విమర్శలకు జవాబు

రచయిత: Marie Prasanth Perikala
చదవడానికి పట్టే సమయం: 12 నిమిషాలు

Did You Know

కొద్ది రోజుల క్రితం ఒక సోదరుడు నాకు ఈ ఫోటోను పంపించి ఇది ఎంత వరకు వాస్తవం? దీని గురించి కాస్త వివరించండి అని అడగడం జరిగింది. నాకు తెలిసి ఇది బహుశా Seventh Day Adventist సంఘం వాళ్లు ప్రచారం చేస్తున్నది అనుకుంటా. ఈ ఫోటోలో ఉన్న విషయం ఏంటంటే, “క్రైస్తవ్యాన్ని స్వీకరించిన మొట్టమొదటి రోమా చక్రవర్తి అయిన Constantine The Great, తాను క్రైస్తవ్యాన్ని స్వీకరించినప్పటికీ, సూర్యుడ్ని ఆరాధించడాన్ని మాత్రం మానలేదు. క్రీస్తు శకం 313వ సంవత్సరంలో మిలాను శాసనం ద్వారా అతను రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ్యాన్ని ఒక మతంగా గుర్తించినప్పటికీ సూర్యారాధనను కొనసాగించాడు. క్రీస్తు శకం 321వ సంవత్సరంలో అధికారికంగా ఆదివారాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించడం ద్వారా, (అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం రోజుకి సూర్యుడే అధిపతి. ఆ రోజు సూర్యుడిదే. అందుకే ఆ రోజును Sunday - ఆదివారం అని అంటాం. ఆదిత్యుడు అని అంటే సూర్యుడు, అటువంటి ఆదివారాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించడం ద్వారా) సబ్బాతు ఆరాధనను శాశ్వతంగా శనివారం నుండి ఆదివారానికి మార్చివేశాడు” అనేది Constantine చక్రవర్తి మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణ. అయితే ఇది నిజం కాదు. కేవలం ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే Constantine చక్రవర్తి క్రీస్తు శకం నాలుగవ శతాబ్దానికి చెందినవాడు. అతను జీవించిన కాలం కంటే సుమారు రెండు వందల సంవత్సరాల ముందుగానే అంటే క్రీస్తు శకం రెండవ శతాబ్దంలోనే క్రైస్తవులు ఆదివారం రోజు సంఘముగా కూడుకుని దేవుడ్ని ఆరాధించేవారు అని అనడానికి ఆధారాలు ఉన్నాయి.

అయితే detailsలోకి వెళ్లే ముందు ఒక చిన్న disclaimer ఏంటంటే, క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని ఆచరించాలా - ఆచరించాల్సిన అవసరం లేదా? ఒకవేళ ఆచరించాలి అని ఆంటే శనివారం రోజు ఆచరించాలా లేక ఆదివారం రోజు ఆచరించాలా? యేసు క్రీస్తు శుక్రవారం రోజు మరణించి తిరిగి ఆదివారం రోజునే పునరుత్థానం అయ్యారా లేదా? ఇలాంటి విషయాలను గురించి ఈ వ్యాసంలో మనం మాట్లాడుకోవడం లేదు. క్రైస్తవులు ఆదివారం రోజు సంఘముగా కూడుకోవడం అనే ఆచారాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టినవాడు Constantine చక్రవర్తేనా లేకపోతే అతనికంటే ముందు నుండే ఈ పద్ధతిని పాటిస్తూ ఉన్నారా? Constantine చక్రవర్తి సూర్యుడ్ని ఆరాధించేవాడు కాబట్టి సంఘంలోకి ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టారా లేకపోతే దీని వెనుక ఇంకా వేరే ఏమైనా కారణం ఉందా? వీటి గురించి మాత్రమే ఈ రోజు మనం పరిశీలించబోతున్నాం. సరే వివరాల్లోకి వెళితే...

