యేసుక్రీస్తు ప్రభువు భూమిపై మనిషిగా జీవించినప్పటి సంఘటనలు నాలుగు సువార్తలలో మనం చదువుతాము. ఒక సువార్తలో చదివిన కొన్ని సంఘటనలు మరొక సువార్తలో ఉండకపోవటం సాధారణంగా మనం గమనిస్తాము. ప్రతి సువార్త గ్రంథాన్ని విడిగా చదివి రచయిత ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటం కష్టం కాదు. కానీ నాలుగు సువార్తలను సమగ్రంగా నేర్చుకుంటున్నప్పుడు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. అందులో ఒక సమస్య సువార్త సంఘటనల కాలక్రమానికి సంబంధించినది.జాగ్రత్తగా విశ్లేషించకపోతే అనేక అపార్థాలు చోటుచేసుకుంటాయి. ప్రతీ సంఘటనను కాలక్రమంలో అర్థం చేసుకున్నప్పుడు ఎన్నో అపార్థాలకు పరిష్కారాలు లభిస్తాయి. నాలుగు సువార్తలను సమగ్రంగా మాత్రమే కాదు, సమన్వయపరిచి విశ్లేషించటానికి సువార్త సంఘటనల కాలక్రమం ఎంతో ప్రాముఖ్యమైనది. నాలుగు సువార్తలన్నిటినీ కాలక్రమంలో అమర్చి టేబుల్ రూపంలో వాటిని మీకు అందించటమే ఇక్కడ చేయబడిన ప్రయత్నం.
పరిచయం

మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను రాసిన నాలుగు సువార్తలతో మన కొత్త నిబంధన గ్రంథం ప్రారంభమౌతుంది. యేసుక్రీస్తు ప్రభువు భూమిపై మనిషిగా జీవించినప్పటి సంఘటనలు ఈ నాలుగు సువార్తలలో మనం చదువుతాము. ఈ నాలుగు సువార్తలలో ఒకే వ్యక్తికి సంబంధించిన జీవిత చరిత్ర రాయబడింది కాబట్టి వాటిలో ఎన్నో సమాంతర విషయాలు కనిపిస్తాయి. అయితే నలుగురు రచయితలు ఆయనను నాలుగు వేరు వేరు కోణాలలో వివరించటం కారణంగా వారి విశ్లేషణకు అవసరమైన కొన్ని సంఘటనలు మాత్రమే వారు ప్రస్తావించి మిగతావి విడిచిపెట్టారు. మత్తయి ఆయనను రాజుగాను, మార్కు ఆయనను సేవకునిగాను, లూకా ఆయనను మానవునిగాను, యోహాను ఆయనను దేవునిగాను వివరించారు. ఈ కారణాన్ని బట్టి ఈ నాలుగు సువార్తలలో గొప్ప వైవిధ్యం కనిపిస్తుంది. ఒక సువార్తలో చదివిన కొన్ని సంఘటనలు మరొక సువార్తలో ఉండకపోవటం సాధారణంగా మనం గమనిస్తాము.
ప్రతి సువార్త గ్రంథాన్ని విడిగా చదివి రచయిత ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటం కష్టం కాదు. కానీ నాలుగు సువార్తలను సమగ్రంగా నేర్చుకుంటున్నప్పుడు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. అందులో ఒక సమస్య సువార్త సంఘటనల కాలక్రమానికి సంబంధించినది. ఏ సంఘటన మొదట జరిగింది, ఆ తర్వాత ఏమి జరిగింది అంటూ చివరివరకూ ప్రతి సంఘటననూ క్రమబద్ధంగా క్రోడీకరించి అర్థం చేసుకోవటం అవసరం. అలా జాగ్రత్తగా విశ్లేషించకపోతే అనేక అపార్థాలు చోటుచేసుకుంటాయి.
అనేకమంది బైబిల్ విమర్శకులు సువార్తలలో పరస్పర వైరుధ్యాలుగా ఎత్తి చూపించిన సంఘటనలు వారు ముందూవెనుకా ఆలోచించని కారణంగా పుట్టిన అపార్థాలే. ఉదాహరణకు 3 సువార్తలలోనూ యేసు బాప్తిస్మం తరువాత వెంటనే అరణ్యంలో 40 రోజుల ఉపవాసానికి వెళ్లిపోయినట్లు ఉంటే, యోహాను సువార్తలో మాత్రం ఆయన బాప్తిస్మ ప్రస్తావన తరువాత మూడు రోజులకే తన శిష్యులతో కానా విందుకు వెళ్ళినట్లు కనిపిస్తుంది. అదిగో వైరుధ్యం అంటాడు విమర్శకుడు. దీనికి పరిష్కారం ఈ సంఘటనల కాలక్రమంలో మనకు కనిపిస్తుంది. యేసు బాప్తిస్మం తర్వాత అరణ్యానికే వెళ్ళాడు. అయితే యోహాను సువార్తలో కనిపించేది ఆయన బాప్తిస్మ సంఘటన కాదు. బాప్తిస్మమిచ్చు యోహాను ఆయనకు బాప్తీస్మం ఇచ్చినప్పుడు చూసిన అద్భుత సంగతిని గురించి సాక్ష్యం ఇచ్చిన సంఘటన ఇక్కడ చదువుతాము. బాప్తిస్మానికి వెంటనే అరణ్యానికి వెళ్లాడని రాయబడింది కాబట్టి అరణ్యంలో 40 రోజుల ఉపవాసం తరువాత మళ్ళీ యేసును చూసినప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను అప్పటి అద్భుతాన్ని గురించి సాక్ష్యం వహించాడని, ఆ తరువాత మూడు దినాలకు యేసు కానా విందుకు వెళ్లాడని సరళంగా అర్థం చేసుకోవచ్చు.
ఇలా ప్రతీ సంఘటనను కాలక్రమంలో అర్థం చేసుకున్నప్పుడు ఎన్నో అపార్థాలకు పరిష్కారాలు లభిస్తాయి. నాలుగు సువార్తలను సమగ్రంగా మాత్రమే కాదు, సమన్వయపరిచి విశ్లేషించటానికి సువార్త సంఘటనల కాలక్రమం ఎంతో ప్రాముఖ్యమైనది. నాలుగు సువార్తలన్నిటినీ కాలక్రమంలో అమర్చి టేబుల్ రూపంలో వాటిని మీకు అందించటమే ఇక్కడ చేయబడిన ప్రయత్నం. టేబుల్ ని ఆంగ్లంలో రిక్ అస్కమన్ గారు తయారుచేస్తే మా సహోదరుడు సామ్రాట్ దానిని తెలుగు భాషలోనికి అనువదించాడు. మాకు అవసరమని తోచిన కొన్ని ప్రధాన మార్పులు చేసి ప్రస్తుతం దీనిని సంఘ వినియోగార్థం విడుదల చేస్తున్నాము. మీరందరూ దీనిని వాడే క్రమంలో ఇంకా ఏవైనా సవరణలు మా దృష్టికి తీసుకొస్తే మేము వాటిని సరిచూసుకుని సరిచేసుకోవడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాము. ఇలాంటి మరిన్ని బైబిల్ వనరులు మీకు అందించాలని మేము ప్రయాసపడుతుండగా మా కొరకు ప్రార్థన చేయండి. వీటిని మీరు వాడుతూ మీ పరిచయస్థులందరికీ వీటిని పరిచయం చేయండి.
- హితబోధ టీం
| నాలుగు సువార్తల కాలక్రమం(సువార్తల సామరస్యం)(Aschmann.net/BibleChronology/ChronologyOfTheFourGospels.pdf) | బైబిల్ కాలక్రమం ప్రధాన పేజీ క్రొత్త నిబంధన కాలక్రమం పేజీ | Last updated: 13-Jan-2021 at 18:39 (See History) © Richard P. Aschmann | 
ఈ ప్రాజెక్టును జూన్, 2020లో సంపూర్ణం చేయడం జరిగింది. (నేపథ్య సమాచారం, రంగులు, ఇతర ఆకృతీకరణ, ఉపయోగించిన చిహ్నాలు మరియు ముగింపు గమనికల కోసం చివరి రెండు పేజీలను చూడండి.)
యేసు జననానికి ముందు నుండి ఆయన పరిచర్య ప్రారంభం వరకు
| ఎప్పుడు మరియు ఎక్కడ | మత్తయి | మార్కు | లూకా | యోహాను | ||||
| 
 పరిచయం | పరిచయ విషయాలు | 1:1 | 1:1-4 | |||||
| యోహాను ముందుమాట | 
 
 
 
 | 1:1-18 | ||||||
| యేసు వంశావళి | ↓ లూకా 1:24 -26 | 1:1-17 | 3:23b-38 | |||||
| 
 
 బాప్తిస్మము ఇచ్చు యోహాను మరియు యేసు క్రీస్తు జననాలు | జెకర్యాకు ఒక దేవదూత కనిపిస్తాడు | యెరూషలేము, యేసు పుట్టడానికి 15 నెలల ముందు | 1:5-25 | |||||
| మరియకు ఒక దేవదూత కనిపిస్తాడు | నజరేతు, యేసు పుట్టడానికి 9 నెలల ముందు | 1:26-38 | ||||||
| మరియ ఎలీసబెతును సందర్శిస్తుంది | యూదయ (లూకా 1:39) | ↑ లూకా 1:31,36 | 1:39-56 | |||||
| బాప్తిస్మము ఇచ్చు యోహాను జననం | యూదయ, యేసు పుట్టడానికి 6 నెలల ముందు | 1:57-80 | ||||||
| మరియ గర్భవతి అని యోసేపు తెలుసుకుంటాడు | నజరేతు, మరియ తిరిగి వచ్చిన తరువాత | 1:18-25a | ||||||
| యేసు జననం | బెత్లెహేము, క్రీ.పూ. 6 నుండి 4 శతాబ్దాల మధ్య?1 | 2:1-20 | ||||||
| యేసుకు సున్నతి | 8 రోజుల వయస్సు | 1:25b | 2:21 | |||||
| యేసును ఆలయంలో ప్రతిష్ఠించారు | యెరూషలేము, 40 రోజుల వయస్సు (లేవీ. 12: 4) | 2:22-39a | ||||||
| జ్ఞానుల సందర్శన | యెరూషలేము, బెత్లెహేము | 2:1-12 | ||||||
| ఐగుప్తుకు పారిపోవటం | ఐగుప్తు | 2:13-15 | ||||||
| మగ శిశువుల సంహారం | బెత్లెహేము | 2:16-18 | ||||||
| నజరేతుకు తిరిగి వెళ్ళటం † | నజరేతు, క్రీ.పూ. 4వ శ.? 1 | 2:19-23 | 2:39b | |||||
| 
 యేసు బాల్యం | పసిప్రాయం | 2:40 | ||||||
| యెరూషలేమును సందర్శించటం | 12 సంవత్సరాల వయసు (లూకా 2:42) | 2:41-51 | ||||||
| బాల్యం | 2:52 | |||||||
యేసు పరిచర్య యొక్క మొదటి సంవత్సరంన్నర (సిద్ధపాటు సంవత్సరం)
| ఎప్పుడు మరియు ఎక్కడ | మత్తయి | మార్కు | లూకా | యోహాను | ||
| 
 
