దుర్బోధలకు జవాబు

రచయిత: జాన్‌ మెకార్ధర్‌
అనువాదం: నగేష్ సిర్రా
ప్రచురణ: బేతెల్‌ రిఫార్మ్‌డ్‌ చర్చ్‌ - తణుకు

విషయసూచిక

                                       అన్యాగ్ని సందేశానికి ప్రశంసలు

               దేవుని వాక్యసత్యం చేత జీవితాలు మార్చుకున్న ప్రజల సాక్ష్యాలు

జాన్‌ మెకార్థర్‌గారిని బట్టి, క్యారిస్‌మాటిక్‌ బోధలోని పలు లోపాలను ఎంతో స్పష్టంగా ఆయన బయలుపరుస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభువుకు కృతజ్ఞురాలను.- కార్లా

క్యారిస్‌మాటిక్‌ బోధను లేఖనాలతో పోల్చుతూ, దానిని పునఃపరిశీలించడానికి జాన్‌ మెకార్థర్‌ నాకు సహాయం చేశారు. అప్పటి వరకు, సుమారు ఆరు సంవత్సరాలు నేను క్యారిస్‌మాటిక్‌ సంఘంలోనే ఉన్నాను. క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో మోసపోతున్న వారి గురించి ఇంకా నా హృదయం పరితపిస్తోంది. వారికి వాగ్ధానం చేయబడుతున్న ఐశ్వర్యం వారిని వంచిస్తోంది. నూరంతలు తిరిగి పొందాలని ఆశిస్తూ ప్రజలు తమకు కలిగిన విలువైన ప్రతి దానిని ఇచ్చేయడం నేను చూశాను. తాము ఎదురుచూసిన ప్రతిఫలం వాస్తవరూపం దాల్చకపోయినప్పుడు, తమ విశ్వాసంలో లోపం ఉందని వారికి చెప్పబడుతుంది. ఇది ఎంతో విచారకరం. - మడలీనా

కొన్ని సంవత్సరాల క్రితం మా కూతురు చనిపోయింది. ఆమె స్వస్థత పొందడానికి తగినంత విశ్వాసం మాకు లేదని మా సంఘ సభ్యుల్లో కొందరు చెప్పారు. మా జీవితాల్లో పాపం ఉండి ఉండవచ్చని మరికొందరు మాతో అన్నారు. జాన్‌ మెకార్థర్‌గారి పరిచర్య నిమిత్తం నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దశాబ్దానికి పైగానే మేమున్న క్యారిస్‌మాటిక్‌ సంఘ వాతావరణాన్ని విడిచిపెట్టడానికి సరిపడేంత సత్యాన్ని ఆయన పుస్తకాల ద్వారా, బోధల ద్వారా నేనూ, నా భార్యా నేర్చుకున్నాం. తప్పుదారిలో నడిపించబడుతున్న ఎంతో మంది క్యారిస్‌మాటిక్‌ సభ్యులున్నారు. వారంతా సత్యాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. _ మైఖేల్‌

నేను, నా భార్య దాదాపు 16 సంవత్సరాలు ఫ్రెంచ్‌ మాట్లాడే పశ్చిమ ఆఫ్రికాలో పరిచర్య చేసాం. అమెరికా టి.వి. సువార్తికుల, క్యారిస్‌మాటిక్‌ సంఘనాయకుల తప్పు బోధలు పశ్చిమ ఆఫ్రికాలోని పాస్టర్లపై దాడిచేస్తున్నాయి. మేము ఎదుర్కొన్న తప్పులను గద్దించడానికి నాకు అవసరమైన ఉపకరణాలను జాన్‌ మెకార్థర్‌ గారు క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంపై చేసిన బోధ నాకు ఇచ్చింది.- ల్యారీ

నేనూ, నా భర్తా వృద్ధులం. కానీ ఒక వ్యక్తి వయసు ఏదైనప్పటికీ ప్రభువు బలంగా పనిచేయగలడు. మాకు వివాహమై దాదాపు 49 సంవత్సరాలైంది. మొదటి 38 సంవత్సరాలు లేఖనాలకంటే భావోద్వేగాలకు, అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే క్యారిస్‌మాటిక్‌ సంఘానికే మేము వెళ్లాం. నేను చాలా ఇబ్బంది పడ్డాను. కానీ దాని గురించి ఏమి చేయాలో నాకు తెలియలేదు. లేఖనమనే భూతద్దం ద్వారా క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంపై ఒక సరికొత్త దృక్పధాన్ని కలిగి ఉండడానికి జాన్‌ మెకార్థర్‌ మాకు సహాయం చేసారు. మేము బెరియన్లుగా ఉండాలని ఆయన మాకు బోధించారు - వాల్‌రాయే

వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ ఉద్యమం నేటి నిజ క్రైస్తవ్యానికి అత్యంత భయంకరమైన నష్టాన్ని కలుగచేసే ఉద్యమాల్లో ఒకటి. కొత్త వారికీ, యవ్వనస్థులకూ ఆ వర్తమానం నిజమైన క్రైస్తవ్యంగానే కనిపిస్తుంది. ఐశ్వర్యం గురించి పిచ్చిదైన లోకానికి ఖచ్చితంగా అది మంచిదిగా అనిపిస్తుంది. ఆరోగ్యైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలనుకునే ప్రజలకు ఇది మంచిగా కనిపిస్తుంది. నేనొక వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ సంఘానికి ఇంతకుముందు హాజరయ్యేవాణ్ణి. మన ఆర్థిక విషయాలలో, సంబంధాలలో, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో పూర్తి విజయాన్ని మనం కలిగి ఉండాలనేది దేవుని కోరికని ఈ సంఘం మనకు బోధిస్తుంది. మరైతే పాస్టర్‌గారు ఎందుకు ఆరోగ్యంగా లేరు? ప్రజలు ఎందుకు
ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు? వారి ఆర్థిక విషయాలలో వారిపుడు వర్ధిల్లడం లేదు. వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మనుగడ సాధించలేకపోతున్నారు. దేవుడే వారిని నిరాశపరుస్తున్నాడేమోనని ప్రజలు ఆశ్చర్యపడడం ఆరంభించారు. ఆయన తాను కుదుర్చుకున్న ఒప్పందంలో తన బాధ్యతను ఎందుకు నెరవేర్చలేదు? వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ సిద్ధాంతం ఒక భయంకరమైన అబద్ధ సువార్త. మమ్ముల్ని లేఖనాల వైపుకు తిప్పినందుకు
జాన్‌ మెకార్థర్‌గారికి నేను కృతజ్ఞుడను.- జెర్మీ

నాకు 35 సంవత్సరాలు. నేను పశ్చిమ నార్వేలో నివసిస్తున్నాను. ఒక నూతన విశ్వాసిగా రెండు సంవత్సరాలు నేను పెంతెకోస్తు సంఘంలో ఉన్నాను. జీవితంలో అభివృద్ధి, ఆశావాదంతో కూడిన జీవితం, ఇహపరమైన సంపద, లోకానుసారమైన కీర్తి మొదలైనవి వారు బోధించి ఆచరిస్తున్న విషయాలు. లేఖనంలో నేను చదివిన విషయాలు అవి కావు. పశ్చాత్తాపం గురించీ, నా ప్రాణాన్ని సైతం నేను ఆర్చించబడ్డుడనై యున్నాననీ, క్రీస్తు బానిసగా ఉండడం గురించీ ఖచ్చితంగా నేనెన్నడూ వినలేదు. ఒక సంవత్సరం క్రితం ఈ విషయాలపై జాన్‌ మెకార్థర్‌ గారు చేస్తున్న బోధను వినడం ప్రారంభించాను. నా సొంత భావోద్వేగాలకు నిరంతరం బానిసగా ఉండడానికి బదులు దేవుని వాక్యమైన బైబిల్‌ మాత్రమే నాపై నిజమైన అధికారం కలిగిందనే సత్యాన్ని నేర్చుకొని, హత్తుకోవడం చాలా స్వేచ్చనిచ్చేదిగా ఉంది.-బిజార్న్

భాషల్లో మాట్లాడి, దేవుడు వ్యక్తిగతంగా నాతో మాట్లాడేది వినమని నాకు బోధించబడిన సంఘంలో నేను పెరిగాను. నేను ఏ దేవునినైతే నమ్మాలని నాకు బోధించబడిందో ఆయన మర్మయుక్తంగా, వింతగా, గూఢమైనవానిగా, అయోమయంగా కనిపించాడు. ఇదంతా ఎంతో గందరగోళంగా ఉండేది. ఆ విషయాల వలన, ఎన్నడూ నిజం కానటువంటి ప్రవచనాల వలన బైబిల్‌కి సంబంధించిన ప్రతి దాని నుండి నేను దూరమయ్యేంతగా నేను బాధపడ్డాను. ఆత్మీయంగా నేను తప్పిపోయాను. దాదాపు 10 సంవత్సరాలు నేను దేవుని వాక్యాన్ని తప్పించుకుని తిరిగాను. ఆ సమయమంతటిలో నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుసు. కనుక నేను దేవుణ్ణి నమ్మాను. అయితే ఆయన కోసం
నేను ఎలా జీవించాలో నాకు అర్థం కాలేదు. మూడు సంవత్సరాల క్రితం, ఆన్‌లైన్‌లో జాన్‌ మెకార్థర్‌ గారి వాక్యబోధ పరిచర్యను నేను కనుగొన్నాను. భాషలు మాట్లాడడం గురించి ఆయన ఏమి చెప్పారో చూడడానికి 1కొరింథీ పత్రికపై ఆయన చేసిన ప్రసంగాలను నేను వెంటనే వెదికాను. అర్థవంతమైన వర్తమానాన్ని వినడం చాలా ఉత్సాహాన్నిచ్చింది. లెక్కలేనన్ని వర్తమానాలు నేను డౌన్‌లోడ్‌ చేసుకున్నాను. నేను బైబిల్‌ను తిరిగి నేర్చుకుంటున్నాను. నాకు సమీపంలో రాజీపడకుండా వాక్యానికి కట్టుబడి బైబిల్ ను బోధించే పాస్టర్‌ గారు ఉన్న సంఘంలో నేను చేరాను. ప్రభువు నా జీవితంలో చేస్తున్న మేలును బట్టి నేనెంతో సంతోషిస్తున్నాను. - జెస్టిన్

నేను క్యారిస్‌మాటిక్‌ నేపథ్యం నుంచి బయటకు వచ్చాను. జాన్‌మెకార్థర్‌ గారి బోధ నిజంగా కళ్లు తెరిపించేదిగా ఉంది. నా కుటుంబం, మా సంఘం పూర్తి తప్పు బోధ నుంచి విముక్తులమైనందుకు నేను దేవునికి కృతజ్ఞుడిని. - క్రిస్టల్

                                                 రచయిత గురించి

జాన్‌ మెకార్థర్‌ గారు కాలిఫోర్నియా రాష్ట్రంలో సన్‌వ్యాలీలో గ్రేస్‌ కమ్యూనిటీ చర్చ్‌లో 1969వ సంవత్సరం నుంచి పాస్టర్‌గా, బోధకునిగా పరిచర్య చేస్తున్నారు. ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్‌ అనే అతని పరిచర్య వైశాల్యత, ప్రభావాలు అసమానమైనవిగా ఉన్నాయి. నాలుగు దశాబ్దాలుగా ఒకే ప్రసంగ వేదిక నుంచి పరిచర్య చేస్తూ కొత్త నిబంధన మొత్తాన్నీ పాత నిబంధనలో ముఖ్యమైనవాటిలో అనేక భాగాలనూ ఆయన ప్రసంగించారు. ద మాస్టర్స్‌ కాలేజ్ కీ, సెమినరీకీ ఆయన ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వందలాది రేడియో కేంద్రాలలో ప్రసారం చేయబడుతున్న గ్రేస్‌ టు యూ రేడియో కార్యక్రమాల ద్వారా ఆయన ప్రసంగాలను మీరు వినవచ్చు. "ద మెకార్థర్‌ స్టడీ బైబిల్‌", "ద గాస్పెల్‌ ఎకార్టింగ్‌ టు జీసస్‌", "ట్వల్వ్ ఆర్టినరి మెన్‌", "వన్‌ పెర్‌ఫెక్ట్‌ లైఫ్‌" మొదలగు అత్యుత్తమంగా అమ్ముడుపోయిన అనేక గ్రంథాలను ఆయన రచించారు.

జాన్‌ మెకార్థర్‌ గారి గురించిన, అతని బైబిల్‌ టీచింగ్‌ ఉపకరణాలను గురించిన
మరిన్ని వివరాలకు సంప్రదించండి:

గ్రేస్‌ టు యూ ఎట్‌ 800-55 గ్రేస్‌, లేదా www.gty.org.

                                                       ఆయన నామం కోసం

ఇశ్రాయేలీయుల మధ్య కనానీయుల మూఢ నమ్మకాలను విస్తరింపచేయడానికి వారి సమాజంలో రహస్యంగా చొరబడిన మాంత్రికులో లేదా మోసపూరిత వ్యాపారస్తులో కారు నాదాబు, అబీహులు. ఏ విధంగా చూసినా వారు నీతిమంతులు, గౌరవనీయులు, భక్తిగల ఆధ్యాత్మిక నాయకులు. వారు ఏకైక నిజ దేవుని యాజకులే, కానీ సాధారణ లేవీయులు మాత్రం కాదు. ప్రధాన యాజకుని ధర్మానికి తొలి వారసునిగా నాదాబు, తర్వాత వానిగా అబీహు ఉన్నారు. వీరు అహరోను పెద్ద కుమారులు. మోషే వీరికి చిన్నాన్న ఇశ్రాయేలీయుల ప్రధానులకు ముందు వీరి పేర్లే ఉన్నాయి (నిర్గమ 24:11), వీరి తండ్రి అహరోను తర్వాత, హీబ్రూ జాతిపై ఆధ్యాత్మిక నాయకత్వ బాధ్యతను పొందిన 70 మంది ఇశ్రాయేలు నాయకులకు ముందుగా కేవలం వీరి పేర్లను మాత్రమే లేఖనం మొదటిసారి ప్రస్తావించింది (సంఖ్యా 11:16-24) దుర్మార్గులుగానో, దుష్టులుగానో కాక దానికి భిన్నంగా లేఖనం వీరిని మనకు పరిచయం చేస్తోంది.

