images//new_theme/Spandana-desktop-1.jpg

నిర్గమకాండము 20 అధ్యాయము

ఉద్దేశ్యము
దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలకు మనము విధేయత చూపాలి అని బోధించుట. ఒకవేళ మనము పొరపాటున వాటిని అతిక్రమించి పాపము చేసినట్లయితే యేసు మనలను క్షమించగలడు

ముఖ్యాంశము
మీరు చదువుకుంటున్న స్కూల్ లో ఎటువంటి నిబంధనలు రూల్స్ లేవు అనుకుందాము. అప్పుడు మీ స్కూల్ ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరూ తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిస్తారు. విద్యార్థులు తమకు ఇష్టమైన సమయానికి స్కూల్ కి వస్తారు, నచ్చితే క్లాస్ కి వెళ్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లంచ్ చేసారు. ఇలా అందరూ వారికి నచ్చినట్లు చేసుకుంటుంటారు. ఇలా ఉంటే స్కూల్ లో చాలా గందరగోళంగా ఉంటుంది కదూ! అలాగే రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ లేవు అనుకోండి ఎలా ఉంటుంది? మనుష్యులు వాహనాలను తమకు ఇష్టమైనంత వేగంగా నడిపిస్తూ ఉంటారు. సిగ్నల్ దగ్గర, మనుష్యులు రోడ్డు దాటే దగ్గర తమ వాహనాలను ఆపరు. అలా జరిగితే ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొనవలసి వస్తుంది. మనను సరియైన మార్గములో నడిపించటానికి మనకు కొన్ని నిబంధనలు అవసరము. దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలు మానవుని ప్రవర్తనకు ఎంత అవసరము అనే విషయం చూద్దాం.

గతవారము
దేవుడు సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి తన చేతితో రాతి పలకలపై వ్రాసి మోషేకు పది ఆజ్ఞలు ఇచ్చినట్లు మనము చూశాము. ప్రజలు దేవునిపట్ల ఎదుటివారి పట్ల ఏ విధముగా ప్రవర్తించాలో తెలుసుకొనునట్లు పది ఆజ్ఞలను వారికిచ్చాడు. మనుష్యులు సరియైన మార్గములలో నడిచిన ఎడల సంతోషంగా ఉండగలరు. వారు చెడు మార్గాలలో నడిచి నట్లయితే తప్పక ఫలితం అనుభవించవలసి వస్తుంది. ఈరోజు దేవుని ఆజ్ఞలు, కట్టడల గురించి తెలుసుకుందాము. అవి దేవుడు కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు కాని ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసం ఇచ్చినటువంటి ఆజ్ఞలు. వాటిని తెలిసికొని, విధేయత చూపుట ప్రతి వ్యక్తికి ఎంతో అవసరం.

మొదటి ఆజ్ఞ: నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు
మనము అందరికన్నా ఎక్కువగా, అన్నిటికన్నా ఎక్కువగా ప్రభువును ప్రేమించాలి అని ఎంతో స్పష్టంగా ఈ మొదటి ఆజ్ఞలో దేవుడు చెప్పాడు. మనము నిజముగా దేవుని ప్రేమించినట్లయితే ఆయనను గురించిన ఆలోచనలు ప్రతిదినము మనకు ఎంతో సంతోషం కలిగిస్తాయి. ఆయనకు విధేయులమై ప్రభువును సంతోషపరిచే విధంగా జీవిస్తాము. దేవుని మన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రేమించ లేకపోతే దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞను అతిక్రమించడం అవుతుంది. మనము ఆయనను మాత్రమే ఆరాధించాలి అని దేవుడు చెప్పాడు. ప్రభువైన యేసు కూడా తన బోధలలో దేవుని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమించాలి అని చెప్పాడు.