 బాప్తిస్మము ఇచ్చు యోహాను మరియు యేసు క్రీస్తు పరిచర్యల ఆరంభం | బాప్తీస్మము ఇచ్చు యోహాను తన పరిచర్యను ప్రారంభిస్తాడు † | యొర్దాను నది ప్రక్కన, 26వ సంవత్సరం చివరి భాగం | 3:1-12 | 1:2-8 | 3:1-18 | |
| యేసు బాప్తిస్మము | (లూకా 3:23: “యేసు వయసు దాదాపు ముప్పై సంవత్సరాలు”) | 3:13-17 | 1:9-11 | 3:21-23a | (1:32-34) | |
| యేసు యొక్క శోధన | అరణ్యములో 40 రోజులు | 4:1-11 | 1:12-13 | 4:1-13 | ||
| యోహాను తన పరిచర్యను వివరించాడు | యొర్దాను యొక్క మరొక వైపు, బేతనియ (27వ సంవత్సరం మొదట్లో?) | 1:19-28 | ||||
| యోహాను యేసును ప్రకటిస్తాడు | మరుసటి రోజు | 1:29-34 | ||||
| పేతురు మరియు ఆంద్రేయ యొక్క తొలి పిలుపు | మరుసటి రోజు | 1:35-42 | ||||
| ఫిలిప్పు మరియు నతనియేలు యొక్క పిలుపు | మరుసటి రోజు | 1:43-51 | ||||
| యేసు నీటిని ద్రాక్షారసంగా మారుస్తాడు | గలిలయలోని కానా, 3 రోజుల తరువాత (3 రోజుల నడక తరువాత) | 2:1-11 | ||||
| వారంతా కపెర్నహుముకు వెళతారు | “దీని తరువాత, వారు కొన్ని రోజులు అక్కడే ఉన్నారు” | 2:12 | ||||
| 
 యేసు పరిచర్యలో ప్రథమ పస్కా పండుగ† | యేసు ఆలయాన్ని ఖాళీ చేశాడు | యెరూషలేము, దాదాపు పస్కా పండుగ సమయంలో, ఏప్రిల్ (27వ సంవత్సరం) | 2:13-25 | |||
| యేసు నీకొదేముకు బోధిస్తాడు | 3:1-21 | |||||
| యేసు మరియు బాప్తిస్మం ఇచ్చు యోహాను చేసిన బాప్తిస్మ పరిచర్య | 3:22-24 | |||||
| బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసు గురించి చెబుతాడు | 3:25-36 | |||||
| 
 మొదటి సంవత్సరం ముగింపు | హేరోదు యోహానును చెరశాలలో పెట్టాడు† | డిసెంబర్? (27వ సంవత్సరం) (యోహాను 4:35 చూడండి) | 4:12a | 1:14a | 3:19-20 | (3:24) | 
| యేసు గలిలయకు బయలుదేరాడు | 4:1-3 | |||||
| సమరయ స్త్రీ | సమరియలోని సుఖార (యేసు 2 రోజులు ఉంటాడు) | 4:4-42 | ||||
| 
 
 గొప్ప గలిలయ పరిచర్య ప్రారంభం | యేసు గలిలయకు వస్తాడు† | గలిలయ | 4:12b | 1:14b | 4:14-15 | 4:43-45 | 
| యేసు ఒక అధికారి కుమారుడిని స్వస్థపరుస్తాడు | గలిలయలోని కానా | 4:46-54 | ||||
| యేసు కపెర్నహూంలో స్థిరపడ్డాడు | కపెర్నహూం (28వ సంవత్సరానికి ముందు?) | 4:13-16 | ||||
| యేసు దేవుని రాజ్యాన్ని ప్రకటించడం ప్రారంభిస్తాడు | 4:17 | 1:14c-15 | ||||
| నజరేతులో తిరస్కరణ | నజరేతు, విశ్రాంతి దినమున | 4:16-30 | ||||
| నలుగురు మత్స్యకారుల అధికారిక పిలుపు | గలిలయ సముద్రం (గెన్నేసరేతు సరస్సు) | 4:18-22 | 1:16-20 | [5:1-11] | ||
| యేసు అపవిత్రాత్మగలవానిని స్వస్థపరుస్తాడు | కపెర్నహూం, విశ్రాంతి దినమున | 1:21-28 | 4:31-37 | |||
| యేసు పేతురు అత్తగారిని, ఇతరులను స్వస్థపరుస్తాడు | కపెర్నహూం, అదే రోజున | 8:14-17 | 1:29-34 | 4:38-41 | ||
| యేసు ఏకాంత ప్రదేశంలో ప్రార్థిస్తాడు | మరుసటి రోజున, ఏకాంత ప్రదేశం | 1:35-38 | 4:42-43 | |||
| యేసు గలిలయ అంతటా ప్రయాణిస్తాడు | గలిలయ గ్రామాలు (మార్కు 1:38) | 4:23-25 | 1:39 | 4:44 | ||
| నలుగురి మత్స్యకారుల పిలుపు నిర్థారించబడింది | గెన్నేసరేతు సరస్సు (గలిలయ సముద్రం) | [4:18-22] | [1:16-20] | 5:1-11 5 | ||
| యేసు కుష్ఠురోగిని స్వస్థపరుస్తాడు | పట్టణాలలో ఒకటి (లూకా 5:12) | 8:1-4 | 1:40-45 | 5:12-16 | ||
| యేసు పక్షవాతంగలవానిని స్వస్థపరుస్తాడు | కపెర్నహూం, కొన్ని రోజుల తరువాత (మార్క్ 2: 1) | 9:1-8 | 2:1-12 | 5:17-26 | ||
| యేసు మత్తయిని (లేవీని) పిలుస్తాడు | గలిలయ సముద్రం (గెన్నేసరేతు సరస్సు) | 9:9-13 | 2:13-17 | 5:27-32 | ||
| యోహాను శిష్యులు ఉపవాసం గురించి అడుగుతారు † | (యోహాను ఇంకా జైలులో ఉన్నాడు) | 9:14-17 | 2:18-22 | 5:33-39 | ||
యేసు పరిచర్య యొక్క రెండవ సంవత్సరం (ప్రజాదరణ పొందిన సంవత్సరం)
| ఎప్పుడు మరియు ఎక్కడ | మత్తయి | మార్కు | లూకా | యోహాను | ||
| 
 యేసు పరిచర్యలో రెండవ పస్కా పండుగ † | ఆయన సబ్బాతు రోజున పక్షవాతంగలవానిని స్వస్థపరుస్తాడు | ఏప్రిల్? (28వ సంవత్సరం), యెరూషలేము, బెతేస్థ కోనేరు | 5:1-47 | |||
| శిష్యులు విశ్రాంతి దినమున వెన్నులు త్రుంచి తిన్నారు | గలిలయకు మళ్ళీ వచ్చాడు, ఏప్రిల్ / మే (పండిన బార్లీ లేదా గోధుమ) 6 † | 12:1-8 | 2:23-28 | 6:1-5 | ||
| యేసు విశ్రాంతి దినమున స్వస్థపరుస్తాడు | 12:9-14 | 3:1-6 | 6:6-11 | |||
| యేసు ఇంకొందరిని స్వస్థపరుస్తాడు | గెన్నేసరేతు సరస్సు (గలిలయ సముద్రం) | 12:15-21 | 3:7-12 | |||
| యేసు 12 మంది అపొస్తలులను ఎన్నుకుంటాడు | సరస్సు దగ్గర ఒక పర్వతం | 3:13-19 | 6:12-16 | |||
| 
 
 
 
 కొండ మీది ప్రసంగం: 
 మొదటి ఉపదేశం 
 | ఒక జనసమూహం కూడి యేసు వద్దకు వచ్చింది | అదే కొండపై ఉన్న మైదానం వద్ద | 5:1a | 6:17-19 | ||
| ధన్యతలు | 5:1b-12 | 6:20-23 | ||||
| శ్రమలు | 6:24-26 | |||||
| “మీరు లోకానికి ఉప్పైయున్నారు” | 5:13 | [9:50] | [14:34-35] | |||
| “మీరు లోకానికి వెలుగైయున్నారు” | 5:14-16 | |||||
| ధర్మశాస్త్రము యొక్క నెరవేర్పు | 5:17-37 | |||||
| కంటికి కన్ను | 5:38-42 | 6:27-31 | ||||
| “మీ శత్రువులను ప్రేమించుడి” | 5:43-48 | 6:32-36 | ||||
| అక్కరలో ఉన్నవారికి ఇవ్వడం | 6:1-4 | |||||
| పరలోక ప్రార్థన | 6:5-8 | |||||
| ప్రభువు యొక్క ప్రార్థన | 6:9-15 | [11:1-4] | ||||
| ఉపవాసం | 6:16-18 | |||||
| పరలోక ధనం | 6:19-21 | [12:32-34] | ||||
| దేహమునకు దీపం | 6:22-23 | [11:33-36] | ||||
| ఇద్దరు యజమానులకు ఎవరూ దాసులుగా లేరు | 6:24 | |||||
| చింతించకండి | 6:25-34 | [12:22-31] | ||||
| ఇతరులను తీర్పు తీర్చడం | 7:1-5 | 6:37-42 | ||||
| ముత్యాలను పందులకు విసరవద్దు | 7:6 | |||||
| అడగుడి మీకివ్వబడును | 7:7-11 | [11:5-13] | ||||
| బంగారు నియమం | 7:12 | |||||
| రెండు ద్వారాలు | 7:13-14 | [13:23-30] | ||||
| ఒక చెట్టు మరియు దాని ఫలం | 7:15-23 | 6:43-45 | ||||
| తెలివైన మరియు మూర్ఖమైన నిర్మాణకులు | 7:24-27 | 6:46-49 | ||||
| జనం ఆశ్చర్యపోయారు | 7:28-29 | |||||
| 
 పరిచర్య కొనసాగింపు | యేసు ఒక శతాధిపతి యొక్క బానిసను స్వస్థపరుస్తాడు | కపెర్నహూము | 8:5-13 | 7:1-10 | ||
| యేసు ఒక వితంతువు కుమారుడిని లేపుతాడు | నాయిను | 7:11-17 | ||||
| యేసు మరియు బాప్తిస్మం ఇచ్చు యోహాను † | (యోహాను ఇంకా చెరశాలలోనే ఉన్నాడు) | 11:2-19 | 7:18-35 | |||
| పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసును అభిషేకించింది | 7:36-50 | |||||
| యేసు ప్రయాణం | గలిలయ | 8:1-3 | ||||
| యేసు మరియు బయల్జెబూలు | కపెర్నహూము | 12:22-30 | 3:20-27 | 11:14-23 | ||
| పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దైవదూషణ | 12:31-37 | 3:28-30 | ||||
| యోనాను గూర్చిన సూచక క్రియ | 12:38-42 | 11:29-32 | ||||
| తాత్కాలిక సంస్కరణ | 12:43-45 | 11:24-28 | ||||
| నా సహోదరులు ఎవరు? | 12:46-50 | 3:31-35 | 8:19-21 | |||
| శరీరం యొక్క దీపం | [6:22-23] | 11:33-36 | ||||
| ఆరు శ్రమలు | 11:37-54 | |||||
| 
 
