దుర్బోధలకు జవాబు

రచయిత: యం. జోషి లీలన్ రెడ్డి

Article Release long serpant decieved preaching min

 

సాంప్రదాయక క్రైస్తవ్యం

యెహోవాసాక్షులు

మార్మోన్లు

వ్యవస్థాపకుడు

యేసుక్రీస్తు ప్రభువు (మత్తయి 16:18; 1కొరింథీ 3:11 ; 1పేతురు 1:18,19 ;అ.కా. 20:28 ) చార్లెస్ రస్సెల్ 1931 సం||లో ఓహియో రాష్ట్రం (అమెరికా)లో స్థాపించాడు. ఆ తరువాత జోసఫ్ ఫ్రాంక్లిన్ రూథర్ ఫోర్డ్, నాథన్ హోమర్ నార్. ఫ్రెడరిక్ డబ్ల్యూ ఫ్రాన్స్ నాయకత్వంలోనికి వెళ్ళింది. ఏప్రిల్ 6,1860 నాడు న్యూయార్క్లో జోసఫ్ స్మిత్ ప్రారంభించాడు. ఆ తరువాత బ్రిగ్హయంగ్ నాయకత్వంలోనికి వెళ్ళింది. (చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ అని దీనికి మరో పేరు కూడా కలదు).

ప్రేరిత లేఖనాలు

39 పుస్తకాలు గల పాత నిబంధన, 27 పుస్తకాలు గల క్రొత్తనిబంధనలు కలిగిన బైబిల్లో మొత్తము 66 పుస్తకాలు వున్నాయి. న్యూ వరల్డ్ ట్రాన్సిలేషన్ ఆఫ్ బైబిల్, వాచ్ టవర్ పత్రికలలో వచ్చే నాయకుల బైబిల్ స్టడీస్, ది ట్రూత్ షల్ మేక్ యు ఫ్రీ, మెక్ ష్యూర్ ఆఫ్ ఆల్ థింగ్స్. లెట్ గాడ్ బి ట్రూ, న్యూహెవెన్ ఆండ్ న్యూ ఎర్త్, యు మే సర్వైవే అర్మగెడెన్ మొదలగు పుస్తకాలు. క్రీ.శ. 1827 నుండి 1830 వరకు ఆలివర్ కవడైరీకి తెరవెనుక నుండి జోసఫ్ స్మిత్ ఉద్భోధించిన "బుక్ ఆఫ్ మార్మోన్” బైబిల్, డాక్ట్రిన్ అండ్ కవనెంట్స్, అర్టికల్స్ ఆఫ్ ఫెయిత్, మార్మోన్ డాక్ట్రిన్, గాస్పల్ డాక్ట్రిన్, జర్నల్ ఆఫ్ . డిసోర్సెస్, ద సీర్, టీచింగ్స్ ఆఫ్ ద ప్రాఫెట్ జోసఫ్ స్మిత్, పెర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రెస్, మార్మోన్ క్యాటకిసమే, కీ టు ద సైన్స్ ఆఫ్ థియాలజీ మొదలగునవి.

తండ్రి

పా.ని.లో యెహోవా తండ్రిగా గుర్తించబడుతున్నాడు. తండ్రి సృష్టికర్త. తండ్రి దేవుడు. (ద్వితీ 4:35 ; ఆది 1:1 ). దేవుని పేరు యెహోవా, యెహోవా నిత్యుడు, యెహోవాయే తండ్రి, (మెక్ ప్యూర్ ఆఫ్ ఆల్ థింగ్స్, పేజి 485) మిఖాయేలే ఆదాము. ఆదాము తండ్రియైన దేవుడు. (జర్నల్ ఆఫ్ డిసోర్సెస్, 1:50) ప్రతి దేవుడు తన భార్య లేదా భార్యల ద్వారా పిల్లల్ని కని ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. (ద సీర్, పేజీ 37). దేవుడు సర్వశక్తిమంతుడు కాని సర్వవ్యాపికాదు. (డాక్ట్రిన్ ఆండ్ కవనెంట్స్, పేజీ 130) మహిమలో పాలించే ప్రతిమనిషి కూడా దేవుడే (మార్మోన్ డాక్ట్రిన్, పేజీ 322).

యేసుక్రీస్తు

దేవుడు. త్రిత్వములోని ఒక వ్యక్తి. కన్యమరియ గర్భాన శరీరధారిగా జన్మించి, చనిపోయి మూడవ దినమున తిరిగి లేచి ఆరోహణమై మరల రానై యున్నాడు. యోహాను1:1,14,18;
14:3 ; మత్తయి 1:18 ; అపో.కా 1:11 ; 20:28 ; యెష 7:14 ).

