సంఘము

రచయిత: జెర్రీ ర్యాగ్
అనువాదం: నగేష్ సిర్రా

 

Picture1

విషయసూచిక

 ముందుమాట 

నాయకత్వం గురించి రాసిన గ్రంథాలతో పుస్తకాల షాపులు నిండిపోతున్నాయి. అందులో చాలా గ్రంథాలు ఆత్మీయ నాయకులకు అత్యంత అపాయకరమైన చెడు సలహాలనందిస్తున్నాయి.

ఉత్తమ ఫలితాలను పొందడానికీ, తమ పలుకుబడిని పెంచుకోవడానికీ, శక్తివంతమైన వ్యక్తిననిపించుకోవడానికి, తిరుగులేని అవకాశం కోసం తగిన పన్నాగాలకూ ఎత్తుగడలకూ నేటి కార్పోరేట్ నాయకులు లౌకిక నాయకులు ప్రాధాన్యతనిస్తున్నారు.

సెలబ్రిటీలను, సైనికాధికారులనే నాయకత్వానికి ఉత్తమమైన మాదిరిగా భావించి వారి జీవితానుభవాలనుంచే నాయకత్వ నియమాలకు అవసరమైన ఉదాహరణల్నీ, వివరణల్నీ ఇస్తున్నారు. ప్రభుత్వాన్నీ, పలుకుబడినీ, ఇహపరమైన విజయాలను సాధించి, అధికారాన్ని ప్రదర్శించి, డంబంగా జీవించడమే నాయకత్వం గురించి నేటి సమాజానికి ఉన్న అభిప్రాయం. నాయకునికున్న గుర్తింపు అసమానమైనది కనుక, చాలా యుక్తిగా ప్రజల్ని బెదిరించి, వారిపై తమ అధికారాన్ని పెంచుకోవడానికి అత్యంత అధునాతనమైన వేషధారణనూ హావభావాలనూ ఎలా సంపూర్ణం చేసుకోవాలో తెలియచేసే గ్రంథాలు చాలా ఉన్నాయి.

అయితే ఆత్మీయ నాయకత్వాన్ని గూర్చి యేసు వైఖరి చాలా భిన్నంగా ఉంది. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, “అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను. ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని” చెప్పారు (మత్తయి 20:25-28).

మరొక రీతిగా చెప్పాలంటే పరిచర్య చేస్తూ దీనత్వాన్ని కలిగియుండి, తన్ను తాను ఉపేక్షించుకోవడమే నిజమైన ఆత్మీయ నాయకత్వపు సారం. ఎందుకంటే మీలో గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెనని యేసు చెప్పాడు (మత్తయి 23:11).

అవును, నాయకత్వమంటే ఇతరులను ప్రభావితం చేయడమే! ప్రజలు ఒక వ్యక్తిని వెంబడిస్తారు కనుకనే, అతణ్ణి నాయకుడని పిలుస్తాం. అయితే మాదిరికరమైన ఆత్మీయ నాయకుడు తన అనుచరుల్ని ప్రభావితం చేసే విధానం మిలటరీ సైన్యాధ్యక్షుని ప్రభావానికీ, భూరాజుల ప్రభావానికీ చాలా భిన్నంగా ఉంటుంది. ఈ లోకంలో నాయకుల వేషభాషలూ, హావభావాలే వారికి తగిన గుర్తింపునూ, ప్రత్యేకతను తెచ్చి పెడుతుంటాయి.

ఆత్మీయ నాయకత్వానికి మహోన్నతమైన మాదిరి యేసుక్రీస్తే! ఇతరుల కోసం తన్ను తాను అర్పించుకొనుట, దీనత్వంతో పరిచర్య చేయుట ఆయన నాయకత్వంలో నిరంతరం కనబడేవి. నాయకత్వం గురించి తన శిష్యులకొక పాఠాన్ని నేర్పించి, వారికి అత్యంత స్పష్టమైన మాదిరిని ఉంచడానికి తన్ను తాను కట్టుబానిసగా మార్చుకుని వారి పాదాలు కడిగారు.

నిజం చెప్పాలంటే క్రైస్తవ నాయకత్వం చాలా మంది ప్రజలు భావించినట్లు అస్సలు ఉండదు. సహజంగా లోకం ఎంతో గొప్పవారిగా ఎంచే వ్యక్తులను ఎన్నడూ దేవుడు నాయకులుగా ఎంచుకోడు, ఆశీర్వదించడు. యేసే స్వయంగా జాలరుల్నీ, రోజూ కూలి పనులు చేసుకొనే సామాన్యుల్ని ఎంచుకొని అపొస్తలులుగా ఉండడానికి వారికి శిక్షణ నిచ్చారు, సంఘాన్ని నిర్మించడానికి వారిని స్తంభాలుగా వాడుకున్నారు. తన నాయకత్వానికి అధికారం కాదు, కేవలం పరిచర్య మాత్రమే ముఖ్య లక్షణమని తన శిష్యులకు మాదిరి చూపి వారి నుంచి ఆయన అటువంటి పరిచర్యనే కోరుకున్నారు.

యజమానీ, పై అధికారీ అనే బిరుదులతో కాక కాపరి అనే బిరుదుతోనే సంఘ నాయకుల్ని క్రొత్త నిబంధన పిలవడానికి కారణం ఇదే!

నాయకుల పరిచర్య పద్దతులు గూర్చిన, పథకాల గూర్చిన ప్రశ్నలన్నింటి కంటే ఎంతో కీలకమైనది నాయకుని స్వభావం! యథార్థత, నమ్మకత్వం, ప్రజల యెడల ప్రేమ, తన్ను తాను అర్పించుకొనుటకు సంసిద్ధత మొదలగు సద్గుణాలన్నీ ఆత్మీయ నాయకత్వానికి ఉండాల్సిన నిజమైన అర్హతలు. నిజానికి సంఘంలో పెద్దలకూ, పరిచారకులకూ ఉండాల్సిన అర్హతల జాబితాను క్రొత్త నిబంధన నియమించినప్పుడు (1 తిమోతి 3:1-12;; తీతు 1:7-9;), పెద్దలకు బోధించగలిగే వరముండాలి అనేది తప్ప మిగిలినవన్నీ వ్యక్తిగత స్వభావానికి సంబందించినవే!

'మాదిరికరమైన ఆత్మీయ నాయకత్వం' అనే ఈ పుస్తకాన్ని రాయడానికి జెర్రీ ర్యాగ్ అన్ని విధాలా అర్హుడు. జెర్రీ సమర్థుడైన బోధకుడు, సహజమైన నాయకుడు. సంఘ నాయకత్వానికి యేసు మాదిరియైన దీనత్వం, స్వీయత్యాగం అను వాటిపట్ల అతడు అంకిత భావం ఉన్నవాడు. భక్తిగల నాయకుడంటే ఎలా ఉంటాడో తెలియచేసే ఈ గ్రంథం పాఠకుల మనసును నూతనపరుస్తుంది, వారు చదవడానికి అనుకూలంగా ఉంటుంది. క్రైస్తవులందరికీ ఏదొక స్థాయిలో నాయకులుగా ఉండడానికి పిలుపు ఉంటుంది (హెబ్రీ 5:12;). కాబట్టి, ప్రతి క్రైస్తవుడూ ఈ పుస్తకాన్ని ప్రయోజనకరమైనదిగా ప్రోత్సాహకరమైనదిగా భావిస్తాడు, పదే పదే చదువుతాడు. మీరు ఇప్పుడే ఇతరుల్ని శిష్యులుగా చేయనారంభించినా లేదా దశాబ్దాలుగా పాస్టర్ గా ఉన్నా మీ నాయకత్వాన్ని సవాలు చేస్తూ, ఆలోచనలు రేకెత్తిస్తూ,మీరు మరింతగా క్రీస్తును పోలియుండాలని మిమ్మల్ని ప్రోత్సహించే ఎంతో విలువైన సమాచారాన్ని ఈ పుస్తకం మీకు అందిస్తుంది.
కేవలం మీకు మాత్రమే గాక మీరు నడిపించే వారందరికీ ఈ పుస్తక అధ్యయన ప్రభావం గంభీరంగా, శాశ్వతంగా ఉండాలన్నదే నా అభిలాష! - జాన్ మెకార్థర్

 

పరిచయం

నా భార్యకు భర్తనై, నా బిడ్డలకు తండ్రినైన నాటి నుంచి ఆత్మీయ నాయకత్వం లోని డిమాండ్లను నేను ఎదుర్కొంటూనే ఉన్నాను. అప్పట్లో చాలా యవ్వన వయసులో ఉన్నాను. కాబట్టి ఆత్మీయ నాయకత్వం గురించి కనీస అవగాహన కూడా నాకు లేదు. ప్రజల్ని ఫలవంతంగా నడిపించడానికి అవసరమైన అవగాహన, అనుభవాలు నాకు కొదువగా ఉండేవి. నాయకుడవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని జీవితం పట్టించుకోదు. ఇతరుల జీవితాల పట్ల బాధ్యతను తీసుకోగానే నాయకత్వ విధులకు మనం పిలుపునందుకున్నట్లే! మనకు అనుభవమున్నా లేకపోయినా బ్రతికినంత కాలం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, నైతికపరమైన సందిగ్దావస్థల్లో జ్ఞానయుక్తంగా దిశా నిర్దేశం చేయాలి, ఇతరుల్ని సంరక్షించి పోషించాలి, దైవ స్వభావాన్ని కనబరచాలి, స్థిరంగా భక్తిలో కొనసాగాలి. వీటన్నింటిని ప్రజలు మన నుంచి ఆశిస్తారు. ఇది మీకు కలవరం కలిగించకపోతే, మనం చేసిన తప్పులు మన జీవితాల్లోనే కాక మనం ప్రజల జీవితాల్లో కూడా దుష్పరిణామాలు కలిగిస్తాయన్న విషయమైనా మనకు కలవరాన్ని కలిగించాలి.

అప్పుడప్పుడు నా ప్రజల్ని మంచిగా నడిపించినప్పటికీ, అధికశాతం చాలా పొరపాట్లతో నా తొలి సంవత్సరాల్లోని నాయకత్వం గడిచిపోయింది. అదే సమయంలో బలమైన, నమ్మకమైన నాయకత్వంలో ఉండాల్సిన ముఖ్యమైన సంగతులేమిటో నేర్చుకోవాలనే జిజ్ఞాస కూడా నాలో అధికమవుతూనే వచ్చింది. నా కుమారుల నెలా భక్తిలోకి నడిపించాలనే భారం నాలో పెరుగుతూ వచ్చింది. దైవభక్తి గల నాయకత్వం లేకపోవడం వలన కుటుంబాలు విచ్ఛిన్నమై పోవడం నేను చూసాను. అపనమ్మకస్థులైన కాపరుల దుష్ప్రవర్తన మూలంగా కలిగిన దుష్పరిణామాల వలన కలతచెంది దు:ఖ సాగరంలో మునిగిపోయిన సంఘాలకు కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు నేను ఉన్నాను. ఈ బరువైన, భీతిగొలిపే బాధ్యత గురించి నా కుమారులకేమి బోధిస్తాను? దానికి మించి వారి ముందు నమ్మకంగా ఎలా జీవించగలుగుతాను? శాశ్వతమైన స్వాస్థ్యాన్ని కలిగించాలంటే మంచి ఉద్దేశాలుంటే సరిపోదు. భక్తిగల నమ్మకమైన నాయకులంటే దృఢమైన చిత్తాన్నీ, ఉన్నతమైన గుణశీలాల్నీ కలిగినవారు. తీవ్రంగా వెంబడించాల్సిన, స్థిరంగా పెంపొందించుకోవాల్సిన లక్షణాలున్నవారు. ఆత్మీయ నాయకత్వమనేది కేవలం దేవుని నుంచి మాత్రమే వస్తుందనీ, ఆయన దయ లేకుండా నిత్య విలువ కలిగిన దేనినీ నెరవేర్చలేమని గ్రహించిన వ్యక్తులే ఈ నాయకులు. వ్యాపార మెళకువలూ, ప్రజాభిప్రాయాలు వచ్చిపోతుంటాయి. కానీ నిజమైన, ఫలవంతమైన నాయకుని హృదయం తన ఆత్మీయ జీవితంతో రాజీపడదనీ, చంచలంగా ఉండదనీ వారి కర్థమవుతుంది. అధికారం, ప్రజాభినందన అనే ఆకర్షణలకు గురైనపుడు ఏ మాత్రం వాటికి లొంగిపోని మాదిరికరమైన నాయకుల అవసరత మనకుంది. నాయకత్వం గురించి మన సంస్కృతి మన కందించే ఆకర్షణీయమైన మెళకువలకు లొంగిపోకుండా వ్యతిరేకించే వ్యక్తులు మనకవసరం. తండ్రులు తమ కుమారులకూ, కాపరులు తమ మందకూ శిక్షణ నివ్వాలి. ఇతరులకు బోధించే సామర్థ్యం కలిగిన నమ్మకమైన శిష్యులకు నాయకులు పరిచర్యను అప్పగించాలి (2 తిమోతి 2:2). అలాంటి అత్యవసరమైన విషయాలను మనం తీవ్రంగా నిర్లక్ష్యం చేసినపుడు సంఘాలూ, కుటుంబాలూ నాశనమవుతాయి. భావి తరాల వారు సత్యాన్ని గూర్చిన ఆకలితో అలమటిస్తారు, నిరీక్షణ లేకుండా జీవిస్తారు. ఈ దుష్పరిణామాలన్నింటికీ మనమే కారణమవుతాం!

నాయకత్వం గురించి రాసిన ఏ పుస్తకమైనా అందులోని ప్రతీ అంశాన్ని సంపూర్ణంగా చర్చించలేదు. ఆ విషయం స్పష్టమే! కొన్ని ముఖ్యాంశాల్ని విస్తారంగా చర్చించి, సామాన్యాంశాల్ని క్లుప్తంగా వర్ణించే భిన్న గ్రంథాలున్నాయి. కొద్దిమందైతే 2 లేక 3 అంశాల్ని మాత్రమే లోతుగా చర్చిస్తారు. కొన్ని సార్లు నాయకుడంటే వ్యాపారంలో ముఖ్య కార్య నిర్వాహణాధికారి అయినట్లు నాయకత్వాన్ని వ్యాపారంలోని పదజాలంతో వర్ణిస్తుండగా, మరికొన్ని సార్లు ఫలవంతమైన నాయకత్వానికి వ్యక్తులతో సత్సంబంధాలే ముఖ్యమని నాయకత్వాన్ని సత్సంబంధాలనే అద్దంలోంచి చూస్తున్నారు. ఇలాంటి భిన్నాభిప్రాయాల మధ్యనున్న అగాధం నాయకునిగా ఉండాలనుకొనే వారిని అయోమయానికి గురిచేసి భయపెడుతోంది. మనం నాయకత్వాన్నెలా నిర్వచించాలి? క్రైస్తవ జీవితానికి అన్వయించగలిగిన ఆత్మీయ నాయకత్వంలోని అత్యావశ్యకమైన నియమాలను గ్రహించే మార్గమేదైనా ఉందా? ఉండే ఉండొచ్చు. ఆ ఆశయాన్ని ఈ పుస్తకం నెరవేరుస్తుందో లేదో నాకు తెలియదు కాని మాదిరికరమైన ఆత్మీయ నాయకత్వం ఎలా ఉంటుందో తెలియచేయాలనే నా చిరు ప్రయత్నాన్ని మాత్రం ఇది చూపిస్తుంది.

ఇతరుల్ని ప్రభావితం చేయగల సామర్థ్యానికి నిర్భయంతో కూడిన నమ్మకమూ, మహోత్కృష్టమైన దైవ సందేశాన్ని కలిగియున్న జీవితమూ గుండెలాంటివి. అది నాకు బాగా తెలుసు. దేవుని భయంతో జీవించి, లోకానికి ఆయన సత్యాన్ని ధైర్యంగా చెప్పే నాయకుడే ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసాడు (యెషయా 66:2;). అలాంటి మనుష్యులు ఈ రోజున ఎక్కడున్నారు? ఆర్ధిక వనరులు, రాజకీయ బలం, సామాజిక పలుకుబడి ఉన్న వ్యక్తే లోకానికి మాదిరికరమైన నాయకుడు. కానీ సంఘంలో ఈ లక్షణాలు ఏ మాత్రం ముఖ్యమైనవి కాకూడదు. అయితే మనుష్యులకు భయపడి సత్యం విషయంలో రాజీపడే బలహీనమైన నాయకులతో ఇవాంజెలికల్ సంఘం దాదాపు 3 దశాబ్దాలు ఇబ్బందిపడింది. ఆత్మీయ ప్రభావాన్ని గూర్చిన అంశాల్ని చర్చించే విషయాల్లో చాలా గ్రంథాలు జోక్యం చేసుకోకపోవడం ఆశ్చర్యం కాదు. మనల్ని యజమానికి ఉపయోగపడేలా చేస్తాయని దేవుడు చెప్పిన వాక్య నియమాల వైపుకి మనం తిరిగి వెళ్లాలి (2 తిమోతి 2:21;). నీతితో కూడిన స్వభావాన్నీ, కదలని స్థిరమైన ఆత్మీయ నమ్మకాలనూ ఒక వ్యక్తి జీవితం కనబరుస్తుంటే, ఆ నైతిక బలాన్ని అనుసరించడానికి ఎవ్వరూ వ్యతిరేకించరు. దీనికి తోడు జీవితంలో అత్యంత క్లిష్టమైన సమస్యలకు సమాధానం చెప్పడానికి ప్రస్తుత లోకం వ్యర్థ ప్రయత్నాలు చేస్తోంది కనుక, ఉన్నతమైన జ్ఞానం కలిగిన వ్యక్తిని అది తృణీకరించడం కష్టం. బలమైన, ఫలవంతమైన ఆత్మీయ నాయకులు భక్తిగల అలవాట్లను ప్రజలకు అలవర్చడానికి నిర్విరామంగా కృషి చేస్తారు. వారు సత్యాన్ని మాట్లాడతారు, భయపడకుండా నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి ప్రభావం గల వ్యక్తులు లోకాన్ని సేవించడానికి బదులు దేవుని వాక్యానికి విధేయులవుతారు. భక్తిగల నాయకత్వంలో ఎదురయ్యే సవాళ్లు భయాన్ని పుట్టిస్తాయి, అపాయాలు గంభీరంగా ఉంటాయి. అయితే మనం దేవుని చేతిలో బలమైన సాధనాలు కావడానికి అవసరమైనవన్నీ ఆయన మనకు సమకూరుస్తాడు. ఈ అధ్యాయాల్లో ఆ నియమాల్ని సాధన చేయడానికి దేవుడే మనకు కృప అనుగ్రహించును గాక!

మొదటి భాగం

నాయకత్వ లక్షణాలు

1. అనుసరించదగిన జీవనశైలి

ఒక వ్యక్తి నాయకత్వాన్నీ ఆశయాన్నీ అనుసరించేలా కొద్దిమంది ప్రజల్ని ప్రేరేపించేదేమిటి? కొంతమందివి ఇతరుల తలంపుల కంటే, అభిరుచుల కంటే ఎక్కువగా ప్రజల్ని ప్రభావితం చేస్తాయి, దానికి కారణమేమిటి? ప్రేరణ అంటే ఏమిటి? నాయకత్వానికి ఈ ప్రేరణను కీలకమైందిగా చేసే శక్తి ఏమిటి? మహోన్నతమైన ఆశయాన్ని కలిగి, దానిని సాధించడానికి ఇతరుల్ని ప్రోత్సహించే బాధ్యత పొందిన ప్రతీ నాయకుడూ ఎదుర్కొనే నిజమైన ప్రశ్నలివి. ఒక వ్యక్తినీ, విషయాన్నీ, సంఘటననూ ప్రభావితం చేయగలిగే శక్తినే ప్రేరణకు నిర్వచనమని చెప్పవచ్చు. ఆ నాయకత్వం విషయానికొస్తే ఒక ప్రత్యేక మార్గాన్ని అనుసరించి, ఆశించిన దాన్ని సాధించే విధంగా ఇతరుల్ని ప్రభావితం చేసి, ఒప్పించే సామర్థ్యమే ప్రేరణ. ఇతరులు అనుసరించేంత మాదిరికరంగా జీవించడం, వినేటంత శక్తివంతంగా ప్రకటించడమే ప్రేరణ. ఇతరులు అనుకరించడానికి అవసరమయ్యే మాదిరికరమైన జీవనశైలి, సాధారణ మనుషులకుండే వాటికంటే గంభీరమైన తలంపులూ కొందరు నాయకులకుంటాయి. అలాంటి నాయకుల నుంచి ప్రజలు శ్రేష్ఠమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు.

ఆత్మీయ నాయకుల పైనే దేవుని ప్రజల ఆత్మీయ పరిపక్వత ఆధారపడి ఉంటుంది. కనుక నాయకులు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. క్రైస్తవ జీవితపు ప్రతి ఘట్టంలోనూ ఇతరుల్ని మంచిగానో, చెడుగానో ప్రభావితం చేసే అవకాశం నాయకులకు ఉంది. ప్రజలు తమ నాయకులకు విధేయులై, తరచూ వారిని గ్రుడ్డిగా అనుసరించేస్తారు. కనుక నాయకులు ఎక్కువ భారాన్ని మోయాలి.

అధికారంతో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుంది. కనుక నాయకులకు తమ అధికార నిర్వహణే కీలకాంశం. ప్రజలు తమ నాయకుల్ని నమ్మినపుడు వారు చెప్పే విషయాల్నీ, చేసే పనుల్నీ ఏ మాత్రం ఆరా తీయకుండా అంగీకరిస్తారు. అలాంటి అధికారం నిర్లక్ష్య వైఖరిగల నాయకులకు తమ స్వార్థపూరిత కోరికల్ని నెరవేర్చుకోవడానికి ప్రజల్ని వాడుకొనే అవకాశం ఇస్తుంది. స్వార్థపూరిత ఉద్దేశాల్ని నెరవేర్చుకొనేందుకు ఉపయోగించే అధికారం ఘోరమైన అక్రమానికీ, రాజకీయాల్లో కనబడే కుట్రకూ మించినదేమీ కాదు. నాయకుల హృదయానికి అత్యాసక్తికరమైన అంశాలేంటో ప్రజలు తెలుసుకోవాలని ఈ గంభీరమైన వాస్తవాన్ని గూర్చి హెన్రీ, రిచర్డ్ బ్లాకబేలు హెచ్చరిస్తున్నారు. - 'నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి” (యాకోబు 3:1) అనే గంభీరమైన హెచ్చరికలో యాకోబు ఈ గృహనిర్వాహకత్వపు సారాన్ని పొందుపరిచాడు. ప్రస్తుత లోకం వ్యక్తిపూజకు అలవడింది. ఇలాంటి లోకంలో తమ ప్రత్యేకాకర్షణతో, విలాసవంతమైన జీవనశైలితో, రెచ్చగొట్టే ప్రసంగాలతో నాయకులు ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారు. తద్వారా వాక్యానుసారమైన నాయకత్వంలోని ఉన్నతమైన లక్షణాల్ని మూలకు నెట్టేస్తున్నారు. సంఘంలో నాయకత్వాన్ని తరచూ అయోమయం పీడిస్తోంది, ఆత్మీయ వనరుల్ని హరించివేసి, అభివృద్ధిని అడ్డగించే బలహీనతలు ముట్టడిస్తున్నాయి. సంఘ బల ప్రభావాల్ని దోచుకుంటున్న లోపాలు కొన్నింటిని నేను ఎన్నో ఏళ్ళగా గమనిస్తూనే ఉన్నాను.

  • ఆ తరిగిపోతున్న జనసంఖ్య, ఆర్థిక ఒత్తిడి, పెరిగిన శ్రమ, వేదాంత పండితులు చేసే హేళన, సాంప్రదాయాలకు ఇచ్చే విలువ మొదలగు విషయాలతో సంఘాలు అసంతృప్తి చెందుతున్నాయి. వీటివలన ఉత్పన్నమయ్యే నష్టాన్ని అరికట్టడానికి వెర్రి నాయకులు వేదాంత కళాశాలల్నీ, వివిధ గ్రంథాల్నీ ఆశ్రయిస్తున్నారు.
  • అనేకమంది నాయకులు తమ వ్యక్తిగత ఆకర్షణనూ, సహజమైన తలాంతులనే వారి ప్రభావానికి బలాలుగా భావించి, వాటిపైనే ఆధారపడుచున్నారు. వీరు నిజమైన ఆత్మీయ అవసరాలకు ఏ మాత్రం వాక్యాధారం లేని నామమాత్రపు సలహాలిస్తున్నారు.
  • ప్రజల అభినందనలను అతిగా అపేక్షించు వారే అధిక శాతం నాయకత్వ స్థానాన్ని అధిరోహిస్తున్నారు. ప్రజా గమనాన్ని తమవైపు మళ్లించుకోవడానికి అవకాశ వాదాన్నీ, స్వీయప్రచారాన్ని వారు ఉపయోగించుకుంటున్నారు. 
  • పదవి కోసం పోరాటాలూ, రాజకీయాలూ చేసే నాయకులు మాత్రమే కొన్ని సంఘాలకు తెలుసు. ఇతరులు తమ బలహీనతల్ని చూస్తే ప్రమాదమని భయాందోళనలు, అభద్రతా భావాలుగల నాయకులు భావిస్తున్నారు. వారు తమ బలహీనతల్ని దాచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటువంటి నాయకులు తలాంతులు కలిగిన తమ స్నేహితుల సమక్షంలో అసౌకర్యంగా ఉంటారు.
  • ఎట్టి పరిస్థితిలోనైనా వివాదాలనుంచి చాలా వేగంగా పారిపోయే వ్యక్తులే కొన్నిసార్లు పరిచర్యను నడిపిస్తున్నారు. తెగువ చూపించడానికి బదులు, స్వీయపరిరక్షణకూ వ్యక్తిగత సౌకర్యానికి వారు ప్రాధాన్యతనిస్తున్నారు. వివాదం తలెత్తినపుడు 'సంబంధాలలో ఐక్యత' అనే బలిపీఠంపై 'సత్యాన్నీ', 'సిద్ధాంతపరమైన నమ్మకాలనూ' వారు బలిగా అర్పిస్తున్నారు. జీతగాని నాయకత్వంలో సంఘం ఏమి చేయాలో తెలియక అవస్థలు పడుతోంది.
  • ఖచ్చితమైన, సంపూర్ణమైన ప్రమాణాల కనుగుణంగా జీవించాలని చెప్పే ప్రతి వ్యవస్థకూ వ్యతిరేకంగా మాట్లాడడం వలన నేటి తరంలో అధికారం దక్కుతోంది. ప్రామాణిక సత్య ఉనికిని తృణీకరిస్తూ  భ్రమల లోకంలో విహరించే యువతతో ఏకీభవించడం వలన ప్రజాదరణ పొందారు నవతరపు సంఘ నాయకులు. ఇలాంటి సంఘాలు సాంప్రదాయాన్ని నూతన శత్రువుగా, సమాజానికి సేవ చేయడాన్ని 'యేసు జీవన విధానంగా' భావిస్తాయి. ఈ పరిచర్యలలోని నాయకత్వానికి ఏ విధమైన వేదాంతపరమైన శిక్షణ గానీ మొరటైన భాషనూ, ప్రవర్తననూ మార్చుకోవాలనే కోరికగానీ అవసరం లేదు.

లోక నాగరికత నాయకత్వాన్ని అంగడి సరుకుగా మార్చేసింది. సంఘం కూడా దానికి భిన్నమైనదేమీ చేయలేదు. ప్రజల్లో నూతన ఆలోచన విధానం కలిగే వరకు సంఘం కూడా లోక పద్దతిని ఆస్వాదించవచ్చనే అభిప్రాయంలో ఉంది. నాయకత్వం ఉండాల్సిన పద్ధతి ఇదేనా? నాయకులెలా తయారవుతారు? ఇతరులు అనుసరించడమే ఒకని నాయకుణ్ణి చేస్తుందా? మరైతే దీర్ఘకాలిక ఆత్మీయ పతనం సంగతేంటి? నేటి ఆత్మీయ నాయకులు వారు కలిగించిన దానికి బాధ్యత వహించడానికి ఆ తర్వాత 30 సంవత్సరాలూ అందుబాటులోనే ఉంటారా? వాక్యానుసారమైన సమాధానం చెప్పాల్సిన గంభీరమైన ప్రశ్నలివి. మరొక వ్యూహరచన సభ ద్వారానో లేదా మన సంస్కృతిని సంపూర్ణంగా త్యజించడం మూలంగానో సంఘ నాయకత్వంలోని సంక్షోభం పరిష్కారం కాదు. లోకమనే ఎడారినుంచి సమృద్ధి నిండిన ప్రదేశానికి దేవుని ప్రజలను నడిపించే బలాఢ్యులైన సంఘ నాయకులు అవసరం. అలాంటి తరాన్ని లేపమని దేవుని వేడుకోవడానికి మనం కృపా సింహాసనం దగ్గరకు తిరిగి వెళ్లాలని నేను భావిస్తున్నాను.

 

వివేకంతోనూ యుక్తితోనూ సమస్యను పరిష్కరించే యుగం

నిజమైన ఆత్మీయ నాయకత్వం దేవుని వరమే కానీ మనుష్యులు తయారుచేసేది కాదు. అది వాస్తవం కాబట్టి దేవుని సహజాతీత కార్యాన్ని మానవ కల్పిత అనుకరణల నిమిత్తం అమ్మేసే ఏ నాయకత్వ దృక్పథమైనా క్షీణించిపోతుంది. మానవ ఆవిష్కరణల పైనా, కపటోపాయాలపైనా నాయకత్వం ఆధారపడి ఉంటుందని ఈ తరపు నాయకులు నమ్ముతున్నారు. మనది ఇలాంటి తరం కావడం శోచనీయం. శక్తివంతమైన ఆత్మీయ నాయకత్వానికి అత్యవసరమైన కొన్ని అంశాల్ని దేవుని వాక్యం విస్మరించిందని వారి అభిప్రాయం. లేఖన సత్యాన్ని లోకం వ్యతిరేకిస్తుంది. కనుక మన సందేశాన్ని మార్చుకొని, దానికి రుచికరమైన సందేశాన్ని అందించాలనే అభిప్రాయాన్ని అందరూ ఆమోదిస్తున్నారు. మరైతే సత్యాన్ని సిగ్గుపడకుండా ప్రకటించమని ఎంతో స్పష్టంగా బోధిస్తున్న బైబిల్ పరిస్థితేంటి? కేవలం దైవ ప్రత్యక్షత మాత్రమే మనుష్యులకు సంబంధించి నిజమైన, స్పష్టమైన అవగాహన కలిగిస్తుంది.

అపొస్తలుడైన పౌలు కొరింథుకు వచ్చి 'మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను కాక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతాలనే' వినియోగించాడు (1 కొరింథీ 2:4;). అనర్గళమైన ఉపన్యాసాలనూ, గంభీరమైన తర్కాలనూ మనుష్యులు ఎక్కువగా నమ్ముతారు. దానివల్ల పొంచియున్న తీవ్రమైన ప్రమాదాల గురించి పౌలుకు తెలుసు. పాపుల హృదయాలను దేవుడు బలంగా కదిలించుట చూడాలన్నదే పౌలుకున్న భారం. అందులో ఏ సందేహమూ లేదు. అయితే తన ప్రసంగం సత్యంకంటే మరింత ఆకర్షణీయంగా ఇతరులకు కనబడుతుందేమోనన్న విషయం అతన్ని వణికించింది. కొరింథీయుల విశ్వాసం అనర్గళంగా ఉపన్యసించు నేర్పరితనంపై కాకుండా, కేవలం దేవుని శక్తి పైనే ఆధారపడాలని అతడు కోరాడు (1 కొరింథీ 2:5;). ప్రజలను యేసుక్రీస్తు రక్షణా సువార్తతో చేరడం పౌలుకున్న అద్భుతమైన ఆధిక్యత, బాధ్యత. అయితే సువార్తలోని జీవాన్నిచ్చే శక్తితో వారి హృదయాల్ని చేరడం మాత్రం దేవునికున్న సార్వభౌమాధికార ఆనందం!

లోక డిమాండ్లకు అనుగుణంగా సువార్తను మార్చాలనేది నేటి నాయకుల ఆలోచన. అది సత్యాన్ని ఆకర్షణీయంగా చేయదు కానీ, అసత్యంతో అలంకరిస్తుంది. దైవిక సత్యం మార్పు చెందదు. పాపులు సరిక్రొత్త సందేశాన్ని డిమాండ్ చేయడం మానేసి, దేవుడు పెట్టిన షరతులతో ఆయనను ఎదుర్కొనే వరకూ వారు రక్షణార్థమైన కృపను ఎరుగలేరు. పతనమైన మనిషికి తన నిజమైన ఆత్మీయ అవసరాన్ని చూడగలిగే సామర్థ్యం లేదు. అందుచేతనే మానవ భ్రష్టత్వం గురించీ, పరిశుద్దాత్ముని ఒప్పింపచేసే కార్యం గురించి తెలుసుకోవడం మనకెంత అవసరమో లేఖనాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి (యోహాను 3:3;; 1 కొరింథీ 2:12-14;). మారుమనస్సు పొందక ముందు మతం గురించి నాకు ఎన్నో అభిప్రాయాలుండేవి. కానీ (పరిశుద్ధత, పాపం, తీర్పు, రక్షణార్థమైన కృప మొదలగు) నిజమైన ఆత్మీయ వాస్తవాల గురించి మాత్రం నాకు కనీస అవగాహన కూడా లేదు. తన చుట్టూ ఉన్న లోకాన్ని ఏ విధమైన సందేశంతో చేరుకోగలడో విశ్వాసి ఎన్నటికీ నిర్థారించలేడు. నీ చుట్టు ప్రక్కల వాతావరణాన్ని వర్ణించమని చేపను అడిగితే, ఆ చేప చెప్పే సమాధానంలో నీటిని గూర్చిన ప్రస్తావన ఉండదు. అలాగే విశ్వాసి పరిస్థితి కూడా ఉంటుంది.

థెస్సలోనిక ఒకప్పుడు అభివృద్ధిచెందిన పట్టణం. సిలువ మరణాన్ని పొంది పునరుత్థానుడైన క్రీస్తునుగూర్చిన శక్తివంతమైన సందేశం అందులోని విగ్రహారాధికులపై అకస్మాత్తుగా దాడిచేసి, వారి హృదయాల్ని సత్యానికి లొంగిపోయేట్లు చేసింది. మిషనరీలు లోకజ్ఞానంతోనూ, వాక్చాతుర్యంతోనూ సువార్తను బోధించారా? అసలే మాత్రం వారలా చేయలేదు. “ఆ హేతువు చేతను, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము” (1 థెస్స 2:13) అని జరిగిన వృత్తాంతాన్ని పౌలు వివరించాడు.

తొలిసారి సువార్తను విన్న థెస్సలోనీకయులు దేవుని వాక్యాన్ని విశ్వాసంతో అంగీకరించారు. వారి కనులు తెరుచుకున్నాయి. సత్యాన్ని అంగీకారయోగ్యమైనదిగా చేయడానికి అపొస్తలుడైన పౌలు సువార్తను యుక్తిగా ప్రదర్శించలేదు. ఆ వాస్తవాన్ని వారు దేవుని కృపనుబట్టి వెంటనే గ్రహించారు. లేఖనంలో సూటిగా లిఖితమైన సత్యం గ్రుడ్డి కనులనూ తెరవగలదు, హృదయాన్ని మార్చగలదు (కీర్తన 19:7-11;). సత్యంతో నిండిన మనస్సుకి సహజాతీతంగా వివేచించే సామర్థ్యం వస్తుంది (కీర్తన 119:97-104;). సత్యంతో నిండిన మనస్సు దోషాల్ని సరిచేస్తుంది, మనస్సాక్షికి స్వాతంత్ర్యాన్నిస్తుంది (యాకోబు 1:25;), అంతరంగ పురుషునిలోని లోతైన సంగతుల్ని బయలుపరుస్తుంది. (హెబ్రీ 4:12;), దేవుని సంతోష పెట్టగలిగేలా జీవించడానికి విశ్వాసిని సంపూర్ణంగా సిద్ధపరుస్తుంది. (2 తిమోతి 3:16-17;). ఆత్మీయ నాయకత్వంలో విజయాన్ని చేకూర్చేది పరిశుద్ధాత్మ కార్యం. ఈ విషయాన్ని నేటి ప్రముఖ నాయకులు పూర్తిగా నమ్మడం మానేసారు. కనుక ఫలితాలు చాలా ఘోరంగా ఉన్నాయి.

నేటి ఇవాంజెలికల్ తరంలో ఉన్న ముఖ్యమైన లోపాల్లో ఇదొకటి. దేవుని వాక్య శక్తి కఠినమైన హృదయంలోనికి  చొచ్చుకొనిపోతుంది. ఆ వాక్య శక్తిని మనం తగినంతగా నమ్మట్లేదు. ప్రజలకు వినోదాన్ని అందించుట ద్వారా వారిని సంతృప్తి పరచి, ఆ తర్వాతే వాక్యాన్ని అంగీకరించేలా వారిని సిద్ధపరచాల్సిన అవసరముందని మనం భావిస్తున్నాం. చాలా సందర్భాల్లో అలాంటి ప్రణాళిక నెంచుకున్న వారు దేవుని వాక్యాన్ని ఏ మాత్రమూ ధైర్యంగా ప్రకటించలేరు. హృదయాలలోకి చొచ్చుకొనిపోయే సమర్థవంతమైన సందేశం దేవుని వాక్యంతో పాటు మరొకటేదో ఉందని మనం భావిస్తున్నాం. ప్రజలకు వినోదాన్ని అందించి, వారిని క్రైస్తవ్యానికి స్నేహితులుగా చేసి అదే సమయంలో లేఖన సత్యంతో వారిని గద్దించే సాహసాన్ని జాగ్రత్తగా తప్పించు కోవడానికి మార్గాన్ని కనిపెట్టే ఆలోచన ఇది. అది కేవలం అజ్ఞానం. ఈ రోజుల్లో అటువంటి గారడీలకు ఇస్తున్న ప్రాధాన్యత మూలంగా సమయాన్నీ, శ్రమనూ సంఘాలు అతిగా వృథా చేస్తున్నాయి. 'రెండంచుల వాడిగల ఖడ్గం' కంటే పదునైన దేవుని వాక్యంతో పోల్చితే మానవయుక్తీ, చాతుర్యమూ వెన్న పూసుకోవడాని కుపయోగించే ప్లాస్టిక్ కత్తిలాంటివే!

పరిశుద్ధులను పరిచర్య ధర్మం నిమిత్తం వాక్యానుసారంగా సిద్ధపరచుట మూలంగా కలిగే అద్భుత ఫలితం కాక (ఎఫెసీ 4:12), సువార్తీకరణ లోకానుగుణమైన సంభాషణలే వ్యూహరచన సదస్సుల్లోనూ, మేధావులు చేసే చర్చల్లోనూ ప్రధానాంశాలుగా ఉన్నాయి. క్రైస్తవ లోకం తనకు తెలియకుండానే నిరంతరం నాసిరకపు బైబిల్ బోధ అనే ఆహారాన్ని భుజిస్తూ, సోమరులైన కాపరుల్ని అనుసరిస్తోంది. అది అత్యంత ప్రాథమికమైన క్రైస్తవ సిద్ధాంతాల విషయంలో దేవుని ప్రజలకు వివేచన లేకుండా చేసింది. ప్రస్తుత లోకాని కనుగుణంగా మారి దానిని ప్రభావితం చేయడానికి వేదాంతపరమైన, మతపరమైన ఊత పదాలు సంఘాల్లో సమృద్ధిగా ఉన్నాయి.

కానీ వాటిలో దైవసారం లేదు. ఈ రకమైన వాక్య నిరక్ష్యరాస్యత పెరగడాన్ని బట్టి నిజమైన పరిశుద్ధత విషయంలో మానవ కేంద్రిత దృక్పథం అనివార్యమైంది. ఉద్వేగపూరిత, మానసికమైన, మత పరిపూర్ణత అనే విగ్రహాలు పునరుత్థాన బలాన్ని ఎరుగుటలో ఉన్న మహా వైభవ స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి. దేవుడూ, ఇతరులూ కలిసి మన అవసరాన్ని తీర్చగా కలుగు ఫలితమే పరిశుద్ధత అని నాయకులు భావిస్తున్నారు. క్రీస్తు అనుభవించిన శ్రమా, తృణీకారమూ పాప పరిహారం నిమిత్తమని కాక మానవ ప్రేమకూ, దయకూ ఉదాహరణలుగా ప్రకటిస్తున్నారు. క్రమేపీ అటువంటి నిస్సారమైన బోధవల్ల నిజ విశ్వాసులు బలహీనులై, పాపానికి బానిసలుగా మారి, దోషమనే భారం క్రింద నలిగిపోతున్నారు. నిరుత్సాహానికి గురై లేఖనాల్ని నమ్మలేక, జీవితాన్ని నాటకీయంగా మార్చగలిగే శక్తిలో నమ్మకాన్నీ, ఆసక్తిని కోల్పోతున్నారు.

సంఘం ఎలా ఇంత వ్యాధిగ్రస్థమైంది? సమాధానం చెప్పడం చాలా సులభం. నేటి సంఘం సత్యాన్ని స్రవిస్తూ, స్వీయ ఆరాధనను అతిగా లోనికి చొప్పిస్తోంది. దానివలన తమ దోషాన్నీ, దుఃఖాన్నీ మతంలో ముంచేయాలని ఆశపడే అవిశ్వాసులు సంఘానికి హాజరవడం సంతోషాన్నిచ్చేదిగా, షరతులు పెట్టనట్టి ఆశ్రయ స్థానంగా భావిస్తున్నారు. అవును, వారు అలా ఎందుకు చేయకూడదు? లౌకిక మనస్సాక్షికి ఉపశమనాన్నిచ్చేంత నైతికతా, నామకార్థ క్రైస్తవులను సౌకర్యవంతంగా ఉండనిచ్చేంత లోకమూ వెర్రి వ్యామోహంతో నిండిపోయిన నేటి సగటు ఆరాధనలో ఉన్నాయి. తమ సహజమైన ప్రతిభపై, అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం పై, వ్యాపార లావాదేవీల్లో నిపుణతపై, అచ్చమైన లోకపద్ధతులపై ఆధారపడు అలవాటున్న నాయకులు పైకి కనబడే అభివృద్ధిని సృష్టిస్తున్నారే గానీ, వచ్చే ఫలితాల్లో మాత్రం సారం లేదని స్పష్టమవుతోంది. విచక్షణలేని నాయకులు పెద్ద పరిచర్యను వాగ్దానం చేసే అత్యాధునిక మార్గాలనన్వేషించి సంఘాలను సరిక్రొత్త మార్గాలగుండా ఈడ్చుకెళ్తున్నారు. ఇలాంటి తీవ్రమైన విషాదానికి కారణం: సంఘంలో పరిణితి లేని విశ్వాసులే అత్యంత ప్రభావితం చేయగల బోధకులుగానూ, నాయకులుగానూ ఉండడమేనని జాన్ మెకార్థర్‌ గారు చెప్పారు. 'సంఘం క్రీస్తుతో లోతైన జీవితాన్ని వృద్ధి చేసుకోవాలి. అయితే దానికి బదులు స్థంభించిపోయిన శరీరానుసారమైన పరిచర్య అనే బురదలో పడి దొర్లుతోంది. మనిషి తన సొంత పద్ధతుల్లో నాయకత్వాన్ని చేయడానికి ప్రయత్నిస్తే చోటుచేసుకునే విషాదకరమైన స్వాస్థ్యమది. చిరకాలమూ నిలిచియుండే జీవంగల వాక్యాన్ని క్రమంగా ప్రకటించకుండా, పరిశుద్ధాత్మ యొక్క ఒప్పింపచేసే శక్తి లేకుండా నిజమైన ఆత్మీయ నాయకత్వం ఎండిపోతుంది, నిజమైన ఆహారపు కొరత మూలంగా క్రీస్తు సంఘం ఆకలితో అలమటిస్తుంది.

నేడు చాలా సంఘాలు అస్థిరంగా ఉంటున్నాయి. కారణం: వాటిలోని నాయకుల సారంలేని పరిచర్య పద్ధతులే. ఇదేమీ రహస్యం కాదు. పరిశుద్ధాత్మ మనకిచ్చిన తలాంతులను ఒకే ఒక్క స్థానిక సంఘ పరిచర్యలో ఉపయోగించాలి. దీని కోసం ప్రతి విశ్వాసీ తీర్మానం చేసుకోవాలి. ఈ విషయాన్ని నేను బోధించిన ప్రతిసారీ, కొద్దిమంది కఠినమైన సవాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే పరిచర్య చేయడానికి అందుబాటులో ఉండే జీతగాళ్లను నియమించుకోవడంలో ఎటువంటి సమస్యా లేదని వీరు భావిస్తారు. నాయకులనేకులు సంఘంలో వ్యాపార పద్ధతుల్ని ప్రోత్సహించడం మరింత నీచం. కాపరత్వం, జవాబుదారీతనం, శిష్యత్వం, పవిత్ర జీవితం, స్థానిక సంఘానికి కట్టుబడి ఉండగా మొదలగు వాక్యానుసారమైన ఆధిక్యతలు నేటి పరిచర్య ప్రణాళికల్లో కనబడలేదు. ఈ పద్ధతి సత్యాన్ని గ్రహించనారంభించిన వారికి మాత్రం పనిచేయదు. నిరంతర వాక్యమనే ఆహార లేమితో బాధపడే నిజ విశ్వాసులు తప్పనిసరిగా వారి ఆత్మలకు ఆహారాన్ని అన్వేషిస్తూ, శక్తివంతమైన వాక్యబోధ కలిగిన ఏదొక చిన్న సహవాసంలో అడుగుపెట్టి, వాక్యమనే విందు భోజనంతో వారి ఆకలిని తీర్చుకుంటారు.

 

నాయకుల్ని దేవుడే నియమిస్తాడు

దేవుని ప్రజల ఎదుగుదలను సాధ్యం చేసేది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మాత్రమే నమ్మే నాయకులు మనకవసరం. నా సంఘాన్ని నేను కడతానని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు (మత్తయి 16:18;). నిత్యము నిలిచియుండే జీవం గల దేవుని వాక్యాన్ని (1 పేతురు 1:24;) నమ్మే బాధ్యతకు రాజీనామా చేసిన నాయకుల చేతిలో గొర్రెలు నాశనమవుతుంటే మనం సోమరులుగా కూర్చోకూడదు. ఎన్నో విధాలైన నాయకులు వస్తారు, వెళ్లారు. అయితే ఎవరైతే పరిశుద్దాత్మ శక్తితో నమ్మకంగా జీవించి, జీవంగల దేవుని పక్షంగా మాట్లాడతారో వారే అసమాన రీతిలో ప్రజల్ని ప్రభావితం చేస్తారు. ఈ విషయంలో డెరెక్ ప్రైమ్ ఇచ్చిన స్పష్టత సహాయకరంగా ఉంటుంది. క్రైస్తవ నాయకత్వానికి ప్రధానంగా అవసరమైనదీ, ఇతర రంగాల్లో నాయకత్వానికి అస్సలు లేనిదీ నాయకుడు పరిశుద్ధాత్మతో నిండియుండడమే. ' మనిషిలోని సహజమైన ప్రతిభా సామర్థ్యాలు ప్రశంసించదగినవే. అయితే అవి ఆత్మీయంగా శక్తివంతమైన, వాక్య జ్ఞానం కలిగిన, సన్మార్గం నుండి తొలిగిపోని, స్థిరమైన ఆత్మీయ నాయకుణ్ణి తయారుచేయలేవు. దేవుని కృపా, ఆయన ఏర్పాటే అటువంటి వ్యక్తుల్ని లేపి, పరీక్షించి, పోషించేది.

ముఖ్యంగా క్రైస్తవ నాయకుల్ని క్రీస్తే తయారుచేస్తాడు. వారికి సహజ సామార్థ్యాలున్నప్పటికీ, సంఘ ప్రయోజనం నిమిత్తం వాటిని ఉపయోగించేందుకు వారిని బలపరచేది పరిశుద్దాత్ముడే. ఆయనను క్రీస్తు వారికి బహుమానంగా ఇచ్చాడు..... క్రీస్తు తన సంఘం కోసం నాయకుల్ని తయారుచేసి, సమకూర్చుతాడు..... ఇతర రంగాల్లో నాయకులు తాము పాసైన పరీక్షలనుబట్టి తమకు తాముగా పైకి వచ్చామనీ, తగిన కాలంలో అర్హులమయ్యామనీ తమను తాము వర్ణించుకుంటారు. అయితే క్రైస్తవ నాయకులు విషయంలో ఇది నిజం కాదని' ప్రైమ్ చెప్పాడు.

మనం మన బలహీనతను పూర్తిగా గుర్తించినపుడు, దేవుని చేతిలో మనం ఉపయోగపడే వేగం పెరుగుతుంది. ఇతరుల్ని నడిపించడానికి దేవుడే మనల్ని పిలవడం, అదే సమయంలో మనల్ని దేవుడే వెలిగించగలగడం అనేవి విరుద్ధ విషయాలుగా కనబడతాయి. ఈ వింత సత్యాన్ని ప్రతీ గొప్ప ఆత్మీయ నాయకుడూ ఒప్పుకొని తీరాల్సిందే! మనలోని ధైర్యాన్ని, ఆనందాన్ని భయభక్తులు అదుపుచేయాలి. భయభక్తులతోనే బహుభారమైన ఈ కార్యాన్ని చేయాలి. అలాంటి భయం లేకపోతే నాయకత్వ పాత్రనుండి తొలగిపోవాలి. నాయకత్వాన్ని గూర్చిన అత్యాస విషయంలో తరచుగా ప్రస్తావించే ఎ.డబ్ల్యూ. టోజర్‌ గారి మాట ఈ సందర్భంలో బలమైనదిగా చెప్పవచ్చు.

"నిజమైన నాయకునికి నడిపించాలనే ఆశ ఉండదు. అయితే అంతరంగంలో పరిశుద్ధాత్మ కలిగించు ఒత్తిడి, వెలుపలి పరిస్థితుల మూలంగా నాయకత్వ స్థానంలోకి అతడు బలవంతంగా వస్తాడు. పాత నిబంధన ప్రవక్తలైన మోషే, దావీదూ అలాంటి వారే. పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేసుకోకపోతే, ప్రభువైన యేసు పంపకపోతే నేటి దినాన పౌలులాంటి గొప్ప నాయకుడొకడు ఉండేవాడు కాడని నేను భావిస్తున్నాను. నడిపించాలనే అత్యాస కలిగిన వాడు నాయకునిగా ఉండడానికి అనర్హుడు. ఇది న్యాయమైన నమ్మదగిన కొలమానం. నిజమైన నాయకునికి దేవుని స్వాస్థ్యంపై ప్రభువుగా ఉండాలనే ఆశ ఉండదు. కానీ దీనమనస్సు, సాత్వికం, త్యాగబుద్దీ ఉంటాయి. తనకంటే జ్ఞానవంతుడైన, తలాంతులు కలిగిన వ్యక్తిని పరిశుద్దాత్మ చూపగానే ఇతరుల్ని నడిపించడానికి ఇష్టపడినట్లే, అతన్ని వెంబడించడానికి కూడా అతడు సిద్ధపడతాడు."

అపొస్తలుడైన పౌలువలె దేవునిపై ఆధారపడే నాయకుడు 'తన సామర్థ్యం దేవుని వలననే కలిగియున్నదనీ” (2 కొరింథీ 3:5;), మర్త్యుడైన ఏ మనిషికీ ఇంకొకరికి సహాయంచేసే సహజమైన ఆత్మీయ సామర్థ్యం లేదని స్నేహితునికి శత్రువుకీ కూడా బహిరంగంగా ప్రకటిస్తాడు. 'దేవుడు ఎవరినైతే నాయకులుగా చేస్తాడో వారే ఆ కార్యానికి నిజంగా సమర్థులవుతారు. ప్రభుత్వం పైనా, అధికారంపైనా దేవునికి ఉన్న సార్వభౌమాధికార శక్తిని బట్టి కృతజ్ఞతా భావంతో దేవుని ప్రజలు ఆయనను స్తుతించి, ఆరాధించారు. మానవ అభివృద్ధి నుంచి, ఆవిష్కరణల నుంచి, శక్తినుంచి కాక అసమానమైన అధికారంతో పరిపాలించు సర్వజ్ఞానియగు దేవునినుంచే హెచ్చు కలుగుతుందని 75వ కీర్తన 6,7; వచనాలు చెబుతున్నాయి. ఆయనే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. దేవుని ఆమోదమూ, శక్తి లేకుండా మనిషి దేనినీ సాధించలేడు. కనుక నాయకుల అధికారం ఆయన ఉద్దేశాల కనుగుణంగా ఉండాలి.

అంతేకాదు, ఆత్మీయ విషయాల్లో నాయకుని దైవిక స్వభావమే అధిక ప్రయోజనాన్నీ, దీర్ఘకాలిక అధికారాన్ని నిర్ధారిస్తుంది. ఇతరుల్ని దేవుని వైపు నడిపించాలంటే, నాయకుడు యేసుక్రీస్తుతో అన్యోన్యంగా జీవించాలి. వీధిలో దొరికే జ్ఞానంతో, ప్రజాదరణ పొందిన అభిప్రాయాలతో నాయకత్వ బాధ్యతను నిర్వర్తించే వారు ఆత్మీయ నాయకత్వంలోని సారాన్ని కోల్పోతున్నారు. దేవుని మహిమను ప్రదర్శించి, హెచ్చించడమే ఆత్మీయ ఆధిక్యతలన్నింటి వెనకున్న ఆశయం (1 కొరింథీ 10:31;). కనుక మొదటిగా నాయకులకూ తర్వాత వారు ప్రభావితం చేయు ప్రజలకూ పరిశుద్దతలో ఎదగడమే ప్రయోజనకరమైన నాయకత్వానికి గల కొలమానం. మరొక మాటలో చెప్పాలంటే నాయకుల స్వభావమూ, వారి నమ్మకమైన శ్రమయే అంతిమంగా వారి సేవను ప్రత్యేకమైనదిగా చేస్తుంది. అనుభవంతో ఇతరులు అందించే సహకారమూ, ప్రత్యేకమైన తలాంతులూ ప్రయోజనాన్ని కలిగించవచ్చేమో కానీ నిలిచియుండే ప్రభావాన్ని ఎంత మాత్రమూ కలిగించలేవు.

కృపగల ప్రభువా, నా ప్రభావాన్ని నా సొంత ఆవిష్కరణలకో ప్రజల తెలివితేటలూ, సృజనాత్మకతలకో ఆపాదించే పొరపాటునుంచి నన్ను రక్షించండి. నాయకత్వం మీరనుగ్రహించే ఆధిక్యత అనీ, లోకాశలతో ప్రజల్ని సంతోషపెట్టే సరిక్రొత్త గారడీలతో దానిని వ్యర్థంగా ఉపయోగించకూడదనీ నేను అన్ని వేళలా గుర్తించుకొనేలా చేయండి. సువార్త సేవ భారాన్ని సరిగా వివేచించి, మీ పరిపూర్ణ నాయకత్వం కోసం నడిపింపుకోసం పరితపించేలా, లోక సంబంధమైన అభివృద్ధిని కోరే కోరికకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి నాకు సహాయం చేయండి!

 

2. దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు

నాయకుల్లో వ్యక్తిగత ప్రతిభ గురించీ, వృత్తిలో నైపుణ్యం గురించి మాట్లాడే గ్రంథాల సంఖ్య పెరిగిపోతోంది. అయితే క్రొత్త నిబంధన మాత్రం ఆత్మీయ నాయకత్వాన్ని కేవలం భక్తి జీవితంతో మాత్రమే ముడిపెడుతోంది. “ఆత్మలో, స్వభావంలో పరిశుద్ధతను మనం అపేక్షిద్దాం. సమర్పణ కలిగిన జీవితం నుంచీ, పరిశుద్ధమైన జీవితాన్నుంచీ గొప్ప శక్తి ఉద్భవిస్తుంది. ఇదే మన పొరుగువారిని ప్రభావితం చేస్తుంది.” అని భక్తుడైన చార్లెస్ స్పర్జన్ చెప్పాడు. ఆత్మీయ జీవితమున్న చోట మన నాయకత్వం ఈ లోక సంబంధమైన తాత్కాలిక ప్రయోజనాన్ని కాక నిత్యఫలాన్ని కలుగజేస్తుంది. క్రీస్తు పట్ల చూపించే లోతైన భక్తి అనే నేలనుంచే మన నాయకత్వంలోని శక్తి పెరుగుతుంది. దేవుని చేతిలో వాడబడుటను నేరుగా దుష్టత్వానికి దూరంగా ఉండుటతోనే అపొస్తలుడైన పౌలు ముడిపెట్టాడు (2 తిమోతి 2:21;). దేవుడు ఏర్పరుచుకున్న నాయకులు "తమ్ము తాము పవిత్రపరచుకొనిన మెడల, వారు పరిశుద్దపరచబడినవారై, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యున్నప్పుడు” శాశ్వతమైన ప్రభావాన్ని కలిగిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే దేవుడు మనల్ని వాడుకోవడమనేది భక్తిగా జీవించిన తర్వాతనే సంభవిస్తుంది. రెండు సంవత్సరాల క్రితం సంఘ నాయకుల సమావేశానికి హాజరై, అక్కడున్న ఒక పుస్తకశాలలో బిబ్లికల్ కౌన్సిలింగ్ (వాక్యానుసారంగా సమస్యలను పరిష్యరించడం ఎలా?) అను అంశంపై క్రొత్త గ్రంథాన్నొకటి చూశాను. నా సంఘ పరిచర్యకు విలువైన గ్రంథమొకటి దొరుకుతుందేమోనన్న ఆశ కలిగి ఉత్సాహంతో దానిని తీశాను. అయితే ఆ గ్రంథ రచయితల్లో ఒకని పేరును చూడగానే, అతని నైతిక జీవితానికి సంబంధించిన చెడ్డ సాక్ష్యాన్ని గుర్తుచేసుకుని పుస్తకంపై ఏ మాత్రం ఆసక్తి లేక తక్షణమే దానిని యథాస్థానంలో పెట్టేసాను. అయితే ఇదే వ్యక్తి తన పాప జీవితాన్ని బట్టి ఏ మాత్రం వెనక్కి తగ్గక ఒక క్రైస్తవ విశ్వవిద్యాలయంలో బోధించుట గమనించి నేను మరింత దిగ్బ్రాంతికి గురయ్యాను. నిందించతగిన జీవితమున్న వ్యక్తులను సంఘానికి బోధించు విధంగా మనమెందుకు అనుమతించాం? వారి ఉపదేశం లేకుండా మనం జీవించలేమా? వారికి బోధించే అవకాశం ఇవ్వకపోతే మనం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించాం అనేంతగా వారి వరాలున్నాయా? పరిశుద్ధమైన జీవితాన్నుంచే ఆత్మీయ నాయకత్వం అంకురిస్తుంది. నీతి ప్రజాదరణపొందకపోవచ్చు కానీ, శక్తివంతుడైన నాయకుని తయారుచేయడానికి మాత్రం దానికి ప్రత్యర్థులుండకూడదు. సంఘంలో నాయకునికి ఉండాల్సిన అర్హతల్లో వ్యక్తిగత పరిశుద్ధతకు మించినది ఏదీ లేదు. పరిశుద్ధత స్థిరమైనది, ప్రశంసించదగినది, ప్రజల్ని ప్రభావితం చేయగలిగింది.

 

వాస్తవ పరిచర్య - అవమాన లేమి

రాబోయే తరాన్ని చేరుకోవాలంటే మన చుట్టూ ఉండే వారి నమ్మకాల్లోనూ, వారి అపవిత్ర కార్యకలాపాల్లోనూ మనం ఏకీభవించాలని సత్య సంఘంలోని నాయకులు చెబుతున్నారు. దీనిమూలంగా నేడు సంఘాల్లో తీవ్రమైన గందరగోళం చోటుచేసుకుంటోంది. శరీరేచ్ఛలూ, లోకమర్యాదలూ, కామాతురతా, పతనమైన వారి మాటల్లో కామంతో కూడిన స్పష్టమైన సందేశమూ సువార్తకు అడ్డం కాకూడదని వారు మనకు చెబుతున్నారు. మనం నిజంగా సువార్త భారంగల వ్యక్తులమైతే అటువంటి కార్యక్రమాల్లో హృదయపూర్వకంగా లీనమై అన్ని విషయాల్లో మనం కూడా అవిశ్వాసుల్లాంటి వారమేననీ, స్వభావంలో మార్పూ పరిశుద్ధమైన జీవితమూ నిజంగా యేసును ఎరగడానికి అత్యవసరమైనవి కావనీ వారు గ్రహించేలా చేయాలని వారు వాదిస్తున్నారు. ఈ భావాన్ని బలంగా సమర్థించేవారు ఈ కార్యక్రమాలను సంఘ నాయకత్వంలోనికి తీసుకొచ్చారు. ఆరాధన కార్యక్రమంలో సంఘం ముందు నిలబడి నాయకులు ప్రజల్ని నవ్వించాలని అనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో తమ ప్రసంగాల్ని అశ్లీలంతో కూడిన, అనుచితమైన పదజాలంతో నింపి ప్రజలకు ఊపిరాడకుండా చేస్తున్నారు. ఇలా చేస్తూ నైతికత విషయంలో కాపరులు నిందారహితులుగా ఉండాలని బోధించే క్రొత్త నిబంధనకు విరుద్ధంగా నిలుస్తున్నారు.

వాక్య ప్రమాణాల కనుగుణమైన జీవితాన్ని నిరంతరం ఉల్లంఘించడం వారి వివేచనపై ఎటువంటి తీవ్రమైన ప్రభావాన్ని కలిగించదనీ, సంఘాలన్నీ సాధ్యమైనంత ఎక్కువగా అత్యంత స్పష్టమైన అపవిత్ర కార్యాలను బట్టి శక్తి పొందుతున్నట్లు వారు భావిస్తున్నారు. ఇది ఎంత జుగుప్సాకరమో కదా! నేను మూర్ఖుడిలా కనబడవచ్చు. సువార్తీకరణ ప్రధాన ఆశయం క్రీస్తు అనుగ్రహించే పాప క్షమాపణ. పాపంపై, శరీరేచ్ఛలపై, శోధనలపై ఆ సువార్త శక్తిని ప్రదర్శించాలి. కాబట్టి సువార్త ప్రజలకు అన్వయిస్తూ, నాయకులు వాటిని అణచడానికి అధికంగా చెమటోడ్చాలి! యేసు క్రీస్తు నిమిత్తం నశించిన వారి ఆత్మలను చేరుకోవడమంటే కేవలం వారి పాప జీవితాలకు యేసును అదనంగా చేర్చడమేనా? మనం అవిశ్వాసులకు అందిస్తున్నది వారిని నిజంగా విగ్రహారాధన నుంచీ, అపవిత్రత నుంచి విడిపించగల సువార్తనా? లేదా అటువంటి నాశనకరమైన బానిసత్వాన్ని సాధారణమైనదిగా పునర్నిర్వచించి, తద్వారా దేవుని రక్షణా కార్యాన్ని అల్పమైనదిగా చేసే సువార్తనా?

యేసుక్రీస్తు కోసం లోకాన్ని ప్రభావితం చేయుటలో సంఘం పరిణితి చెందినదనే సూచనకు ఈ పద్దతులు సుదూరంలో ఉన్నాయి. నిజమైన పరిశుద్ధతకు అవసరమైన క్రైస్తవ నియమాలను పూర్తిగా విడిచి పెట్టేయడాన్నే అటువంటి ప్రవర్తన వ్యక్తీకరిస్తోంది. వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం, శక్తివంతంగా వాక్య బోధ చేయడం అనేవి సహజాతీతమైన ఉపకరణాలు. వీటినుపయోగించి పరిశుద్దాత్ముడు మన మనస్సుల్నీ, స్వభావాల్ని మారుస్తాడు. కానుకలర్పించడం, ప్రార్థన, వాక్య ధ్యానం, సంఘ ఆరాధన, సువార్తీకరణ, ఆత్మీయ పరిచర్య, ఉపవాసం మొదలగునవన్నీ మన పరిశుద్ధతలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. నేటి సత్య సంఘంలోని యువ నాయకులనేకులు పరిశుద్ధపరిచే నియమాల మూలంగా కాక సిగ్గు లేకుండా అశ్లీలాన్ని అతిగా అపేక్షించే మన సంస్కృతి మూలంగా తయారైనవారు. వీరు ఆసక్తికరంగా అన్వేషించే విషయాలు చాలా ఉన్నాయి. కానీ అందులో వ్యక్తిగత పరిశుద్ధత మాత్రం లేదు. 'పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు ........ ప్రతీ సత్కార్యమునకు సిద్ధపరచబడిన' పాత్రలుగా మారడానికి బదులు కామాతురతను బట్టి వారు శక్తివంతులుగా తయారవుతున్నట్టు వారు భావిస్తున్నారు.

నేటి సంఘ పరిచర్యలో అమర్యాదపూర్వకమైన వికృతచేష్టలు సరిక్రొత్త రీతిలో చాలా బహిరంగంగా జరుగుచున్నాయి. మనుషులు చేసే జుగుప్సాకరమైన పనుల్ని సిగ్గులేకుండా రియాల్టీ టీ.వీ. షోలు ప్రసారం చేస్తున్నాయి. ఈ ప్రసారాలు సామాన్యమైనవిగా, ఏ మాత్రం భయపెట్టనివిగా ఉన్నాయి. జాతీయ టెలివిజన్లో ప్రజా గౌరవాన్ని భంగపరచడాన్నే గొప్ప వినోదమనే భావనతో మన సంస్కృతీ, మీడియాలూ నింపబడడం రహస్యమేమీ కాదు. ఎగతాళి చేస్తున్న జనం ముందు తీవ్రమైన శ్రమా, మొరటైన ఉద్రేకమూ, ఘోరమైన అశ్లీల ప్రదర్శన ఆకర్షణీయమైన రేటింగు పెంచుతున్నాయంటే, భయంకరమైన తప్పిదమేదో ఉంది టీ.వీ. లో ప్రసారమయ్యే వినోదాన్ని వీక్షించడానికి సాయంత్రం పూట అల్పాహారాన్ని ముందు ఉంచుకుని వీక్షకులు సిద్ధపడుచుండగా కష్టనష్టాలలో ఉన్న ప్రజల వ్యక్తిగత విషయాలలో కనబడే అమర్యాదకరమైన, అసభ్యకరమైన ప్రవర్తనలను రికార్డు చేసి ప్రసారం చేసే రియాల్టీ టి.వి. షోలు మనకున్నాయి. కార్యక్రమాల్లో పాల్గొనేవారు సైతం వీక్షక లోకం ముందు తమ చౌకబారు జీవితాలను డంబంగా ప్రదర్శించడానికి అతిశయిస్తున్నారు. పరిణితి లేని భ్రష్టులైన యువత చేసే ప్రమాదకరమైన సాహస కార్యాల్ని గొప్పగా చూపించే సినిమాలు చూడడానికి కోట్లాది రూపాయలను మన సమాజం కూడా ఏ మాత్రం సిగ్గులేకుండా వెచ్చిస్తోంది. అలాంటి వినోదం మన ఇంద్రియాలపై, మనస్సాక్షులపై నాశనకరమైన ప్రభావాన్ని కలిగిస్తోంది. సంఘం ఈ కార్యక్రమాలకు అతిగా బహిర్గతమై ఇబ్బందికి గురవుతోంది. దీని వలన క్రైస్తవులు మంచి చెడులను వివేచించే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు (1 థెస్స 5:2;; హెబ్రీ 5:14;). ఈ ఆకర్షణీయమైన భోగాసక్తి అత్యంత నీచమైన ఆత్మీయ జీవితాన్ని సైతం విశ్వాసులకు సామాన్యమైనదిగా పరిగణించే నూతన సంఘ పరిస్థితులను కలిగిస్తోంది. “నిజమైన క్రైస్తవుడు కూడా పరిశుద్ధంగా నేడు జీవించలేడనే ఆలోచనతో పరిశుద్ధత కోసం పోరాటం చేసేవాణ్ణి వెర్రివాడని పిలుస్తున్నారు. థామస్ మర్ఫీ 'పాస్టోరల్ థియాలజీ' అనే తన మహాగ్రంథంలో భావి తరాల్లో నాయకులకు భక్తి జీవితపు శక్తి గురించి తెలియచేస్తూ ఈ క్రింది సవాలు చేసాడు.

వాక్య పరిచర్య అనేది ఎంతో పవిత్రమైన కార్యం. ఈ కార్యానికి సిద్ధపడటానికి ముందే భక్తి జీవితముంటుంది. ఈ విషయం నిస్సందేహమైనది. తలాంతులు, విద్య, అధ్యయనం, అనుకూల పరిస్థితులు, పనిలో నేర్పరితనం, ప్రసంగాలను సిద్ధపరచుటలో మెళకువ మొదలగు వాటికి ముందే భక్తి జీవితం ఉంటుంది. ఈ భక్తి జీవితమే పరిచర్యలోని ప్రతి అంశానికి గుణాన్నీ, స్వరాన్నీ, బలాన్ని ఇవ్వడానికి అవసరం. దీర్ఘకాల ముండే సంతృప్తికరమైన పరిచర్యను జరిగించడానికి ఈ ఉన్నతమైన ఆత్మీయత తప్ప మరేదీ ఉపయోగపడదు. మిగిలినవన్నీ పునాది లేకుండా నిర్మించిన భవనం లాంటివే! యవ్వన సేవకుల హృదయాల్లో ప్రారంభం నుంచే ఈ సత్యం లోతుగా నాటుకొంటే ఎంత గొప్పగా ఉంటుందో కదా! భక్తి జీవితం లేకుండా పవిత్ర కార్యమైన పరిచర్యలో సాఫల్యాన్ని ఆశించకూడదు. భక్తి జీవితాన్ని తీక్షణంగా అపేక్షించకపోతే బోధ తన అధికారాన్ని పోగొట్టుకుంటుంది, శిష్యరికం భావోద్వేగాలు లేని బాధ్యత అవుతుంది, ప్రార్థన వేషధారణ అవుతుంది.

 

నాగరికులైన నాయకులు

ఆత్మీయ నాయకత్వం ముఖ్యంగా సద్గుణాన్ని బట్టి కాక ప్రజాదరణ పొందిన ధోరణినిబట్టీ, పైపై ఆకర్షణనుబట్టీ వర్థిల్లితే, దేవుని ప్రజలు ఎన్నో తరాలు శ్రమ నెదుర్కొంటారు. రాజును ఎన్నుకున్నప్పుడు దేవుని హృదయానుసారుడైన నాయకుణ్ణి కోరుకొనుటలో విఫలమై ఇశ్రాయేలీయులు వేసిన నాశనకరమైన బాటను సమూయేలు మొదటి గ్రంథం తెలియచేసింది. నిందారహితంగానూ, దేవునికిష్టుడుగానూ జీవించిన సేవకుడు సమూయేలు. రాజుగా సౌలును నియమించక ముందు, అతని ద్వారా ప్రజలు తమ రక్షణ, నడిపింపు, భద్రతల విషయంలో కేవలం దేవుని వైపే చూసారు (1 సమూ 7:8-12;). అయితే ఇశ్రాయేలీయులు మనుషులకు భయపడ్డారు, పొరుగు దేశాల భద్రతా శక్తిని అతిగా కాంక్షించారు. వారి హృదయంలోని అహంకారాన్ని బట్టి వారికొక నాయకుడు కావాలని వాళ్ళు డిమాండ్ చేసారు. వారి అవివేక ఆలోచనను బట్టి సమూయేలు ఇశ్రాయేలీయుల్ని హెచ్చరించాడు. రాజును పాలనలో ఉంటే సంభవించే పరిణామాల్ని దేవుడు ముందుగానే తెలియజేసాడు. అయితే వెంటనే ఆ మాటను త్రోసిపుచ్చి, ఆ కాలానికనుగుణమైన వ్యక్తిని వాళ్ళు కోరుకున్నారు. శత్రువులకు తమను బలహీనులుగా చూపే నాయకుడు గొప్ప భక్తుడైనా సరే వారి కవసరం లేదు, వారు అతనిని అనుసరించరు. దేవునిపై ఎక్కువగా ఆధారపడడమే జీవితాన్ని దుర్భరంగా మార్చిందని భావిస్తూ దేవుడిచ్చే భద్రతనూ, సమృద్ధినీ ప్రజలు తమ నమ్మలేకపోయారు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తినీ, పొరుగు దేశ ఆచారాలతో కలిసిపోయేలా చేసే వ్యక్తినీ రాజుగా చేసుకోవాలన్నది వారి ప్రధాన ఆశయం. సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజును నియమింపుము (1 సమూ 8:5;) అని వారు పలికిన మాటలో వారి ఆలోచన స్పష్టమవుతోంది. వారి చుట్టు ప్రక్కల రాజ్యాల్లో శక్తివంతమైన అధికారానికి, నైపుణ్యానికి ప్రమాణంగా ఉన్న నాయకులున్నారు. వారిని చూసి ఇశ్రాయేలీయులు అసూయపడ్డారు.