మోషేతో దేవుడు మాట్లాడుతుండగా సీనాయి పర్వతం ఎక్కి కొంచెం దూరం నుండి చూసే ఆధిక్యతను 70 మంది పెద్దలతోపాటు వీరిద్దరూ పొందారు (నిర్గమ 24:9-10) ఆ పర్వతం ఎక్కవద్దనీ, దాని అంచును తాకొద్దనీ ఇశ్రాయేలీయులను దేవుడు ఆజ్ఞాపించాడు (నిర్ణమ 19:12). మోషేతో దేవుడు మాట్లాడుతుండగా తప్పిపోయిన మృగమైనా సీనాయి పర్వతాన్ని తాకితే, ఆ మృగాన్ని రాళ్లతో కొట్టి లేదా, పొడిచి చంపాలి (వ13). పర్వతం కింద ఉన్న సామాన్య ఇశ్రాయేలీయులు పొగనూ, మెరుపుల్నీ మాత్రమే చూడగలిగారు. కానీ దేవుడే స్వయంగా నాదాబు, అభీహులను పేర్లుపెట్టి పిలిచి, 70మంది పెద్దలను పర్వతం పైకి తీసుకురమ్మని ఆహ్వానించాడు. “వారు దేవుని చూసి అన్నపానీయాలు పుచ్చుకొన్నారు” (నిర్గమ 24:11).

మరొకమాటలో చెప్పాలంటే, నాదాబు అబీహులు అందరికంటే దేవునికి సన్నిహితంగా ఉన్నవారు. మోషే తర్వాత మరి ఏ ఇశ్రాయేలీయునికీ అంతటి ఉన్నతమైన ఆధిక్యతను దేవుడు ఇవ్వలేదు. ఈ ఖ్యాతినొందిన యవ్వనస్థులు చాలా భక్తిగలవారిగా, నమ్మకమైన ఆధ్యాత్మిక నాయకులుగా, విశ్వసనీయమైన సేవకులుగా కనిపించారు. దాదాపు ఇశ్రాయేలీయుల్లో ప్రతీ ఒక్కరూ వీరిని ఎంతో ఉన్నతంగా గౌరవించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

దేవుడు పరిశుద్ధాగ్నితో ఆకస్మాత్తుగా నాదాబు, అబీహులను కాల్చి చంపినపుడు ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరూ భయంతో వణికారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రత్యక్ష గుడారంలో వారి పరిచర్య ప్రారంభమైన తొలిరోజే ఇది జరిగింది. ప్రత్యక్ష గుడార నిర్మాణం పూర్తైన తర్వాత అహరోను, అతని కుమారుల ప్రతిష్టత కార్యక్రమం ఏడు రోజులు కొనసాగింది. ఎనిమిదవ రోజున (లేవీ 9:1) ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటి పాప పరిహారార్థ బలిని అహరోను జరిగించాడు. ఆ వేడుకకు ఒక అద్భుతంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

“యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలువెళ్ళి బలిపీఠంపై ఉన్న దహనబలి ద్రవ్యాన్ని, కొవ్వునూ కాల్చివేసింది. ప్రజలందరు దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడ్డారు” (లేవీ 9:24)

తరువాత జరిగిన దానిని మోషే గ్రంథస్థం చేసాడు:

అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన నన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. వారు యెహోవా సన్నిధిని మృతిపొందారు. మోషే అహరోనుతో ఇట్లనెను - ఇది యెహోవా చెప్పిన మాట - నా యొద్ధ నుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరచుకొంటాను. ప్రజలందరి యెదుట నన్ను మహిమవరచుకొంటాను (లేవీ 10:1-3),

నాదాబు అబీహులు దేవుడు చెప్పిన బలిపీఠం నుంచి కాక వేరొక స్థలం నుంచి అగ్నిని తీసుకొని, తమ ధూపార్తుల్ని వెలిగించారు. వారు స్వయంగా తయారుచేసిన అగ్నితోనో లేదా, ఇశ్రాయేలీయుల సమాజంలో ఏదో ఒక మంట నుంచి తెచ్చిన నిప్పులతోనో నాదాబు అబీహులు తమ ధూపార్తుల్ని నింపుకున్నట్లు స్పష్టమవుతోంది. వారు అగ్నిని ఎక్కడినుంచి సేకరించారన్న విషయం వాక్యంలో లేదు, అది అంత ముఖ్యమైన విషయం కూడా కాదు. కానీ దేవుడే స్వయంగా దహించిన అగ్నినుంచి కాకుండా వేరొక అగ్నిని వారు ఉపయోగించారన్నదే అసలు విషయం.

వీరు మద్యం కూడా సేవించి ఉండవచ్చు, తాము చేస్తున్నదేమిటో వివేచించలేనంత మత్తులుగా బహుశా వారు ఉండి ఉంటారు (లేవీ 10:9) ఇలానే జరిగి ఉంటుందని సూచిస్తున్నది. కాని “అన్యాగ్ని" ని అర్పించినందుకే లేఖనం బాహాటంగా వీరిని నిందిస్తున్నది. దేవునికి ఇవ్వవలసినంత ఘనతను ఇవ్వకుండా నిర్లక్ష్య వైఖరితో, స్వచిత్తానుసారంగా, తగని పద్ధతిలో ఆయనను సమీపించడమే వారి పాపంలో కీలంకశం. వారు ఆయనను పరిశుద్ధునిగా పరిగణించలేదు, ప్రజల ముందు ఆయన నామాన్ని ఘనపరచలేదు. కనుక ప్రభువు స్పందన చాలా వేగంగా, ప్రాణాంతకమైనదిగా వారిపైకి వచ్చింది. నాదాబు అబీహుల అన్యాగ్ని దైవతీర్పు అనే ఆర్పజాలని అగ్నిజ్వాలలను వారిపైన కురిపించి, వారిని అక్కడికక్కడే దహించివేసింది.

ఈ సంఘటన గంభీరమైనదిగా, గగుర్పాటు కలిగించేదిగా ఉంది. ఈ సంఘటనలో మన సంఘానికి అవసరమయ్యే స్పష్టమైన పాఠాలున్నాయి. దేవుణ్ణి అవమానించి, ఆయనను నిర్లక్ష్యం చేసి, అసహ్యించుకునే రీతిలో ఆయనను సమీపించడం తీవ్రమైన నేరం. దేవుణ్ణి ఆరాధించేవారు ఆయనను పరిశుద్ధునిగా తలపోస్తూ, ఆయన ఆజ్ఞాపించినట్లు ఆరాధించాలి.

త్రిత్వంలో మూడవ వ్యక్తి అయిన మహిమగల పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుల కంటే ఏ మాత్రమూ తక్కువ కాడు. కనుక పరిశుద్ధాత్మను అవమానించేవాడు దేవుణ్ణి అవమానించినట్లే. పరిశుద్ధాత్మ నామాన్ని దుర్వినియోగం చేయడం దేవుని నామాన్ని వ్యర్ధంగా ఉచ్చరించడమే. తమ ఇష్టానుసారంగా, నియమ నిబంధనల్లేకుండా, వాక్య విరుద్ధమైన పద్ధతిలో ఆరాధించడానికి కారకుడు ఆయనేనని చెప్పడం దేవుణ్ణి ఏహ్యభావంతో పరిగణించినట్లే. పరిశుద్ధాత్మను ఒక వేడుకగా మార్చడమంటే ఆయనను దుఃఖపెట్టే పద్ధతిలో ఆరాధించడమే. అందుచేతనే ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ద్వారా సంఘంలోనికి ప్రవేశించిన అమర్యాదపూర్వకమైన వికృత చేష్టలూ, వక్రీకరించబడిన సిద్ధాంతాలూ నాదాబు అబీహుల అన్యాగ్ని కంటే నీచంగా ఉన్నాయి. అవి పరిశుద్ధాత్మునికీ, తద్వారా దేవునికీ అవమానం తెస్తున్నాయి. కఠినమైన తీర్పుకు ఇవే కారణాలు (హెబ్రీ 10:31).

ఒకప్పుడు పరిశుద్దాత్మ కార్యాన్ని పరిసయ్యులు సాతానుకి ఆపాదించారు. కఠిన హృదయంతో వాళ్ళు చేసిన ఆ దేవదూషణ క్షమించరానిదని ప్రభువు వారిని హెచ్చరించాడు (మత్తయి 12:24). పరిశుద్ధాత్మతో అబద్ధం చెప్పిన వెంటనే అననీయ, సప్పీరాలను దేవుడు మొత్తాడు. ఫలితంగా “సంఘమంతటికిని, ఈ సంగతులు వినిన వారందరికినీ మిగుల భయము కలిగెను" (అపొ.కా.5:11). గారడీ చేసే సీమోను, ఆత్మశక్తిని ధనంతో కొంటానని అడిగినప్పుడు, “నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో నశించును గాక” (అపొ.కా. 8:20) అని పేతురు అతణ్ణి కఠినంగా గద్దించాడు. కృప కలిగిన ఆత్మను అవమానించే ప్రమాదంలో ఉన్నవారిని “జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము” (హెబ్రీ 10:31) అని హెబ్రీ గ్రంథకర్త గంభీరంగా హెచ్చరించాడు. అన్యాగ్నిని తనకు అర్పించే ఎవనికైనా త్రిత్వంలో మూడవ వ్యక్తి చాలా భయంకరుడు.

పరిశుద్ధాత్మను తిరిగి కనిపెట్టుట

ఒక వైపున ప్రధాన ఇవాంజెలికల్స్‌ కొంతమంది పరిశుద్ధాత్మను పూర్తిగా విస్మరిస్తూ దోషులుగా ఉన్నారు. వీరు సంఘాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన శక్తిని కాక తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. త్రిత్వంలో మూడవ వ్యక్తియైన పరిశుద్ధాత్మను మర్చిపోయారు. వీళ్లు ప్రజాదరణ నిమిత్తం వ్యక్తిగత పవిత్రతకూ, పరిశుద్ధాత్మ అనుగ్రహించే పరిశుద్ధతకూ ప్రాధాన్యతను ఇవ్వట్లేదు. వాక్యానుసారమైన ప్రసంగంలో మాత్రమే ఆత్మ ఖడ్గం శక్తివంతంగా వినియోగించబడుతుంది. అయితే వీరు దీనిని చాలా పురాతన పద్ధతని వాదిస్తున్నారు. దాని స్థానంలో వినోదాన్ని అందించి, అబద్ధ వాగ్దానాలు చేస్తూ, ఉద్రేకాన్ని రేకెత్తించే ప్రసంగాల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపిత లేఖనాల అధికారాన్ని చౌకబారైన అసమర్థ ప్రత్యామ్నాయాలతో మార్చేస్తున్నారు.

మరొక పక్క ప్రస్తుత పెంతెకోస్తు క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాలు పరిస్థితిని మరొక విపరీత ధోరణి వైపునకు మళ్ళించేసాయి. వాక్యానుసారం కాని భావనలను పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలుగా వారు కనపరిచారు. సూచనల గురించీ, భావోద్వేగాల గురించీ, సరికొత్త సంచలనాల గురించీ అంకిత భావంగల క్యారిస్‌మాటిక్‌ బోధకులు నిరంతరం మాట్లాడుతున్నారు. దీనిని బట్టి వీరి బోధల్లో క్రీస్తు ఆయన సిలువ యాగం, చరిత్రలో సువార్త సత్యాలను గురించిన విషయాలు చాలా తక్కువగా ఉంటున్నాయి, కొన్నిసార్లు అసలు కనబడట్లేదు. పరిశుద్ధాత్మ కార్యాలపై క్యారిస్‌మాటిక్‌ వారి అత్యాసక్తి మూఢభక్తి. “తండ్రి యొద్ద నుండి మీ దగ్గరకు నేను పంపబోయే ఆదరణకర్త అనగా తండ్రి దగ్గర నుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినపుడు ఆయన నా గురించి సాక్ష్యమిస్తాడు.” (యోహాను 15:26) అని యేసు చెప్పారు. కనుక సంఘం ప్రధాన గురి పరిశుద్ధాత్ముడైతే అది ఆయన నిజ కార్యాన్ని అడ్డగిస్తుంది.

క్యారిస్‌మాటిక్‌ బోధలోనూ, ఆచరణలోనూ అధికశాతం కనిపించే పరిశుద్ధాత్మునికీ, లేఖనాలు బయలుపరచిన నిజ దేవుని ఆత్మకూ ఏ మాత్రమూ పోలిక లేదు. తన్మయత్వంతో కూడిన శక్తిని కలుగచేసే ఉత్తేజమో, మొద్దుబారిన తలంపులతో అర్ధరహితమైన భాషను వాగించేవాడో, ఆరోగ్యైశ్వర్యాలను కలిగించే విశ్వవ్యాప్తమైన జీని (Genie) గానీ కాడు పరిశుద్ధాత్మ. తన ప్రజలను వికారంగా మాట్లాడడానికీ, వికృతంగా నవ్వడానికీ పరిశుద్ధాత్ముడు కారణం కాడు. వారిని స్పృహ లేకుండా అచేతనంగా వెనుకకు పడగొట్టడు. అస్తవ్యస్తంగా అదుపులేని పద్ధతుల్లో ఆరాధించడానికి వారిని పురికొల్పడు. తన రాజ్యపు పనిని అబద్ధ ప్రవక్తల ద్వారా, నకిలీ స్వస్థతకారుల ద్వారా, వంచకులైన టి. వి. సువార్తికుల ద్వారా ఆయన నెరవేర్చడు. నేటి క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం దాని వ్యర్థమైన ఊహలకు సరిపోయే పరిశుద్ధాత్మను సృష్టించి, క్రీస్తు శరీరానికి వెలకట్టలేనంత నష్టాన్ని కలిగించే అన్యాగ్నిని అందిస్తోంది. త్రిత్వంలో మూడవ వ్యక్తిపైన దృష్టిసారించానని ప్రకటిస్తూ, ఇది నిజానికి ఆయన నామాన్ని అపవిత్రపరచి, ఆయన నిజ కార్య ప్రతిష్టను దిగజారుస్తున్నది.