తండ్రిచే సృష్టించబడినాడు. (లెట్ గాడ్ బీ ట్రూ పేజీ 32). ప్రధానదూత మిఖాయేలే దేవుని అద్వితీయ కుమారుడు, అతడే యేసుక్రీస్తు (నూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్, పేజి 30). మరియకు క్రీ.పూ. 2లో అక్టోబర్ 1న జన్మించాడు. (లెట్ గాడ్ బి ట్రూ, పేజి 36). శరీరముతో లేపబడలేదు కానీ ఆత్మ లేపబడింది. (వాక్ ష్యూర్ ఆఫ్ ఆల్ థింగ్స్, పేజి 426). యేసుక్రీస్తు 1914లో దేవాలయానికి వచ్చి 1918 కంత దాన్ని శుద్ది చేశాడు. (ద ట్రూత్ షెల్ మెక్ యూ ఫ్రీ, పేజి 295). ఎలోహీంకు జన్మించిన పిల్లలలో జ్యేష్ఠ్యుడు యెహోవా అనబడే యేసుక్రీస్తు (గాస్పల్ డాక్ట్రిన్, పేజి 70). సృష్టిని నడిపించడంలో యేసుక్రీస్తుకు ఆదాము, మోషే పేతురు, యాకోబు, యోహానులు మరియు జోసఫ్ స్మిత్ (మార్మోను సంఘ స్థాపకుడు) ఇతరులు సహయపడుతున్నారు. (మార్మోన్ డాక్టిన్, పేజి 169). సిలువలో మరణించి తిరిగి లేచాడు, భూమిపై రాజ్యాన్ని స్థాపించుటకు మరల వచ్చుచున్నాడు. (డాక్ట్రిన్ ఆండ్ కవనెంట్స్, పేజి 472)

పరిశుద్ధాత్మ

దేవుడు, పరిశుద్దాత్మ త్రిత్వములో ఒక వ్యక్తి, ఆదరణకర్త, సర్వసత్యములోనికి నడిపించువాడు. (
యోహాను 15:26 ; 16:8,13 ; 14:26 ; రోమా 8:9,11 ; 14:17 ; ఎఫెసీ 5:18 ; 3:15 ; 1 కొరింథీ3:16).
దేవుని చిత్తము చేయునట్లు మనుష్యులను ప్రేరేపించు దేవుని యొక్క అదృశ్య క్రియాత్మక శక్తి. (లెట్ గాడ్ బి ట్రూ, పేజి 108). తండ్రికి, కుమారునికి ఉన్నట్లు ఎముకలు, మాంసములేని ఆత్మరూపియైన వ్యక్తి. (డాక్ట్రిన్స్ ఆండ్ కవనెంట్స్ 130:22). పరిశుద్దాత్మ దేవుని ప్రభావము, క్రీస్తు వెలుగు లేదా సత్యము, (గ్రాస్పల్ డాక్టిన్, పేజీ 60). సర్వవ్యాపి కాదు కాని ఒక స్థలంలో ఉండి విశ్వమంతటిని తన తేజస్సుతో అంటే కరెంటు లాగా నింపుతున్నాడు. (మార్మోన్ డాక్ట్రిన్, పేజి 359, 753).

త్రిత్వము

దేవుడు. త్రిత్వము త్రియేక దేవుడు. దేవుడు ఒక్కడే. త్రిత్వములో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి మూడు పాత్రలు కాదు. కాని ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. (ఆది1:1, 11:7 ; ద్వితి 4:35 ; యోహాను 4:24 ; 1తిమోతి2:5;మత్తయి3:16,17,28:19 ;
యెషయా 48:16 ).
త్రిత్వము లేదు. దేవుడు ఒక్కడే, ఒకే వ్యక్తి. సాతానుడు త్రిత్వ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. (లెట్ గాడ్ బీ ట్రూ, పేజీ 101). తండ్రి నిజమైన దేవుడు. కుమారుడు తండ్రికన్న తక్కువ. పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు కాని దేవుని యొక్క క్రియాత్మక ప్రభావం (వాట్ డస్ గాడ్ రిక్వైర్ ఆఫ్ అస్, వాచ్ టవర్ సోసైటీ 1997) తండ్రి, కుమారుడు పరిశుద్ధాత్మ అనే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు (మార్మోన్ డాక్ట్రిన్, పేజి 270) ప్రతి దేవుడు తన భార్య లేదా భార్యల ద్వారా పిల్లల్ని కని ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. (ద సీర్, పేజి 37) దేవుడు సర్వశక్తిమంతుడు కాని సర్వవ్యాపి కాదు. (డాక్ట్రిన్ ఆండ్ కవనెంట్స్, పేజి 130) మహిమలో పాలించే ప్రతిమనిషి కూడా దేవుడే (మార్మోన్ డాక్టిన్, పేజి 322) అనేకమైన దేవుళ్ళు ఉన్నారు. (టీచింగ్ ఆఫ్ ప్రాఫెట్ జోసఫ్ స్మిత్, పేజి 370-372).