బలమైన నాయకత్వమంటే ప్రజల గమనాన్ని ఆకర్షించి, అధికారాన్ని సమర్థవంతంగా వినియోగించే సామర్థ్యం అని నేటి అభిప్రాయం. ఇశ్రాయేలీయుల ఆలోచన కూడా ఇలాంటిదే. ఒక మహోన్నత కార్యాన్ని సాధించడానికి ప్రజలను పురికొల్పి, ప్రోత్సహించవచ్చేమో కానీ, నైతికత అనే చుక్కాని లేకపోతే మాత్రం ప్రజలు గర్వమనే రాళ్లనూ, వివాదాలనే ఒడ్డునూ ఢీ కొంటారు. ఒక స్థిరమైన వాక్య సిద్ధాంతాన్ని కాక ఏ బోధనైనా అనుసరిస్తూ ఎటువంటి నైతికతనైనా సహించే పరిచర్య తత్వాన్ని కలిగిన ఎమర్జెంట్ చర్చ్  లో కూడా ఇటువంటి ప్రాణాంతకమైన లోపమే ఉంది. వారెంత అనుకూలంగా మారినా, ఐకమత్యంతో మెలిగినా, ఆ ప్రయత్నాలేమీ 'శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు' (కొలస్సీ 2:23;). కనుక విస్తారమైన పాపమే అనివార్యమైన ఫలితం. నైతిక విలువలు లేని ఘన కార్యాలను మనం సాధిస్తూ ఉంటే, ఆత్మ వంచనకు గురి కాకుండా మన హృదయాల్ని మనం కాపాడుకోలేము.

మన హృదయాలది మోసకరమైన వక్రబుద్ధి. దేవుని కృపలేకపోతే దానికి వ్యతిరేకంగా యుద్ధం చేయగలిగే సామర్థ్యం మనలో ఏ ఒక్కరికీ లేదు. ఇక దుష్టుడు పన్నే కుయుక్తితో కూడిన పన్నాగాల విషయమైతే అసలు చెప్పనక్కరలేదు. “నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు ఉంచబడెను” ( 2 కొరింథీ 12:7) అని చరిత్రలో అత్యంత గొప్ప ఆత్మీయ నాయకుల్లో ఒకడైన అపొస్తలుడైన పౌలు తన బలహీనత గురించి రాసాడు. చాలా ఉన్నతంగా ఇతరుల్ని ప్రభావితం చేయగలిగే ఆధిక్యతను దేవుడు నాయకులకు అనుగ్రహిస్తాడు. ఆ నాయకుల్లోని పాపేచ్ఛలను సిలువవేయడానికి దేవుడు తీవ్రమైన ఒత్తిడినీ, శ్రమనూ ఉపయోగించుకుంటాడు. అధునాతనమైన, అభివృద్ధిచెందిన వస్తువులు అందుబాటులోకి వచ్చినప్పుడు ఇంతకుముందు ఉపయోగించిన వస్తువుల్ని ప్రజలు మర్చిపోతారు. సచ్ఛిలత లేకుండానే ఎన్నో గొప్ప కార్యాలు చేసి, ఎంతోమంది అనుచరుల్ని పోగుచేసుకున్న నాయకుడు కూడా ప్రజలు మర్చిపోయే ఆ పాత వస్తువులాంటివాడే!

నాయకుడనే గుర్తింపు పొందడం నేడు సులభమైనట్లు గతంలో ఎన్నడూ లేదు. ఒక గ్రంథాన్ని రచించిన వ్యక్తినీ లేదా డాక్టరేట్ సంపాదించిన వ్యక్తినీ వెంటనే నిపుణునిగా, నాయకునిగా నేటి సమాజం పేర్కొంటోంది. నాయకులు కావాలని కోరే వారిలో తాము నిజంగానే నడిపించడానికి అర్హులయ్యామనే భావం కలిగించడానికి నిపుణులైన సలహాదారులు "పేరు ప్రతిష్ఠలనెలా నిర్వహించుకోవాలనే” పాఠాల్ని బోధిస్తున్నారు. సరైన సహాయ సహకారాలుంటే ప్రజలు ఎంతో హడావుడిని సృష్టించ వచ్చు కానీ, వారు నిజానికి కపటనాయకులు; వారిలో ఛాయయేగాని సారం లేదు' అని హెన్రీ, రిచర్డ్ బ్లాకబే లు చెప్పారు.

ఇతర రాజ్యాలవలె రాజులూ చక్రవర్తులూ తమను పరిపాలించాలనే ఆశ మాత్రమే కాదు, గానీ దేశానికి భద్రతనూ ఆర్థిక సౌకర్యాలనూ అందించి రాజకీయంగా, సైనికపరంగా దేశాన్ని తన యుక్తితో నడిపిస్తూ భయం కలిగించే నాయకుడు వారికి ఉండాలనే ఉద్దేశంతోనే ఇశ్రాయేలీయులు రాజును డిమాండ్ చేసారు ('మా ముందర పోవుచు మా యుద్ధములను చేసే రాజు మాకు కావలెను' - 1 సమూ 8:19-20;). రాజు కోసం వారు చేసిన మనవిని బట్టి సౌలును వారికి రాజుగా అనుగ్రహించినపుడు, సౌలు భౌతిక దేహధారుడ్యాన్ని చూసి ప్రజలు ఆనందం పట్టలేకపోయారు (1 సమూ 10:24;). నాయకత్వానికి తగిన అర్హత గురించి వారికున్న అభిప్రాయం అకస్మాత్తుగా చాలా నీచమైన స్థాయికి దిగజారిపోయింది. దేశపు అత్యున్నత వ్యక్తికి ప్రధానంగా ఉండాల్సినవి ప్రజాభిమానం, ఇహలోక సంపద, భౌతిక రూపాలేనని వారి ఆలోచన. తిరుగుబాటుతో దేవుని ప్రజలు చేసిన తప్పిదం చాలా ఘోరమైందని ఋజువైంది. దేవుని దీర్ఘశాంతాన్ని బట్టి, దయను బట్టి విజయవంతంగా మొదలైన సౌలు పరిపాలన అతని అసంపూర్ణ హృదయంతో కూడిన విధేయత కారణంగా, వేషధారణతో నిండిన ఆరాధన మూలంగా దేశ ప్రజలపై కఠిన శిక్షతో ముగిసిపోయింది. మనుష్యులంటే అతనికున్న భయం అతనిని అంగీకారయోగ్యం కాని బలి అర్పించడానికి ప్రేరేపించింది (1 సమూ 13:8-13;). పాపంతో తేలికగా వ్యవహరించడానికి తన పిరికితనం, స్వీయభద్రతలు కారణమయ్యాయి (1 సమూ 14:32-35;). దేవునికి వ్యతిరేకంగా అతడు చేసిన ఆత్మీయ ద్రోహం అతని పాలనను విషాదకరమైన రీతిలో ముగింపుకు తెచ్చింది (1 సమూ 15:1-33).

యెష్షయి కుమారుడైన దావీదు యవ్వనస్థుడు, గొర్రెల కాపరీ. అతనికి ఏ విధమైన పాలనా అనుభవమూ, హోదా, గొప్పతనాలు లేవు. అయినా అతణ్ణి అభిషేకించి నాయకత్వంపై ఇశ్రాయేలీయులకున్న దురభిప్రాయాన్ని దేవుడు ఖండించాడు. “అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను - అతని (దావీదు అన్నమైన ఏలీయాబు) రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుష్యులు లక్ష్య పెట్టువాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును” (1 సమూ 16:7). అందరికంటే దేవునికి ఎక్కువ భయపడాలనే హృదయ పరీక్షలో దావీదు సహోదరుల్లో ఏ ఒక్కరూ పాసవ్వలేదు. ప్రతిష్ఠిత కార్యం జరిగే మహిమకరమైన స్థలానికి నిగర్వీ, గొర్రెల కాపరీ అయిన దావీదు చేరుకున్నప్పుడు, ప్రజల్ని నడిపించడానికి తానేర్పరుచుకున్న యవ్వనస్థుడు అతడేనని దేవుడు ధృవీకరించాడు (1 సమూ 16:12;).

దేవునికి సంబంధించి ఆత్మీయ నాయకత్వంలో మనల్ని ఉపయోగకరంగా చేసేది మన హృదయమే! నీతి సత్యాలు కొరవడిన జీవితంలో ఒకని అధికారం సదా వాటి స్థానాన్ని భర్తీ చేస్తాయని మనం భావించినప్పుడే ఇతరుల జీవితాలకు అత్యంత తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఆత్మీయ నాయకత్వమనే భారాన్నీ ఆధిక్యతనూ అపేక్షించే వారెవరైనా దేవుని అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందే ముందు తన నడతను గూర్చిన దేవుని పరీక్షలో పాసవ్వాలి. మన గమనాన్ని వాటివైపు మళ్లించదగినంత యోగ్యత కలిగిన సుగుణాలు అనేకం ఉన్నాయి. అయితే ప్రతీ ఆత్మీయ నాయకుని పరిచర్యను పరిపూర్ణం చేసే ముఖ్య లక్షణాల్ని మనం రాబోయే మూడు అధ్యాయాల్లో పరిశీలిద్దాం. పరలోక తండ్రీ, మీరు సమస్తాన్ని చూస్తారనీ, మీ దృష్టికి మరుగైనదేదీ లేదని నాకు తెలుసు. బాహ్య రూపానికి వ్యర్థమైన ఆకర్షణలకు లోబడకుండా నా హృదయాన్ని కాపాడండి. నా హృదయమూ, మనస్సూ మీ సత్యంతో పూర్తిగా నిండిపోతే అది మీకు అత్యధికమైన ఆనందాన్నిస్తుంది. మీ నాయకత్వాన్ని ఎన్నడూ సందేహించకుండా, విజయం గురించి నాకున్న అభిప్రాయాన్ని మీ వాక్యానికి లోబడేలా నాకు సహాయం చేయండి, ఆమెన్!

 

3. సాత్వికమనే ఒరలో దాగియున్న బలం

ఇంగ్లాండు దేశంలో బార్న్ స్టేపల్ అను పట్టణంలో ఎబినెజర్ చాపెల్ ఉంది. అందులో రాబర్ట్ చామన్ ఎన్నో సంవత్సరాలు కాపరిగా పనిచేసాడు. అతడు ఇతరుల యెడల అసాధారణ ఓర్పునూ, ప్రేమనూ కనపరిచాడు. దాన్ని ప్రజలు గుర్తించారు. ఆ చిన్న సంఘంలో ఉన్న పరిశుద్ధులకు శ్రమ లెదురైనప్పుడు అతడు నిస్వార్థంగా సేవ చేసాడు. ఆ సేవ అతని గొప్ప సాత్వికం నుంచీ, తాను అయోగ్యుడననే మనుస్సులోంచి ఉద్భవించింది. ఒక నాయకుడు దీనమనస్సుతో, దేవునిపై ఎంత ఎక్కువగా దేవునిపై ఆధారపడతాడో అంత లోతుగా అతని భక్తి ఉంటుంది అని చాప్మన్ అభిప్రాయం.

ప్రభువైన యేసు సేవకుడు సమయమందును అసమయమందును అందుబాటులో ఉండాలి. అతడు ఎవరికి లెక్క అప్పగించవలసియున్నదో ఆ ప్రభువుకు దూతనని ఎరిగి ఎల్లప్పుడూ ఆయనదగ్గర నేర్చుకోవాలి. నిరంతరం ఇతరులకు పరిచర్య చేయవలసిన వాడని గుర్తించి, కృపా సంపన్నుడైన దేవునినుంచి తాజా ఉపకరణాలను అన్ని మార్గాల్లోనుండి పొందుతూ ఉండాలి. అన్ని విషయాల్లో క్రీస్తును ఘనపరుస్తూ, ఇతరుల అధికారాన్ని అంగీకరించాలి. ఆ బలమైన నాయకత్వం వెనకున్న నిజమైన శక్తి ఏమిటోననే విషయంలో నేటి సంఘం అయోమయంలో ఉంది. ప్రశ్నల్ని లేవనెత్తి, నూతన భావాల్ని పరిచయం చేసే సాహసం చేయలేక, విసిగి వేసారిన సిబ్బంది పలు సంఘాల్లో ఉన్నారు. నిగర్వియై, సేవకుని మనస్సు కలిగిన నాయకుడు అనూహ్యంగా పెరిగిన జనసంఖ్యనూ, అధిక రాబడినీ, ఘనకార్యాలనూ పెద్దగా పట్టించుకోడు. దీనమనస్సు బలహీన మైనది కనుక గొప్ప కార్యాల్ని సాధించేట్లు ఇతరుల్ని పురికొల్పదని ప్రజల అభిప్రాయం.

రెండు సంవత్సరాల క్రితం మోషే జీవిత చరిత్రను 'ప్రిన్స్ ఈజిప్ట్' అనే పేరుతో స్టీవెన్ స్పిల్ బర్గ్ యానిమేటెడ్ చిత్రంగా నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి కథా, మాటలతో ఇద్దరు రచయితలు నన్ను సంప్రదించారు. అప్పుడు దీనమనస్సు గొప్ప కార్యాలు చేసేట్లు ఇతరులను పురికొల్పదనే లోక అభిప్రాయం నాకు స్పష్టంగా అర్థమయ్యింది. నిర్మాణ ప్రారంభానికి ముందే ఆ చిత్రం వాక్యంలో దేవుడు రాయించిన వాస్తవాలకు అద్దంపట్టేదిగా ఉండాలనే ఆలోచనతో ఆ ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఇవాంజెలికల్ (సత్యవాక్య సిద్ధాంతాన్ని నమ్మే) వారి దృక్పథాన్ని వినాలని తీర్మానించుకున్నాడు. తొలి రాత ప్రతిని చదివిన తర్వాత, మోషే జీవిత సారాన్ని వారు పూర్తిగా అపార్థం చేసుకున్నారని నేను నిర్మొహమాటంగా చెప్పాను. దుష్ట సామ్రాజ్య కబంధ హస్తాల్లో నలిగిపోతున్న తన ప్రజల శ్రమను చూసి ఏ మాత్రం సహించలేని వ్యక్తనీ, అసాధారణ జాలి హృదయం కలవాడనీ వారి తొలి రాత ప్రతి మోషేను చిత్రించింది. అత్యంత శక్తివంతుడైన ఇశ్రాయేలు నాయకుడు ఓర్పు సహనం లేనివాడు, పోటీతత్వం కలవాడు, ఎవరిపైనా ఆధారపడనివాడు, ఒకరి ప్రేరణ అవసరం లేనివాడు, క్రూరమైన లోకాన్నుంచి తన ప్రజలను విముక్తుల్ని చేయాలనే ఆశయంతో విజయ దాహం కలిగిన విప్లవకారుడు కావాల్సివచ్చింది. నేను బైబిల్ తెరచి, సంఖ్యాకాండము 12:3;లో దేవుడు రాయించిన మోషే ముఖ్య లక్షణం సాత్వికం అని చూపగానే వారికి మాటలు పెగల్లేదు. మోషే జీవితం మోషే గురించి కాదు కానీ, దేవుని గురించి తెలియచేస్తోందని వారికి చెప్పాను. ఆ చిత్రం విడుదలైనపుడు, బైబిల్ వర్ణించిన మోషే మచ్చుకైనా కనబడలేదు. దేవుని మహిమను కనబరిచే దీనమైన సాధనంగా కాక బానిసత్వానికి వ్యతిరేకంగా, మానవ హక్కులు కోసం పోరాడే యోధునిగా స్పిల్‌బర్గ్ నిర్మించిన 'ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్' మోషేను చిత్రించింది. స్పెషల్ ఎఫెక్ట్స్ మహాత్మ్యం కదా! అలానే ఉంటుంది.

 

సాత్వికం నాసిరకపు లక్షణమా?

చాలామంది రచయితలు సాత్వికాన్ని యోగ్యమైన లక్షణంగానే ప్రస్తావిస్తున్నారు. అయితే ఆశయాన్నీ అనుచర గణాన్నీ అభివృద్ధి చేసుకొనుట, సృజనాత్మకత, అధికార దర్పాలనే లక్షణాలను శ్రేష్ఠమైనవిగా చూపించిన తర్వాత ఆఖరి పేజీ చివర్లో వాళ్ళు సాత్వికమనే లక్షణాన్ని వివరిస్తున్నారు. గొప్ప నాయకత్వానికి అత్యవసరమైన లక్షణాల్లో ముఖ్యమైంది సాత్వికమని అప్పుడప్పుడు కొద్దిమంది వ్యాపారవేత్తలే చెబుతున్నారు. చిరు వ్యాపారాన్ని బ్రహ్మాండమైన వ్యాపారంగా మార్చడమెలాగో తెలియచేసే 'గుడ్ టు గ్రేట్' అనే అత్యంత విలువైన గ్రంథాన్ని జిమ్ కొలిన్స్- రచించాడు. దేశంలో అత్యుత్తమ నాయకుల్లో ఉన్న గొప్ప లక్షణాల్లో సాత్వికమైన మనస్సు ఒకటని అతడు తెలియచేసాడు. విజయవంతమైన వివిధ కంపెనీల్లో కొలిన్స్ చేసిన పరిశోధన సాత్వికాన్ని లౌకిక పద్ధతిలో ఉదాహరిస్తుంది. ఈ పద్ధతిలో అతి పెద్ద ఆశయాలను నెరవేర్చడానికి నిస్వార్థం, అదృష్టం అనేవి ముఖ్యాంశాలు. సాత్వికాన్ని ఎలా ఆచరణలో పెట్టాలో కొలిన్స్ తన పరిశోధనలో తెలియచేయడం ఆశ్చర్యమేమీ కాదు.

గొప్పలు చెప్పుకోవడానికి దూరంగా ఉండుట ద్వారా, ఇతరులు సాధించిన దానిని గుర్తించి అభినందించుట ద్వారా, బహిరంగంగా వచ్చు పొగడ్తలను వ్యతిరేకించుట ద్వారా సాత్వికమను లక్షణాన్ని సాధన చేయవచ్చని కొలిన్స్ తెలియజేసాడు. సంఘంలో ఉన్న వారికంటే క్రైస్తవేతరులే దీనత్వపు ప్రాముఖ్యత గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని కొలిన్స్ రచించిన గ్రంథం తెలియజేస్తోంది. “సేవకుడైన నాయకుని హృదయానికి ముఖ్యమైంది సాత్వికమే. సాత్వికులు తమను తాము తక్కువగా ఎంచుకొంటారని  కెన్ బ్లాంచర్డ్ కంపెనీల సహ వ్యవస్థాపకుడు స్పష్టంచేసాడు. వ్యాపారాలను సమర్థవంతంగా ఎలా నడిపించాలో ఈ కంపెనీ నేర్పిస్తుంది. అయితే కొంతమంది వాక్యాన్ని నమ్మే నాయకులు రచించిన గ్రంథాల్లో సాత్వికాన్ని గూర్చిన చర్చ నెమ్మదిగా కనుమరుగవుతోంది. దీనత్వపు గొప్పతనాన్ని క్రైస్తవ సమాజం గౌరవం చూపిస్తున్నప్పటికీ, ఆచరణలో మాత్రం తరచుగా గర్వమే గెలుస్తోంది.

పెరుగుచున్న ఈ ధోరణినిబట్టి చర్చ్ గ్రోత్ మూవ్మెంట్ (సంఘాభివృద్ధి - ఉద్యమం) నే అధికంగా నిందించాలి. ఈ ఉద్యమం గత 25 సంవత్సరాలుగా ఆరోగ్యకరమైన నాయకత్వాన్ని వ్యాపారం చేయగల నైపుణ్యంతో సమం చేసేసింది. వాక్యాన్ని ఘోరంగా విమర్శించడంతోపాటు, గొర్రెలతో పాటు జీవించే దీనమనస్సు కలిగిన కాపరుల కంటే కూడా నిపుణులైన C.E.O.లే దేవుని ప్రజల్ని చక్కగా నడిపిస్తారని ఈ ఉద్యమం సంఘాలకు బోధిస్తోంది. బలమైన నాయకుడు, దీనుడైన కాపరి పరస్పరం వేర్వేరు వ్యక్తులనే భావాన్ని నేడు అందరూ అంగీకరిస్తున్నారు. కానీ, వారిరువురు ఒక్కరనే విషయాన్ని మాత్రం అందరూ విస్మరిస్తున్నారు. నిస్వార్థమైన పరిచర్యకు ఫలితమే స్ఫూర్తి నింపగలిగే నాయకత్వం. 'మీలో గొప్పవాడు మీకు పరిచారకుడు కావాలని' (మార్కు 10:43) చెప్పి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ అంశాన్ని రెండు సహస్రాబ్దాల క్రితమే స్థిరపరిచారు. మన నాయకత్వం మన కిష్టమైన సంగతులతోనూ పాపభీతితోనూ నిండిపోయి ఉంటే, తన రూపాన్ని కాపాడుకోవడానికి తన చుట్టూ ఉన్న అద్దాలను భయంతో చూసే వ్యక్తిలా మనం ఉంటాం. నాయకత్వంపై రచించిన గ్రంథాలూ, మనుషుల మధ్య సంబంధాలూ ఇతరుల శ్రేయస్సు నిమిత్తం కాక వాటి కీర్తి ప్రతిష్ఠల నిమిత్తమే ఉపయోగపడే వస్తువుల్లాంటివి.

వ్యక్తిగత హెూదా గురించీ, సంపదల గురించీ కాక వాటికి మించిన ఉన్నత ఆశయాన్ని కలిగిన నాయకుడు వేసే ప్రణాళికలూ, చేసే కార్యాలూ వర్థిల్లతాయి. నిజ సేవకుడైన నాయకుడు ఇతరుల శక్తి సామర్థ్యాలను యోగ్యమైన ఆశయాల వైపు మళ్లిస్తాడు. దీన హృదయం లేకుండా వాక్యానుసారమైన ఆశయాల నిమిత్తం శ్రమపడితే అది రాచరికానికీ, కుటిలమైన అధికారానికి, ప్రతి విధమైన దుష్టత్వానికీ నడిపిస్తుంది ( యాకోబు 3:16;). చక్కటి వ్యూహ రచన చేయడం తప్పు కాదు, కానీ దానిలో దీనత్వం లోపిస్తే పరిచర్య ప్రయాణానికి ఇబ్బందు లెదురవుతాయి. దీనమైన విధేయతను అభ్యసించడమే మనకున్న భారమైన పిలుపు. 'ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుచుండునో' (యెషయా 66:2) ఆ నాయకునిపై దేవుని దివ్యానుగ్రహం ఉంటుందని ఆయన వాగ్దానం చేసాడు.

 

దీనత్వం, నాయకత్వం: సమతుల్యత కోసం అన్వేషణ

మనలో ప్రతీ ఒక్కరం ఏదొక సమయంలో ఒక పని బాగా చేసినందుకు కృతజ్ఞతాభి వందనాన్నీ, మన వ్యక్తిగత లక్షణాల్నీ తలాంతుల్నీ బట్టి ప్రశంసనూ పొందినవారమే. నాయకునికి ప్రజాభిమానమూ, ఉత్సాహవంతులైన అనుచరగణమూ ఉన్నప్పుడు సాత్వికాన్ని ఎలా సాధనచేయాలి? నాయకుడు సాధించే గొప్ప కార్యాల సంఖ్య పెరిగేకొలదీ, తన నేర్పునుబట్టి తప్పనిసరిగా మరింత గుర్తింపూ, ప్రశంసలూ పెరుగుతాయి. నమ్మకమైన సేవకుడిని బహిరంగంగా సన్మానించిన సందర్భం కూడా లేఖనాల్లో ఉంది. క్రీస్తు పని నిమిత్తం అతడు చావునకు సిద్ధమైయుండెను గనుక అట్టివానిని ఘనపరచుడి' అని ఫిలిప్పీ 2:29-30;లో ఎపఫ్రాదితును గూర్చి ప్రస్తావిస్తూ పౌలు చేసింది అదే! 'ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును' అని సామెతలు 12:8 చెబుతోంది. నిజమైన అభినందనను సాత్వికంతో స్వీకరించాలి, అదే సమయంలో క్రీస్తు మహిమను మాత్రమే కోరాలి. ఈ రెండు పనులు సవాలుతో కూడినవి.

నాయకుని వరాలు సహజంగా ప్రజాభిమానాన్ని కలిగిస్తాయని క్రొత్త నిబంధన చెబుతోంది. శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కర లేదు........ దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు (1 కొరింథీ 12:23-24). గర్వమనే ఊబిలోకి జారిపోకుండా, తన్ను తాను ఎక్కువ అంచనా వేసుకోకుండా, తను తప్పించుకోలేని గౌరవ ఘనతలపట్ల ఏ విధంగా నాయకుడు వ్యవహరిస్తాడు? మానవ ప్రశంసలు అన్ని వేళలా నాయకుని స్వభావాన్ని పరిశోధిస్తాయి (సామె 27:21;). ఎందుకంటే ఈ ప్రశంసలే అంతరంగంలోని ఉద్దేశాలను బహిర్గతం చేస్తాయి. అయితే సాత్వికాన్ని సాధన చేయమని ఒకనిని అడగడం ఎలాంటిదంటే నీ ఆలోచనల్లో నీవు ఉండవద్దని చెప్పినట్లు ఉంటుంది. ఇది సాధ్యం కాని పని! “సాత్వికం గురించి మాట్లాడడానికి అతిశయపడే వ్యక్తిని నేను కలిస్తే, ఆ అంశం గురించి మాట్లాడడానికి అతడు అనర్హుడని నేను భావిస్తాన”ని సిజె మహానీ సూటిగా రాసాడు. స్వీయఘనత అనే లోయలోనికి దిగిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అర్థం చేసుకోవడం మనకు కష్టమే. మరైతే పరిష్కారమేంటి?

సరైన ఆరంభం మనకు బయటే మొదలవుతుంది. దేవుని గూర్చిన స్పష్టమైన అవగాహన, సిలువనుగూర్చిన వాక్యానుసారమైన శ్రేష్ఠమైన శాశ్వతమైన దృక్పథం, మానవ పాపాన్ని గూర్చిన సరైన భావం అనేవి అగ్నిజ్వాలల్లాంటివి. వీటిలోనే సాత్వికమనే ఆయుధం రూపుదిద్దుకుంటుంది. ఈ వాస్తవాలు మనల్ని ముఖాముఖిగా గద్దించినపుడు మన బలహీనతలు బ్రహ్మాండంగా కనబడతాయి. కనుక వాటికి నచ్చిన పనిచేయడానికి మనం మన విజయాలకు అనుమతి ఇవ్వము. దేవునిగూర్చిన సరైన దృక్పధం తక్షణమే మన గొప్పతనం గురించి మనం చేసే ఆలోచనలకు ముగింపు పలుకుతుంది. ప్రవక్తయైన యెషయా సర్వశక్తిమంతుడైన దేవుని దహించే పరిశుద్ధతను చూసి వెంటనే 'అయ్యో నాకు శ్రమ, నేను నశించితిని ఏలయనగా సైన్యముల కధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని' అని ఒప్పుకొని భయంతో శక్తి హీనుడయ్యాడు (యెషయా 6:5;). అదే విధంగా దేవుడు మనకిచ్చిన రక్షణతో మన హృదయాన్ని మనం నింపుకుంటే దేవుని కృపకు ఘనత కలుగుతుంది, పాపపు దుష్టత్వం బహిర్గతమవుతుంది. ముందూ వెనుక ఆలోచించకుండా తన్ను తాను ఎక్కువగా ఎంచుకొనుటలో పేరొందిన వ్యక్తి అపొస్తలుడైన పేతురు. ప్రకృతిపై యేసు సహజాతీత శక్తిని ముఖాముఖిగా చూసిన వెంటనే పేతురు తన పాపస్థితిని గుర్తించాడు (లూకా 5:8;`). దేవుని గురించి లోతులేని మన జ్ఞానాన్ని నిజాయితీగా ఒప్పుకొని క్రమంగా మన హృదయంలోని విగ్రహాల్ని విడిచిపెడితేనే మనం దేవుడు కోరిన నాయకులం కాగలము.

 

మనం ఆయనను ఘనపరుస్తాము

మనం ఏ మాత్రం గొప్పవారం కాదు. సుత్తిలాంటి ఈ వాస్తవంతో మన మనస్సుల్ని నలగ్గొట్టినపుడు శాశ్వతమైన సాత్వికం కలుగుతుంది. ఈ నమ్మకానికి పునాది వేయడానికి 8వ కీర్తన చక్కగా సహాయపడుతుంది. సృష్టిలో కనబడుతున్న దేవుని అసమానమైన ఘనతను దావీదు ఆరాధన భావంతో ప్రకటిస్తున్నాడు. 'భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది' (కీర్తన 8:1, 9;) అని దేవుని గొప్పతనాన్ని గూర్చిన స్తుతి ఈ కీర్తన ప్రారంభంలోనూ, ముగింపులోనూ ఉంది. విస్తారమైన, చాలా శ్రద్ధతో కూడిన దేవుని చేతి పనికీ, మానవుని విలువలేని ఉనికికీ మధ్య వ్యత్యాసాన్ని గమనించిన దావీదు తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు (నీ ఆకాశములను చూడగా... నరుడు ఏపాటివాడు? 3, 4వచనాలు). అత్యంత అల్పులమైన మన గురించి దేవుడు ఆలోచించాడు. ఈ విషయం దావీదు హృదయాన్ని తన స్వంత ప్రాముఖ్యత వైపు కాక తన ఆరాధనంతటికీ యోగ్యుడైన సృష్టికర్త వైపుకే మళ్లించింది. సాత్వికంతో ఇతరుల్ని నడిపించడమంటే ఒకడు తన్ను తాను అయోగ్యుడనని ఒప్పుకోవడమే. "క్రైస్తవ సువార్త క్రీస్తు మహిమ నిమిత్తమే కాని నా గొప్పతనం గూర్చినది కాదు. కొంతమేరకు అది నా గురించి ఐనప్పుడు సైతం, దేవుడు నన్ను ఘనపరచడు. కానీ నిత్యమూ నేను దేవున్ని ఘనపరచుటలో ఆనందించడానికి నన్ను కనికరంతో బలపరుస్తాడు'' అని ఈ నియమాన్ని జాన్ పైపర్ విలక్షణమైన రీతిలో వ్యక్తపరిచాడు.

దేవుడు తన సంకల్పాలు నెరవేర్చుకోవడానికి మనుష్యుల్ని ఉపయోగించు కుంటాడు. ఇది ఆశ్చర్యం! కొన్నిసార్లు ఇతరుల జీవితాల్ని గొప్పగా ప్రభావితం చేయడానికి కూడా వారిని అనుమతిస్తాడు. అయితే గొప్పవారం కావాలనే మోసపూరిత శక్తి విషయంలో మనం మెలకువగా ఉండాలి. కొరింథీ సంఘాన్ని నడిపించడానికి తన అధికారాన్ని సమర్థించుకోవాల్సి వచ్చినపుడు, 'నేను మీ చేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏ మాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలుల కంటే నేను ఏ విషయములోను తక్కువవాడను కానని' ధైర్యంగా ప్రకటించాడు (2 కొరింథీ 12:11;). పౌలు ఆ మాట చెప్పిన విధానం నాకు భలే నచ్చింది! తను మారుమనస్సు పొందిన విధానం పౌలు మనస్సులో ఎంతో బలంగా నాటుకుపోయింది. కనుక ఆ మారుమనస్సు అనుభవమే నాయకత్వ బాధ్యతను పొందడానికి కీలకమైందని అతనికి తెలుసు. క్రీస్తునందు మాత్రమే అతిశయించడానికి అతని కుటుంబ నేపధ్యాన్ని, యూదా మతం పట్ల తనకున్న ఆసక్తినీ, ధర్మశాస్త్రాన్ని అనుసరించుటలో సంవత్సరాల తరబడి తన నిందారహిత జీవితాన్ని ఎంతో సంతోషంగా, త్వరితంగా విడిచిపెట్టాడు. క్రీస్తునందు మాత్రమే అతిశయించాలనే నమ్మకం అతని నాయకత్వంలో పూర్తిగా ఇమిడిపోయింది. అయితే ఈ నమ్మకం తన్ను తాను హేయమైనవానిగా ఎంచుకోవడం మూలంగా కలిగింది కాదు. నిజమైన పరిచర్య ప్రభావాన్ని బయలుపరచడానికి క్రీస్తునందు మాత్రమే అతిశయించాలనే నియమం ఆయువు పట్టులాంటిదని పౌలుకు తెలుసు.

పరిచర్యలో గొప్ప కార్యాలు మొదలుకొని ఆదరణ కలిగించే అతి సామాన్యమైన మాట వరకూ అన్నీ మనకు అర్హత లేని ఆధిక్యతలే. తన మహిమ కోసం నమ్మదగిన సృష్టికర్త ఉపయోగించుకొనే పాత్రలం మనం. గొప్ప క్రీడాకారుడు ఆటలో తనకున్న నైపుణ్యాన్ని బట్టి అతిశయించవచ్చా? మేధావి తనకున్న విస్తారమైన మేధస్సునుబట్టి కలిగే ఘనతను స్వీకరించవచ్చా? సృష్టిలోని అలాంటి అద్భుతాలు మనుష్యుల మహిమ నిమిత్తం కాదు కేవలం దేవుని మహిమ నిమిత్తమే! మనం సాధించేదేదీ మనల్ని గొప్పవారిగా చేయదు. కానీ దేవుడు మనల్ని వాడుకొనే విధానం ఆయన గొప్పతనాన్నీ మహిమనూ చూపిస్తుంది. దేవుని విమోచన ప్రణాళికకు మన తలాంతులూ, వరాలూ అత్యవసరమన్నట్లు మనం ప్రవర్తిస్తాం. కానీ లేఖనం దానికి భిన్నంగా బోధిస్తోంది.

అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా! ఒక్కొక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపొల్లో నీరు పోసెను, వృద్ధి కలుగచేసినవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లుపోయువానిలోనైనను ఏమియు లేదని' (1 కొరింథీ 3:5-7) అద్భుతమైన వరాల్ని కలిగిన కొరింథీ సంఘాన్ని పౌలు హెచ్చరించాడు.

గర్వమనే కెరటం కొరింథులో విశ్వాసుల్ని పాపమనే సముద్రంలోనికి ముంచేస్తూ వచ్చింది. అందుచేత ఆత్మవరాలన్నింటిని ప్రభువే అనుగ్రహిస్తాడని వారికి కఠినంగా గుర్తుచేయాల్సివచ్చింది. (నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? - 1 కొరింథీ 4:7). ప్రతీ వరాన్నీ, తలాంతునూ, అధికారాన్నీ అయోగ్యులైన వారికి దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తాడు. ఈ గ్రహింపు కలిగి పనిచేసే నాయకుడు తన్ను తాను అయోగ్యుడైన సేవకునిగా కంటే ఎక్కువగా అంచనా వేసుకోడు (రోమా 12:3;). అతడు తాను చేసిన అత్యల్పమైన పనిని బట్టి కూడా కృతజ్ఞత కలిగి ఉంటాడు. తాను నడిపించే వారిలో అత్యల్ప పరిమాణంలో అభివృద్ధి జరిగినా అతడు అత్యానందపడతాడు. థెస్సలోనిక పట్టణానికి సువార్తను తీసుకెళ్లిన మిషనరీలు సువార్త ప్రకటన వలన తాము పొందిన సమస్త సంతోష, ఘనతల్ని ఏ మాత్రం సమృద్ధియైన ప్రతిఫలాలుగా ఎన్నడూ చూడలేదు. ఎంత అద్భుతమైన దృక్పధం! దీనుడైన ప్రతి నాయకుడు అలాగే చేస్తాడు. పౌలూ, అతని అనుచరగణమూ దేవుని ప్రజల ఎదుగుదలనుబట్టి ఆత్మీయంగా ప్రోత్సహం పొందినా అతిగా మాత్రం అతిశయించలేదు. దేవుని కృప లేకపోతే వారు కూడా క్రీస్తులేని నిత్యత్వంలో నాశనమవుతారనే జ్ఞానంలోనే వారి దీనత్వం వేళ్లూనుకొనియున్నది.

పరిణితి లేని అనుచరుల మూలంగా మనం అతిగా విసుగు చెందుతున్నామంటే, జీవంగల దేవుని సేవించే ఘనతకు మనకు అర్హత లేదనే వాస్తవం గురించి మనం తగినంత ఆలోచించలేదన్న మాట! హృదయంలోని పరిశీలనకు గురి కాని విగ్రహాల గురించి 6వ అధ్యాయంలో విపులంగా చర్చిద్దాం.

కానీ వాక్యానుసారమైన సాత్వికాన్ని నిర్లక్ష్యం చేసినపుడు ఇతరులను మన సౌకర్యాలకూ, విజయాలకూ అడ్డంకిగా చూడ నారంభిస్తామను విషయాన్ని మాత్రం ఇక్కడ గుర్తిద్దాం. మరొక విధంగా చెబితే గడ్డు మనుష్యులకూ, సమస్యలతో కూడిన వారి జీవితాలకూ మన వరాల్నీ సమయాన్నీ శక్తినీ ధారపోయడం వ్యర్థమని భావించేట్లు గర్వం మనల్ని నడిపిస్తుంది. ప్రజలు దేవుని విలువైన బిడ్డలుగా కాక మన గొప్పకార్యాలకు అడ్డంకిగా, మన గౌరవ ఘనతలను పెంచే వనరులని మనం గర్వం మూలంగా భావిస్తాం. సాత్వికం దానికి భిన్నమైన దానిని కలిగిస్తుంది. దేవుని ఘనత వైభవాలను గూర్చిన స్పష్టమైన అవగాహన మనం మన గురించి సరిగా వివేచించేలా చేసి దాని కనుగుణంగా దేవునిపై ఆధారపడే మనసును మనకిస్తుంది. అలాంటి మనసు కలిగిన నాయకుల్లో సంతృప్తి, సహనం, స్థిరమైన కృతజ్ఞతా భావం, వరాలు కలిగిన స్నేహితులయెడల సహృద్భావం, దేవుని మంచితనం నందు సడలని విశ్వాసం కొట్టొచ్చినట్లు కనబడతాయి.

 

విస్మయమొందించే సిలువలోని కృప

సాత్వికంతో ప్రజల్ని నడిపించాలని ఆశపడితే సిలువ నీడలో మనం జీవించాలి. ఈ మధ్యకాలంలో నా సంఘ కుటుంబంలో కురువృద్ధుడైన రాయ్ సమాధి కార్యక్రమంలో ప్రసంగించే ఆధిక్యత నాకు దక్కింది. 98 సంవత్సరాల వయసులో ప్రభువు తనని ఇంటికి (పరలోకానికి) తీసుకెళ్లారు. జీవిత చరమాంకంలో అనేకులు శక్తిహీనులవడం సాధారణమే. కానీ రాయ్ ఆఖరి సంవత్సరాలు మాత్రం అసాధారణం. తను పరలోకానికి చేరేంతవరకూ వారంలో 3 సార్లు టెన్నిస్ ఆడేవాడు, స్నేహితులతో చాలా సరదాగా గడిపేవాడు, సువార్తను ఇతరులకు తెలియచేయాలనే భారంతోనే జీవించాడు. ఇవి అతని దైనందిన జీవితంలో ముఖ్యాంశాలు. అతని గురించి ఎరిగిన వారందరూ ఆయనొక గుర్తుంచుకొనదగిన వ్యక్తని అతన్ని అభినందిస్తారు. కొన్ని సంవత్సరాలు మాత్రమే నేను అతనికి పాస్టర్ గా ఉన్నాను. మా పరిచయం ఎంతో స్వల్ప కాలమైనా మేము సంభాషించుకొన్న ప్రతీసారి క్రీస్తునుగూర్చిన నా అన్వేషణను ఎంతో తీవ్రంగా అతడు సవాలు చేసాడు, నన్ను నూతనపరిచాడు. ఆదివారం నేను ఏ లేఖన భాగంలో నుంచి ప్రసంగించినా రాయ్ మాత్రం క్రీస్తు సిలువలోని అద్భుతాన్ని ధ్యానించి ఉద్వేగానికి గురయ్యేవాడు. లేఖనంలో రక్షణగూర్చిన ప్రతీ నూతన తలంపు అది చిన్నదైనా పెద్దదైనా అతని హృదయాన్ని బలంగా తాకేది. నిష్కల్మషుడైన తన ప్రభువును నలగ్గొట్టిన తన పాపం గురించి ఆలోచించిన ప్రతిసారి క్రీస్తు మాధుర్యం అతని హృదయాన్ని నింపేసేది. అతడు సిలువను సమీపించినపుడు నన్ను పిలిచి అతడు పరీక్షించినట్లే నన్నుకూడా తదేక దీక్షతో సిలువను చూడమని బలవంతం చేసేవాడు.

క్రైస్తవ జీవితంలో మనం తెలుసుకోవల్సినది యావత్తు కలువరి సిలువ దగ్గరే నేర్చుకోవాలని రాయ్ గుర్తించాడు. పాప భ్రష్టత్వం గురించీ, దేవుని పరిశుద్ధత గురించీ, విమోచనలో ఇమిడియున్న ప్రేమ కృపలనుగూర్చీ సిలువ మాట్లాడుతోంది. పాపపు అమితమైన దుష్టత్వానికి మూలమేంటో గ్రహిస్తే, మనం అయోగ్యులమనే వాస్తవానికి ఆధారం దొరుకుతుంది.

ఈ ఆలోచన మిమ్ముల్ని విసిగిస్తుందేమో! క్రైస్తవులుగా మనం ఇప్పటికే సువార్తను నమ్మాము. క్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్న రక్షణా వరాన్ని మనం ఇప్పటికే పొందాము కాబట్టి ఇంకా సిలువపై దృష్టి ఉంచాల్సిన అవసరమేముంది? మరింత పరిణితి చెందిన విషయాల్లో మన విశ్వాసాన్ని ఆచరణలో పెట్టడానికి ఇది సమయం కాదా? అని మీరు ప్రశ్నించవచ్చు. అయితే అది సరైన ఆలోచన కాదు. సిలువను గూర్చిన సత్యాన్ని నీవు ఇప్పటికే సంపూర్ణంగా గ్రహించాననే తలంపు ఒక్కక్షణం నీలో కలిగినా....... బైబిల్ లోనే అత్యంత ప్రధానమైన సత్యం విషయంలో నీవు తడబాటుకు గురయ్యావు. కనుక పరిణామాలను అనుభవిస్తావని” 'ద క్రాస్ సెంటర్డ్ లైఫ్' అనే తన గ్రంథంలో సిజె మహానే రాసాడు.

 సిలువను గూర్చిన వేదాంతం మన నరనరాల్లో జీర్ణించుకుపోవాలి. కలువరి సిలువ మనకు సన్నిహితుడైన, నమ్మకమైన స్నేహితుడైపోవాలి. 'తండ్రీ, నేను సిలువకు సాధ్యమైనంత దగ్గరగా నిలబడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను సిలువకు దగ్గరగా ఉన్నప్పుడు గర్వంగా ఉండుట నాకు చాలా కష్టమవుతోందని, పాస్టర్ మహానే ప్రార్థించడం ఆశ్చర్యమేమీ కాదు. మన అనుదిన జీవితాల్లో సిలువను గూర్చిన ఆవశ్యకత నెమ్మదిగా కనుమరుగయ్యే విధానం మనకు అంతుచిక్కనిదిగా ఉంటుంది. క్రీస్తు సిలువ శ్రమ ప్రాముఖ్యతను మనమెన్నడూ తృణీకరించం కానీ, మన హృదయాల్లో సిలువకున్న ప్రాధాన్యత అనవసరమైన వ్యాపకాల మూలంగా నిరంతరం తగ్గిపోతుంది. మన సమయాన్ని హరించివేసే అనవసరమైన వ్యాపకాలను గుర్తించకపోతే, జారుడు నేలపై పడి మోసమనే గుంటలోనికి పడిపోతాము. “సామాన్యాంశాలు కీలకాంశాల్ని ఎప్పుడైతే స్థానభ్రంశం చేస్తాయో, అప్పుడు మనం విగ్రహారాధనకు దగ్గరకు వచ్చేసినట్లేనని'' డి.ఎ. కార్సన్ హెచ్చరించాడు. సిలువనుగూర్చిన అద్భుతాన్ని ఘనతనూ మన గ్రహింపులో కాంతి విహీనమయ్యేందుకు మనం వీలు కల్పించకూడదు. దేవుని కోణం నుంచి సిలువను చూస్తూ మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి.

ఈ ఆలోచన గమనించండి. దేవుడు పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడు (లేవీ 11:44;). ఆయన పవిత్రత, నీతి విషయాల్లో మండే సూర్యునిలాంటివాడు. ఆయనను గ్రహించే నైతిక సామర్థ్యం మనకు లేదు. సమీపింపరాని దేవుని తేజస్సును చూచాయగానైనా చూసినవారికి చాలా వింతైన అనుభవాలెదురయ్యాయి. మోషే ముఖం ఇశ్రాయేలీయులు భయంతో చూడలేనంతగా భయపడేంతగా ప్రకాశించింది (నిర్గమ 34:29-30;), యెషయా వెంటనే బొత్తిగా నాశనమైనట్లు భావించాడు (యెషయా 6:5;), పేతురు యాకోబు యోహానులు అచేతనంగా నేలపై పడిపోయారు (మత్తయి 7:6), గొప్ప వాక్చాతుర్యంగల పౌలు పరదైసును దర్శించిన తర్వాత తన అనుభవాన్ని వర్ణించడానికి కనీసం ఒక్క పదాన్నైనా వాడడానికి దేవుడు అతణ్ణి అనుమతించలేదు! (2 కొరింథీ 12:4;). మనం దేవుని పరిశుద్ధతను చూసినపుడు, శిక్షావిధికి గురికావల్సిన పాపులయెడల కనుపరచిన ఆయన ప్రేమ యొక్క లోతును గ్రహించ నారంభిస్తాము. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను (1 యోహాను 4:9). పరిశుద్ధమైన న్యాయం అనే కోర్టులోనికి దయ అనే గుణాన్ని ఆహ్వానించిన ప్రేమనూ, సమాధాన బలిగా తన జీవాన్ని అర్పించిన న్యాయాధిపతినీ మనం సిలువ దగ్గర ఎదుర్కొంటాము. తీర్పు క్రీస్తుపై పడగా, నిత్య నరకాన్ని అనుభవించడానికి బదులు పరిశుద్ధుడైన దేవునితో మనం సమాధాన స్థితిని పొందాము.

అదే ఎంతో గంభీరమైన సత్యం. అయితే పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నీతిమంతుడైన వానిపై తండ్రి ఉగ్రత కుమ్మరించగా అలాంటి సమాధాన స్థితి రావడం మన జ్ఞానానికి మించినది. తండ్రియైన దేవుడు పాపులనెంత దూరంగా పెడతాడో దేవుని కుమారుని యెడల అంత అపరిమితంగా ఆనందిస్తాడు. ఈ వాస్తవాల్ని మర్చిపోకండి. మన విమోచన నిమిత్తం తండ్రి ఆయనను మొత్తాడు. అంతటి ప్రేమ గర్వంతో నిండిన మన హృదయాల్ని దీన హృదయాలుగా మార్చాలి. ఇతరులు మనకు చేసిన అన్యాయం మనల్ని ఎంతగానో కలిచివేస్తుంది. నిర్దోషమైన దేవుని గొర్రెపిల్లయైన క్రీస్తుపై తండ్రియైన దేవుడు మోపిన పాపదోషంతో మనకు జరిగిన అన్యాయం ఎన్నటికీ సమానం కాదని సిలువ మనకు గుర్తుచేస్తుంది. మనమే క్రీస్తును సిలువకు పంపించాము. ఆయన పవిత్ర హృదయాన్ని నలుగగొట్టింది మన పాపమే. మన దోషాన్ని ఆయన స్వచ్ఛందంగా భరించాడు. సిలువలో యేసు ఘోరమైన అన్యాయాన్ని భరించాడు. ఆ వెలుగులో మన జీవించ నారంభించినప్పుడు సాత్వికం మన ఆలోచననూ, వైఖరినీ నిర్బంధిస్తుంది. ప్రేమతో, కరుణతో మనం నడిపించ నారంభిస్తాం. నేను కృపచేత రక్షణ పొందిన పాపిని. అయితే నేను దేవుని ప్రేమకు పాత్రులైన నా తోటి దేవుని ప్రజలకు పైగా హెచ్చించుకుని వారినెలా నా స్వార్థం నిమిత్తం ఉపయోగించుకోగలను? నేను నడిపించే వారితో కఠినంగా వ్యవహరించి, నా పరిచర్యను వారు అభినందించనపుడు వారిని ప్రేమించకుండా ఉండేందుకు నాకున్న హక్కు ఏంటి? సువార్త సత్యాన్ని ప్రకటించే ఆధిక్యతనూ, బాధ్యతనూ పొందిన నేను కేవలం దేవుని కృపాకనికరాలకు గృహనిర్వాహకుడని మాత్రమే. సాత్వికంతో కూడిన నిజమైన నాయకత్వం ఇక్కడే మొదలవ్వాలి. పాశ్చాత్య సంఘాన్ని పశ్చాత్తాపపడమని చెబుతూ డిఎ కార్సన్ ఈ ఆలోచనను మరికొంత ముందుకు తీసుకెళ్లాడు.

('నేను బాస్ ని, నా క్రిందున్న వారు నేనేం చెప్పినా చేస్తారనే) నియంత పాలననూ, (ప్రజలకు కావల్సింది ఇవ్వండి, మరొకసారి ప్రజాభిప్రాయాన్ని సేకరించి వారి అవసరాలు తీర్చండి అనే) ప్రజాస్వామ్య పాలనను అంతు లేకుండా ఆశించే పాశ్చాత్త దేశస్థులమైన మనం పశ్చాత్తాపపడాలి. క్రైస్తవ నాయకత్వం ఎంత విభిన్నమైన శైలితో కూడినదైనా, సమాజ శ్రేయస్సు నిమిత్తం ఎంత జ్ఞానయుక్తమైన పనులు చేసినా, ఎంతటి విలక్షణరీతిలో పనిచేసినా ఈ క్రింది ప్రాథమిక గుర్తింపుతోనే ప్రారంభం కావాలి. దేవుడు ఎన్నో యుగాలుగా మరుగుచేసి సువార్త పరిచర్య ద్వారా ఇప్పుడు బయలుపరచిన దైవ మర్మాలను దేవుడు క్రైస్తవ నాయకులకు అప్పగించాడు. "

సత్యం నుంచి మన హృదయాలు ఎంత త్వరగా తొలగిపోతాయో మర్చిపోయినప్పుడు మన సమస్యలు జటిలమవుతాయి. అంతం వరకూ స్థిరంగా కొనసాగుటలో మన సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనావేసే భయంకరమైన స్వభావం మనకుంది. మనమేం చేయగలమో ఏం చేయలేమో తెలుసుకోవడానికి గర్వంతో నిరాకరిస్తే వేరొకరి సహాయం మనకవసరం లేదనే ఉదాసీన వైఖరిలోకి కొట్టుకొనిపోతాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపరులకూ, నాయకులకూ సి జాన్ మిల్లర్ గారు రాసిన లేఖలను చదువుచుండగా ఈ వాస్తవం నా హృదయంలోనికి చొచ్చుకొనిపోయింది.

పాపమనే ప్రవాహంలో నేను కొట్టుకొనిపోయినట్లు బహుశా మీరు కొట్టుకెళ్లక పోవచ్చు. దేనినుంచైతే ప్రభువు శక్తివంతమైన ప్రేమ నన్ను విడిపించిందో ఆ భ్రష్టత్వమనే లోతైన గుంటను నేను నిరంతరం మర్చిపోతున్నాను. అలా కొట్టుకొని పోవడం ఏ మాత్రం కష్టమైంది కాదు. ఎందుకంటే క్రీస్తును గూర్చిన జ్ఞానంలో ఎదగడం మానెయ్యి, లోకతత్వమనే దుష్టప్రవాహం మిగిలిన పనంతా చేసేస్తుంది. నశించి పోయే వారిని గూర్చిన భారం క్రమేపీ చెదిరిపోయిన జ్ఞాపకంలా కనబడుతుంది. యేసు యెరూషలేము గురించి విలపించుట, తన ప్రజల నిమిత్తం శాపగ్రస్థుడవడానికి ఇష్టపడడం మొదలగునవి నిజమైన సంఘటనలు కావేమో అన్నంత దూరమవుతాయని, ఐర్లాండ్ లో పరిచర్య చేస్తున్న తన తోటి మిషనరీయైన జాక్ ను ప్రోత్సహిస్తుండగా నిక్కచ్చిగా మాట్లాడు స్వభావమున్న మిల్లర్ రాసాడు.

దేవునిపై ఆధారపడడమే అలాంటి అహంకారంతో కూడిన అజ్ఞానాన్ని తప్పించుకొనే ఏకైక మార్గం. ఎంతో వేగంగా వైఫల్యమనే లోయలోనికి దిగిపోయిన అపొస్తలుడైన పేతురు వృత్తాంతాన్ని గ్రంథస్థం చేసిన మత్తయి 26:31-35;ను జ్ఞాపకం చేసుకొంటే మనం విజయవంతమైనట్లే! 'ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు' (31వ వచనం) అని స్వయంగా ప్రభువే తన శిష్యులకు మానవ హృదయపు చంచలత్వం గురించి ప్రత్యేకమైన ఆ సాయంత్రం పూట తెలియచేసారు. బలపరిచే ప్రభువును వారు వేడుకొని ఉండాల్సింది. అయితే నిన్నుగూర్చి వారంతా అభ్యంతరపడినా నేనెన్నటికీ అభ్యంతరపడనని (33వ) గర్వంతో క్రీస్తు అనుచరులందరి పక్షంగా పేతురు మాట్లాడడం విచారకరం. చాలా దశల్లో ఈ ప్రత్యేకమైన రోగమే మనకూ సోకుతుంది. దైవ సత్యంపై ఎల్లప్పుడు ఆధారపడడానికి బదులు, క్రీస్తుతో మనకున్న గొప్ప ఆధిక్యతతో కూడిన సంబంధం మన మంచితనపు ఫలితమేనని మనం భావిస్తాం.

దేవుని బిడ్డగా ఉండడమే మనల్ని ముఖ్యమైన వ్యక్తులుగా చేస్తుందనే నమ్మకం నుంచే అహాంకారమనే పాపం పుట్టుకొస్తుంది. కొన్ని సందర్భాల్లోనైతే, మనం ముఖ్యమైన వారం కాబట్టి మనం దేవునికి చెందిన వారమని అనుకుంటాం. మన హృదయాల గురించి మనల్ని చేసిన వానికి తెలిసిన దాని కంటే మనకు ఎక్కువ తెలుసని మనం నమ్ముతాం. అదే అహంకారం! దేవుని వాక్యం మన జీవితాల గురించి సంపూర్ణమైన జ్ఞానంతో బోధిస్తుంది. ఆ వాక్యాన్నే ప్రశ్నించి, దానితో వాదించడం చాలా అమర్యాదకరంగా ప్రవర్తించడమే! సాత్వికం దేవుని ప్రణాళికల వెనకున్న మంచితనాన్ని ప్రశ్నించదు. తానెదుర్కోబోతున్న హింస గురించి, మరణం గురించి ప్రభువు మాట్లాడినపుడు పేతురు అజ్ఞానంతో ప్రభువుని గద్దించడానికి పైకి లేచినప్పుడే అతని ఆత్మీయ పతనం ప్రారంభమైంది. 'సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై యున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావు' (23 వ వచనం) అని యేసు సమాధానం చెప్పాడు. పేతురు జీవించినంత కాలం తన సొంత జ్ఞానంపై ఎన్నడూ ఆధారపడ కూడదనుటకు ఒక జ్ఞాపికలా పేతురు హృదయంలో ఆ సమాధానం ప్రభువు చెక్కాడు. మనం దేవుని ప్రణాళికలకూ ఉద్దేశాలకూ లొంగిపోయినప్పుడు మన శరీర కోరికలు క్షీణిస్తాయి. మనం శత్రువులుగా ఉన్నప్పుడే మనతో సమాధానపడడానికి ఇష్టపడితే, సమృద్ధియైన జీవమార్గంలో మనల్ని నడిపించే విషయంలో మనం ఆయనను నమ్మవచ్చనే జ్ఞానంలో మనం సేదతీరవచ్చని క్రీస్తు సిలువ మనకు బోధిస్తోంది. ఆయన పరిపూర్ణ నాయకత్వం క్రిందకు ఇష్టపూర్వకంగా రావడం మూలంగా కలిగే ఫలితమే సాత్వికం. దీనమనసుతో కూడిన విధేయత అనే నిలిచియుండే వేరును పెంచడానికి అవసరమయ్యే క్రమశిక్షణను వృద్ధిచేయడం కంటే దాని గురించి మాట్లాడడం తేలికని అంగీకరించాలి. హెలీ ల్యాండ్ (పరిశుద్ధ ప్రదేశం) యాత్ర చేయదలిచిన భార్య భర్తల మధ్య జరిగిన సంభాషణలా ఉంది ఇది.

భర్త : హోలీ ల్యాండ్ కి వెళ్లి, సీనాయి పర్వతమునెక్కి అక్కడనుండి పది ఆజ్ఞలను గట్టిగా ప్రకటించడం ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా?

భార్య: మనం ఇంటి దగ్గరే ఉండి వాటిని అనుసరిస్తే మరింత అద్భుతంగా ఉంటుంది.

ఎవరూ కదల్చలేనిది, స్థిరమైనది దేవుని వాక్యం. అది మన మనస్సుని ఆక్రమించి మన చిత్తాన్ని చిన్నాభిన్నం చేసే వరకూ క్రీస్తుని మన కత్యంత ప్రీతి పాత్రునిగా చేసుకోలేము. ప్రభువైన యేసు క్రీస్తే మనకు అతి శ్రేష్ఠమైన మాదిరి. తండ్రి చిత్రాన్ని నెరవేర్చడమే ఆయనకు అత్యానందాన్ని కలిగించు విషయం. ఆయన తండ్రియైన దేవుని వాగ్దానాలను నమ్మారు కనుక 'తన్ను తాను న్యాయంగా తీర్పు తీర్చువానికి అప్పగించుకోగలిగారు (1 పేతురు 2:23;). మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేసే క్రీస్తు కృప మాదిరిని ఉదాహరించి, అదే విధమైన విధేయతను సాధన చేయమని పౌలు ఫిలిప్పీ 2:5-8లో మనకు సవాలు విసురుతున్నాడు. మన నాయకత్వం సాత్వికాన్ని బలంగా బహిరంగంగా ప్రదర్శిస్తే, అది మన ప్రభువు శరీరధారియైనపుడు చూపిన గొప్ప త్యాగాన్ని ప్రతిబింబిస్తున్నట్లే. భూమిమీదకు రాకమునుపే యేసు త్రిత్వంలోని రెండవ వ్యక్తి, గత నిత్యత్వమంతటిలో ఉనికి కలిగినవాడు, విశ్వానికి దేవుడు, మహా వైభవంతో, తరగని మహిమలో ఆనందిస్తున్నవాడు (ఫిలిప్పీ 2:6;). సార్వభౌమాధికారంతో పాలించే ఘనత అధికారికంగా తనదైనప్పటికీ, పాపులు అత్యవసరతలో ఉన్నప్పుడు ఆ స్థానం కోసం ఆయన ప్రాకులాడలేదు (వచనం 6a). క్రీస్తు తన శత్రువుల యెడల అంత జాలి చూపి, తన అధికారాన్ని త్యాగం చేస్తే, అధికారం హెూదా స్థాయి నిమిత్తం మనమెన్నడూ వెంపర్లాడకూడదు. తన పరలోక మహిమను మరుగుచేసుకొని విధేయతతో తండ్రిపై స్వచ్ఛందంగా మన ప్రభువు ఆధారపడ్డాడు, మహిమను విడిచాడు, బానిసగా మారాడు (వ 7). 'బానిస' అనే భావాన్ని వ్యక్తీకరించుట కోసం 'డూలాస్' అనే గ్రీకు పదాన్ని పౌలు ఉపయోగించాడు. దేవుని కుమారుడు దేవుని బానిసయ్యాడు. 

మనమిలాగే నడిపిస్తున్నామా? క్రీస్తు ప్రణాళికల నిమిత్తం, ఆయన ఉద్దేశాల నిమిత్తం మన చిత్తాన్ని కట్టుబానిసలవలె ఆయన కప్పగించడానికి సంసిద్ధులుగా ఉన్నామా? పాపుల్ని విమోచించడానికి పాప శరీరాకారంతో ఆయన వచ్చాడు. దేవుని ప్రజలు పరలోక మహిమను సంపూర్ణంగా అందుకోవడాన్ని చూడడానికి, నేను తప్పనిసరిగా నా వ్యక్తిగత సౌకర్యాల్నీ, ఇహలోక భద్రతనూ ప్రక్కన పెట్టేయవచ్చు. తన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి మన ప్రభువు అద్భుతాలు చేయలేదు. తన వ్యక్తిగత ప్రయోజనం కోసం తన సహజాతీత శక్తిని ఎన్నడూ ఆయన రహస్యంగా వినియోగించుకోలేదు. అందుచేతనే 'తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును' అని ఆయన తన గురించి తాను ధైర్యంగా సాక్ష్యమిచ్చుకున్నాడు (యోహాను 5:19;). తన హృదయమనే చెకుముకి రాయి తన తండ్రి చిత్తమనే జ్వాలను మాత్రమే రగిల్చేది. ఇహలోక గొప్పతనాన్ని పొందుకోమని ఆయనను వేధించినపుడు, 'నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగును గాక!' అని పలికి, జనాదరణ వలన కలిగే భద్రతను ఆయన పోగొట్టుకున్నాడు. నిజానికి ఆయన ఈ పాప లోకంలోనికి ప్రవేశించినపుడు రాజుల రాజుకి తగిన వేడుకతో రాకుండా నిస్సహాయుడైన బలహీనుడైన బాలునిగా వచ్చాడు. ఈ వాస్తవాన్ని జాన్ ఈడే కంటే స్పష్టంగా ఎవ్వరూ ప్రకటించలేదు.

ఆయన కలిగియున్న దీన మనసును బట్టి, వర్ణింపశక్యముకాని కృపతో, ఇతరుల స్థితిని చూచి తన మహిమను మరుగుచేసుకొని భూమికి దిగివచ్చాడు. మహిమలో ఉన్న దేవునిగా ఆయన కనబడలేదు గాని శరీరాన్ని ధరించుకున్నాడు. రాజ వస్త్రాలను కాక పల్లెల్లో యవ్వనస్థులు ధరించే సామాన్య వస్త్రాలనే ఆయన ధరించాడు. మండే పొదలో దేవునిగా కాక కన్నీళ్లు కార్చే నరునిగా ఆయన కనబడ్డాడు. ఆయన జన్మించింది రాజ దర్బారులో కాదు పశువుల పాకలో. తన చేతిలో పిడుగుల్ని కాదు గానీ గలిలయలోని వడ్రంగి కలిగియుండే సుత్తి శానాలను ఆయన పట్టుకున్నాడు.

కుమారుడును ఆలాగే చేయును' అని ఆయన తన గురించి తాను ధైర్యంగా సాక్ష్యమిచ్చుకున్నాడు (యోహాను 5:19). తన హృదయమనే చెకుముకి రాయి తన తండ్రి చిత్తమనే జ్వాలను మాత్రమే రగిల్చేది. ఇహలోక గొప్పతనాన్ని పొందుకోమని ఆయనను వేధించినపుడు, 'నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగును గాక!' అని పలికి, జనాదరణ వలన కలిగే భద్రతను ఆయన పోగొట్టుకున్నాడు. నిజానికి ఆయన ఈ పాప లోకంలోనికి ప్రవేశించినపుడు రాజుల రాజుకి తగిన వేడుకతో రాకుండా నిస్సహాయుడైన బలహీనుడైన బాలునిగా వచ్చాడు. ఈ వాస్తవాన్ని జాన్ ఈడే కంటే స్పష్టంగా ఎవ్వరూ ప్రకటించలేదు.

ఆయన కలిగియున్న దీన మనసును బట్టి, వర్ణింపశక్యముకాని కృపతో, ఇతరుల స్థితిని చూచి తన మహిమను మరుగుచేసుకొని భూమికి దిగివచ్చాడు. మహిమలో ఉన్న దేవునిగా ఆయన కనబడలేదు గాని శరీరాన్ని ధరించుకున్నాడు. రాజ వస్త్రాలను కాక పల్లెల్లో యవ్వనస్థులు ధరించే సామాన్య వస్త్రాలనే ఆయన ధరించాడు. మండే పొదలో దేవునిగా కాక కన్నీళ్లు కార్చే నరునిగా ఆయన కనబడ్డాడు. ఆయన జన్మించింది రాజ దర్బారులో కాదు పశువుల పాకలో. తన చేతిలో పిడుగుల్ని కాదు గానీ గలిలయలోని వడ్రంగి కలిగియుండే సుత్తి శానాలను ఆయన పట్టుకున్నాడు.

సాత్వికంతో ప్రజల్ని నడిపించాలని మనం ఆశపడితే మనం ప్రియమైనదిగా ఎంచే ప్రతి దాని విషయంలో మరణించడానికి సిద్ధమనస్సు కలిగియుండాలి. జీవించు మనము ఇకమీదట మన కొరకు కాక, మన నిమిత్తము మృతిపొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు (2 కొరింథీ 5:15;), మనందరం సిలువ దగ్గర క్రీస్తు యేసుతో కూడా సిలువవేయబడ్డాము (గలతీ 2:20;). మన కాడి మోయుటలో ఉండే ఆనందం నిమిత్తం, మన స్వభావాన్ని క్రీస్తు పరిపూర్ణ ప్రణాళిక నిమిత్తం త్యాగం చేయడమే భక్తిగల నాయకత్వ సారాంశం.

భ్రష్టుడినైన నన్నా ఆయన రక్షించింది!

ఆఖరిగా, సాత్వికంతో నాయకత్వాన్ని జరిగించడానికి మానవ భ్రష్టత్వం గురించి సరైన అవగాహన అత్యవసరం. నాయకుడు తన అంతరంగాన్ని నిశితంగా పరీక్షించుకోకుండా ఇతరులకు సలహాలనిస్తూ ఉపదేశిస్తూ ఉండడమే ఆత్మీయ నాయకత్వంలో ఎదురయ్యే అతి ముఖ్యమైన ప్రమాదం. పతనమైన మన స్థితి గురించి బైబిల్ బోధించే వాస్తవాన్ని సంపూర్ణంగా గ్రహిస్తే, ఇతరుల్ని నడిపించక ముందే మనకు మనం బోధించుకొనేటట్లు అది మనల్ని పురికొల్పుతుంది. ఇతరుల కంటే తనకు తక్కువ మోతాదులో కృప సరిపోతుందనే ఆలోచన కలిగిన నాయకునితో వ్యవహరించడం కంటే సవాలుతో కూడిన విషయం మరొకటి లేదు. అలాంటి వ్యక్తులు తమ నాయకత్వం క్రిందున్న వారి వైఫల్యాల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈ ధోరణిని నిర్లక్ష్యం చేస్తే, పరిశుద్ధుల యెడల తమ ప్రేమ చల్లారిపోతుంది. వాక్య బోధన అత్యవసరమైన సున్నితత్వాన్ని కోల్పోతుంది, సాత్వికమనేది ఇక కేవలం ఇతరులకు చూపించే నాటకం మాత్రమే అవుతుంది.

సుంకరి గురించీ, పరిసయ్యుని గురించీ యేసు చెప్పిన ఉపమానాన్ని లూకా తన సువార్తలో గ్రంథస్థం చేసాడు. ఈ ఉపమానంలో సుంకరికి తన హృదయపు భ్రష్టత్వం గురించి సరైన అవగాహన ఉంది, గానీ పరిసయ్యుని స్వనీతి తనలోని ఆత్మీయ దారిద్ర్యాన్ని చూడనీయకుండా అతణ్ణి గ్రుడ్డివాణ్ణి చేసింది. మనం చేయవలసినవేంటో, చేయకూడనివేంటో తెలియచేసే ఉపమానమిది. ప్రభువు చెప్పిన ఉపమానాన్ని చూద్దాం.

తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి - దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండుమారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టు కొనుచు- దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటె ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను (లూకా 18:9-14).

తన దేశానికి దోహియైన సుంకరి తన పాప స్థితినీ, దాని దుష్ట లక్షణాల వికృత రూపాన్ని చూసాడు. అయితే వాక్యం పై డాక్టరేట్ చేసిన పరిసయ్యుడు మాత్రం తనను దేవుడు అంగీకరిస్తాడనే నిశ్చయతతో ఉన్నాడు. తమ భ్రష్టత్వాన్ని సరిగ్గా గమనించిన వారు ఇతరుల్ని పరీక్షించక ముందే తమకు తాము బోధించుకుంటారు. కనుక యేసు చెప్పిన ఉపమానం, ఆయన భావం ఏ మాత్రం పొరపాట్లకు తావులేనివి. చేసిన మంచి పనులు ఇతర విషయాల్లో చేసిన స్వల్పమైన పాపాల కంటే గొప్పవని చెబుతూ అర్థరహితమైన సాకులు చెప్పి, దోషానికి బాధ్యత వహించకుండా గర్వపు హృదయం దూరంగా తొలగిపోతుంది. సుంకరి తన స్వదేశానికి ద్రోహి కావడానికి కారణమైన అతి ఘోరమైన ధనాపేక్షను గుర్తించి దుఃఖపడ్డాడు. తాను పూర్తిగా భ్రష్టుడని తెలుసుకున్నాడు. ఆ రోజున తన శత్రువుని కలిసాడు. ఆ శత్రువు ఎవరో కాదు స్వయంగా తానే! గర్వం మారుమనస్సును అడ్డుకుంటుంది అనే అంశాన్ని ఈ ఉపమానం బోధిస్తున్నప్పటికీ, దీనమనస్సు గురించి ఇందులో దాగియున్న పాఠాలు హృదయాన్ని తాకేవిగా ఉన్నాయి. మన హృదయ పాపాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నామని తలంచిన సమయంలోనే మనం గర్వమనే విత్తనాన్ని నాటి, దానికి నీరుపోసి దాని పంటను కోసేసాము. "హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింప గలవాడెవడు? యెహెూవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను” అని యిర్మీయాను తన నోటిగా వాడుకున్న దేవుడు చెప్పాడు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమంటే మనకెంత పిచ్చి ప్రేమ ఉందో అని తెలియచేసే జ్ఞానమే దీనమనస్సుతో కూడిన నాయకత్వమనే నేలను కూడా సేద్యపరుస్తుంది. మన ఆత్మీయ పేదరికానికి మనమే పూర్తి బాధ్యత వహిస్తే అది మన ఆత్మీయ నాయకత్వాన్ని కృపా కార్యంగా మార్చి సోమరితనాన్నీ, గర్వాన్ని అడ్డు కుంటుంది. అలా చేయడం మన నిజ స్వభావం గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తూ నిజమైన మార్పుకోసం శ్రమపడేలా చేస్తుంది. ఫలితంగా తమ భక్తి జీవితంలో విజయం సాధించడానికి శ్రమిస్తున్న వారి యెడల జాలి చూపుతాము. ఎందుకంటే మనల్ని కూడా మన బలహీనత ఆవరించి ఉంది కాబట్టి!

మన పాపాన్ని సరిగ్గా మనం గమనించడమే మనలో నిరాశావాదం పెరగ కుండా, నశించువారిపట్ల ప్రేమ తగ్గకుండా అడ్డుకుంటుంది. థామస్ మర్ఫీ ఇలా చెప్పాడు,

“ప్రసంగీకుడు తానే ముఖ్యమైన శ్రోతనని భావించి, తనకు తానే ప్రతీ వర్తమానాన్ని ప్రసంగించుకోవాలి. అవిశ్వాసి నుద్దేశించి ప్రసంగించినా అతడలా చేయాల్సిందే. ఎందుకంటే అవిశ్వాసి హృదయమూ, తన హృదయమూ ఒకే స్వభావం గలవి. మరియు తాను ఏ అగాధం నుంచైతే తృటిలో తప్పించు కున్నాడో అదే అగాధం నుంచి వారిని తప్పించేలా ప్రయత్నిస్తున్నాడు కాబట్టి! ప్రసంగీకుని నిమిత్తం ప్రజల నిమిత్తం ఇలా చేయడం అత్యవసరం."

దీనుడైన నాయకుని క్రిందున్న దేవుని ప్రజలు వర్ధిల్లుతారు. సర్వశక్తిమంతుడైన దేవుని ప్రభావ మహిమల్ని మనం ముఖాముఖిగా ఎదుర్కొన్నప్పుడు మనలో దీనత్వం బాగా వృద్ధిచెందుతుంది. మన ప్రాధాన్యత కాక ఆయన ప్రాధాన్యతే మనకు ప్రియమైన వాటిని వశపరచుకొనే నియమమైనపుడు, దీనమనసుతో మనం నడిపిస్తాం. సిలువలో కనబడుచున్న ఘోరమైన దౌర్జన్యంతో, క్రీస్తు యొక్క వర్ణింపశక్యము కాని ప్రేమతో మన ఆలోచనను నింపుకొంటే, 'ఆయన హెచ్చవలసియున్నది నేను తగ్గవలసియున్నది.' (యోహాను 3:30) అని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పినట్లు మనం చెబుతాము. సోమరితనంతో మనం స్వయంసమృద్ధి గలవారమనే ప్రవాహంలో కొట్టుకొనిపోయే మన నైజాన్ని మర్చిపోని రోజును మనం గడిపితే, మన మాదిరిని అనుసరించు వారికది ధన్యకరమైన మార్గమవుతుంది.

