యేసు క్రీస్తు గాడిద పిల్లను యెక్కి యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు, దారి పొడుగునా ప్రజలు తమ బట్టలు అలాగే చెట్ల కొమ్మలను పరిచి యేసు క్రీస్తుకు ఘన స్వాగతం పలికారు. నాకు తెలిసి దాదాపు ప్రతి చర్చిలో కూడా మట్టల ఆదివారం సందర్భంగా ఈ రోజు ఈ వాక్యభాగాన్ని గుర్తుచేసుకునే ఉండి ఉంటారు. ఈ సంఘటన జరిగినప్పుడు జనసమూహములలో కొంతమంది హోసన్నా హోసన్నా దావీదు కుమారుడా హోసన్నా! అని కేకలు వేశారు. అసలు హోసన్నా అంటే ఏమిటి?
దేవదూతల గురించి సరైన అవగాహన చాలామందికి లేదు, ఎందుకంటే ఈ విషయం అనేక సంఘాలలో సరిగా బోధించబడట్లేదు. అయితే అనేక Cults ఈ విషయంలో అబద్ధ బోధలు చెప్తూ, వాక్యం చెప్పని విషయాలను దేవదూతల గురించి బోధించి విశ్వాసులను తప్పుదారి పట్టిస్తున్నారు. వాక్యంలో దేవదూతల గురించి చెప్పబడిన విషయాలపై సంఘానికి సరైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వ్యాసం రాసాను. ఇది దేవదూతల గురించిన లోతైన పరిశీలన కాదు, అయినప్పటికీ అవసరమైన ప్రాథమిక అంశాల గురించిన అవగాహనకు ఈ వ్యాసం చాలా దోహదపడుతుంది.
దాదాపు ఒక ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటా, నాకు తెలిసిన ఒక మిత్రుడు నాతో ఏమన్నాడంటే, "ఒకప్పుడు ప్రపంచమంతా హిందూ మతమే ఉండేది. ఆరు వేల సంవత్సరాల నాటి రాముడు హనుమంతుడి బొమ్మలు ఇరాక్ లో బయటపడ్డాయి తెలుసా?" అని అంటూ WhatsApp లో నాకు కొన్ని ఫోటోలు కొన్ని వెబ్సైట్ల లింకులను పంపించాడు. ఆ తరువాత కూడా ఇవే ఫోటోలు నాకు సోషల్ మీడియాలో చాలా సార్లు కనిపించాయి. కొద్ది రోజుల క్రితం మన తెలుగు బాక్స్ ఆఫీస్ టీవీ ప్రేమచంద్ గారు కూడా ఒక వీడియోలో దీని గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఈ ప్రచారంలో ఉన్న వాస్తవమెంత? ఆరు వేల సంవత్సరాల నాటి రాముడు హనుమంతుడి బొమ్మలు నిజంగానే ఇరాక్ లో బయటపడ్డాయా? ఇందులో ఉన్న నిజానిజాలు ఏమిటో కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
గత 1,2 దశాబ్దాల నుండి క్రైస్తవ లోకంలో ఆరాధన పద్ధతిలో పరిశుద్ధతను, వాక్యభావాన్ని మరచి లోకపరమైన పోకడలను, ఆకర్షణీయమైన పద్ధతులను అవలంబిస్తూ వస్తుంది. టి.వి. మాధ్యమం, సామాజిక మాధ్యమం ఎక్కువగా అందుబాటులోకి రావడం వలన, ప్రజలు, సంఘ సభ్యులు తమని తాము ప్రదర్శించుకోవడానికి అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నేటి యువత వాక్యం లోని లోతైన అవగాహన కూడా లేకుండా పాటలు రాసి, పాడి సమాజంలో దేవుని నామానికి ఘనత కలిగించ లేకపోతున్నారు. ఇది పెద్దవారిలో కూడా కనబడుతుంది. అలాగే క్రైస్తవ్యంలో ఇబ్బంది పెడుతున్న మరొక అంశం అపవిత్రమైన నృత్య ప్రదర్శనలు లోక పరమైన నృత్యాలను సంఘంలోనికి తీసుకొచ్చి అపవిత్ర పరుస్తూ దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. పరిశుద్ధంగా ఉండవలసిన సంఘ స్థలాలు అపవిత్రమైన సంగీత, నృత్య ప్రదర్శనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా ఆరాధన పద్ధతులు, పరిశుద్ధమైన ఆరాధన, సంఘాలలో ప్రదర్శిస్తున్న సంగీత, నృత్య కార్యక్రమాలు గురించి గమనిద్దాం.
ప్రపంచవ్యాప్తంగా కరోనా(COVID-19) విజృంభించి నాశనాన్ని సృష్టిస్తున్న సమయంలో, కొన్ని మతాలవారు ఈ వైరస్ పరిష్కారం గురించి తమ మతగ్రంథాలలో ముందే వ్రాయబడి ఉందని చెపుతూ కొన్ని మూఢనమ్మకాలనూ, అబద్ధప్రచారాలనూ వ్యాప్తిచేయడం ప్రారంభించారు. హిందువులైతే ఆవు మూత్రం, పేడ కరోనాకు విరుగుడంటూ విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలలో దేవునివాక్యం పైన అవగాహన లేని క్రైస్తవులు కూడా తక్కువేమీ కాదు.
క్రైస్తవ సమాజానికి ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలలో ఒకటైన యెరూషలేము యాత్ర పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకనగా యెరూషలేము యాత్ర వాక్యానుసారమైనది కాదు. యెరూషలేము పుణ్యక్షేత్రము కాదు. పుణ్యక్షేత్రము అనగా ఫలానా స్థలంలో మనకు పుణ్యం అనగా మోక్షం లేక రక్షణ (స్వర్గం) వస్తుందని ఒక నమ్మకం లేక విశ్వాసం.
నేటి క్రైస్తవ్యంలో జరుగుచున్న సంఘటనలు గమనిస్తే హృదయం ఆవేదన చెందుతుంది. మొదటి శతాబ్దపు కాలంనాటి క్రైస్తవ్యంతో పోలిస్తే నేటి క్రైస్తవ్యం అసలు క్రైస్తవ్యమే కాదనిపిస్తుంది. యేసు క్రీస్తు చెప్పిన భోదలు, చేసిన పరిచర్య, అపొస్తలులు అనుసరించిన పద్ధతులు, వారు వేసిన పునాది, దాన్ని అనుసరించిన తరువాతి కాలపు అపొస్తలుల క్రైస్తవ్యం, పరిచర్య పద్దతలు నేటి పరిచర్యతో అసలు పొంతనే లేదనిపిస్తుంది. ముఖ్యంగా సంఘ పెద్దలు, దైవజనులు పూర్తిగా వ్యాకానికి భిన్నంగా లోకరీతిగా నడుచుకుంటున్నారు....
© 2021. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.