ఎవరైనా దేవుణ్ణి అవమానిస్తున్నప్పుడు ఆయనను ప్రేమించేవారికి బాధ, నీతితో కూడిన రోషం కలుగుతాయి. “నీ యింటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడియున్నవి” అని కీర్తన 69:9లో దావీదు పలికినప్పుడు ఆయన అనుభవించింది అదే. యూదులు దేవాలయాన్ని (వ్యాపారపుటిల్లుగా మార్చి) ఎంతో అమర్యాదతో అవమానించిన సందర్భంలో ప్రభువైన యేసు రూకలు మార్చే వారి బల్లలు పడద్రోసి, దేవాలయాన్ని శుద్ధీకరించినపుడు ఈ వచనాన్ని ప్రస్తావించారు. క్యారిస్‌మాటిక్‌ సంఘాల్లో అనేకమంది పరిశుద్ధాత్మను అపఖ్యాతికి గురిచేసి, అవమానిస్తూ, అవాస్తవంగా చూపిస్తున్న భయంకరమైన విధానాలకు వ్యతిరేకమైన భారం నాకు దీర్ఘకాలంగా ఉంది.

పరిశుద్ధాత్మపై అతిగా దృష్టి సారించామని చెబుతున్నవారే వాస్తవానికి ఆయనను అతిగా దూషిస్తున్నారు, దుఃఖపెడుతున్నారు, అవమానిస్తున్నారు, వక్రీకరిస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు. ఇది ఎంత విచారకరం. వారు ఇది ఎలా చేస్తున్నారు? ఆయన పలకని మాటలను, చేయని కార్యాలను, కనపరచని సూచనలను, ఆయనకు ఏ మాత్రమూ సంబంధంలేని అనుభవాలనూ ఆయనకు ఆపాదిస్తూ ఇది చేస్తున్నారు. ఆయనది కాని కార్యంపై ఆయన నామాన్ని వారు ఎంతో ధైర్యంగా అతికించేస్తున్నారు.

యేసయ్య కాలంలో ఇశ్రాయేలు మత నాయకులు పరిశుద్ధాత్మ కార్యాన్ని దేవదూషణకరమైన రీతిలో సాతానుకు ఆపాదించారు (మత్తయి 12:24 ). అయితే ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం దానికి భిన్నంగా అపవాది కార్యాన్ని పరిశుద్దాత్మునికి ఆపాదిస్తోంది. సాతానుగాడి అబద్ధ బోధకుల సైన్యాలు వారి వ్యభిచార సంబంధమైన కోరికలను నిజం చేసుకునే మార్గంలో కవాతు చేస్తూ, వాడి తప్పులను సంతోషంగా ప్రచారం చేస్తున్నారు. వారు ఆధ్యాత్మిక వంచకులు, మోసగాళ్లు, దోపిడి దారులు, కువైద్యులు. టి.వి. పెట్టగానే వారి అంతులేని ఆడంబరాన్ని మనం చూడవచ్చు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరం భద్రం చేయబడియున్నదనీ, వారిని నిర్జల మేఘాలనీ, ప్రచండమైన అలలనీ మార్గం తప్పి తిరుగు చుక్కలనీ యూదా పిలిచాడు (వ13) తమ అబద్ధాలను నమ్మించడం కోసం పరిశుద్ధాత్మ నామాన్ని ప్రస్తావిస్తూ, ఆ విధమైన దేవదూషణకు శిక్షను అనుభవించవలసిన అవసరం ఏమీ లేదన్నట్లు నటిస్తూ తమను తాము వెలుగు దూతలుగా వారు ప్రకటించుకుంటున్నారు.

దేవుని స్వభావాన్ని బట్టి ఆయనను ఆరాధించమని బైబిల్‌ స్పష్టం చేస్తుంది. కుమారుని ఘనపరచకుండా ఎవ్వరూ తండ్రిని ఘనపరచలేరు. అదే విధంగా పరిశుద్ధాత్మను తృణీకరిస్తూ, తండ్రి కుమారులను ఘనపరచడం అసాధ్యం. అయితే ప్రతి రోజు లక్షలాదిమంది క్యారిస్‌మాటిక్స్‌ తాము కల్పించిన పరిశుద్ధాత్మని అత్యంత వికృత రూపాన్ని ఘనపరుస్తున్నారు. వారు మోషే లేనప్పుడు బంగారు దూడను తయారుచేయమని అహరోనును బలవంతపెట్టిన నిర్గమకాండము 32వ అధ్యాయపు ఇశ్రాయేలీయుల్లా ఉన్నారు. ఆ విగ్రహారాధిక ఇశ్రాయేలీయులు ప్రభువును ఘనపరుస్తున్నామని వాదించారు (వ4-8). కానీ వారు నాట్యం చేస్తూ అమర్యాదతో ఆరాధించింది కలవరం కలిగించే అత్యంత వికృత రూపంలో ఉన్న ప్రతిమను (వ25 ), వారి అవిధేయతను బట్టి అత్యంత వేగంగా, తీవ్రంగా దేవుడు స్పందించాడు. ఆ రోజు గడవకముందే, వేలాదిమందిని దేవుడు చంపాడు.

మనకు నచ్చిన రూపంలో దేవుణ్ణి తయారుచేసుకునే అర్హత మనకు లేదు. మన రూపంలో గానీ, మన అంచనాలకూ ఆలోచనలకూ తగిన రూపంలోగాని దేవుణ్ణి మనం మలచకూడదు. కానీ పెంతెకోస్తువారూ క్యారిస్‌మాటిక్‌ ఉద్యమకారులూ చేసింది అదే. ఇశ్రాయేలీయులు బంగారు దూడను తయారుచేసుకున్నట్టు, తమకు నచ్చిన విధంగా వీరు పరిశుద్ధాత్మను సృష్టించుకున్నారు.

మానవ అనుభవమనే అగ్ని జ్వాలల్లో తమ వేదాంతాన్ని విసిరి, బయటకు వచ్చిన అబద్ధ ఆత్మ ముందు వికారమైన వికృతమైన చేష్టలతో, అడ్డూ అదుపూ లేని ప్రవర్తనతో కవాతు చేస్తూ వారు ఆరాధిస్తున్నారు. ఒక ఉద్యమంగా వారు పరిశుద్ధాత్మను గురించిన సత్యాన్ని మొండిగా విస్మరించి, దేవుని గృహంలో నిర్లక్ష్య వైఖరితో విగ్రహ ఆత్మను నిలబెట్టి, త్రిత్వంలో మూడవ వ్యక్తిని ఆయన నామంలోనే అగౌరవపరుస్తున్నారు.

                                    ట్రోజాను గుర్రాన్ని పోలిన ఆత్మీయ దుర్నీతి

క్యారిస్‌మాటిక్స్‌ అతి ఘోరంగా వేదాంతపరమైన అసత్యంలో ఉన్నప్పటికీ, ప్రధాన ఇవాంజెలికల్‌ శాఖలో అంగీకారాన్ని వారు డిమాండ్‌ చేస్తున్నారు. చాచిన చేతులతోనూ, ఆహ్వానపూరిత చిరునవ్వుతోనూ అనేకమంది ఇవాంజెలికల్స్‌ వారి డిమాండ్లకు లొంగిపోయారు. ఇలా చేసి ప్రధాన ఇవాంజెలికల్‌ శాఖ తెలియకుండానే తన శిబిరంలోనికి శత్రువును ఆహ్వానించింది. విషయ విజ్ఞానవాదమనే మోసానికీ, అనుభవమే జ్ఞానార్జనకు మూలమనే భావానికీ, వాక్య విరుద్ధమైన క్రైస్తవ సిద్ధాంతాలు గల క్రైస్తవ సంఘాలతో రాజీకీ, తప్పు బోధలకూ ద్వారాలు విశాలంగా తెరుచుకున్నాయి. ఈ విధంగా రాజీపడేవారు అన్యాగ్నితో చెలగాటమాడుతూ, తమను తాము తీవ్రమైన ప్రమాదానికి గురిచేసుకుంటున్నారు.

19వ శతాబ్దం తొలి సంవత్సరాల్లో పెంతెకోస్తు ఉద్యమం ఆరంభమైనపుడు వేదాంత పండితులు ఈ ఉద్యమాన్ని అధికశాతం తప్పు బోధగా పరిగణించారు. మొదట్లో ఈ ఉద్యమం ఒంటరిగా ఉండి దాని శాఖలకే పరిమితమైంది. కానీ 1960 సంవత్సరాల్లో తమ వేదాంతంలో లిబరలిజమ్‌ను హత్తుకొని దాదాపు ఆధ్యాత్మికంగా చల్లారిపోయిన ప్రొటస్టెంట్‌ సంఘాల్లోనికి పెంతెకోస్తు ఉద్యమం పాదాన్ని మోపి, ప్రధాన శాఖల్లోనికి ప్రవేశించ నారంభించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని వాన్‌ నాయస్‌ అనే నగరంలో సెయింట్‌ మార్క్‌ ఎపిస్కోపల్‌ చర్చ్‌లోనే క్యారిస్‌మాటిక్‌ రెన్యువల్‌ ఉద్యమారంభ జాడలు కనబడతాయి. 1960లో ఈస్టర్‌ పండుగకి రెండు వారాల ముందు, ఆ సంఘ కాపరి డెన్నిస్‌ బెన్నెట్‌ తాను పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందానని ప్రకటించాడు (అతడు, సంఘ సభ్యులు మరికొంతమంది రహస్య సభలు జరుగుతుండగా భాషల్లో మాట్లాడడాన్ని అభ్యసించామని తెలిపారు).

లిబరల్‌ ఎపిస్కొపల్‌ నాయకులు ఫాదర్‌ బెన్నెట్‌ చేసిన ప్రకటన విషయంలో కనీస ఆసక్తిని కూడా చూపించలేదు. నిజానికి త్వరలోనే వాన్‌నాయస్‌ సంఘం నుంచి బెన్నెట్ ను తొలగించారు. అయితే అతడు ఎపిస్కోపల్‌ శాఖలోనే నిలిచాడు. ఆ క్రమంలో సియాటిల్‌లో దురావస్థలో ఉన్న సంఘానికి పాస్టర్‌గా ఉండేందుకు పిలుపునందుకున్నాడు. వెంటనే ఆ సంఘం వృద్ధి చెందనారంభించింది. బెన్నెట్‌ నూతన పెంతెకోస్తు భావన నెమ్మదిగా విస్తరించి, ఆత్మీయంగా ఎండిపోయిన పలు సంఘాలలోనికి ప్రవేశించింది. ఆ దశాబ్దపు ఆఖరి సమయానికి, ప్రపంచ నలుమూలల్లో దిక్కులేని స్థితిలో ఉన్న ఆత్మీయంగా మృతమైన పలు ప్రముఖ సంఘాలు క్యారిస్‌మాటిక్‌ సిద్ధాంతాన్ని చేపట్టి, తత్ఫలితంగా సంఖ్యాపరమైన అభివృద్ధిని చూసాయి.”

అనుభవమే జ్ఞానానికి మూలమనే పెంతెకోస్తు శాఖ ఉద్రేకపూరిత భావన మందకొడిగా ఉన్న సంఘాలలో అగ్నిజ్వాలలను రగల్చగా, 1970 నాటికి ఈ క్యారిస్‌మాటిక్‌ రెన్యువల్‌ ఉద్యమం వేగం పుంజుకున్నది. 1970 తొలినాళ్ళలో బైబిల్‌ లోపరహితమైనది అనే బోధ విషయంలో తాను తీసుకున్న తీర్మానానికి ప్రధాన ఇవాంజెలికల్‌ పాఠశాలయైన ఫుల్లర్‌ ధియలాజికల్‌ సెమినరీ స్వస్తి చెప్పింది. ఆ సెమీనరీలో ఇద్దరు ప్రొఫెసర్లు 1980లో క్యారిస్‌మాటిక్‌ భావాలను తరగతి గదిలోనే ప్రోత్సహించడం ప్రారంభించారు. ఆ విధంగా పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్‌ వేదాంతం ఇవాంజెలికల్‌ శాఖలోనికీ, స్వతంత్ర సంఘాల్లోనికీ చొరబడగా ఏర్పడినది “థర్డ్‌ వేవ్‌” గా పిలువబడింది.

ఆ విధంగా క్యారిస్‌మాటిక్‌ సిద్ధాంతం పలు క్రైస్తవ శాఖలను నియంత్రించడం మూలంగా కలిగిన ఫలితాలు విధ్వంసకరంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సత్యాన్ని వక్రీకరించి, హితబోధను బయటకు రానీయకుండా చేసి, సువార్త వ్యాప్తిని అతిగా అడ్డగించిన ఉద్యమం మరొకటేదిలేదు. క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ఇవాంజెలికల్‌ సంఘాన్ని అసత్యంతో నిండిన మురికిగుంటగానూ, అబద్ధ బోధకుల తయారీ కేంద్రంగానూ మార్చేసింది. ఇది స్వచ్చమైన ఆరాధనను అడ్డూ అదుపు లేని ఉద్రేకం చేత వక్రీకరించి, ప్రార్థనను వ్యక్తిగతమైన పిచ్చి మాటలతో కలుషితం చేసి, నిజమైన ఆధ్యాత్మికతను వాక్య విరుద్ధమైన మర్మాలతో మలినం చేసి, లోకాశలను నెరవేర్చుకోవడానికి సృజనాత్మక బలంగా ఇది విశ్వాసాన్ని మార్చేసింది. లేఖన అధికారానికి పైగా వ్యక్తిగత అనుభవ అధికారాన్ని హెచ్చించడం ద్వారా క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ప్రతి విధమైన తప్పుడు బోధకూ, ఆచరణలకూ స్వేచ్చగా అనుమతినిచ్చి తనను తాను కాపాడుకోవడంలో సంఘానికి ఉన్న శక్తిని నాశనం చేసింది. నిక్కచ్చిగా చెబితే, క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం సత్యవాక్య వేదాంతానికి ఏ విధమైన సహకారాన్ని అందించకపోగా, సత్యం నుంచి తొలగిపోయిన ఒక పరివర్తనను ఇది సూచిస్తోంది. ఈ ఉద్యమం ఒక ప్రాణాంతకమైన వైరస్‌ లాంటిది. అయితే కొన్ని వాక్యానుసారమైన క్రైస్తవ లక్షణాలను బాహ్యంగా ప్రదర్శిస్తూ సంఘంలోనికి ప్రవేశం పొంది, చివరకు అన్నివేళలా సత్యమైన బోధను వక్రీకరిస్తున్నది. ఫలితంగా కలిగిన నష్టం తప్పుడు బోధకూ, వెర్రి ప్రవర్తనకూ, దేవదూషణకూ దారి తీసాయి. తనను తాను అది క్రైస్తవ్యంగా పిలుచుకుంటోంది కానీ, ఇది వట్టి మాయ. అనూహ్యమైన రీతిలో ఒక అసత్యం నుంచి మరొక అసత్యానికి నిత్యం తన రూపాన్ని మార్చుకుంటున్న ఆధ్యాత్మికతకు నకిలీ రూపమిది.