మానవుడు

ఆదాము, హవ్వలు, ఆది దంపతులు. దేవుని పోలికలో సృష్టింపబడినారు. దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు. మానవుని ఆత్మ నిత్యము ఉంటుంది. దీనికి నాశనము లేదు. నరకములోనైనా, పరలోకములోనైనా నిత్యము ఉండాల్సిందే. (ఆది. 1:27 ; 2:17;ప్రసంగి 12:7 ; మార్కు 9:48; 1కొరింథీ 15:53,54 ). మానవుడు యెహోవా పోలికలో చేయబడినాడు. పాపముచేసి మరణాన్ని తెచ్చుకున్నాడు. మానవుని ఆత్మ నిత్యము ఉండేది కాదు. జంతువులకు కూడ ఆత్మ ఉంది. ఆది చనిపోతుంది. (వాట్ డస్ గాడ్ రిక్వైర్ ఆఫ్ అస్, 1997). మనుష్యులు నిత్యత్వము నుండి ఉన్నారు. మన తండ్రి ఆదాము మొదటిసారి ఏదేను తోటలోకి వచ్చినప్పుడు తన భార్యలలో ఒకరైన హవ్వను తనతో తెచ్చాడు. ప్రధానదూత మిఖాయేలే ఆదాము. అతనే తండ్రియైన దేవుడు. (జర్నల్ ఆఫ్ డిసోర్సెస్ 1:50).

పాపము

నీతిమంతుడు ఎవ్వరును లేరు. అందరును పాపముచేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. ఆదాము నుండి పాపము అందరికీ సంక్రమించింది. (రోమా 8:10,23 ; 14:23 ;5:12-21; 1యోహాను 1:8,10 ;3:4 ; 5:17 ;యాకోబు 4:17 ). దేవుని స్థాయికి కొదువుగా ఉంటే పాపము. దేవుని నీతిని అతిక్రమిస్తే పాపము. ఆదాము, హవ్వలు దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు. ఆదాము వారసులంత పాపులే (వాక్ ష్యూర్ ఆఫ్ ఆల్ థింగ్స్, పేజి 456, 457, 458). మరణంతో ఆదాము మట్టిలో కలసిపోతాడు మరల తిరిగిరాడు (న్యూ హెవెన్ ఆండ్ న్యూ ఎర్త్, పేజి 88) మానవులంత ఇహలోకములో సంతోషించునట్లు ఆదాము పడిపోయాడు (2వ నెఫీ 2:25; మార్మోను బైబిలు). ఆదాము జ్ఞానయుక్తంగా పండును తిన్నాడు. (డాక్ట్రిన్ ఆండ్ కవనెంట్స్, పేజి 65). ప్రథమ తల్లిదండ్రుల పతనము మనము భౌతికంగా హెచ్చింపబడి ఆనందించడానికి కారణమయింది. (మార్మోను క్యాటిక్స్). ప్రతిమనషి తన పాపాన్ని బట్టి శిక్షింపబడతాడు కాని ఆదాము పాపాన్ని బట్టి కాదు. (ఆర్టికల్స్ ఆఫ్ ఫెయిత్, 2)

