ఇతర అంశాలు

రచయిత: Marie Prasanth Perikala
చదవడానికి పట్టే సమయం: 8 నిమిషాలు

యేసు క్రీస్తు గాడిద పిల్లను యెక్కి యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు, దారి పొడుగునా ప్రజలు తమ బట్టలు అలాగే చెట్ల కొమ్మలను పరిచి యేసు క్రీస్తుకు ఘన స్వాగతం పలికారు. నాకు తెలిసి దాదాపు ప్రతి చర్చిలో కూడా మట్టల ఆదివారం సందర్భంగా ఈ రోజు ఈ వాక్యభాగాన్ని గుర్తుచేసుకునే ఉండి ఉంటారు. ఈ సంఘటన జరిగినప్పుడు జనసమూహములలో కొంతమంది హోసన్నా హోసన్నా దావీదు కుమారుడా హోసన్నా! అని కేకలు వేశారు. అసలు హోసన్నా అంటే ఏమిటి?

నేను గమనించింది ఏంటంటే మనలో చాలా మంది హోసన్నా అంటే జయము అని అనుకుంటున్నారు. అలా అనుకోవడానికి గల కారణం ఏంటంటే, మన తెలుగు బైబిల్స్ లో హోసన్నా అనే పదాన్ని జయము అని తర్జుమా చేశారు. But sorry to say, this is not a proper translation.

మత్తయి సువార్త 21:9 వచనంలో "జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి" అని ఉంటుంది. Then the multitudes who went before and those who followed cried out, saying: "Hosanna to the Son of David! 'Blessed is He who comes in the name of the Lord!' Hosanna in the highest!"

మార్కు సువార్త 11:9-10 వచనాలలో "ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి" అని ఉంటుంది. Then those who went before and those who followed cried out, saying: "Hosanna! 'Blessed is He who comes in the name of the Lord!' Blessed is the kingdom of our father David That comes in the name of the Lord! Hosanna in the highest!"

అలాగే యోహాను సువార్త 12:12-13 వచనాలలో "మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి" అని ఉంటుంది. The next day a great multitude that had come to the feast, when they heard that Jesus was coming to Jerusalem, took branches of palm trees and went out to meet Him, and cried out: "Hosanna! 'Blessed is He who comes in the name of the Lord!' The King of Israel!"

