హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.
హితబోధ యాప్ కొరకు Join WhatsApp
ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.
ఆదికాండము అధ్యాయము 1
ఈ అధ్యాయంలో దేవుడు భూమ్యాకాశాలను సృష్టించడం (1-1) రెండవ వచనం నుండి ఈ భూమిని నివాసయోగ్యంగా తీర్చిదిద్దుతూ వెలుగును సృష్టించడం (2-5) జలాలతో కప్పబడిన భూమినుండి జలాలను వేరు చేసి సముద్రాలుగా ఏర్పరచడం (6-10) దేవుడు ఈ భూమిపై మొదటిగా చెట్లను మొలిపించడం (11-13) తరువాత సూర్యచంద్రులను కలుగచెయ్యడం (14-19) తరువాత ఆయన జీవరాశులను సృష్టించడం (20-25) ఆయన తన పోలిక తన స్వరూపంలో మనుషులను సృష్టించి వారిని ఆశీర్వదించడం (26-31) గురించి మనం చదువుతాం. ఇందులో అనేకమైన విమర్శలకు, అపార్థాలకు కూడా వివరణ పొందుపరచడం జరిగింది.
ఆదికాండము అధ్యాయము 2
ఈ అధ్యాయంలో దేవుడు తన పనంతటినీ ముగించి విశ్రమించడం (1-6) ఆదామును సృష్టించి ఏదేనులో ఉంచడం (7-8) మంచిచెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాల చెట్టును కూడా ఏదేనులో మొలిపించి ఆ ఫలాలను తినకూడదని ఆదాముకు ఆజ్ఞాపించడం (9-17) ఆదాముకు దేవుడు సాటియైన సహాయం చేయాలని ఆలోచించడం, ఆదాము జంతువులకూ పక్షులకూ పేర్లుపెట్టడం (18-19) ఆయన ఆదాముకు గాఢనిద్ర కలుగచేసి స్త్రీని నిర్మించి వారిద్దరినీ జతచెయ్యడం (20-25) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 3
ఈ అధ్యాయంలో, అపవాది సర్పం ద్వారా హవ్వతో మాట్లాడడం హవ్వ తనకున్న దురాశతో మోసపోవడం (1-6) ఆ ఫలాలను తినగానే ఆదాము హవ్వలకు సిగ్గుతెలిసి దేవునికి భయపడి దాక్కోవడం (7-11) వారి అతిక్రమం గురించి దేవుడు ఆరా తీసినపుడు వారిద్దరూ దానిని ఒప్పుకోకుండా, నెపాన్ని వేరొకరిపై నెట్టివెయ్యడం (12-13) దేవుడు సర్పాన్నీ దానిని ఆవహించిన అపవాదినీ శపించడం (14-15) తరువాత ఆదాము హవ్వలకు కూడా ప్రసవవేదననూ, చేతుల కష్టాన్నీ, మరణాన్నీ శిక్షగా విధించడం (16-20) మరలా దేవుడు వారిపై కనికరపడి చర్మపు వస్త్రాలను చేసివ్వడం, వారికి కలిగిన పతనస్థితిని బట్టి ఏదేనునుండి వెళ్ళగొట్టడం (21-24) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 4
ఈ అధ్యాయంలో ఆదాము హవ్వలు కయీను హేబెలులను కనడం (1-2) వారిద్దరూ యెహోవా సన్నిధికి అర్పణలు తీసుకువెళ్ళడం, దేవుడు కయీను అర్పణను తిరస్కరించి హేబెలుది లక్ష్యపెట్టడం (3-5) కయీనుతో దేవుడు మాట్లాడి అతనికి ఒక అవకాశం ఇవ్వడం (6-7) కయీను హేబెలును చంపడం, దేవుడు దానిగురించి విచారించి అతడిని శపించడం (8-12) కయీనుకు ఆయన గురుతును వెయ్యడం (13-15) కయీను అక్కడినుండి వెళ్ళి నోదుదేశంలో స్థిరపడడం (16-17) కయీను సంతానం పతనస్వభావంతో విస్తరించడం (18-24) ఆదాము హవ్వలకు షేతు పుట్టడం (25-26) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 5
