బైబిల్ దేవునిపై చెయ్యబడుతున్న విమర్శలలో, ఆయన ఇశ్రాయేలీయుల చేత కనానీయులను చంపించి, వారి దేశాన్ని దురాక్రమణ చేయించాడు అనేది ఒక ప్రధానమైన అభియోగం (నిర్గమకాండము 23:24, సంఖ్యాకాండము 33:51-53, ద్వితీయోపదేశకాండము 7:16, 20:16, యెహోషువ 6:21, 10:40). ఈ విమర్శను ప్రాముఖ్యంగా హ్యూమనిస్టులుగా పిలవబడే ఒక గుంపువారు చేస్తుంటారు. నాకు ఈ గుంపును తలుచుకున్నప్పుడల్లా మన తెలుగులో "తాడు బొంగరంలేనివాడు" అనే సామెత గుర్తుకు వస్తుంది. ఎందుకంటే వీరికంటూ ఏ నైతిక ప్రమాణం లేదు. హ్యూమనిజంలో నేను ఏ హ్యూమన్ ని ప్రామాణికంగా తీసుకోవాలి, హిట్లర్ నా లేక మథర్ థెరిస్సానా? అనే ప్రశ్నకు వీరి దగ్గర సమాధానం లేదు. హిట్లర్ లక్షలమంది ప్రజలను చిన్నపిల్లలతో సహా ఊచకోత కోసాడు, మథర్ థెరిస్సా లక్షలమందికి ఉన్నతమైన సేవలు చేసింది. కానీ ఆ ఇద్దరూ కూడా హ్యూమన్శ్ యే. ఒకవేళ వీరు మథర్ థెరిస్సానే ప్రమాణికంగా తీసుకోవాలంటే ఆమె అనుసరించిన ప్రవర్తన సరైనదని వీరు ఏ కొలమానం ఆధారంగా చెబుతారు? మానవ విలువల గురించి మాట్లాడేవీరికి వాటి గురించి ఎలా తెలుసు? హిట్లర్ మనిషి కాడా మరి? అతని విలువలను ఎందుకు పాటించకూడదు? అసలు ప్రపంచానికి మానవ విలువలు నేర్పించిందే బైబిల్. ఆ బైబిల్ లో ఉన్న మానవ విలువలు కొన్నిటిని దొంగిలించి, అదే బైబిల్ దేవునిపై ఆరోపణలు చెయ్యడం హ్యూమనిస్టుల నీచపు బుద్ధికి మంచి నిదర్శనం.
ఈరోజు ప్రపంచం పాపంలో మునిగిపోవడానికి ప్రధాన కారణమైన మానవస్వేచ్చా సిద్ధాంతం ఈ హ్యూమనిస్టుల ఘనకార్యమే. మానవ స్వేచ్చను నేను కూడా గౌరవిస్తాను, బైబిల్ దానిని స్పష్టంగా బోధిస్తుంది, కానీ వీరు తీసుకువచ్చిన స్వేచ్చా సిద్ధాంతం నైతికత పరిధిలో ఉండదు. ఉదాహరణకు; స్వలింగ సంపర్కం, అబార్షన్, వ్యభిచారం, జంతుశయనం. ప్రస్తుతం ఇవన్నీ చట్టపరంగా మారిపోవడం వీరు తీసుకువచ్చిన స్వేచ్చా సిద్ధాంతంలో భాగమే.
ఇక వీరు కనానీయుల విషయంలో బైబిల్ దేవునిపై చేస్తున్న విమర్శ దగ్గరకు వద్దాం;
నిజానికి కనానీయుల ప్రాంతాన్ని ఇశ్రాయేలీయులు దురాక్రమణ చెయ్యలేదు, అబ్రాహామును బట్టి వారికి 400 సంవత్సరాల ముందు వాగ్దానం చెయ్యబడిన దేశాన్నే స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం మనకు అబ్రాహాముకు దేవుడు చేసిన ప్రమాణం విషయంలో స్పష్టమౌతుంది.
ఆదికాండము 15:18-21
ఆ దినమందే యెహోవాఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా కేనీయు లను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరి జ్జీయులను రెఫాయీయులను అమోరీయులను కనా నీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతాన మున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.
దేవుడు అబ్రాహామును కనానుకు రప్పించిందే ఆ దేశాన్ని అతని సంతానానికి స్వాస్థ్యంగా ఇవ్వడానికి (ఆదికాండము 12:1,2). ఈ కారణంగా ఇశ్రాయేలీయులు చేసినదానిని దురాక్రమణ అనలేము. సమస్త భూమీ దేవునిదే అయినప్పుడు (ద్వితీయోపదేశకాండము 10:14) తాను కోరుకున్న ప్రజలకు ఆ భూమిని పంచడం ఆయన ఇష్టమే కదా! (దానికి న్యాయబద్ధమైన కారణాలు ఉంటాయి).
