విమర్శలకు జవాబు

రచయిత: Marie Prasanth Perikala
చదవడానికి పట్టే సమయం: 1 గంట 21 నిమిషాలు

 

అబ్రాహాముకి తండ్రి అయిన తెరహు ఎన్ని సంవత్సరాలు జీవించాడు అనే విషయాన్ని ఈ రోజు మనం పరిశీలిద్దాం. నిజానికి తెరహు ఎన్ని సంవత్సరాలు జీవించాడు అనే విషయం అంత ప్రాముఖ్యమైన అంశం ఏమీ కాదు. కానీ ఇది బైబిల్ లో ఒక contradiction లాగా కనిపిస్తుంది కాబట్టి చాలా మందికి ఈ విషయంలో తప్పకుండా కొన్ని సందేహాలు ఉంటాయి. ఈ ఆర్టికల్ లో ఆ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం.

ముందుగా అసలు ఈ విషయంలో ఉన్న సమస్య ఏమిటో చూద్దాం.

"తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను." అని ఆదికాండం 11వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. అంటే అబ్రహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు 70 సంవత్సరాలు అని సాధారణంగా ఈ వచనాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు.

ఆ తరువాత 32వ వచనంలో "తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను." అని ఉంటుంది. అంటే ఈ వచనం ప్రకారం తెరహు చనిపోయే సమయానికి అబ్రాహాము వయస్సు బహుశా 135 సంవత్సరాలు అయ్యుండాలి.

ఆ తరువాత 12వ అధ్యాయం 4వ వచనంలో "అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు." అని ఉంటుంది.

ఇక్కడి వరకు ఎలాంటి సమస్యాలేదు. ఈ వాక్యభాగాన్ని ఎలా అర్ధం చేసుకోవచ్చు అంటే, అబ్రాహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు 70 సంవత్సరాలు. అబ్రాహాము హారానునుండి బయలుదేరినప్పుడు అబ్రాహాము వయస్సు 75 సంవత్సరాలు. అంటే అప్పటికి తెరహు వయస్సు 145 సంవత్సరాలు. ఆ తరువాత కూడా తెరహు మరో 60 సంవత్సరాలు బ్రతికి 205 సంవత్సరాల వయస్సులో మరణించాడు. Jewish Study Bible లో ఉన్న వ్యాఖ్యానాన్ని పరిశీలిస్తే, Traditional గా యూదులు కూడా ఇలాగే interpret చేసేవారు అని మనకు అర్ధం అవుతుంది.

అయితే అసలు సమస్య ఎక్కడ వస్తుంది అంటే, క్రొత్త నిబంధనలో అపొ. కార్యములు 7వ అధ్యాయం 4వ వచనంలో స్తెఫను Sanhedrin లో ప్రధాన యాజకుడి ముందు అబ్రాహాము గురించి మాట్లాడుతూ "అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొనివచ్చెను" అని అంటాడు. స్తెఫను మాట్లాడిన ఈ మాటలను బట్టి మనకు ఇక్కడ contradiction ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే స్తెఫను చెప్పినదాని ప్రకారం అబ్రాహాము తన తండ్రి చనిపోయిన తరువాత  హారాను నుండి బయలుదేరాడు. కానీ పాత నిబంధనలో ఉన్న వివరాల ప్రకారం అప్పటికి తెరహు వయస్సు కేవలం 145 సంవత్సరాలు మాత్రమే. అంటే స్తెఫను చెప్పిన దాని ప్రకారం తెరహు 145 సంవత్సరాలకి మరణిస్తే, పాత నిబంధన ప్రకారం తెరహు జీవించిన కాలం 205 సంవత్సరాలు.

దీన్ని చూపించి బైబిల్ లో contradiction ఉంది అని నాస్తికులు మరియు క్రైస్తవేతరులు అంటారు. అసలు క్రొత్త నిబంధన రాసిన వాళ్లకి హీబ్రూ బైబిల్ లోని విషయాలు సరిగ్గా తెలియవు అని, అందుకే క్రొత్త నిబంధనలో ఇలా తప్పులు రాసుకున్నారు అని యూదులు అంటారు. మరి దీన్ని ఎలా పరిష్కరించాలి?

ఒక possibility ఏంటంటే, బహుశా స్తెఫను హీబ్రూ scriptures ని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. అబ్రాహాము హారానును విడిచి కనాను దేశానికి పయనమయ్యే సమయానికి తెరహు ఇంకా జీవించే ఉన్నప్పటికీ, అతను చనిపోయాకే అబ్రాహాము అక్కడి నుండి బయలుదేరాడు అని స్తెఫను తప్పుగా అర్థం చేసుకున్నాడేమో అని కొంతమంది అభిప్రాయపడతారు. స్తెఫను sanhedrin లో మాట్లాడిన మాటలను లూకా యధాతథంగా నమోదు చేసాడే కానీ దీనిని inspired text లాగా తీసుకోవాల్సిన అవసరం లేదనీ, దీనిని స్తెఫను పొరబడి మాట్లాడిన మాటలుగానే చూడాలి కానీ దీనిని ఒక contradiction లాగా చూడాల్సిన అవసరం లేదు అనేది వీరి భావన. అయితే ఈ వివరణ అంత convincing గా అనిపించదు. 70+75 కలిపితే 145. 205 కంటే 145 చాలా తక్కువ. ఎవరైనా ఈ విషయాన్ని చాలా తేలిగ్గానే గ్రహించగలరు. మరి స్తెఫను ఎలా పొరబడ్డాడు? ఇక్కడ మరొక సమస్య కూడా ఉంది. అదేమిటంటే, ఆదికాండము 11వ అధ్యాయం 31వ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అసలు తెరహు కనాను వెళ్ళడానికే తన కుటుంబం మొత్తాన్నీ తీసుకుని కల్దీయుల ఊరు అనే పట్టణములో నుండి తన ప్రయాణాన్ని మొదలు పెట్టినట్లుగా మనం చూస్తాం. అయితే మధ్యలో కొంత కాలం వారు హారానులో జీవించారు. అబ్రాహాము హారాను విడిచి వెళ్ళిపోయినప్పటికీ మరో అరవై సంవత్సరాల పాటు తాను మరణించేవరకు కూడా తెరహు హారానులోనే ఎందుకు ఉన్నాడు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఈ option అనేది least possible అని అయితే మనం చెప్పొచ్చు.

మరికొంతమంది ఏమంటారంటే అసలు అబ్రాహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు 70 సంవత్సరాలు అనే ఎందుకు అనుకోవాలి? అతని వయస్సు అప్పటికి 130 సంవత్సరాలు అయ్యుండొచ్చు కదా అని కొంతమంది అభిప్రాయపడతారు. వీరు ఇలా అభిప్రాయపడటానికి కారణం ఏంటంటే "తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను." అని ఆదికాండం 11వ అధ్యాయం 26వ వచనంలో ఉంది. దీనిని traditional way లో అర్థం చేసుకుంటే అబ్రాహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు 70 సంవత్సరాలు. అంటే ఓకే సంవత్సరంలో ముగ్గురిని కన్నాడు అని కాదు కానీ, ఆదికాండము 5వ అధ్యాయంలోనూ అలాగే ఆదికాండము 11వ అధ్యాయంలోనూ ఉన్న pattern ని మనం follow అయితే తెరహు తన 70య్యో సంవత్సరంలో అబ్రాహామును కనెను అనేది traditional way of understanding. కానీ కొంతమంది ఏమాటారంటే ఈ వాక్యాన్ని అలా అర్థం చేసుకోకూడదు కానీ, తెరహు 70 యేళ్లు బ్రతికిన తరువాత అప్పుడు పిల్లల్ని కనడం మొదలుపెట్టాడు అని, కాబట్టి బహుశా తెరహు కి 130 సంవత్సరాల వయసున్నప్పుడు అబ్రాహాము జన్మించుంటాడు అనేది వీరి అభిప్రాయం. వీరు చెప్పిందే కరెక్ట్ అయితే కనుక బైబిల్ లో contradiction ఏమీ ఉండదు. తెరహుకి 130 సంవత్సరాల వయసున్నప్పుడు అబ్రాహాము పుట్టాడు. అబ్రాహాముకి 75 సంవత్సరాల వయసున్నప్పుడు అంటే అప్పటికి తెరహుకి 205 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు తెరహు మరణించాడు. ఆ తరువాత అదే సంవత్సరం అబ్రాహాము హారానుని విడిచి కనాను దేశానికి ప్రయాణమయ్యాడు అని మనం భావించాల్సి ఉంటుంది. అంతా చక్కగా సరిపోతుంది. అయితే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య ఏమిటంటే, తెరహుకి 130 సంవత్సరాల వయస్సులో అబ్రాహాము జన్మించి ఉంటే, అప్పుడు అబ్రాహాముకి వందేళ్ల వయస్సులో ఇస్సాకు జన్మించడం పెద్ద విషయమేమీ కాదు. ఇప్పుడు కాకపొతే కొన్ని సంవత్సరాల తరువాత అయినా నాకు పిల్లలు పుడతారు అని అబ్రాహాము ధైర్యంగా ఉండేవాడు. కానీ అబ్రాహాము దానికి భిన్నంగా నాకు ఇక పిల్లలు పుట్టరు అని ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. శారాను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేస్తాను అని దేవుడే స్వయంగా చెప్పినప్పుడు అబ్రాహాము నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా? అని మనస్సులో అనుకుంటాడు (ఆదికాండము 17:16-17). మరొక సమస్య ఏంటంటే అసలు తెరహు చనిపోయిన తరువాతే అబ్రాహాము హారాను విడిచి కనాను వెళ్ళాడు అని పాత నిబంధనలో ఎక్కడా లేదు కదా. మరి స్తెఫను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు? అతని దగ్గర ఉన్న ఆధారమేమిటి? What was his source? తెరహు చనిపోయినప్పుడు అబ్రాహాము యొక్క వయస్సు, అలాగే హారాను విడిచిపెట్టినప్పుడు అబ్రాహాము యొక్క వయస్సు ఈ రెండూ కూడా ఒక్కటే అని ఖచ్చితంగా నిర్ధారించుకోగలిగినప్పుడే, తెరహు చనిపోయిన తరువాత అబ్రాహాము హారాను విడిచి వెళ్ళాడు అని మనం ఖచ్చితంగా చెప్పగలము. మరి స్తెఫను అలా ఎలా నిర్ధారించుకోగలిగాడు? తెరహు చనిపోయిన తరువాత అబ్రహాము కనాను దేశానికి వెళ్ళాడు అని స్తెఫను చెప్పాడు కాబట్టి, దాన్ని ఆధారంగా చేసుకుని అబ్రహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు 130 సంవత్సరాలు అయ్యుంటుంది అని మనం అనుకుంటున్నామే కానీ, నిజానికి స్తెఫను కూడా అదే అభిప్రాయం కలిగి ఉన్నాడా అనేదే ప్రశ్న. ఒక వేళ స్తెఫను నిజంగా అదే ఉద్దేశంతో చెప్పి ఉంటే కనుక, అతనికి ఆ సమాచారం ఎక్కడ నుండి వచ్చింది? అబ్రహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు 130 సంవత్సరాలు అని స్తెఫనుకి ఎలా తెలిసింది? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి.

