క్యారిస్మాటిక్ భావజాలం, మరియు పెంతెకోస్తు సంఘాలు ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా ఉనికిలోకి వచ్చాయి. వీటిలో మనం ప్రధానంగా గమనిస్తున్న భాషల వరం, స్వస్థతా వరం బైబిల్ లోని భాషల వరం, స్వస్థతా వరం ఎందుకు కావు (ఎలా నకిలీవి). వీటిలో బోధించబడుతున్న సువార్త బైబిలోని సువార్త ఎందుకు కాదు (ఎలా వేరొక సువార్త). వీరు పరిశుద్ధాత్మను ఎలా, ఎంత దారుణంగా అవమానిస్తున్నారు. ఈ విషయాలన్నీ వివరంగా, ఆధారాలతో తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవండి. ఇందులో "పరిశుద్ధాత్మను అపహసించడం, పరిశుద్ధాత్మ యొక్క నూతన క్రియ, ఆత్మలను పరీక్షించడం, అపోస్తలులు మన మధ్య ఉన్నారా?, అబద్ధ ప్రవక్తల మూఢత్వం, వక్రీకరించబడిన భాషలు, నకిలీ స్వస్థతలు, పరిశుద్ధాత్ముడు రక్షణ, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధత, పరిశుద్ధాత్ముడు లేఖనాలు", వంటి అంశాలను కూడా వాక్యానుసారంగా వివరించడం జరిగింది.
వేదాలలోని 33 దేవుళ్ళలో ఒకరైన ప్రజాపతి మరెవరో కాదు యేసు క్రీస్తే అని కొందరు బోధిస్తున్నారు. ప్రజాపతిని దేవుళ్ళందరూ కలిసి బలిగా అర్పించారనీ ప్రజాపతి దేవుని కుమారుడైన యేసే అని నిస్సందేహంగా నిరూపించడానికి దోహదపడే అనేక లక్షణాలు అతనిలో ఉన్నాయని వారు చెబుతారు. ఈ బోధ ఎంతవరకూ సత్యమో పరిశీలించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.
ఆదికాండము 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్న "దేవుని కుమారులు - నరుల కుమార్తెలపై" క్రైస్తవసమాజంలో ప్రాముఖ్యంగా రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. యూదులకు కూడా ఇది ఒక వివాదాస్పదపు అంశమే. ఇది మన రక్షణకు కానీ విశ్వాసానికి కానీ దేవుని గుణలక్షణాలకు కానీ లేఖనాల ప్రామాణికతకు కానీ సంబంధించిన అంశం కానప్పటికీ లేఖనంలో రాయబడినవాటిని క్షుణ్ణంగా పరిశీలించి (సాధ్యమైనంతమట్టుకు) సరైనదానిని విశ్వసించడం మన బాధ్యత కాబట్టి కొంచెం విస్తారంగానే దీనిపై చర్చించదలిచాను. అందుకే ఈ అంశంపై ఉన్న ఆ రెండు అభిప్రాయాలనూ వాటిలో నేను గమనించిన లోపాలనూ మీతో పంచుకుని చివరిగా నేనేం విశ్వసిస్తున్నానో కూడా తెలియచేస్తాను.
వాచ్మన్ నీ (1903–1972) చైనా దేశానికి చెందిన ఒక వాక్యోపదేశకుడు, 'లోకల్ చర్చ్ మూవ్మెంట్'(LCM) వ్యవస్థాపకుడు. ఆయన పేరుతో చెయ్యబడుతున్న రచనలను బట్టి కొన్ని శాఖలలో విస్తృతంగా గౌరవించబడుతున్నప్పటికీ వాటిలో బైబిల్ సత్యం నుండి వైదొలిగే ముఖ్యమైన సిద్ధాంతపరమైన లోపాలు ఉన్నాయి. కానీ చాలా మంది విశ్వాసులు తెలియకుండానే లేఖనాల వెలుగులో జాగ్రత్తగా పరిశీలించకుండానే ఆ బోధనలను స్వీకరించారు. అలా పరిశీలించే అవకాశం కల్పించడం కోసమే ఈ చిరువ్యాసం ఉద్దేశించబడింది. ఇక్కడ ఉదాహరించబడిన అంశాలను ప్రార్థనాపూర్వకంగా పరిశీలించగలరు.
"నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినయెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాక" అంటూ విగ్రహారాధన విషయంలో నయమాను కోరిన అనుమతికి "నెమ్మదిగలిగి పొమ్మని" ఎలీషా పలికిన మాటలను లేఖనాల వెలుగులో అర్థం చేసుకోకుండా క్రైస్తవులు తప్పనిసరి పరిస్థితుల్లో విగ్రహారాధన చెయ్యవచ్చన్నట్టుగా బోధిస్తున్న దుర్బోధకుడికి సమాధానమే ఈ వ్యాసం.
