Samaritan Pentateuch ని Samaritan Torah అని కూడా అంటారు. ఇందులో కేవలం మోషే రాసిన పంచకాండాలే ఉంటాయి. కేవలం ఆ అయిదు పుస్తకాలు మాత్రమే దేవుని వాక్యం అని సమరయులు నమ్ముతారు. ఈ సమరయులు కూడా ఇశ్రాయేలీయులే. నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేసి కొంతమంది యూదులను తన చెరలోనికి తీసుకుని వెళ్లాడు. ఇది అందరికీ తెలిసిందే. అయితే అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ చెరలోకి వెళ్ళలేదు. కొంతమంది ఇశ్రాయేలు దేశంలోనే జీవించారు. వీరే తరువాతి కాలంలో సమరయులు అని పిలువబడ్డారు. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన యూదులు వీరితో కలవడానికి ఇష్టపడలేదు. సమరయులు అన్యులతో కలిసిపోయారని కాబట్టి వాళ్ళు తమతో సమానమైన వారు కాదనీ, మొదలయిన కారణాలు చెప్పి యూదులు సమరయులను దూరం పెట్టారు. వీరు సమరయ అనే ప్రదేశంలో జీవించేవారు కాబట్టి వీళ్ళను సమరయులు అని పిలిచేవారు. సమరయులకి మరియు మిగతా యూదులకి మధ్య theological గా కొన్ని విభేదాలు ఉన్నాయి. అందుకని సమరయులు ఏమి చేశారంటే క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో అప్పటికి అందుబాటులో ఉన్న హీబ్రూ లేఖనాలను తీసుకుని వాళ్లకి అనుకూలంగా కొన్ని మార్పులు చేసుకున్నారు. అయితే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిన మార్పులను మనం తేలికగానే గుర్తించవచ్చు. ఉదాహరణకు యూదులు యెరూషలేము దేవాలయములో దేవుడిని ఆరాధిస్తూ ఉంటే, సమరయులు Mount Gerizim అనే పర్వతం మీద ఒక దేవాలయాన్ని నిర్మించుకుని అక్కడ దేవుడిని ఆరాధిస్తూ ఉండేవారు. కాబట్టి దాన్ని సమర్ధించుకోవడానికి వాళ్ళు ఏమి చేశారంటే, "మీరు కనాను దేశంలోకి ప్రవేశించినప్పుడు Gerizim అనే పర్వతం మీద ఒక బలిపీఠాన్ని నిర్మించాలి" అని దేవుడు ఆదేశించినట్లుగా వాళ్లంతట వాళ్ళే ఒక ఆజ్ఞను రాసుకుని, దానిని పది ఆజ్ఞల్లో కలిపేశారు. నిర్గమకాండం ఇరవయ్యో అధ్యాయం పదిహేడవ వచనాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ మీరు Masoretic Text లో ఉన్న వాక్యాన్ని, అలాగే దాని కింద Samaritan Pentateuch లో ఉన్న వాక్యాన్ని కూడా చూడొచ్చు.
Masoretic Text:
"You shall not covet your neighbor's house; you shall not covet your neighbor's wife, nor his male servant, nor his female servant, nor his ox, nor his donkey, nor anything that is your neighbor's." (Exodus 20:17)
Samaritan Pentateuch:
Thou shalt not covet thy neighbour's house, and not thou shalt not covet thy neighbour's wife, nor his field, nor his manservant, nor his maidservant, nor his ox, nor his ass, nor any thing that is thy neighbour's. And when it so happens that LORD God brings you to the land of Caanan, which you are coming to posses, you shall set-up there for you great stones and plaster them with plaster and you write on the stones all words of this law. And it becomes for you that across the Jordan you shall raise these stones, which I command you today, in mountain Grizim. And you build there the altar to the LORD God of you. Altar of stones. Not you shall wave on them iron. With whole stones you shall build the altar to LORD God of you. And you bring on it ascend offerings to LORD God of you, and you sacrifice peace offerings, and you eat there and you rejoice before the face of the LORD God of you. The mountain this is across the Jordan behind the way of the rising of the sun, in the land of Caanan who is dwelling in the desert before the Galgal, beside Alvin-Mara, before Sechem. (Exodus 20:17)
Masoretic Text లో ఏముంటుందంటే, "నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు" అని దేవుడు చెబుతాడు, దానితో పది ఆజ్ఞలు అయిపోతాయి. కానీ Samaritan Pentateuch లో దీనికి కొనసాగింపుగా "దేవుడైన యెహోవా మిమ్మల్ని కనాను దేశంలోకి తీసుకువెళ్లిన తరువాత అక్కడ Gerizim అనే పర్వతం మీద ఇనుము వాడకుండా కేవలం రాళ్లతో ఒక బలిపీఠాన్ని నిర్మించి, ఆ రాళ్ళ మీద ఈ ఆజ్ఞలన్నిటిని రాయాలి" అని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా రాసుకున్నారు. ఇలాంటివి Samaritan Pentateuch లో చాలా కనిపిస్తాయి.
