దేవుడు

రచయిత: Marie Prasanth Perikala

కొన్ని సంవత్సరాల క్రితం నేను కొంతమంది యెహోవా సాక్షులతో మాట్లాడుతున్నప్పుడు యేసు క్రీస్తు యొక్క దైవత్వం గురించిన ప్రస్తావన వచ్చింది. ఈ యెహోవా సాక్షులు ఎవరూ అంటే, తాము కూడా క్రైస్తవులమే అని చెప్పుకుంటూ ఉంటారు కానీ వీళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవ సమాజానికీ వీళ్లకి అసలు సంబంధమే లేదు. వీళ్ళు కూడా బైబిల్ నే ప్రకటిస్తున్నాము అంటారు, కానీ వాళ్ళ దగ్గర ఉండే బైబిల్ ని మన బైబిల్ తో పోల్చి చూస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. యేసు క్రీస్తు యొక్క దైవత్వం గురించి ఉన్న వాక్యాలను వాళ్ళు కొంచెం భిన్నంగా తర్జుమా చేస్తారు. యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని వాళ్ళు అంగీకరించరు. వీళ్ళ version of Bible ని "New World Translation", (అంటే కొత్త లోక అనువాదం) అని అంటారు. వీళ్ళ బైబిల్ లో మీరు యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే ఇలా ఉంటుంది.

మొదట్లో వాక్యం ఉన్నాడు, ఆ వాక్యం దేవుని దగ్గర ఉన్నాడు, ఆ వాక్యం ఒక దేవుడై ఉన్నాడు (లేదా దేవునిలా ఉన్నాడు). (యోహాను సువార్త 1:1 - కొత్త లోక అనువాదం)

మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, మన బైబిల్ లో ఉండేదానికి యెహోవా సాక్షుల బైబిల్ లో ఉండే దానికి ఒక మౌలికమైన వ్యత్యాసం ఉంది. మన బైబిల్ లో ఏముంటుందంటే,

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. (యోహాను సువార్త 1:1)

"వాక్యము దేవుడై యుండెను" అని మన బైబిల్ లో ఉంటే, "వాక్యం ఒక దేవుడై ఉన్నాడు" అని యెహోవా సాక్షుల బైబిల్ లో ఉంటుంది. "ఒక దేవుడు" అని అన్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మాములుగా మనం "దేవుడు" అనే పదాన్ని ఏ విధంగా అయితే నిర్వచిస్తామో, అదే అర్ధంలో లేదా అదే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ "దేవుడు" అనే పదాన్ని వాడటం లేదు. ఈ పదాన్ని నిర్వచించడంలోనే వారికి మనకి తేడా ఉంది. దేవుడు అని అనడానికి హీబ్రూ భాషలో "ఎల్", "ఎలోఆహ్", "ఎలోహీమ్" మొదలైన పదాలను వాడతారు. అయితే, హీబ్రూ భాషలో ఈ పదాలను కేవలం యెహోవాను ఉద్దేశించి మాత్రమే వాడలేదు. అన్య దేవతలు, దెయ్యాలు, ఆత్మలు, బలవంతులైన మనుషులు, పాలకులు, నాయకులు మొదలైన వారిని ఉద్దేశించి కూడా ఈ పదాలను వాడారు. అందువల్ల హీబ్రూ భాషలో ఉన్న ఈ వెసులుబాటుని ఉపయోగించుకుని యెహోవా సాక్షులు ఏమని వాదిస్తారంటే, యేసు క్రీస్తు "ఒక దేవుడు", లేదా దేవుని లాంటివాడు. He is a powerful being (శక్తిమంతుడు), He is a mighty one (బలవంతుడు). కానీ, యెహోవాతో సమానమైనవాడు కాదు. యెహోవా కింద పని చేసే అనేకమంది సేవకులలో యేసు క్రీస్తు ప్రధాన సేవకుడు అనేది వారి వాదన. కాబట్టి నేను కొంతమంది యెహోవా సాక్షులతో మాట్లాడుతున్నప్పుడు యేసు క్రీస్తు యొక్క దైవత్వం గురించి వారితో చర్చిస్తున్న సమయంలో యెషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనాన్ని నేను వారి వద్ద ప్రస్తావించాను. ఈ వచనాన్ని మనం ఇంగ్లీష్ బైబిల్ లో చూస్తే ఇలా ఉంటుంది,

For unto us a child is born, unto us a son is given: and the government shall be upon his shoulder: and his name shall be called Wonderful, Counsellor, The mighty God, The everlasting Father, The Prince of Peace. (Isaiah 9:6 KJV)

ఈ వచనాన్ని చూపించి నేను వారితో ఏమన్నానంటే, ఇది యేసు క్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచనం అని మీరు అంగీకరిస్తారా? అంటే, అంగీకరిస్తాము అని అన్నారు. మరి అయితే, ఇక్కడ యేసు క్రీస్తుని ఉద్దేశించి "The mighty God" అని ఉంది కదా... యేసు క్రీస్తు దేవుడు అని అనడానికి ఇంతకంటే వేరే ఆధారం ఇంకేం కావాలి? అని నేను వారిని అడిగాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, "Yes ofcourse, Jesus is Mighty God. But Jehovah is Almighty God". చూడండి, they are just twisting the words. వారి వాదన ప్రకారం, యేసు క్రీస్తు బలవంతుడైన దేవుడే. కానీ, యెహోవా సర్వశక్తిమంతుడైన దేవుడు. యెహోవాతో పోల్చి చూసినప్పుడు యేసు క్రీస్తు చిన్న దేవుడు. యేసు క్రీస్తు యెహోవాతో సమానమైనవాడు కాదు. ఇది యెహోవా సాక్షులు నమ్మేది.

ఇకపోతే ఈ మధ్య నేను ఒక క్రైస్తవ సోదరుడితో మాట్లాడుతున్నప్పుడు అతను ఏమన్నాడంటే, తండ్రి కుమార పరిశుద్దాత్మ... వీరు వేరు వేరు వ్యక్తులు కాదు కానీ, తండ్రి అయిన దేవుడే కుమారుడిగాను, కుమారుడే పరిశుద్దాత్ముడిగాను తనకు తానుగా మనకు ప్రత్యక్షపరచుకున్నాడనీ, అంటే ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కాదు కానీ, ఒక్క దేవుడే మూడు రకాలుగా బయలుపరచబడ్డాడు అని నేను నమ్ముతాను అన్నయ్య అని అంటూ ఆ సోదరుడు తాను ఆ విధంగా ఎందుకు నమ్ముతున్నాడు అనేదానికి ఆధారంగా యెషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనాన్నే చూపించాడు. ఈ వచనములో యేసు క్రీస్తుని ఉద్దేశించి "నిత్యుడగు తండ్రి" అని ఉంది కాబట్టి, తండ్రి అయిన దేవుడే కుమారుడిగా వచ్చాడు అని ఆ సోదరుడు నమ్ముతున్నాడు.

నేను మీకు ఈ రెండు ఉదాహరణలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనం బైబిల్ లో ఉన్న ఏదైనా ఒక సిద్ధాంతాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే, ఆ విషయం గురించి బైబిల్ ఏమి చెబుతుంది అనేది మనం సమగ్రంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. అంతేకాని ఎదో ఒక వచనాన్ని లేదా ఒక పదాన్ని విశ్లేషించడం ద్వారా మనం ఒక నిశ్చితాభిప్రాయానికి రావొచ్చు అనుకోవడం ఎంతమాత్రమూ సరి అయినది కాదు. యెషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం గురించి అలాగే యేసు క్రీస్తు దైవత్వం గురించి వివరంగా మాట్లాడుకునే ముందు అసలు ఈ వచనం Greek Septuagint లో ఎలా ఉంది అనే విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దానికంటే ముందు Septuagint గురించి కూడా క్లుప్తంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.

