దుర్బోధలకు జవాబు

రచయిత: కె. నరసింహుడు

వాచ్‌మన్ నీ (1903–1972) చైనా దేశానికి చెందిన ఒక వాక్యోపదేశకుడు, 'లోకల్ చర్చ్ మూవ్మెంట్'(LCM) వ్యవస్థాపకుడు. ఆయన పేరుతో చెయ్యబడుతున్న రచనలను బట్టి కొన్ని శాఖలలో విస్తృతంగా గౌరవించబడుతున్నప్పటికీ వాటిలో బైబిల్ సత్యం నుండి వైదొలిగే ముఖ్యమైన సిద్ధాంతపరమైన లోపాలు ఉన్నాయి. కానీ చాలామంది విశ్వాసులు తెలియకుండానే లేఖనాల వెలుగులో జాగ్రత్తగా పరిశీలించకుండానే ఆ బోధనలను స్వీకరించారు. అలా పరిశీలించే అవకాశం కల్పించడం కోసమే ఈ చిరువ్యాసం ఉద్దేశించబడింది. ఇక్కడ ఉదాహరించబడిన అంశాలను ప్రార్థనాపూర్వకంగా పరిశీలించగలరు.

1. వీరు లేఖనం బోధించే త్రిత్వసిద్ధాంతం కాకుండా భిన్నమైన త్రిత్వాన్ని నమ్ముతున్నారు అని చెప్పడానికి వారి పుస్తకం నుండి మేము సేకరించిన మాటలు పరిశీలించండి:

"Erroneous Concepts of the Trinity. The traditional explanation of the Trinity is grossly inadequate and borders on tritheism. When the Spirit of God is joined with us, God is not left behind, nor does Christ remain on the throne. This is the impression Christianity gives. They think of the Father as one Person, sending the Son, another Person, to accomplish redemption, after which the Son sends the Spirit, yet another Person. The Spirit, in traditional thinking, comes into the believers, while the Father and Son are left on the throne. When believers pray, they are taught to bow before the Father and pray in the name of the Son. To split the Godhead into these separate Persons is not the revelation of the Bible, but the doctrine of the Nicene Creed that God is triune. If you have seen the Son, you have seen the Father because the Father is embodied in the Son to be seen among the believers. The Son is the embodiment and the expression of the Father"

ఈ మాటల ప్రకారం “తండ్రిలో పరిశుద్ధాత్మ మరియు కుమారుడు ఉన్నారు, కుమారునిలో తండ్రి మరియు పరిశుద్ధాత్మ ఉన్నారు, పరిశుద్ధాత్మలో తండ్రి మరియు కుమారుడు ఉన్నారు. ” కాబట్టి సిలువలో మరణించింది కుమారుడు మాత్రమే కాదు, తండ్రి మరియు పరిశుద్ధాత్మ ఆయనలో ఉండటాన్ని బట్టి త్రిత్వమై ఉన్న దేవుడు సిలువపై చనిపోయాడని వీరు బోధిస్తారు. దీనిని సమర్థించడానికి వీరు "తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి" (యోహాను 14:10,11) అనే వాక్యభాగాన్ని చూపిస్తారు.

వాస్తవానికి ఆ మాటలు తండ్రికీ ఆయనకూ మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తున్నాయే తప్ప అక్షరాలా ఒకరు ఇంకొకరిలో ఉన్నారని కాదు. ఎందుకంటే తర్వాత వచనాలలో ప్రభువు "నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు" (యోహాను 14:20) అని చెప్పడం మనం చూస్తాం. కాబట్టి కచ్చితంగా ఆ మాటలు తండ్రికీ ఆయనకూ మధ్య ఉన్న సంబంధం గురించే మాట్లాడుతున్నాయి తప్ప మరేమీ కాదు. "మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు" అనే మాటల విషయంలో కూడా వీరు దుర్బోధ చేస్తున్నారు. మనం ఆయనలో ఉండడం అంటే సంఘం దేవునిలో నాల్గవ వ్యక్తిగా మార్చబడిందని చెబుతూ మనుష్యుల్ని త్రియేక దేవునితో సమానం చేస్తారు. ఇది కేవలం ఒక భయంకరమైన దుర్బోధ మాత్రమే కాదు బాహాటమైన దైవ దూషణ.