ఈ Gerizim అనే పర్వతం షెకెము అనే పట్టణ పరిసరప్రాంతంలో ఉంటుంది. ఆదికాండము 12వ అధ్యాయంలో ఉన్న వివరాల ప్రకారం అబ్రాహాము హారాను నుండి బయలుదేరి కనాను దేశానికి వచ్చినప్పుడు అతను మొట్టమొదటిగా షెకెము అనే ప్రాంతానికే చేరుకుంటాడు. అక్కడ యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు.
అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారముచేసి మోరే దగ్గరనున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయినీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. (ఆదికాండము 12:6-7)
అలాగే ఆదికాండము 33వ అధ్యాయం ప్రకారం యాకోబు కూడా షెకెములో ఒక బలిపీఠాన్ని కట్టి దానికి "ఎల్ ఎలోహే ఇశ్రాయేల్" అని పేరు పెట్టాడు.
అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. (ఆదికాండము 33:18-20)
అందువలన ప్రాచీన కాలంలో షెకెము అనే ప్రాంతానికి చాలా ప్రాధాన్యం ఉండేది. యాకోబు బావి కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ బావి దగ్గర యేసు క్రీస్తు ఒక సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భాన్ని మనం యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో చూస్తాం. వాళ్లిద్దరి మాటల మధ్యలో ఆ సమరయ స్త్రీ ఇలా అంటుంది,
"మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతారు కదా" అని ఆమె యేసు క్రీస్తుని ప్రశ్నిస్తుంది (యోహాను సువార్త 4:20). Gerizim అనే పర్వతాన్ని ఉద్దేశించే ఆ సమరయ స్త్రీ యేసు క్రీస్తుతో అలా మాట్లాడింది.
Samaritan Pentateuch కి సంబంధించి ప్రస్తుతం మనకి సుమారు 150 manuscripts అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం లేదా ఆ తరువాత కాలానికి సంబంధించినవే. అందులోనూ చాలా వరకు పదిహేనవ శతాబ్దంలో రాసినవే. Damascus కి చెందిన కొంతమంది సమరయుల ఆధీనంలో ఉన్న కొన్ని Samaritan Pentateuch manuscripts పదిహేడవ శతాబ్దంలో యూరోప్ చేరుకోవడంతో వాటిని Biblical Scholars పరిశీలించడం మొదలుపెట్టారు. దానితో సమరయులు తమ సిద్ధాంతాలకు అనుగుణంగా కొన్ని చోట్ల లేఖనాలను ఉద్దేశపూర్వకంగా మార్చినట్లు స్పష్టంగా అర్ధమయ్యింది. Masoretic Text తో పోలిస్తే Samaritan Pentateuch లో దాదాపుగా ఆరు వేల వ్యత్యాసాలు ఉండటంతో, వీటన్నిటినీ కూడా సమరయులు ఉద్దేశపూర్వకంగానే మార్చి ఉండి ఉంటారనీ, చాలా మార్పులకు గురయ్యింది కాబట్టి Samaritan Pentateuch ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ, Samaritan Pentateuch తో మనకు పెద్దగా ఉపయోగమేమీ లేదనీ మొదట్లో చాలా మంది scholars అభిప్రాయపడ్డారు. అయితే కొంతమంది భిన్నమైన అభిప్రాయాలను కూడా కలిగి ఉండేవారు. Masoretic Text కంటే కూడా Samaritan Pentateuch చాలా ఉత్తమమైనది అని 1631 లో John Morinus అనే ఒక scholar అభిప్రాయపడ్డారు. అయితే 1815 లో Wilhelm Gesenius గారు Samaritan Pentateuch