ఇక మూడవ possibility ఏంటంటే తెరహు 205 సంవత్సరాలు కాదు కానీ అతను కేవలం 145 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉండి ఉంటాడు. తెరహుకి 70 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రాహాము జన్మించాడు అబ్రాహామునకు 75 సంవత్సరాలు వచ్చేటప్పటికి అంటే తెరహు 145 సంవత్సరాల వయస్సులో మరణించాడు అబ్రాహాము అదే సంవత్సరం హారాను విడిచి కనాను దేశానికి ప్రయాణమయ్యాడు. దీని ప్రకారం చూస్తే స్తెఫను కరెక్టుగానే చెప్పాడు. అతనేమీ పొరబడలేదు. ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న హీబ్రూ manuscripts లోనే బహుశా తప్పు ఉండి ఉంటుంది. తెరహు 145 సంవత్సరాలు మాత్రమే జీవించాడు అనేదే correct reading అయ్యుంటుంది అనేదే నా అభిప్రాయం కూడా. దీనికి సంబంధించి మనకి ఉన్న ఆధారాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

Original autographs లో ఆదికాండము 11వ అధ్యాయం 32వ వచనంలో తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు అని ఉందా లేక నూట నలభై యైదేండ్లు అని ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం ముఖ్యంగా ten different sources ని పరిశీలించవచ్చు.

 1. Hebrew Masoretic text
 2. Greek Septuagint
 3. Samaritan Pentateuch
 4. New Testament
 5. The Antiquities of the Jews
 6. The Works of Philo Judaeus
 7. Midrash
 8. Jerome’s Commentary
 9. The Book of Jubilees
 10. Dead Sea scrolls

అయితే అందరూ గుర్తుపెట్టుకోవలసిన ఒక విషయం ఏంటంటే మన దగ్గర దేనికీ కూడా Original Autographs అనేవి లేవు. మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నవన్నీ కూడా కేవలం manuscripts మాత్రమే. రచయిత స్వయంగా రాసిన ప్రతిని Original Autograph అంటారు. అలా కాకుండా అప్పటికే ఉన్న ఒక వ్రాతప్రతిని చూసి మరొక వ్రాతప్రతిని తయారు చేస్తే దానిని manuscript అంటారు. ఇలా manuscripts ని రాసే క్రమంలో scribes కొన్నిసార్లు పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. లేదా కొన్నిసార్లు అక్కడ ఉన్నది కరెక్టే అయినప్పటికీ అది తప్పేమో అని వాళ్ళు భావించినప్పుడు వాటిని కొద్దిగా మార్చి రాసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి variations అన్నిటినీ ఒక పద్దతి ప్రకారం అధ్యయనం చేసి original reading ఏంటి అని తెలుసుకునే ప్రక్రియను Textual Criticism అంటారు. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే బైబిల్ కి సంబంధించినంత వరకు, Original Autographs ని మాత్రమే మనం inspired text అంటాం. వాటిల్లో ఎలాంటి వైరుధ్యాలు ఉండవు. ఎలాంటి తప్పులూ ఉండవు. కానీ, manuscripts లో తప్పులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా మనసులో ఉంచుకోండి. సరే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న ten different sources ని కొద్దిగా పరిశీలిద్దాం.

Masoretic Text:

Masoretic text లో ఏముందో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మన బైబిల్స్ అన్నీ కూడా Masoretic text నుండే తర్జుమా చేయబడ్డాయి. Masoretic Text కి సంబంధించి ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నవి సుమారు క్రీస్తు శకం పదవ శతాబ్దానికి చెందిన manuscripts. Masoretic text ప్రకారం,

తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.(ఆదికాండం 11:26)

తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను. (ఆదికాండం 11:31-32)

అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు. (ఆదికాండం 12:4)

Greek Septuagint:

ఇప్పుడు మనం Greek Septuagint లో ఏముందో చూద్దాం. సుమారు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో హీబ్రూ భాషలో ఉన్న లేఖనాలను గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. దీనినే Greek Septuagint అని అంటారు. ఇది original గా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే రాసినప్పటికీ, మరీ అంత ప్రాచీన కాలానికి చెందిన వ్రాతప్రతులేవీ కూడా ప్రస్తుతం మనకి అందుబాటులో లేవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న Greek Septuagint manuscripts లో మూడు manuscripts చాలా ప్రధానమైనవి. ఒకటి Codex Vaticanus - ఇది క్రీస్తు శకం నాలుగవ శతాబ్దానికి చెందినది. రెండవది Codex Sinaiticus - ఇది కూడా క్రీస్తు శకం నాలుగవ శతాబ్దానికి చెందినదే. ఇక మూడవది Codex Alexandrinus - ఇది క్రీస్తు శకం అయిదవ శతాబ్దానికి చెందినది. Greek Septuagint ప్రకారం,

తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.(ఆదికాండం 11:26)
And Tharrha lived seventy years, and begot Abram, and Nachor, and Arrhan.

తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల దేశము నుండి బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించాడు. తెరహు హారానులో బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను. (ఆదికాండం 11:31-32)
And Tharrha took Abram his son, and Lot the son of Arrhan, the son of his son, and Sara his daughter-in-law, the wife of Abram his son, and led them forth out of the land of the Chaldees, to go into the land of Chanaan, and they came as far as Charrhan, and he dwelt there. And all the days of Tharrha in the land of Charrhan were two hundred and five years, and Tharrha died in Charrhan.

అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు. (ఆదికాండం 12:4)
Abram was seventy-five years old, when he went out of Charrhan.

మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే Masoretic text తో compare చేసినప్పుడు Greek Septuagint లో చిన్న variation ఉంది. అదేమిటంటే, Masoretic text ప్రకారం తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. కానీ Greek Septuagint ప్రకారం తెరహు హారానులో బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. హారాను పట్టణానికి రాకముందు "ఊరు" అనే పట్టణంలో తెరహు ఎన్ని సంవత్సరాలు జీవించాడో మనకు తెలీదు కాబట్టి Greek Septuagint ప్రకారం అసలు తెరహు మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో కూడా మనకు తెలీదు. ఏ విధంగా చూసినా కూడా Greek Septuagint manuscripts లో ఉన్న ఈ వచనంలో ఖచ్చితంగా తప్పు ఉంది అని అయితే మనకి స్పష్టంగా అర్ధం అవుతుంది.

Samaritan Pentateuch:

సరే ఇక Samaritan Pentateuch లో ఏముందో ఇప్పుడు చూద్దాం. అసలు Samaritan Pentateuch ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చా అనే సందేహం కొంతమందికి కలుగవచ్చు. అందువల్ల ముందుగా Samaritan Pentateuch గురించి క్లుప్తంగా కొన్ని వివరాలు చూద్దాం. Samaritan Pentateuch ని Samaritan Torah అని కూడా అంటారు. ఇందులో కేవలం మోషే రాసిన పంచకాండాలే ఉంటాయి. కేవలం ఆ అయిదు పుస్తకాలు మాత్రమే దేవుని వాక్యం అని సమరయులు నమ్ముతారు. ఈ సమరయులు కూడా ఇశ్రాయేలీయులే. నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేసి కొంతమంది యూదులను తన చెరలోనికి తీసుకుని వెళ్లాడు. ఇది అందరికీ తెలిసిందే. అయితే అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ చెరలోకి వెళ్ళలేదు. కొంతమంది ఇశ్రాయేలు దేశంలోనే జీవించారు. వీరే తరువాతి కాలంలో సమరయులు అని పిలువబడ్డారు. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన యూదులు వీరితో కలవడానికి ఇష్టపడలేదు. సమరయులు అన్యులతో కలిసిపోయారని కాబట్టి వాళ్ళు తమతో సమానమైన వారు కాదనీ, మొదలయిన కారణాలు చెప్పి యూదులు సమరయులను దూరం పెట్టారు. వీరు సమరయ అనే ప్రదేశంలో జీవించేవారు కాబట్టి వీళ్ళను సమరయులు అని పిలిచేవారు. సమరయులకి మరియు మిగతా యూదులకి మధ్య theological గా కొన్ని విభేదాలు ఉన్నాయి. అందుకని సమరయులు ఏమి చేశారంటే క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో అప్పటికి అందుబాటులో ఉన్న హీబ్రూ లేఖనాలను తీసుకుని వాళ్లకి అనుకూలంగా కొన్ని మార్పులు చేసుకున్నారు. అయితే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిన మార్పులను మనం తేలికగానే గుర్తించవచ్చు. ఉదాహరణకు యూదులు యెరూషలేము దేవాలయములో దేవుడిని ఆరాధిస్తూ ఉంటే, సమరయులు Mount Gerizim అనే పర్వతం మీద ఒక దేవాలయాన్ని నిర్మించుకుని అక్కడ దేవుడిని ఆరాధిస్తూ ఉండేవారు. కాబట్టి దాన్ని సమర్ధించుకోవడానికి వాళ్ళు ఏమి చేశారంటే, "మీరు కనాను దేశంలోకి ప్రవేశించినప్పుడు Gerizim అనే పర్వతం మీద ఒక బలిపీఠాన్ని నిర్మించాలి" అని దేవుడు ఆదేశించినట్లుగా వాళ్లంతట వాళ్ళే ఒక ఆజ్ఞను రాసుకుని, దానిని పది ఆజ్ఞల్లో కలిపేశారు. నిర్గమకాండం ఇరవయ్యో అధ్యాయం పదిహేడవ వచనాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ మీరు Masoretic Text లో ఉన్న వాక్యాన్ని, అలాగే దాని కింద Samaritan Pentateuch లో ఉన్న వాక్యాన్ని కూడా చూడొచ్చు.

Masoretic Text:
"You shall not covet your neighbor's house; you shall not covet your neighbor's wife, nor his male servant, nor his female servant, nor his ox, nor his donkey, nor anything that is your neighbor's." (Exodus 20:17)

Samaritan Pentateuch:
Thou shalt not covet thy neighbour's house, and not thou shalt not covet thy neighbour's wife, nor his field, nor his manservant, nor his maidservant, nor his ox, nor his ass, nor any thing that is thy neighbour's. And when it so happens that LORD God brings you to the land of Caanan, which you are coming to posses, you shall set-up there for you great stones and plaster them with plaster and you write on the stones all words of this law. And it becomes for you that across the Jordan you shall raise these stones, which I command you today, in mountain Grizim. And you build there the altar to the LORD God of you. Altar of stones. Not you shall wave on them iron. With whole stones you shall build the altar to LORD God of you. And you bring on it ascend offerings to LORD God of you, and you sacrifice peace offerings, and you eat there and you rejoice before the face of the LORD God of you. The mountain this is across the Jordan behind the way of the rising of the sun, in the land of Caanan who is dwelling in the desert before the Galgal, beside Alvin-Mara, before Sechem. (Exodus 20:17)

Masoretic Text లో ఏముంటుందంటే, "నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు" అని దేవుడు చెబుతాడు, దానితో పది ఆజ్ఞలు అయిపోతాయి. కానీ Samaritan Pentateuch లో దీనికి కొనసాగింపుగా "దేవుడైన యెహోవా మిమ్మల్ని కనాను దేశంలోకి తీసుకువెళ్లిన తరువాత అక్కడ Gerizim అనే పర్వతం మీద ఇనుము వాడకుండా కేవలం రాళ్లతో ఒక బలిపీఠాన్ని నిర్మించి, ఆ రాళ్ళ మీద ఈ ఆజ్ఞలన్నిటిని రాయాలి" అని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా రాసుకున్నారు. ఇలాంటివి Samaritan Pentateuch లో చాలా కనిపిస్తాయి.

