విమర్శలకు జవాబు

రచయిత: Marie Prasanth Perikala
చదవడానికి పట్టే సమయం: 29 నిమిషాలు

ఈ మధ్య SunilKumarTelugu అనే YouTube Channel లో ఒక వ్యక్తి, ఆదికాండము 46:26 వ వచనాన్ని ఉదాహరణగా చూపిస్తూ, బైబిల్ లో “పురుషాంగం” అనే పదం వాడటానికి బదులు “తొడ” అనే పదం వాడారనీ, అందువల్ల ప్రకటన గ్రంథం 19:16 వచనం ప్రకారం, యేసు క్రీస్తు తాను “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును” అని తన పురుషాంగం మీద వ్రాసుకున్నాడు అని, వాక్యాన్ని వక్రీకరించే ప్రయత్నం చేసినట్లుగా నా దృష్టికి వచ్చింది. (అతను మాట్లాడిన మాటలను క్రింద ఉన్న YouTube వీడియో లింక్ లో మీరు చూడొచ్చు). అతను చెప్పిన విషయాలు నిజమా కాదా అనే అంశంలోకి వెళ్లేముందు అసలు గ్రీకు భాష పట్ల అతనికి ఉన్న పరిజ్ఞానం ఏపాటిదో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని వక్రీకరించే ప్రయత్నం చేసిన సునీల్ కుమార్ అనే వ్యక్తి, గ్రీకు భాషలోని ఒక పదాన్ని చూపించి “Unpov” అని అన్నాడు. ఇక్కడ అతను గ్రీకు అక్షరాలను ఇంగ్లీషు అక్షరాల్లాగా చదువుతున్నాడు. అతను చూపించిన పదంలో మొత్తం అయిదు అక్షరాలు ఉన్నాయి. మొదటి అక్షరాన్ని “మీ (μ - mee)” అని అంటారు. కొంతమంది “ము” లేదా “మ్యు” అని కూడా అంటారు. ఇక రెండవ అక్షరాన్ని “ఈటా (η - EE-tah)” అని అంటారు. మూడవ అక్షరాన్ని “రో (ρ - roh)” అని అంటారు, నాలుగవ అక్షరాన్ని “ఒమీక్రోన్ (ο - OH-mee-kron)” అని అంటారు, అలాగే చివరి అక్షరాన్ని “నీ (ν - nee)” లేదా “ను” అని అంటారు. కాబట్టి ఈ పదాన్ని Unpov అని కాదు, “మేరోన్ (μηρὸν)” అని పలకాలి. కాబట్టి మిత్రులారా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్ధమయ్యేది ఏంటంటే, సునీల్ కుమార్ గారికి గ్రీకు భాషలో కనీసం ఏబీసీడీ లు కూడా రావు. అటువంటి వ్యక్తి Bible Translators ని తప్పు పట్టాలనుకోవడం, వాళ్ళేదో కావాలని మార్చి తప్పుగా తర్జుమా చేశారు అని ఆరోపించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