హీబ్రూ తనాక్ అంటే మన పాత నిబంధన వాక్యభాగానికి సంబంధించిన గ్రీకు అనువాదాన్ని Septuagint అని అంటారు. Second Temple period (దీనినే inter-testamental period అని కూడా అంటారు). అంటే పాత నిబంధన కాలానికి మరియు క్రొత్త నిబంధన కాలానికి మధ్యలో ఉన్న సమయం. సుమారు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం (500 BC) నుండి క్రీస్తు శకం మొదటి శతాబ్దం (70AD) వరకు ఉన్న సమయాన్ని Second Temple period అని అంటారు. 70AD లో యెరూషలేము దేవాలయం కూల్చివేయబడింది. ఈ Second Temple period సమయంలో క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో ఐగుప్తు దేశంలోని అలెగ్జాండ్రియా అనే పట్టణంలో యూదా మతపెద్దలు హీబ్రూ భాషలో ఉన్న పాత నిబంధన లేఖనాలను గ్రీకు భాషలోకి అనువదించారు. ఈ Septuagint అనేది పాత నిబంధనకు సంబంధించి మొట్టమొదటి అనువాదం. డెబ్బై మంది యూదా మతపెద్దలు కలిసి అనువదించారు కాబట్టి దీనికి Septuagint అనే పేరు వచ్చింది. పాత నిబంధనలో ఉన్న పుస్తకాలన్నిటినీ ఒకేసారి అనువదించలేదు కానీ, మొదట మోషే రాసిన పంచకాండాలను, ఆ తరువాత మెల్లగా ఒకదాని తరువాత ఒకటి పాత నిబంధనలో ఉన్న మిగతా పుస్తకాలన్నిటినీ కూడా అనువదించారు. ఈ అనువాద ప్రక్రియ అంతా కూడా సుమారు 300BC నుండి 200BC మధ్య కాలంలో జరిగింది. అంటే, 200BC నాటికే పాత నిబంధన మొత్తం గ్రీకు భాషలోకి అనువదించబడింది. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు, ఇంకా ఇతర శిష్యులు జీవించే సమయానికంటే చాలా ముందు నుండే Septuagint అనేది అందుబాటులో ఉంది. ఆదిమ క్రైస్తవ సంఘంలోని వారు ఈ Septuagintనే తమ బైబిల్ గా వాడారు (Septuagint was the Bible of the early Church). ఎందుకంటే ఆదిమ క్రైస్తవ సంఘంలో గ్రీకు భాష మాట్లాడే యూదేతర విశ్వాసులు (అంటే, Greek speaking Non-Jewish Gentile Christians) ఎక్కువ మంది ఉండేవారు. వాళ్ళు గ్రీకు మాత్రమే మాట్లాడగలరు. వాళ్లకు హీబ్రూ భాష తెలీదు, అలాగే అరామిక్ భాష కూడా తెలీదు. కాబట్టి Targums ని కూడా వాళ్ళు చదవలేరు. (క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో హీబ్రూ లేఖనాలను అరామిక్ భాషలోకి తర్జుమా చేశారు. వాటినే Aramaic Targums అని అంటారు). కాబట్టి ఆదిమ క్రైస్తవ సంఘంలోని వారు పాత నిబంధన వాక్యభాగాన్ని చదవాలన్నా లేదా అధ్యయనం చేయాలన్నా కూడా Septuagint అనేది చాలా కీలకంగా మారింది. కేవలం Non-Jewish Gentile Christians మాత్రమే కాక, ఇశ్రాయేలు బయట ఇతర దేశాలలో స్థిరపడిన యూదులు కూడా Septuagint నే వాడేవారు. ఎందుకంటే అలెగ్జాండర్ దండయాత్రల తరువాత గ్రీకు భాష, గ్రీకు సంస్కృతి బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఇతర దేశాలలో స్థిరపడిన యూదులు కూడా గ్రీకు భాషకు అలవాటుపడ్డారు. ప్రస్తుతం మనలో చాలా మందికి ఇంగ్లీష్ బైబిల్ చదివే అలవాటు ఉన్నట్లుగానే, అప్పట్లో చాలా మంది యూదులు కూడా Greek Septuagint ని చదివేవారు. అలా గ్రీకు భాషకు గ్రీకు సంస్కృతికి అలవాటు పడిన యూదులను Hellenized Jews అని అంటారు. కాబట్టి చారిత్రకంగా Greek Septuagint కి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా Greek New Testament ని రాసేటప్పుడు పాత నిబంధనలోని వచనాలను ఉటంకించాల్సి వచ్చినప్పుడు రచయితలు ఎక్కువగా Greek Septuagint మీదే ఆధారపడ్డారు. అంటే Hebrew Masoretic Text తో పోలిస్తే Greek Septuagint ఉత్తమమైనది అని కాదు కానీ, అది గ్రీకు భాషలో ఉన్న కారణంగా Greek New Testament writers, Septuagint మీద ఎక్కువగా ఆధారపడ్డారు. పాత నిబంధన లేఖనాలు అప్పటికే గ్రీకు భాషలో అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ అప్పటికప్పుడు హీబ్రూ భాషలో ఉన్న వచనాన్ని గ్రీకులోకి తర్జుమా చేయాల్సిన అవసరం లేదు కదా. నేరుగా Septuagint నుండి ఆ వాక్యాన్ని తీసుకుని క్రొత్త నిబంధనలో దానిని ఉటంకించడం వాళ్ళకి చాలా తేలికైన పని. అంతేకానీ, Hebrew Masoretic Text తో పోలిస్తే Greek Septuagint ఉత్తమమైనది, అందువల్ల Greek Septuagint నుండి మాత్రమే quote చేయాలి అనేది వారి ఉద్దేశం కాదు.

హీబ్రూ లేఖనాలకి సంబంధించినంతవరకు కనీసం మూడు రకాల versions ఉన్నాయి అని బైబిల్ పరిశోధకులలో ముందు నుండి ఒక అభిప్రాయం ఉంది.

  1. Hebrew Masoretic Text. ప్రస్తుతం మనం వాడుతున్న బైబిల్ లోని పాత నిబంధన ఏదైతే ఉందో అది Masoretic Text నుండే తర్జుమా చేశారు.
  2. Greek Septuagint ని తర్జుమా చేయడానికి వాడిన Hebrew Scriptures. ఎందుకంటే, Greek Septuagint చాలా వరకు Masoretic Text తో match అవుతుంది కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇవి రెండు కొంచెం భిన్నంగా ఉంటాయి. అందువల్ల Septuagint ని తర్జుమా చేయడానికి వాడిన హీబ్రూ లేఖనాలు ఏవైతే ఉన్నాయో అవి బహుశా Masoretic Text కంటే కొంచెం భిన్నంగా ఉన్న different version అయ్యుండొచ్చు అనేది బైబిల్ పరిశోధకుల అభిప్రాయం.
  3. ఇక మూడవది Samaritan Pentateuch. ఇందులో కేవలం మోషే రాసిన అయిదు పుస్తకాలు మాత్రమే ఉంటాయి. కానీ ప్రాచీన హీబ్రూ లేఖనాలను అధ్యయనం చేయడానికి Samaritan Pentateuch కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే సమరయులు తమ సిద్ధాంతాలకు అనుగుణంగా ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అవి మనం చాలా తేలిగ్గానే గుర్తించవచ్చు.

కాబట్టి పాత నిబంధనకు సంబంధించినంతవరకు కనీసం మూడు రకాల versions ఉన్నాయి అనేది బైబిల్ పరిశోధకుల అభిప్రాయం. 1947వ సంవత్సరం వరకు ఇది ఒక థియరీ మాత్రమే. అయితే, 1947వ సంవత్సరంలో Dead Scrolls ని కనుగొన్నారు. ఈ Dead Sea scrolls ని పరిశీలిస్తే, వాటిల్లో Greek Septuagint తో సరిపోయే హీబ్రూ లేఖనాలు ఉన్నాయి, Masoretic Text తో సరిపోయే హీబ్రూ లేఖనాలు ఉన్నాయి, అలాగే Samaritan Pentateuch తో సరిపోయే హీబ్రూ లేఖనాలు కూడా ఉన్నాయి. కాబట్టి Greek Septuagint అనేది ఎవరో కావాలని కొత్తగా తయారు చేసింది కాదు. Greek Septuagint కి హీబ్రూ మూలాలు ఉన్నాయి, హీబ్రూ భాషలో ఉన్న లేఖనాల నుండే Greek Septuagint ని తర్జుమా చేశారు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.

ఇక్కడ Masoretic Text గురించి కూడా కొంత చెప్పాలి. ఇప్పుడు మనం Masoretic Text అని దేనినైతే అంటున్నామో నిజానికి అది క్రీస్తు శకం మొదటి శతాబ్దం తరువాత, అంటే సుమారు 100AD ఆ టైంలో తయారు చేయబడింది. ఒక విధంగా చూస్తే Septuagint కి స్పందనగా కూడా యూదులు ఈ Masoretic Text ని అభివృద్ధి చేశారు అని చెప్పొచ్చు. ఇదొక్కటే కారణం అని అనలేము కానీ, traditional Jewish scriptures ని standardize చేయడానికి Septuagint కూడా ఒక కారణం. ఇప్పుడు మనం Masoretic Text అని దేనినైతే అంటున్నామో exact గా అలాంటి వ్రాత ప్రతులు Dead Sea scrolls లో ఉన్నాయి. అయితే వాటికి కొంచెం భిన్నంగా ఉన్న వ్రాత ప్రతులు కూడా Dead Sea scrolls లో ఉన్నాయి. వీటన్నిటినీ standardize చేసే క్రమంలో Masoretic Text అనే దానిని అభివృద్ధి చేశారు. ఉదాహరణకు ప్రస్తుతం మన దగ్గర బైబిల్ కి సంబంధించి వందలాదిగా ఇంగ్లీష్ అనువాదాలు ఉన్నాయి. వాటన్నిటికీ మూలం ఒక్కటే. కానీ అనువాదాల్లో మాత్రం కొన్ని తేడాలు ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు అందరినీ నియంత్రించగల ఒక అథారిటీ ఉంటె గనక, వాళ్ళు ఇన్ని రకాల ఇంగ్లీష్ అనువాదాలు ఎందుకు ఒక standard version ని తయారు చేసి ఇప్పటి నుండి క్రైస్తవులు అందరూ కూడా ఆ Version ని మాత్రమే వాడాలి మిగతావన్నీ తీసేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే గనక, అప్పుడు మనందరం ఏమి చేస్తాం? అన్ని versions ని తీసేసి, కేవలం ఆ ఒక్క version ని మాత్రమే వాడతాం. మొదటి శతాబ్దంలో యూదా సమాజంలో కూడా ఇటువంటిదే జరిగింది. అప్పట్లో వాళ్ళ దగ్గర హీబ్రూ బైబిల్ కి సంబంధించి చాలా వ్రాత ప్రతులు ఉండేవి. వాటిల్లో కొన్ని Septuagint కి దగ్గరగా ఉండేవి. కొన్ని ఇప్పుడున్న Masoretic Text కి దగ్గరగా ఉండేవి. ప్రతి synagouge లోనూ ఒక manuscript ఉండేది. అవి అన్ని కూడా చేతితో manual గా కాపీ చేస్తూ వచ్చారు కాబట్టి సహజంగానే వాటన్నిట్లోనూ చిన్న చిన్న variations అనేవి ఉండేవి. దానితో అప్పుడున్న యూదా మత పెద్దలు ఏమి చేశారంటే, ఇన్ని రకాల different versions కి బదులు యూదులందరికీ official గా ఒక standard Hebrew text ఉండాలి, అందులోనూ ప్రత్యేకించి ఈ Spetuagint ని ఉపయోగించి యేసు క్రీస్తు మెస్సయ్య అని ఆయన దేవుడు అని ఈ క్రైస్తవులందరూ ఏదైతే ప్రచారం చేస్తున్నారో... అంటే అప్పట్లో క్రైస్తవులు యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరూపించడానికి Septuagint లోని కొన్ని specific passages ని చాలా frequent గా ఉపయోగించేవారు. అది సహజంగానే యూదులకి నచ్చలేదు. అందువల్ల ఈ క్రైస్తవులు చేస్తున్న ప్రచారాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వీలుగా యూదులందరికీ official గా ఒక standard Hebrew text ఉండాలి అని వాళ్ళు భావించి సుమారు 100AD ఆ టైంలో Masoretic Text ని develop చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యూదులందరూ ఈ Masoretic Text నే వాడుతున్నారు. Masorah అనే హీబ్రూ పదానికి literal meaning ఏంటంటే "handover" లేదా "transmit". ఈ particular Hebrew text ని ఒక manuscript నుండి మరొక manuscript కి కాపీ చేయడానికి వాళ్ళు వాడిన పద్ధతిని "Masorah" అని అంటారు. వీటిని కాపీ చేసిన scribes ని Masoretes అని అంటారు. అందువల్ల ఈ particular Hebrew text కి Masoretic Text అనే పేరు వచ్చింది. మనం వాడుతున్న బైబిల్ కూడా ఈ Masoretic Text నుండే తర్జుమా చేయబడింది.