దేవుడు కనానీయులను నాశనం చేసి ఆ భూమిని ఇశ్రాయేలీయులకు పంచడమే కాదు, హోరీయులు అనే జాతి ప్రజలను కూడా వెళ్ళగొట్టి "ఆయన ద్వేషించిన" (రోమా 9:13) ఏశావు సంతానానికి ఆ ప్రాంతాన్ని పంచాడు.
ద్వితియోపదేశకాండము 2: 5
వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చి యున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను.
ద్వితియోపదేశకాండము 2: 22
అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానముకొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి యెదుటనుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటి వరకు వారిచోట నివసించుచున్నారు.
శపించబడిన లోతు సంతానమైన అమ్మోనీయులకూ మోయాబీయులకు కూడా ఆయన ఆవిధంగానే చేసాడు.
ద్వితీయోపదేశకాండము 2:18-21
అమ్మోనీయుల మార్గమున వెళ్లునప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను. వారు అనాకీయులవలె ఉన్నత దేహులు, బలవంతు లైన బహు జనులు. అయితే యెహోవా అమ్మోనీయుల యెదుటనుండి వారిని వెళ్లగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి చోట నివసించిరి.
కాబట్టి దేవుడేమీ ఇశ్రాయేలీయులపై పక్షపాతంతో కనానీయులను సంహరించేసి వారి దేశాన్ని వీరికి పంచివ్వలేదు. ఎందుకంటే ఆయన ప్రజలు కానివారైన (ద్వేషించిన) ఏశావు సంతానానికీ, శపించబడిన లోతు సంతానానికి కూడా ఆయన అప్పటికే కొందరు నివసిస్తున్న భూభాగాలను పంచియిచ్చాడు. "దానికి ఆ పూర్వప్రజల పాపమే ప్రధానమైన కారణం". అందుకే వారిని వెళ్ళగొట్టి అక్కడ వేరేవారిని స్థాపించాడు. భూమిని సృష్టించిన దేవునిగా ఇది ఆయనకు న్యాయమే.
యిర్మీయా 27:5,6
అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబు కద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులనుకూడ అతని వశము చేయుచున్నాను.
కీర్తనలు 9: 5
నీవు అన్యజనులను గద్దించి యున్నావు, దుష్టులను నశింపజేసి యున్నావు వారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టియున్నావు.
బైబిల్ లో రాయబడిన చరిత్రను ఆధారం చేసుకుని విమర్శలు చేసేవారు, అదే బైబిల్ లో ఉన్న ఇతర మాటలను బట్టి సమాధానం ఇచ్చినప్పుడు స్వీకరించాలి మరి.
నేను పైన చెప్పినట్టుగా, ఇశ్రాయేలీయులు కనానీయుల జాతులను అంతం చేసి వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవడం, అబ్రాహాముకు దేవుడు చేసిన ప్రమాణాన్ని బట్టి మాత్రమే జరగలేదు, కనానీయులు చేసిన ఘోర పాపాలను బట్టి వారిపైకి వచ్చిన దేవుని తీర్పువల్ల కూడా అలా జరిగింది.
ద్వితీయోపదేశకాండము 9:4-6
నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి వారిని తోలి వేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీన పరచుకొనునట్లుగా యెహోవా నా నీతినిబట్టి నన్ను ప్రవేశ పెట్టెనని అనుకొనవద్దు. "ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ యెదుట నుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు". నీవు వారి దేశ మునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతియైనను నీ హృదయ యథార్థతయైనను హేతువుకాదు. "ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణముచేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్నాడు"
ఈవిధంగా దేవుడు ఇశ్రాయేలీయులకు కనానును స్వాధీనపరచడానికి ఆయన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణంతో పాటు, కనాను దేశంలో నివసిస్తున్న ప్రజల చెడుతనం కూడా ప్రధానమైన కారణం. అసలు ఆయన అబ్రాహామును ఏర్పరచుకుని కనానుకు రప్పించిందే కనానులో ఉన్న ప్రజలపట్ల ఆయన తీర్పును ప్రకటించి, తదుపరి అబ్రాహాము సంతానాన్ని అక్కడ స్థాపించడానికి. అందుకే ఆయన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించి వారిని కనాను దేశానికి తీసుకువస్తున్నప్పుడు వారిని ఆయన "సేనలుగా" (యుద్దసైన్యంగా) వర్ణించడం జరిగింది.