ఈ అధ్యాయంలో దేవుడు ఆదాము హవ్వలను సృజించి వారికి నరులని పేరుపెట్టడం (1-2) ఆదాము షేతును కనడం (3-5) షేతు వంశావళిలో ఎనోషను, హనోకు, నోవహు వంటి భక్తులు జన్మించడం (6-32) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 6
ఈ అధ్యాయంలో, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడం, (1-2) వారి అక్రమం విషయంలో యెహోవా ఆత్మ వారితో వాదించడం (3) వారికి పుట్టిన పిల్లలు బలాత్కారులుగా మారడం, దేవుడు వారి చెడుతనాన్ని బట్టి నరులను చేసినందుకు సంతాపపడడం (4-6) జలప్రళయం ద్వారా వారిని నాశనం చెయ్యాలనుకుని నోవహుపై కృపచూపించడం (7-11) ఓడను కట్టమని నోవహుకు ఆజ్ఞాపించడం (12-16) నోవహుతో తన నిబంధన స్థిరపరచడం (17-18) జీవరాశులను కూడా ఆయన కాపాడదలచడం (19-20) నోవహు దేవుడు చెప్పిన సమస్తాన్ని పూర్తిచెయ్యడం (21-22) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 7
ఈ అధ్యాయంలో దేవుడు నోవహుతో తన కుటుంబం, జీవరాశులతో కలసి ఓడలోకి ప్రవేశించమని ఆజ్ఞాపించడం (1-5) నోవహు అదేవిధంగా ప్రవేశించడం (6-16) దేవుడు చెప్పినట్టే జలప్రళయం సంభవించి ఓడను పైకి తేలచెయ్యడం, పర్వతాలు కూడా మునిగిపోవడం (17-20) అప్పుడు భూమిపై ఉన్న సమస్త శరీరులూ చనిపోవడం (21-24) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 8
ఈ అధ్యాయంలో, ఓడలో ఉన్న నోవహునూ అతనితో ఉన్న సమస్తాన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకోవడం, ఆయన గాలిని విసిరింపచెయ్యడం వల్ల నీరు తగ్గుతూ ఉండడం (1-3) ఓడా ఆరారాతు పర్వతాలపై నిలవడం, కొండల శిఖరాలు కనిపించడం (4-5) సమాచారం కోసం నోవహు మొదట కాకినీ తరువాత పావురాన్ని విడిచిపెట్టడం (6-12) నేల ఆరినపుడు దేవుడు నోవహునూ అతనితో ఉన్న సమస్తాన్నీ బయటకు వెళ్ళమనడం (13-19) నోవహు అర్పించిన బలిని దేవుడు స్వీకరించి ఇక జలప్రళయం ద్వారా నాశనం చెయ్యనని పలకడం (20-22) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 9
ఈ అధ్యాయంలో జీవరాశులన్నిటినీ నోవహు కుటుంబానికి లోపరచడం (1-4) నరహత్య విషయంలో హెచ్చరించడం (5-6) తన నిబంధనను మరలా జ్ఞాపకం చెయ్యడం (7-11) మరలా జలప్రళయం సంభవించదని తన నిబంధనకు గురుతుగా మేఘంలో ధనుస్సును ఉంచడం (12-17) నోవహు సంతానం ద్వారా భూమిపై మనుషులు విస్తరించడం (18-19) నోవహు మత్తుడై వస్త్రహీనుడవ్వడం, ఆ విషయంలో హాము చేసినదానిని బట్టి కనాను శపించబడడం (20-25) షేము యాపెతులను దీవించడం, చివరికి అతను మరణించడం (26-29) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 10
ఈ అధ్యాయంలో నోవహు కుమారులైన షేము, హాము, యాపెతులనుండి ఏయే జాతులు ఉద్భవించాయో, వారు ఎక్కడెక్కడ స్థిరపడ్డారో వాటి వివరాలను మనం చదువుతాం (1-32).