అయితే, Greek Septuagint ని తర్జుమా చేయడానికి వాడిన హీబ్రూ వ్రాత ప్రతులు, అలాగే Masoretic Text ని తయారు చేయడానికి వాడిన హీబ్రూ వ్రాత ప్రతులు.... ఈ రెండిటిలో ఒకటి superior and better text అని కానీ, మరొకటి inferior and corrupted text అని కానీ మనం చెప్పడానికి వీల్లేదు. యూదులు అలాగే చాలా మంది క్రైస్తవులలో కూడా ఉన్న ఒక అపోహ ఏంటంటే, ప్రవక్తలు స్వయంగా తమ చేత్తో రాసిన ప్రతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ Masoretes... word to word, letter to letter, exact గా transmit చేశారు, కాబట్టి ప్రస్తుతం మనం వాడుతున్న బైబిల్ లో ఎలాంటి వైరుధ్యాలు కానీ ఎలాంటి తప్పులు కానీ ఉండవు. "Masoretic Text is the ultimate authentic exact replica of original autographs" అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. చిన్న చిన్న variations ఉన్న different versions of manuscripts అనేవి మనకి Dead Sea scrolls లో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వాటిల్లో కొన్ని Septuagint కి దగ్గరగా ఉంటే, కొన్ని Masoretic Text కి దగ్గరగానూ అలాగే కొన్ని Samaritan Pentateuch కి దగ్గరగానూ ఉంటాయి. వీటిల్లో పలానా manuscript better text అని కానీ, లేదా particular manuscript లో ఉన్నది more accurate and older text అని కానీ చెప్పడం సాధ్యపడదు. ఎందుకంటే ఇవి అన్నీ కూడా chronological గా ఒకే time period కి చెందినవి. Around 300BC ఆ టైములో ఈ different versions of manuscripts అన్నీ కూడా వాడుకలో ఉన్నాయి. ఒక synagogue లో ఒకరకమైన manuscript ని వాడుతూ ఉంటే మరొక synagogue లో మరొకరకమైన manuscript ని వాడుతూ ఉండేవారు. It all depends on which community adopted which manuscript. కాబట్టి వీటిల్లో ఏది more accurate and older text అనే విషయం చెప్పడం సాధ్యం కాదు.

సరే, ఇక యెషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం Septuagint లో ఎలా ఉంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. 

For a child is born to us, and a son is given to us, whose government is upon his shoulder: and his name is called the Messenger of great counsel: for I will bring peace upon the princes, and health to him.

మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ "his name is called the Messenger of great counsel" అని ఉంది. దీన్ని ఇంకా better గా translate చేయాలంటే "his name is called the Angel of great counsel" అని translate చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్రీకులో వాడిన పదం "Angelos". Angelos అంటే ఇంగ్లీష్ లో Angel. Ofcourse Angel అన్నా Messenger అన్నా రెండూ ఒక్కటే. హీబ్రూలో "మలాక్" అనే పదం వాడతారు. మలాక్ అనే పదానికి అర్ధం Messenger. మనం తెలుగులో "దేవ దూత" అని అంటాం. దూత అనే పదానికి కూడా Messenger అనే అర్ధమే వస్తుంది. అంటే దేవుని నుండి వర్తమానము తీసుకొచ్చిన వాడు అన్నమాట. Messenger అన్నా లేకపోతే Angel అన్నా రెండూ ఒక్కటే. కాకపొతే మన ఆలోచనా విధానంలో Messenger అని అంటే మనం అంత త్వరగా connect అవ్వకపోవచ్చు కానీ Angel అని అంటే మనకి బాగా అర్ధం అవుతుంది. అందుకని ఈ explanation ఇచ్చే ప్రయత్నం చేసాను. So, ఇక్కడ Septuagint ప్రకారం "his name is called the Messenger of great counsel" లేదా "his name is called the Angel of great counsel" అని ఉంది. హీబ్రూ Masoretic text తో పోలిస్తే, అంటే మనం వాడే బైబిల్ తో పోలిస్తే Septuagint లో ఇక్కడ చాలా భిన్నంగా ఉంది. మనం వాడే బైబిల్ లో ఏముంటుందంటే, "his name shall be called Wonderful, Counsellor, The mighty God, The everlasting Father, The Prince of Peace." అని ఉంటుంది. తెలుగులో అయితే, "ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి" అని ఉంటుంది. ఇక్కడ "Wonderful, Counsellor" అనేదానికంటే కూడా Counsellor of Wonders లేదా Planner of Wonders అనేది better translation. ఎందుకంటే ఇక్కడ Counsellor అనే పదం ఏదైతే ఉందో దానికి హీబ్రూలో వాడిన పదం "yoetz (יועץ)". ఇది ఒక participle. Participle అంటే its a verbal adjective, Somebody doing something descriptively. కాబట్టి "pele yoetz (פלא יועץ)" అనే hebrew phrase ని "Wonderful, Counsellor" అనేదానికంటే కూడా Counsellor of Wonders లేదా Planner of Wonders అనేది better translation అవుతుంది. కాబట్టి Hebrew Masoretic text లో ఉన్నది ఏంటంటే pele yo-etz, el gibbor, avee-ad, sar-shaa-lom (פלא יועץ אל גבור אביעד שר שלום) ఆశ్చర్యకరమైన కార్యములకు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కానీ Septuagint లో ఈ వచనం చాలా భిన్నంగా ఉంది. Septuagint లో బలవంతుడైన దేవుడు అనే మాట లేదు, నిత్యుడగు తండ్రి అనే మాట కూడా లేదు. కేవలం "Angel of Great Counsel" అని ఉంది.

సాధారణంగా ఈ వాక్యం చూడగానే ఏమనిపిస్తుందంటే యేసు క్రీస్తు దేవుడు కాదు అనే వాదనకు ఈ వాక్యం బలాన్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ నిజానికి యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని అధ్యయనం చేయడానికి ఈ వాక్యం బాగా ఉపయోగపడుతుంది. క్రీస్తు శకం మొదటి శతాబ్దానికి ముందు వరకు కూడా Plurality in Godhead - దైవత్వంలో బహుళత్వం ఉంది అనే విషయాన్ని యూదా సమాజం కూడా గుర్తించింది. That was part of their theology. యూదులు హీబ్రూ లేఖనాలను ఇతర భాషల్లోకి అంటే గ్రీకులోకి కానీ అరామిక్ లోకి కానీ తర్జుమా చేసినప్పుడు, ఆ అనువాదాలను పరిశీలిస్తే, వారి thought process ఏంటి, అనువాదకుడు ఆ వాక్యాన్ని ఎలా అర్ధం చేసుకున్నాడు, ఎలా interpret చేస్తున్నాడు అనే విషయాలు మనకి అర్ధం అవుతాయి. ఒకప్పుడు యూదులలో Plurality in Godhead అనే theology ఉన్నప్పటికీ, క్రీస్తు శకం మొదటి శతాబ్దం చివరినాటికి క్రైస్తవ్యం ఒక ప్రత్యేక మతంగా స్థిరపడటం, యేసు క్రీస్తు దేవుడు అని క్రైస్తవులు ప్రచారం చేయడం, దానికి ఆధారంగా హీబ్రూ లేఖనాలనే ఉటంకిస్తూ ఉండటంతో క్రైస్తవ్యాన్ని ఎదుర్కోవడం కోసం యూదులు ఏమి చేశారంటే, దైవత్వంలో బహుళత్వం అనే సిద్ధాంతాన్ని దుర్బోధగానూ, ఆ సిద్ధాంతాన్ని నమ్మేవారిని అలాగే ప్రచారం చేసేవారిని కూడా heretics గానూ ప్రకటించారు.

