దుర్బోధలకు జవాబు

రచయిత: హితబోధ నెట్వర్క్
చదవడానికి పట్టే సమయం: 6 నిమిషాలు

 ఈ మధ్య కాలంలో నిత్యజీవానికి సంబంధించిన సువార్తను, 'చచ్చిపోయి పరలోకం పోతే చాలు' అనుకునే సువార్తగా హేళన చేసే కొందరు కుహానా సువార్తికులు బయలుదేరారు. ప్రవీణ్ పగడాలగారు వీరికి నాయకత్వం వహిస్తున్నారు. అన్ని రంగాలలో అభ్యున్నతి సాధించటమే దేవుని రాజ్యస్థాపన అని, అన్ని రంగాలను కైవసం చేసుకోవటమే సంఘము యొక్క లక్ష్యమయ్యుండాలని, మానవుని భౌతిక జీవితానికి సంబంధించిన రంగాలను లోకస్థుల చేతుల్లో నుండి క్రీస్తు కొరకు విడిపించటమే సువార్త ఉద్దేశించే పరలోక రాజ్యస్థాపన అని వీరు ప్రబోధిస్తుంటారు. సువార్త విలువలు అన్ని రంగాలను ప్రభావితం చేసేలా సంఘం సువార్త వెలుగును ప్రసరింపజేయాలన్నది నిజమే. కానీ ఈ రోజు ఉండి, రేపు నశించిపోయే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలను, క్రీస్తు కొరకు విడిపించటమే సువార్త యొక్క అసలు లక్ష్యమని చెప్పటం, నిత్యజీవానికి సంబంధించిన సువార్తను తక్కువ చేసి మాట్లాడటం, తప్పకుండా నిజమైన దేవుని రాజ్యవిస్తరణను అడ్డుకోవటానికి సాతాను పన్నిన కుట్ర అనటానికి ఎలాంటి సందేహము లేదు.

'చచ్చిపోయి పరలోకం పోయే సువార్త' అంటూ హేళనగా మాట్లాడొద్దని మాలో ఒక సహోదరుడు వ్యక్తిగతంగా కూడా ప్రవీణ్ పగడలగారిని హెచ్చరించారు. అలా ఆయన అనేక వేదికలలో చెప్పటం మాత్రమే కాదు, ఇప్పుడు లిఖిత పూర్వకంగా కూడా అదే మాట అంటున్నారు. Picture1

తన YWAM (Youth With a Mission) భావజాలానికి అడ్డొచ్చేలా నిజసువార్తను నొక్కి చేప్పేవారిపై ఎలా అక్కసు వెళ్లగక్కుతాడో తెలిపే చక్కటి నిదర్శనం, ఇటీవలే "వాక్యపునాది" అనే తన వెబ్సైటులో ఆర్థర్ డబ్ల్యూ. పింక్ ను  అవమానిస్తూ రాసిన ఒక వక్రవ్యాసంలో వెలువడింది.( http://vakyapunadhi.com/node/203 ) మేము పైన చెప్పిన అదే తప్పుడు సువార్తను ఖండిస్తూ A.W.Pink రాసిన మాటలు చదివి భుజాలు తడుముకుంటూ రాసిన ఈ వ్యాసంలో పింక్ గారిని 'పింకు'-'పింకు' అంటూ సంబోధించి తన చౌకబారుతనాన్ని బయటపెట్టుకోవటంతో పాటుగా, తనివితీరా కాల్వినిస్టులందరిపై తన అక్కసును వెళ్ళగ్రక్కారు. ఈ తొందరలో ఎన్నిసార్లు పప్పులో కాలేసారో చూసుకోవటంలో విఫలమయ్యారు.

పాపం దేవుని చిత్తంలో భాగమని A.W.Pink చెప్పిన ఒక screenshot చూపించి, అలా అయితే 'వేరొక సువార్త' అనే వ్యాసంలో పింక్ గారు ఖండించిన వక్రసువార్తలు, సాతాను కార్యకలాపాలు, అన్ని దేవుని చిత్తంలో భాగమే అంటూ ఖండించారు. దేవుడు పాపానికి కర్త కాదు అని అదే పుస్తకంలో పింక్ చెప్పిన వేరొక భాగాన్ని కనిసం ప్రస్తావించను కూడా లేదు.

not auther of sin

అది చూపిస్తే ఎక్కడ పింక్ పైన తాను చిమ్మే విషయానికి విరుగుడు కూడా తానే అందించడమౌతుందో అని భయమేమో! అయినా, వాక్యాన్నే సమగ్రంగా చదివే నిజాయితీ లేనివారు, after all ఒక 'పింకు' మాటలతో నిజాయితీగా వ్యవహరిస్తారని ఆశించటం మన వెఱ్ఱితనమే అవుతుందేమో!