సరే ఇక సబ్జెక్టులోకి వెళితే, బైబిల్ లో మనకు అక్కడక్కడా Euphemism అనే ఒక కాన్సెప్ట్ కనిపిస్తుంది. Euphemism అంటే ఏంటంటే, మనం సాధారణంగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అనిపించే పదాలు లేదా కొంచెం అసౌకర్యంగా అనిపించే పదాలను పలకవలసి వచ్చినప్పుడు, మనం ఏమి చేస్తామంటే ఆ particular పదానికి బదులు వేరొక పదాన్ని వాడతాం. దానినే Euphemism అని అంటారు. ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, పలానా వ్యక్తి చనిపోయాడు అని అనడానికి బదులు మనం సాధారణంగా ఏమంటామంటే, పలానా వ్యక్తి ప్రభువునందు నిద్రించాడు అని అంటాం. లేకపోతే దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు అని అంటాం. లేదా మహిమా ప్రవేశం చేశాడు అని అంటాం. ఇది ఒక రకమైన Euphemism. అలాగే యూదులు “యెహోవా” అనే దేవుని పేరుని ఉచ్ఛరించరు. అందువల్ల వాళ్ళు బైబిల్ చదివేటప్పుడు యెహోవా అనే పదాన్ని పలకడానికి బదులు Adonai అని అంటారు. మొదటి శతాబ్ద కాలంలో అయితే యూదులు “ఎలోహీమ్” అనే పదాన్ని కూడా పలికేవారు కాదు. దాని బదులు “షమాయీమ్” అనే పదాన్ని వాడేవారు. అందువల్ల మనకు క్రొత్త నిబంధనలో చాలా చోట్ల Kingdom of Heaven - పరలోకరాజ్యం అనే పదం కనిపిస్తుంది. నిజానికి ఆ పదాన్ని మనం Kingdom of God - దేవుని రాజ్యం అని అర్ధం చేసుకోవాలి. Even నేటికీ కూడా కొంతమంది orthodox jews అయితే, ఎలోహీమ్ అనే పదాన్ని పలకడానికి బదులు ఎలోకీం అని అంటారు. ఇది మరొక రకమైన Euphemism. అదే విధంగా కొన్నిసార్లు కొన్ని పదాలను పలకాలంటే కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఆ సందర్భంలో కూడా మనం ఆయా పదాలకు బదులు వేరొక పదాలను వాడతాం. ఉదాహరణకు లేవీయకాండము 18:6 వచనంలో “మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు” అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ లో అయితే “to uncover his nakedness” అని ఉంటుంది. ఈ మాట మనకు బైబిల్ లో చాలా చోట్ల కనిపిస్తుంది. దీని అర్థం కేవలం వంటి మీది వస్త్రములను తీసి నగ్నంగా చూడకూడదు అని మాత్రమే కాదు. It is actually speaking about sexual intercourse. శారీరక లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు అనేది ఇక్కడ ఉన్న actual meaning. ఇది మరొక రకమైన Euphemism.