సరే మళ్ళీ మనం యెషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం దగ్గరకు వద్దాం. సాధారణంగా ఇలా భిన్నంగా ఉన్న వాక్యభాగాలను చూసినప్పుడు we can have two possibilities. ఒక possibility ఏంటంటే, Masoretic text తో పోలిస్తే Greek Septuagint లో ఉన్నది చాలా భిన్నంగా ఉంది కాబట్టి, బహుశా గ్రీకులోకి తర్జుమా చేయడానికి వాడిన హీబ్రూ లేఖనాలు ఏవైతే ఉన్నాయో, అవి Masoretic text కంటే భిన్నంగా ఉండి ఉండవచ్చు. ఇక్కడ మనం చూస్తున్న వాక్యభాగంలో కూడా బహుశా అదే జరిగి ఉండి ఉండవచ్చు. That is completely possible. ఎందుకంటే ఇక్కడ Greek Septuagint లో ఉన్న వాక్యం పూర్తిగా భిన్నంగా ఉంది. అయితే, రెండవ possibility ఏంటంటే, సాధారణంగా Masoretic Text తో పోల్చిచూస్తే Septuagint కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ, ఇవి రెండూ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అంటే, చాలా చిన్న చిన్న variations, suffixes విషయంలో గానీ, లేదా క్రియా పదాలు, లేదా సర్వనామాలు ఇలాంటి వాటిల్లో చిన్న చిన్న variations, లేదా అక్కడక్కడా కొన్ని పదాలు miss అవ్వడం లేదా order of the verse కొంచెం భిన్నంగా ఉండటం ఇలాంటి చిన్న చిన్న variations ఉంటాయి కానీ, చాలా వరకు Masoretic Text మరియు Septuagint ఈ రెండూ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రెండూ కూడా చాలా భిన్నంగా ఉన్నాయి కాబట్టి, మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్లు బహుశా గ్రీకులోకి తర్జుమా చేయడానికి వాడిన హీబ్రూ లేఖనాలు Masoretic text కంటే భిన్నంగా ఉండి ఉండవచ్చు, లేదా అనువాదకుడు తాను తర్జుమా చేస్తున్న వాక్యాన్ని ఏ విధంగా అయితే interpret చేస్తున్నాడో, ఆ interpretive ideas ని తన తర్జుమాలోకి చొప్పించి ఉండి ఉండవచ్చు. ఈ రెండు possibilities లో ఏదైనా జరిగుండొచ్చు, మనకి తెలీదు.

అయితే, ఇక్కడ ఒకవేళ second option గనక జరిగి ఉండి ఉంటే... అంటే, గ్రీకులోకి తర్జుమా చేయడానికి వాడిన హీబ్రూ లేఖనాలు ఏవైతే ఉన్నాయో అవి, మరియు Masoretic Text, ఈ రెండిట్లో కూడా ఒక్కటే text ఉండి, అనువాదకుడు తన interpretation ని Septuagint లోకి చొప్పించి ఉంటే గనక అది చాలా ఆసక్తికరమైనది. ఎందుకంటే, "ఆశ్చర్యకరమైన కార్యములకు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి", ఇలాంటి పదాలను చూస్తూ ఆ అనువాదకుడు ఒక Angel ని ఎలా ఊహించుకోగలిగాడు? వీటన్నిటినీ అలా ఎలా కనెక్ట్ చేసాడు? అతని thought process ఎలా ఉంది? ఆ కాలంలో వాళ్ళ theology ఎలా ఉండేది? ఇవి అన్నీ కూడా చాలా interesting elements.

వీటన్నిటినీ అర్ధం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు, కాకపొతే మనకి మన హీబ్రూ బైబిల్ గురించి కొంత అవగాహన ఉండాలి. ఇక్కడ "ఆశ్చర్యకరమైన కార్యములకు ఆలోచనకర్త" అనే పదం ఏదైతే ఉందో, దానికి హీబ్రూ లో వాడిన పదం "pele yoetz (פֶּ֠לֶא יוֹעֵץ֙)". ఈ same combination of words ని మనం యెషయా గ్రంథంలోనే మరొక చోట చూస్తాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి చూడండి.

This also comes from the Lord of hosts, Who is wonderful in counsel and excellent in guidance. (Isaiah 28:29 NKJV)

ఈ వచనములో Who is wonderful in counsel? సైన్యములకధిపతియగు యెహోవా - pele yoetz (פֶּ֠לֶא יוֹעֵץ֙) - ఆశ్చర్యకరమైన కార్యములకు ఆలోచనకర్త ఆయనే. అలాగే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూడండి.

నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును (యెషయా 29:14)
behold, I will again do a marvelous work among this people, A marvelous work and a wonder; (Isaiah 29:14 NKJV)

నిజానికి ఇక్కడ హీబ్రూలో pele అనే పదం మూడు సార్లు వస్తుంది. ఆశ్చర్య కార్యములు చేసేవాడు యెహోవా. అలాగే యెషయా గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చూడండి.

యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించెదను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి (యెషయా 25:1)
O Lord, You are my God.
I will exalt You,
I will praise Your name,
For You have done wonderful things;
Your counsels of old are faithfulness and truth.

మళ్ళీ ఇక్కడ యెహోవాను అద్భుత కార్యములు చేసిన వాడుగానూ, అలాగే తన ఆలోచనలు సత్యస్వభావము ననుసరించి నెరవేర్చినట్లుగాను చెప్పబడింది. కాబట్టి "pele yoetz (פֶּ֠לֶא יוֹעֵץ֙)" అనే ఈ combination of words ని దేవుడైన యెహోవాను ఉద్దేశించి వాడినట్లుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇదే రకమైన terminology ని, ఇవే పదాలను ఒక Angel ను ఉద్దేశించి ఎక్కడైనా వాడారా?

Yes, వాడారు. ప్రత్యేకించి ఒక unique Angel. మామూలు ఇతర దూతల వంటివాడు కాదు. ఆ Angel ని ఉద్దేశించి హీబ్రూలో "మలాక్ యెహోవా" అనే ఒక ప్రత్యేకమైన పదాన్ని వాడారు. ఇంగ్లీష్ బైబిల్ లో “The Angel Of The LORD" అని కనిపిస్తుంది. తెలుగులో "యెహోవా దూత" అని ఉంటుంది. ప్రత్యేకించి కొన్ని వాక్యభాగాలలో ఈ unique and special Angel ని ఉద్దేశించి మనం ఇంతకుముందు చూసిన హీబ్రూ పదాలను వాడారు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇక్కడ యెహోవా దూత సంసోను తల్లిదండ్రులను దర్శించి వారికి ఒక కొడుకు పుడతాడు అని చెప్పిన సందర్భం. ఇక్కడ 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఒకసారి చూడండి.

యెహోవా దూత నీ వేల నాపేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యముకాని దనెను. అంతట మానోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసికొని యొక రాతిమీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠముమీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి.
And the Angel of the Lord said to him, “Why do you ask My name, seeing it is wonderful?” So Manoah took the young goat with the grain offering, and offered it upon the rock to the Lord. And He did a wondrous thing while Manoah and his wife looked on — it happened as the flame went up toward heaven from the altar—the Angel of the Lord ascended in the flame of the altar! When Manoah and his wife saw this, they fell on their faces to the ground.

ఆశ్చర్యమైన కార్యములను చేసేవాడు అని యెహోవాను ఉద్దేశించి వాడిన వాక్యభాగాలను ఇంతకుముందే చూశాం. కానీ, ఇక్కడ ఈ వాక్యభాగంలో "Whose Name is called Wonderful"? It's Angel of the LORD. Who did a wondrous thing? It's Angel of the LORD.

అలాగే, నిర్గమకాండం 15వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇది చాలా important passage. ఎందుకంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చి, ఎర్ర సముద్రం దాటిన వెంటనే, ఐగుప్తీయుల దేవీదేవతల మీద యెహోవా సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ మోషే పాడిన పాట ఇది. పదకొండవ వచనంలో మోషే ఇలా అంటున్నాడు.

యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు (నిర్గమకాండం 15:11)
“Who is like You, O Lord, among the gods?
Who is like You, glorious in holiness,
Fearful in praises, doing wonders?
(Exodus 15:11)

మళ్ళీ same word and same terminology. యెషయా 9:6 లో ఉన్న పదం. అలాగే, నిర్గమకాండం 3:20 ఒకసారి చూడండి. ఇది ఎర్ర సముద్రం దాటకముందు.

నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుతములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును.
So I will stretch out My hand and strike Egypt with all My wonders which I will do in its midst; and after that he will let you go.