ఉదాహరణకు, యోహాను 1:12 ఉటంకిస్తూ, ఆయనను అంగీకరించినవారు దేవుని పిల్లలు అవుతారని ఉంది కాబట్టి, ఆయనను అంగీకరించే సామర్థ్యం దేవుడిస్తేనే వస్తుందని చెప్పటం వేరొక సువార్త అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ అలా అంగీకరించేవారు దేవుని మూలంగా పుట్టినవారే అని ఆ తరువాత వచనమే ఇచ్చే వివరణను తెలివిగా దాటేసారు. ఆ కోణాన్ని నొక్కిచెప్పేవారు వేరొక సువార్త ప్రకటిస్తున్నట్లు మరిన్ని వాక్యభాగాలను కూడా ఇలాగే వక్రీకరించి నాటకాలు ప్రదర్శించారు. ఇలాంటి వాక్యవక్రీకరణే ఆ వ్యాసమంతటిలో విస్పష్టంగా కనబడుతుంది. తీరిక, ఓపిక ఉన్నవారు పరిశీలించండి, మీకే తెలిసిపోతుంది. అయితే వాక్యాన్నే ఇలా వక్రీకరించేవారు, ఒక మనిషి మాటలను అసందర్భంగా ఉదాహరించి వక్రీకరించటం ఆశ్చర్యమేమీ కాదు.

పింక్ చెప్పిన మాటలను సందర్భసహితంగా అర్థం చేసుకోవాలనుకున్నవారికి, 'దేవుని సార్వభౌమత్వం' అనే ఆయన పుస్తకాన్ని త్వరలో మా వెబ్సైట్ ద్వారా తెలుగులో అందిస్తాం. ఆపై నిజాయితీగా ప్రశ్నలు అడిగే ఎవరి సందేహాలనైనా తప్పక నివృత్తి చేస్తాం. కానీ ఈలోగా vakrapunaadi.com వారికి తగిన కౌంటర్లు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం.

ఈ మధ్య ఒక అబధ్ధప్రవక్తను మేము బహిర్గతం చేయబోతున్నామని తెలిసి, మా మీదను, ఆ విషయంలో మరో ప్రధాన సాక్షి మీదను, పోలీస్ కేసులు పెడతామని, మా ఉద్యోగాల్నికూడా టార్గెట్ చేయగలమని, బెదిరింపులకు దిగిన ప్రవీణ్ పగడాల బృందానికి వాక్యసత్యాన్ని ఎదుర్కునే సత్తా ఉందని ఎవరైనా భావిస్తే అది వారి అమాయకత్వమే అవుతుంది. మా ముందు నిలువలేని మతోన్మాదులు కూడా తలపెట్టని దిగజారుడుతనానికి మాలో కొందరితో పదేండ్లు కలిసి పరిచర్యచేసినవారు తెగబడటం కొంత విచిత్రంగా అనిపించినా నిజంగా అదంత పెద్ద వింతేమీ కాదు. గత 2000 సంవత్సరాలుగా సంఘం ఇలాంటివి ఎన్నిచూడలేదు! అయితే వక్రీకరిస్తారు, పని జరగకపోతే బెదిరింపులకు దిగుతారు. ఇది వీరి దిగజారిన యుద్ధనీతికి అద్దం పడుతోంది. మమ్మల్ని బెదరగొట్టటంలో విఫలమై ఇప్పుడు మా సాహిత్య పరిచర్య ద్వారా మేలు పొందేవారిని చెదరగొట్టే ప్రయత్నంలో vakrapunaadhi.com ప్రారంభించారు. ఇప్పుడు vakrapunaadhi.comలో Authors(రచయితలు)గా పేర్కొన్న వారిలో ఆ అబద్ధప్రవక్త ఒకరు, చర్చ్ అఫ్ క్రైస్ట్ అనే అవాంతరశాఖకు చెందిన వారొకరు, సోషల్ మీడియాలో సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడే ప్రబుధ్ధులు కొందరు, ఇవేమి పరిశీలించకుండా తొందరపడి చేరిన అమాయకులు ఇంకొందరు - వీరే ప్రస్తుతం ప్రవీణ్ పగడాల బలగం. "ఇద్దరు సమ్మతించనిదే కూడి నడతురా" అనే బైబిల్ నియమాన్ని ఇప్పటికైనా ఆ అమాయకులు ఆలోచిస్తే వారికే మంచిది.

ప్రవీణ్ పగడాల నిజాయితీ రాహిత్యాన్ని, అబద్ధపు మాటలను, వేషధారణను నిరూపించే కొన్ని సంగతులు ఇంకా మా వద్ద ఉన్నాయి. అవసరం మేరకు వాటిని బయటపెడుతుంటాము. బైబిల్ తో  కొంత అంబేద్కర్ భావజాలాలు, కొంత మతోన్మాద వ్యతిరేక నినాదాలను జోడించి చెప్పినంత మాత్రాన వారు చెప్పేది వాక్యపరిశీలనకు అతీతం కాదని ఎవరు మరచిపోకండి. మేము చెప్పినా, వారు చెప్పినా, బైబిల్ వెలుగులో అన్నిటిని పరిశీలించండి. 'ఆయన మీ పేరు ప్రస్తావించలేదు కదా, మీరు కూడా పేరు చెప్పకండి' అని కొందరు మాకు ఉచిత సలహాలు ఇవ్వజూశారు. వారు మా శ్రేయోభిలాషులు. కానీ ఏం చేద్దాం, మాకు ఈ ముసుగులో గుద్దులాట అలవాటు లేదు. Anyway, దీనికి కొనసాగింపు రాయాల్సొస్తే, Part 2 లో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.