విమర్శలకు జవాబు

రచయిత: కె. విద్యా సాగర్

 

విషయసూచిక

  1. బైబిల్లో అన్నాచెల్లెళ్ళ వివాహం
  2. బైబిల్లో తండ్రీకూతుళ్ళ సెక్స్
  3. బైబిల్లో మామాకోడళ్ళ సెక్స్
  4. బైబిల్లో తల్లీకొడుకుల సెక్స్
  5. బైబిల్లో అత్తాఅల్లుళ్ళ సెక్స్
  6. దావీదు బత్షెబా పాపం
  7. బైబిల్ దేవుడు సౌలు భార్యలను దావీదు కౌగిట్లో చేర్చాడా?
  8. తండ్రి తప్పు చేస్తే కొడుకుకు మరణశిక్ష
  9. అమ్నోను తామారు
  10. తండ్రి భార్యలను కొడుకుకు అప్పగించిన బైబిల్ దేవుడు
  11. శీలపరీక్షలు చేయించిన బైబిల్ దేవుడు
  12. పరమగీతాల్లో సెక్స్
  13. యెహోవాకు ఇద్దరు భార్యలు (యెహెజ్కేలు 23)
  14. లంగాలు ఎత్తి చూపిస్తానన్న బైబిల్ దేవుడు
  15. యేసుక్రీస్తు వ్యభిచారమందు పుట్టాడా?

"భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును" (యెషయా 57:20) అని రాయబడినట్టుగా మన దేశంలో కొందరు "హిందూమతోన్మాదులు" లేచి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పై, బైబిల్ దేవునిపై తమ వక్రీకరణలతో అసత్యాలతో బురద చల్లాలని చూస్తున్నారు. ఎందుకంటే వారి గ్రంథాలలోని బూతుచరిత్రలనూ వారి దేవుళ్ళ జీవితాలలో అనైతికతనూ కప్పిపుచ్చుకోవడానికి బైబిల్లో కూడా అలాంటివి ఉన్నాయని, బైబిల్ దేవుడు కూడా అలాంటివాడే అని అడ్డకోలుగా వాదించి తప్పించుకోవడం తప్ప వారికి వేరే మార్గం లేదు పాపం. కానీ బైబిల్ విషయంలో మనకు అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి లేదు, లేఖనాలు పరిశుద్ధమైనవి (2 తిమోతీ 3:14, రోమా 7:12) బైబిల్ దేవుడు పరిశుద్ధుడు (కీర్తనలు 99:3,5,9, యెషయా 6:3). ఈ సత్యాన్ని మనం ఎలుగెత్తి చాటగలం. అందుకే బైబిల్ పైనా బైబిల్ దేవునిపైనా హిందూ మతోన్మాదులు చేస్తున్నటువంటి అపవిత్ర ఆరోపణలకు సమాధానంగా ఈ వ్యాసం రాస్తున్నాను. ఈ క్రమంలో అవసరమైనప్పుడల్లా  హిందూ దేవుళ్ళ చరిత్రలను కూడా ప్రస్తావిస్తుంటాను.

1. బైబిల్లో అన్నాచెల్లెళ్ళ వివాహం

హిందూ మతోన్మాదులు, ఆదాము హవ్వలకు ఈ భూమిపై మొదటిగా జన్మించిన కయీనును ప్రస్తావిస్తూ బైబిల్లో అన్నాచెల్లెళ్ళ వివాహం అనుమతించబడిందని, అందుకు నిదర్శనమే కయీను తన స్వంతచెల్లిని వివాహం చేసుకోవడమని బురద చల్లుతుంటారు. దురదృష్టవశాత్తూ కొందరు బైబిల్ బోధకులు కయీను తన చెల్లెలినే వివాహం చేసుకున్నాడని బోధించడం‌ కూడా ఇందుకు కారణం. కానీ పరాయి మతగ్రంథంపై విమర్శలు చేసేముందు అందులో ఏముందో తెలుసుకోవలసిన విజ్ఞత హిందూ మతోన్మాదులకు లేదా? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా కయీను తన చెల్లిని‌ వివాహం చేసుకున్నాడని లేదు. మరి ఏమని‌ ఉందో మీరే చూడండి -

ఆదికాండము 4:16,17 అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను.

ఈ వాక్యభాగంలో ఎక్కడా కూడా కయీను తన చెల్లెలిని వివాహం చేసుకున్నాడని లేదు. మరి‌ ఇంతకూ కయీను వివాహం చేసుకున్న ఆ స్త్రీ ఎవరంటే ఆమెను దేవుడు సిద్ధపరచిన ప్రత్యామ్నాయంగానే మనం భావించాలి. అది ఎలా జరిగిందో మనకు వివరించబడలేదు, అన్నీ వివరించబడవలసిన అవసరం కూడా లేదు. "ఆయన‌ ఒకనినుండి (ఆదాము) ప్రతీజాతి మనుష్యులనూ సృష్టించాడు" అనేది వాస్తవం (అపో.కార్యములు 17:26). ఆ పరిధిలోనే ఆయన కయీనుకూ ఆదాము హవ్వలకు జన్మించిన మొదటి తరమంతటికీ జీవితభాగస్వాములను ‌సిద్ధపరచియుండాలి. హవ్వ ఆదాముకు జన్మించలేదు కానీ అతని‌నుండే సృష్టించబడింది. అలానే దేవుడు ఆదాము మొదటి తరమంతటికీ ఆదాముకు వేరుగా కాకుండా భార్యలనూ/భర్తలనూ నియమించాడు అనేది నా వాదన. ఎవరైనా ఇది కాదు అంటే కయీను తన చెల్లినే వివాహం చేసుకున్నట్టు ఎక్కడ రాయబడిందో చూపించాలి. 

నేను ఇలా మతోన్మాదుల ఆరోపణకు వ్యతిరేకంగా వాదించడానికి బైబిలే నాకు ఆధారం‌ కల్పిస్తుంది. "కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను" (ఆదికాండము 4:17) అని రాయబడింది కానీ చెల్లిని కూడగా అని ఎక్కడా లేదు. మరియు ఆయన ఇశ్రాయేలీయుల చేత కనానీయులను నిర్మూలం‌ చేయించినప్పుడు ఆ కనానీయులు ఎలాంటి హేయకృత్యాలు జరిగించారో వివరించాడు. అందులో ఒకానొకటి - వావివరసలు లేకుండా అన్నాచెల్లెళ్ళు వివాహం చేసుకోవడం.

లేవీయకాండము 18:9-25 నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క యైనను నీ తల్లి కుమార్తె యొక్క యైనను మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.

ధర్మశాస్త్రానికి ముందు కాలంలో కూడా కనానీయులు తమ‌ స్వంత అన్న, చెల్లెళ్ళను వివాహం చేసుకుంటున్నప్పుడు దేవుడు దానిని మరణానికి తగిన నేరంగా ఎంచి వారిని నిర్మూలం చేసాడు.‌ బైబిల్ దేవుడు ఇంత‌ తీవ్రంగా ఆ అనైతికతను ఖండిస్తుంటే బైబిల్లో అన్నాచెల్లెళ్ళ వివాహం ఎక్కడ అనుమతించబడిందో మతోన్మాదులు ఆధారాలతో రుజువు చెయ్యాలి. ఒకవేళ అబ్రాహాము‌ అబీమెలెకు రాజుముందు పలికిన మాటలను ఆధారం చేసుకుని అతను కూడా తన చెల్లెలైన (Half-sister) శారానే వివాహం చేసుకున్నాడని వాదిస్తారేమో (ఆదికాండము 20:12). అక్కడ కూడా అలాంటి ఆరోపణకు తావులేదు. ఎందుకంటే అక్కడ అబ్రాహాము శారా తనకు తన తండ్రివైపు నుండి‌ చెల్లెలు‌ వరస (నా తండ్రి కుమార్తె) ఔతుందని హెబ్రీయుల సంస్కృతి ప్రకారం మాట్లాడుతున్నాడు‌ తప్ప, ఆమె నా తండ్రికి పుట్టిన సొంత చెల్లి అనే భావంలో కాదు. హెబ్రీయులు తమ తండ్రి వంశానికి చెందిన పిల్లలందర్నీ నా తండ్రి కుమారులు, కుమార్తెలు అనే సంబోధిస్తారు. అంతమాత్రాన వారు స్వంత చెల్లెళ్ళు అని కాదు. అబ్రాహాము తన తండ్రికి పుట్టిన సొంత‌ చెల్లెలిని వివాహం చేసుకోలేదని చెప్పడానికి బైబిలు నుండే స్పష్టమైన ఆధారం పెడుతున్నాను చూడండి.

ఆదికాండము 11:26,27 తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను.

ఈ వాక్యభాగం ప్రకారం అబ్రాహాము తండ్రియైన తెరహుకు అబ్రాహాము, నాహోరు, హారాను అనబడే ముగ్గురు మగసంతానమే తప్ప ఒక్క ఆడసంతానం కూడా లేదు. కావాలంటే ఈ తెరహుకు ముందున్న వంశావళి అంతా పరిశీలించండి, అక్కడ తెరహు పితరులు ఎవరికైనా ఆడసంతానం ఉంటే దాని గురించి ప్రస్తావించబడింది, కానీ తెరహు విషయంలో మాత్రం అలా రాయబడలేదు. పైగా తెరహుకు అబ్రాహాము భార్యయైన శారా ఏమౌతుందని రాయబడిందో చూడండి -

ఆదికాండము 11:31 తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, "తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని" తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.

దీనిప్రకారం అబ్రాహాము తన స్వంత చెల్లిని (Half-sister) వివాహం చేసుకున్నాడని ఎవరూ నిరూపించలేరు. దీనిగురించి మరింత‌ వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

కయీను తన చెల్లినే వివాహం చేసుకున్నాడా?

2. బైబిల్లో తండ్రీకూతుళ్ళ సెక్స్

హిందూ మతోన్మాదులు పదే పదే అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సందర్భాన్ని ఎత్తిచూపిస్తూ బైబిల్లో తండ్రీకూతుళ్ళ సెక్స్ ఉందంటూ బురద చల్లుతుంటారు. ఒకసారి ఆ సందర్భంలో ఏముందో చూడండి.

ఆదికాండము 19:30-36 లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు; సర్వ లోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షా రసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.

ఈ సందర్భంలో నిజంగా‌నే లోతు కుమార్తెలు అతనికి ద్రాక్షారసం పట్టించి అతనిద్వారా గర్భవతులైనట్టుగా మనం చదువుతున్నాం. అయితే ఈ సంఘటన తండ్రీకూతుళ్ళు సెక్స్ చేసుకోవచ్చు అనడానికి అనుమతిగా రాయబడిందా? లేదు విశ్వాసియైన అబ్రాహామును విడిచిపెట్టి దుష్టరాజ్యమైన సొదొమవైపుకు వెళ్ళిన లోతుకు ఎలాంటి పరిస్థితి దాపరించిందో సొదొమలోని వావివరసలు లేని లైంగిక అపవిత్రత లోతు కుమార్తెలను కూడా ఎలా ప్రభావితం చేసిందో మనకు తెలియచేసేలా చారిత్రక కోణంలో రాయబడింది. లోతు కుమార్తెలు అనుసరించింది బైబిల్ సంస్కృతి కాదు, సొదొమ సంస్కృతి. వారి చరిత్రను బట్టి మనమంతా అలాంటి నీచసంస్కృతులకు లోనై జీవించకూడదని హెచ్చరించడానికే అదంతా రాయబడింది.

1కోరింథీయులకు 10:11 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.