ఈ రోజుల్లో చాలామంది బోధకులు తమంతట తాము అపొస్తలులమని ప్రకటించుకుంటున్నారు, అలాగే చలామణీ అవుతున్నారు. మరి కొన్ని క్రైస్తవశాఖలకు చెందినవారు ఇలా వాదిస్తుంటారు - 'ప్రతి క్రైస్తవుడూ ఒక అపొస్తలుడే. ప్రతి ఒక్కరూ అపొస్తలులు చేసినవన్నీ చెయ్యాలి. అపొస్తలులు కనపరిచిన ఆ మానవాతీత శక్తినీ, ప్రభావాన్నీ కనపరచాలి'. టీవీ ప్రసంగాల్లోనూ, సామాజిక మాధ్యమాల ద్వారానూ ఈ బోధ ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. ఈ తరంలోని అనేకులు ఈ విషయంలో 'ఏది సత్యం? ఏది అసత్యం?' అని నిర్ధారించుకోలేని గందరగోళ పరిస్థితులలో ఉంటున్నారు. లేఖనాల ఆధారంగా ఈ విషయంలో స్పష్టత తెచ్చుకోవడం కోసం ఈ వ్యాసాన్ని చదవండి.
కీర్తనలు 82:1,6 లో ఆసాపు "మీరు దైవములని" ఎవరి గురించి సంబోధించాడు. యోహాను 10:34,35 లో యేసుక్రీస్తు ఆ మాటలను ఎందుకు ప్రస్తావించాడు. దేవుడు మోషేను, అహరోనుకూ ఫరోకూ దేవునిగా నియమించాడు అంటే భావం ఏంటి? ఈ సందర్భాలను వక్రీకరించి, పీడీ సుందరరావు మరియు రంజీత్ ఓఫీర్ లు చేస్తున్న "మనం కూడా దైవాలమే" అనే దుర్బోధకు సమాధానమే ఈ వ్యాసం.
పీడీ సుందరరావు - తెలుగు క్రైస్తవులలో ఈయన పేరు తెలియనివారు చాలా అరుదు. ఈయన BOUI అనే ఒక సంస్థను స్థాపించి సార్వత్రిక క్రైస్తవసంఘం ప్రాముఖ్యమైన విశ్వాస పునాదులుగా నమ్మే లేఖనాధారమైన సిద్ధాంతాలను విస్మరిస్తూ, బైబిల్ రాయబడ్డ మూలభాషలను కానీ, సంఘచరిత్రను కానీ, లేఖనాలను సందర్భానుసారంగా అర్థం చేసుకునే పద్ధతిని కానీ ఏమాత్రం అనుసరించకుండా తనకున్న స్వంత జ్ఞానంతో ఎన్నో దుర్బోధలను ఆ సంస్థ ద్వారా వ్యాపింపచేసి, తనకున్న వాక్చాతుర్యంతో గొప్ప బోధకుడిగా పేరు సంపాదించాడు. ఆయన రచించిన పుస్తకంలోని దుర్బోధలను ఖండించే క్రమంలో నేను రాస్తున్న మొదటి భాగమే ఈ వ్యాసం.
కొన్నిరోజుల క్రితం మేము అద్దంకి రంజీత్ ఓఫీర్ గారు తాను చెప్పిన ప్రవచనం, బోధ ఆధారంగా లేఖనాల ప్రకారం అబద్ధప్రవక్త ఔతున్నాడని రుజువు చేస్తూ ఒక వీడియోను చేసాము. ఈ వ్యాసంలో ఆయన మాట్లాడిన మరికొన్ని మాటల ఆధారంగా కూడా ఆయనను అబద్ధప్రవక్తగా దుర్భోధకుడిగా రుజువు చెయ్యబోతున్నాము. కాబట్టి వాక్యం పట్ల ఆసక్తికలిగిన విశ్వాసులందరూ దీనిని పరిశీలించి ఓఫీర్ గారు ఎవరో మీరే నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
పెంతెకోస్తువారు, కరిస్మాటిక్ వారు, సాధారణంగా చెప్పుకొంటే (జీసస్ ఓన్లీ గుంపు మినహా) పరిశుద్ధాత్మ దేవత్వాన్ని, త్రిత్వాన్ని నమ్ముతారు. అయితే పెంతెకొస్తు ఉద్యమం తండ్రి కుమారులను త్రోసిపుచ్చి పరిశుద్ధాత్మను హెచ్చిస్తుంది. క్రొత్త నిబంధన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్న క్రమాన్ని మార్చి పరిశుద్ధాత్మ, కుమారుడు, తండ్రిగా తికమక చేసారు. అయితే పరిశుద్ధాత్మ తనను గూర్చి కాక క్రీస్తును గూర్చి మాట్లాడవలసి వుంది. తండ్రి కుమారులు ఆయన్ని ఈ లోకములోనికి పంపించారు. కుమారుణ్ణి లోకానికి వెల్లడిచేసి మహిమపరచే బాధ్యత ఆయనకు అప్పగింపబడ్డది (యోహాను 16:13-15).
