దుర్బోధలకు జవాబు

రచయిత: స్టీఫెన్ హాక్
అనువాదం: జి. బిబు
చదవడానికి పట్టే సమయం: 7 నిమిషాలు

ఆడియో

Article Release long arminian min

ఆర్మీనియనులు ప్రకటించే యేసు బైబిల్ లో ఉన్న యేసు ప్రభువేనా? కానేకాదు.

అంత్య దినాలలో నేనే క్రీస్తునని చెప్పుకునే అనేకమంది అబద్ధ క్రీస్తులు వస్తారని బైబిల్ హెచ్చరించింది .
యేసు వారితో ఇట్లనెను. ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు. (మత్తయి 24:4-5).

క్రైస్తవులమని చెప్పుకునే మనం అప్రమత్థంగా ఉండాలి. మోసగించబడకుండా మనం ఎంతో జాగ్రత్త వహించాలి. నిజమైన క్రీస్తును మాత్రమే నమ్మి, ప్రేమించి, వెంబడించటానికి మనం పిలువబడ్డాము.

మన కాలంలో ఉన్న అనేక అబద్ద క్రీస్తులతో మనకు ఎలాంటి సంబంధం ఉండే అవకాశం లేదు కొన్ని అవాంతర శాఖలు మరియు అన్య మతాలకు చెందిన క్రీస్తు గురించి మనకు తెలుసు. అతడు ఒక మంచి వ్యక్తి, ప్రవక్త, దేవుని ప్రథమ సృష్టి, ఒక గొప్ప ఆత్మ, ఒక దైవిక సంకల్పం లేదా స్వయంగా దేవుడే కూడా అయ్యుండొచ్చూ.కాని అతడే నిజదేవుడు, నిత్యుడైన దేవుడు కాదు. తనకంటే గొప్పవానినుండి అతడు తన ఉనికిని పొందాడు. అలాంటివాడు బైబిల్ లో ఉన్న క్రీస్తు కాదు. అతడివల్ల మనం మోసగించబడము. అతడొక అబద్ధ క్రీస్తు.

రోమన్ కాథోలికుల క్రీస్తు మనకు తెలుసు. అతడు నిజదేవుడని వారొప్పుకుంటారు. అతడు పాపాలు క్షమించటం కోసం శ్రమనొంది మరణించాడు పునరుద్ధానుడిగా లేచి, స్వర్గారోహణమై, తిరిగి రానైయున్నాడు. కాని అతడు పూర్ణ రక్షకుడు కాదు. రోమన్ కాథోలిక్ క్రీస్తు పాపులను వారి స్వనీతి క్రియలు మరియు యాజకుల మధ్యవర్తిత్వం లేకుండా రక్షించలేడు. అలాంటివాడు బైబిల్ లో ఉన్న క్రీస్తు కాదు. అతడివల్ల మనం మోసగించబడము. అతడొక అబద్ధ క్రీస్తు.

అయితే, ఈ అవాంతర శాఖలు మరియు రోమన్ కాథోలికుల క్రీస్తు కంటే మరింత అపాయకరమైన వేరొక క్రీస్తు కూడా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలనుండి నేటివరకు కోట్లమందిని మోసగిస్తూనే ఉన్నాడు. ఇతడు ఎంత అపాయకరమైన వాడంటే, అసాధ్యం కాకపోతే ఏర్పరచబడినవారిని సహితం మోసగించి ఉండేవాడు (మత్తయి 24:24). ఇతడే ఆర్మీనియనుల క్రీస్తు.

ఈ అబద్ధ క్రీస్తుకి నిజక్రీస్తుతో చాలా పోలికలు ఉన్న కారణాన్నిబట్టి ఇతడు అత్యంత ప్రమాదకరం. ఇతడు తండ్రి మరియు పరిశుధ్ధాత్మతో సమానుడైన నిజదేవుడని వారంటారు. పాపులను రక్షించటానికి అతడు సిలువపై మరణించాడని వారు ప్రకటిస్తారు. ఇతడు మానవ క్రియలు లేకుండా కేవలం తన కృప చేత మాత్రమే రక్షిస్తాడని కూడా వారు ఒప్పుకుంటారు. ఇతడికి ఆ అవాంతర శాఖలు మరియు రోమన్ కాథోలికుల క్రీస్తుతో ఎలాంటి సంబంధమూ ఉండకపొవచ్చు.