Gerizim అనే పర్వతం షెకెము అనే పట్టణ పరిసరప్రాంతంలో ఉంటుంది. ఆదికాండము 12వ అధ్యాయంలో ఉన్న వివరాల ప్రకారం అబ్రాహాము హారాను నుండి బయలుదేరి కనాను దేశానికి వచ్చినప్పుడు అతను మొట్టమొదటిగా షెకెము అనే ప్రాంతానికే చేరుకుంటాడు. అక్కడ యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు.

అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారముచేసి మోరే దగ్గరనున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయినీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. (ఆదికాండము 12:6-7)

అలాగే ఆదికాండము 33వ అధ్యాయం ప్రకారం యాకోబు కూడా షెకెములో ఒక బలిపీఠాన్ని కట్టి దానికి "ఎల్ ఎలోహే ఇశ్రాయేల్" అని పేరు పెట్టాడు.

అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. (ఆదికాండము 33:18-20)

అందువలన ప్రాచీన కాలంలో షెకెము అనే ప్రాంతానికి చాలా ప్రాధాన్యం ఉండేది. యాకోబు బావి కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ బావి దగ్గర యేసు క్రీస్తు ఒక సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భాన్ని మనం యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో చూస్తాం. వాళ్లిద్దరి మాటల మధ్యలో ఆ సమరయ స్త్రీ ఇలా అంటుంది, 

"మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతారు కదా" అని ఆమె యేసు క్రీస్తుని ప్రశ్నిస్తుంది (యోహాను సువార్త 4:20). Gerizim అనే పర్వతాన్ని ఉద్దేశించే ఆ సమరయ స్త్రీ యేసు క్రీస్తుతో అలా మాట్లాడింది.

Samaritan Pentateuch కి సంబంధించి ప్రస్తుతం మనకి సుమారు 150 manuscripts అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం లేదా ఆ తరువాత కాలానికి సంబంధించినవే. అందులోనూ చాలా వరకు పదిహేనవ శతాబ్దంలో రాసినవే. Damascus కి చెందిన కొంతమంది సమరయుల ఆధీనంలో ఉన్న కొన్ని Samaritan Pentateuch manuscripts పదిహేడవ శతాబ్దంలో యూరోప్ చేరుకోవడంతో వాటిని Biblical Scholars పరిశీలించడం మొదలుపెట్టారు. దానితో సమరయులు తమ సిద్ధాంతాలకు అనుగుణంగా కొన్ని చోట్ల లేఖనాలను ఉద్దేశపూర్వకంగా మార్చినట్లు స్పష్టంగా అర్ధమయ్యింది. Masoretic Text తో పోలిస్తే Samaritan Pentateuch లో దాదాపుగా ఆరు వేల వ్యత్యాసాలు ఉండటంతో, వీటన్నిటినీ కూడా సమరయులు ఉద్దేశపూర్వకంగానే మార్చి ఉండి ఉంటారనీ, చాలా మార్పులకు గురయ్యింది కాబట్టి Samaritan Pentateuch ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ, Samaritan Pentateuch తో మనకు పెద్దగా ఉపయోగమేమీ లేదనీ మొదట్లో చాలా మంది scholars అభిప్రాయపడ్డారు. అయితే కొంతమంది భిన్నమైన అభిప్రాయాలను కూడా కలిగి ఉండేవారు. Masoretic Text కంటే కూడా Samaritan Pentateuch చాలా ఉత్తమమైనది అని 1631 లో John Morinus అనే ఒక scholar అభిప్రాయపడ్డారు. అయితే 1815 లో Wilhelm Gesenius గారు Samaritan Pentateuch ని విస్తృతంగా పరిశోధించి తన అభిప్రాయాలను ప్రచురించారు. చారిత్రకంగానూ మరియు సమరయులు లేఖనాలను మార్చిన విధానాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే, పాత నిబంధన యొక్క original text ని వెలికితీయడానికి Samaritan Pentateuch అసలు ఎందుకూ పనికిరాదు అని Gesenius గారు అభిప్రాయపడ్డారు. ఆ తరువాత ఒక శతాబ్దం పాటు Gesenius గారి అభిప్రాయాలతో అందరూ ఏకీభవిస్తూ వచ్చారు. Masoretic Text తో పోల్చి చూసినప్పుడు Samaritan Pentateuch లో కనిపిస్తున్న వ్యత్యాసాలు అన్నీ కూడా సమరయులు కావాలని ఉద్దేశపూర్వకంగా మార్చి రాసినవే కానీ అవి ప్రాచీన హీబ్రూ లేఖనాలను ప్రతిబింబించేవి కాదు అని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే 1915వ సంవత్సరంలో Paul Kahle అనే ఒక scholar ఏమన్నారంటే Masorectic Text తో పోల్చి చూసినప్పుడు భిన్నంగా కనిపిస్తున్న వచనాలలో చాలా వరకు కూడా Samaritan Pentateuch లో ఉన్నదే original reading అయ్యుండొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఈ విధంగా అభిప్రాయపడటానికి గల కారణం ఏంటంటే, Samaritan Pentateuch లో భిన్నంగా ఉన్నాయి అని అనుకుంటున్న వచనాలలో చాలా వరకు కూడా కొన్ని apocryphal books లోనూ, Septuagint లోనూ అలాగే క్రొత్త నిబంధనలో కూడా కనిపిస్తున్నాయి. అంటే Septuagint లోనూ మరియు క్రొత్త నిబంధనలో ఉన్న కొన్ని వాక్యాలు Masoretic Text తో విభేదిస్తున్నప్పటికీ అవి Samaritan Pentateuch తో ఏకీభవిస్తున్నాయి. వీటి ఆధారంగా, Samaritan Pentateuch లో ఉన్న కొన్ని వాక్యాలు భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ అవే అసలైనవి అయ్యుండొచ్చు అని Paul Kahle గారు అభిప్రాయాపడ్డారు.

ఇక 1947లో Dead Scrolls ని కనుగొన్న తరువాత Samaritan Pentateuch విషయంలో ఒక స్పష్టత వచ్చింది. Qumran Caves లో దొరికిన ఈ manuscripts అన్నీ కూడా identical గా లేవు కానీ వీటిల్లో కొంత variation ఉంది అని పరిశోధకులు గుర్తించారు. Dead Sea scrolls లోని కొన్ని వ్రాత ప్రతులు Samaritan Pentateuch తో ఏకీభవిస్తున్నాయి అని కూడా పరిశోధకులు గుర్తించారు. అయితే, సమరయులు తమ సిద్ధాంతాలకు అనుగుణంగా లేఖనాలలో ఏవైతే మార్పులు చేశారో, (ఉదాహరణకు Mount Gerizim గురించి ఉన్న వాక్యభాగం) వి ఏవి కూడా Dead Sea scrolls లో కనపడలేదు. Samaritan Pentateuch తో దగ్గరగా ఉన్న ఈ Dead Sea scroll manuscripts కి scholars పెట్టిన పేరు ఏంటంటే "pre-samaritan text". ఇక్కడ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, Qumran Caves లో దొరికిన manuscripts అన్నీ కూడా Samaritan Pentateuch తో ఏకీభవిస్తున్నాయి అని నేను అనడం లేదు. Dead Sea scrolls లోని కొన్ని manuscripts మాత్రం Samaritan Pentateuch కి దగ్గరగా ఉన్నాయి. వీటిని మాత్రమే "pre-samaritan" text అని అంటారు.

Dead Sea scrolls ని కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే మనకు అర్ధమయ్యేది ఏంటంటే, పూర్వం చాలా శతాబ్దాల క్రితం original text ఏదయితే ఉందో దాన్ని manual గా చేత్తో copy చేసే క్రమంలో అక్కడక్కడా కొన్ని variations అనేవి రావడం జరిగింది. ఇది సహజంగా జరిగేదే. మనుష్యులు manual గా copy చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా చేసినా కూడా అక్కడక్కడా కొన్ని తప్పులు దొర్లడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే Biblical manuscripts విషయంలో ఇది పెద్ద సమస్య ఏమీ కాదు. ఎందుకంటే ఈ variations లో అధిక శాతం, వాక్యం యొక్క అర్ధాన్ని మార్చే అంత భిన్నంగా ఏమీ ఉండవు. చాలా చిన్న చిన్న variations అంటే, వ్యక్తులు లేదా స్థలాల పేర్లలో స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉండటం, sentence structure and syntax కొద్దిగా భిన్నంగా ఉండటం, scribes యొక్క పొరపాటు వలన కొన్ని లైన్లు miss అవ్వడమో లేక కొన్ని అంకెలు తప్పుగా రాయడమో లేక కొన్ని అక్షరాలను తప్పుగా రాయడమో జరిగింది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న manuscripts ని ఒకదానితో ఒకటి compare చేయడం ద్వారా ఈ variations లో చాలా వరకు కూడా మనం పరిష్కరించుకోవచ్చు.

ఇక్కడ క్రింద మీరు చూస్తున్న ఈ రెండు వచనాలు కూడా Masoretic Text నుండి తీసుకున్నవే. మొదటిది ఆదికాండము పదవ అధ్యాయం నాలుగవ వచనం. ఇక్కడ యావాను కుమారుల పేర్లు ఎలీషా, తర్షీష్, క్కిత్తీమ్, దొదానీం అని ఉంటుంది. ఇదే వచనం మళ్ళీ మొదటి దినవృత్తాంతములు మొదటి అధ్యాయం ఏడవ వచనంలో కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ యావాను కుమారుల పేర్లు ఎలీషా, తర్షీషాహ్, క్కిత్తీమ్, రొదానీం అని ఉంటుంది. ఇక్కడ తర్షీష్ అనే పదానికి చివరలో హే(ה) అనే అక్షరం కలవడం వలన అది తర్షీషాహ్ అయ్యింది. కానీ తర్షీష్ అనేదే correct reading. అలాగే మొదటి దినావృత్తాంతాల్లో రొదానీం అని ఉంటే ఆదికాండములో మాత్రం దొదానీం అని ఉంది. రెష్(ר) అనే అక్షరానికి బదులు దాలెత్(ד) అనే అక్షరం వాడటం వలన రొదానీం కాస్తా దొదానీం అయ్యింది. కానీ రొదానీం అనేదే correct reading.

క్రీస్తు పూర్వం మూడు రెండు శతాబ్దాల కాలంనాటికి ఇలా variations ఉన్న different manuscripts అందుబాటులో ఉండేవి. ఇదే సమయంలో ఒక manuscript ని base చేసుకొని (దీనినే "The Egyptian Hebrew recension" అని అంటారు) Greek Septuagint అంటే హీబ్రూ లేఖనాలను గ్రీకు భాషలోకి తర్జుమా చేయడం జరిగింది. అలాగే సమరయులు కూడా ఇదే సమయంలో ఒక manuscript ని తీసుకుని అందులో వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. వీళ్ళు తీసుకున్న base text ని "The Palestinian Hebrew recension" అని అంటారు. ఆ తరువాత కూడా variations ఉన్న different hebrew manuscripts ని మామూలుగానే copy చేస్తూ వచ్చారు. అలా variations ఉన్న ఈ different hebrew manuscripts అన్నీ కూడా మనకు Qumran Caves లో దొరికాయి. వీటినే మనం Dead Sea scrolls అని అంటున్నాం. క్రీస్తు శకం మొదటి శతాబ్దం తరువాత అప్పుడున్న Jewish Scholars ఏమి చేశారంటే hebrew manuscripts అన్నిటినీ తీసుకుని ఒక Standard Text ని తయారు చేశారు. దీనినే మనం Masoretic Text అని అంటున్నాం. వీళ్ళు అప్పట్లో వాడిన లేఖనాలకు base text ఏదయితే ఉందో దాన్ని "The Babylonian Hebrew recension" అని అంటారు. ప్రస్తుతం మనం వాడుతున్న బైబిల్స్ అన్నీ కూడా ఈ Masoretic Text నుండే తర్జుమా చేయబడ్డాయి.