వీరు కుమారుడు తండ్రిలో ఉన్నాడు అని చెప్పడానికి "నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు" (యోహాను 14:9) అనే వాక్యభాగాన్ని కూడా వక్రీకరిస్తారు.

దానికి సంబంధించిన ఆధారాలు ఈ లింక్ ద్వారా పరీక్షించండి: https://www.ministrybooks.org/books/reader.php?hid=R_kwXIbXisUISKORKVMOK4ZaId48u9tDIMve7bQYgvVG-OdA2LKci1PZyUNCUTWlF

Life study of John chapter 31

అయితే ఆ మాటల విషయంలో గమనించాల్సింది ఏంటంటే క్రీస్తులో దైవత్వపు సర్వ పరిపూర్ణత నివసిస్తుంది (కొలస్సీ 2:9) అనగా తండ్రిలో ఏ లక్షణాలైతే ఉన్నాయో అవే లక్షణాలు క్రీస్తులోనూ ఉన్నాయి. తండ్రిలో ఉన్న దైవత్వము అంతే సమానంగా కుమారునిలో కూడా ఉంది. కాబట్టి కుమారుణ్ణి చుస్తే తండ్రిని చూడటంతో సమానం.  అలా కాకుండా అక్షరాల కుమారునిలో నివసిస్తున్న తండ్రినే చూస్తున్నారు అని భావిస్తే "మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు" (1తిమోతి 6:16) అని రాయబడిన మాటలు అవాస్తవం ఔతాయి. ఒకవేళ వీరు వాదిస్తుందే నిజమైతే తండ్రి వరకే ఆగడం ఎందుకు క్రీస్తుని చూసినవారు పరిశుద్ధాత్మను కూడా చూసారని చెప్పుకోవచ్చు. అంతే కాదు మనయందు అయన ఉన్నాడని చెప్పాడు కాబట్టి మనల్ని కూడా చూసారని చెప్పుకోవచ్చు. ఇది ఎంత హాస్యాస్పదమో మీరే ఆలోచించండి.

వీరి త్రిత్వంలో ఉన్న మరొక గందరగోళం ఏంటంటే యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా మనలోనూ మన మధ్యను నివసిస్తున్నాడని చెబుతారు. దీనికి వీరు "ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్య్రమునుండును" (2 కొరింథీ 3:17) అనే వాక్యభాగాన్ని చూపిస్తారు.

దానికి ఆధారంగా 'దేవుని ప్రణాళిక', పేజీ నెంబర్ 14, 21 నుండి మేము తీసుకున్న మాటలు:

"ప్రభువే  ఆత్మ......" (II కొరింథీ. 3:17). పరిశుద్ధాత్ముడు క్రీస్తు నుండి వేరుగా ఉన్నవాడు కాడని ఈ వచనము నిరూపించుచున్నది. ప్రభువు అంటే స్వయంగా క్రీస్తే మరియు ఆయనే ఆత్మగా తెలుపబడుచున్నాడు. "కడపటి ఆదాము జీవమిచ్చు ఆత్మ ఆయెను" (I కొరింథీ. 15:45) కడపటి ఆదామైన క్రీస్తే ఆత్మయని లేఖనములు తిరిగి సూచించుచున్నవి. జీవమిచ్చు ఆత్మ అనగా పరిశుద్ధాత్మయేనని మనము అంగీకరించవలసియున్నది"

"ప్రభువు పునరుత్థానుడైన తరువాత, తన శిష్యుల యొద్దకు వచ్చి వారిపై ఊదెను (యోహాను 20:21,22). ఆ ఊపిరిని "పరిశుద్ధాత్మ" అని పిలిచెను, ఎందుకనగా ఆయనే పరిశుద్ధాత్మయైయున్నాడు. ఆయన నుండి వెలువడునదంతయు పరిశుద్ధాత్మయే అయ్యుండ వలెను. ఊపిరి అనునది జీవమునకు చెందినదనియు, జీవము కొరకైనదనియు మనమెరుగు దుము. ప్రభువు వారిలోనికి పరిశుద్ధాత్మను ఊదుట అనునది తన ఆత్మను వారిలోనికి పంపుటయైయుండెను. నాటి పునరుత్థాన దినమునుండియు శిష్యులందరును వారియందు జీవపు ఆత్మను పొందుకొనియుండిరి. అంతర్యపు జీవజలముల పానీయమును వారు పొందుకొనిరి"