కాని జాగ్రత్త సుమ! తస్మాత్ జాగ్రత్త! ఈ ఆర్మీనియనుల క్రీస్తు బైబిల్ లో ఉన్న నిజ క్రీస్తు కానే కాదు. మోసగింపబడకండి!

1. ఆర్మీనియనుల క్రీస్తు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించి, వారంతా రక్షింపబడాలని యధార్థంగా ఆశిస్తాడు. బైబిల్ లో ఉన్న క్రీస్తు దేవుని చేత బేషరతు గా ఏర్పరచబడిన వారిని మాత్రమే ప్రేమించి, వారి రక్షణను మాత్రమే కోరుకుంటాడు. (కీర్తన 5:5, కీర్తన 7:11, కీర్తన 11:5 , మత్తయి 11:27, యోహాను 17:9-10, అపొస్తలుల కార్యములు 2:47, అపొస్తలుల కార్యములు13:48, రోమీయులకు 9:10-13 ,రోమీయులకు 9:21-24, ఎఫెసీయులకు 1:3-4)

2. ఆర్మీనియనుల క్రీస్తు రక్షణ ఆఫర్ అందరికి ఇచ్చి , అందరిని రక్షించటానికి శాయశక్తులా ప్రయాసపడుతున్నాడు.అయితే వారిలో ఎక్కువ మంది రావటానికి నిరాకరించి, అతని ఆఫర్ మరియు ప్రయాసను తరచుగా నిర్వీర్యం చేస్తున్నారు.

బైబిల్ లో ఉన్న క్రీస్తు ఏర్పరచబడిన వారిని మాత్రమే సమర్ధవంతంగా పిలిచి, వారిని తన సర్వాధికారంతో రక్షించుకుంటాడు. వారిలో ఒక్కరుకూడా తప్పిపోరు. (యెషయా. 55:11, యోహాను 5:21, యోహాను 6:37-40, యోహాను 10:25-30, యోహాను 17:2, ఫిలిప్పీయులకు . 2:13)

3. తమ స్వేచ్ఛా చిత్తం తో (ఫ్రీ విల్ తో) మొదట తనను ఎన్నుకొనని ఒక పాపిని ఆర్మీనియనుల క్రీస్తు తిరిగి జన్మింపజేసి రక్షించలేడు . క్రీస్తును ఎన్నుకోవాలా లేక తిరస్కరించాలా అని నిర్ణయించగల స్వేచ్ఛా చిత్తం మానవులందరికీ ఉంది. ఆ స్వేచ్ఛా చిత్తం తో క్రీస్తు కలుగజేసుకోకూడదు.

బైబిల్ లో ఉన్న క్రీస్తు తన సార్వభౌమ అధికారంతో ఏర్పరచబడిన పాపిని అతని తీర్మానం తో నిమిత్తం లేకుండానే తిరిగి జన్మింపజేస్తాడు. ఎందుకంటే ఆత్మీయంగా చనిపోయిన ఒక పాపి, తిరిగి జన్మించకుండా క్రీస్తు కావాలని తీర్మానించుకోలేడు .విశ్వాసం రక్షణలో మానవుడు అందించే భాగస్వామ్యం కాదు, నూతన జన్మలో క్రీస్తు సార్వభౌమ్యంగా అనుగ్రహించే వరం. ( యోహాను 3:3. , యోహాను 6:44 & 65, యోహాను 15:16 , అపొస్తలుల కార్యములు11:18, రోమీయులకు . 9:16, ఎఫెసీయులకు . 2:1, ఎఫెసీయులకు . 2:8-10, ఫిలిప్పీయులకు . 1:29, హెబ్రీయులకు . 12:2)

4. ఆర్మీనియనుల క్రీస్తు అందరికొరకు సిలువపై మరణించి, అందరు రక్షింపబడే వీలు కలుగజేసాడు. కాని మానవుని తీర్మానం జోడించబడకుండా ఆ మరణం ఎవ్వరిని రక్షింపజాలదు. ఈ కారణాన్నిబట్టి అతడు ఎవరికొరకు మరణించాడో , వారిలో అనేకమంది నశించిపోతారు .