ఆదికాండము అధ్యాయము 11
ఈ అధ్యాయంలో దేవుడు బాబేలు గోపురం విషయంలో భూజనుల బాషలను తారుమారు చేసి చెదరగొట్టడం (1-9) అబ్రాహాము వంశావళి గురించి వివరించబడడం (10-30) అబ్రాహాము దేవుని పిలుపుమేరకు హారానుకు రావడం (31-32) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 12
ఈ అధ్యాయంలో అబ్రాహాముకు దేవుడు ప్రత్యక్షమై కనానుకు వెళ్ళమనడం (1-3) అబ్రాహాము దేవుడు తనతో చెప్పినట్టే కనానుకు వెళ్ళడం (4-9) కనానులో కరవు కారణంగా అతను ఐగుప్తుకు చేరడం, అక్కడ శారయి విషయంలో అతనికి ఇబ్బందులు ఎదురవ్వడం (10-16) శారయిని బట్టి దేవుడు ఫరో ఇంటివారిని దండించడం, వారు ఆమెను అబ్రాహాముకు అప్పగించి ఐగుప్తునుండి పంపించెయ్యడం (17-20) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 13
ఈ అధ్యాయంలో అబ్రాహాముకు దేవుడు ప్రత్యక్షమై కనానుకు వెళ్ళమనడం (1-3) అబ్రాహాము దేవుడు తనతో చెప్పినట్టే కనానుకు వెళ్ళడం (4-9) కనానులో కరవు కారణంగా అతను ఐగుప్తుకు చేరడం, అక్కడ శారయి విషయంలో అతనికి ఇబ్బందులు ఎదురవ్వడం (10-16) శారయిని బట్టి దేవుడు ఫరో ఇంటివారిని దండించడం, వారు ఆమెను అబ్రాహాముకు అప్పగించి ఐగుప్తునుండి పంపించెయ్యడం (17-20) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 14
ఈ అధ్యాయంలో షీనారు ప్రాంతానికి చెందిన ఐదుగురు రాజులు సొదొమ గొమొఱ్ఱాలపై యుద్ధం చేసి లోతునూ అతని కుటుంబాన్ని చెరగా తీసుకుపోవడం (1-12) ఆ విషయం అబ్రాహాముకు తెలిసి ఆ రాజులతో యుద్ధం చేసి లోతునూ అతని కుటుంబాన్ని కాపాడుకోవడం (13-17) షాలేము రాజైన మెల్కీసెదకు అబ్రాహామును ఎదుర్కొని అతనిని దీవించడం (18-20) సొదొమ రాజు మనుష్యులను నాకు అప్పగించి ఆస్తిని నువ్వే తీసుకోమన్నపుడు అబ్రాహాము దానికి నిరాకరించడం (21-24) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 15
ఈ అధ్యాయంలో అబ్రాహాముకు దేవుడు ప్రత్యక్షమై అతని బహుమానం గురించి తెలియచెయ్యడం అబ్రాహాము దానిని భౌతికపరమైన సంపదగా అర్థం చేసుకోవడం (1-3) దేవుడు అబ్రాహాముకు తన సంతానం గురించీ, కనాను దేశం గురించీ వాగ్దానం చెయ్యడం (4-7) అబ్రాహాము దానికి సూచన కోరినపుడు దేవుడు అతనితో నిబంధన చేస్తూ, అతని సంతానానికి కలుగబోయే దాస్యం గురించి కూడా వివరించడం (8-21) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 16
ఈ అధ్యాయంలో శారయి తనకు పిల్లలు లేకపోవడం చూసి హాగరును అబ్రాహాముకు భార్యగా ఇవ్వడం (1-3) హాగరు గర్భవతి అయ్యాక ఆమె ప్రవర్తనను బట్టి శారయి అబ్రాహామును నిందించడం (4-5) అందుకు అబ్రాహాము శారయికి సానుకూలంగా స్పందించడం ఆమె హాగరును శ్రమపెట్టడం, హాగరు పారిపోయినపుడు యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఆమె సంతానాన్ని దీవించడం (6-14) తరువాత హాగరు ఇష్మాయేలును కనడం (15-16) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 17