కాబట్టి సమరయులు హీబ్రూ లేఖనాలలో కొన్ని మార్పులు చేసినప్పటికీ అవి పరిమితమైన మార్పులు మాత్రమే. యెరూషలేము కేంద్రంగా దేవుడిని ఆరాధించే వారితో తమకు ఉన్న విభేదాల కారణంగా తమ theological stand point ని సమర్ధించుకుంటూ కొన్ని మార్పులు చేశారే కానీ, ఆ thin layer ని గనక మనం వేరు చేసి చూడగలిగితే, Samaritan Pentateuch లో కూడా ప్రాచీన కాలానికి చెందిన హీబ్రూ లేఖనాలు అంటే క్రీస్తు పూర్వం రెండు మూడు శతాబ్దాలకు చెందిన ancient hebrew text ఏదైతే ఉందో అది మనకు Samaritan Pentateuch లో కూడా కనిపిస్తుంది. కాబట్టి Masoretic Text తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది అనే కారణంతో మనం Samaritan Pentateuch ని తీసి పక్కన పెట్టలేము. Original Text ని గుర్తించే విషయంలో Samaritan Pentateuch కూడా చాలా విలువైనదే. వాస్తవానికి Samaritan Pentateuch కి మరియు Masoretic Text కి మధ్య దాదాపు ఆరు వేల వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అందులో సుమారు రెండు వేల చోట్ల Samaritan Pentateuch, Septuagint తో ఏకీభవిస్తుంది. మీకు తేలిగ్గా అర్ధం అవ్వడానికి కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం నాలుగవ వచనం ఒకసారి చూడండి.

"మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీ కాజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను" అని Masoretic Text లో ఉంది. Septuagint లో కూడా ఇదే విషయం ఉంటుంది. కానీ Samaritan Pentateuch లో మాత్రం "బెహర్ ఏబాల్" అనే పదానికి బదులు "బెహర్ గెరిజీమ్" అనే పదం వాడారు. ఇక్కడ సమరయులు ఈ వాక్యాన్ని కావాలని మార్చారు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక్కడ Septuagint లో "ఏబాల్" అని కాకుండా "గేబాల్" అని ఎందుకు ఉంది అనే సందేహం మీకు రావొచ్చు. ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే modern Hebrew భాషలో ప్రస్తుతం మనం "ఆయిన్" అని పిలుస్తున్న అక్షరం ఏదయితే ఉందో, ఆ అక్షరాన్ని చాలా ప్రాచీన కాలంలో కొన్ని సార్లు "గ" అనే శబ్దాన్ని పలకడానికి కూడా వాడేవారు. Septuagint అనేది చాలా పాత translation కాబట్టి కొన్ని పేర్లను transliterate చేసినప్పుడు, ఆ కాలంలో వాళ్ళు ఏ విధంగా అయితే పలికేవారో, అదే ఉచ్ఛారణ మనకి Septuagint లో కనిపిస్తుంది. దీనికి classic example ఏంటంటే సొదొమ గొమొఱ్ఱా పట్టణాలు. గొమొఱ్ఱా అనే పదాన్ని మీరు హీబ్రూ బైబిల్ లో చూసినట్లయితే అక్కడ "ఆయిన్" అనే అక్షరమే ఉంటుంది. కానీ ఈ పదాన్ని "ఒమొఱ్ఱా" అని కాకుండా "గొమొఱ్ఱా" అనే పలుకుతారు.

అలాగే నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం నలభయ్యో వచనం చూసినట్లయితే "ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు" అని Masoretic Text లో ఉంటుంది. కానీ Septuagint లోనూ మరియు Samaritan Pentateuch లోనూ "ఇశ్రాయేలీయులు ఐగుప్తులో మరియు కనానులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు" అని ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ("నేను చెప్పునదేమనగా నాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు") కూడా Septuagint తోనూ మరియు Samaritan Pentateuch తోనూ ఏకీభవిస్తుంది. కాబట్టి ఇక్కడ Masoretic Text లో తప్పు ఉంది అని మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది.

అందువల్ల Masoretic Text తో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నప్పటికీ, ప్రాచీన కాలానికి చెందిన హీబ్రూ లేఖనాలలో original గా ఏముంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనకి Samaritan Pentateuch బాగా ఉపయోగపడుతుంది. Samaritan Pentateuch లో ఉన్నదాని ప్రకారం,

తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.(ఆదికాండం 11:26)
And Terah lived seventy years, and begat Abram, Nahor, and Haran.

తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి మరియు మిల్కా అను తన కోడళ్లను, తన కుమారుడగు నాహోరును తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రదికిన దినములు నూట నలభై యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను. (ఆదికాండం 11:31-32)
And Terah took Abram his son, and Lot the son of Haran his son's son, and Sarai and Milka his daughters-in-law, his son Abram's wife; and Nahor – his son; and he went forth with them from Ur of the Chaldees, to go into the land of Canaan; and they came unto Haran, and dwelt there. And the days of Terah were hundred and forty five years: and Terah died in Haran.

అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు. (ఆదికాండం 12:4)
Abram was seventy and five years old when he departed out of Haran.

ఇక్కడ Masoretic Text తో పోలిస్తే Samaritan Pentateuch లో రెండు variations ఉన్నాయి. ఒక variation ఏంటంటే Masoretic Text ప్రకారం, అబ్రాహామును, అబ్రాహాము భార్యయయిన శారాను, హారాను కొడుకు లోతును తీసుకుని తెరహు కనాను దేశానికి వెళదామని బయలుదేరాడు. కానీ Samaritan Pentateuch ప్రకారం, తెరహు తన మరొక కుమారుడైన నాహోరును అతని భార్య మిల్కాను కూడా తీసుకుని కనాను దేశానికి బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ Samaritan Pentateuch లో ఉన్నదే వాస్తవానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే మనం ఆదికాండము 24 నుండి 29వ అధ్యాయం వరకు చదివితే నాహోరు కుటుంబం హారానులో స్థిరపడింది అనే విషయం అర్ధం అవుతుంది. అంటే తెరహు తోపాటు మొత్తం కుటుంబం అంతా కనాను దేశానికని బయల్దేరి మధ్యలో ఉన్న హారాను అనే ప్రాంతం వరకు వచ్చి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ తెరహు చనిపోయిన తరువాత అబ్రాహాము కనాను దేశానికి ప్రయాణమయ్యి వెళ్ళిపోతే నాహోరు కుటుంబం మాత్రం హారానులోనే శాశ్వతంగా స్థిరపడ్డారు అని మనకు తెలుస్తోంది. కాబట్టి Samaritan Pentateuch లో మనకి more accurate information ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అదేమిటంటే, హారాను అనే ప్రాంతానికి అరామ్ నహరాయీమ్, పద్దాన్ అరామ్ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. బేసిక్ గా ఇది అరాము అంటే ప్రాచీన సిరియా దేశంలో యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య ఉన్న ప్రాంతం. ప్రస్తుతం ఇది టర్కీ దేశంలో ఉంది. అరామ్ నహరాయీమ్ అంటే అరాము దేశంలోని నదీ పరివాహక ప్రాంతం అనీ, పద్దాన్ అరామ్ అంటే అరాము దేశంలో ఉన్న మైదాన ప్రాంతం అని అర్ధాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక్కటే ప్రాంతాన్ని గురించి వర్ణిస్తూ చెప్పిన మాటలు. ఆదికాండములోని వాక్య భాగాల్లో వేరు వేరు పదాలు ఉపయోగించడాన్ని బట్టి ఒకవేళ మీరు confuse అవుతారేమో అని ఈ విషయం చెబుతున్నాను.

అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసికొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి (ఆదికాండము 24:10)

కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకు (ఆదికాండము 27:43)

నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి (ఆదికాండము 28:2)

యాకోబును పంపివేసెను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను. (ఆదికాండము 28:5)

ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు (ఆదికాండము 28:6)

యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లి పోయెననియు ఏశావు తెలిసికొనినప్పుడు, (ఆదికాండము 28:7)

యాకోబు వారిని చూచి అన్నలారా, మీ రెక్కడివారని అడుగగా వారు మేము హారానువార మనిరి. అతడు-నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి. (ఆదికాండము 29:4-5)