మునుపటి తరాల్లోనైతే పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాలను తప్పుబోధలుగా పేర్కొనడం జరిగింది. అయితే ఇపుడు దానికి భిన్నంగా ప్రపంచంలోనే క్రైస్తవ్యమని పిలువబడుతున్న దానికి ఇది అత్యంత శక్తివంతమైన రూపంగా కనబడుతున్నది. ఇది సువార్త యొక్క అతి స్వచ్చమైన, అత్యంత శక్తివంతమైన రూపమని వాదిస్తున్నది. కానీ వాక్యానుసారమైన సువార్తతో అసలు ఏ మాత్రం సంబంధం లేని ఆరోగ్యైశ్వర్యాలను వాగ్దానం చేసే సువార్తను ఇది ప్రాథమికంగా ప్రకటిస్తుంది. దాని సిద్ధాంతాన్ని ఎదిరించే వారందరినీ పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టేవారనీ, ఆయనను ఆర్పివేస్తూ, ఎదిరిస్తున్నారనీ, ఆ విధంగా ఆయనను దూపిస్తున్నారనీ ఈ ఉద్యమం వారిని బెదిరిస్తుంది. అయితే ఆయన నామంపై ఎంతో తీవ్రంగా బురదచల్లుతూ అవమానిస్తున్న ఉద్యమం దీనికి మించినది మరొకటేది లేదు.

ఎవరైతే పరిశుద్ధాత్మ గురించి అతి ఎక్కువగా మాట్లాడుతున్నారో వారే ఆయన నిజ కార్యాన్ని తృణీకరించడం మిక్కిలి హాస్యాస్పదంగా ఉంది. అన్ని విధాలైన మానవుల అవివేకాన్ని ఆయనకు ఆపాదిస్తూ ఆయన పరిచర్య అసలైన ఉద్దేశాన్ని, శక్తినీ అనగా పాపులను మరణం నుంచి విముక్తులను చేయడం, వారికి నిత్యజీవం అనుగ్రహించడం, వారి హృదయాలను మార్చడం, వారి స్వభావాన్ని రూపాంతరం చేయడం, ఆత్మీయంగా జయించడానికి గల సామర్థ్యాన్ని ప్రసాదించడం, దేవుని కుటుంబంలో వారి స్థానాన్ని స్థిరపరచడం, దేవుని చిత్త ప్రకారం వారి కోసం విజ్ఞాపన చేయడం, నిత్య మహిమకు భద్రంగా వారిని ముద్రించడం, భవిష్యత్తులో వారిని అమర్త్యమైనవారిగా లేపుతానని వాగ్దానం చేయడం మొదలైనవాటిని విస్మరిస్తున్నారు.

పరిశుద్ధాత్ముడు దేవుడు కనుక ఆయన గురించీ, ఆయన కార్యం గురించీ వక్రీకరించబడిన భావాన్ని ప్రచారం చేయడం దేవదూషణే ఔతుంది. ఆయనను హెచ్చించాలి, ఘనపరచి, స్తుతించాలి. తండ్రి కుమారులను ఏ విధంగా మహిమపరుస్తామో ఆ విధంగా పరిశుద్ధాత్మను ఏమైయున్నాడో ఏమి చేస్తాడోననే విషయాలను బట్టి ఆయనను మహిమపరచాలి. ఆయన ఎవరిలోనైతే నివస్తున్నాడో వారిచేత ప్రేమించబడి, స్తుతించబడాలి. అది జరగాలంటే ఆయనను ఎరిగి, ఆ సత్యంతో ఆయనను ఆరాధించాలి.

                                                మరి మనం ఎలా స్పందించాలి?

పరిశుద్ధాత్మ వ్యక్తిత్వ కార్యాలపై సరైన దృష్టిని తీసుకురావడానికి ఇవాంజెలికల్‌ సంఘం నిలబడడానికి ఇదే మంచి తరుణం. సంఘం యొక్క ఆత్మీయ ఆరోగ్యం ప్రమాదంలో ఉంది. ప్రస్తుత దశాబ్దాల్లో, క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ప్రధాన ఇవాంజెలికల్‌ శాఖల్లోనికి చౌరబడి, అంతర్జాతీయ తెరపై భీతి కలిగించే వేగంతో పేట్రేగిపోయింది. ఇదే ప్రపంచంలో అతి వేగంగా విస్తరిస్తున్న మతోద్యమం. ఇపుడు ప్రపంచవ్యాప్తంగా క్యారిస్‌మాటిక్స్‌ సంఖ్య 50 కోట్లకు పైగానే ఉంది. అయితే అలాంటి సంఖ్యాపరమైన అభివృద్ధిని కలిగించేది సత్య సువార్త కాదు, వాటి వెనకున్న ఆత్మ పరిశుద్ధాత్మ కాదు. మనం వాస్తవంగా చూస్తున్నది అసత్య సంఘపు గణనీయమైన అభివృద్ధిని. ఇది క్రైస్తవ్యంపై దాడిచేసిన ప్రతి విధమైన తప్పు మతం, తప్పు బోధలంత ప్రమాదకరమైనది. ప్రారంభ దశనుంచే ఈ క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ఒక హాస్యనాటకం, మోసం. ఇది మంచిదానిగా ఎన్నడూ మారలేదు.

సత్య సంఘం స్పందించవలసిన సమయం ఇదే. వాక్యానుసారమైన సువార్త, ఉజ్జీవం, మతోద్ధారణలో సోలాస్‌ అనే నియమాలపై నూతన ఆసక్తి వచ్చిన సమయంలో, పరధ్యానంగా నిలబడడం అంగీకారయోగ్యమైనది కాదు. లేఖనాలకు నమ్మకస్తులుగా ఉండే ప్రతీ ఒక్కరూ పూనుకొని, దేవుని మహిమపై దాడి చేసే ప్రతీ విషయాన్నీ ఖండించాలి. పరిశుద్ధాత్మను గురించిన సిద్ధాంతాన్ని ధైర్యంగా పరిరక్షించడంలో మనం సత్యాన్ని అన్వయించబద్ధులమై ఉన్నాం. సంఘ సంస్కర్తలకు మనం గౌరవాన్ని చూపితే, మనం విశ్వాసాన్ని గురించి ఆసక్తితో పోరాడి, వారు కనపరచిన ధైర్య సాహసాలకు తగినట్లుగానే ప్రవర్తించాలి. పరిశుద్ధాత్మ దేవునిపై జరుగుతున్న భయంకరమైన దూషణలపై మూకుమ్మడిగా యుద్ధం జరిగించాలి. ఆయన ఘనత గురించి పోరాడడానికి పిలుపునిచ్చేదే ఈ పుస్తకం.

అసలు పరిశుద్ధాత్ముని నిజమైన పరిచర్య ఏంటో, అది ఎలా ఉంటుందో కూడా మీకు గుర్తు చేయాలనే ఆశ నాకుంది. అది అస్తవ్యస్తంగా, ఆడంబరంగా, సర్కస్ లా ఆకర్షణీయంగా ఉండదు. అది అదృశ్యమైనదిగా, ఒక ఫలం ఎదిగే రీతిగా, అస్పష్టమైనదిగా ఉంటుంది. పరిశుద్ధాత్ముని ప్రధాన పాత్ర క్రీస్తును ఘనపరచడమేననీ, ముఖ్యంగా తన ప్రజల్లో క్రీస్తు పట్ల ఆరాధన పుట్టించడమేననీ మనకు ఎవరో గుర్తు చేయవలసిన అవసరం ఉండకూడదు. క్రీస్తుని ఘనపరిచే ఈ కార్యాన్ని పరిశుద్ధాత్ముడు ఒక వినూత్నమైన, వ్యక్తిగతమైన విధానంలో చేస్తున్నాడు. అనగా మనకు మన పాపాన్ని చూపి, నిజమైన నీతికి మన కనులను తెరిపించి, సర్వలోకానికి తీర్పరియైన దేవునికి (యోహాను 16:8-11) మనం లెక్క అప్పగించవలసిన భావాన్ని మనలో కలుగచేస్తూ మనల్ని గద్దించి, ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు విశ్వాసుల్లో నివసిస్తూ, క్రీస్తును మహిమపరచి, ఆయనకు సేవచేయడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇస్తుంటాడు (రోమా 8:9). ఆయన మనలను నడిపిస్తూ, మనకు రక్షణ నిశ్చయతను కలుగచేస్తుంటాడు (వ14-16), ఉచ్చరించడానికి అసాధ్యమైన మాటలతో ఆయన మన గురించి ప్రార్థిస్తాడు (వ26). క్రీస్తులో మనలను భద్రం చేసి, ముద్రిస్తూ ఉంటాడు (2కొరింథీ 1:22 ఎఫెసీ 4:30), మనలను క్రీస్తు స్వరూపం లోనికి మారుస్తూ ఉండగా, మన పరిశుద్ధతకు ఆధారమూ, రహస్యమూ పరిశుద్ధాత్ముని అనుదిన సహవాసమే.

ఇపుడు సైతం సంఘంలో పరిశుద్ధాత్ముడు నిజంగా చేసేది అదే. ఆత్మపూర్ణులుగా ఉండడం, ఆత్మచేత నడిపించబడడం అంటే తికమక పెట్టే, వికారమైన, హేతువిరుద్ధమైన విషయాలు ఏమీ ఉండవు. ఆకర్షణీయమైన వాటిని కలుగచేయడం, గందరగోళాన్ని ప్రోత్సహించడం ఆయన పని కాదు. నిజానికి అటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు వీటిని చేసేది ఆయన కాదని మీరు గమనించాలి. “ఏలయనగా దేవుడు సమాధానమునకే కర్తగాని అల్లరికి కర్త కాడు” (1కొరింథీ 14:33,40) పరిశుద్ధాత్ముడు కలుగచేసే ఫలం: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. “ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు” (గలతీ 5:22,23).

ఈ పుస్తకాన్ని చదువుతుండగా పరిశుద్ధాత్ముడే స్వయంగా మీ జీవితంలో ఆయన నిజ పరిచర్య గురించి ఒక స్పష్టమైన అవగాహనను దయచేయాలనీ, పరిశుద్ధాత్మ గురించీ, ఆయన కృపావరాలను గురించీ, వాక్యానుసారమైన బోధను మీరు హత్తుకొని, పలు తప్పు సిద్ధాంతాలను బట్టి నేడు మనల్ని ఆకర్షిస్తున్న మోసపూరిత అద్భుతాలను బట్టి ఏమరుపాటుకు గురికాకూడదని మీ గురించి నా ప్రార్ధన. కేవలం దేవునికే మహిమ కలుగును గాక!

 

మొదటి భాగం

నకిలి ఉజ్జీవాన్ని గద్దించడం

                                                1. పరిశుద్ధాత్మను అపహసించడం

ఆఫ్రికాలోని ఒక వార్తా వెబ్‌సైట్‌ సంపాదకీయం నుంచి వెలువడిన వార్త ఈ మధ్య కాలంలో నన్ను చేరింది. దాన్ని చదివి, దాని ముక్కుసూటి నిజాయితీకీ పరిజ్ఞానానికీ నేను ఆశ్చర్యపోయాను. ఆ వార్తను రాసింది పెంతెకోస్తు సభ్యుడే అయినప్పటికీ, ఆ ప్రదేశంలో క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో జరుగుతున్న గందరగోళం గురించి అతడు కఠినంగా విమర్శించాడు.

పెంతెకోస్తు తత్వంలోని “వింతైన ఆత్మ వశీకరణ", విచిత్రమైన ఆచార వ్యవహారాలను తీవ్రంగా విమర్శించిన తర్వాత, రచయిత “భాషల్లో మాట్లాడడం” అనే అంశంపై దృష్టి సారించాడు. పరిశుద్ధాత్మపూర్ణుడైనట్లు కనబడిన ఒక వ్యక్తిని గమనిస్తూ, వెర్రి చేష్టలతో కూడిన ఆ దృశ్యాన్ని అతడు ఈ మాటలతో వివరించాడు:

పక్షవాతం వచ్చినట్లు తీవ్రంగా శరీరం కంపిస్తూ చేతులు వణుకుతుండగా 'యే -యే-యే-యే-సు.... యే.... సు.... యే.... సు.... యే -యే-యే-సు.... ఆస్‌.... ఆస్‌... ఆస్‌.... యే.... సు...' అని అర్థరహితమైన శబ్దాలను చేస్తున్న వ్యక్తిని నేను చూసాను.