రెండవ ఆజ్ఞ: ఎటువంటి విగ్రహములను చేసికొని పూజింప కూడదు
దేవుడు సృష్టికర్త అయిన తనను మాత్రమే పూజించి ఆరాధించాలి అని రెండవ ఆజ్ఞలో చెప్పాడు. ఎంతోమంది సృష్టికర్తను విడిచిపెట్టి ఆయన సృష్టిని పూజిస్తుంటారు. కర్రతో రాతితో చేసిన విగ్రహాలను ఆరాధిస్తుంటారు. సృష్టిని దేవతలుగా చేసికొని ఎంతగానో పూజిస్తూ సృష్టికర్త అయిన దేవునికి కోపం తెప్పిస్తుంటారు .

మన హృదయాలలో ఆలోచనలలో ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తామో అవి మనకు దేవుళ్లుగా మారుతుంటాయి. ధనము, డబ్బు, పేరు, మంచి ఉద్యోగం ఇవి మనకు చాలా ముఖ్యమైనదిగా మారిపోతే దేవుని గురించిన ఆలోచనలు మనకు దూరమైపోతాయి. అందుకే మన జీవితాలలో ఎల్లప్పుడూ దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి.

మూడవ ఆజ్ఞ: దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించుట కూడదు
దేవుని ఎదుట ప్రమాణం చేయడం, ఒట్టు పెట్టుకోవడం తప్పు అని దేవుడు తన మూడవ ఆజ్ఞ ద్వారా తెలియ చేస్తున్నాడు. మన మాటలు యదార్థమైనవిగా అవునంటే అవును కాదంటే కాదు అనే విధముగా ఉండాలి. ఎన్నడూ దేవుని అపహసిస్తూ మనము మాట్లాడకూడదు. దేవుని కించపరుస్తూ సరదాగా మాట్లాడుకోవడం ఈ దినాలలో చాలామందికి అలవాటుగా మారిపోయింది. కానీ ఈ విషయము దేవునికి ఎంతో కోపం కలిగిస్తుంది అని మనము గ్రహించాలి.

నాలుగవ ఆజ్ఞ: విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించాలి
దేవుడు ఆరు దినములు పనిచేసి ఏడవ దినమున విశ్రాంతి తీసుకొని నట్లు మనము కూడా ఒక దినము విశ్రాంతి దినముగా అనుసరించాలి అని దేవుని ఆజ్ఞ. ఆయన చూపిన మాదిరిని మనము అనుసరించాలి. ఆదివారం రాగానే ప్రతి ఒక్కరూ తమ పనులతో తీరిక లేకుండా ఉంటారు. కానీ ఆదివారము ఒక ప్రత్యేకమైన దినముగా మనము ఆచరించాలి అని దేవుని ఆజ్ఞ. ప్రతి దినము మనము చేసే పనులను మానుకుని ప్రభువు సన్నిధిలో సమయము గడపాలి అని దేవుని కోరిక. దేవుని గురించి తెలుసుకుని ,ప్రార్థించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆనందించాలి. ఆదివారం ఒక్కరోజు కాదు గాని ప్రతి దినము దేవుని స్తుతించాలి. కాని పరిశుద్ధ దినమైన ఆదివారము నాడు ఎక్కువ సమయాన్ని దేవునితో గడపాలి. అందుకే ఇప్పుడు ఆదివారము నాడు క్రైస్తవులు చర్చికి సండే స్కూల్ కి వెళ్ళి దేవుని ఆరాధిస్తారు.

