'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.
హితబోధ యాప్ కొరకు Join WhatsApp
ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.
మత్తయి సువార్త అధ్యాయము 1 పై వ్యాఖ్యానం
మత్తయి ఒకటవ అధ్యాయాన్ని రెండు ముఖ్యమైన భాగాలుగా విభాగించవచ్చు. మొగటి భాగంలో యేసుక్రీస్తు అబ్రాహాముకు చెయ్యబడిన వాగ్దానసంతానమని, దావీదు సింహాసనానికి నిత్యవారసుడైన మెస్సీయా అని నిరూపించే వంశావళి పట్టిక గ్రంథస్తం చెయ్యబడింది ( మత్తయి 1:1-17); రెండవ భాగంలో ఆయన వాగ్దానం చెయ్యబడిన స్త్రీసంతానమని, శరీరధారియైన ఇమ్మానుయేలని నిరూపించే ఆయన జనన విధం వివరించబడింది (మత్తయి 1:18-25). ఎంతో సరళంగా కనిపించే ఈ అధ్యాయం మనకు నేర్పించే లోతైన సత్యాలు, వాక్యవిరోధుల విమర్శలకు సమాధానాలు మరియు వ్యక్తిగత అన్వయింపుకు సంబంధించిన పాఠాలు ఈ వ్యాఖ్యానంలోని విశేషాలు.
మత్తయి సువార్త అధ్యాయము 2 పై వ్యాఖ్యానం
ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు పుట్టుక వెంటనే జరిగిన కొన్ని సంఘటనలు వివరించబడ్డాయి. ఈ సంఘటనల ద్వారా నెరవేర్చబడిన లేఖన ప్రవచనాలు ఒక ఎత్తయితే వాటి నుండి మనం స్వపరిశీలన కొరకు స్వీయ అన్వయింపు కొరకు నేర్చుకోవలసిన పాఠాలు మరొక ఎత్తు. ఇవి ప్రభువు పసిప్రాయం దశలో మనకు అందించబడిన అతి తక్కువ సమాచారంలో భాగంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ప్రశస్తమైన వివరాలు. వీటిలో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.
1) తూర్పు దేశం నుండి జ్ఞానులు ప్రభువును వెతుక్కుంటూ రావడం (మత్తయి 2:1-8).
2) ఆసక్తితో వారు ప్రభువును కనుగొని ఆయనను పూజించడం (మత్తయి 2:8-12).
3) హేరోదు క్రూరత్వాన్ని తప్పించుకోవడానికి ప్రభువు ఐగుప్తుదేశంలో తలదాచుకోవడం (మత్తయి 2:13-15).
4) హేరోదు బేత్లెహేములోనూ పరిసర ప్రాంతాల్లోనూ ఉన్న మగశిశువులను కిరాతకంగా చంపడం
(మత్తయి 2:16-18).
5) ప్రభువు ఇశ్రాయేలు దేశానికి తిరిగి రావడం (మత్తయి 2:19-23).
మత్తయి సువార్త అధ్యాయము 3 పై వ్యాఖ్యానం
ఈ అధ్యాయాన్ని రెండు ముఖ్యమైన భాగాలుగా విభాగించవచ్చు. 1 నుండి 12 వరకూ ఉన్న మొదటిభాగంలో మనకు బాప్తిస్మమిచ్చు యోహాను పరిచయం ఔతాడు. అతని పరిచర్య, అతని సందేశం, వాటికి ఆధారమైన ప్రవచనం, అతని జీవన శైలి, అతని పరిచర్య సాధించిన గొప్ప విజయం, స్వనీతిపరులకు రాబోయే ఉగ్రత గురించి ఆయన చేసిన హెచ్చరిక, ఆ ఉగ్రతను తప్పించుకునే మార్గంలోకి అతను ప్రజలకు ఇచ్చిన ఆహ్వానం, అన్నిటికంటే అతి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువునకు అతను ఇచ్చిన పరిచయం - ఇవి ప్రధాన అంశాలు. 13 నుండి 17 వరకూ ఉన్న రెండవ భాగంలో, యోహాను చేత ప్రభువు బాప్తిస్మం పొందడం, దానివెనుక ఉన్న కారణాలు, అప్పుడు చోటుచేసుకున్న అసాధారణమైన సంగతులు, వివరించబడ్డాయి. అర్థం చేసుకోవడానికి ఎంతో సరళంగా కనిపించే ఈ వాక్యభాగంలో దాగి ఉన్న దేవశాస్త్రపరమైన సత్యాలు, క్రైస్తవ విశ్వాసానికి అత్యంతకీలకమైన సిద్ధాంతాలు. ఇందులో మాటలు క్రైస్తవులుగా మనం అన్వయించుకుని పాటించవలసిన క్రీస్తుకేంద్రిత నియమాలను మనకు బోధిస్తున్నారు. మన విశ్వాసం ఆ సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటే, మన నడవడి ఆ నియమాలకు లోబడి లేకపోతే, మరోసారి స్వపరిశీలన చేసుకుని, మన విశ్వాసాన్ని వాక్యపు వెలుగులో సరిచూసుకోవడానికి, మన జీవితాన్ని అందులోని నియమాలకు అనుగుణంగా సవరించుకోవడానికి ఈ వ్యాఖ్యానం ద్వారా దేవుడు మనకు సహాయం చేయునుగాక.
మత్తయి సువార్త అధ్యాయము 4 పై వ్యాఖ్యానం
ఈ అధ్యాయ మొదటిభాగంలో ప్రభువు అపవాది చేత శోధించబడిన మూడు సందర్భాలు వాటిలో ఆయన అపవాదిపై సాధించిన ఘనవిజయానికి సంబంధించిన వివరాలు చదువుతాము (మత్తయి 4:1-11). తర్వాత ఆయన చేసిన బహిరంగ పరిచర్య యొక్క ప్రారంభ దశకు సంబంధించిన కొన్ని వివరాలు. ఆయన కాపురం ఉండడానికి ఎన్నుకున్న స్థలం, ప్రకటించిన బోధ, పిలుచుకున్న శిష్యులు, చేసిన అద్భుత క్రియలు, వాటివల్ల ఆయన పరిచర్యకు ఆకర్షితులైన జనసమూహాలకు సంబంధించిన కొన్ని వివరాలు తెలుపబడ్డాయి (మత్తయి 4:12-25). మన ఆదరణకు ఆధారమైన ఆచరణకు ఆదర్శనమైన విశ్వాసానికి పునాదియైన ఎన్నో సత్యాలతో కూడిన ఈ వాక్యభాగాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆయన మార్గంలో మరో అడుగు, పురోగతి చెందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించును గాక!