విమోచన

యేసుక్రీస్తు రక్తముద్వారా విమోచన. యేసు ప్రభువు ఒక్కసారే అర్పించిన బలి ద్వారా విమోచన (ఎఫె 1:7 ; 1పేతురు 1:18-19 ; ప్రక 1:5-6 ; హెబ్రీ 9:22 ; 10:12,14 ;కొలస్సీ 1:20 ). ఆదాము నష్టపోయిన పరిపూర్ణ ఇహలోక జీవితాన్ని భర్తీ చేయడానికి యేసుక్రీస్తు అనే | మానవుడు క్రయధనము చెల్లించాడు. ఆదాము ఎంత నష్టపోయాడో అంతే విమోచన చేశాడు. (యూ మే సర్వైవ్ ఆర్మగెడైన్ ఇన్ టు గాడ్స్ న్యూవరల్డ్). యేసు మరణము పాపము కొరకు, పాపశిక్ష కొరకు కాదు కాని పరిపూర్ణ ఇహలోక జీవితము కొరకు. (లెట్ గాడ్ బి ట్రూ 116 పేజి) యేసుక్రీస్తు విమోచన కార్యములో జంతువులకు, పక్షులకు, చేపలకు కూడ స్థానమున్నది. (డాక్ట్రిన్ ఆండ్ కవనెంట్స్ 29:23-25) సువార్త యొక్క ఆజ్ఞలకు,నియమాలకు లోబడినవారే క్రీస్తు విమోచనలోనికి వస్తారు. సువార్త నియమాలు: యేసుక్రీస్తుపై విశ్వాసం, పశ్చాత్తాపం, పాపక్షమాపణ కొరకు ముంచడం బాప్తీస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు హస్తనిక్షేపణ. (ఆర్టికల్స్ ఆఫ్ ఫెయిత్ 3,4) యేసునందు విశ్వాసముంచినంత మాత్రాన యేసు రక్తము మనలను శుద్ది చేయజాలదు. మనము కూడా కష్టపడాలి. (వాట్ డు ది మార్మోన్స్ థింక్ ఆఫ్ క్రైస్ట్ 1973 - పేజి 27-33). అవసరమైతే ప్రతివ్యక్తి తన విమోచన కొరకు తన రక్తమును కార్చాలి. (జర్నల్ ఆఫ్ డిసోర్సెస్, 3:247; 4:219-220).

రక్షణ

విశ్వాసము ద్వారా, దేవుని కృప ద్వారా, యేసు ప్రభువు చేసిన బలియాగమును బట్టి, క్రియలతో నిమిత్తము లేక ఉచితముగా రక్షణ దొరుకుతుంది. (అ.కా. 16:31 ; యోహా 1:12 ;3:17,36 ; తీతు 3:5 ;'ఎఫెసి 2:8-9 ; రోమా 3:24 ; 10:4 ). నమ్మకత్వాని బట్టి నిత్యత్వం లభిస్తుంది. 1,44,000 మంది మాత్రమే పరలోక మహిమను అనుభవిస్తారు. మిగిలిన వారు భూమి మీదే సంతోషాన్ని పొందుతారు. అందరూ పరలోకానికి పోవాలని ఆశించరాదు. ఆర్మగెడ్లోను యుద్ధంలో బ్రతికిన వారు భూమిమీద పరలోక వాతావరణాన్ని కలిగి జీవిస్తారు. (లెట్ గాడ్ బి ట్రూ - 74, 23 1, 279, 298) యోహాను 3:3లో యేసుక్రీస్తు చెప్పిన ప్రకారము అందరూ మారుమనస్సు పొందనక్కరలేదు. ఎందుకంటే వారు భూమి మీదనే నిత్యజీవాన్ని సంపాదించుకుంటారు. (వాచ్ టవర్, 15-11-1954, పేజీలు 681, 682),.. నీటిలో ముంచబడుట ద్వారా రక్షణ లభిస్తుంది. (డాక్ట్రిన్స్ ఆండ్ కవనెంట్స్ 84:74). మహిమ వివాహము చేసుకున్నవారికి పరలోకములో ఉన్నతస్థలం లభిస్తుంది. వీరు పునరుత్థానములో ఆత్మపిల్లలను కంటారు వారు తండ్రియైన దేవునిస్థాయిని కలిగిఉంటారు. | (మార్మోన్ డాక్ట్రిన్స్ - పేజి 118).

తీర్పు - శిక్ష

పాపఫలితము మరణము, న్యాయతీర్పు ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచనివారు నరకానికి వెళ్ళాలి. నిత్యనాశనము కలదు. (రోమా 6:23 ; దాని 12:2 ; హెబ్రీ 9:27ప్రక 20:12 ; 2థెస్స 1:7-9;మార్కు 9:48).