"దుర్భోధను ఖండించుచునుండుము" (తీతుకు 2:15), పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెను ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు" (యూదా 1:3,4) అనే ప్రభువు ఆజ్ఞలను బట్టి మేము దుర్బోధలను ఖండిస్తున్నప్పుడు కొందరు మేము చెబుతున్న విషయం వదిలేసి మాపై అనవసరపు విమర్శలకు తెగబడుతున్నారు. అలాంటి విమర్శలకు సమాధానమే ఈ వ్యాసం.
బైబిలో దేవుడు ప్రత్యక్షపరచిన బోధకు భిన్నంగా ఎవరు బోధించినా అది దేవుని కార్యం కాదని, అది మానవ పొరపాటు లేదా సాతాను దుర్బోధ అయ్యుండాలని వేరే చెప్పాల్సిన పని లేదు. కాబట్టి, ప్రతి బోధకుని మాటలను మనం వాక్యపు వెలుగులో పరిశీలించాలి. అది బైబిలుకు భిన్నమైన బోధ అని తేలితే దానిని తిరస్కరించి ఖండించాలి. ఇందుకు దేవదాసు అయ్యగారు కూడా మినహాయింపు కాదు. ప్రస్తుత పరిశీలనకు నన్ను ప్రేరేపించింది దేవుని వాక్యం పట్ల కనపరచాల్సిన విశ్వాస్యత మాత్రమే తప్ప, ఇందులో ఎలాంటి వ్యక్తిగత ద్వేషానికి, దూషణకు తావులేదని గమనించాలి.
Institute of Bible Technology వ్యవస్థాపకులైన డాక్టర్ బొంకూరి జాన్ గారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడే తప్ప దేవుడు కాడని, దేవునితో సమానుడు కాడని తీర్మానిస్తూ, తాను సొంతంగా పోగుచేసుకుని కల్పించుకున్న చౌకబారు వ్యాఖ్యానాలకు లేఖనాలను తగిలించుకుని, ఎంతో శ్రమించి పరిశోధించి రాసిన ‘యేసుక్రీస్తు ఎవరు’ అనే 8 పేజీలు కలిగిన కరపత్రాన్ని లేఖనాధారాలతో తూర్పారబడుతూ, సంస్కారవంతంగా ఖండిస్తూ ఈ వ్యాసాన్ని రాస్తున్నాము.
గమనిక: ఈ రచన బి.జాన్ గారి ప్రసంగం ఎంత వరకు సత్యము అని పరిశీలించడానికి మాత్రమే ఉద్దేశించినది. ఇది పరిశుద్ధాత్ముని గూర్చిన పూర్తి వివరణ ఇచ్చే రచన కాదు. కొందరు IBT సహోదరులు ఇలా జాన్ గారి దురోధలను బహిర్గతం చేయడం, వ్యక్తిగత విమర్శ అంటున్నారు. డా|| జాన్ గారి దగ్గరికి వచ్చే సహోదరులు జాన్ గారి బోధలను ఏమాత్రం పరిశీలించకుండానే అంగీకరించి వాటినే ఇతరులకు బోధిస్తున్నారు.