 ఉపమానాలు: 
 పరలోక రాజ్యం యొక్క ఉపదేశం | విత్తువాడు | గెన్నేసరేతు సరస్సు పక్కన | 13:1-23 | 4:1-20 | 8:4-15 | |
| కలుపు మొక్కలు (గురుగులు) | 13:24-30 | |||||
| దీపం | 4:21-25 | 8:16-18 | ||||
| పెరిగే విత్తనం | 4:26-29 | |||||
| ఆవగింజ | 13:31-32 | 4:30-32 | [13:18-19]7 | |||
| పుల్లని పిండి | 13:33 | [13:20-21] | ||||
| గురుగులను గూర్చిన ఉపమాన భావం | 13:36-43 | |||||
| దాచబడిన ధనం | 13:44 | |||||
| ముత్యం | 13:45-46 | |||||
| చేపల వల | 13:47-52 | |||||
| ప్రవచనాల నెరవేర్పుగా ఉపమానాలు | 13:34-35 | 4:33-34 | ||||
| 
 
 అద్భుతాలు | యేసును వెంబడించటానికి చెల్లించాల్సిన వెల | 8:18-22 | 9:57-62 | |||
| యేసు తుఫానును శాంతపరుస్తాడు | గెన్నేసరేతు సరస్సు (గలిలయ సముద్రం) | 8:23-27 | 4:35-41 | 8:22-25 | ||
| యేసు దెయ్యాలు పట్టిన ఇద్దరు మనుషులను స్వస్థపరుస్తాడు | గెరాస | 8:28-34 | 5:1-20 | 8:26-39 | ||
| చనిపోయిన అమ్మాయి | కపెర్నహూము | 9:18-19 | 5:21-24a | 8:40-42 | ||
| రక్తస్రావముగల స్త్రీ | 9:20-22 | 5:24b-34 | 8:43-48 | |||
| యేసు చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించాడు | 9:23-26 | 5:35-43 | 8:49-56 | |||
| యేసు ఇద్దరు గ్రుడ్డివారిని స్వస్థపరుస్తాడు | 9:27-31 | |||||
| యేసు మూగమనిషిని స్వస్థపరుస్తాడు | 9:32-34 | |||||
| యేసు తన స్వదేశంలో మళ్ళీ తిరస్కరించబడ్డాడు | నజరేతు, విశ్రాంతి దినమున | 13:53-58 | 6:1-6a | |||
| 
 పన్నెండుమంది అపోస్తలులను పరిచర్యకు పంపించడము: 
 పంపించినపుడు చేసిన ఉపదేశం | పనివారు కొద్దిగా ఉన్నారు | “సమస్త పట్టణములయందును,గ్రామములయందును” / “చుట్టుపక్కలనున్న గ్రామమలు” | 9:35-38 | 6:6b | ||
| యేసు పన్నెండు మందిని పిలుస్తాడు | కపెర్నహూము? | 10:1-4 | 6:7 | 9:1-2 | ||
| యేసు అపొస్తలులకు ఆజ్ఞాపిస్తాడు | 10:5-15 | 6:8-11 | 9:3-5 | |||
| వివేకులే కానీ నిష్కపటులు కూడా | 10:16-33 | [12:1-12] | ||||
| సంఘర్షణ మరియు త్యాగం | 10:34-38 | [12:49-53] | ||||
| యేసు నిమిత్తం ప్రాణాలు పొగొట్టుకున్నవారు దానిని దక్కించుకుంటారు | 10:39 | [17:33] | ||||
| “మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును” | 10:40-42 | |||||
| అపొస్తలులు పంపబడ్డారు | 11:1 | 6:12-13 | 9:6 | |||
| యోహాను మరణం | బాప్తిస్మము ఇచ్చు యోహాను యొక్క మరణం † | మకీరస్/మకారస్ (29వ సంవత్సర ప్రారంభములో?) | 14:3-12 | 6:17-29 | (9:9) | |
| హేరోదు యేసు గురించి ఆశ్చర్యపోయాడు | పెరియా | 14:1-2 | 6:14-16 | 9:7-9 | ||
యేసు పరిచర్య యొక్క మూడవ సంవత్సరం (ప్రతికూల సంవత్సరం)
| ఎప్పుడు మరియు ఎక్కడ | మత్తయి | మార్కు | లూకా | యోహాను | ||
| 
 జనసమూహం మరియు అద్భుతాలు (యేసు పరిచర్యలో మూడవ పస్కా పండుగ †) | అపొస్తలులు తిరిగి వస్తారు | కపెర్నహూము? | 6:30 | 9:10a | ||
| యేసు ఏకాంత ప్రదేశానికి పడవలో వెళ్ళాడు | బేత్సయిదా దగ్గర (లూకా 9:10), దానికి దక్షిణంగా? | 14:13a | 6:31-32 | 9:10b | 6:1 | |
| జనసమూహం అనుసరిస్తుంది | 14:13b | 6:33 | 9:11a | 6:2 | ||
| యేసు ప్రజలకు బోధిస్తాడు మరియు స్వస్థపరుస్తాడు | ఒక కొండపై ( యోహాను 6: 3), దాదాపు పస్కా పండుగ సమయంలో, ఏప్రిల్ (29వ సంవత్సరం) | 14:14 | 6:34 | 9:11b | 6:3-4 | |
| యేసు ఐదువేల మందికి ఆహారం పెట్టాడు | సాయంత్రం వరకు, “పచ్చిక మీద’’ (మార్కు 6:39)8 | 14:15-21 | 6:35-44 | 9:12-17 | 6:5-13 | |
| తనను ప్రజలు రాజుగా చేస్తామనటాన్ని యేసు తిరస్కరించాడు | 6:14-15 | |||||
| యేసు శిష్యులను పడవ ద్వారా పంపివేస్తాడు | 14:22a | 6:45a | 6:16-17a | |||
| యేసు జనసమూహాలను పంపివేశాడు | 14:22b | 6:45b | ||||
| యేసు ప్రార్థన చేయడానికి కొండకు వెళ్తాడు | 14:23a | 6:46 | ||||
| సాయంత్రం శిష్యులు కష్టపడతారు | సాయంత్రం | 14:23b-24 | 6:47-48a | 6:17b-18 | ||
| యేసు నీటి మీద నడుస్తాడు | నాల్గవ గడియ, ఉదయం 3 గంటల తరువాత. | 14:25-26 | 6:48b-50a | 6:19 | ||
| “భయపడకుడి” | 14:27 | 6:50b | 6:20 | |||
| పేతురు నీటి మీద నడుస్తాడు | 14:28-31 | |||||
| యేసు తుఫానును శాంతింపజేసి పడవలోకి ప్రవేశిస్తాడు | 14:32-33 | 6:51-52 | 6:21 | |||
| గెన్నేసరేతులో అద్భుతాలు | గెన్నేసరేతు పట్టణం | 14:34-36 | 6:53-56 | |||
| జీవాహారం | కపెర్నహూము, మరుసటి రోజు | 6:22-71 | ||||
| యేసు మనుష్యుల సంప్రదాయాలను ఖండించాడు | 15:1-9 | 7:1-13 | ||||
| నిజమైన అపవిత్రత | 15:10-20 | 7:14-23 | ||||
| గొప్ప గలిలయ పరిచర్య యొక్క ముగింపు9 | 7:1 | |||||
| 
 గలిలయ మరియు పరిసర ప్రాంతాలలో ప్రయాణం | కనానీయు స్త్రీ | తూరు మరియు సీదోను | 15:21-28 | 7:24-30 | ||
| యేసు చెవిటి మరియు మూగ మనిషిని (మరియు ఇతరులను) నయం చేస్తాడు | గలిలయ సముద్రం, ఆగ్నేయ తీరం (దేకపోలి) | 15:29-31 | 7:31-37 | |||
| యేసు నాలుగువేలమందికి ఆహారం పెట్టాడు | తూరు మరియు సీదోను నుండి బయలుదేరిన 3 రోజుల తరువాత | 15:32-39 | 8:1-10 | |||
| ఒక సూచన కోసం అడగడం | దల్మనూత / మగదను / మగ్దల | 16:1-4 | 8:11-13 | |||
| యూదానాయకుల గురించి హెచ్చరికలు | 16:5-12 | 8:14-21 | ||||
| బేత్సయిదా సమీపంలో గ్రుడ్డివాడు | బేత్సయిదా | 8:22-26 | ||||
| 
 
 అంతం కొరకు అపొస్తలుల సిద్ధపాటు | పేతురు యొక్క ఒప్పుకోలు | కైజేరియా ఫిలిప్పీ | 16:13-20 | 8:27-30 | 9:18-20 | |
| యేసు తన మరణాన్ని ముందుగానే ప్రకటించాడు | 16:21-23 | 8:31-33 | 9:21-22 | |||
| నిజమైన శిష్యత్వం | 16:24-27 | 8:34-38 | 9:23-26 | |||
| దేవుని రాజ్యం త్వరలో వస్తుంది | 16:28 | 9:1 | 9:27 | |||
| రూపాంతరము | 6 రోజుల తరువాత (మత్త. 17: 1, మార్కు 9: 2), హెర్మోను పర్వతం? | 17:1-9 | 9:2-10 | 9:28-36 | ||
| ఏలీయా మరియు బాప్తిస్మము ఇచ్చు యోహాను | 17:10-13 | 9:11-13 | ||||
| యేసు మూగదయ్యము పట్టిన ఒకనిని స్వస్థపరుస్తాడు | మరుసటి రోజు (లూకా 9:37), పర్వతం దగ్గర | 17:14-18 | 9:14-29 | 9:37-43a | ||
| ఆవగింజంత విశ్వాసం | 17:19-21 | [17:5-6] | ||||
| యేసు తన మరణాన్ని మరల ప్రకటించాడు | గలిలయ | 17:22-23 | 9:30-32 | 9:43b-45 | ||
| చేప నుండి నాణెం | కపెర్నహూము | 17:24-27 | ||||
| 
 
