నిజమైన మార్పు సంభవించింది అనేందుకు గుర్తించదగిన సూచనలు ఏమైనా ఉన్నాయా? దేవుడు వారి హృదయాల్లో కార్యం జరిగిస్తే రక్షణను వెదకేవారు ఆ సంగతిని ఎలా చెప్పగలరు? మారుమనస్సు పొందానని చెప్పుకునే వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని ఒక కాపరి ఎలా గుర్తించగలడు? లేక బాప్తీస్మం కొరకు మరియు సంఘ సభ్యత్వం కొరకు ధరఖాస్తు పెట్టుకున్న వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని ఎలా గుర్తించగలం?
'నేను బోధించునది కొత్తదేమీ కాదు, వినూత్న సిద్దాంతమేమి కాదు; కాల్వినిజమ్ అనే మారుపేరుతో పిలువబడు బలమైన సనాతన సిద్ధాంతములను బోధించుట నాకు చాలా ప్రీతి. ఎందుకనగా ఇవి క్రీస్తులో ప్రత్యక్షపరచబడిన దేవుని సత్యములు.
అవిశ్వాసులైన, దుర్మార్గులైన ఇశ్రాయేలీయుల మీద దేవుని ఉగ్రత వస్తుందని ఈ వచనములో హెచ్చరించబడింది, దేవుని నిబంధనప్రజలుగా దేవుని కృపామాధ్యమాలన్నీ కలిగి జీవిస్తూ దేవుడు వారికి చేసిన ఆశ్చర్యకార్యాలెన్నో చూసినప్పటికీ వీరు "ఆలోచన లేని జనముగా" ( ద్వితియోపదేశకాండం 32:28వ వచనం) , వివేచన లేని ప్రజగా ఉన్నారు.
విశ్వాసి తన రక్షణ కోల్పోడం సాధ్యమా? యేసుక్రీస్తు ప్రాణం పెట్టింది ఎవరి కొరకు?
యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినవారందరూ రక్షణలో ఉన్నారా? ఈ ప్రశ్న వివాదాస్పదమైనదని నాకు తెలుసు. ఐనా ఇది అనేకుల రక్షణకు సంబంధించిన ప్రశ్న కాబట్టి అడుగుతున్నాను.
ఏ బేధము లేకుండా అందరూ పాపము చేస్తున్నారన్నది వాస్తవమైతే, పాపము ఓ అలవాటు కాదు, స్వభావమే అని వేరే చెప్పనవసరం లేదు.
రక్షణను వివిధ కోణములనుండి వీక్షించవచ్చు, విభిన్న అంశములుగా విభజించి యోచించవచ్చు. ఐతే మనం ఏ కోణము నుండి చూసినా, "రక్షణ యెహెూవాదే” అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
ఇది దైవభక్తికి సంబంధించిన అతిముఖ్యమైన ప్రశ్న. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని యేసు ప్రభువు ఖండితంగా చెప్పాడు
ఒక వ్యక్తి రక్షణలో దేవునితో పాటు ఆ వ్యక్తికి కూడా భాగస్వామ్యం ఉంటుంది. రక్షణలో మానవుని పాత్ర యొక్క ఆవశ్యకతను అత్యాసక్తిగల కాల్వినిస్టులు తిరస్కరిస్తే, దేవునిక్రియ యొక్క నిజస్వభావాన్ని ఆర్మీనియన్లు తిరస్కరిస్తారు.