సరే ఇక ఇదే వాక్యభాగంలో ఉన్న రెండవ variation గురించి చూద్దాం. Masoretic Text ప్రకారం "తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు." కానీ Samaritan Pentateuch ప్రకారం "తెరహు బ్రదికిన దినములు నూట నలభై యైదేండ్లు." ఒకవేళ Samaritan Pentateuch లో ఉన్నదే correct reading అయ్యుంటే గనక మన సమస్యకి పరిష్కారం దొరికినట్లే. అబ్రాహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు 70 సంవత్సరాలు. అబ్రాహాముకి 75 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తెరహు మరణించాడు. తెరహు బ్రదికిన దినములు నూట నలభై యైదేండ్లు. తెరహు చనిపోయిన తరువాత అబ్రాహాము హారాను వదిలి కనాను దేశానికి వెళ్ళాడు. క్రొత్త నిబంధనలో స్తెఫను చెప్పిన విషయాలతో Samaritan Pentateuch పూర్తిగా ఏకీభవిస్తుంది. స్తెఫను అధ్యయనం చేసిన లేఖనాలు ఏవైతే ఉన్నాయో, బహుశా వాటిల్లో తెరహు బ్రదికిన దినములు నూట నలభై యైదేండ్లు అని ఉందేమో. మనం చెప్పలేము. కానీ మొదటి శతాబ్ద కాలం నాటికి చిన్న చిన్న variations ఉన్న different hebrew manuscripts చెలామణిలో ఉండటాన్ని బట్టి, అలాగే తెరహు చనిపోయిన తరువాతే అబ్రాహాము హారాను వదిలి కనాను దేశానికి వెళ్ళాడు అని స్తెఫను ఖచ్చితంగా చెప్పటాన్ని బట్టి చూస్తే, స్తెఫను అధ్యయనం చేసిన లేఖనాలలో కూడా Samaritan Pentateuch లో ఉన్నట్లుగానే తెరహు బ్రదికిన దినములు నూట నలభై యైదేండ్లు అని ఉందేమో అనిపిస్తుంది. అంటే manual గా copy చేసే క్రమంలో ఒక వ్రాత ప్రతిలో నూట నలభై అయిదు సంవత్సరాలు అని రాయటానికి బదులు పొరపాటున రెండు వందల అయిదు సంవత్సరాలు అని రాసి ఉండి ఉండవచ్చు. ఈ వ్రాత ప్రతిని చూసి మరికొన్ని వ్రాత ప్రతులను రాయడం, అలా చివరికి Masoretic Text లోకి అలాగే మన బైబిల్స్ లోకి కూడా ఇదే అంకె వచ్చి చేరింది. అయితే అసలు ఈ పొరపాటు ఎలా జరిగింది? నూట నలభై అయిదు సంవత్సరాలు అని ఉంటే రెండు వందల అయిదు సంవత్సరాలు అని అలా ఎలా రాశారు? అనే సందేహం మీకు రావొచ్చు. మనం ఇంగ్లీష్ లోనో లేక తెలుగులోనో చూస్తే ఈ విషయం అంత తేలిగ్గా అర్ధం కాదు. అందుకే నేను ఇక్కడ హీబ్రూ వాక్యాలను పెట్టాను ఒకసారి చూడండి. Samaritan Pentateuch లో ఉన్నది ఏంటంటే "ఖమెష్ షనీమ్ ఉ'అర్బాయీమ్ ఉ'మాత్ షనాహ్". ఖమెష్ అంటే అయిదు. షనీమ్ అంటే సంవత్సరాలు. అర్బాయీమ్ అంటే నలభై. మాత్ షనాహ్ అంటే వంద సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఏంటంటే అయిదు సంవత్సరాలు మరియు నలభై మరియు వంద సంవత్సరాలు. నూట నలభై అయిదు సంవత్సరాలు అని చెప్పడానికి వాళ్ళు ఆ రోజుల్లో ఇలా చెప్పేవారు. ఒక థియరీ ప్రకారం ఏంటంటే, original text నుండి ఈ వాక్యాన్ని manual గా copy చేసే క్రమంలో ఒక వ్రాత ప్రతిలో "ఉ'అర్బాయీమ్" అనే పదం పొరపాటున miss అయ్యింది. అప్పుడు అది "అయిదు సంవత్సరాలు మరియు వంద సంవత్సరాలు" అయ్యింది. అంటే నూట అయిదు సంవత్సరాలు. కొంత కాలానికి ఇక్కడ తప్పు ఉంది అని మరొక scribe గుర్తించాడు. ఎందుకంటే ఆదికాండము పదకొండవ అధ్యాయంలోని వంశావళి మొత్తం పరిశీలిస్తే, తెరహు కేవలం నూట అయిదు సంవత్సరాలు మాత్రమే జీవించాడు అనేది కొంచెం odd గా కనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ కాలం జీవించారు. దీన్ని సరి చేసే క్రమంలో ఆ scribe ఏమి చేసాడంటే "మాత్" అనే పదాన్ని "మాతయీమ్ " అని మర్చి ఉంటాడు. అప్పుడు నూట అయిదు సంవత్సరాలు కాస్త రెండు వందల అయిదు సంవత్సరాలు అయ్యింది. ఖచ్చితంగా ఇలాగే జరిగింది అని నేను చెప్పట్లేదు కానీ, బహుశా ఇలా జరిగి ఉంటుంది అని కొంత మంది scholars ఒక థియరీని ప్రతిపాదించారు. ఏది ఏమైనప్పటికీ Samaritan Pentateuch ప్రకారం, తెరహు బ్రదికిన దినములు నూట నలభై యైదేండ్లు.New Testament:

ఇక క్రొత్త నిబంధనలో ఏముందో మనం already చూశాము. అపొ. కార్యములు 7వ అధ్యాయం 4వ వచనంలో స్తెఫను మాట్లాడుతూ, తెరహు చనిపోయిన తరువాతే అబ్రాహాము హారాను విడిచి కనాను దేశానికి వెళ్ళాడు అని చాలా స్పష్టంగా చెప్పాడు.

Flavius Josephus:

ఇక ఇదే విషయం గురించి Yoseph Ben Mathiyahu ఏమి రాశాడో ఇప్పుడు చూద్దాం. Flavius Josephus అని కూడా పిలువబడే ఇతను, మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడు మరియు యెరూషలేము దేవాలయములో యాజకుడు. ఇతను రాసిన The Antiquities of the Jews, Book Number one, sixth chapter, fifth paragraph లో తెరహు తన డెభయ్యో యేట అబ్రాహామునకు జన్మనిచ్చాడు అనీ, కల్దీయుల దేశమైన ఊరు అనే పట్టణంలో తెరహు కుటుంబం జీవిస్తున్న సమయంలో అక్కడ హారాను మరణించాడనీ, ఆ బాధలో ఉన్న తెరహుకి ఆ పట్టణంలో జీవించడం ఇష్టం లేకపోవడంతో, వారి కుటుంబం అంతా మెసొపొటేమియాలో ఉన్న హారాను అనే ప్రాంతానికి వలస వెళ్లిపోయారు అనీ, అక్కడ తెరహు మరణించాడనీ, అప్పుడు అతని వయస్సు రెండు వందల అయిదు సంవత్సరాలనీ రాశాడు. ఆ తరువాతి అధ్యాయంలో ఇంకా ఏమి రాసాడంటే, అబ్రాహాము డెభై అయిదేళ్ల వయస్సులో కల్దీయుల దేశాన్ని వదిలి కనాను దేశానికి వెళ్ళాడు అని కూడా రాశాడు. అబ్రాహాము కనాను వెళ్ళేటప్పటికి తెరహు చనిపోయాడా లేక ఇంకా బ్రతికే ఉన్నాడా అనే విషయాన్ని Josephus స్పష్టంగా రాయనప్పటికీ, తెరహు తన డెభయ్యో యేట అబ్రాహామునకు జన్మనిచ్చాడు అనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా రాశాడు. అంటే Josephus రాసినదాని ప్రకారం అబ్రాహాము కనాను వెళ్ళేటప్పటికి తెరహు వయస్సు నూట నలభై అయిదు సంవత్సరాలే. అంటే మరి ఆ తరువాత మరో అరవై సంవత్సరాల పాటు తెరహు జీవించే ఉన్నాడా అనే ప్రశ్న వస్తుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న Josephus manuscripts అన్నిట్లో కూడా తెరహు బ్రతికిన దినములు రెండు వందల అయిదు సంవత్సరాలు అని ఉన్నప్పటికీ బహుశా అది corrupted number అయ్యుండొచ్చు అని కొంత మంది scholars అభిప్రాయపడతారు. దానికి కారణం ఏంటంటే, "అక్కడ ఉన్న వంశావళిలోని మిగతా వారితో పోలిస్తే తెరహు అంత  తక్కువ కాలం మాత్రమే ఎందుకు జీవించాడు?" అని చదివిన వాళ్ళు ఆశ్చర్యపోకుండా ఉండటానికి అన్నట్లుగా, దానిని వివరిస్తూ Josephus ఒక చిన్న కామెంట్ రాశాడు. అదేమిటంటే "మనిషి యొక్క జీవిత కాలం అప్పటికే బాగా తగ్గిపోయింది, మోషే కాలం వరకు కూడా ఇంకా తగ్గుతూ వచ్చింది" అని రాశాడు. తెరహు రెండు వందల అయిదు సంవత్సరాలు జీవించాడు అని Josephus నిజంగానే రాసి ఉండి ఉంటే గనక, అతను రాసిన ఈ కామెంట్ అర్ధరహితం. ఎందుకంటే తెరహు యొక్క తండ్రి నాహోరు నూట నలభై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే జీవించాడు. అంటే తెరహు తన తండ్రి కంటే యాభై ఏడు సంవత్సరాలు ఎక్కువ కాలం జీవించినట్లవుతుంది. Josephus ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకుంటే బహుశా అతను ఒరిజినల్ గా Samaritan Pentateuch లో ఉన్నట్లే తెరహు బ్రతికిన దినములు నూట నలభై అయిదు సంవత్సరాలు అని రాసి ఉంటాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. Josephus writings ని ఇంగ్లీషులోకి తర్జుమా చేసిన William Whiston గారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా అబ్రాహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు 70 సంవత్సరాలుగా పరిగణించి, Josephus ఇచ్చిన వంశావళి ఆధారంగా లెక్కిస్తే, ఆదాము నుండి మోషే చనిపోయేవరకు ఉన్న కాలం 2993 సంవత్సరాలు. అలా కాకుండా అబ్రాహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు 130 సంవత్సరాలుగా పరిగణించి, Josephus ఇచ్చిన వంశావళి ఆధారంగా లెక్కిస్తే, ఆదాము నుండి మోషే చనిపోయేవరకు ఉన్న కాలం 3053 సంవత్సరాలు. అయితే తాను రాసిన Against Apion Book No. One, 8th Paragrah లో Josephus ఒక చిన్న మాట రాశాడు. అదేమిటంటే, ఆదాము నుండి మోషే చనిపోయే వరకు ఉన్న కాలం మూడు వేల సంవత్సరాలకి కొద్దిగా తక్కువ అని రాశాడు. Eusebius లాంటి early church fathers కూడా Josephus ని quote చేస్తూ ఇదే మాట రాయడాన్ని మనం వారి writings కి సంబంధించిన ancient copies లో చూడొచ్చు. అంటే "little short of three thousand years" అని Josephus ఏదైతే రాశాడో అది corrupted number కాదు కానీ, Josephus original గా రాసిన అంకె అని మనం నిశ్చయంగా చెప్పొచ్చు. దీన్నిబట్టి చూస్తే అబ్రాహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు 70 సంవత్సరాలు మాత్రమే అనే అభిప్రాయాన్ని Josephus కలిగి ఉన్నాడు అని మనకు స్పష్టంగా అర్ధమవుతుంది.Philo of Alexandria:

అబ్రాహాము కనాను దేశానికి వలస వెళ్లడం గురించి మనకి Philo యొక్క రచనలలో కూడా కనిపిస్తుంది. Philo Judaeus - ఇతన్ని Philo of Alexandria అని కూడా పిలుస్తారు. ఇతను మొదటి శతాబ్దపు యూదా తత్త్వవేత్త. ఇతను క్రీస్తు పూర్వం ఇరవయ్యో సంవత్సరం నుండి క్రీస్తు శకం యాభయ్యో సంవత్సరం వరకు జీవించాడు. అంటే ఇతను యేసు క్రీస్తుకి, అపొస్తలులకి, పౌలు, స్తెఫను, Josephus మొదలయిన వాళ్లకి సమకాలీనుడు. ఆ రోజుల్లో చాలా మంది యూదులకి రెండు రెండు పేర్లు ఉండేవి. ఒకటి Greek Name, రెండు Hebrew Name. Philo అనేది ఇతని Greek name అయితే, "యెదీద్'యహ్ హ కోహెన్" అనేది ఇతని Hebrew name. కోహెన్ అంటే యాజకుడు. ఇతని పేరుని బట్టి చూస్తే ఇతను యాజకుల వంశంలో జన్మించాడని అర్ధం అవుతుంది. Philo రాసిన "On The Migration Of Abraham" అనే పుస్తకంలో, అబ్రాహాము తన తండ్రి చనిపోయిన తరువాత తన డెబ్బయి అయిదవ యేట హారాను విడిచి వెళ్ళాడు అని Philo రాశాడు.