 సంఘం గురించి ఉపదేశం | పరలోక రాజ్యంలో గొప్పవాడు | 18:1-2 | 9:33-36 | 9:46-47 | ||
| చిన్నబిడ్డ వంటివారు అవ్వండి | 18:3-4 | |||||
| విశ్వాసిని చేర్చుకోవడం | 18:5 | 9:37 | 9:48 | |||
| యేసు నామములో కార్యాలు10 | 9:38-41 | 9:49-50 | ||||
| విశ్వాసిని అభ్యంతరచడం | 18:6-7 | 9:42 | [17:1-2] | |||
| శోధనను గురించి హెచ్చరిక | 18:8-9 | 9:43-50 | ||||
| తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానం | 18:10-14 | [15:1-7] | ||||
| సంఘములో క్రమశిక్షణ | 18:15-17 | |||||
| యేసు అపొస్తలులకు అధికారం ఇస్తాడు | 18:18-20 | |||||
| క్షమాపణ | 18:21-22 | [17:3-4] | ||||
| రుణపడి ఉన్న దాసుల ఉపమానము | 18:23-35 | |||||
| 
 యెరూషలేములో పర్ణశాలల పండుగ † | యేసు సోదరులు | కపెర్నహూము, సెప్టెంబర్ లేదా అక్టోబర్ (29వ సంవత్సరం) | 7:2-9 | |||
| యేసు రహస్యంగా విందుకు వెళ్తాడు | యెరూషలేము | 7:10-13 | ||||
| యేసు గురించి వివాదం | 7:14-52 | |||||
| వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ | ఆలయంలో | 7:53, 8:11 | ||||
| వివిధ బోధలు | 8:12-59 | |||||
| గ్రుడ్డివాడిగా పుట్టిన మనిషిని స్వస్థపరుస్తాడు | ఒక విశ్రాంతి(సబ్బాత్) దినమున | 9:1, 10:21 | ||||
| 
 
 గలిలయ నుండి యూదాకు ప్రయాణిస్తున్నప్పుడు పరిచర్య | యేసు గలిలయను విడిచిపెట్టాడు | 19:1a | 10:1a | 9:51 | ||
| కుష్ఠురోగంతో ఉన్న పదిమందిని యేసు స్వస్థపరిచాడు | గలిలయ సమరియల మధ్య సరిహద్దు | 17:11-19 | ||||
| సమరియుల యొక్క వ్యతిరేకత | సమరియ | 9:52-56 | ||||
| యేసు డెబ్బై రెండు మందిని పరిచర్యకు పంపుతాడు | (ప్రదేశం తెలియదు, గలిలయ కాదు) | 11:20-24 | 10:1-16 | |||
| డెబ్బై రెండు మంది తిరిగి వస్తారు | 10:17-20 | |||||
| దేవుని యొక్క ప్రత్యక్షత | 11:25-27 | 10:21-24 | ||||
| “నేను మీకు విశ్రాంతి కలుగజేతును” | 11:28-30 | |||||
| మంచి సమరయుని ఉపమానం | 10:25-37 | |||||
| మరియ మార్తలతో యేసు | యెరూషలేము దగ్గర బేతనీయ | 10:38-42 | ||||
| ప్రభువు ప్రార్థన | “ఒక చోట”, బహుశా యెరూషలేము చుట్టుపక్కల | [6:9-15] | 11:1-4 | |||
| అడుగుడి ఇవ్వబడును | [7:7-11] | 11:5-13 | ||||
| యెరూషలేములో | ప్రతిష్ఠిత పండుగ (హనుక్కా) † | యెరూషలేము, నవంబర్ లేదా డిసెంబర్ (29వ సంవత్సరం) | 10:22-39 | |||
| 
 
 
 పెరియాలోని పరిచర్య | పెరియాకు ప్రయాణం | పెరియా | 19:1b-2 | 10:1b | 10:40-42 | |
| హెచ్చరికలు మరియు ప్రోత్సాహకాలు | [10:16-33] | 12:1-12 | ||||
| ధనవంతుడైన మూర్ఖుని ఉపమానం | 12:13-21 | |||||
| చింతించకండి | [6:25-34] | 12:22-31 | ||||
| పరలోకంలో నిధి | [6:19-21] | 12:32-34 | ||||
| మెలకువ | 12:35-48 | |||||
| సమాధానం కాదు విభజన | [10:34-38] | 12:49-53 | ||||
| కాలముల వివరణ | 12:54-59 | |||||
| మారుమనస్సు పొందకపోతే నశిస్తారు | 13:1-9 | |||||
| యేసు విశ్రాంతి దినమున నడుము వంగిపోయిన స్త్రీని స్వస్థపరిచాడు | ఒక విశ్రాంతి(సబ్బాతు) దినమున సమాజమందిరంలో | 13:10-17 | ||||
| ఆవగింజ ఉపమానం | [13:31-32] | [4:30-32] | 13:18-197 | |||
| పులిసిన పిండిని గూర్చిన ఉపమానం | [13:33] | 13:20-21 | ||||
| యేసు యెరూషలేము వైపు బయలుదేరాడు | పట్టణాలు & గ్రామాలు, యెరూషలేం వైపు | 13:22 | ||||
| ఇరుకైన ద్వారము | [7:13-14] | 13:23-30 | ||||
| యేసు హేరోదు గురించి హెచ్చరించాడు | 13:31-33 | |||||
| ఒక పరిసయ్యుని ఇంట్లో యేసు | ఒక విశ్రాంతి(సబ్బాతు) దినమున | 14:1-14 | ||||
| గొప్ప విందు యొక్క ఉపమానం | 14:15-24 | |||||
| యేసును వెంబడించటానికి చెల్లించాల్సిన వెల | 14:25-33 | |||||
| సారము లేని ఉప్పు పనికిరానిది | [5:13] | [9:50] | 14:34-35 | |||
| తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానం | [18:10-14] | 15:1-7 | ||||
| పోగొట్టుకున్న నాణెం యొక్క ఉపమానం | 15:8-10 | |||||
| తప్పిపోయిన కుమారుని ఉపమానం | 15:11-32 | |||||
| తెలివిగల గృహనిర్వాహకుని ఉపమానం | 16:1-15 | |||||
| ఇంకొన్ని బోధనలు | 16:16-18 | |||||
| ధనవంతుడు మరియు లాజరు | 16:19-31 | |||||
| విశ్వాసి పాపము చేయడానికి కారణమవ్వటం | [18:6-7] | [9:42] | 17:1-2 | |||
| క్షమాపణ | [18:21-22] | 17:3-4 | ||||
| ఆవగింజ వంటి విశ్వాసం | [17:19-21] | 17:5-6 | ||||
| నిష్ప్రయోజకులైన దాసులు | 17:7-10 | |||||
| దేవుని రాజ్యం యొక్క రాకడ | [24:23-27] | [13:21-23] | 17:20-25 | |||
| నోవాహు దినములలో వలె | [24:37-39] | 17:26-27 | ||||
| లోతు దినములలో వలె | 17:28-32 | |||||
| యేసు నిమిత్తం ప్రాణమును పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు | [10:39] | 17:33 | ||||
| కొంతమంది కొనిపోబడతారు, కొందరు విడచిపెట్టబడతారు | [24:40-43] | 17:34-36 | ||||
| పీనుగు - గద్దలు | [24:28] | 17:37 | ||||
| పట్టువిడవని వితంతువు యొక్క ఉపమానం | 18:1-8 | |||||
| పరిసయ్యుడు మరియు సుంకరి ఉపమానం | 18:9-14 | |||||
| లాజరును లేపడానికి యూదయకు తిరిగి వెళ్లడం | లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసు విన్నాడు | పెరియా | 11:1-16 | |||
| యేసు లాజరును లేపుతాడు | యెరూషలేము దగ్గర బేతనీయ | 11:17-53 | ||||
| యేసు అప్పటినుండి యూదులలో బహిరంగంగా సంచరించలేదు | ఎఫ్రాయిము | 11:54 | ||||
| 
 చివరి ప్రయాణం | విడాకులు | (బహుశా ఇది కూడా పెరియాలోనే అయ్యుండొచ్చు) | 19:3-12 | 10:2-12 | ||
| యేసు పిల్లలను ఆశీర్వదిస్తాడు | 19:13-15 | 10:13-16 | 18:15-17 | |||
| ధనవంతుడైన యువకుడు | 19:16-22 | 10:17-22 | 18:18-23 | |||
| ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించటం | 19:23-26 | 10:23-27 | 18:24-27 | |||
| సువార్త నిమిత్తం నష్టపోవటం | 19:27-30 | 10:28-31 | 18:28-30 | |||
| ద్రాక్షతోటలోని పనివారి ఉపమానం | 20:1-16 | |||||
| యేసు తన మరణాన్ని మళ్ళీ ప్రకటించాడు | యెరూషలేముకు వైపుకు వెళ్ళే రహదారిపై | 20:17-19 | 10:32-34 | 18:31-34 | ||
| యాకోబు, యోహానుల తల్లి | 20:20-23 | 10:35-40 | ||||
| తగ్గింపు | 20:24-28 | 10:41-45 | ||||
| యేసు గ్రుడ్డి బర్తిమయియను, మరొకరిని స్వస్థపరిచాడు | యెరికో | 20:29-34 | 10:46-52 | 18:35-4311 | ||
| జక్కయ్య యేసు దగ్గరకు వస్తాడు | 19:1-10 | |||||
| పది మినాల ఉపమానం | 19:11-27 | |||||
| యేసు యెరూషలేము వైపు వెళ్తాడు | 19:28 | |||||
| యేసును ఖైదు చేయాలనే కుట్ర | యెరూషలేము, ఏప్రిల్, పస్కాకు పండుగకు కొంత సమయం ముందు (30వ సంవత్సరం) | 11:55-57 | ||||
యేసు పరిచర్యలోని చివరి వారం
(మందపాటి గీత: కొత్త రోజు) & (మందపాటి ఎరుపు గీత: వచనం క్రొత్త రోజును సూచిస్తుంది)
| ఎప్పుడు మరియు ఎక్కడ | మత్తయి | మార్కు | లూకా | యోహాను | ||
| పస్కా పండుగకు 6 రోజుల ముందు † | మరియ యేసును అభిషేకించింది12 | బేతనీయ, పస్కా పండుగకు 6 రోజుల ముందు † | 26:6-13 | 14:3-9 | 12:1-8 | |
| లాజరును చంపే ప్రణాళిక | 12:9-11 | |||||
| 
 
 ఆ మరుసటి రోజు† | ప్రజలు యేసును కలవడానికి వస్తారు | 
 | 12:12-13 | |||
| గాడిద పిల్ల కోసం యేసు తన శిష్యులను పంపుతాడు | ఒలీవ పర్వతాన్ని దాటాక | 21:1-7 | 11:1-7 | 19:29-35 | 12:14-16 | |
| విజయోత్సవ ప్రవేశం | యెరూషలేము | 21:8-9 | 11:8-10 | 19:36-40 | ||
| యెరూషలేము నాశనాన్ని ఉహించాడు | 19:41-44 | |||||
| యేసు గుర్తించబడ్డాడు | 21:10-11 | 12:17-19 | ||||
| యేసు బేతనీయకు తిరిగి వెళ్ళాడు | బేతనీయ | 21:17 | 11:11 | |||
| 
 
 మరుసటి రోజు † | ఫలములు లేని అంజూరపు చెట్టు | మార్గం మధ్యలో | 21:18-19a | 11:12-14 | ||
| యేసు దేవాలయాన్ని ఖాళీ చేశాడు | యెరూషలేములోని ఆలయంలో | 21:12-13 | 11:15-17 | 19:45-46 | ||
| యేసు శత్రువులు వారి కుట్రను కొనసాగిస్తున్నారు | 11:18 | 19:47-48 | ||||
| పిల్లలు యేసును స్తుతిస్తారు | 21:14-16 | |||||
| యేసు తన శిష్యులతో పట్టణములో నుండి బయటకు వెళ్ళాడు | ఎక్కడికి?? | 11:19 | ||||
| రోజువారీ దినచర్య, ఉదయం మరియు సాయంత్రం | (21:37-38) | |||||
| 
 