Thigh లేదా “తొడ” అనే పదాన్ని కూడా బైబిల్ లో కొన్ని చోట్ల Euphemism లో భాగంగా వాడారు. ఉదాహరణకు ఆదికాండము 24వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకునకు పెళ్లి చేయడం కోసం, తన స్వదేశమందున్న తన బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకునకు భార్యను తీసుకురమ్మని ఎలీయెజెరును పంపించే ముందు అతనితో ఒక ప్రమాణం చేయించుకుంటాడు. ఆ సందర్భంలో అబ్రహాము ఎలీయెజెరుతో “నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము” (ఆదికాండము 24:2) అని అంటాడు. “ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను” అని తొమ్మిదవ వచనంలో ఉంటుంది. ఇక్కడ తొడ అనే పదాన్ని Euphemism లో భాగంగా వాడారు అనే విషయాన్ని బైబిల్ పరిశోధకులందరూ కూడా అంగీకరిస్తారు. నిజానికి ఇక్కడ ఎలీయెజెరు అబ్రహాము యొక్క పురుషాంగము కింద చెయ్యి పెట్టి ప్రమాణము చేశాడు. 21వ శతాబ్దంలో ఆధునికంగా ఆలోచించే మనకు పురుషాంగము కింద చెయ్యి పెట్టి ప్రమాణము చేయడం ఏంటి అసహ్యంగా అని అనిపించొచ్చు. కానీ ప్రాచీన కాలంలో ఇది చాలా సాధారణమైన విషయం. దీని వెనుక ఉన్న ఆలోచనా విధానం ఏమిటో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ కాలంలో ఎవరైనా ప్రమాణం చేసేటప్పుడు సాధారణంగా ఏమి చేస్తారు? తమ తల మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తారు. లేదా కొంతమందైతే తమ గొంతు మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తారు. లేకపోతే తమ పిల్లల మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తారు. లేదా దేవతా విగ్రహాల మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తారు. లేదా తమ పవిత్ర గ్రంథాల మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న భావజాలం ఏంటంటే, నా జీవితంలో నేను దేనినైతే అత్యంత విలువైనదిగా భావిస్తానో, దేనికైతే అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానో, వాటి మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేసిన తరువాత ఒకవేళ నేను ఆ మాట తప్పినట్టయితే ఆ దేవుడు లేదా దేవతకు అపరాధం చేసిన వాడినవుతాను. ఆ దేవత ఆగ్రహానికి గురి అవుతాను. తగిన శిక్షకు పాత్రుడనవుతాను. లేదా నాకు ఇష్టమైన వ్యక్తుల మీద ప్రమాణం చేసి ఆ మాట తప్పినట్టయితే, ఆ వ్యక్తులకు నేను దూరమవుతాను. కాబట్టి నేను ఖచ్చితంగా నిజమే చెబుతాను అనే విషయాన్ని declare చేయడం కోసం మనం ఈ విధంగా చేస్తాం. ప్రాచీన కాలంలోని ప్రజలు తమ posterity అంటే తమ భావితరాలు, తమ వారసులు, తమ సంతానాన్ని చాలా విలువైనదిగా భావించేవారు. సంతానం కలగడానికి మూలం పురుషాంగము. అందువల్ల ప్రాచీన కాలంలోని ప్రజల ఆలోచనా విధానంలో పురుషాంగము మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేయడమంటే, all future generations of people - తమ భావితరాలు అందరి మీద ప్రమాణం చేయడమే. అబ్రహాము సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం జీవించినవాడు. అప్పటి Ancient Near Eastern and Middle Eastern cultures లో ఉన్న ఆచారాలను, అలాగే ఇక్కడ ఉన్న context ని కూడా ఒకసారి గమనించండి. అబ్రహాము తన వంశాభివృద్ధి కోసం ఇస్సాకునకు ఒక భార్యను వెతికే ప్రయత్నంలో ఉన్నాడు. అలాగే ఈ ప్రమాణం చేయడం ద్వారా ఎలీయెజెరు తన యజమాని కుటుంబం పట్ల తనకున్న విధేయతకు కట్టుబడి ఉంటాడు. కాబట్టి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే, it really makes sense what Abraham was doing and why he was doing so. Male sex organ మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేయడమనేది కేవలం అబ్రహాము జీవిస్తున్న సంస్కృతికి మాత్రమే పరిమితమయ్యింది కాదు. ఆ కాలంలో ఇది ప్రపంచమంతా ఉంది. ఉదాహరణకు ఇంగ్లీష్ లో testimony లేదా testify అనే పదాలనే తీసుకోండి. Testimony అంటే సాక్ష్యం. Testify అంటే సాక్ష్యమివ్వడం. ఒక సాక్షి తాను అంతా నిజమే చెబుతాను అని ప్రమాణం చేసి అప్పుడు తన సాక్ష్యాన్ని చెబుతాడు. ఈ రెండు పదాలకు సంబంధించిన మూల పదం ఏమిటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. Testis అనే లాటిన్ పదం నుండి ఈ రెండు పదాలు వచ్చాయి. లాటిన్ లో testis అంటే సాక్షి. ఈ పదానికి మరొక అర్ధం కూడా ఉంది. ఒకవేళ మీరు మీ హైస్కూల్ లో బయాలజీ సబ్జెక్ట్ ని ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఉండుంటే గనక ఇది మీకు బాగా తెలిసిన పదమే. Male reproductive cells ని produce చేసే అవయవాన్ని testis లేదా testicles అని అంటారు. పురుషాంగానికి సాక్షికి సాక్ష్యానికి ఏంటి సంబంధం? మన modern thinking ప్రకారం ఆలోచిస్తే ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రాచీన కాలంలోని ప్రజల ఆచారాల గురించి మనం తెలుసుకున్నప్పుడు వీటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో మనకు అర్ధం అవుతుంది. దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు అనే పుస్తకంలో తాపీ ధర్మారావుగారు ఒట్టు వేసుకోవడం గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, “పూర్వపు ఆచారం ఏమిటంటే, దేవతా విగ్రహం దగ్గరలో ఉంటే ఆ విగ్రహాన్ని ముట్టుకుంటూ చెప్పడం - అలాగే దేవతా విగ్రహం దగ్గరగా లేకపోతేనో? దేవతా మహత్వం కలిగి, అన్నివిధాలూ అర్చనలనూ, పూజలనూ పొందుతూ వుండే స్త్రీ పురుష గోప్యాంగాలున్నాయి కదా, వాటిని ముట్టుకుంటూ మనుష్యులు ఈ ఒట్టులు పెట్టుకునేవారు. కొన్ని ఆ కాలపు దేవతా చిత్రాలలో మనుష్యులు తమ గోప్యాంగం పట్టుకుంటూ ప్రమాణం చేసినట్లు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇలాంటి చిత్రాలు కొన్ని అక్కడక్కడ, కొన్ని మ్యూజియములలోనూ పురాతన పుస్తకాలలోనూ ఇప్పటికీ చూడవచ్చును. తరువాత తరువాత, కొంచెం నాజూకుతనం కలిగినప్పుడు పబ్లిక్ న్యాయస్థానాలలోనూ, సభ్యుల సమాజములోనూ ఈ పని చేయడానికి కొంచెం సంకోచించారు. దీనికి బదులుగా, 'చేయి తొడ కిందపెట్టి' ప్రమాణం చేయడం వాడుక లోనికి వచ్చింది.”