మళ్ళీ same word and same terminology. 15:11 వచనములో ఎర్ర సముద్రం దాటిన తరువాత, అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు అని మోషే పాట పాడుతూ ఉంటే, 3:20 వచనములో I will stretch out My hand and strike Egypt with all My wonders అని దేవుడు చెప్పినట్లుగా చూస్తాం. This really only matters if the Angel of The LORD and YHWH can somehow be co-identified with eachother. అంటే, యెహోవా అలాగే యెహోవా దూత... వీళ్ళిద్దరూ కూడా సమానమైన హోదా కలిగిన వారైతేనే మనం ఈ విధమైన వచనాలను చూడగలం. ఎందుకంటే మీరు నిర్గమకాండం మూడవ అధ్యాయం మొదటి నుండి చూస్తే, ఇది అందరికీ బాగా తెలిసిన వాక్యభాగమే - మోషే మరియు మండుతున్న పొద. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ మండుతున్న పొదలో ఎవరు ఉన్నారు? రెండవ వచనంలో, - "ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను." అని ఉంటుంది. ఆ తరువాత నాలుగవ వచనంలో, "దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండి మోషే మోషే అని అతనిని పిలిచెను." అంటే మరి ఆ మండుతున్న పొదలో ఎవరు ఉన్నారు? ఆ పొదలో ఇద్దరు ఉన్నారు. యెహోవా దూత అలాగే యెహోవా. ఈ backdrop లో ఇప్పుడు మీరు 20య్యో వచనం చూడండి. ఐగుప్తులో అద్భుత కార్యములు చేస్తానని దేవుడు చెప్పాడు. అలాగే న్యాయాధిపతులు 13వ అధ్యాయం ప్రకారం, it was the Angel who did a wondrous thing and the Name of the Angel is wonderful. మీరు నిర్గమకాండంలో ఇంకా చదువుతూ వెళ్తే, 23వ అధ్యాయంలో, ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలను ఇచ్చిన తరువాత. నిర్గమకాండం 23వ అధ్యాయం 20-21, ఈ రెండు వచనాలను ఒకసారి చూడండి.

ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది.
“Behold, I send an Angel before you to keep you in the way and to bring you into the place which I have prepared. Beware of Him and obey His voice; do not provoke Him, for He will not pardon your transgressions; for My name is in Him.

నా నామము ఆయనకున్నది. అంటే ఇక్కడ Name Theology అని ఒకటి ఉంటుంది. దాని గురించి కొంచెం అవగాహన ఉండాలి. మీరు ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం లాంటి వాక్యభాగాలను చూస్తే, నిజానికి ద్వితీయోపదేశకాండములో చాలా చోట్ల ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు 12:5 వ వచనం చూడండి.

మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్ప రచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయు చుండవలెను.
అలాగే పదకొండవ వచనంలో "మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసికొని రావలెను." అని ఉంటుంది.

ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులందరినీ తీసుకుని వెళ్లి ఒక స్థలమును ఎన్నుకుని, అక్కడ YHWH అనే four consonant letters అంటే యెహోవా అనే పదాన్ని ఆ స్థలంలో రాస్తాడు అని కాదు. నా నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలము అంటే, అది దేవాలయాన్ని సూచిస్తుంది. "The Name" అనేది దేవుడిని, దేవుని సన్నిధిని సూచించడానికి వాడే ఒక పద ప్రయోగం. యూదులు అసలు యెహోవా అనే పేరుని ఉచ్చరించరు. వాళ్ళు బైబిల్ చదివేటప్పుడు వాళ్లకి యెహోవా అనే పదం కనపడితే they have two options. ఒకటి adonai అని అంటారు. లేకపోతే HaShem అని అంటారు. HaShem అంటే the Name అని అర్ధం. అంటే వాళ్ళు HaShem అనే పదాన్ని దేవునికి పర్యాయపదంలాగా, ఆ కాలంలోనూ, అంటే బైబిల్ ని రాస్తున్న కాలంలోనూ వాడారు, ఇప్పటికీ కూడా వాడుతున్నారు. మీరు ఇరవయ్యో కీర్తన మొదటి వచనం చూసినట్లయితే,

ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. (కీర్తనల గ్రంథం 20:1) అని ఉంటుంది. అలాగే ఏడవ వచనంలో,
కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము (కీర్తనల గ్రంథం 20:7) అని ఉంటుంది. అలాగే యెషయా గ్రంథం ముప్పయ్యో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో,
ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది (యెషయా గ్రంథం 30:27) అని ఉంటుంది.

కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము అని అంటే, దాని అర్థం యుద్ధభూమిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు సైనికులు యెహోవా... యెహోవా... అని అరుస్తూ ఉంటారని కాదు. లేదా శత్రు సైనికులు వాళ్ళ దగ్గరకు రాకుండా ఉండటానికి నేల మీద యెహోవా అనే పదం రాస్తారని కూడా కాదు. యెహోవా నామమును విశ్వసించడం అంటే, యెహోవాను విశ్వసించడమే. అంటే, యెహోవా నామమును personify చేసే ఒక concept మనకి లేఖనాలలో కనిపిస్తుంది.

ఇప్పుడు మళ్ళీ నిర్గమకాండం 23వ అధ్యాయం దగ్గరకు వెళ్తే, అక్కడ దేవుడు ఒక Angel ని చూపించి My Name is in Him అని అన్నాడంటే, దాని అర్ధం ఏంటంటే, నేను ఆ Angel లో ఉన్నాను. He is Me and I am Him. I am in Him. My presence is in this Angel. అందుకే అంటాడు - ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు.

ఈ concept మనకి బైబిల్ లో పదే పదే కనిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి తీసుకువచ్చింది ఎవరూ అంటే? మనం సాధారణంగా దేవుడు లేదా దేవుడైన యెహోవా అని చెబుతాం. కానీ మీరు వాస్తవానికి హీబ్రూ బైబిల్ లో చూస్తే, మీకు different options కనిపిస్తాయి. ఒకటి యెహోవా, రెండు కొన్ని వాక్యభాగాల ప్రకారం యెహోవా దూత ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి తీసుకువచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే మరి ఇశ్రాయేలీయులను ఎవరు ఐగుప్తు నుండి బయటకు తీసుకువచ్చారు? యెహోవానా లేక యెహోవా దూతా అంటే, ఇద్దరూ అని చెప్పొచ్చు. యెహోవా, అలాగే యెహోవా దూత... ఈ పదాలు కొన్ని చోట్ల interchangeable words లాగా కూడా వాడారు. న్యాయాధిపతులు రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీము నకువచ్చి యీలాగు సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశము నకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.

ఇక్కడ, మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశము నకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను అని యెహోవా దూత మాట్లాడుతున్నాడు. యెహోవా అలాగే యెహోవా దూత, వీళ్ళిద్దరూ కూడా వేరు వేరు వ్యక్తులు కానీ ఒకేలా కూడా కనిపిస్తారు. యేసు క్రీస్తు అలాగే తండ్రి అయిన యెహోవా... వీరిద్దరి గురించి మనం ఏ విధంగా అయితే మాట్లాడతామో, ముఖ్యంగా మనం ప్రార్ధన చేసేటప్పుడు, తండ్రి అయిన యెహోవాను ప్రార్ధిస్తున్నామా లేక యేసు క్రీస్తుకి ప్రార్ధిస్తున్నామా, we actually don’t care, మనం అసలు అది పట్టించుకోము. ఆ చిన్న వ్యత్యాసం అనేది కనిపించీ కనిపించనట్లు ఉంటుంది. సరిగ్గా అదే రకమైన భాషను మనం పాత నిబంధనలో యెహోవాకు యెహోవా దూతకు మధ్య వాడటాన్ని గమనించవచ్చు. యేసు క్రీస్తు దేవుడే కానీ తండ్రి కాదు. తండ్రి కానప్పుడు యేసు క్రీస్తు దేవుడు ఎలా అవుతాడు? ఎందుకంటే, యేసు క్రీస్తు దేవుడు అని కొన్ని వాక్యభాగాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. వాళ్లిద్దరూ వేరు వేరు వ్యక్తులు కానీ ఒక్కటే.

ఆదికాండము 31వ అధ్యాయంలో కూడా ఈ విషయం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ యాకోబు లాబాను మధ్య జరిగిన కొన్ని విషయాలను మనం చూస్తాం. గొర్రెలు మేకల విషయంలో లాబాను యాకోబుని మోసం చేయాలనుకోవటం, అప్పుడు యాకోబు తన మందను ఏ విధంగా వృద్ధి చేసుకున్నాడు, లాబాను మంద ఏ విధంగా తగ్గిపోయింది, ఈ విషయాలన్నీ మనం చూస్తాం. ఇక్కడ యాకోబు తన మందను వృద్ధి చేసుకోవడంలో అతనికి దేవుడైన యెహోవా సహాయం చేస్తాడు. ఆదికాండము 31వ అధ్యాయం మూడవ వచనంలో ఏముంటుందంటే, “అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో” (ఆదికాండము 31:3) చెప్పినట్లుగా మనం చూస్తాం. కానీ మీరు పదకొండు, పన్నెండు, పదమూడు వచనాలు చూసినట్లయితే,

మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను. (ఆదికాండము 31:11-13)

అని యాకోబు తనకి స్వప్నంలో కనిపించిన విషయాలను తన భార్యలకు చెబుతాడు. యాకోబుకి స్వప్నంలో కనిపించింది ఎవరు? దేవుని దూత. నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుము అని యాకోబుతో చెప్పినది ఎవరు? దేవుని దూత. గొఱ్ఱెలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను కలిగినవిగా చేసింది ఎవరు? దేవుని దూత. బేతేలులో యాకోబు స్తంభముమీద నూనె పోసి ఎవరికైతే మ్రొక్కుబడి చేశాడో ఆ బేతేలు దేవుడను నేనే అని దేవుని దూత చెబుతున్నాడు. బేతేలులో ఏమి జరిగింది అనేది ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం నుండి 22వ వచనం వరకు ఉంటుంది. దేవుడైన యెహోవా యాకోబును మొట్టమొదటిసారిగా దర్శించింది అక్కడే. అక్కడ చాలా స్పష్టంగా దేవుడైన యెహోవా మాట్లాడుతూ, "నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను" అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. నీ సంతానమును బహుగా వృద్ధి చేస్తాను, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. నేను నీకు తోడై ఉంటాను, నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువను" అని యెహోవా యాకోబునకు వాగ్దానం చేస్తాడు. యాకోబు నిద్ర నుండి లేచిన తరువాత, "నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు;" అని చెప్పి, "తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసి, ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. అయితే, ఇక్కడ యాకోబు ఏ దేవుడికైతే మ్రొక్కుబడి చేశాడో ఆ దేవుడ్ని నేనే అని ఆదికాండము 31వ అధ్యాయంలో దేవుని దూత చెబుతున్నాడు.

అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను. (ఆదికాండము 28:12-22)

మీకు మరొక వాక్యభాగం చూపిస్తాను. యేసు క్రీస్తు దైవత్వం గురించి ఒకవేళ మీరు ఎవరైనా యెహోవా సాక్షులతో మాట్లాడుతున్నట్లయితే గనక, ఇప్పుడు నేను చూపించబోయే వాక్యభాగం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆదికాండము 48వ అధ్యాయంలో యాకోబు తాను చనిపోయే ముందు యోసేపు పిల్లలను దీవిస్తాడు. ఇది మనందరికీ బాగా తెలిసిన విషయమే. యాకోబు తన రెండు చేతులను మార్చి, చిన్నవాడి తల మీద కుడి చెయ్యి, పెద్దవాడి తల మీద ఎడమ చెయ్యి పెట్టి వాళ్ళిద్దరినీ దీవిస్తాడు. ఆ సమయంలో యాకోబు చేసిన ప్రార్ధన చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని మనష్షే తలమీద తన యెడమచేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి- (ఇప్పుడు ఇక్కడ యాకోబు చేసిన ప్రార్ధన ఉంటుంది. ఆ ప్రార్ధనలో మొత్తం మూడు చరణాలు ఉంటాయి. మొదటి చరణం - ) నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని యెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, (రెండవ చరణం - ) నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, (ఇక మూడవ చరణం... మొదటి రెండు చరణాలు చదివిన తరువాత ఎవరైనా ఏమి అనుకుంటారు? మూడవ చరణంలో కూడా మళ్ళీ యాకోబు దేవుని గురించి ప్రస్తావిస్తాడు అనే ఎవరైనా అనుకుంటారు. కానీ ఇక్కడ యాకోబు ఏమంటున్నాడో చూడండి) అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; (ఆదికాండము 48:14-16)

అని యాకోబు ప్రార్థన చేశాడు. ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, "ఆశీర్వదించునుగాక" అని ఉన్న చోట, హీబ్రూలో వాడిన పదం "యెవారేక్ (יְבָרֵךְ֮)". ఇది Third Person Masculine Singular Verb (పుంలింగ ఏకవచన క్రియా పదం). అందుకే ఇంగ్లీష్ NIV (New International Version) బైబిల్ లో, may he bless these boys అని ఉంటుంది. ఈ వచనాన్ని, may they bless these boys అని తర్జుమా చేయడానికి వీల్లేదు. అంటే ఇక్కడ, "నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని యెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత, అతడు (జాగ్రత్తగా గమనించండి ఏకవచనం) యీ పిల్లలను ఆశీర్వదించునుగాక" అని యాకోబు ప్రార్ధించాడు. అబ్రాహాము ఇస్సాకులు ఏ దేవుని ఎదుట నడిచారు? వారు యెహోవా ఎదుట నడిచారు. యాకోబు పుట్టినది మొదలుకొని చివరివరకు అతడిని పోషించిన దేవుడు ఎవరు - యెహోవా. సమస్తమైన కీడులలోనుండి యాకోబును తప్పించినది ఎవరు? యెహోవా దూత అని యాకోబు అంటున్నాడు. మరి అయితే, ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు ఈ పిల్లలను ఆశీర్వదించాలి అని యాకోబు ప్రార్ధిస్తున్నాడు? యెహోవానా లేక యెహోవా దూతా? Ofcourse, ఇద్దరూ కూడా ఈ పిల్లలను ఆశీర్వదించాలి అని యాకోబు ప్రార్ధిస్తున్నాడు కానీ, వారిరువురినీ కలిపి ఒక్కటిగా చూపే ప్రయత్నం కూడా చేశాడు. యెహోవా గురించి మరియు యేసు క్రీస్తు గురించి మనం ఏ విధంగా అయితే మాట్లాడతామో, సరిగ్గా అదే విధంగా యెహోవా మరియు యెహోవా దూత గురించి ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు.

ఇప్పటివరకు మనం చెప్పుకున్న కొన్ని వచనాలను గురించి, ఉదాహరణకు ఆదికాండము 31వ అధ్యాయం 13వ వచనం లాంటివి, వాటి గురించి కొంత మంది ఏమంటారంటే, సాధారణంగా దేవ దూతలు, తాము దేవుడి నుండి తీసుకుని వచ్చిన వర్తమానాన్ని, స్వయంగా దేవుడే చెబుతున్నట్లుగా అనిపించేలా first person language ని వాడతారు. అంటే, ఆదికాండము 31వ అధ్యాయం 13వ వచనంలో, "బేతేలు దేవుడను నేనే" అని అంటున్నది వాస్తవానికి యెహోవాయే కానీ, ఆ మాటలను దేవుడు దూత నోటి ద్వారా పలికించాడు అని వారు వివరించే ప్రయత్నం చేస్తారు. సరే, కాసేపు వాళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం. మిగతా అన్ని చోట్లా ఈ వాదన పనిచేస్తుంది కానీ, ఆదికాండము 48వ అధ్యాయంలో ఇది పని చేయదు. ఎందుకంటే, ఇక్కడ ఏ దేవదూత కూడా మాట్లాడటం లేదు. తన జీవితంలో జరిగిన విషయాలను బట్టి, దేవుడు తనని దర్శించి నడిపించిన విధానాన్ని బట్టి యాకోబు స్వయంగా అంటున్న మాటలు ఇవి. యెహోవాను మరియు యెహోవా దూత, ఇద్దరినీ కలిపి ఒక్కటిగా చెప్పే ప్రయత్నం చేసింది యాకోబు. యెహోవా మరియు యెహోవా దూత, ఇద్దరూ వేరు వేరు వ్యక్తులు కానీ, ఇద్దరూ ఒక్కటే.

ఇప్పుడు, "యెహోవా ఒక దేవదూత కాదు అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా?" అని మీరు ఏ యెహోవా సాక్షినైనా అడగండి. వాళ్ళు ఏమంటారంటే, యెహోవా దేవదూత ఎలా అవుతాడు? దేవదూతలు సృష్టింపబడిన వాళ్ళు కదా. కాబట్టి ఖచ్చితంగా యెహోవా దేవదూత కాదు అని వాళ్ళు సమాధానమిస్తారు. అప్పుడు మీరు వాళ్లకి ఆదికాండము 48వ అధ్యాయంలో ఉన్న వాక్యభాగాన్ని చూపించండి. హీబ్రూలో వాడిన "యెవారేక్ (יְבָרֵךְ֮)" అనే పుంలింగ ఏకవచన క్రియా పదం గురించి కూడా వివరించండి. ఇక్కడ వాళ్లకి ఒక సమస్య వస్తుంది. ఈ వాక్యభాగం ప్రకారం అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా ఒక దూత అయినా అయ్యుండాలి, లేదా ఇక్కడ ప్రస్తావించబడిన యెహోవా దూత; యెహోవా అయినా అయ్యుండాలి. ఏ విధంగా చూసినా కూడా, ఇది వాళ్ళు నమ్ముతున్న సిద్ధాంతాన్ని తప్పు అని రుజువు చేస్తుంది.