నిర్గమకాండము 12: 41
ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను.
ఇంతకూ కనానీయులపై దేవుని తీర్పు ఎందుకో తెలియాలంటే, అసలు వారు పాటించే మహా గొప్ప సంస్కృతి గురించి మనకు తెలియాలి. ఎందుకంటే ఈ హ్యూమనిస్టులు మాటిమాటికీ 'అదిగో బైబిల్ దేవుడు కనానీయుల సంస్కృతిని నాశనం చేయించాడని' వాపోతుంటారు. అందుకే వారి సంస్కృతి ఏంటో, వారి విషయంలో ఈ హ్యూమనిస్టులకు అంత నొప్పి ఎందుకో వరుసగా వివరించే ప్రయత్నం చేస్తాను.
విచ్చలచిడి లైంగిక సంబంధాలు:
లేవీయకాండము 18వ అధ్యాయం 6-17 వచనాలను మనం పరిశీలించినప్పుడు, దేవుడు అక్కడ లైంగిక సంబంధాల విషయంలో నియంత్రణలు విధించుకుంటూ వెళ్తాడు. అందులో; తల్లితోనైనా (స్వంత తల్లి/తండ్రి వేరొక భార్య), సహోదరితోనైనా, మనువరాలితోనైనా, మేనత్తతోనైనా, పిన్నమ్మ/పెద్దమ్మతోనైనా, కోడలితోనైనా, వదిన/మరదలుతోనైనా,..ఇలా ఎవరితో లైంగిక సంబంధం కలిగియుండకూడదో లేక ఏ వరుసవారిని వివాహం చేసుకోకూడదో వివరిస్తాడు (స్త్రీలైతే తమ కోణం నుండి ఈ వరసలను ఆపాదించుకోవాలి). అదంతా అయిపోయాక ఆయన ఒక మాట అంటాడు అదేంటో చూడండి.
లేవీయకాండము 18:24,25
వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.
ఈ వచనాల ప్రకారం; కనాను దేశంలో ఉన్న ప్రజలు కనీసం తల్లీ కొడుకూ, తండ్రి కూతురూ, అన్నా చెల్లీ ఇలాంటి వరుసలు కూడా పట్టించుకోకుండా లైంగికసంబంధాలు పెట్టుకునేవారు. ఇది ఇతరులతో లైంగిక సంబంధం పెట్టుకోవడం కంటే చాలా హేయమైన చర్య కాబట్టి దేవుడు ఆ విషయాన్ని ఇశ్రాయేలీయులకు తెలియచేసి జాగ్రతగా ఉండమంటున్నాడు.
లేవీయకాండము 18:3-5
నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలను బట్టి నడవకూడదు.
మీరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; మీ దేవుడనగు నేను యెహోవాను. "మీరు నాకట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును" నేను యెహోవాను.
కనానీయులను దేవుడు అన్యాయంగా చంపించేసాడని ఆరోపణలు చేస్తున్న హ్యూమనిస్టులు వారు పెట్టుకున్న ఈ లైంగిక సంబంధాలను సమర్థిస్తారా మరి? ఓ క్షమించాలి మరచిపోయాను, హ్యూమనిస్టులకు అది నేరంగా భావించడానికి ఎలాంటి నైతికప్రమాణమూ లేదు కదా! అందుకే వారి దృష్టిలో ఇద్దరికీ అంగీకారమైతే ఎవరు ఎవరితో అయినా లైంగిక సంబంధం పెట్టుకోవచ్చు (తల్లీ కొడుకులు కూడా), అది మానవహక్కు/స్వేచ్చ. కానీ మనసాక్షి ద్వారా కానీ లేఖనాల ద్వారా కానీ దేవుడు బోధించిన నైతికప్రమాణాన్ని కలిగినవారు అలాంటి లైంగికచర్యలను ఎంతమాత్రమూ సహించరు, వాటిని అత్యంత నీచంగా భావిస్తారు. ఒకవేళ నేనే కనుక చట్టాలను నిర్మించే స్థాయిలో ఉండి అలాంటి చర్యలకు పాల్పడినవారు నాదగ్గరకు వస్తే, ఆ ఇద్దరినీ ఏం చేసి చంపాలో అలానే చేసి చంపిద్దును (చట్టపరంగా).
జంతు శయనము:
లేవీయకాండము 18:22-25
స్త్రీ శయనమువలె పురుషశయనము కూడదు; అది హేయము. ఏ జంతువు నందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము. వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. "నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది".
లేవీయకాండము 20:15-23
జంతుశయ నము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను .స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమశిక్షకు తామే కారకులు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. "వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని".
