విమర్శలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్

 

నిన్న (అనగా 21-5-2024 మంగళవారం) ఓఫీర్ గారి మాజీ ప్రేయసి ఒకరు ఒక మతోన్మాదికి interview ఇస్తూ తాను ఓఫీర్ చేతిలో మోసపోయానని చాలా వాపోయింది. ఆ వీడియో లింక్ (Click Here);

నైతికతకు విరుద్ధంగా అక్రమసంబంధాలు పెట్టుకునేవారంతా ఇలా మోసపోయా, మభ్యపెట్టబడ్డా (Trance) లాంటి సాకులు చెప్పడం మన సమాజంలో As usual కదా అనుకునేలోపే, ఆమె అంతటితో ఆగకుండా, క్రిస్టియానిటీనే వ్యభిచారమతం అంటూ, ఆ కారణం చేత అందులోకి ఎవరూ వెళ్ళకూడదు అంటూ కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేసింది. నేను ఈవిధంగా స్పందించడానికి ఆ వ్యాఖ్యలే కారణం. ఆమె చెప్పినట్టుగా ఒకవేళ క్రిస్టియానిటీ వ్యభిచారమతమే ఐతే "వ్యభిచరించకూడదని (నిర్గమకాండము 20:14), వ్యభిచరించిన వారికి కటాక్షం లేకుండా మరణశిక్ష విధించాలని (లేవీకాండము 20:10), ఇప్పుడైతే సంఘం నుండి వెలివెయ్యాలని (1 కొరింథీ 5:11) బైబిల్ చెప్పదు కదా. బైబిల్ గ్రంథంలో వందలచోట్ల వ్యభిచారాన్ని ఖండిస్తూ రాయబడింది.

ఇశ్రాయేలు దేశానికీ మరియు సంఘానికి దానివిషయంలో ఎన్నో హెచ్చరికలు చెయ్యబడ్డాయి, శిక్షలు కూడా విధించబడ్డాయ్ "నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు కావున వానలు కురియక మానెను" (యిర్మియా 3:3). "నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే నిన్ను శుభ్ర పరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీమీద తీర్చుకొనువరకు నీవు శుభ్రపడకయుందువు" (యెహేజ్కేలు 24:13). "జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు" (1కోరింథీ 6:18), "మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము" (1థెస్సలొనిక 4:3).

బైబిల్ ఇన్ని విధాలుగా ఇంత తీవ్రంగా వ్యభిచారాన్ని ఖండిస్తున్నప్పుడు క్రిస్టియానిటీ వ్యభిచారమతం ఎలా ఔతుందో మరి? నిజానికి నీది వ్యభిచార బ్రతుకు కాబట్టి వ్యభిచారం చేసావు, ఏం నీకు వ్యభిచారం చెయ్యకూడదని తెలీదా పాపం? కిరణ్ పాల్ అనేవాడు నీ బంధువులు ఒకామెతో అక్రమసంబంధం పెట్టుకున్నాడనే కారణంతో అతని చర్చికి వెళ్ళడం మానేసిన నువ్వు, మరి తర్వాత ఓఫీరు చర్చికి వెళ్ళి అతనితో ఎలా వ్యభిచరించగలిగావ్? నువ్వు‌ ఓఫీరుతో ఎంత తియ్యగా, గారాభంగా మాట్లాడావో అంతా వినలేదు అనుకుంటున్నావా? "జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి" (సామెతలు 5:3).

అది నీ బ్రతుకు. అలానే అతనిది కూడా అదే బ్రతుకు కాబట్టి నీతో వ్యభిచరించాడు, అలాంటి కామబోధకుల కోసం మా బైబిల్ లో ముందే హెచ్చరికలు చెయ్యబడ్డాయి (యూదా 1:4). మేము అలాంటివారిని ఖండిస్తూనే ఉన్నాము కూడా. మరి మధ్యలో మా క్రిస్టియానిటీపై నీ వ్యభిచారపు ఆరోపణలు ఏంటి? ఒకవేళ అతను‌ నీపై అత్యాచారానికి పాల్పడి ఉంటే, లేక నువ్వు తప్పించుకోలేనివిధంగా బెదిరించి లొంగదీసుకుని‌ ఉంటే, మా క్రైస్తవ సంఘం అది నీకు జరిగిన అన్యాయంగా పరిగణించి సాధ్యమైనంతమట్టుకు నీకు న్యాయం జరగాలని పోరాడేవారం. కానీ నీ interview లో రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అని నువ్వే ఒప్పుకున్నట్టుగా ఆ ఓఫీరూ నువ్వు మాటా మాటా కలుపుకుని మీ వ్యభిచార బ్రతుకును అనుసరించారు. స్టైట్ గా చెప్పాలంటే, అతను గోకాడు నువ్వు‌ గోకించుకున్నావు. "ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును (వ్యభిచరించును) దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును" (యాకోబు 1:14). కాబట్టి ఏదైనా ఉంటే like amount settlement లాంటివి. అతనూ నువ్వు చూసుకోవాలే తప్ప, సానుభూతుల కోసం, ముఖ్యంగా మతోన్మాదుల మెప్పుకోసం ఇలాంటి నంగనాచి నాటకాలు ఆడకూడదు.

"వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు‌‌. అవమానము నొందితిమని వారికి తోచనేలేదు" (యిర్మియా 6:15) ఎందుకంటే, "అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యమువంటి ధైర్యము గలదు, సిగ్గు పడనొల్లకున్నావు" (యిర్మియా 3:3) కాబట్టి, "పడి పోవువారితో వారు పడిపోవుదురు, నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు" (యిర్మియా 6:15).

ఈమెగారి మేధావితనం‌ గురించి ఇంకా‌ చెప్పాలంటే, యేసుక్రీస్తు అనేవాడే లేడు‌ అంట. మేడాం గారు ఏ చరిత్రను పరిశీలించి అలాంటి వ్యాఖ్యలు చేసిందో తెలియదు కానీ బహుశా ఓఫీర్ ఇవ్వవలసింది ఇవ్వకపోడం‌ వల్ల అలా ఊహించుకుంటుంది ఏమో. అయినా ఆ ఓఫీర్ కీ మా యేసుక్రీస్తుకీ సంబంధమే లేదు, అతనొక దుర్బోధకుడు మరియు కామబోధకుడని ఎంతోకాలంగా మా‌ బోధకులు బైబిల్ ప్రకారంగా చెబుతున్నప్పుడు, ఓఫీర్ నిన్నేదో చేసాడని, లేక నువ్వుకూడా ఓఫీర్ తో చెయ్యిచెయ్యి కలిపి చప్పట్లు కొట్టావని చరిత్రలో యేసుక్రీస్తు లేకపోవడమేంటి? దానికీ దీనికీ ఏంటి సంబంధం?

యెషయా 57:4,5 మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మస్తచావృక్షములను చూచి పచ్చని ప్రతిచెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప హితబోధ ఎప్పుడూ, ఎవ్వరి నుండీ ఆర్థిక సహాయం అంగీకరించదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.