విమర్శలకు జవాబు

హార్వర్డ్ డివినిటీ స్కూల్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న చరిత్రకారిణి, “Harvard’s Hollis Chair of Divinity” ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ, బ్రౌన్ యూనివర్సిటీ నుండి “History of Religions” అనే అంశంలో డాక్టరేట్ పొంది, క్రొత్త నిబంధన మరియు ప్రాచీన క్రైస్తవ చరిత్ర అనే అంశాలలో నిపుణురాలైన Karen Leigh King గారు, 2012 సెప్టెంబరు నెలలో, యేసు ప్రభువు యొక్క భార్య సువార్తను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ సువార్త వాస్తవమా లేక భూటకమా? తెలుసుకోవాలనుకుంటే ఈ వ్యాసాన్ని తప్పకుండా చదవండి. 

రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అని యేసు క్రీస్తు తన పురుషాంగం మీద రాసుకున్నాడు అని బైబిల్ ని వక్రీకరిస్తున్న సునీల్ కుమార్ అనే వ్యక్తికి సమాధానమే ఈ వ్యాసం. బైబిల్ లో ఉన్న Euphemism అనే కాన్సెప్టును వివరిస్తూ, ప్రకటన గ్రంథం 19:16 వచనంలో “Thigh Inscription“ ఎందుకు ఉంది అనే విషయాన్ని ఈ వ్యాసంలో వివరించడం జరిగింది. అప్పటి cultural context మరియు Epigraphical and Literary evidences గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వ్యాసాన్ని తప్పకుండా చదవండి. 

స్త్రీలకు శీలపరీక్ష చెయ్యమని ధర్మశాస్త్రంలో రాయించడం లింగవివక్ష కాదా? అది పురుషుడికి ఎందుకు వర్తింపచెయ్యలేదు? ఇతర కారణాలతో తొలిరాత్రి రక్తపు మరకలు చూపించలేని స్త్రీ ఆ పద్ధతి కారణంగా, అన్యాయంగా రాళ్ళతో కొట్టబడి చంపబడడం లేదా? ఇటువంటి విమర్శలకు సమాధానమే ఈ వ్యాసం.

ఆదికాండము 26:34-35; 28:8-9 ప్రకారం ఏశావునకు మొత్తం ముగ్గురు భార్యలు. అతని మొదటి భార్య పేరు బేయేరీ కుమార్తెయగు యహూదీతు. రెండవ భార్య పేరు ఏలోను కుమార్తెయగు బాశెమతు. మూడవ భార్య పేరు ఇష్మాయేలు కుమార్తెయగు మహలతు. కానీ ఆదికాండము 36వ అధ్యాయం ప్రకారం ఒక భార్య పేరు అనా కుమార్తెయగు అహోలీబామా. మరొక భార్య పేరు ఏలోను కుమార్తెయగు ఆదా. ఇక మూడవ భార్య పేరు ఇష్మాయేలు కుమార్తెయగు బాశెమతు. మొదటి రెండు వాక్యభాగాలతో మూడవ వాక్యభాగాన్ని పోల్చిచూసినప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం ముగ్గురి పేర్లూ కూడా తేడాగానే ఉన్నాయి. ఎందుకు? కొంతమంది అనుకుంటున్నట్లుగా నిజంగానే ఇది వైరుధ్యమా? లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? 

బైబిల్ ని ఎవ్వరూ నాశనం చెయ్యలేరని బైబిల్ ఎలుగెత్తి చాటుకుంటుంది. ఈ లోకంలో ఏ గ్రంథము కూడా తన శాశ్వతత్వాన్ని గూర్చి ఇంత నిర్భయంగా, విశ్వాసముతో కేక వేసి చెప్పలేకపోయింది.