అయిదవ ఆజ్ఞ: నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము
పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయత చూపి వారి మాటల చొప్పున నడుచుకోవాలి అని దేవుని ఆజ్ఞ. తల్లిదండ్రులు ఏదైనా చెప్పినప్పుడు దానిని ఇష్టంతో సంతోషంగా చేయాలి. కాని ఎన్నోసార్లు పిల్లలు తమ తల్లిదండ్రులను ఎదిరిస్తారు, తిరగబడతారు. కానీ అది దేవుని ఆజ్ఞను అతిక్రమించుడమే. నీవు దీర్గాయువు కలిగి ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అందరికీ దీర్ఘాయువు కలిగి ఉండాలని ఆశ ఉంటుంది. కాని దానికి దేవుడు ఏర్పరచిన నియమము తల్లిదండ్రులను సన్మానించుట. యేసు తన తల్లిదండ్రులకు విధేయత చూపుతూ జీవించాడు. మనము నిజముగా ప్రభువును ప్రేమించే వారమైతే అన్ని విషయాలలో తల్లిదండ్రుల మాట వినాలి. ఇది ప్రభువుకు అంగీకారమైనది. (కొలస్సి 3:20)

ఆరవ ఆజ్ఞ: నరహత్య చేయకూడదు
ప్రతిరోజు ఎన్నో హత్యలు గురించి మనము టీవీలో,పేపర్లో చూస్తుంటాము మనిషి మరొక మనిషిని చంపడం ఎంతో క్రూరమైన విషయం. మనము ఎవరిని హత్య చేయలేదు కదా అని సంతోషపడవచ్చు, కానీ ఎదుటి వాని మీద కోపపడు ప్రతివాడు తీర్పు పొందును అని ప్రభువైన యేసు బోధించాడు (మత్తయి. 5:22). హేబెలును చంపిన కయీను దేశదిమ్మరి అగునట్లు దేవుడు శిక్షించాడు. దేవుని స్వరూపములో ఆయన పోలిక చొప్పున సృజియింపబడిన మానవుని మరొక మానవుడు చంపడం ఎంత భయంకరం!

ఏడవ ఆజ్ఞ : వ్యభిచరింపకూడదు
వివాహము చేసుకొని భార్యాభర్తలు తమ జీవితాంతము కలసిఉండాలి అని దేవుని ఆజ్ఞ .భర్త భార్యను, భార్య భర్తను వదలి పెట్టకూడదు. మానవుని శరీరము దేవుని ఆలయమై యున్నది గనుక దానిని అపవిత్ర పరచకూడదు. ఈ దినాలలో ఎంతోమంది భార్య భర్తలు చిన్న విషయాలకు గొడవపడి విడాకులు తీసుకుంటున్నారు. అటువంటి పనులు దేవునికి ఎంతో కోపం కలిగిస్తాయి అని తెలుసుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన సృజించిన మానవులు కూడా పరిశుద్ధులై ఉండాలి అని కోరుకుంటున్నాడు.

ఎనిమిదవ ఆజ్ఞ: దొంగిలకూడదు
మనది కాని వస్తువులను మనము ఎన్నడూ ఆశించకూడదు. షాపులో,స్కూల్ లో స్నేహితుల దగ్గర., తల్లిదండ్రుల దగ్గర వారికి తెలియకుండా, చెప్పకుండా దేనిని తీసికొనకూడదు. అలాచేస్తే అది దొంగిలించడం అవుతుంది. అలా చేస్తూ మనలను ఎవరూ చూడటం లేదు అని అనుకొనవచ్చు. కానీ మనము చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు అని మరిచిపోకూడదు. దొంగతనం చేయడం పాపం అని దేవుడు 8వ ఆజ్ఞ ద్వారా స్పష్టంగా తెలియచేశాడు. చిన్న వయసు నుండి ఇటువంటి పనులు చేయడం మానుకోవాలి. ఈ లోకంలోమనము చేసిన దొంగతనానికి పోలీసులు, కోర్టులు శిక్ష విధిస్తాయి. మరి వారికంటె పరిశుద్ధుడైన యేసు మనము దొంగతనం చేసినప్పుడు తప్పక కోపము కలిగివుంటాడు.