ఈ సందర్బాలను బట్టి, కనాను ప్రాంతపు ప్రజలు జంతుశయనం చేసే సంస్కృతిగలవారని మనకు అర్థమౌతుంది. అప్పటికే వారు వావి వరుసలు లేకుండా ఇష్టానుసారంగా లైంగికసంబంధాలు పెట్టుకున్నారు, అది సరిపోదన్నట్టుగా జంతుశయనం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాలపై వారి దేవతలపై పరిశీలనలు చేసిన కొందరు చరిత్రకారుల వివరణ ప్రకారం అది వారి దైవభక్తిలో ఒక భాగం (లైంగికసంబంధాలు కూడా). ఇలాంటి చర్యలు హ్యూమనిస్టులకు; మానవహక్కుగా/స్వేచ్చగా అనిపిస్తాయేమో కానీ దేవునికీ ఆయన ప్రజలకూ మాత్రం ఇవి చాలా చండాలంగా అనిపిస్తాయి. అందుకే జంతుశయనం గురించి "అది విపరీతము" అని రాయబడింది.
స్వలింగ సంపర్కం:
లేవీయకాండము 20:13,23
ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన యెడల వారిద్దరు హేయక్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. "వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని"
చూడండి; ఈ కనానీయులు వావి వరుసలు లేని లైంగికసంబంధాలు, జంతుశయనాలతోనే ఆగిపోకుండా స్వలింగ సంపర్కానికి కూడా తెగబడ్డారు. ఈరోజు ఆయా దేశాల్లో ఈ హేయమైన స్వలింగ సంపర్కం చట్టపరం అవ్వడానికి హ్యూమనిస్టుల పోరాటాలే లేక వారు తీసుకువచ్చిన స్వేచ్చా సిద్ధాంతాలే కారణం. ఎందుకంటే ఇది హ్యూమనిస్టులకు/చాలామంది బైబిల్ విమర్శకులకు చాలా ఇష్టమైన కార్యం (మానవహక్కు). అందుకే అలాంటిపనులు చేసే సొదొమ పట్టణస్తులనూ కనాను ప్రజలనూ నాశనం చేసాడనే కారణంతో బైబిల్ దేవునిపై, ఆయన పిల్లలపై ఇంతలా పగపట్టారు.
మొదటి పేతురు 4:4,5
అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. "సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు"
రోమీయులకు 1:26-28
అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
క్రూరత్వం:
లేవీయకాండము 19:13,33
నీ పొరుగువాని హింసింప కూడదు, వాని దోచుకొనకూడదు, మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు.
పై సందర్భాలవలే, ఇలాంటి హింసా ప్రవృత్తి కూడా కనానీయుల్లో ఉంది కాబట్టి దేవుడు ఆ విషయంలో కూడా ఇశ్రాయేలీయులను ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాడు.
పసిపిల్లల బలులు:
లేవీయకాండము 18:21-25
నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయ కూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.
ద్వితీయోపదేశకాండము 12:31
తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవు డైన యెహోవాను గూర్చి చేయవలదు, "ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కూమా రులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చి వేయుదురు గదా".
ఈ వచనాల ప్రకారం; కనానీయులు తమ స్వంత పిల్లలను తమ దేవతలకు బలులుగా అర్పించేవారు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటివారిని ఇశ్రాయేలీయుల చేత చంపించడం, న్యాయమా లేక నేరమా? మేము హ్యూమనిస్టులము, మానవ హక్కులకోసం పోరాడేవారమని మహా గొప్పగా చెప్పుకుంటుంటారుగా, కాసేపు చిన్నపిల్లల ప్రాణాలకోసం కూడా ఆలోచించండి మరి. గతంలో ఒక మతోన్మాది ఈ ఆధారాలన్నిటినీ విస్మరిస్తూ "కుక్కను కొట్టిచంపాలంటే పిచ్చి కుక్క అని ముద్రవేసినట్టు" మోషే కూడా ఈ కనానీయులపై అలాంటి అబద్ధపు ఆరోపణలు మోపి చంపించివేసాడని మాట్లాడాడు. మోషే రాసిన చరిత్రను ఆధారం చేసుకుని "బైబిల్ దేవుడు కనానీయులను చంపించేసాడని గగ్గోలుపెట్టేవారు, ఇంతకూ వారిని ఎందుకు చంపమన్నాడో అదే మోషే రాసిన మాటలను మాత్రం అబద్ధంగా చిత్రీకరించడం బైబిల్ విమర్శకుల కుయుక్తికి మంచి ఆధారం".
