సంఘము

క్రీస్తు తన ప్రజల కొరకు ఒక 'గృహాన్ని' లేక కుటుంబాన్ని తయారుచేసాడు. ఇలాంటి అద్భుతమైన దైవజ్ఞానం గురించి ఈ పేజీలలో రాయబడింది. ఇది మనమంతా ప్రభువు యొక్క పరిచర్యలో ఎదగడానికి ఉపయోగపడే అద్భుతకరమైన అంశం, అంతమాత్రమే కాకుండా, మన ఆత్మీయ జీవితాలకు చాలా అవసరమైనది మరియు ఆశీర్వాదానికి కారణమైనది కూడా. ఈ అంశం ఒకదానికొకటి సరిగ్గా అతికేటట్టు మనకు చక్కగా అర్థమవ్వడానికి అద్భుతమైన సాదృశ్యాలతో, ఉదాహరణలతో వివరించబడింది. ఒక విశ్వాసి ప్రభువుతో సన్నిహితంగా నడవడం తెలుసుకున్న తర్వాత విశ్వాససంబంధమైన మూలపాఠాలను అర్థం చేసుకున్న తరువాత 'సంఘ సభ్యత్వం' అనే అంశం ఆ విశ్వాసి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైంది.

దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘంలో ఎవర్ని సంఘపెద్ద అంటారు? ఆయనను ఎవరు నియమిస్తారు? సంఘపెద్ద, అధ్యక్షుడు, పాస్టర్ ఒక్కరేనా? ఒకవేళ సంఘపెద్ద పాపం చేస్తే, సంఘసభ్యులు ఏం చేయాలి? పాపమందు పట్టబడిన పాస్టర్ గారిని చర్చి సభ్యులు సంఘబహిష్కరణ చేస్తే, సంఘాన్ని ఎవరు నడిపిస్తారు? సంఘంలో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు పాస్టర్లుగా సేవ చేయడానికి అవకాశముందా? సామాజికంగా పని చేస్తూ ప్రభువు పరిచర్యను కూడా చేయవచ్చా? మొదలైన అంశాలను లేఖనాల వెలుగులో ఈ చిన్ని పుస్తకంలో చర్చించడం జరిగింది.

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.