So, ఇదంతా విన్న తరువాత మీకు ఒక సందేహం రావొచ్చు. సునీల్ కుమార్ గారు చెప్పింది బహుశా నిజమేనేమో అనే భావన మీలో కలగొచ్చు. కానీ ఆయన చెప్పింది నూటికి నూరు శాతం అబద్ధం. Yes ofcourse, బైబిల్ లో కొన్ని చోట్ల పురుషాంగం అనే పదం వాడటానికి బదులు తొడ అనే పదాన్ని వాడారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అది అనువాద లోపం కూడా కాదు. మూలభాషలోనే ఆ విధంగా వాడారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే తొడ అనే పదం వాడిన ప్రతిసారీ కూడా మనం దానిని పురుషాంగం అనే అర్థం చేసుకోవాలి అనే నియమం ఏమీ లేదు. కొన్ని సార్లు తొడ అంటే తొడ అనే అర్ధమే వస్తుంది. It all depends on the context. కానీ మన సునీల్ కుమార్ గారి లాగా బైబిల్ ని వక్రీకరించే వారు మాత్రం context తో అసలు ఏమాత్రం సంబంధం లేకుండా తొడ అనే పదానికి ప్రతిసారీ కూడా పురుషాంగం అనే అర్ధమే వస్తుంది అని వాదిస్తారు. ఇప్పుడు automatic గా next వచ్చే ప్రశ్న ఏంటంటే, సునీల్ కుమార్ గారు చెప్పింది తప్పు అని ఎందుకు అనుకోవాలి? ప్రకటన గ్రంథంలో ఆ పదానికి తొడ అనే అర్థమే వస్తుంది అని అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అసలు ఈ విధమైన వర్ణన ఆ వాక్యభాగంలో ఎందుకుంది? దీని వెనుక ఉన్న background and context ఏంటి? ఈ విషయాలన్నిటిని ఇప్పుడు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం.

ప్రకటన గ్రంథం 19:11-16 వచనం వరకు చూసినట్లయితే, అక్కడ పరలోకము తెరువబడింది. ఆ దర్శనంలో ఒక వ్యక్తి ఒక తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ ఉన్నాడు. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములు ఉన్నాయి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు. పరలోకమందున్న సేనలు తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచున్నారు. ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో జనములను ఏలును. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు. కానీ, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.

