సువార్త

రచయిత: తమ్మారెడ్డి కిరణ్

 దేవుడు మనుష్యులను ఎంతగానో ప్రేమించాడు. మానవుడు తనను తాను పాపము నుండి విడిపించుకోలేక, జీవము గల దేవుని చేరలేకపోతున్నాడు. బైబిలు చెబుతుంది - మనము మొదటి మానవుని ద్వారా పాప స్వభావమును సంక్రమించుకున్నాము, మరియు మనము వ్యక్తిగతంగా దేవుని ఆజ్ఞలను పాటించకుండా పాపము చేస్తూ వస్తున్నాము. పాపము వలన వచ్చు జీతము మరణము (భౌతిక మరణము మరియు ఆత్మ మరణము)(ఆత్మ మరణమనగా మానవుడు ఇక ఎప్పటికీ దేవుని చేరుకోలేక ఆయనను ద్వేషిస్తూనే ఉంటాడు)

దేవుడు అనంతంగా, నిత్యంగా పరిశుద్ధుడు, మంచివాడు, సార్వభౌముడు, సర్వాధికారి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, తనకు తానుగా జీవము గలవాడు, ఆయన తన గుణ లక్షణములన్నింటిలో పరిపూర్ణుడు.

దేవుడు ఈ సృష్టి అంతటిని తన మాటతో కలుగజేశాడు, మనుష్యులను మాత్రము తన స్వరూపములో సృష్టించాడు.
ఈ సృష్టిని చాలా మంచిదిగా ఆయన చేశాడు కానీ మానవుడు తన పాపము చేత ఈ సృష్టి అంతటికీ చెడును సంక్రమింపచేస్తున్నాడు

దేవుడు మనుష్యుని దీనస్థితిని చూసి, మానవుని ఎంతగానో ప్రేమించి తన జనతైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకములోనికి పాపరహితుడిగా, కన్య గర్భము ద్వారా పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువువారు నీతిమంతుడుగా జీవించి, దేవుని ధర్మశాస్త్రమును సంపూర్ణంగా పాటించి, మనల్ని మన పాపం నుండి రక్షించడానికి మన పక్షంగా దేవుని నీతిని నెరవేర్చి, మనకు బదులుగా మన శిక్షను తను భరించి, చనిపోయి, సమాధి చేయబడి, మూడవ దినమున మరలా తిరిగి లేచాడు. ఇదే శుభవార్త.

యేసుక్రీస్తు ప్రభువువారు ఇలా చెప్పారు - నేను మాత్రమే మార్గమును, సత్యమును, జీవమునై యున్నాను, నా ద్వారా తప్ప ఎవరును దేవుని చేరలేరు

ఈ శుభవార్తను విశ్వసించి, మన పాపముల ఒప్పుకొని దేవున్ని ప్రార్ఠిస్తే, మరియు ఆయన సంఘమునకు అంటుకట్టబడి ఆయన కృపలో ఎదిగితే, ఈ సృష్టి అంతమున మనం భౌతికంగా, మహిమ శరీరంతో పునరుత్ఠానమును పొందుతాము, యుగయుగములు మనము దేవుని సన్నిధిలో, యేసుక్రీస్తు ప్రభువువారిని పోలి ఉంటాము. ఇక కన్నీరు, బాధలు తొలగిపోతాయి, శాపగ్రస్థమైనది ఇక ఏమీ ఉండదు, పాపము, మరణము ఇక ఎప్పటికీ ఉండవు

అయ్యలారా, అమ్మలారా, సహోదరసహోదరీలారా, దయచేసి ఈ శుభవార్తను నమ్మి దేవుని వైపు తిరగండి, దేవునితో సహవాసం చేయండి.

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.