ఇలా చారిత్రక కోణంలో రాయబడిన ఈ సంఘటనలను, మనం అలా చెయ్యకూడదని హెచ్చరికలుగా రాయబడిన మాటలను తీసుకుని బైబిల్లో తండ్రీకూతుళ్ళ సెక్స్ ఉందని, అక్కడికి బైబిల్ ఏదో తండ్రీకూతుళ్ళ మధ్య సెక్స్ ను ప్రోత్సహిస్తున్నట్టు బైబిల్ పై బుదర చల్లడం హిందూ మతోన్మాదుల నీచబుద్ధికి మంచి నిదర్శనం. బైబిల్ లో పలాన వ్యక్తి అపవిత్రంగా జీవించాడు అని రాయబడినంత మాత్రాన బైబిల్ అపవిత్రమైపోదు. బైబిల్ దానిని ప్రోత్సహిస్తున్నప్పుడు మాత్రమే ఆ ఆరోపణకు అవకాశం ఉంటుంది. బైబిల్ లోతు కూతుళ్ళు చేసినదానిని ప్రోత్సహిస్తుందో ఖండిస్తుందో ఈమాటలు చూడండి -

లేవీయకాండము 18:6 మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను.

బైబిల్ ఇంత స్పష్టంగా లోతు కుమార్తెలు లోనైనటువంటి లైంగిక అపవిత్రతలను ఖండిస్తుంటే బైబిల్ దేనినైతే ఖండిస్తుందో ఆ పాపాన్ని బైబిల్ కు ఆపాదించడం ఎంత దుర్మార్గమో ఆలోచించండి. నేను మరలా చెబుతున్నాను, బైబిల్లో ఒక అపవిత్రకార్యం గురించి, చారిత్రక కోణంలో అది కూడా మీరు అలా చెయ్యకూడదనే‌ హెచ్చరికగా రాయబడినప్పుడు బైబిల్ దానిని సమర్థిస్తున్నట్టు కాదు. అలాగైతే మనం ప్రతీరోజూ చదివే న్యూస్ పేపర్లలో ఇలాంటి సంఘటనలు ఎన్నో రాయబడతాయి. మతోన్మాదులు ఆ న్యూస్ పేపర్లపై వాటి యజమాన్యంపై అలాంటి ఆరోపణలు చెయ్యగలరా? కోర్టు జడ్జిమెంటుల్లో కూడా పలానా వ్యక్తి పలానా నేరం చేసాడని వివరంగా రాయబడుతుంది. ఆ నేరం ప్రస్తావించబడిన జడ్జిమెంట్ పైన, అది రాసిన జడ్జిపైనా ఆ నేరారోపణ చెయ్యగలరా? మతోన్మాదులు ఒక్కసారి ప్రయత్నించి చూడాలి అప్పుడు ఏమౌతుందో మేమూ‌ చూస్తాం.

ఇక లోతు సందర్భం గురించి మరికొన్ని విషయాలను ప్రస్తావిస్తున్నాను.

1. జరిగిన ఆ సంఘటనలో లోతు తప్పిదమేమైనా ఉంటే అది అబ్రాహామును విడిచి లైంగిక అపవిత్రతలు ఉన్న సొదొమవైపుగా వెళ్ళడమే తప్ప అతనేమీ ఉద్దేశపూర్వకంగా తన కుమార్తెలతో తప్పు చెయ్యలేదు. అతను ద్రాక్షారసం త్రాగి‌ మత్తుడిగా ఉన్న సమయంలో ఆ సంఘటన జరిగింది. పురుషులు స్పృహ లేకుండా మత్తులుగా ఉన్నప్పుడు కూడా వారి శారీరకస్వభావం స్త్రీతో శయనించడానికి సహకరిస్తుంది. అందుకే "ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి" అని రాయబడింది. ఈరోజు ఎవరైనా కామాంధుడు ఒక స్త్రీకి మద్యం కానీ మత్తుమందు కానీ పట్టించి ఆమెపై అత్యాచారం చేస్తే దానికి ఆమెను ఎలా బాధ్యురాలిని చెయ్యలేమో అలాగే ఆ సంఘటన విషయంలో లోతును కూడా బాధ్యునిగా చెయ్యలేము.

2. లోతు కుమార్తెలు చేసిన పాపాన్ని దేవుడు ఖండించాడు కాబట్టే ఆ పాపానికి గుర్తుగా వారికి పుట్టిన సంతానాన్ని ఆయన తన సన్నిధికి రాకుండా బహిష్కరించాడు, ఈ బహిష్కరణ లోతు కుమార్తెలు చేసింది ఆయన దృష్టికి హేయం అనడానికి హెచ్చరికగా జ్ఞాపకంగా ఉంది.

ద్వితీయోపదేశకాండము 23:3 అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.

తరువాత కాలంలో‌ మోయాబీయురాలైన రూతు, అపవిత్రమైన తన జాతితో సంపూర్ణంగా తెగదెంపులు చేసుకుని, కష్టమైనా, నష్టమైనా ఇశ్రాయేలీయురాలిగానే యెహోవా దేవుని భక్తురాలిగానే జీవిస్తానని నయోమీని వెంబడించిన కారణాన్ని‌బట్టి కనికరం కలిగిన దేవుడు ఆమెపై కనికరం చూపించాడు. ఇది ఆమె‌ విషయంలో మాత్రమే కల్పించబడిన మినహాయింపు.

రూతు 1:16,17 అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు; నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను.

ఈ కారణంగా యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఆమెకు చోటు‌ దక్కింది (ఈ వంశావళి గురించి తదుపరి భాగంలో మాట్లాడతాను). ఈవిధంగా రూతు విషయంలో‌‌ మినహా లోతు కూతుళ్ళకు పుట్టిన సంతానంలో మరెవ్వరికీ దేవుని సన్నిధిలో‌ చోటు దక్కలేదు. నేను పైన చెప్పినట్టుగా ఈ బహిష్కరణ లోతు కుమార్తెలు చేసిన హేయకార్యంపై దేవుని అసహ్యతను సూచిస్తుంది. ఇప్పుడు చెప్పండి బైబిల్ లోతు కుమార్తెలు చేసినదానిని ప్రోత్సహిస్తుందా? ఖండిస్తుందా?

3. లోతు కానీ లోతు కుమార్తెలు కానీ మాకు మాదిరి కాదు. వారిని మాదిరిగా తీసుకుని జీవించండని బైబిల్లో ఎక్కడా బోధించబడలేదు, పైగా వారిలా జీవించవద్దని మాత్రం హెచ్చరించబడింది. హిందూ‌ మతోన్మాదుల్లారా మీ సంగతేంటి? మీ దేవుళ్ళు మీకు మాదిరులా కాదా? వారు పాటించింది సొదొమ సంస్కృతి కాదా? మీ దేవుడైన బ్రహ్మగారు ఏం చేసారో మీకు తెలియదా? ఒకవేళ తెలియకపోతే "మత్స్య పురాణం, మూడవ అధ్యాయం 31-45" శ్లోకాలలో ఏముందో చదువుకోండి. అక్కడ మీ బ్రహ్మగారు తన శరీరం నుండి పుట్టిన కుమార్తెయైన సరస్వతిని మోహించడం, పాపం సరస్వతి ఆ కామపు చూపులనుండి తప్పించుకోవడానికి ఆకాశానికి పారిపోవడం, సరస్వతిపై పుట్టిన కామానికి బ్రహ్మగారికి ఐదవ తల మొలవడం కూడా దర్శనమిస్తుంది. దీని సంగతేంటి? ఈ ఆరోపణ నుండి తప్పించుకోవడానికి కామమంటే కామం కాదు, మోహమంటే మోహం కాదు వంటి కథలు‌ చెప్పకండి. మీ గ్రంథాలలోనే బ్రహ్మ చేసిన ఆ పనిని ఆక్షేపించిన ప్రస్తావనలు, మాదిరిగా తీసుకున్న సంఘటనలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి‌. "పోతన భాగవతం, 3వ స్కంధం"లో కొందరు మునులు బ్రహ్మ సరస్వతిని మోహించి వివాహం చేసుకోవడాన్ని అక్షేపిస్తూ ఎలా గడ్డిపెట్టారో చదువుకోండి. అక్కడ వారు బ్రహ్మను ఉద్దేశించి "కామాంధుడికి కళ్ళు కనిపించవు" అనే లోకోక్తిని కూడా ఉపయోగించారు. దానికి బ్రహ్మ సిగ్గుతో తలదించుకుంటాడు. కామమంటే కామం కాదు, మోహమంటే మోహం కానప్పుడు ఇదంతా ఎందుకు? బ్రహ్మను పూజార్హుడిగా ఉండకుండా నిషేధించింది అతను చేసింది తప్పు అనే కదా! "యముడు చెల్లెలైన యమి" తన అన్నయైన యముడిని తనతో శయనించమని కోరి, దానికి అతను నీవు నా స్వంత చెల్లెలివి కాబట్టి మనం అలా చెయ్యకూడదని హెచ్చరించినప్పుడు, ఆమె బ్రహ్మ చేసినదానినే ప్రస్తావించి "సృష్టికర్తయైన బ్రహ్మనే తన కూతురితో కామం తీర్చుకున్నప్పుడు, మనం అలా చెయ్యడం ఎలా తప్పు ఔతుందని" బ్రహ్మ చేసినదానిని మాదిరిగా తీసుకుని వాదిస్తుంది (ఋగ్వేదం, 10వ మండలం). కాబట్టి మీ దేవుళ్ళు చేసిన అపవిత్ర కార్యాలను మాకు ఆపాదించకండి.

3. బైబిల్లో మామాకోడళ్ళ సెక్స్

మతోన్మాదులు యాకోబు కుమారుడైన యూదా తన కోడలైన తామారుతో వ్యభిచరించిన సంఘటనను కూడా చూపిస్తూ (ఆదికాండము 38 వ అధ్యాయం) బైబిల్లో మామాకోడళ్ళ సెక్స్ ఉందని ఆరోపిస్తుంటారు. నేను లోతు విషయంలో చెప్పినమాటలే మరోసారి ఇక్కడ జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను‌. జరిగిన సంఘటనలు చారిత్రక కోణంలో రాయబడినంత మాత్రాన బైబిల్ గ్రంథం ఆ అపవిత్రతను ఆమోదిస్తున్నట్టు కాదు. బైబిల్ దానిని ఆమోదిస్తుందో లేక పాపంగా ఖండిస్తుందో తెలియాలంటే అందులోని దైవాజ్ఞలను పరిశీలించాలి. ఈ మాటలు అవసరాన్ని బట్టి మరలా మరలా ప్రస్తావిస్తూనే ఉంటాను. ఒకసారి బైబిల్ మామాకోడళ్ళు వ్యభిచరించడాన్ని ఆమోదిస్తుందో లేక పాపంగా ఖండిస్తుందో చూడండి.

లేవీయకాండము 18:15 నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.

ఈ ఆజ్ఞ ప్రకారం; మామాకోడళ్ళు వ్యభిచరించడం దేవుని దృష్టికి ఇతరులతో వ్యభిచరించినదాని కంటే మరింత హేయం, పాపం. బైబిల్ దీనిని ఎంతమాత్రమూ సమర్థించదు. ఇలాంటి హేయమైన కార్యాలు చేసిన కారణంగానే బైబిల్ దేవుడు కనానీయులను నిర్మూలం చేసాడని కయీను సందర్భంలో తెలియచేసాను, ఇక్కడ కూడా తెలియచేస్తున్నాను. మున్ముందు కూడా దానిని ప్రస్తావిస్తూనే ఉంటాను. ఎందుకంటే కల్మషంతో నిండిపోయిన మతోన్మాదులకు ఒకసారి చెబితే అర్థం కాదుగా పాపం.

లేవీయకాండము 18:15-28 నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్నవారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు, అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక, యీ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను.

ఇంతకూ యూదా తెలిసే తన కోడలితో వ్యభిచరించాడా? ఆ సందర్భం చూడండి -

ఆదికాండము 38:15-19 యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె నీవు నాతో వచ్చినయెడల నాకేమి యిచ్చెదవని అడిగెను. అందుకతడు నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపువరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను. అతడు నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతికఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతని వలన గర్భవతి మాయెను. అప్పుడామె లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్యవస్త్రములను వేసికొనెను.