ని విస్తృతంగా పరిశోధించి తన అభిప్రాయాలను ప్రచురించారు. చారిత్రకంగానూ మరియు సమరయులు లేఖనాలను మార్చిన విధానాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే, పాత నిబంధన యొక్క original text ని వెలికితీయడానికి Samaritan Pentateuch అసలు ఎందుకూ పనికిరాదు అని Gesenius గారు అభిప్రాయపడ్డారు. ఆ తరువాత ఒక శతాబ్దం పాటు Gesenius గారి అభిప్రాయాలతో అందరూ ఏకీభవిస్తూ వచ్చారు. Masoretic Text తో పోల్చి చూసినప్పుడు Samaritan Pentateuch లో కనిపిస్తున్న వ్యత్యాసాలు అన్నీ కూడా సమరయులు కావాలని ఉద్దేశపూర్వకంగా మార్చి రాసినవే కానీ అవి ప్రాచీన హీబ్రూ లేఖనాలను ప్రతిబింబించేవి కాదు అని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే 1915వ సంవత్సరంలో Paul Kahle అనే ఒక scholar ఏమన్నారంటే Masorectic Text తో పోల్చి చూసినప్పుడు భిన్నంగా కనిపిస్తున్న వచనాలలో చాలా వరకు కూడా Samaritan Pentateuch లో ఉన్నదే original reading అయ్యుండొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఈ విధంగా అభిప్రాయపడటానికి గల కారణం ఏంటంటే, Samaritan Pentateuch లో భిన్నంగా ఉన్నాయి అని అనుకుంటున్న వచనాలలో చాలా వరకు కూడా కొన్ని apocryphal books లోనూ, Septuagint లోనూ అలాగే క్రొత్త నిబంధనలో కూడా కనిపిస్తున్నాయి. అంటే Septuagint లోనూ మరియు క్రొత్త నిబంధనలో ఉన్న కొన్ని వాక్యాలు Masoretic Text తో విభేదిస్తున్నప్పటికీ అవి Samaritan Pentateuch తో ఏకీభవిస్తున్నాయి. వీటి ఆధారంగా, Samaritan Pentateuch లో ఉన్న కొన్ని వాక్యాలు భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ అవే అసలైనవి అయ్యుండొచ్చు అని Paul Kahle గారు అభిప్రాయాపడ్డారు.
ఇక 1947లో Dead Scrolls ని కనుగొన్న తరువాత Samaritan Pentateuch విషయంలో ఒక స్పష్టత వచ్చింది. Qumran Caves లో దొరికిన ఈ manuscripts అన్నీ కూడా identical గా లేవు కానీ వీటిల్లో కొంత variation ఉంది అని పరిశోధకులు గుర్తించారు. Dead Sea scrolls లోని కొన్ని వ్రాత ప్రతులు Samaritan Pentateuch తో ఏకీభవిస్తున్నాయి అని కూడా పరిశోధకులు గుర్తించారు. అయితే, సమరయులు తమ సిద్ధాంతాలకు అనుగుణంగా లేఖనాలలో ఏవైతే మార్పులు చేశారో, (ఉదాహరణకు Mount Gerizim గురించి ఉన్న వాక్యభాగం) అవి ఏవి కూడా Dead Sea scrolls లో కనపడలేదు. Samaritan Pentateuch తో దగ్గరగా ఉన్న ఈ Dead Sea scroll manuscripts కి scholars పెట్టిన పేరు ఏంటంటే "pre-samaritan text". ఇక్కడ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, Qumran Caves లో దొరికిన manuscripts అన్నీ కూడా Samaritan Pentateuch తో ఏకీభవిస్తున్నాయి అని నేను అనడం లేదు. Dead Sea scrolls లోని కొన్ని manuscripts మాత్రం Samaritan Pentateuch కి దగ్గరగా ఉన్నాయి. వీటిని మాత్రమే "pre-samaritan" text అని అంటారు.