"పరిశుద్ధాత్మయని మనము ఒప్పుకొనవలెను. అందుచేత, కుమారుడు తండ్రియని పిలువబడుచున్నాడు, మరియు ప్రభువైయున్న ఈ కుమారుడే, ఆత్మ కూడ అయ్యున్నాడు"

అయితే ఆ వాక్యభాగం పరిశుద్ధాత్మ యొక్క ప్రభుత్వాన్నీ అధికారాన్నీ సూచిస్తుందే తప్ప యేసు ప్రభువే పరిశుద్ధాత్మగా అయ్యాడనే ఆలోచన అక్కడ కానీ బైబిల్లో మరెక్కడా కానీ లేదు. ఒకవేళ ఉంటే, ఆయన,'నేనే పరిశుద్ధాత్మగా వస్తాను' అని చెప్పి ఉండేవాడు. 'వేరొక ఆదరణ కర్తను పంపిస్తాను' అని ఎందుకు చెబుతాడు? (యోహాను 14:16). ఈ విధంగా వీరు బైబిల్ బోధించే త్రిత్వ సిద్ధాంతాన్ని తృణీకరించి స్వంతగా కల్పించుకున్న వేరొక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. 

2. ఓ యేసుప్రభువా ఆమెన్ అని చెప్పడం:

"ప్రభువు నామాన్ని పిలుచుటకు గల మరొక కారణమేమనగా శ్రమలలోనుండి (కీర్తనలు. 18:6; 118:5), సమస్యలలో నుండి (కీర్తనలు. 50:15;86:7;81:7), విచారము మరియు బాధనుండి (కీర్త. 116 4) విడిపింపబడుట కొరకు. ప్రభువును పిలుచుటను వ్యతిరేకించి, వాదించేవారు, సమస్యలు లేదా రోగాలు వచ్చినప్పుడు ఆయనను పిలుచుటను తమంతటతామే కనుగొనిరి. మన జీవితములో సమస్యలు లేనప్పుడు, మనము ప్రభువును పిలుచుటను గూర్చి వ్యతిరేకించి వాదించేవారిమిగా ఉండవచ్చును. అయితే, సమస్యలు వచ్చినప్పుడు, ఆయనను పిలువమని మనకు ఎవరునూ చెప్పనవసరములేదు; మనము అప్రయత్నముగానే ఆయనను పిలిచెదము"

మా సమాధానం: మొరపెట్టడం అంటే ఇలా అందరూ సమూహంగా కానీ లేదా వ్యక్తిగతంగా కానీ అదే పేరుతో పదే పదే పిలవడం కాదు. వారు హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టారు. కాబట్టి మొర పెట్టడం అంటే ఒకే పేరును పదే పదే ఉచ్చరించడం కాదు, అలా భక్తులు పిలిచినట్టుగా వాక్యంలో ఏ ఆధారమూ లేదు. అందుకు భిన్నంగా ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని, అలా ఉచ్చరించినవారిని అయన నిర్దోషిగా యెంచడని వాక్యం హెచ్చరిస్తుంది.

భక్తులు యెహోవాకు మొరపెట్టారు అన్నప్పుడు వారు ప్రాముఖ్యంగా భారంతో బాధతో మరి ముఖ్యంగా ఏదైనా ఆపదలలో లేదా అత్యవసర పరిస్థితులలో ఉన్నప్పుడు అలా చేసారు. అంతే తప్ప ఓ యేసూ ప్రభువా ఆమెన్ అని ఎవరైనా అరిచినట్టు ఎలాంటి దాఖలాలూ లేవు.