ప్రభువా, దీన మనస్సుని కలిగియుండడం చాలా కష్టం. నాలోని ప్రతీది దాన్ని ఎదిరిస్తుంది. సృష్టిలోనూ, లేఖన భాగాల్లోనూ నేను నీ ఘనతను చూస్తున్నప్పటికీ, గర్వంతో నేను నీ మహిమను దొంగిలిస్తున్నాను. సిలువను సరిగ్గా చూడడానికి నీ కృప నాకు అవసరం. నా పాపం ఎంత మోసకరమైనదో, నీ కృపాబాహుళ్యమెంత అద్భుతమైనదో నేనెన్నటికీ మర్చిపోకుండునట్లుగా నేను సిలువనుగూర్చి తెలుసుకోవాలను కుంటున్నాను. అన్ని వేళలా నిన్నే ఘనపరచునట్లుగా క్రీస్తు సౌందర్యంతో నేను నిండిపోవాలని తీవ్రంగా అపేక్షిస్తున్నాను. ఈ అద్భుతాల నుంచి నేను తొలగిపోయి నప్పుడు గుర్తించగలిగే వివేచన నాకు అనుగ్రహించండి, ఆమెన్!

 

4. యథార్థత వల్ల కలిగే స్వేచ్ఛ

నేనొక సంచార వ్యాపారి గురించి విన్నాను. ఒక పెద్ద కంపెనీకి కార్య నిర్వాహణాధికారియైన వ్యక్తి ముందు కూర్చొని తాను తెచ్చిన వస్తువు గొప్పతనాన్నీ, నాణ్యతనూ కనులకు కట్టినట్లు వివరించాడు. మరికొన్ని క్షణాల్లో తాను తెచ్చిన వస్తువు ధరను తెలియచేసే లోపే ఆ కార్యనిర్వాహణాధికారి కొద్ది సమయం బయటకు వెళ్లాడు. ఆ అధికారి లేని సమయంలో తన కెదురుగా బల్లపై ఉన్న కాగితంపై ఆ వ్యాపారి దృష్టి పడింది. దానిపై తన ప్రత్యర్థి కంపెనీ చిరునామా, దానికి అడుగున ఆ కంపెనీ ఉత్పత్తుల ధరల జాబితా ఉన్నాయి. ఆ ధరను చూద్దామని అనుకున్న వ్యాపారి ఆశను ఆ కంపెనీ కార్యనిర్వాహణాధికారి త్రాగిన సోడా గ్లాసు ఆవిరి చేసేసింది. ఎందుకంటే ఆ గ్లాసు సరిగ్గా ధరల పట్టీని కప్పేసింది. ఆత్రాన్ని అణుచుకోలేని ఆ వ్యాపారి ఆ కార్యనిర్వాహణాధికారి గైర్హాజరీని అవకాశంగా తీసుకొని ధరల పట్టీమీద ఉన్న గ్లాసును తొలగించగానే అందులోనుంచి చిన్న చిన్న స్టీలుగుండ్లు ఆ బల్లపైనా, ఆ కార్యాలయపు ప్రాంగణంలోకి ప్రవాహంలా దూసుకెళ్లిపోయాయి. నిర్ఘాంతపోయిన ఆ వ్యాపారి తన ప్రతిపాదనను కట్టిపెట్టి, సిగ్గుతో, అవమాన భారంతో అక్కడ నుంచి జారుకున్నాడు. అతని యథార్థతను పరీక్షించడానికి పెట్టిన ఆ పరీక్షలో అతడు విఫలమయ్యాడు. ఈ కథలో నిజానిజాలేమిటో నాకు తెలియదు కానీ, నిజాయితీతో యథార్థతతో కూడిన మనస్సును అనగా చెప్పిన దాన్నే చేసే మనస్సును స్పష్టంగా అది ఉదాహరిస్తోంది.

నమ్మకాలూ, నడతా స్థిరంగా ఏకీభవించడమే యథార్థత. అతిక్రమించకూడని నియమాలని వేటిగూర్చైతే బోధించి, వేటి కనుగుణంగా నాయకులు స్థిరంగా జీవిస్తారో వారే యథార్థవంతులు. దానికి భిన్నంగా జీవించువారు వేషధారులు. ఆత్మీయ నాయకులమైన మనకు దేవుని వాక్యమే మన వివాదరహితమైన ప్రమాణం. మన నమ్మకాలు లేఖనాలనుంచే ఉద్భవించాలి, మన నడత దాని ఉపదేశాల కనుగుణంగా మార్పు చెందాలి. వాక్యానుసారమైన సిద్ధాంతాల విషయంలో రాజీ పడినవారు సౌకర్యవంతంగా ఉండే వాక్యవిరుద్ధమైన అభిప్రాయాలతో తృప్తి చెందుతూ, పాపాన్ని సమర్థించుకోవడమో, లేదా పాపాన్ని నిర్లక్ష్యం చేయడమో చేస్తున్నారు. ఆ ప్రజల సమక్షంలోనైనా ఏకాంత సమయంలోనైనా మలినంకాని నైతిక స్వభావాన్ని కలిగియుండడమే యథార్థత!

నిందార్హమైన నడత కనబడనీయకుండా మారువేషాన్ని ధరించుట, నైతికంగా మోసపూరితమైన పన్నాగాల వెనక దాక్కొనుట, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయుట, ముఖ్యమైన బిరుదులు పొందుట మొదలగు విషయాల్లో నాయకులు నిపుణులై, చివరకు ఏదొక సందర్భంలో తమ వేషధారణ బట్టబయలయ్యే వరకూ నిజాయితీ లేని నాయకులు తమ్ము తాము పాప దుర్భేధ్యమైన వారిగా ఎంచుకుంటున్నారు. ఆత్మీయ నాయకుని వేషధారణ బట్టబయలైనపుడు కలిగే దుష్పరిణామాల నుంచి తప్పించుకోవాల్సిన ఒత్తిడిలో దేవుని ప్రజలుంటారు. యథార్థత లోపిస్తున్నదని తెలియచేసే సూచనల్ని నిర్లక్ష్యం చేయడమే నాయకుడు అప్రతిష్ఠ పాలవడానికి కారణం. నెలల తరబడి ఒక నాయకుని నైతిక ప్రవర్తనలో అవకతవకలు గమనించినప్పటికీ, ఆ నాయకుడు సత్ప్రవర్తన కలిగినవాడేననీ, కేవలం నేటి దినాన మాత్రమే నైతిక బలహీనత మూలంగా తొట్రుపడ్డాడనీ, బలమైన శోధన దాడిచేసినప్పుడు అప్రమత్తంగా లేనందున పాపం చేతికి చిక్కాడనీ ప్రజలు భావించే అవకాశముంది. అయితే ఆ అభిప్రాయం సరిగా వివేచించే సామర్థ్యం లేకపోవడం మూలంగా కలిగిందే. 'ఒక వ్యక్తి పడిపోయినపుడు తానున్న ప్రదేశానికి దూరంగా పడిపోడని' నాకు పరిచర్య గురించి ఉపదేశించిన నా గురువు జాన్ మెకార్థర్ గారు చాలాసార్లు చెప్పారు. మరొక రీతిగా చెప్పాలంటే, నాయకుడు కనపరచాల్సిన ప్రవర్తనను ఘోరమైన రీతిలో ఉల్లంఘించడం అకస్మాత్తుగా, అనూహ్యమైన రీతిలో జరిగిపోదు. ఎవరైతే దేవుని కృపనుబట్టి నైతికంగా ఖచ్చితమైన జీవనశైలిని ఏర్పరచుకుంటారో, వారు అబద్దాలతో వేషధారణతో కూడిన జీవితానికి తొందరగా ఆకర్షితులవ్వరు. ఎన్నోసార్లు చాలా చాలా చిన్న విషయాల్ని సరిగా గుర్తించకుండా రాజీపడడం వల్ల ఇలాంటి పతనం హృదయంలోనుంచి బయట పడుతుంది. నాయకుడు యథార్థత విషయంలో పడిపోతే, ఆ పతనం మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తి పతనాన్ని పోలినదే! అయితే మన భక్తి మనల్ని సాతానుగాడి తంత్రాలకూ మన పాపేచ్ఛలకూ అతీతులుగా చేస్తుందనుట మాత్రం నిజం కాదు. స్వచ్ఛమైన, వాక్యానుసారమైన యథార్థతను సాధన చేస్తున్న వ్యక్తిలో బలమైన ఆత్మీయ వివేచన ఉంటుంది. ఆ వివేచనే అకస్మాత్తుగా నైతిక వైఫల్యం జరగకుండా అడ్డుకుంటుందని జాన్ మెకార్థర్ గారు సరిగ్గా చెప్పారు. పాపేచ్ఛలు హృదయంలోకి వచ్చి బలంపొందకముందే, యథార్థంగా జీవించాలని తీర్మానించుకున్నవారు ఆ అబద్దానికున్న ముసుగును తొలగించి ఆ ప్రమాదం నుంచి వీలైనంత వేగంగా పారిపోతారు (1 తిమోతి 6:11;; 2 యథార్థతవల్ల కలిగే స్వేచ్ఛ 2 తిమోతి 2:22;, హెబ్రీ 5:14;). ఈ విషయంలో స్పర్జన్ గారు చెప్పిన మాటలు అసమానమైనవి. “అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఒక వ్యక్తి అజ్ఞానంతో తన భక్తి జీవితాన్ని నాశనం చేసుకుంటే, ఆ వంచన కేవలం అగ్ని పర్వతంలోని లావాతో నిండిన నేలనుంచి ఆకస్మికంగా వెలువడిన ఒక్క నిప్పు కణం లాంటిది; మరొక రీతిగా చెప్పాలంటే ఆ వ్యక్తి చేసిన తుచ్ఛమైన పాపం అనేక క్రూర మృగాలుండే గుహనుంచి బయటకొచ్చిన ఒక్క గర్జించు సింహం వంటిది.

 

యథార్థత - మనస్సాక్షి

శుద్ధమైన మనస్సాక్షిని కలిగి ఉండడానికి శ్రమిస్తేనే యథార్థ హృదయం ఏర్పడుతుంది. మనల్ని సత్య మార్గంలో నడిపించడానికి మన అంతరంగంలో దేవుడు పెట్టిన వ్యవస్థే మన మనస్సాక్షి. ఈ మనస్సాక్షి కొన్నిసార్లు మన క్రియల్ని నిందిస్తుంది, కొన్నిసార్లు సమర్థిస్తుంది. మన మనస్సుకీ, హృదయానికీ సాక్షిగా పనిచేస్తుంది. మనం జవాబు చెప్పాల్సిన మన అంతరంగ భాగస్వామిగా పనిచేస్తుంది. ( రోమా 2:15;). మన మనస్సాక్షికి వాక్య సత్యాన్ని తెలియచేస్తున్నప్పుడు, లేఖన ప్రమాణానికి విరుద్ధంగా మనం ఏమీ చేయకుండా అదుపులో ఉంచమని దానికి చెబుతున్నాం. కేవలం మనస్సాక్షే మన ప్రమాణం కాకపోయినా, దానిని శుద్ధంగా స్పష్టంగా ఉంచడానికి శ్రద్ధ చూపితే అది మనల్ని మహోన్నతమైన, స్థిర ప్రమాణమైన దేవుని వాక్యం వైపుకు నడిపిస్తుంది. కనుక యథార్థంగా జీవించడానికి శక్తివంతమైన సాధనంగా మనస్సాక్షి సహాయపడుతుంది.

నాయకుడు తన మనస్సాక్షి వేసే కేకల్ని నిర్లక్ష్యం చేసినపుడు తీవ్రమైన ప్రమాదానికి గురవుతాడు. అతని వివేచన సామర్థ్యం నాశనమౌతుంది, గర్వం విచ్చలవిడిగా పెరుగుతుంది, తద్వారా అతని జీవితం అదుపు తప్పి ఆత్మ వంచనకు గురవుతుంది. హుమెనైయును, అలెక్సెంద్రు అను తిమోతి సమకాలీకులిద్దరు తమనమ్మకాలను క్రమంగా ఉల్లంఘిస్తున్నారని (1తిమోతి 1:20;) తెలియచేస్తూ, యవ్వన పాస్టరైన తిమోతిని మంచి మనస్సాక్షిని కలిగియుండమని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు (18 వ.). నిష్ప్రయోజనమైన ముచ్చటలకూ, పాపేచ్ఛలకూ, తప్పు బోధనూ ప్రచారం చేయడానికి కపటంతో కూడిన విశ్వాసమూ మలినమైన మనస్సాక్షి నడిపిస్తాయని పౌలుకు తెలుసు (6,7 వచనాలు). మనస్సాక్షిని నిరంతరం నిర్లక్ష్యం చేయడం మూలంగా కలిగే ఆత్మీయ నాశనం గురించి ఇతడు తరచూ మాట్లాడాడు.

1) ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మనస్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా? అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు (1 కొరింథీ 8:10-12).

2) నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై....... మంచి పోరాటము పోరాడవలెనని యీ ఆజ్ఞను నీకు ఇస్తున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారివలె చెడియున్నారు (1తిమోతి 1:18,19).

3) అయితే కడవరి దినములలో వాతవేయబడిన మనస్సాక్షిగల కొందరు అబద్ధికుల వేషధారణ వలన ......... కొందరు విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు (1తిమోతి 4:1-2).

4) పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి (తీతు 1:15).

ఆత్మీయ జీవితానికి కలిగే అపాయాన్ని పౌలు మాటలు తెలియచేస్తున్నాయి. ఇది స్పష్టం. మన మనస్సాక్షి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరచినపుడు మనం దాన్ని గద్దించి, నిశ్శబ్దంగా ఉంచే అవకాశమూ ఉంది, దాన్ని అంగీకరించి దాని ప్రభావానికి లొంగిపోయే అవకాశం కూడా ఉంది. మనస్సాక్షి స్వరానికి వెనువెంటనే మనం విధేయత చూపే కొలది, అది చెప్పే సత్య స్వరపు స్పష్టత పెరుగుతుంది, ప్రమాదాల్ని సునిశితంగా పసిగట్టగలిగేలా మన ఆత్మీయ ఇంద్రియాలకు శిక్షణనిస్తుంది. మనం విధేయులమయ్యే కొలదీ, మనం నిజాయితీపరులం, యథార్థవంతులం అనడానికి ఆధారం దొరుకుతుంది. రాజీ వైపు మనం ప్రయాణిస్తున్నప్పుడు సత్యం విషయంలో సున్నితంగా ఉండడానికి ఉన్నతమైన శిక్షణ పొందిన మనస్సాక్షి మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. పాపాన్నుంచి దృఢచిత్తంతో పారిపోవాలి. దానికి బదులు హేతువు నాధారం చేసుకొని పాపంతో రాజీపడి, సత్యాన్ని అణిచేస్తే మనలో మంచి చెడుల్ని ఎంతో స్పష్టంగా తెలియచేసే ధ్వని క్షీణించిపోతుంది. పలుమార్లు ఇది పునరావృతమైతే సత్యాన్ని వినిపించే గంట అసలు మోగనే మోగదు. మరి ఇతరులకు నమ్మకమైన జీవితంలా కనబడేది కేవలం తుఫాను వచ్చేముందు కలిగే నిశ్శబ్దమే కాని మరొకటేమీ కాదు. సమయం సత్యం అన్నివేళలా కలసి పయనిస్తాయి. నేడు చిన్నవైన, అంతగా ప్రాముఖ్యతలేని విషయాల్లో రాజీపడితే అది రేపటి దినాన ముఖ్యమైన విషయాల్లో రాజీపడడానికి కారణమవుతుంది. మన నాయకత్వం మాదిరికరంగా ఉండేటట్లు మనం యథార్థతతో కూడిన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి? ఆ జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలి?

 

సత్యం విషయంలో సున్నితంగా ఉండాల్సిన అంతరంగ జీవితం

ప్రజలు క్రీస్తును తృణీకరిస్తే ఆత్మీయ నాయకునికి ఎంతో దుఃఖం కలుగుతుంది. దానికి తోడు నీతి న్యాయాలతో, ప్రేమానురాగాలతో, స్వచ్ఛమైన, హృదయపూర్వకమైన మనసుతో చేసే పరిచర్య గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడితే అది కూడా అతన్ని అతిగా కలిచివేస్తుంది. అలుపెరగక అలవర్చుకున్న యథార్థతను ఎవరైనా విమర్శిస్తే అది ఎంతో వేదన కలిగిస్తుంది. ఎవరైనా నిన్ను అపార్థం చేసుకొన్నారను విషయమే నీకు కష్టమనిపిస్తుంది. మరైతే ఉద్దేశపూర్వకంగా నిన్ను తప్పుగా చిత్రించినప్పుడు కాపరిగా ఉండాలనే భారంతో ఉన్న నీ హృదయాన్ని పదునైన బాకుతో పొడిచినట్లే ఉంటుంది కదా! అపొస్తలుడైన పౌలువంటి నాయకుని గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, సంపూర్ణంగా శుద్ధమైన మనస్సాక్షిని కలిగి ఉన్నానని అతడు ధైర్యంగా చెప్పిన మాటలే. యూదుల మహా సభ ముందు తన్ను తాను సమర్థించుకొంటూ 'నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని యెదుట నడుచు కొనుచుంటినని (అపొ.కా. 23:1), 'నేను దేవుని యెడలను మనుష్యుల యెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నానని (అపొ.కా. 24:16) కొన్నాళ్ల తర్వాత కైసరయలో పెద్దల, ప్రజల సమక్షంలో గవర్నరుతో పౌలు చెప్పాడు. తన నిజాయితీ గురించి తానెదుర్కొన్న ప్రశ్నలకు తరచూ దేవుడు అనుగ్రహించిన తన మనస్సాక్షే అంతిమ సమాధానమని అతడు చెప్పాడు (2 కొరింథీ 1:12;; 2 కొరింథీ 4:2;; 1 థెస్స 2:4;; 2 తిమోతి 1:3;). పౌలు అభిప్రాయం ప్రకారం యథార్థంగా జీవించాలంటే సత్యం విషయంలో సున్నితంగా పనిచేసే మనస్సాక్షిని ఎంత శ్రమైనా కాపాడుకోవాలి. దీనికి కఠోరమైన క్రమశిక్షణ అత్యవసరం. పరిచర్యలో అత్యధిక ఆశీర్వాదం అనుభవించాలంటే శ్రమకు తోడు వ్యక్తిగతమైన జాగరూకత కూడా అవసరమే. నిజానికి నాయకునిగా అనర్హుడు కాకూడదని తన శరీర కోరికల్ని తన అదుపులోకి తెచ్చుకుని, తన శరీరాన్ని లోపరచుకొనుచున్నానని పౌలు కొరింథీ సంఘానికి చెప్పాడు (1 కొరింథీ 9:27;). సువార్త ఫలం వలన కలిగే అక్షయమైన కిరీటాన్ని పొందడమే ఆశా నిగ్రహాన్ని అతడు సాధన చేయుట వెనకున్న ముఖ్యోద్దేశం (23-26 వచనాలు).

నాయకత్వంలో యథార్థతను అభివృద్ధి చేసుకొని, దానిని భద్రపరచు కోవడానికి పౌలు ఏర్పరుచుకున్న స్థిరమైన నియమాలు ఏంటి? థెస్సలోనిక మొదటి పత్రికను అధ్యయనం చేసినపుడు మనం అతని హృదయాన్ని చూడవచ్చు. అతడు తనతో పాటు ప్రయాణిస్తున్న సువార్త బృందపు ఆదర్శప్రాయమైన పరిచర్యను తెలియచేస్తూ నాయకత్వంలోని యథార్థతను వివరించి, సమర్థించాడు. థెస్సలోనికలో వారు 3 నెలలు అద్భుతమైన పరిచర్య చేసిన తర్వాత, యూదుల్లో కొంతమంది పౌలూ, అతని స్నేహితులూ కేవలం పేరు ప్రతిష్ఠలకోసం, ధనఘనతల కోసం మాత్రమే సేవ చేసారని వాదిస్తూ వాళ్ళ స్వభావానికి వ్యతిరేకంగా కఠినమైన నిందలు వేసారు. (1 థెస్స 2:3-12;). అంతేకాదు అవసరంలో ఉన్న నూతన థెస్సలోనిక సంఘాన్ని వాళ్ళు విడిచిపెట్టేసారనీ (1 థెస్స 2:17-20;), క్రైస్తవ్యాన్ని అంగీకరించడం వలన కలిగే ప్రమాదాల్ని దాచిపెట్టి నూతన విశ్వాసుల్ని మోసగించారని (1 థెస్స 3:2-4;) కూడా వాళ్ళను నిందించారు. అలాంటి నిందనూ విమర్శను ఎదుర్కోవడం పౌలుకు కొత్తేమీ కాదు. తన వ్యక్తిగత ఘనతను సమర్థించుకోవాలని ఎన్నడూ అతడు ఉద్దేశించలేదు. దానికి భిన్నంగా తన పరిచర్యలో జరిగిన యథార్థ సంఘటనల ద్వారా తనపై వచ్చిన నిందల నెదుర్కున్నాడు. 'మీరెరిగినట్టే, మీకు తెలియును, మీకు జ్ఞాపకమున్నది గదా, మీరే సాక్షులు' అని 2వ అధ్యాయంలో పునరావృతమైన మాటలు పౌలు చెప్పిన మాటల్లోని నిజాన్నీ, చేసిన పనుల్లోని పారదర్శకతను ఉదాహరిస్తున్నాయి.

 

1. యథార్థ జీవితమంటే తెరచిన పుస్తకంలా ఉండాలి

యథార్థంగా జీవించడానికి పౌలు ఏర్పరుచుకున్న నియమాల్లో మొదటిది తనను క్షుణ్ణంగా పరీక్షించమని బహిరంగంగా ఇతరుల్ని ఆహ్వానించడమే! నీ మాటలతో నీ క్రియలు పొసగుచున్నాయా? లేదా? అని ఇతరులు పరిశీలించగల ప్రదేశంలోనే యథార్థతను సాధన చెయ్యాలి. గతంలోని సంఘటనల్నీ, తన పరిచర్యలోని కొన్ని వృత్తాంతాల్నీ ప్రజల ముందుంచి వాటిని పరీక్షించడానికి పౌలు అంగీకరిస్తున్నాడు. థెస్సలోనిక సంఘస్థుల యెడల పౌలు చూపిన నిజమైన శ్రద్ధలో, చేసిన వ్యక్తిగత త్యాగంలో, జరిగించిన దీన పరిచర్యలో వారు ఏవేవో లోపాలు కనుగొంటారనే చింత కించితైనా అతనికి లేదు. విమర్శకులు అతనిపై మోపిన ప్రతీ నిందను అతని నాయకత్వంలోని ఆధారంతో జాగ్రత్తగా బేరీజు వేస్తే, పరిస్థితిని సరిగా అంచనా వేయగలుగుతారు. పౌలు తప్పనిసరిగా కొన్నిసార్లు విఫలమయ్యాడు, కదా? అని ఎవరో ఒకరు అడిగే అవకాశముంది. ఆయన కూడా మనిషే కాబట్టి కఠినమైన మాటను పలకడమో, స్వార్థంగా పనిచేయడమో, తన పరిచర్యలోని విజయాలకు ఘనతను తనకు తాను ఆపాదించుకోవడమో చేసి అతడు పొరపాటు చేసే ఉంటాడని మనం భావిస్తాం. అయితే పౌలు తన అపోస్తలత్వాన్నిబట్టి తానెంతగానో తగ్గించుకున్నాడు. తన లోపాలను చూసుకొని విరిగి నలిగిన మనసుతో దుఃఖపడేవాడు. అవి గమనించిన ప్రతీవారికి తన బలహీనత కూడా తన బలమంత గొప్పదిగానే కనబడేది. తత్ఫలితంగా తనను నిశితంగా పరిశీలించమని ఇతరుల్ని బహిరంగంగా ఆహ్వానించే వాడు. ఎందుకంటే అతని పరిచర్య, వేదాంతం, స్వభావం మోసపూరితమైనవీ కావు, తన స్వశక్తిమూలంగా పొందుకున్నవీ కావు. అదే విధంగా మన వేదాంతం, స్వభావం మన విజయ పరాక్రమ కార్యాల గురించి కాక సత్యాన్ని స్పష్టంగా కనుగొని దాని ప్రకారం జీవించుట గూర్చినవై ఉండాలి. ఎవరైనా మన జీవిత విధానంతో, పరిచర్యతో విభేదించినా లేదా వక్రీకరించినా, తద్వారా జరిగే పరీక్షను బట్టి మనం వ్యక్తిగతంగా భయభ్రాంతులకు గురికాకూడదు. పౌలుకి అలాంటి చింత అస్సలు లేనే లేదు. కనుక థెస్సలోనీకయుల మధ్యలో నాయకునిగా ఉన్నప్పుడు తనలో వారు చూసిన వాటిని ఆధారం చేసుకొని అతనిపై వచ్చిన నిందల్ని పరీక్షించమని అతడు ధైర్యంగా చెప్పగలిగాడు.

 

2. యథార్థ జీవితం మనుషుల్ని సంతోషపెట్టదు

ఆత్మీయమైన ధైర్య సాహసాలతో సేవించడమే యథార్థంగా జీవించడానికి పౌలు ఏర్పరుచుకున్న రెండవ స్థిరమైన నియమం. సువార్తికులైన పౌలూ, అతని అనుచరులూ కేవలం అధికారం పొందడానికి ధైర్యంగా మాట్లాడుతూ, వ్యతిరేకతను ఎదుర్కొనగానే థెస్సలోనీకయులను విడిచి పెట్టే జీతగాళ్లని తప్పు బోధకులు చెప్పారు. గొర్రెల్ని సంరక్షించినట్లు నటిస్తూ ప్రమాదానికి నిజంగా భయపడే జీతగాళ్లను యేసు గద్దించాడు (యోహాను 10:11-15;). స్వీయభద్రత అనేది సద్గుణం కాదు, అదొక బలహీనత. అయితే పౌలూ అతని అనుచరుల విషయంలో కూడా ఈ బలహీనత ఉందా? థెస్సలోనికకు ఈశాన్యంగా కొన్ని వందల మైళ్ల దూరంలో ఉంది ఫిలిప్పీ పట్టణం. అందులో తాము ప్రదర్శించిన ఆత్మీయ సాహసం గురించి పౌలు మాట్లాడాడు. వారు శ్రమపడి అవమానం పొంది, యెంతో పోరాటంతో దేవుని సువార్తను బోధించడానికి ధైర్యం తెచ్చుకున్నారు. (1 థెస్స 2:2;). ఫిలిప్పీ పట్టణంలో తగిలిన దెబ్బల మూలంగా కలిగిన గాయాలింకా మానక ముందే కుంటుకొంటూ పౌలు థెస్సలోనీకకు వచ్చి, సమాజ మందిరంలో బోధించ నారంభించాడు. ఆ విధంగా క్రీస్తు సత్యంతో అత్యంత వివాదాస్పదమైన, అపాయకరమైన పరిస్థితుల్లోకి పౌలు చొరబడగలిగాడు. కొన్ని వారాల (బహుశా 2 లేదా 3 నెలల) స్వచ్ఛమైన సూటియైన సువార్త పరిచర్య చేసిన తర్వాత, ఆ సువార్త సత్యం ఆ పట్టణస్తుల రాతి హృదయాల్ని బలంగా తాకింది. ఫలితంగా రక్షణ పొందిన నూతన విశ్వాసులు ఆ సువార్తికుల్ని అనగా వారికున్న నమ్మదగిన కాపరుల ప్రాణాల్ని కాపాడడానికి రహస్యంగా వారిని ఆ పట్టణం నుంచి పంపించేసారు. అయితే అక్కడనుంచి వెళ్లకుండా సమాజమందిరంలో బోధించడానికి పౌలు ఎంతగానో వాదించి ఉంటాడని నేను భావిస్తున్నాను.

యథార్థత లేని వ్యక్తి చేసే కార్యాలు ఇవేనా? 'కాదు' అని చెవులకు చిల్లులు పడేలా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. దైవజనుడు దేనికీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే సువార్తను అప్పగించుటకు అతని మనస్సాక్షిని యోగ్యమైనదిగా దేవుడు ఎంచాడు. కనుక అతడు మనుష్యుల్ని సంతోషపెట్టువానిగా కాక హృదయాల్ని పరీక్షించు దేవునినే సంతోషపెట్టువానిగా బోధించాడు (1 థెస్స 2:4). ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు (సామెతలు 28:1) అని జ్ఞానియైన సొలొమోను చెప్పాడు. ఆత్మీయ నాయకుల్ని పరీక్షించండి. వారు ఆత్మీయంగా ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారా? దేవుని కార్యాన్నీ, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారా? నిర్భయంగా వారు దేవుని వాక్యాన్ని వివరిస్తున్నారా? వాక్యానుసారంగా, స్పష్టంగా వారు సమాధానమిస్తున్నారా? సిద్ధాంతం, పరిచర్య, సద్గుణం, సేవ మొదలగు అంశాల గురించి ప్రశ్నల్ని ఇష్టపూర్వకంగా వారు ఆహ్వానిస్తున్నారా? ఒకవేళ వారలా చేయకపోతే, గొర్రెలు బలహీనమై, అసత్యం సంఘంలోనికి చొరబడుతుంది. నాయకుల్లోని ధైర్య సాహసాలకు, యథార్థత తోడైతే అది ప్రజలకు గొప్ప భద్రత నిస్తుంది.

 

3. యథార్థ జీవితం కేవలం దేవుడు మాత్రమే చూడగలిగేవాటితో యుద్ధం చేస్తుంది

దేవుని ముందు సిగ్గుపడనక్కరలేని స్వచ్ఛతతో జీవించడమే యథార్థంగా జీవించడానికి పౌలు ఏర్పరుచుకున్న మూడవ స్థిరమైన నియమం. నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో నాయకత్వం జరిగించాలనుకొనే నాయకుడు తన హృదయంలో జరిగే యుద్దాల్ని నిరంతరం గెలుస్తూనే ఉండాలి. పాపానికి వ్యతిరేకంగా చేసే యుద్ధంలో తన హృదయం నిందారహితంగా ఉందని పౌలుకు తెలుసు. ఇతర పాపుల మాదిరిగానే అతడు కూడా పాపానికి లొంగిపోయాడు. అయితే దేవుని పరిశుద్ద ప్రమాణాన్ని ఉల్లంఘించినప్పుడు హేతుబద్ధమైన సాకులు చెప్పి తన్ను తాను సమర్థించుకునే అలవాటు మాత్రం అతనికి లేదు. అందుచేత అతడు సృష్టికర్తనే తన క్రియలకూ మాటలకూ సాక్షిగా పిలుస్తున్నాడు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడినవారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలవలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడు వినియోగింప లేదు; ఇందుకు దేవుడే సాక్షి అని 1 థెస్స 2:4-5;లో పౌలు చెప్పాడు. పౌలు అతనితో కూడా నున్న సువార్తికులు సిద్ధాంతపరమైన లోపం, కామాతురత, ముఖస్తుతి చేసే మాటలు, ధనాపేక్ష మొదలగు విషయాల్లో ఏ మాత్రం ఆసక్తిని కనపరచక నిందా రహితులుగా సత్యమైనవారిగా నిరూపితమయ్యారు. ఒకవేళ వారు ఆ పాపాల్లో ఏకీభవించి ఉంటే, పౌలు తననెవ్వరూ తప్పుపడతారనే భయం లేకుండా తీవ్రమైన వ్యతిరేకత మధ్య అంత ధైర్యంగా ఎలా సవాలు చేయగలుగుతాడు? ఒకవేళ పౌలు థెస్సలోనీకయుల్ని తన స్వప్రయోజనం నిమిత్తం వాడుకోవాలనే మనస్సు కలిగినవాడైతే, దేవుడినే సాక్షిగా పిలిచే సాహసం చేసుండేవాడు కాడు!

హృదయ సంగతుల్ని నిర్లక్ష్యం చేసేవారు సత్యాన్ని తప్పించుకొని తిరగడానికి విస్తారమైన మార్గాల్ని ఏర్పాటు చేసుకోవాలి. చదరంగంలో నిపుణుడైన ఆటగాడు గెలవడానికి ఎత్తుకు పై ఎత్తులను ముందుగానే నిర్ణయించుకుంటాడు. అదే విధంగా తాను చేసిన పాపాన్ని సమర్థించుకునే నాయకుడు జాగ్రత్తగా తప్పించుకోవడానికి మార్గాన్నీ, తానెదుర్కొనబోయే విమర్శలకు తగిన సమాధానాన్ని ముందుగానే సిద్ధపరచు కుంటాడు. అతడు తన అనుచరులకు ప్రశాంతంగా కనబడవచ్చు గానీ అంతరంగంలో పాపేచ్ఛలతో నిండుకొనినవాడై వాటిని ఎంతో నేర్పుగా సమర్థించుకుంటూ ఉంటాడు. ఇదంతా పిల్లి ఎలుకల మధ్య జరిగిన ప్రాణాంతకమైన ఆటలా ఉంది. అవినీతిపరుల చేతిలో హేతుబద్ధమైన సమాధానం అనేది అరిగిపోయిన పనిముట్టు లాంటిది. ఈ విధంగా సమర్థించుకొనే తీరును చాలా సులభంగా పసిగట్టవచ్చు.

  • శోధన వస్తుంది, సంభవించబోయే ప్రమాదం గురించి మనస్సాక్షి హెచ్చరిస్తుంది.

సమర్థించుకొనే విధానం: నేను పాపాన్ని ద్వేషిస్తాను కాబట్టి, శోధనకు దగ్గరగా ఉండి కూడా దాన్ని కోరకుండా, దాని బారిన పడకుండా ఉండగలను.

  • శోధన తీవ్రత పెరుగుతుంది. 

సమర్థించుకొనే విధానం: నేను ఆత్మీయంగా బాగానే ఉన్నాను. కష్టాన్ని గమనించడం మూలంగా కలిగే హాని ఏముంది?

  • పాపేచ్ఛలు ఆలోచన జీవితాన్ని దహించడం ప్రారంభిస్తాయి.

సమర్థించుకొనే విధానం: నా జీవితం చాలా కష్టమైనది. కనుక అన్ని సమయాల్లో నేను బలంగా ఎలా ఉండగలను? అలాంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా, ప్రతీ శక్తివంతమైన శోధనకు నేను లొంగిపోకుండా ఉండాలా?

  • సత్యం గురించీ, కుటుంబం స్నేహితులగూర్చీ, కలుగబోయే పరిణామాల గురించి మనస్సాక్షి హెచ్చరికలు జారీ చేస్తుంది.        సమర్థించుకునే విధానం: ఈ పాపంలో ఉన్నది నేనే కాబట్టి, నేను ప్రేమించే వారిలో ఏ ఒక్కరు కూడా దీని ప్రభావానికి గురికారు. అంతేకాదు నేను ఇతరుల్లో చూసిన దాని కంటే ఇదేమీ పెద్ద పాపం కాదు.
  • పాపం గెలుస్తుంది, దోషం వెంటాడుతుంది.

సమర్థించుకునే విధానం: నేను ఇతరుల కంటే చెడ్డవాణ్ణేమీ కాదు. దేవుడు నన్ను క్షమిస్తాడని నాకు తెలుసు. ఈ పాపాన్ని ఆయనకు నాకు మధ్యలో వదిలి వేస్తాను. ఇతరులకు నా పాపం తెలిస్తే వారు నాకు తీర్పు తీర్చడానికి ప్రయత్నిస్తారు. కనుక నేను ఎవరికీ చెప్పను, ఎవరి సహాయమూ నాకు అక్కరలేదు. పాపం అలవాటుగా మారుతుంది, సత్యం బలహీనమవుతుంది.

దోషారోపణచేసే ఇంద్రియాలు మౌనమైపోతాయి. సమర్థించుకునే విధానం: ప్రజలు మతాచారాల్ని అతిగా పాటిస్తారు. తాము మాత్రమే అన్ని వేళలా నీతిగా జీవిస్తున్నామని భావిస్తారు. దేవుడెంతో ప్రేమ కలిగిన వాడు, నేను సంతోషంగా ఉండాలని ఆయన కోరుచున్నాడు.

పై వివరణ మోసపూరితమైన హృదయం వేసే పథకాలన్నింటినీ కూలంకుషంగా వివరించనప్పటికీ, రాజీపడే విషయంలో మిళితమైయున్న దశల్ని మాత్రం వర్ణిస్తోంది.

వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు, అట్టివాడు లెస్పైన జ్ఞానమునకు విరోధియని సామెతలు 18:1 క్లుప్తంగా చెబుతోంది. ఒక నాయకుడు ఎన్ని విజయాలు సాధించి, ఎంత ప్రజాదరణ సంపాదించినా తన పాపాన్ని సమర్థించుకోవడం మాత్రం అన్ని వేళలా శాపాన్ని నాశనాన్ని కలిగిస్తుంది (యాకోబు 1:14-15;). పాపేచ్ఛలను చాలా తీవ్రంగా ఛేదించాలి, పశ్చాత్తాపం ద్వారా ఒప్పుకోలు ద్వారా పాపానికి పూర్తి బాధ్యత వహించాలి, లేఖనంతో మనసును నింపుకొని లేఖనానికి విధేయత చూపడం ద్వారా మనసును నూతనపరచుకోవాలి. ఇలా చేసి పాపాన్ని సమర్థించుకొనుట అనే ఈ ఘోరమైన పద్ధతికి ముగింపు పలుకవచ్చు. పాపేచ్ఛల్ని కోరికల స్థాయిలో ఉన్నప్పుడు కఠినంగా చేధించి పాపాన్ని అడ్డుకోవచ్చని యేసు చెప్పాడు.

వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పున దేమనగా- ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాని పెరికి నీ యొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రమోజనకరము గదా. నీ కుడి చెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాన్ని నరికి నీ యొద్దనుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రమోజనకరము గదా (మత్తయి 5:27-30).

పాపేచ్చ మన మనసులో చొరబడగానే, మన ప్రభువూ యజమానీయైన యేసు సిలువ దగ్గర ఆశ్రయం పొందడానికి వీలైనంత వడిగా పరిగెత్తి పాపేచ్చలనుంచి మనం పారిపోవాలి (1 తిమోతి 6:11;). అంతేకాదు పాపాన్ని పూర్తిగా ఒప్పుకొని, దానికి పూర్తి బాధ్యత వహించినప్పుడు పాపాన్ని సమర్థించుకొనే అవకాశమే ఉండదు. 51వ కీర్తనలో దావీదు తన పాపం గురించి పశ్చాత్తాపపడినపుడు తన పాపానికి తానే పూర్తిగా బాధ్యత వహించాడని స్పష్టమవుతోంది.

..... దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము.

నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమము తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము

నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి

నా పాపమెల్లప్పుడు నా యెదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను

నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు

తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు (కీర్తన 51:1-4).

నిజమైన ఒప్పుకోలు పాప తీవ్రతను తగ్గించదు, అస్పష్టంగా కనబడేలా చేయదు. కానీ దేవుడు పాపాన్నెలా నిర్వచిస్తాడో అలానే చూస్తుంది. మన పాపం మూలంగా కలిగే ప్రతీ పరిణామానికి బాధ్యత వహించాలి, దాని భారాన్ని భరించాలి. అలా చేయడమే నిజమైన పశ్చాత్తాపానికి కీలకమైనది. మన పాపం విషయంలో దేవునికి ఏ మాత్రం భాగం లేదనీ, ఆయన స్వభావం నిర్దోషమైనదనీ చూపించే కోరికే మన పాపానికి మనం పూర్తిగా బాధ్యత వహించామనడానికి ముఖ్య ఆధారం. పాపం మూలంగా కలిగిన ప్రతీ పరిణామాన్ని బట్టి దావీదు తన్ను తాను సమర్థించుకోలేదు కానీ దేవుని న్యాయాన్ని ఘనపరిచాడు (తీర్పు తీర్చినపుడు నీవు నిర్మలుడవుగా అగపడుదువు -4వ వచనం). తన పాపానికి ఆ విధంగా పూర్తి బాధ్యత వహించడం ఇశ్రాయేలు రాజైన దావీదుకు హాయినిచ్చే విషయం కాదు. 51వ కీర్తన రాసిన తర్వాత, తాను సమర్థించుకున్న పాపం ఫలితంగా దాదాపు 30 సంవత్సరాల కఠినమైన కుటుంబ సంక్షోభం, ఎన్నో సంవత్సరాల నిస్సారమైన నాయకత్వం దావీదు జీవితంలో చోటుచేసుకున్నాయి. ఈ శ్రమలన్నింటిని అనుభవిస్తున్న ఏ సందర్భంలో కూడా దేవుడు అత్యంత కఠినంగా, అన్యాయంగా శిక్షిస్తున్నాడని దావీదు నిందించలేదు. దావీదు హృదయం విరిగి నలిగిపోయింది. అలాంటి పశ్చాత్తాపాన్ని దేవుడు ఇష్టపడతాడు (17వచనం). నాయకుడు దేవుని హృదయానుసారుడైతే (1 సమూ 13:14;), పాపాన్ని సమర్థించుకోవాలన్న ఆలోచనే రాదు.

 

4. యథార్థంగా జీవించాలంటే వాక్యంలోని ప్రతిమాటకూ లోబడి జీవించాలి

దేవుని వాక్యంతో మన మనస్సులు నింపుకొని త్వరితంగా మన చిత్తాన్ని ఆ వాక్యానికి లొంగిపోయేలా చేసినప్పుడు పాపాన్ని సమర్థించుకోవడం అసంభవమే. మనలో క్రీస్తు స్వభావం రూపుదిద్దుకోవాలంటే పాపాన్ని గూర్చిన అవగాహన, దేవుని మహోన్నతమైన పరిశుద్ధతను గూర్చిన ఉన్నతమైన అభిప్రాయం, పరిశుద్ధాత్మ పరిపూర్ణమైన నడిపింపు మనకు అవసరం. శోధనను జయించడానికి దైవశక్తిని మనం కోరుకుని, వాక్యమనే పాలను నిర్లక్ష్యంచేస్తే పరిశుద్దాత్ముడు పని చేయడానికి అవకాశమేదీ లేదు, ఎందుకంటే ఆయన తన వాక్య సత్యాన్ని మాత్రమే పరిశుద్దపరచడానికి వినియోగించుకుంటాడు (యోహాను 17:17;). "దైవ సత్యం (వాక్యం), దైవభక్తి ఏ మాత్రం విడదీయలేనంత సంబంధం కలిగినవి. మన ఉద్దేశాలు ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ, దేవుని చిత్తమేంటో తెలుసుకోకపోతే దానికి లోబడడం మనకు అసాధ్యం. దేవుడు ఎలాంటివాడో, ఆయనకు చెందిన వారి నుంచి ఆయన ఏమి ఆశిస్తాడో మనకు తెలియకపోతే మనం భక్తిగా ఉండలేమని” మెకార్థర్ గారు చెప్పారు.

మరోప్రక్క మన చిత్రాన్ని లోబరచకుండా లేఖనాన్ని మనం అధ్యయనం చేస్తే మన జీవితాలు క్రీస్తులా మారే పరిమాణం తక్కువగానూ, పరిసయ్యులయ్యే ప్రమాదం ఎక్కువగానూ ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని ప్రకారం జీవించడానికి ఎజ్రా దృఢ నిశ్చయము చేసికొనెను (ఎజ్రా 7:10). ఎందుకంటే ఆ నిర్ణయానికి భిన్నమైనదేదీ తన మనస్సుకీ హృదయానికి ప్రయోజనం కాదని అతనికి తెలుసు. దేవుని నోటినుంచి వచ్చే ప్రతిమాట (మత్తయి 4:4;) కు లొంగిపోవడం మూలంగా కలిగే లాభం గురించి అర్థం చేసుకొనుట ద్వారా ఆత్మీయ నాయకులు తమ యథార్థత విషయంలో స్థిరపడతారు. వాక్య పరిశోధన, ధ్యానాల వెనకున్న ఉద్దేశాలు చెడ్డవై, అధిక శాతం ఆతురత మూలంగా ప్రేరేపించబడినవై, తప్పకనో లేదా జ్ఞానార్జన ద్వారా గర్వపడడానికో అయితే, మన ఆత్మకు ఆ వాక్య ధ్యానం వలన ఎటువంటి ప్రయోజనమూ చేకూరదు. "

శక్తివంతమైన ఆత్మీయ నాయకత్వానికీ, అధికారానికి యథార్థత అనేది లంగరు వంటిది. మన హృదయాలు సత్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే, దేవుడు మన చిన్న చిన్న ప్రయత్నాల్ని చూసి చిరునవ్వు నవ్వి, తన కృపతో జ్ఞానంతో మన బలహీనతల్ని కప్పుతాడు. 'యెహోవా, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే'నని ఇశ్రాయేలీయులు పాడుకొనేవారు (కీర్తన 16:1,2;).

ప్రియమైన రక్షకుడా, నీవు తప్ప మరెవ్వరూ చూడలేని సంగతులపై యుద్ధం చేయడానికి నాకు సహాయం చేయండి. నా మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు, అజ్ఞానంతో నేనెన్నడూ దానిని అణిచివేయకుండా, నా పాపాన్ని సమర్థించుకోకుండా సహాయం చేయండి. నా హృదయం కుయుక్తితో ఆడే ఆటల్ని పసిగట్టడానికి, నా పాపానికి పూర్తి బాధ్యత వహించడానికి నాకు సహాయం చేయండి. నేను సత్యం విషయంలో ఎంతో సున్నితంగా ఉండునట్లు నీ కృపే నన్ను నిజమైన పశ్చాత్తాపం వైపు నడిపించును గాక, ఆమెన్!

 

5. సుదీర్ఘ పయనానికి కావల్సిన శక్తి

పలు సంవత్సరాలు పరిచర్య అనే యుద్ధ రంగంలో ఆరితేరిన ప్రముఖ సంఘ కాపరిని కొన్నాళ్ల క్రితం కలిసి 'నేటి సంఘ నాయకులు కలిగి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏమిటి? అని అడిగాను. ఒక్క క్షణమైనా ఆలోచించకుండా 'నమ్మకత్వమే' నేటి నాయకులకు అవసరమైన లక్షణమని అతడు నొక్కి చెప్పాడు. నమ్మకత్వం తర్వాత స్థిరమైన సహనమే ఈ అనుభవజ్ఞుడైన కాపరి జాబితాలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. సాత్వికం త్యాగం యథార్థత క్రమశిక్షణ జ్ఞానం మొదలగు ముఖ్య లక్షణాలకు అతడు అధిక ప్రాధాన్యత నిచ్చినప్పటికీ, అవేమీ నమ్మకత్వాని కంటే ముఖ్యమైనవిగా అతడు భావించలేదు.

తమకు దేవుడు అనుగ్రహించిన పవిత్రమైన ఆధిక్యతనూ, బాధ్యతనూ మర్చిపోయిన నాయకుల్నీ, వారి లోపాల్నీ ఎన్నో ఏళ్ల తన జీవితంలో ఆ అనుభవశాలి ప్రత్యక్షంగా చూసాడు. ఉరకలేసే ఉత్సాహంతోనూ, అద్భుతమైన తలాంతులతోనూ నాయకత్వమనే మారథాన్ పరుగు పందాన్ని ఎంతోమంది ప్రారంభిస్తారు. అయితే నిర్లక్ష్య ధోరణితో విధుల్ని నిర్వర్తిస్తూ విఫలమవడం వలన పందెంలో అనర్హులవుతారు. ఈ విషయాలన్నీ ఆయనకు తెలుసు. సేవకుని మనసుతోనే ఎంతోమంది పరిచర్యను ప్రారంభిస్తారు. అయితే ఏ మాత్రం సహాయ సహకారాల్ని అందించని వారితో పరిచర్య చేస్తే కొన్నాళ్లకు వారు తీవ్రమైన అసంతృప్తికి గురౌతారు. యథార్థంగా జీవించాలని దృఢ నిశ్చయం చేసుకున్న వారు సైతం వ్యక్తిగత వైఫల్యాన్నీ, పరిచర్యలోని అసంతృప్తినీ అనుభవిస్తారు. ఈ అనుభవాలు తమ వేషధారణను దాచుకొనే విధంగా శోధిస్తాయి. స్వార్థబుద్ధి ప్రేరేపిస్తునపుడు ఇతరుల్ని పురికొల్పే సామర్థ్యమైనా, ఆశయాల్ని సాధించు విధంగా ప్రోత్సహించే నేర్పరితనమైనా అపనమ్మకానికి, నిరాశకు గురిచేస్తుంది. అనుభవంతో పాటు వచ్చే చిక్కు సమస్యలన్నింటినీ భరించి స్థిరంగా నిలబడడం నిజంగా చాలా కష్టం! పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే పరిచర్యలో కొనసాగడం అసాధ్యం.

విశ్వాసమనే సుదీర్ఘమైన ప్రయాణంలో దైవభక్తిని సాధన చేస్తే, అది శాశ్వతమైన, గంభీరమైన రీతిలో ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. సంఘ చరిత్ర అంతటిలో క్రైస్తవ నాయకులు ఎంతో నమ్మకంగా, భక్తిగా జీవించి మనకొక స్వాస్థ్యాన్ని ఏర్పరిచారు. ఆ స్వాస్థ్యమే నమ్మకమైన గృహనిర్వాహకత్వం జరిగించడానికి మనకు పిలుపునిస్తోంది, మనం ఏ విధమైన సాకులు చెప్పడానికి వీలు లేకుండా మనల్ని అడ్డుకుంటోంది.

బలహీనమైన తీర్మానాలు చేసుకోవడం వలన, జీవాహారమైన వాక్యాన్ని సరిగా భుజించకపోవడం వలన ఈ తరపు నాయకుల్లో నైపుణ్యం కొదువుగా ఉంటోంది, నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. గ్రంథ రచన కొనసాగుతూనే ఉంది,  ఊహకందని వేగంతో నాయకత్వంపై గ్రంథాలు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. అందుబాటులో ఉన్న వనరులన్నింటి మూలంగా పరిచర్య బలం పొంది, సుదీర్ఘ కాలం నమ్మకమైన బలమైన క్రైస్తవ నాయకుల్ని గుర్తించి, వారికి శిక్షణనిచ్చి, వారి వంటి అనేక మందిని తయారుచేయడంలో సంఘం ఇప్పటికే నిపుణత సాధించి ఉండాలి. అయితే అలాంటి నాయకులెక్కడ? పరిచర్యను చెక్కే నేటి శిల్పకారులు లోకాన్ని ఆకర్షించే నూతన ఆవిష్కరణలకు మాత్రమే ప్రాధాన్యత నిస్తున్నారు. మోసకరమైన జలాల్లో ఆత్మీయ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో నడిపించే నాయకులు దేవుని ప్రజలకు అవసరమైనపుడు, వాక్య స్పష్టతను సమకూర్చి, బల పరాక్రమాల్ని ప్రదర్శిస్తూ యుద్ధ నౌకను నడిపే స్టీరింగ్ దగ్గర ఏ ఒక్కరూ వారికి కనబడట్లేదు. ఇదేమీ ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు!

 

కృపచేత బలంపొందాలి

పరిచర్య మూలంగా ఎదురయ్యే కష్టాల్లో ముందుకు సాగిపోవడానికి నాకు కూడా ప్రోత్సాహం చాలాసార్లు అవసరమయ్యింది. దేవుడు మన గురించి చాలా శ్రద్ధ తీసుకొని సరైన సమయంలో, సరైన మాటతో మనల్ని ఆదరించు స్నేహితుల్ని మన మార్గంలో ఉంచుతాడు. యధాలాపంగా జరిగిన ఆ సంభాషణ మరొక కత్తిపోటును తట్టుకొనే శక్తిని మన హృదయానికిస్తుంది. పరిచర్యలో స్థిరంగా కొనసాగడానికి ఇబ్బందిపడుతున్న తన యవ్వన శిష్యుడైన తిమోతికి విశ్వాసంలో తనకు తండ్రియైన పౌలునుంచి 'యేసు దగ్గరకు రా' అనే సందేశం అవసరమైంది. 'నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము......... క్రీస్తు యేసుయొక్క మంచి సైనికునివలె ......... శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు,' అని అనుభవజ్ఞుడైన కాపరిగా పౌలు తిమోతికి ఉపదేశించాడు (2 తిమోతి 2:1,3,4). యుద్ధరంగంలో పాల్గొనమనేది ఎంత అద్భుతమైన పిలుపో కదా! పరిచర్యలోని ప్రతీ విషయం ప్రధాన స్థావర ఉద్దేశంపై, యుద్ధ ప్రణాళికపై, దాని ఆచరణలో పెట్టే పద్ధతులపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఈ వాస్తవం గురించి అనుభవంలేని తన స్నేహితునితో అనుభవజ్ఞుడైన యోధుడు చెప్పాడు. పాపిని రక్షించే కృపయే పాపికి సరఫరా అయ్యే శక్తి. బలపరిచేది దేవుని కృపయైతే, బలవంతుడవు కమ్మని పౌలు తిమోతికి ఎలా చెప్పగలడు? అని ఎవరైనా అడగవచ్చు. క్రైస్తవ జీవితమంటే అన్ని విషయాల్లో దేవుని వాగ్దానాలకు మనల్ని మనం అప్పగించుకొని, విశ్వాసంతో నడిచే నడక అని మనం గుర్తుంచుకోవాలి (2 కొరింథీ 5:7;). తిమోతికి ఇంతకు ముందే దేవుడు అనుగ్రహించిన క్రీస్తు కృపద్వారా దైవ వనరుల్ని అంకిత భావంతో, ఆత్మ విశ్వాసంతో ఉపయోగించు కొమ్మని పౌలు చెప్పాడు. యుద్ధం ముమ్మరంగా జరుగుచున్నప్పుడు ఎదురయ్యే ప్రతీ సవాలుకు దేవుని నుంచి సత్వర సమాధానంపై నమ్మకమైన నాయకులు ఆధారపడరు. ఎందుకంటే తమ మనస్సును దేవునికి అర్పించినప్పుడు దేవుడు తన సహజాతీత శక్తిని వారి శ్రమలో మిళితం చేస్తాడని ఎరిగి భయంతో, వణుకుతో తమ స్వరక్షణను కొనసాగిస్తూ (ఫిలిప్పీ 2:1,2;), వారు ధైర్యంగా నిలబడగలుగుతారు. కొన్నిసార్లు మన ప్రస్తుత సమస్య నుంచి వేగంగా విముక్తి పొందడానికి దేవుడు ఏదొక అద్భుత మార్గాన్ని చూపిస్తాడని ఆశిస్తూ మనం దేవుని దగ్గరకు వెళ్తాం. మన మనస్సును ఆయనకు లోబర్చడమే ఈ దృశ్యనీయమైన వైరుధ్యాన్ని పరిష్కరించడానికి ముఖ్యమైన మార్గం. మనం శోధన ఎదుర్కొన్న ప్రతి సమయంలో దేవుడే జోక్యం చేసుకుని మనల్ని విధేయులు కమ్మని బలవంతం చేస్తే మనకున్నది ఎలాంటి విశ్వాసం? మనం నిశ్చలంగా ఉన్నప్పుడు మనలో నమ్మకత్వమనే గుణం రూపుదిద్దుకోదు. దేవుని శక్తి మనల్ని కాపాడుతుంది, అయితే మార్పు కొరకు మనం పడే శ్రమ ద్వారానే దైవశక్తిని మనం ఆస్వాదించగలుగుతాం (ఫిలిప్పీ 2:12-13;).

క్రీస్తుయేసునందున్న కృపయే మన ప్రయాసలో ఉన్న ప్రధానాంశం. జీవితంలో ఎదురయ్యే కష్టాలు చేసే రణగొణ ధ్వనిని గెలవడానికి నిరంతరం ప్రయత్నించేవాణ్ణి నాకు చూపిస్తే, తన విమోచన గురించి లోతుగా ధ్యానిస్తూ విశ్వాసంలో ముందుకు సాగిపోయే వాణ్ణి నేను మీకు చూపిస్తాను. ఏ కృపలోనైతే మనం నిలిచియున్నామో ( రోమా 5:2;), ఏ కృప సహాయంతోనైతే మనం పాపంతో పోరాటం చేస్తున్నామో (రోమా 6:4-11;), ఏ కృపమూలంగానైతే దేవుడు మనల్ని మహిమకు భద్రం చేసాడో ఆ కృపయే మన శ్రమలన్నింటిలో మనం స్థిరంగా కొనసాగడానికి సహకరిస్తుంది.

 

ప్రవాహంలో కలసిపొండి!

నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగించుము (2 తిమోతి 2:2). సేవకుని మనసు కలిగిన నాయకులుగా తమ బాధ్యతను నిర్వర్తించి, మరొక తరానికి సేవచేయగలిగిన బృందాన్ని తయారుచేయగలిగిన వారికి నాయకత్వ బాధ్యత అప్పగించమని తిమోతికి పౌలు ఆజ్ఞాపించాడు.

మా నాన్నగారితో లోతైన వేదాంత మర్మాల గురించి తరచూ చర్చించే ఆధిక్యతను పొందడమే నా జీవితంలో అత్యంత మధురమైన ఘట్టాల్లో ఒకటి. 70 సంవత్సరాల వయసులో ఆయన హెబ్రీ భాషనూ, సిస్టమాటిక్ థియాలజినీ (క్రమ పద్ధతిలో వాక్య సిద్ధాంతాలని) నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆయనొక పుస్తకాల పురుగు. ఒక పుస్తకాన్ని చదివిన వెంటనే తర్వాత చదవాల్సిన పుస్తకమేంటో తెలియచేయమని నిర్విరామంగా నన్ను విసిగించేవారు. తెల్లవారు జామునే వాక్య పఠనం చేస్తూ, సంఘంలో ఇతర పురుషుల దగ్గర నిరంతరం శిష్యునిగా తర్ఫీదు పొందుతూ ఆయన మార్పుచెందిన సంఘటనలు నాకింకా జ్ఞాపకమున్నాయి. ప్రభువు కృప ఆయన హృదయాన్ని సంధించినప్పుడు ఆయన వయస్సు 31 సంవత్సరాలు. ఆ సంఘటన తర్వాత మా కుటుంబ జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమైంది. పలు సంవత్సరాల ఆత్మీయ యుద్ధం చేసిన తర్వాత నా తండ్రిలో సత్యాన్ని గూర్చిన ఆసక్తి, సంఘ క్షేమం పట్ల భారమూ తగ్గిపోయి ఉంటాయని మీరు అనుకోవచ్చు.

కానీ అది వాస్తవం కాదు. నిజానికి నా తల్లి నమ్మకమైన సహచర్యంలో వారిరువురి ఆత్మీయ బలం మా కుటుంబానికి అత్యంత విలువైన స్వాస్థ్యం. 'క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురియొద్దకు పరిగెత్తమని' తమను అప్పుడప్పుడు సవాలుచేసే తాతయ్య ఒకరున్నారని ఆయన మనమలకు తెలుసు. మా తండ్రికి జన్మించిన నలుగురి కొడుకులం ఆయన మాదిరిగానే నలుగురికి జన్మనిస్తే, ఈ విధంగా 5 తరాలు కొనసాగితే, దాదాపు 250 మంది అవుతారనీ, వారందరిపై ఆయన ఆత్మీయ జీవితం ప్రభావం చూపుతుందని ఆయన కొన్నేళ్ల క్రితం లెక్కగట్టాడు. ఆ గంభీరమైన దృక్పథమే తన జీవితాన్ని సువార్త భారంతో కూడినదిగా మలిచింది. మా నాన్న గారు తన రక్షకుని గురించీ, ఆయన పునరుత్థాన శక్తి గురించి లోతుగా తెలుసుకోవడానికి ఎదురయ్యే శ్రమల్ని చూసి ఎన్నడూ వెనుకంజ వేయలేదు. పరిచర్యలోని ఇబ్బందుల కారణంగా నేను సణుగుకొన్న ప్రతిసారీ ఆ విషయం జ్ఞాపకమొచ్చి ధైర్యం తెచ్చుకుంటాను.

నమ్మకత్వంతో జీవించి అటువంటి స్వాస్థ్యాన్ని నీ వెనుక విడిచి వెళ్లడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? శిష్యుల్ని తయారుచేయడమనేది ఎంతో పవిత్రమైన బాధ్యత. నిరంతరం నాయకుల్ని తయారుచేయడానికి అవసరమయ్యే స్థిరమైన నమ్మకాల్ని కలిగి ఉండాలని నాయకుల్ని ఈ బాధ్యత డిమాండ్ చేస్తుంది. తిమోతికి అందుబాటులో ఉన్న ఆత్మీయ ఆధిక్యతలు నిజానికి చాలా ఉన్నతమైనవి. విశ్వాసులైన తల్లి, అమ్మమ్మలనుంచి సువార్తను నేర్చుకొన్న తిమోతి సత్యాన్ని చేతబట్టిన వారి సుదీర్ఘ జాబితాలో ఉన్నాడు (2 తిమోతి 1:5;; 2 తిమోతి 3:15;). శ్రేష్ఠమైన వాక్యబోధను అతడు క్రమంగా విన్నాడు. దైవభక్తులు అతనిని వ్యక్తిగతంగా మార్గదర్శకం చేసారు. అపొస్తలుడైన పౌలు శిక్షణలో అతడు కాపరిగా తర్ఫీదు పొందాడు. ఎన్నో సంవత్సరాలు సత్యాన్ని నేర్చుకొని, దాన్ని సాధన చేసి ఆ తర్వాత గృహనిర్వాహకునిగా బాధ్యత వహించాడు. పరిచర్య నుంచి వెనకకు మళ్లి, తన బాధ్యతను త్యజించే అవకాశం అతనికి లేనే లేదు. శిష్యునిగా ఉండడానికి, ఇతరుల్ని శిష్యులుగా చేయడానికి వాక్యాన్ని వీలైనంత ఎక్కువగా నేర్చుకోవాలి, సత్యాన్ని సంరక్షించే వారిని కనుగొని వారికి సత్యాన్ని ప్రకటించాలి, వారు కూడా తమలాంటి వారిని తయారుచేసే వరకూ వాక్యంతో వారిని పోషించాలి!

నాయకులు సోమరులై, శిష్యుల్ని తయారుచేయకుండా, వారు మరొక బలమైన నాయకుని పర్యవేక్షణలో ఎదగకుండా ఉన్నప్పుడు బలహీనత చాలా వేగంగా విస్తరిస్తుంది. గొలుసులోని ఒక బలహీనమైన లింకు మొత్తం గొలుసంతటిని బలహీనం చేసినట్లు, ఒక బలహీన నాయకుని మూలంగా మొత్తం పరిచర్యే ప్రమాదంలో పడే అవకాశముంది. విజయం సాధించకుండా అదే సమయంలో పరాజయం పాలవకుండా మధ్యస్థంగా, సాదాసీదాగా బ్రతకడాన్ని అంకితభావంగల నాయకులు సహించలేరు. 2 నేను భక్తిగా ఉండడానికి ఎంతోమంది తమ సమయాన్ని వెచ్చించారు, తమ వనరుల్ని అందించారు, నా గురించి ప్రార్థించారు. ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకోవడం వల్లనే పాపం చేయకుండా నన్ను అదుపుచేసుకోవడానికి సహకరించే విషయాల్లో ఒకటిగా నేను భావిస్తాను. నాకు ముందుగా వెళ్లిన వారి నీడలో ఉండి, మాదిరికరమైన నాయకత్వం కోసం ఇపుడు నా వైపు చూస్తున్న వారి ముందు నేనెలా అస్థిరంగా ఉండగలను? మనల్ని అనుసరించేవారి కోసం నమ్మకమైన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టడంతోపాటు, మనతో తన నిబంధన స్థిరపరచిన దేవుణ్ణి ఈ లోకంలో సరైన రీతిలో ప్రతిబింబించడానికి మనం తీర్మానించుకోవాలి. ఆయన మన యెడల కనపరచిన అపారమైన ప్రేమే మన ఉన్నతమైన, ఏకైక ఆశయం. మనం ఆయన మహిమకరమైన నిబంధన ప్రేమకు సమమైన ప్రేమను ఎన్నటికీ కనబరచలేకపోయినా, ఆయన ప్రేమకు అద్దంపట్టే చిహ్నాల్ని కలిగియుండడానికి ఎంత శ్రమనైనా భరించాల్సిందే!

తన సైనికాధికారికి విధేయత చూపడానికి సైనికుడు చూపే వెనుదీయని సమర్పణ, విజయ మార్గాన పయనించడానికి ఒక అథ్లెట్ సాధన చేసే క్రమశిక్షణ, పంటలో ఫలాన్ని ఆశిస్తూ రైతుపడే నిరంతర శ్రమ అనే మూడు స్పష్టమైన సాదృశ్యాల నుపయోగించి 2 తిమోతి 2లో నాయకత్వ సారాన్ని పౌలు తెలియచేసాడు. తమ తమ వృత్తుల్లో విజయం సాధించడానికి సైనికుడు, అథ్లెట్, రైతు ఎంతో శ్రమపడతారు, ఎన్నో త్యాగాలు చేస్తారు. కనుక ఈ మూడు సాదృశ్యాలు నమ్మకత్వపు శ్రేష్ఠతను స్పష్టంగా చూపిస్తున్నాయి. పరిచర్య అనే రణరంగంలో నాయకుడు ఎదుర్కొనే అతి భయంకరమైన కష్టాల్ని భరించడానికి అతణ్ణి ప్రేరేపించేదేంటి? లోకం చేసే వాగ్దానాలో, ఒక జట్టుగా కలసి పనిచేయడమో కానే కావు. దానికి భిన్నంగా సామాజిక మార్పు కానీ ఘోరమైన అవిశ్వాసం కానీ దేవుని వాక్యానికి సంకెళ్లు వేసి బంధించలేవనే జ్ఞానం మూలంగా సహనం అనేది అలవడుతుంది. పరిచర్యలో పరిస్థితులెలా ఉన్నప్పటికీ 'దేవుని వాక్యాన్ని ఎవ్వరూ బంధించలేరని ఎరిగి, నేరస్థునివలె శ్రమపడడానికి సిద్ధ మనసును కలిగి మనం ధైర్యంగా నిలబడవచ్చు. ఆత్మీయబలం కలిగి ఉండడమంటే ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతోకూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని మనం వారి కొరకు ఓర్చుకోవడమే (10వ వచనం). మనది యేసేపు అంటే ఎవరో తెలియని తరం కావడం విచారకరం. నేటి నాయకులు భక్తిగల నాయకత్వమనే వారసత్వానికి పూర్తిగా వేరైపోతున్నారు. కనుక సువార్త పరిచర్యలో సంఘం ఎదుర్కొనే అత్యంత గడ్డు పరిస్థితుల్లో వారి నేర్పరితనం దేవుని ప్రజలనేమీ పోషించలేదు. ప్రజల్ని దీర్ఘకాలం ప్రభావితం చేసేలా తమ తలాంతుల్ని ఉపయోగించి, అంకితభావాన్ని కనపరచేవారికి ఖచ్చితంగా నమ్మకంగా సువార్త పరిచర్య బాధ్యతను అప్పగించాలనీ, ఆ విధంగా శిష్యుల్ని తయారుచేసే విధిలో పాలిభాగస్థులవ్వమనీ అన్ని తరాల్లోని నాయకులకు పౌలు ఆజ్ఞాపించాడు.

 

1. యుద్ధం శ్రమతో కూడినది

యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళంలో ప్రాథమిక శిక్షణను పూర్తి చేసిన తర్వాత, ఇంతటి కఠోరమైన శిక్షణను మనమెందుకు భరించాలి? అనే ఆలోచన నాలో కలిగింది. శిక్షణలో ఉండగా మేమనుభవించిన శ్రమకూ, శిక్షణ పూర్తైన తర్వాత చేసే ఉద్యోగానికీ అస్సలు సంబంధమే లేదు. ప్రాథమిక శిక్షణ పూర్తైన తర్వాత మేమనుభవించిన మిలటరీ జీవితం చాలా ప్రశాంతతతో కూడినది. మాపై అధికారులు మరికొన్ని నియమ నిబంధనలు ప్రకారం ప్రవర్తించమని మాతో చెప్పినప్పటికీ, మమ్ముల్ని సహోద్యోగులుగా పరిగణించేవారు. కవాతు చేయడం, నిద్రలేని రాత్రులు గడపడం, అధికారుల అరుపుల బొబ్బలతో ఉలిక్కిపడడం, కొన్నిసార్లు వారిచేత ఉమ్మి వేయించుకోవడం మొదలగు అనుభవాలన్నీ నాకు తెలుసు. అంతటి రచ్చ దేని కోసం? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం చాలా సులభం. తీవ్రమైన ఒత్తిడిని తట్టుకొనే సామర్థ్యం మాకుందా? లేదా? అని పరీక్షించడమే ఆ కఠోరమైన శిక్షణ వెనకున్న ముఖ్యోద్దేశం. నీ స్పందనను గమనించడానికే నీవు భరించలేని డిమాండ్లను డ్రిల్ మాస్టార్లు నీపై పెడతారు. నిరంతరం సోదాలు జరిగేవి, తగినంత విశ్రాంతి తీసుకోకుండా గంటలు కొద్దీ పనిచేయాల్సివచ్చేది, అత్యున్నత ప్రమాణాలను అందుకోవడానికి నిరంతర ఒత్తిడిని ఎదుర్కోవల్సి వచ్చేది, విపరీతమైన వేడికీ, వెన్నులో వణుకు పుట్టించే చలికీ అలవాటు పడాల్సివచ్చింది, అంతులేని అధ్యయనం చేయాల్సివచ్చింది, ఎటువంటి గుర్తింపూ ఉండేది కాదు, బయట ప్రపంచంతో కనీస సంబంధాలు కూడా కొనసాగించే వీలుండేది కాదు, అధికారులు నిరంతరం చేసే వ్యక్తిగత దూషణలకు గురికావల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితుల మధ్య యుద్ధం చేయడం నీవు నేర్చుకోకపోతే, నిజమైన యుద్ధంలో నీ వెన్నటికీ బ్రతికిబట్టకట్టలేవు. శిక్షణను కొంతమంది సీరియస్ గా తీసుకోరు. ప్రశాంత సమయం వారిని జోలపాటతో నిద్రపుచ్చి, శిక్షణ యొక్క అత్యవసరాన్ని వారు నిర్లక్ష్యంచేసేలా మార్చింది. ఉదాసీన వైఖరి, పిరికితనం, యుద్ధ నైపుణ్యాల్లో లోపాలు సైనికుని జీవితంలో అత్యంత ప్రమాదకరమైన శోధనలు. ఎంతటి విజయవంతమైన యుద్ధ ప్రణాళికనైనా పై మూడు దుర్గుణాల కలయిక నాశనం చేసేస్తుంది. మన ఆత్మల విరోధికి వ్యతిరేకంగా దీర్ఘకాలం అలుపెరుగని యుద్ధం చేయడానికి మనకు తిమోతి వలే ఒక సైనిక నియమావళి అవసరం.

పోరాటతత్వం గురించి పౌలు చెప్పిన మాటలు వాస్తవానికి అద్దంపడుతున్నాయి. "సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు” (2 తిమోతి 2:4). దేవుని యుద్ధ ప్రణాళికల్ని నెరవేర్చడానికి అనవసరమైన భారాన్ని తొలగించుకోవాలి, అవసరమైన కార్యాలకై అధికంగా కృషిచేయాలి. తద్వారా సహనం అలవడుతుంది. మిలటరీలో ప్రాథమిక శిక్షణ కోసం మొదటిగా వచ్చినప్పుడు కలిగిన అనుభూతి నాకు బాగా గుర్తుంది. నాకు ముందే శిక్షణలో ఉన్న ఒకతను అత్యవసరమైన వస్తువులు మాత్రమే వీలైనంత తక్కువగా తెచ్చుకొమ్మని మంచి సలహా ఇచ్చాడు. కొన్ని దుస్తులు, ప్రతి దినం వాడుకోవడానికి సబ్బు, ష్యాంపు, టూత్ పేస్టు మాత్రం నేను తీసుకెళ్లాను. మా పై అధికారులు తొలిసారి మా సామాగ్రిని వెదకినప్పుడు దొరికిన రేడియోల్నీ, వార్తా పత్రికల్నీ, చాక్లెట్లనూ, కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థంగా తెచ్చుకొన్న వస్తువుల్నీ పనికిరాని వస్తువులన్నట్లు చెత్తకుండిలో విసిరేసారు. సెంటిమెంట్ గా ఉంచుకొనే వస్తువు దేన్నైనా వారు ఎగతాళి చేసేవారు, విమర్శించేవారు. క్రమక్రమంగా నాగరికతకూ, సుఖసౌఖ్యాలకూ దూరమవడమే కాక, యుద్ధ వీరులుగా కావడానికి మాకడ్డొచ్చే అవరోధాలన్నింటినీ మా నుంచి మాపై అధికారులు వేరు చేసేసారు. సమూలమైన మార్పు జరగాలన్నా, ఆశయ సాధనకై ఏకాగ్రత చూపాలన్నా ఇదొక్కటే మార్గం!

