ఇందులో RTFవారు దుర్బోధకులతో సంఘానికి సంధి కుదిర్చే ప్రయత్నం చేశారని మేము చేసిన అభియోగమే ప్రస్తుత చర్చకు దారితీసింది. మేము లేవనెత్తిన అనేక విషయాలలో, సహో.సాయికృష్ణ గోమటంగారు ఓఫిర్ని "క్రీస్తునందు సోదరుడని", సహో.జాన్ క్రిస్టోఫర్ గారు ఓఫీర్ని "దేవుని సేవకునిగా గౌరవిస్తున్నాం" అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్న ప్రశ్నలు ఈ చర్చలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
ఈ చర్చలో:
1- ఓఫిర్ ని కొత్త దేవుడని ఎందుకంటున్నాం ?
2- వ్యభిచారం చేయకూడదని చెప్పడం పరిసయ్యుల బోధ అవుతుందా?
3- మోహపుచూపు పాపమని బోధించడం తప్పు అవుతుందా?
4- హస్తప్రయోగం చేయకూడదని బైబిల్ లో లేదా ?
5- పరలోకంలో కూడా సెక్స్ ఉంటుందా ?
తదితర ప్రశ్నలకు జవాబు తెలుసుకోటానికి ఈరోజు 8:00 PM జరగబోయే చర్చా కార్యక్రమాన్ని తప్పక చూడండి.
తల్లితండ్రులకు ముఖ్య గమనిక 12 సం|| లోపు ఉన్న మీ పిల్లలను ఈ కార్యక్రమం నుంచి దూరంగా ఉంచడం మంచిది.
రంజిత్ ఓఫిర్ గారు 'నేను ఒక ప్రవక్తని' అని చెప్పుకుంటూ, 2020 లో ఒక ప్రవచనం చెప్పడం జరిగింది. ఆ ప్రవచనం నెరవేరకపోయిన కారణాన్ని బట్టి రంజిత్ ఓఫిర్ ఒక అబద్ద ప్రవక్త అని బిబు గారు ప్రకటించారు. అయితే రంజిత్ ఓఫిర్ గారు తనని తాను సమర్ధించుకోవడం కోసం 'బైబిలే inaccurate గా వుంది కాబట్టి నేను కూడా inaccurate ఏ' అన్నట్లుగా మాట్లాడారు. దానితో పాటుగా బైబిల్ లోని కొన్ని వాక్య భాగాలను వైరుధ్యాలుగా వక్రీకరించారు. అయితే వాటన్నింటికీ సమాధానం చెప్తూ, లేఖనాల వెలుగులో రంజిత్ ఓఫిర్ గారిని అబద్ద ప్రవక్త అని ఎందుకు ప్రకటించారో ఇంకా చక్కగా మరో సారి వివరిస్తూ counter వీడియో చేశారు బిబు గారు. మతోన్మాదులు ఎలాగైతే బైబిల్ inaccuracies పైన పుస్తకాలు రచిస్తూ ప్రసంగాలు చేస్తూ వచ్చారో, ఓఫిర్ గారి స్పందనను బట్టి ఇక Ophirist లు కూడా అటువంటి పనే చెయ్యాలి, అలాగే చేస్తారు కూడా. అయితే మీరు ఇటువంటివి ఇంకా ఎన్ని తీసుకొచ్చినా, బైబిల్ accurate అని prove చేస్తాము అని బిబు గారు చెప్పడం జరిగింది. కాబట్టి అనుకున్నట్టే జరిగింది. recent గా ophirist లు కొంతమంది కలిసి ఒక panel discussion చేసి అందులో అందరూ ముక్త కంఠంతో బైబిల్ inaccurate అని ప్రకటించారు. RKP పాస్టర్లు చేసిన ఆ వీడియోకే ఈ మా స్పందన. ఇందులో మేము ప్రస్తావించిన వీడియోలు మరియు వ్యాసాల లింక్లు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
అనేక సంఘాలలో డిసెంబర్ 31న లేదా జనవరి 1వ తారీఖున బైబిల్లో ఉన్న వాగ్దానాలను చిన్నచిన్న చీటీలలో రాసి పంచిపెట్టడం, ఎవరికి ఏ వాగ్దానం వస్తే అది ఆ సంవత్సరం కోసం ప్రభువు ఇచ్చిన వాగ్దానంగా పరిగణించటం ఒక అలవాటు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు కాబట్టి, నా పరిస్థితిని ఎరిగిన దేవుడు దానికి తగిన వాగ్దానాన్ని నాకు అనుగ్రహిస్తాడనే విశ్వాసం ఈ అలవాటుకు ఆయువుపట్టు. ఎంతో ఆదరణనిచ్చే ఈ పరిచర్యను కూడా విమర్శిస్తారా? అది తప్పు, ఇది తప్పు అనటంకంటే మీకింకో పనే లేదా అనే ఆక్షేపణలకు, తిరస్కారానికి సిద్ధపడి, వాక్య అధికారంతో ఈ వాగ్దానాల లాటరీ పద్ధతిని ఖండిస్తున్నాను. ఇది సంఘాన్ని మూఢభక్తి వైపుకు నడిపించటం మాత్రమే కాకుండా, దేవుని వాక్యం చదవాల్సిన విధానాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టే తప్పుడు అలవాటు. ఇందులో ఉన్న పొరపాటు ఏమిటో ఈ క్రింది విషయాలను నాతో కలసి విశ్లేషిస్తే మీకే అర్థమౌతుంది. ప్రార్థనాపూర్వకంగా పరిశీలించగలరని మనవి.
రంజిత్ ఓఫిర్ అబద్ధ ప్రవక్త - ఇదే యెహోవా వాక్కు|Thus says the Lord - Ranjith Ophir is a false prophet
హితబోధ నెట్వర్క్ వారి పరిచర్యలో భాగంగా బ్రదర్ బిబు ఈమధ్యకాలంలో బైబిల్ మిషన్ దేవదాసు అయ్యగారి బోధలలోని వాక్యవిరుద్ధమైన సంగతులను తన పుస్తకం మరియు వీడియోల ద్వారా బహిర్గతం చేసినప్పుడు ఆ సంస్థకు చెందిన కొందరు అనుచరులు విషయమంతా వదిలేసి, దేవదాసు అయ్యగారు చెప్పినవి ఏవిధంగా వాక్యానుసారమో రుజువు చెయ్యకుండా, కనీసం వారు బహిరంగంగా నిరూపించుకోగలిగే సవాలును కూడా స్వీకరించకుండా కొన్ని అనవసరపు విమర్శలు చెయ్యడం ప్రారంభించారు. దుర్బోధలను ఖండించే క్రమంలో ఇటువంటి అనవసరపు విమర్శలు మాకు కొత్తేంకాదు.
దేవదాసు అయ్యగారి జీవిత చరిత్రగా బైబిల్ మిషను వారు ప్రచురించిన పుస్తకం 59-61 పేజీలలో దేవదాసు అయ్యగారితో సహా మొత్తం ఐదుగురు కలసి ప్రభువు వారితో మాట్లాడిన మాటలన్నిటినీ రాసి ఆ ప్రతులను ఒక పెద్ద గదిలో భద్రపరిచారనీ, వాటిని కనుక అచ్చువేస్తే ఇప్పుడున్న 100 బైబిళ్ళకు ఆ గ్రంథం సామానం ఔతుందనీ, ఇతరులు ఎవరైనా ఆ గదిలోకి వెళ్తే చనిపోతారనీ తెలియచేసారు....
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.