బైబిల్

యేసుక్రీస్తు ప్రభువు భూమిపై మనిషిగా జీవించినప్పటి సంఘటనలు నాలుగు సువార్తలలో మనం చదువుతాము. ఒక సువార్తలో చదివిన కొన్ని సంఘటనలు మరొక సువార్తలో ఉండకపోవటం సాధారణంగా మనం గమనిస్తాము. ప్రతి సువార్త గ్రంథాన్ని విడిగా చదివి రచయిత ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటం కష్టం కాదు. కానీ నాలుగు సువార్తలను సమగ్రంగా నేర్చుకుంటున్నప్పుడు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. అందులో ఒక సమస్య సువార్త సంఘటనల కాలక్రమానికి సంబంధించినది.జాగ్రత్తగా విశ్లేషించకపోతే అనేక అపార్థాలు చోటుచేసుకుంటాయి. ప్రతీ సంఘటనను కాలక్రమంలో అర్థం చేసుకున్నప్పుడు ఎన్నో అపార్థాలకు పరిష్కారాలు లభిస్తాయి. నాలుగు సువార్తలను సమగ్రంగా మాత్రమే కాదు, సమన్వయపరిచి విశ్లేషించటానికి సువార్త సంఘటనల కాలక్రమం ఎంతో ప్రాముఖ్యమైనది. నాలుగు సువార్తలన్నిటినీ కాలక్రమంలో అమర్చి టేబుల్ రూపంలో వాటిని మీకు అందించటమే ఇక్కడ చేయబడిన ప్రయత్నం.

బైబిలులో వ్రాయబడిన వాటి కంటే లెక్కకు మించిన అద్భుతాలు మన ప్రభువైన యేసు చేశాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ బైబిలులో వ్రాయబడలేదు గాని వ్రాయబడినవి ఎందుకు వ్రాయబడ్డాయో యోహాను 20:31లో ఉంది. “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.” ఈ చిన్న గ్రంథంలో ప్రభువు చేసిన అద్భుతాలను ధ్యానించడం ద్వారా అందరూ ఆయనను నమ్మాలనీ, నమ్మినవారు విశ్వాసంలో ఎంతో బలపడాలని కోరుతూ ... రచయిత

దేవుడు తన వాక్యాన్ని మనకనుగ్రహించటంలో ఒక శ్రేష్ఠమైన ఉద్దేశాన్ని కలిగున్నాడు. ఆ ఉద్దేశాన్ని 2 తిమోతి 3:16,17 వచనాలలో అతి శ్రేష్ఠమైన భాషలో బయలుపరిచాడు. ''దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనమును, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది.''

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.