ఈ వాక్యభాగం ప్రకారం యూదాకు తాను కోరుకున్న స్త్రీ తన కోడలు అని ఏమాత్రం తెలియదు. అతను ఎవరో వేశ్య అనుకుని అలా చేసాడు. అందుకే ఆమె తన కోడలు అని తెలిసినప్పుడు ఏమంటున్నాడో ఏం చేసాడో చూడండి -

ఆదికాండము 38:25,26 ఆమెను బయటికి తీసికొని వచ్చి నప్పుడు ఆమె తన మామయొద్దకు ఆ వస్తువులను పంపి ఇవి యెవరివో ఆ మనుష్యునివలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర యీ దారము ఈ కఱ్ఱ యెవరివో దయచేసి గురుతు పట్టుమని చెప్పించెను. యూదా వాటిని గురుతు పట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక "ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరియెప్పుడును ఆమెను కూడలేదు."

ఈ వాక్యభాగం ప్రకారం యూదా తాను శయనించింది తన కోడలితోనే అని తెలుసుకుని మరి ఎప్పుడూ ఆమెతో అలా ప్రవర్తించలేదు. వాదనకోసం ఈ ఆధారాలు అన్నీ ప్రక్కనపెట్టి యూదా కావాలనే అలా చేసాడు అనుకున్నప్పటికీ యూదా మాకు మాదిరి కాదు. బైబిల్ అతని సంఘటనను రాయించి అలా చెయ్యవద్దని హెచ్చరిస్తుందే తప్ప చెయ్యమని కాదు.

లేవీయకాండము 18:15 నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.

అయితే యూదాకు తామారు ద్వారా పుట్టిన సంతానం నుండే యేసుక్రీస్తు జన్మించాడు కదా? ఆయన‌ వంశావళిలో తామారు ప్రస్తావన కూడా చెయ్యబడింది‌ కదా అనే ఆరోపణ కూడా చేస్తే; ఔను యేసుక్రీస్తు జన్మించింది యూదా తామారుల ద్వారా పుట్టిన పెరెసు సంతానంలోనే (మత్తయి 1:3,4). అంతమాత్రమే కాదు యేసుక్రీస్తు వంశావళిలో మోయాబీయురాలైన రూతు, వేశ్యయైన రాహాబులు కూడా మనకు కనిపిస్తారు. యేసుక్రీస్తు వచ్చింది మారుమనస్సు పొందిన పాపులను రక్షించడానికి కాబట్టి, ఆయనకున్న పరిశుద్ధత ఆయన వంశావళిని బట్టి సంక్రమించింది కాదు‌ కాబట్టి ఇందులో ఆయన పరిశుద్ధతకు ఎలాంటి విఘాతం లేదు. ఆయన ఎలాంటి పాపినైనా మారుమనస్సు పొందితే ఆయన సన్నిధిలో‌ స్థానం కల్పిస్తాడని‌ చెప్పడానికే ఒకప్పుడు అపవిత్రమైన జీవితాలు జీవించిన తామారు, రాహాబుల ప్రస్తావన, లోతు కుమార్తెలకు తమ తండ్రిద్వారా జన్మించిన మోయాబు జాతికి చెందిన రూతు ప్రస్తావన కూడా యేసుక్రీస్తు వంశావళిలో చెయ్యడం జరిగింది. లేకపోతే ఆత్మప్రేరేపితుడైన గ్రంథకర్త మిగిలిన స్త్రీలందరి పేర్లనూ ప్రక్కనపెట్టి ఆ ముగ్గురు పేర్లను మాత్రమే ఎందుకు రాసినట్టు? నేను పైన చెప్పిన మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తుకు ఉన్న పరిశుద్ధత ఆయన వంశావళిని బట్టి సంక్రమించిందో ఆ వంశావళిని బట్టి క్షీణించిపోయేదో కాదు. దేవుడైన ఆయన ఈలోకంలోకి రావడానికి ఒక వంశావళి అవసరం కాబట్టి ఆయన ఆ వంశావళిని ఎన్నుకున్నాడు, మారుమనస్సు పొందిన పాపులకు కూడా ఆ వంశావళిలో స్థానం కల్పించాడు. హిందూ మతోన్మాదులు పాపం యేసుక్రీస్తు పరిశుద్ధత కూడా "తపస్సు చేసుకుంటున్న ఋషులపై, దేవుళ్ళపై ఎవడో బాణం వేస్తే వెంటనే వారు ఆ తపస్సును పక్కనపెట్టి స్త్రీల వెంట పరుగుతీసేంత బలహీనమైనది అనుకుంటున్నారేమో! లేదా విష్ణువును మోహీని వేషంలో చూసి ఆమె వెంట వీర్యం కార్చుకుంటూ పరుగుతీసిన శివుడు వంటిది అనుకుంటున్నారేమో" (అలా కారిన వీర్యం వల్లే మన భూమిలోకి బంగారం వచ్చిందంట, శాస్త్రవేత్తలు చెబుతున్నట్టుగా supenova వల్ల కాదంట "శ్రీ శ్రీమద్భాగవతము/పోతనభాగవతము/వ్యాసభాగవతము 8వ స్కంధం, 19వ శ్లోకాలనుండి చదువుకోండి") కానీ యేసుక్రీస్తు పరిశుద్ధుడు అన్నప్పుడు ఆయనను ఏదీ అపవిత్రపరచలేదని భావం.

1యోహాను 1:5 మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగైయున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.

4. బైబిల్లో తల్లీకొడుకుల సెక్స్

మతోన్మాదులు యాకోబు పెద్దకుమారుడైన రూబేను అతని‌ పినతల్లియైన (యాకోబు ఉపపత్ని) బిల్హాతో చేసిన హేయకార్యాన్ని చూపించి బైబిల్లో తల్లీకొడుకుల సెక్స్ ఉందంటూ బురద చల్లుతుంటారు. ఆ సందర్భం చూడండి -

ఆదికాండము 35:22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.

ఇప్పటికే నేను లోతు సందర్భంలోనూ యూదా సందర్భంలోనూ ప్రస్తావించినట్టుగా ఇది‌ చారిత్రక కోణంలో రాయబడిన సంఘటనే తప్ప, తల్లీ‌కొడుకుల వ్యభిచారానికి అనుమతిగా రాయబడింది కాదు. రూబేను, బిల్హాలు చేసిన వ్యభిచారాన్ని బైబిల్ హేయమైనదిగా ఖండిస్తుంది.

లేవీయకాండము 18:7,8 నీ తండ్రికి మానాచ్ఛాదనముగానున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే.

ద్వితియోపదేశకాండము 22:30 ఎవడును తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు.

ద్వితియోపదేశకాండము 27:20 తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

బైబిల్ రూబేను చేసిన పనిని ఖండిస్తుందనీ మనం అలా చెయ్యకూడదని హెచ్చరిస్తుందనీ చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి? మతోన్మాదులకు మాత్రం ఇవేం అవసరం లేదు. చరిత్రలో జరిగిన సంఘటనల గురించి రాయబడితే చాలు, ఇక ఆ గ్రంథం దానిని అనుమతిస్తున్నట్టే ఆధారం వారికి. నేను కూడా అదే వాదన తీసుకుంటే హిందూ గ్రంథాలలో రాక్షసుల గురించి రాయబడింది. మరి హిందూ గ్రంథాలు రాక్షసత్వాన్ని ప్రేరేపించే గ్రంథాలా? రావణుడు సీతను ఎత్తుకుపోయిన సంఘటన గురించి రామాయణంలో రాయబడింది, అంటే రామాయణం స్త్రీలను అపహరించడాన్ని ప్రోత్సహిస్తుందా? లేదు, లేదు, ఖండిస్తుంది అందుకే మా రాముడు రావణుడితో రాక్షసులతో యుద్ధం చేసాడు అంటారు కదా! అలా ఆలోచించే బుద్ధి బైబిల్ విషయంలో మాత్రం‌ ఎక్కడికి పోతుంది? బైబిల్ దేవుడు మీరు ఆరోపిస్తున్నటువంటి హేయక్రియలను ఖండించడం, అలాంటి పనులు చేసినవారిని శిక్షించడం కనిపించలేదా మీకు? ఉదాహరణకు, యాకోబు కుమారుడైన రూబేను ప్రస్తావనే తీసుకోండి. బైబిల్ దేవుడు అతను చేసిన పనిని తీవ్రంగా ఖండించడం నేను పైన ప్రస్తావించిన వాక్యభాగాలలో స్పష్టంగా లేదా? యాకోబు దైవప్రేరణతో రూబేనును శపించి, అతనికి చెందవలసిన హక్కులను తొలగించలేదా?

ఆదికాండము 49:3,4 రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము మీదికెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచము మీదికెక్కెను.

1 దినవృత్తాంతములు 5:1 ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడైయుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్య్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలుచేయబడలేదు.

మరోసారి ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. రూబేను మాకు మాదిరి కాదు, మేము‌ అతను‌ చేసిన పనిని‌ బట్టి అలా‌ చెయ్యకూడదని‌ నేర్చుకుంటామే తప్ప అలా చెయ్యాలని కాదు. కానీ మీ దేవుళ్ళ సంగతేంటి? మీ దేవుళ్ళు మీకు మాదిరి కాదా మరి? "మీ దేవతయైన ఆదిపరాశక్తి మొదట బ్రహ్మను సృష్టించి తనతో శయనించమని అడుగుతుంది, కానీ బ్రహ్మ తనను సృష్టించిన తల్లితో శయనించడానికి నిరాకరిస్తాడు.‌ వెంటనే ఆమెకు కోపం వచ్చి అతణ్ణి భస్మం చేస్తుంది. తరువాత మరలా విష్ణువును సృష్టించి, అతనితో కూడా అదే కామకోరికను వెళ్ళబుచ్చుతుంది. కానీ అతను కూడా తల్లితో శయనించడానికి నిరాకరించడంతో బ్రహ్మను చేసినట్టే భస్మం చేసేస్తుంది. చివరిగా శివుణ్ణి సృష్టించి తన కోరికను తెలిపినప్పుడు శివుడు కాస్త తెలివిగా ఆలోచించి, నువ్వు నన్ను సృష్టించిన తల్లివి కాబట్టి నువ్వు ఇదే రూపంలో ఉండగా నీతో శయనించలేను, ఒకవేళ నువ్వు వేరే రూపంలోకి మారితే నీ కోరిక తీరుస్తానని ఒప్పుకుంటాడు. అదేవిధంగా భష్మం చెయ్యబడిన బ్రహ్మ విష్ణువులను కూడా బ్రతికించి వేరే రూపాలతో వారితో శయనించమనే సలహా కూడా ఇస్తాడు. అప్పుడు ఆమె బ్రహ్మ విష్ణువులను కూడా తిరిగి బ్రతికిస్తుంది" ఇదంతా మీరు "ఆదిజాంబవ పురాణం"లో‌ చదువుకోవచ్చు. మీరు ప్రేమోన్మాదుల గురించి వినుంటారు, ఆదిపరాశక్తిది కామోన్మాదం, అది కూడా స్వంత కొడుకుల‌ పట్ల. ఈ ఆరోపణ నుండి తప్పించుకోవడానికి అదిజంబావ పురాణం మాకు ప్రామాణికం కాదని ఎవరైనా వాదిస్తే అది ఎందుకు ప్రామాణికం కాదో పలానా పురాణం ప్రామాణికం పలానా పురాణం ప్రామాణికం కాదు అనడానికి హిందువులకు ఉన్న కొలమానం ఏంటో ఆధారాలతో వివరించాలి. protestant బైబిల్ లో ఉన్న 66 పుస్తకాలు మాత్రమే మాకు ప్రామాణికం అని నేను సంఘచరిత్రను బట్టి మాత్రమే కాదు, బైబిల్ లో ఉన్న  ఆధారాలతో కూడా రుజువుచెయ్యగలను. 

5. బైబిల్లో అత్తాఅల్లుళ్ళ సెక్స్

హిందూ మతోన్మాదులు మోషే తల్లితండ్రులైన అమ్రాము యోకెబెదుల వివాహాన్ని ప్రస్తావిస్తూ అమ్రాముకు యోకెబెదు మేనత్త ఔతుందని, దీనిప్రకారం బైబిల్లో అత్తాఅల్లుళ్ళ సెక్స్ కూడా ఉందని బురద చల్లుతుంటారు.