Titus Aelius Hadrianus Antoninus Pius అనే రోమా చక్రవర్తి క్రీస్తు శకం 138వ సంవత్సరం నుండి 161వ సంవత్సరం వరకు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలో క్రైస్తవుల మీద విపరీతమైన హింస జరుగుతూ ఉండేది. క్రైస్తవులను ద్వితీయ శ్రేణి పౌరులలాగా చూసేవారు. క్రైస్తవుల మీద ఏవైనా ఆరోపణలు వస్తే కనీసం విచారణ కూడా చేయకుండానే వాళ్ళను శిక్షించేవాళ్ళు. క్రైస్తవులను క్రూర మృగాలకు ఆహారంగా వేసేవాళ్ళు. క్రైస్తవులను సజీవదహనం చేసి చంపేసేవాళ్ళు. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య సుమారు క్రీస్తు శకం 155వ సంవత్సరంలో Justin Martyr అనే ఒక క్రైస్తవుడు రోమా చక్రవర్తికి ఒక ఉత్తరం రాశాడు. ఈయన సుమారు క్రీస్తు శకం 100వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 165వ సంవత్సరం వరకు జీవించిన early Christian apologist మరియు తత్వవేత్త. ఈయన కూడా చివరికి హతస్సాక్షిగానే మరణించారు. రోమా అధికారులు ఇతనికి శిరచ్ఛేదన శిక్షను విధించి ఇతని తలను నరికి చంపేశారు. రోమా చక్రవర్తికి ఈయన రాసిన ఉత్తరాన్ని “The First Apology of St. Justin For The Christians to Antoninus Pius” అని అంటారు. ఈ ఉత్తరంలో Justin Martyr గారు ఆ కాలంలో క్రైస్తవులపై జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలు మరియు హింసను ఆపివేయాలి అని కోరుతూ, క్రైస్తవులను క్రైస్తవ విశ్వాసాన్ని సమర్థిస్తూ, అప్పటి రోమా చక్రవర్తికి క్రైస్తవుల నైతికతను వారి ఆచారాలు, వారి పద్దతులను వివరించడం జరిగింది. దీనిలో భాగంగా క్రైస్తవులు దేవుడ్ని ఆరాధించే పద్ధతి, వాళ్ళు సంఘముగా ఎప్పుడు కలుసుకుంటారు, అలా కలుసుకుని ఏమి చేస్తారు మొదలైన విషయాలను కూడా Justin Martyr గారు ఆ ఉత్తరంలో వివరించారు. ఆ ఉత్తరంలోని 87, 88, 89 పేరాలను మనం చూసినట్లయితే ఆయన ఈ విధంగా వ్రాశారు.

And in every Eucharistical sacrifice we bless the Maker of all things through His Son Jesus Christ, and through the Holy Spirit. And upon the day called Sunday, all that live either in city or country meet together at the same place, where the writings of the apostles and prophets are read, as much as time will give leave. When the reader has done, the bishop makes a sermon, wherein he instructs the people, and animates them to the practice of such lovely precepts. At the conclusion of this discourse, we all rise up together and pray; and prayers being over, as I now said, there is bread and wine and water offered, and the bishop, as before, sends up prayers and thanksgivings with all the fervency he is able, and the people conclude all with the joyful acclamation of Amen. Then the consecrated elements are distributed to, and partaken of by all that are present, and sent to the absent by the hands of the deacons.

But the wealthy and the willing, for every one is at liberty, contribute as they think fitting; and this collection is deposited with the bishop, and out of this he relieves the orphan and the widow, and such as are reduced to want, by sickness or any other cause, and such as are in bonds, and strangers that come from far; and, in a word, he is the guardian and almoner to all the indigent.

Upon Sunday we all assemble, that being the first day in which God set Himself to work upon the dark void, in order to make the world, and in which Jesus Christ our Saviour rose again from the dead; for the day before Saturday He was crucified, and the day after, which is Sunday, He appeared to His apostles and disciples, and taught them what I have now proposed to your consideration.

ఇక్కడ Justin Martyr గారు ఏమంటున్నారంటే, "తన కుమారుడైన యేసు క్రీస్తు మరియు పరిశుద్దాత్మ ద్వారా, సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్తకు మేము ప్రతి ఆరాధనలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. పట్టణాల్లో నివసించే వారు అయితేనేమి గ్రామాల్లో నివసించేవారు అయితేనేమి ప్రతి ఒక్కరమూ కూడా ఆదివారము రోజు ఒక చోట కలుసుకుని ప్రవక్తలు మరియు అపొస్తలుల రచనలను చదువుతాము. ఆ తరువాత బిషప్పుగారు ప్రసంగిస్తూ అంతకుముందు చదివిన అద్భుతమైన విషయాలను మా జీవితంలో ఎలా ఆచరించాలో వివరిస్తారు. చివరిగా అందరము లేచి ప్రార్ధన చేస్తాము. ప్రార్ధన అయిపోయిన తరువాత రొట్టెను మరియు ద్రాక్షారసమును మరియు నీటిని అర్పిస్తాము. బిషప్పు గారు మళ్ళీ ప్రార్ధన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. చివరిగా అందరూ ఆమెన్ అని అంటారు. ఆ తరువాత అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి అర్పించిన రొట్టె ద్రాక్షరసము నీటిని స్వీకరిస్తారు. రాలేకపోయిన వారికి సంఘపెద్దల ద్వారా పంపించే ఏర్పాటు చేస్తారు. సంపన్నులు మరియు దేవునికి ఇవ్వాలి అని అనుకున్నవాళ్ళు స్వచ్ఛందంగా ఎవరికి తోచినంత వాళ్ళు కానుకలు అర్పిస్తారు. సేకరించిన డబ్బు అంతా కూడా బిషప్పు గారి దగ్గర ఉంటుంది. వాటిని ఆయన, అనాథలు, విధవరాండ్రు, రోగగ్రస్తులు, బానిసలు మరియు దూరప్రాంతాల నుండి వచ్చే బాటసారుల కోసం వెచ్చిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవసరతలో ఉన్నవారికి మరియు పేదవారికి బిషప్పుగారు ఆ డబ్బును దానం చేస్తారు. మేము అందరమూ ఆదివారము రోజునే కలుసుకోవడానికి కారణం ఏంటంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు, చీకటి అగాధ జలము పైన కమ్మియుండగా దేవుడు ఈ లోకాన్ని సృష్టించదలచి తన పనిని మొదలుపెట్టిన రోజు, అలాగే మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు సమాధిలో నుండి తిరిగి లేచిన రోజు, అంటే ఆయన శనివారానికి ముందు రోజు సిలువ వేయబడి ఆ తరువాతి రోజు అంటే ఆదివారం రోజు తిరిగి తన శిష్యులకు కనిపించారు కాబట్టి, మేము అందరమూ కూడా ఆదివారము రోజు సంఘముగా కూడుకుంటాము" అని Justin Martyr గారు వివరించారు.