"And Abraham was," he says “seventy and five years old when he went out from Haran” (Gen. xii. 4). On the number of the five and seventy years, whose import agrees with what has just been said, we will dwell in detail at a later time. Let us first examine the significance of Haran and of the removal from this country. No one versed in the Laws is likely to be unaware that at an earlier date Abraham migrated from Chaldea and dwelt in Haran, and that after his father's death there, he removes from that country also, so that he has at this point already quitted two places. (DE MIGRATIONE ABRAHAMI: 176-177)

అబ్రాహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు ఖచ్చితంగా ఎంత అనేది Philo ఎక్కడా ప్రస్తావించనప్పటికీ, అబ్రాహాము తన తండ్రి చనిపోయిన తరువాతే హారాను విడిచి వెళ్ళాడు అనీ, అప్పుడు అతని వయస్సు డెబ్బయి అయిదు సంవత్సరాలు అని స్పష్టంగా రాశాడు. Philo మరియు స్తెఫను ఇచ్చిన సాక్ష్యాలను బట్టి చూస్తే, అబ్రాహాము తన తండ్రి చనిపోయిన తరువాతే హారాను విడిచి కనాను దేశానికి వెళ్ళాడు అనే అభిప్రాయం కేవలం సమరయులలో మాత్రమే కాక ఇంకా ఇతర యూదులలో కూడా ఇదే అభిప్రాయం ఉంది అన్న విషయం మనకు అర్ధం అవుతుంది. ఒకవేళ Josephus కూడా ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉండి ఉంటే గనుక, మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు అతను ఒరిజినల్ గా Samaritan Pentateuch లో ఉన్నట్లే తెరహు బ్రతికిన దినములు నూట నలభై అయిదు సంవత్సరాలు అని రాసి ఉంటాడు అని మనం భావించడానికి ఇది మరికొంత ఎక్కువ బలాన్నిస్తుంది. అలాగే, Philo was a Greek speaking Jew. ఇతను అలెగ్జాండ్రియాలో నివసించాడు కాబట్టి, ఇతను Hellenistic Jewish Community కి చెందినవాడు. ఇతని విద్యాభ్యాసం అంతా కూడా గ్రీకు భాషలోనే సాగింది. కాబట్టి ఇతను Greek Septuagint ని అధ్యయనం చేశాడు. తెరహు చనిపోయిన తరువాతే అబ్రాహాము హారాను విడిచి కనాను దేశానికి వెళ్ళాడు అని Philo చెప్పడాన్ని బట్టి చూస్తే, ఆ కాలంలో అతను అధ్యయనం చేసిన Septuagint Manuscripts లో కూడా Samaritan Pentateuch లో ఉన్నట్లే తెరహు బ్రతికిన దినములు నూట నలభై అయిదు సంవత్సరాలు అని ఉండి ఉండవచ్చు అని కొంతమంది scholars అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, క్రీస్తు శకం నాలుగవ శతాబ్దానికి పూర్వం ఉన్న Greek manuscripts ఏవీ కూడా ప్రస్తుతం మనకు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. కొన్ని పాత manuscripts ఉన్నప్పటికీ అవి పాక్షికంగానో లేదా చిన్న చిన్న fragments రూపంలోనో ఉన్నాయి. కాబట్టి Philo కాలంలో అప్పటికి అందుబాటులో ఉన్న Septuagint manuscripts లో ఏముంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము.

Bereishit Rabbah:

క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో యూదా మత పెద్దలు హీబ్రూ లేఖనాలకు వ్యాఖ్యానాలు రాశారు. వీటిని Midrash అని అంటారు. ఇందులోని Bereishit Rabbah అనే పుస్తకంలో మనకు ఆదికాండానికి సంబంధించిన వ్యాఖ్యానాలు కనిపిస్తాయి. ఈ వ్యాఖ్యానాలను రాసింది క్రీస్తు శకం రెండవ శతాబ్దంలోనే అయినప్పటికీ, ఇందులోని కొన్ని విషయాలు ఇంకా పురాతన కాలానికి సంబంధించినవి - అంటే, రెండవ శతాబ్దానికంటే ముందు నుండి ఉన్న interpretations ఏవైతే ఉన్నాయో అవి మనకు Midrash లో కనిపిస్తాయి. Midrash లో ఉన్నదంతా కరెక్టే, మనం Midrash ని ప్రామాణికంగా తీసుకోవాలి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అయితే ఆ కాలంలోని యూదుల అభిప్రాయాలు ఎలా ఉండేవో తెలుసుకోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. Bereishit Rabbah లోని 38వ అధ్యాయంలో హారాను ఎలా మరణించాడు అనే దాని గురించి ఒక చిన్న ఆసక్తికరమైన కథ ఉంది. అందులో ఉన్న వివరాల ప్రకారం తెరహు వృత్తిరీత్యా విగ్రహాలను తయారు చేసి వాటిని అమ్మేవాడు. ఒకసారి తెరహు కి ఎదో పని ఉండి వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చి, తనకి బదులుగా విగ్రహాలను అమ్మడానికి అబ్రాహామును దుకాణంలో ఉంచి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక విగ్రహాన్ని కొనడానికి ఒక వ్యక్తి ఆ దుకాణానికి వచ్చాడు. అప్పుడు అబ్రాహాము ఆ వ్యక్తితో "నీ వయస్సెంత?" అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి "యాభై సంవత్సరాలు" అని బదులిచ్చాడు. అప్పుడు అబ్రాహాము అతనితో "నీకు యాభై సంవత్సరాల వయస్సు ఉండి కూడా, ఒక రోజు వయస్సు ఉన్న విగ్రహానికి మ్రొక్కుతున్నావు, నీకు శ్రమ!" అని అన్నాడు. దానితో ఆ వ్యక్తి సిగ్గుపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరొక సందర్భంలో ఒక మహిళ ఒక పళ్లెం నిండా పిండి తీసుకుని వచ్చి, ఈ పిండిని ఆ విగ్రహాలకు అర్పించమని అబ్రాహాముని అడిగింది. అప్పుడు అబ్రాహాము ఒక కర్రను తీసుకుని, ఆ విగ్రహాలన్నిటినీ పగలగొట్టి, ఒక పెద్ద విగ్రహం చేతిలో ఆ కర్రను ఉంచాడు. తెరహు తిరిగి వచ్చిన తరువాత, "నువ్వు చేసిన ఈ పని ఏంటి?" అని అబ్రాహామును ప్రశ్నించాడు. అప్పుడు అబ్రాహాము ఏమి చెప్పాడంటే, "ఒక పళ్లెం నిండా మంచి ఆహారం తీసుకుని ఒక మహిళ నా దగ్గరకు వచ్చి, ఆ ఆహారాన్ని ఈ విగ్రహాలకు అర్పించమని నన్ను అడిగింది. అప్పుడు, 'నేను ముందు తింటా, అంటే నేను ముందు తింటాను అంటూ', వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడటం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళల్లో అందరికంటే పెద్దగా ఉన్న విగ్రహం లేచి, ఒక కర్రను తీసుకుని, మిగతా విగ్రహాలన్నింటినీ పగలగొట్టింది." అని అబ్రాహాము తన తండ్రితో చెప్పాడు. "ఏంటి నాతో వేళాకోళాలు ఆడుతున్నావా?" అని తెరహు అబ్రాహాముతో అన్నాడు. "అంటే వాటికి తెలివి లేదు అని ఒప్పుకున్నట్లే కదా! నీ నోరు మాట్లాడుతున్న మాటలను నీ చెవులు కూడా వినాలి" అని అబ్రాహాము తిరిగి బదులిచ్చాడు. దానితో తెరహుకి కోపం వచ్చి అబ్రాహామును బంధించి నిమ్రోదునకు అప్పగించాడు. అప్పుడు నిమ్రోదు అబ్రాహాముతో, "మనం ఈ అగ్నికి మ్రొక్కుదాం, రా" అని అంటాడు. "అగ్నికి బదులు మనం గంగకు మ్రొక్కుదాం, ఎందుకంటే నీరు అగ్నిని కూడా ఆర్పివేయగలదు కదా" అని అబ్రాహాము బదులిచ్చాడు. "అయితే మనం గంగనే మ్రొక్కుదాం" అంటాడు నిమ్రోదు. "గంగకి బదులు మనం మేఘాలను మ్రొక్కుదాం, ఎందుకంటే మేఘాలలోనే నీరు ఉంటుంది కదా" అని అంటాడు అబ్రాహాము. "సరే అయితే మేఘాలనే మ్రొక్కుదాం" అంటాడు నిమ్రోదు. "మేఘాలకి బదులు మనం వాయువుకి మ్రొక్కుదాం. ఎందుకంటే మేఘాలను కూడా కదిలించే శక్తి గాలికి ఉంది కదా" అంటాడు అబ్రాహాము. "సరే అయితే మనం వాయువుకే మ్రొక్కుదాం" అంటాడు నిమ్రోదు. "వాయువుకి బదులు మనం మనుష్యులకు మ్రొక్కుదాం. ఎందుకంటే మనుష్యులు గాలి వచ్చినా తట్టుకుని నిలబడగలరు కదా" అని అంటాడు అబ్రాహాము. "నువ్వు మాటలతో గారడీ చేస్తున్నావు. మనం అగ్నికే మ్రొక్కుదాం. నిన్ను ఈ అగ్నిగుండంలో పడేస్తాను. నువ్వు నమ్మే దేవుడు వచ్చి నిన్ను రక్షిస్తాడో లేదో చూద్దాం" అని నిమ్రోదు అంటాడు. ఆ పక్కనే నిలబడి ఇదంతా చూస్తూ ఉన్న హారాను సందిగ్ధంలో పడతాడు. ఒకవేళ అబ్రాహాము గెలిస్తే అబ్రాహాము నమ్మేదే నేను కూడా నమ్ముతాను. లేకపోతే నిమ్రోదు పక్షాన నిలబడతాను అని తన మనస్సులో అనుకుంటాడు. అబ్రాహాము అగ్నిగుండంలోకి దిగినా అతనికి ఎటువంటి హానీ జరగదు. అప్పుడు నిమ్రోదు హారానుతో, "నువ్వు ఎవరి వైపు" అని అడిగితే, "నేను అబ్రాహాము నమ్మేదే నమ్ముతాను" అని హారాను బదులిచ్చాడు. అప్పుడు నిమ్రోదు హారానుని అగ్నిగుండంలో పడేస్తాడు. ఆ మంటల్లో కాలిపోయి హారాను మరణించాడు. ఆ విధంగా హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను (ఆదికాండము 11:28) అని యూదులు వ్యాఖ్యానం రాశారు. ఈ కథను నేను మీకు ఎందుకు చెప్పానంటే, మరి కాసేపట్లో మనం చెప్పుకోబోయే కొన్ని విషయాలకి ఈ కథకి ఒక సంబంధం ఉంది. అది మీకు కాసేపట్లోనే అర్ధం అవుతుంది. దీని తరువాతి అధ్యాయంలో అంటే, Bereishit Rabbah 39వ అధ్యాయంలో ఏముందంటే,

YHVH said to Abram, "Go forth from your land…" (Genesis 12:1) What was written prior to this matter? “…and Teraḥ died in Ḥaran.” (Genesis 11:32) Rabbi Yitzḥak said: if the matter is the math, then up to now [where Avram leaves, for Teraḥ to be dead,] it would need another 65 years, but initially, you can interpret that evildoers are called “dead” during their lives. It is because Abraham our father was afraid and said, “If I go out, they will profane the Heavenly Name through me and say that he left his father and went during his [father’s] old age. The Holy One Blessed Be He said to him, I exempt you from honoring father and mother, but I do not exempt [any] other from honoring father and mother. And not only that, but I moved forward his death to before your going out: first, “And Teraḥ died in Ḥaran.”, and afterwards “And YHVH said to Avram” (Bereishit Rabbah 39:7)