పసిపిల్లలను బలిగా అర్పించే కనానీయుల సంస్కృతి గురించి బైబిల్ కు బయట (archeology) కూడా మనకు ఎన్నో ఆధారాలు లభించాయి. ఉదాహరణకు; "పాలస్తీనా excavation department" కు Director గా పని చేసిన "Robert Alexander Stewart Macalister" గారు (1870-1950) కనానీయులలో ఒకజాతియైన అమోరీయులు నివసించిన Gezer అనే ప్రాంతంలో తవ్వకాలు చేసారు. ఇది ఎత్తైన కొండప్రాంతం, అమోరీయులు ఇక్కడే నివసించేవారని బైబిల్ చెబుతుంది (నిర్గమకాండము 13:29, యెహోషువ 10:6 ఇంగ్లీష్ బైబిల్ లో స్పష్టంగా ఉంది). అక్కడ తవ్వకాలు జరిపించిన ఆయన 12 దేవతా స్థంబాలను కనుగొని వాటి క్రిందకు తవ్వకాలు జరిపినప్పుడు ఆయనకు అనేకమైన కూజాలు (కుండలు) కనిపించాయి. వాటిని తెరచి చూసినప్పుడు ఒకవారం కంటే తక్కువ వయస్సున్న పసిపిల్లల దేహాలు (ఎముకలు) అందులో పెట్టబడియున్నాయి. పైగా ఆ పసిపిల్లలను ముందే అగ్నిలో కాల్చివేసి, చనిపోయిన ఆ దేహాలను మరలా అగ్నినుండి తీసి ఆ కూజాలలో పెట్టి ఆ దేవతాస్థంబాల పక్కనున్న శిలాద్వారం ద్వారా ఆ దేవతాస్థంబం కింద ఉన్న గుహలోకి చేర్చారు. ఈ విషయాలు అన్నీ ఆయన "Bible side-light" అనే పుస్తకం "Iniquity of the amorite" అనే అధ్యాయంలోనూ, "The excavation of Gezer" అనే పుస్తకంలోనూ వివరించారు.
అక్కడ లభించిన ఎముకలు అన్నీ చాలామట్టుకు ఒక వారం లోపు పసిపిల్లలవే. అందులో కొన్ని దహనబలిగా అర్పించి, చనిపోయాక ఆ శరీరాన్ని బయటకు తీసి కూజాలో పెట్టి పాతిపెట్టినవైతే మరికొన్ని తలను నరికి చంపినవి, అక్కడ దొరికిన ఒక యువతి దేహాన్ని (ఎముకలను) పరిశీలించినప్పుడు ఆమె శరీరాన్ని రెండుగా నరికి చంపినట్టు నిర్థారణకు వచ్చారు, మరో అమ్మాయిని తల నరికి పాతిపెట్టారు, ఇంకో అమ్మాయికి చేతిని నరికేసి పాతిపెట్టారు. ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా యవ్వన వయస్సున్న వారే. అక్కడ దేవతాస్థంబాల దగ్గర దొరికినవాటిలో ఈ ముగ్గురి ఎముకలు మాత్రమే పెద్ద వయసువారివి. మిగిలినవన్నీ వారం లోపు పసిపిల్లలవే. వీటన్నిటినీ పరిశీలించిన "Robert Alexander Stewart Macalister" గారు; కనానీయులు (అమోరీయులు) ఏదో అప్పుడప్పుడూ మాత్రమే పిల్లలను బలులుగా ఇచ్చేవారు కాదని, తమకు తొలిచూలు పిల్ల/పిల్లవాడు పుట్టగానే ఇది మోలెకు దేవతకు బలి, ఇది అష్తారోతు దేవతకు బలి, ఇది బయలు దేవతకు బలి అని ఇలా ప్రతిష్ట చేసి సంతోషంగా బలులు అర్పించేవారని, ఒక్కోదేవతకూ ఒక్కో విధంగా ఆ బలిని అర్పించేవారని తెలియచేసారు.