ఈ వాక్యభాగంలో మనకు కనిపిస్తున్న వర్ణనలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో అప్పటికే యేసు క్రీస్తును ఉద్దేశించి చెప్పడం జరిగింది. రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అనే వర్ణన కూడా అప్పటికే 17:14 వచనంలో అజేయుడైన దేవుని గొఱ్ఱెపిల్ల అని యేసు క్రీస్తును గురించి చెబుతూ వర్ణించడం జరిగింది. కాబట్టి ఆ తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తున్న వ్యక్తి నిస్సందేహంగా యేసు క్రీస్తే. అయితే క్రొత్త నిబంధనలో మరెక్కడా కూడా కనపడని ఒక ప్రత్యేకమైన వర్ణన మనకు ఈ వాక్యభాగంలో కనిపిస్తుంది. ఆ వర్ణన ఏంటంటే “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడి ఉండటం”. తొడ మీద వ్రాయబడి ఉంది అనే వర్ణన మనకు బైబిల్ లో ఇంకెక్కడా కూడా కనిపించదు. చాలా మంది బైబిల్ వ్యాఖ్యాతలకు అలాగే బైబిల్ పరిశోధకులకు కూడా ఈ వాక్యం ఒక puzzle లాగా మిగిలిపోయింది. సరైన సమాచారం కానీ సరైన ఆధారాలు కానీ లేకపోవడంతో చాలా మంది చాలా theories ని కూడా propose చేశారు. కొంతమంది ఏమన్నారంటే, ఆదికాండము 46:26 వ వచనాన్ని ఉదహరిస్తూ ఇక్కడ “తొడ” అనే పదాన్ని literal గా తీసుకోకూడదు కానీ, ఇది allegorical గా “posterity of Jesus” అంటే యేసు క్రీస్తు నుండి ఉద్భవించిన క్రైస్తవ సంఘాన్ని సూచిస్తుంది అని కొంతమంది ప్రతిపాదించారు. కొంతమంది ఏమన్నారంటే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనే నామము, ఆయన తొడమీద కాదు కానీ, ఆయన తొడ పైన ఉన్న వస్త్రముమీద మాత్రమే వ్రాయబడి ఉంది అని ఇంకొంతమంది ప్రతిపాదించారు. ఇంకొంతమంది ఏమన్నారంటే, సాధారణంగా యుద్ధం చేసే సైనికులు తమ ఖడ్గాన్ని ఒక ఒరలో ఉంచి, ఆ ఒరను నడుముకు కట్టుకుంటారు. అప్పుడు ఆ ఖడ్గం వారి తొడను ఆనుకునే ఉంటుంది. కాబట్టి ఇక్కడ తొడ అనే పదం ఖడ్గాన్ని సూచిస్తుంది అని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు. ఈ విధంగా వాదించేవారందరూ కూడా ఇక్కడ తొడ అనే పదాన్ని literal గా తీసుకోకూడదు కానీ దీనిని allegorical గా మాత్రమే తీసుకోవాలి అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నవారు.

అయితే దీనికి భిన్నంగా ఇక్కడ తొడ అనే పదాన్ని allegorical గా కాదు కానీ దీనిని literal గానే తీసుకోవాలి అని ప్రతిపాదించేవారు కూడా ఉన్నారు. German Theologian and New Testament scholar కూడా అయిన Ernst Lohmeyer గారి అభిప్రాయం ప్రకారం ఐగుప్తీయుల ఆచారాలలో తొడ మీద royal names ని inscribe చేసే ఒక ఆచారం ఉంది. అలాగే English Biblical Scholar అయిన Henry Barclay Swete గారు ఏమంటారంటే, ఎఫెసీ పట్టణంలో గుర్రం మీద స్వారీ చేస్తున్న ఒక వ్యక్తి విగ్రహం ఉంది. ఆ విగ్రహం మీద అతని తొడ మీద ఒక inscription ఉంది. అలాగే Italian New Testament scholar అయిన Edmondo F. Lupieri గారు ఏమంటారంటే Hellenistic culture లో అంటే గ్రీకు సంస్కృతిలో విగ్రహాల మీద “thigh inscriptions” అనేవి ఉండేవి. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ వర్ణన కూడా బహుశా ఇటువంటిదే అయ్యుండొచ్చు అనేది వీరి అభిప్రాయం. అంటే ఇక్కడ తొడ అనే పదాన్ని allegorical గా కాదు కానీ దీనిని literal గానే తీసుకోవాలి అనేది వీరి ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు బలాన్ని చేకూరుస్తూ American New Testament scholar అయిన James R. Edwards గారు కొన్ని epigraphical evidences ఆధారంగా “The Rider on the White Horse, the Thigh Inscription, and Apollo” అనే పేరుతో ఒక చక్కటి వ్యాసాన్ని Journal of Biblical Literature లో publish చేశారు. James Edwards గారు సేకరించిన ఆధారాలను నేను ఈ రోజు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.