ఈ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై తన నిబంధన గురించి జ్ఞాపకం చెయ్యడం (1-3) అతని పేరును అబ్రాహాముగా మార్చడం (4-5) అతని సంతానం గురించి తెలియచెయ్యడం (6-8) ఆ సంతానానికి సున్నతి ఆచారాన్ని నియమించడం (9-14) శారా పేరును మార్చడం (15-16) అబ్రాహాము తన శారీరక స్థితిని బట్టి సందేహానికి లోనవ్వడం ఇష్మాయేలు గురించి వేడుకోవడం, దేవుడు దానిని అంగీకరించడం (17-22) అబ్రాహాము దేవుడు చెప్పినట్టే సున్నతి ఆచారాన్ని పాటించడం (23-27) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 18
ఈ అధ్యాయంలో యెహోవా ఇద్దరు దేవదూతలతో కలపి అబ్రాహామును దర్శించడం (1-2) అబ్రాహాము వారికి విందు చెయ్యడం (3-8) ఆయన ఇస్సాకు గురించి వాగ్దానం చెయ్యడం శారా దానికి నవ్వుకోవడం (9-15) యెహోవాతో వచ్చిన ఇద్దరు దేవదూతలు సొదొమ వైపుగా వెళ్ళక, అబ్రాహాము ఆ పట్టణాల గురించి దేవునితో మాట్లాడడం, తరువాత దేవుడు అతనియొద్దనుండి వెళ్ళిపోవడం (16-33) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 19
ఈ అధ్యాయంలో ఇద్దరు దేవదూతలు సొదొమ పట్టణంలో లోతుదగ్గరకు వెళ్ళడం, లోతువారిని విందుచెయ్యడం (1-3) సొదొమ పట్టణస్తులు వారిని బలత్కరించాలని చూసి లోతును బెదిరించడం (4-9) ఆ దేవదూతలు లోతునూ అతని కుటుంబాన్ని బయటకు తీసుకురావడం యెహోవా అతనితో మాట్లాడడం (10-23) యెహోవా ఆ పట్టణాలను అగ్నిగంధకాలు కురిపించి నాశనం చెయ్యడం (24-29) లోతు పర్వతం దగ్గర నివసిస్తున్నపుడు అతని కుమార్తెలు అతనితో హేయమైన పని చేసి గర్భవతులై పిల్లలను కనడం (30-38) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 20
ఈ అధ్యాయంలో అబ్రాహాము గెరారు ప్రాంతానికి వెళ్ళడం, అక్కడి రాజైన అబీమెలెకు శారాను ఆశించడం (1-2) అబీమెలెకును దేవుడు శారా నిమిత్తం గద్దించడం (3-7) అబీమెలెకు అబ్రాహాముతో మాట్లాడి శారాను అతనికి అప్పగించడం, ప్రాయుశ్చిత్తంగా కొంత సంపదను కూడా అందించడం (8-16) దేవుడు అబ్రాహాము ప్రార్థనను బట్టి అబీమెలెకు కుటుంబాన్ని స్వస్థపరచడం (17-18) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 21
ఈ అధ్యాయంలో దేవుడు తాను చెప్పినట్టుగానే అబ్రాహాముకు ఇస్సాకు జన్మించడం (1-5) ఆ విషయంలో శారా ఆనందించడం (6-7) ఇస్సాకు పాలువిడిచిన రోజు అబ్రాహాము విందు చెయ్యడం ఆ విందులో ఇష్మాయేలు ఇస్సాకును శ్రమపెట్టడం (8-9) దాని విషయంలో శారా హాగరునూ ఆమె కుమారుడనీ వెళ్ళగొట్టమనడం దానికి అబ్రాహాము బాధపడడం (10-11) దేవుని మాటను బట్టి అబ్రాహము కూడా దానికి అంగీకరించి వారిని పంపివెయ్యడం (12-14) అరణ్యంలో పిల్లవాడు సొమ్మసిల్లినపుడు యెహోవా దూత హాగరుకు ప్రత్యక్షమై ఆమెను ఓదార్చడం పిల్లవాడిని బ్రతికించి అతనికి తోడైయుండడం (15-21) అబ్రాహాము అబీమెలెకులు నిబంధన చేసుకోవడం (22-32) అబ్రాహాము దేవునికి ప్రార్థన చేసి పిలిష్తీయుల దేశంలో నివసించడం (33-34) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 22