 ఆ మరుసటి రోజు ఉదయం † | అంజూరపు చెట్టు ఎండిపోతుంది | మార్గం మధ్యలో | 21:19b-22 | 11:20-26 | ||
| యేసు యొక్క అధికారం ప్రశ్నించబడింది | యెరూషలేములో | 21:23-27 | 11:27-33 | 20:1-8 | ||
| ఇద్దరు కుమారుల ఉపమానం | 21:28-32 | |||||
| పంటకాపుల ఉపమానం | 21:33-41 | 12:1-9 | 20:9-16 | |||
| కట్టువారు తిరస్కరించిన రాయి | 21:42-44 | 12:10-11 | 20:17-18 | |||
| మతనాయకులు అభ్యంతరపడ్డారు | 21:45-46 | 12:12 | 20:19 | |||
| వివాహ విందు యొక్క ఉపమానం | 22:1-14 | |||||
| పన్నుల గురించి ప్రశ్న | 22:15-22 | 12:13-17 | 20:20-26 | |||
| పునరుత్థానం గురించి ప్రశ్న | 22:23-33 | 12:18-27 | 20:27-38 | |||
| ముఖ్యమైనది మరియు మొదటిది ఐన ఆజ్ఞ | 22:34-40 | 12:28-34 | 20:39-40 | |||
| క్రీస్తు ఎవరి కుమారుడు? | 22:41-46 | 12:35-37 | 20:41-44 | |||
| యేసు అహంకారాన్ని ఖండించాడు | 23:1-12 | 12:38-40 | 20:45-47 | |||
| ఏడు శ్రమలు | 23:13-36 | |||||
| యెరూషలేము గురించి యేసు విలపించాడు | 23:37-39 | 13:34-35 13 | ||||
| పేద వితంతువు యొక్క ఉదాహరణ | 12:41-44 | 21:1-4 | ||||
| 
 
 యుగసమాప్తి గురించిన బోధన: 
 ఒలీవకొండ మీది ప్రసంగం | ఆలయం నాశనమవుతుంది | ఆలయం విడిచి బయటకు వస్తున్నపుడు | 24:1-2 | 13:1-2 | 21:5-6 | |
| శిష్యులు ప్రశ్నలు అడుగుతారు | 24:3 | 13:3-4 | 21:7 | |||
| “ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి” | 24:4-5 | 13:5-6 | 21:8 | |||
| యుద్ధాలు మరియు హింస | 24:6-14 | 13:7-13 | 21:9-19 | |||
| హేయవస్తువు మరియు శ్రమ | 24:15-22 | 13:14-20 | 21:20-24 | |||
| అబద్ధ క్రీస్తులు | 24:23-27 | 13:21-23 | [17:20-25] | |||
| పీనుగు మరియు గద్దలు | 24:28 | [17:37] | ||||
| మనుష్యకుమారుని రాక | 24:29-31 | 13:24-27 | 21:25-28 | |||
| అంజూరపు చెట్టు యొక్క పాఠం | 24:32-35 | 13:28-31 | 21:29-33 | |||
| ఆ దినము లేదా గడియ ఎవరికీ తెలియదు | 24:36 | 13:32 | ||||
| నోవాహు దినములలో వలె | 24:37-39 | [17:26-27] | ||||
| కొంతమంది తీసుకొనిపోబడతారు, కొందరు విడచిపెట్టబడతారు | 24:40-43 | [17:34-36] | ||||
| మెలకువగా ఉండటం | 24:44-51 | 13:33-37 | 21:34-36 | |||
| పదిమంది కన్యకల ఉపమానం | 25:1-13 | |||||
| తలాంతుల ఉపమానం | 25:14-30 | |||||
| గొర్రెలు, మేకలు | 25:31-46 | |||||
| 
 
 ఆ మరుసటి రోజు మధ్యాహ్నం | యేసు తన మరణాన్ని మళ్ళీ ప్రకటించాడు | 12:20-36a | ||||
| 12:36b | ||||||
| తన సిలువ మరణం గురించి యేసు శిష్యులకు గుర్తుచేస్తాడు | పస్కా పండుగకు / పులియని రొట్టెల పండుగకు రెండు రోజుల ముందు† | 26:1-2 | ||||
| యేసుకు వ్యతిరేకంగా కుట్ర | 26:3-5 | 14:1-2 | 22:1-2 | |||
| యేసుకు ద్రోహం చేయడానికి యూదా అంగీకరిస్తాడు | 26:14-16 | 14:10-11 | 22:3-6 | |||
| యూదుల అవిశ్వాసం | 12:37-43 | |||||
| యేసు సందేశం యొక్క సారాంశం | 12:44-50 | |||||
| (యేసు విశ్రమిస్తాడు?) | ||||||
| ప్రభురాత్రి భోజనం కోసం సన్నాహాలు | పస్కా పండుగ/ పులియని రొట్టెల పండుగ యొక్క మొదటి రోజు † | 26:17-19 | 14:12-16 | 22:7-13 | ||
| 
 
