ఆదివారం సెలవు దినం క్రైస్తవసాంప్రదాయాన్ని బట్టి బ్రిటీష్ వారు తీసుకువచ్చిందని వాపోతున్న మోడీగారు, మరి చరిత్రప్రకారంగా బ్రిటీష్ వారు రాకముందు ఈ దేశంలో ఏ దినం సెలవుదినంగా ఉండేదో తెలియచేసుంటే చాలా బావుండేది. పోని మనం దానినే మన దేశపు అసలు సెలవుదినంగా పాటించేవారం. కానీ ఆయన అలా చెయ్యలేకపోయాడు. ఎందుకంటే బ్రిటీష్ వారు రాకముందు అసలు ఈ దేశంలో పనిచేసేవారికి ఎలాంటి అధికారిక సెలవుదినాలూ ఉండేవి కావు. బానిసల విషయంలోనైతే వారికి ఆరోగ్యం బాగోలేకున్నా సరే వారానికి ఏడురోజులూ పనిచెయ్యవలసి వచ్చేది. అలాంటి పరిస్థితి చూసి చలించిపోయిన మిషనరీల పోరాటపుణ్యమే బ్రిటీష్ హయాంలో మనకు ఆదివారం అధికారిక సెలవుదినంగా అవతరించింది. అయితే కార్మికులకు వారానికి ఒకరోజు సెలవుదినం కావాలని మహారాష్ట్రకు చెందిన "నారాయణ్ మేఘాజీ లోకాండే" అనే అతను పోరాడాడని కూడా చెబుతారు, కానీ ఆదివారపు సెలవుదినం వెనుక మాత్రం క్రైస్తవ మూలాలే స్పష్టంగా ఉన్నాయి. అందుకే బ్రిటీష్ వారు ఆరోజునే సెలవుదినంగా ప్రకటించారు. సరే వారు క్రైస్తవులు కాబట్టి ఆదివారం సెలవుదినంగా ప్రకటించారు.
అయినప్పటికీ దానివల్ల క్రైస్తవులకే కాదు అన్ని మతాలవారికీ వారంలో ఒకరోజు విశ్రాంతిలభించింది. కానీ మన హిందూ రాజుల పాలనలో కనీసం హిందువులకు కూడా సెలవుదినం లేదు ఔనా? వారు గొడ్డుల్లాగా వారం పొడుగునా పని చెయ్యవలసిందే. ఏం కాదా? మళ్ళీ చెబుతున్నాను. ఆదివారం సెలవుదినం క్రైస్తవసాంప్రదాయం నుండి ఉద్భవించినప్పటికీ అది కష్టజీవులపట్ల కనికరాన్ని చూపించేదిగా, మానవ ఆరోగ్యం పట్ల శ్రద్ధతీసుకునేదిగా ఉంది. సృష్టికర్తయైన మా దేవుడు వారానికి ఒకరోజు విశ్రాంతిదినంగా నియమించడంలో ఇది ప్రధానమైనకోణం, ఆయన దానిగురించి జ్ఞాపకం చేసినప్పుడల్లా మీ ఇంట్లో దాసీ, దాసులు కూడా ఆరోజు విశ్రాంతి తీసుకోవాలని మరీ మరీ ఆజ్ఞాపించాడు (నిర్గమకాండము 20:8-10, ద్వితీయోపదేశకాండము 5:14). మరి మీ హిందూమతం ఇలా ఎందుకు చెయ్యలేకపోయింది? బానిసలతో (పనివారితో) కనికరం లేకుండా పని చేయించుకోవడం తప్ప మీ రాజులూ జమీందార్లూ వెలగబెట్టింది ఏముంది? అంటే మీమతంలో ఎలాగూ ఇలాంటి కనికరసంబంధమైన కట్టడలు ఉండవు కాబట్టి, ప్రపంచానికే కనికరం నేర్పించిన బైబిల్ పైనా దాని సంబంధిత సెలవుదినంపైనా కక్షకట్టారా?
మీకు బ్రిటీష్ వారు చేసిన అభివృద్ధి కావాలి, చట్టప్రకారంగా వారు చేసిన సంస్కరణలు కావాలి, కానీ వారు తీసుకువచ్చిన సెలవు దినం మాత్రం వద్దు ఔనా. ఏది చేతనైతే బ్రిటీష్ వారు చట్టప్రకారంగా చేసిన సంస్కరణలు: సతీసహగమన నిషేధ చట్టం, నరబలుల నిషేధచట్టం, శిశు (ఆడపిల్లల) హత్యల నిషేధ చట్టాలను తీసెయ్యండి చూద్దాం. అప్పుడు మీ హిందువుల్లోనే ఎంతమంది మీపైకి దండెత్తుతారో బాగా చూద్దురు. చివరికి ఈ దేశంలో ఆధునిక విద్యనూ వైద్యాన్ని ప్రవేశపెట్టింది కూడా వారే. అవి కూడా తీసేసి చూడండి, ఎంతమంది హిందువులు మీ పక్షంగా ఉంటారో లెక్కపెట్టుకుందురు. శస్త్రచికిత్సల సమయంలో రోగికి నొప్పి తెలియకుండా ఉపయోగించే Chloroform (Anaesthesia) కనిపెట్టింది కూడా James Simpson అనే బ్రిటీష్ వాడే. అతను బైబిల్ ప్రేరణతోనే (ఆదికాండము 2:21) దానిని కనిపెట్టానని బాహాటంగా సాక్ష్యమిచ్చాడు. చేతనైతే ఈ దేశంలో దానిని నిషేధించగలరా?, కనీసం మీ పార్టీ వారైనా దానిని ఉపయోగించకుండా ఉండి, అమాయక హిందువులకు మీరు నూరిపోస్తున్న కల్తీ దేశభక్తిని చాటుకోగలరా? ఇవే కాదు, ఇలాంటివి కొన్ని వందల ఉదాహరణలు చెబుతాను. పౌరుషముంటే ఈ దేశంలో అవన్నీ నిషేధించి చూపించాలి మరి.
ఇకపోతే మీరు ఆదివారం సెలవుదినం తీసేసినంతమాత్రాన మాకు పోయేదేముండదు. సంఘంగా రాత్రిళ్ళు కూడుకుంటాం. మా ప్రారంభక్రైస్తవ సంఘానికి సెలవు ఉండే ఆదివారం కూడుకోలేదు. వారు రాత్రిళ్ళు నిద్రమానుకుని కూడుకున్నారు. కాబట్టి ఈ దేశంలో క్రైస్తవ్యాన్ని అడ్డుకోవడానికి మీరెన్ని కుయుక్తులు పన్నినా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అణగద్రొక్కాలని చూసినా ఈ దేశంలో మా ఉనికిని రూపుమాపలేరు. అది మహా మహా సామ్రాజ్యాల వల్లే కాలేదు, ఆఫ్ట్రాల్ మీరెంత? వెళ్ళి చరిత్రను చదువుకోండి.
కీర్తనలు 2:1-5
అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మనయొద్దనుండి పార వేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును.
భారతదేశంలో ఆదివారం సెలవు రద్దు? కీలక జోస్యం చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ!
Note: బ్రిటీష్ వారిని సమర్థించడం మా ఉద్దేశం కాదు కానీ, మా క్రైస్తవ మిషనరీల పోరాటంతో ప్రజలకు మేలు జరిగేలా బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన సాంప్రదాయలను, వారు చేసిన చట్టపరమైన సంస్కరణలను క్రైస్తవులంగా, మానవత్వం కలిగిన మనుషులంగా మేమెప్పుడూ సమర్థిస్తూనే ఉంటాము.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.