ఈ అధ్యాయంలో దేవుడు అబ్రాహామును పరిశోధిస్తూ ఇస్సాకును బలిగా కోరడం (1-2) దానికి అబ్రాహాము అంగీకరించి మోరియా పర్వతం దగ్గరకు చేరుకోవడం (3-8) ఆ పర్వతంపై ఇస్సాకును బలిగా అర్పించబోయినపుడు యెహోవా దూత అడ్డుకోవడం (9-12) ఇస్సాకుకు ప్రతిగా పొట్టేలును అర్పించడం (13-14) యెహోవా దూత అబ్రాహామును దీవించడం (15-18) అబ్రాహాము ఇస్సాకుతో తిరిగిరావడం అతని సహోదరుని సంతానం గురించి తెలుసుకోవడం (19-24) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 23
ఈ అధ్యాయంలో శారా మృతిచెందడం, అబ్రాహాము ఆ విషయమై విలపించడం (1-2) తరువాత అబ్రాహాము శారాను పాతిపెట్టేందుకు ఎఫ్రోను పొలాన్ని కోరడం (3-6) అతను ఆ భూమిని ఉచితంగా ఇస్తాను అన్నప్పటికీ అబ్రాహాము దానికి వెల చెల్లించడానికి బలవంతం చెయ్యడం (7-15) చివరికి ఎఫ్రోను కూడా దానికి ఒప్పుకున్నపుడు అబ్రాహాము వెలచెల్లించి ఆ భూమిని కొనుక్కోవడం (16-20) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 24
ఈ అధ్యాయంలో అబ్రాహాము ఇస్సాకు వివాహ విషయమై ఎలీయెజెరు చేత ప్రమాణం చేయించడం (1-9) ఎలీయెజెరు ప్రయాణమై రిబ్కాను గుర్తించేందుకు దేవుడిని సూచన అడగడం ఆయన దానిని నెరవేర్చడం (10-27) ఎలీయెజెరు రిబ్కా ఇంటికి వెళ్ళి జరిగిన సంగతులన్నీ వారితో పంచుకోవడం వారు రిబ్కాను ఇస్సాకుకు వివాహం చెయ్యడానికి సమ్మతించడం (28-53) ఎలీయెజరు రిబ్కాను తీసుకుని ఇస్సాకు యొద్దకు తిరిగిరావడం, అతను ఆమెను వివాహం చేసుకోవడం (54-67) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 25
ఈ అధ్యాయంలో అబ్రాహాము కెతూరాల వివాహం మరియు వారి సంతానం (1-4). కుమారులకు ఆస్తిపంపకం (5,6), అబ్రాహాము మృతిబొంది సమాధి చేయబడడం (7-11), ఇష్మా యేలు వంశావళి (12-18వ), ఇస్సాకుకు సంతానం అనుగ్రహించబడడం (19-26) మరియు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించడం (27-34) గురుంచి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 26
ఈ అధ్యాయంలో కనానులో కరువు వచ్చినపుడు ఇస్సాకుతో దేవుడు మాట్లాడడం (1-5), ఇస్సాకు గెరారులో నివసించి అబీమెలకుతో తన భార్యను చెల్లెలని చెప్పడం (6-11), ఇస్సాకును దేవుడు బహుగా దీవించడం వల్ల పిలిష్తీయులు అతనిపై అసూయపడి అతడిని అక్కడినుండి వెళ్ళగొట్టడం (12-17), అబ్రాహాము తవ్వించిన బావుల నిమిత్తం పిలిష్తీయులు అతనితో జగడమాడడం (18-22), దేవుడు మరలా అతనికి ప్రత్యక్షం కావడం, అబీమెలకు అతనితో నిబంధన చేసుకోవడానికి రావడం (23-31), ఇస్సాకు అజాగ్రత్త వల్ల ఏశావు కనానీయుల కుమార్తెలను వివాహం చేసుకోవడం (34-35) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 27