 ప్రభురాత్రి భోజనం 
 (యేసు పరిచర్య యొక్క నాల్గవ పస్కా పండుగ) | వారందరూ భోజనపుబల్ల వద్ద కూర్చున్నారు | మేడగది, రాత్రి † | 26:20 | 14:17 | 22:14 | |
| ప్రభురాత్రి భోజన ప్రాముఖ్యత | 22:15-16 | |||||
| యేసు తన శిష్యుల పాదాలను కడుగుతాడు 14 | 13:1-17 | |||||
| యేసు తనను అప్పగించువాని గురించి మాట్లాడతాడు | 26:21 | 14:18 | 22:21-22 | 13:18-21 | ||
| అది ఎవరు అని శిష్యులు అడుగుతారు14 | 26:22-25 | 14:19-21 | 22:23 | 13:22-25 | ||
| యేసు తనను అప్పగించువానిని తెలియజేశాడు | 13:26-27a | |||||
| ఇస్కరియోతు యూదా అక్కడినుండి వెళ్లిపోతాడు | 13:27b-30 | |||||
| కొత్త ఆజ్ఞ | 13:31-35 | |||||
| ప్రభురాత్రి భోజనాన్ని స్థాపించడం (రొట్టె) | 26:26 | 14:22 | 22:19 | 1 Co. 11:23-24 | ||
| ప్రభురాత్రి భోజనాన్ని స్థాపించడం (ద్రాక్షరసం) | 26:27-28 | 14:23-24 | 22:20 | 1 Co. 11:25 | ||
| యేసు మరలా ద్రాక్షరసం తాగడు | 26:29 | 14:25 | 22:17-18 | |||
| సేవ ద్వారా గొప్పతనం | 22:24-30 | |||||
| పేతురు తిరస్కరణను యేసు ప్రవచించాడు | 22:31-34 | 13:36-38 | ||||
| యేసే తండ్రి వద్దకు మార్గం | 14:1-14 | |||||
| పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం | 14:15-31a | |||||
| జాలెయు, సంచి మరియు కత్తి | 22:35-38 | |||||
| వారు ఒలీవ కొండకు వెళతారు | 26:30 | 14:26 | 22:39 | 14:31b | ||
| పేతురు తిరస్కరణను యేసు మళ్ళీ ప్రవచించాడు | 26:31-35 | 14:27-31 | ||||
| “నేను నిజమైన ద్రాక్షావల్లిని” | 15:1-17 | |||||
| లోకం యొక్క ద్వేషం | 15:18- 16:4 | |||||
| పరిశుద్ధాత్మ యొక్క పని | 16:5-15 | |||||
| “మీ దు:ఖం సంతోషమగును” | 16:16-24 | |||||
| “నేను లోకమును జయించి ఉన్నాను” | 16:25-33 | |||||
| ప్రధాన యాజక ప్రార్థన | 17:1-26 | |||||
| గెత్సెమనేలో | వారు గెత్సెమనే వద్దకు వస్తారు | గెత్సెమనే | 26:36-38 | 14:32-34 | 22:40 | 18:1 | 
| యేసు వేదనతో ప్రార్థిస్తాడు | 26:39 | 14:35-36 | 22:41-45 | |||
| యేసు రెండవసారి ప్రార్థిస్తాడు | 26:40-42 | 14:37-39 | 22:46 | |||
| యేసు మూడవసారి ప్రార్థిస్తాడు | 26:43-46 | 14:40-42 | ||||
| యూదా యేసును అప్పగిస్తాడు | 26:47-50 | 14:43-45 | 22:47-48 | 18:2-3 | ||
| యేసు శిష్యుల భద్రత కోసం అడుగుతాడు | 18:4-9 | |||||
| పేతురు మల్కు చెవిని తెగనరుకుతాడు | 26:51-54 | 14:46-47 | 22:49-51 | 18:10-11 | ||
| తనను ఖైదు చేసే విధానాన్ని యేసు ప్రశ్నించాడు | 26:55-56a | 14:48-49 | 22:52-53 | |||
| యేసు ఖైదు అయ్యాడు, శిష్యులు పారిపోతారు | 26:56b | 14:50 | 18:12 | |||
| ఒక యువకుడు నగ్నంగా పారిపోతాడు (మార్కు ??) | 14:51-52 | |||||
| యూదా అధికారుల విచారణ | అన్న మరియు కయప ఇంటికి15 | యెరూషలేము | 26:57 | 14:53 | 22:54a | |
| మొదట అన్న ఇంటికి | 18:13-14 | |||||
| పేతురు ప్రాంగణంలోకి వెళ్తాడు | 26:58 | 14:54 | 22:54b | 18:15-16 | ||
| పేతురు యేసును మొదటిసారి తిరస్కరించాడు | 26:69-71a | 14:66-68 | 22:55-57 | 18:17-18 | ||
| అన్న ముందు విచారణ | 18:19-23 | |||||
| కయప మరియు మహాసభ (సన్హెద్రిన్) ముందు విచారణ | 26:59-66 | 14:55-64 | 18:24 | |||
| వారు యేసును కొట్టి ఎగతాళి చేస్తారు | 26:67-68 | 14:65 | 22:63-65 | |||
| పేతురు యేసును రెండవసారి తిరస్కరించాడు | “కొంచెం తరువాత” (లూకా 22:58) | 26:71b-72 | 14:69-70a | 22:58 | 18:25 | |
| పేతురు యేసును మూడవసారి తిరస్కరించాడు | “సుమారు గంట తరువాత” (లూకా 22:59) | 26:73-74a | 14:70b-71 | 22:59-60a | 18:26-27a | |
| కోడి కూసింది (రెండవసారి) | 26:74b | 14:72a | 22:60b | 18:27b | ||
| యేసు ఏడుస్తున్న పేతురు వైపు చూస్తాడు | 26:75 | 14:72b | 22:61-62 | |||
| మరుసటి రోజు †, ఉదయాన్నే | మహాసభ (సన్హెద్రిన్) యేసుకు శిక్ష విధించెను | 27:1 | 15:1a | 22:66-71 | ||
| యూదా ఆత్మహత్య చేసుకున్నాడు | 27:3-10 | Acts 1:18-19 | ||||
| పిలాతు విచారణ | పిలాతు ఎదుట | ప్రిటోరియం(రోమా అధిపతి యొక్క నివాసం) | 27:2 | 15:1b | 23:1-2 | 18:28-32 | 
| పిలాతు యేసును విచారిస్తాడు | 27:11-14 | 15:2-5 | 23:3-4 | 18:33-38 | ||
| హేరోదు ఎదుట | 23:5-12 | |||||
| పిలాతు భార్య నుండి సందేశం | 27:19 | |||||
| పిలాతు యేసుని విడుదల చేయాలని ప్రయత్నించాడు | 23:13-16 | |||||
| యేసు లేదా బరబ్బ | 27:15-18 | 15:6-10 | 23:17 | 18:39 | ||
| జనం బరబ్బను ఎన్నుకుంటారు | 27:20-21 | 15:11 | 23:18-19 | 18:40 | ||
| “అతన్ని సిలువ వేయండి!” | 27:22-23 | 15:12-14 | 23:20-23 | |||
| ముళ్ళ కిరీటం | 27:27-30 | 15:16-19 | 19:1-3 | |||
| పిలాతు యేసుని విడుదల చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తాడు | ఉదయం 6 (6:00 a.m). † | 19:4-15 | ||||
| పిలాతు చేతులు కడుక్కున్నాడు | 27:24-25 | |||||
| బరబ్బ విడుదల అయ్యాడు | 27:26 | 15:15 | 23:24-25 | 19:16 | ||
| సిలువ వేయడానికి వారు యేసుని బయటకు నడిపిస్తారు | వయా డోలోరోసాలో | 27:31 | 15:20 | 19:17 | ||
| కురేనీయుడైన సీమోను | 27:32 | 15:21 | 23:26 | |||
| స్త్రీలు యేసు నిమిత్తం ఏడుస్తారు | 23:27-31 | |||||
| సిలువ | యేసు సిలువ వేయబడ్డాడు | గోల్గొతా (“కపాల స్థలం”), ఉదయం 9:00 (మార్కు. 15:25) | 27:33-35a | 15:22-24a | 23:33 | 19:18 | 
| “తండ్రీ,.... వీరిని క్షమించుము” 16 | 23:34a | |||||
| వారు యేసు బట్టల కోసం చీట్లు వేస్తారు | 27:35b-36 | 15:24b | 23:34b | 19:23-24 | ||
| ఇది మూడవ గంట (9 a.m.) | ఉదయం 9:00 † | 15:25 | ||||
| యేసు మీద మోపబడిన నేరాన్ని వ్రాసి ఆయనకు పైగా ఉంచారు | 27:37 | 15:26 | 23:38 | 19:19-22 | ||
| వారు యేసుతో పాటు ఇద్దరు దొంగలను సిలువ వేస్తారు | 27:38 | 15:27 | 23:32 | |||
| అందరూ యేసుని అవమానిస్తారు | 27:39-44 | 15:28-32 | 23:35 | |||
| సైనికులు యేసుని అవమానిస్తారు | 23:36-37 | |||||
| “మీరు పరదైసులో నాతో ఉంటారు” | 23:39-43 | |||||
| “ఇదిగో నీ తల్లి”14 | 19:25-27 | |||||
| భూమి అంతా చీకటి | మధ్యాహ్నం 12:00 † | 27:45 | 15:33 | 23:44-45a | ||
| “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి??” | మధ్యాహ్నం 3:00 p.m. † | 27:46-47 | 15:34-35 | |||
| “నేను దప్పిగొనుచున్నాను” | 27:48 | 15:36a | 19:28-29 | |||
| “ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూతము” | 27:49 | 15:36b | ||||
| “సమాప్తమైనది” | 19:30a | |||||
| “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను” | 23:46a | |||||
| యేసు మరణం | 27:50 | 15:37 | 23:46b | 19:30b | ||
| అద్భుత సంఘటనలు | 27:51-53 | 15:38 | 23:45b | |||
| శతాధిపతి యేసుని నమ్ముతాడు | 27:54 | 15:39 | 23:47 | |||
| జనం ఆశ్చర్యపోయారు | 23:48 | |||||
| స్త్రీలు మరియు యేసు అనుచరులు | 27:55-56 | 15:40-41 | 23:49 | |||
| యేసు పక్కను ఈటెతో పొడిచారు 14 | 19:31-37 | |||||
| 
 యేసు సమాధి చేయబడ్డాడు | అరిమతీయాకు చెందిన యోసేపు యేసు శరీరాన్ని అప్పగించమని అడుగుతాడు | మద్యాహ్నం తరువాత † | 27:57-58 | 15:42-45 | 23:50-52 | 19:38 | 
| యేసు సమాధి చేయబడ్డాడు | రాత్రివేళకు ముందు † | 27:59-60 | 15:46 | 23:53-54 | 19:39-42 | |
| యేసు సమాధి స్థలాన్ని స్త్రీలు చూసి వెళ్తారు | 27:61 | 15:47 | 23:55 | |||
| స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తారు | 23:56a | |||||
| 
 | సమాధి ముందు కాపలా | 27:62-66 | ||||
| స్త్రీలు విశ్రాంతి తీసుకుంటారు | 23:56b | |||||
| స్త్రీలు ఎక్కువ సుగంధ ద్రవ్యాలను కొంటారు | ఒక విశ్రాంతి(సబ్బాత్) దినము తరువాత. శనివారం సాయంత్రం? | 16:1 | ||||
పునరుత్థానం నుండి పరలోకానికి ఆరోహణమయ్యే వరకు 40 రోజులు
| ఎప్పుడు మరియు ఎక్కడ | మత్తయి | మార్కు | లూకా | యోహాను | ||
| యేసు క్రీస్తు పునరుత్థానం (ఆదివారం)† | స్త్రీలు యేసు సమాధి వద్దకు వెళతారు | మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమీ; ఇంకను చీకటి | 28:1 | 16:2-3 | 24:1 | 20:1a | 
