బైబిల్లో అశ్లీలత ఉందని మతోన్మాదులు ఆరోపించే అన్ని వాక్యభాగాలూ ఒకొక్కటిగా క్రమంగా ఈ పుస్తకంలో పరిగణలోకి తీసుకోబడ్డాయి. ఇందులో ప్రస్తావించబడిన 15 సందర్భాలనే వారు తిప్పి తిప్పి బైబిల్ పైన మళ్ళీ మళ్ళీ ప్రయోగిస్తుంటారు. ఎందుకంటే ఆరోపించడానికి వాటికి మించి వారిదగ్గర మరేదీ ఉండదు కాబట్టి. అయితే వారు లేవనెత్తే అభ్యంతరాలేవీ ఆ సందర్భాలకు పొసగవని నిరూపించడమే కాకుండా అసలు అశ్లీలత, అనైతికత అంతా వారి మతగ్రంథాలలోనే ఉందని వారి దేవుళ్ళ చరిత్రల నుండే ఆధారాలతో నిరూపించడమైంది. ఎప్పుడూ బూతులే చదివే మతోన్మాదుల పచ్చకామర్ల కళ్ళకు ఎక్కడ చూసినా బూతులే కనబడతాయి మరి. ఈ పుస్తకం ప్రతీ క్రైస్తవుని చేతిలో ఒక ఆయుధంగా ఉండి తన విశ్వాసాన్ని కాపాడే డాలుగా మాత్రమే కాకుండా ప్రశ్నించే ప్రతీ మతోన్మాది విశ్వాస పునాదులను చిన్నాభిన్నం చేసే ఖడ్గంగా కూడా ఉండేలా దేవుడు ఆశీర్వదించును గాక! చదవండి, చదివించండి.
జి. బిబు LLM, Hithabodha Network
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.