Dead Sea scrolls ని కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే మనకు అర్ధమయ్యేది ఏంటంటే, పూర్వం చాలా శతాబ్దాల క్రితం original text ఏదయితే ఉందో దాన్ని manual గా చేత్తో copy చేసే క్రమంలో అక్కడక్కడా కొన్ని variations అనేవి రావడం జరిగింది. ఇది సహజంగా జరిగేదే. మనుష్యులు manual గా copy చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా చేసినా కూడా అక్కడక్కడా కొన్ని తప్పులు దొర్లడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే Biblical manuscripts విషయంలో ఇది పెద్ద సమస్య ఏమీ కాదు. ఎందుకంటే ఈ variations లో అధిక శాతం, వాక్యం యొక్క అర్ధాన్ని మార్చే అంత భిన్నంగా ఏమీ ఉండవు. చాలా చిన్న చిన్న variations అంటే, వ్యక్తులు లేదా స్థలాల పేర్లలో స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉండటం, sentence structure and syntax కొద్దిగా భిన్నంగా ఉండటం, scribes యొక్క పొరపాటు వలన కొన్ని లైన్లు miss అవ్వడమో లేక కొన్ని అంకెలు తప్పుగా రాయడమో లేక కొన్ని అక్షరాలను తప్పుగా రాయడమో జరిగింది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న manuscripts ని ఒకదానితో ఒకటి compare చేయడం ద్వారా ఈ variations లో చాలా వరకు కూడా మనం పరిష్కరించుకోవచ్చు.
ఇక్కడ క్రింద మీరు చూస్తున్న ఈ రెండు వచనాలు కూడా Masoretic Text నుండి తీసుకున్నవే. మొదటిది ఆదికాండము పదవ అధ్యాయం నాలుగవ వచనం. ఇక్కడ యావాను కుమారుల పేర్లు ఎలీషా, తర్షీష్, క్కిత్తీమ్, దొదానీం అని ఉంటుంది. ఇదే వచనం మళ్ళీ మొదటి దినవృత్తాంతములు మొదటి అధ్యాయం ఏడవ వచనంలో కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ యావాను కుమారుల పేర్లు ఎలీషా, తర్షీషాహ్, క్కిత్తీమ్, రొదానీం అని ఉంటుంది. ఇక్కడ తర్షీష్ అనే పదానికి చివరలో హే(ה) అనే అక్షరం కలవడం వలన అది తర్షీషాహ్ అయ్యింది. కానీ తర్షీష్ అనేదే correct reading. అలాగే మొదటి దినావృత్తాంతాల్లో రొదానీం అని ఉంటే ఆదికాండములో మాత్రం దొదానీం అని ఉంది. రెష్(ר) అనే అక్షరానికి బదులు దాలెత్(ד) అనే అక్షరం వాడటం వలన రొదానీం కాస్తా దొదానీం అయ్యింది. కానీ రొదానీం అనేదే correct reading.
క్రీస్తు పూర్వం మూడు రెండు శతాబ్దాల కాలంనాటికి ఇలా variations ఉన్న different manuscripts అందుబాటులో ఉండేవి. ఇదే సమయంలో ఒక manuscript ని base చేసుకొని (దీనినే "The Egyptian Hebrew recension" అని అంటారు) Greek Septuagint అంటే హీబ్రూ లేఖనాలను గ్రీకు భాషలోకి తర్జుమా చేయడం జరిగింది. అలాగే సమరయులు కూడా ఇదే సమయంలో ఒక manuscript ని తీసుకుని అందులో వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. వీళ్ళు తీసుకున్న base text ని "The Palestinian Hebrew recension" అని అంటారు. ఆ తరువాత కూడా variations ఉన్న different hebrew manuscripts ని మామూలుగానే copy చేస్తూ వచ్చారు. అలా variations ఉన్న ఈ different hebrew manuscripts అన్నీ కూడా మనకు Qumran Caves లో దొరికాయి. వీటినే మనం Dead Sea scrolls అని అంటున్నాం. క్రీస్తు శకం మొదటి శతాబ్దం తరువాత అప్పుడున్న Jewish Scholars ఏమి చేశారంటే hebrew manuscripts అన్నిటినీ తీసుకుని ఒక Standard Text ని తయారు చేశారు. దీనినే మనం Masoretic Text అని అంటున్నాం. వీళ్ళు అప్పట్లో వాడిన లేఖనాలకు base text ఏదయితే ఉందో దాన్ని "The Babylonian Hebrew recension" అని అంటారు. ప్రస్తుతం మనం వాడుతున్న బైబిల్స్ అన్నీ కూడా ఈ Masoretic Text నుండే తర్జుమా చేయబడ్డాయి.