"తెరహు హారానులో మృతిబొందెను అని ఉన్న తరువాత (ఆదికాండము 11:32), యెహోవా అబ్రాహాముతో మాట్లాడుతూ, "నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము" (ఆదికాండము 12:1) అని చెప్పినట్లుగా మనం ఆదికాండంలో చూస్తాం. Rabbi Yitzḥak గారు దీనిని వివరిస్తూ ఈ విధంగా చెప్పారు - Chronological point of view లో చూసినప్పుడు, తెరహు చనిపోవడానికి ఇంకా 65 సంవత్సరాల సమయం కావాలి. అయితే, దుష్టులు బ్రతికున్నా కానీ చనిపోయిన వారితో సమానం. దేవుడు చెప్పినట్లుగా తాను హారాను విడిచి కనాను దేశానికి వెళ్ళిపోతే, వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు అని ప్రజలందరూ అనుకుంటారేమో అప్పుడు దేవుని నామానికి అవమానం కలుగుతుంది అని అబ్రాహాము భయపడ్డాడు. అయితే దేవుడు అబ్రాహాముకి తన తండ్రి పట్ల తాను నెరవేర్చాల్సిన బాధ్యతల నుండి మినహాయింపును ఇవ్వడమే కాక, అబ్రాహాము హారాను విడిచి కనాను దేశానికి వెళ్లడానికంటే ముందే తెరహు చనిపోయినట్లుగా లేఖనాలలో నమోదు చేయించాడు. అందువల్ల, తెరహు హారానులో మృతిబొందెను అన్న వాక్యాన్ని ముందుగా రాసి, ఆ తరువాత దేవుడు అబ్రాహాముతో మాట్లాడినట్లుగా వ్రాయబడింది" అని Rabbi Yitzḥak గారు చెప్పినట్లుగా Bereishit Rabbah లో వ్రాయబడి ఉంది. ఇక్కడ Rabbi Yitzḥak గారు మాట్లాడుతూ, Chronological point of view లో చూసినప్పుడు, తెరహు చనిపోవడానికి ఇంకా 65 సంవత్సరాల సమయం కావాలి అని అన్నారు. కానీ 70 + 75 ఈ రెండు కలిపితే 145 సంవత్సరాలు. 205 లో నుండి 145 తీసేస్తే మిగిలేది కేవలం 60 సంవత్సరాలే. మరి Rabbi Yitzḥak గారు, "ఇంకా 65 సంవత్సరాల సమయం కావాలి" అని ఎందుకు అన్నారు? ఈ విషయం అర్ధం కావాలంటే Bereishit Rabbah 39వ అధ్యాయంలోని ఎనిమిదవ వచనాన్ని కూడా మనం చదవాలి. ఇందులో ఏముంటుందంటే, అబ్రాహాము ముందుగా 70 సంవత్సరాల వయస్సులో ఒకసారి హారాను విడిచి కనాను దేశానికి వెళ్ళాడనీ, అక్కడి నుండి హారానుకి తిరిగి వచ్చాడనీ, ఆ తరువాత మళ్ళీ 75 సంవత్సరాల వయస్సులో శాశ్వతంగా హారాను విడిచి కనాను దేశానికి వెళ్లాడని ఉంటుంది. ఈ interpretation ప్రకారం అబ్రాహాము మొదటిసారి హారాను విడిచి వెళ్ళినప్పుడు అతని వయస్సు 70 సంవత్సరాలు. అబ్రాహాము జన్మించేటప్పటికి తెరహు వయస్సు 70 సంవత్సరాలు. 70 + 70 ఈ రెండు కలిపితే 140 సంవత్సరాలు. 205 లో నుండి 140 తీసేస్తే మిగిలేది 65 సంవత్సరాలు. అందువల్ల Rabbi Yitzḥak గారు మాట్లాడుతూ, తెరహు చనిపోవడానికి ఇంకా 65 సంవత్సరాల సమయం కావాలి అని అన్నారు. కాబట్టి Midrash లో ఉన్న దాని ప్రకారం అబ్రాహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు 70 సంవత్సరాలు. తెరహు బ్రతికిన దినములు 205 సంవత్సరాలు. అయితే తెరహు బ్రతికుండగానే, అతనికి 145 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అబ్రాహాము శాశ్వతంగా హారాను విడిచి కనాను దేశానికి వెళ్ళాడు. అబ్రాహాము వెళ్లిపోయిన తరువాత కూడా తెరహు మరో 60 సంవత్సరాలు బ్రతికే ఉన్నాడు. అయితే, వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని విడిచి వెళ్లడం నైతికంగా సరైనది కాదు కదా అనే ప్రశ్న వచ్చినప్పుడు, దానిని వివరించడం కోసం తెరహు విగ్రహారాధీకుడనీ, కాబట్టి అతను దుష్టుడనీ, దుష్టులు బ్రతికున్నా చనిపోయిన వారితో సమానమని, అందువల్ల అబ్రాహాము చేసిన దాంట్లో తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు.

Jerome’s Jewish Tradition:

క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో Jerome అనే ఒక గొప్ప భక్తుడు హీబ్రూ లేఖనాలను లాటిన్ భాషలోకి తర్జుమా చేశాడు. దీనికోసం అంటే హీబ్రూ లేఖనాల మీద పట్టు సంపాదించడం కోసం అతను రోము నగరం విడిచి బెత్లెహేములో తన నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. హీబ్రూ నుండి లాటిన్ భాషలోకి బైబిల్ ని తర్జుమా చేసే విషయంలో అతనికి కొంతమంది Jewish scholars కూడా సహాయం చేశారు. ఈ సమయంలో ఆదికాండము మీద Jerome ఒక వ్యాఖ్యానం రాశాడు. ఈ వ్యాఖ్యానాన్ని Hebrew Questions on Genesis అని అంటారు. Early Church Fathers యొక్క interpretations తో పాటు యూదుల నుండి సేకరించిన Jewish interpretations ని కూడా ఉపయోగించి Jerome ఈ వ్యాఖ్యానాన్ని రాయడం జరిగింది. తెరహు ఎంత కాలం జీవించాడు అనే విషయంలో contradiction ఉంది అని Jerome కూడా గుర్తించాడు. తాను రాసిన వ్యాఖ్యానంలో ఈ సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం కూడా చేశాడు. అంతేకాకుండా ఈ విషయంలో తాను రాసిన వివరణ ఏదైతే ఉందో, అది తన సొంత వివరణ కాదనీ, తనకు సహాయం చేసిన యూదుల నుండి సేకరించిన, హెబ్రీయుల సంప్రదాయంలో ఉన్న Jewish interpretation అని Jerome ప్రస్తావించాడు. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే, Jerome స్వతహాగా హెబ్రీయుడు కాదు కాబట్టి, ఇది అతని interpretation అయ్యుంటే గనక దీనికి మనం అంత ప్రాముఖ్యత ఇచ్చి ఉండే వాళ్ళం కాదు. కానీ ఇది హెబ్రీయుల సంప్రదాయంలో ఉన్న Jewish interpretation అని Jerome చెప్పాడు కాబట్టి, క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో జీవించిన యూదుల అభిప్రాయాలు ఎలా ఉండేవో తెలుసుకోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. Jerome రాసిన వ్యాఖ్యానంలో ఏముందంటే,

And Abram was 75 years old when he went out from Haran. A question arises which cannot be answered. For if Terah, Abram’s father, when he was still in the territory of the Chaldeans at 70 years of age fathered Abram, and afterwards died in Haran in the 205th year of his life: how is it that now, after Terah’s death, Abram went out from Haran, and is declared to have been 75 years old, when 135 years are shown to have passed from Abram’s birth up to his father’s death? Therefore that tradition of the Hebrews, which we have related above, is true; that Terah with his sons went out from the fire of the Chaldeans, and that Abram, when surrounded by the Babylonian fire because he refused to worship it, was set free by God’s help; and from that time onwards the days of his life and the measure of his age are reckoned for him, namely from that time when he acknowledged the Lord and despised the idols of the Chaldeans. (Jerome’s Hebrew Questions on Genesis 43-44)

"75 ఏళ్ళ వయస్సులో అబ్రాహాము హారాను విడిచి వెళ్ళాడు. 70 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తెరహు అబ్రాహామునకు జన్మనిచ్చి, ఆ తరువాత 205 ఏళ్ల వయస్సులో మరణిస్తే, అప్పటికి అబ్రాహాము వయస్సు 135 సంవత్సరాలు ఉండాలి. మరి తెరహు మరణించిన తరువాత అబ్రాహాము హారాను విడిచి వెళ్ళినప్పుడు అతని వయస్సు 75 సంవత్సరాలు ఎలా అయ్యింది? హెబ్రీయుల సంప్రదాయంలో ఉన్న ఒక కథనం ప్రకారం కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు అబ్రాహాము అగ్నికి మ్రొక్కడానికి నిరాకరించినప్పుడు అతనిని అగ్నిగుండంలో పడవేయగా, దేవుని సహాయంతో అబ్రాహాము దాని నుండి బయటపడ్డాడు. అప్పటి నుండి అంటే, అబ్రాహాము కల్దీయుల విగ్రహాలను తృణీకరించి యెహోవాను విశ్వసించిన రోజు నుండి, అతను క్రొత్త జీవితాన్ని ఆరంభించాడు, అలాగే అతని వయస్సు కూడా క్రొత్తగా లెక్కించబడింది" అని Jerome రాసిన వ్యాఖ్యానంలో ఉంది. హారాను ఎలా మరణించాడు అనే దాని గురించి Midrash లో ఉన్న ఒక కథను మనం ఇదివరకే చూశాం. Jerome కూడా ఇంచుమించుగా అదే కథను ఇక్కడ ప్రస్తావించాడు. అయితే Jerome ప్రస్తావించిన "Jewish Tradition" ప్రకారం, అబ్రాహామును అగ్నిగుండంలో పడవేయగా, దేవుని సహాయంతో అతను బయటపడిన సంఘటన ఏదైతే ఉందో, ఆ రోజున అతను తిరిగి జన్మించినట్లుగానూ, కల్దీయుల విగ్రహాలను తృణీకరించి యెహోవాను విశ్వసిస్తూ క్రొత్త జీవితాన్ని ఆరంభించినట్లుగానూ, అలాగే అతని వయస్సు కూడా క్రొత్తగా లెక్కించబడినట్లుగానూ ఉంది. అంటే, అబ్రాహాముకి వాస్తవంగా అరవై సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందనీ, అక్కడి నుండి 75 సంవత్సరాలకి అంటే, అప్పటికి తెరహు వయస్సు 205 సంవత్సరాలు, అబ్రాహాము యొక్క వాస్తవ వయస్సు 135 సంవత్సరాలు, అబ్రాహాము తిరిగి జన్మించి 75 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు తెరహు మరణించాడనీ, అలాగే అబ్రాహాము హారాను విడిచి కనాను దేశానికి వెళ్ళాడనీ Jerome చెబుతున్నాడు. Midrash లో ఉన్నదాని ప్రకారం, అబ్రాహాము 75 సంవత్సరాల వయస్సులో హారాను విడిచి వెళ్ళే సమయానికి తెరహు ఇంకా జీవించే ఉన్నప్పటికీ అతను చనిపోయినవాడితో సమానమని ఉంటే, Jerome చెబుతున్న "Jewish tradition" ప్రకారం మాత్రం తెరహు చనిపోయిన తరువాతే అబ్రాహాము హారాను విడిచి వెళ్ళాడు కానీ, అప్పటికి అబ్రాహాము తిరిగి జన్మించి 75 సంవత్సరాలు అయ్యింది. ఈ రెండిట్లోనూ common గా ఉన్న విషయాలు ఏంటంటే,

 1. అబ్రాహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు 70 సంవత్సరాలు.
 2. తెరహు జీవించిన కాలం 205 సంవత్సరాలు.
 3. తెరహు మరణించిన తరువాత అబ్రాహాము హారాను విడిచి వెళ్ళాడు.
 4. అప్పుడు అబ్రాహాము వయస్సు 75 సంవత్సరాలు.