క్రీస్తు సేవలో ఎంతోమంది సొమ్మసిల్లి పోవడానికి కారణం వ్యర్థమైన వాటిని కోరుకోవడం, లోకానికి ఆకర్షితులవ్వడమే! ఆ కోరికలు తీర్చుకోలేరు, లోక ఆకర్షణల్ని వదులుకోవడానికి ఒప్పుకోరు. సుఖ సౌఖ్యాల్నీ, వ్యక్తిగత ప్రయోజనాల్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఆత్మీయ నాయకత్వం చేపడితే, సహనమున్న కాపరులుగా మనం తయారు కాలేము. ఎటుబోయినను శ్రమపడుచున్నాము..... అపాయములో ఉన్నాము, తరమ బడుచున్నాము....... పడద్రోయ బడుచున్నాము..... యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము.... సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము” అని (2 కొరింథీ 4:8-11) లో పౌలు తన పరిచర్య గురించి ఏ మాత్రం దాపరికం లేకుండా మాట్లాడాడు. పౌలు అనుభవించిన తీవ్రమైన శ్రమల్ని అనుభవించడానికి దేవుడు మనల్ని పిలవక పోవచ్చు కానీ దేవుడు కోరినదాన్ని చేయడానికి నిజమైన నాయకత్వం, పరిచర్యలు సహాయపడతాయి. ఈ లోకసంబంధమైన కోరికల్లో మనం చిక్కుకొనకూడదు. విజయాల్ని ఆస్వాదిస్తూ శ్రమల్ని సహించాలంటే మనల్ని దండులో చేర్చుకొన్నవానిని సంతోషపెట్టడమే మన ఏకైక గురిగా ఉండాలి (2 తిమోతి 2:4;). ఆత్మీయ నాయకత్వాన్నీ, బాధ్యతనూ చేపట్టడం దీర్ఘకాల యుద్ధంలో పాల్గోవడమే! అయితే ఆ యుద్ధంలో చిక్కుకోకుండా ఉండేందుకు హృదయమనే గృహాన్ని శుద్ధిచేయడం ఎక్కడనుంచి ప్రారంభిద్దాం. ఇదిగోండి, అనవసరమైన సామాగ్రి జాబితా ఇక్కడ ఇస్తున్నాను, ఆలోచించండి.

జీవితం గురించి భయపడుతూ, చింతిస్తూ చేసే పాపాలు. 'చింతపడకుడి' అని యేసు చేసిన ఆజ్ఞల తీవ్రతను తగ్గించి, చింతపడుట అనే పదానికి 'ఫిర్యాదు చేయడం' 'హృదయ భారం' అనే పేర్లు పెట్టి తప్పించుకోవడానికి క్రైస్తవులు ఇష్ట పడుచున్నారు. 'చింతపడుట' అనేది దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడా? లేదా? అనే సందేహాలతో మన ఆలోచనల్ని పూర్తిగా నింపేస్తుంది. కనుక ఇతరుల క్షేమాన్నిగూర్చి స్వచ్ఛమైన శ్రద్ధతో నడిపించే సామర్థ్యాన్ని ఆ చింత కుంటిదానిగా చేస్తుంది (మత్తయి 6:25-34;; ఫిలిప్పీ 4:6-7;). ఆస్తిపాస్తులపై, సుఖ సౌఖ్యాలపై అధికమైన ప్రేమ. క్రీస్తు కంటే ఇహలోక సంపదకూ సౌకర్యవంతమైన జీవితానికి అధిక ప్రాధాన్యతనిస్తే, నాయకత్వంలో సవాళ్లు ఎదురైనపుడు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యం (మత్తయి 19: 16-22;; లూకా 9:57-62;; కొలస్సీ 3:1-4;).

పరిష్కారం కాని ద్వేషభావం. క్షమించలేని గుణం మనలోని వివేకాన్ని మరుగున పడేస్తుంది. సత్యాన్ని గూర్చిన యుద్ధంలో పక్షపాతం లేని, స్పష్టమైన వాక్య వివరణ కోసం ఇతరులు మన వైపు చూస్తారు. మనకు జరిగిన వ్యక్తిగత గాయాల్ని జ్ఞాపకం చేసుకోవడం సాతానుగాడి వంచనకు ఆహ్వానం పలుకుతుంది, మన ఆనందాన్ని హరించివేస్తుంది, మన నమ్మకాల్ని బలహీనపరుస్తుంది, మన బలమైన సాక్షాన్ని నిశ్శబ్దం చేస్తుంది (1 కొరింథీ 3:3-9;;2 కొరింథీ 2:10-11;; కొలస్సీ 4:2-3;; ఎఫెసీ 4:29-32;).

భూసంబంధమైన వినోదాలపట్ల బలమైన అపేక్ష. విశ్రాంతి, వినోదాలు ప్రభువు మనకనుగ్రహించిన బహుమానాలే. అయితే వాటికి అధిక ప్రాధాన్యతనిస్తే అవి బాధ్యతను విస్మరించడానికీ, కష్టపడి పనిచేసే తత్వానికి వ్యతిరేకమైన వైఖరినీ కలుగచేస్తాయి (ప్రసంగి 3:10;; ప్రసంగి 4:5;; ప్రసంగి 5:12;; ప్రసంగి 10:18;; సామెతలు 6:6-11;; 1 కొరింథీ 16:13;; 1 కొరింథీ 5:8;; 1 థెస్స 4:11-12;).

మనుషుల భయం. మన భక్తినీ, విశ్వాసాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకే అంకితం చేయాలని భక్తిగల, శక్తివంతమైన నాయకత్వం డిమాండ్ చేస్తుంది. ఇహలోక సంపదలకూ, సుఖసౌఖ్యాలకూ మనం బందీలమైతే, కుటుంబం స్నేహితులు మన హృదయాల్ని మన యజమానికంటే ఎక్కువగా ఆకర్షిస్తే, ఇతరుల ఆధిపత్యానికి కోరికలకూ లొంగిపోతాం, దేవుడు మన కనుగ్రహించిన ఆధిక్యతనూ, బాధ్యతనూ నెరవేర్చుటలో విఫలమవుతాం (సామెతలు 3:5-6;; లూకా 14: 26-27;).

తన సైనికాధికారిని సంతోషపెట్టాలనే ఆశతో 'ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి......... తన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తడానికి (హెబ్రీ 12:1) యుద్ధ సన్నద్ధుడైన సైనికుడు తనకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇచ్చుకోకుండా జీవిస్తాడు.

 

2. యుద్ధం చేయడానికి క్రమశిక్షణ అత్యవసరం

అడ్డదారులు అస్సలు వద్దు! “జెట్టియైనవాడు పోరుడునప్పుడు, నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదని” పౌలు చెప్పాడు (2తిమోతి 2:5). ఒక ప్రముఖ అథ్లెట్ తన అనర్హత మూలంగానో, ప్రయత్న లోపంవల్లనో కిరీటాన్ని గెలవడంలో విఫలమైతే అది ఎంత విచారకరం. నిషిద్ధమైన మాదకద్రవ్యాల్ని ఉపయోగించి క్రీడా నియమాల్ని ఉల్లంఘించాడని తెలియగానే బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులెందరి నుంచో ఆ పతకాల్ని క్రీడా నిర్వాహకులు తిరిగి తీసేసుకోవడం మనమెన్ని సార్లు చూడలేదు? గొప్ప గొప్ప క్రీడాకారులు విజయ సాధన కోసం అలవాటుగా అడ్డదారులు తొక్కుతున్న సంగతేంటి? క్రీడల్లో అనుసరించాల్సిన క్రమశిక్షణ గురించి పౌలు ఉపయోగించిన సాదృశ్యం ఈ కీలకాంశాన్ని చక్కగా వివరిస్తోంది. నీవు మోసం చేసినా, అడ్డదారులు తొక్కినా శక్తివంతమైన నాయకత్వం మూలంగా లభించే ఫలాన్ని పరిచర్యనూ కోల్పోతావు. అవును, అది ముమ్మాటికీ నిజం. సరైన శిక్షణ యొక్క ప్రాధాన్యతను నొక్కిచెప్పడానికే వంచన చేయకూడదు, అడ్డదారులు తొక్కకూడదనే నియమాల గురించి పౌలు మాట్లాడడానికి కారణం. నాయకునిగా సిద్ధపడడానికి నైపుణ్యాభివృద్ధికి ఎవరైనా నాయకులు అడ్డదారులు తొక్కితే, పరిచర్య కొలువలేనంతగా నష్టపోతుందనేది పౌలు బాధ.

నేను హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు మంచి ప్రతిభగల ఈతగాడిని. మా యూనివర్సిటీ వాటర్ పోలో జట్టు తరపున ఈత పోటీల్లో పాల్గొని కొన్ని పతకాలు సాధించాను. అదే నా క్రీడా జీవిత పరిధి. అయితే నన్ను అతిగా కలిచివేసే విషయమేంటంటే అసాధారణ ప్రతిభగల అథ్లెట్ నిర్లక్ష్య వైఖరితో, సోమరితనంతో తన ప్రతిభను వ్యర్థమైనదిగా భావించడమే! అలాంటి ఒక విద్యార్థి నాకు తెలుసు. ఒక ఈతగాడికి ఉండాల్సిన లక్షణాలూ, సామర్థ్యాలూ అన్నీ అతనిలో ఉన్నాయి. అతని పొడుగునూ, వెడల్పైన భుజాల్నీ, బలాన్ని చూసిన ప్రతివారు అతడొక ప్రతిభగల వేగవంతమైన ఈతగాడని చెప్పేవారు. 1970-80ల మధ్యకాలంలో తాను హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే ఒలింపిక్ క్రీడల్లో అత్యంత వేగంగా ఈదేవారితో సమానంగా ఈదగలిగేవాడు. అతని ప్రతిభ అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగేదని మా కోచ్ కు తెలుసు. అయితే ఏంటి ప్రయోజనం? అతని గురించి తెలిసిన ఉపాధ్యాయులూ, స్నేహితులూ కుటుంబ సభ్యులందరూ తాను సాధన చేస్తే సాధించేదేమిటో ఊహించు కొమ్మని ప్రోత్సహించేవారు. అయితే గొప్ప ఆశయాన్ని సాధించడానికి అతడు అనుదినం సాధన చేయాలనే ఆసక్తి లేకపోవడమే అసలైన సమస్య. ఎంతోమందికి లేని సహజ ప్రతిభ అతనిలో ఉన్నాయి. అయితే అతని హృదయం మాత్రం ఏ మాత్రం విలువలేని వినోదాలతో నిండిపోయింది, కాబట్టి ఏ గురీ గమ్యమూ లేకుండా జీవించడానికి అతడు ఇష్టపడ్డాడు. ఏ రకమైన క్రమశిక్షణా లేకుండా పోటీల్లో గెలవడమైతే దానిని బహుశా అతడు అంగీకరించేవాడేమో! (1972 ఒలింపిక్ క్రీడల్లో 7 బంగారు పతకాలు సాధించి) మార్క్ స్పిట్జ్ నెలకొల్పిన రికార్డుల్ని మైఖెల్ ఫెక్ట్స్ కంటే ఆ విద్యార్థి ముందుగానే బద్దలగొట్టేవాడేమో!ఎవరికి తెలుసు?

నియమాల కనుగుణంగా సిద్ధపడి, శిక్షణ పొందడానికి శ్రమపడడానికి నీకు ఇష్టం లేకపోతే నాయకునిగా వుండడం అసాధ్యం. మరొక క్రీడల సాదృశ్యాన్ని ఉపయోగిస్తే, ఎట్టి పరిస్థితిల్లోనైనా పరిగెత్తి గెలవాల్సిన పరుగు పందెమే క్రైస్తవ జీవితమని పౌలు కొరింథీయులతో చెప్పాడు (1 కొరింథీ 9:24;). అన్ని విషయాల్లో ఆశా నిగ్రహాన్ని అభ్యాసం చేస్తూ తన పాపేచ్చలకు బానిసగా మారకుండా వాటిని అనుదినం అతడు అణగదొక్కేవాడు (25-27 వచనాలు). నాయకులు అనుదినం అభ్యాసం చేయాల్సిన ఆత్మీయ పాఠాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. వాక్య పఠనం, వాక్య విశ్లేషణ, ప్రార్థన, ఉపవాసం, సువార్తీకరణ, ధ్యానం, కానుకలర్పించడం, ఆత్మీయ పరిచర్య, ఆరాధన మొదలగునవి మన భక్తి జీవితంలో ఆత్మపూర్ణులై యుండడానికి దేవుడు అనుగ్రహించిన మార్గాలు. * మనల్ని వంచించి పరిచర్యకు అనర్హులుగా చేయడానికి మన శత్రువైన సాతాను తగిన పథకాల్ని నిరంతరం కనిపెడుతూనే ఉంటాడు (2 కొరింథీ 2:10-11;; ఎఫెసీ 6:11-12;). అపవాది అబద్దాలతో పన్నిన కుయుక్తిని మన స్వశక్తితో మనం గెలవకపోయినా, భక్తిని చాటే ఉద్దేశంతో మనం క్రమశిక్షణతో జీవిస్తే (1 తిమోతి 4:7;) నమ్మకమైన పరిచర్యనూ అక్రమాలు లేని పరిచర్యనూ దీర్ఘకాలం మనం అనుభవించవచ్చు.

నాకు బలమైయున్న దేవా, ఈ ప్రమాదకరమైన దినాల్లో పరిచర్య అనే సుదీర్ఘ ప్రయాణాన్ని నేనెలా చేయగలను? ప్రతి దశలోనూ రాజీపడిపోతున్న నాయకుల్ని చూస్తుంటే, ఎలాంటి పరిస్థితుల్నైనా సహించే కాపరుల అవసరత చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. నీ అపరిమిత కృప నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజల్ని నడిపించుటలో ఎదురయ్యే కష్టాల్లో సైతం సంతోషంగా నిలిచియుండే సాహసాన్ని నాకు ఇవ్వండి. సులభంగా, సౌకర్యవంతంగా పరిచర్య చేయాలనే కోరికతో నేనెన్నడూ అజ్ఞానంగా అడ్డదారులు తొక్కకుండా నన్ను కాపాడండి. నాకు ముందే వెళ్లి ఎంతోమంది ఏర్పరిచిన నమ్మకత్వమనే అద్భుతమైన స్వాస్థ్యాన్ని కళంకితం చేయకుండా, నా నమ్మకమైన జీవితంతో అలంకరించునట్లు నాకు సహాయం చేయండి. ఆమెన్!

 

రెండవ భాగం

నాయకత్వంలో

ఎదురయ్యే ప్రమాదాలు

6. దేవుడెదిరించే నాయకులు

ఆత్మీయ నాయకుని జీవితంలో దుర్నీతే దేవుని ప్రజలు ఎదుర్కొనే అత్యంత నాశనకరమైన సైనిక బలగం. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. బలహీనమైన తీర్మానాలు చేసుకొనే నాయకులను నైతికత విషయంలో ఎంతో ఘోరంగా రాజీపడేట్లు ప్రలోభపెట్టడం మన శత్రువైన సాతానుకిష్టం. శరీర కార్యాలకు లొంగిపోయిన, శక్తిహీనులైన నకిలీ కాపరుల్ని లెక్కలేనంతమందిని నిర్విరామంగా సంఘంలోనికి సాతానుగాడు ప్రవేశ పెడుతున్నాడు. నిజ కాపరులు రాజీపడడం, సాతానుగాడు నకిలీ కాపరులను సంఘం లోనికి తీసుకురావడం అను రెండు పథకాల్లో ఏ ఒక్కటి విజయవంతమైనా ఎన్నో సంవత్సరాలు ప్రజల నమ్మకం దెబ్బతిని, సాక్ష్యం కళంకితమై సంఘం ఘోరంగా నష్టపోతుంది. నిజానికి కామమనే పాపం బట్టబయలైనప్పుడు అది వెంటనే పరిచర్య వేగాన్ని నియంత్రించి చివరకు ఆపేస్తుంది. నాయకుల్లో దుర్నీతి మూలంగా ఏర్పడిన దుస్థితి ననుభవించిన సంఘానికి అకస్మాత్తుగా నాశనం కలుగుతుంది. ఒకవేళ సంఘం కొనసాగినా, తర్వాత సంవత్సరాల్లో నాయకుల్ని అది ఎంతో అనుమానిస్తుంది. ఒక నాయకుని జీవితంలో ఎన్నో ఏళ్లుగా కనబడని, ఎవ్వరూ గుర్తించని, కపటమైన, అతి చిన్నవిగా కనబడే ఆత్మీయ వ్యాధుల సంగతేంటి? ఆరోగ్యకరమైన పరిచర్యను హేయమైన పాపాల మాదిరిగానే ఈ వ్యాధులు కూడా ధ్వంసం చేస్తాయి. నాయకుడు నిరంతరం నిర్లక్ష్యం చేసి, ఉద్దేశపూర్వకంగా విస్మరించి, సాకులతో తరచూ ముసుగువేసి దాచేసిన స్వాభావిక దోషాల్ని నేను ప్రస్తావిస్తున్నాను. ఉదాహరణకు కోపోద్రిక్తుడు, జగడాలమారియైన నాయకుడు ప్రజల్ని భయపెట్టి, లొంగదీసుకుని పరిచర్యను అడ్డగిస్తాడు. ముఖస్తుతిని అతిగా ఆశించే నాయకుడు ఒక ప్రక్క పొగడ్తల నిమిత్తం ఎదురుచూస్తూనే మరోప్రక్క తన కంటే ఎక్కువ తలాంతులున్న వారిని అసూయతో ఎదిరిస్తాడు. అధికార దాహమూ, ప్రజల్ని తన అదుపులో ఉంచుకోవాలనే తపనా నాయకుడిని అసూయతో అహంతో అత్యాశతో నింపేస్తాయి. మనుషుల భయం ప్రతి ఒక్కరిని అనుమానించేలా, ఎవ్వరికీ జవాబుదారీగా ఉండుటకు ఒప్పుకోకుండా చేసి నాయకుని చిక్కులు పెడుతుంది. బహిరంగంగా జరిగే నైతిక అక్రమాలకంటే ఈ బలహీనతలు ఏమైనా సంఘానికి తక్కువ నష్టాన్ని కలుగచేస్తాయా? నాయకుడు తన ఇష్టానుసారమైన జీవితాన్ని పట్టించు కోకపోతే, తన నాయకత్వ ప్రయత్నాలు వర్థిల్లతాయా? కాపరికి మితిమీరిన గర్వం ఉన్నప్పటికీ దేవుడు అతని పరిచర్యను చూసి సంతోషిస్తాడా?

దేవునికి గర్వమంటే హేయమనీ, అహంకారులకు ఆయన వ్యతిరేకమనీ, దీనత్వాన్ని వెంబడించే వారికి ఆయన అధికమైన కృప చూపిస్తాడనీ లేఖనాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి (కీర్తన 138:6;; సామెతలు 3:34;; సామెతలు 6:16-17;; సామెతలు 16:5,18;; మత్తయి 23:12;; యాకోబు 4:6;; 1 పేతురు 5:5;). నాయకునిలో గర్వముంటే దేవుని ద్వేషమూ, శిక్షా మరింత తీవ్రమైన పరిమాణాల్లో ఉంటాయి. రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన - నీ రాజ్యము నీ యొద్దనుండి తొలగిపోయెను. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారియైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొను వరకు తమ యొద్దనుండి మనుషులు నిన్ను తరిమెదరు; నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుదువు (దానియేలు 4:31-32). అధికారమనే ఆకర్షణీయమైన ఎర ఆత్మీయ నాయకత్వ స్థానంలో ఉన్న అనేకమందిని బందీలుగా చేస్తోంది. సహజసిద్ధంగా నాయకత్వ లక్షణాలున్న వ్యక్తిలోని ఈ విధమైన పాపాల గురించి నాయకత్వ బృందాలు కానీ పెద్దల సమాజాలు కానీ ఏమీ పట్టించుకోకపోవడం దౌర్భాగ్యకరం. సమస్యను బహిరంగంగా చర్చించి, పరిష్కరించే వరకూ కలహాలతో, కోపోద్రిక్తుడై, తన్ను తాను సమర్థించుకొంటూ, స్వీయ ప్రచారం చేసుకొనే నాయకుణ్ణి సంఘ సిబ్బంది, సంఘ సభ్యులు ఎన్నో సంవత్సరాలు సహించే అవకాశముంది. తరచూ అలాంటి వ్యక్తుల్ని ఎదిరించినప్పుడు అవమానాన్ని తప్పించుకొనే ప్రయత్నంలో వారు ఎదురుదాడికి దిగుతారు. విమర్శించడాన్ని భక్తిహీనతతో కూడిన తిరుగుబాటు అని వాళ్ళు వాదిస్తారు. వాళ్ళ చుట్టూ ఉన్న వారు వెనక్కి తగ్గి పారిపోయినా దేవుడు మాత్రం ఈ నాయకుల్ని ఎదిరిస్తాడు ( యాకోబు 4:6;; 1 పేతురు 5:5;).

బైబిల్ గూర్చిన అసాధారణ జ్ఞానంతో నిండి.... తన జీవితంలో మాత్రం ప్రేమానురాగాలు లేని కాపరి గురించి అలెగ్జాండర్ ఫ్రాచ్ మాట్లాడుతుంటాడు. నాయకునిలో గర్వమనే కుటిలమైన పరాన్న జీవి నమ్మకమైన సంఘాల్లో తరచూ చీలికలు కలిగిస్తోంది. జరగాల్సిందేమిటి? ఇటువంటి ప్రమాదకరమైన రోగాన్నుంచి పరిచర్యను ఎలా సంరక్షించుకోవాలి? నాయకుడు తన హృదయాన్ని భద్రంగా కాపాడుకొని (సామెతలు 4:23;), తద్వారా శక్తివంతమైన సువార్త పరిచర్యను అణగతొక్కకుండా ఉండగలడా? లేఖన స్పష్టత ద్వారా అతడు తన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి, కాపాడుకోగలడని నేను నమ్ముతున్నాను. దేవుడు ఘనంగా వాడుకొనే నాయకులున్నారు, దేవుడెదిరించే నాయకులున్నారు.

 

అసూయ కలిగిన నాయకుడు

పరిచర్య తీవ్రమైన వివాదంలో ఉన్నప్పుడు నాయకులు తరచూ చిర్రుబుర్రులాడుతూ, తమ నిరసనను వ్యక్తం చేస్తూ, అందరినీ అనుమానిస్తూ ఉంటారు. ఇలా జరిగినపుడు కాపరి విసుగుకు అతి శీఘ్రంగా బలయ్యేది గొర్రెలే కదా! అయితే పరిచర్య గురించి దీర్ఘకాల దృష్టిని కలిగిన పౌలు వైఖరికి ఇది పూర్తి వ్యతిరేకమైనది. క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది (గలతీ 4:19). ఇతరుల అవసరాల్లో పౌలు చూపించిన కనికరమే అతడు అసహనానికి గురికాకుండా అడ్డుకుంది. కఠినంగా బోధించకుండా అతణ్ణి నిర్బంధించింది తన కనికరమే! తనకే మాత్రం ఇష్టంలేని కార్యాన్ని నెరవేర్చే బాధ్యతలో చిక్కుకొన్న వ్యక్తి బలవంతంగా పనిచేసినట్లు పౌలు పరిచర్య చేయకుండా అతణ్ణి తన కనికరమే అడ్డగించింది. కాపరిగా తమ విధిని నిర్వర్తిస్తున్నప్పుడు కాపరులు ఎదుర్కొనే ఒత్తిడి చాలా కుటిలమైనది. సేవలో ఉండే సంతోషాన్నీ, చూపాల్సిన సాహసాన్నీ ఎన్నడో కోల్పోయిన వ్యక్తులు కేవలం తమ కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలుగకూడదనే ఆలోచనతోనే సేవలో కొనసాగుతుంటారు. నేను వేరొక మార్గాన్ని ఎంచుకొంటే ఇతరులు నా గురించి ఏమనుకుంటారు? నేను బలహీనుడిగా, ఆత్మీయత లేనివాడిగా కనబడతానా? అని వారు చింతపడుతుంటారు. ప్రజల్ని సంతోషపెట్టాలనే మనస్సు మనం కాపరిగా చేయు పనిలో పరిశుద్దాత్మ ప్రభావాన్ని ఆర్పేస్తుంది. పరిచర్యలో చేయాల్సిన పనులు ఒక దాని తర్వాత మరొకటి నాయకునిపై ఒత్తిడి కలిగించినపుడు అతడు విసుగు చెందుతాడు. దేవుని ఉద్దేశాల్ని చూడలేక, గత్యంతరం లేక తన విధుల్ని నిర్వర్తిస్తాడు. నీ గురువో, బంధువో లేక స్నేహితుడో నీ నుంచి ఆశించే వాటిని నెరవేర్చడానికి పరిచర్యను నీవెప్పుడైనా భారంగా నెట్టుకొచ్చావా? పరిచర్యంటే మక్కువ కలిగిన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మూలంగానో, లేదా పరిచర్యలో తాము అభిమానించిన వారిని అనుసరించాలనో ఎంతోమంది బైబిల్ కళాశాలల్లో చేరడం నాకు తెలుసు. ఎంతో మందిని దేవుడు సేవకు పిలవకపోయినా స్థిరమైన జీతం పోతుందనే భయం వారిని పరిచర్యలోని విధులకు బందీలుగా చేస్తోంది. ఆత్మీయ నాయకుడు దేవుణ్ణి, తన్ను తానూ ఏకకాలంలో సేవించుకోలేడు.

గొర్రెల యెడల కనపరచాల్సిన స్వచ్ఛమైన శ్రద్ధను దోచుకొనే చెడు ఉద్దేశాల విషయమై జాగ్రత్త వహించమని 1 పేతురు 5:1-4; మనల్ని హెచ్చరిస్తుంది. మనల్ని మనం భద్రపరచుకోవాలనో, ఇతరుల్ని సంతోషపెట్టాలనో లేదా లోకాన్ని ఆకర్షించాలనే కోరిక నుంచో మన నాయకత్వం ఎన్నడూ ఉద్భవించకూడదు. 'బలిమిచేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా నాయకులు పై విచారణ చేయాలి. ప్రధాన కాపరి మాదిరిగానే దేవుని ప్రజల్ని లోతైన భారంతో సంరక్షించి సేవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పనిని మనం సంపూర్ణమైన నిజాయితీతో చేయాలి. దేవుని మందకున్న ఆత్మీయ అవసరతలు తీర్చాలనే కోరికతో ప్రయాసపడిన అపొస్తలుడైన పౌలు మాదిరిగా (2 కొరింథీ 11:28-29;; గలతీ 4:19;; కొలస్సీ 1:28; కొలస్సీ 2:1;), యేసుక్రీస్తు ఘనత, మహిమల నిమిత్తం భారంతో స్వచ్ఛందంగా శ్రమపడాలి, కానీ తప్పదనో లేదా ఏదొక ఒత్తిడి మూలంగానో కాదు. ఆత్మీయ నాయకత్వం గొప్ప డిమాండ్లతో కూడినది, మానసికంగా ఒత్తిడి కలిగిస్తుంది, నాయకులు దేవునికి లెక్క అప్పగించాల్సి ఉంటుంది. కనుక ఆ బాధ్యతను పిరికివారికి దేవుడు అనుగ్రహించడు. ఎవరి బలవంతం వల్లనో సేవచేసే వారు స్వచ్ఛమైన శ్రద్ధనూ, 2 సంతోషాన్నీ, ఓర్పునూ కనపరచలేరు. తప్పు చేస్తున్నామనే భావం వారిలో ఉంటుంది, కనుక వారు ఏ మాత్రం ప్రజల్ని ప్రభావితం చేయలేరు. ప్రమాద సూచన కనబడగానే మందను ప్రమాదంలో విడిచిపెట్టి పారిపోయే స్వభావమున్న పిరికివాడైన జీతగాని గురించి యేసు హెచ్చరించాడు (యోహాను 10: 12-13;). ఎవరికో భయపడినందువలనో, గొప్పవారి మద్దతు కోసమో, పొట్టకూటి కోసమో నీవు పరిచర్యలో ఉంటే నీవొక జీతగాడివే! ఎవరో బలవంతం చేయడం మూలంగానో భయపెట్టడం వల్లనో కాక తనకు తానుగా ఒక వ్యక్తి ఆత్మీయ నాయకత్వాన్ని ఎంచుకోవాలి..

ఏదొక బాధ్యతవల్లనో, ఒత్తిడి మూలంగానో నాయకత్వాన్ని చేపట్టే ధోరణిని అధిగమించాలంటే మానవ దుస్థితిని అర్థం చేసుకోవాలి. 'కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరినవారిగా తన చుట్టూ ఉన్న జనసమూహాన్ని యేసు చూసారు (మత్తయి 9:36;). ఇతరుల్ని మనం కూడా అలాగే చూడాలి. మనల్ని మనం అదే విధంగా ఎంచుకోవాలి. ఆ పరిస్థితులే మన ప్రభువు వారిపై కనికరపడేలా చేసాయి (36 వ.). ఇతరుల యెడల మన జాలి క్షీణిస్తే అదే రీతిలో దేవుని యెడల మన ప్రేమ కూడా కనుమరుగవుతుంది (1 యోహాను 3:17;). నీలోని సున్నితమైన కనికర గుణం తన అద్భుతమైన కాంతిని కోల్పోయిందా? అయితే నీవు పశ్చాత్తాపపడాలి. నీవు పరిచర్య చేసే వారి కోణంలో జీవించ నారంభించాలి. మనమందరం గొర్రెలమనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకని జీవితంలో నేటి శ్రమ నీకు నిన్నటి శ్రమయై యుండవచ్చు లేదా భవిష్యత్తులో కలగవచ్చు. దేవుని ప్రజల్లో క్రీస్తు స్వరూపాన్ని సంపూర్ణంగా చూడాలని ఎవరి హృదయమైతే పరితపిస్తుందో వారు ప్రధాన కాపరి యొక్క నిస్వార్థపూరిత సున్నితమైన పోలికను కలిగినవారై ఇతరుల నిమిత్తం తమ ప్రాణాన్నైనా పెట్టడానికి అన్నివేళలా సిద్ధపడి ఉంటారు.

 

దురాశాపరుడైన నాయకుడు అమ్మో,

ధనమా! మనకది బాగా అవసరం, దాన్ని ప్రతి దినం ఉపయోగిస్తాం, క్రొత్త క్రొత్త మార్గాల్లో దాన్ని దాచడానికి ప్రయత్నిస్తాం, దాన్ని దుర్వినియోగం చేయడం మూలంగా ఇబ్బందిపడతాం. ధనసంపదల ఉపయోగం గురించి, ప్రజలు దాన్ని దుర్వినియోగపరిచే విధానం గురించీ యేసు చాలా విస్తారంగా మాట్లాడాడు. ఈ సందర్భంలో జాన్ మెకాక్టర్ గారు చెప్పిన మాటలు ఉపయోగకరంగా ఉంటాయి.

క్రీస్తు చెప్పిన 38 ఉపమానాల్లో 16 ఉపమానాలు ప్రజలు ఇహలోక సంపదనెలా ఉపయోగించాలో తెలియచేస్తున్నాయి. పరలోకం, పాతాళం, నరకాల గురించి బోధించిన దానికంటే ఎక్కువగా ధనం గురించే ప్రభువు బోధించాడు. సువార్త గ్రంథాల్లో ప్రతీ 10 వచనాల్లో 1 వచనం ధనాన్ని గూర్చినదే. ధన, సంపదల గురించి 2 వేలకంటే ఎక్కువ వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఈ సంఖ్య విశ్వాసం, ప్రార్థనల గురించి ఉన్న వచనాల కంటే రెండింతలు ఎక్కువగా ఉన్నది. దేవుడు మన కనుగ్రహించిన దానితో మనమేం చేస్తామన్నది ఆయనకు చాలా ముఖ్యమైన విషయం . 5 ధనం మంచిది కాదు, చెడ్డదీ కాదు! అయితే దాన్ని ప్రేమించే వారికోసం పతనం, నాశనం ఎదురుచూస్తుంటాయి, (1 తిమోతి 6:9-10;)! అందుచేత ఆత్మీయ నాయకుల్లో ధనాపేక్షను అదుపు చేయడం అత్యవసరం. దుర్గాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతో సేవించాలనే తీవ్రమైన పదజాలాన్ని పేతురు ఉపయోగించాడు. (1 పేతురు 5:2;). అసూయ కలిగిన నాయకుడు 'బలవంతంగా సేవచేస్తే' దుర్గాభాపేక్షతో సేవించే నాయకుడు 'అతి నీచమైన అబద్ధంతో సేవిస్తున్నాడు'. అంటే బలవంతంగా చేసే సేవలో నిజాయితీ కొదువైతే, దురాశతో చేసే సేవలో యథార్థత కొరతగా ఉంటుంది. ఇతరుల్ని ఇరకాటంలో పెట్టి ధనాన్ని అర్జించాలనే ఆశలో ఆత్మీయ నాయకత్వం వేళ్లూనుకొని ఉంటే అప్పుడు అసూయ, ద్వేషం, పక్షపాతం అనే లక్షణాలే ఫలాలవుతాయి. అంకితభావం, నిజాయితీ గల మంచికాపరి ఇతరుల అవసరాల్ని పట్టించుకొని, వారి క్షేమం నిమిత్తం వనరులన్నింటినీ ఉపయోగిస్తాడు. ఉన్నతమైన ఆత్మీయ ప్రమాణాల్ని నెరవేర్చాలనే సంపూర్ణ ఆసక్తి ఎవరికి ఉంటుందో వాడే క్రీస్తును పోలిన నాయకుడని పేతురు వర్ణించాడు. 1 పేతురు 5:2;లో 'సిద్దమనస్సుతో' అను మాటకు 'సేవించడానికి సంపూర్ణాసక్తి' అనే అక్షరానుసారమైన అర్థముంది. కనుక క్రీస్తును పోలిన నాయకుడు అత్యంత అవసరమున్నచోట వ్యక్తిగతంగా త్యాగం చేయడానికి ఇష్టపడతాడు. దురాశకూ, స్వాతిశయానికీ మధ్య విడదీయరాని సంబంధముందని పౌలు వారించినప్పటికీ, సంఘంలోని నాయకులు తరచూ ధనమనే ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము (1 తిమోతి 6:17). ధనమూ, గర్వమూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. పెద్ద పరిచర్య, భారీ బడ్జెట్, లోకానుగుణమైన పద్ధతులు చాలా త్వరితంగా నాయకుడు తన్ను తాను గొప్పగా భావించేలా చేస్తాయి. అందువల్ల ఎవరైనా సత్యం విషయంలో అతన్ని సవాలు చేయాలంటే కష్టమే. ఒకప్పుడు ఎంతో దీనుడిగా సేవచేసి కొద్దికాలం తర్వాత గర్విష్టిగా మారి, తాను చేసే పరిచర్యను ఏ మాత్రం పట్టించుకోని పాస్టరు ఎన్ని సంఘాలు గమనించాయి? లోక పద్ధతులకు అలవడిన సమాజంలో ఇలాంటి పాపాన్ని గద్దించి వ్యతిరేకించడం సవాలుతో కూడిన పని. మన బలహీనతల్ని స్పష్టంగా చూడాలంటే మనల్ని మనం యథార్థంగా పరీక్షించుకోవాలి, దీనమనసు కలిగి ఉండాలి. నీవు నడిపించేది స్వచ్ఛమైన మనస్సుతోనా లేదా దురాశతోనా అనేది నీకెలా తెలుస్తుంది. ఈ క్రింది పది ప్రశ్నలు ఆ విషయాన్ని తెలుసుకోవడానికి సహాయపడతాయి.

1. నీ వ్యక్తిగత ధనం విషయంలో నీవు జాగ్రత్తపరుడైన గృహనిర్వాహకుడవేనా?

2. ప్రభువు పనికి నీవు నమ్మకంగా, సంతోషంగా, త్యాగపూరితంగా కానుకలు అర్పిస్తావా?

3. పరిచర్యలో నీకు తగినంత ధనం రాకపోవడం, తత్ఫలితంగా ఎదురయ్యే అసౌకర్యాలుబట్టి నీవు లోలోపల పరిచర్య గురించి సణుగుకొంటున్నావా?

4. సంఘంలో ఉండే ధనవంతులతో నీవు ఎక్కువగా స్నేహం చేస్తున్నావా?

5. అకస్మాత్తుగా ఎదురైన ఆర్థిక అవసరాల వలన దుఃఖం విసుగు నిన్ను సులభంగా కలవరపెడతాయా?

6. సంఘసభ్యులు తక్కువ సంఖ్యలో హాజరైనప్పుడూ, ఆర్థిక లావాదేవీల గురించి చర్చించేడపుడు ఆందోళనపడుతుంటావా?

7. త్వరగా ధనవంతులయ్యే పథకాలకు నీవు ఆకర్షితుడవవుతావా?

8. తాత్కాలికంగా సంఘాభివృద్ధిని కలుగచేసే పద్ధతులయెడల నీ పరిచర్య మక్కువ కనపరుస్తోందా?

9. నీ ఆస్తిపాస్తుల గురించి నీవెంత మాట్లాడతావు?

10. బహుమతులు ఇవ్వడం కంటే తీసుకోవడానికి ఆరాటపడతావా?

'అవును' అనేదే పై ప్రశ్నలకు నీ సమాధానమైతే, నీలో ఇహలోక సంపదను గూర్చిన ఆశ ఉన్నదని స్పష్టంగా చెప్పవచ్చు. దురాశ ఒక దుర్గుణమని కాక గొప్పవారి కున్న ఉన్నతమైన లక్షణమనేంతగా ధనాపేక్ష పాశ్చాత్య సంస్కృతిని మార్చేసింది. అయితే మనం సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, మన ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు (1తిమోతి 6:8). దురాశలేని ఆత్మీయ నాయకులు తమ విధుల్లో పూర్తి స్థాయి సామర్థ్యాన్ని కనబరుస్తారు, నిస్వార్థంగా ఉంటారు, ధనానికి అతీతంగా పనిచేస్తారు. వారు సృజనాత్మకత కలిగినవారై, శ్రేష్ఠమైన ఫలితాల కోసం శ్రమిస్తారు.

 

కయ్యానికి కాలుదువ్వే నాయకుడు

మృదుస్వభావిగా, సహనశీలిగా ఉండాలని దేవుడు ఒక వ్యక్తిని కాపరిగా పిలుస్తాడు. అలాంటి వ్యక్తిలో నైతిక భ్రష్టత్వం తర్వాత ఆ బాధ్యతకు పొసగనిదీ, జుగుప్సాకరమైనదీ ఇతరుల్ని అణచివేయాలనే అహంకారమే! సూటిగా చెప్పాలంటే, నమ్మదగిన ఆత్మీయ నాయకుడు దేవుడు అనుగ్రహించిన ఆధిక్యతలను పెత్తనం చెలాయించడానికి

ఇతరుల యెడల కనబరిచే అసహనం

కొంతమంది ఇతరుల్లోని బలహీనతల్ని చూసి అసలే మాత్రం తమ అసహనాన్ని అణచుకోలేరు. తన గౌరవానికీ, సౌకర్యానికి ఇబ్బంది కలిగించే చిన్న చిన్న పొరపాట్లను కూడా నాయకుడు సహించలేడు. నిన్ను నీవు ఆగ్రహం గల నాయకుడని అనుకోక పోవచ్చు కానీ ప్రజలూ పరిస్థితులూ నీకు సహకరించనప్పుడు నీవెలా స్పందిస్తావనేది నీవు ఆగ్రహమున్న నాయకుడవో కాదో తెలియజేస్తుంది. ఎంతో వ్యతిరేకత మధ్య తన సంఘం చీలిపోయినపుడు తానెలా సత్యం కోసం నిలబడ్డాడో చాలా ధైర్యంగా ఒక పాస్టర్ మాట్లాడడం కొన్నేళ్ల క్రితం విన్నాను. అతడు ఆ సంఘానికి ఎన్నో సంవత్సరాలు కాపరిగా పనిచేసాడు. అయితే క్రమేపీ తన బోధ గురించీ నాయకత్వం గురించీ తన సంఘం తరచూ సణుగుకొనేంతగా అతడు వారిపై మండిపడేవాడు. అతడి పరిచర్యను వారెందుకు అభినందించ లేకపోయారు? లేఖనం ఆజ్ఞాపించిన లోబడే మనస్సెక్కడ ఉంది? ఒక ఆదివారం ఆరాధన కార్యక్రమం జరుగుచుండగా బహిరంగంగానే తన విసుగుదల అతడు ప్రదర్శించాడు. ఆ కోపం సంఘాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది. చివరికి తనను కాపరి పదవినుంచి తొలగించింది. ఇతరుల్లోని సద్గుణాల గైర్హాజరి తన పరిచర్యలోని ఘోరమైన లోపాన్ని బట్టబయలు చేసింది. కనుక తన పరిచర్య ద్వారా వారి జీవితాన్ని మంచిగా ప్రభావితం చేసే అవకాశాన్ని అతడు కోల్పోయాడు. క్రీస్తును పోలిన కాపరత్వంలో సహనం, దయ కనబడాలనీ మరి ముఖ్యంగా అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు వాటిని కలిగియుండాలని అతడు గుర్తుంచుకొని ఉంటే, దేవుని వాక్యం అవమానానికి గురయ్యేది కాదు. ఒకరి బలహీనతల్ని మరొకరు భరించడం క్రైస్తవులందరూ నేర్చుకోవాలి. ఇతరుల్ని నడిపించడానికి దేవుడు పిలిచిన నాయకులమైన మనం మరింత సహనాన్నీ, కనికరాన్నీ కనబరచాలి. ఓర్పులేని ఆ కాపరి కొద్దికాలం తన పనిచర్యను కొనసాగించవచ్చేమో కాని ఆ వైఖరిని దేవుడు వ్యతిరేకిస్తాడు. కచ్చితంగా సహనంలేని నాయకుణ్ణి దీర్ఘశాంతాన్ని అలవర్చుకొనే వరకు శిక్షిస్తాడు.

అహంకారం - దుఃఖం

నాయకులు అగ్రహాన్ని ప్రదర్శించడం ద్వారా దేవుని సార్వభౌమ ఉద్దేశాల్ని ఎదిరించే వ్యక్తిగత ఆశయాలు తమకు ఉన్నాయన్నట్లు ప్రవర్తిస్తుంటారు. దేవుడు శ్రమల్ని వారి మేలు కోసం తన ఘనత కోసం ఉపయోగిస్తాడనే వాస్తవాన్ని కఠినాత్ము లైన నాయకులు వ్యతిరేకిస్తారు. 'నా సహోదరులారా, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. మీరు సంపూర్ణులును, అనునాంగులును, ఏ విషయములోనైనను కొదువలేని వారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి' అని యాకోబు ఆజ్ఞాపిస్తున్నాడు (యాకోబు 1:2-4). నిజానికి మన జీవితాల్ని ఏయే విషయాల్లో ఖచ్చితంగా మార్చుకోవాలో తెలియజేయడానికి ఇతరుల్లోని బలహీనతల్నీ, విపరీత ప్రవృత్తుల్నీ, తప్పుల్నీ దేవుడు ఉపయోగించుకుంటాడు. మన ఓర్పునూ, నమ్మకత్వాన్ని పరీక్షించి క్రీస్తు మనల్ని ప్రేమించినట్లే మనం కూడా త్యాగపూరితంగా ప్రేమించేలా చేయడానికి ఎంతోమంది పరిపక్వతలేని వ్యక్తుల్ని దేవుడు మన మార్గంలో ఉంచుతాడు. ఇతరుల్ని సహించలేని స్వభావం మనలో ప్రేమ సహనాలు కొదువగా ఉన్నాయనే వాస్తవాన్ని బయలుపరుస్తుంది. కనుక ఇతరుల పాపాల్ని ప్రక్కన పెట్టి నీ పాపాన్ని ప్రాముఖ్యంగా లేఖనం చూపిస్తుంది. (మత్తయి 7:1-4;).

“కోపమనేది ప్రేమకు విరుద్ధమైనది, ఎందుకంటే 'నేను చాలా ప్రాముఖ్యమైన దానిని. నాకు నచ్చనిదేదైనా నీవు చేస్తే, దానికి తగిన శాస్తి నీకు చేస్తానని కోపం చెబుతుందని"9 కోపం వెనకున్న మనసు గురించి ఒక ప్రసంగీకుడు తెలియజేసాడు. మనం ప్రజలపైనా, పరిస్థితులపైనా కోపాన్ని ప్రదర్శించినప్పుడు నిజానికి మనం వ్యతిరేకించేది దేవుడు ప్రేమతో మన కోసం సమకూర్చిన పరిస్థితుల్నే అను విషయం తెలుసుకున్నప్పుడు అది మరింత భయాన్ని కలిగిస్తుంది. మనల్ని శ్రమపరచిన హస్తాన్ని ముద్దు పెట్టుకోవడానికి బదులు, మనకు నచ్చినట్లు మన జీవితాన్ని జీవించనీయమనీ, ప్రజలతో మనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించనీయమనీ, మన సౌకర్యానికేమీ అడ్డురావొద్దనీ మనం దేవుని డిమాండ్ చేస్తున్నాం. 'మనం మనవారం కాము, విలువపెట్టి కొనబడినవారమని' ఒక ప్రక్కన ధైర్యంగా చెబుతూనే (1 కొరింథీ 6:19-20;), మరో ప్రక్క ప్రభువుకి మనపై ఎలాంటి అధికారమూ లేదన్నట్లు ప్రవర్తిస్తున్నాం. ఈ స్థాయిలోనే మనం మనలోని అహంకారాన్ని గుర్తించకపోతే అది చాలా తొందర్లోనే పరిచర్యలోని ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని హరించివేస్తుంది.

దీని విరుగుడు గురించి 3వ అధ్యాయంలో విస్తారంగా నేను చెప్పినప్పటికీ, మరొక సారి దాన్ని క్లుప్తంగా వివరిస్తాను. సిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రదర్శించిన శక్తివంతమైన సాత్వికం క్రింద అహంకారమంతా ఛిన్నాభిన్నమైపోవాలి (ఫిలిప్పీ 2:38). మనం విలువైన వారమనీ, యోగ్యులమని వాదించినప్పటికీ, క్రీస్తు మాత్రమే యోగ్యుడనీ, ఆయన అతి విలువైన ధననిధియని సిలువ నిరూపిస్తోంది. ఆయనే ముఖ్యమైనవారు, మనం కాదు! విమోచన అనే గొప్ప ప్రణాళికలో ఆయన మహోన్నతమైన ప్రేమను బట్టి, అద్భుతమైన కృపనుబట్టి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పాన్నిబట్టి (ఎఫెసీ 1:5;) మనం విలువను పొందుకున్నాం. ఆ సత్యాన్ని మన మనసులో ముద్రించుకొని ఇతరుల్ని నడిపిస్తే, అహంకారం ఎంత బలంగా మనల్ని సవాలు చేసినా (మన చేతిలో) అది సహజంగా మరణిస్తుంది. 'ఓ ప్రసంగీకుడా! సిలువ వైపుకు నీవు ప్రజల గమనాన్ని నిరంతరం మళ్లిస్తుంటే నీవు చెప్పేది వింటున్న మాకు నీకు స్తుతులు పాడే సమయ ముండదని 10 కాపరి నాయకత్వం గురించి జిమ్ షడ్జిక్స్ చెప్పాడు.

 

స్వనీతి - తీర్పు తీర్చే వైఖరి

కలహ ప్రియుడైన నాయకుణ్ణి పట్టి పీడించే మరొక పాపమే స్వనీతి, అనగా తన పాపాన్ని అల్పమైనదిగా చూస్తూ ఇతరుల పాపాన్ని పెద్దదిగా చూపించే నైజం. మత్తయి 7:1-4; లో “నీ కంటిలోని దూలాన్ని మొదట తొలగించుకో" అని వేషధారణ గురించి యేసు హెచ్చరించిన పాపమే ఇది. ఇదొక ప్రమాదకరమైన పాపం. ఈ ఘోరమైన నటనను దేవుడు చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాడు. 'మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చుబడదు. మీరు తీర్పు తీర్పు చెప్పుననే మీకును కొలువ బడునని' యేసు చెప్పారు (మత్తయి 7:12;). ఇతరుల్ని అల్పులుగా భావించి అహంకారంతో వారికి తీర్పు తీరిస్తే, మన బలహీనతల విషయంలో కూడా దేవుడు అదే విధమైన నిర్దయతో వ్యవహరిస్తాడు. జీవంగల దేవుడు నిర్దయతో మన యెడల స్పందిస్తే అదెంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి! కలహప్రియులు తాము ఇతరులతో ఎంత ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారో, అలాగే దేవుడు కూడా తన దయా వాత్సల్యాలను బట్టి కాకుండా తమ వలెనే ఖచ్చితంగా వ్యవహరించాలని చెబుతుంటారు. ఎంతటి కఠిన హృదయులకైనా అలాంటి మాటలు భయాన్ని కలిగించాలి. దేవుడు అత్యంత హేయంగా ఎంచే పాపాల్లో అహంకార దృష్టియే మొదటి స్థానంలో ఉందని గుర్తుచేయాలి (సామెతలు 6:16-19;).

స్వనీతీ, కోపంతో తొక్కే చిందులూ ఉప్పుకారాల్లాగ కలిసే పనిచేస్తాయని నేను గమనించాను. సొంత డప్పు కొట్టుకునే కొద్దిమంది నాయకులు నాకు తెలుసు. వారందరూ స్వార్థప్రియులు, త్వరగా కోపాన్ని ప్రదర్శిస్తారు. ప్రతీకారేచ్ఛ గలవారు, క్షమించలేనివారే. గర్వం విమర్శను ఎన్నడూ ఆహ్వానించదు. గద్దింపును ఎప్పుడూ సహించదు. తమ ముక్కోపాన్ని అందరి ముందు ఒప్పుకొని కొన్నిసార్లు క్షమాపణ చెబుతూ, తమ పాపాన్ని బట్టి ఎదురయ్యే తీవ్ర వ్యతిరేకతను వారు సద్దుమణిగేలా చేస్తారు కానీ, శ్రమపడి తమ స్వభావాన్ని పూర్తిగా మార్చుకోవడానికి ఇష్టపడరు. ఇది వారి ఆత్మీయ యథార్థతకూ, మనస్సాక్షికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. పాపాన్ని లోతుగా గ్రహించకుండా, మనస్ఫూర్తిగా ఒప్పుకోకుండా ఉంటే అది ప్రమాదాన్ని కలిగిస్తుందనీ, నిజాయితీతో ఒప్పుకొని దాని విడిచిపెట్టడానికి ఇష్టపడితే అది కనికరాన్ని పుట్టిస్తుందని సామెతలు 28:13; బోధిస్తోంది. విపరీతమైన కోపమనేది తగ్గిపోయేవరకు ఇతరులు సహించుకోవలసిన చిన్న బలహీనత కాదు. 'మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు. వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండునని సామెతలు 19:19 చెబుతోంది.

కోప సమస్యలు సులభంగా తొలగిపోవు. ఎందుకంటే కోపతాపాలు వెనుక అహం, వ్యక్తిగత హక్కులు, ప్రతీకారం అను నీచమైన విగ్రహాలు పొంచి ఉంటాయి. 'ప్రజలు నన్ను సంతోషపరిచేలా నాతో ప్రవర్తించాలి, నేను దానికి యోగ్యుడిని. నా గౌరవ మర్యాదలు అతి ముఖ్యమైనవి, నా అంచనాలు నెరవేరాలి, లేదంటే ఊరుకునే సమస్యే లేదని' కోపతాపాలు చెబుతాయి.

కొద్దిమంది నాయకులు యేసుక్రీస్తు ఘనత కోసం జీవించడానికి బదులు తమ కీర్తి ప్రతిష్ఠలకే నిరంతరం సాష్టాంగపడతారు. తమను ఇతరులు గుర్తించి సేవించాలనే ఉద్దేశంతో కొన్ని వ్యక్తిగత హక్కులనూ, ఆశయాలనూ వారు కలిగియుంటారు, ఇతరుల్ని తమ చుట్టూ ప్రదిక్షణలు చేయించుకోవాలనే నాయకుల స్వభావాన్ని మార్తపీస్ చాలా బాగా బట్టబయలు చేసారు. “ఈ విశ్వాన్ని మన దృక్పథంతో ఆలోచిస్తూ దేవుణ్ణి కూడా మన కోణం నుంచే అర్థం చేసుకుంటాం. మనల్ని మనం ముఖ్యంగా ఎంచుకొనే మన కోరికల్ని దేవుడు తీర్చి, మనం ప్రత్యేకమైన వారమనే భావం మనకు కలిగించాలని ఆయనపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.”11 నరమాత్రులు దేవుణ్ణి బలవంతం చేయడమనే తలంపు ఎంత హాస్యాస్పదమైనదో కదా! అయితే చాలామంది నాయకులకు తమ గురించి తమకున్న అభిప్రాయం అదే. ఎవరైనా తమ అహాన్ని గాయపరిచే పనిచేసినప్పుడు కలహ ప్రియుడైన నాయకుడు అగ్ని పర్వతం బద్దలైనప్పుడు పొర్లిపారే లావాలాంటి మాటలతో ప్రతీకారం తీర్చుకొని సంతృప్తి చెందుతాడు. అహాన్ని ఆరాధించే ఈ విగ్రహాలను తీవ్రమైన పశ్చాత్తాపంతో మనసును నూతనపరచడమనే సమ్మెటలతో తుత్తునీయులుగా చేయకపోతే, సంబంధాలు తెగిపోతాయి, నమ్మకత్వం నశిస్తుంది, పరిచర్య నిర్జీవమౌతుంది. కనుక క్రీస్తు గురించి ఎన్నటెన్నటికీ తృప్తి చెందని అపేక్షను కలిగియుండడమే మన ఏకైక నిరీక్షణ. ఈ వాస్తవం గురించి స్కాట్లాండ్ దేశానికి చెందిన పాస్టర్, వేదాంత పండితుడైన థామస్ ఛామర్స్ కంటే చక్కగా మరెవరూ వర్ణించలేదు.

ఒక క్రొత్త రుచి మనల్ని ఆకర్షించినపుడు మాత్రమే పాత రుచి బానిసత్వం నుంచి మనం విడుదలవుతాం. ఒక యవ్వనస్థుడు కామాతురతను విడిచిపెట్టవచ్చు. ఎందుకంటే దాని స్థానంలో ధనాపేక్ష అనే విగ్రహం చేరింది కాబట్టి. మానవ హృదయానికి సంతోషాన్నిచ్చే, సుందరంగా కనబడే విషయాల్లో తప్పా మరే విషయం లోనూ మన హృదయం మార్పును అంగీకరించదు. గతంలో హృదయానికి ఒక ప్రత్యేకాంశంపై ఉన్న ప్రేమను దూరం చేయాలంటే దానికి మించిన శక్తిగల నూతన అంశాన్ని హృదయానికి పరిచయం చేయడమొక్కటే మార్గం.

ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరచాలనే ఆత్మానుసారమైన, తీరని దాహమే విశ్వాసుల విషయంలో శక్తిగల నూతన ఆసకై ఉండాలి. ఇతరుల్ని తరచుగా చిన్న చూపు చూసే అలవాటు నీలో ఉంటే, నీ రక్షకుని ఘనతకై వారిని నడిపించాలనే నూతనాసక్తిని నీలో కలిగించమని దేవుని దయకోసం చాలా గొప్ప వేగంగా ఆయన దగ్గరకు పారిపో!

 

అహంకారం, అభద్రతా భావం

కృపచేత రక్షణ పొందిన వారికి తగినట్లుగా మనకు మనం ఎంచుకొనతగిన దానికంటే ఎక్కువగా ఎన్నడూ ఎంచుకొనకూడదని అపొస్తలుడైన పౌలు మనల్ని రోమా 12:3 ;లో హెచ్చరిస్తున్నాడు. మనకున్న వరాల్ని బట్టి ప్రభావాన్ని బట్టి మనం మత్తులమైతే, మన అభివృద్ధికి ప్రజలొక మార్గంగా వారిని చూస్తాం. ప్రజల గుర్తింపు, ధనం, అధికారం, కామాతురత, వ్యక్తిగత ప్రాముఖ్యత మొదలగు ఆకర్షణలకు నేటి నాయకులు సులభంగా లొంగిపోతున్నారు. 3యోహాను 9-10; వచనాల్లో అహంకారం అనే లక్షణాన్నీ, గుర్తింపు కోసం ప్రాకులాడే లక్షణాన్నీ దియొర్రె ఫే అను వ్యక్తి ద్వారా యోహాను చాలా స్పష్టంగా చిత్రీకరించాడు. దేవుని ప్రజల్ని తన ఘనతకు వాడుకున్న పరిచర్యకు దిమొర్రె ఫే పరిచర్య మాదిరిగా ఉంది. అధికారం, మానవ ప్రశంసలనే ఎరలు అతన్ని మోహించగా గర్వమూ, అహంకారమూ అనే మోసకరమైన ఊబిలో అతడు తన హృదయం మునిగిపోయేలా చేసుకున్నాడు.

నేటి పదజాలాన్ని ఉపయోగించి దియొ ఫేను వర్ణిస్తే అతడొక సీనియర్ పాస్టర్. తాను పరిచర్యలో చేసిన కార్యాల్ని బట్టి 'ప్రధానత్వాన్ని' కోరుకొన్న వ్యక్తిగా లేఖనం అతణ్ణి వర్ణిస్తోంది. (3 యోహాను 9వ). ఘనత పొందాలనే విపరీతమైన కోరిక అతనికుంది. ఇతరుల ప్రశంసల్ని బట్టి అతని హృదయం రహస్యంగా ఆనందించింది. ఆ హృదయమే తన సామర్థ్యాల్ని చాలా ఉన్నతమైనవనే భావాన్ని అతనిలో కలిగించింది. ఇతరుల అభినందనలతో ఒక నాయకుడు తన్ను తాను సంతృప్తి పరుచుకొంటే పరిచర్యను ధ్వంసం చేసే పలు రకాలైన దుష్ప్రవర్తనలకు అతడు తన హృదయంలో స్థలాన్ని సిద్ధం చేస్తాడు. ఉదాహరణకు ఘనత పొందాలనే అపేక్ష సంఘాధికారానికి లోబడనొల్లని హృదయాన్ని దియొ ఫెలో కలిగించింది. (9వ.). అంతేకాక 'యోహానును అన్యాయంగా దుర్భాషలాడుతూ అతడు వంచకుడై పోయాడు (10వ.). అహంతో కూడిన నాయకత్వం అన్నివేళలా ఇతరుల యెడల అసహనానికి గురై, వేషధారణతో జీవిస్తుంది. అలాంటి పాపపు అలవాట్లు మన హృదయాల్ని లోబరుచుకుంటే, ప్రజల గమనమంతటిని మనవైపు మళ్లించడానికి ప్రయత్నిస్తాం. ఇతరుల తలాంతుల్నీ, వరాల్నీ, సలహాల్ని తక్కువ చేసి కొట్టిపారేస్తాం. మనం కూడా తన పరిచర్య సరిహద్దుల్లోనికి ఎవ్వరినీ అనుమతించ సహించలేని దియొ ఫేలా ఉంటాం.

మనుషులు మనల్ని అభినందించాలనే ఆకలి దేవుడు మనకనుగ్రహించిన వరాల్ని బట్టి కృతజ్ఞత లేని మనస్సునూ, దేవుని చిత్తానికి బయట ప్రాముఖ్యత కోసం వెంపర్లాడే మన వైఖరినీ బయలుపరుస్తోంది. “మన స్వీయ ఘనతను కోరుకోకూడదని” లేఖనాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి (సామెతలు 25:27;; సామెతలు 28:6-7;). క్రీస్తు పని నిమిత్తం సేవ చేయుటలోనే మన ప్రాముఖ్యత ఉందని గుర్తుంచుకోవాలి. తద్వారా మనుషుల ప్రశంసలు పొందాలనే ప్రలోభాలకు దూరంగా ఉండవచ్చు. అంతేకాదు దేవుని నుంచే మనం కృపావరాలు పొందామనీ, దేవుని నానా విధమైన కృపకు మనం కేవలం గృహ నిర్వాహకులమనీ 1 పేతురు 4:10; మనకు చెబుతుంది. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేం! నీవు మనుషుల స్తుతిని అతిగా ఆశిస్తున్నావో లేదో నీకెలా తెలుస్తుంది? ఈ క్రింది ప్రశ్నలు ఆ విషయాన్ని తెలుసుకోవడానికి నీకు సహాయపడవచ్చు. ఇతరుల ప్రశంసను అడ్డగిస్తావా? గమనాన్ని నీ వైపు మళ్ళించడానికి ప్రయత్నిస్తావా? మంచి తలాంతులున్న స్నేహితుల సమక్షంలో నీవు అసౌకర్యంగా ఉంటావా? నీ గొప్పలు నీవే చెప్పుకుంటావని ఇతరులు నీ గురించి చెబుతారా? ఇతరుల్ని పరిచర్యలో దేవుడు వాడుకునే తీరును చూసి ఆనందించడానికి నీవు ఇబ్బంది పడుతుంటే, ముఖస్తుతి సాగుచేసే సారవంతమైన నేలను నీ హృదయంలో సిద్ధం చేసినట్లే! దియొ ఫేలో నాటుకొనియున్న అధికార కాంక్ష మరింత నాశనకర మైనది. ఈ అధికార దాహం మనం లెక్క అప్పగించాల్సిన అధికారులకు దూరమై పోయేలా చేస్తుంది. యోహానుకున్న అపొస్తలత్వపు అధికారాన్ని దియొ ఫే వ్యతిరేకించాడు. ఎందుకంటే అతడు ఇతరుల్ని తన అధికార బలాల విస్తరణకు అడ్డుబండలుగా చూసాడు. అతడు యోహాను తదితరుల గురించి చెడ్డగా మాట్లాడడంతో సంతృప్తి చెందక, ఇతర సంఘాల సువార్త పరిచర్యను అడ్డగించడానికి ప్రయత్నించాడని 3 యోహాను 10;వ. చెబుతోంది. ఆ కోపంతోనే సువార్త బృందం అవసరంలో ఉన్నప్పుడు వారికి పరిచర్య చేయడానికి తిరస్కరించాడు. (అతడు సహోదరులను ....చేర్చుకొనడు) అందర్నీ అదుపు చేయాలనే కోరికుంటే, మన స్వీయ ప్రాముఖ్యత కోసం చేసే యుద్ధంలో పట్టును కోల్పోతామనే భయంతో ఇతరుల్ని అనుమానిస్తాం. “మనకు అప్పగించబడిన వారిపై ప్రభువులైనట్టు ఉండి.... ” మనం వారిని ఎన్నడూ నడిపించకూడదని లేఖనం మనకు బోధిస్తుంది. (1 పేతురు 5:3).

మనం ఎవరికైతే లెక్క అప్పగించాలో ఆ ప్రధాన కాపరినుంచి మనం పొందుకున్న బాధ్యతే గొర్రెలు. క్రీస్తుకు లెక్క అప్పగించాల్సిన ఆలోచనే నాయకునికి వణకు పుట్టించకపోతే, చిన్న చిన్న విషయాలకు భయపడుతూ ఇతరుల్ని అణిచివేయడానికి ఎత్తుగడలు వేస్తుంటాడు. తనకు వ్యతిరేకంగా నిలబడిన వారందరూ దియొ ఫే ద్వేషానికి గురయ్యేవారు. తన ఆజ్ఞలకు వ్యతిరేకంగా పనిచేసే వారితో సహవాసం చేయొద్దని అతడు తన సంఘాన్ని పురికొల్పాడు. ఇది నాయకత్వం కాదు నియంతృత్వం. అధికారం అనే ఆకలి వలలో నీవు చిక్కుకున్నావో, లేదో నీకెలా తెలుస్తుంది? నీ జీవితాన్ని పరీక్షించుకుని ఈ క్రింది ఆధారాల కోసం వెదుకు.

ఇతరుల్ని నీ విజయానికి ముప్పుగా చూడడం: తలాంతులు గల స్నేహితుల సమక్షంలో నీవు సౌకర్యంగా ఉండగలవా? కొద్దిమంది నాయకులు ఇతరుల్ని విజయం పొందనీయకుండా చేయడానికి శయశక్తులా ప్రయత్నిస్తారు. తమ ప్రభావాన్ని తగ్గించేంత గొప్ప ప్రభావాన్ని దేవుడు ఇతర నాయకులకు అనుగ్రహిస్తాడేమోననే భయం వారిలో ఉంటుంది. తప్పును చూపినపుడు నేర్చుకోలేని గుణం: ఇతరులపై అధికారాన్ని చెలాయించాలనే ఆకలి నీకున్నప్పుడు, ఎలాంటి విమర్శనైనా నిజానిజాల్ని పరీక్షించకుండానే పూర్తిగా కొట్టిపారేస్తావు. నేర్చుకోవడానికి ఇష్టపడని నాయకులు దీన పరిచర్య ద్వారా కాక ఇతరుల్ని భయపెట్టి తమ ప్రభావాన్ని స్థాపించుకుంటారు. విఫలమైన నిర్ణయాలకై నిందను ఇతరులపై మోపే స్వభావం: ఇతరుల్ని అదుపుచేసే నాయకులు తమ తప్పులెన్నడూ ఒప్పుకోరు. కనుక విజయం కలిగినప్పుడు సంతోషంగా ఆ ఘనతను తనకు ఆపాదించుకుంటారు. పరాజయం కలిగితే ఇతరుల్ని వాళ్ళు నిందిస్తుంటారు. నాయకుడు ప్రజల్నుంచి పొందుకొనేదే గౌరవంగా పరిగణిస్తారు. కనుక అపజయాన్ని బలహీనతగా భావించి దాన్ని నాయకత్వంలో ఉన్న వాళ్ళకు ఆపాదించకూడదన్నట్లు ఇలాంటి నాయకులు ప్రవర్తిస్తారు. ఇతరులకు అవసరమయ్యే ముఖ్యమైన వనరుల్నీ, సమాచారాన్ని దాచేసే నైజం: ఇతరుల్ని అదుపులో ఉంచుకోవడానికి ముఖ్యమైన మార్గమే సమాచారమని అధికార దాహం గల వారికి తెలుసు. కాబట్టి ఈ ముఖ్య వనరుల్ని ఇతరుల కందించడానికి వాళ్ళు తీసుకొనే జాగ్రత్తలు చాలా వెర్రిగా ఉంటాయి. ఇతరులకు అత్యవసరమైన వాటిని రహస్యంగా నీ దగ్గరే దాచుకుంటావా? నీకు తెలిసినదేమిటి? తెలియనిదేమిటి? అనే విషయాల్లో నిర్మొహమాటంగా, నిజాయితీగా తెలిపి ఇతరుల ప్రయత్నం మూలంగా, కృషి మూలంగా గొప్ప ప్రయోజనాలు చేకూరేలా చేస్తావా? ఇతరులకు బాధ్యతలు అప్పగించాలనే మనసు లేకపోవడం: ఇతరులు విఫలమైనప్పుడు మన గౌరవ ఘనతలు దెబ్బతింటాయనే భయం, మనకంటే ఇతరుల్ని ఎక్కువ పొగుడుతారనే అసూయలు అధికారాన్ని కోరుకోవడం మూలంగా కలుగుతాయి.

అహంకారంతో, భయంతో చేసే నాయకత్వానికి ఇవే సూచనలు. నీలో ఉన్న ఆ లక్షణాలు కఠినంగా గుర్తించి, వాటికి మూలాధారమైన కోరికల్ని వివేచించే కృప కోసం దేవుని వేడుకొని, వాటికి వ్యతిరేకంగా దేవుని నోటినుంచి వచ్చే ప్రతి సత్య వాక్యంతో నీ మనస్సునూ, హృదయాన్ని నింపేసుకో!

పరలోకమందున్న తండ్రీ, నా పరిచర్య ప్రయత్నాల్ని నీవెదిరిస్తావనే ఆలోచన నన్ను భయపెడుతుంది. ప్రధాన కాపరి కోణం నుంచి నా బాధ్యతల్ని సరైన రీతిలో నేను చూడాల్సినవసరం ఉంది. గర్వం, లోకతత్వం, స్వార్థం, కలహాలాడే స్వభావం మొదలగు దుర్గుణాల్ని చంపే కష్టమైన పని చేయడానికి నన్ను బలపరచండి. నేనెన్నడూ అసూయతో నడిపించకుండా సహాయం చేయండి. ఆకర్షణీయమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని ఆశించే నా హృదయాన్ని నిరంతరం అదుపులో ఉంచుకోవడానికి సహాయం చేయండి. నేను కఠినంగా ఇతరుల్ని బెదిరించి నడిపించడానికి ప్రయత్నించినపుడు, నా వివేచనను తట్టిలేపే ఆలోచనలు క్రీస్తు విలువనుంచి నేను వేగంగా పొందుకొనేట్లు నన్ను సరి చేయండి. నీ చేతిలో నేనొక సాధనమనీ, నీవు మాత్రమే నన్ను ఉపయోగకరంగా చేయగలవని నేను ఒప్పుకుంటున్నాను, ఆమెన్!

 

7. వరాలను తృణీకరించుట

కొరింథీ సంఘంలో ఎన్నో తీవ్రమైన సమస్యలున్నాయి. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికను మన సంఘాలు పొందుకుంటే లైట్లు ఆర్పేసి, తలుపులు మూసేసి, దేవుని దయకోసం ప్రార్థిస్తాం. సంఘాల్ని సులభంగా నాశనం చేయగల పాపాలతో నిండిపోయిన పరిచర్య గురించి ఊహించడమే చాలా కష్టం. కొరింథీ సంఘ సభ్యులు అసూయ ద్వేషాలతో నిండిపోయారు. నాయకులపై ప్రత్యేక అభిమానంతో జట్లుగా చీలిపోయారు. మారుటి తల్లితోనే వ్యభిచరించిన వాడొకడు వాళ్ళ మధ్యే ఉన్నాడు. ఒకరి నొకరు కోర్టు కీడుస్తున్నారు. అబద్ధ బోధ ప్రారంభమైంది. వివాహ సంబంధాలు మలినమైపోయాయి, కృపావరాల్ని దారుణంగా దుర్వినియోగం చేసారు. వాళ్ళ ప్రేమ విందులు వాళ్ళ అతినీచమైన వేషధారణనూ, భోగాశక్తినీ, పేదవారిని చిన్న చూపు చూసే మనస్సునూ బయలుపరిచాయి. ఇన్ని సమస్యలున్నప్పటికీ పౌలు తన పత్రికను రాసేటప్పటికీ వాళ్ళంతా ఒకే సంఘంలో ఉన్నారు. ఇదెంత ఆశ్చర్యకరమో కదా!

లోతైన ప్రేమ లేకుండా, ఆత్మాధీనంలో ఉండుట వలన ఒకరి యెడల మరొకరు చూపించే ప్రేమ లేకుండా ప్రపంచంలో ఉన్న వరాల్లో తలాంతుల్లో ఏ ఒక్కటి కూడా విజయవంతమైన సువార్త పరిచర్యను జరిగించలేవు. ఈ వాస్తవాన్ని గ్రహించడం నానా విధాలైన, శ్రేష్ఠమైన వరాల్ని కలిగిన కొరింథీ సంఘానికి కూడా కష్టమైంది. 1 కొరింథీ 13:1-3; వచనాలపై మరింత స్పష్టంగా వ్యాఖ్యానించడం అసాధ్యమైనప్పటికీ, అలెగ్జాండర్ స్క్రాచ్ రాసిన ఖచ్చితమైన వివరణ సరైనది.

లక్షలాదిమంది ప్రజల్ని నా వాక్చాతుర్యం చేత కదిలించగల అత్యంత నైపుణ్యం గల ప్రసంగీకుష్ఠినా ప్రేమలేని వాడనైతే, దేవుని ముందూ ప్రజల ముందూ కేవలం నేనొక విసిగించే వదరుబోతుని మాత్రమే. ప్రతి ఒక్కరినీ అయస్కాంతంలా ఆకర్షించే అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తినైనా, క్రీస్తులా ప్రేమించకపోతే నేను కేవలం మోసగాణీ, వ్యర్ధుణ్ణి.

క్రీస్తు సంఘమెన్నడూ విననట్టి అత్యున్నత ఆశయాలు గల గొప్ప నాయకుడినైనా ప్రేమలేని వాడనైతే, నేను తప్పుదారిలో పయనించి నాశనమౌతాను. వేదాంతం గురించీ, సంఘాభివృద్ధి గురించి రాయడంలో నేనొక ప్రముఖ రచయితనైనా, ప్రేమ లేకపోతే నేనొక అజ్ఞానిని. తప్పక నేను అపజయం పాలవుతాను. నేను మెలకువగా ఉన్న సమయాన్నంతా భవిష్యత్తు కోసం నాయకుల్ని సిద్ధం చేయడం కోసం త్యాగం చేసినా, ప్రేమ లేకపోతే నేనొక దుర్నీతిపరుత్తైన నాయకుడినీ, అతి చెడ్డ మాదిరినే గాని మరొకథేమీ కాదు.

ఇతరుల ప్రయోజనార్థం కాక తమను తామే హెచ్చించుకోవడానికి కొరింథీయులు తమ కృపావరాల్ని నిరంతరం ఉపయోగించేవారు. పరిశుద్ధుల భక్తి జీవితాల్ని కట్టడానికి పరిశుద్ధాత్ముడు సంఘానికి కృపావరాల్ని అనుగ్రహిస్తాడు. అయితే ఈ వరాలే అతి నీచమైన అసూయకూ, స్వీయ ఘనలకూ ఆ సంఘంలో ప్రధాన కారణాలయ్యాయి.