దీదాత్ వాదనలు బైబిలుకు వ్యతిరేకంగా చెల్లవని, ఐతే ఖురానుకు వ్యతిరేకంగా అవి ఎంతో చక్కగా వర్తిస్తాయని ఈ విధంగా నిరూపించగలిగినందుకు హర్షిస్తున్నాను; సమస్త మహిమ ప్రభువుకే ఆరోపిస్తున్నాను. బైబిల్ మాత్రమే దేవుని వాక్యముగా నిత్యము వర్ధిల్లుతుంది

ఆగష్టు 1981 లో సౌత్ ఆఫ్రికా లోని డర్బన్ నగరంలో జోష్ మేక్డోవెల్ మరియు అహ్మద్ దీదాత్ మధ్య “క్రీస్తు సిలువ వేయబడ్డాడా” అనే అంశం మీద అ ఒక డిబేట్ (వాద ప్రతివాద కార్యక్రమం) జరిగింది.
ఆ  వాదప్రతివాదంలో  వారి మాటలను ఉన్నదున్నట్లుగా  తెలుగులో అనువాదం చేసిన ఒక ప్రతి మాకు దొరికింది. దానిని ఈ విధంగా  మీకు అందించగలిగేలా కృషి చేసిన వారందరిని ప్రభువు దీవించునుగాక.
ఈ  వాద ప్రతివాదంలో మూడు భాగాలుంటాయి. మొదట 50 నిమిషాల చొప్పున ఇరువురు వక్తలు చేసిన ప్రారంభవదాలుంటాయి. తరువాత 10 నిమిషాల చొప్పున ఇరువురు చేసిన ప్రతివాదాలుంటాయి . చివరిగా 3 నిమిషాల చొప్పున ఇరువురు చెప్పిన ముగింపు సందేశాలుంటాయి.
క్రీస్తు సిలువ మరణంపై క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరచి, దానిపై ఆధారపడిన సువార్త మన ముస్లిం మిత్రులు గ్రహించులాగున ఈ చిరు ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తే మాకంతే చాలు.

కన్యక గర్భం ధరించడం అనేది శుద్ధతప్పా? అది కేవలం అన్వయింపు మాత్రమేనా???

“కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును...” అని యెషయా గ్రంథం 7:14 లో ఉన్న ప్రవచనం ఏదైతే ఉందో, అది తప్పుగా తర్జుమా చేయబడింది అని, మూల భాష అయిన హిబ్రూ బైబిల్ లో, అక్కడ “అల్మాహ్” అనే పదం వాడారని, ఆ పదానికి అర్థం “యువతి” లేదా “యవ్వనస్తురాలు” అనే అర్థం వస్తుందని, కానీ క్రైస్తవులు “అల్మాహ్” అనే ఈ పదానికి “కన్య” అని అన్వయించుకుని తప్పుగా తర్జుమా చేశారని... అలాగే “కన్య” అనే పదానికి హిబ్రూలో “బెతూలాహ్” అనే పదం వాడతారని, కానీ యెషయా 7:14 లో “బెతూలాహ్” అనే పదం కాకుండా “అల్మాహ్” అనే పదం వాడారు కాబట్టి, కన్యక గర్భం ధరించడం అనేది శుద్ధతప్పు, ఇది కేవలం అన్వయింపు మాత్రమే అని విమర్శించే వారికి సమాధానం... 

అబ్రాహాముకి తండ్రి అయిన తెరహు బ్రతికిన దినములు 205 సంవత్సరాలా లేక 145 సంవత్సరాలా?  అబ్రాహాముకి తండ్రి అయిన తెరహు ఎన్ని సంవత్సరాలు జీవించాడు అనే విషయాన్ని ఈ రోజు మనం పరిశీలిద్దాం. నిజానికి తెరహు ఎన్ని సంవత్సరాలు జీవించాడు అనే విషయం అంత ప్రాముఖ్యమైన అంశం ఏమీ కాదు. కానీ ఇది బైబిల్ లో ఒక contradiction లాగా కనిపిస్తుంది కాబట్టి చాలా మందికి ఈ విషయంలో తప్పకుండా కొన్ని సందేహాలు ఉంటాయి. ఈ ఆర్టికల్ లో ఆ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. 

మేఘం అంటే నీటి ఆవిరి. మేఘాల మీద కూర్చుని ఎవరైనా ప్రయాణం చేస్తారా? ప్రాక్టికల్ గా అది impossible!!! నాతో పాటు ఇంకో దేవుడు ఉన్నాడని యెహోవా ఎక్కడైనా చెప్పాడా? యేసు ఎక్కడైనా నేను దేవుడ్ని అని చెప్పుకున్నాడా? అని ప్రశ్నిస్తున్న కరుణాకర్ సుగ్గునకు ధీటైన జవాబు. 

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.