నేటికీ మాకు దేవుని ప్రత్యక్షతలు వస్తున్నాయి అంటున్నవారు బైబిల్ ప్రామాణికతకు పెద్ద ముప్పు. ఇది నిజం కాకపోతే బైబిల్ ని ప్రామాణీకరణ చేసి, 66 పుస్తకాలకే దేవుని వాక్యాన్ని పరిమితం చేయటం పెద్ద తప్పు. బైబిల్ ప్రామాణికరణకు వెలుపల (Canon వెలుపల) కూడా దేవుని వాక్యం ఉంటె, ప్రత్యక్షతలు కొనసాగితే, ప్రామాణికరణకు (Canonicity కి) అర్ధమే లేదు. కానీ ఇలా చెప్పటం "Sola Scriptura" ( బైబిల్ మాత్రమే) అనే బైబిల్ మూలసిద్ధాంతాన్ని విసర్జించటమే అవుతుంది. అయితే, ఏ మూలసిద్ధాంతం ఏ మూలకు పోతే మాకెందుకు, మాకు మా అనుభవాలే ముఖ్యం అంటూ, వాటిని వెనకేసుకొని వచ్చే క్రమంలో కొందరు బైబిల్ ప్రామాణికతనే ప్రమాదంలోనికి నెడుతున్నారు. మాకొచ్చింది దైవ ప్రత్యక్షత అనటానికి ఆధారం లేకపోతే, లూకా, హెబ్రీ పత్రిక మొదలైనవి దైవ ప్రత్యక్షత అనటానికి ఆధారం ఏంటి అంటూ బాధ్యత రహిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వారికే ఈ వీడియో.
© 2021. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.