నిర్గమకాండము 6:20 అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

ఈ వాక్యభాగంలో మతోన్మాదులు ఆరోపిస్తున్నట్టుగానే అమ్రాముకు యోకెబెదు మేనత్త అని రాయబడింది. కానీ ఈ వివాహం గురించి రాయబడిన మరో సందర్భం చూడండి.

నిర్గమకాండము 2:1 లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను.

ఈ వాక్యభాగం ప్రకారం యోకెబెదు లేవీ కుమార్తె.

నిర్గమకాండము 6:16,18 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను. కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.

ఈ వాక్యభాగం ప్రకారం అమ్రాము లేవీకి మనువడు. యోకెబెదు నిజంగా లేవీకి కుమార్తెయైతే కహాతుకు సహోదరి, కహాతు కుమారుడైన అమ్రాముకు మేనత్త ఔతుంది. కానీ అసలు విషయం ఏమిటంటే అమ్రాము తాతయైన లేవీకి అసలు కుమార్తెలే లేరు. ఈ వాక్యభాగాలు చూడండి -

నిర్గమకాండము 6:16 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

ఆదికాండము 46:11 లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి.

కాబట్టి అమ్రాము వివాహం చేసుకుంది తన స్వంత మేనత్తను కాదు. తెలుగు బైబిల్ లో మేనత్త అని తప్పుగా తర్జుమా చేసారు. ఇంగ్లీష్ బైబిల్ లో Father's sister అని‌ మాత్రమే ఉంటుంది. హెబ్రీయుల విషయంలో Father's sister, Father's daughter అని ఉన్న ప్రతీసందర్భంలోనూ వారు తండ్రియొక్క స్వంత సహోదరీలు, తండ్రియొక్క స్వంత కూతుళ్ళు అని భావం కాదు. హెబ్రీయులు తమ తండ్రి సహోదరుల సంతానానికి చెందినవారిని కూడా తమ తండ్రి పేరుతోనే సంబోధిస్తారు. ఈ విషయం నేను అబ్రాహాము విషయంలో కూడా తెలియచేసాను. ఈ ప్రకారంగా అమ్రాము వివాహం చేసుకుంది తన స్వంత మేనత్తను కాదు. లేవీకి అసలు కుమార్తెలే లేరు.

వాదన కోసం అమ్రాము తన మేనత్తనే వివాహం చేసుకున్నాడు అనుకున్నప్పటికీ అమ్రాము ఒక‌ మనిషి, అతను తప్పు చేస్తే చేసుంటాడు. కానీ మాకు దేవుడు ఏం చెబుతున్నాడు అనేదే ప్రామాణికం. దేవుడు దానిని ఆమోదించాడా లేక ఖండించాడా అనేదే అసలు విషయం. మేనత్తలను వివాహం చేసుకోవడం గురించి మా దేవుడు ఏం చెబుతున్నాడో చూడండి -

లేవీయకాండము 18:12 నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.

ఈ వాక్యభాగం ప్రకారం స్వంత మేనత్తలను వివాహం చేసుకోవడం బైబిల్ దేవుని దృష్టికి హేయమైన పాపం. అది సరే కానీ మీ హిందువులు చాలా పవిత్రమైనవిగా చేసుకుంటున్న మేనరికపు వివాహాల సంగతేంటి? బైబిల్ ప్రకారం మేనమామను వివాహం చేసుకోవడం పాపం‌ మరి.

లేవీయకాండము 18:13 నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.

ఈ వాక్యభాగంలో నీ తల్లి సహోదరిని వివాహం చేసుకోకూడదు అన్నది, పురుషుల వైపునుండి చెప్పబడితే ఇవే మాటలు స్త్రీల వైపునుండి నీ తల్లి సహోదరుణ్ణి (మేనమామను) చేసుకోకూడదని చెప్పబడుతున్నాయి. ఈ వివాహాల కారణంగా పుట్టబోయే పిల్లలకు అంగవైకల్యాలు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రీయంగా కూడా రుజువు చెయ్యబడింది. మరి మీరు అశాస్త్రీయమైన, హేయమైన ఆ వివాహాలను ఎందుకు సమర్థిస్తున్నారు? మీరు మాత్రం బైబిలుకూ సైన్సుకూ వ్యతిరేకంగా వివాహాలను చేసుకోవచ్చు, బైబిల్ సంస్కృతిని పాటించేవారు మాత్రం ఆ సంస్కృతిలో ఆమోదించబడిన వరుసవారిని వివాహాలు చేసుకుంటే మీకు అభ్యంతరమా? మేనమామ కూతుళ్ళనూ మేనత్త కూతుళ్లనూ వివాహం చేసుకుంటే చాలా పవిత్రం, Cousins ను‌ వివాహం చేసుకుంటే అపవిత్రమా? ఇలా నిర్ణయించడానికి మీకున్న కొలమానం ఏంటి? ఇంతకూ‌‌ మీరు పూజించే దేవుళ్ళైనా మీ వరసల ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్నారా? బ్రహ్మ సరస్వతుల వివాహం గురించి, యముడి చెల్లి నిర్వాకం గురించి ఇప్పటికే వివరించాను కదా!

6. దావీదు బత్షెబా పాపం

హిందూ మతోన్మాదులు రాజైన దావీదు ఊరియా భార్యయైన బత్షెబాతో వ్యభిచరించిన సంఘటనను ఎత్తిచూపుతూ బైబిల్ పై బురద చల్లుతుంటారు. దావీదు బెత్షబాతో వ్యభిచరించడం ఎవరికి తెలియని విషయం? దాదాపుగా అందరు సేవకులూ ఆ ఉదంతాన్ని ప్రస్తావించి, అంతటి భక్తుడైన దావీదే పాపంలో పడిపోతే మనం ఇంకా పడిపోయే అవకాశం ఉందని, కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేస్తుంటారు. దేవాది దేవుడు ఆ సంఘటనను అంత వివరంగా రాయించింది కూడా అందుకే. ఈ విషయంలో బైబిల్ పైన కానీ బైబిల్ దేవునిపై కానీ బురదచల్లే అవకాశం మతోన్మాదులకు ఎక్కడిది? దావీదు అలా చేసినంత‌మాత్రాన బైబిల్ దానిని సమర్థిస్తుందా లేదా అనేది కదా అసలు విషయం. పరాయి పురుషుల భార్యలతో వ్యభిచరించడాన్ని, దానికి అంగీకరించడాన్ని బైబిల్ ఎలా ఎంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తుందో చూడండి -

లేవీయకాండము 20:10 పరుని భార్యతో వ్యభిచరించినవానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.

ఈ న్యాయవిధి ప్రకారం, ఎవరైనా పరాయి పురుషుడి భార్యతో వ్యభిచరిస్తే దానికి ఆ స్త్రీ అంగీకరిస్తే వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. రాజుగా ఆ శిక్షలను అమలు చెయ్యవలసిన దావీదే అలాంటి పని చేసినప్పుడు దానికి మా దేవుడు కూడా ఎలా స్పందించాడో చూడండి -

2సమూయేలు 11:27 అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.

ఈ వాక్యభాగం ప్రకారం దావీదు చేసింది బైబిల్ దేవుడైన యెహోవా దృష్టికి దుష్కార్యం. అందుకే ఆయన దావీదుకు మరణంకంటే ఎక్కువ బాధ కలిగించే శిక్షను విధించాడు. అబ్షాలోము కుట్రలో మనం అదే చూస్తాం (ఆ శిక్షలపై వస్తున్న ఆరోపణ గురించి మరలా మాట్లాడతాను). బైబిల్ దావీదు చేసినపనిని చెడ్డదిగా ఖండిస్తున్నప్పుడు, బైబిల్ దేవుడు ఆ విషయంలో దావీదుకు శిక్ష విధించినప్పుడు, మతోన్మాదులు మరలా మరలా ఆ సందర్భాన్ని ప్రస్తావించి బైబిల్ పై బైబిల్ దేవునిపై బురద చల్లడమేంటి? ఓహో ఒకవేళ బైబిల్ మరియు బైబిల్ దేవుడు దావీదు చేసినపనిని మెచ్చుకుని ఉంటే మీకు మంచిగా అనిపించేదేమో. ఎందుకంటే మీ దేవుళ్ళు చేసింది అదే కదా! మీ కృష్ణుడు పరాయి పురుషుల భార్యలతో వ్యభిచరించలేదా? వెళ్ళి "పోతన భాగవతం, 10వ స్కంధం, రాసలీలాపర్వం మరియు జలక్రీడాపర్వం" చదువుకోండి. మళ్ళీ ఆ పాడుపనులకు "అగ్ని సమస్తమునూ దహించి దోషి కానట్టే క్రిష్ణుడు పరాయి పురుషుల భార్యలతో వ్యభిచరించినా దోషి, అపవిత్రుడు కాడని" ముని సమర్థింపు ఒకటి. ఏ జన్మలోనో వారికి వరం ఇచ్చాడని ఈ జన్మలో వారు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేసుకుంటుంటే మాయ చేసి మరీ వారితో వ్యభిచారిస్తాడా? అసలు అలాంటి నీచమైన వరాన్ని ఎందుకు ఇవ్వాలి?

మీ శివుడు పరాయి పురుషుల భార్యలతో వ్యభిచరించి మునుల శాపంవల్ల పురుషాంగాన్ని పోగొట్టుకోలేదా? "సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం, కోటి రుద్ర సంహిత, 12వ అధ్యాయం, స్కంద పురాణం V.3.38.23-38, వామన పురాణం 6.57-66, కూర్మ పురాణం volume.2. 37వ ఆధ్యాయం, బ్రహ్మాండ పురాణం volume I. సెక్షన్ 2. 27వ అధ్యాయం, శ్రీ దేవి భాగవతం 4వ స్కంధం 20వ అధ్యాయం, శ్రీ దేవి భాగవతం 1 వ స్కంధం 5వ అధ్యాయం"లో ఏముందో చదువుకోండి. మీ దేవతలకు రాజైన దేవేంద్రుడు, గౌతమి మహర్షి భార్య అహల్యాతో వ్యభిచరించడం, మహర్షి శా‌పం వల్ల వృషణాలను (Testicles) పోగొట్టుకోవడం, దేవతలు అతనికి మేక వృషణాలను తీసుకువచ్చి అతికించడం మీకు తెలియదా? "రామాయణం, బాలకాండ, 49వ సర్గ" నుండి‌ చదువుకోండి. దావీదు ఎంత గొప్ప భక్తుడైనప్పటికీ అతను కూడా ఒక మనిషి. అందరు మనుషుల్లానే అతనూ ఊరియా భార్య‌ విషయంలో పాపానికి లోనయ్యాడు. మా దేవుడు దానిని ఖండించాడు. శిక్ష విధించాడు. ఈవిషయంలో బైబిల్ కు కానీ బైబిల్ దేవుని పరిశుద్ధతకు కానీ ఎటువంటి విఘాతం కలుగలేదు. కానీ మీ దేవుళ్ళు చేసిన వ్యభిచారాల సంగతేంటి?

                        "మరి దావీదుకు మరణశిక్ష ఎందుకు విధించలేదు?"

దావీదు చేసిన పాపం విషయంలో స్వయంగా దేవుడే కలుగచేసుకున్నాడు. అందుకే చట్టపరంగా ఆయన మిగిలిన వ్యభిచారులకు నియమించినట్టు అతనికి మరణశిక్షను విధించలేదు. చట్టాలను అమలు చెయ్యవలసిన రాజుస్థానంలో ఉండి అతనే అలాంటిపని చేసినందుకు మరణంకంటే ఎక్కువ బాధను అనుభవించాలని దేవుడు ఆ విధంగా చేసాడు. హేబెలు హత్య విషయంలో ఆయన కయీనుకు కూడా ప్రాణానికి ప్రాణం తియ్యకుండా మరణం కంటే ఎక్కువ శిక్షను విధించినట్టు గమనిస్తాం. అందుకే కయీను ఆ శిక్షను బట్టి "అందుకు కయీనునా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది" (ఆదికాండము 4:13) అని విలపించాడు. దేవుని శిక్ష మరణమే కాదు కొన్నిసార్లు ఆ మరణం కంటే భయంకరంగా ఉంటుంది. ఈ వాక్యభాగం చూడండి.