తరువాత 'ష్లబబబ - జా - జీ - బలిక' అంటూ కొంత నత్తితో భాషల్లో అతడు మాట్లాడాడు. అమెరికా మానసిక వైద్యుడైన పీటర్‌ బ్రెంట్  ఈ లక్షణాన్ని 'బోర్న్ ఎగైన్‌ ఫిక్సేషన్‌' (తిరిగి జన్మించిన వారికి గల విశేషాశక్తి) అని పిలువగా, ఒక పరిశీలకుడు దీనిని 'పెంతెకోస్తు గేయం' అని పేర్కొన్నాడు. క్షుద్రపూజలు చేసే పూజారి తన చేతిలో ఉన్న నల్లటి కుంచె ఊపుతూ, నత్తిగా 'షిరి - బో - బో - బో - బోహ్' అని పలుకుతుండగా, మారుమనస్సు పొందిన క్రైస్తవుడు తన బైబిల్‌ పట్టుకుని 'ష్ల - బ- బ - బ  ష్లబలిక' అనే శబ్దం చేస్తున్నాడు. తేడా ఏముంది?” అని ఈ మధ్యనే ఒక సంఘ పరిచారకుడు ప్రశ్నించాడు.

ఆ వ్యంగ్య ప్రశ్న పాఠకుని చెవిలో ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉన్నది.

కొంతమంది ప్రార్థన ఆత్మ కలిగిన వారిని ముఖ్యంగా గొల్లభామల్లా ఒంటికాలిపై గెంతుచున్న స్త్రీలను  బెంచీలనూ, కుర్చీలనూ పడద్రోస్తూ నేలపై దొర్లుతున్న ఇతరులనూ గమనించగా క్రమం, క్రమశిక్షణ అనేవి గాలిలో కలిసిపోయి, అరుపులూ బొబ్బలతో కూడిన గందరగోళ స్థితికి అవి తావునిచ్చాయని చెబుతూ ఒక పెంతెకోస్తు సంఘ కార్యక్రమాన్ని నొప్పి కలిగించే విధంగా రచయిత బట్టబయలు చేసాడు. “అదేనా దేవుని సేవించే వాక్యానుసారమైన పద్ధతి?” అని ఆశ్చర్యంతో ఒక స్పష్టమైన ప్రశ్నను అతడు సంధించాడు. మరలా ఈ వ్యంగ్య ప్రశ్న సమాధానం లేకుండానే మిగిలిపోయింది.

అటు తరువాత అతడు కొద్ది వారాల క్రితం ఒక పెంతెకోస్తు ప్రార్ధన కూడికలో జరిగిన సంఘటనను వివరించాడు. ఈ కూడికలో ఆత్మవశురాలైన ఒక స్త్రీ భాషల్లో మాట్లాడుతున్న ఒక బాలుని మైకంతో ఢీకొట్టింది. సంఘస్థుల మధ్య పడిపోయి, రక్తం కారుతున్న పెదవిని పట్టుకుని పైకి లేచి, “అబ్బా ఎందుకు ఇలా జరిగింది?” అని ఆ బాలుడు తన ప్రాంతీయ భాషలో విలపించాడు.

ఈ సంఘటన సమాధానాలు లేని పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. వేరొక భాష మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ మరుక్షణంలోనే రక్తం కారుతున్న పెదవులను వదిలి ఎందుకు ప్రాంతీయ భాషలో మాట్లాడాలి? అని రచయిత ఆశ్చర్యపోయాడు. అయితే మరి ముఖ్యంగా, “ఇటువంటి గందరగోళ పరిస్థితికి పరిశుద్ధాత్ముడు ఏ విధంగా బాధ్యుడు కాగలడు?” అనే విషయాన్ని అతడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. “నిజానికి ఈ సంఘటన వీక్షకులనూ, ఆత్రుత గల సందర్శకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకరిలో ఉన్న పరిశుద్ధాత్మ వేరొకరిలో ఉన్న పరిశుద్ధాత్మను కొట్టి కింద పడవేసి, ఎందుకు గాయపరచాలి? పరిశుద్ధాత్ముడు శత్రువుని మట్టికరిపించే మల్లయోధునిగా ఇప్పుడు మారిపోయాడా? ఇలాంటి విషయాలు చాలా మర్మయుక్తంగా ఉన్నాయి” అని అతడు రాశాడు. వీక్షకుల గాబరా గ్రహించదగిందే. ఖచ్చితంగా దేవుని ఆత్మ తన వారిని గాయపరిచే అవకాశమే లేదు. ఆ
ఆలోచన “ఈ పరిస్థితి వెనకున్నది పరిశుద్ధాత్మ కాకపోతే, మరి ఎవరు?” అనే సందేహం వారిలో కలిగిస్తున్నది.

ఈ ప్రత్యేకమైన వార్త ఆఫ్రికా నుంచి వచ్చినదైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోట ఉండే పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్‌ సంఘాలను అది చక్కగా వర్ణిస్తోంది.  ఆ సంపాదకీయుడు లేవనెత్తిన ప్రశ్నలనే ప్రతి విశ్వాసి మరి ముఖ్యంగా క్యారిస్‌మాటిక్‌ సంఘ సభ్యులు అడగాలి. ఎందుకు భాషల్లో మాట్లాడే ఈ ఆధునిక ప్రక్రియ అన్యమత ఆరాధన పద్ధతులను పోలి ఉంది? క్రమానికి దేవుడైనవాడు అక్రమం, గందరగోళం చేత ఏ విధంగా ఘనత పొందుతాడు? పరిశుద్ధాత్ముడు నిజంగానే ప్రజలను కిందపడేలా చేస్తాడా? ఎందుకు ఈ క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ఆయనది కాని రూపానికి ఆయనను మార్చేసింది? మరి ముఖ్యంగా, ఈ మతిభ్రమణ వెనకున్నది ఆయన కాదని ప్రజలు తెలుసుకున్నప్పుడు వారికి ఏమి జరుగుతుంది?

                                                     పరిశుద్ధాత్మను అవమానించడం

పరిశుద్ధాత్మ పరిచర్యను ఘనపరచి, హెచ్చించడానికే కట్టుబడి ఉన్నదిగా ప్రకటించుకున్న ఉద్యమమే నిజానికి ఆయనను తృణీకరించి, తుచ్చమైనవానిగా పరిగణించడం మిక్కిలి హాస్యాస్పదం. తరచుగా క్యారిస్‌మాటిక్స్‌ దేవుని ఆత్మను ఒక శక్తిగానూ, ఒక భావనగానూ భావిస్తున్నారు. వారి వింత ఆచారాలూ, అతిశయోక్తితో కూడిన వ్యాఖ్యలూ ఆయనను ఒక వెర్రివానిగానూ, మోసగానిగానూ చిత్రిస్తున్నాయి. సార్వభౌమ మహిమతో కూడిన ఆయన పరిశుద్ధ వ్యక్తిత్వం పదేపదే తుచ్చమైన మానవ ఊహచేత అవమానానికి గురౌతూ ఉంది. ఫలితంగా టి.వి. సువార్తికులు, ఫెయిత్‌ హీలర్స్‌, తమను తామే పప్రవక్తలుగా ప్రకటించుకున్నవారు, ప్రోస్పారిటి బోధకులు వంటి అత్యంత గొప్ప నాయకులను కలిగి ఉన్న ఉద్యమం ఆయన నామాన్ని నిర్భయంగా ప్రకటిస్తూనే దాన్ని బురదగుండా ఈడ్చుకు వెళ్తుంది.

ఈ క్యారిస్‌మాటిక్‌ సమాజంలో నిరంతరం వెలుగు చూస్తున్న కుంభకోణాల, అక్రమాల సంఖ్య వణుకు పుట్టిస్తుంది. విడాకులు పొందుతూ నైతికంగా విఫలమౌతున్న క్యారిస్‌మాటిక్‌ ప్రధాన నాయకుల సంఖ్య అధికం కావడంవల్ల ఈ మధ్య కాలంలో క్యారిస్‌మాటిక్‌ సమాజపు పునాదులు వణికాయి. “ఈ ఉద్యమం క్రైస్తవ్యాన్ని పస లేనిదిగా, కీర్తిని సంపాదించి పెట్టేదిగా నిర్వచిస్తున్న కారణాన్ని బట్టి నేనెరిగిన క్యారిస్‌మాటిక్స్‌ అనేకులు ఇబ్బందిపడ్డారు. ఇలాంటి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి, పశ్చాత్తాపపడి, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇదే మంచి తరుణమని వారు భావిస్తున్నారు” అని కరిష్మా పత్రిక సంపాదకీయుడు జె.లీ. గ్రాడీ  'క్రిస్టియానిటి టుడే' లో రాశాడు.

పరిశుద్ధపరిచే ఆత్మ శక్తి కేవలం క్యారిస్‌మాటిక్స్‌కు మాత్రమే పరిమితమైంది. మరి యే ఇతర విశ్వాసికి అది అందుబాటులో లేదనేది క్యారిస్‌మాటిక్‌ బోధలోని ప్రాథమికాంశం. క్యారిస్‌మాటిక్‌ అనుభవం పొందినవారు ఆత్మ బాప్తిస్మం పొందారనీ, కనుక ఆ అనుభవమే అద్భుతరీతిలో విధేయత చూపడానికి శక్తినిచ్చి, పరిశుద్ధతను వృద్ధిచేసి, ఆత్మఫలాన్ని కలుగచేస్తుందనీ వారు చెబుతారు. వారు చెప్పేది నిజమైతే, క్యారిస్‌మాటిక్స్‌ ఆడంబరత్వానికి పేరొందిన వారిని కాకుండా, క్రీస్తు మాదిరిగా ఉన్న నాయకులను తయారుచేయాలి. వారి ఉద్యమంలో నైతిక వైఫల్యాలూ, ధన మోసమూ, అక్రమాలూ అత్యంత అరుదుగా ఉండాలి.

అయితే గత మూడు దశాబ్దాల్లో క్రీస్తు నామానికి అవమానం తీసుకువచ్చిన ప్రముఖ పాస్టర్ల, టి.వి. సువార్తీకుల జాబితాలో జిమ్‌ బక్కర్‌, జిమ్మీ స్వగ్గర్ట్‌, టెడ్‌ హాగ్గర్ట్‌, టాడ్‌ బెంట్లీ మొదలైన క్యారిస్‌మాటిక్‌ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. “వికీపీడియా” అనే ప్రముఖ వెబ్‌సైట్‌లో “లిస్ట్‌ ఆఫ్‌ స్కాండల్స్  ఇన్‌వాల్వింగ్‌ ఇవాంజెలికల్‌ క్రిస్టియన్స్‌” అనే శీర్శిక బహిరంగంగా అవమానానికి గురైన 50 మంది ప్రముఖ సంఘ నాయకులను గుర్తించింది. ఆ గుంపును “ఇవాంజెలికల్‌" అని ఈ శీర్షిక పేర్కొన్నప్పటికీ ఆ జాబితాలో కనీసం 35మంది పెంతెకొస్తు, క్యారిస్‌మాటిక్‌ నేపధ్యాల నుంచి వచ్చినవారే. సిద్ధాంతాల మూలంగా ఏర్పడిన శాఖల పేర్లను ప్రస్తావించే విషయంలో వికీపీడియా శీర్షిక అధికార పూర్వకమైనది కాకపోవచ్చు కానీ, ప్రజాభిప్రాయానికి ఖచ్చితమైన కొలమానంగా మాత్రం ఆది పనికొస్తుంది. నైతికంగా గానీ, ధనమోసం చేసి కానీ క్యారిస్‌మాటిక్‌ నాయకులు విఫలమైనప్పుడు, అవమానం కలిగేది ఇవాంజలికల్‌ శాఖ కీర్తి ప్రతిష్టలకే! మరి ముఖ్యంగా అది క్రీస్తు నామానికి మచ్చ కలుగచేస్తోంది, పరిశుద్ధాత్మకు అవమానం తీసుకువస్తోంది.

క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో వింతైన సిద్ధాంతాలు, వెర్రి ప్రవర్తన అత్యంత సాధారణమైపోయాయి కనుక, వారిక ప్రధాన వార్తల్లో నిలవట్లేదు. అర్థంకాని మాటలు మాట్లాడడం, నేలపై వెనుకకు పడిపోవడం, అదుపులేకుండా నవ్వడం, నేలపై దొర్లడం మొదలైన వాక్య విరుద్ధమైన పనులు పరిశుద్ధాత్మ సంచరిస్తున్నాడనడానికి ముఖ్య ఆధారాలుగా ఉన్నాయి. సంఘాలన్నీ పరిశుద్ధాత్మ నృత్యం చేస్తున్నట్టు, (పరిశుద్ధాత్మను ఒక అదృశ్యమైన మాదకద్రవ్యంగా భావించి ఆయనను శ్వాసిస్తూ, ఉప్పొంగుతూ) ప్రజలు ఆత్మను సేవిస్తున్నట్టు, పురిటినొప్పులు పడుతున్నట్లు స్త్రీలు  నేలపై దొర్లుతున్నటువంటి తీవ్ర దేవదూషణకరమైన క్యారిస్‌మాటిక్‌ కార్యాలను ఎన్నో యూట్యూబ్‌లో మనం చూడవచ్చు. గతంలో పాముల్ని ఆడించేవారే వీరి కంటే సామాన్యమైన మనుషుల్లా కనిపిస్తున్నారు.

ఇదంతా ఎంతో వెర్రితనంగా ఉంది. అయినప్పటికీ పరిశుద్ధాత్ముడే ఈ గందర గోళానికి కర్త, ఈ అక్రమానికి శిల్పి అన్నట్టు దీన్నంతటినీ నిస్సంకోచంగా ఆయనకు ఆపాదిస్తున్నారు. కరెంట్‌ షాక్‌ పాదాల్లో నుంచి కాళ్లలోకి, అటు తరువాత తల లోనికి, అక్కడి నుంచి చేతుల ద్వారా వేళ్లలోనికి ప్రవేశించిన విధంగానే క్యారిస్‌మాటిక్‌ రచయితలు పరిశుద్ధాత్మ సన్నిధిని వర్ణిస్తున్నారు. అటువంటి వర్ణనలు లేఖనంలో ఎక్కడా లేవు కనుక దాని గురించి అభ్యంతరపడవద్దు. సాతాను కూడా సూచనలూ, అద్భుతాలూ చేయగలడని లేఖనం మనల్ని హెచ్చరిస్తుంది. ఒకవేళ ఆ కార్యాల భావాలు నిజానికి అపవాది నుంచి కలిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ సూచనలు అంధకార సంబంధమైనవిగా, అసహ్యకరమైనవిగా, అల్లరితో కూడినవిగా ఉంటున్నాయి కనుక, వీటిని కలిగించేది అపవాదేనని చెప్పడం సత్యానికి దూరమైన విషయమేమీ కాదు.