ఉదాహరణకు: మోలెకు దేవతకు దహనబలి అర్పించి, మరలా ఆ శవాన్ని (సగం కాలిన) తీసి కూజాలో పెట్టి ఆ దేవతా స్థంబం క్రింద గుహలో పడవెయ్యాలి/పాతిపెట్టాలి. కనానీయుల్లో పసిపిల్లల బలులు ఇంత దారుణంగా ఉండేవి (తొలిచూలు పిల్లలు). అక్కడ రాళ్ళపై చెక్కబడిన వారి దేవతల రూపాలు పసిపిల్లల పుర్రెలపై నిలబడియున్నట్టు చిత్రీకరించబడ్డాయి. మధ్యమధ్యలో వీరు ఆ దేవతలకు బానిసలను కూడా బలులుగా అర్పించేవారు, బహుశా అక్కడ దొరికిన అమ్మాయిల ఎముకలును బట్టి వారు బానిసలై యుండవచ్చు. "Schumacher" అనే పురాతత్వ శాస్త్రవేత్త కూడా తవ్వకాలు జరిపి ఈ విషయాలను నిర్థారించాడు. కాబట్టి కనానీయులు పసిపిల్లలను తమ దేవతల పేరిట బలులు అర్పించేవారని చెప్పడానికి బైబిల్ కు బయటకూడా మనకు తిరుగులేని ఆధారాలు ఉన్నాయి. ఇంత దారుణమైన సంస్కృతిగల ప్రజలను నాశనం చెయ్యడం, ఆ దేవతా ప్రతిమలను పగలగొట్టమని చెప్పడం (నిర్గమకాండము 23:24) ఎలా నేరమౌతుంది? హ్యూమనిస్టులే/బైబిల్ విమర్శకులే సమాధానం చెప్పాలి.
యెషయా గ్రంథము 57:3-5
మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరక్కడికి రండి. మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?మస్తచావృక్షములను చూచి పచ్చని ప్రతిచెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతిసందులక్రింద పిల్లలను చంపువారలారా -
కనానీయులు ఇంతవరకూ నేను వివరించినవే కాకుండా మరెన్నో హేయమైన కార్యాలను కూడా జరిగించారు.
ద్వితీయోపదేశకాండము 18:9-14
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.
తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. "ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు". నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.
ద్వితియోపదేశకాండము 12: 31
తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కూమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చి వేయుదురు గదా.
అయినా కూడా దేవుడు వారు మార్పు చెందడానికి సుమారు 400 సంవత్సరాలు సమయం ఇచ్చాడు (ఎందుకు ఇచ్చాడో చివరిలో చూద్దాం)
ఆదికాండము 15: 16
అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
ఆ సమయంవరకూ వారిని అనేకవిధాలుగా హెచ్చరిస్తూనే వచ్చాడు.
ద్వితీయోపదేశకాండము 8:20
"నీ యెదుటనుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు" మీ దేవు డైన యెహోవా మాట మీరు వినకపోయినయెడల మీరును వారివలెనే నశించెదరు.
ఆ నాలుగువందల సంవత్సరాలు గడిచేవరకూ అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన కనానును స్వాధీనం చెయ్యలేదు, వారి సంతానమైన ఇశ్రాయేలీయులను కూడా 215 సంవత్సరాలు ఐగుప్తులోనే బానిసలుగా ఉంచాడు. అమోరీయుల (కనానీయుల) పాపం పరిపూర్ణమైంది. ఇక అప్పుడే ఆయన ఇశ్రాయేలీయులను తన సైన్యంగా కనానుకు రప్పించి వారిని హతం చేయించాడు. ఇక్కడ మనం గమనించవలసిన మరో విషయం ఏమిటంటే, దేవుడు తలచుకుంటే సొదొమ పట్టణాలను నాశనం చేసినట్టు వారిని నాశనం చేయొచ్చు, కానీ అలా చెయ్యకుండా ఇశ్రాయేలీయుల చేతిలోనే వారిని ఎందుకు చంపించాడంటే, అది ఇశ్రాయేలీయులకు కూడా ఒక హెచ్చరికగా ఉంటుంది. భవిష్యత్తులో వీరు కూడా అలాంటి పనులే చేస్తే ఆయన వీరినీ అదేవిధంగా ఇతర సైన్యాల చేత సంహరిస్తాడు.
లేవీయకాండము 26:17
నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.
ఇశ్రాయేలీయుల చరిత్రను మనం పరిశీలించినప్పుడు వారు కూడా కనానీయులవలే ప్రవర్తించినప్పుడు (కీర్తనలు 106:37, యిర్మియా 7:31, యెహెజ్కేలు 16:20) ఆయన వారిపైకి కూడా ముందే హెచ్చరించినట్టుగా (ద్వితీయోపదేశకాండము 4:27) సైన్యాలను పంపించి నాశనం చేయించాడు. అష్షూరు రాజులను, బబులోను రాజులను ప్రేరేపించి వారి చేతిలో ఇశ్రాయేలీయులు విస్తారంగా హతమయ్యేటట్టు చేసాడు. ఎందుకంటే ఆయన పాపాన్ని సహించడు.
యెషయా గ్రంథము 10:5,6
అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది. భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను.
యెషయా 46: 11
తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెర వేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.