James Edwards గారు సేకరించిన ఆధారాలలో మొదటిది “Miletus Statue”. Miletus అనేది ప్రాచీన గ్రీకు నగరాలలో ఒకటి. ఇది ప్రస్తుతం టర్కీ దేశంలో ఉంది. ఈ పట్టణంలో ఉన్న మ్యూజియంలో గ్రీకు దేవుడైన “అపోలో” కి సంబంధించిన పాలరాతి విగ్రహం ఒకటి ఉంది. ఇది క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దానికి చెందిన విగ్రహం. ఈ విగ్రహంలో కొంత భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా కేవలం ఛాతీ భాగం నుండి మోకాళ్ల వరకు ఉన్న భాగం మాత్రమే మిగిలింది. ఈ విగ్రహంలో అపోలో యొక్క ఎడమ తొడ మీద కొన్ని వాక్యాలు చెక్కబడి ఉండటాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఏమి రాసి ఉంది అనేది మనకు పూర్తిగా తెలీదు. ఎందుకంటే ఈ విగ్రహం యొక్క ఎడమ తొడ భాగం సగానికి విరిగిపోయి ఉంది. అందువల్ల ఇక్కడ రాసి ఉన్నదాంట్లో కేవలం సగం మాత్రమే మనకు కనిపిస్తుంది. దీని మీద పరిశోధనలు చేసిన పరిశోధకులు కనుగొన్న దేమిటంటే, ఎవరో ఒక భక్తుడు, అపోలో కి తన మొక్కు చెల్లించుకుంటూ కానుకలు సమర్పించుకున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని దానంగా ఇచ్చాడు. ఇక్కడ చెక్కబడిన వాక్యం మనకు పూర్తిగా లభించి ఉండి ఉంటే బహుశా ఆ భక్తుడి పేరు మొదలైన వివరాలు కూడా తెలిసి ఉండేవేమో.

Miletus Statue

James Edwards గారు సేకరించిన ఆధారాలలో రెండవది “Claros Statue”. Miletus నగరానికి ఉత్తరాన సుమారు యాభై మైళ్ళ దూరంలో ఈ Claros అనే పట్టణం ఉంది. ఇక్కడ సుమారు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దానికి చెందిన పాలరాతి విగ్రహం ఒకటి లభించింది. ఇది కూడా గ్రీకు దేవుడైన అపోలో కి సంబంధించిన విగ్రహమే. ఈ విగ్రహం కూడా కొంత భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా కేవలం ఉదర భాగం నుండి మోకాళ్ల వరకు ఉన్న భాగం మాత్రమే మిగిలింది. ఈ విగ్రహంలో కూడా అపోలో యొక్క ఎడమ తొడ మీదే కొన్ని వాక్యాలు చెక్కబడి ఉన్నాయి. Miletus నగరంలో లభించిన విగ్రహంలా కాకుండా Claros లో లభించిన ఈ విగ్రహం యొక్క తొడ భాగం పూర్తిగా భద్రపరచబడింది. అందువల్ల ఈ విగ్రహం మీద ఉన్న శాసనాన్ని పరిశోధకులు పూర్తిగా చదవగలిగారు. దీని మీద ఏమి రాసి ఉందంటే, “Theodorus కుమారుడైన Timonax అనే వ్యక్తి అపోలో కు మొట్టమొదటిసారిగా బలి అర్పించాడు” అని ఉంది. బహుశా ఇది priestly offering కి సంబంధించి అయ్యుండొచ్చు.