పరిశుద్ధాత్మ నామంలో ఇంతకు మించిన క్రూరమైన దాడులు జరిగాయి. ఒక స్త్రీని స్వస్థపరిచే క్రమంలో ఆమెను కడుపులో గుద్దాననీ, ఎందుకంటే దేవుడే తనను అలా చేయమన్నాడనీ కెన్నెత్‌ హాగిన్‌ చెప్పాడు. రాడ్నీ హావర్డ్ బ్రౌన్‌ ఒక చెవిటి వ్యక్తిని నేలపై పడిపోయేంత గట్టిగా చెంపపై కొట్టాడు. బెన్నీహిన్  ఎల్లప్పుడూ ప్రజలను చాలా దారుణంగా నేలపైకి నెట్టేస్తాడు. కొన్నిసార్లు అతడు తన కోటునూ, మరి కొన్నిసార్లు తన చేతినీ వారివైపు ఊపుతూ ఒక గారడీలా చేస్తాడు. ఇతర సమయాల్లో వారిని తగినంత బలంతో వెనుకకు తోసేస్తాడు. ఆ ప్రక్రియలో ఒకసారి వయసుమళ్లిన ఒక స్త్రీ ప్రాణాంతకమైన రీతిలో గాయపడింది. అయితే అతణ్ణి తన అద్భుతాల సభల్లో ఒక క్రమమైన
వాడుకగా ఇలా చేయడాన్ని ఆ ప్రమాదం ఆపలేకపోయింది. ఊహకందని అనుచిత కార్యాలను వాళ్లు ఆత్మ ప్రభావానికి ఆపాదిస్తున్నారు. ఉదాహరణకు క్యారిస్‌మాటిక్‌ సువార్తికులు టాడ్‌ బెంట్లీ స్వస్థపరిచేటప్పుడు తాను ఉపయోగించే క్రూరమైన విధానాలను ఈ విధంగా సమర్థించుకుంటున్నాడు.

“దేవా, నేను వందమంది వికలాంగుల గురించి ప్రార్ధించాను, కానీ ఒక్కరు  కూడా స్వస్థత పొందలేదు” అన్నాను. అప్పుడు ఆ స్త్రీ  కుంటి కాళ్లను‌ పట్టుకుని, బట్టలు ఉతికినట్టు వేదికపై బాదమని ఆయన చెప్పాడు. నేను వేదికపైకి వెళ్ళి ఆమె కాళ్లు పట్టుకుని వేదికపై బాదడం మొదలుపెట్టాను. ఆమె న్వస్థతపొందింది. “దేవుని శక్తి ఎందుకు సంచరించట్లేదు?” అని నేను ఆలోచిస్తుండగా, “ఏందుచేతనంటే నీవు ఆ స్త్రీ  ముఖంపై తన్నలేదు కనుక” అని ఆయన చెప్పాడు. వేదికకు ఎదురుగా వ్యద్ధురాలైన ఒక స్త్రీ కూర్చుని ఆరాధిస్తుంది. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు. విశ్వాసవరం నాకు వచ్చింది. “నీ బైకర్‌ బూటుతో ఆమె ముఖంపై తన్ను” అని ఆయన చెప్పాడు. నేను ఆమె దగ్గరకు "ఫట్" మని తన్నాను. నా బూటు ఆమె ముక్కును తాకగానే దేవుని శక్తి వలన ఆమె వెనుకకు పడిపోయింది.

అటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, పీటర్‌ వాగ్నర్  వంటి క్యారిస్‌మాటిక్‌ నాయకులు 2008 లేక్‌ల్యాండ్‌ రివైవల్‌ (ఉజ్జీవం) లో బెంట్లీని ప్రశంసించారు. తన దగ్గర పనిచేసే ఒక స్త్రీతో  బెంట్లీ అక్రమ సంబంధం కలిగి ఉండడం వలన తన పరిచర్య తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే తన భార్యకు విడాకులిచ్చి తిరిగి వివాహం చేసుకున్న కొద్దికాలానికే బెంట్లీ సంపూర్ణకాల సేవకు తిరిగి వచ్చాడు.

1990 తొలినాళ్ళలో తన విమర్శకులపై పరిశుద్ధాత్మను మారణాయుధంగా ఉపయోగిస్తానని బెదిరించి బెన్నీహిన్‌ ప్రధాన వార్తల్లో నిలిచాడు. “మమ్మల్ని తృణీకరించేవారు బుద్ధిలేనివారు... నీకు వారంటే ఇష్టం లేకపోతే, వారిని చంపేయ్‌” అని చెప్పే ఒక్క వచనం కోసం నేను బైబిల్‌లో వెదికాను, కానీ నాకది దొరకలేదు. నేను ఆ వచనాన్ని కనుగొనగలిగితే బాగుండును.... దేవుడు నాకు పరిశుద్ధాత్మ అనే మిషన్‌గన్‌ ఇస్తేబాగుండునని కొన్నిసార్లు  నేను అనుకుంటాను. అపుడు మిమ్ముల్ని కాల్చి పారేస్తాను” అని ట్రినిటీ బ్రాడ్‌ కాస్టింగ్‌ నెట్‌వర్క్‌లో ప్రెయిజ్ -ఎ-థాన్‌ అనే సుదీర్థమైన ప్రసంగంలో హిన్‌ చెప్పాడు.

బెన్నీ భార్య సుజానే తన భర్త అంత శత్రుత్వాన్ని ప్రదర్శించనప్పటికీ పరిశుద్ధాత్ముని వికృతమైన, అనుచితమైన విధానంలో ప్రస్తావించి మీడియా దృష్టిలో నిలిచింది. వేదికపైన ముందుకి వెనుకకు వెర్రిగా నడుస్తూ “నా అంతర్గత  అవయవాలు బలం పుంజుకుంటున్నాయి. మీ సంగతి ఏంటి? మీ అవయవాలు బలం పుంజుకోకపోతే, మీకు అవసరమైనదేమిటో తెలుసా? మీ కింద భాగం నుంచి పరిశుద్ధాత్మ మందు మీకు అవసరం! ఎందుకంటే దేవుడు మరి దేనిని సహించడు?"  అని హిన్‌ శ్రీమతి ప్రకటించింది. తరువాత ఆమె వికృత వ్యంగ్య చిత్రాలు కామెడి సెంట్రల్‌ ద డైలీ షో లో ప్రసారమైనప్పుడు, హిన్‌ తరపున న్యాయవాదులు పరువు నష్టం దావా వేసి బెదిరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆమె తనను తానే హాస్యాస్పదంగా చేసుకున్నది. కానీ వాస్తవానికి అపఖ్యాతి పొందిన ఏకైక వ్యక్తి పరిశుద్ధాత్ముడే.

                                                           మోసపుచ్చే ఆత్మ

త్రిత్వంలో మూడవ వ్యక్తిని హెచ్చిస్తున్నామని క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ప్రకటిస్తోంది. నిజం చెప్పాలంటే అది ఆయనను సర్కస్ లో  ప్రధాన ఆకర్షణగా మార్చేసింది. అలాంటి దేవదూషణ కేవలం ఒక స్థానిక సంఘ శ్రోతలకు మాత్రమే పరిమితమై ఉంటే ఎక్కువ నష్టం జరగకపోయేది. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రింటు (వార్తా పత్రికలు, పుస్తకాల ద్వారా) రేడియో, టెలివిజన్‌ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ హేయకరమైన సర్కస్‌ నిరంతరాయంగా ఎగుమతి చేయబడుతోంది. “గతంలో నైపుణ్యంలేని ఈ నాయకుల ప్రభావానికి కొన్ని పరిమితులుండేవి. వారి వక్రమైన బోధల ప్రసారం స్థానిక సంఘానికీ, కళాశాలకూ, సెమినరీ తరగతి గదులకూ, పుస్తకాలకూ, రేడియో కార్యక్రమాలకు పరిమితమై ఉండేది. కానీ గత ముప్పై నలభై సంవత్సరాల్లో టి.వి. ప్రసారాల వలన అదంతా మారిపోయింది”  అని మునుపు పెంతెకోస్తు సభ్యుడు కెన్నెత్‌ డి.జాన్‌ వివరిస్తున్నాడు.

అత్యంత ప్రముఖ టి.వి. ప్రసంగీకులు క్యారిస్‌మ్యాటిక్స్‌ను ప్రభావితం చేశారు. వారు తమ ప్రతీ ఆజ్ఞను శిరసావహించే పరలోకపు నౌకరుగానూ, బానిసగానూ సార్వభౌమాధికారం కలిగిన దేవుని ఆత్మను పరిగణిస్తున్నారు. 2006లో అంతర్జాతీయంగా అతిగా అమ్ముడుపోయిన పుస్తకం “ద సీక్రెట్” ద్వారా ప్రజాదరణ పొందిన న్యూ ఏజ్‌ తప్పు బోధకూ వారి బోధకూ సారంలో ఎటువంటి భేదమూ లేదు. “నీవు ఈ విశ్వానికి యజమానివి, నిన్ను సేవించడానికి జీని ఉన్నాడు” అని ఆ పుస్తక రచయిత రోండా బైర్న్‌ చెబుతున్నాడు. క్యారిస్‌మాటిక్‌ టి.వి. సువార్తికులు ప్రముఖ పాస్టర్లూ అదే విధమైన సందేశాన్ని ప్రకటిస్తున్నారు. ఇది భౌతికమైన ఐశ్వర్యాన్ని గురించిన అసత్య సువార్త. వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ సిద్ధాంతమనే ప్రముఖ పేరు దీనికి ఉంది. నీకు తగినంత విశ్వాసముంటే, నీవు ఏది అడిగితే దాన్ని ఖచ్చితంగా పొందుకోవచ్చని వారు ప్రకటిస్తున్నారు.

యేసు నామంలో ఆజ్ఞలు జారిచేసే హక్కు విశ్వాసిగా నీకుంది. వాక్యంపై ఆధారపడిన ప్రతిసారీ, దేవుని కొంత మేరకు నీవు ఆజ్ఞాపిస్తున్నావు అని కెన్నెత్‌ కోప్‌ల్యాండ్‌ చెబుతున్నాడు. మీరు దేవుని నుంచి ఏది డిమాండ్‌ చేసిప్పటికీ భయపడవద్దు, వెనుకాడ వద్దని ఫ్రెడ్ ప్రైస్  తన అనుచరులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. “నీ చిత్తమైతే దయచేయి, నీ చిత్తమే జరుగును గాక” అని చెబితే, అప్పుడు నీవు దేవుణ్ణి మూర్ఖుడని పిలుస్తున్నట్లే, ఎందుకంటే మనల్ని అడగమని చెప్పింది ఆయనే గనుక .... దేవుడు నేను ఏది కలిగి ఉండాలని కోరుతున్నాడో, అది అనుగ్రహిస్తాడు. కనుక నేను ఏమి అడిగానన్నది అసలు విషయమే కాదు.” 

వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ అనే క్యారిస్‌మాటిక్‌ శాఖ మొత్తం క్యారిస్‌మాటిక్‌ శాఖలన్నింటిలోనే అతి విస్తారంగా, అత్యంత శక్తితో బహు వేగంగా వృద్ధి చెందుతున్న ఉద్యమం. సులభంగా చెప్పాలంటే, వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ బోధకులు ఈ విస్తారమైన ఉద్యమానికి ప్రధాన బలంగా ఉన్నారు. వారు బోధించే ప్రోస్పారిటీ  సిద్ధాంతానికీ యేసుక్రీస్తు సత్యసువార్తకూ ఏ సంబంధమూ లేదు. జ్ఞానం, తత్వసంబంధ మతాల నుంచి సేకరించిన తప్పుడు సిద్ధాంతాలకు క్రైస్తవ పదాలనూ, చిహ్నాలనూ  ధరింపజేసి మోటైన మూఢనమ్మకాలను వారు ప్రచారం చేస్తున్నారు. కనుక అది నిజమైన క్రైస్తవ్యం కాదు.

వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ వేదాంతాన్ని ప్రోస్పారిటి సువార్తనూ హత్తుకునే కోట్లాది మంది ప్రజలకు, "విజయాన్నీ  అభివృద్ధినీ ప్రసాదించగలిగే తాంత్రిక శక్తిగా పరిశుద్ధాత్ముడు నియమించబడ్డాడు". “దేవుణ్ణి వాడుకోమని విశ్వాసికి చెబుతున్నారు. అయితే దేవుడు విశ్వాసిని వాడుకుంటాడనేది వాక్యానుసారమైన క్రైస్తవ సత్యం. వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌, ప్రోస్పారిటి వేదాంతాలు విశ్వాసి కోరిన ప్రతి దానిని అనుగ్రహించే శక్తిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిగణిస్తున్నాయి. అయితే దేవుని చిత్తాన్ని జరిగించడానికి విశ్వాసిని బలపరిచే వ్యక్తి పరిశుద్దాత్ముడని బైబిల్‌ బోధిస్తుంది” అని ఒక రచయిత రాశాడు.