3. ఇంకా శరీరంలో నుండి ఆత్మలోనికి ప్రవేశిస్తామని, అలా చేస్తేనే దేవునితో సంపర్కం సాధ్యమని, ఎందుకంటే దేవుడు ఆత్మయి ఉన్నాడని వీరు చెప్పుకుంటారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆత్మలో ఆరాధించాలి అన్నది వాస్తవమే. అయితే దాని అర్థం ముందుగా ఆత్మలో ప్రవేశిస్తేనే అలా చెయ్యగలం అని కాదు. అదే నిజమైతే ప్రభువు అలానే చెప్పి ఉండేవాడు. అలానే ప్రవేశించడానికి మార్గం కూడా స్పష్టంగా చెప్పి ఉండేవాడు. అలా చెప్పనిదాని విషయమై ఒక మానవ కల్పిత పద్దతిని పాటిస్తూ మేము మాత్రమే ఆత్మతో దేవుణ్ణి “తాకుతున్నాము” అని చెప్పుకోవడం ఆత్మవంచన ఔతుంది. ఇలాంటి మానవ కల్పిత పద్దతులు వ్యర్థమైన ఆరాధన అని ప్రభువే స్వయంగా చెప్పిన మాటలు చుడండి.

మత్తయి 15:9 - మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.

అయితే ఆత్మలో ఆరాధించడం అని ప్రభువు చెప్పిన మాటకు అర్ధం ఏంటి అనే ప్రశ్న మనకు రావచ్చు. ఏ స్థలంలో ఆరాధించాలి అని సమరయ స్త్రీ అడిగిన ప్రశ్నకు భౌతిక స్థలంతో నిమిత్తం లేకుండా ఎక్కడినుండైనా ఆరాధించుకోగలిగే ఆత్మీయ ఆధిక్యత ప్రభువులో కలుగబోతుంది అనే సత్యాన్ని అక్కడ ప్రభువు బయలుపర్చాడు. అంతే తప్ప అలా చెయ్యడానికి ఏదైనా ఒక ప్రత్యేక పద్ధతిని అవలంభించాలని సూచనప్రాయంగా కూడా చెప్పబడలేదు. 

4. "రక్షించబడుటకుగాను ప్రభువు నామాన్ని పిలుచుట అవసరము" అని వీరు బోధిస్తారు.

ఇలా పిలవడం ద్వారా రక్షణ కలుగుతుంది అని చెప్పే మరొక భయంకరమైన బోధ వీరిలో ఉంది.  దానిని సమర్థించడానికి "ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును" (రోమా 10:13) అనే వాక్యభాగం వీరు చూపిస్తారు. అయితే ఆ వచనంలో విశ్వాసంతో ఆయన నామంలో ప్రార్దన చేసినవాడు రక్షించబడతాడు అని ఉంది తప్ప పదే పదే ఆయన పేరును ఉచ్చరిస్తూ అరవమని కాదు. ఆ సందర్బమంతా చూస్తే సువార్త గురించి రాయబడింది తప్ప పిలవడం ద్వారా రక్షణ కలుగుతుంది అని కాదు. రక్షించబడే ఒక వ్యక్తి సువార్తికుని ద్వారా సువార్త వింటాడు. అలా వినడం ద్వారా అతనిలో విశ్వాసం కలుగుతుంది. అప్పుడు అతను హృదయంలో విశ్వసించి నోటితో యేసే ప్రభువు అని ఆయన ప్రభుత్వానికి లోబడతాడు. ఆయన నామంలో ప్రార్థన చేస్తాడు. అలా విశ్వాసం లేకుండా ఊరికే ఆయన్ని ప్రభువా ప్రభువా అని పిలిచేవారి గురించి వాక్యంలో ఇలా రాయబడిందిః

లూకా 6:46 - నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా , అని నన్ను పిలుచుట ఎందుకు?

మత్తయి 7:22 - ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.