ప్రకటన గ్రంథం 9:6 ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.

ఇక దావీదు తన జీవితంలో మరణం కంటే ఎక్కువగా ఎలాంటి బాధను అనుభవించాడో ఒక ఉదాహరణకు ఈ మాటలు చూడండి -

2 సమూయేలు 18:33 అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి యేడ్చుచు, సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, "నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును" నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.

తండ్రి స్థానంలో ఉన్నవాడికి తన కుమారుడు తన కళ్ళముందే చనిపోతే అది మరణంకంటే ఎక్కువబాధను కలిగిస్తుందో లేదో బాగా తెలుసు. కొడుకు ఏదో తప్పు చేస్తే వాడికి కుష్టురోగం రావాలని శపించినటువంటి దుర్మార్గపు తండ్రి కాదు దావీదు. అలా కొడుకును శపించింది ఎవరో హిందూ మతోన్మాదులకు అర్థమైంది అనుకుంటా? అర్థం కాకపోతే "భాగవతం 10వ స్కంధం" చదువుకోండి. ఆ కొడుకు పేరు మాత్రం సాంబుడు.

7. బైబిల్ దేవుడు సౌలు భార్యలను దావీదు కౌగిట్లో చేర్చాడా?

2 సమూయేలు 12:7,8 నాతాను దావీదును చూచి-ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా- ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదావారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.

ఈ సందర్భంలో దేవుడు నాతాను ద్వారా "నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని" అని పలికించిన మాటలను మతోన్మాదులు‌ వక్రీకరించి, బైబిల్ దేవుడు సౌలు భార్యలను దావీదు కౌగిట్లో చేర్చాడని అపహాస్యం చేస్తుంటారు. జూదంలో భార్యను తాకట్టు పెట్టి తీరా అందులో ఓడిపోయాక ఆ భార్యను గెలిచినవాడికి అప్పగించే కథలు చదివీ చదివీ వీరికి అలా అర్థమయ్యింది పాపం (మహాభారతం, సభాపర్వం). కానీ ఒకసారి దేవుడు అక్కడ నాతాను ద్వారా ఏం పలికిస్తున్నాడో మరోసారి వివరంగా చూడండి.

"ఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదావారిని నీకప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును"

దావీదు రాజుగా ఉన్న రాజ్యం నిజానికి సౌలుది. కానీ సౌలు దేవునికి అవిధేయుడైన కారణంగా ఆయన అతనిని కొట్టి వేసి ఆ స్థానంలో దావీదును ఉంచాడు (1 సమూయేలు 15:28). ఈరోజు దావీదు అనుభవిస్తున్న భోగభాగ్యాలు, ఉపపత్నులు అవన్నీ సౌలు రాజుగా ఉండకుండా కొట్టివెయ్యబడ్డాడు కాబట్టే దావీదుకు దక్కాయి. అయితే ఇక్కడ గతంలో సౌలు అనుభవించిన అదే స్త్రీలను దావీదు ఇప్పుడు అనుభవిస్తున్నాడని, దేవుడు అదే స్త్రీలను దావీదు కౌగిట్లో చేర్చాడని అర్థం కాదు. ఒకవేళ ‌‌సౌలే బ్రతికుంటే దావీదుకు అంతమంది స్త్రీలను ఉపపత్నులుగా చేసుకునే అవకాశం లేకపోయేది, ఆ అవకాశం రాజుగా సౌలుకు మాత్రమే ఉండేది. ఎందుకంటే అంతకుముందు ఇశ్రాయేలువారికీ యూదావారికీ సౌలు మాత్రమే యజమానుడు. తన ఆధీనంలో‌ ఉన్న ప్రజలనుండి అతను మాత్రమే అంతమంది స్త్రీలను ఉపపత్నులుగా సంపాదించుకోగలడు. ఇప్పుడు సౌలు లేడు కాబట్టి, దేవుడు దావీదును వారికి యజమానిగా చేసాడు కాబట్టి ఆ ప్రజలనుండి తనకు ఇష్టమైన స్త్రీలను దావీదు స్వంతం చేసుకున్నాడు. దేవుడు నాతాను ద్వారా పలికిస్తున్న మాటలకు అసలు భావం‌ ఇదే. ఇవి రాజ్యంతో ముడిపడిన మాటలు. అందుకే ఆయన "ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును" అని రాజ్యాన్ని అతనికి ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సందర్భంలో దేవుడు నేను నీకు రాజ్యాన్ని ఇచ్చాను, రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ నీ వశం చేసాను, నీకు ఇంకా కావాలంటే ఇంకా ఇద్దును. కానీ నువ్వు నేను‌ చేసిన మేలు అంతా మరచిపోయి నా దృష్టికి అంత ఘోరపాపం ఎందుకు చేసావని ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయం సండే స్కూల్లో ఉన్నప్పుడు కూడా నాకు బానే అర్థమైంది. కాబట్టి "నీ యజమానుని స్త్రీలను" అంటే నీ యజమానునికి చెందవలసిన స్త్రీలను అని అర్థం చేసుకోవాలి. అందుకే అక్కడ నీ యజమానుని భార్యలు అని కానీ ఉపపత్నులు అని కానీ కాకుండా స్త్రీలను అని‌ ఉంటుంది. అలాకాదని ఎవరైనా వితండవాదం చేస్తే గతంలో సౌలు అనుభవించిన అదే స్త్రీలను అనే భావం వచ్చేలా "నీ యజమానుని 'అదే' స్త్రీలను నీ కౌగిట్లో చేర్చానని" ఎక్కడ ఉందో చూపించాలి.

ఇకపోతే "కౌగిట్లో చేర్చి" అనగానే అది తప్పకుండా లైంగికసంబంధం గురించే చెప్పబడుతుందని భావించకూడదు. ఉదాహరణకు ఈ మాటలు చూడండి.

సంఖ్యాకాండము 11:12 ​నేనే యీ సర్వజనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు.

ఈ సందర్భంలో‌ మోషే ఇశ్రాయేలీయుల ప్రజలకు నాయకుడిగా వారిని నడిపించడాన్ని కూడా "రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు" అంటూ వారిని కౌగిట్లో ఉంచుకోవడంతో పోలుస్తున్నాడు.

8. తండ్రి తప్పు చేస్తే కొడుకుకు మరణశిక్ష

2 సమూయేలు 12:14-18 అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. ఏడవ దినమున బిడ్డ చావగా-

ఈ సందర్భంలో దేవుడు; దావీదు బత్షెబాలకు పుట్టిన కుమారుడిని మొత్తడం, అప్పుడు ఆ కుమారుడు చనిపోవడం మనకు కనిపిస్తుంది. హిందూ మతోన్మాదులు ఈ సంఘటనను ఉదహరిస్తూ తండ్రి తప్పు చేస్తే బిడ్డను చంపడమేంటని ఆరోపిస్తుంటారు. ఒకసారి ఆ సందర్భంతా పరిశీలిస్తే ఆ బిడ్డకు తటస్థించిన మరణం అతనిపై దేవుని కృపగా మనకు అర్థమౌతుంది. ఎందుకంటే దావీదు చేసిన పాపం వల్ల దావీదు ఇంటివారికి ఏ శిక్ష విధించబడిందో చూడండి.

2 సమూయేలు 12:10 నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.

ఈ మాటల ప్రకారం, దావీదు ఇంటివారికి సదాకాలం ఎవరొకరితో యుద్ధం కలుగుతూనే ఉంటుంది. అందుకే దేవుడు ఆ చిన్న బిడ్డకు ఆ యుద్ధం నుండి మినహాయింపు కల్పిస్తూ మరణాన్ని అనుగ్రహించాడు, ఈ మరణాన్ని దుష్టుదైన యరొబాము కుమారుడి మరణంతో పోల్చి అర్థం చేసుకోండి (1రాజులు 14:7-13). ఈ ఆధారాలన్నీ ప్రక్కనపెట్టినా సరే; మనిషిని పుట్టించినవాడిగా ఆ మనిషిని తాను నిర్ణయించిన సమయంలో మరణానికి అప్పగించడం ఆయనకు న్యాయమే (కీర్తనలు 90:3). ఆ మరణం దావీదుకూ అతనితో కలసి పాపం చేసిన బెత్షబాకూ వేదనకరంగా ఉండేలా ఆయన నిర్ణయించాడు. అన్యాయం అంటే "రెండు‌కోతుల మధ్య యుద్ధం జరుగుతుంటే మధ్యలో ఒకడు చెట్టు చాటు నుండి బాణం వేసి అందులో ఒక కోతిని చంపేస్తాడు" చూడండి దానిని అంటారు అలా (మళ్ళీ ధర్మాన్ని కాపాడడానికే అలా చేశాడని సమర్థింపు ఒకటి, ధర్మాన్ని కాపాడడానికి అధర్మంగా యుద్దం చెయ్యాలా? చంపాలా? ఇదేం ధర్మమో మరి). ఈ నా సమాధానాన్ని బట్టి దావీదు పాపం చేస్తే తన ఇంటివారికి యుద్ధం కలగడమేంటని మళ్ళీ ఎవరైనా ఆరోపిస్తే అసలు దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి కాపాడుతుందే దావీదును బట్టి‌. నిజానికి వారేమీ ఆయన ఆశీర్వాదాన్ని కాపుదలను పొందుకునేంత మంచివారేం కారు (దీనికి మరింత వివరణ, అమ్నోను తామరు, తండ్రి భార్యలను కొడుకు అప్పగించిన బైబిల్ దేవుడు భాగాలలో పొందుపరిచాను). అలాంటప్పుడు ఆ దావీదు పాపం కారణంగా ఇప్పుడు వారు అతని శిక్ష కూడా భరించడంలో అన్యాయమేమీ లేదు. ఇంతకూ హిందూగ్రంథాల ప్రకారం ఏ జన్మలోనో‌ పాపం చేస్తే అసలు ఆ పాపమేంటో కూడా తెలియకుండా ఈ‌ జన్మలో దానిని‌ అనుభవించడమేంటి?

9. అమ్నోను తామారు

బైబిల్ చరిత్రలోని కొందరు వ్యక్తులు చేసిన పాపాలను తీసుకుని వాటిని బైబిల్ పైనా బైబిల్ దేవునిపైనా ఆపాదించే కుట్రలో భాగంగా హిందూ మతోన్మాదులు దావీదు కుమారుడైన అమ్నోను తన చెల్లెలిపై అత్యాచారం చేసిన సంఘటనను కూడా ప్రస్తావిస్తుంటారు. దావీదు కుమారుడైన అమ్నోను తన చెల్లెలి (Half-sister) పై చేసింది బైబిల్ దేవునికి హేయమైన చర్య అని చాలా స్పష్టంగా రాయబడింది. అలాంటి కార్యాలు చేసినందుకే ఆయన కనానీయులను నిర్మూలం చేసాడని ఇప్పటికే నేను వివరించాను.

లేవీయకాండము 18:9-25 నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్కయైనను నీ తల్లి కుమార్తెయొక్కయైనను మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.‌ వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్నవారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.

అమ్నోను ఈ నియమాన్ని మీరుతూ తన చెల్లెలిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు (2 సమూయేలు 13). చివరికి తన సహోదరుడైన అబ్షాలోము చేతిలో హతమయ్యాడు. ఇందులో బైబిల్ పై కానీ బైబిల్ దేవునిపై కానీ బురద చల్లడానికి ఏముంది? బైబిల్ దేవుడేమైనా అమ్నోనును అలా చెయ్యమని ప్రేరేపించాడా? పైగా అలా చెయ్యకూడదని కచ్చితంగా ఆజ్ఞాపించాడు కదా! అమ్నోను ఎవరి ప్రేరణతో ఆ పని చేసాడో ఆ అధ్యాయంలో వివరంగా ఉంది చదువుకోండి (2 సమూయేలు 13:3-5). హిందూ మతోన్మాదుల కుయుక్తి ఇలా ఉంటుంది. జరిగిన ఒక సంఘటన చారిత్రక కోణంలో రాయబడితే చాలు ఇక బైబిల్ పై బురద చల్లేయ్యడమే. అలాగైతే రాక్షసుల గురించి రాయబడిన హిందూ గ్రంథాలు రాక్షసగ్రంథాలు ఔతాయని, రాక్షసుల చర్యలకు ఆ గ్రంథాలనే నిందించవలసి ఉంటుందని, సీతను ఎత్తుకుపోవడం గురించి రాయబడిన రామాయణం స్త్రీలను అపహరించే గ్రంథం ఔతుందని ఇప్పటికే హెచ్చరించాను.