 

బానిసలు - రాజులు

సామెతలు 30వ అధ్యాయం లేఖనమంతటిలో నా కిష్టమైన భాగాల్లో ఒకటి. జ్ఞానంతో పూర్తిగా నిండిన అధ్యాయమది. 13-19 సంవత్సరాల వయసుండే యౌవనస్థులకు 2వ వచనం బాగా వర్తిస్తుందని నా చిన్న కుమారుడు తరచూ జోక్ చేస్తుండేవాడు. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు (సామెతలు 30:2). తానెన్నడూ దేవుని అవమానించకుండ ఉండేందుకు తన జీవితానికి చాలినంత మాత్రమే కావాలని ఆగూరు 8,9 వచనాల్లో అద్భుతంగా దేవుని ప్రార్థించాడు. స్వార్థపూరిత హృదయాన్ని 'జలగ' అనే పద చిత్రంతో వర్ణించిన తీరును చూసి నవ్వుకోని వ్యక్తి ఎవరుంటారు? ఈ అధ్యాయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం తిరిగి చదువుచుండగా 21-23 వచనాలు చాలా స్పష్టంగా అర్థమయ్యాయి. భూమిని వణకించునవి మూడు కలవు.

అది మోయలేనివి నాలుగు కలవు అవేవనగా, రాజరిమునకు వచ్చిన దాసుడు కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు కంటకురాలై యుండి పెండ్లియైన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి పై వచనాల్లో ఉన్న ఉదాహరణల జాబితాలో మొదటి సాదృశ్యం నా దృష్టి నాకర్షించింది. బానిసకు అకస్మాత్తుగా అత్యున్నత అధికారాన్నిస్తే, విధ్వంసకరమైన రీతిలో దాన్ని అతడు తప్పనిసరిగా దుర్వినియోగం చేస్తాడు. ఎందుకంటే దరిద్రత ననుభవించిన బానిస రాజ దర్బారులో జీవితాన్ని, రాజుకున్న బాధ్యతల భారాన్నీ మోయలేడు. తక్కువ ఉన్నవాడు ఎక్కువ ఉన్న వాణ్ణి చూసి అసూయపడతాడు. వీధిలో జీవించే వ్యక్తికి సింహాసనంపై కూర్చొనే అవకాశమిస్తే ఆ అధికారాన్ని బాధ్యతా రాహిత్యంతో అతడు దుర్వినియోగం చేస్తాడు.

పై వాక్య సాదృశ్యం కొరింథు సంఘంలో చోటుచేసుకున్న గందరగోళాన్ని స్పష్టంగా వర్ణిస్తోంది. బహిరంగంగా ప్రాముఖ్యత లేని వరాల్ని పొందిన వాళ్ళు అద్భుత వరాలున్న వారిని చూసి అసూయపడ్డారు. పరిశుద్ధాత్మ ఆ అద్భుత వరాల్ని తమకు అనుగ్రహించలేదనే వాస్తవాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. తెరవెనుక శ్రమపడే వారిని అద్భుత వరాలు పొందినవారు బహిరంగంగానే తూలనాడేవారు. సంఘంలో పదవీ, అధికారాల కోసం పరితపించే కొరింథీయులు రాజ్యాధికారం పొంది దాన్ని తమ సుఖభోగాల నిమిత్తం దుర్వినియోగం చేసిన పరిపక్వతలేని బానిసల్లానే ప్రవర్తించారు. మితిమీరిన అహంకారం మూలంగా పరిచర్య పునాదులు వణికాయి, ఫలితాలు విధ్వంసకరంగా మారాయి.పరిశుద్ధాత్మ అనుగ్రహించిన సామర్ధ్యం లేకుండానే దేవుని పక్షంగా మాట్లాడుచున్నామని సంఘ ఆరాధన కార్యక్రమంలో కొద్దిమంది అంతరాయం కలిగించేవారు (1 కొరింథీ 12:3;; 1 కొరింథీ 14:37-38;). మరి కొంతమంది తమ వరాల్ని సంఘ క్షేమాభివృద్ధి కోసం కాక తమను తాము హెచ్చించుకోవడానికి ఉపయోగించేవారు (1 కొరింథీ 14:12-19,26;). కొరింథీ సంఘంలోనే బోధించుటలో తమకున్న జ్ఞానానికీ సామర్థ్యానికి గుర్తింపు కోరుచూ పురుషుల నాయకత్వ పాత్రను చేజిక్కించుకోవడానికి స్త్రీలు ప్రయత్నించేవారు (1 కొరింథీ 14:34-35;). బహిరంగంగా ప్రదర్శించడానికి వీలులేని పరిశుద్ధాత్మ వరాల్ని ప్రాముఖ్యత లేనివిగా వాళ్ళు పరిగణించారు (1 కొరింథీ 12:12-16;). వారు ప్రేమనూ, ఇతరుల క్షేమాభివృద్ధి అనే రెండు ముఖ్య నియమాలనూ విస్మరించారని స్టాచ్ తెలియచేసాడు. నీకున్న ఆత్మ వరమేదైనా ప్రేమ, సాత్వికం లేకుండా సంఘానికి క్షేమాన్ని కలిగించలేవు.

నేనొక భారీ సంఘంలో సిబ్బందిగా పనిచేసాను. ఆ సంఘానికి సంబంధించి ఒక సెమినరీ ఉంది. ఆ సెమినరీలో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల్ని అభివృద్ధి చేయడానికి నేను క్రమంగా వాళ్ళను కలిసేవాడిని. వరాల పట్ల ఆత్రుత కనపరచకుండా చాలా భద్రంగా తమ హృదయాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేను చాలా తరచుగా వాళ్ళకు చెప్పేవాడిని. సంఘంలో నాకున్న స్థానాన్ని బట్టి విద్యార్థులు నా దగ్గరకొచ్చి నాకు సహాయం చేయడానికి అవకాశాల నివ్వమనీ, తమను వ్యక్తిగతంగా తీర్చిదిద్దమనీ తరచూ నన్నడిగేవారు. అందుకు వాళ్ళకు నేనెంతో కృతజ్ఞుడిని. అయితే కొద్దిమంది విద్యార్థులకు నిజంగా కావాల్సింది వాళ్ళకు అధికారాన్నీ, ప్రత్యేక హోదానూ ఇచ్చే స్థానం. అవసరమున్న చోట పరిచర్య చేసే ఆశ తమకుందని వాళ్ళు చెప్పేవారు కానీ, రహస్యంగా ఇతరులు తమను వరాలున్న వారిగా, తెలివైన వారిగా గుర్తించాలని తహతహలాడే వారు. వాళ్ళకు నిజంగా అవసరమైందేమిటంటే పరీక్ష. వాళ్ళ హృదయాలు సరిగా ఉన్నాయో లేదో పరీక్షించడానికి ఏ విధమైన గుర్తింపుకూ అవకాశం లేని బాధ్యతలు అప్పగించేవాడిని. నా వైఖరి ఒక యౌవ్వనస్థుడికి విసుగు కలిగించింది. అలా ఆ యౌవనస్థుడు సంఘంలో ఉండే ప్రతీ సిబ్బంది దగ్గరికి వెళ్లి ఘనతకు నోచుకోని తన తలాంతుల నెవరైనా గుర్తిస్తారేమోనని పరీక్షించాడు.

జ్ఞానియైన చార్లెస్ స్పర్జన్ తన పాస్టర్స్ కాలేజ్ లో జరిగిన హాస్య సన్నివేశాన్ని వివరించాడు.

ఒక యౌవ్వనస్థుడు నన్నొకసారి కలిసాడు. అతని పరిచయం నా మనసుపై చెరగని ముద్రవేసింది. నన్ను వెంటనే కలవాలని ఒక ఆదివారపు ఉదయం నా ఆఫీస్ కి వర్తమానం పంపించాడు. నేను కూడా వెంటనే అతన్ని కలిసాను. నా ముందుకి రాగానే, “సార్ నేను మీ కాలేజ్ లో చేరాలనుకుంటున్నాను. నేను వెంటనే చేరాలి,” అన్నాడు. ప్రస్తుతానికి మీకు అవకాశం లేదు కానీ, మీ గురించి ఆలోచిస్తానని నేను చెప్పాను. "సార్, నాలాంటి విద్యార్ధిని మీరెప్పుడు చూసి ఉండక పోవచ్చు నేనొక అద్భుతమైన వ్యక్తినని" అతడు చెప్పాడు. - ఆ విద్యార్థి తనకున్న తలాంతుల గురించి ఎంత అద్భుతంగా మాట్లాడతాడో విందామని ఆ తర్వాత రోజైన సోమవారం కూడా మరలా అతన్ని రమ్మని చెప్పి స్పర్జన్ ఉచ్చును సిద్ధం చేసాడు. దీనత్వం అనే పాఠాన్ని ఆ విద్యార్థికి నేర్పించడంలో స్పర్జన్ ఒక మంచి పాత్ర పోషించడానికి సంతోషించాడు. ఆ సన్నివేశాన్ని స్పర్జన్ ఇలా వివరించాడు.

తనకిచ్చిన ప్రశ్నలకు అసాధారణ రీతిలో సమాధానాలు రాసి ఆ విద్యార్థి సోమవారం వచ్చాడు. తాను చదివిన అనేక పుస్తకాల జాబితాను స్పర్జన్ కిచ్చి, అతడు, “ప్రాచీన, అధునాతన గ్రంథాలనెన్నో నేను చదివాను. ఈ జాబితాలో నేను చదివిన గ్రంథాల్లో కొన్ని మాత్రమే ఉన్నాయి. అన్ని విభాగాలకు సంబంధించిన పుస్తకాలనెన్నో నేను చదివానని” చెప్పాడు. అతని ప్రసంగంలో సుదీర్ఘ సమయం సాక్షాలనెన్నో ప్రస్తావించగలడు.

కానీ వాటిని చెప్పాల్సిన అవసరం ఉందోలేదో అస్సలు అతనికి తెలియదని అతని నడిగితే అర్థమయ్యింది. నేనేమి చెబుతానో అని ఆసక్తితో అతడు ఎదురుచూసాడు. మా కాలేజ్ లో నిన్ను చేర్చుకోలేమని నేను అతనికి చెప్పగానే, “ఎందుకు సార్?" అని ఆశ్చర్య పోతూ అడిగాడు. “నీ జ్ఞానం అమోఘం. మా కాలేజ్ లో చేర్చుకొని నిన్ను అవమానించలేను. ఎందుకంటే మా ప్రెసిడెంట్, బోధకులు, విద్యార్థులు అందరూ సామాన్యులే, మా దగ్గరుంటే నీవు చాలా తగ్గించుకోవాలని” నేను చెప్పాను.

స్పర్జన్ విసిరిన ఛలోక్తులంటే నాకు చాలా యిష్టం. “మీరు ఏ వాక్యభాగాన్నైనా, ఏ అంశాన్నైనా ఇవ్వండి. శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసే విధంగా ప్రసంగించగలనని చెప్పిన ఆ విద్యార్థికి, “నీకు వందనాలు, నీవు చెప్పేది విని నేను ఇబ్బందిపడదలచు కోలేనని"* స్పర్జన్ చెప్పాడు.

“మీరు ఇబ్బంది పడడంకాదు సార్, నా ప్రసంగం వలన మీరు అత్యంత ఆనందాన్ని అనుభవిస్తారని, అతడు చెప్పాడు. ఆ విద్యార్థికున్న అహంకారం హాస్యాస్పదమైంది. స్పర్జన్ ఆ కథనాన్ని ఈ మాటలతో ముగించాడు. “ఆ గౌరవనీయుడైన విద్యార్థి ఆ సమయంలో నాకు తెలియదు. ఎలాంటి కోర్టులోనైనా సగానికి సగం మంది అతనిని మేధావి అంటారనేది అతని భావం.76 స్వీయ ఘనతను ప్రచారం చేసుకొనే మనస్సూ, అధికారాన్ని దిక్కరించే వైఖరీ ఎప్పుడూ కలిసే ఉంటాయి. "నేను ప్రసంగించడానికే పుట్టానని” ఒక అసోసియేట్ పాస్టర్ నాతో చెప్పాడు. “నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును,” అని జ్ఞానం హెచ్చరిస్తోంది (సామెతలు 27:2).

 

సరైన స్థానంలో లేని సేవకులు

భవిష్యత్తులో తాము చేయబోయే పరిచర్య నిమిత్తమై కేవలం ప్రభువు నుంచి అనుమతినీ, నడిపింపునూ కోరుకునే కాపరుల్ని చూడడం కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. వాళ్ళు తమ వరాల గురించి గొప్పలు చెప్పుకోవడానికి తగిన అవకాశాల కోసమో, పరిస్థితుల కోసమో వెదకరు. కానీ తమ స్వభావాన్ని పరీక్షించే అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. అంతేకాదు సంఘ కార్యక్రమాల్లో నిమగ్నమై యుండగా తమ వరాలు వాళ్ళను ఎంత ఉన్నత స్థాయికి తీసుకుకెళ్తాయనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. నాయకునిగా సిద్ధపడుతున్న తొలినాళ్లలోనే నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠమిది. అయితే “దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెనని” 1 కొరింథీ 12:18 చెబుతోంది. మనిషి కాదు దేవుడే తన చిత్త ప్రకారం సంఘమనే శరీరాన్ని నిర్మించాడని 24వ వచనం చాలా స్పష్టంగా అదే విషయాన్ని తెలియజేస్తోంది.

కొరింథీ సంఘం వరాల్ని దుర్వినియోగం చేసింది. నేటి సంఘం సైతం మందిరాల కోసం భారీ స్థలాలు కొనుగోలు చేసి, అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చుచేస్తోంది. పేరు ప్రఖ్యాతుల కోసం పరితపించిపోతోంది. తమ వరాల్నీ, వనరుల్నీ దుర్వినియోగం చేసి అహంకారంతో, అసూయతో నిండిపోతోంది. ఈ విషయాలు నాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. బోధకులూ, నాయకులూ తమ గుణశీలాల్ని పరీక్షించుకోక ముందే అనతి కాలంలోనే బహిరంగంగా ఉన్నత స్థానాలకు ఎదిగిపోయి ప్రముఖుల జాబితా లోకి చేరిపోతున్నారు. ఒక వ్యక్తి మాట్లాడే మాటలూ, క్రియలు చేసే పనులూ ఎంత వివాదాస్పదమైతే, ఆ వ్యక్తికి ప్రజల హృదయాల్లో అంత గౌరవమూ, గుర్తింపూ లభిస్తున్నాయి. ప్రముఖ పరిచర్యలోని ముఖ్య నాయకుని వివాదాస్పదమైన జీవనశైలిని గురించి ప్రజలు వింటూనే, అతడు నిర్వహించే సమావేశాలకు వేల కొలదిగా హజరవుతూ, సత్య సంఘంలోని సభ్యులు బోధించే వరం నాయకత్వ వరాల మత్తులో మునిగిపోయారు. అయితే పరిశుద్ధాత్మ తమ కనుగ్రహించిన వరాలతో సంఘాన్ని ప్రభావితం చేసే వారికి మాత్రం అభిమాన సంఘాలు ఉండవు, ఘనమైన సత్కారాలు ఉండవు, సంఘాభివృద్ధి ప్రణాళికల్లో వారి పేర్ల ప్రస్తావనే రాదు. సంఘానికి దేవుడు ఏర్పరచిన విధి విధానాలకు ఇది పూర్తిగా విరుద్ధమైనది.

 

సంఘం కురూపి అయ్యే ప్రమాదముంది

క్రీస్తు శరీరం వివిధ రకాలైన వరాలతోనూ, విభిన్నమైన తలాంతులతోనూ తులతూగే ఒక అద్భుతమైన వ్యవస్థ. మహిమగల మన విమోచకుని సౌందర్యాన్ని, ఆయన గుణ లక్షణాలనూ లోకానికి చూపాలనే ఉద్దేశంతో ఈ వరాల్నీ, తలాంతుల్నీ సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. మన హృదయాల్లో పాపేచ్ఛలనూ, పాప వైఖరినీ అనుమతించి నపుడు మనం క్రీస్తు శరీరాన్ని వక్రీకరిస్తున్నాం. దాని వల్ల అది కురూపియై సరైన రీతితో పనిచేయలేదు. తన యవ్వనంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రమైన గాయాలతో బయటపడిన స్నేహితుడొకడు నాకున్నాడు. అతడు నాకు చాలా కాలంగా తెలుసు. ప్రభువు అతణ్ణి సజీవునిగా ఉంచినందుకు అతడు ఎల్లప్పుడూ ప్రభువుకి కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నాడు. అయితే యాక్సిడెంట్లో తగిలిన దెబ్బలు మాత్రం అతనికి తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తుండేవి. అతని కాళ్లు సరిగ్గా పనిచేయవు, తరచూ వచ్చే పక్షవాతం మూలంగా స్పష్టంగా మాట్లాడడానికి కూడా చాలా శ్రమపడేవాడు. మానవ శరీరంలో అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడం విసుగు కలిగించే విషయమే. ఒక అవయవానికున్న బలహీనత మిగిలిన అవయవాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. దేవుడు శరీరానికి ఉద్దేశించిన విధులు ఆ ఒక్క బలహీన అవయవ మూలంగా అంతరాయానికి గురవుతాయి. అదే విధంగా సంఘ సభ్యులు ఇతరుల నుంచి తమను తాము వేరుపరచు కున్నప్పుడూ, వారే ముఖ్యమైన సభ్యులన్నట్లు ప్రవర్తించినప్పుడూ సంఘం కూడా ఇబ్బందికి గురవుతుంది.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నీకు బోధించే వరముంటే, నీవు మాత్రమే సంఘానికి అత్యవసరమైనవాడివనీ, క్రీస్తు శరీరం ప్రాథమికంగా ఉపన్యాసకులతో నిండి ఉందనే భావనను నీ మనసులోంచి పారద్రోలాలి. నీకున్న వరాలు బహుశా బహిరంగంగా గుర్తింపుకు నోచుకోనివై యుండవచ్చు. అయితే నీకు లేని గొప్ప వరాల్ని పొందుకోవాలనే దురాశ నీలో కలిగితే నీవు వెంటనే దాన్ని విడిచిపెట్టాలి. దేవుని పనికి నీవు అనవసరమనే ఆలోచనను నీవు ఎదిరించాలి. ఇలాంటి ఆలోచనలే క్రీస్తు శరీరాన్ని వికృతంగా, కురూపిగా చేస్తాయని పౌలు చెప్పాడు (1 కొరింథీ 12:17,19;). నీవు నమ్మకంగా పరిచర్య చేయకపోయినా సంఘం వర్ధిల్లుతుందనే అభిప్రాయానికి రావడం పొరపాటు. ఎంతో మంది మంచి పరిచారకులు సంఘ పెద్దలవ్వడానికి ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో చూడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వారలా ప్రయత్నించడానికి కారణం సంఘ పెద్ద స్థానం వలన కలిగే గౌరవం, సాధించే గొప్ప కార్యాలు చాలా గొప్పవనేదే వారి ఆలోచనే. ఫలితంగా తనకు దేవుడు అనుగ్రహించని నాయకత్వ భారాన్ని అతడు మోస్తుండగా, సంఘాని కవసరమైన మంచి పరిచారకుని స్థానం భర్తీ కావట్లేదు. మనకున్న బలంగురించీ, పరిమితుల గురించీ సరైన అవగాహన కలిగి ఉండాలని 1 కొరింథీ 12:15-19; బోధిస్తుంది.

నేను చెయ్యి కాను గనుక శరీరంలోనిదానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరము లోనిదానను కాదని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీర మంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?

యేసుక్రీస్తు మహిమ విశదమవ్వాలంటే పరిశుద్దాత్మ అనుగ్రహించు వరాలన్నీ కీలకమైనవే, తలాంతులన్నీ అవసరమైనవే. కొద్ది మందికున్న తలాంతులు అల్పమైనవని చెప్పి వాటిని నిర్లక్ష్యం చేసి, వాళ్ళ ఉత్సాహాన్ని చల్లార్చి, వాళ్ళను పరిచర్య చేయనీయకుండా అడ్డగించే వాళ్ళు సంఘంలో ఉండడం విచారకరం. సంఘంలో ప్రతి ఒక్కరిని పరిచర్యలో దేవుడు వాడుకోవడం వల్ల కలిగే ఆనందాన్ని ఆస్వాదించాలనీ (1కొరింథీ 2:23-25). వరాల్లో ఏ ఒక్క దానిని ఉన్నతమైన దానిగా పరిగణించకూడదనీ లేఖనం బోధిస్తోంది. సంఘమంతా సమాజంగా కూడినప్పుడూ, సిద్ధాంతాన్ని ఉపదేశించేటపుడూ ప్రసంగానికి మొదట ప్రాధాన్యత నివ్వాలి. అయితే ఏ వరాన్ని కూడా ఉన్నతమైనదిగానో, అనవసరమైనదిగానే పరిగణించకూడదు. పరిశుద్ధాత్మ అనుగ్రహించిన కృపను అలా దుర్వినియోగం చేయడం తన పరిపూర్ణ జ్ఞానం డిమాండ్ చేసిన రీతిగానే సంఘమనే శరీరాన్ని నిర్మించిన దేవునికి అగ్రహాన్ని కలిగిస్తుంది.

నాయకులుగా మనం చాలా తీక్షణమైన నిజాయితీని అనుసరించే వారమై యుండాలి. గుర్తింపును ఎక్కువగా తీసుకొచ్చే వరాల గురించీ, నాయకత్వ పాత్ర గురించీ మనం అత్యాశ కలిగియున్నామా? సువార్త వ్యాప్తిలో దేవుని ఉద్దేశాలు నెరవేరడానికి మన వరాలెక్కడ సరైన పాత్ర పోషిస్తాయి? పరిచర్యలో దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టీ, పరిశుద్ధాత్ముడు మన జీవితాల కోసం మలచిన ప్రత్యేక రూపాన్ని బట్టి మనం సంతృప్తి చెందామా? విశ్వాసులందరూ ముఖ్యంగా నాయకత్వంలో ఉన్నవారు దేవుడు వారినెక్కడ నాటాడో అక్కడ ఎదిగి, ఫలించి పరిచర్యకు సహకరించాలి. నీకు బోధించే వరముంది. కానీ కాపరి లక్షణాలు లేకపోతే, సంఘంలో నమ్మకమైన బోధకునిగా ఉండి, కాపరి బాధ్యతకు దూరంగా ఉండు. నాకు తెలిసిన తలాంతులు గల బోధకులెంతో మంది సంఘ సభ్యులనూ సిబ్బందినీ ఎంతో గందరగోళానికి గురి చేస్తున్నారు, ఎందుకంటే కాపరిగా ఉండే బాధ్యత తమకు సరిపడదని వారు గుర్తించలేకపోయారు. నీకు కొదువున్న చోట ఇతరుల వరాల్ని వినియోగించే అవకాశం వాళ్ళకివ్వండి.

నీకు బహుశా సువార్తను బలంగా ప్రకటించే వరముండగా అధిక సమయం నీవు అధ్యక్ష పదవిని చేపట్టి ఆ బాధ్యతల్లో తలమునకలై విసుగు చెందుతున్నావేమో! అధ్యక్ష పదవిని చేపట్టడానికి సంతోషించేవారికి ఆ బాధ్యతల్ని అప్పగించి సంఘ స్థాపకునిగా నిన్ను బయటకు పంపమని నీ పరిచర్యలోని సభ్యుల్ని అడుగు. ఇతరుల్ని ఆదరించు వరాలున్న వ్యక్తులు రోగుల్నీ, అవసరతలో ఉన్న వారిని దర్శించుటకు బదులు సంఘ కార్యక్రమాల్ని చక్కపెట్టే పనుల్లో నిమగ్నులై ఉక్కిరిబిక్కిరవడం నేను చూసాను. నీ వరాలు సంఘ పరిపాలనకు (అనగా 1 కొరింథీ 12:28; - ప్రభుత్వములు చేయుటకు) సంబందించినవై యుండవచ్చు. అయితే గొప్ప విశ్వాసంతో, ఆశయంతో నడిపించే విషయంలో నీకు పరిమితులు ఉన్నాయేమో! ఓడ నాయకుని కంటే ఓడ ముందుండే చుక్కాని పెద్ద ప్రాముఖ్యమైంది కాదని ఊహించుకోవద్దు. నీ సామర్థ్యాలతో నీవు ఫలవంతమౌతుండగా, నీకున్న బలహీనతల్లో విశ్వాసవరాన్నీ, నాయకత్వ వరాన్నీ కలిగిన వాళ్ళు నీకు సహాయం చేస్తారు.

పరిచర్య సొమ్మసిల్లిన చోట, కార్యక్రమాలు జరపడానికి ఇబ్బందు లెదుర్కొనే చోట సహకరించే వరాలున్న వారిని పెట్టాలి. ధారాళంగా ఇవ్వగల వరాలున్న వారికి పరిచర్యలోని అవసరతలు తెలిపి ప్రార్థించి సహకరించడానికి అవకాశమివ్వాలి. హెచ్చరించే వరమున్న వారు రోగుల దగ్గర ఫలవంతమైన పరిచర్య చేయలేరనే వాస్తవాన్ని నీ వెన్నడైనా గమనించావా? ఆత్మీయంగా బలహీనులైన వారి దగ్గర హెచ్చరించు వరమున్న వాళ్ళనుంచండి. వారి పరిచర్య బలంగా ఉంటుంది. అసాధారణ రీతిలో సాహసం అవసరమున్న చోట కృప వర్థిల్లటానికి ఇబ్బంది పడుతుంది, కానీ స్వస్థత అవసరమైన చోట అది ప్రకాశిస్తుంది.

కొన్ని సందర్భాల్లో మనకు తలాంతులు లేని విషయాల్లో పరిచర్య చేయమనీ, మన కంటే గొప్పగా ప్రభావితం చేయగలిగిన వరాలున్న వారి స్థానంలో పనిచేయమనీ మనల్ని అడుగుతారు. అలా ప్రజలు మన సహాయం కోరడం చాలా గౌరవం. మనకు పరిమితులున్నప్పటికీ ప్రభువు సహాయంతో సరైన తలాంతులున్న వ్యక్తులు వచ్చేవరకు ఆ పరిచర్యకు సహకరిస్తూ, వాళ్ళకు ఆశీర్వాదకరమైన సేవకులుగా ఉండవచ్చు. ప్రతి విశ్వాసి తన తలాంతుల నెరిగి సంఘానికున్న అవసరాల కనుగుణంగా సేవించడానికి తన తలాంతుల్ని ఉపయోగించడానికి శ్రమపడాలి. తమ శక్తినంతటిని ధారపోసి బోధకులు బోధించడానికి, నాయకులు నడిపించడానికీ, హెచ్చరించు వరమున్న వారు హెచ్చరించడానికి శ్రమపడాలి. పరిచారకులు, సహాయకులు, దాతలు, దయా గుణమున్నవారు ఆ వరాలు వర్ధిల్లేచోట తమ శక్తికి తగినట్లు ప్రయాసపడాలి. ప్రజల కున్న వరాలు ఎంత విశిష్టమైనవైనా అవి ప్రజాభిమానం కోసం కాక దేవుని మహిమ కోసం ఉపయోగపడాలి. “నాకు పలు విషయాల్లో వరాలుంటే నేనేం చేయాలి?” అని మీలో కొందరు అడుగవచ్చు. క్రీస్తు శరీరాభివృద్ధికి సంపూర్ణంగా సహకరించడానికి పరిశుద్ధాత్మ ప్రేమతో మనకు వినూత్నమైన వైవిధ్యభరితమైన వరాల ననుగ్రహిస్తాడు. (ఎఫెసీ 4:16;). కొంతమందికి వివిధ రకాలైన వరాలుంటాయి. అలాంటి విశిష్ఠత ప్రభువు ఉద్దేశాల కనుగుణంగా ఉంటుంది. అసూయతో, గర్వంతో దేవుడ నుగ్రహించిన వరాల్ని తృణీకరించుట అపాయకరమైన సంగతి అనే విషయాన్నే నేను ఈ అధ్యాయం ద్వారా చెప్పాలనుకున్నాను. అంతేకాదు కొరింథీ సంఘంలో కూడా ఇదే విషయం జరిగింది.

 

సమతుల్యతలో ఉండే సౌందర్యం

కొన్ని వరాల్ని హెచ్చించి, మరి కొన్ని వరాల్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా సంఘానికి ఘోరమైన నష్టం వాటిల్లుతుంది. క్రీస్తు సొగసును చూపించే సమత్యులత శరీరంలో ఉండాలి. ప్రసంగించే, బోధించే, నడిపించే వరాలకు ప్రజాభిమానాన్ని ఎక్కువగా పొందే అవకాశముంటుంది. వీటిని సైతం ఎక్కువ ఘనతకు అర్హమైన వరాలుగా భావించకూడదు. లేఖనం ఇలా సెలవిస్తోంది.

గనుక కన్ను చేతితో, నీవు నాకక్కరలేని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి యెక్కువగా ఘనపరచు చున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్య మక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక, అవయవములు ఒకదానికొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చి యున్నాడు.

ఈ సత్యం వినడానికి చాలా సులభమైనది, అయితే ఆచరణలో గంభీరమైనది. మానవ దేహంలో ఇతరులకు కనబరిచే అవయవాలూ, కనబరచని అవయవాలూ ఉన్నాయి. అలాగే సాధారణ అసాధారణ వరాల్ని సంఘమనే శరీరంలో దేవుడు ఉంచాడని పౌలు మనకు చెబుతున్నాడు. మనలో స్వార్థం, గర్వం మితిమీరితే ఇతరులకు మనల్ని మంచిగా చూపించే వరాల్ని ఘనపరచి, సామాన్య వరాల్ని నిర్లక్ష్యం చేస్తాం. సామాన్య వరాలని మనం భావించే వాటిపై ప్రేమతో, కృతజ్ఞతతో ప్రధాన వరాలు కలిగినవారు ఉన్నతమైన గౌరవాన్ని కనపరచాలని దేవుడు కోరుచున్నాడు. మరొకరీతిగా చెప్పాలంటే ప్రజల దృష్టిలో పడకుండా తెరవెనుక ఉండి దినదినమూ త్యాగపూరితంగా సంఘ శరీరాన్ని ఘనపరిచేలా పరిచర్య చేసే వారు పరిచర్యను బలపరచడానికి అత్యవసరమైనవారని ఇప్పటికే తమ పరిచర్యను బట్టి ప్రజాభిమానాన్ని పొందుకుంటున్న వారు చెప్పాలి. దేవుని హృదయం లోంచి పుట్టుకొచ్చిన ఈ ప్రణాళిక ఎంత జ్ఞాన యుక్తమైనదో కదా! పరిచర్యలో ప్రతి విశ్వాసి కీలకమైనవాడే. అయితే అవసరముందని ఏ ఒక్కరూ చూడని ప్రదేశంలో ఉపయోగపడే చక్కటి వరాలు కొద్దిమందికి ఉంటాయి. ఆకర్షణీయమైన వరాలున్న వ్యక్తుల గురించి నిర్విరామంగా మాట్లాడుకుంటూ ప్రజలు ఇలా తెరవెనుక పనిచేసే వరాలున్న వాళ్ళను చాలా ఘోరంగా నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనికి భిన్నంగా మనం ఉండాలని దేవుని ఆజ్ఞ. నీకున్న వరాలు ఆకర్షణీయమైనవైతే సహజంగానే నీకు గౌరవం లభిస్తుంది. అలాంటి సమయంలో నీ విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి దేవునికి ఉపయోగపడిన ఇతరుల్ని గుర్తుచేసుకుని వాళ్ళకు కూడా నీవు పొందే గౌరవాన్ని ఆపాదించడం నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరైనా నీ పరిచర్య తమకు ఆశీర్వాదంగా ఉందని చెబితే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించు. అదే సమయంలో నీవు శ్రమించి పరిచర్య చేయడానికి సహకరించిన ఎంతో మందికి నీ వ్యక్తిగతమైన కృతజ్ఞతలు మరిచిపోకుండా తెలియచెయ్యి. మనకు పరిచర్య చేయడానికి లెక్కలేనన్ని మార్గాల్లో దేవుడు ఇతరుల్ని ఉపయోగించుకుంటున్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యుక్తమైన విషయం. ఒకరిపై మరొకరు ఆధారపడే ఈ అంశాన్ని గూర్చి జాన్ మెకాక్టర్ గారు విపులంగా రాసారు.

మనం క్రీస్తులో సంపూర్ణులం, ఆయన మనకు చాలినవాడు. గనుక నమ్మకమైన క్రైస్తవులుగా జీవితాన్ని జీవించడానికి ఏ ఒక్కరి సహాయమూ మనకవసరం లేదనే అభిప్రాయానికి క్రైస్తవులమైన మనం కూడా బందీలుగా మారిపోతాం . ఆ భావం లేఖనానికి పూర్తిగా విరుద్ధమైనది. దేవుడు మనల్ని సృష్టించి, విమోచించింది ఆయన కోసం మాత్రమే కాదు గానీ ఇతరుల కోసం కూడా. వేరొకరు క్రీస్తు దగ్గరకు మనల్ని నడిపించకపోతే, చదవడానికి వాక్యానుసారమైన సాహిత్యాన్ని మనకు అందించకపోతే దేవుని గురించి గానీ, సువార్త గురించి గానీ మనం ఎన్నటికీ వినుండేవారం కాము. క్రైస్తవ నాయకులూ, స్నేహితులూ మనకు సహకరించి నడిపించకపోతే విశ్వాసంలో, విధేయతలో మనం ఎదుగుండేవాళ్ళం కాము. ఇతరుల సహాయ సహకారాలు లేకపోతే మనకున్న ఏ పరిచర్యనైనా సంపూర్ణంగా నెరవేర్చలేము."

దేవుడు ఉద్దేశించినట్లు దేవుని ప్రజలు ఒకరియెడల మరొకరు శ్రద్ధ వహించడం ఎంత అద్భుతమైన విషయం! బహిరంగంగానూ, ఏకాంతంగానూ నమ్మకంగా పరిచర్య చేసే వారికి నాయకులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడం నేర్చుకోవాలి. నేను ఎన్నో సంవత్సరాలు డాక్టర్ జాన్ మెకార్థర్ గారితో పరిచర్యలో ఉన్నాను. సంఘంలో ఒకరి అవసరత మరొకరికి ఉందనే నియమానికి ఆయన కట్టుబడి ఉన్నారు. దానికి నేనే సాక్షిని. నాయకత్వం విషయంలో ఎన్ని సవాళ్ళు ఎదురైనా, ఒంటరిగా ఉన్నప్పుడు పరిచర్యలో ఎన్ని యుద్ధాలు జరిగినా, తన తోటి పెద్దల యెడల, సంఘం యెడల సువార్త పరిచర్యలోని ఆధిక్యతలను బట్టి ఎంతో కృతజ్ఞతాపూర్వక హృదయాన్ని ఆయన కనపరిచేవాడు. పరిచర్య గురించి ప్రతికూలమైన భావాన్ని ఆయన ఎన్నడూ ప్రసంగ వేదిక నుంచి మాట్లాడడం నేను వినలేదు. ఇతరుల కున్న వరాల్ని చులకన చేసి మాట్లాడం కనీసం ఒంటరిగా ఉన్నపుడు సైతం నేను ఎన్నడూ గమనించలేదు. నా జీవితం పైనా, పరిచర్యపైనా అటువంటి స్థిరమైన మాదిరి ఎంతో గంభీరమైన ప్రభావాన్ని కనపరచింది. అహంకారం, వరాల యెడల అనారోగ్యకమైన ఆసక్తి క్రీస్తు శరీరంలో ముఖ్యంగా నాయకుల మధ్యలో ఉండనే కూడదు. వరాల్ని సక్రమంగా ఉపయోగించడానికి ప్రేమ, కనికరం, సాత్వికం దోహదపడతాయి. ఈ లక్షణాలు ఏలే చోట గర్వానికి పాదం మోసే స్థలం కూడ దొరకదు (1 కొరింథీ 12:26;). ప్రియమైన దేవా, ఎన్నోసార్లు ఇతరుల అభినందనల్ని నేను కోరుకున్నాను. ఒక క్షణం నీవు నాకిచ్చిన వరాల్ని బట్టి తృప్తి కలిగి ఉంటున్నాను, మరుక్షణంలోనే నా సామర్థ్యాల్ని నన్ను హెచ్చరించుకోవడానికి వాడుతూ ఉన్నాను. అయ్యో! అయోగ్యుడనైన్పటికీ ఎన్నో సార్లు క్రీస్తు శరీరం ద్వారా ఆశీర్వాదం పొందిన మార్గాల గురించి అనుదినం నేను గుర్తుంచుకోవాలి. దేవా, నాకున్న పరిమితుల్ని నాకు చూపించండి, నా సామర్థ్యాల్ని సరైన కోణంలో చూసేలా నా బలహీనతల్ని కూడా తగిన రీతిలో నాకు చూపించండి. ఆమెన్!

 

8. విమర్శలు

ప్రతీ ఒక్కరూ ఏదొక సమయంలో కఠినమైన విమర్శ నెదుర్కొన్నవారే. ఇతరులపై కంటే నాయకులపై ఈ విమర్శనాస్త్రాలు మరింత ఎక్కువగా దాడిచేస్తాయి. సద్విమర్శలు సహాయం చేయగా, దురుద్దేశంతో చేసిన విమర్శలు కృంగదీస్తాయి. కనుక నాయకు లెదుర్కొనే ఈ విమర్శలు అత్యంత ప్రమాదకరమైనవి, అతిగా గాయపరచేవి. అయితే ఈ విమర్శల వర్షం ఏ హెచ్చరికా లేకుండానే కురుస్తుంది. ఇది ప్రజలు మనల్ని అపార్థం చేసుకోవడంతో మొదలై, దురుద్దేశంతో మనల్ని తీవ్రంగా దూషించే స్థాయికి చేరుకుంటుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే విమర్శ గురించి కర్టిన్ థామస్ కొన్ని చక్కటి తలంపుల్ని రాసాడు.

అన్ని వేళలా దుఃఖపడుతూ ఫిర్యాదు చేసే మనసున్న వారి నుంచే ఫిర్యాదులొస్తాయి. కొద్దిమంది తమకు పూర్తిగా తెలియని విషయాల గురించి, ఏ మాత్రం ఆలోచించని సంగతుల గురించి ఫిర్యాదులు చేస్తారు. మరికొద్ది మందైతే దేవునితో మన నడక, మన బోధ, సంఘ పాలన, నాయకత్వం మొదలగు విషయాల్లో మనకు సహకరించడానికి విమర్శిస్తారు. అందువల్ల కొన్ని సద్విమర్శలుంటాయి. వాటిని మనం ఫిర్యాదులుగా భావించకూడదు. ఇలాంటి సద్విమర్శలను స్వీకరించి వాటిని మన ప్రయోజనార్థం ఉపయోగించుకోవాలి. కొద్దిమంది విరోధ భావంతో, మరి కొద్దిమంది చాలా దీన మనసుతో మనల్ని విమర్శిస్తారు. అవి తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి సంఘ జీవనంలో అవి వాస్తవాలు.

ఒక రోజు సంఘంలో బైబిల్ క్లాస్ బోధించడానికి వెళ్తుండగా ఒకాయన నన్ను ఆపి, 'గత నాలుగు సంవత్సరాలుగా మీ మీద నేను చాలా కోపంగా ఉన్నానని' చెప్పాడు. ఆశ్చర్యపడడం నా వంతయ్యింది. నాకు తెలిసి నేనెప్పుడూ ఇతని గురించి విరోధంగా ఆలోచించలేదు. నిర్ఘాంతపోయిన నేను 'మిమ్మల్ని గాయపరిచే పని నేనేం చేసాను?” అని అతణ్ణి అడిగాను. అతడిచ్చిన సమాధానాన్ని నేనెన్నడూ మర్చిపోలేను. 'ఒక రోజు ఉదయాన "హలో" అని నేను మిమ్మల్ని పలకరిస్తే మీరస్సలు నన్ను పట్టించుకోలేదని' అతను చెప్పాడు. ఇతరుల్ని తీవ్రంగా విమర్శించడానికి కొద్దిమందికి ఇంతకు మించిన కారణాలు అవసరం లేదు. ఆ సహోదరుడూ నేనూ ఒకరితో మరొకరం సమాధానపడ్డాం. అతి చిన్న విషయంలో అపార్థం చేసుకొని దీర్ఘకాలం నన్ను ద్వేషించిన విషయాన్ని అతడు గుర్తించాడు. అయితే అన్ని గాయాలూ, విమర్శలూ సులభంగా సమసిపోవు. తమపై సంధించిన విమర్శల్ని జ్ఞానయుక్తంగా, ఓర్పుతో ఎదుర్కోవడం భక్తిగల, ప్రభావితం చేయగల నాయకులకు అత్యవసరం. "క్రైస్తవ నాయకునిలో ఓర్పు లేకపోతే అదొక తీవ్రమైన లోపం. సహనంలేని తండ్రి తన పిల్లలకూ, ఓర్పులేని కాపరి తన గొర్రెలకూ ప్రమాదకరమైన రీతిగా సహనం లేని నాయకుడు తన ప్రజలకు ప్రమాదకరమని”2 అలెగ్జాండర్ స్క్రాచ్ ఈ అంశాన్ని చాలా తీవ్రంగా రాసాడు. ఏ ఒక్కరూ విమర్శల్ని ఇష్టపడరు. అయితే ఆత్మీయ నాయకులు విమర్శ లెదుర్కొన్నపుడు వాక్యానుసారంగా స్పందించడానికి దేవుడు వారిని పిలిచాడు. కొన్నిసార్లు విమర్శకుని అభిప్రాయం పూర్తిగా అవగాహన లేనిదై ఉంటుంది, మరికొన్ని సార్లు కచ్చితంగా ఉంటుంది. అలాంటి రెండు పరిస్థితుల్లోనూ మన నాయకత్వ లక్షణాల్ని అభివృద్ధి చేసుకోవడానికి విమర్శల్ని మనం ఉపయోగించుకోవాలి. వినడం నేర్చుకోవాలి

కొన్నేళ్ళ క్రితం ఒక పెద్ద మిలటరీ డిఫెన్స్ కాంట్రాక్టింగ్ కంపెనీలో నేను పని చేసాను. అందులో C.E.O. కి డ్రైవర్ గా పనిచేసే జో అనే వ్యక్తిని తరచుగా నేను కలిసేవాడిని. జో తన చుట్టు ప్రక్కల జరిగే పరిస్థితిని ఎన్నడూ పట్టించుకోని మంచి జోకర్. మీరెంత సీరియస్ గా ఉన్న సమాచారాన్ని అతనికి చెప్పినా, 'అద్భుతం మహాద్భుతం' అని చెబుతుంటాడని నా తోటి ఉద్యోగులు తరచూ జోక్ చేస్తుండేవారు. ఒక సందర్భంలో నా తోటి ఉద్యోగులు సెక్యూరిటీ కెమెరాలోంచి చూస్తుండగా నేను అతణ్ణి పరీక్షిద్దామని నిర్ణయించుకున్నాను. ఎలివేటర్ లో నేను జోని కలిసి 'హలో' అని అన్నాను. క్రిందికి చూస్తూనే 'ఎలా ఉన్నావ్?' అని అతడు నన్ను అడిగాడు. నా తల్లిదండ్రులిద్దరూ ఈ మధ్యనే కార్ యాక్సిడెంట్ లో మరణించారని నేను వెంటనే చెప్పాను. నా సహోద్యోగులు చెప్పినట్లే, 'అద్భుతం మహాద్భుతం' అని జో చెప్పాడు. మా కుటుంబమంతా ఆ సన్నివేశాన్ని గుర్తుచేసుకొని ఎన్నో సంవత్సరాలు నవ్వుకున్నాం. ఎందుకంటే ఎవరైనా వారి మనసులోని ఆలోచనల్ని మనతో పంచుకున్నప్పుడు మనమెంత పరధ్యానంగా ఉంటామో అనే వాస్తవానికి అదొక ఉదాహరణగా ఉంది. ఇతరులు చెప్పింది మీరు చాలాసార్లు విన్నట్లే భావిస్తారు. కానీ కొద్ది క్షణాల తర్వాత విన్నదేదీ మీకు గుర్తుండదు. అలాంటి సన్నివేశాలేవైనా జ్ఞాపకమున్నాయా? ఇతరులు చెప్పేది పూర్తిచేయకముందే చెప్పాల్సిన సమాధానం గురించి ఆలోచించిన సందర్భాల సంగతేంటి? విమర్శను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏకాగ్రతతో, శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది. ఇది సులభమైన విషయం కాదు, కానీ విమర్శలనెలా ఎదుర్కోవాలో చూపించమని నాయకుల్నే లేఖనాలు ఆజ్ఞాపిస్తున్నాయి (2 తిమోతి 2:24-26).

 

వినడానికి నిజమైన ఆసక్తి ఉండాలి

ఇతరులు చెప్పేది వినడమంటే వారి ముందు మౌనంగా కూర్చొని ఉండడమే కాదు, వారు చెప్పేదంతా మన మనసుపెట్టి ఆలకించడం కూడా. పరిస్థితులు చేయి దాటిపోకముందే చక్కటి నేర్పుతో వింటే చాలా మట్టుకు విమర్శల్ని తిప్పికొట్టవచ్చని అనుభవం నాకు నేర్పింది. మనల్ని ఇతరులు విమర్శిస్తున్నప్పుడు చాలా సహజంగా మనల్ని మనం సమర్థించుకొనే పనిలో మునిగిపోతాం. ఆ సమయంలో ఆ వ్యక్తి మన ఉద్దేశాల్ని ఎందుకు అపార్థం చేసుకున్నాడు? వాస్తవాల్ని ఎందుకు వక్రీకరించాడు? అనే ప్రశ్నలకు కారణాల్ని వెదుకుతూ ఉంటాం. సమర్థించుకొనే వైఖరి మన వివేచన సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. వెంటనే మన వైఖరి మన గౌరవ ఘనతలపై దృష్టి మరల్చుకుంటుంది. మనల్ని మనం భద్రంగా కాపాడుకోవాలనే ఆలోచననే సూచిస్తుంది, అది ఇతరుల క్షేమాభివృద్ధి గురించి ఎన్నడూ నిజమైన శ్రద్ధనూ, ఆసక్తిని కలిగించదు. నీవెదుర్కొనే విమర్శ అసత్యమైనదని నీవు భావిస్తే, విమర్శించే వారి మాటల వెనకున్న మనసును గ్రహించడానికి ఓపికతో, శ్రద్ధగా వినాలి. 'ప్రతివాడును మాటలాడుటకు నిదానించువాడును వినుటకు వేగిరపడు వాడునై యుండవలెనని' యాకోబు 1:19 చెబుతోంది. సామెతలు 18:13 మరింత సూటిగా మాట్లాడుతుంది. “సంగతి వినక ముందు ప్రత్యుత్తురమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.” ఇతరులు చెప్పేది వినడానికి నిజంగా ఆసక్తిని కనబరచాలంటే ఆశా నిగ్రహాన్ని ప్రదర్శించాలి. నాయకులు తమ సుఖసౌఖ్యాల కోసంకాక వారి నాయకత్వం క్రింద ఉన్న వారి ఆత్మీయ ఎదుగుదల గురించి చింతించాలి ( 2 తిమోతి 2:25-26;; 1 పేతురు 4:15;). మనం సత్యానికి లోబడుచున్నామని ఇతరులు గ్రహించే వరకూ మనం వారి జీవితాలకు దిశా నిర్దేశం చేయలేము. నీవు స్పందించక ముందే ఇతరులు చెప్పింది శ్రద్ధగా వినడానికి సమయం కేటాయించు. పవిత్ర హృదయాన్నీ, పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వ్యక్తి కఠినంగా, దురుసుగా మాట్లాడడు. 'నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును, అని సొలొమోను చక్కగా చెప్పాడు (సామెతలు 15:28). విమర్శించు వాని ఆత్మీయ ప్రగతిని నీ మనస్సులో కాంక్షిస్తూ వింటే, ఆ విమర్శ వెనకుండే నిజమైన మనసును నీవు స్పష్టంగా చూడ గలుగుతావు.

 

విషయ స్పష్టత కోసం ప్రశ్నలడగాలి

నేర్పరితనంతో వినాలంటే మాటల్లోని పదాల్నీ, సందర్భాన్ని గ్రహించాల్సి ఉంటుంది. విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రశ్నలడగడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అయితే అసలైన సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకో, ఇతరుల్ని సవాలు చేసే విధంగానో, కోపంతో మండిపడే విధంగానో ప్రశ్నలు అడగకూడదు. మనందరం ఉపయోగించే పదజాలం చాలా భిన్నంగా ఉంటుంది కనుక, మనం మాట్లాడే మాటల అర్థాలపై ఏకాభిప్రాయముంటే అది మనకెంతో సహకరిస్తుంది. చాలాసార్లు భాషను సరిగా ఉపయోగించకపోవడమే విమర్శలకూ, అపార్థాలకూ కారణమౌతుంది.

స్త్రీల కూడికలో బోధించడానికి ఒక సహోదరి సిద్ధపరచుకున్న బైబిల్ స్టడీ సారాంశాన్ని పరిశీలించి, ఆమోదించమని నన్ను అడిగిన సందర్భం నాకు గుర్తుంది. ఆ నోట్సులోని ముఖ్యాంశాలు అలంకార ప్రాయంగా ఉన్నాయి. అందువల్ల ఆ ముఖ్యాంశాల వెనకున్న వాక్య నియమాల్ని అర్థం చేసుకోవడం నాకు కష్టమైంది. మీరు రాసిన నోట్సు అంతా అలంకార ప్రాయంగా ఉంది. కనుక ప్రతీ అలంకారం వెనకున్న మీ ఉద్దేశాన్ని నాకు స్పష్టంగా వివరించండని ఆ బోధకురాలకి వేరొకరి ద్వారా తెలియజేసాను. వేరకరి ద్వారా ఇలాంటి సమాచారాన్ని తెలియజేయడం అన్ని వేళలా ప్రమాదకరమే. నేను ఎన్నడూ ఊహించని, ఉద్దేశించని రీతిలో వివాదంలో ఇరుక్కుపోయాను. ఆమె రాసిన నోట్స్ 'భౌతికేతరమైంది'గా ఉందని నేను ఆమెను నిందించినట్లు ఆమె భావించింది. ఆమె మనస్సు గాయపడింది. 'భౌతికేతరమైంది' అనే పదానికున్న అర్థమేమిటో మా యిద్దరికి పూర్తిగా అవగాహన లేదు.

పొరపాటు ఎక్కడ జరిగిందో ఆ స్త్రీల పరిచర్యలోని నాయకులకు వివరించే వరకూ నా నాయకత్వంపై వారు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అది చాలా విచారకరం. చాలా సంవత్సరాలుగా ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆ వివాదం అనవసరమైంది అని నవ్వుకుంటాను. అయితే ఈ వివాదం చాలా స్వల్ప కాలంలో ముగిసినందుకు నేను కృతజ్ఞుడిని. అయితే ఎలాంటి అపార్థాలూ, గొడవలూ లేకుండా ముగియడం చాలా అరుదు. అందుచేతనే స్పష్టత కోసం మంచి ప్రశ్నలడగడం అత్యవసరం. 'నేనర్థం చేసుకోవడానికి సహకరించండి, నన్ను ఓర్చుకుని సమస్యేమిటో నాకు తెలియజేయండి' అనే మాటలతో విమర్శలకు మనం స్పందించాలి. తమ ఉద్దేశాల్ని స్పష్టంగా తెలియజేయడానికి ప్రజలేమీ 'అభ్యంతరపడరు. అందుకోసం తమ సమయాన్ని వెచ్చిస్తారు. సమస్యకు లోతులేని, సత్వరమైన పరిష్కారాలకై తొందర పడడం కంటే విషయాన్ని కూలంకుషంగా తెలుసుకోవడమే శ్రేయస్కరం.'

 

దైవభక్తికి తగిన స్పందన

విమర్శించే వారు మరింత కోపంతో రగిలిపోకుండా శ్రద్ధగా వినేవారు అడ్డుకట్ట వేస్తారు. నేర్పరితనంతో వినేవారు మృదువైన సమాధానం చెప్పి తీవ్రమైన కోపాన్ని చల్లబరుస్తారు ( సామెతలు 15:1;; సామెతలు 25:15;). ప్రజలు నీపై అన్యాయంగా విమర్శలు గుప్పిస్తున్నప్పుడు సైతం వారి మాటలకు అంతరాయం కలిగించకుండా, వాళ్ళ గురించి విరోధ భావం ఏర్పరుచుకోకుండా నీవు వినాలి. ఇతరుల మాటలపై పద్ధతులపై విరుచుకు పడడం మూలంగా వివాదం చెలరేగుతుంది. ఆ వివాదం ప్రజలు విసిగి, నిరాశ చెందడానికి కారణమౌతుంది. తొందరపడి తీర్పు తీర్చడం మూలంగా కలిగిన గాయాల్ని మానేలా చేయడం చాలా కష్టమైన పని. 'బలమైన పట్టణమును వశపరచు కొనుటకంటే ఒకనిచేత అన్యాయము నొందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపులు అడ్డుగడియలంత స్థిరములు' అని సామెతలు 18:19 చెబుతోంది. విమర్శ ఏ మాత్రం అవగాహన లేని అభిప్రాయం మూలంగా కలిగినా, మంచి నాయకుడు వ్యక్తిగత దాడికి దిగడు, నిందను వేరొకరిపైన రుద్దేయడు. నాయకులు తరచూ విమర్శించే వారిని ప్రతి విషయంలోనూ దూషించి, వాక్య వ్యతిరేకమైన పద్ధతిలో స్పందించడం మూలంగా ప్రజలు వారిని ఏ మాత్రం సమీపించలేని స్థితిలో ఉండిపోతున్నారు. దీనివల్ల ప్రజలలో విసుగు, కోపం, నాయకుల ఉద్దేశాల గురించి పాపపు ఊహలు కలుగుతాయి. నీచుల్ని ప్రేమించి, స్వార్థపరులైన పాపుల కోసం తన్ను తాను అర్పించుకున్న ( రోమా 5:6-10;) యేసుక్రీస్తు కళ్లతో ఇతరుల్ని చూడగలిగేంత విశాలమైన మనస్సును కలిగియుండేలా మనం పరిణితి చెందాలి. ఒక వ్యక్తి విమర్శల దాడినెలా ఎదుర్కొంటాడనేది కాదు గాని దానికి ఎంత ప్రతికూలంగా స్పందిస్తాడనేది ముఖ్యమైన విషయం. విమర్శ నెదుర్కొంటున్నప్పుడు, “ప్రభువా, ఇతడు చెప్పే మాటల్లోంచి నేనెలా నేర్చుకోవాలి?" అనే ప్రశ్నను అడగాలి.

నాయకులు ప్రతి విషయంలోనూ మరి ముఖ్యంగా విమర్శలకు స్పందించేటపుడు సందర్భానుసారంగా, వాక్యానుసారమైన, క్షేమాభివృద్ధి కలుగచేసే మాటలు పలికే నైపుణ్యాన్ని అలవరచుకోవాలి. * ప్రతి విషయాన్ని మానవ అభిప్రాయాలు కాక కేవలం దేవుని జ్ఞానమే శాసించేలా అన్వయించడం మనం నేర్చుకోవాలి (సామెతలు 15:2;; ఎఫెసీ 4:15;; 2 తిమోతి 3:16-17;). ఇంతకుముందే విషమించిన పరిస్థితులపై మానవ అభిప్రాయాల్ని రుద్దడానికి మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు. ఎన్నోసార్లు లేఖనాల్ని తగినంత ధ్యానించకుండా, వాటిని సరైన రీతిలో జ్ఞాపకం చేసుకోకుండానే మనం విమర్శలకు స్పందిస్తాం. వివాదాలొచ్చినప్పుడు దేవుని అభిప్రాయమే కాని మరేదీ కీలకం కాదు. మన సొంత అధికారమనే మందుపాతరున్న ప్రదేశంలో తప్పిపోకుండా మనం జాగ్రత్తపడాలి. “ఈ పరిస్థితి గురించి బైబిల్ ఏమి చెబుతోంది? నేనెలా స్పందిస్తే ప్రభువు ఎక్కువ ఆనందిస్తాడు? అనే విషయాల్ని మనం ఆలోచించాలి. సత్యం విషయంలో నీకున్న భారాన్నీ, దానికి నీవు లోబడే తీరునూ ఇతరులు చూస్తే విమర్శలు తగ్గుతాయి, హృదయాలు సున్నితంగా మారతాయి. దానికి భిన్నంగా మన స్వీయ అధికారానికే ప్రాధాన్యతనిస్తే, సద్విమర్శల్ని అంగీకరించే మనస్సు వారికి లేదనే సందేశం ఇతరులకు చేరుతుంది. విమర్శలకు స్పందించ డానికి తగిన సమయం కోసం ఎదురుచూడాలి (సామెతలు 25:11;; కొలస్సీ 4:6;). మనం అజాగ్రత్తగా ఉంటే ఇతరుల శ్రమల్లో, వ్యక్తిగత బాధల్లో వారిని మరింత అణగ తొక్కినవారవుతాం. 'దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడని' సామెతలు 25:20 లో సొలొమోను వర్ణించిన వ్యక్తిని మనం పోలియుంటాం. చలిదినమున పై బట్ట తీసివేయువానివలె మనం ఉంటాం. సరైన సమయం కోసం కనిపెట్టడం శ్రమలో మనుష్యులెలా ప్రవర్తిస్తారో మన మెరిగి యున్నామనే సంగతిని తెలియజేస్తుంది. ప్రజలు తమ పరిశుద్ధతలో ఎదగడానికి, ఇతరుల బలహీనతల్ని చూసే పద్ధతిని మార్చుకోవడానికి సమయం పడుతుంది. మనకున్న విసుగును సరైన రీతిలో అదుపు చేసుకోకపోవడం వలన, పాపపు భ్రమల మూలంగా విమర్శలొస్తాయని మనకు తెలుసు. మంచినాయకులు తాము పరిశుద్ధతలో ఎదిగే వేగాన్ని అన్నివేళల్లో గుర్తుంచుకోవాలి. మారడానికి ఇతరులకు కూడా సమయం పడుతుందని గుర్తించాలి. మనకంటే వేగంగా ఇతరులు ఎదగాలని మనం ఆశించ కూడదు. సత్యాన్ని కించిత్తైనా ఎదిరించక తక్షణమే దానికి మనం లోబడతామనే ఆలోచన మనకు చాలా సహజంగా కలుగుతుంది. నేను సత్యానికి సిద్ధమనస్సుతో ఇష్టపూర్వకంగా లోబడతాను. అయితే నా పాపాన్ని గూర్చిన వాస్తవం ఇతరులకంటే నాకే బాగా తెలుసు. మన పరిశుద్ధత గురించి మనం నిరంతరం నిజాయితీగా చేసే ఆలోచన మూలంగానే సమయానుకూలంగా ఇతరుల్ని ఆదరించగలుగుతాం. అలా ఆలోచించడమే ఇతరుల కష్ట సమయంలో వారికి అవసరమైన దాని గురించి దయా హృదయంతో స్పందించడానికి కారణమౌతుంది. ఇతరుల్ని పాపంలో కొనసాగమని పరోక్షంగా చెప్పడం దీని ఉద్దేశం కాదు. అయితే మనం ఇతరుల సమస్యను పరిష్కరించే ముందు వారిలో సరైన దృక్పధం ఉందో లేదో పరీక్షించాలి. ఉదాహరణకు ప్రజలు ఉద్రేకంగా ఉన్నప్పుడు వారి వైఖరిని వెనువెంటనే సరి చేయడం ఏ మాత్రం ఎవ్వరికీ సహకరించదు. ప్రజలు తమ భావోద్వేగాల్ని తాము నమ్మే వేదాంతానికి (వాక్యానికి) లోబడేటట్లు చేయడానికి సమయం పడుతుందని” నేను నా సంఘంతో చాలా తరచుగా చెబుతుంటాను. ఇతరుల్లోని ఫిర్యాదు చేసే వైఖరి నిజంగా ఉందా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించక ముందే వారి లోపాల్ని వేలెత్తి చూపడం వలన ఏ సమస్యకు పరిష్కారం లభించదు. జ్ఞానయుక్తంగా ఇతరులు చెప్పే దానిని వినేవారు విశ్వాసాన్ని కట్టే ఆదరణమైన మాటలు పలుకుతారు. మనం విమర్శ లెదుర్కున్నప్పుడు క్రీస్తు మహిమను గూర్చిన ఆసక్తి, ఆయన ప్రజల క్షేమాభివృద్ధి కొరకైన భారమూ మన భాషలో కనబడాలి. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు (ఎఫెసీ 4:29). అన్యాయంగా విమర్శ నెదుర్కున్నప్పుడు, ఆ విమర్శకునికి కూడా మనం కృప గురించి బోధించే సేవకులమనే వాస్తవాన్ని మనలో ఎంతమందిమి ఆలోచిస్తున్నాం? ఇదెందుకు మనకు కష్టంగా ఉంటుంది? ఎందుకంటే మన భక్తిలో, పరిచర్యలో స్థిరంగా ఉన్నామని భావిస్తూ, సౌకర్యవంతంగా ఉన్నప్పుడు, మనలోని బలహీనతల్నీ, మనకున్న పరమితుల్నీ నిశితంగా చూసే విధంగా విమర్శ మనల్ని బలవంతం చేస్తుంది కాబట్టే! ఫలితంగా మనం వెంటనే బోనులో బందీలుగా ఉండే జంతువుల్లా మారిపోతాం. మన బలహీనతల్ని దాచుకోవడానికి, వాటిని వేలెత్తి చూపించేవారి గౌరవాన్ని మంటగలపడం కోసం మార్గాల నన్వేషిస్తాం. అన్నివేళల్లో ఒకరి క్షేమాభివృద్ధి కోసం మరొకరం శ్రమ పడటం నేర్చుకోకపోతే, మన స్పందన అన్నివేళల్లో పాపభరితమైందిగానే ఉంటుంది. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై .... ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు రుచికలదిగాను కృపాసహితముగాను మన సంభాషణ ఉండేలా ఇతరుల నుంచి వచ్చిన ఫిర్యాదు మనల్ని జాగ్రత్తపడేలా చేయాలి.

 

సరైన ఆశయాన్ని సంరక్షించాలి

నిర్విరామంగా అత్యంత కఠినమైన విమర్శల్ని సహించిన నాయకునిగా పౌలు ఎన్నడూ తన్నుతాను సమర్థించుకోకపోవడం, ప్రతికారేచ్ఛతో ప్రతిదాడికి ప్రయత్నించక పోవడం మనల్ని అత్యంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పౌలు గురించి అబద్దాల్ని నమ్మినందుకు కొరింథీ సంఘం పశ్చాత్తాపపడింది. పౌలును ఎదిరించిన వ్యక్తిని చాలా తీవ్రంగా క్రమశిక్షణ చేసినపుడు పౌలు తన పేరు ప్రఖ్యాతుల్ని సమర్థించుకోకుండా అతణ్ణి క్షమించి ఆదరించమని వారికి తెలియజేసాడు (2 కొరింథీ 2:6-7;). తన్ను తాను సత్యవంతునిగా నిరూపించుకొనే అవకాశం వచ్చినప్పుడు సైతం, పౌలు సత్యాన్నే పరిరక్షించడానికి ప్రయత్నించాడు. సత్య సిద్ధాంతాన్ని గూర్చి చాలా భారాన్ని కలిగియుండి, తనపై వ్యక్తిగతంగా జరిగిన దాడుల్ని ఏ మాత్రం లక్ష్యం చేయకుండా అతడు ఎలా ఉండగలిగాడు? ఎలా అంటే, అసలు పౌలు తన గురించి తాను ఏ మాత్రం గొప్పగా ఎంచుకోలేదు. కనుక దేవుని రాజ్య వ్యాప్తిలో తాను కనుమరుగై పోయాడు. దేవుని కార్యాన్ని నెరవేర్చడానికి తానొక ఆహుతి కాదగిన సేవకుడని పౌలుకు తెలుసు. హృదయాన్ని బద్దలు చేసే కష్టాలతో నిరాశ నిస్పృహలతో కూడిన పరిచర్య జీవితం తను పరిశుద్ధతలో ఎదగడానికి దేవుడిచ్చిన కృప అని అతడికి పూర్తిగా తెలుసు. అదీ, అతడు జీవించిన విధానం!

తప్పుడు ఆరోపణల్ని సరిచేయడానికీ, వ్యక్తిగతంగా మనల్ని మనం సమర్థించుకొనే శోధనను ఎదరించడానికీ మధ్య కష్టతరమైన సమతూకం గురించి వివరించమని ప్రజలు నన్ను తరచూ అడుగుతుంటారు. ఇది సులభమైన విషయం కాదు. వ్యక్తిగత దాడుల ననుభవించిన పౌలు సరైన రీతిలో స్పందించేందుకు సహాయపడిన రెండు నియమాలు మనకు కూడా ఈ విషయంలో సహకరిస్తాయి.

 

నాయకులు దేవుని ఉద్దేశాల నెరవేర్పు కోసం పరిచర్య చేస్తారు

మనకు కోపాన్ని కలిగించేదేమిటి? దేవునికి కోపాన్ని కలిగించేదేమిటి? అనే విషయంలో మనం ప్రజల్ని ఎటువంటి అయోమయానికి గురిచేయకూడదు. మనుషులందరూ ఏమి చేసినా అది దేవుని సన్నిధిలోనే చేస్తారు. ఈ వాస్తవాన్ని అన్యాయంగా మనపై చేసిన విమర్శమూలంగా కలిగిన బాధ, దుఃఖం కనుమరుగు చేయకూడదు (హెబ్రీ 4:13;). కొన్ని అబద్ధాలపైన ఆధారపడి మన నాయకత్వంపై చేసిన విమర్శలు మనల్ని వ్యక్తిగతంగా గాయపరుస్తాయి, మనసుకు చేదుగా ఉంటాయి. అయితే మన భక్తి మాత్రం మనల్ని పరిచర్యకు పిలుచుకున్న వాని స్వభావ మహిమలకు అనుగుణంగా ఉండాలి. దేవుని నామాన్నీ, ఆయన స్వభావాన్ని ప్రజలు ప్రాముఖ్యత లేనివిగా ఎంచినపుడు మనం ఆగ్రహించాలి. అయితే వారు మనపైనా, మన పరిచర్యపైనా దాడిచేసినపుడు సమస్యను దేవుని కప్పగించాలి. ఆయన తన మహిమా ప్రభావాల్ని కనబరచు నిమిత్తం తగిన సమయంలో ప్రతీ విషయాన్ని వెలుగులోనికి తీసుకొస్తాడు (మత్తయి. 10:26;; 1 కొరింథీ 4:5;). మనం ఆయన ఉద్దేశాల్ని నెరవేర్చడానికి పరిచర్య చేస్తున్నాం. తన సేవకులపై జరిగే దాడులు కూడా ఆయన ఉద్దేశాల్లో భాగమే. నాయకుల వ్యక్తిగత స్వభావాలపైన ప్రజలు క్రూరమైన దాడులు చేస్తారు, వారి నిర్ణయాల్ని విమర్శిస్తారు, వారి వెనుక వారి గురించి చెడ్డగా మాట్లాడతారు, వారి ప్రేమను అలుసుగా తీసుకుంటారు. 13 అయితే ఇవేమీ మనం దేవునికి కోపం కలిగించేవిగా మనల్ని ఉసిగొల్పకూడదు. ఇతరులు మనపై వ్యక్తిగతంగా చేసిన దాడుల్ని బట్టి మనం ప్రతిదాడికి దిగితే అది మన గౌరవాన్ని మంటగలిపి, మన హృదయాల్లో ద్వేషాన్ని పోగుచేసు కోవడానికి కారణమౌతుంది. 'అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి.... కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియు లేదు (1 కొరింథీ 3:5,7).

మన వ్యక్తిగత పేరు ప్రఖ్యాతులపై జరిగిన దాడికి ప్రతిదాడి చేస్తే అది ప్రజల గమనాన్ని దేవుని అధికార మహిమలపైకి కాక మనపైకి మళ్లిస్తుంది. విమర్శకుల్ని సవాలు చేయాల్సింది ప్రజలు మన కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగించినపుడు కాదు దేవుని నామానికి అవమానం తీసుకొచ్చినప్పుడు. అందుచేతనే తనపై వ్యక్తిగతంగా క్రూరమైన దాడులు జరిగినప్పటికీ పౌలు దేవుని సేవకునిగా తన పాత్రను మాత్రమే కొరింథీ 2వ పత్రికలో సమర్థించుకున్నాడు. పౌలు తన నిజాయితీని సమర్థించు కున్నప్పుడు తన విమర్శకులకు వ్యతిరేకంగా వ్యక్తిగతమైన పగతో ప్రతిదాడి చేయలేదు కానీ తన నిజాయితీనీ, పరిచర్యనూ దేవుని ప్రమాణాల కనుగుణంగా కఠినంగా పరీక్షించడానికి సాహసించాడు. తన పరిచర్యను అతడు సమర్థించుకున్న విధానాన్ని చదివినపుడు, తన్ను తాను సత్యవంతునిగా కనపరచుకున్న దాఖలాలే కనబడవు." శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బల యందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములోను జాగరముల లోను ఉపవాసములోను మిగుల ఓర్పుగలవారమై, పవిత్రతతోను జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను పరిశుద్దాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి, ఘనతా ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమైయుండి అన్ని స్థితులలోమమ్మునుమేమేమెప్పించుకొనుచున్నాము.మేముమోసగాండ్రమైనట్లుండియుసత్యవంతులము,తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము, చనిపోవుచున్న వారమై నట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము, శిక్షింపబడినవారమైనట్లుండియు చంప బడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము, దరిద్రులమై నట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమియు లేనివారమై నట్లుండియు సమస్తమును కలిగినవారము "(2 కొరింథీ 6:4-10).

పౌలు తన శ్రమల బాధల్నీ, తనపై జరిగిన దాడుల్నీ పట్టించుకోలేదు, గాని జీవంగల దేవుని సేవకునిగా తన ప్రాణాన్నీ, పరిచర్యనూ ఇతరులకు అర్పించాడు. తన అపొస్తలత్వాన్ని సమర్ధించుకోవడానికి పౌలు తన రెండవ పత్రికను కొరింథీయులకు రాసినప్పటికీ, తన్ను తాను గొప్పవానిగా పరిగణించుకోలేదు (2 కొరింథీ 12:2;`). ప్రభువు ఇష్టపడిన దానిపైనే పౌలు తన మనసును ఉంచాడు.

 

నాయకులు దేవుని ఉద్దేశాల నుంచి నేర్చుకోగలరు

విమర్శను మన భక్తిలో ఎదుగుదలకూ, మార్పుకూ సాధానంగా మనం చూడాలి. విమర్శ నెదుర్కున్నప్పుడు మనకు అనేకమైన శోధనలు కలుగుతాయి. (1) గౌరవం కోల్పోతామనే భయం కలుగుతుంది. (2) మనపై వచ్చిన ఆరోపణల సమాచారాన్ని సవాలు చేయడానికి కారణాలు వెదుకుతాం. (3) ఆ ప్రక్రియలో దోషాల్ని కనిపెడతాం. (4) ఎదుటి వ్యక్తిలోని బలహీనతను వేలెత్తి చూపిస్తాం. (5) మన సామర్థ్యాల్ని గుర్తించి గౌరవించాలని డిమాండ్ చేస్తాం. (6) ఇతరులు చేసే అన్యాయమైన ఫిర్యాదుల్ని తట్టుకోలేక పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. అయితే విమర్శలేమి రాకూడదన్నట్లు వాటికి దూరంగా పారిపోతే ప్రజల్ని మరింత ప్రభావితం చేయడానికీ, నాయకత్వ బాధ్యత నిర్వర్తించడానికి, మరింత భక్తిగా మారడానికి దేవుడేర్పరచిన మార్గాన్నే మనం కాలదన్నుకుంటాము. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గాలని సొలొమోను చెప్పాడు (సామెతలు 6:23;). కనుక విమర్శను మన ఆత్మీయాభివృద్ధికై ఉపయోగించుకోవాలి. మన బలహీనతనూ, పొరపాటునూ ఒప్పుకుంటే ఇతరులు మనల్ని గౌరవించరని మనం అతిగా భయపడుతుంటాం. అయితే అది నిజం కాదు. మన బలహీనతల్నీ, పొరపాట్లనూ ఒప్పుకొంటేనే ప్రజలు మనల్ని గౌరవిస్తారు. మనల్ని మనం సమర్థించుకోవడం మన నాయకత్వాన్నుంచి గౌరవ మర్యాదల్ని హరించివేసే ప్రవర్తన. ఇతరుల మన్ననలను పొందలేమనే భయం గురించి బార్జ్ మన్ ఇలా రాసాడు. “తన్ను తాను ఎల్లప్పుడూ సమర్థించుకొనే దైవజనునిలో ఏదో తిరకాసుంది. ఎవరైనా ప్రశ్నలు లేవనెత్తినా, గద్దించినా తన్ను తాను సమర్థించుకొనే రక్షణ వలయాలు పైకి లేస్తే అది అతని గౌరవాన్ని క్షీణించిపోయేలా చేస్తుంది. 'నేను మీతో విభేదిస్తున్నాను, నేను మీరు చేసే దానిని విమర్శించాల్సొస్తుంది' అని ఎవరైనా చెప్పినప్పుడు మన భక్తి అనే ఖడ్గానికి కలిగే పదును మన కవసరం (సామెతలు 27:17; చూడండి). నిజానికి గర్వమనే శోధనకూ మనుష్యుల భయానికి లొంగిపోకుండా, మన ప్రయోజనార్థం కొన్ని పాఠాల్ని బోధించడానికి ప్రతీ విమర్శనూ ప్రభువు మన కోసం ఏర్పరచిన బహుమానమని మనం భావించాలి.