బైబిల్ లో ప్రస్తావించబడిన ఈ specific Angel... యెహోవాతో సమానమైనవాడిగా గుర్తించబడిన ఈ యెహోవా దూత, దేవుని నామము... అంటే, దేవుని సన్నిధి ఎవరిలో అయితే ఉందో ఆ యెహోవా దూత గురించి సరిగ్గా అర్ధం చేసుకుంటే గనక, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ మీ మనస్సులో ఉంటే, అప్పుడు యెషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనాన్ని చూసినప్పుడు, ఇక్కడ ఈ శిశువు ద్వారా స్వయంగా దేవుడే శరీరధారియై ఒక మనుష్యునిగా జన్మించడం అనే విషయాన్ని మీరు లోతుగా ఆలోచించినప్పుడు, దేవుడు ఒక visible form లో మనకి కనిపించడం... అంటే, దేవుడ్ని ఎప్పుడూ ఎవరూ చూడలేదు. పాత నిబంధనలో కేవలం యెహోవా దూత రూపంలోనే దేవుడు మనుషులకు ఒక visible form లో కనిపించాడు. అందుకే యోహాను కూడా యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనంలో "ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను." అని అంటాడు. కాబట్టి యెషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనంలో ఉన్న ఈ శిశువు ఇంకెవరో కాదు, లేఖనాలలో కనిపిస్తున్న యెహోవా దూత అయ్యుంటాడు అనే conclusion కి రావలసి ఉంటుంది. ఈ వచనాన్ని Greek Septuagint లోకి అనువదిస్తున్న అనువాదకుడు కూడా ఈ విధంగా ఆలోచించి ఉంటాడు. “ఈ వచనంలో ఒక శిశువు పుట్టబోతున్నట్లుగానూ, దేవుడే స్వయంగా శరీరధారియై మానవ రూపంలో జన్మించబోతున్నట్లుగానూ ఉంది, అంతేకాకుండా ఇతడు ఆశ్చర్యకరమైన కార్యములకు ఆలోచనకర్త అని ఉంది, ఇటువంటి వర్ణన లేఖనాలలో ఇంకా ఎక్కడైనా ఉందా? ఆ... సంసోను జన్మవృత్తాంతంలో యెహోవా దూతను ఉద్దేశించి "His Name was Wonderful" అని ఉంది. యెహోవా కూడా ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరమైన కార్యములను చేస్తాడు. ఇక్కడ ఈ వాక్యభాగంలో దేవుడు మానవరూపంలో ఒక visible form లో ఉండబోతున్నాడు. ఇటువంటిది లేఖనాలలో ఇంకా ఎక్కడైనా ఉందా? ఆ... పంచకాండాల్లో మానవరూపంలో మనుషులకు కనిపించిన దేవుడు యెహోవా దూత. కాబట్టి యెషయా 9:6లో బహుశా ఇక్కడ ఉన్నది యెహోవా దూత గురించేనేమో. దేవుని నుండి వచ్చిన దూత... తాను స్వయంగా దేవుడు కూడా అయిన యెహోవా దూత - The Angel from God who is also God. కాబట్టి ఇక్కడ ఈ శిశువు The Messenger లేదా The Angel of The Great Counsel అని పిలువబడతాడు అని తర్జుమా చేయవచ్చు కదా” అని అనువాదకుడు భావించి ఉంటాడు.

సరే అంతా బాగానే ఉంది కానీ ఈ counsel ఎక్కడి నుండి వచ్చింది? అనే సందేహం మీకు రావొచ్చు. 82వ కీర్తనలో దీని గురించి మనకి కొన్ని విషయాలు కనిపిస్తాయి. "దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. (కీర్తనల గ్రంథము 82:1)" అని మొదటి వచనంలో ఉంటుంది. 89వ కీర్తనలో కూడా ఈ Divine Counsel అనే దానిని మనం చూడొచ్చు. "యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు? పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు. (కీర్తనల గ్రంథము 89:6-7)" అని 89వ కీర్తన 6-7 వచనాలలో ఉంటుంది. 82వ కీర్తన మొదటి వచనంలో "దైవములు" అనే పదం కనిపిస్తుంది. మూల భాష హీబ్రూలో చూసినట్లయితే, "ఎలోహీమ్" అనే పదాన్ని బహువచన రూపంలో వాడారు. ఆరవ వచనం చూసినట్లయితే, "మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. (కీర్తనల గ్రంథము 82:6)" అని ఉంటుంది. సర్వోన్నతుడైన దేవుడు ఒక్కడే. కాబట్టి వీళ్ళు "దేవుని కుమారులు". 82వ కీర్తన మొదటి వచనంలోనూ అలాగే 82వ కీర్తన ఆరవ వచనంలోనూ దేవుని కుమారులను ఉద్దేశించి "ఎలోహీమ్" అనే పదాన్ని వాడారు. కాబట్టి ఇక్కడ "దేవుని సమాజము" లేదా "పరిశుద్ధదూతల సభ" - The Divine Counsel, దేవునితో పాటు దేవుని కుమారులు, దేవదూతలు ఈ సభలో ఉండటాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ "ఎలోహీమ్" అంటే spiritual world లో ఉండే ఒక spirit being అని అర్థం.

మనం సాధారణంగా "దేవుడు" అనే పదాన్ని చూసినప్పుడు మన brain ఎలా tune అయ్యుంటుంది అంటే, దేవుడు అనగానే అది కొన్ని specific set of unique attributes అంటే, కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన వ్యక్తి గురించి చెబుతుంది అని మనం అనుకుంటాం. సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికర్త, అద్వితీయుడు అయిన యెహోవాను మాత్రమే మనం దేవుడు అని అంటాం. కానీ బైబిల్ రచయితలు "ఎలోహీమ్" అనే పదాన్ని ఈ విధంగా వాడలేదు. ఆ విషయం మనకి ఎలా తెలుసంటే, వాళ్ళు "ఎలోహీమ్" అనే పదాన్ని కేవలం యెహోవాను ఉద్దేశించి మాత్రమే కాకుండా ఇంకా వేరే వాళ్ళను ఉద్దేశించి కూడా ఈ పదాన్ని వాడారు. కాబట్టి బైబిల్ రచయితలు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు లేదా కొన్ని unique set of attributes ని దృష్టిలో ఉంచుకొని "ఎలోహీమ్" అనే పదాన్ని వాడలేదు. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో కర్ణ పిశాచముగల స్త్రీ, ఆమె ఊహించని విధంగా అక్కడికి చనిపోయిన సమూయేలు ఆత్మ వచ్చినప్పుడు, "ఆమె దేవతలలో ఒకడు భూమిలోనుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను (మొదటి సమూయేలు 28:13)" అని అంటుంది. ఇక్కడ మూల భాష హీబ్రూలో "ఎలోహీమ్" అనే పదాన్ని వాడారు. ఖచ్చితంగా, చనిపోయిన వాళ్ళు ఇశ్రాయేలీయుల దేవుడితో సమానమైన వారు కాదు. చనిపోయిన వారి అమ్మానాన్నలు లేదా వారి అత్తమామలు, యెహోవాతో సమానమైన వారు అని, లేదా యెహోవాకు ఉన్న లక్షణాలే వీరికీ ఉంటాయి అని కానీ ఇశ్రాయేలీయులు ఎవరూ కూడా అనుకోరు. అన్య దేవతలను ఉద్దేశించి కూడా బైబిల్ లో "ఎలోహీమ్" అనే పదాన్నే వాడారు. అన్య దేవతలకు మరియు యెహోవాకు మధ్య తేడా ఏమీ లేదు, అంతా సమానమే అని బైబిల్ రచయితలు అనుకున్నారా? ఖచ్చితంగా కాదు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 17వ వచనంలో "షేదీమ్ (שֵּדִם)" అనే ఒక పదం కనిపిస్తుంది. ఈ పదాన్ని దెయ్యములు అని తర్జుమా చేస్తారు. ఇక్కడ దెయ్యములను ఉద్దేశించి కూడా "ఎలోహీమ్" అనే పదాన్ని వాడారు.

వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి.
יזבחו לשדים לא אלה אלהים לא ידעום חדשים מקרב באו לא שערום אבתיכם

హీబ్రూ బైబిల్ లో కేవలం యెహోవాను ఉద్దేశించి మాత్రమే కాకుండా ఇంకా వేరే వాటికి కూడా ఎలోహీమ్ అనే పదాన్ని వాడారు. ఈ పదాన్ని వాడినప్పుడు బైబిల్ రచయితలు ప్రత్యేకమైన లక్షణాల గురించి ఆలోచించడం లేదు. మనకి కనిపించని Spiritual world లో ఉన్న spiritual beings ని ఉద్దేశించి ఈ పదాన్ని వాడారు. Spiritual World లో చాలా మంది ఎలోహీమ్ ఉన్నారు. కానీ వారిలో కేవలం ఒక్క ఎలోహీమ్ మాత్రమే యెహోవా. ఈ అందరిలోనూ యెహోవా చాలా ప్రత్యేకమైనవాడు అని మనకి ఏ విధంగా తెలియచేయబడ్డాడు? ఎలోహీమ్ అనే పదం ద్వారా కాదు. ఆయన ఎవరు? ఆయనకున్న లక్షణాలు ఏమిటి? ఇలాంటి వాటి ద్వారా యెహోవా చాలా ప్రత్యేకమైనవాడు అని మనకి తెలుస్తుంది. యెహోవా సార్వభౌమత్వం కలిగినవాడు. ఆయన సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, ఆయన మాత్రమే సమస్తమును సృష్టించిన సృష్టికర్త. ఇలాంటి లక్షణాలు మరే ఇతర ఎలోహీమ్ కి కూడా లేవు. యెహోవా అద్వితీయుడు. యెహోవా లాంటివాడు ఇంకెవరూ లేరు.