నేను మొదట్లోనే చెప్పినట్లుగా ఇక్కడ Justin Martyr గారు చెప్పిన విషయాలు థియోలాజికల్ గానూ మరియు వాక్యం ప్రకారం కరెక్టా కాదా అనే విషయాన్ని మనం పరిశీలన చేయబోవడం లేదు కానీ, ఇక్కడ చాలా స్పష్టంగా అర్ధమవుతున్న ఒక విషయం ఏంటంటే క్రీస్తు శకం 155వ సంవత్సరం నాటికే రోమా సామ్రాజ్యంలోని క్రైస్తవులు ఆదివారం రోజు సంఘముగా కూడుకుని దేవుడ్ని ఆరాధించేవారు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించడానికి తన పనిని మొదలు పెట్టిన రోజు మరియు యేసు క్రీస్తు సమాధిలో నుండి తిరిగి లేచిన రోజు కూడా ఆ రోజే అని అప్పటి క్రైస్తవులు భావించేవారు కాబట్టి ఆదివారం రోజు అందరూ కలుసుకునేవారు అనే విషయం కూడా స్పష్టంగానే అర్ధమవుతుంది.

Capernaum

కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం అయితే, మొదటి శతాబ్దంలోని Jewish Christians అంటే యేసు క్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించిన యూదులు, మిగతా యూదులకు లాగానే సబ్బాతు రోజు (అంటే శనివారం రోజు) యూదుల సమాజమందిరాలలోనే కూడుకునేవారు. అంటే Jewish Christians కూడా Jewish Synagogues లోనే ఆరాధించేవారు. ఆ రోజు సూర్యాస్తమయం తరువాత, (వాళ్ళ క్యాలెండర్ ప్రకారం అయితే అప్పటికే ఆదివారం మొదలయిపోతుంది మన భాషలో చెప్పుకుంటే గనక శనివారం సాయంత్రం చీకటి పడిన తరువాత) యూదుల సమాజ మందిరానికి కొద్దిగా దూరంలో ఆ పక్కనే మరొక ప్రదేశంలో క్రైస్తవులు అందరూ కలుసుకుని రొట్టె విరిచి ప్రభు రాత్రి భోజన సంస్కారంలో పాలు పంచుకునే వాళ్ళు. కపెర్నహూము లోని అటువంటి ఒక ప్రదేశాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది యూదుల సమాజ మందిరానికి ఆనుకుని పక్కనే ఉంటుంది. (శాస్త్రవేత్తల అంచనా ప్రకారం బహుశా ఇది యేసు క్రీస్తు శిష్యుడైన పేతురు గారి స్వగృహం అయ్యుండొచ్చు. మార్కు సువార్త రెండవ అధ్యాయం మొదటి వచనం ప్రకారం చూసినట్లయితే బహుశా స్వయంగా యేసు క్రీస్తువారే కొంత కాలం నివాసం ఉన్న ఇల్లు ఇదే అయ్యుండొచ్చు కూడా.) కాబట్టి శనివారం సాయంత్రం చీకటి పడిన తరువాత అంటే వారి పరిభాషలో ఆదివారం రాత్రి క్రైస్తవులు అందరూ కలుసుకుని, రొట్టె విరిచి ప్రభు రాత్రి భోజన సంస్కారంలో పాలుపంచుకునే ఆచారం మొదటి శతాబ్దం నుండే ఉంది. ఇదే విషయాన్ని మనం అపొస్తలుల కార్యములు 20:7 కూడా చూస్తాం.

capernaum 1

ఇదే పద్దతి తరువాతి కాలంలో కూడా కొనసాగుతూ వచ్చి ఉండి ఉంటుంది. కాబట్టి Constantine చక్రవర్తి సూర్యుడ్ని ఆరాధించేవాడు కాబట్టి విశ్రాంతి దినాన్ని శనివారం నుండి ఆదివారానికి మార్చివేశాడు అనే ఆరోపణలో నిజం ఎంతమాత్రమూ లేదు. అది కేవలం ఒక అపోహ మాత్రమే.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.