సండే స్కూల్ పాఠాలు

సండే స్కూల్ పాఠాలు

శ్రీమతి ఫ్రాన్సిస్ ఫౌంటెన్ గారి జీవితం (1930-2023) స్థిరమైన విశ్వాసంతో, దృఢచిత్తంతో మరియు సువార్తను వ్యాప్తి చేయాలనే లోతైన నిబద్ధతతో నిండినది. ఒక చిన్న గ్రామంలో డిస్లెక్సియాతో పెరిగిన ఈమె 16 సంవత్సరాల వయస్సులో క్రైస్తవురాలిగా మారారు. తరువాత స్ప్రింగ్ రోడ్ ఎవాంజెలికల్ చర్చి పాస్టర్ ఐన డేవిడ్ ఫౌంటెన్ గారిని వివాహం చేసుకున్నారు. ఆవిడకు ఆరోగ్య సవాళ్ళు ఉన్నప్పటికీ, ముఖ్యంగా నిర్ధారణ కాని ఉదరసంబంధ వ్యాధి ఉన్నప్పటికీ, ఆమె ఒక ప్రియమైన, ఆచరణాత్మక తల్లిగా, సంఘంలో చురుకైన సభ్యురాలిగా చివరి వరకూ ఉన్నారు. ఆమె సృజనాత్మకత 'మేఫ్లవర్ బైబిల్ పాఠాలు' మరియు 'ట్రెజర్ నోట్స్'ను అభివృద్ధి చేయడంలో వెల్లివిరిసింది. ఈ పాఠాల ద్వారా యునైటడ్ కింగ్డమ్ మరియు ఇంకా చాలా దేశాల్లోని అనేకమంది పిల్లలకు వీరు ప్రయోజనం చేకూర్చారు.

ఆమె తరువాతి సంవత్సరాలలో, ఆరోగ్య పోరాటాల మధ్య కూడా, దయతో, నిస్వార్థతతో కొనసాగారు. స్నేహితులూ, కుటుంబసభ్యులూ పెద్ద సంఖ్యలో హాజరైన ఆమె అంత్యక్రియలు తన చుట్టూ ఉన్నవారిపై ఆమె యొక్క శాశ్వత ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఫ్రాన్సిస్ ఫౌంటెన్ గారి జీవితం అంకితభావంతో కూడిన సేవ యొక్క కథని చెప్పుకోవాలి. ఆమె సంఘం లోపలే కాక సంఘం వెలుపల కూడా శాశ్వత వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు. తన పిల్లలు మరియు మనుమలు-మనుమరాళ్ల రక్షణలో ఆవిడ కీలక పాత్ర పోషించారు; వారంతా ఇప్పుడు ప్రభువు పనిలో చురుకుగా ఉన్నారు. "నా దేవుడు ఆదేశించిందేదైనా సరైనదే" అనే క్రైస్తవకీర్తన పట్ల ఆమెకున్న నిబద్ధత, ఆమె జీవితకథ చేత స్పృశించబడినవారి హృదయాలలో ప్రతిధ్వనిస్తుంది.

దేవుడు ఎవరనేది పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయపడటం, సువార్తను చిన్నిమనసులకు హత్తుకునేలా చెప్పడం మరియు క్రైస్తవ విలువలను ప్రోత్సహించడం అనే ఒక సాధారణ లక్ష్యంతో ఫ్రాన్సిస్ ఫౌంటెన్ గారు 25 సంవత్సరాలు వెచ్చించి 'మేఫ్లవర్ బైబిల్ పాఠాలను' రూపొందించారు. ఈ పాఠాలలో 16 ధారావాహికలు ఉన్నాయి, ప్రతి ధారావాహిక 11-13 పాఠాలతో బైబిల్లో ఒక భాగాన్ని బోధిస్తుంది. పాఠాలను క్రమపద్ధతిలో బోధించడం చాలా ముఖ్యం. ప్రతి పాఠంలో పేజీలకు రంగులు వేయడం, కట్ - పేస్ట్ - కలర్ యాక్టివిటీ మరియు పజిల్స్ వంటి పిల్లలకు నచ్చే ఎన్నో విషయాలు ఉంటాయి. ఈ కార్యకలాపాలు బిగినర్స్, ప్రైమరీ మరియు జూనియర్స్ తరగతుల కోసం రూపొందించబడ్డాయి.

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

Coming Soon ...

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

Coming Soon ...
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.