నిత్యనరకము లేదు సాతానుతోపాటు, వాడి మనుష్యులు నరకములోనికి పోయి అంతమై పోతారు. నిత్య నరకాగ్నిలో కాలుట ఉండదు. (లెట్ గాడ్ బి ట్రూ - పేజి 99, 270). క్రీస్తు రెండవరాకడలో ఇశ్రాయేలీయులు పాలస్తీనాలోను, మార్మోను సంఘస్తులంత అమెరికాలోని మిస్సోరిలోను ఆశ్చర్యకరంగా సమకూర్చబడతారు. మిగిలిన లోకమంతటపై దేవుని ఉగ్రత కుమ్మరించడుతుంది. (డాక్ట్రిన్ ఆండ్ కవనెంట్స్ 29:9-11). ఎవ్వరును నశించరు. నిత్య నరకానికి వెళ్లరు. నరకములేదు. (మార్మోను డాక్ట్రిన్ 1966- పేజి 778, 174).

అంతము

సంఘము ఎత్తబడుతుంది. సంఘకాల విశ్వాసుల పునరుత్థానము. (1కొరింథీ 15:22-24 ;
1థెస్స 4:13-17 ). భూమిపై 7 సం||ల శ్రమకాలం. ఆ తరువాత క్రీస్తు రెండవ రాకడ. (యిర్మీయా 30:1; 31:25; ప్రకటన 19:11-16; జెకర్యా 14:4). మొదటి పునరుత్థానము, భూమిపై వెయ్యేండ్ల పాలన, సాతాను బంధించబడుట. (ప్రకటన 20:1-6; మీకా 5:7-9). రెండవ పునరుత్థానము, మృతులైన పాపుల అంత్యతీర్పు, నిత్యత్వము. (ప్రకటన 20:11-15).
క్రీస్తు భౌతిక ఆకారంలో రాడు. ఆత్మరూపంలో వస్తాడు. యేసుక్రీస్తు 1914లో దేవాలయానికి వచ్చి 1918 కంత దాన్ని శుద్ధి చేశాడు. (ద. ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ, పేజి 295). నిత్యనరకం లేదు. భూమిమీదనే పరలోకపు వాతావరణాన్ని యెహోవాలో విశ్వాసముంచినవాడు అనుభవిస్తారు. (లెట్ గాడ్ బి ట్రూ - పేజి 99, 270). మూడు రకాల స్థలాలు కలవు : 1. టెలెస్ట్రియల్ రాజ్యము (మధ్యాకాశము) యేసునందు విశ్వాసముంచక, లౌకికతత్త్వాలను పాటించి, పాపజీవితం జీవించినవారు నివసిస్తారు. 2. టెరస్ట్రియల్ రాజ్యము (భూమి) - మార్మోనులుగా మారని ఇతర క్రైస్తవుడు ఉండే స్థలము. 3. సెలస్ట్రియల్ రాజ్యము - నిజమైన మార్మోనులు నివసించే ఉన్నతమైన మహిమ రాజ్యము, మార్మోను దేవాలయాల్లో మహిమ వివాహాలు చేసుకున్నవారు ఇందులో జీవిస్తారు. (మార్మోను డాక్ట్రిన్ 1966 - పేజి 778, 774).

సాతాను

అపవాది. లూసిఫర్, ప్రధాన దూత. దేవుని సింహాసనముపై కూర్చోవాలని ఆశించి పతనమై పోయాడు. సాతానుకు దేవుడు నిత్యనరకము సిద్దపరిచాడు. ధవళ సింహాసనపు తీర్పు తరువాత నరకములోనికి పోతాడు. నిత్యము అక్కడ కాలుతాడు. (యెషయా 14:12-17 ;యెహెజ్కే 28:14-17 ; ప్రకటన 12:4,9 ; 20:1-10 ; 2 పేతురు 2:4 ;మత్తయి 25:41 ). యెహోవా యేసుకు వాగ్దానం చేసినట్లు పరలోకాన్ని ఏలడానికి క్రీ.శ. 1914లో అధికారం ఇచ్చాడు. అప్పుడు యేసు సాతానును పరలోకంలో నుండి 1914లో వెళ్ళగొట్టాడు. బైబిల్ ప్రకారము త్రిత్వము, నిత్యనరకము అనేవి లేవు. మనుష్యులను తప్పుదారిని పట్టించడానికి సాతాను సృష్టించిన బోధలు. (వాట్ గాడ్ రిక్వైర్స్ ఆఫ్ అప్, 1997) యేసు మరిము లూసిఫర్ అన్నదమ్ములు (జర్నల్ మార్మోన్ డాక్ట్రిన్స్)

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.