Claros Statue

James Edwards గారు సేకరించిన ఆధారాలలో మూడవది “Mantiklos Statue”. ఈ విగ్రహం ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న Museum of fine arts లో ఉంది. సుమారు క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన ఈ కాంస్య విగ్రహాన్ని 1890లలో గ్రీసు దేశంలోని Thebes అనే పట్టణంలో కనుగొన్నారు. ఇంతకుముందు మనం చూసిన రెండు విగ్రహాల లాగా కాకుండా ఈ విగ్రహానికి రెండు తొడల మీద కూడా శాసనం చెక్కబడి ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ విగ్రహం మీద ఏమి రాసి ఉందంటే, “వెండి ధనస్సును ధరించిన విలుకాడికి అర్పిస్తూ, Mantiklos అనే వ్యక్తి నాకు దానం చేశాడు, కాబట్టి ఓ తేజోమయుడా ఇతనికి ప్రతిఫలాన్ని ఇవ్వు” అని రాసి ఉంది. ఇక్కడ “వెండి ధనస్సును ధరించిన విలుకాడు” అంటే “Archer of the silver bow”, అలాగే “తేజోమయుడు” లేదా “the Bright One”, గ్రీకు భాషలో అయితే “Phoebus (Φοῖβος)” అని అంటారు. ఇవి రెండూ కూడా గ్రీకు దేవుడైన అపోలో కి ఉన్న టైటిల్స్. అంటే ఇక్కడ “Archer of the silver bow” అలాగే “Phoebus (Φοῖβος)” - ఇవి రెండూ కూడా అపోలో ని ఉద్దేశించి వాడిన పదాలే. అంటే ఈ విగ్రహం కూడా అపోలో కి సంబంధించిందే.

Mantiklos Statue

ఇవి కాకుండా మరికొన్ని literary evidences కూడా ఉన్నాయి. క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో రోమా సామ్రాజ్యంలోని Sicily అనే ప్రాంతానికి Gaius Verres అనే వ్యక్తి magistrate గా వ్యవహరించేవాడు. అతను చాలా అవినీతికి దోపిడీకి పాల్పడినట్లు అతని మీద అనేకమైన నేరారోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల పైన విచారణ జరుగుతన్న సమయంలో అప్పటి రోమా రాజనీతిజ్ఞుడు న్యాయవాది అయిన Cicero అనే వ్యక్తి, Verres మీద చేసిన ఆరోపణల్లో ఒక ఆరోపణ ఏంటంటే, Agrigentum లోని Aesculapius దేవాలయంలో, తొడ మీద చిన్న వెండి అక్షరాలతో Myron అనే పేరు చెక్కబడినటువంటి అందమైన అపోలో విగ్రహాన్ని కూడా ఇతను దొంగతనం చేశాడు అని. ఇంతకుముందు మనం చూసిన మూడు విగ్రహాల్లాగానే, ఇక్కడ Cicero ప్రస్తావించిన విగ్రహానికి కూడా తొడ మీద inscription అనేది ఉంది.