కాబట్టి సమరయులు హీబ్రూ లేఖనాలలో కొన్ని మార్పులు చేసినప్పటికీ అవి పరిమితమైన మార్పులు మాత్రమే. యెరూషలేము కేంద్రంగా దేవుడిని ఆరాధించే వారితో తమకు ఉన్న విభేదాల కారణంగా తమ theological stand point ని సమర్ధించుకుంటూ కొన్ని మార్పులు చేశారే కానీ, ఆ thin layer ని గనక మనం వేరు చేసి చూడగలిగితే, Samaritan Pentateuch లో కూడా ప్రాచీన కాలానికి చెందిన హీబ్రూ లేఖనాలు అంటే క్రీస్తు పూర్వం రెండు మూడు శతాబ్దాలకు చెందిన ancient hebrew text ఏదైతే ఉందో అది మనకు Samaritan Pentateuch లో కూడా కనిపిస్తుంది. కాబట్టి Masoretic Text తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది అనే కారణంతో మనం Samaritan Pentateuch ని తీసి పక్కన పెట్టలేము. Original Text ని గుర్తించే విషయంలో Samaritan Pentateuch కూడా చాలా విలువైనదే. వాస్తవానికి Samaritan Pentateuch కి మరియు Masoretic Text కి మధ్య దాదాపు ఆరు వేల వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అందులో సుమారు రెండు వేల చోట్ల Samaritan Pentateuch, Septuagint తో ఏకీభవిస్తుంది. మీకు తేలిగ్గా అర్ధం అవ్వడానికి కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం నాలుగవ వచనం ఒకసారి చూడండి.
"మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీ కాజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను" అని Masoretic Text లో ఉంది. Septuagint లో కూడా ఇదే విషయం ఉంటుంది. కానీ Samaritan Pentateuch లో మాత్రం "బెహర్ ఏబాల్" అనే పదానికి బదులు "బెహర్ గెరిజీమ్" అనే పదం వాడారు. ఇక్కడ సమరయులు ఈ వాక్యాన్ని కావాలని మార్చారు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక్కడ Septuagint లో "ఏబాల్" అని కాకుండా "గేబాల్" అని ఎందుకు ఉంది అనే సందేహం మీకు రావొచ్చు. ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే modern Hebrew భాషలో ప్రస్తుతం మనం "ఆయిన్" అని పిలుస్తున్న అక్షరం ఏదయితే ఉందో, ఆ అక్షరాన్ని చాలా ప్రాచీన కాలంలో కొన్ని సార్లు "గ" అనే శబ్దాన్ని పలకడానికి కూడా వాడేవారు. Septuagint అనేది చాలా పాత translation కాబట్టి కొన్ని పేర్లను transliterate చేసినప్పుడు, ఆ కాలంలో వాళ్ళు ఏ విధంగా అయితే పలికేవారో, అదే ఉచ్ఛారణ మనకి Septuagint లో కనిపిస్తుంది. దీనికి classic example ఏంటంటే సొదొమ గొమొఱ్ఱా పట్టణాలు. గొమొఱ్ఱా అనే పదాన్ని మీరు హీబ్రూ బైబిల్ లో చూసినట్లయితే అక్కడ "ఆయిన్" అనే అక్షరమే ఉంటుంది. కానీ ఈ పదాన్ని "ఒమొఱ్ఱా" అని కాకుండా "గొమొఱ్ఱా" అనే పలుకుతారు.
అలాగే నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం నలభయ్యో వచనం చూసినట్లయితే "ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు" అని Masoretic Text లో ఉంటుంది. కానీ Septuagint లోనూ మరియు Samaritan Pentateuch లోనూ "ఇశ్రాయేలీయులు ఐగుప్తులో మరియు కనానులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు" అని ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ("నేను చెప్పునదేమనగా నాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు") కూడా Septuagint తోనూ మరియు Samaritan Pentateuch తోనూ ఏకీభవిస్తుంది. కాబట్టి ఇక్కడ Masoretic Text లో తప్పు ఉంది అని మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది.
అందువల్ల Masoretic Text తో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నప్పటికీ, ప్రాచీన కాలానికి చెందిన హీబ్రూ లేఖనాలలో original గా ఏముంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనకి Samaritan Pentateuch బాగా ఉపయోగపడుతుంది.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.