ఈ మూడు వాక్యాలను మీరు ఇంగ్లీష్ బైబిల్ లో గాని లేదా గ్రీకులో గానీ చూసినట్లయితే, మనకు తెలుగులో జయము అని ఉన్న ప్రతీ చోటా కూడా హోసన్నా అనే ఉంటుంది. హోసన్నా అనేది నిజానికి ఒక హీబ్రూ పదం. హోషియానా (הוֹשִׁיעָה נָּא) అనే హీబ్రూ పదాన్ని గ్రీకులో transliterate చేసినప్పుడు హోసన్నా (Ωσαννα) అని రాశారు. కాబట్టి actual pronunciation ఏంటంటే హోషియానా. "యాషా" అనే పదం అలాగే "నా" అనే పదం... ఈ రెండు పదాల నుండి హోషియానా అనే పదం వచ్చింది. "యాషా" అని అంటే రక్షించడం... ఇబ్బందుల్లో ఉన్నవారిని కాపాడటం, భారంతో కుంగిపోతున్న వారిని విడిపించడం. ఇలాంటి అర్ధాలు వస్తాయి. "యాషా" అనే పదం నుండి "హోషే-ఆ" అనే పదం వచ్చింది. "హోషే-ఆ" అని అంటే రక్షణ (salvation) లేదా రక్షించు అనే అర్థం వస్తుంది. "హోషే-ఆ" అనే పదం మనకు బాగా తెలిసిన పదమే. పాతనిబంధనలో ఒక ప్రవక్త పేరు "హోషే-ఆ". అతని పేరుతో ఒక గ్రంథం కూడా ఉంది. అంతేకాకుండా యెహోషువ అసలు పేరు "హోషే-ఆ". సంఖ్యాకాండము 13:8 వచనంలో "ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ" అని ఉంటుంది. ఆ తరువాత 16వ వచనంలో "మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను" అని ఉంటుంది. ఇక "నా" అనే హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే now... ఇప్పుడే లేదా వెంటనే అనే అర్థం వస్తుంది. కాబట్టి హోషియానా అని అంటే save now, ఇప్పుడే రక్షించు లేదా వెంటనే రక్షించు అనే అర్థం వస్తుంది. వాళ్ళు అక్కడ జయము జయము అని పొగడటం లేదు. మమ్మల్ని వెంటనే రక్షించు ప్రభువా అని వేడుకుంటున్నారు. Ofcourse వాళ్ళు ఆత్మ సంబంధమైన రక్షణ కోసం వేడుకోవడం లేదు. ఈ లోక సంబంధమైన రక్షణ ఈ లోక సంబంధమైన విడుదల, రోమీయుల నిరంకుశ పాలన నుండి తమను విడిపించడానికి మెస్సయ్య వస్తాడని అప్పట్లో ఇశ్రాయేలీయులు ఎదురుచూస్తూ ఉండేవారు. ఈ యేసు క్రీస్తే తాము ఎదురుచూస్తూ ఉన్న మెస్సయ్య అని కూడా వాళ్ళు విశ్వసించారు. ఇక్కడ వాళ్ళు యేసు క్రీస్తును తమ రాజుగా ప్రకటిస్తూ ఉన్నారు. తమ తరపున రోమీయులతో యుద్ధం చేసి తమకు విశ్రాంతి కలుగజేస్తాడు అని, ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అనేది వారి నిరీక్షణ. వాళ్ళు దేవుని ప్రణాళికను సరిగ్గా అర్థం చేసుకోలేదు. వారి ఆత్మలను రక్షించి వారిని దేవుని రాజ్యంలోకి నడిపించడమే యేసు క్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మనం గమనించవలసిన మరొక కీలకమైన విషయం ఏంటంటే, నిజానికి ఇక్కడ వాళ్ళు కీర్తనల గ్రంథము 118:25-26 వచనాలను quote చేస్తున్నారు. కీర్తనల గ్రంథము 118:25-26 వచనాలలో "యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక" అని ఉంటుంది. "అన్నా యెహోవా హోషియా నా, అన్నా యెహోవా హత్స్-లిఖానా. బరూక్ హబ్బా బెషేమ్ యెహోవా" అని హీబ్రూలో ఉంటుంది. "యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక" అని పాతనిబంధనలో ఉంటే, "ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక" అని కొత్త నిబంధనలో ఉంది. మనకు అందుబాటులో ఉన్న గ్రీక్ manuscripts అన్నిట్లో కూడా యెహోవా అనే పదానికి బదులు కురియోస్ అనే పదాన్ని వాడారు కాబట్టి తెలుగులో కూడా ప్రభువు అని తర్జుమా చేశారు. కానీ నిజానికి అక్కడ యెహోవా అని ఉండాలి. అలాగే బరూక్ అనే పదానికి హెబ్రీ భాషలో వేరు వేరు అర్ధాలు ఉన్నాయి. అందువల్ల తెలుగులో ఈ పదాన్ని కొన్ని సార్లు ఆశీర్వాదం అని కొన్ని సార్లు సన్నుతించుము అని ఇంకొన్ని సార్లు స్తుతించుము అని తర్జుమా చేశారు. ఇక్కడ నేను చెబుతున్న విషయం ఏంటంటే కీర్తనల గ్రంథము 118:25-26 వచనాలను కొత్త నిబంధనలో quote చేశారు. అంటే యెహోవాకు చేసిన ప్రార్ధనను యేసు క్రీస్తుకు apply చేయడం ద్వారా New Testament writers ఏమి చేస్తున్నారంటే యేసు క్రీస్తు మెస్సయ్య అనే విషయాన్ని చెప్పడంతో పాటు ఆయన దైవత్వాన్ని కూడా highlight చేస్తున్నారు. ఈ వాక్యభాగంలో ఇది చాలా కీలకమైన విషయం. So this is all about Hosanna. హోసన్నా అని అంటే దయచేసి నన్ను వెంటనే రక్షించు ప్రభువా అని వేడుకోవడం.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.