హిందూ మతోన్మాదులారా అమ్నోను తన చెల్లెలిని మోహించి అత్యాచారం చెయ్యడాన్ని ప్రస్తావించి బైబిల్ పై బురద చల్లుతున్నారు కదా! అమ్నోను మాకు మాదిరి కాదు, అతను కనీసం దావీదులా భక్తుడు కూడా కాదు. అతను ఏం చేస్తే మాకేంటి? ఎలా చస్తే మాకేంటి? కానీ మీ సంగతేంటి? బ్రహ్మ మీకు దేవుడే కదా. మరి ఆ బ్రహ్మగారు వీర్యస్ఖలనం అయ్యి నేలపై పడేంతగా శివుడి భార్య పార్వతిని చూసి మోహించడం, అది గ్రహించిన శివుడు ఆవేశంతో బ్రహ్మ తలల్లో ఒకదానిని నరికిపడేయ్యడం గురించి ఏం చెబుతారు? వెళ్ళి "స్కందపురాణం, ప్రథమసంపుటం, page no. 107"లో ఏముందో చదువుకోండి. అమ్నోను "నా చెల్లీ నాతో శయనించుము" అని తన చెల్లిని‌ బ్రతిమిలాడితే (2 సమూయేలు 13:11), మీ యముడి చెల్లి యమి "నా అన్నా నాతో శయనించుము", బ్రహ్మే తన కూతురుతో శయనించినప్పుడు అన్నాచెల్లెళ్ళమైన మనం అలా చెయ్యడంలో ఏముందని, యముణ్ణి బ్రతిమిలాడలేదా? (ఋగ్వేదం 10వ మండలం). మా గ్రంథంపై మా దేవునిపై అక్రమంగా బురద చల్లాలని చూస్తే ఇలానే మీ గ్రంథంలో ఉన్న పెంటను వెలికి తీయవలసి ఉంటుంది.

10. తండ్రి భార్యలను కొడుకుకు అప్పగించిన బైబిల్ దేవుడు

హిందూ మతోన్మాదులు అబ్షాలోము దావీదుపై కుట్ర చేసాక రాజనగరికి కాపలాగా ఉన్న అతని ఉపపత్నులతో శయనించడాన్ని చూపించి (2 సమూయేలు 16:22), అబ్షాలోముకు తన తండ్రి భార్యలను బైబిల్ దేవుడే అప్పగించాడని ఆరోపిస్తుంటారు. ఎందుకంటే దేవుడు దావీదుకు నాతాను ద్వారా ప్రకటించిన శిక్షలో వాడబడిన మాటలు అలానే ఉంటాయి.

2 సమూయేలు 12:11,12 నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా- నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; "నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను".

"నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించెదను" అన్నప్పుడు అక్కడ మతోన్మాదులు చెబుతున్న భావమే ఉందో లేదో‌ చూసేముందు అసలు అబ్షాలోము ఎవరి ప్రేరణతో ఆ పని చేసాడో ఒకసారి చూడండి.

2 సమూయేలు 16:20-22 అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలిసికొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా అహీతోపెలు-నీ తండ్రిచేత ఇంటికి కావలియుంచబడిన ఉపపత్నులయొద్దకు నీవు పోయిన యెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరు తెలిసికొందురు, అప్పుడు నీ పక్షముననున్నవారందరు ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులకందరికి తెలియునట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను.

ఈ వాక్యభాగంలో అహీతోపెలు అనేవాడి ఆలోచనను బట్టే అబ్షాలోము ఆ పని చేసినట్టు స్పష్టంగా రాయబడింది. అదేంటి మతోన్మాదులు ఆరోపణప్రకారం యెహోవా ప్రేరణతోనే కదా అతను అలా చెసాడని రాసుండాలి? ఇది ప్రక్కనపెడితే అబ్షాలోము చేసిన ఆ పనిని బట్టి బైబిల్ దేవుని‌ స్పందన ఎలా ఉందో చూడండి.

2 సమూయేలు 17:14 ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయనిశ్చయించియుండెను.

ఈ వాక్యభాగం ప్రకారం, అబ్షాలోను చేసిన ఆ పనిని బట్టి దేవుడు అతనిపైకి ఉపద్రవం రప్పించదలిచాడు. అదేంటి అతను దేవుని ఆలోచన చొప్పునే అదంతా చేస్తున్నప్పుడు మరలా అతనిని చంపాలనుకోవడం ఎందుకు? ఎందుకంటే అబ్షాలోము అక్కడ చేసింది బైబిల్ దేవునికి అత్యంత హేయమైన చర్య.

లేవీయకాండము 18:7,8 నీ తండ్రికి మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే.

ద్వితియోపదేశకాండము 22:30 ఎవడును తన తండ్రిభార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు.

ద్వితియోపదేశకాండము 27:20 తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

ఈ ఆజ్ఞలను మీరుతూ తన తండ్రి భార్యలతో శయనించినందుకే దేవుడు అబ్షాలోమును చంపదలచి యోవాబు చేతికి అతనిని‌ అప్పగించాడు (2 సమూయేలు 18:14,15). ఇక్కడ ఎక్కడా కూడా అబ్షాలోము చేసిన పనిని దేవుడు అంగీకరించలేదు. మరి "నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును" అనే మాటలకు అర్థం తెలియాలంటే ఈ సందర్భాలు కూడా చూడండి -

న్యాయాధిపతులు 2:11-14‌ ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; "ఆయన దోచుకొనువారిచేతికి వారిని అప్పగించెను". వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి "శత్రువులచేతికి వారిని అప్పగించెను" గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి.

న్యాయాధిపతులు 13:1 ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిష్తీయులచేతికి "అప్పగించెను".

ఈ సందర్భాల ప్రకారం; బైబిల్ లో దేవుడు "అప్పగించెను, చేయించెను" అన్నప్పుడు ఆయనేదో వారిని తీసుకువెళ్ళి‌ ఎవరికో అప్పగించాడని కాదు. వారు చేసిన పాపాలను బట్టి వారిని కాపాడడం మానివేసాడని అర్థం. దావీదు బత్షెబాతో పాపం చెయ్యకుండా ఉండుంటే దేవుడు యోబు కుటుంబానికి కంచెవేసినట్టుగా (యోబు 1:10) అతని కుటుంబానికి కూడా కంచె వేసి అబ్షాలోములాంటివారు అలాంటి పనులు చెయ్యకుండా ఎవరికీ ఏ ప్రమాదం రాకుండా కాపాడియుండేవాడు. కానీ దావీదు చేసిన పాపం కారణంగా ఆయన ఆ కంచెను తీసివేసాడు (కాపాడడం మానివేసాడు). అబ్షాలోము అలాంటి పాపానికి ఒడిగట్టాడు. ఆయన దావీదు కుటుంబానికి ఉన్న తన కాపుదలను తొలగించగానే అలా జరుగుతుందని దేవునికి ముందే తెలుసు కాబట్టి అవే మాటలను నాతాను ద్వారా ప్రకటించాడు (హిజ్కియా రాజు విషయంలో కూడా ఇంచుమించు ఇలాంటి హెచ్చరికనే మనం గమనిస్తాం "యెషయా 39వ అధ్యాయం") ఇక్కడ దేవుడేమీ అబ్షాలోము మంచిగా ఉంటే అతనిని ప్రేరేపించి అలా చేయించలేదు, అసలు అబ్షాలోము స్వభావమే దుష్టస్వభావం. అతని‌ చరిత్రను పరిశీలిస్తే ఆ విషయం మనకు బాగా అర్థమౌతుంది. కానీ దావీదు పాపం చెయ్యకుండా ఉండుంటే అతను చెయ్యాలనుకున్న కీడు చెయ్యకుండా దేవుడు ఆపియుండేవాడు. ఇప్పుడు దావీదు చేసిన పాపం కారణంగా అలా అతణ్ణి ఆపవలసిన అవసరం దేవునికి లేదు. అందుకే అతను దావీదుపై కుట్రచేస్తున్నప్పుడు వాని పాపానికి వానిని‌ వదిలివేసాడు. ఆయన అప్పగించెను, ఆయన తప్పించెను అన్నప్పుడు ఆయా వ్యక్తులపై ఆయన కాపుదల నిలపడం గురించీ దానిని ఉపసంహరించుకోవడం గురించి చెప్పబడుతుంది. "నీ భార్యలను నీ చేరువవానికి అప్పగించెదను" అంటే ఇదిఅర్థం. ఒకవేళ దావీదు పాపం చేస్తే తన భార్యలకు ఎందుకు శిక్ష అని ఎవరైనా ఆరోపిస్తే అంతవరకూ దావీదు ఆశీర్వాదాన్ని అనుభవించినవారు అతని శిక్షలో కూడా పాలుపొందాలన్నది నా సమాధానం.

హిందూ మతోన్మాదుల్లారా మీ సంగతేంటి? "శివపురాణం, కోటిరుద్ర సంహిత, యుద్ధకాండ" ప్రకారం విష్ణువు, జలందరుడి భార్యయైన బృందను తన భర్తవేషంలో వెళ్ళి మానభంగం చేస్తాడు. తనతో శయనించింది తన భర్తకాదని తెలుసుకున్న బృంద వెంటనే విష్ణువుకు "వచ్చే జన్మలో నీవు అడవిలో అలమటిస్తావు అనీ రాక్షసుడు నీ‌భార్యను ఎత్తుకుపోతే కోతుల సహాయంతో ఆమెకు తిరిగితెచ్చుకుంటావని‌" శాపం పెడుతుంది. అసలు విష్ణువు రామావతారం ఎత్తిందే బృందశాపం కారణంగా. ఈ విషయం రాముడు కూడా ఒప్పుకుని తన పూర్వజన్మ పాపాల‌ (బృందను మానభంగం చెయ్యడం) కారణంగానే ఈ జన్మలో ఇన్ని వేదనలు ఎదుర్కొంటున్నానని వాపోతాడు (వాల్మికి రామాయణం, అరణ్యకాండ, 63వ సర్గ, 4వ శ్లోకం). ఇప్పుడు చెప్పండి, రాముడు పూర్వజన్మలో మానభంగం చేస్తే ఈ జన్మలో అతని భార్యయైన సీతకు శిక్షయేంటి? బృంద శాపం కారణంగానే కదా పాపం ఆమెను రాక్షసుడైన రావణుడు ఎత్తుకుపోయాడు. లంకలో ఆమె చాలా బాధపడవలసి వచ్చింది.

11. శీలపరీక్షలు చేయించిన బైబిల్ దేవుడు

సంఖ్యాకాండము 31:17,18‌ కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. "పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి".

ఈ సందర్భంలో మోషే మోయాబీయుల స్త్రీల విషయంలో మాట్లాడుతూ "పురుషసంయోగము ఎరిగిన స్త్రీలను చంపి, పురుషసంయోగము ఎరుగని ఆడపిల్లలను బ్రతకనివ్వమనడం" మనకు కనిపిస్తుంది. హిందూ మతోన్మాదులు దీనిని చూపిస్తూ "ఏ స్త్రీ పురుషసంయోగం ఎరిగిందో, ఏ స్త్రీ ఎరగలేదో" వారికి ఎలా తెలుస్తుంది, అందుకే బైబిల్ దేవుడు ముందుగా ఆ స్త్రీలకు శీలపరీక్షలు చేయించాడని" ఆరోపిస్తుంటారు.