తగినంత విశ్వాసం కలిగిన వారికీ, మరి ముఖ్యంగా తమకు ధనాన్ని పంపించే వారికీ అంతులేని ఆరోగ్యైశ్వర్యాలు కలుగుతాయని ధైర్యంగా వాగ్దానం చేస్తున్నారు వాక్చాతుర్యం గల టి.వి. సువార్తికులు. కార్యక్రమమంతటిలోనూ, తర్వాత కూడా దేవుడు అద్భుత రీతిలో వారిని ధనవంతులుగా చేస్తాడనే వాగ్దానాన్ని నమ్మి ఒక విత్తనాన్ని నాటమని (టు ప్లాంట్‌ ఎ సీడ్‌) ప్రజలను వేడుకుంటున్నారు. క్యారిస్‌మాటిక్‌ సిద్ధాంతాన్ని విస్తరింపజేయడానికి టి.వి. ఉపయోగించిన తొలి వ్యక్తి అయిన ఒరల్‌ రాబర్ట్స్‌, దీనికి సీడ్‌-ఫెయిత్‌ ప్లాన్‌ (విత్తనం - విశ్వాసం - ప్రణాళిక అనే పేరు పెట్టాడు. వీక్షకులు నిజంగా ఇవ్వగలిగిన దాని కంటే ఎక్కువ విరాళం ఇచ్చేవిధంగా వారిని మభ్యపెట్టడానికి రాబర్ట్‌ సీడ్‌-ఫెయిత్‌ ప్లాన్‌ (విత్తనం-విశ్వాసం-ప్రణాళిక) నూ, లేదా అదే రకమైన మరొక ప్రణాళికనూ అనేకమంది క్యారిస్‌మాటిక్‌ టి. వి. సువార్తికులు ఫెయిత్‌ హీలర్స్‌ (విశ్వాస స్వస్థతకారులు) ఉపయోగిస్తున్నారు. 

ట్రినిటీ బ్రాడ్‌కాస్టింగ్‌ నెట్‌వర్క్‌ స్థాపకుడు, చైర్మన్‌ అయిన పాల్‌ క్రౌచ్‌ ఈ సిద్ధాంతానికి ప్రముఖ ప్రచారకర్తల్లో ఒకడు. “ఒక ముఖ్యమైన విత్తనాన్ని నాటండి. యేసు వాగ్దానం చేసిన మహిమకరమైన పునరాగమనాన్ని నిరీక్షిస్తూ పూర్తిగా ఇచ్చేయండి. ఆఖరిగా ఒక గమనిక: బుణవిముక్తి, ఉద్యోగం, గృహం, భర్త, భార్య లేదా దేవుని నుంచి మీరు ఆశించేదేదైనా దానిని తెలియజేయండి” అని 2011 టి.బి.ఎన్‌. విరాళ సేకరణ లేఖలో క్రౌచ్‌ రాశాడు. “గ్యాస్‌ సిలిండర్‌, ఇతర వస్తువుల ధరలన్నీ పెరిగాయని నాకు తెలుసు. కానీ ఇవ్వండి, మీకు ఇవ్వబడును” అన్న యేసు మాటలను జ్ఞాపకం చేసుకోండి?" అనే మాటలతో మరొక లేఖను ముగించాడు. ఈ సందేశం కపటంతో కూడినది.

“పాస్టర్‌ పాల్‌ క్రౌచ్  దానిని “దేవుడు అనుగ్రహించే వద్దతి” అని పిలుస్తున్నాడు. క్రౌచ్ యొక్క ట్రినిటీ బ్రాడ్‌ కాస్టింగ్‌ నెట్‌వర్క్ కి విరాళం అందిస్తున్న ప్రజలు కృతజ్ఞత కలిగిన దేవుని  నుంచి ఆర్థిక ఆశీర్వాదాలను పొందుతారు. టి.బి.ఎన్‌. కి వారు ఎంత ఎక్కువ ఇస్తే ఆయన వారికి అంత ఎక్కువ ఇస్తాడు. ఆర్థికంగా చితికిపోయి, అప్పుల్లో ఉన్నామని సాకులు చెప్పి చెక్కు రాయడం మానకండి. నిజానికి అదే చక్కటి అవకాశం, ఎందుకంటే అసలేమాత్రం ఇవ్వలేనప్పుడు ఇచ్చిన వారికి దేవుడు ప్రత్యేకమైన రీతిలో ధారాళంగా ఇస్తాడు. “ఆయన మీకు వేలు, లక్షలు, కోట్లు, బిలియన్ల డాలర్లు ఇస్తాడు” అని గత నవంబరులో క్రౌచ్  తన వీక్షకులకు చెప్పాడు” అని క్రౌచ్  పద్దతిని లాన్‌ ఏంజెలెస్‌ టైమ్స్ ఒక శీర్షికలో వివరించింది. 

ఈ పథకాన్ని ప్రారంభించిన క్రౌచ్‌కూ, ఇతరులకూ ప్రోస్పారిటి వేదాంతం చక్కటి ప్రయోజనం కలిగిస్తోంది. వీక్షకులు కోట్ల డాలర్లు పంపిస్తున్నారు.  కానీ పెట్టుబడికి తగిన ఫలితం రాకపోతే,వారు దేవుణ్ణి నిందిస్తున్నారు. ప్రజలు ఎదురుచూసిన అద్భుతం వాస్తవ రూపం దాల్చకపోతే  ధనం పంపిన ప్రజల విశ్వాసంలో లోపం ఉందని వారిని నిందిస్తున్నారు. నిరాశ, విసుగు, పేదరికం, దుఃఖం, కోపం, చివరికి అవిశ్వాసమే ఈ విధమైన బోధ వలన కలిగే ప్రధాన ఫలాలు. అయితే ధనాన్ని గురించిన మనవులు చాలా త్వరితంగా, అసత్య వాగ్దానాలు అత్యంత అతిశయోక్తిగా ఉంటున్నాయి.

విశ్వాసం, ధాతృత్వమనే మారువేషంలో ఉన్న ఈ సమస్త నటన దురాశ గలవారిని దోచుకుని, దిక్కులేని వారిని వంచించడానికి కల్పించబడిన మోసపూరితమైన తంత్రం. ఇది దేవుని ఆత్మను మోసపుచ్చే ఆత్మతో భర్తీ చేసింది. అయినప్పటికీ అబద్ధ నిరీక్షణను గురించిన దాని సందేశం అత్యంత ప్రజాదరణ పొందింది. ఆరోగ్యం, ఇహలోక సంపద, సుఖ జీవనాల గురించిన వాగ్దానాలు మనసుకి ఇష్టంగా ఉంటాయి కనుక ప్రోస్పారిటి సిద్ధాంతం ప్రజాదరణ పొందడానికి గల కారణాన్ని తెలుసుకోవడం సులభమైన విషయమే. ఇది పూర్తిగా శరీర సంబంధమైనది. ఆత్మీయతకు సంబంధించినది ఏదీ నిజంగా ఇందులో లేదు.

జోయల్‌ ఆస్టిన్‌ వంటి సామాన్య ప్రోస్పారిటి ప్రసంగీకులు అనేకులు కపటాన్నీ చిరునవ్వునూ కలిపి వారి ప్రసంగాలను రుచికరమైనవిగా చేస్తున్నారు. కానీ వాటికి మూలాధారమైన సందేశం మాత్రం ఒక్కటే. మన కలలను నిజం చేయడానికే దేవుడు ఉన్నాడనేదే ఆ సందేశం. “ఆస్టిన్‌ తెలియజేసే నైతిక, వైద్యపరమైన దైవశాస్త్రం నేడు అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన మతాన్ని తెలియచేస్తుంది. నీ కోసం నీ సంతోషం కోసమే ప్రాథమికంగా దేవుడున్నది. జీవితం నుంచి నీవు కోరుకునేది పొందడానికి ఆయన దగ్గర కొన్ని నియమ నిబంధనలున్నాయి. వాటిని అనుసరిస్తే నీవు కోరింది పొందవచ్చు. నీవు కేవలం కోరుకో, నీకు అభివృద్ధి కలుగుతుంది” అని మైకేల్‌ హోర్టన్‌ చెబుతున్నాడు. వ్యాపార కోణం నుంచి చూస్తే, అది ఒక ఫలవంతమైన సూత్రం.  అపరిమితమైన ఆరోగ్యైశ్వర్యాలను గురించిన అధికారపూర్వకమైన వాగ్దానాలనూ, పరిశుద్ధాత్మను అపహసించడం సానుకూల దృక్పధాన్ని, లోతులేని గంభీరమైన ప్రకటనలనూ లెక్కలేని మోతాదులో కలిపితే రేటింగ్స్‌ పెరిగి, పుస్తకాలు అమ్ముడుపోవచ్చు. అయితే ఇదంతా అతి పెద్ద మోసం. వాక్యానుసారమైన క్రైస్తవ్యానికీ, దీనికీ ఆసలు సంబంధమే లేదు.

దురాశనూ, లోకతత్వాన్నీ స్వకీర్తినీ పెంచే బోధతో దాడి చేసి వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ బోధకులు దుర్వేదాంతం నుంచి లాభదాయకమైన జీవితాలను ఏర్పరచుకున్నారు. లేఖనాలను వక్రీకరిస్తూ, దేవుని యొద్ద నుంచి కొత్త దర్శనం వచ్చిందని చెబుతూ తమ అబద్ధ బోధలను వారు సమర్థించుకుంటున్నారు. కొందరైతే “విశ్వాసులు తమ లోకాశాలను నిజం చేసుకోగలిగే చిన్న దేవుళ్లు” అని చెప్పే స్థాయికి వెళ్లిపోయారు. “నేనే ఒక చిన్న దేవుణ్ణి. నాకు ఆయన నామం ఉంది. నేను ఆయనతో ఏకమై ఉన్నాను. నేను నిబంధన సంబంధంలో ఉన్నాను. నేను చిన్న దేవుణ్ణి. విమర్శకులు నాశనమైపోవును గాక" అని అంతర్జాతీయ టెలివిజన్‌ కార్యక్రమంలో విమర్శకులపై పాల్‌క్రౌచ్‌ స్పందించాడు. “నీవు దేవుడవు. దేవుడు నీలో నివశించడం కాదు గానీ నీవే దేవుడవు. నీవు దేవునికి అత్యావశ్యకమైనవాడివి” అని తన శ్రోతలకు కెన్నెత్ కోప్‌ల్యాండ్‌ చెప్పాడు, “నేనొక విషయం చెప్పబోతున్నాను. ఈ భూమిపై మనం దేవుళ్ళం కనుక, కేవలం శక్తిలేని నరుల మాదిరిగా కాకుండా దేవుళ్ళ మాదిరిగా జీవించడానికి ఇదే సమయం” అని ఈ మధ్యకాలంలోనే కోప్‌ల్యాండ్‌, క్రౌచ్‌ల బోధలను టి. వి.సువార్తికుడు క్రెఫ్లోడాలర్‌ ప్రతిధ్వనించాడు. "పైశాచికం” అనే ఒకే ఒక్క విశేషణం మాత్రమే అంతటి దేవదూషణతో కూడిన అహంకారాన్ని పూర్తిగా వర్ణించగలదు (ఆది 3:5).

తమను తాము దేవుని స్థాయికి హెచ్చించుకుంటూ, అదే సమయంలో వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ బోధకులు నిజ దేవుని సార్వభౌమాధికారాన్ని తృణీకరిస్తున్నారు. “నరుని అనుమతి లేకుండా దేవుడు ఈ భూమిపై ఏమీ చేయలేడు” అని మైల్స్‌ మున్రో టిబియన్  ప్రేక్షకులకు ప్రకటించాడు. ఆదాముకూ, మానవజాతికీ అధికారాన్ని అప్పగించడం ద్వారా ఈ లోకంలో దేవుడు తన అధికారాన్ని కోల్పోయాడు. ఫలితంగా యేసును భౌతికంగా ఉనికిలోనికి తీసుకురావడానికి పరిశుద్ధాత్ముడు శక్తిహీనుడై సిద్ధ మనసు కలిగిన నరులు సరైన విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడి శరీరధారణను సాధ్యంచేసే వరకు ఆయన నిర్బంధించబడ్డాడని ట్రినిటీ బ్రాడ్‌కాస్టింగ్‌ నెట్‌వర్క్‌లో అనుదినం ప్రసారమయ్యే “ద గాస్పల్ ట్రూత్‌" అనే తన కార్యక్రమంలో ఆండ్రూ వోమ్యాక్‌ పట్టుదలగా చెప్పాడు.

“ప్రభువైన యేసు తెరపైకి రావడానికి నాలుగు వేల సంవత్సరాలు పట్టడానికి కారణం తనకు లోబడి, తన భౌతిక దేహాన్ని సృష్టించడానికి అవసరమైన దైవ ప్రేరేపిత మాటలను పలికే ప్రజలను కనుగొనడానికి దేవునికి నాలుగు వేల సంవత్సరాల కాలం పట్టడమే... పరిశుద్ధాత్ముడు ఈ మాటలను తీసుకుని, మరియను గర్భం ధరించేలా చేశాడు” అని 2009 ప్రసారంలో వోమ్యాక్‌ తన వీక్షకులకు చెప్పాడు. అది ఎటువంటి లేఖనాధారమూ లేని తప్పుడు బోధ. అది అతని వక్రీకరించబడిన ఊహనుంచి నేరుగా పుట్టుకు వచ్చింది. ఆ మాటలు తన కుమారుని ఈ లోకానికి పంపడానికి దేవునికి పాపులైన మనుషుల సహాయం అవసరమైందని చెబుతున్నాయి. ఈ మాట చాలా తీవ్రమైన రీతిలో
పరిశుద్ధాత్మ ప్రతిష్టను దిగజారుస్తున్నది, కనుక ఈ వ్యాఖ్య ఎంతో నీచమైనది.

ఇటువంటి ఉదాహరణలు లెక్కకు మించినవిగా ఉన్నాయి. కానీ సార్వత్రిక క్యారిస్‌ మాటిక్‌ ఉద్యమంలో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అటువంటి క్రూరమైన దాడులు మినహాయింపుగా కాకుండా ఒక నియమంగా మారడం విచారకరం.