5. రక్షణ పొందినవారిలో కొంతమంది మాత్రమే జయిస్తారని, జయించనివాళ్ళు 1000 సంవత్సరాలు శిక్ష అనుభవించి తర్వాత పరలోకం లోనికి ప్రవేశిస్తారని వీరు బోధిస్తారు (Life-study of Matthew Chapter 58). దానికి ఆధారంగా "అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను" (మత్తయి 22:13), "చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును" (ప్రకటన 2:7) అనే వాక్యభాగాలు చూపిస్తారు. ఒకవేళ వీరు చెప్పేదే నిజమైతే క్రీస్తు మనకొరకు సంపూర్ణంగా శిక్ష భరించలేదని, కొన్ని పాపాలను విశ్వాసులు తమంతట తామే వెయ్యేళ్ళ శిక్ష ద్వారా పరిహరించుకోవాలని వీరు బోధిస్తున్నారు. ఇది క్రీస్తు చేసిన సిలువ కార్యాన్ని అవమానించడమే.

ఈ బోధ క్రీస్తు రక్తం మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది అనే మాటలను (1 యోహాను 1:7) అర్థరహితం చేస్తుంది. ఇది బైబిల్ స్పష్టంగా బోధిస్తున్న రక్షణ సువార్తను తూలనాడి వేరొక సువార్తను ప్రకటించడం కాకపోతే మరేంటి. ఇది క్రీస్తులో ఉన్న మన నిశ్చయతను, నిరీక్షణను నిర్వీర్యం చేసే సాతాను కుట్ర కాకపోతే మరేంటి?

మేము మాత్రమే జయించేవారము అన్నది వీరికి ఉన్న ధీమా. ఓ యేసు ప్రభువు ఆమెన్ అని పదే పదే అరుస్తారు కాబట్టి వారు పాపాన్ని జయిస్తారని వారు చూపించే కారణం. అయితే ఇలా పాపాన్ని జయించి పరిపూర్ణతతో క్రియల ద్వారా జయించినవారిగా పరలోకంలో ప్రవేశిస్తారని వీరి నమ్మకం. కాని వాక్యమైతే మనం పాపం లేనివారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవారమని చెబుతుంది (1 యోహాను 1:8,10). వాక్యంలో విశ్వాసులందరూ విశ్వాసం ద్వారానే జయిస్తారని రాయబడి ఉంది (1 యోహాను 5:4) తప్ప క్రియల ద్వారా జయిస్తామని లేదా కొంతమందే జయిస్తారని ఎక్కడా లేదు. అయితే ఈ జీవితంలో పాపరాహిత్యాన్ని సంతరించుకోవడం ద్వారా కాదు, ప్రభువు రాకడలో అయన పోలికగా మార్చబడటం ద్వారా జయిస్తాము.

1 కొరింథీయులకు 15:54ఁ ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.

జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు అన్నది వాస్తవమే కాని విశ్వాసం ద్వారానే మరియు విశ్వాసులందరూ కచ్చితంగా ఈ లోకాన్ని జయిస్తారు.

1 యోహాను 5:4 - దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే

గమనిక: ఈ బోధలన్నీ వాచ్‌మన్ నీ గారి పేరుతో విట్నెస్ లీ అనే వ్యక్తి వ్యాపింపచేసాడు. వాచ్ మెన్ నీ గారు చైనాదేశంలో తన విశ్వాసం కొరకు ఎన్నో శ్రమలను అనుభవించి చివరికి హతస్సాక్షి అయ్యాడు. అలాంటి మంచిసాక్ష్యం కలిగిన వ్యక్తి ఇలాంటి దుర్బోధలు చేసుండకపోవచ్చును అనేది మా అభిప్రాయం. బహుశా విట్నెస్ లీ వంటి ఆయన అనుచరులే ఆయన పేరుతో ఇలాంటి దుర్బోధలను సంఘంలోకి ప్రవేశపెట్టియుండవచ్చు. అయితే దుర్బోధకుల్లో కూడా వారి విశ్వాసం కొరకు హతస్సాక్షులు అయినవారు లేకపోలేదు. ఉదాహరణకు జోసెఫ్ స్మిత్. అందుకే వాక్యవిరుద్ధంగా సంఘాన్ని కలవరపరిచేలా దుర్బోధలు ఎవరు చేస్తున్నా, ఎవరి పేరుతో చెయ్యబడుతున్నా వాటిని వివేచించడం, ఖండించడం మనందరి బాధ్యత. వ్యక్తులను కాకుండా వాక్యాన్ని వెంబడించే క్రీస్తు శిష్యులంతా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను.

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.