చివరిగా ఇశ్రాయేలీయులు కనానీయులపై యుద్ధం చేసినపుడు వారి పసి పిల్లలను కూడా చంపివెయ్యడాన్ని కూడా కొందరు ప్రశ్నిస్తుంటారు. మనిషి పుట్టినప్పటినుండీ అతని యొక్క స్వభావం ఏమిటో (పాపం), ఆ మనిషి భవిష్యత్తులో ఎలా మారతాడో దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఆ పట్టణంలో చనిపోయిన చిన్నపిల్లల విషయంలో కూడా మనం ఇదేవిధంగా ఆలోచించవలసి ఉంటుంది. ఇటువంటి విషయాలలో అరకొర జ్ఞానంతో దేవునిపై విమర్శలు చేసేవారు, కలుషితమైన వారి మనసులోనే చిన్నపిల్లలపై అంతజాలి ఉంటే, వారిని పుట్టించిన దేవుడు వారిపట్ల మరెంత న్యాయంగా ప్రవర్తిస్తాడో గ్రహించగలగాలి. దేవుడు పాపాన్ని బట్టి ఒక జాతి మొత్తాన్ని నాశనం చెయ్యాలనుకున్నప్పుడు ఆ జాతి మొత్తాన్నీ పసిపిల్లలతో సహా నాశనం చేస్తాడు, అది ఆ జాతి ఇంతవరకూ చేసిన పాపం పట్ల ఆయన అసహ్యతనూ ఉగ్రతనూ సూచిస్తుంది. ఆ జాతిని సృష్టించినవాడిగా అలా చెయ్యడం ఆయనకు న్యాయమే.
అయినా హిందూ మతోన్మాదుల ప్రమాణం ప్రకారం ఒక మనిషియొక్క మరణానికీ అతని జీవితంలో సంభవించే ప్రమాదాలకూ పూర్వజన్మ పాపాలే కారణం. కాబట్టి పసిపిల్లలు చంపబడినా దానికి వారి పూర్వజన్మ పాపమే కారణం కదా! ఆ విషయంలో ఆందోళన ఎందుకు? ఇక నాస్తికులు/హ్యూమనిస్టుల వాదన ప్రకారం మనిషి అంటే కేవలం కొన్ని chemicals&molecules నిర్మాణం మాత్రమే. అంతకుమించి మనిషికి ఎటువంటి ప్రత్యేకతా లేదు గమ్యమూ లేదు. అలాంటప్పుడు మనిషి చంపబడితే అతని శరీరపు chemicals&molecules భూమిలో ఉన్న chemicals&molecules తో కలసిపోతాయి. ఇందులో వారికి ఇబ్బంది ఏముంది? చూసారా వారు నమ్ముతున్న ప్రమాణాలు/వాదనలే వారి నోర్లను ఎలా మూయిస్తున్నాయో.
రెండవ తిమోతికి 3:8,9
యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసవిషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో ఆలాగే వీరిది కూడ అందరికి తేటపడును గనుక వీరు ఇకముందుకు సాగరు.
ఎవరైనా సరే; మనిషిని చంపడాన్నీ లేదా మనిషిని హింసించడాన్ని నేరంగా పరిగణించాలంటే, ఆ విషయంలో బాధపడాలంటే, చివరికి ఆ మనిషిని శపించడాన్ని/దూషించడాన్ని కూడా తప్పుపట్టాలంటే, బైబిల్ ప్రమాణం దగ్గరకే రావాలి. ఎందుకంటే ఒక మనిషిని ఎందుకు చంపకూడదో, ఆ మనిషిని ఎందుకు హింసించకూడదో బైబిల్ మాత్రమే వివరిస్తుంది. మిగిలిన జీవులకంటే మనిషి ప్రత్యేకమైనవాడని బైబిలే చాటి చెబుతుంది.
ఆదికాండము 9:5,6
మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.
కీర్తనల గ్రంథము 8:5-9
దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు. గొఱ్ఱెలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్య ములను సముద్రమార్గములలో సంచరించువాటి నన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు. యెహోవా మా ప్రభువా భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది!
ఈ ప్రమాణాన్ని మీరితే, కోడిని కోసుకుతిన్నట్టు మనిషిని కూడా కోసుకుతినొచ్చు. అది తప్పు అని ఎలా చెబుతారు? అలాంటి చర్యలు నేరమని చెప్పడానికి చట్టానికి కూడా ఉన్న ప్రామాణికత ఏంటి? రాజ్యాంగం ఎలా, ఏ కొలమానంతో ఏర్పడుద్ది? ఇది తప్పు అది ఒప్పు అనే నిర్థారణకు మనిషి ఎలా వస్తాడు? హ్యూమనిస్టులు తలక్రిందులుగా నిలబడి ఆలోచించినా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు.