ఇక్కడ ముందుగా మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఇది యుద్ధానికి సంబంధించిన విషయం. పైగా ఈ యుద్ధం బిలాము ప్రేరణతో ఇశ్రాయేలీయులను దారి తప్పించిన మోయాబీయులతో జరుగుతుంది, అందులో స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు కాబట్టి (సంఖ్యాకాండము 25:1,2, ప్రకటన 2:14) వారిని కూడా చంపవలసి వచ్చింది. తప్పు చేసినవారికి శిక్షపడడం న్యాయమే కదా!

సంఖ్యాకాండము 31:14-16 అప్పుడు మోషే యుద్ధసేనలోనుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకుల మీద కోపపడెను. మోషే వారితో మీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చితిరా? ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించినవారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా.

వాస్తవానికి ఆ యుద్ధంలో పురుషసంయోగము ఎరుగని స్త్రీలను కూడా చంపాలి, కానీ మోషే వారిపై కనికరం చూపించి వారికి క్షమాభిక్ష పెట్టాడు. "మీ నిమిత్తము వారిని బ్రతుకనియ్యుడి" అంటే వారిని శారీరకంగా అనుభవించడానికి కాదు. అలా చేస్తే వ్యభిచారం చెయ్యకూడదనే దేవుని ఆజ్ఞను (నిర్గమకాండము 20:14) ధిక్కరించినట్టు ఔతుంది. కాబట్టి మోషే చెబుతున్న మాటలకు అర్థం అది కాదు. "మీ నిమిత్తము వారిని బ్రతుకనియ్యుడి" అంటే వారిని దాసీలుగా చేసుకోవడానికి అని అర్థం. యుద్ధంలో ప్రాణం పోగొట్టుకోవడం కంటే ఇశ్రాయేలీయుల గృహాల్లో దాసీలుగా జీవించడం క్షేమమే కదా. పైగా ఇశ్రాయేలీయుల్లో బానిసలచేత కఠినసేవ చేయించుకోవడం నిషిద్ధం. అంతేకాకుండా ఆ స్త్రీలలో ఎవరైనా ఇశ్రాయేలీయులకు నచ్చినట్టైతే వివాహం ద్వారా వారికి భార్యస్థానం కల్పించే అవకాశం కూడా ఉంది (ద్వితీయోపదేశకాండము 21:10-13). ఎలా చూసినా సరే యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకునేవారితో పోలిస్తే ఆ స్త్రీలకు మేలే జరుగుతుంది.

ఇక ఎవరు పురుషసంయోగము ఎరిగిన స్త్రీలో ఎవరు ఎరుగని స్త్రీలో శీలపరీక్షలు చేయించే నిర్థారించారా అంటే అలా ఎక్కడ రాసుందో హిందూ మతోన్మాదులు చూపించాలి. ఆ మాటలు వివాహం జరిగిన స్త్రీలా లేక వివాహం జరగని స్త్రీలా అని సాధారణంగా కన్యకలను గుర్తించే పద్ధతిలో చెప్పబడ్డాయి. ప్రస్తుతం మనం కూడా వివాహం కాని స్త్రీలను కన్యకలు అనే సంబోధిస్తుంటాము. వారికి శీలపరీక్షలు చేసివచ్చే అలా అంటున్నామా? హిందూ గ్రంథాలలో కూడా కన్యకల ప్రస్తావన ఉంటుంది, అంటే ఆ గ్రంథాలు రాసినోళ్ళు ఆ స్త్రీలకు శీలపరీక్షలు చేసివచ్చాకే వారు కన్యకలు అని నిర్ధారించుకుని రాసారా?

12. పరమగీతాల్లో సెక్స్

హిందూ మతోన్మాదులు సొలోమోను రచించిన పరమగీతాలలో కొన్ని వాక్యాలను తీసుకుని అందులో సెక్స్ ఉందని ఆరోపిస్తుంటారు. నిజమే అందులో చాలా వాక్యభాగాలు లైంగికసంబంధం గురించే మాట్లాడుతున్నాయి. ఎందుకంటే అసలు ఆ పుస్తకం రాయబడిందే భార్యాభర్తల గురించీ వారిమధ్య ప్రాముఖ్యంగా ఉండే లైంగిక ప్రేమను ప్రోత్సహించడానికీనూ. అలాంటప్పుడు అందులో లైంగికసంబంధం గురించిన మాటలు రాయబడితే అభ్యంతరమేంటి? భార్యాభర్తలు లైంగికంగా ఒకరితో ఒకరు సంతృప్తి చెందేటప్పుడు వారిమధ్య ప్రేమ మరింతగా బలపడుతుంది. వారి సంబంధం బలంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం సంతోషంగా క్షేమంగా ఉంటుంది. ఇది తెలియచెయ్యడానికే సొలోమోను ఆ పుస్తకం రచించాడు, అందుకే దానిని ప్రేమకావ్యం అని పిలుస్తారు. బైబిల్ అనేది చిన్నవారి దగ్గరనుండి పెద్దవారివరకూ అందరికోసమూ రాయబడింది. ఉదాహరణకు, సామెతలు గ్రంథం చిన్నవారికీ యవ్వనస్తులకూ అవసరమైన బోధను చేస్తుంది. అలాగే పరమగీతాలు భార్యాభర్తల మధ్య ప్రేమను ప్రోత్సహిస్తుంది. దాని విషయంలో మతోన్మాదులు బురద చల్లడానికి ఏమీలేదు. పసిపిల్లల చేత పరమగీతాలు చదివించగలరా అంటే ఆ అవసరం మాకు లేదు, అది రాయబడింది భార్యాభర్తల కోసం. పసిపిల్లలకు వాటితో పనేంటి? వయసు వచ్చాక వారు కూడా చదువుతారు, భార్యతో/భర్తతో ఎంత అన్యోన్యంగా ఉండాలో నేర్చుకుంటారు. ఇంతకూ మీ హిందూ గ్రంథాలలో ఎన్ని గ్రంథాలు పసిపిల్లలు చదివేలా ఉన్నాయి, ప్రతీదానిలోనూ 18+ కంటెంట్‌ ఉంటుందిగా. ఉదాహరణకు, బ్రహ్మ పార్వతిని చూసి నేలపై వీర్యాన్ని కార్చుకోవడం, శివుడు ఆడవేషంలో ఉన్న విష్ణువును చూసి వీర్యాన్ని కార్చుకోవడం. 

13. యెహోవాకు ఇద్దరు భార్యలు (యెహెజ్కేలు 23)

హిందూ మతోన్మాదులు వారి దేవుళ్ళు ఇద్దరు ముగ్గురిని భార్యలుగా చేసుకున్న చరిత్రలనూ వారితో ఏకంగా సంవత్సరాలు సంవత్సరాలు ఆపకుండా సెక్స్ చేసిన కథలనూ చదివి "యెహోవా దేవుడు ఇశ్రాయేలు మరియు యూదా" దేశాల గురించి అలంకాప్రాయంగా చెబుతున్న మాటలను వక్రీకరించి ఆయనకు కూడా ఇద్దరు భార్యలు ఉన్నారని బురద చల్లుతుంటారు. ఒకసారి ఆ సందర్భం చూడండి -

యెహెజ్కేలు 23:2-4 నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన యిద్దరు స్త్రీలు కలరు. వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను కుమార్తెలను కనిరి ఒహొలాయను పేరు షోమ్రోనునకును, ఒహొలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి.

ఈ సందర్భంలో ఆ ఇద్దరు స్త్రీలు ఒకప్పుడు ఐగుప్తులో జారత్వం చేసారని, ఒక స్త్రీ షోమ్రోనుకు, మరో స్త్రీ యెరూషలేముకు చెందుతుందని స్పష్టంగా రాయబడింది. బైబిల్ చరిత్ర కొంచెంగా తెలిసినా సరే ఈమాటలు ఇశ్రాయేలువారి కోసమూ యూదావారి కోసమూ చెప్పబడుతున్నాయని అర్థమైపోతుంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు షోమ్రోను రాజధాని, యూదావారికి యెరుషలేము రాజధాని. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో ఒకే ఇశ్రాయేలు రాజ్యం అలా రెండుగా చీలిపోయింది. 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం నుండి బాగా చదువుకోండి. ఐగుప్తుదేశంలో జారత్వం చేసి తరువాత యెహోవా దేవుని ప్రజలుగా కనానులో ప్రవేశించింది ఇశ్రాయేలీయుల ప్రజలే.

యెహెజ్కేలు 20:18 వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితిని మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు, వారి పద్ధతులనుబట్టి ప్రవర్తింపకయు, వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయునుండుడి.

ఆమోసు 5:25 ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా? మీరు మీ దేవతయైన మోలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా.

ఈ వాక్యభాగాల ప్రకారం ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండగా చేసిన విగ్రహారాధనను యెహెజ్కేలు 23లో జారత్వంగా పోల్చడం జరిగింది. విగ్రహారాధన అనే పాపం యొక్క తీవ్రతను తెలియచెయ్యడానికే అలా జారత్వంగా (భర్తను విడిచి వేరేవారితో శయనించడంగా) పోల్చబడింది. ఆ క్రమంలో వాడబడిన పదజాలం కూడా ఆ పాపం పట్ల దేవుని‌కి ఎంత అసహ్యభావం ఉందో తెలియచెయ్యడానికే వాడబడింది. "యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి"

కాబట్టి ఒహొలా, ఒహొలీబా అంటే వారు అక్షరార్థంగా ఎవరో ఇద్దరు స్త్రీలు అని‌కాదు. రెండు రాజ్యాలు అని అర్థం. బైబిల్ దేవుడు తన ప్రజలపై తన అధికారాన్ని తెలియచెయ్యడానికి, ఆయనకు ఆ ప్రజలు లోబడియుండాలని బోధించడానికి అలా భర్తగా పోల్చుకోవడం లేఖనాలలో చాలా సాధారణం.

యెషయా 54:5 నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.

యేసుక్రీస్తు కూడా సంఘానికి అని కూడా ఇదే భావంలో చెప్పబడింది (ఎఫెసీ 5:23-27). మతోన్మాదులకు ఇవేం అవసరం లేదు, ఎలాగైనా బైబిల్ దేవుడు కూడా వారి దేవుళ్ళలాగా ఇద్దరు ముగ్గురు భార్యలను కలిగియున్నాడని, వారి దేవతల్లాగే ఆయన కూడా అపవిత్రమైన కార్యాలు చేసాడని అడ్డకోలుగా వాదించడమే వారి జీవితధ్యేయం. అందుకే ఈ కుట్రలన్నీ. మానవులను స్త్రీనిగానూ పురుషునిగానూ సృష్టించిందే ఆయన (ఆదికాండము 5:1,2). వారి మధ్యలో లైంగిక సంబంధాన్ని పెట్టి వారిని‌ ఫలించమని చెప్పిందే ఆయన (అదికాండము 2:24, ఆదికాండము 1:27,28). ఆయనకు మనలాగా భార్య అవసరం కానీ లైంగికవాంఛను తీర్చుకోవాలనే కోరికలు కానీ ఉండవు. మనకున్న బంధాలనూ కోరికలనూ దేవునికి ఆపాదించకూడదు. అవి కేవలం కల్పిత దేవుళ్ళ కథలకు మాత్రమే పరిమితం.

ఇది అర్థంకాని హిందూ మతోన్మాదులు చివరికి యేసుక్రీస్తు తల్లియైన మరియ పరిశుద్ధాత్మ మూలంగా గర్భవతియైనదానిని కూడా శారీరకసంబంధంతో ముడిపెడుతుంటారు. కానీ అక్కడ ఏమని రాయబడిందో చూడండి -

లూకా 1:35 దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; "సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును" గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.