విమర్శలు మనల్ని ప్రార్థనకు నడిపిస్తాయి. ఇతరులు చేసే విమర్శల భారం క్రింద నలిగిపోతున్నప్పుడు అది మనల్ని మరింత ఎక్కువగా దేవునిపై ఆధార పడడానికి కారణమౌతుంది. మన హృదయాల్ని భద్రపరచుకోవడానికి ప్రతీ విషయాన్ని ప్రభువు దగ్గరకు తీసుకెళ్లేలా విమర్శలు మనల్ని బలవంతం చేస్తాయి (ఫిలిప్పీ 4:6;). విమర్శలు

మనల్ని లేఖనాల వైపుకు నడిపిస్తాయి. పరిస్థితుల్ని స్పష్టంగా గ్రహించడం కోసం, జ్ఞానం కోసం మనం దేవుని వాక్యాన్ని పరిశోధించేలా విమర్శలు మనల్ని నిర్బంధిస్తాయి (కీర్తన 119:98-100;; సామెతలు 3:5-6;; 2 తిమోతి 3:16-17;).

విమర్శలు మన భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని మెరుగుపరచుకొనేలా చేస్తాయి. మనం నమ్మే దానిని స్పష్టమైన పదజాలంతో అతి శ్రద్ధగా పునరుచ్ఛరించడం వలన మనకు ప్రయోజనం చేకూరుతుంది (ఎఫెసీ 4:29;; కొలస్సీ 4:6;).

విమర్శలు మన హృదయాల్ని పరీక్షించుకొనేలా మనల్ని బచేయాల్సిన కార్యమొకటి అతనికుంది, ఆ కార్యాన్నుంచి అతథేమీ అడ్డగించలేక పోయింది.” నేను వెంటనే బలం పొందాను. సాధ్యమైనన్ని మార్గాల్లో మన దృష్టిని పరిచర్య నుంచి మళ్లించడం సాతాను గాడికిష్టం, అలా మన దృష్టి మళ్లిస్తే మనం ముఖ్యమైన విషయాల్ని ముఖ్యమైనవిగా చేయడం మరచిపోతాం. మూర్ఖుని నోటినుంచి విమర్శ వస్తే చిన్నవైన, అనవసరమైన అంశాల గురించి వాదన పెట్టుకొనే స్థాయికి మనం దిగిపోకూడదు. సామెతల గ్రంథలో రెండు వింతైన నియమాల్ని వెనువెంటనే సొలొమోను రాసాడు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము ఇచ్చిన యెడల నీవును వాని పోలియుందువు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము. ఆలాగు చేయని యెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానియనుకొనును. పరస్పరం విరుద్దంగా కనబడుచున్న పై వచనాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? రెండు వచనాల్లోనూ మూర్ఖుని మాటలూ, చేతలూ కనబడుచున్నాయి. రెండు వచనాలూ మనం స్పందనకు తగిన ఫలితాలుంటాయని చెబుతున్నాయి. 4వ వచనం ప్రకారం మూర్ఖుని మాటలను క్రియలను పోలినట్లే మనం సమాధానం చెబితే, మూర్ఖుడులాంటి ప్రవర్తననే మనం అవలంబించి నట్లవుతుంది. అయితే మూర్ఖుని అజ్ఞానాన్ని బట్టీ, గర్వాన్ని బట్టి అతన్ని సవాలు చేసే మాటలతో క్రియలతో అతనికి సమాధానమిస్తే, అతని జీవితంలోకి సత్యాన్ని జ్ఞానాన్ని తీసుకెళ్ళిన వ్యక్తులమవుతామని 5వ వచనం తెలియజేస్తుంది. మూర్ఖుడు చేసే విమర్శకు ఇదెలా వర్తిస్తుంది? విమర్శలు మనుష్యులు మూర్ఖతలోంచి వస్తున్నాయా? లేదా వారి జ్ఞానం మూలంగా వస్తున్నాయా? అనే విషయాన్ని మనం వివేచించాలని ఈ వచనాలు మనకు బోధిస్తున్నాయి. మూర్ఖుడు చేసే విమర్శల్లో ఈ క్రింది సూచనలు కనబడతాయి. * దగా, పరుల గుట్టు బయటపెట్టుట, పుకార్లు (సామెతలు 11:13;; 3 యోహాను10;) • ఎవ్వరికీ జవాబుదారీగా ఉండక తప్పించుకొనే స్వభావం. ఆ కలహ స్వభావం, జగడాలు పుట్టించే వైఖరి (సామెతలు 26:20;; సామెతలు 6:19;;సామెతలు 15:18;). లవంతం చేస్తాయి. మన వైఖరినీ, ఉద్దేశాలనూ శ్రద్ధగా పరిశీలించడానికి విమర్శలు కారణమౌతాయి. తద్వారా మన పాపస్థితి మనకు గుర్తొస్తుంది (1 కొరింథీ 4:3-5;; గలతీ 6:4,5;).

విమర్శలు మనలో ఆత్మీయ సహనాన్ని కలిగిస్తాయి. విమర్శకు గురైనపుడు నొప్పిగా ఉండొచ్చు. అయితే మనకున్న బలాబలాల నుంచీ, వనరులనుంచీ మనల్ని స్వతంత్రులనుగా చేసి తన కృపలో తన సామర్థ్యంతో మనల్ని బలవంతుల్ని చేయడానికి విమర్శల్ని దేవుడు వాడుకుంటాడు (యాకోబు 1:2-4;; 2 కొరింథీ 12:7-10;). విమర్శలు మన భక్తిగల సాత్వికాన్ని చూపించడానికి అద్భుతమైన అవకాశాలను ఇస్తాయి. ఇతరులు మనతో చాలా తీవ్రంగా విభేదించినపుడు, మన జీవితాల్లో ప్రభువు యొక్క పవిత్ర పరిచే కృపకు సాత్వికంగా లొంగిపోయే విషయంలో మనం మాదిరిగా ఉండాలి (సామెతలు 9:8-9;; సామెతలు 12:5;).

విమర్శలు దేవుణ్ణి మహిమపరచడానికి గొప్ప అవకాశాలనిస్తాయి. కఠినమైన శ్రమల్ని దేవుని సేవకులు కృపతో సహించినపుడు దేవుడు ఘనతపొందుతాడు, ఆయనకు మహిమ కలుగుతుంది (1 పేతురు 2:20;; 1 పేతురు 3:15-17;).

 

మన బలహీనతను గుర్తించి, నేర్చుకోవాలి

విమర్శకుని దగ్గర మన పొరపాట్లను అంగీకరించడం రుచించే విషయం కాదు. ప్రజలు మన నాయకత్వానికి సరైన రీతిలో స్పందించకపోవడానికి మన లోపాన్నే సాకుగా తరచూ ఉపయోగించుకుంటారు. మనందరం ఎదగాల్సిన అవసరమున్న గొర్రెలమనీ, ప్రభువు యొక్క పవిత్రపరచే కృప మనందరికీ కావాలనీ, ఇతరులు గుర్తించగలిగిన రీతిలో నాయకుడైనా/కాపరియైనా ఎదగాల్సిందేననీ లేఖనాలు బోధిస్తున్నాయి (1 తిమోతి 4:15;). అయినా కొందరి దృష్టిలో మన బలహీనతను ఒప్పుకున్నప్పుడు మన నమ్మకత్వం ఎవ్వరూ బాగుచేయలేని రీతిలో దెబ్బతింటుంది. అయితే మనం యథార్థవంతులమనీ, దేవుడు పిలిచిన వ్యక్తులమనీ, మాదిరిగా ఉంటూ ఆయన మందకు ఉన్న అవసరాలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నామనీ ఎక్కువమంది గ్రహించాలని ఆశపడదాం. * విమర్శలొచ్చినపుడు మన స్పందనే మనం ఇతరులకు చూపే మాదిరి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనల్ని మనం సమర్థించుకొనే వైఖరినీ, గర్వాన్నీ పారద్రోలడానికి ఈ క్రింది నియమాలు సహకరిస్తాయి. విమర్శలోని సత్యాన్ని వెదకి దాన్ని మీ సొంతం చేసుకోండి (కీర్తన 51:4;). నీవు చేసిన పాపమేదైనా ఉంటే, ఆ వ్యక్తి ద్వారా దేవుడు నీ పాపాన్ని బయలుపరచి నందుకు దీనమనస్సుతో, కృతజ్ఞతా భావంతో దేవునిదగ్గర క్షమాపణ కోరుకో (సామెతలు 28:13;;యాకోబు 5:16;).

మీ పాపపు ఒప్పుకోలును బట్టి ప్రజలు మిమ్మల్ని వెంటనే అంగీకరించాలని వారిని డిమాండ్ చేయవద్దు. పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినప్పటికీ, రెండు వర్గాల మధ్య వచ్చిన ఘర్షణ చాలా తీవ్రంగా ఉంటుంది. కనుక అది సులభంగా సమసిపోదు. సంబంధాల్లో వచ్చిన అనైక్యత, తద్వారా కలిగే దుఃఖం నుంచి బయటకు రావడానికి ప్రజలకు కొంత సమయం అవసరం. నీలోని బలహీనతను అంగీకరించగానే కలిగే అవమానం నుంచీ, నీ వైఫల్యం మూలంగా కలిగే పరిణామాల నుంచీ వెంటనే ఇతరులు నిన్ను సంరక్షించాలని నీవు ఆశిస్తావు. ఆ గాయాన్ని స్వస్థపరచే కార్యాన్ని ప్రభువును చేయనివ్వు. ఆయన అన్నివేళలా దీనులకు కృప చూపించును అని నమ్ము (సామెతలు 3:34;; కీర్తన 138:6;; 1 పేతురు 5:6-7;).

ఒకడు చేసిన విమర్శలో నిజం లేకపోతే, అతడా విమర్శను చేయడానికి కారణం ఏమిటో గ్రహించడానికి ప్రయత్నించు. ఎందుకంటే ప్రజలు కొన్ని సార్లు అపార్థాల వలన, తప్పుడు ఊహల వలన, తప్పుడు సమాచారం వలన, ఎవరో చెప్పింది వినడం వలన తప్పుడు అభిప్రాయాల నేర్పరచుకుంటారు. నీవు చేసిన పనుల్లో, పలికిన మాటల్లో వేటి మూలంగా వారు ఆ అభిప్రాయాల కొచ్చారో తెలుసుకుంటే అది మీకందరికీ సహకరిస్తుంది. “మీరు చేసే విమర్శకు ఆధారమేదీ లేదు, అయితే మీరలా ఊహించడానికి కారణమేంటో నేను స్పష్టంగా గ్రహించగలను' అని విమర్శకు నీవు స్పందిస్తే వారిలో ఆ విమర్శ చేయడం వెనుక ఏ దురుద్దేశమూ లేదని నీవు గ్రహించావని వారు భావిస్తారు. * దుష్ట మనస్సుతో విమర్శల బాణాన్ని సంధిస్తే వారి దోషాన్ని త్వరగా పెద్ద మనస్సుతో క్షమించండి, ఆశనిగ్రహాన్ని అభ్యాసం చేయండి, సరైన వైఖరితో చక్కటి పదాల్ని ఎంపిక చేసుకొని స్పందించండి (“దైవభక్తికి తగిన స్పందన” అను అంశాన్ని ఈ విషయంలో స్పష్టత కోసం మరొకసారి చదవండి).

 

మూర్ఖులకు జ్ఞానంతో సమాధానం చెప్పాలి.

దేవుని కార్యాన్ని ధ్వంసం చేస్తే తప్ప సంతృప్తి చెందని వ్యక్తుల నుంచి కొన్నిసార్లు విమర్శలొస్తుంటాయి. నాయకులు ప్రతీ విమర్శకుని నోరు మూయించడానికి ప్రయత్నిస్తూ ప్రతీ పుకారుని వేటాడి, మన పరిచర్యను వ్యతిరేకించే వారితో వాదించడానికి అన్ని సమయాల్లో సిద్ధంగా ఉంటే మన పరిచర్యను ఎన్నటికీ తుదముట్టించలేము. నేను పరిచర్య ప్రారంభించిన తొలిదినాల్లో ఇలాంటి సంఘటనొకటి జరిగింది. ఒకాయన నా నాయకత్వాన్ని బోధనూ తీవ్రంగా వ్యతిరేకించి, నాకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని లేవదీసే ప్రయత్నం చేసాడు. ఆ పరిస్థితిలో నేనేం చేయాలో సలహా ఇవ్వమని పరిచర్యలో అనుభవశాలియైన ఒకయాన్ను అడిగాను. చాలా స్పష్టమైన, బలంగా నా హృదయంలో నాటుకుపోయిన, అత్యంత ప్రోత్సాహకరమైన సలహాను నాకతడు అందించాడు. ఆయన నాతో ఇలా అన్నాడు. “ప్రసంగ వేదిక నీకుంది. కనుక సత్యాన్ని బలంగా ప్రకటించడానికి అవసరమైన అత్యంత గొప్ప అవకాశం నీకున్నట్లే. శక్తివంతమైన ప్రసంగాలు చేయుట కొనసాగించు. తన విమర్శకు లందరితో చర్చలు జరపడం కోసం నెహెమ్యా ఎన్నడూ తాను నిర్మిస్తున్న గోడను విడిచిపెట్టి రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకో. ప్రభువు కోసం చేయాల్సిన కార్యమొకటి అతనికుంది, ఆ కార్యాన్నుంచి అతథేమీ అడ్డగించలేక పోయింది.” నేను వెంటనే బలం పొందాను. సాధ్యమైనన్ని మార్గాల్లో మన దృష్టిని పరిచర్య నుంచి మళ్లించడం సాతాను గాడికిష్టం, అలా మన దృష్టి మళ్లిస్తే మనం ముఖ్యమైన విషయాల్ని ముఖ్యమైనవిగా చేయడం మరచిపోతాం. మూర్ఖుని నోటినుంచి విమర్శ వస్తే చిన్నవైన, అనవసరమైన అంశాల గురించి వాదన పెట్టుకొనే స్థాయికి మనం దిగిపోకూడదు. సామెతల గ్రంథలో రెండు వింతైన నియమాల్ని వెనువెంటనే సొలొమోను రాసాడు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము ఇచ్చిన యెడల నీవును వాని పోలియుందువు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము. ఆలాగు చేయని యెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానియనుకొనును.

పరస్పరం విరుద్దంగా కనబడుచున్న పై వచనాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? రెండు వచనాల్లోనూ మూర్ఖుని మాటలూ, చేతలూ కనబడుచున్నాయి. రెండు వచనాలూ మనం స్పందనకు తగిన ఫలితాలుంటాయని చెబుతున్నాయి. 4వ వచనం ప్రకారం మూర్ఖుని మాటలను క్రియలను పోలినట్లే మనం సమాధానం చెబితే, మూర్ఖుడులాంటి ప్రవర్తననే మనం అవలంబించి నట్లవుతుంది. అయితే మూర్ఖుని అజ్ఞానాన్ని బట్టీ, గర్వాన్ని బట్టి అతన్ని సవాలు చేసే మాటలతో క్రియలతో అతనికి సమాధానమిస్తే, అతని జీవితంలోకి సత్యాన్ని జ్ఞానాన్ని తీసుకెళ్ళిన వ్యక్తులమవుతామని 5వ వచనం తెలియజేస్తుంది. మూర్ఖుడు చేసే విమర్శకు ఇదెలా వర్తిస్తుంది? విమర్శలు మనుష్యులు మూర్ఖతలోంచి వస్తున్నాయా? లేదా వారి జ్ఞానం మూలంగా వస్తున్నాయా? అనే విషయాన్ని మనం వివేచించాలని ఈ వచనాలు మనకు బోధిస్తున్నాయి.

మూర్ఖుడు చేసే విమర్శల్లో ఈ క్రింది సూచనలు కనబడతాయి. * దగా, పరుల గుట్టు బయటపెట్టుట, పుకార్లు (సామెతలు 11:13;; 3 యోహాను10;) • ఎవ్వరికీ జవాబుదారీగా ఉండక తప్పించుకొనే స్వభావం. ఆ కలహ స్వభావం, జగడాలు పుట్టించే వైఖరి (సామెతలు 26:20;; సామెతలు 6:19;; సామెతలు 15:18;).మూర్ఖుని విమర్శకు సంపూర్ణ సత్యంతో తీవ్రమైన హెచ్చరికతో స్పందించాల్సిన అవసరముంది. కేవలం భేదాభిప్రాయాల్ని కలుగచేయాలనుకొనే వారితో వ్యక్తమైన గొడవలూ, వాదాలూ పెట్టుకోవడం సమయం వృధా చేసుకోవడమే. అవివేక తర్కములును, కలహములును... వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుడని నాయకులకూ కాపరులకూ లేఖనాలు కఠినమైన హెచ్చరిక జారీచేస్తున్నాయి. మత బేధములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు (తీతు 3:9-11;).

నాయకులకు విమర్శలనేవి తప్పించుకోలేనివి, బాధాకరమైనవి. మనం ఊహించని సమయంలో, ఊహించని వ్యక్తుల నుంచి అవి రావచ్చు. మనం ఆ విమర్శలకెలా స్పందిస్తామనేదే అద్భుతమైన పరిచర్యకూ గొడవలతో నిండిన పరిచర్యకూ కారణమవుతుంది. ఇతరులు చెప్పే మాటల్ని వినే మన నైపుణ్యానికి పదును పెట్టాలి. ప్రజలు విమర్శల బాణాల్ని మనపైకి సంధించినప్పుడు వ్యక్తిగతంగా గాయపడి పగతీర్చుకొనే వైఖరిని ఎదిరించాలి. దేవుని రాజ్య పనిని నెరవేర్చే బాధ్యత దేవునిదే. మనం మాత్రం ఆయన మహిమనే మన మహోన్నత ఆశయంగా పెట్టుకోవాలి. మన పేరు ప్రతిష్ఠలనూ, మన ఘన కార్యాలనూ విలువగా ఎంచితే, అపుడు విమర్శల్ని మనకు ప్రతికూలమైనవిగా భావించి వాటిని నిరంతరం తప్పించుకొని తిరుగుతాం. అయితే విమర్శలు విశ్వాసి జీవితంలో పవిత్రపరిచే కృపగా పనిచేస్తాయి. ఇతరులు కచ్చితంగా గ్రహించిన దాని నుండీ, పొరపాటున గ్రహించి దాని నుండీ మనం నేర్చుకోవచ్చు.

తండ్రీ, విమర్శలెదుర్కొనే విషయంలో మీ కృపకోసం, మీరిచ్చే బలం కోసం మిమ్మల్ని అర్థిస్తున్నాను. నేను విమర్శ లెదుర్కునపుడు ఒత్తిడికి గురై, దాని మూలంగా కలిగే ప్రయోజనాల నుండి నేను తప్పించుకు తిరుగుతున్నాను. నేను నీ పరిశుద్ధతలో ఎంతో లోతుగా పాలుపొందాలి. ప్రతి విమర్శ ద్వారా నా జీవితంలో పనిచేస్తున్నావనే సత్యంతో నా హృదయాన్ని సవాలు చేయండి. మీరు నన్ను పిలిచి అప్పగించిన పనికి నా దోషాలేలా అడ్డంకిగా ఉన్నాయో నాకు చూపించండి. ఏ విమర్శకు స్పందించాలి? దేనిని లక్ష్యపెట్టకూడదు? అనే విషయాలన్ని స్పష్టంగా చూడడానికి నీ సత్యంలో నన్ను స్థిరపరచండి, ఆమెన్!

 

9. వివాదంలో సంఘాన్ని నడిపించుట

కొరింథులో ఉన్న సంఘానికి తన మొదటి పత్రికను రాస్తూ, “మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. సహోదరులారా, మీరందరు ఏకభావముతోను, ఏక మనస్సుతోను, ఏకాత్మతోను ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొను చున్నాను” అని పౌలు చెప్పాడు. సంఘంలో ఐక్యతకు ఇదే సుస్పష్టమైన నిర్వచనం!

సత్యాన్ని గూర్చిన మన అవగాహనలో ఏకభావం కోసం, మన విధేయతలో ఐక్యత కోసం మనం పనిచేయాలి. “మీరు కక్షలు లేకుండా ఏక మనస్సుతోను, ఏక తాత్పర్యముతోను ఉండాలని' పౌలు చెప్పాడు (1కొరింథీ 1:10;). ఒక్క దానియందే మనస్సుంచుచూ నా సంతోషాన్ని సంపూర్ణము చేయండి” అని ఫిలిప్పీ సంఘంతో చెప్పాడు (ఫిలిప్పీ 2:2;). 'ఏకప్రేమ, ఏకభావం, ఏక మనస్సు, కలిగిన మందను చూస్తే కాపరికి సంపూర్ణమైన ఆనందం అనుభూతి కలుగుతాయి (ఫిలిప్పీ 2:2;). బాధలోనూ, భక్తిలోనూ అలాంటి ఐక్యతను కలిగించే ముఖ్య కారకం ఏది? జవాబు: దీనమనస్సు! ప్రభువైన యేసులా మనం దీనులమై ఉండాలి.

వివాదాన్ని ఆపగలిగే సామర్థ్యముంటే తప్పనిసరిగా మనం వాటిని ఆపడానికి ప్రయత్నించాలి. అన్ని సమయాల్లోనూ అత్యవసర పరిస్థితుల్లో యుద్ధాలు జరగటం పరిపాటి అన్న మాటను మనం అంగీకరించకూడదు. కొన్ని యుద్ధాలు అత్యవసరం, కొన్ని అనవసరం. మనం వాటిని అడ్డుకోగలిగితే, సమాధానపరచడానికి ఉన్న మార్గాలన్నింటిని ఉపయోగించుకుంటూ వాక్యానుసారంగా వాటిని పరిష్కరించాలి. “శక్యమైతే మీ చేతనైనంతమట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి” అని రోమా 12:18 చెబుతున్నది. ఇతరులు చేస్తున్నదాన్ని మనం నియంత్రించలేము. కానీ సంఘ పరిచర్యలోనూ, నాయకత్వంలోనూ తలెత్తే సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మనకుంది. క్రీస్తును ఘనపరిచే విధంగా మనం ఆ పని చేయాలి.

 

ఇది కాపరితో మొదలవుతుంది

గొట్టెల మధ్యనున్న వివాదం కాపరికి నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే పాపాన్నిబట్టి నాయకుల మధ్య కలిగే చీలికలు అత్యంత నాశనకరమైనవి. ప్రజలు ఒకరితో ఒకరు ఐకమత్యంతో ఉండేలా సంఘ కాపరులు వారికి మార్గాన్ని చూపించాలని దేవుడు వారిని పిలుస్తున్నాడు. అయితే పరిణితిలేని నాయకుడు వివాదాన్ని పాపమార్గంలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. అందువల్ల సంఘమంతటినీ దహించేసే అగ్నికణం ఒకటి రగులుకుంటుంది. కొన్నిసార్లు కాపరులు విమర్శను వ్యక్తిగతంగా తీసుకుని, ఆత్మ సంరక్షణ ధోరణిలో పడిపోతారు. వివాదంలోకి నాయకులు మరింత ఒత్తిడినీ వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చినప్పుడు సంఘం బలహీనమవుతుంది. పరిస్థితులు తమకనుకూలంగా జరగనప్పుడు నాయకుల్లో కలిగే జగడమాడే ధోరణి గురించి తన యౌవ్వన శిష్యుడైన తిమోతిని పౌలు హెచ్చరించాడు (2తిమోతి 2:24;).

అయితే కాపరి ఆత్మ సంరక్షణ ధోరణిని ప్రక్కన పెట్టి, తన జీవితాన్ని పరిశుద్ధ పరిచే కృపగా వివాదాన్ని చూడగలిగితే, చీలిపోయిన సహవాసంవల్ల గాయపడిన వారికి చాలా గొప్పగా పరిచర్య చేయగలుగుతాడు. నిజానికి పగ, ప్రతీకారాలు లేని నాయకులు విభజనకు ముఖ్య కారణమైన వారిని సరిచేయడానికి ఉపయోగపడతారు.

సరిగ్గా ఇలాగే పౌలు కొరింథీ సంఘంలోని కక్షల్ని చెల్లాచెదురు చేయగలిగాడు, తద్వారా సంఘంలో పౌలుపైన ద్వేషభావంతో చీలికకు కారణమైన వ్యక్తికి కూడా దయచూపించి కృపకు నిజమైన పాత్రగా మారాడు. “మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని, మీ యెడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవలెనని, నిండు శ్రమతోనూ, మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని” అని పౌలు 2 కొరింథీ 2:4లో చెబుతున్నాడు. కొరింథీ సంఘం ఆ సమయానికి ఒక పెద్ద వివాదం నుంచి బయటపడింది. పౌలు ఆ సంఘాన్ని స్థాపించాడు. తాను ఆ సంఘాన్ని విడిచి పెట్టకముందు వారికి బోధిస్తూ, నాయకుల్ని బలపరస్తూ చాలా సమయాన్ని వారిమధ్య వెచ్చించాడు. అయితే చాలా స్వల్పకాలంలోనే పౌలు పరిచర్యను వ్యతిరేకించినవారు కొరింథీ సంఘంలోకి చొరబడి, పౌలు గురించి పుకార్లు పుట్టించి అతని ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. సంఘాన్ని బలపరుద్దామని అక్కడకు వెళ్ళిన పౌలుకు ఆ సంఘం బలహీనమై కనబడింది. కొన్నాళ్ళు ఆలస్యంగా పౌలు అక్కడకు వెళ్ళివుంటే, వారు అతణ్ణి బయటకు తరిమేసి ఉండేవారు. కొరింథీ పరిచర్య ప్రభావంతో ఇతర సంఘాల్లో పౌలు చేసిన సువార్త పరిచర్యను నాశనం చేయగల ఘోరమైన చీలిక అది.

పౌలు పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగినా, ఆ సంఘంలోని నాయకులు సమాధాన పడుటలో కృషిచేసేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన వ్యక్తిత్వంపై జరిగిన దాడి గురించి పగ పెంచుకోకుండా తన హృదయాన్ని భద్రపరచుకుంటూనే, వారిమధ్య సేవకునిగా తన యథార్థ జీవితాన్ని సమర్థించుకున్నాడు. ఆ చీలికకు ప్రధాన కారణమైన వ్యక్తి పశ్చాత్తాపపడినప్పుడు, వాడితో ఏకీభవించిన వారందరిపై తీవ్రంగా సంఘం విరుచుకు పడకుండా పౌలు అడ్డుకున్నాడు. “ఎవడైనను దుఃఖము కలుగచేసియుండిన యెడల, నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీకందరికి దుఃఖము కలుగచేసియున్నాడు. అట్టివానికి మీలో ఎక్కువమంది వలన కలిగిన యీ శిక్షయే చాలును (2కొరింథీ 2:5-6) సంఘంలో పాటించిన క్రమశిక్షణ పద్ధతి వలన హృదయాలు నొచ్చుకున్నాయి, దైవికమైన దుఃఖం వారిలో కలిగింది. సంబంధాలను పునరుద్ధరించి, ఈ చీలికకు కారణమైన నాయకునికి వ్యతిరేకంగా శత్రుత్వాన్ని కొనసాగించి అతనికి మరింత ఇబ్బందిని కలిగించకుండా సంబంధాలను పునరుద్ధరించాల్సిన కీలక సమయం ఇదే. వారు నిజంగా పశ్చాత్తాపులైతే, వారికి మరింత దుఃఖం కలగకూడదని పౌలు భావించాడు (వ.7)

సంఘం చీలిపోవడం మూలంగా కలిగే బాధతో మనం సంఘాలకు కాపరులుగా పనిచేస్తున్నప్పుడు పౌలు హృదయాన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు. సంఘంలో క్రీస్తుకు ఘనతనివ్వటమే మన ఏకైక గురి కావాలి. దీనికోసం నాయకులు వ్యక్తిగత గాయాలన్నింటినీ ప్రక్కన పెట్టడం చాలా కీలకం. పాస్టర్లు తమను తాము నియంత్రించు కుని, వ్యక్తిగతంగా అనుభవించిన బాధను విస్మరించి, యేసుక్రీస్తు యోగ్యతను ఇతరులకు చూపించినప్పుడు ఐక్యత వర్ధిల్లుతుంది. చాలా సందర్భాల్లో వివాదం సహజ మరణం చెందదు. ఎందుకంటే తమను గాయపరచిన వారిని శిక్షించి, దానికి సంఘనాయకులు జీవం పోస్తుంటారు. కాపరులు అవమానానికి అవమానాన్ని ప్రతిగా చెల్లించినప్పుడు గొట్టెలు వారిని అనుసరిస్తాయి. వ్యక్తిగతంగా ఎంత విమర్శను ఎదుర్కొన్నప్పటికీ, క్రీస్తు ఘనతనూ సువార్త పరిచర్యనూ ముఖ్యమైనదిగా ఎంచటంలో పౌలే మాదిరిగా ఉంటాడు. సమాధాన హృదయంతో ప్రభువును ఘనపరచమని కొరింథీయులను చాలా బలంగా పౌలు బతిమాలాడు. విభజనకు కారణమైన నాయకుడు పౌలును తీవ్రంగా దూషించాడు. అతడు సృష్టించిన పుకార్ల వలన కొరింథీ సంఘస్తులు చాలామంది ప్రభావితమయ్యారు. అయినప్పటికీ తన ప్రభువూ, రక్షకుడూ అయిన వాని గౌరవ ఘనతల గురించే కానీ తన పేరు ప్రతిష్టల గురించి పౌలుకు అస్సలు చింతేలేదు. “కావున వానియెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మీరన్ని విషయములందు విధేయులైయున్నారేమో అని మీ యోగ్యత తెలిసికొనుటకే గదా పూర్వము వ్రాసితిని (2కొరింథీ 2:8-9) అనే మాటల వెనుకున్న ఆత్మీయబలం అలాంటి దీనత్వమే.

అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న పాస్టర్ గారి దగ్గర నేను ఎన్నో సంవత్సరాలు పనిచేశాను. దశాబ్దాలుగా ఆయన నిర్విరామంగా చేస్తున్న ప్రసంగాలనూ, పరిచర్యనూ నేటికి కూడా దుర్బోధకులు తరచూ వక్రీకరిస్తూనే ఉన్నారు. ఆయన ఉద్దేశాలకు తీర్పు తీర్చి, అపహసిస్తూనే ఉన్నారు. అయితే ఈ నమ్మకమైన దైవజనుడు తనపై చేసిన దాడుల్ని క్షమిస్తూనే ఉన్నాడు, ఎవరిపైనా పగ ప్రతీకారాలు పెంచుకోకుండా, తన శత్రువుల్ని దీవించడానికి ప్రయత్నించడం నేను చాలా దగ్గరుండి అనేక సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాను. నాకది చాలా భయాన్ని కలిగిస్తోంది. ఆయన పరిచర్యలోకి స్థిరత్వానికి ఇదే కీలకం. ఎవ్వరూ తనపై బురదచల్లే అవకాశాన్ని ఇవ్వకుండా ఉండడానికి, తనపై జరిగిన వ్యక్తిగత దాడుల్ని అతడు ఎన్నడూ తనలో ఉంచుకోలేదు. పరిచర్య గురించి నేర్చుకొనేవారికి తన విరోధులు యెడల అలాంటి దయ అత్యంత గంభీరమైన పాఠం. దాన్ని ఆస్వాదించే ఆధిక్యత నాకు దక్కింది. శుద్ధమైన మనస్సాక్షి కలిగివుండడం ఎంత ప్రాముఖ్యమో నేను నేర్చుకున్నాను. తీర్పును మించి అతిశయపడే కనికరం గురించి నేను నేర్చుకున్నాను (మీకా 6:8;; యాకోబు 2:13;). వివాదాలు నాశనకరమైన పరిణామాలు కలిగిస్తాయి. వాటినుంచి పారిపోవాలని కాపరులు ఇతరులకు సలహాలిస్తారు. కాపరులు తామిచ్చిన సలహాలను తామే పాటించి తమ హృదయాలను భద్రపరచుకుంటే వివాదాలు చాలా తొందరగా, సులభంగా తొలగిపోతాయి.

అయితే వివాదమనేది తప్పించుకోలేనిది. కలతలు, సంఘంలో చీలికలు, నాయకుల మధ్య తీవ్రమైన అనైక్యతలు లేని పరిచర్య జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం మీరు చేయవచ్చు. కానీ సువార్త మూలంగా ఒకచోట సమకూడే పాపులున్న చోట తప్పనిసరిగా వివాదం ఉంటుంది. హృదయమనే నేలలో వివిధ తగాదాలనే విత్తనాలను నాటినప్పుడు పెరిగేది వివాదమనే మొక్క. ఇందులో చాలా రకాల విత్తనాలు మన నియంత్రణలో ఉండవు. కాబట్టి సువార్త దుష్టత్వంతో తలపడినప్పుడు వివాదం తప్పనిసరిగా అనివార్యమవుతుంది. మనం అణిచివేయగలిగిన, అణిచివేయాల్సిన వివాదాలు ఉన్నాయి. ఇతరులకు వ్యతిరేకంగా మనం చేసే పాపంతో సంబంధంలేని చీలికలు కూడా ఉంటాయి. మనం ఆత్మీయంగా పరిణితి గలవారమని నిరూపించడానికి, నమ్మకమైన విశ్వాసులకూ, విశ్వాసభ్రష్టులకూ మధ్య స్పష్టమైన తారతమ్యాన్ని చూపడానికి మనం వీటిని ఎదుర్కోవాలి (1కొరింథీ 11:19;). తప్పించుకోలేని వివాదం రెండు రకాల నేలలనుంచి పెరుగుతుంది. 

 

                మొదటి రకం :

అపవాది చేసే దాడి, మానవుల మధ్య తారతమ్యాలు.

             

              అపవాది చేసే దాడి

మనం ఒకరినొకరం కరుచుకుని, భక్షించుకోవాలని అపవాది కోరతాడు (గలతీ 5:15;). చీలికలనే అడవిని పెంచడం కోసం తన దగ్గరున్న ప్రతి దుష్టమైన ఎరువును వాడు ఉపయోగించుకుంటాడు. మొదటిగా మోసాన్నీ, అనైక్యతనూ, కుతంత్రాన్ని సంఘంలో ప్రవేశపెట్టడానికి పన్నాగం పన్నుతాడు. సంఘ ఆరంభంలోనే అననీయ సప్పీరాలు పరిశుద్దాత్మకు అబద్దం చెప్పేలా వారి హృదయాలను ప్రేరేపించి, దేవుని ప్రజల్ని మోసగించేలా అపవాది చేసిన పనిని అపొ.కా. 5:3 వివరిస్తున్నది. వంచకులైన తన సేవకులను నమ్మకమైన వారిగా చూపించి సంఘాన్ని మింగేయడానికి అపవాది వస్తాడని 2కొరింథీ 11:14-15; మనల్ని హెచ్చరిస్తున్నది. తమను తాము వెలుగు దూతలుగా వారు కనబరుచుకుంటారు. “మీ విరోధియైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడని” పేతురు మనతో చెబుతున్నాడు (1 పేతురు 5:8).

రెండవదిగా, దేవుని ప్రజల్ని మోసగించడానికి వారందరి చుట్టూ క్రీస్తు విరోధి ఆత్మను విస్తరింపచేస్తాడు. “మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి” అని చెబుతూ, క్రీస్తు విరోధి ఆత్మకు వెనకున్నది సాతాను అని ఎఫెసీ 2:2 బోధిస్తున్నది. ఆ ఆత్మయే నిరంతరం సంఘంపై దాడిచేస్తూ, తరచూ నాయకత్వంలోకి చొరబడుచున్నది.

మూడవదిగా, సంఘాన్ని విడదీయడానికి అబద్ధ నాయకులు తమ పలుకుబడినీ, ఆధిపత్యాన్ని ఉపయోగించుకుంటారు. “నేను వెళ్ళిన తరువాత క్రూరమైన తోడేళ్లు ప్రవేశించునని నాకు తెలుసు. వారు మందను కనికరించరు మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకరమాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలు దేరుదురు” అని ఎఫెసీ సంఘ పెద్దలతో పౌలు చెబుతున్నాడు (అపొ.కా. 20:29-30).

నాలుగవదిగా, లోకపు ద్వేషం సంఘానికి శ్రమ కలిగిస్తుంది. యేసు తన శిష్యుల్ని లోకం నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వారిని లోకం ద్వేషిస్తుందని యోహాను 15:18-19; లో ఆయన తన శిష్యులకు చెప్పాడు. లోకం క్రీస్తును మొదటిగా ద్వేషించింది కాబట్టి అది క్రీస్తు ప్రజల్ని కూడా ద్వేషిస్తుంది. పౌలు బర్నబాలు శిష్యుల మనస్సులను దృఢపరచి - విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించారు. (అపొ.కా 14:22). అనేక శ్రమలను అనుభవించాలా? ఈ వాక్యభాగాన్ని ఎవరైనా తమ జీవితాలకు అతిముఖ్యమైన వాక్యభాగంగా చేసుకున్నారా? చాలామంది చేసుకోరు. అయినా 2 తిమోతి 3:12లో "క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరికీ శ్రమలు కలుగును” అని పౌలు రాస్తున్నాడు.

 

మానవుల మధ్య తారతమ్యాలు

సంఘనాయకుల మధ్య సహజంగా ఉండే తారతమ్యాల్లోనే కొన్ని వివాదాలకు బీజం ఏర్పడుతుంది. మన మధ్యనున్న బేధాలు నిరుపయోగకరంగానే ఉంటాయి. కాని మనం పరిచర్యను చేసే విధానాన్ని, సంఘానికి పరిచర్య చేయడానికి మనం తీసుకునే నిర్ణయాలను అవి ఎంతగానో ప్రభావితం చేస్తాయి. దేవుడు మనల్ని భిన్నంగా చేశాడు. పరిచర్య అద్భుతమైన సాహసంతో కూడినది కావడానికి ఆ భిన్నత్వమే కారణం. సృష్టి అంతటిపైనా యజమానుడైన దేవుని చేతికార్యమిది అని నా అభిప్రాయం. మనందరం భిన్నమైన కుటుంబ నేపథ్యాలనుంచి వచ్చాం, జీవితాన్ని ఒక్కొక్కరం ఒక్కొక్క కోణంలో చూస్తాం, పరిచర్యలోని కొన్ని అంశాల్ని చాలా ఉద్వేగపూరితంగా చూస్తాం. ఇతర అంశాల్ని పెద్దగా పట్టించుకోము. పరిచర్యకు పెద్దల్ని పిలిచి, దానికి తగిన వరాల్ని ఇచ్చేది దేవుడే! అయితే పరిచర్యలోని నిర్ణయాలను బేరీజు వేయడానికి మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన మనస్తత్వాన్ని ఆయన ఇస్తాడు. పెద్దలు తమలో ఉన్న భిన్నమైన మనస్తత్వాలను అర్థం చేసుకోగలిగితే సంఘాన్ని అద్భుతంగా సేవించ గలుగుతారు. పాస్టర్లకూ, నాయకులకూ ఒకరి ఆలోచనా విధానం మరొకరికి తెలిస్తే, ఒకరిలో వైవిధ్యాన్ని మరొకరు ఆస్వాదిస్తే, ప్రేమతో ఒకరినొకరు విబేధించుకోగలిగితే సాత్వికం కలిగి ఉంటే నాయకత్వంలో వివాదాలు చాలామట్టుకు సద్దుమణిగిపోతాయని నా నమ్మకం.

 

పరిచర్యలోని అపరిపక్వత

నాయకత్వ బృందాలు చాలా చమత్కారంగా ఉంటాయి. నాయకుల్లో ఉండే సామాన్యమైన వైవిధ్యం మూలంగానే వివాదాలు పుట్టుకొస్తాయని నేనెంతో కాలంగా గమనిస్తూ వస్తున్నాను.

మొదటి వైవిధ్యం, పరిచర్యలో అపరిపక్వత. పాస్టర్లు ఆత్మీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మనం పరిణితిచెందే వరకు, పరిణితిలేని మన ఆలోచనా విధానం వివాదాలను రగిలిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు, కొన్ని కీలకమైన సిద్ధాంతాల విషయంలో నాయకులకు కేవలం ప్రాథమిక అవగాహన మాత్రమే ఉంటుంది. ఫలితంగా వారికి బైబిల్ గురించి తెలియాల్సినంతగా తెలియదు. మనం సరిగ్గా తెలుసుకోని, చక్కగా ధ్యానించని లేఖనం గురించీ, వేదాంతం గురించి మనల్ని ప్రజలు ప్రశ్నలడిగినప్పుడు ఈ పరిపక్వతనుంచే వివాదం తలెత్తుతుంది. ఇలాంటి సందర్భాల్లో లేఖనం నుంచి సంగ్రహించిన నియమాలను కాక, లోక ప్రమాణంతో జవాబులు చెబుతాము. బైబిల్ నిరక్షరాస్యత వలన వేదాంత అజ్ఞానం వలన నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత ఉండదు. వాక్యనియమాలను వ్యక్తిగత అభిరుచుల నుంచి వేరు చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. దేవుని వాక్యం ఏలాంటి స్పష్టతా ఇవ్వని అంశం విషయంలో మనం దేవుని అధికారాన్ని సహాయంగా కోరతాం. మనం ఎన్నడూ లోతుగా అధ్యయనం చేయనటువంటి సిద్ధాంతాన్ని మనం వ్యక్తిగతంగా సమర్థించలేని బోధను చాలా మొండిగా విడిచిపెట్టడానికి ఒప్పుకోము. నాయకత్వ స్థాయిలో వివాదాలన్నింటికీ ఆరంభం లేఖనం గురించి స్పష్టత లేకపోవడం వలన ఏర్పడిన అపరిపక్వతలోనే ఉంటుంది.

ఆత్మీయ పాఠాల్ని అభ్యాసం చేయకపోవడం వలన కూడా పరిచర్యలో సమస్యలు ఎదురవుతాయి. యవ్వన నాయకులు తమ నాయకత్వ బాధ్యతను సీరియస్ గా తీసుకోవడానికి వారిని ఆత్మీయ పాఠాల్ని క్రమశిక్షణతో నేర్చుకోవాలని, వాటి గురించి శ్రమలను ఎదుర్కోవడానికైనా సిద్ధపడాలని మనం ఆశిస్తాం. అయితే కొన్నిసార్లు క్రీస్తుతో తమ నడకలో కొన్ని కీలకమైన ఆత్మీయ పాఠాల్ని ఎన్నడూ అభ్యసించనివారిలో అపారమైన అనుభవజ్ఞులే ఉంటారు. మిగతా అన్ని విషయాల్లో వారు భక్తిగా, వివేచన తోనే ఉంటారు కానీ వారి వాక్య వివేచన చాలా అల్పంగా ఉంటుంది. నాయకత్వంలో కొన్ని నిర్ణయాలను తీసుకోవడం పలు సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితుల్లోకి మనల్ని నెట్టేస్తాయి. అందుచేత అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేఖనాలను అర్థవంతంగా అన్వయించడం అత్యవసరం. ఆత్మీయ విషయాల్లో క్రమశిక్షణ లేని పాస్టరు సున్నితమైన విషయాల్లో సత్యాన్ని జ్ఞానయుక్తంగా అన్వయించే అవగాహన ఉండదు. వాక్యాన్ని క్రమశిక్షణతో సాధన చేయడంవలన లేఖనాన్ని నేర్పుతో అన్వయించగలిగే జ్ఞానం వస్తుంది. (హెబ్రీ 5:14;). ఆ జ్ఞానం లేకపోతే సమస్య పరిష్కారంలోకి మరింత అపరిపక్వతను తీసుకువస్తారు. నాయకత్వంలోని వారిని విసిగిస్తారు. అప్పుడు వివాదాలు మరింత ఉదృతమవుతాయి.

తెగువ లేకపోవడమే పరిచర్యలోని అపరిపక్వతకు మరొక కారణం. సాహసం చేయలేని వారికి తమ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికీ, ఆత్మీయ సహనాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైన పరిచర్య అనుభవం ఉండదు (యాకోబు 1:2-4). శ్రమ కలిగినప్పుడు వారు ప్రభువును నమ్మాల్సినంతగా నమ్మరు. విశ్వాసం పరీక్షించబడాలి. వారి విశ్వాసం ఇంకా పసితనంలోనే ఉంది, ఇంకా నిరూపించ బడకుండానే ఉంది. పరిచర్య ప్రయాణంలో ఎదురయ్యే గాఢాంధకారపు లోయల్లో ప్రభువు విశ్వాస్యతను చూడడంవల్ల పరిస్థితులన్ని మనకు ప్రతికూలంగా జరుగు తున్నప్పుడు దేవుని నమ్మడం మూలంగా మనలో సాహసించే తెగువ వస్తుంది. క్రీస్తు నిమిత్తం (ఎఫెసీ 6:10;) ఒంటరిగా నిలబడటమనే, ఆయన మహాశక్తిలో బలం పొందటమనే అగ్నిజ్వాలల్లోనే ఆత్మీయ తెగువ అనే లక్షణం రూపుదిద్దుకుంటుంది. జీతగాళ్ళలా పారిపోకుండా తన గొట్టెల కోసం గొప్ప కాపరి ప్రాణం పెడతాడు (యోహాను 10:12-15;). పరిచర్యను ఆ గొప్పకాపరి కళ్ళతో చూసినప్పుడు మనకు సహనమనే గుణం అలవడుతుంది. నాయకత్వ బాధ్యత డిమాండ్ చేసే వెల చాలా ఎక్కువ కావడం వలన తమ బాధ్యతనుంచి తొలగిపోతూ నాయకత్వ బృందానికి ఇవ్వాల్సిన మద్దతును ఉపసంహరించుకున్నప్పుడు వివాదం కలుగుతుంది. పరిచర్యలో ఎదురయ్యే కష్టాల్లో ప్రభువును నమ్మే అనుభవాన్ని వారు పొందాల్సి ఉంది.

పరిచర్యలో ఇబ్బందులు ఎదురవడానికి మరొక కారణం సంబంధాలను కొనసాగించడంలో నేర్పరితనం లేకపోవడమే. పలురకాలైన నేపధ్యాలున్న ప్రజలతో దయతో జాగ్రత్తతో నడుచుకొనే సామర్థ్యం సమతుల్యమైన నాయకత్వానికి అత్యవసరం. అయితే క్రీస్తు శరీరంలో ఉన్న వైవిధ్యపు విలువను ఆస్వాదించడానికి, అర్ధం చేసుకో వడానికి కొందరు పాస్టర్లు అస్సలు ప్రయత్నించటం లేదు. ఇతరుల అవసరాలకూ, అభిరుచులకు తగినట్లు మనం సర్దుబాటు చేసుకోవడం వారికి కోపం పుట్టిస్తుంది. ఒక బృందంగా పనిచేస్తున్నప్పుడు ప్రజలను అభినందించడానికీ, సరిచేయడానికీ వారి బలాబలాలను గురించి తెలుసుకునే నైపుణ్యాన్ని ఎన్నడూ అభివృద్ధి చేసుకోక పోవడం వలన నిజానికి చాలామంది నాయకులు గొడవలు సృష్టిస్తుంటారు. తమ లాగానే ఇతరులు ఆలోచించాలనీ, తమలాగానే ఇతరులు సమస్యల్ని పరిష్కరించు కోవాలని వారు ఆశిస్తారు. అలాంటి భిన్నత్వంలో కూడా నాయకత్వ బృందాలు ఐక్యతను కాపాడాలి. సంఘ పెద్దలంతా ఒకే జట్టు. సంఘానికి సేవచేయడానికి దేవుడు పిలుచుకున్న నాయకుల బృందం అది. వారు విభిన్నమైన వ్యక్తిత్వాలు గలవారైనప్పటికీ, వారు సేవించే ప్రభువు ఒక్కడే. వారు అనుసరించే గ్రంథం ఒక్కటే!

వివాదాలు తలెత్తడానికి మరొక వింతైన, సాధారణమైన కారణం. "వ్యక్తులకుండే విలక్షణమైన వ్యక్తిత్వాలు”. దేవుడు మనలో ఒక్కొక్కరిని ఒక్కోవిధంగా సృష్టించాడు. కొందరు ఆశావాదులు, మరికొందరు నిరాశావాదులు. ఆశావాదులు వాస్తవాలకు అతీతంగా ఆలోచిస్తుంటారని నిరాశవాదులు వ్యతిరేస్తుంటారు. ఫిర్యాదు చేయడమే నిరాశావాదుల వైఖరి అని ఆశావాదులూ చెబుతుంటారు. నాయకత్వ బృందాల్లో కూడా ఇలాంటి వ్యక్తిత్వాలున్న వారుంటారు. కాబట్టి వివాదాలు ఒక్కొక్కసారి తారస్థాయికి చేరుకుంటాయి. ముఖ్యంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఆశావాదులు, నిరాశావాదులు కూడా తామే చక్కటి సమతుల్యత కలిగి, నిబ్బరంతో వ్వవహరిస్తామని భావిస్తుంటారు. తన ఆలోచనలు వాస్తవాలకు దగ్గరగా ఉంటాయి కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో జ్ఞానయుక్తంగా వ్యవహరించేది తానేనని నిరాశావాది యైన నాయకుడు భావిస్తాడు. అయితే నిరీక్షణతో కూడిన తన వైఖరి గొప్ప విశ్వాసానికి ప్రతీక కాబట్టి, తనకే శ్రేష్టమైన వివేచన ఉందని ఆశావాదియైన నాయకుడు ఆలోచిస్తుంటాడు.

కొద్దిమంది నాయకులది కళాపోషణ, ఉద్వేగాలు కలగలిపిన వ్యక్తిత్వం. మరి కొంతమందిది శాస్త్ర సాంకేతికతకు విలువనిచ్చే మనస్సు. శాస్త్ర సాంకేతికతకు విలువ నిచ్చేవారు గొళ్లెల్ని కాచే పనిని ఒక గణిత సమీకరణంగా చేసి, గొట్టెల పరిశుద్ధతను అంచనా వేస్తుంటారని మొదటి గుంపు విమర్శిస్తారు. భావోద్వేగాలను నియంత్రించు కోలేని ఆటవికులే మొదటి గుంపు అని శాస్త్ర సాంకేతికతకు విలువనిచ్చే రెండవ నాయక బృందంవారు అభిప్రాయపడుతుంటారు.

నాయకుల్లో ఒకరికి కనికరం గల మనస్సుంటే, మరొకరికి రాజీపడకుండా గంభీరంగా వ్యవహరించే వైఖరి ఉంటుంది. ఇతరుల యెడల జాలిపడకుండా, రాజీపడకుండా గంభీరంగా ఉండే నాయకుల్లో ప్రేమ లేదని కనికరం గల మనసున్న నాయకుడు వాదిస్తుంటాడు. అయితే కనికరం గల మనస్సున్నవాళ్ళు భావోద్వేగ పూరితమైన వ్యక్తులనీ బలహీనులనీ గంభీర మనస్కులు విమర్శిస్తుంటారు.

మరొక వింతైన జాబితా కూడా ఉంది. అనవసరమైన ఖర్చులకు వెనుకాడే వ్యక్తిత్వం, ధారాళంగా ఖర్చు పెట్టే మనస్తత్వం. ధారాళంగా ఖర్చుపెట్టే మనస్తత్వమున్న వారు బాధ్యతలేకుండా వ్యవహరిస్తారనీ, దేవుడు అనుగ్రహించిన వనరులకు మంచి గృహనిర్వాహకులుగా పనిచేయరనీ మొదటి గుంపు ఆక్షేపిస్తారు. పిసినారులనీ, విశ్వాసం లేనివారనీ రెండవ బృందం అనవసరమైన ఖర్చులు చేయనివారిని పరిగణిస్తుంది.

ఇన్ని భిన్నమైన వ్యక్తిత్వాలు నాయకత్వ బృందంలో ఉంటే వివాదాలు తలెత్తకుండా ఎలా ఉంటాయి? దేవుడు మనలో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చేశాడు. మన వ్యక్తిత్వాల్లో ఉన్న విలక్షణత మూలంగా ఘోరమైన పాపాలు జరగకపోవచ్చు కానీ, నాయకత్వ బృందాల్లో తీవ్రమైన అలజడుల్ని ఒత్తిడిని సృష్టిస్తుంది. తీవ్రంగా విబేధించుకునే గ్రూపులు కూడా ఉంటాయి. ఒకరిది పోట్లాడే వ్యక్తిత్వం, మరొకరిది పారిపోయే మనస్తత్వం. పోరాట తత్వమున్న వ్యక్తి వాదంలో గెలవడం కోసం సంభాషణను రణరంగంగా మార్చేస్తాడు. మరొకరికి మాట్లాడే అవకాశం కానీ, వారి ఆలోచనకు విలువ కానీ ఇవ్వడు. ఎవ్వరి అభిప్రాయం కోసం ఎదురుచూడడు. అయితే పారిపోయే మనస్తత్వ మున్నవారు దేనికోసమూ గొడవపడడు. కాబట్టి రాజీపడే వ్యక్తిత్వంగలవాడని పోరాట తత్వం గలవాడు అతణ్ణి పరిగణిస్తాడు. అయితే తనది సమాధానపరిచే మనస్తత్వమని భావిస్తూ ప్రతి విషయానికి పోరాడే మనసున్నవాడు ఆత్మీయతలేని వాడనీ, గొడవలు సృష్టించేవాడనీ పారిపోయే మనస్తత్వమున్నవాడు అభిప్రాయపడుతుంటాడు. అయితే పోరాటతత్వం కలవాడు తన్నుతాను పరిచర్యకు ద్వారపాలకుడనని పరిగణించు కుంటాడు. ఆఖరి జాబితా, సమస్యల్ని త్వరితంగా పరిష్కరించాలనే వైఖరి కలవాడు, సమస్యలు వాటంతట అవే సమసిపోతాయని భావించే నిర్లక్ష వైఖరి గలవాడు. మొదటివాడు సమస్యను పరిష్కరించేవరకు మనశ్శాంతిగా ఉండలేడు. ఇలాంటి నాయకుడే తన ఇంట్లో సమస్యను పరిష్కరించడానికి తన భార్యతో అర్థరాత్రి 2 గంటల వరకు మాట్లాడుతుంటాడు. ఎలాగైనా సమస్య పరిష్కరించబడాలి లేకపోతే ఆ తర్వాత రోజు అతడు పనిచేయలేదు. అయితే సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేసేవాడు నిర్లక్ష వైఖరి గలవాడు ఒత్తిడి కలుగుతుందనే భయంతో ఆస్టిచ్ తల ఇసుకలో దూర్చేసి కళ్లు మూసుకున్నట్లు ఇతడు కూడా సమస్యను మరచిపోయి తనంతట అదే తొలగి పోతుందని భావిస్తాడు. తన్ను తాను సహనశీలిగా భావిస్తూ, సమస్యల్ని ఎలాగైనా పరిష్కరించాలనుకునే వ్యక్తిని సహనం లేనివాడుగా చూస్తాడు. తన చేతికి మట్టి అంటకుండా, సమస్యను ఎదిరించకుండా పారిపోయే పిరికివాడని మొదటి వ్యక్తి ఇతణ్ణి విమర్శిస్తాడు.

దేవుడు మనల్ని భిన్నరీతుల్లో మలిచినందువల్ల కలిగే ఒత్తిళ్ళు తీవ్రమైన విబేధాలకు కారణం కాకూడదు. చాలాసార్లు నాయకులు ఇతరుల ఉద్దేశాలను ఊహిస్తూ తొందరగా గాయపడుతుంటారు.

కానీ ఆ గొడవలకూ, వైరుధ్యాలకూ కారణం కేవలం వ్యక్తిత్వాల్లో విలక్షణతే. దేవుడు మనల్ని చేసిన విధానాన్ని మనకిచ్చిన వ్యక్తిత్వాల్నీ గ్రహించడం ప్రారంభించినప్పుడు, మనకు పూర్తి భిన్నంగా ఉన్న వారితోనూ మనం ఐక్యమత్యంతో పనిచేయడానికి చక్కగా సిద్ధపడతాము. దీనికితోడు పరిచర్యలో ఉన్న అనుభవమూ పరిణితీ కూడా వివాదం పెరగడానికి కారణమవుతాయి. ఒకరికి ధైర్యం కొదువగా ఉంటుంది, మరొకరు అన్నివేళల్లోను యుద్ధానికి సై అంటారు. ఒక పెద్ద ఆత్మీయ పాఠాల్ని చక్కగా సాధన చేస్తుంటాడు, మరొకడు వాటిని నెమ్మదిగా నేర్చుకుంటాడు. కొద్దిమంది నాయకులకు ఇతరులతో త్వరగా కలిసిపోయే అలవాటు సహజంగా అబ్బుతుంది. మరొకరు గ్రూపులో కలవడానికి అసౌకర్యంగా భావిస్తాడు. పాపం మూలం గానో, నిర్లక్ష్యంవల్లనో కలిగే బలహీనతలు కావివి. అయితే ఒత్తిళ్ళను రగిలించగల సామర్థ్యమున్న కీలకమైన వైరుధ్యాలవి. వాటి మూలాన్ని అర్థంచేసుకోకపోతే అనవసర మైన అనైక్యత చోటుచేసుకుంటుంది. నాయకత్వ బృందాన్ని బలహీనపరుస్తుంది, తప్పనిసరిగా దేవుని ప్రజల్ని గాయపరుస్తుంది.

 

భిన్నమైన నేపధ్యాలు, చరిత్ర

నాయకుల మధ్య మరొక వైవిధ్యం :

మనం నాయకులుగా పనిచేసే తీరును మన వ్యక్తిగత చరిత్ర, మన నేపథ్యం ప్రభావితం చేస్తాయి. చిన్న చిన్న లోపాలను పెద్దవిగా చేయకుండా అందరితో సర్దుకుపోగలమని మనలో చాలామంది అనుకుంటాము కానీ కొన్ని విషయాల్లో మన అభిప్రాయాలు ఎంత దృఢంగా ఉంటాయో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యేవరకు మనకు అర్థం కాదు. ఉదాహరణకు సంఘంలో సౌకర్యాల విస్తరణకు ధనం అప్పు చేయాలా? వద్దా? అనే మీమాంసలో ఉన్నప్పుడు, సంఘం అప్పు చేయడాన్ని ఒక పెద్ద చాలా తీవ్రంగా వ్యతిరేకించవచ్చు. తన వ్యక్తిగత జీవితంలో డబ్బుకు సంబంధించిన విషయంలో తానెదుర్కొన్న అనుభవించిన పరిస్థితులే తన అభిప్రాయం వెనకున్న చరిత్ర. ఇతరులు భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తుండగా ఆ పెద్ద తన అభిప్రాయాల్ని ఇతరుల మనస్సుల్లోకి తీవ్రంగా చొప్పించేందుకు ప్రసంగం చేయనారంభిస్తాడు. అలాంటి కీలక సమయాల్లో మన వ్యక్తిగత చరిత్ర సమతుల్యతతో నడిపించే మన సామర్థ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో గమనించేలా ఒకరికొకరు సహాయపడాలి.

మనలోంచి ఒక్కసారిగా బయటపడే ఈ భావోద్వేగాల వెనకున్నదేమిటి? అనేక విషయాల్లో చాలా పరిణితి కనపరిచే నాయకుడు వ్యక్తిగత విషయాల్లా కనబడే వాటిపై కఠినుడిగా వ్యవహరించేలా చేసేదేమిటి? కొన్నిసార్లు, మనం ఇంతకుముందు తీసుకున్న శిక్షణే దీనికి కారణం కావచ్చు. ప్రతీ నాయకుడు నాయకత్వ బృందంలోకి పలు అనుభవాలను తీసుకొస్తాడు. మనం అతిగా గౌరవించే గురువుల సందేశాన్ని మనం వింటాం. మన తోటి నాయకులు మన గత బోధకుల అభిప్రాయాలకు భిన్నంగా ప్రవర్తించినా, మాట్లాడినా మనకు శిక్షణనిచ్చిన వారి అభిప్రాయాలను బలంగా సమర్థించే కోరిక మన మాటల తీవ్రతను పెంచుతుందని గమనించకుండానే మనం చాలా ఉద్వేగభరితులమవుతాం. నిజానికి ఆ పరిస్థితిని మనం ఎన్నడూ వ్యక్తిగతంగా ఎదుర్కొని ఉండకపోవచ్చు. అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే వారి తప్పుడు అభిప్రాయాన్ని కూడా సమర్థించేంతగా మన గురువుల్నీ, శిక్షణ నిచ్చినవారినీ గౌరవిస్తాం.

మనకున్న భిన్నమైన నేపధ్యాల్లో మన సంఘ అనుభవం మరొకటి. ఆత్మీయంగా ఆరోగ్యకరమైన పరిచర్యల్లోనే మనం ఎదిగామా? లేదా ఒక వివాదం తర్వాత మరొక వివాదమే సంఘంలో ఉన్నప్పుడు ఎదురయ్యిందా? “నేను గతంలో నమ్మిన నాయకులందరూ ఎన్నోసార్లు నన్ను వంచించారు. ప్రస్తుత సంఘ నాయకత్వ శైలి ఆ చేదు అనుభవాలను స్పందనగా వచ్చినదేనని” ఒక పాస్టర్ గారు చెప్పడం నాకు గుర్తుంది. ప్రస్తుత సంఘ నాయకత్వం, జీవనశైలి గత పరిచర్యల్లో మన అనుభవాల మూలంగా చాలా ఎక్కువగా ప్రభావితం చేయబడతాయి. బహుశా ఒకప్పుడు దీనుడైన నాయకుడు ఇప్పుడు గర్వాంధునిగా మారడం నీవు చూడడం వలన చక్కటి తలాంతులున్న కాపరులనూ, నాయకులనూ చూస్తే మీకు అనుమానం కలిగి ఉండవచ్చు. లేదా మునుపటి సంఘంలో పరిచర్య చేస్తుండగా మీ వనరులూ, శక్తి పూర్తిగా ఖర్చయిపోయి ఉండవచ్చు. అందువల్ల ఇప్పుడు ఇతరుల అవసరాలు తీర్చడానికి వెనకడుగువేస్తు తోటి నాయకులకు ఆ పనిలో ఎదురయ్యే ప్రమాదాల గురించి నిరంతరం హెచ్చరిస్తూ ఉండవచ్చు. గత పరిచర్యల్లో కష్టాలకు మన స్పందనలను అర్థం చేసుకుంటే అది నాయకత్వ బృందంలో చోటుచేసుకునే వివాదాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. నిస్వార్థమైన నిర్ణయాలు తీసుకునే మన సామర్థ్యాన్ని ప్రభావితం చేసే భయాల విషయంలో మనకు అవగాహన ఉండాలి.

గత పరిచర్యల్లో నాయకత్వ పద్ధతి మనల్ని ఎలా ప్రభావితం చేసిందో కూడా మనం ఆలోచించాలి. ఆ సంఘాన్ని పెద్దలే నడిపించేవారా? ఆ పద్ధతి వర్థిల్లిందా? అది సంఘస్థుల పాలనకే కట్టుబడిన పరిచర్యా? కాదా? ఆ సంఘ నాయకత్వ పద్ధతి ఎలాంటి ఒత్తిళ్ళను సృష్టించింది? అన్ని నిర్ణయాలకూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందేనా? ప్రతి నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకోబడేదా? లేదా అధిక సంఖ్యలో పెద్దల ఓటింగ్ ద్వారా తీసుకోబడేదా? మీ సంఘ నేపథ్యం ఎలా ఎంటే అలాంటి నాయకత్వాన్నే మీరు ప్రస్తుతం పరిచర్య చేస్తున్న సేవలో అన్వయిస్తారు. నాయకత్వ పద్ధతి గురించీ, సంఘపాలన గురించీ మీ అభిప్రాయాలు నెమ్మదిగా మారుతాయని గమనించండి. అయితే మన విభిన్న నేపధ్యాలు మనలో చెక్కబడ్డాయనీ, వాటిని మనం తప్పనిసరిగా అనుసరిస్తామని నేను చెప్పట్లేదు కానీ మన వ్యక్తిగత పరిచర్య నేపథ్యం నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఇతరుల్ని నడిపించడంలోనూ మనల్ని ప్రభావితం చేస్తుందని మనం గ్రహించినప్పుడు, సవాళ్ళతో కూడిన పరిస్థితిలో పక్షపాత వైఖరి ఏమైనా కనపరిస్తే దాన్ని మనం గుర్తించగలం.

నాయకులు ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నప్పుడు ఆ పద్ధతుల్ని చూసి నవ్వుకుంటాం. సమతుల్యతతో పనిచేసే విధంగా ప్రోత్సహించుకుంటాం. మనం నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా ఉంటామనీ మన తోటి నాయకులను సరిచేయాల్సి ఉందనీ ఊహల్లో బ్రతకడానికి బదులు, మన పద్ధతుల్ని వాటికి మూల కారణాల్ని ఇతరుల పరిశీలనకు అప్పగించి, వారు మన నాయకత్వ బలాల గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మన తత్వాన్ని మన నాయకత్వ పద్ధతుల్ని నిజంగా తెలుసుకోవడానికి కేవలం ఆత్మపరిశీలన మాత్రమే సరిపోదు. ఇతరులు మన గురించి ఏం అర్థం చేసుకున్నారో అనే దాన్నుంచి కూడా ఎక్కువగా తెలుసుకోవచ్చు. "నేను మారాలనీ నన్ను నేను మార్చుకోవాలని భావిస్తున్నాను. నా పద్ధతుల్నీ, వాటికి మూలకారణాన్ని పరిశీలించుకోవాలనుకుంటున్నాను. క్రీస్తు సేవలో అత్యంత ఉపయోగకరమైన పాత్రగా ఉండాలనుకుంటున్నాను,” అని మీ తోటి సేవకులతో చెప్పడానికి సంసిద్ధులేనా? ఇలాంటి పరిస్థితుల నుంచి ఎదురయ్యే వివాదాలను మనం తప్పించుకోలేకపోయినా సాత్వికంతోనూ, అర్థం చేసుకునే మనస్సుతోనూ, క్రీస్తు ప్రేమతోనూ వ్యవహరిస్తే వీటిమూలంగా ఎదురయ్యే అనవసరమైన చీలికలను మనం ఆపగలం.

ప్రభువా, నీ ప్రజల్ని నడిపించడమనేది గొప్ప ఆధిక్యత. ఈ విషయంలో మీ అవసరత నాకెంతో ఉందని నేను ఒప్పుకుంటున్నాను. నేను లోపాలు కలిగిన వ్యక్తిని. అయితే నిన్నుపోలి నడుచుకోవడానికి నన్ను పిలుచుకుని, నేను నిన్ను పోలి నడిచినట్లు ఇతరులు నన్ను పోలి నడుచుకొనేలా ఇతరుల్ని పిలువమని కోరుతున్నారు. నీవు నన్ను చేసిన విధానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. అయినా జీవిత పరిస్థితులూ వాటికి నా స్పందనా కూడా నన్ను ప్రభావితం చేశాయనీ చేస్తున్నాయనీ నేను గుర్తిస్తున్నాను. మీ గొట్టెల్ని నేను కాస్తుండగా ఈ విషయాలు బయటపడుతున్నాయి. నేనెప్పుడు పరిపూర్ణ స్థితిలో ఉండలేను. ఈ మందను నడిపించడానికి నీవు లేపిన వ్యక్తుల దగ్గరకు నేను ఈ పద్ధతులతో వచ్చేముందు నాకు సున్నితత్వాన్ని అనుగ్రహించండి. క్రీస్తునందున్న కృపలో బలంగా ఉండాలని నా ఆశ. సవాళ్ళతో కూడిన ఈ విషయాల్లో నడిపించడానికి నాకు జ్ఞాన వివేకాలు అవసరం. మీ మంద క్షేమం నిమిత్తం, మీ నామ మహిమ నిమిత్తం నాలో నీ కార్యాన్ని నైపుణ్యం గల నీ హస్తమే చేస్తుందని నీ ప్రేమను నేను నమ్ముతున్నాను, ఆమెన్!

 

10. వివాదాన్ని పరిష్కరించుట

కొన్ని సంవత్సరాల క్రితం మా సంఘంలో ఒక వివాదం చెలరేగింది. ఆ వివాదం ప్రజల్ని ఉద్రేకపరచి, పరిచర్య చీలిపోయే పరిస్థితికి తీసుకొచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యంలో పనిచేసిన విశ్వాసులు కొద్దిమంది మా సంఘంలో ఉన్నారు. సంఘ పెద్దల్లో ఒక సీనియర్ పెద్దకూడా సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందినవాడే. మా సంఘ అవసరత నిమిత్తం ఆ మధ్యకాలంలో ఒక ఆడిటోరియమ్ ను పునర్నిర్మించినపుడు అమెరికా జాతీయ జెండాను తొలగించడం వలన సైన్యంలో పనిచేసిన విశ్వాసుల మనసులు గాయపడ్డాయి. 1992లో సంఘం ప్రారంభమైనప్పటినుంచి మా దేశపు జాతీయ జెండా ఎగురుతూనే ఉంది. సంఘంలో అమెరికా జాతీయ జెండాను ప్రదర్శించడం అనేది రాజకీయాలకు సంబంధించినది కాదు అది యుద్ధంలో ప్రాణాలు విడిచిన వారిని గౌరవించడమని ఆ సీనియర్ పరిశు దుల అభిప్రాయం. ఎంతోమంది యుద్ధంలో తమ ప్రాణాలు త్యాగం చేయడం వల్లనే ఈ గొప్పదేశంలో మన నమ్మకాలకు తగినట్లు స్వేచ్ఛగా ఆరాధించుకోగలుగుతున్నామని వారి వాదన. అయితే ఒక తరపువారి ఆలోచన వేరే తరపువారికి భిన్నంగా ఉంటుంది. యవ్వన విశ్వాసులు లేచి సువార్త పరిచర్యను గందరగోళపు రాజకీయాలతో ముడిపెట్టకూడదని తిరగబడ్డారు. “సంఘమంటే రాజకీయ వ్యవస్థకాదు. ప్రసంగ వేదిక సంస్కృతికి అద్దంపట్టే స్థలం కాదు” అని యవ్వనస్తులు తమ గళాన్ని వినిపించారు. వృద్ధులైన పరిశుద్ధులు ఆ భావజాలాన్ని అర్ధం చేసుకోలేకపోయారు.

జాతి గౌరవానికి చిహ్నమైన జెండాను ప్రదర్శించడంవల్ల రాజకీయ వ్యవస్థ ఎలా క్రీస్తు సువార్తనూ సంఘ ఆశయాన్నీ అణచివేస్తుందని వాపోయారు. ఈ వివాదం సంఘం చీలిపోయే పరిస్థితికి కారణం కాకముందే నాయకత్వ బృందం జాగ్రత్తగా ఈ విషయంలో కల్పించుకోవాల్సి వచ్చింది.

బుధవారం సంఘకూడికలో, “ఈ విషయాన్ని వాక్య దృక్పధంలో పరిశీలించి, పరిష్కరించడానికి మూడు నెలల సమయం” నాయకత్వ బృందానికి ఇవ్వమని కోరాను. నా తోటి పెద్దల సమక్షంలో నా పరిచర్య ప్రారంభంలోనే ఇది జరిగింది. కనుక పెద్దలమధ్య సత్సంబంధాలు పెంపొందించుకోవడానికీ, లేఖనాల్ని కలిసి అధ్యయనం చేసి మా వివేచనకు సాన పెట్టుకోవడానికి ఇది చక్కటి అవకాశాన్నిచ్చింది. ఆ సమయంలో నాయకత్వ బృందంలో ఉన్నవారు కొద్దిమంది అనుభజ్ఞులు, మరి కొందరు యవ్వనస్థులు. ఈ రెండు గుంపులవారి ఆలోచనా విధానాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఐక్యత సాధించడమనేది సవాలుతో కూడిన విషయమే. అయినాసరే ఐక్యతకోసం కృషిచేయాలని తీర్మానించుకున్నాం. వివాదం తప్పించుకోలేనిదైనప్పుడు, దాన్ని ప్రభువును ఘనపరచే పద్ధతిలో పరిష్కరించడానికి మాకు జ్ఞానం అవసరమయ్యింది. మేము సంగ్రహించే నియమాలు లేఖనం నుంచే రావాలి, ప్రస్తుత కాలపు వివాదాన్నే కాక రాబోయే కాలంలో కూడా వివాద పరిష్కారానికి అవి ఉపయోగపడాలి. ఈ అంశాన్ని కలిసి అధ్యయనం చేసినప్పుడు, ఈ క్రింది నాయకత్వ నియమాలు చాలా సహకరించాయి.