మరో విషయం గమనించండి, 'అదిగో బైబిల్ దేవుడు కనానీయుల పసిపిల్లలను కూడా చంపించేసాడని' తెగ జాలి ఒలకబోసే ఈ హ్యూమనిస్టులు అబార్షన్ విషయంలో మాత్రం అది "తల్లి హక్కు" అంటూ వాదిస్తుంటారు. అంటే వీరికి చిన్నపిల్లలపై జాలి బైబిల్ దేవుణ్ణి విమర్శించేటప్పుడు మాత్రమే పొంగుకొస్తుందేమో? హ్యూమనిస్టుల్లో కనుక నిజంగా మానవత్వమే ఉంటే ముందు విచ్చలవిడి అబార్షన్లకు వ్యతిరేకంగా, పిండంగా ఏర్పడిన శిశువుకు ఈ భూమిపై జన్మించే హక్కు ఉంటుందని వారి హక్కులకోసం పోరాడాలి. లేదా బైబిల్ జోలికి రాకుండా మీకిష్టమైన కార్యం (స్వలింగ సంపర్కం) లో నిమగ్నమై నాశనమైపోండి. అంతేతప్ప మీ ఉనికి కోసం బైబిల్ దేవునిపై విమర్శలు చేసే సాహసాలు చెయ్యకండి. మా దేవుడు ఎవరి నోరు ఎలా మూయించాలో దానికి అవసరమైన జ్ఞానాన్ని మాకు (సంఘానికి) సమృద్ధిగా దయచేసాడు. ఇది దేవుని నైతికప్రమాణం కలిగినవాడిగా హ్యూమనిస్టులకు నా హెచ్చరిక.
దేవుడు అంటూ ఉన్నప్పుడు ఆయనకంటూ ఒక చిత్తం ఉంటుంది, దేవుడు తన చిత్తప్రకారంగానే అన్నిటినీ జరిగిస్తాడు (ఎఫెసీ 1:12, దానియేలు 4:35, కీర్తనలు 115:3). అందువల్ల కనానీయులు అలాంటిపనులు చేస్తున్నప్పుడు వారు మార్పు చెందడానికి అంత సమయం ఎందుకు ఇచ్చాడు? అందరికీ అలానే ఇస్తాడా? పుట్టేవారు ఎలాంటి వారు ఔతారో ఆయనకు ముందే తెలిసినప్పుడు దుర్మార్గులను పుట్టించడం ఎందుకు? వంటి ప్రశ్నలకు తావులేదు. దేవుణ్ణి విమర్శించేవారు ఆయన పరిధిలోకి వచ్చి ఆయనను విమర్శించవలసి ఉంటుంది. లేదా ఆ దేవుడే లేడని రుజువు చెయ్యవలసి ఉంటుంది. ఎవరైనా ఆ సాహసం చెయ్యగలిగితే ఇంత అద్భుతమైన ఊహాతీతమైన సృష్టి ఎలా ఉనికిలోకి వచ్చిందో, ఈ సృష్టిలో మానవజ్ఞానానికి అందని సంక్లిష్టమైన designs ఎలా ఏర్పడ్డాయో (ఉదాహరణకు మానవదేహం), చివరికి మానవులకు నైతిక విలువలు ఎలా సంక్రమించాయో (ఉదాహరణకు హత్య చెయ్యడం అన్ని దేశాల్లోనూ ఎందుకు నేరం, అబద్ధాలు చెప్పడం అన్ని ప్రాంతాల్లోనూ ఎందుకు నిషేధం) ఇలా చాలా విషయాలకు వివరణ ఇవ్వవలసి ఉంటుంది. బైబిల్ కు ఉన్న Historical&Archeology ఆధారాల విషయంలో సహ (అవి ఎలా wrong?).
బైబిల్ దేవునిపై చెయ్యబడుతున్న మరికొన్ని ఆరోపణలు/విమర్శల గురించి తెలుసుకోవడానికి ఈ క్రింది లింకుల ద్వారా సూచించిన వ్యాసాలను చదవండి.
ఈ హ్యూమనిస్టులు మరియు ఫీమినిస్టులు "స్త్రీలహక్కుగా" భావించే "అబార్షన్ హక్కు" లో ఉన్న లోపాల గురించి, ఆ హక్కువల్ల జరుగుతున్న దారుణాల గురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ద్వారా సూచించిన వ్యాసం చదవండి.
హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.
ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.