| రాయి పొర్లించబడింది | 28:2-4 | |||||
| స్త్రీలు అది చూస్తారు! | 16:4 | 24:2 | 20:1b | |||
| స్త్రీలు యేసు శరీరాన్ని కనుగొనలేరు | 24:3 | |||||
| స్త్రీలు దేవదూతలను చూస్తారు | 16:5 | 24:4 | ||||
| దేవదూతలు యేసు పునరుత్థానాన్ని ప్రకటిస్తారు | 28:5-6 | 16:6 | 24:5-6a | |||
| “ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి” | 24:6b-8 | |||||
| “త్వరగా వెళ్లి.... ఆయన శిష్యులకు తెలియజేయుడి” | 28:7 | 16:7 | ||||
| మొదట ఆ స్త్రీలు భయంతో ఏమీ మాట్లాడలేదు | 16:8 | |||||
| అప్పుడు ఆ స్త్రీలు యేసు శిష్యులకు చెప్పడానికి త్వరపడి వెళ్ళారు | 28:8a | |||||
| మగ్దలేనే మరియ అవిశ్వాసంతో ముందుకు నడుస్తుంది | 20:2a | |||||
| మగ్దలేనే మరియ, పేతురు మరియు యోహానులకు చెబుతుంది 14 | 20:2b | |||||
| పేతురు మరియు యోహాను యేసు సమాధిని చూస్తారు | 24:12 | 20:3-10 | ||||
| యేసు మగ్దలేనే మరియకు కనిపిస్తాడు | 16:9 | 20:11-17 | ||||
| యేసు (ఇతర) స్త్రీలకు కనిపిస్తాడు | 28:8b-10 | |||||
| కావలివారి నివేదిక | 28:11-15 | |||||
| స్త్రీలు శిష్యులకు సమాచారాన్ని అందిస్తారు | 16:10-11 | 24:9-11 | 20:18 | |||
| యేసు పేతురుకు కనిపిస్తాడు | ఎప్పుడు? | 1 Co. 15:5a | (24:34) | |||
| యేసు క్లియోపా & మరొకరికి కనిపిస్తాడు | మధ్యాహ్నం, ఎమ్మాయుకి రహదారి (7 మైళ్ళు, 2 గంటల నడక) | 16:12 | 24:13-27 | |||
| యేసు తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకుంటాడు | “దాదాపు సాయంత్రం”, ఎమ్మాయు | 24:28-32 | ||||
| వారు యెరూషలేముకు తిరిగి వస్తారు | (2 గంటల నడక తరువాత) | 16:13 | 24:33-35 | |||
| యేసు శిష్యులకు కనిపిస్తాడు | ఆదివారం సాయంత్రం † | 1 Co. 15:5b | 16:14 | 24:36-43 | 20:19-20 | |
| అపొస్తలులు అధికారాన్ని పొందుతారు | 20:21-23 | |||||
| వారు అర్థం చేసుకోవడానికి యేసు వారి మనస్సులను తెరుస్తాడు | 24:44-48 | |||||
| తరువాత | తోమా యొక్క అవిశ్వాసం | 20:24-25 | ||||
| మరుసటి ఆదివారం | యేసు తోమాకు కనిపిస్తాడు | అదే ఇల్లు, యేసు పునరుత్థానం ఐన ఒక వారం తరువాత † | 20:26-29 | |||
| తరువాత | యేసు ఏడుగురు శిష్యులకు కనిపిస్తాడు 14 | గలిలయ, తిబెరియా సముద్రం | 21:1-24 | |||
| యేసు గలిలయలో పదకొండు మందికి కనిపిస్తాడు | గలిలయలోని ఒక కొండ | 28:16-17 | ||||
| గొప్ప ఆజ్ఞ | 28:18-20 | 16:15-16 | ||||
| సూచక క్రియలు | 16:17-18 | |||||
| యేసు 500 మందికి కనిపిస్తాడు | ఎప్పుడు? | 1 Co. 15:6 | ||||
| యేసు యాకోబుకు కనిపిస్తాడు | ఎప్పుడు? | 1 Co. 15:7a | ||||
| యేసు కనబడిన సందర్భాల ప్రదర్శనల సారాంశం | 40 రోజుల వ్యవధిలో † | Acts 1:3 | ||||
| పరలోకానికి యేసు ఆరోహణము (పునరుత్థానం తరువాత 40 రోజులు) | చివరి ఆదేశాలు | యెరూషలేము? | 1 Co. 15:7b | 24:49 | Acts 1:4-8 | |
| ఆరోహణము | బెథానీ, యెరూషలేము దగ్గర | 16:19 | 24:50-51 | Acts 1:9 | ||
| యేసు వెళ్ళినట్లే తిరిగి రానైయున్నాడు | Acts 1:10-11 | |||||
| శిష్యులు యెరూషలేముకు తిరిగి వస్తారు | 24:52-53 | Acts 1:12-14 | ||||
| తుది వ్యాఖ్యలు | ఇంకా చాలా సంగతులు ఉన్నప్పటికీ, మనం విశ్వసించటానికి చాలినవి మాత్రమే గ్రంథస్తం చేయబడ్డాయి | 20:30-31 | ||||
| యేసు చేసిన కార్యాలలో ప్రతిదీ రాయబడలేదు | 21:25 | |||||
ఆరోహణము తర్వాత కొంతకాలంలోనే సంభవించిన సంఘటనలు
| ఎప్పుడు మరియు ఎక్కడ | మత్తయి | మార్కు | లూకా | యోహాను | |
| యూదా స్థానంలో మత్తియ ఎంపికయ్యాడు | “ఆ రోజుల్లో” | Acts 1:15-26 | |||
| పరిశుద్ధాత్మ రాకడ | పెంతేకొస్తు ఆదివారం, ఆరోహణకు 10 రోజుల తరువాత 17 | Acts 2:1-13 | |||
| పేతురు (మరియు ఇతరులు) బోధించారు | ఉదయం 9 గంటలు (9 a.m.) | 16:20 | Acts 2:14-41 | 
నేపథ్య సమాచారం
(మరిన్ని వివరములకు Aschmann.net/BibleChronology/#Sources చూడండి).
ఏదేమైనా, ఈ కాలక్రమాన్ని అధికారికంగా లేదా ఆత్మావేశమైనదిగా చూడకూడదు, కానీ నాలుగు సువార్తలకు వాటి సాపేక్ష కాలక్రమాన్ని చూపించడానికి ఉపయోగపడే అమరికగా మాత్రమే చూడాలి. మరియు † (సిలువ) గుర్తు ఉపయోగించి గుర్తించబడిన ముఖ్య సంఘటనలను క్రింద చూపించడం జరిగింది. ఇలాగే ప్రయాసపడి ఇతరులు కూడా ఇలాంటి క్రోడీకరణలను చేశారు. ఏదేమైనా, 3½ సంవత్సరాలను ఆధారం చేసుకున్న కాలక్రమాన్నే సాధారణంగా అందరూ అంగీకరించారు. (ఈ పేజీని this page చూడండి).
| రంగులు, ఆకృతీకరణ మరియు చిహ్నాలు | |
| ఎరుపు వచనం | వచనంలో అందించిన కీలక తేదీని లేదా సమయ వ్యవధిని దీని నుండి లెక్కించవచ్చు. ఇది అందించే విషయం కూడా ఎరుపు రంగులో ఉంటుంది. కొన్ని సంఘటనలకు తేదీని చెప్పలేము, కాని బాప్తిస్మము ఇచ్చు యోహాను యొక్క జైలు శిక్ష లేదా అతని శిరచ్ఛేదం వంటి ఇతర సంఘటనల క్రమాన్ని నిర్ణయించడంలో ఇవి కీలకం; ఇవి కూడా ఎరుపు రంగులో గుర్తించబడ్డాయి. | 
| ధూమ్రవర్ణ వచనం | వచనంలో అందించిన ఇతర కాల సమాచారం, లేదా “మరుసటి రోజు” లేదా “విశ్రాంతి(సబ్బాత్) దినము” వంటి దాని నుండి లెక్కించవచ్చు. ఈ సమాచారం సాపేక్షమైనది, రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఘటనల మధ్య సమయాన్ని చూపిస్తుంది, అయినప్పటికీ పెద్ద సందర్భంలో వీటి యొక్క తేదీని కనుక్కోలేము. | 
| † | ఈ (సిలువ) చిహ్నం, ఈ కాలక్రమాన్ని నిర్మించడానికి మరియు నాలుగు సువార్తలను ఒకే కాలక్రమంలో సమలేఖనం చేయడానికి అనుమతించే ముఖ్య సంఘటనలను సూచిస్తుంది. సాముదాయిక సువార్తలు (మత్తయి, మార్కు మరియు లూకా) ఒకే సంఘటనలు మరియు బోధనలను చూపిస్తున్నాయి, అయితే యోహాను చాలా భిన్నమైన సంఘటనలు మరియు బోధనలను చూపిస్తున్నాడు, ఇది యోహానుతో సాముదాయిక సమలేఖనం చేయడం కొంచెం కష్టతరం చేస్తుంది. అయినప్పటికీ, కొన్నిసార్లు వారు ఒకే సంఘటనలను చూపిస్తున్నందున ఈ కాలక్రమాన్ని రూపొందించడం సాధ్యపడుతుంది | 
| ఎడమ మార్జిన్లో ఆరెంజ్(కాషాయపు) గీత | గొప్ప గలిలయ పరిచర్య అని పిలువబడే దాని పరిధిని ఇది చూపిస్తుంది, ఇది సుమారు ఏడాదిన్నర పాటు, అనగా 27వ సంవత్సరం డిసెంబర్ నుండి 29వ సంవత్సరంలో పస్కా పండుగ తరువాత వరకు. ఈ కాలంలో యేసు ఎక్కువ సమయం గలిలయలో గడిపాడు, ఆయన పరిచర్య చాలా బహిరంగంగా జరిగింది. | 
| 4 నుండి 7 నిలువు వరుసలలో రిఫరెన్సుల ఆకృతీకరణ | |
| అండర్లైన్ మరియు మందము చేసిన పదాలు | ఇవి సంపూర్ణమైన లేదా ముఖ్యమైన వాక్యభాగాలు(passages), లేదా ముఖ్యమైన అదనపు సమాచారంతో కూడిన వాక్యభాగాలు. | 
| నీలం రూపురేఖ | ఇది నాలుగు సువార్తల సందర్భంలో మరింత సమాచారం అందించే నాలుగు సువార్తలకు వెలుపల ఒక భాగం. | 
| పసుపురంగులో హైలైట్ చేయబడిన పదభాగాలు | ఇది సువార్తలలో ఒకదానిలో కాలక్రమానుసారం లేని ఒక భాగం. మార్కు మరియు యోహాను గ్రంథాలు దాదాపు పూర్తిగా కాలక్రమానుసారంగానే ఉన్నట్లు అనిపిస్తాయి కాని తరచుగా మత్తయి, కొన్నిసార్లు లూకా గ్రంథాలు అలా ఉండవు. మార్కు మరియు యోహాను ఏకీభవించనట్టు అనిపించే ప్రతి సందర్భంలో ఆ రెండిటిలో ఏదో ఒకదానిలో ఉన్న కాలక్రమాన్నే అనుసరించటం జరిగింది. అయితే, ఈ వ్యత్యాసాలు యేసు పరిచర్య యొక్క చివరివారంలో మాత్రమే కనిపిస్తాయి. ఏదేమైనా, పేజీ చివరన ఫుట్‌నోట్ ద్వారా వివరణ ఇవ్వబడినవి తప్ప, మిగిలినవన్నీ స్వల్ప వ్యత్యాసాలు మాత్రమే. | 
| నీలాకాశపు రంగులో హైలైట్ చేయబడిన పదభాగాలు | ఇది ఏదో నిజమైన కాలక్రమ సమస్య వల్ల కాదు కానీ, కేవలం పొందిక కుదరటం కోసం మాత్రమే క్రమం తప్పించబడిన భాగం. | 
| బ్రాకెట్లలో ఉన్నవి (i.e., in parentheses) | ఇది వాస్తవానికి మరో సందర్భానికి చెందిన భాగమైనా, ప్రస్తుత సందర్భానికి అవసరమైన సమాచారాన్ని పరోక్షంగా అందిస్తుంది. | 
| [బూడిద రంగులో మరియు బ్రాకెట్లలో ఉన్నవి] | ఇది సమాంతర భాగంగా కనిపించినా బహుశా అది వేరొక సంఘటన లేదా పదేపదే చెప్పబడిన బోధన. సాధారణంగా సందర్భంలో ఇది తెలుస్తుంది. | 
ముగింపు గమనికలు