ఈ అధ్యాయంలో ఇస్సాకు తన మరణ సమయంలో ఏశావును దీవించాలని ఉద్దేశించడం (1-4) యాకోబే ఆ దీవెనను పొందుకోవాలనే ఉద్దేశంతో రిబ్కా ఒక ఉపాయం పన్ని యాకోబును ప్రేరేపించడం (5-17) ఇస్సాకు యాకోబును ఏశావుగా భావించి దీవించడం (19-29) వేటాడి వచ్చిన ఏశావుకు దీవెనను తన సోదరుడు తీసుకునిపోయాడని తెలిసి విలపించడం (30-36) ఇస్సాకు ఏశావుకు జరగబోయేదానికి ప్రవచించడం (37-40) ఏశావు యాకోబుపై పగపట్టినపుడు రిబ్కా యుక్తిగా ఆలోచించి అతనిని తన సోదరుడిదగ్గరకు పంపాలని ఇస్సాకుతో మాట్లాడడం (41-46) గురించి చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 28
ఈ అధ్యాయంలో, ఇస్సాకు రిబ్కాలు యాకోబును పద్దనరాముకు పంపించడం (1-5) అది తెలుసుకున్న ఏశావు తన తండ్రి మెప్పుపొందడానికి ప్రయత్నించడం (6-9) ప్రయాణంలో అలసిపోయిన యాకోబు బేతేలులో విశ్రమించి ఒక కలను కనడం, ఆ కలలో దేవుడతనికి తన వాగ్దానాన్ని జ్ఞాపకం చెయ్యడం (10-15) తరువాత యాకోను నిద్రలేచి దేవునికి మ్రొక్కుబడిని చేసుకోవడం (16-22) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 29
ఈ అధ్యాయంలో యాకోబు బేతేలునుండి సిరియాకు రావడం (1) ఒక బావిదగ్గర నిలచి అక్కడివారి కొరలు వేచిచూడడం (2-5) ఈలోపు రిబ్కా ఆ బావిదగ్గరకు రావడం (6-9) యాకోబు ఆమె మందకు నీరు పెట్టి తాను ఎవరో తెలియచేసుకోవడం (10-11) ఆమె తన తండ్రికి అవిషయం చెప్పినప్పుడు అతను వచ్చి యాకోబును తన ఇంటికి తీసుకువెళ్ళి నెలరోజులు అతడికి ఆతిథ్యమివ్వడం (12-15) తరువాత యాకోబు రాహేలు నిమిత్తం అతనికి కొలువు చెయ్యడానికి ఇష్టపడి అతనిచేతిలో మోసపోవడం (16-25) తరువాత రాహేలు నిమిత్తం మరో 7 సంవత్సరాలు కొలువు చెయ్యడానికి ఒప్పందం చేసుకోవడం (26-30) లేయా ద్వేషించబడినప్పుడు దేవుడు ఆమెకు గర్భఫలం ఇవ్వడం (31-35) గురించి మనం చదువుతాం.
ఆదికాండము అధ్యాయము 30
ఈ అధ్యాయంలో రాహేలు తన అక్కపై అసూయతో యాకోబును విసిగించడం, అందుకు యాకోబు కోపం ఆమెపై రగులుకోవడం (1-2) ఆమె సలహామేరకు యాకోబు ఆమె దాసితో పిల్లలను కనడం (3-8) లేయా కూడా అదేపని చేసి తన దాసిద్వారా పిల్లలను కనడం (9-13) పుత్రదాత వృక్షఫలాల నిమిత్తం లేయా రాహేలులు ఒప్పదం చేసుకోవడం (14-16) కానుపు ఉడిగిన లేయా మరలా గర్భవతి కావడం ఆ సమయంలో ఆమె ఒక పొరపాటు మాట మాట్లాడడం (17-21) దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమెకు గర్భఫలం ఇవ్వడం (22-24) తరువాత దేవుని మాటప్రకారం యాకోబు తన తండ్రి ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకుని దానిగురించి లాబానుతో మాట్లాడి మంద నిమిత్తం ఒప్పందం చేసుకోవడం (25-34) లాబాను మరలా అతనిని మోసగించే ప్రయత్నం చేసినా దేవుడు తన అద్భుతం ద్వారా యాకోను కష్టానికి ప్రతిఫలం ఇవ్వడం (35-43) గురించి మనం చదువుతాం.
More Articles ...
Page 1 of 2