తొమ్మిదవ ఆజ్ఞ: నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు
ఇతరులపై అబద్ధములు చెప్పడం పొరపాటు. ఏదైనా కష్టములో, సమస్యలు ఉన్నప్పుడు వాటి నుండి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తుంటాము . అబద్హాలు చెప్పడం చాలాసులభం. మనము చేసిన తప్పులను ఇతరులపై వేస్తూ తప్పించుకోవటానికి చూస్తాము. ఒక అబద్ధం కప్పిపుచ్చడానికి ఎన్నో అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. మనము తప్పించుకోవడానికి ఇతరులపై అబద్ధాలు చెప్పడం పాపం.

పదవ ఆజ్ఞ: నీ పొరుగువాని సంపదను ఆశించకూడదు
పొరుగువారి వస్తువులను మనము ఆశించకూడదు. మన స్నేహితులకు ఉన్న సైకిల్, సెల్ ఫోన్, కంప్యూటర్ చూసి మనము అసూయ పడకూడదు. దేవుడు మనకు ఇచ్చిన వాటితో సంతృప్తి చెంది సంతోషంగా జీవించటం నేర్చుకోవాలి.

సందేశము
దేవుడు మనకు పదిఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి నాలుగు ఆజ్ఞలు దేవుని యెడల మనము ఎలా ఉండాలి అనే విషయాలను తెలియజేస్తాయి. తరువాత ఆరు ఆజ్ఞలు ఇతరుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అని మనకు నేర్పిస్తాయి. మన జీవితం సరియైన మార్గాలలో నడవడానికి ఈ పది ఆజ్ఞలు ఎంతో ముఖ్యమైనవి.

అన్వయింపు
దేవుని జ్ఞానయుక్తమైన ఆజ్ఞలను గురించి మనము తెలుసుకున్నాము. అవి మన జీవితాలకు ఎంతో అవసరమైనవి. ఇంట్లో కూడా తల్లిదండ్రులు కొన్ని నియమాలను చెప్తారు. మీ ఆటల సమయం చదువుకునే సమయం, నిద్రపోయే సమయం కొన్ని ఖచ్చితంగా పాటించవలసి వుంటుంది. అవి పిల్లల మంచి కోసం వారు ఏర్పాటు చేసినవి కానీ చాలాసార్లు పిల్లలు వాటిని పట్టించుకోరు. తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాట వినే వారు ఎవరూ ఉండరు. కొన్ని నియమాలను పక్కన పెడుతూ, మరికొన్నింటిని వింటూ ఉంటారు. అదే విధముగా ప్రభువైన యేసు తప్ప దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఖచ్చితంగా అనుసరించిన వారు మరెవ్వరూ లేరు.(రోమా 3:23). దేవుని మాటలు వినకపోవడం చాలా బాధాకరమైన విషయం. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన ఆజ్ఞలను అతిక్రమించి పాపము చేయుట దేవునికి కోపం కలిగిస్తుంది. మనము చాలాసార్లు ఇతరులతో పోల్చుకుంటూ చాలా మంచివారము అని అనుకుంటాము. కానీ ఎంత మంచి వారమైనా మనము కూడా పాపులమే తల్లిదండ్రుల మాట విననప్పుడు వారు మనలను శిక్షించినట్లు గానే దేవుడు తన ఆజ్ఞలను అతిక్రమించిన వారిని శిక్షిస్తాడు. మరి మనం ఏమి చేయాలి? యోహాను1:17 లో "ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను''అని వ్రాయబడింది. ఎంత మంచివార్త! మనము చేసిన తప్పులకు, చూపిన అవిధేయతకు నిజముగా పశ్చాత్తాపపడి ప్రభువైన యేసును అడిగినప్పుడు ఆయన మనలను క్షమించగలడు. ఎప్పుడైనా మీ పాపాలు, తప్పులు క్షమించమని దేవునికి ప్రార్థన చేశారా!

కంఠతవాక్యము
నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను (లూకా 10:27)

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

 

పుస్తకాలు
More articles ...
More articles ...
More articles ...
More articles ...