కాబట్టి James Edwards గారు ఏమంటారంటే, ప్రకటన గ్రంథం 19:16వ వచనంలో ఉన్న ఈ “Thigh Inscription” ఏదైతే ఉందో, అది ఎదో యాదృచ్ఛికంగా వారి cultural context తో సంబంధం లేకుండా ప్రస్తావించబడిన అంశం అయితే కాదు. మొదటి శతాబ్దకాలంలో ఆసియ ప్రాంతంలో “Apollo cult” అనేది చాలా ప్రబలంగా ఉండేది. (ఆసియ అంటే ఇప్పుడున్న ఆసియ ఖండం కాదండి. ప్రస్తుతం టర్కీ దేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మొదటి శతాబ్ద కాలంలో ఆసియ అని పిలిచేవారు.) యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని ముఖ్యంగా ఆసియలో ఉన్న ఏడు సంఘాలను ఉద్దేశించి వ్రాయడం జరిగింది. మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో “యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది” అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ యోహాను తాను ఎవరికైతే వ్రాస్తున్నాడో, వారికి బాగా తెలిసిన ఒక metaphor ని తీసుకుని యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించిన graphic narrative ని వారి కాళ్లకు కట్టినట్లు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. అంత్య క్రీస్తును మహా వేశ్యతో పోలుస్తూ వర్ణించడాన్ని మనం 17వ అధ్యాయంలో చూస్తాం. ఈ మహావేశ్య యొక్క నుదుటి మీద దాని పేరు వ్రాయబడి ఉంది అని 5వ వచనంలో ఉంటుంది. “మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను” అనే పేరు దాని నొసట మీద వ్రాయబడి ఉంది. దీనికి కౌంటర్ గానే 19వ అధ్యాయం 16వ వచనంలో అజేయుడైన యేసు క్రీస్తు యొక్క తొడమీద “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము” వ్రాయబడియున్నది. నుదుటి మీద వ్రాయబడి ఉండటం అనేది చాలా సాధారణమైన విషయం. కానీ ఇక్కడ తొడ మీద వ్రాయబడి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యుద్ధ వీరుడి ఖడ్గం వ్రేలాడే ప్రదేశం అదే. “మహావేశ్య పదిమంది రాజులతో కలిసి గొఱ్ఱపిల్లతో యుద్ధము చేస్తుంది. కానీ గొఱ్ఱపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును అయినందున ఆ రాజులను జయిస్తాడు” అని 17వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఇదే పేరు 19:16వ వచనంలో గుర్రం మీద స్వారీ చేస్తున్న యేసు క్రీస్తు తొడ మీద ఉంది. “రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు” అనే పేరు మెస్సయ్యకు ఇవ్వబడిన ultimate epithet. ఎందుకంటే రాజులు ప్రభువులు దేవుళ్ళు అందరినీ కూడా పరిపాలించేవాడిగా యేసు క్రీస్తుకు ఉన్న అధికారాన్ని, ఆయనకున్న అసలైన గుర్తింపును ఈ పేరు తెలియజేస్తుంది. He was properly glorified with this title. మొదటి రాకడలో గొఱ్ఱపిల్ల వలే వచ్చిన యేసు క్రీస్తు రెండవ రాకడలో మాత్రం సమస్త జాతులు దేశాలు ప్రజలందరి మీదా కూడా తనకున్న సార్వభౌమత్వాన్ని నెరవేర్చుకోవడం కోసం అజేయుడైన యుద్ధ వీరుడి వలే వస్తాడు అనే సందేశాన్ని ఆసియలోని ఏడు సంఘాలవారికి స్పష్టంగా తెలియజేసే ఉద్దేశంతోనే యోహాను భక్తుడు ఇక్కడ “Thigh Inscription” అనే metaphor ని ఉపయోగించాడు.

ఇక సునీల్ కుమార్ గారు చేసిన interpretation విషయానికి వస్తే ఆయన చెప్పింది నూటికి నూరు శాతం తప్పు. ప్రకటన గ్రంథం 19:16వ వచనంలో తొడ అనే పదం Euphemism లో భాగంగా వాడినది కాదు. ఇక్కడ తొడ అంటే తొడ అనే అర్ధమే వస్తుంది అని అనడానికి మన దగ్గర epigraphical and literary evidences చాలానే ఉన్నాయి. బైబిల్ ని చదివేటప్పుడు both literary context అలాగే cultural context - ఈ రెండిటి మీద కూడా సరైన అవగాహన అనేది తప్పనిసరిగా ఉండాలి. రెండు మూడు వేల సంవత్సరాల క్రితం రాసిన విషయాలను చదివేటప్పుడు మన modern thinking ని apply చేసి చదవాలి అనుకుంటే మాత్రం that is not the right approach.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.