 

ఒకరి కోసం మరొకరు ప్రార్థించండి

ఒకరికోసం మరొకరు ప్రార్థించాల్సిన అవసరతనూ, ప్రోత్సహించాల్సిన బాధ్యతనూ తక్కువగా అంచనా వేయవద్దు. ఇది చాలా స్పష్టమైన నియమమైనప్పటికీ, సమాధానకర్తయైన దేవునికి తగ్గట్లు మన హృదయాలు స్పందించేలా కృపా సింహాసనమున్న గదిలోకి కలిసి ప్రవేశించకుండానే వివాదాల్ని పరిష్కరించడానికి త్వరపడిపోతాం. “మన హృదయాల్లో క్రీస్తు సమాధానం ఏలనివ్వాలని” పౌలు మనకు ఉపదేశిస్తున్నాడు. అంటే మనం దేవునితో ఆస్వాదించే సమాధానమే వివాదాల్లో ఉన్నప్పుడు ఇతరులతో మనం స్పందించే తీరును శాసించాలని భావం. క్రీస్తు మనల్ని దేవునితో సమాధానపరిచాడు. ఆయన మనయెడల కనపరచిన సమాధానార్థమైన మనస్సే ఇతరులతో సమాధానంగా ఉండేందుకు సహాయపడుతుంది. మరొక మాటలో చెప్పాలంటే, మన వివాదాలన్నింటిలో క్రీస్తు సమాధానమే న్యాయనిర్ణేతగా ఉండాలి. ముందుగానే ఈ సత్యాల గురించి ప్రార్థించడం మన వైఖరుల్ని సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడుతుంది. పౌలుకున్న విస్తారమైన పరిచర్యలోని భారాల గురించి నిరంతరం ప్రార్థించడానికి కారణం ఇదే. మనం ఈ కీలకమైన మొదటి అంశాన్ని దాటుకొని ముందుకెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన అనుదిన జీవితంలో వివాదాల్ని పరిష్కరించడమనేది దాదాపు ప్రతి నిత్యమూ ఉంటుంది. వివాదం గురించి ప్రార్థించినప్పుడు సాత్వికం కలుగుతుంది. ఒకరి హృదయం మరొకరి యెడల సున్నితంగా మారుతుంది. మన పాపేచ్చలు పెరిగి పెద్దవి కావు కాని, వాటి ప్రారంభంలోనే తుంచివేయబడతాయి.

 

ప్రేమతో ఒకరి నొకరు గద్దించుకోండి

వివాదాన్ని పరిష్కరించడానికి పాపాన్నంతటినీ గద్దించాలి, ఒప్పుకోవాలి, విడిచి పెట్టాలి, క్షమించాలి. ఉపదేశసారమనగా పవిత్ర హృదయము నుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే (1తిమోతి 1:5)

జ్ఞానాన్వేషణకు అత్యవసరమైన విషయం . పాపపు వైఖరినీ క్రియలనూ విస్మరిస్తే మనం ఎన్నడూ ఐక్యత సాధించలేము. కపటమైన మనస్సాక్షితో వాక్యానుసారంగా ఆలోచించలేము. నాయకత్వ స్థాయిలో ఒత్తిడి అన్నివేళలా అసౌకర్యంగా ఉంటుంది. పాపేచ్ఛలను మొదట పరిష్కరించకుండానే సంఘ జీవనంలోని సవాళ్ళ గురించి స్పష్టంగా ఆలోచించగలమని కొద్దిమంది నాయకులు ఊహించుకుంటుంటారు. ఇదొక తీవ్రమైన తప్పిదం. "పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన” పరిశుభ్రమైన పాత్రలుగా సంఘనాయకులు ఉండాలి. (2తిమోతి 2:21). పాపమంతా సరిచేయబడడానికీ, సంబంధాల పునరుద్ధరణకూ మనం ప్రేమతో ఒకరి నొకరు గద్దించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అది కొన్నిసార్లు అసౌకర్యంగా ఉన్నాసరే! చాలా నాయకత్వ బృందాలు సంఘం విషయంలో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఆశ్చర్యమేమీ కాదు. అపరిష్కృత పాపం బయటపడడానికి దారి వెదుకుచుండగా, దాన్ని కాలు క్రింద అదిమిపట్టి వారు తరచుగా, పరిచర్య చేయడానికి ప్రయత్నిస్తుంటారు. నా ఆత్మీయ గురువుల్లో ఒకరు చెప్పినట్లు “దేవుని మెండైన ఆశీర్వాదాలు దొరికే చోట మనం ఉన్నప్పుడే”, దేవుని ప్రజలను మనం అత్యుత్తమంగా సేవిస్తాం అంటే సాధ్యమైనంత మేరకు మనం అందరితో సమాధానంగా ఉండడమే! (రోమా 12:18;).

 

మీ లోపాలను దీనమనస్సుతో గుర్తించి, అంగీకరించండి

ఇతరులు మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు, దీనత్వం మీకు అత్యంత అవసరం. “దీనులై నలిగిన హృదయముగలవారై తన మాట విని వణికే వారినే ప్రభువు దృష్టిస్తున్నాడు (యెషయా 66:2). సంఘాన్ని నడపడానికి అవసరమైన జ్ఞానాన్ని గర్వం చంపేస్తుంది. మన పరిచర్యలోని కష్టాలకు నాయకులందరూ తమ అహంకారాన్ని గర్వాన్నీ జోడిస్తారనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. మెలకువగల కాపరి దీనమనస్సును పెంపొందించుకోవడానికి కృషిచేయవచ్చు కాని, తనలోని గర్వాన్ని ఇతరులు చూపేవరకు గమనించలేడు. అయితే మన హృదయాల్లోని పాపాన్ని పరిష్కరించడానికి తిరస్కరిస్తే సంఘంలో పాపం వలన కలిగిన వివాదాలను నివారించడం, పరిష్కరించడం అసాధ్యం. ఇతరులు మన పాపాన్ని గమనించినప్పుడు, దీనమనస్సు కోసం ప్రార్థించాలి, మన పాపానికి మూలకారణాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి, ఎవరిని గాయపరిచామో వారినుంచి క్షమాపణ కోరాలి. మీలో ఉన్న పాపాన్ని గద్దించేంతగా మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి నిమిత్తం ప్రభువుకు స్తుతులు చెప్పాలి, మీ బలహీనతలు మీ తోటి నాయకులకు ఇబ్బంది కలగకుండా చేయాలని ప్రార్థించాలి. అంతేకాదు పరిచర్య అవసరాల్లో మనుషులకు దూరంగా ఉండాలనే శోధనను జయించండి. బలమైన నాయకత్వ బృందం దయా, కనికరాలతో వ్యవహరిస్తుంది. నమ్మకంగా ఇతరులతో వ్యవహరించండి. ఒకరి నొకరు ప్రోత్సహించుకోండి, సహకరించుకోండి, సంఘ జీవనంలో ఎదురయ్యే ఒత్తిళ్ళనూ వివాదాలను పరిష్కరించడానికి అవసరమయ్యే శక్తినిచ్చే క్రీస్తును ఘనపరచండి.

 

శ్రమలను హత్తుకోండి

శ్రమ మీ జీవితంలో శక్తివంతమైన కార్యం చేస్తుంది. శ్రమలద్వారా వచ్చే ప్రభువు శిక్షణ మన భక్తిని పెంచడానికి ఆయన ఉద్దేశించినదే (హెబ్రీ 12:4-13;). జీవితంలోనూ పరిచర్యలోనూ తలెత్తే శ్రమల్లో సంఘ నాయకులు స్థిరంగా ఉండి మాదిరిని కనపరచాలి. సంఘనాయకత్వంలోని శ్రమలకు యాకోబు 1:2-4; వర్తిస్తుందని బహుశా మీరు ఎప్పుడు ఆలోచించి ఉండరు. శ్రమల్ని వ్యక్తిగతంగా మనం ఎదుర్కొనే పరిస్థితులుగా భావిస్తామే కానీ సంఘనాయకులు ఎదుర్కొనే పరీక్షలని అనుకోము. మనం ఇతర శ్రమల్నీ కష్టాల్ని పరిగణించినట్లుగానే పరిచర్యలోని కష్టాలను కూడా పరిగణించడం చాలా కీలకమైన విషయం. యాకోబు 1:2-4;వచనాల్లోన్న సారాంశాన్ని సాధనచేస్తూ మనం సంఘాన్ని నడిపించాలి. దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో శ్రమలను ఏ ఉద్దేశంతో అనుమతిస్తాడో అదే ఉద్దేశంతో సంఘనాయకత్వాన్ని పరీక్షిస్తాడు. నాయకత్వంలోని సవాళ్ళను మనలో సహనాన్ని పెంచడానికి ఉపయోగిస్తాడు. ఈ సహనం ప్రశాంతతనూ, ఉన్నతమైన పరిశుద్ధతకూ, శ్రేష్టమైన వివేచనకూ నడిపిస్తుంది. ఈ దృక్పథం లేకపోతే పాపభీతితో, స్వచిత్తానుసారంగా, మానవజ్ఞానంపై ఆధారపడుతూ విఫలమవుతాం. జీవితం దుర్భరంగా ఉన్నప్పుడు ప్రభువునందు నమ్మకముంచడం అంటే ఏమిటో మనం సంఘానికి మాదిరి చూపించాలి. సంఘంలో వివాదమున్నప్పుడే స్పష్టంగా వాస్తవం కనబడుతుంది.

 

సాత్వికులైన నాయకులు వివాదాల నుంచి పారిపోరు

శ్రమలకు లొంగిన నాయకులను చూసి సంఘ శరీరంలోని విశ్వాసులు ప్రోత్సహించబడతారు, స్థిరపడతారు. శ్రమలు మనలోని పాపేచ్ఛలను హరించేస్తాయి. అయితే యోహాను 10:12-13;లోని జీతగాడిలా వివాదం నుంచి పారిపోతే అవి ఎన్నడూ పరిష్కారం కావు, కాబట్టి అది చివరికి నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. వివాదాన్ని పరిష్కరించడంలో ఎన్నడూ ఏకీభవించకుండా ఆ భారాన్ని ఇతరులపై మోపే ఇద్దరు, ముగ్గురు నాయకత్వ బృందంలో ఉంటారు. తాము చాలా సహాయపడుతున్నామనే భ్రమలోనే వారుంటారు. ఆ నిర్లక్ష్యం కొనసాగితే వారి ఆత్మీయత, వాక్య స్పష్టత మరింత దుస్థితికి చేరుకుంటాయి. అనతికాలంలోనే సమర్థవంతంగా లేఖనాలను అన్వయించుకోలేని స్థితికి వారు వెళ్ళిపోతారు. మనల్ని బలపరచి, పదును పెట్టడానికి ప్రభువు కృపతో అనుగ్రహించిన బహుమానంగా శ్రమల్ని హత్తుకోవాలి. అది ఆరోగ్యవంతమైన నాయకత్వ బృందానికీ, పరిచర్యకూ అత్యవసరం. ఎందుకంటే అలాంటప్పుడే ఆత్మీయ కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. మన స్వభావం ఇంకా పరిశుద్ధపరచబడుతుంది.

 

సాత్వికులైన నాయకులు వివాదాల మూలంగా తమకు నష్టాన్ని కొనితెచ్చుకోరు

మనం వివాద పరిష్కారం నుంచి పారిపోకూడదు, అలాగని అందులో ఆనందించకూడదు. పరిణితి కలిగిన నాయకులు సంఘ కార్యక్రమాల్లో ఒత్తిడినీ, వివాదాన్నీ, ప్రతికూల ప్రభావాన్ని సరైన కారణంతోనే ఇష్టపడరు. గొఱ్ఱల క్షేమాభివృద్ధికి అడ్డుగా నిలిచే ఏ వివాదాన్నెనా పరిష్కరించడానికి నేను వెనుకాడను. అయితే వివాదంతో దుఃఖం కూడా అన్నివేళలా కలిసి పయనిస్తుంది. ఒత్తిడిని పరిష్కరించడానికి మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సమయమే పడుతుంది. వివాద పరిష్కార సమావేశాలు తరచూ వ్యక్తిగతమైన గద్దింపుతో నిండి ఉంటాయి. కాబట్టి అందరూ సున్నితమైన భాషనే మాట్లాడాల్సి ఉంటుంది. కోపోద్రిక్తులైన వ్యక్తిత్వమున్న వారితో ఇలాంటి సమావేశాల్లో కూర్చోవడం సంతోషకర విషయం కాదు. భక్తిగల నాయకులుందరూ భయపడేది దీనికే! అంతరంగీక వాగ్వాదాలనూ, ఒత్తిడితో నిండిన సంభాషణలనూ మీ పెద్దల్లో ఎవరో ఒకరు ఆస్వాదిస్తుంటే తాను వివాదాన్ని అణచడంకంటే మరింత ఎక్కువగా రగిలిస్తాడు. వివాదాలు కలిగించే విబేధాల్లో మనం ఉన్నప్పుడు అతిశయించకుండా, అన్నివిధాలుగా దాన్ని నివారించడానికి ప్రయత్నించి దీనత్వంతో వ్యవహరించాలి.

 

వ్యక్తిగత అభిరుచులనూ, వాక్యనియమాలనూ వేరుచేయండి

వివాదానికి కారణం మన వ్యక్తిగత అభిరుచులా? లేదా వాక్యనియమాలా? అనే విషయాన్ని మనం గుర్తించడం చాలా కీలకమైన విషయం. ఆడిటోరియంలో అమెరికా జాతీయ జెండా ప్రదర్శన గురించి ప్రజలు చాలా భారం కలిగి ఉండడం గురించి ఇంతకుముందు మనం ప్రస్తావించాం. కొన్నాళ్ళు అమెరికా మిలటరీలో పనిచేసిన నాకు కూడా ఆ జెండా చాలా ముఖ్యమైంది. ఈ దేశంలో అన్య సాంప్రదాయాలు మితిమీరుతున్నాయి.

రోమాపత్రిక 1వ అధ్యాయంలో దేవుడు చెప్పిన పరిస్థితులు అనివార్యమని నాకు తెలుసు. అయినాసరే మన దేశానికి సేవచేయడం విషయంలో నేను కృతజ్ఞుడిని. ఎందుకంటే దాని వలన మన విశ్వాసాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించడానికి అవకాశం దక్కింది. మా సంఘంలో సీనియర్ పెద్ద రెండవ ప్రపంచయుద్ధంలో తన కుటుంబ సభ్యుల్ని కోల్పోయాడు. ఇటలీలో తాను కూడా యుద్ధంలో పాల్గొన్నాడు. ఇప్పుడు ఆయన ప్రభువుతో ఉన్నాడు. దేశమంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో నేను మిలటరీలో పనిచేశాను కాబట్టి యుద్ధరంగంలో అనుభవజ్ఞుడైన ఈ పెద్ద నా దృష్టికి మహానుభావుడు. నార్మాండీ సముద్రతీరంలో హతులైన సహోదరుల గురించి ఆలోచించినప్పుడు నా హృదయం ద్రవించిపోతుంది.

"మన సంఘం సువార్త పరిచర్య చేస్తోందా? రాజకీయాలు నడిపిస్తోందా?” అని ప్రశ్నించే మా సంఘపు యవ్వనస్థుల ఆలోచనను కూడా నేను పరిగణనలోకి తీసుకున్నాను. కొన్నిసార్లు వాక్య నియమానికీ, వ్యక్తిగత అభిప్రాయానికీ మధ్య వ్యత్యాసాన్ని చూపించడం కష్టతరమైన సంగతి, ఎందుకంటే కొన్ని విషయాలకు వాక్య నియయాల్లో మూలాలు ఉన్నప్పటికీ, మనం మనకు నచ్చినట్లు వాటిని అన్వయించుకుంటాం. మా సంఘలో జెండాను గూర్చిన వివాదం అలాంటిదే! మన పూర్వికుల ప్రాణత్యాగం ద్వారా మనకు మతపరమైన స్వాతంత్ర్యం వచ్చేలా దేవుడు అనుగ్రహిస్తే, మన జాతీయ జెండాను తొలగించడం ఆ త్యాగవీరుల త్యాగాన్ని అమర్యాద లేకుండా చేయడమేనని కొందరి అభిప్రాయం. మన ప్రసంగ వేదికలనుంచి స్వేచ్చగా మనం సువార్తను ప్రకటించగలగడానికి ఎంతోమంది తమ రక్తాన్ని చిందించారు అని యుద్ధంలో పాల్గొన్న సైనికుల అభిప్రాయం. జెండాను తొలగించేయడం వాళ్ళకు జ్ఞానయుక్తంగా తోచలేదు. అదే సమయంలో సంఘ ఉద్దేశాన్ని ఆచార సంబంధమైన, రాజకీయపరమైన విషయాలతో మిళితం చేస్తే సువార్త చులకనయ్యే అవకాశం ఉందని యవ్వనస్థులు అభిప్రాయపడ్డారు.

మా నాయకత్వ బృందం ఈ రెండు ఆలోచనలను కూడా సమదృష్టితోనే పరిశీలించింది. ఇలాంటి సందర్భాల్లోనే బైబిల్ స్పష్టంగా ఇచ్చే ఆజ్ఞలకూ, వ్యక్తిగత అభిప్రాయాలకూ మధ్య వ్యత్యాసాన్ని కనుగొనేలా నాయకులు గొట్టెలకు సహకరించాలి. మన అభిప్రాయాలూ, అభిరుచులూ మనకెంత ప్రియమైనవైనా, మంచివైనా వాటిని లేఖనంలోని ఆజ్ఞలకు సమానంగా చేయకూడదు. వాటిని వాక్యంతో సమానంగా ఎంచకూడదు. ఈ జెండా విషయం బలమైన అభిప్రాయాలకూ, అభిరుచికో ముడిపడి ఉందని ఎరిగి, ప్రేమే జయించేలా చేయండని ఇతరులకు పిలుపునిచ్చాం. చివరికి మా సంఘంలో వృద్ధులైన పరిశుద్దుల అభిరుచికి తగినట్లుగా, ఆ జెండాను ఆడిటోరియంలో కొన్ని సంవత్సరాలు ప్రదర్శించడానికి ఒప్పుకున్నాం. అయితే ఈ జెండా ఎప్పుడైనా సంఘ ఉద్దేశాన్ని ఆశయాన్నీ అడ్డగించేదిగా ఉంటే అప్పుడు దాన్ని తొలగించాల్సి వస్తుందని ఆ సీనియర్ విశ్వాసులను హెచ్చరించాం. ఒకవేళ మా సంఘ పెద్దలు వ్యక్తిగత అభిరుచులనూ, వాక్య నియమాలనూ వేరుచేయకపోతే ఈ విషయం కచ్చితంగా సంఘంలో చీలికలు తీసుకొచ్చేది.

 

ప్రేమను గెలవనివ్వాలి

వ్యక్తిగత అభిరుచుల విషయంలోనో, మనస్సాక్షి విషయంలోనో బేధాభిప్రాయాలు కలిగిస్తే మనం ప్రేమతో విభేదించడం నేర్చుకోవాలి. అభిరుచుల విషయంలో ప్రేమనే గెలవనివ్వాలని పౌలు రోమా 14:1-23లో మనకు బోధిస్తున్నాడు. క్రీస్తు ప్రభుత్వాన్ని మన జీవితాల్లో ఒప్పుకుంటామా లేదా అనే విషయమే మన నిత్యజీవాన్నీ, నాశనాన్నీ నిర్దేశించే అంశం. మనల్ని నిలబెట్టగలిగేది ఆయనేనని మనకు ఆయన వాగ్దానం ఉంది. (రోమా 14:4;). మన వ్యక్తిగత అభిరుచులనుబట్టి ఇతరులకు తీర్పు తీర్చడం ఎప్పుడూ సరైన విషయం కాదు ( రోమా 14:10-13;). అలా తీర్పు తీర్చి మనకు నచ్చిన పనికి వాక్యాధికారం ఉన్నట్లు ప్రవర్తించకూడదు. దేవుడు ఆజ్ఞాపించిన దానికీ, మనస్సాక్షికి వ్యక్తిగతంగా బాధకలిగించే దానికీ మధ్య విశ్వాసులు స్పష్టంగా బేధం చూపించగలగాలి. నాయకులు ఈ విషయంలో విశ్వాసులకు సహకరించకపోతే సంఘంలో వివాదాలు తరచూ తారాస్థాయికి చేరుతుంటాయి. లేఖనం ఏ మాత్రం బోధించని దాన్ని దేవుడే స్వయంగా కోరుతున్నాడన్నట్లు మనం చాలాసార్లు బలంగా వాదిస్తుంటాం. మరి కొన్నిసార్లు దేవుని ఆజ్ఞను వ్యక్తిగత అభిప్రాయంగా భావించి అజ్ఞానంతో దేవునికి అవిధేయత చూపి అపరాధులమవుతుంటాం. వాక్యనియమాల్నీ, వ్యక్తిగత అభిప్రాయాన్ని విడమర్చి చూడగలిగితే వివాదాలూ, పాపం మూలంగా కలిగే చీలికలూ సమసిపోతాయి.

 

స్పష్టమైన సిద్ధాంతాల విషయంలో, పరిచర్య నియమాల విషయంలో ఆత్మ నడిపింపును బట్టి ఏక భావం ఉండాలి

నాయకబృందంగా స్పష్టమైన సిద్ధాంతాల విషయంలో, పరిచర్య నియమాల విషయంలో మనమంతా ఏకభావంతో ఉండడానికి కృషిచేయాలి. అప్పటికింకా ఏకాభిప్రాయానికి రాకపోతే, పరిశుద్దాత్మ మన అవగాహనను సరిచేసే వరకు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసే ఆధిక్యత మనకుంది. వాక్య నియమాలు స్థిరమైనవి. సంఘజీవనంలో పరిచర్యను మనం ఎలా నిర్వహిస్తామనేది స్పష్టంగా లేఖనం ఇచ్చిన ఆజ్ఞల్లో వేరుపారుకుని ఉండాలి. సిద్ధాంత విషయంలోనూ, దాన్ని ఆచరించే విషయంలోనూ ఐక్యత వచ్చేవరకు మనం కృషి చేయాలి (ఎఫెసీ 4:13;). వాక్యంలోని ఆజ్ఞలకూ, అభిరుచుల్లో భిన్నత్వానికీ మధ్య స్పష్టమైన బేధాలు తెలుసుకోకపోతే, నాయకుల నిర్ణయాలు భారీ యుద్ధాలకు దారితీస్తాయి. దేవుడు మాట్లాడని విషయాలకు ఆయన అధికారాన్ని ఆపాదించినా, దేవుడు స్పష్టంగా మాట్లాడిన విషయాలను కేవలం ఒట్టి మనుషుల అభిప్రాయాలుగా చెప్పి వాదించినా వివాదం పరిష్కారం కాదు.

వ్యక్తిగత అభిరుచుల విషయంలో వ్యతిరేకించాల్సివస్తే , ప్రేమతో విబేధించుకునే అవకాశం మనకుంది. సంఘంలో వివాదానికి సాత్వికం, కృప, త్యాగం అనేవి మరణకరమైన దెబ్బలు. ఇతరుల్ని మీకంటే యోగ్యులుగా ఎంచేందుకు, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పవాడిగా ఎంచడానికి సంసిద్ధత చూపినప్పుడే ఐక్యత, అంగీకారం సంఘంలో నెరవేరుతాయి (ఫిలిప్పీ 2:3;). ప్రస్తుతం క్రైస్తవ సంఘంలో అనూహ్యమైన మార్పులు రావడానికి కారణం యవ్వన పరిశుద్దుల అపరిపక్వత, దూకుడే! వారు స్పష్టమైన సిద్ధాంతాల విషయంలో, పరిచర్య నియమాల విషయంలో ఏకాభిప్రాయానికై కృషిచేసి, వ్యక్తిగత అభిరుచుల విషయంలో సహృద్భావంతో విబేధించి, సాత్వికాన్ని చక్కగా సాధన చేసి ఉంటే, అవిశ్వాస లోకానికి సువార్త ఎలా ప్రకటించాలి అనే విషయంలో ఎన్నో బేధాభిప్రాయాల్ని మనం గత కొన్ని దశాబ్దాల్లో చూసుండేవాళ్ళం కాదు. ఇతరుల ఆశయాలను నెరవేర్చడానికి సిద్ధపడినప్పుడు, మనం నిజంగా మన బలమైన అభిప్రాయాల్ని ఎలా ప్రక్కన పెట్టగలం? వారి గురించి ఎలా సణుక్కోకుండా ఉండగలం? మొదటిగా ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించడమంటే ఏంటో మనకు తెలియాలి.

1. ప్రస్తుతం మనముందున్న సమస్య వ్యక్తిగత అభిప్రాయానికే గాని స్పష్టమైన వాక్య నియమాలకు సంబంధించింది కాదని మనం తెలుసుకోవాలి.

2. మన మనస్సులో ఒక అభిప్రాయానికంటే మరొక దానికి ఎక్కువ ప్రాధాన్యత నివ్వడానికి మనం ఒక్క అభిప్రాయానికి బందీ కాకూడదు.

3. అధిక సంఖ్యలో నాయకుల జ్ఞానయుక్తమైన ఆలోచనను గౌరవించడానికి మనం సంసిద్ధులుగా ఉండాలి.

4. తమ ముందున్న మార్గాలను నాయకులు బేరీజు వేస్తుండగా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటాడని మనం నమ్మాలి.

5. ఇతరుల అభిప్రాయాలకు విలువనివ్వడం ద్వారా పెంపొందిన ఐక్యత విషయంలో మనం కృతజ్ఞులుగా ఉండాలి.

6. సంఘానికి సమాధానం చెప్పడానికి పిలువబడినప్పుడు నాయకులంతా కలిసి తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని సమర్థించడానికి తీర్మానం చేసుకోవాలి.

రెండవదిగా ఇతర నాయకుల అభిప్రాయాలకు మర్యాదనివ్వడమనేది కృతజ్ఞత కలిగిన గృహనిర్వాహకుని మనసుతో చేయాలి. అభిప్రాయ బేధాలకు సంబంధించిన విషయాల్లో నాయకుల మధ్య కలిగే పలు సంక్లిష్ట పరిస్థితుల్లో పరిచర్య చేయడం ఆధిక్యత, కృపావరం. మన జీవితాలను సజీవయాగంగా దేవుని ప్రజలకు అర్పించే సేవకులం మనం. కాబట్టి వ్యక్తిగత అభిప్రాయాల నిమిత్తం పరిచర్య అభివృద్ధికి, నాయకులకూ అడ్డుబండగా ఉండడం స్వార్థమే అవుతుంది. మనకున్న అభిప్రాయాలకు చాలా భారంగా మనం కట్టుబడి ఉండవచ్చు. అయితే మన అభిప్రాయం గురించి దైవ ప్రత్యక్షత మౌనంగా ఉంటే దేవుని ప్రజల్ని సేవించే భాగ్యం దక్కినందుకు దేవుని స్తుతిస్తూ, ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తూ ఆత్మ అనుగ్రహించు ఐక్యతను కాపాడాలి. అంతేకాని మన అంగీకారాన్ని నిరుత్సాహపడడానికో, భయానికో గురయ్యేలా చేయకూడదు. ఒక్కసారి కనుక ఇతరుల అభిప్రాయాల యెడల వారు తీసుకునే నిర్ణయాల యెడల అయిష్టాన్ని కొనసాగిస్తే త్వరలోనే ద్వేషభావం మనలో మొదలవుతుంది.

మూడవదిగా, ఇతర నాయకుల అభిప్రాయాల వలన మీ మనస్సాక్షికి గొప్ప ఇబ్బంది కలుగుతుందని మీకనిపిస్తే, మీకు భిన్నంగా ఉన్నవారి మనస్సాక్షుల గురించి వారిని పాపపు మనసుతో తీర్చుతీర్చకుండా ఉండడానికి రోమా పత్రిక 14వ అధ్యాయాన్ని చదవడం జ్ఞానయుక్తమైన సంగతి. ఒకవేళ నాయకత్వ బృందమంతా కలిసి తీసుకునే నిర్ణయాలు మీ మనస్సాక్షిలో నిరంతరం అలజడులను సృష్టిస్తుంటే, సంఘ నాయకత్వం స్థానం నుంచి తొలగిపోయే విషయం గురించి మీరు సీరియస్ గా ఆలోచించాలి. బహుశా నాయకత్వ స్థానంలో కొనసాగే వరం మీకు లేదేమో! కనుక సంఘపరిచర్యలో మీరు ఏ స్థానంలో చక్కగా పనిచేస్తారో ఆ విభాగంలో చేరండి. నాయకత్వ బాధ్యతనుంచి తొలగిపోవడమనేది అవమానకరమైన, సిగ్గుపడాల్సిన విషయం కాదు. తన ద్రాక్షతోటలో దేవుడు మనల్ని ఎక్కడ నాటాడో అక్కడ మనం వర్థిల్లాలని ప్రభువు కోరతాడు (1 కొరింథీ 12:11, 18,24-25;). మనం నిజాయితీగా ఉందాం. కొద్దిమంది నాయకులకు తమ అంతరంగంలో కలిగే అలజడులను గుర్తించి, ఒప్పుకోవడానికి కొన్నిసార్లు నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది. బాహ్య ప్రపంచంలో కురుస్తున్న అగ్ని వర్షాన్ని మనం తట్టుకోగలం గానీ అంతరంగంలో రేగే తుఫానును నిమ్మళపరచలేకపోతున్నామని మనం గమనించాలి. మన నిర్ణయాన్ని నమ్మకస్తులు, జ్ఞానవంతులైన మన తోటి నాయకుల ముందు పెట్టాలి. ఇతరుల అభిప్రాయాలను సహృద్భావంతో అంగీకరించే పరిపక్వత లేదని ఒప్పుకోవాలి. మన హృదయాలను నిజాయితీతో పరిశీలించుకుని సుదీర్ఘ సమయాన్ని ప్రార్థనలో వెచ్చించి, అయితే శుద్ధమైన మనస్సాక్షితో నాయకత్వంలో కొనసాగడానికి పునఃనిశ్చయించుకోవాలి. లేదా సంతోషంగా నాయకత్వ బాధ్యతలనుంచి తొలగిపోవాలి.

ఆఖరిగా ఇతరుల అభిప్రాయాలకు నిజంగా విలువనివ్వడమంటే విశ్వాసుల మధ్య గొడవలు సృష్టించని రీతిలో నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తపరచాలి, వివరించాలి. సంఘాల్లో వివాదం మూలంగా కలిగే నాశనకరమైన అగ్నిని తరచూ రగిలించేది సంఘ పెద్దలే!

గొట్టెలకూ, కాపరులకూ మధ్య ఏర్పడే సన్నిహిత వ్యక్తిగత సంబంధాలు సహజమైనవి, క్షేమాభివృద్ధి కలిగించేవి. అయితే అలాంటి సందర్భాల్లో ముఖ్యంగా మన అభిప్రాయాలతో మన సన్నిహిత స్నేహితుల బలమైన అభిప్రాయాలు కలిసిన సందర్భాల్లో నిష్పక్షపాతంగా ఇతర నాయకుల అభిప్రాయాలను అంగీకరించడం, సమర్థించడం చాలా కష్టమవుతుంది. నాలుగోడల మధ్య పెద్దలతో సమాధాన బంధాన్ని బలపరచుకోవడం కోసం వారి అభిప్రాయాలను అంగీకరిస్తాం, సమర్థిస్తాం. కాని విశ్వాసులతో సంభాషణలో పెద్దల నిర్ణయాలతో విభేదించి ఆ బంధాన్ని కేవలం మనమే బలహీనం చేసుకుంటాం. “ఆ నిర్ణయం జ్ఞానయుక్తమైంది కాదని నేను భావించాను అయితే నా మాటను లెక్కచేయరనే భావంతోనూ ఎక్కువమంది పెద్దల నిర్ణయానికి అడ్డు రాకూడదనీ, నేను అంగీకరించాల్సి వచ్చింది”, అని మనం చెప్పిన మాటలు నిరపాయకరంగా కనబడవచ్చు. సువార్త ప్రభావితం చేసిన అడవిని తగలబెట్టే నిప్పురవ్వను రాజేసేది ఆ మాటే!

గొట్టెలు మందలో ఐకమత్యంగా ఉండాలి. అయితే నాయకత్వ స్థాయిలో వచ్చిన చీలిక మందను అయోమయానికి గురిచేసి, వారిని సాతానుగాడి తంత్రాలకు చిక్కుకుపోయేలా విడిచిపెడుతుంది.

సంఘంలో నాయకులుగా పరిచర్య చేయడానికి దేవుడు పురుషులను పిలుచు కున్నాడు. వారు పరిచర్యలో తీసుకునే నిర్ణయాలకు దేవునికి లెక్క అప్పగిస్తారు (హెబ్రీ 13:17; 1తిమోతి 2:12;). కాబట్టి నాయకులు తమ జీవిత భాగస్వామిని దీనమనస్సుతో నాయకులకు లోబడాలని జ్ఞానంగా ప్రోత్సహించడం కూడా కీలకమైన విషయమే. నాయకుని ఇంటి నాలుగోగోడల మధ్య జీవిత భాగస్వామితో నాయకుడు పంచుకున్న అభిప్రాయాలు సంఘస్థులు వాటికి ఎలా స్పందిస్తారో అనేదాన్ని తెలుసుకోవడానికి పనికొస్తాయి. పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని ఒక నాయకుడి భార్యకు అస్సలు నచ్చకపోతే, ఆమె తన అభిప్రాయాల్ని తన సన్నిహిత స్నేహితులతో పంచుకునే అవకాశముంది. ఇది సంఘానికి ఏమాత్రం సహకరించని విషయం, ఆత్మ అనుగ్రహించే ఐక్యతను ధ్వంసం చేసే పని. నాయకులు ఏకాంతంగా, ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాన్ని నాయకత్వ బాధ్యతల్లో లేనివారికి తెలియజేసినప్పుడు, ఆ వ్యక్తిపై తీవ్రమైన భారం మనం పెట్టినట్లే! అప్పటినుంచి ఆ సమాచారాన్నిచ్చినందుకు అది ఇతరుల్నీ పరిచర్యనూ ప్రభావితం చేసే పద్ధతికి వారు జవాబుదారులు. వారికి మనం చెప్పిన విషయాల్ని వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? అలాంటి వివరాలు తెలుసుకుని ఆ భారాన్ని మోయడానికి తగినంత ఆత్మీయ పరిపక్వత వారికి ఉందా? ఇది పుకార్లను పుట్టించడానికి హేతువు అవుతుందా?

కీలకమైన సమాచారాన్ని ఇతరులకు తెలియని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలని మన హృదయం ఆత్రుత కనపరుస్తుంది. తద్వారా మనం ఇతరులకంటే ముఖ్యమైన వారమనే భావన మనకు కలుగుతుంది. అయితే ఇలాంటి మనస్సు కలిగి ఉండకూడదని లేఖనం మనల్ని హెచ్చరిస్తున్నది. “కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి అంతరింద్రియాల్లోకి దిగిపోవును” అని సామెతలు 18:8 ముక్కుసూటిగా చెబుతున్నది. "సమాచారాన్ని తెలుసుకోవడమే శక్తి,” అని ఈ సామెత భావం. నాయకులు తీసుకునే కీలకమైన నిర్ణయాల్లో సున్నితమైన సమాచారాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త తీసుకోవడమనేది చాలా గంభీరమైన బాధ్యత. ఒక నాయకుని భార్యకు నాయకులంతా కలిసి తీసుకున్న నిర్ణయాన్నీ, చుట్టూ ఉన్న ఒత్తిళ్ళనూ అధిగమించే పరిణితి ఉండకపోవచ్చు. ఇతరుల అభిప్రాయాన్ని చక్కగా గౌరవించడమంటే మీకు సన్నిహితంగా ఉన్న వారందరిని జాగ్రత్తగా పెద్దల నిర్ణయాన్ని వివరించి, దానికి లోబడేలా చేయడమని అర్థం. సంఘ పెద్దలు పరిచర్యను నడిపించడానికి తీసుకున్న నిర్ణయాలను సంతోషంతో అంగీకరించడంలో మీ జీవిత భాగస్వామి మీ మాదిరిని అనుసరించాలి. ఉన్నతమైన ఆశయ సాధనను కొనసాగించాలి

వివాద సమయంలో గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన నియమం సువార్త వ్యాప్తిని గూర్చిన ఉన్నతమైన ఆశయం. నా ఉద్దేశమేంటంటే, వివాద సమయంలో మనం కురచబుద్ధితో వ్యవహరించి, వివేచన కోల్పోతాం. గోడమీద గీసిన చిత్రంలో మనకు ఒక కోణమే కనబడినట్లు వివాదంలో అత్యల్ప విషయాలు మన దృక్పధాన్ని ఒక కోణంలోనే ఆలోచించేలా చేస్తాయి. అయితే వివాదంగుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు కలుగచేసే ఫలం పై మనం మరలా దృష్టి సారించాలి. ఫిలిప్పీ సంఘంలో ఉన్న చిన్న చిన్న వివాదాలను పరిష్కరించడానికి పౌలు వారి మనసుల్ని, దృష్టిని పెద్ద విషయాలపైకి మళ్ళించాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో తనతో సువార్త పరిచర్యలో వారు ఏకీభవించారని చెప్పాడు(17వ). ప్రోత్సాహం, ఆదరించు ప్రేమ, ఆత్మతో నిండిన వనరులు, క్రీస్తునుంచి వారు పొందుకున్న మహాకనికరం మొదలగు విషయాలను వారికి గుర్తుచేసి, వారిని క్రీస్తు కేంద్రిత ఐక్యత కలిగి ఉండాలని 2వ అధ్యాయంలో వారికి పిలుపునిచ్చాడు (వ:2,3). 3వ అధ్యాయంలో భక్తిగల ఆత్మీయ నాయకులను అనుసరించమని వారికి సవాలు విసిరాడు (వ: 16, 17). సంఘంలో ఉన్న విబేధాలను తొలగించమని 4వ అధ్యాయంలో నాయకులకు ఉపదేశించాడు (వ.3). ఆ విధంగా వారిని వివాదాలకు అతీతంగా ఆలోచింపచేశాడు. ఇది గొప్ప నాయకత్వపు సారం!

వ్యక్తుల మధ్య వివాదాలు పరిచర్యలో ఉన్నతమైన ఆశయాలకు దూరంగా మన దృష్టిని చాలా తొందరగా మళ్ళిస్తాయని మంచి నాయకులకు తెలుస్తుంది. ఉద్రేకపూరితమైన వివాదాలున్నప్పుడు, తన రాజ్యవాప్తికోసం దేవుడు చేస్తున్నదానిపై దృష్టిపెట్టడం కష్టం. ప్రజల్ని దేవుని ఉన్నత ఆశయాల గురించి గుర్తుచేసే పూర్వస్థితికి వారిని తీసుకురావాలి. సువార్త పరిచర్య యొక్క మహోన్నత ఆశయంపై దృష్టి కోల్పోతే, బేధాభిప్రాయాలు ఎంత చిన్నగా మొదలైనా అవి జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. వివాదం వచ్చినప్పుడు, మనకున్న ఉన్నతమైన ఆత్మీయ ఆశయాల సాధనలో మన బేధాభిప్రాయాలు ఎంతవరకు సహకరిస్తున్నాయి, ఏ మేరకు అడ్డుగా నిలుస్తున్నాయి అనే విషయాలు ఇతరులకు చూడగలిగేలా సహాయం చేయాలి. వివాదం తర్వాత వచ్చే నిరుత్సాహాన్ని తగ్గించడానికి పౌలు ఫిలిప్పీలోకి సంఘనాయకులను ప్రపంచవ్యాప్తంగా సువార్త ద్వారా దేవుడు చేస్తున్న దానిని వివరించాడు. ఆ సంఘంలో యువోదియ, సుంటికేను అను స్త్రీల మధ్య తీవ్రమైన వివాదం వచ్చింది. ఆ సంఘానికి రాసిన ఈ పత్రికలో పౌలు నేరుగా ఆ వివాదం గురించి ప్రస్తావించేంత పెద్ద వివాదంగా అది మారిపోయింది. పౌలు ఈ ఇద్దరి స్త్రీల ఆలోచనను విశాలపరిచాడు. “ప్రభువునందు ఏకమనస్సుగలవారై ఉండండి” అని పౌలు యువొదియకూ, సుంటుకేకూ చెప్పాడు. ఆ తర్వాత “అవును నిజమైన సహకారీ ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పరిచర్యలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారులు పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి” అని పౌలు రాశాడు. వ్యక్తుల మధ్య వివాదాలు తరచూ పాపానికి కారణం కాగా, పాపం భయాన్ని పుట్టిస్తుంది. ఇతరుల పాపాన్ని చూచి, క్రైస్తవ సహవాసానికి శాశ్వతంగా నష్టం వాటిల్లుతుందని మనం భయపడతాం. మన పేరు ప్రతిష్టలకు అవమానం కలుగుతుందనీ, పరిచర్యలో మనం స్థానాన్ని కోల్పోతామనీ భయపడి మనం మూర్ఖంగా ప్రవర్తిస్తాం. వివాదం మనలోని అతి నీచమైన గుణాన్ని బట్టబయలు చేసినప్పుడు మనం నమ్మకత్వాన్ని కోల్పోతామని మనం భయపడతాం. అలాంటి నిరుత్సాహకరమైన సమయాల్లో మీ నమ్మకమైన భాగస్వామ్యం ద్వారా దేవుడు ఎంతో గొప్పగా, విస్తారంగా చేస్తున్న కార్యాల గురించి గుర్తుచేయడం ఎంత అద్భుతమైన కృప!

 

వివాదంలో భాగమైన వారందర్ని దాని పరిష్కారంలో పాలుపొందేలా ప్రోత్సహించండి

వివాదాన్ని పరిష్కరించాలంటే ఐదవ నియమం ఇదే. ఫిర్యాదులు చేయడానికి లొసుగులు వెదకడం సులభమే. నాయకత్వ బృందాలు తరచూ ఫిర్యాదులు చేయడంలో నిష్ణాతులైన వారితో నిండి ఉంటున్నాయి. వీరు సమసల్ని పరిష్కరించడానికి కాక కేవలం ఫిర్యాదు చేయడానికే నిరంతరం కారణాలు చూపిస్తారు. కానీ పరిష్కార మార్గాల్ని సూచించరు. వారికి ప్రతీది చీకటిగానే కనబడుతుంది. కొండ ప్రక్కనే దాక్కొని కాల్పులు జరిపి, వెంటనే పోరాటాన్ని విరమించుకొనే వారిలా, వీరు పరిచర్యను నాశనం చేసే ప్రతీ అంశాన్ని విస్తారంగా చర్చించి తర్వాత మెల్లగా ప్రక్కకు తప్పుకుంటారు. నాయకుల సమావేశాన్ని వీరు పూర్తిగా భగ్నం చేసి, అందున్న ఆనందాన్ని పూర్తిగా హరించేయగల సమర్థులు వీరు. సమస్యను చూపించే వారిని “మనం ఇప్పుడు ఏం చేయాలని మీరు భావిస్తున్నారు? మనం ఎలా ముందుకెళ్ళాలి? అనే ప్రశ్నలు అడుగుతాను. ఫిర్యాదులు చేసేవారే పరిష్కారాలు కనుగొనడంలో నిమగ్నమవడం కీలకమైన విషయం. వారి అంచనాలకు తగినట్లే పరిష్కారాలు పనిచేయకపోతే వారు మరింత విమర్శనాత్మక ధోరణి కనబరచి, ఫలితంగా వచ్చే పరిణామాలకెన్నడూ బాధ్యత వహించడం నేర్చుకోరు. తద్వారా వారెన్నడూ మంచి నాయకులు కాలేరు.

వివాద పరిష్కారంలో ఇతరుల్ని నడిపిస్తున్న్పడు ఆ ప్రక్రియలో అందరూ పూర్తిగా నిమగ్నం కావాలని నేను ప్రతి ఒక్కరినీ అర్ధిస్తున్నాను. ఇది మూడు ముఖ్యమైన ఆశయాలను నెరవేరుస్తుంది. మొదటిగా, వివాద పరిష్కార ప్రక్రియలో నిమగ్నమైన వారందరూ తనను తానే పరీక్షించుకొనేందుకు కారణమవుతుంది. వివాదాలు ఇతరుల్ని నిందించడానికి, నిందను వేరొకరి పైకి త్రోసివేయడానికే ఎక్కువశాతం మనల్ని పురికొల్పుతాయి. అయితే వివాదం మన స్వభావంపై ఒత్తిడి చేసి, మన అంతరంగాన్ని బహిర్గతం చేస్తుంది. నిజాయితీతో కూడిన స్వీయపరిశీలన ఆ సమయంలో చాలా కీలకం. తమ బలహీనతలు బహిర్గతమవుతాయనే భయంతో చాలామంది నాయకులు మౌనమైపోతుంటారు. వారు అన్ని సమావేశాలకు హాజరవుతారు, సమాచారాన్నంతటినీ సేకరిస్తారు. అయితే తప్పు చేస్తామనే భయంతో ఆ సమస్య పరిష్కారానికి ఏ విధంగానూ పూనుకోరు. సమస్య పరిష్కార ప్రక్రియలో ఇది అంగీకారయోగ్యమైంది కాదు. మనల్ని మనం పరీక్ష చేసుకుంటున్నప్పుడు దేవుని నమ్మకత్వం గురించి అతిశయించగలం, మన బలహీనత విషయంలో దుఃఖపడతాం.

రెండవదిగా వివాద పరిష్కారంలో అందరూ నిమగ్నమవడంవల్ల అది వారి వరాలను అత్యధికంగా అభివృద్ధి చేసుకోవడానికి సహకరిస్తుంది. వివాద పరిష్కారంలో పరిశుద్ధాత్ముడు ప్రజల్ని విలక్షణమైన, వినూత్నమైన రీతుల్లో ఉపయోగించుకోవడం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సమస్యల పరిష్కారానికి అవసరమైన దాన్నంతటినీ కేవలం ఒక్కడే ఎప్పటికీ అందించలేడు. చురుకైన నాయకులు ఒత్తిడితో కూడిన సమావేశాల్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుని బిడియపడే నాయకులను "ప్రభువు తమను ఎప్పుడైనా ఉపయోగించుకొంటాడా?” అని ఆశ్చర్యపోయేలా చేస్తారు. అందుచేతనే నేను ప్రతి నాయకునికి దేవుడు అనుగ్రహించిన వ్యక్తిత్వాన్నీ, వరాన్నీ ఉపయోగించుకొనేలా వారిని సమస్య పరిష్కారంలో భాగస్థులను కమ్మని ప్రోత్సహిస్తున్నాను. ప్రతీ నాయకుడు తన ఆత్మీయ పరిణతినీ, వరాన్నీ, సామర్థ్యాన్ని ఉపయోగించి సమస్య పరిష్కారానికి తోడ్పడాలని నా అభిలాష. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కోరీతిలో నిర్మించాడు. కొద్దిమంది నాయకులు పనుల్ని పూర్తిగా నెరవేర్చేవరకూ నిద్రపోరు, మరికొద్దిమంది ప్రారంభించి, మధ్యలోనే ఆపేస్తారు. కొందరైతే అసలు దేవుడు తమకనుగ్రహించిన వరాల్ని ఏమాత్రం ఉపయోగించరు, పనులు ప్రారంభించరు. అయితే ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మకు లోబడినప్పుడు సమావేశంలో ఉన్న ప్రతి విలక్షణమైన నాయకునిలోనూ ఆయన జ్ఞానం ప్రవేశిస్తుంది. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన ఆత్మవరాల్నీ, నైపుణ్యాల్నీ పురికొల్పడం గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది.

మూడవదిగా, వివాద పరిష్కారంలో నిమగ్నమైన ప్రతి ఒక్కరూ రాబోయే సత్ఫలితానికి గానీ దుష్పరిణామానికి గానీ బాధ్యత వహించడానికి సిద్ధపడి ఉండాలని నేను ప్రోత్సహిస్తాను. నాయకులుగా మనం ఆత్మలకు కాపలాకాస్తుంటాం. వివాద పరిష్కారంలో పాల్గొన్నప్పుడు విసుగుచెంది, ఆ ప్రక్రియ నుంచి విరమించు కోవడం సహకరించదు. యుద్ధరంగంలో విశ్వాసులను సిద్ధంచేసి, వారికి బలమైన వాక్యపు ఆయుధాలను ఇచ్చి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పించకుండా విడిచిపెట్టడం చాలా దారుణం. అలాంటప్పుడు ప్రజలు అసహనానికి గురై బలవంతులు కావడానికి తప్పుడు మార్గాల్ని ఎంచుకుంటారు. అందుచేతనే మన బోధను అన్వయించుకునే వరకు మనం వివాద పరిష్కార ప్రక్రియలో విశ్వాసులతో ఉండాలి. వివాద సమయంలో తాము చేసే బోధకు నాయకులు బాధ్యత వహించాల్సింది. ఈ విధంగానే! మనం ఇతరుల్ని అన్వయించుకోమంటున్న సత్యాన్ని మనం అన్వయించుకొని మాదిరిచూపడం ఈ విధంగానే. దేవుని ప్రజల్ని హెచ్చరించి, దాని ప్రభావం వారి జీవితాల్లో కనబడుతుందో లేదో పట్టించుకోకపోవడం నామకార్థపు సేవే అవుతుంది. మనం మన ప్రజల్ని పోషించాలి, నడిపించాలి. మన ప్రజలు బాధాకరమైన వివాదంగుండా పయనిస్తున్నప్పుడు, వారితో నడుస్తూ, మన సలహాను వారు అన్వయించుకుంటున్నారో లేదో పరీక్షించడం తప్పనిసరి. బాధ్యతలేని అధికారం ప్రమాదకరమైంది. బాధ్యత తీసుకోకుండా కేవలం అధికారాన్ని మనం ప్రదర్శిస్తుంటే మన సలహాను ప్రజలు పట్టించుకోరు. ప్రజలు నిరంతరం సమస్యల్లో చిక్కుకుని బాధపడుతున్నప్పుడు, గాయపడిన ఆ విశ్వాసుల్ని సమీపించి సేవించడానికి బదులు వారిని నిర్లక్షం చేసి అదే సమయంలో తమ ప్రసంగాల్లో 'ఖండించు, గద్దించు, బుద్ధిచెప్పు' విషయాల్లో తమ సామర్థ్యం గురించి చాలామంది నాయకులు అతిశయిస్తుంటారు. అయితే నిజమైన కాపరి వాక్య నియమాలను ఎలా అనుదిన జీవితంలో అన్వయించుకోవాలో శ్రద్ధగా ఆలోచిస్తాడు. నమ్మకమైన నాయకుడు ఇతరుల సమస్యల్లో వారికి తోడుగా ఉండి క్రమక్రమంగా సత్యం వారిపై ప్రభావం చూపేలా చేస్తాడు. ఫలితంగా వివాదాన్ని పరిష్కరించుకొనే విషయంలో ఇతరులకు సహాయపడడమనేది కేవలం ఊహాజనితమైనది కాక నిజరూపం దాల్చుతుంది. అప్పుడు బైబిల్ ఇచ్చే పరిష్కార మార్గాలు స్పష్టమవుతాయి. నమ్మకంగా ప్రజలు వాటిని అన్వయించుకుంటారు. తద్వారా క్రీస్తు సమాధానం మన హృదయాల్లో రాజ్యమేలుతుంది. సమాధానపరిచే ప్రక్రియలో పాల్గొనడం వలన అది వచ్చిన ఫలితాన్ని వాక్యానుసారంగా నిర్ధారించుకొనేలా మనల్ని బలవంతం చేస్తుంది. సమాధాన ఫలం గురించి దేవుడు ఏమి చెబుతున్నాడు? ఒకరితో ఒకరు ఐకమత్యంతో జీవించే విషయంలో మనం వాక్య ప్రమాణాలకు అనుగుణంగానే జీవిస్తున్నామా? లేదా? పరీక్షించుకోవాలి. క్రీస్తును సంతోషపెట్టే విధంగానే మనం వివాదాన్ని పరిష్కరించామా? ఈ ప్రశ్నలకు నిరంతరం సమాధానం చెప్పడం వల్ల అది మనల్ని ఐక్యతకు నిర్బంధించి, మరింత ఎక్కువగా ఒకరినొకరు ప్రేమించుకోవడానికి పురికొల్పుతుంది.

 

అపనమ్మకాన్ని కాదు, జాలిని పెంపొందించుకోండి

మరొక నియమం అపనమ్మకం ఏలకుండా జాగ్రత్తపడడం. ఒకరి యెడల మరొకరం జాలి చూపించాలనీ, ఇతరులు మనకు హాని తలపెట్టినప్పుడు సహనంతో వ్యవహరించాలనీ దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు (2 తిమోతి 2:24;). ప్రజలు ఆత్మీయంగా పసిపిల్లల్లా వ్యవహిస్తున్నప్పుడు, వారి ఆత్మీయ దుస్థితిని చూసిన ఏ మంచి నాయకుకైనా హృదయం బద్దలైన అనుభూతే కలుగుతుంది. దీన్ని నాయకులు తప్పించుకోలేరు. మన సంరక్షణలో ఉన్న కొందరు గొట్టెల చర్మాల్లో ఉన్న మొండి గాడిదలు ఇలాంటి పరిస్థితుల్లో సమస్యల్ని పరిష్కరించుకోగలరా? లేదా? అనే అపనమ్మకం కలగడం సహజమే. ప్రజా సమస్యలు మనల్ని ప్రవాహంలా ముంచెత్తి నప్పుడు, మనం వారిలోని అత్యల్పమైన సమస్యలవైపు, అసభ్యకరమైన ప్రవర్తనవైపు దృష్టి మళ్ళిస్తాం. వారికి సహాయం చేయాలన్న మన ప్రయత్నాలకు వారు మరొకమారు విఘాతం కలిగించారనే నిరుత్సాహంతో మనం మన హృదయాల్లో వారిపట్ల ప్రతికూల భావాన్ని ఏర్పరచుకుంటాం. మనం కనికరం లేకుండా మారిపోయి, మారాలనే వారి కోరికపై నమ్మకం ఉంచలేము. అపనమ్మకమంటే ప్రేమ లేకపోవడమే (1 కొరింథీ 3:17;, 1 యోహాను 3:17;).

అదే సమయంలో ఇతరుల పాపం గురించి వారితో నిర్మొహమాటంగా ప్రేమతో మాట్లాడాలి. మనల్ని చుట్టుముట్టిన వ్యక్తిగత బలహీనతలు ఇతరులయెడల జాలిపడేలా మనల్ని ప్రోత్సహించాలి. ఆత్మీయ యుద్ధ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపిని ఆత్మీయంగా నిరంతరం, అనుక్షణం కాపాడి పోషించే కృపను మనం గట్టిగా చేపట్టాలి. గాయపడిన వ్యక్తుల మధ్య వివాదాన్ని పరిష్కరించడం సులభం కాదని మనకు తెలుసు (సామె 18:19;). దేవుడు మనయెడల సహనం కలిగివున్నాడు. అయితే మన పాపేచ్చల్ని వేళ్ళతో సహ పెరికివేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ప్రారంభదినాల్లో ఆయన చేసిన క్రమశిక్షణ కొద్దిమందిని సున్నితంగా మారుస్తుంది. మారాలని ఇష్టపడే వారిని చూసి జాలిపడడం మనకు సులభమే. అయితే కొద్దిమందిని దేవుడు తన వారుతోనూ, కళ్లముతోనూ అదుపు చేస్తాడు (కీర్తన 32:9;).

మరికొంతమందిలో గొప్ప ఆత్మీయ ఆకలి పుట్టించడానికి ఆత్మీయ ఎడారిలోకి దేవుడు పంపిస్తూ ఉంటాడు. తన బిడ్డలను పరిశుద్ధతలో పెంచడానికి ప్రభువు ఏ పద్దతిని ఎన్నుకున్నా వారి ఇబ్బందిని అర్థం చేసుకుని, ఆ సమస్యలో వారియెడల మనం కనికరపడాలి.

 

నాయకునిగా ఇతరులకు అందుబాటులో ఉండండి

మీ సంఘంనుంచి దాక్కోవద్దు! నిత్యమూ గొట్టెల మధ్య ఉండేవారే కాపరులని అపొస్తలులు సేవకులను ప్రస్తావించారు. “మీ మధ్యనున్న దేవుని మందను కాయండి”, అని పేతురు చెప్పాడు (1 పేతురు 5:2). “మీ మధ్య మేము దీనులుగా ఉన్నాం ”, అని 1థెస్స 2:7లో పౌలు చెప్పాడు. ప్రజల మధ్యన వారికి అందుబాటులో ఉండండి. నాయకత్వ సమావేశాల్లో విషయాలన్నింటినీ, వారు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ మనం సంఘస్థులతో చెప్పాల్సిన పని లేదు కానీ అంతరంగంలోని యధార్థత బహిరంగ జీవితంలో దాపరికం లేకుండా చేస్తుంది. నాయకత్వపు భారం గురించి సంఘంతో బహిరంగంగా మాట్లాడండి. అయితే ప్రభువు ఎలా నడిపిస్తున్నాడో కూడా తెలియచేస్తూ వారిని చక్కగా ప్రోత్సహించండి. లేఖనాన్ని హెచ్చించి, ప్రజలకు ఆత్మీయంగా క్షేమాభివృద్ధినిచ్చి పాపంతోనూ వివాదంతోనూ దేవుని ప్రజలు ఎలా వ్యవహరించాలి అనే విషయాల్ని ఎన్నడూ దాచవద్దు. తాము ఏం తెలుసుకోవచ్చు, ఏం తెలుసుకోకూడదు అనే విషయాల గురించి కూడా సంఘస్తుల్ని అన్నివేళలా ప్రార్థించమని చెప్పండి. మందకు మీరు అన్నీ చెప్పాల్సిన అవసరంలేదు. అలాచేస్తే వారు మోయనక్కరలేని భారాన్ని మనం వారిపై మోపినట్లవుతుంది. నేర్చుకొని ఎదగడానికి సంసిద్ధులుగా ఉన్నవారికి నాయకునికి జీవితం అందుబాటులో ఉన్నప్పుడు పాపవివాదానికి ఇక అవకాశమే ఉండదు.

ప్రభువా వివాదంలో ఉన్న నీ ప్రజలను కాయడానికి నీ వాక్యం నుంచి జ్ఞానాన్ని పొందుకునే సామర్థ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను. మీ వాక్యంనుంచే, పరిచర్యలో మాకు ముందుగా పయనించిన వారి నుంచే నేర్చుకోవడానికి సహకరించండి. మీ ప్రజలకు సహకరిస్తూ ఆ ప్రక్రియలో నేను కూడా క్షేమాభివృద్ధి పొందడానికి మీ వాక్యం నుంచి ప్రతి జ్ఞానయుక్తమైన నియమాన్ని నేను శ్రద్ధగా, సహనంతో ఆచరణలో పెట్టడానికి సహాయం చేయండి. నన్ను దీనునిగా ఉంచండి, ఇతరుల అభిప్రాయాలకూ విలువనివ్వడంలో నన్ను మాదిరిగా ఉండనీయుడి, నా రక్షకునిలోని కృపా కనికరాలను నాలోనూ అభివృద్ధి చేయండి, ఆమెన్!

 

11. నాయకులు పతనమైనప్పుడు

సుదీర్ఘకాలం మా సంఘ నాయకత్వ బృందంలో పనిచేసిన వ్యక్తి కొన్నేళ్ళ క్రితం పాపంలో జీవిస్తున్న విషయం బట్టబయలై మా సంఘం సంక్షోభాన్ని ఎదుర్కొంది. నిజానికి అతడు చాలాకాలంగా ఆ పాపంలోనే ఉన్నాడు. అయితే ఒక వారాంతంలో అది వెలుగులోకి వచ్చింది. ఆ విధ్వంసకరమైన వార్తను ఆదివారం సంఘంలో తెలియచేయాలనుకొని ఆ శనివారం రాత్రి సొలొమోనులాంటి జ్ఞానంకోసంప్రార్థించడంమొదలుపెట్టాను.మేముప్రతివారంధ్యానించేవాక్యభాగాన్నిఆవారంఆపాల్సివచ్చింది.నేనుకాపరిగాఇంతకుముందెన్నడూఎదుర్కోని పరిస్థితిని అప్పుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. నాయకుని పతనం మూలంగా కలిగిన సంక్షోభం పరిచర్యను పూర్తిగా కుంటుపరిచేలా కనిపించింది. సంఘంలో ప్రతి ఒక్కరూ నిర్ఘాంతపోతారనీ, దుఃఖపడతారనీ నాకు తెలుసు. అయితే ఆ నాయకుడు నైతికంగా పతనం కావడం వలన దాదాపు దశాబ్ద కాలం పైనే బాధననుభవించిన కొందరు విశ్వాసులకు ఉపశమనం కలుగుతుందని కూడా నేను గ్రహించాను. ఈ విధమైన సంక్షోభం సంఘంలో కలిగినప్పుడు నాయకులు ఎలా వ్యవహరించాలో సెమినరీ క్లాసులు ఏమీ లేవు. ఈ పతనావస్థ నుంచి మా సంఘాన్ని ఎలా కాపాడాలి? వారు నిరాశ నిస్పృహల్లో పడిపోయి, చీలిపోకుండా ఉండడానికి వారికి ఎలా సహాయపడాలి? చెల్లాచెదురైపోకుండా, ప్రభువుకు అవమానం తీసుకురాకుండా మా పరిచర్య ఎలా నిలుస్తుంది? ఇలాంటి ఆదివారాన్ని మేము ఇంతకుముందు ఎన్నడూ ఎదుర్కోలేదు.

నేను మా పిల్లల్నీ వారి జీవిత భాగస్వాముల్నీ నాతో ఆరాధనలో కూర్చోమని చెప్పాను. నేను చెప్పబోయే సందేశం సాధారణమైంది కాదు కాబట్టి దాన్ని సంఘం ఎలా తీసుకుంటుందని నేను కొంత ఆందోళన చెందాను. వారి ప్రేమానురాగాలు నాకు ఆదరణనిచ్చాయి. అయితే సంఘం నా జీవితంలోనూ పరిచర్యలోనూ ఏదైనా సంక్షోభం ఉందేమోనని ఊహించుకుంటుందని నేను చింతించాను. ఆ రోజు ఆరాధన ప్రారంభపు ఆహ్వాన పలుకుల్నే చాలా జాగ్రత్తగా చెప్పించాను. మొదటి 30 నిముషాల్లో పరిస్థితి అంతా బాగానే ఉందన్నట్లు మేము వ్యవహరించకూడదు. అదే సమయంలో మేము క్రీస్తును ఆరాధించడానికి సమకూడిన ప్రజలమనే వాస్తవాన్ని కూడా విస్మరించకూడదు. మా ఆరాధనా కార్యక్రమాన్ని ప్రారంభించే వ్యక్తితో ఈ క్రింది మాటలు చెప్పమన్నాను. “ఈ ఉదయం మన ఆరాధన కార్యక్రమాన్ని కొంచెం భిన్నంగా ప్రారంభించుకోబోతున్నాం. మొదట రెండు, మూడు కీర్తనలు పాడిన తరువాత నాయకత్వ బృందంలో జరగిన తీవ్రమైన తప్పిదాన్ని సరిచేయడానికి మన పాస్టర్ గారు కాపరిగా రాబోతున్నాడు.” మొదట మన సంఘ విశ్వాసులకు నేను కాపరిననే విషయాన్ని గుర్తుచేసి, వారు ఆ సమయంలో ఎదుర్కొబోయే సమస్యలో వారితో కలిసి నేను పయనిస్తానని వారు తెలుసుకోవాలని భావించాను. నాయకత్వ బృందంలోని సంక్షోభం నా జీవితానికీ భక్తికీ ఏ విధంగానూ ముడిపడిలేదు. అలాంటి మాటలతో ఆరాధనను ప్రారంభించి, వారిని కూడా ముందుగానే సమస్యను ఎదుర్కొనేలా సిద్ధం చేశాను. తద్వారా మేమంతా కలిసి ప్రభువును సమీపించేందుకు అది సహకరించింది.

నాయకత్వ బృందంలోని లోపం నైతికమైనదైనా, సిద్ధాంతపరమైనదైనా అది సంఘాన్ని లేఖనాలవైపు మళ్ళిస్తుంది. అలాంటి సమయాలు మన వైఖరినీ, స్వభావాన్నీ ప్రభువుతో మన నడక విషయంలో సంతృప్తి చెందే మన ధోరణిని పరీక్షించుకొనేలా ఒత్తిడి చేస్తాయి (1కొరింథీ 4:3-5;; గలతీ 6:4-5;). తన ప్రజల పవిత్రతనూ ఐక్యతనూ నాశనంచేసే వారిని బట్టబయలు చేసి దేవుడు తన ప్రజలను భద్రపరుస్తుండగా, మనం ఆయనముందు దీనమనస్సుతో నడవాలని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఆత్మీయ పతనం సంఘాన్ని మేల్కొలుపుతుంది. అది నమ్మకస్థులు తమ ఆత్మీయ ఉష్ణోగ్రతను కొలుచుకొనేలా చేసి, తమలో ఆయాసకరమైనదేమైనా ఉందేమో పరీక్షించుకొనేలా చేస్తుంది (కీర్త 139:24;). నాయకత్వ బృందంలో పతనం కలిగినప్పుడు సంఘాలు మనుగడ సాగించలేవు. సమస్యను పరిష్కరించి సామరస్యంతో ముందుకెళ్ళడానికి ఎన్నో నెలల సమయం పడుతుంది. ఇలాంటి సమయాల్లో ఆత్మీయ సహనం అవసరం, నాయకత్వంలో సంక్షోభం ఏర్పడినప్పుడు మనుగడ సాగించడానికి అవసరమైన జ్ఞానాన్ని దేవుడు ధారాళంగా అనుగ్రహిస్తాడు.

 

నాయకత్వంలో లోపాన్ని భరించాల్సిన పద్ధతి

లోపాలున్న నాయకుడి వలన, అకస్మాత్తుగా అనర్హుడైన నాయకుడి వలన కలిగే విషాదాన్ని పరిచర్యలో ప్రతి ఒక్కరూ అనుభవించకపోవచ్చు. కానీ కొద్దిమంది నాయకుల పతనం మాత్రం సాధారణంగా జరిగేదే! దేవుని ప్రజల్ని, వారి ప్రభావాన్ని మింగేసి, వారి విశ్వాసాన్ని ధ్వంసం చేయడానికి సాతాను అన్నివేళల్లోనూ ఎదురుచూస్తూనే ఉంటాడు (1 పేతురు 5:8;). వాడు సంఘ కాపరుల్ని కొట్టగలిగితే, ఆ తర్వాత అనేక సంవత్సరాపాటు గొట్టెల్ని చెదరగొట్టగలుగుతాడు. నాయకత్వ పతనం మూలంగా సంఘాలు ఇంతకు మునుపెన్నడూ అనుభవించని కొన్ని శోధనలకు గురవుతాయి. ఉద్వేగపూరితమైన శ్రమ మన దృష్టిని లేఖనాల నుంచి దూరంగా మళ్ళిస్తుంది. అందువల్ల మనం మన విశ్వాసానికి కర్త దానిని కొనసాగించువాడు అయిన (యేసువైపు) చూడకుండా ఉపశమనం కోసం వెంపర్లాడుతుంటాం (హెబ్రీ 12:2;). నాయకత్వ పతనానికి మనం జ్ఞానయుక్తంగా, దీనమనస్సుతో, క్రీస్తును ఘనపరిచే విధంగా స్పందించడానికి మనకు బలమైన వాక్య నియమాలు అవసరం. ఆ ఆదివారపు ఉదయాన మా స్పందనను బలపరచి, మా హృదయాలను మనస్సులను భద్రపరచే నాలుగు నియమాలను నేను బోధించాను. ఆ తర్వాత రాబోయే కాలంలో వారికి పెను ఉప్పెనలా ఎగిసిపడే ఐదు శోధనల గురించి వారిని హెచ్చరించాను!

 

సంఘం ప్రభువైన యేసుక్రీస్తుకు చెందినది

నా సహచరుని రహస్య పాప జీవితాన్ని నేను కనిపెట్టిన వెంటనే, నాకు సుదీర్ఘకాలం ఆత్మీయ పాఠాలు నేర్పించిన గురువుకు కావాల్సిన జ్ఞానం కోసం, ప్రోత్సాహం కోసం ఫోన్ చేశాను. ఆయన చెప్పిన మొదటి మాటల్ని నేను ఎన్నటికీ మరచిపోలేను. “ఇందులో చాలా గొప్ప విషయం దాగివుంది” అని ఆయన చెప్పారు ఈ మాట నన్ను చాలా ఆశ్చర్యపరచింది. "ఏ విధంగా?” అని నేను అడిగాను. “ఇప్పటివరకు ఈ వ్యక్తి మీ మధ్యలోనే ఉండి పాపం చేస్తున్నాడు. అయినా దేవుడు నీ ప్రజల్ని అతని పాపం మూలంగా కలిగే పరిణామాల నుంచి భద్రపరిచాడు. ఇప్పుడు అతని పాపం బట్టబయలైంది. కాబట్టి మీ ప్రజలకు గొప్ప నిగ్రహశక్తి, ఆత్మీయ బలమూ కలుగుతాయి తద్వారా సువార్త సేవలో వారు గొప్పగా ఉపయోగపడతారు,” అని అతడు సమాధానం చెప్పాడు. అలాంటి పరిస్థితులెన్నో రుచిచూసిన అనుభవశాలియైన సైనికుడాయన. కాబట్టి ఆయన ఇచ్చిన సందేశం ఆ సమయానికి ఎంతో సహకరించింది.

ఇది అత్యావశ్యకమైన మొదటి నియమం. 'నేను నా సంఘాన్ని కట్టుదును, పాతాళలోకపు ద్వారములు దానియెదుట నిలువజాలవు,” అని ప్రభువైన యేసు చెప్పాడు (మత్తయి 16:18). ఆయన తన సంఘాన్ని నిర్మించుకుంటున్నాడు. మన సంఘ జీవనంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా, శత్రువు తన దుష్టకార్యాల్ని సంఘంలో అమలుచేయడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, స్థానిక సంఘంలో పరిచర్య మన పరిచర్య కాదు. సంఘానికి ఎన్ని మచ్చలూ, ముడతలూ ఉన్నా కూడా అది మహా ఘనుడూ ప్రభువూ అయిన యేసుక్రీస్తుకు చెందినది. సంక్షోభంలో ఉన్న ప్రజలు సత్వరమే కుదురుకోవాలి. సంఘంలో పాపం కనబడగానే దేవుడు ఆ సంఘాన్ని విడిచి పెట్టేశాడన్నట్లు మనయెడల మనమే జాలిపడి, నిరాశ నిస్పృహలకు గురయ్యే సమయం కాదిది. నాయకత్వ స్థానంలోని ఘోరమైన పాపం బయలుపడగానే ఇతర నాయకులు రాబోయే విమర్శలకు సమాధానం చెప్పడానికి సిద్ధపడి, ప్రజల్ని అదుపుచేసి, ఉద్రేకంతో స్పందించేలా శోధించబడతారు. దీనిమూలంగా సంఘస్థులు తమకు గాయమవుతుందనే భయంతో ఇతరులకు పరిచర్య చేయడం మానుకుంటారు. గోధుమల మధ్యలో గురుగులు ఎన్నడూ ఉండవన్నట్లు మనం భయభ్రాంతులకు గురై వింతగా ప్రవర్తించ మొదలు పెడతాం (మత్తయి 19:25;). అయితే తన వారెవరో ప్రభువుకు తెలుసు (2తిమోతి 2:19;). "అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలబెట్టుకోవాలని” మనల్ని రక్షించాడు (ఎఫెసీ 5:27). మన ప్రభువు కోరినట్లు మనం ఇప్పుడు లేము. అయితే ఆయన మొదలు పెట్టిన కార్యాన్ని ఆయన పూర్తిచేస్తూ ఉన్నాడు (ఫిలిప్పీ1:6;). మనల్ని ఆయన స్వరూపంలోకి మార్చుకోవడానికి తనకున్న మహిమా ప్రభావాలతో మనల్ని తనయెదుట కనపరచుకుంటాడు.

 

దేవుడు పరిశుద్దుడు కనుక ఆయనకు పవిత్రమైన సంఘమే కావాలి.

సమస్యలో ఉన్నప్పుడు సంఘం ప్రభువును వెదికి, ఆయన వాక్యానికి వణికేలా నిర్బంధించబడుతుంది (యెషయా 6:22). దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరతాడు (కీర్తన 51:6;). 'మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అనే విషయం తెలుసుకోండి” అని లేఖనం చెప్పే మాటల్ని మనం నమ్ముతాం (సంఖ్యా 32:23;). పతనమైన నాయకులు నిరంతరం తమ విశ్వాస విషయంలో ఓడ బ్రద్ధలైపోయిన వారివలె ఉంటారు (1తిమోతి 1:19). దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తన సంఘం కూడా తన పరిశుద్ధతకు సమరూపంగలదిగా ఉండాలని ఆయన కోరతాడు (1 పేతురు 1:16;). దేవుని ప్రజల్ని నడిపించే వ్యక్తి అపవిత్రుడైతే అది విశ్వాసుల ఆత్మీయ ఇంద్రియాలను ధ్వంసం చేస్తుంది. గొఱ్ఱల్ని చెల్లాచెదురు చేసే స్వార్థపూరిత నాయకులను ఒక్కక్షణం కూడా మనం అంగీకరించకూడదు. అయితే సత్యసంఘం కూడా అపవిత్రులైన నాయకులతో ఖచ్చితంగా వ్యవహరించడానికి వెనకాడుతున్నట్లే కనిపిస్తుంది. వారు బాగా పేరు ప్రతిష్ఠలున్న వారైతే, వారిని మనం క్షమిస్తాం. బహిరంగంగా వారు క్షమాపణ కోరితే, మారుమనస్సుకు తగిన నిరంతర ఫలాన్ని మనం డిమాండ్ చేయము. వారు స్వచిత్తానుసారులైతే వారు మొదటిరకపు వ్యక్తిత్వం గలవారని మనం పేర్కొంటాం. కొద్దిమంది యౌవ్వన నాయకులు అహంకారులైనా, వారిని హెచ్చరిస్తూనే వారిపైన హస్తనిక్షేపణ చేస్తుంటాం. దేవుడు సంఘం పవిత్రంగా ఉండాలని కోరతాడు. ఆమె మచ్చలేనిదిగా మారేవరకూ తన ఇంటి పైన కూడా దేవుడు తీర్పు తీర్చకుండా ఉండడు. ఈ సత్యానికి అనుగుణంగా మన పరిచర్యలను సర్దుబాటు చేసుకోకపోతే నాయకుల్లో నైతికపరమైన, సిద్ధాంతపరమైన పతనం కొనసాగుతూనే ఉంటుంది (1 పేతురు 4:17;).