తెలుగు బైబిల్

మా వెబ్సైట్లో ఉన్న వ్యాసాలు, పుస్తకాలు చదివేవారి సౌకర్యార్థం BSIవారు అనువదించిన తెలుగు బైబిల్ కూడా మీకు అందుబాటులో ఉంచబడింది. ఈ బైబిలుకు క్రాస్ రిఫరెన్సులు, స్ట్రాంగ్స్ నెంబర్లు జత చేస్తూ ఉన్నాము. లోతుగా లేఖనాలను అధ్యయనం చేయటానికి ఈ వనరులు ఎంతగానో ఉపయోగపడతాయి. వాడుక భాషలో తెలుగు బైబిల్ అనువాదాలను కూడా ఇక్కడ పొందు పరచాలనుకుంటున్నాము. ఈ ప్రక్రియ అంతా త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు అందుబాటులోకి వచ్చేలా దయచేసి ప్రార్థించండి.

బైబిల్ వ్యాఖ్యానాలు
పూర్తి బైబిలును వచనం వెంబడి వచనం క్రమబద్ధంగా అర్థం చేసుకోవడానికి, ఆచరించటానికి బైబిల్ వ్యాఖ్యానం నేరుగా దోహదపడుతుంది. ఇందుకోసమే ఒక్కొక్క గ్రంథం యొక్క వ్యాఖ్యానాన్ని మీకు అందుబాటులోకి తెస్తూ ఉన్నాము.
ఆడియోలు మరియు వీడియోలు
వ్యాసాలు, పుస్తకాలతో పాటు ఆడియో,వీడియో వనరులు కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి.
01

ఆడియోలు

అనేక ఆధ్యాత్మిక సందేశాలు, అలాగే వ్యాసాల, పుస్తకాల రికార్డింగులు మీకిక్కడ లభిస్తాయి.
02

వీడియోలు

YOUTUBE CHANNEL ద్వారా అనేక ఆధ్యాత్మిక సందేశాలు, అలాగే వ్యాసాల, పుస్తకాల వీడియోలు మీకిక్కడ లభిస్తాయి.

Store

హితబోధ పుస్తకాలు Onlineలో ఆర్డర్ చేయడం కొరకు ఈ Linkని వాడండి. గుంటూరు నగరంలో మా హితబోధ బుక్ స్టోర్ ను సందర్శించండి
క్రొత్తగా చేర్చిన పుస్తకాలు
Intro Image
April 04, 2026
ఈ విశ్లేషణ కేవలం మతపరమైన ఆడంబరాలను ప్రేమించేవారి కోసం కాదు; దేవుని వాక్యం పట్ల నిజాయితీగా ఉండేవారి కోసం. గుడ్ ఫ్రైడే...

Read More ...

Intro Image
March 21, 2026
క్రీస్తు దైవత్వం అనేది కేవలం వాద ప్రతివాదాలకు మాత్రమే పనికొచ్చే సిద్ధాంతం కాదు. ఇది నిత్యజీవము...

Read More ...

Intro Image
March 18, 2026
సుమారు క్రీ.పూ 2300 చెందిన 'ఎరిడు జెనెసిస్', 'అత్రహసిస్ ఎపిక్', 'ఎపిక్ ఆఫ్ గిల్గమేష్' (Eridu...

Read More ...

Intro Image
December 19, 2025
దశమభాగం బైబిల్ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞలలో ఒకటి. పాత నిబంధనలో ఇది తప్పనిసరి ఆజ్ఞగా...

Read More ...

Intro Image
August 13, 2025
ప్రసంగించడం అనేది దేవుడు మనకు అప్పగించిన ఒక పవిత్రమైన బాధ్యత. సంఘ నిర్మాణం వాక్యోపదేశం ద్వారా...

Read More ...

Intro Image
June 09, 2025
దేవుని ప్రజలందరూ ఆయన మనస్సు‌ కలిగియుండాలని ఆజ్ఞాపించబడుతున్నారు (ఫిలిప్పీ 2:5). నిజంగా ఆయన మనస్సు...

Read More ...

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.