క్రీస్తుసేవకై పిలువబడిన ఒక దాసుని పరిచర్యలో వివిధ కోణాలు ఉన్నాయి. అతడు రక్షింపబడనివారికి సువార్త బోధించి, జ్ఞానముతోను, వివేకముతోను దేవుని ప్రజలను పోషించి (యిర్మియా 3:15). “వారి మార్గములో నుండి అడ్డు చేయుదానిని (యెషయా 57:14). తొలగించడం మాత్రమే కాక,“యెలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుచు నా ప్రజలకు వారి తిరుగుబాటును, పాపములను తెలియజేయుము” (యెషయా 58:1; 1తిమోతి 4:2; ) అనే ఆజ్ఞకు కూడా కట్టుబడి పనిచేయాలి. వీటన్నిటితో పాటు అతడు మరో ప్రాముఖ్యమైన విధిగా “నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి” (యెషయా 40:1) అనే దేవుని మాటకు కూడా కట్టుబడి పరిచర్య చేయవలసినవాడుగా ఉన్నాడు.
“నా జనులు !” అన్నది ఎంత ఘనమైన పిలుపు! "మీ దేవుడు!” అన్నది ఎంత అభయమిచ్చే అనుబంధం! “నా జనులను ఓదార్చుడి!" అన్నది ఎంత దీవెనకరమైన బాధ్యత!
© 2021. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.