మరియ గర్భవతియైంది, సర్వోన్నతుడైన పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకోవడం ద్వారా అని ఈ వాక్యభాగం స్పష్టంగా తెలియచేస్తుంది. పరిశుద్ధాత్ముడు తన శక్తితో చేసిన అద్భుతం ద్వారా అది జరుగుతుందని అర్థం. దానిని తీసుకుని మీ దేవుళ్ళు పరాయి పురుషుల భార్యలతో పెట్టుకున్న లైంగికసంబంధంతో ముడిపెడితే ఎలా? లేదా మీ కుంతీ సూర్యుడితో పడుకుని కర్ణుడ్ని కన్నదానితో పోల్చుకుంటే ఎలా?  ముందు సర్వోన్నతుడు అంటే అర్థం తెలుసుకోండి; బైబిల్ ప్రకారం సర్వోన్నతుడు అంటే దేవుడు. నేను పైన వివరించినట్టుగా ఆయనకు భార్యల అవసరం కానీ, లైంగికసంబంధం పెట్టుకోవాలనే కోరికలు కానీ ఉండవు. మీ దేవుళ్ళ చరిత్రలోని బురదను తీసుకువచ్చి మా దేవుడికి అంటించే ప్రయత్నాలు చెయ్యకండి. అది మీవల్ల కాదు. చరిత్రలో అలా ప్రయత్నించిన మీకంటే ఉన్మాదులు కాలగర్భంలో కలసిపోయారు.

14. లంగాలు ఎత్తి చూపిస్తానన్న బైబిల్ దేవుడు

యిర్మీయా 13:26‌ కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను.

హిందూ మతోన్మాదులు ఈ వాక్యభాగాన్ని చూపించి మీ బైబిల్ దేవుడు స్త్రీల లంగాలు ఎత్తి చూపిస్తాను అన్నాడంటూ హేళన చేస్తుంటారు. కానీ ఒకసారి ఈ సందర్భం చూడండి.

యిర్మీయా 13:25-27 నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నాచేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను. నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జారకార్యములను కామాతురతను నేనెరుగుదును; పొలములలోనున్న మెట్టలమీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి; "యెరూషలేమా", నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచుకొననొల్లవు; ఇక నెంత కాలము ఈలాగు జరుగును?

ఈ సందర్భం ప్రకారం ఆయన "కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తుచున్నాను" అంటున్న మాటలు ఎవరో కొందరు స్త్రీలను ఉద్దేశించి పలుకుతున్నవి కావు. ఆయన యెరూషలేము అనే పట్టణం (యూదా దేశం) గురించి ఇలా మాట్లాడుతున్నాడు. ఆ పట్టణం చేసిన హేయక్రియలను బట్టి ఆయన దానిని శత్రువుల చేతికి అప్పగించబోతున్నాడని అప్పుడు ఆ పట్టణానికి సిగ్గు కలుగబోతుందని వీటి భావం. శత్రువులు వచ్చి యెరూషలేము పట్టణంపై దాడి చేసి అందులో చెరపట్టబడినవారిని వివస్త్రలుగా తమ దేశానికి తీసుకుపోయేటప్పుడు అక్షరార్థంగానూ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ పట్టణానికి కలిగే అవమానాన్ని బట్టి అలంకారంగానూ ఈ మాటలు నెరవేరతాయి. ఉదాహరణకు ఈ మాటలు చూడండి.

యెషయా 20:4‌ ​అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశమునుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను పెద్దలను, దిగంబరులనుగాను చెప్పులు లేనివారినిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదులమీది వస్త్ర మును ఆయన తీసివేసి వారిని కొనిపోవును.

కాబట్టి అక్కడ దేవుడు పలుకుతున్నమాటలు యుద్ధానికి సంబంధించిన మాటలు. అది సరేకానీ "స్కంద పురాణం, ప్రధమసంపుటం, page n. 107" ప్రకారం మీ పార్వతిగారు ఏమి ఎత్తి చూపిస్తే  బ్రహ్మకు వీర్యస్ఖలనం అయ్యి నేలపై పడింది?

15. యేసుక్రీస్తు వ్యభిచారమందు పుట్టాడా?

యోహాను 8:41 మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా-

ఈ సందర్భంలో యూదులు యేసుక్రీస్తుతో "తమను తాము వ్యభిచారము వలన పుట్టినవారము కామని" ప్రస్తావించుకోవడాన్ని హిందూ మతోన్మాదులు వక్రీకరించి, అంటే వారు యేసుక్రీస్తు వ్యభిచారం‌ వల్ల పుట్టినవాడని ఆరోపిస్తున్నారని మాట్లాడుతుంటారు. కానీ యేసుక్రీస్తు యూదులలో ఎవరి కుమారుడిగా ఎంచబడ్డాడో చూడండి -

లూకా 3:23 యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను.

మత్తయి 13:55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా?

ఈ వాక్యభాగాల ప్రకారం యేసుక్రీస్తును యూదులంతా యోసేపు కుమారుడిగానే భావించారు. యేసుక్రీస్తును కొందరు మెస్సీయ కాదని అనుమానించడానికి కూడా కారణం అదే.

యోహాను 7:27‌ అయినను ఈయన ఎక్కడివాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చునప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుకొనిరి.

(గలిలీయలో పుట్టాడు అనుకుని ఆయన ఎక్కడివాడో మేము ఎరుగుదుము అనుకున్నారు, కానీ ఆయన పుట్టింది గలిలీయలో కాదు బెత్లెహేములో)

కాబట్టి యేసుక్రీస్తు వ్యభిచారం‌వల్ల పుట్టాడనే అభిప్రాయం యూదులలో ఎంతమాత్రమూ లేదు. వారు ఆయనతో "మేము వ్యభిచారము వలన పుట్టినవారము కాము" అని పలుకుతున్న మాటలు వారు అబ్రాహాముకూ శారాకూ పుట్టిన వాగ్దాన సంతానమని, హాగరుకు కానీ కెతూరాకు కానీ పుట్టిన సంతానం కాదని చెప్పడానికి వాడిన మాటలు.

యోహాను 8:39 అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రాహామనిరి.

ఒకవేళ యూదులు యేసుక్రీస్తు గురించే ఆ మాటలు అంటుంటే తమ గురించి చెప్పుకోవడం ఎందుకు, ఆయననే "నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినవాడవు" అనొచ్చుగా? ఇలా ఉంటుంది హిందూ మతోన్మాదుల కుయుక్తి. వారు యథార్థంగా యేసుక్రీస్తు పుట్టుకపై బురద చల్లలేరు కాబట్టి, వివరంగా ఉన్న మాటలను కూడా వక్రీకరించి ఏదోటి చెయ్యాలిగా మరి. వారి దేవుడైన శ్రీ కృష్ణుడు వారికి అదే నేర్పించాడు (అశ్వత్థామ).

మరియమ్మ గర్భవతియైంది పరిశుద్ధాత్మ శక్తి కారణంగా అని, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాక అపోస్తలులు పరిశుద్ధాత్మ ప్రేరణతో సువార్తలు రాసేవరకూ ఎవరికీ తెలియదు. మరియ గర్భవతిగా ఉన్నప్పుడే యోసేపు ఆమెను చేర్చుకున్నాడు. అప్పటి నుండి ఆమెకు పుట్టిన యేసుక్రీస్తు యోసేపు కుమారుడిగానే పెంచబడ్డాడు. ఆయన ఎక్కడ పుట్టాడో (బెత్లెహేము) తెలియని యూదులకు (గలిలీయ అనుకున్నారు) ఆయన ఎలా పుట్టాడో ఎలా తెలుస్తుంది? అపోస్తలలు ఆయన కన్యకకు పుట్టాడని సువార్తలు రాసాకే కొందరు యూదులు ఆయన పుట్టుకపై తప్పుడు ఆరోపణలు చెయ్యడం ప్రారంభించారు. అంతకుముందు వారందరూ ఆయనను యోసేపు కుమారుడిగానే భావించారు. ఆ కారణంగా చిన్నచూపు చూసారు. "ఇతడు వడ్లవాని కుమారుడు కాడా?"

హిందూ మతోన్మాదుల్లారా "మీ అయ్యప్ప స్వామి" సంగతేంటి? అతను ఎలా పుట్టాడో అతనికి "హరిహర పుత్రుడు" అనే పేరు ఎలా వచ్చిందో మీ సోది మాటల్లో కాకుండా మీ గ్రంథాల ఆధారంగా వివరించగలరా?

గమనిక: ఈ వ్యాసంలో నేను ప్రస్తావించిన హిందూమతోన్మాదులు, హిందువులు ఒకటి కాదు. సాధారణ హిందువులతో మాకు మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. కానీ మతోన్మాదంతో బైబిల్ పైనా బైబిల్ దేవునిపైనా అన్యాయంగా దాడిచేస్తున్నవారినే నేను హిందూమతోన్మాదులుగా ప్రస్తావించడం జరిగింది. బైబిల్ పై వారు చేస్తున్న అబద్ధపు ఆరోపణలకు సమాధానం ఇచ్చే క్రమంలో నేను హిందూ దేవతల గురించి కూడా ప్రస్తావించింది హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికో లేక మా గ్రంథంపై ఆరోపణలు చేస్తే మీ గ్రంథంపైనా ఆరోపణలు చేస్తామని బెదిరించడానికో కాదు. మా గ్రంథంలో మనుషులు పాపం చేసారు, మా దేవుడు వాటిని‌ ఖండించాడు. వాటివల్ల ఎవరూ ఆ పాపాలను ప్రామాణికంగా తీసుకునే అవకాశం లేదు. కానీ హిందూ గ్రంథాలలో దేవుళ్ళే ఘోరపాపాలు చేసారు, దీనివల్ల ఆ దేవుళ్ళను పూజించే ప్రజలు వాటిని అనుసరించే పరిస్థితి కలుగుతుంది. ఆవిధంగా ఆ దేవుళ్ళు పాటించిన సంస్కృతి మన సమాజానికి చాలా ప్రమాదకరం కాబట్టి, ఆ దేవుళ్ళ చరిత్ర గురించి తెలియనివారిని హెచ్చరించడానికే అలా చేసాను. ఇది హిందూ మతోన్మాదులకు కూడా చెంపపెట్టు లాంటిది. అయితే నేను హిందూ దేవుళ్ళ గురించి ప్రస్తావించిన మాటలను వారు విస్మరిస్తూ సంస్కృతంలో అక్కడ అలా లేదు, ఇక్కడ ఇలా లేదంటూ అబద్ధాలు చెబుతారని‌ నాకు బాగా తెలుసు. అలాగైతే వారు సంస్కృతంలో అక్కడ ఏముందో ఇక్కడ ఏముందో డిక్షనరీ ఆధారంగా చూపించాలి. అప్పుడు మాట్లాడదాం. ఎవరి మతగ్రంథంలోనైనా భాషను బట్టి కొన్ని పదాలు‌ మారిపోవచ్చు కానీ సందర్భం మారిపోదుగా? నేను హిందూ దేవుళ్ళ గురించి చూపించినవి పదాలు కావు, సందర్భాలు. ఒకవేళ ఎవరైనా నేను References మాత్రమే పెట్టాను, అక్కడున్న శ్లోకాలూ వాటి తాత్పర్యం పెట్టలేదు, అక్కడ నేను చెప్పినటువంటి భావం ఏమీలేదని తప్పించుకోవాలని చూస్తే ఆ Referencesలో ఏముందో వారి పుస్తకాల నుండి చూపించాలి. చదువరులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నేను కేవలం Referencesతోనే సరిపెట్టాను. మరీ అంత ఆశ్లీలంగా అసభ్యంగా ఉన్నవి చదవాలంటే ఎవరికైనా ఇబ్బందేకదా!

"హిందూ మతోన్మాదులు బైబిల్ పై చేస్తున్న మరికొన్ని ఆరోపణలకు సమాధానాలు"

 స్త్రీకి శీలపరీక్ష, బైబిల్ దేవుని వివక్షేనా?

బైబిల్ దేవునికి స్త్రీలపై వివక్ష వాస్తవమా లేక ఆరోపణా?

మోషే ధర్మశాస్త్రానికి‌ ముందు నైతిక ఆజ్ఞలు లేవా?

అంగవైకల్యం గలవారిపై బైబిల్ దేవుని వివక్ష వాస్తవమా?

ఇశ్రాయేలీయులు కనానీయులను సంహరించడం నేరమా? న్యాయమా?

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.