అదే విధంగా Angel అనే పదాన్ని చూడగానే మనం ఎలా ఆలోచిస్తాము అంటే, వాళ్ళు దేవునిచే సృష్టింపబడిన వారనీ, వాళ్లకి రెక్కలుంటాయనీ, ఆ రెక్కలతో వాళ్ళు ఎగురుతూ ఉంటారనీ, ఎప్పుడూ దేవుడిని స్తుతిస్తూ ఉంటారనీ, దేవుని ఆజ్ఞలకు లోబడి పని చేస్తూ ఉంటారనీ... ఇలా రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటాం. అసలు కొంతమంది అయితే, Angel అనగానే వాళ్ళని ఆడవాళ్ళగా చిత్రీకరిస్తారు. కొంతమంది ఆడవాళ్లను చూడగానే మీరు Angel లాగా ఉన్నారు అని తెగ పొగుడుతూ ఉంటారు. అలా పోల్చడానికి వీళ్ళు Angels ని ఎప్పుడు చూశారో మనకి తెలీదు కానీ, నాకు తెలిసినంతవరకూ బైబిల్ లో ఆడ దేవదూతలు లేరు. సరే, ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే, "మలాక్" అనే హీబ్రూ పదానికి literal meaning ఏంటంటే, A Messenger - ఒక వర్తమానాన్ని లేదా ఒక message ని అందివ్వడం కోసం వచ్చిన ఒక దూత. "మలాక్" అనే పదం ఒక వ్యక్తి చేస్తున్న ఒక పనిని వర్ణించడానికి ఉపయోగించే పదమే కానీ, ఆ పని చేస్తున్న వ్యక్తి గురించి, అతని స్వభావం గురించి, అతని గుణగణాల గురించి, అతని శక్తిసామర్ధ్యాల గురించి, అతని పుట్టుపూర్వోత్తరాల గురించి వర్ణించడానికి ఉపయోగించిన పదం కాదు. అయితే కొన్ని పదాలు కాలక్రమంలో వాటికున్న విస్తృతార్ధాన్ని కోల్పోయి narrow down అయ్యి ఒక కొత్త అర్ధాన్ని సంతరించుకుంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఇక్కడ నేను చెబుతున్నది ఏంటంటే, ప్రస్తుతం Angel అనే పదాన్ని మనం ఏ అర్ధంలో అయితే వాడుతున్నామో, ఆ మాటకొస్తే Second Temple Period లో యూదులు "మలాక్" అనే పదాన్ని ఏ విధంగా అయితే వాడారో, దానికీ యాకోబు కాలంలో ఈ పదాన్ని వాడిన విధానానికీ వ్యత్యాసం ఉంది. ఆ తేడాను మనం గ్రహించగలిగితే అప్పుడు యాకోబు ఆ విధంగా ఎందుకు ప్రార్ధన చేశాడు అనే విషయం మనకి అర్ధం అవుతుంది.

కాబట్టి దేవుని సమాజంలో దేవుడు నిలచియుండటం, అలాగే తోరాహ్ లో దేవుడు స్వయంగా ఒక ప్రత్యేకమైన దూతను పంపించడం, ఆ దూత ఒక మానవ రూపంలో మనుషులకు కనిపించడం, అంతేకాకుండా ఆ దూత దేవుడు కూడా అయ్యుండటం, కొన్ని సార్లు యెహోవాతో సమానమైనవాడిగానూ కొన్ని సార్లు యెహోవాగా కూడా గుర్తింపబడటం... ఈ విషయాలన్నీ కూడా యెషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేస్తున్న అనువాదకుడి మనస్సులో ఉంటే, అప్పుడు అతను ఉపయోగించిన వ్రాతప్రతిలో Masoretic Text లో ఉన్నట్లుగానే ఉన్నా, లేక వేరే different version ఉన్నా... ఏదిఏమైనా కూడా ఈ రెండిటి భావము ఒక్కటే అవుతుంది. అతను ఉపయోగించిన వ్రాతప్రతిలో Masoretic Text లో ఉన్నట్లుగానే ఉందా, లేక వేరే ఇంకేమైనా ఉందా అనేది పెద్ద విషయమేమీ కాదు. దేవుని గురించి, అలాగే దైవత్వంలో ఉన్న బహుళత్వం గురించి వారి Theology ఏంటి అనేది ఇక్కడ చాలా కీలకం. ఇక్కడ దేవుడు మనిషిలా రావడం గురించి ఉంది. ఇటువంటిదే "తోరాహ్" లో యెహోవా దూత గురించి చూస్తాం. పాత నిబంధనలో కనిపించిన యెహోవా దూత, మానవ రూపంలో ఉన్న యెహోవా అని నమ్మితే తప్ప, Septuagint లో యెషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం ఆ విధంగా ఎందుకుంది అనే విషయాన్ని వివరించలేము.

ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవచ్చు. అదేమిటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ concept ని క్రొత్త నిబంధనలో ఎక్కడైనా వాడారా? అవును వాడారు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించి వాగ్దాన భూమికి నడిపించింది యేసు క్రీస్తు అని యూదా అంటాడు (ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించి - యూదా 5). మనం already ఇంతకుముందు చూశాం, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించి వాగ్దాన భూమికి నడిపించింది యెహోవా దూత అని పాత నిబంధనలో కనిపిస్తుంది. అలాగే యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో “యెహోవా వాక్కు” కనిపిస్తుంది. కొంతమంది ఏమంటారంటే, యోహాను ప్లేటోనిక్ ఫిలోసోఫీకీ మరియు Gnostic Community యొక్క ప్రభావానికి లోనయ్యాడు, అలాగే గ్రీకు తత్వవేత్తలకి "లోగోస్" అంటే ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది, యోహాను తన సువార్తను అన్యులకు రాస్తున్నాడు, గ్రీకులకు రాస్తున్నాడు, కాబట్టి వాళ్లకి అర్ధమయ్యేలాగా యేసుక్రీస్తును "లోగోస్ - వాక్యముగా" పరిచయం చేశాడు అని కొంతమంది అంటారు. కానీ అది నిజం కాదు. యోహానుకి తన హీబ్రూ లేఖనాలలో ఏముందో చాలా స్పష్టంగా తెలుసు. యిర్మియా మొదటి అధ్యాయంలో యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమవుతాడు. వాక్కు అంటే కేవలం స్వరం వినపడటం అనుకోకండి. స్వరం అయితే కేవలం వినిపిస్తుంది. కానీ ఇక్కడ యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్ష మాయెను (యిర్మియా 1:2). ఈ యెహోవా వాక్కును యిర్మియా యెహోవా అని పిలుస్తాడు. (అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము - యిర్మియా 1:6). అంతేకాదు, ఇక్కడ యెహోవా తన చేయి చాపి యిర్మియా నోటిని ముట్టుకుంటాడు. మానవ రూపంలో కనిపించి, యిర్మియాతో మాట్లాడి, యిర్మియా నోటిని ముట్టుకున్న దేవుడిని ఉద్దేశించి ఇక్కడ “యెహోవా వాక్కు” అని పిలవడం జరిగింది. ఇటువంటిదే మొదటి సమూయేలు గ్రంథం మూడవ అధ్యాయంలో చూస్తాం. ఇంకా చాలా వాక్యభాగాలలో కూడా “యెహోవా వాక్కు” మానవ రూపంలో ప్రత్యక్షమవ్వడాన్ని మనం చూస్తాం. కాబట్టి యోహాను, "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను" అని అన్నప్పుడు, ఇది చదివిన యూదులకి యోహాను ఏమి చెబుతున్నాడు అనేది స్పష్టంగానే అర్ధమవుతుంది.

యెహోవా వాక్కు, యెహోవా దూత, who are again identified as Yehovah himself, ఇటువంటి concepts ని యూదులు అప్పటికే తమ హీబ్రూ లేఖనాలలో చూశారు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే యెషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని గ్రీకు భాషలోకి అనువదిస్తున్న అనువాదకుడు ఉపయోగించిన హీబ్రూ లేఖనాలలో, ఒకవేళ ఆరవ వచనం Masoretic Text లో ఉన్నట్లుగానే ఉండి, అనువాదకుడు తన interpretation ని తర్జుమాలోకి చొప్పించి ఉంటే గనుక, you can see how he can connect these dots. ఆశ్చర్యకరమైన కార్యములకు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి... ఇలాంటి పదాలను చూస్తూ, దేవుడే స్వయంగా ఒక మానవ రూపంలో ఒక శిశువుగా ఈ భూమి మీదకు వస్తున్నాడు అనేదాని గురించి ఆలోచన చేసినప్పుడు, you can connect those dots. అయితే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇక్కడ మరొక possibility కూడా ఉంది. యెషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని గ్రీకు భాషలోకి అనువదిస్తున్న అనువాదకుడు ఉపయోగించిన హీబ్రూ లేఖనాలలో, ఒకవేళ ఈ ఆరవ వచనం Masoretic Text లో ఉన్నట్లుగా కాకుండా ఒకవేళ భిన్నంగా ఉండి ఉంటే గనుక, అది కూడా ఆసక్తికరమైనదే. ఎందుకంటే, యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని తిరస్కరించడానికి బహుశా యూదులు ఈ వచనాన్ని Masoretic Text లో తమకి అనుకూలంగా మార్చి ఉండి ఉండవచ్చు. మీరు Jewish commentaries చూస్తే గనుక వాళ్ళు ఈ వచనాన్ని చాలా different గా interpret చేస్తారు. క్రైస్తవులు యేసు క్రీస్తును, తండ్రి కుమార పరిశుద్దాత్మల్లో "కుమారుడు" అని అంటారు. కానీ ఇక్కడ నిత్యుడగు తండ్రి అని ఉంది కాబట్టి, ఈ వచనం యేసు క్రీస్తు గురించి కాదు అని వాళ్ళు చాలా తేలిగ్గా వాదించడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి Greek Septuagint ని ఆధారం చేసుకుని ఈ వచనాన్ని మనం లోతుగా విశ్లేషించినప్పుడు యేసు క్రీస్తు యొక్క దైవత్వం గురించి అలాగే Second Temple Period లో plurality in Godhead అనే అంశంలో Jewish Theology ఎలా ఉండేది అనే విషయాలు మనకి చాలా బాగా అర్థం అవుతాయి.

 

Add comment

Security code
Refresh

Comments  

# Good sirJoseph 2020-11-10 15:49
Good explain sir do more
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.