అయితే ఇది ఎలా సాధ్యమయ్యింది? అనేదే ఈ రెండూ కూడా వివరించే ప్రయత్నం చేశాయి కానీ, వేరు వేరు మార్గాలను ఎన్నుకున్నాయి. ఇక్కడ Jerome చెబుతున్న "Jewish Tradition" లో చాలా సమస్యలు ఉన్నాయి. అబ్రాహాము కనాను దేశానికి వెళ్లిన తరువాత అతని జీవితంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన chronology అంతా కూడా గందరగోళంగా తయారవుతుంది. అందువల్ల ఈ అభిప్రాయాన్ని ఎవరూ అంగీకరించకపోవడంతో కాలక్రమంలో ఇది కనుమరుగైపోయింది. Midrash లో ఉన్న విషయాలు, అలాగే Jerome చెబుతున్న "Jewish Tradition" లో ఉన్న విషయాలు, ఈ రెండిటికి మూలాలు మనకు క్రీస్తు పూర్వం మొదటి రెండు శతాబ్దాలలో వచ్చిన "Second Temple Jewish Literature" లో కనిపిస్తాయి.

The Book Of Jubilees:

క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో రాసిన "The Book Of Jubilees" అనే పుస్తకంలో, Midrash లో ఉన్నట్లుగానే తెరహు విగ్రహారాధీకుడనీ, మనుష్యుల చేత్తో చేసిన విగ్రహాలను కాకుండా, సమస్తమును సృష్టించిన దేవుడికి మాత్రమే మ్రొక్కాలి అని అబ్రాహాము తెరహుతో వాదించినట్లుగా, ఇలా అనేక విషయాలు మనకు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఇందులోని పదకొండవ అధ్యాయం పదవ వచనం ప్రకారం, ఆదాము సృష్టింపబడిన తరువాత 1806 సంవత్సరాలకు తెరహు జన్మించాడు. పదిహేనవ వచనం ప్రకారం, ఆదాము సృష్టింపబడిన తరువాత 1876 సంవత్సరాలకు అబ్రాహాము జన్మించాడు. అంటే అబ్రాహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు 70 సంవత్సరాలు.

And she bare him Terah in the seventh year of this week. [1806 A.M.] (The Book Of Jubilees 11:10)

And in the seventh year of this week [1876 A.M.] she bare him a son, and he called his name Abram, by the name of the father of his mother; for he had died before his daughter had conceived a son. (The Book Of Jubilees 11:15)

పన్నెండవ అధ్యాయంలో ఉన్న వివరాల ప్రకారం, అబ్రాహామునకు అరవై సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఒకరోజు రాత్రి విగ్రహాలు ఉన్న ఆలయానికి అబ్రాహాము నిప్పు పెట్టాడు. మంటల్లో కాలిపోతూ ఉన్న విగ్రహాలను కాపాడటానికి ప్రయత్నించిన హారాను, ఆ మంటల్లో పడి కాలిపోయి చనిపోయాడు. ఇక్కడ కొంత భిన్నంగా ఉన్నప్పటికీ Midrash లో కూడా హారాను మంటల్లో పడి కాలిపోయినట్లుగా మనం చూస్తాం. Midrash లో చెప్పబడిన సంఘటన జరిగినప్పుడు అబ్రాహాము వయస్సు అరవై సంవత్సరాలు అని Jerome ప్రస్తావించిన "Jewish Tradition" లో ఉంది. The Book Of Jubilees లో కూడా అబ్రాహాముకి అరవై సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరిగినట్లు, ఆ సమయంలో హారాను మరణించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఉన్న వివరాలు కొంత భిన్నంగా ఉన్నప్పటికీ వీటిల్లో కొన్ని common elements ఉండటాన్ని మనం గమనించవచ్చు.

And in the sixtieth year of the life of Abram, that is, in the fourth week, in the fourth year thereof, [1936 A.M.] Abram arose by night, and burned the house of the idols, and he burned all that was in the house and no man knew it. (The Book Of Jubilees 12:12)

అలాగే పన్నెండవ అధ్యాయం 16 మరియు 28వ వచనాలను మనం చూస్తే, అబ్రాహాముకి 75 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించినట్లుగాను, మరో రెండు సంవత్సరాలకి అంటే అబ్రాహాముకి 77 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతను హారాను విడిచి కనాను దేశానికి వెళ్ళినట్లుగానూ ఉంటుంది.

And in the sixth week, in the fifth year thereof, [1951 A.M.] Abram sat up throughout the night on the new month of the seventh month to observe the stars from the evening to the morning, in order to see what would be the character of the year with regard to the rains, and he was alone as he sat and observed. (The Book Of Jubilees 12:16)

And it came to pass in the seventh year of the sixth week [1953 A.M.] that he spoke to his father and informed him, that he would leave Haran to go into the land of Canaan to see it and return to him. (The Book Of Jubilees 12:28)

Dead Sea Scrolls - Q4252:

Qumran Caves లో దొరికిన Dead Sea Scrolls లో 4Q252 అనే ఒక manuscript ఉంది. దీనినే "4QCommentary on Genesis A" అని కూడా అంటారు. ఇది క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దానికి చెందినది. ఆదికాండములోని కొన్ని విషయాలకి సంబంధించిన వ్యాఖ్యానాలను మనం ఈ manuscript లో చూడొచ్చు. ఇవి సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం రాసినవి కాబట్టి శాస్త్రవేత్తలు వీటిని కనుగొనేటప్పటికే బాగా శిథిలావస్థలో ఉన్నాయి. కొంత భాగం చినిగిపోతే, మరికొంత భాగం బాగా పాడయిపోయి కేవలం చిన్న చిన్న ముక్కలు మాత్రమే మిగిలాయి. ఇక్కడ క్రింద మీద మీరు చూస్తున్నట్లుగా 4Q252 manuscript కి సంబంధించి కేవలం ఆరు fragments మాత్రమే దొరికాయి.

వీటిల్లో Fragment No. 1 మరియు Fragment No. 3 ని మనం చూసినట్లయితే, ఇందులోని second column, Line No. 8 నుండి Line No. 10 వరకు ఏముందంటే, "తెరహు కల్దీయుల ఊరు అనే పట్టణం నుండి హారాను వెళ్ళినప్పుడు అతని వయస్సు నూట నలభై సంవత్సరాలు. మరియు అబ్రాము వయస్సు డెబ్బయి సంవత్సరాలు. హారానులో అబ్రాము అయిదు సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతను కనాను దేశానికి వెళ్ళాడు" అని ఉంది. ఆ తరువాత "అరవై" అనే పదం ఉండటాన్ని మనం గమనించవచ్చు. కానీ దాని తరువాత ఏముందో మనకి తెలీదు. ఎందుకంటే మిగిలిన భాగం పూర్తిగా పాడైపోయి మనకి అందుబాటులో లేకుండా పోయింది. బహుశా "అబ్రాహాము కనాను దేశానికి వెళ్లిన తరువాత మరో అరవై సంవత్సరాలకి తెరహు మరణించాడు" అని అక్కడ ఉండి ఉంటుంది అని ఈ manuscript మీద పరిశోధనలు చేసిన George J. Brooke అనే scholar అభిప్రాయపడ్డారు. మరికొంతమంది scholars అభిప్రాయం ప్రకారం, అక్కడ "తెరహు హారానులో అరవై అయిదు సంవత్సరాలు జీవించాడు" అని రాసి ఉండే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ 4Q252 లో ఉన్న interpretation, అలాగే Midrash లో ఉన్న interpretation ఈ రెండూ కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి. అయితే, తెరహు బ్రతికున్నా చనిపోయిన వాడితో సమానము అనే interpretation ని Midrash లో అదనంగా చేర్చారు.Conclusion:

సరే ఇక చివరిగా ఇప్పటివరకు మనం చూసిన ఈ different sources అన్నిటిని కూడా summarize చేస్తూ ఒక conclusion కి వచ్చే ప్రయత్నం చేద్దాం. అబ్రాహాము జన్మించే సమయానికి తెరహుకి ఎన్ని సంవత్సరాలు అనే విషయంలో Masoretic Text మరియు Greek Spetuagint లో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ, మిగిలిన Ancient Sources అన్నిట్లో కూడా అబ్రాహాము జన్మించే సమయానికి తెరహు వయస్సు 70 సంవత్సరాలు అని స్పష్టంగా ఉంది. వీళ్ళ interpretation కరెక్టా కాదా అనేది చర్చనీయాంశమే. అయితే, Philo మరియు స్తెఫను, వీరిద్దరూ కూడా మొదటి శతాబ్ద కాలంలో జీవించిన యూదులు. అప్పటి యూదా సమాజంలో విస్తృతంగా ఉన్న ఒక అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వీరు కలిగి ఉంటారా? అంటే most probably NO అని చెప్పడానికి మనం పెద్దగా సందేహించాల్సిన అవసరం లేదు. ఇక హారాను విడిచి పెట్టే సమయానికి అబ్రాహాముకి ఎన్ని సంవత్సరాలు అనే విషయంలో దాదాపుగా అన్ని sources లో కూడా 75 సంవత్సరాలు అనే ఉంది. Jerome's Jewish Tradition ప్రకారం మాత్రం అబ్రాహాము తిరిగి జన్మించి 75 సంవత్సరాలు అని ఉంటే, The Book of Jubilees లో కొద్దిగా తేడా ఉన్నప్పటికీ, 75 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు దేవుడు అబ్రాహామును దర్శించినట్లుగా ఉంది. ఇక Jerome's Jewish Tradition ని పక్కన పెడితే, దాదాపుగా అన్ని sources లో కూడా అబ్రాహాము హారాను విడిచి కనాను దేశానికి వెళ్లే సమయానికి తెరహు వయస్సు 145 సంవత్సరాలు అని ఉండటాన్ని మనం గమనించవచ్చు. తెరహు చనిపోయిన తరువాత అబ్రాహాము హారాను విడిచి కనాను దేశానికి వెళ్ళాడు అని స్తెఫను మరియు Philo ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి చూస్తే, వారిద్దరూ కూడా తెరహు 145 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అని మనం భావించవచ్చు. అలాగే తెరహు చాలా తక్కువ కాలానికే మరణించడానికి కారణం ఇది అని Flavius Josephus ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకుని చూస్తే, బహుశా అతను కూడా original గా తెరహు జీవించిన కాలం 145 సంవత్సరాలు అనే రాసి ఉంటాడు అని కొంత మంది scholars యొక్క అభిప్రాయం. అలాగే Philo ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి చూస్తే ఆ కాలంలో ఉన్న Septuagint manuscripts లో కూడా బహుశా తెరహు జీవించిన కాలం 145 సంవత్సరాలు అని ఉండి ఉండవచ్చు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే, Masoretic text లో బహుశా scribal error ఉండి ఉండొచ్చనీ, నిజానికి తెరహు జీవించిన కాలం 145 సంవత్సరాలు మాత్రమే అనే ఒక logical conclusion కి మనం రావలసి ఉంటుంది. తెరహు ఖచ్చితంగా 145 సంవత్సరాలు మాత్రమే జీవించాడా అని గనక మీరు నన్ను అడిగితే, I would say that I am not 100% sure, but most probably this could be the case.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.