- 1 - క్రీస్తు ఐగుప్తు నుండి తిరిగి రావడం హెరోదు ది గ్రేట్ మరణం తరువాత సంభవించింది, అతను (మార్చి లేదా ఏప్రిల్ క్రీ.పూ. 4వ సంవత్సరంలో మరణించాడు) most likely died in March or April of 4 B.C. యేసు పరిచర్య క్రీ.శ. 27వ సంవత్సరారంభంలో మొదలైతే, లూకా 3:23 లో చెప్పినట్లుగా, అతని వయస్సు 30 ఏళ్ళు ఉంటుంది. గుర్తుంచుకోండి, సంవత్సరం ౦ (సున్నా) లేదు! అయినప్పటికీ, చాలా మంది వ్యాఖ్యాతలు మత్తయి 2: 16 లోని రెండేళ్ల సంఖ్య అంటే, జ్ఞానుల రాక సమయానికి యేసు అప్పటికే రెండు సంవత్సరాల వయస్సులో ఉన్నాడు అని అనుకున్నారు, కాబట్టి లూకా 3: 23 లోని “ముప్పై సంవత్సరాల వయస్సు” 32 సంవత్సరాలు వరకు ఉంటుంది. మరోవైపు, బేకర్ యొక్క కొత్త నిబంధన వ్యాఖ్యానం మరియు ఆల్ఫ్రెడ్ ఎడర్‌షీమ్ వంటి గౌరవప్రదమైనవారితో సహా మరెంతమందో వ్యాఖ్యాతలు ఇలా అన్నారు - ఇది మన ఊహ అయ్యుండాల్సిన అవసరం లేదు, శిశువులను చంపడంలో అతిగా వెళ్లిన దుష్ట రాజు హేరోదు స్వభావానికి ఇది సరిపోతుంది. బేకర్ యొక్క కొత్త నిబంధన వ్యాఖ్యానం చెప్పినట్లుగా, “చంపే విషయంలో, హేరోదు ఎప్పుడూ అవసరానికి మించిన తీవ్రతనే ప్రయోగించాడు.” ఈ కారణంగా, యేసు బహుశా క్రీ.పూ. 6 మరియు 4 సంవత్సరాల మధ్య జన్మించాడని నేను చెప్పాను.
- 2 - యోహాను పరిచర్య ప్రారంభించడానికి లూకా 3:1 లో పేర్కొన్న కాలపరిమితి క్రీ.శ. 26 యొక్క తరువాతి భాగంలో ఎందుకు జరిగిందో ఈ పేజీ (this page), ఈ పేజీ(this page) మరియు ఈ పేజీని (this page) చూడండి.
- 3 - పేరు ప్రస్తావించని ఇతర శిష్యుడు బహుశా యోహాను కావచ్చు. పేజీ చివరన వ్రాయబడిన (ఫుట్‌నోట్) 16 చూడండి. సమదృక్పథ సువార్తలలో మాత్రమే ప్రస్తావించబడిన గలిలయ సముద్రం (గెన్నేసరెతు సరస్సు) వద్ద "అధికారిక" పిలుపును పొందిన నలుగురు మత్స్యకారులలో వీరు ముగ్గురు (3 మంది). Apostles.html చూడండి
- 4 - యోహాను 2:20 ప్రకారం, హేరోదు ది గ్రేట్, ఆలయాన్ని పునర్నిర్మించడం ప్రారంభించిన 46 సంవత్సరాల తరువాత ఇది జరిగింది, ఇది అతని పాలన యొక్క 18వ సంవత్సరంలో (క్రీ.పూ. 20-19) సంభవించింది, ఇది యేసు తన పరిచర్యను ప్రారంభించి క్రీ.శ 27 లో ఆలయాన్ని ప్రక్షాళన చేశాడని నిర్ధారిస్తుంది, అనేక ఇతర సాక్ష్యాలు కూడా దీనిని సూచిస్తున్నాయి. (గుర్తుంచుకోండి, సంవత్సరం ౦ (సున్నా) లేదు!).
- 5 - బేకర్ యొక్క కొత్త నిబంధన వ్యాఖ్యానం ఇక్కడ లూకా రాసింది, మత్తయి మరియు మార్కు చేసిన దాఖలాలకు చాలా వేరుగా ఉందని ఎత్తి చూపటమే కాక, యేసుకు మరియు ఈ 4 శిష్యులకు ముందే పరిచయం ఉందని, ఇది తరువాత జరిగిన సంఘటన అని కూడా సూచిస్తుంది. “ది నేరేటెడ్ బైబిల్” చెప్పినట్లుగా, లూకా ఈ సంఘటనను వరుస క్రమాన్ని తప్పి వివరించాడనే అనుమానాన్ని ఇది నివారిస్తుంది.
- 6 - యోహాను 5లో, ఇది పస్కా పండుగ అని చెప్పలేదు, కానీ “యూదుల విందు ఉందని మరియు యేసు యెరూషలేముకు వెళ్ళాడు” అని మాత్రమే చెప్తుంది. యెరూషలేములో మాత్రమే జరుపుకునే మూడు విందులు ఉన్నాయి: పస్కా పండుగ (ఏప్రిల్‌లో), పెంతేకొస్తు పండుగ (జూన్‌లో), మరియు పర్ణశాలల పండుగ (సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో), మరియు వీటిలో ఏవైనా ఉండవచ్చు. బేకర్ క్రొత్త నిబంధన వ్యాఖ్యానం చెప్పేది ఏంటంటే, “మా అభిప్రాయం ప్రకారం పేరు ప్రస్తావించబడని ఈ పండుగ a) యెరూషలేముకు వెళ్ళి ఆచరించవలసిన మూడు పండుగలలో ఒకటి; b). ఇది క్రీ.శ 28వ సంవత్సరంలో ఉండాలి, మరియు c). బహుశా పస్కా లేదా పర్ణశాలల పండుగ (ఇది పెంతేకొస్తు అయ్యుండే అవకాశాన్ని కాదనుకుండానే). ఇది పస్కా అని చెప్పడానికి రెండు అదనపు వాదనలను కొన్నిసార్లు సూచిస్తారు: 1. దీనిని ఇరేనియస్ సాక్ష్యం సమర్థిస్తుంది, 2. ఇశ్రాయేలీయులు హాజరు కావాల్సిన ఏకైక పండుగ ఇది. అయితే, దీని కచ్ఛితంగా నిర్థారించలేము”. ఇది యోహాను 5వ అధ్యాయంలోని సంఘటనలను లూకా 6వ అధ్యాయంలోని సంఘటనలకు ముందు ఉంచుతుంది, ఇది వసంత ఋతువులో, గోధుమ లేదా బార్లీ పంటకాలానికి దగ్గరలో, ఏప్రిల్ లేదా మేలో జరిగింది (క్రింద ముగింపు గమనిక 8 కూడా చూడండి). యోహాను 4వ మరియు 6వ అధ్యాయాల తేదీలు చాలా స్పష్టంగా ఉన్నాయి, ఎందుకంటే వీటిని ఇతర సువార్తలతో క్రమాంకనం చేయవచ్చు, వాటి మధ్య ఒక సంవత్సరం మరియు 4 నెలలు ఉంటాయి.
- 7 - ఇది కొంచెం కష్టతరమైన సందర్భం. వివిధ కారణాల వల్ల మత్తయి, మార్కు మరియు లూకాలోని ఈ భాగాలన్నీ వాటివాటి సందర్భాలతో స్పష్టంగా కలుస్తున్నట్లు కనిపిస్తుంది, కాబట్టి సారూప్యతలు ఉన్నప్పటికీ, లూకాలోని ఈ సందర్భం అనేది మార్కు మరియు మత్తయి బోధన యొక్క పునరావృతం అని మనం అనుకోవాలి.
- 8 - ఇజ్రాయెల్ దేశపు వాతావరణంలో వసంతకాలంలో, ప్రధానంగా ఏప్రిల్‌లో మాత్రమే గడ్డి ఆకుపచ్చగా మరియు తాజాగా ఉంటుంది. శీతాకాలంలో అది ఘనీభవిస్తుంది, వేడి, పొడి వేసవిలో అది ఎండిపోతుంది. ఇది పస్కా దగ్గర ఉందని, “గడ్డి పుష్కలంగా” ఉందని యోహాను చేసిన ప్రకటనను నిర్ధారిస్తుంది (యోహాను 6:10). ఇజ్రాయెల్‌లోని నాలుగు కాలాల గురించి ఈ అద్భుతమైన యూట్యూబ్ వీడియోను చూడండి - YouTube video about the four seasons in Israel , అలాగే చాలా బైబిల్ ప్రదేశాలను కళ్ళకు కట్టినట్టు చూపించే యూట్యూబ్ చానెల్ కూడా చూడండి Sergio & Rhoda in Israel, .
- 9 - 10/సెప్టెంబర్/2019 కి ముందు నేను గొప్ప గలిలయుని పరిచర్య ముగింపును మార్క్ 10:1a వద్ద ఉంచాను, కాని బేకర్ యొక్క కొత్త నిబంధన వ్యాఖ్యానంతో సహా బహుళ వ్యాఖ్యాతలు దీనిని ఇక్కడ ఉంచారు. యేసు దీని తరువాత గలిలయకు తిరిగి వస్తాడు, కాని అతని పరిచర్య ఈ సమయం నుండి మరింత ఏకాంతంగా ఉంటుంది.
- 10 - అక్టోబర్, 2019 లో, మార్కు క్రమాన్ని అనుసరించడానికి నేను ఈ వరుస(పంక్తి)ని కదిలించాను, ఎందుకంటే యోహాను క్రమంతో విభేదాలు వచ్చినప్పుడు తప్ప, నేరేటెడ్ బైబిల్ మార్కును అనుసరించని ఏకైక సందర్భం ఇది మాత్రమే. (పైన పసుపు రంగులో హైలైట్ చేయబడిన చర్చ చూడండి.)
- 11 - ఈ మూడు సమాంతర వాక్యభాగాలలో ఒక సమస్య ఉంది: మత్తయి మరియు మార్కు, యేసు గ్రుడ్డివారిని యెరికో నుండి బయలుదేరినప్పుడు స్వస్థపరిచాడని చెప్తారు, కాని లూకా యేసు యెరికోలోకి ప్రవేశిస్తున్నప్పుడే స్వస్థపరిచాడని అంటాడు. దీనికి చాలా వివరణలు ఇవ్వబడ్డాయి.
- 12 - మార్కు యొక్క క్రమాన్ని తీవ్రంగా మార్చిన ఏకైక సందర్భం ఇది అనిపిస్తుంది, యేసుకు ద్రోహం చేయడానికి యూదా అంగీకరించిన సంఘటనను మార్కు వివరిస్తున్న సందర్భంలో మూడు రోజుల ముందు మరియ యేసును అభిషేకించిన సందర్భాన్ని ప్రస్తావించాడు. (పస్కా పండుగకు/ పులియని రొట్టెల పండుగకు రెండు రోజుల ముందు జరిగిన సంఘటనలకు సరైన నేపథ్యాన్ని ఇచ్చే విధంగా పస్కా పండుగకు/ పులియని రొట్టెల పండుగకు 6 రోజుల ముందు జరిగిన సంఘటనను మార్కు ప్రస్తావించాడు). యోహాను ఈ సంఘటనను పస్కా పండుగకు/ పులియని రొట్టెల పండుగకు 6 రోజుల ముందు జరిగిందని ఖచ్చితంగా నిర్థారించాడు; చాలా వివరాలు సరిపోతాయి కాబట్టి మూడు సువార్తలు కూడా తప్పకుండా ఇదే సంఘటనను ప్రస్తావిస్తున్నాయి.
- 13 - మత్తయిలోని వాక్యభాగంతో సమాంతరంగా ఉన్న ఈ భాగాన్ని, అది ప్రత్యేకమైన అంశం కావడం చేత లూకా వరుస క్రమానికి వేరుగా ప్రస్తావించాడని బేకర్ యొక్క కొత్త నిబంధన వ్యాఖ్యానం అభిప్రాయపడుతుంది, ఇది తార్కికంగానే అనిపిస్తుంది.
- 14 - నాల్గవ సువార్త రచయిత అయిన యోహాను అపొస్తలుడు పరోక్షంగా యోహాను 21:2 లోని జెబెదయి ఇద్దరు కుమారులలో ఒకరిగా తనను ప్రస్తావించడం మినహాయిస్తే తన తగ్గింపును బట్టి తన సువార్తలో తనను తాను ఎప్పుడూ నేరుగా ప్రస్తావించుకోలేదు. బదులుగా, సాంప్రదాయం ధృవీకరించినట్లుగా తనను తాను ఇతర విధాలుగా ప్రస్తావించుకున్నాడు. యోహాను 13:23-25, 19: 26-27, 20: 2-3, మరియు మరియు 21:7,20 లలో "యేసు ప్రేమించిన శిష్యుడు" ఖచ్చితంగా అతడే. అతను బహుశా యోహాను 19:35 మరియు 21:24 లలో సాక్ష్యమిచ్చే శిష్యుడు కూడా. అంతేకాక యోహాను 1: 35-40 మరియు యోహాను 18:15-16లో పేరు చెప్పని ఆ "మరియొక శిష్యుడు" కూడా ఇతనే. Apostles.html చూడండి.
- 15 - Peter’s Three Denials of Jesus చూడండి.
- 16 - ఈ ముదురు ఆకుపచ్చ రంగులోని మాటలు “యేసు సిలువపై చివరి ఏడు మాటలు”.
- 17 - సాధారణ చర్చి సాంప్రదాయం ప్రకారం, ప్రథమ ఫలాల విందు రోజున యేసు మృతులలో నుండి లేచాడు, మరియు ప్రథమ ఫలాల విందుకు 50 రోజుల తరువాత పెంతేకొస్తు దినం జరిగింది; యేసు పునరుత్థానం మొదలుకొని ఆరోహణ వరకూ 40 రోజులు శిష్యులకు కనబడ్డాడు; 50 - 40 = 10 కాబట్టి ఆరోహణ నుండి పెంతేకొస్తు వరకు 10 రోజుల వ్యవధి ఉన్నట్టు తెలుస్తుంది.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
 
    
    