 

కేవలం దేవుని వాక్యం మాత్రమే పరిశుద్ధపరుస్తుంది.

మూడవదిగా, పరిశుద్ధపరిచేది కేవలం దేవుని వాక్యమేనని సంఘం గుర్తుంచుకోవాలి. మనం శాంతి సమాధానాలతో జీవిస్తున్నా, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నా దేవుని వాక్యం చెంతకు వేగిరపడి వెళ్ళాలి. “నీ సత్యంతో వారిని పరిశు ద్దపరచు, నీ వాక్యమే సత్యము” అని తన తండ్రికి ప్రార్థించేటప్పుడు తనయొక్క పరిశుద్ధపరిచే కార్యానికి మూలాన్నీ, శక్తినీ యేసు సూటిగా చూపించాడు (యోహాను 17:17;). సంక్షోభంలో మనం దేవుని వాక్యం దగ్గరకు మాత్రమే త్వరపడి వెళ్ళాలి. నాయకునితో సంక్షోభసమయంలో సత్యానికి మూలమైన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని ప్రజలు నమ్మకంగా, వివేచనతో ఉండలేరు. అయినాసరే పరిస్థితులు దుర్బరంగా ఉన్నప్పుడు తరచూ మనల్ని మనం భద్రపరచుకోవడానికి ప్రయత్నిస్తూ, జ్ఞానంకోసం దేవుణ్ణి వేడుకోవడంలో విఫలమవుతాం (యాకోబు 1:5;; యాకోబు 4:2;). సమస్యల్ని మనం కేవలం మనషుల అభిప్రాయాలతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటాం. తన వాక్యం ద్వారా మన మనస్సులను నూతనపరచి, సత్యాసత్యాలకు మధ్య బేధాన్ని కనుగొనే వివేచన నిచ్చేది పరిశుద్ధాత్మ శక్తే (హెబ్రీ 4:12;;హెబ్రీ 5:14;). కాబట్టి ఊహలనూ, మానవ సలహాలనూ మనం విడిచి పెట్టాలి. సంఘ ఆరాధనలో దేవుని వాక్య ప్రకటన చాలా ముఖ్యమైనది. కాబట్టి నాయకత్వ స్థాయిలో సంక్షోభం జీవితాన్ని మార్చగలిగే శక్తి కలిగిన సత్యం నుంచి అది మన దృష్టి మరల్చేలా మనం దానికి అవకాశ మివ్వకూడదు. మనం ఆత్మీయ ఆకలితో అలమటిస్తున్నప్పుడు మన ఆత్మలకు అత్యంత అవసరమైనది ఆహారమే!

 

సంఘాన్ని భద్రపరచాలంటే మనం మన హృదయాన్ని భద్రపరచుకోవాలి.

ఆఖరిగా సంక్షోభంలో ఉన్నప్పుడు మనం మన హృదయాల్ని భద్రపరచుకుని, “ప్రతీ ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టాలి” (2కొరింథీ 10:5;). ఆత్మీయ నిర్లక్ష్యమూ, వేషధారణలే పాపమనే పంట పెరగడానికి సారవంతమైన నేల అవుతాయి. తన కుమారులకు జ్ఞానోపదేశం చేస్తూ సొలొమోను ఒక కీలకమైన సత్యాన్ని చెప్పాడు. “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము (సామెతలు 4:23). మన ఆలోచనల్నీ, ఉద్దేశాల్నీ, అభిరుచుల్నీ, చిత్తాన్నీ, భావోద్వేగాల్నీ క్రీస్తు యొక్క పరిపూర్ణ ఉపదేశం పొందేలా చేయడానికి మన అంతరంగ జీవితాన్ని నిరంతరం శ్రద్ధగా చూసుకోవాలి. మన సంఘ జీవనం దేవుని అత్యధికమైన ఆశీర్వాదాలు పొందే స్థానంలో ఉండాలని మనం కోరుకుని, దానికోసం ప్రతీ వ్యక్తి కృషి చేయాలి. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేస్తుంది (1కొరింథీ 5:6;; గలతీ 5:9;). నైతికపరమైన, సిద్ధాంతపరమైన పతనం అకస్మాత్తుగా సంభవించదు, సంఘమంతటా హఠాత్తుగా ప్రాకిపోదు. దీన్ని మొదట గుర్తించడం కష్టం. నాయకత్వ బృందంలో ఒకడు ఆత్మీయ విషయాలను నిర్లక్ష్యం చేస్తూ, వేషధారణతో జీవిస్తుండగా అతని జీవితం నెమ్మదిగా బట్టబయలైనప్పుడు ఇతర నాయకులకూ సంఘానికీ తెలుస్తుంది. మనం ఎప్పుడైతే ఆత్మీయమైన వ్యాక్సిన్లు మన హృదయాల్లో వేసుకుంటామో, అప్పుడే మన సంఘపు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆత్మీయ వ్యాధులను సంఘం త్రిప్పికొట్టగలుగుతుంది.

 

నాయకత్వ పతనం మూలంగా కలిగే నష్టాల విషయంలో జాగ్రత్త పడాలి.

ఒక నాయకుడు విఫలమైనప్పుడు, సంఘం చీలిపోయినప్పుడు విశ్వాసులు ఇంతకుముందెన్నడూ ఎదుర్కోని వింతైన, శక్తివంతమైన శోధనల్ని ఎదుర్కుంటారు. ఇలాంటి బలమైన శోధనలు వారిపైకి దండెత్తకముందే మనం మన ప్రజల్ని వాటి గురించి సిద్ధం చేయాలి. మా నాయకత్వ బృందంలో ఒకని పతనం మూలంగా కలిగిన తీవ్రమైన శ్రమగుండా మా సంఘాన్ని నడిపించడానికి వారి ముందు నిలబడినప్పుడు, వారిలో తప్పనిసరిగా తలెత్తే 5 శోధనలగురించి వారిని హెచ్చరించాను. ఇవి భయభ్రాంతులకు గురిచేస్తాయి. వీటిని సులభంగా కొట్టిపారేయకూడదు.

 

మొదటి శోధన: పాపంతో కూడిన కోపం, ప్రతీకారేచ్చ.

నాయకత్వ సంక్షోభ సమయంలో ప్రజలు కోపంతోనూ ప్రతీకారేచ్ఛతోనూ రగిలిపోయేవిధంగా శోధింపబడతారు. మానసికంగానూ, భావోద్వేగపూరితంగానూ గాయపడిన వారు గొప్ప భక్తులైనప్పటికీ మోసపోయామన్న భావనకు లొంగిపోయి ప్రవర్తించే అవకాశముంది. నీవు నమ్మినవారే నిన్ను మోసగించి, ద్రోహం చేశారనే ఆలోచన, మరొకసారి మోసపోతామేమోనన్న భయం మీ ఆలోచనల్నీ, జీవితాన్ని దహించేస్తుంది. వారిపైన దాడిచేయాలనే శోధన చాలా తీవ్రంగా కలుగుతుంది. ఈ విధమైన స్పందనను లేఖనం చాలా ఖండితంగా నిషేదిస్తుంది. “ప్రియులారా! మీకు మీరే పగ తీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి - పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది (రోమా 12:19). కీడుకు ప్రతికీడు చేయడం ఎప్పుడు సమంజసం? ఎన్నడూ సమంజసం కాదు! ఎందుకు? ఎందుకంటే ప్రతిఫలమిచ్చేది దేవుడే! “పగతీర్చుట నా పని, నేను ప్రతిఫలమిస్తానని” ప్రభువు చెబుతున్నాడు. మోసపోయినప్పుడు, ఇతరుల ద్రోహానికి గురైనప్పుడు మాత్రం ఈ ఆజ్ఞకు దేవుడు మినహాయింపును ఒప్పుకొంటాడని విశ్వాసులు భావిస్తారు.

ప్రతికారం తీర్చుకోవడంలో మన సంస్కృతి ఆనందిస్తుంటుంది. లోకం ఇదొక సద్గుణమనే అభిప్రాయానికి వచ్చింది, కాబట్టి నీకు ద్రోహం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పకపోవడం బలహీనతకు సూచనగా చూస్తోంది. నిజ క్రైస్తవ్యం లోక సంస్కృతికి విరుద్ధమైనది. కీడును మేలుతో జయించాలని” దేవుడు మనల్ని పిలిచాడు ( రోమా 12:21;). ఒకసారి ఇతరులకు సహాయం చేయడానికి ముందుకెళ్ళి అవమానాల్ని ఎదుర్కొని, హింసలు పొందినా మరలా మనం ప్రేమతోనే వారిని చేరుకోవాలి (లూకా 6:29;). ఖచ్చితంగా ఇక్కడే మనం తొట్రుపడుతుంటాం. క్షమించడమంటే మనం మరింత మన రక్షకునిలా మారడమే! ఇతరులు మనల్ని పదే పదే తృణీకరిస్తారని ఎరిగి వారికి సహాయపడాలని చూడడమే “దేవుని ఉగ్రతకు వారిని విడిచిపెట్టడం”

యొక్క తాత్పర్యం. దేవునికి ప్రతి విషయమూ తెలుసు. ప్రతి హృదయంలోని ఉద్దేశాన్ని ఆయన లోతుగా ఎరిగినవాడే. ప్రతి ఆత్మ దేవుని ముందు నిలబడినప్పుడు, మోసాలు, కొండెములు, అన్యాయాలు, అవమానాలు మొదలగునవన్ని వెలుగులోకి వస్తాయి. దేవుడు తన పరిశుద్ద ప్రమాణాలను ఆధారం చేసుకుని వాటికి తీర్పు తీరుస్తాడు (సామె 16:2;; లూకా 8:17;; 1కొరింథీ 4:5;; హెబ్రీ 4:13;). ఆయనకు ప్రతి ఉద్దేశమూ తెలుసు. ఆయన ఉగ్రత పరిపూర్ణ న్యాయంతో కూడినది. విఫలమైన నాయకులపై దాడి చేయాలనే శోధన నుంచి సంఘం పారిపోవాలి. నిష్పక్షపాతమైన తీర్పును ప్రకటించడం ఏ మానవ కోర్టుకైనా అసాధ్యమే. దీనికితోడు పతనమైన నాయకుడు పశ్చాత్తాపపడకపోతే, తనను చేసిన దేవునితో అతని శత్రుత్వం అప్పుడే మొదలవుతుంది. రెండవ శోధన: అనియంత్రిత అనుమానం “సమయం, సత్యం కలిసి పయనిస్తాయి”, అని అనుభవజ్ఞుడైన పాస్టర్ గారు ఇతర పాస్టర్లకు చెప్పేవారు. ద్రోహానికి గురయ్యామనే భావన ప్రతికారం తీర్చుకోవడానికే కాక అనుమానానికి కూడా మార్గం సిద్ధం చేస్తుంది. ఇంకొకసారి మోసపోయి నష్టపోకుండా మనల్ని మనం భద్రపరచుకోవడానికి మనం వెంటనే నేరపరిశోధకులుగా మారిపోయి, ప్రతివ్యక్తి ఉద్దేశాల్లోనూ ప్రమాదమేదైనా పొంచి ఉందేమో అన్నట్లు ప్రశ్నలు సంధిస్తుంటాం. "ఈ నాయకుడు పాపంలో ఎంతో కాలం దొరక్కుండా కొనసాగినప్పుడు మేము మీ పెద్దలను ఎలా నమ్మగలం?” అని ఒకాయన నన్ను ప్రశ్నించాడు. “మనం ప్రభువును నమ్మాలి. అతని జీవితంలో పాప సూచనలేమి మాకు కనబడలేదు. ఒకవేళ మాకు కనబడివుంటే, మేము వెంటనే దానికి తగిన చర్య తీసుకుని ఉండేవారం. మేము మొదటి సూచన కనుగొనే సమయానికి అతడు వెళ్ళిపోయాడు,” అని నేను సమాధానం చెప్పాను. “నా హృదయం ఎక్కడుంది? ఈ విషయంలో ప్రభువు ఏం చేస్తున్నాడు”? అనే ప్రశ్నలు మనం అడగాలి. “అంతేగాని మనం ప్రభువుని సమీపించి నాకు అనుమానాలున్నాయి, ప్రభువా నేను ఈ పరిచర్యనుంచి వైదొలిగాను, నేను నమ్మిన వ్యక్తి నన్ను నిరాశపరిచడమే దానికి కారణం” అని చెప్పకూడదు. మనకు వ్యతిరేకంగా జరిగే కీడుపై దేవుడు సార్వభౌముడు అని మనం గుర్తుంచుకోవాలి.

ఇతరులు మనల్ని బాధితులుగా చేసినంత మాత్రాన మనం నిజంగా బాధితులం కాము. ప్రభువు తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన మన ఆత్మీయ అభ్యున్నతికే సమస్త కార్యాలను నియమించి, దోషరహితమైన ఆయన ప్రణాళికలోని ప్రతి అంశాన్నీ మనం ఆయన కుమారుని స్వరూపంలోనికి మారడానికి సమకూర్చి జరిగిస్తాడు (రోమా 8:28-29;). గాయపడిన సహోదరీ సహోదరులకు తమను మోసగించిన వ్యక్తిని నమ్మడానికి కొంత పమయం పడుతుంది. ఇంకా నిరూపితం కానీ పశ్చాత్తాపాన్నీ, స్వభావాన్నీ నమ్మడం ఒక ఎత్తు. అయితే పతనమైన వారు చేసిన ద్రోహన్ని ఆత్మీయ ఆశీర్వాదాల మూలంగా కలిగే దయతో అధిగమించడం సువార్త శక్తే (1 పేతురు 3:9;).

 

మూడవ శోధన: మీ పాపాన్ని సమర్థించుకోవడానికి - ఇంకొకరి పాపాన్ని సాకుగా ఉపయోగించడం

''నేను గౌరవించే వ్యక్తులే నమ్మకంగా ఉండలేకపోతే నేను నమ్మకంగా ఉండడమనేది కూడా అసాధ్యం. కాబట్టి నమ్మకంగా జీవించడానికి పోరాటం ఎందుకు చేయాలి?" అనే ఆలోచన మీకు కలుగుతుంది. నాయకులు పతనం కావడం వలన నిరుత్సాహపడి, మనం ఎంతోకాలంగా పోరాడుతున్న పాపానికి లొంగిపోయే విధంగా శోధనను ఎదుర్కొంటాం. అత్యంత గౌరవనీయులైన మన నాయకులు నిందారహితులుగా ఉండాలి. ఒక మంచి గురువు పతనమైతే లెక్కలేనన్ని సాకులతోనూ, అన్యాయం జరిగిందనే ఆలోచనతోనూ మన శరీరం ఉగ్రరూపం దాలుస్తుంది. ఆ బలహీన స్థితినుంచి మనల్ని మనం సంరక్షించుకోవడానికి మనం తొలుత స్వనీతిపరులుగా కూడా మారే అవకాశముంది. పతనమైన నాయకునిపై మన తీవ్రమైన కోపాన్ని ప్రదర్శిస్తుంటాం. కానీ సరైన సమయం దొరికితే నీతితో కూడినదని మనం భావించిన ఆగ్రహం ఎంతోకాలంగా మనస్సులో దాచిన పగ అని తెలిసిపోతుంది. పాపానికి కలిగే శిక్షనుంచి తప్పించుకోవడానికి ఇతరులకున్న అవాస్తవమైన స్వేచ్ఛను చూసి అసూయపడిన ఆసాపులా మనం తయారవుతాం (కీర్తన 73:1-14;.

హెచ్చరించకుండానే మన హృదయాలు పగ అనే లోయలోనికి దిగిపోతాయి. ఆ సమయంలో శత్రువుకు మన హృదయాలు తెరచి మనం పాపంలో పడిపోవడాన్ని సమర్ధించుకోవడానికి ఇతరుల పాపాన్ని ఉపయోగించుకునే తీవ్ర ప్రమాదంలో పడిపోతాం. అయితే “తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము యెదుట ప్రత్యక్షము కావలయును” (2కొరింథీ 5:10) అని పౌలు మనకు గుర్తుచేస్తున్నాడు. మహిమగల ప్రభువు ముందు మనం ఒంటరిగా నిలబడి మనం ఆలోచనలు, మాటలు, పనులు గురించి దేవునికి లెక్క అప్పగిస్తాము. ఆ సమయంలో మనం నాయకుణ్ణి నమ్మాను, అతడు ఆత్మీయంగా పతనమై నన్ను గందరగోళానికీ, నిరాశకు గురిచేశాడు” అని మనం చెప్పకూడదు.

మనల్ని తీవ్రంగా ఆ నాయకుడు కోపానికి గురిచేసే ఉండవచ్చు. ఆ కోపం మనల్ని బలమైన శోధనకు నడిపించి ఉండవచ్చు. అయితే ఆ శోధనకు లొంగిపోవడమనేది మాత్రం మన పాపేచ్ఛల్ని నెరవేర్చుకోవడంపై మనకున్న ప్రేమ మూలంగా కలిగేదే! (యాకోబు 1:13-14;)

 

నాలుగవ శోధన: మనపై మనకు కలిగే జాలి, భ్రమ.

నాయకుని పతనం పరిచర్యను మోకాళ్లపైకి తీసుకురావాలి. లేదంటే సమాధానం నిండిన సంఘాలు హఠాత్తుగా చాడీలు చెప్పుకోవడంతోనూ, ఆగ్రహంతోనూ, బహిరంగంగా ద్వేషించుకుంటూ రహస్యంగా ఒకరినొకరు నిందించుకుంటూ, ప్రతి విధమైన దుష్టత్వంలోనూ మునిగిపోతాయి. భయస్తులైన విశ్వాసులు ఒత్తిడిని తట్టుకోలేరు. కాబట్టి నిజమైన పశ్చాత్తాపం ఉన్నా లేకపోయినా సమాధానపడిపోవాలని వారు డిమాండ్ చేస్తారు. సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయాన్ని హెచ్చిస్తుంటే ప్రజలు విసుగుచెంది, వెనక్కు మళ్ళుతారు (గలతీ 6:9;; 1థెస్స 3:13;; హెబ్రీ 12:3;). నాయకత్వంలో సంక్షోభం కలిగినప్పుడు మనపైన మనకు జాలిపడే స్థితి సాధారణంగా కలుగుతుంది. దాన్ని పట్టించుకోకపోతే అది పరిచర్యను భ్రమల లోయలోనికి నడిపిస్తుంది.

సంఘ శరీరమంతా నిరుత్సాహానికి గురైనప్పుడు సువార్త శక్తి మూగబోతుంది. చక్కటి వాక్య ప్రకటన కూడా కటువుగానూ, నిస్సారంగానూ వినిపిస్తుంది. ఒకనాడు ఉత్సాహంతో చేసిన స్తుతి ఆరాధన కేవలం ఇప్పుడు తోలు బొమ్మలాటగా మారుతుంది. పలికే మాటలైనా, చేసే పనులైనా స్వచ్ఛమైన హృదయం నుంచి గానీ దేవుని యెడల కలిగి ఉన్న ప్రేమతో గానీ కలిగేవి కావు. "ఇలా ఎలా జరిగింది” అనే ప్రశ్నను తరచూ మనం అడుగుతుంటాం. అయితే సమాధానాలకోసం మనం దేవునివైపు తిరగడం మానేస్తాం. గాయం మానుతున్న సమయంలో “దేవుని రాజ్యాన్ని మొదట వెదకాలి” (మత్తయి 6:33), భూమిపైనున్న వాటిని కాక పైనున్న వాటిమీదనే మన మనస్సులు పెట్టాలి (కొలస్సీ 3:2). మనకు యుక్తంగా ఎలా ప్రార్థించాలో తెలియదు అయితే పరిశుద్దాత్మ మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడు. ఉచ్ఛరింప శక్యముకాని మూలుగులతో మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు (రోమా 8:26). పౌలుకు బ్రతుకుపైన ఆశలు లేవన్న సందర్భం తటస్థించింది. మనం కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు అనుభవించవచ్చు (2కొరింథీ 1:8;). అయితే ప్రభువు యొక్క సున్నితమైన కరుణగల పాదాల దగ్గర మన భారాల్ని పెట్టాలని జ్ఞాపకముంచుకోవాలి (1 పేతురు 5:7;).

 

ఐదవ శోధన: సంఘం వెలుపల నుంచి నింద వస్తుందనే భయం

కొన్ని సంఘాలు ఇతర సంఘాల్లోనూ పరిచర్యల్లోనూ అక్రమాలను చూసి ఆనందిస్తుంటాయి. ఇదెంత విచారకరం. బహుశా వారు ఇతరుల బలహీనతను సొమ్ముచేసుకుని, తప్పిపోయిన గొట్టెల్ని తాము కూర్చుకొని తమ సంఖ్యను పెంచుకోవాలనే ఆశ ఉంటుంది కాబోలు. కొన్ని సందర్భాల్లో ఇతర పరిచర్యలకు మీ సంఘ సిద్ధాంతాలను బట్టి మీరు వాటిని ఆచరించే పద్ధతులను బట్టి మీరంటే ద్వేషభావం ఉంటుంది. దానివలన మీ సంఘాన్ని గూర్చిన చెడువార్తను వినగానే వారికి సంతృప్తి కలుగుతుంది. ఆ దాడి శత్రు శిబిరంనుంచి కాదు మిత్రపక్షం నుంచి కలిగింది. మీ సంఘంలో సంక్షోభాన్ని సమాజంలో ఇతరులు మీ సంఘం మోసకరమైందనీ, అంటరానిదనీ చెప్పడానికి ఆధారంగా ఉపయోగించుకుంటారు. అలాంటి నిందలకు భయపడే శోధనను మనం ఎదుర్కుంటాం. అయితే అలాంటి సమయంలో ఎంతోకాలంగా సంఘాన్ని బలపరచిన, కృపచేత రక్షించబడిన పాపులను ఆశీర్వదించిన నమ్మకమైన పరిచర్య నియమాలవైపు మనం తిరగాలి.

 

ప్రోత్సాహం కోసం తుది పలుకులు.

నిరుత్సాహపడిన సమయాల్లో ప్రభువు తన కృపతో ప్రోత్సహిస్తాడు. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో దేవుని దయనుబట్టి పైన చెప్పిన నియమాల్నీ హెచ్చరికల్నీ యథార్థ హృదయంతో అనుసరించిన ప్రజలనుంచి పలు విషయాలను విన్నాము. దు:ఖంతో నిండిపోయిన మా హృదయాలను ప్రోత్సహించడానికి ప్రభువు వాటిని ఉపయోగించుకున్నాడు. "తీవ్రమైన దు:ఖంలోనూ, విషాదంలోనూ, దేవుని హస్తం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఆయనను ఎరగడంలోని ఆనందంలో మనం స్థిరంగా ఉంటామని తెలుసుకోండి. ఈ సంఘ కుటుంబాన్ని ప్రేమిస్తూ, మా ప్రార్థనల్లో నాయకులైన మీతో మన ప్రభువు దగ్గరగా ఉంటున్నాం,” అని ఒక పరిశుద్ధుడు రాశాడు.

“సంఘానికి క్రీస్తే శిరస్సనీ, తన గొట్టెలకు ఆయన నిజమైన కాపరి అనీ, సమస్తం ఆయన అదుపులోనే ఉన్నాయని తెలుసుకోవడానికి మనకు ఈ పరిస్థితి సహకరిస్తుంది. గొప్ప కాపరియైన మన ప్రభువు తన దయాసంకల్పం చొప్పున తన మందలో చురుకుగా పనిచేస్తున్నాడని సంఘకాపరులు గుర్తుంచుకోవాలి,” అని మరొకరు గుర్తుచేసారు.

“దేవుడు అన్నివేళల్లోనూ మంచివాడు. ఆయన సత్యం మమ్మల్ని పాపంనుంచి కాపాడుతుంది. ఆయన వాక్యాన్ని నమ్మకంగా బోధిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు అని ఇంకొకరు ప్రోత్సహించారు.

“పాస్టరు గారు, దేవుని వాక్యం నా వేషధారణ గురించి నేను నిరంతరం స్వచ్ఛమైన మనసుతో పశ్చాత్తాపపడుతూ పరిశుద్ధాత్మలో ఎదగాల్సిన అవసరం ఉందనీ నన్ను ఒప్పించింది అని మరొక వ్యక్తి చెప్పాడు. ఆ మాట నాకు చాలా బలాన్నిచ్చింది. “దేవుని ముఖం చూడకుండా మన కనులు తిప్పుకుని, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలకు దేవుని చిత్రం ఏమైయుందో కనిపెట్టడం మానేసినప్పుడు మనం సత్యమని సహించి, సమర్ధించి, స్వీకరించే అసత్యాలకు హద్దులుండవు” అని ఒకరు హెచ్చరించారు. సంఘంలో ఉన్న ఒక సాధారణ విశ్వాసి ఇంత గొప్ప మాటలు రాయడం అద్భుతం కదా!

"మా హృదయాల్లో దేవుని వాక్య సత్యాన్ని ప్రకాశింపచేస్తున్నందుకు ధన్యవాదాలు. నేను ఏ విషయాల్లోనైతే పాపం చేస్తున్నానో వాటి విషయంలో నిజమైన, వాక్యానుసారమైన దు:ఖాన్ని కనపరచి, సరిగ్గా పశ్చాత్తాపపడేలా దేవుడు నాకు కృప అనుగ్రహించాలని సున్నిత మనస్కుడు, సాత్వికుడు అయిన వ్యక్తి రాశాడు.

ప్రోత్సాహాన్నిచ్చే ఈ మాటలు వెంటనే గానీ, హఠాత్తుగా గానీ రాలేదు. మా సంఘ పెద్దల్ని పైకి లేవనెత్తి, క్షేమాభివృద్ధి కలిగించడం కోసం ఈ కృపాసహిత పలుకులను సమయానుకూలంగా దేవుడే మాతో వారిచేత చెప్పించాడు.

ప్రభువా, మీ సంఘం ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్దాత్మ ద్వారా మీరు మాకు పరిచర్యచేసే విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇవి మాకు బహుమానాలు ఎందుకంటే అవి లేకపోతే మేము కేవలం భయస్తులం, అసమర్థులం. మేము ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు “నాకే ఎందుకు ఈ శ్రమ? నేను పరిచర్యనుంచి వైదొలగాలా?” అని సందేహిస్తాం. ప్రభువా, మా ప్రశ్నలకు మేమే సమాధానాలు చెప్పుకోకుండా, మీ వాక్యాన్ని తెరచి, మీరు చెప్పిన సమాధానాలు మేము చెప్పేలా సహాయం చేయండి. ప్రభువా, మేము కేవలం మీవైపే తిరిగేలా కరుణించండి. ఎందుకంటే మీరు మాత్రమే నిత్యజీవపు మాటలు కలిగినవారు. ఈ సత్యాన్ని మా హృదయాల్లోకి చొచ్చుకొనిపోయేలా చేసి, మీ ఆత్మతో మమ్మల్ని ప్రోత్సహించండి. మీ నామంలో ప్రార్థిస్తున్నాం, ఆమెన్!

 

12. కావలివానిగా నాయకుడు

నా సొంత మందకు కాపరిగా ఉండే పిలుపు నంగీకరించినపుడు నేనేమి చేయాలో నాకస్సలు అవగాహన లేదు. సెమినరీలో ఉండగా విద్యార్థులందరూ మొదటి రెండు సంవత్సరాలు ఒక నూతన సంఘంలో తమ పరిచర్య జీవితాన్ని ఊహించుకుంటుంటారు. ఆ సమయాన్నే మేము 'హనీమూన్ పిరియడ్'గా భావిస్తాం. అయితే ఈ విషయంలో నేను ఇతర విద్యార్థులందరి కంటే గొప్ప ఆధిక్యతను పొందుకున్నాను. సెమినరీలో ఉండగానే అనేకమంది సిబ్బంది ఉన్న భారీ సంఘంలో అసోసియేట్ పాస్టర్ గా చాలా సంవత్సరాల అనుభవాన్ని నేను సంపాదించాను. అయినా సీనియర్ పాస్టర్ గా పూర్తి బాధ్యతనూ, భారాన్ని నేను మోయలేదు. కనుక ఆ బాధ్యతకెలా సిద్ధపడాలో తెలియక ఇబ్బంది పడ్డాను. కాలిఫోర్నియా రాష్ట్రంలో సనావ్యాలీ నందున్న గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ నుంచి నేనిపుడు పరిచర్య చేస్తున్న సంఘానికి సీనియర్ పాస్టర్‌గా బాధ్యతను స్వీకరించ డానికి వెళ్ళే ముందు నాకు కొన్ని ఆఖరి సలహాల నిమ్మని జాన్ మెకార్డర్ గారిని అడిగాను. "గ్రెస్ కమ్యూనిటీ చర్చ్ లో అసోసియేట్ పాస్టర్‌గా నీ పరిచర్య చాలా ఏకాంతంగా, రహస్యంగా, సురక్షితంగా ఉంది. అయితే సీనియర్ పాస్టర్ బాధ్యత తీసుకున్నప్పుడు నీ పరిచర్య వెంటనే బహిరంగంగా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు” అని ఆయన ఏ మాత్రం సందేహించకుండా చెప్పారు. పరిచర్యలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న పలు సందర్భాల్లో నేను ఆ సలహాను జ్ఞాపకం చేసుకున్నాను. 8 సంవత్సరాలు పరిచర్య బాధ్యతను నిర్వర్తించిన తర్వాత బహిరంగ పరిచర్యంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. దేవుని పిలుపు లేకపోతే ఏ ఒక్కరూ ఎదుర్కోవడానికి ఇష్టపడని అపాయాలు, ఉరులు, సవాళ్ళు, కష్టాలతో నిండియుంటుంది ఈ పరిచర్య. నా చుట్టూ ఉన్న భక్తిగల నాయక బృందం ప్రభువు అనుగ్రహించిన కృపావరం. వారు నన్ను ప్రోత్సహిస్తారు, నా కొరకు ప్రార్థిస్తారు, సొమ్మసిల్లేంతగా నాతో ప్రయాస పడతారు. వారి నైపుణ్యంతో కూడిన నమ్మకమైన పరిచర్య లేకుండ నేనేమీ సాధించలేను. అయితే సంఘంలోని ఇతర నాయకులూ, సంఘ సభ్యులు తమ పోషణ నిమిత్తం, సంరక్షణ నిమిత్తం ఎవరిపై ఆధారపడతారో అతడు నిర్వర్తించాల్సిన విశిష్ఠమైన బరువు, బాధ్యతలు కొన్ని ఉన్నాయి. నాకే ఆత్మీయ తెగువ కొదువగా ఉంటే ఇతరులు చాలా సులభంగా తొట్రిల్లుతారు. నేను నైతికంగా విఫలమైతే కలిగే నష్టం చాలాకాలం నిలిచే ఉంటుంది. నా వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన ఆత్మీయ నిర్లక్ష్యం మూలంగా, వేషధారణ మూలంగా నా కుటుంబ సంబంధాలు ముక్కలైతే, దాని పరిణామాలు సంఘంపై చాలా తీవ్రంగా ఉంటాయి. నా నాయకత్వ బాధ్యత యొక్క తీవ్రతను తెలుసుకోవడం నన్ను ఈ అద్భుతమైన ఆధిక్యత గురించి మెలకువగా, స్థిరమైన బుద్ధితో ఉండేలా చేస్తోంది. నిరంతరం మెలకువగా, నిగ్రహంతో ఉండకపోతే ఆత్మీయ నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించేవారికి సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో నాయకులు చిక్కుకుంటారు.

మధ్యమ తూర్పు దేశాల్లో ఆధునిక యుగంలో గొర్రెల కాచుకొనే వృత్తి అత్యంత కఠినమైన పని. ఒక లోయగుండానో లేదా ప్రశాంతమైన కొండ దగ్గర తన మంద ప్రక్కనే నిమ్మళంగా నడుస్తున్నట్లో గొర్రెల కాపరిని తరచూ చిత్రిస్తుంటారు. అవును, తన వృత్తిలో ఎదురయ్యే గంభీరమైన భారాన్ని గ్రహించిన ఏ కాపరైనా నిశ్శబ్దంగానే ఉంటాడు. తన కన్ను లెల్లప్పుడూ రాబోయే ప్రమాదాలనే పరీక్షిస్తుంటాయి. లోయల గుండా అధిక వర్షపాతం వలన వచ్చే ఆకస్మిక వరదల్లో, ఎముకలు కొరికే చలిలో గొర్రెలు చిక్కుపడిపోతాయి. ప్రయాణపు ప్రతి మలుపులోనూ గొర్రెల్ని వడిగా, సులభంగా పట్టి చీల్చేసే కూర మృగాలు నుంచి నిరంతర ప్రమాదం పొంచి వుంటుంది. ఈ సమస్యలకు తోడు గొర్రెల సహజ స్వభావం మూలంగా వచ్చే సమస్యలుంటాయి. ఇతర జంతువుల్లో వేటినైనా పోషించి సంరక్షించడం కంటే గొర్రెల్ని పోషించి సంరక్షించడమే అత్యంత కఠినమైన పని.

గొర్రెలు చాలా సులభంగా భయభ్రాంతులకు గురవుతాయి, ఆందోళనతో సరిగా విశ్రాంతి తీసుకోవు, సరైన జ్ఞానం లేని జీవులు, మరణకరమైన మార్గంలో ఇతర గొర్రెల్ని గుడ్డిగా అనుసరించేస్తాయి. ఆత్మీయ కాపరిని ఆత్మీయ కాపలావాడని' రిచర్డ్ మేహూ వర్ణించాడు. వీరు యోగ్యమైన పనివారు (2 తిమోతి 2:15;) సిగ్గుపడనక్కరలేని కావలివాళ్ళు . ఒక సదుద్దేశంతోనే కాపరిని కావలివానిగా పిలవడం జరిగింది. తన మంద క్షేమాన్ని అతడెన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. వాటికి నిరంతరం అవసరమైన ఆహార వసతుల గురించి అజాగ్రత్తగా ఉండకూడదు. అతడు భయస్థుడై తన్ను తాను కాపాడుకోవడానికే ఇష్టపడేవాడైతే ప్రమాదపు మొదటి సంకేతాన్ని చూడగానే పారిపోతాడు, గొర్రెలు నాశనమైపోతాయి. తన విధుల్లోని తీవ్రతను సరిగా అంచనా వేయకపోయినా, అజాగ్రత్తగా ఉన్నా మంద ప్రమాదాన్నుంచి తప్పించుకోలేదు. 'జీవన్మరణ పరిస్థితుల్లో మెలకువగా ఉండే కావాలివాడు పట్టణాన్ని సంరక్షించినట్లు కాపరి జాగ్రత్తగా తన మందను కాయాలని'3 మేహ్యూ చెప్పాడు.

6వ అధ్యాయంలో చర్చించిన స్వభావ ఉద్దేశాల్లో సమస్యలతో పాటు నాయకత్వంలో పాప పద్ధతులైన నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి, అజాగ్రత్త అనే పాపాల్లో పడిపోకుండా కాపరులు జాగ్రత్తపడాలి. ఆ పద్ధతులు మన ప్రభావాన్ని ధ్వంసం చేస్తాయి, అపనమ్మకాన్ని అనుమానాన్ని సృష్టిస్తాయి, మంచి చెడుల్ని వివేచించడానికి అవసరమయ్యే ఉపకరణాలు లేకుండా ప్రజల్ని వదిలేస్తాయి. పిరికివారికీ, గౌరవ మర్యాదలు లేనివారికీ, జ్ఞానాను భవాలు లేనివారికి పరిచర్య సరైన పని కాదు. రాబోయే ప్రమాదాల తీవ్రతను గ్రహించే ప్రతి కాపరి తన ఆత్మీయ ఇంద్రియాల్ని బలహీనపరిచే ప్రతి దానికి దూరంగా ఉంటాడు.

 

స్వీయ భద్రత

పాస్టరు ఉండాల్సిన సాహసం అగత్యమని తిమోతికి ఉపదేశిస్తున్నప్పుడు పౌలు అతన్ని మూడు ప్రత్యేకమైన ప్రమాదాల గురించి హెచ్చరించాడు. 1) మన ఆత్మీయ వారసత్వాన్ని, పిలుపునూ మరచిపోవుట, 2) దేవునికి కాక మనుష్యులకు భయపడుట, 3) మన సొంత అభిరుచులకు పైగా సత్యానికి మద్దతునివ్వకపోవుట. పరిచర్య చేయడానికి ఎఫెసీ ఒక గొప్ప సంఘం. అయితే తిమోతిని ఒత్తిడికి గురి చేసే కఠినమైన సవాళ్లు ఆ సంఘంలో ఉన్నాయి. తిమోతి ఒక యవ్వనస్థుడైన పాస్టర్. అతనికంటే వయసులో పెద్దవారైన కొద్దిమందిని ఆత్మీయంగా పోషించి, నడిపించే బాధ్యతను అతడు స్వీకరించాడు. అయితే వారు తిమోతి నాయకత్వానికి సహృదయంతో స్పందించక పోవడం అతడు ఎదుర్కొన్న సవాళ్ళలో మొదటిది (1 తిమోతి 4:12;. కొందరు తమ వాక్చాతుర్యంతో సంఘంలోనికి భిన్నమైన బోధను తీసుకొచ్చి (1 తిమోతి 1:3;) సంఘ సహవాస పవిత్రతకూ, ఐక్యతకూ హాని కలిగించే ప్రభావాన్ని కలిగించారు (1 తిమోతి 1:20;; 1 తిమోతి 6:20-21;). యువకుడైన తన శిష్యునికి రెండవ పత్రికను రాసే సమయానికి ఆత్మీయ రణరంగంలో బలంగా, నమ్మకంగా ఉండడానికి తిమోతికి ప్రోత్సాహం అవసరమైంది.

 

నీ ఆత్మీయ వారసత్వాన్ని జ్ఞాపకముంచుకో

మొదటిగా ఈ యవ్వనస్తుడైన పాస్టరున్న ఆత్మీయ వారసత్వాన్ని, తన జీవితంలో దేవుని పిలుపునూ పౌలు అతనికి గుర్తు చేస్తాడు. “నీ యొక్క నిష్కపటమైన విశ్వాసమును నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను... ఆ విశ్వాసము మొదటి నీ అవ్వయైన లోయలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను. అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను (2 తిమోతి 1:5-6;). ఆత్మ సంబంధమైన తెగువ అవసరమై నపుడు ఈ నియమం చాలా ముఖ్యమైనది. పరిచర్యలో వచ్చే తుఫానులన్నింటిని ఎదుర్కొని సురక్షితంగా బయటపడిన సైనికుల్లా వారు పరిచర్య చేయాలని ఆత్మీయ నాయకులు గుర్తుంచుకోవాలి. క్రీస్తును ప్రేమించి దేవునికి భయపడమని బోధించిన అమ్మ, అవ్వలు తనకుండడం తిమోతికి ఆశీర్వాదకరమే.

దేవుని దయను బట్టి అతడు రక్షణ పొంది, సువార్త పరిచర్యకు పిలుపు నందుకున్నాడు. తన తీర్మానాన్ని మర్చిపోయి స్త్రీ పురుషుల ఆత్మల కోసం సువార్త పరిచర్య చేయకుండా యుద్ధ రంగం నుంచి వెనుతిరగడానికి ఇది సమయం కాదు. నిజానికి తిమోతి పరిచర్య చేస్తున్న సమయంలో, స్థలాల్లో అది అత్యంత అవసరమైనది. విమర్శల, శ్రమల మధ్యలో భయభ్రాంతులకు గురవడం నిజమైన కావలివాని స్వభావానికి తగినది కాదు. అందుచేతనే తానొక ఆశీర్వాదం పొందిన కుటుంబం నుంచి వచ్చి దేవుని పిలుపు నందుకొని పరిచర్య నిమిత్తం లోకాన్ని ప్రభావితం చేయడానికి ఏర్పాటులో ఉన్న వ్యక్తి అని తిమోతికి గుర్తు చేయాల్సి వచ్చింది. పరిచర్యలో సహోదరుల నుంచి ఆత్మీయ నాయకులందరికీ నిరంతర ప్రోత్సాహం అవసరం. తానొక తోటి పెద్దననీ, క్రీస్తు శ్రమల్లో సాక్షిననీ, త్వరలో ప్రత్యక్షమయ్యే మహిమలో పాలిభాగస్థుణ్ణనీ తీవ్రంగా శ్రమలకు గురై ఆసియా దేశాలన్నింటిలో చెదరిపోయిన పెద్దలకు పేతురు గుర్తు చేసాడు (1 పేతురు 5:1;). 'విశ్వాస వీరు'ల్ని (హెబ్రీ 11:440) గొప్ప సాక్షి సమూహపు మేఘాలని (హెబ్రీ 12:1;) పిలుస్తూ దేవుని ప్రజల విశ్వాసాన్ని హెబ్రీ గ్రంథకర్త బలపరిచాడు. కావలివానిగా మనకున్న విధుల్ని మనం నిర్లక్ష్యంగా వదలిపోకూడదు. అనేకమంది సంరక్షకులూ, కాపరులూ మనం అనుసరించడానికి మాదిరినిచ్చి మనముందే వెళ్ళారు.

 

మనుషులకు కాదు, దేవునికి భయపడు

రెండవదిగా, దేవునికి భయపడి ఆయన శక్తియందు నమ్మికయుంచమని పౌలు తిమోతిని ఆదేశించాడు. ఇది మరొక ముఖ్యమైన ప్రోత్సాహం.

దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము..... ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ము కొనుచున్నాను (2 తిమోతి 1:7-8, 12;).

దేవుని శక్తి, ఆయన యందు తాను కలిగియున్న లోతైన నమ్మకమే పౌలును స్వీయభద్రత నుంచి కాపాడాయని గమనించండి. ఏదైనా ఒక సమస్య మొదటి సూచన కనబడగానే జీతగాళ్ళు తమ విధుల్ని విడిచిపెట్టేస్తారని 4వ అధ్యాయంలో నేను చెప్పాను. మన ప్రభువు తీవ్రంగా గద్దించిన పాపమిది (యోహాను 10:11-15;). స్వీయ భద్రత ఒక బలహీనతే కానీ అది ఏ మాత్రం సద్గుణం కాదు. మనం భక్తిగా ఉన్నప్పుడు, మనం దేనికీ భయపడాల్సిన పనిలేదు. యథార్థత మన హృదయాల్ని పాలించినపుడు మనం సింహం వలె ధైర్యంగా ఉంటాం (సామెతలు 28:1;). నమ్మకమైన కావలివానిగా ఉండాలంటే, మన బిరుదు కంటే ఎక్కువ బాధ్యత మనకు ఉన్నట్లు గుర్తించాలి.

గొర్రెల్ని పోషించి, వారిచేత 'అద్భుతమైన ప్రసంగం' అని చెప్పించుకోవడం కంటే ఎక్కువ చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మానవ ప్రణాళిక కంటే ఎక్కువగా దేవుడు వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడోననే వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని నడిపించి, సంరక్షించడం మన ధర్మం. దేవునికి భయపడడమంటే మనం శ్రమపడడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం (2 తిమోతి 1:8;; 2 తిమోతి 2:3;). మనల్ని కాపాడి, సువార్తకు సాధనాలుగా చేయడానికి దేవుని శక్తియందు మన హృదయాలు నిశ్చలంగా ఆధారపడడమే దేవునికి భయపడడమనగా అర్థం (2 తిమోతి 1:9-11;). మహిమలో తన ప్రజల కోసం ప్రత్యక్షమయ్యే వరకు మన ప్రయాసల్లో ఫలాల్ని కాపాడడానికి మనం ఏ దేవుని యందు నమ్మకముంచుతున్నామో ఆ జీవం గల దేవుని సిగ్గుపడనక్కరలేని సేవకులుగా మారటమే దేవునికి భయపడటం అంటే అర్థం (2 తిమోతి 1:12;). ప్రభువంటే భయం యవ్వనస్థునికి జ్ఞానాన్ని బోధించాలి. లేదంటే అతణ్ణి కాపరి విధుల్నుంచి తొలగించాలి. దేవుని కృప అతని ఆత్మను పరిపక్వం చేయాలి, లేదంటే పైనుంచి శక్తి పొందే వరకు అతడు వేచి చూడాలి.”

వివాదంలో నేనొక్కడినే అత్యల్ప జనాభా మద్దతున్న వైపు నిలబడిన సందర్భాలు పరిచర్యలో తలెత్తినపుడు అంతరంగంలో కలిగే అలజడి నాకు తెలుసు. భయంతోనో, ఒంటరిగా ఉన్నామనే భావంతోనే సత్యా సత్యాల మధ్య సంధి కుదర్చాలనే శోధన మనకు ఎదురవుతుంది. మనుషుల భయం మన హృదయాల్ని ఏలుతున్న ఏ సమయంలోనూ మనం మంచి నిర్ణయాలు తీసుకోలేము. తిమోతికి ఆ భయం అన్నివైపుల నుంచి కలగడం మూలంగా అతనికి ధైర్యం చెడింది. నీరో చక్రవర్తి పాలనలో రోమ్ నుంచి సంఘం ఎదుర్కొంటున్న నిరంతర శ్రమ మూలంగా కలిగిన భయం, తిమోతి నాయకత్వాన్ని ద్వేషించిన వారి నుంచి కలిగిన విరోధం, తప్పు బోధకులు లోక జ్ఞానంతో, బల ప్రభావాలతో సత్య వాక్యంపై చేస్తున్న సిద్ధాంతపరమైన దాడులు తిమోతిని భయపెట్టాయి. ' అలాంటి ఒత్తిడిలో మనుషులంటే భయం అకస్మాత్తుగా కలుగుతుంది. అయితే మనం ఆ ఉచ్చులో పడిపోకూడదు. దుర్భరమైన సమస్యతో మన పరిస్థితుల్ని సాతాను తారుమారు చేస్తాడు. ఎందుకంటే మన మనస్సుల్ని సమస్యపైనే నిలిపి, సమస్యలోని ప్రతి చిన్న విషయాన్ని గూర్చి చింతించి ఆందోళనతో అయోమయంలో చిక్కుకుంటామని వాడికి తెలుసు. ఈ ధోరణి గురించే మత్తయి 6:24-34; లో ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు నుంచి మనం చక్కటి ఉపదేశాన్ని పొందాలి. ఎందుకంటే క్రీస్తు ఎడల నున్న సరళత నుండియు పవిత్రతనుండియు ఎట్లయినను గొర్రెలు తొలగిపోవునేమో అని అతడు అతిగా భయపడ్డాడు. కానీ శ్రమకు కాదు (2 కొరింథీ 11:3;). మెలకువగల కావలివారిగా మన ప్రజల్ని సాతానుగాడి తంత్రాలకు చిక్కకుండా చేయడమే మనకున్న గొప్ప భారం. 'దానికి తక్కువగా ఏం చేసినా నిస్సారమైన పరిచర్యకు కారణమై, క్రీస్తు కోపాన్ని ఆహ్వానిస్తుంది...., మంద ఆత్మీయ ఆరోగ్యానికి హాని చేస్తుంది. వారి రక్తాపరాధం మన చేతులకు అంటుతుంది.”

 

సత్యాన్ని సమర్థించాలి

ఆఖరిగా తన అభిరుచులకు పైగా సత్యాన్ని సమర్థించాలని పౌలు తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు. సత్యాన్ని ధైర్యంగా ప్రకటించడం వల్ల దాన్ని వ్యతిరేకించే వారి నుంచి ఆత్మీయ నాయకులు చాలా సమస్య లెదుర్కుంటారు. నా సంఘంలో రెండు సంవత్సరాలు ప్రసంగించిన తర్వాత ప్రజల్ని కౌన్సిలింగ్ చేసే అవసరత అనూహ్యంగా పెరగడాన్నీ, సంఘంలో అనేక సంవత్సరాలుగా ఉన్న వారి నుంచి ఆందోళన ఎదురు కావడాన్ని నేను గమనించాను. ఒక కుటుంబం నన్ను లంచ్ కి తీసుకెళ్ళి "సంఘంలో పరిస్థితులు ఇంతకు మునుపటిలా లేవని' చెప్పారు. వాక్య సిద్ధాంతాల్లో గానీ పరిచర్య పద్ధతుల్లో గానీ వారికేమైనా అభ్యంతరాలున్నాయా అని నేను ప్రశ్నించగా అలాంటివేమీ లేవని వారు చెప్పారు.

కానీ వారి సమస్యలేమిటో సూటిగా చెప్పలేకపోయారు. వెంటనే నాకు సమస్య అర్థమయ్యింది. దేవుని వాక్యాన్ని స్పష్టంగా ధైర్యంగా ప్రకటించినపుడు, పరిశుద్ధాత్ముడు తన ప్రజల హృదయాల్లో పనిచేయనారంభిస్తాడు (హెబ్రీ 4:12;).

ప్రజలు తమ పాపం విషయమై గద్దింపు పొంది, పరిశుద్దాత్మ ద్వారా వాటిని ఒప్పుకుంటూ కొంత అలజడికి గురైన సందర్భాల్లో వారిని మరింత అసౌకర్యానికీ, అయోమయానికి గురిచేసే కొన్ని సిద్ధాంతాల్నీ, వాక్య భాగాల్నీ చాలా మంది నాయకులూ, కాపరులూ ప్రక్కన పెట్టేస్తుంటారు. లేఖనాల వెలుగును దాచేసే ఏ పనీ మనం చేయ కూడదని పౌలు తిమోతికి గుర్తుచేసాడు. అతడు తరచూ ప్రోత్సాహకరమైన రీతిలో హెచ్చరించాడు.

“హితవాక్య ప్రమాణమును గైకొనుము (2 తిమోతి 1:3;), నీకు అప్పగించబడిన మంచి పదార్థమును కాపాడుము (14 వ.), దేవుని యెదుట యోగ్యునిగాను, సిగ్గు పడనక్కరలేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుము (2:15), నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నది యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము (3:14), దేవుని యెదుటను... క్రీస్తు యేసు యెదుటను వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము (4:12). సంఘ జీవితంలో కీలకాంశంగా నిరంతరం సత్యమే ఉండేలా దేవుని కావలివారు తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాల్ని ప్రక్కన పెట్టడానికి కృషిచేస్తారు.

దానికి తక్కువైనదేదైనా “వాక్యానుసారంగా ఊహకందనిది, ఆత్మీయంగా అన్యాయమైనది.”

 

తీవ్రమైన పొరపాట్లు

పరిచర్య నిమిత్తం శిక్షణ పొందుతున్న యవ్వనస్థులు నేటి సంఘాన్ని చూసి సంఘ నాయకత్వాన్ని గూర్చిన అభిప్రాయాల్ని ఏర్పరచుకోవడం విషాదకరం. వ్యాపార మెళకువల్నీ, ప్రజలతో సత్సంబంధాలనే కానీ వాక్యానుసారమైన పరిచర్య గురించి పెద్దగా తెలియని సిఇఓలుగా భారీ సంఘాల నాయకులున్నారు. మధ్య స్థాయి వ్యాపారవేత్తలు సిబ్బందిని నియమిస్తూ, తొలగిస్తూ, నూతన ఏర్పాట్లు చేస్తూ, ప్రజాదరణ కోసం పోటీలు నిర్వహిస్తున్నట్లుగా మందను కాచే కాపరులు తమ విధుల్లో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. నేటి సంఘాలు ఆధిక్యతలన్నీ కోల్పోయిన వారికీ, ధైర్యం చెడిన వారికీ సురక్షిత స్థానాన్ని కల్పించి, వారు కోల్పోయిన ప్రేమను వారికి అందించే సమాజంగా ఉండడమే పరిచర్యగా భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సిద్ధాంతపరమైన అయోమయాన్నీ, నైతిక బలహీనతనూ, నూతనమైన భావోద్వేగాల్నీ నాయకత్వంలో ఉన్న వారు అనుమతించడమే కాదు, వాటినే నిజాయితీ, సాత్వికం, ధర్మమార్గాలని బలంగా ప్రోత్సహిస్తున్నారు.

నాయకత్వ మార్గదర్శకాలను అసత్య సంఘాల (ఎమర్జింగ్ చర్చెస్) నుంచి తీసుకోవడం పరిచర్య విషయంలో విధ్వంసకరమైన పొరపాటుచేయడమే.మహోన్నతమైనసత్యాన్నిశక్తివంతంగాప్రకటించకుండాఏఒక్కరూపవిత్రతనుపొందలేరు(యోహాను 17:7;). క్రీస్తులో ఎదిగి ఆయన నిమిత్తం ప్రయాసపడేలా పరిశుద్ధుల్ని సిద్ధపరచడానికి భక్తిగల కాపరులు లేకపోతే కేవలం నైతిక బలహీనత, అసత్యాన్ని గుర్తించలేని ఆత్మీయ అసమర్థతలే సంఘంలో ఉంటాయి (ఎఫెసీ 4:12-16;). యవ్వనస్థులు పరిచర్య చేయడానికి శిక్షణ పొందుతుండగా విజయం పొందడానికి వారు పొరపాటున రూపొందించుకున్న ప్రణాళికల్ని వారి మొదటి సంవత్సరాల్లో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే దానికి భిన్నంగా మన పరిచర్య ప్రణాళికల్ని సత్యాని కనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. పౌలు తన మూడవ సువార్త యాత్రను ముగించి యెరూషలేముకు వెళ్ళడానికి త్వరపడుచున్న సమయంలోనే మిలేతులో ఆగాడు (అపొ.కా. 20:15-17;). తాను 3 సంవత్సరాలు సువార్త చెప్పి పరిచర్య చేసిన ఎఫెసీ సంఘంలోని పెద్దల్ని అతడు కలిసాడు. తరచూ తీవ్రమైన ప్రమాదాలు సంభవిస్తున్నందున సంఘాలకు ఆ సమయం చాలా దిక్కుతోచనిదిగా ఉంది. సత్యం చీకటి రాజ్యాల్ని క్షీణింపచేయ సాగింది. అయితే సత్యాన్ని ద్వేషించేవారు సంఘాల్లోకి చొరబడి గొర్రెల్ని మింగేయాలని ప్రయత్నిస్తున్నారు. మెలకువగా ఉ ండమని పౌలు ఎఫెసీ సంఘ పెద్దల్ని హెచ్చరించాడు. గర్వంతో, సాదాసీదాగా, జ్ఞానానుభవాలు లేనివారుగా వారు మారిపోకుండా చేయడానికి పరిచర్యపై వారికి ఎన్నడూ మర్చిపోలేని దృక్పధాన్ని అతడు కలిగించాడు.

 

నిత్యవాస్తవాల కోసం జీవించు

తన నాయకత్వాన్ని నిత్యత్వపు కోణం నుంచి చూసే అద్భుతమైన అలవాటే పౌలు జీవితాన్ని, ప్రసంగాల్నీ ఇతర నాయకులకూ, వారి సంఘాలకూ చాలా ఆకర్షణీయంగా చేసింది. యెరూషలేములో తన కోసం జైలూ, శ్రమలూ ఎదురౌతాయని ఆత్మ తనకు బలంగా తెలియజేస్తున్నప్పటికీ (అపొ.కా. 20:22-23;), తన జీవితం తనకు ఏమాత్రం విలువైంది కాదని (24 వ.) ఎఫెసీ సంఘ పెద్దలతో పౌలు నిర్భయంగా చెప్పాడు. 'దేవుని కృపను గూర్చిన సువార్తకు సాక్ష్యమివ్వడానికి ప్రభువైన యేసునుంచి అతడు పొందుకున్న పరిచర్యను అతడు ముగించాలి (24 వ.). 'భూసంబంధమైన సంగతులపై కాక పైనున్న వాటి మీదనే పౌలు తన మనసునూ, హృదయాన్ని కేంద్రీకరిస్తున్నాడు (కొలస్సీ 3:2;). ఆత్మీయ నాయకులమైన మనం ఈ లోక సుఖ సౌఖ్యాలనే హత్తుకొని, ఈ జీవితాన్ని అనుభవించడానికి పరిచర్యను ఒక మార్గంగా చూస్తే పరిచర్యలో ఎదురయ్యే ప్రమాదాల్ని అస్సలే మాత్రం వివేచించలేము. సాతానుగాడి తంత్రాలు చాలా యుక్తిగా ఉంటే మనమేం చేస్తాం? సోమరిలా కూర్చొని ఈ లోక జీవితంలో ముగినిపోయిన కాపరే గొర్రెలకు ఎక్కువ హాని కలుగజేస్తాడు. పౌలు మనుషులందరి రక్తం విషయంలో నిరపరాధిగా ఉండాలనుకున్నాడు (అపొ.కా. 20:26;). సత్యం, ఆత్మల పట్ల భారం, పరలోకం, నరకం, పాపం, సాతానుగాడి అబద్దాలు, క్రీస్తు మహిమ మొదలగు విషయాల గురించి అతడు ఆలోచించేలా చేసింది ఆ ఆలోచనే. సత్యం కంటే మన జీవితాలనే మనం ప్రియంగా ఎంచితే, అదే భావాన్ని మనం గొర్రెల్లోనూ నింపుతాం. ప్రజలు ఆత్మీయంగా క్షీణించిపోతారు, వారి వివేచించే స్థాయి పైపై మాటలకి పడిపోతుంది, పాపపు యుక్తిగల వంచనలు వారి జీవితాల్ని చిన్నాభిన్నం చేసేస్తాయి.

 

నీతో పాటు ఇతరుల్ని కూడా సంరక్షించు

సత్య సంఘాల్లో ప్రజాదరణ పొందిన పలు గ్రంథాల గురించీ, బోధకుల గురించీ ప్రశ్నిస్తూ నాకు అనేకులు క్రమంగా ఉత్తరాలూ, ఈమెయిల్స్ రాస్తుంటారు. నేడు సంఘాల్లో అసత్యం ఎంత వేగంగా, విస్తృతంగా వ్యాపిస్తుందో చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రజలు తమ ఆత్మీయ పతనావస్థ నుంచి త్వరితంగా పైకి లేవనెత్తేవాటి కోసం విపరీతంగా పరితపిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే విలియమ్ పి.యంగ్ అనే రచయిత 'ది ష్యాక్' అనే క్రైస్తవ కల్పిత నవలను రచించాడు. అమెరికాలో యూరప్లో అది విడుదలై సంఘాలన్నింటిలో చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. అయితే ఈ గ్రంథం త్రిత్వం, రక్షణ, పరిశుద్ధత మొదలగు కీలక సిద్ధాంతాల గురించి వాక్య విరుద్ధమైన భావాలతో నిండియుందని పలువురు విమర్శించారు. అయితే వివేచనాత్మ కలిగిన ఈ విమర్శకులు ఇవాంజెలికల్ శాఖకు చెందిన వారని కొందరు ప్రముఖులు తప్పుబట్టారు. ఈ గ్రంథంలో చాలా ప్రమాదకరమైన లోపాలతో కూడిన వేదాంత భావాలున్నప్పటికీ, క్రైస్తవులందరూ ప్రతిచోట ఈ గ్రంథానికి మద్దతు పలకడం భయంకరమైన విషయం.

గొర్రెల చర్మంలో ఉన్న తోడేలును పసిగట్టడానికి తగినంత చురుకుగా తన మనసు ఉంచుకోవడానికి పౌలు సత్యాన్ని ఎరిగి దాని ప్రకారం జీవించడం పైనే తన హృదయాన్ని పెట్టాడు (ఎజ్రా 7:10; తో పోల్చండి). ప్రతీ వారం సంఘ ఆరాధనలో లేఖనాలు మన జీవితాలకు సమృద్ధియైనవనీ, చాలినవనీ మనం బోధిస్తున్నాం. అయినా జీవితంలోని శ్రమలకు పరిష్కారంగా మానవాభిప్రాయాల్నీ, అనుభవాల్నీ ఆశ్రయించుట వలన క్రైస్తవులు నేడు దీర్ఘకాలం మోసానికి గురవుతున్నారు. సత్యమైయున్న, జీవంగల దేవుని నుంచి వచ్చిన నిజమైన ప్రత్యక్షతకంటే కల్పిత దైవాలతో కల్పిత అనుభవాల్ని గూర్చిన ఒక మనిషి కథ ఏ విధంగా ఎక్కువ ఆదరణ నివ్వగలదు? దైవ ప్రత్యక్షతకంటే కల్పిత కథలవైపే విశ్వాసులు అధికంగా మొగ్గుచూపుచున్నారా? అవును, విశ్వాసులు కల్పితాలకే ప్రాధానత్య నిస్తున్నారు, అది విచారకరం. ఎందుకంటే సత్యానికి లోబడడం కంటే మన అనుభవాల్ని బట్టి దేవుని గూర్చి అభిప్రాయాలు ఏర్పరచుకోవడం సులభం కాబట్టి. మనం గీసిన హద్దుల్లో దేవుని ఉంచి, మనకు నచ్చిన సమయంలో మన భారాలకు ఆయన స్పందించి, మన బలహీనతలు బట్టబయలైనపుడు ఎదురయ్యే అవమానాలను తప్పించుకోవడానికి తగినంత గర్వాన్ని మనలో అనుమతించేలా దేవుణ్ణి మనం బలవంతం చేస్తాం. సత్యానికి ప్రతికూలంగా అబద్దాల్ని రహస్యంగా ట్రోజాన్ గుర్రం దాచిపెట్టింది. అలాంటి కల్పిత కథ విషయంలో జాగ్రత్తపడండి. కల్పిత కథ మనకు ఆనందాన్ని ఇవ్వచ్చు. నిత్యత్వమనేది కల్పితం కాదు. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి (అపొ.కా. 20:28;). ' జాగ్రత్తగా ఉండుడి' అనే క్రియాపదం వెనకున్న గ్రీకు పదాన్ని నేను క్రొత్త నిబంధనంతా వెదకగా, అది 21 సార్లు నాకు కనబడింది. అందులో 14 సార్లు అది ప్రమాదకరమైన అసత్యాన్ని గురించీ హెచ్చరికలు జారీ చేయగా, 4 సార్లు శ్రద్ధగా వినమనే పిలుపును గురించీ, 3 సార్లు లేఖనాల యెడల లక్ష్యముంచమనీ మాట్లాడుతుంది. ఇదే అధ్యాయంలో అంటే అపొ.కా. 20:31;లో అదే గ్రీకు పదం 'మెలకువగా ఉండుడి' అని అనువదించబడింది. కొద్దిమంది నాయకులు అసలు అపాయాల్నే చూడరు. వారి ఆత్మీయ జీవితమే పెను ప్రమాదంలో ఉంది. కాబట్టి సంఘాన్ని బలహీనపరిచే శక్తుల్ని వారి గుర్తించరు. ఎందుకంటే అనుదినం పరిశు దాత్మ అనుగ్రహించు పవిత్రపరిచే శక్తిని వారు అనుభవించట్లేదు. చాలామంది తమ ప్రజల్ని ప్రమాదకరమైన అసత్యంలోకి నడిపిస్తారు. 'లెక్చర్స్ టు మై స్టూడెంట్స్' అనే గ్రంథాన్ని ఛార్లెస్ స్పర్జన్ "ద మినిస్టర్స్ సెల్ఫ్ - వాచ్” (సేవకుని స్వీయ భద్రత) అను అధ్యాయంతో ప్రారంభించాడు. ఆ అధ్యాయంలో ఈ క్రింది మాటలున్నాయి. “సేవకుని భక్తికి సంబంధించిన ప్రాణ నాడి బలంగా, క్రమంగా కొట్టుకోవాలి. అతని విశ్వాస నేత్రం కాంతివంతంగా, తీర్మానపు పాదం స్థిరంగా, కార్యాన్ని నెరవేర్చే హస్తం చురుగ్గా ఉండాలి. అతని అంతరంగ పురుషునిలో యుక్తమైన సంగతులు చాలా ఉన్నత పరిమాణంలో ఉండాలి.”

మంచి నాయకుడు తన జీవితాన్ని పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచుకుంటాడు. తద్వారా అతని ఆత్మీయ దృష్టి స్పష్టంగా ఉంటుంది, చక్కటి ప్రావీణ్యత కలిగియుండి అతడు తన జీవితానికి తన జ్ఞానాన్ని అన్వయించుకుంటాడు (1 తిమోతి 1:5-7;; 1థెస్స 5:21-22;; హెబ్రీ 5:14;). నేను ఎదగకుండా ఉంటే, నేను నడిపించే వారి ప్రశ్నలకు నిజమైన సమాధానాలివ్వలేను. స్పర్జన్ గారు ఈ విధంగా చెప్పారు, “నూతనత్వం పొందిన నా స్వభావంతోనే (నశించిపోయే) ఆత్మల గురించి దుఃఖపడతాను, వేదనను అనుభవిస్తాను. అందుచేత యేసు క్రీస్తులో ఉన్న మృదుత్వాన్ని నాలో ఉండేలా నేను జాగ్రత్త పడాలి.

నేను నా భక్తినీ, ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసి నా గ్రంథాలయాన్ని పుస్తకాలతో నింపేసినా, క్రొత్త కార్యక్రమాల్ని నిర్వహించినా, పథకాల్ని రచించినా అవన్నీ వ్యర్థమే. ఎందుకంటే నాకున్న పవిత్రమైన పిలుపుకు గ్రంథాలూ, వ్యక్తులూ కేవలం కొన్ని ఉపకరణాలు మాత్రమే. పవిత్రమైన సేవకు నా ప్రాణాత్మదేహాలు నాకు అతి సమీపంగా ఉన్న యంత్రాలు.

నా ఆత్మీయాంగాలూ, నా అంతరంగ జీవితాలే నా యుద్ధాపకరణాలు.

 

మంచి గృహ నిర్వాహకునిలా నడిపించు

దేవుని ప్రజలు మనకే చెందినవారనీ, మనకు నచ్చినట్లు వారిని వాడుకోవచ్చనీ ఆలోచించడం ఘోరమైన తప్పిదం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమే దేవుని ప్రజలు (అపొ.కా. 20:28;). దేవుని ప్రజల్ని శ్రద్ధగా చూసుకోవడానికి దేవుని ఆత్మ మనల్ని వారిపై అధ్యక్షులుగా ఉంచాడు. పరిచర్యలోని ఆధిక్యతలకు తానొక గృహ నిర్వాహకుణ్ణని భావించే నాయకుడు ప్రజల్ని సంతోష పెట్టడానికి జీవించడు, తన బ్యాంకు ఖాతాను నింపుకోడు, ప్రజాభిమానం కోసం పరితపిస్తూ దేశ సంచారం చేస్తుంటే వక్త కాలేడు. 'తనను సైనికునిగా దండులో నియమించిన' వానిని సంతోషపరచడానికి శ్రమిస్తాడు (2 తిమోతి 2:4;). ప్రజలను దేవుని సొత్తని లేఖనాలు వర్ణించిన ప్రతీ సందర్భంలో నేను వణికిపోతాను. పరిచర్య శక్తివంతంగా ముందుకు సాగిపోవాలంటే అనేకమైన నా బలహీనతల్ని ప్రభువు తన కృపతో కప్పాల్సి వుందని నాకు తెలుసు. వ్యక్తిగతంగా నేను జయించి బహుమానాలు పొందడానికి పరిచర్య చేసినా, నడిపించినా దేవుని ప్రజలకు సంరక్షణ కొదువై, వారు అపాయాల్లో చిక్కుకుంటారు. క్రీస్తును ఘనపరచడానికి ఆత్మీయ నాయకులు అన్నివేళల్లో తమవైపు నుంచి గమనాన్ని మళ్లించాలి. క్రీస్తు పరిచారకులుగానూ, దేవుని మర్మాల విషయంలో గృహ నిర్వాహకులుగానూ (1కొరింథీ 4:1;) తమను భావించాలని పౌలుతో పాటు, అతని సంఘ స్థాపక బృందం ప్రజలకు చెప్పారు. ఈ వైఖరి అల్పమైన సంగతుల్ని ప్రక్కన పెట్టి, నమ్మకత్వపు ఆవశ్యకతను హెచ్చిస్తుంది (1కొరింథీ 4:2;).

 

సమస్య ఖచ్చితంగా వస్తుందని తెలుసుకో

ఎఫెసీ సంఘ పెద్దలకు పౌలు ఒక గంభీరమైన సందేశాన్నిచ్చాడు. ఆ సంఘంపై తాము దాడి చేయకముందే పౌలు సంఘంలోనుంచి బయటకు వెళ్లిపోవాలని క్రూరమైన తోడేళ్లలాంటి తప్పుబోధకులు ఎదురుచూసారు. కాబట్టి ఎఫెసీ సంఘ పెద్దలు మెలకువగా ఉండి తమకు బోధించిన అనువజ్ఞులైన యోధుల మాదిరిని అనుసరించాలి. నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్ళు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి (అపొ.కా. 20:31;). సత్యాన్ని ప్రకటిస్తున్న ఏ ప్రదేశంలోనైనా సాతాను దానికి విరుద్ధమైన తప్పుబోధను ప్రారంభిస్తాడని స్థిరబుద్ధి గల నాయకులకు తెలుసు. పరిచర్య ఎప్పుడు అసత్యానికి అవకాశమివ్వదని కాపరి భావిస్తాడో, ఆ సమయంలోనే అది అసత్యానికి చిక్కిపోయే ప్రమాదంలో పడిపోతుంది.

క్రీస్తు యొక్క అపొస్తలులుగా మారువేషంతో వచ్చే వంచకులనీ, కపటం కలవారనీ లేఖనాలు అన్నివేళలా తప్పు బోధకుల్ని వర్ణిస్తున్నాయి (2 కొరింథీ 11:13-14;). ఆ తప్పు బోధకులు గొర్రెల చర్మంలో మన దగ్గరకు వస్తారు. కనుక వారిని సులభంగా గుర్తించడం సాధ్యం కాదని యేసు హెచ్చరించాడు (మత్తయి 7:15;). సత్య బోధనుంచి అతి సూక్ష్మమైన వ్యత్యాసం కలిగిన అబద్ధాల్ని సత్యాని కనుగుణమైన బోధతో కలిపి వారు తమ అబద్ధాల్ని రహస్యంగా సంఘంలోకి ప్రవేశపెడతారు (2 పేతురు 2:1;).

ఈ అబద్ద నాయకులు ఎఫెసీ సంఘంలోకి వచ్చినప్పుడు వీరిని క్రూరమైన తోడేళ్లని పిలవడానికి పౌలు సందేహించలేదు, (అపొ.కా. 20:29;). ఈ తోడేళ్ల గుంపు తమ రహస్య బోధను గొర్రెలకు పరిచయం చేసి దాన్ని నమ్మేలా చేయడానికి మొదట ఒక తోడేల్ని వాటి మధ్యకు పంపుతాయి. ఆ తోడేలు ఆకర్షణకు గురైన గొర్రెల పై అప్పటికే రహస్యంగా పొంచియున్న మిగతా తోడేళ్ల గుంపు భయంకరంగా దాడిచేసి కొన్నింటిని చంపి, మరి కొన్నింటిని చెల్లాచెదురు చేస్తాయి. 10 ఇరేనియస్ అనే ఆది సంఘ పితరుడు అసత్యపు మోసాన్ని చాలా సూటిగా బట్టబయలు చేసాడు. “అసత్యమెన్నడూ దాని అసలైన రూపంలో ప్రత్యక్షమవ్వదు. అలా ప్రత్యక్షమైతే అది అసత్యమని అందరికీ తెలిసిపోతుంది. అయితే ఈ అసత్యం ఆకర్షణీయమైన వస్త్రాలు ధరిస్తుంది. కనుక వివేచన అనుభవాలు లేనివారికి సత్యంలా కనబడుతుందని”11 అతడు చెప్పాడు.

సత్యానికి విరుద్ధంగా కపటమైన అబద్దాలేమీ మన మధ్యలో పనిచేయట్లేదనీ, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆ అబద్దాలు దాడిచేయట్లేదనీ, కపటం తెలియని వారిని నాశకరమైన రీతిలో లోబరచుకోవడానికి చూడట్లేదనే నమ్మకాన్ని మనలో కలుగనీయ కూడదు. మన సంఘంలో సత్యం అనేక కాలాల్లో వర్థిల్లినా, మందను చెల్లాచెదురు

 

మూడవ భాగం

నాయకత్వాన్ని అభివృద్ధి చేయుట

13. నాయకత్వానికి అవసరమైన లక్షణాల్ని గుర్తించుట

నేను అమెరికా వైమానిక దళంలో పనిచేసాను. కొన్నేళ్ళ క్రితం యుద్ధాభ్యాసం చేస్తుండగా యుద్ధ విమానాల్లో పైలెట్‌కు సమాచారాన్నందించే బాధ్యత నాకు అప్పగించారు. ముఖ్యంగా శత్రు స్థావరాలపై, వారి విమానాలపై దాడిచేయడానికి పైలెట్లకు అవసరమైన సమాచారాన్నందిస్తూ వారికి సలహాల్నీ, సహాయాన్ని అందించాను. ఒక సందర్భంలో ఒక యుద్ధ విమానం పూర్తిగా ధ్వంసమైంది. దానిలో ఇంధనం అయిపోయింది. అయితే శత్రు స్థావరంపై ప్రయోగించాల్సిన ఆయుధం మాత్రం ఇంకొకటి మిగిలిపోయింది. ఆ పరిస్థితిలో పైలెట్ తిరిగి మా స్థావరానికి వచ్చేస్తానని చెప్పగా, దానికి తగిన ఏర్పాట్లు చేయడ