Church of Christ గా పిలవబడుతున్న అవాంతరశాఖ క్రైస్తవ్యంలో సృష్టిస్తున్న అలజడులు ఏంటి? వీరు బోధిస్తున్నట్టుగా "సంఘానికి క్రీస్తు సంఘం (Church of Christ) అని పెట్టుకుంటేనే ఆ సంఘం క్రీస్తుకు చెందింది ఔతుందా? జన్మపాపం లేదా? యేసుక్రీస్తు దేవుడు కాదా? లేక దేవుడే కానీ మనకు దేవుడు కాదా? లాంటి విషయాలను తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
యేసుక్రీస్తును దేవుడు అన్నిటికంటే ముందుగా సృష్టించాడు అనే బోధలో వాస్తవమెంత? ఆ బోధను చేస్తున్నవారు ప్రస్తావిస్తున్నట్టుగా సామెతలు గ్రంథం 8వ అధ్యాయంలో మాట్లాడుతుంది యేసుక్రీస్తేనా? యేసుక్రీస్తు ఆదిసంభూతుడంటే ముందుగా సృష్టించబడినవాడని అర్థమా గ్రీకులో ఆ పదం ఆ భావంలోనే వాడబడిందా? తండ్రి యేసుక్రీస్తును నేడు నిన్నుకంటిని అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్నప్పుడు దానికి బైబిల్ ఇస్తున్న నిర్వచనం ఏంటి? వీటన్నిటినీ వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
బైబిల్ ముందుగా హెచ్చరించినట్లుగానే ఈ అంత్యకాలంలో అనేకమంది అబద్ద ప్రవక్తలు వచ్చి కోట్లమంది క్రైస్తవుల్ని తప్పుమార్గంలోనికి నడిపిస్తున్నారు. ఇలా మోసగించిన అబద్ద ప్రవక్తల్లో 'విలియం మారియన్ బ్రెన్హాం' అతి ముఖ్యుడు. ఇతడు 1909 సం||లో కెంటక్కి (అమెరికా) అనే ప్రాంతంలో జన్మించాడు. 1943లో విలియం హీలింగ్ మినిస్ట్రీని ఇతడు ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే విస్తారమైన పేరుప్రఖ్యాతలు సంపాదించాడు. అనేక దేశాలు తిరిగాడు. ఒకప్రక్క క్రైస్తవ్యంలో ఉన్న తప్పుడుబోధల్ని ఖండిస్తూ మరోప్రక్క మరింత తప్పుడు బోధలు చేస్తూ పాపులర్ అయ్యాడు. ఆదిమ సంఘానికి పౌలు ఎలాగో ఈ చివరి సంఘానికి తాను అలాంటివాడు అనీ, తనని ప్రవక్తగా అంగీకరించకుంటే రక్షణ దొరకదు అనీ, బైబిల్ లో అతని గురించి ముందుగానే ప్రవచింపబడింది అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు.
అనేక సంఘాలలో డిసెంబర్ 31న లేదా జనవరి 1వ తారీఖున బైబిల్లో ఉన్న వాగ్దానాలను చిన్నచిన్న చీటీలలో రాసి పంచిపెట్టడం, ఎవరికి ఏ వాగ్దానం వస్తే అది ఆ సంవత్సరం కోసం ప్రభువు ఇచ్చిన వాగ్దానంగా పరిగణించటం ఒక అలవాటు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు కాబట్టి, నా పరిస్థితిని ఎరిగిన దేవుడు దానికి తగిన వాగ్దానాన్ని నాకు అనుగ్రహిస్తాడనే విశ్వాసం ఈ అలవాటుకు ఆయువుపట్టు. ఎంతో ఆదరణనిచ్చే ఈ పరిచర్యను కూడా విమర్శిస్తారా? అది తప్పు, ఇది తప్పు అనటంకంటే మీకింకో పనే లేదా అనే ఆక్షేపణలకు, తిరస్కారానికి సిద్ధపడి, వాక్య అధికారంతో ఈ వాగ్దానాల లాటరీ పద్ధతిని ఖండిస్తున్నాను. ఇది సంఘాన్ని మూఢభక్తి వైపుకు నడిపించటం మాత్రమే కాకుండా, దేవుని వాక్యం చదవాల్సిన విధానాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టే తప్పుడు అలవాటు. ఇందులో ఉన్న పొరపాటు ఏమిటో ఈ క్రింది విషయాలను నాతో కలసి విశ్లేషిస్తే మీకే అర్థమౌతుంది. ప్రార్థనాపూర్వకంగా పరిశీలించగలరని మనవి.
అబ్రహాము దేవుడు ఎవరు? యెహోవా లేక అల్లాహ్?
బైబిల్ లో ఉన్న యెహోవా, ఖురాన్ లో ఉన్న అల్లాహ్… ఇద్దరూ ఒక్కరేనా లేక వేరు వేరా? యెహోవా - అల్లాహ్, ఇద్దరూ ఒక్కరే అని ముస్లింలు చాలా బలంగా విశ్వసిస్తారు. ఎందుకంటే, బైబిల్ ప్రకారం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ల దేవుడి పేరు యెహోవా. అలాగే ఖురాన్ ప్రకారం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ల దేవుడి పేరు అల్లాహ్. అందువలన ముస్లింలకు వేరే మార్గం లేదు. అల్లాహ్, యెహోవా ఇద్దరూ ఒక్కరే అని వారు మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి మూడు భిన్న వాదనలను ఈ రోజు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా, ప్రముఖ ముస్లిం మత ప్రచారకుడు డాక్టర్ షబ్బీర్ అలీ గారి వాదన ఏమిటో చూద్దాం.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.