మాధవి పుట్టడంతో ఆ కుటుంబంలో వెల్లి విరిసిన ఆనందం, సందడి ఇంతా అంతా కాదు. ముద్దుగా బొద్దుగా, తెల్లగా, అందంగా, చక్రాల్లాంటి కళ్లతో, నల్లని జుత్తు, ఒత్తుగా, అందరి కలల రూపంగా రేపటి వెలుగులా,రంగుల కలలా, ఆ ఇంట్లో అడుగుపెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ తన బుడిబుడి నడకలతో, ముద్దుముద్దు మాటలతో అందరి మనసులూ ఇట్టే దోచేస్తూ సాగిపోతున్న బాల్యాన్ని హఠాత్తుగా ఏదో అంతు చిక్కని రోగం కాటేసింది. జీవితాంతం ఆ అంగవైకల్యం చెరలో ఆమె మ్రగ్గిపోవాల్సి ఉంటుందని అప్పుడు ఎవరూ ఊహించనే లేదు.