బైబిల్ లో ఉన్న క్రీస్తు దేవుని చేత ఏర్పరచబడిన వారి కొరకు మాత్రమే మరణించి, ఎవరి పక్షంగా ఆయన మరణించాడో , వారందరికీ రక్షణ సంపాదించిపెట్టాడు. ఆయన మరణం ఏర్పరచబడిన దేవుని ప్రజల పాపదోషాన్ని పరిహరించి విధంగా వారికి బదులుగా దేవుని నీతిని తృప్తిపరచింది. (లూకా 19:10, యోహాను 10:14-15 & 26, అపొస్తలుల కార్యములు20:28, రోమీయులకు . 5:10, ఎఫెసీయులకు . 5:25, హెబ్రీయులకు . 9:12, I పేతురు 3:18)

5.ఆర్మీనియనుల క్రీస్తు, అతడు రక్షించుకున్న అనేకులను, వారు విశ్వాసంలో కొనసాగని కారణాన్నిబట్టి నష్టపోతాడు. కొందరు అంటున్నట్లు ఒకవేళ అతడువారికి నిత్యభద్రత ఇచ్చిన , అది అతని చిత్తం లేదా కార్యం పైన కాక, పాపి క్రీస్తును అంగికరించినప్పుడు చేసినతీర్మానంపైనే ఆధారపడివుంటుంది.

బైబిల్ లో ఉన్న క్రీస్తు రక్షించిన వారందరు అంతం వరకు విశ్వాసంలో కొనసాగే విధంగా ఆయన వారిని భద్రపరుస్తాడు .దేవుని ఏర్పాటునందు , సమర్ధవంతమైన తన మరణపు శక్తినిబట్టి మరియు తన ఆత్మ జరిగించే మహాకార్యం చేత వారిని భద్రపరుస్తాడు . (యోహాను 5:24, యోహాను 10:26-29, రోమీయులకు . 8:29-30, రోమీయులకు . 8:35-,39 , I పేతురు 1:2-5 , యూదా 24-25)

మీరు చూస్తున్నట్లుగా, ఆర్మీనియనుల క్రీస్తు మరియు బైబిల్ లో ఉన్న క్రీస్తు ఓకే వ్యక్తిగా అనిపించినా, వారిమధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకడు అబద్ధక్రీస్తు కాగా మరొకరు నిజక్రీస్తు. ఒకడు బలహీనుడు, నిస్సహాయుడు, మానవ సార్వభౌమ్య చిత్తానికి తలొగ్గేవాడు. మరొకరు తన చిత్తనుసారంగా నిర్ణయించి, నిర్ణయించిందంతా నేరవేర్చుకునే సర్వాధికారియైన ప్రభువు.

నువ్వు విశ్వసించి, సేవిస్తున్నది ఆర్మీనియనుల క్రీస్తుని అయితే, నువ్వు సేవించేది బైబిల్ లో ఉన్న క్రీస్తును కాదనే వాస్తవాన్ని గుర్తించాలి. నువ్వు మోసగించబడ్డావు. లేఖనాలను పరిశీలించు నిజక్రీస్తును గురించి నేర్చుకో. మారుమనస్సుతో క్రీస్తును నీ సార్వభౌమ్య ప్రభువుగా దేవునిగా విశ్వసించటానికి కృపనివ్వమని ప్రార్ధించు.

Add comment

Security code
Refresh

Comments  

# సువార్త ఎవరికీ చెప్పనవసరం లేదాManoj 2020-07-05 15:13
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ,నాకు కొన్ని సందేహాలు కలవు.దేవుడు ఏర్పరాచు కున్న వార్ని ఆ యనే రక్షిం చు కుంటే సువార్త చేయడము ఎందుకు
Reply
# RE: సువార్త ఎవరికీ చెప్పనవసరం లేదాSagar 2020-08-08 22:30
విశ్వాసుల రక్షణలో దేవుని మున్నిర్ణయం  (predestination)
https://hithabodha.com/books/salvation/256-divine-predestination-in-salvation.html
ఈ ఆర్టికల్ లో ఆ ప్రశ్నకి సమాధానం ఉంది చదవండి బ్రదర్.
Reply
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.