“నమ్మ శక్యంకాని వేగంతో క్యారిన్‌మాటిక్స్‌ ఒక అక్రమంలో నుంచి మరొక అక్రమం వైపునకు దూసుకుపోవడం వలన మనం ఇవుడు పూర్తి గందర గోళస్థితిని ఎదుర్కొంటున్నాం. క్యారిన్‌మాటిక్‌ సమాజంలో అనేకమంది నేరుగా అన్యమతాల భావాల వైపు, ఆచరణల వైపు తిరిగిపోయారు. ఫలితంగా చాలామంది బలహీన యవ్వన విశ్వాసులు ఆత్మీయంగా పతనమై పోయారు. చక్కటి  ఫలితాలు పొందడానికి ప్రాచీన కాలపు మర్మయుక్తమైన పద్ధతులతో పాటూ ఎంతో నాటకీయంగా కనికట్టు చేసే కపట జిత్తులను మిళితం చేసే ప్రముఖ న్వస్థతకారులు ఉద్భవించారు  జనసమూపహాలు వారిని అనుసరిస్తున్నారని” ఆ ధోరణిని పీటర్‌ మాస్టర్స్‌ ఖచ్చితంగా వివరిస్తున్నాడు.”

నేను రెండు దశాబ్దాల క్రితం “క్యారిన్‌మాటిక్‌ కేయాస్” అనే పుస్తకం రాసిన సమయంలోనే పై మాటలను రచయిత రాయడం ప్రాముఖ్యమైన విషయం. ఆ తరువాత సంవత్సరాల్లో పరిస్థితి మరింత విషమ స్థాయికి చేరుకున్నది.

                                                   మేము నమ్మేది చాలా విలువైనది

ప్రోస్పారిటి సువార్త యొక్క మితిమీరిన లోకతత్వం, స్వార్థంతోపాటు అన్ని విధాలైన ఆత్మీయ వంచన, వేదాంతపరమైన లోపం, ఘోరమైన అవినీతి క్రియలు సార్వత్రిక క్యారిస్‌మాటిక్‌ సమాజంలో వసతిని పొందుకుంటున్నాయనేది తప్పించుకోలేని వాస్తవం. అయితే అటువంటి తప్పు భావాలు కేవలం శాస్త్రీయ ఉద్యమ సరిహద్దుల్లో ఉన్న వెర్రి సమాజంలో మాత్రమే ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు. ప్రోస్పారిటి బోధకులు, ఫెయిత్‌ హీలర్స్‌ (విశ్వాస స్వస్థతకారులు), టి.వి. సువార్తికులు క్యారిస్‌మాటిక్‌ సమాజపు చిట్ట చివరన సురక్షితమైన రీతిలో ఏకాంతంగా ఉన్నారన్నాట్టు చిత్రీకరించడానికి అనేక మంది సాధారణ క్యారిస్‌మాటిక్స్‌ ఆశపడుతున్నారు.

కానీ పరిస్థితి అలా ఉండకపోవడమే దౌర్భాగ్యం. మత ప్రచారం చేసే టి.వి., క్యారిస్‌మాటిక్‌ మాస్‌ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిరంతరం జరుగుతున్న మతమార్పిడిల వల్ల అత్యంత విస్తారమైన (ఉద్యమం) అత్యంత ప్రధాన (ఉద్యమం) గా మారింది. క్రైస్తవ ముఖచిత్రంపై డంబమైన తప్పు బోధకులు మాత్రమే అధికశాతం వీక్షక లోకానికి కనబడుతున్నారు. పరిశుద్ధాత్మ నామంలో వారు తమ అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్నారు.

మతపరమైన ప్రసార విషయంలో సాతానుగాడు నిజానికి వాయుమండల (తరంగాల) సంబంధమైన అధిపతిగా ఉన్నాడు. ప్రకటించేది  ఎంతటి అబద్ధ ప్రవచనమైనా, ఎలాంటి తప్పు బోధయైన, మూఢ నమ్మకమైనా టి.బి.ఎన్‌. వంటి నెట్‌వర్క్‌లలో ప్రసారానికి సమయం దొరుకుతుంది. తన పెంపుడు కోడి అద్భుతమైన రీతిలో మృతుల్లోంచి ఏ విధంగా లేచిందోననే విచిత్రమైన వృత్తాంతాన్ని కన్నీటితో జేన్ క్రౌచ్  వివరిస్తోంది.  తమ ప్రియుల మృతదేహాలు ఉంచబడిన శవపేటికలను టి.వి. ముందు పెట్టి, మృతినొందిన వాని చేతిని టెలివిజన్‌కు తాకిస్తే, వేలకొలదిగా మృతులు తిరిగి లేస్తారనే వింత ప్రవచనం వీక్షకులకు చెప్పి బెన్నిహిన్‌ ఆమె మాటను అధిగమించాడు. ట్రినిటీ బ్రాడ్‌ కాస్టింగ్‌ నెట్‌వర్క్‌ (త్రిత్వాన్ని ప్రసారం చేసే టి.వి.) లో ప్రసారం చేయాలనుకునే వ్యక్తి కచ్చితంగా త్రిత్వాన్ని నమ్మే వ్యక్తి కానవసరం లేదనే విషయం హాస్యాస్పదంగా ఉన్నది. ఒన్‌నెస్‌ పెంటెకోస్టలిజమ్‌లో ప్రముఖుడైన టి.డి. జేక్స్‌ టి.బి. ఎన్‌.కి ప్రధాన సంపదగా ఉన్నాడు. దేవుడు తొమ్మిదిమంది వ్యక్తులుగా ఉన్నాడని బెన్నీహిన్  చెప్పాడు. తర్వాత అతడు తన మాటలను వెనకకు తీసుకున్నాడు.

ఈ భూమిపైనే అత్యంత పెద్దదైన మత ప్రచార నెట్‌వర్క్‌ టి. బి.ఎన్‌. వందకుపైగా దేశాల్లో డెబ్బె ఉపగ్రహాల ద్వారా 1800 టివి ఛానెల్స్‌, కేబుల్‌ అనుబంధ సంస్థలలో నిరంతరం తన కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నది. దాని ఇంటర్నెట్‌ కార్యక్రమాలు అంతకు మించిన స్థాయిలో విస్తరించాయి. “బాధల లోకాన్ని సువార్త నిరీక్షణతో" చేరుకోవడానికి పరిశుద్ధాత్ముడే ఈ ప్రసార సంస్థను బలపరుస్తున్నాడని ఇది చెప్పుకుంటోంది. కానీ ఇది అసత్య సువార్త వలన కలిగే అసత్య నిరీక్షణ. శ్రోతలకు తమ ధనానికి బదులుగా దేవుడు స్వస్థతనూ, సంపదనూ, ఇతర ఇహలోక ఆశీర్వాదాలనూ అనుగ్రహిస్తాడని బోధించే ప్రోస్పారిటి వేదాంతాన్నే ఈ నెట్‌వర్క్‌లో పనిచేసే ప్రముఖులంతా నిజానికి ప్రకటిస్తున్నారు. కేవలం టి.బి.ఎన్‌. ఒక్కటే దోషి కాదు. ఈ నెట్‌వర్క్‌తో ప్రధానంగా పోటీపడే (డేస్ట్రార్స్‌, లేసీ) ఛానెల్‌లు సైతం వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ బోధకులకు అదే విధమైన అవకాశాలను సమకూరుస్తున్నాయి.

కనుక ఆరోగ్యైశ్వర్యాలను గురించిన ప్రోస్పారిటి సువార్త మనపై అకస్మాత్తుగా దాడి చేయడమనేది ఏమైనా ఆశ్చర్యమా? ఇంతకు ముందెన్నడూ లేనంత వేగంగా క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ప్రపంచ జనాభాలో 66 శాతం ప్రజలున్న ఆసియాలోనూ, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. ఈ ఖండాలలో సగానికి పైనే పెంతెకోస్తు, క్యారిస్‌ మాటిక్‌ అనుచరులు ప్రోస్పారిటి సువార్తను చేపట్టినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.

“తగినంత విశ్వాసం  కలిగిన వారికి ఇహలోక అభివృద్ధినీ ఆరోగ్యాన్నీ దేవుడు అనుగ్రహిస్తాడనే నమ్మకాన్ని బోధించే ప్రసిద్ధ ప్రోస్పారిటి నువార్తయే పెంతెకోస్తు వైఖరిలో అత్యంత వివాదాస్పదమైన అంశం. నియో-పెంటెకోస్టల్‌ శాఖవారు ప్రోస్పారిటి సువార్తపై దృష్టి  కేంద్రీకరించగా, సాంప్రదాయక పెంతెకోస్తువారు న్వస్థతలూ భాషలూ అనే ఆత్మవరాలపై దృష్టి సారించారని వారి మద్య భేదాన్ని కొంతమంది విశ్లేషకులు తెలియజేశారు. కానీ ప్రోస్పారిటి సువార్తయే నిజానికి పెంతెకోస్తు శాఖ అంతటికీ ప్రముఖ అంశంగా ఉన్నదని ద వ్యూ ఫోరం సమాచారం తెలియజేస్తోంది,

పలు దేశాల్లో 90 శాతానికి మించిన అధిక సంఖ్యాక పెంతెకోస్తు సభ్యులు ఈ నమ్మకాలను చేపట్టారు” అని జాన్‌ టి. అలెన్‌ వివరిస్తున్నాడు. వాస్తవానికి ప్రోస్పారిటి సువార్తకు ఉన్న ప్రజాదరణే క్యారిస్‌మాటిక్‌ వేదాంతం శీఘ్రమైన వ్యాప్తి చెందడానికి మొదటి కారణం.

లోక సంపదలను గురించిన ప్రలోభ, స్వస్థత గురించిన నిరీక్షణలే  ప్రజలను ఆకర్షిస్తున్నాయి కానీ పరిశుద్ధాత్మ ఒప్పించే కార్యం మాత్రం కాదు. దక్షిణ కొరియాలో 8 లక్షలకు పైగానే సభ్యులు గల సంఘాన్ని కలిగి ఉన్న డేవిడ్‌ యొంగి చో మొదలుకొని, నైజీరియాలో ప్రతినెల క్రమంగా జరుగుతున్న తన ప్రార్థన కూడికల్లో 8 లక్షలమంది సంఘ సభ్యులను కలిగిన బిషప్‌ ఈనక్‌ అడెబోయ్‌ వరకూ వేగంగా వృద్ధి చెందుతున్న అత్యంత భారీ క్యారిస్‌మాటిక్‌ సంఘాలన్నీ ఈ సిద్ధాంతంలో ఏదో ఒక అంశాన్ని ప్రకటిస్తున్నాయి. “ప్రోస్పారిటి సువార్త అనీ, లేదా వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ ఉద్యమమనీ పేరుగాంచిన ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఉత్సాహవంతులైన అనుచరులను సంపాదిస్తున్న ఒక అంతర్జాతీయ శక్తి. కెన్నెత్  కోప్‌ల్యాండ్‌, డేవిడ్‌ యొంగిచో, రెయిన్‌హార్ట్‌ బొంకే మొదలైన ప్రముఖ బోధకులూ, సువార్తికులూ నడపిస్తున్న ఈ బోధ సంఘ చరిత్రలోనే అత్యంత భారీ సంఘాలను, సువార్త మహోద్యమాలను కొన్నింటిని ప్రభావితం చేసింది” అని అకస్మాత్తుగా పెరిగిన ప్రజాసంఖ్యను బట్టి స్పష్టంగా ఆశ్చర్యచకితుడైన పెంతెకోస్తు చరిత్రకారుడు విన్సన్‌ సైనన్‌ రాశాడు. వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ ఉద్యమపు విశ్వవ్యాప్త విజయమే పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న మత ఉద్యమంగా చేసింది.

ప్రోస్పారిటి సువార్తను సంతోషంగా స్వీకరించింది కేవలం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు  వెలుపల ఉన్న సంఘాలు మాత్రమే కాదు. అమెరికా నేల పైన సైతం ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న క్రైస్తవశాఖల్లో ఒకటి. దేశంలోనే అత్యంత భారీ సంఘాలను నడిపిస్తున్న జోయల్‌ ఆస్టిన్‌, జాయస్‌ మేయర్‌, టి.డి. జేక్స్‌ మొదలగు ప్రముఖ పాస్టర్లు సిగ్గు లేకుండా ఆరోగ్యైశ్వర్యాలనూ, సుఖ సంతోషాలనూ వాగ్దానం చేసే సువార్తను ప్రచారం చేస్తున్నారు. వారి ప్రభావం అమెరికా మత చిత్రాన్నే శాశ్వతంగా మార్చేదిగా ఉంది. “క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో బలంగా ప్రకటించబడుతున్న ప్రోస్పారిటి సువార్త దాని సరిహద్దులను దాటి, భారీ ఇవాంజిలికల్‌ సంఘంలో వేరు పాదుకుంటుంది. తగినంత విశ్వాసం కలిగిన వారందరికీ దేవుడు ఇహలోక సంపదలను అనుగ్రహిస్తాడనే భావంతో క్రైస్తవులని పరిగణించబడుతున్న వారిలో 46 శాతం ఏకీభవిస్తున్నారని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగిన సర్వేలో తేలింది. 

సంఘ సభ్యులకుండే దురాశల గురించీ, వారి ప్రయోజనాల గురించీ సంఘం గతంలో పట్టించుకోలేదు. కానీ పరిస్థితి ఇప్పుడు వేగంగా మారిపోతోంది. అమెరికా క్రైస్తవులలో దాదాపు సగంమంది, దాదాపు రెండింట మూడొంతుల మంది అమెరికా పెంతెకోస్తు సభ్యులు “ఆనందంతో, ఆరోగ్యైశ్వర్యాలతో నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు” అనే ప్రోస్పారిటీ సువార్తను ఇప్పుడు హత్తుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్‌ సభ్యుల మొత్తం సంఖ్య 50 కోట్లకు పైగానే ఉందని ఈ మధ్యకాలపు అధ్యయనాలు అంచనా వేసాయి. ఉత్తర అమెరికాలో 8 కోట్లమంది, లాటిన్‌ అమెరికాలో 14 కోట్ల పది లక్షలమంది, ఆసియాలో 13 కోట్ల 50 లక్షల మంది, ఆఫ్రికాలో 12 కోట్ల 60 లక్షల మంది, ఐరోపాలో 8 కోట్ల 80 లక్షల మంది ఇందులో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ్యంలో క్యారిస్‌మాటిక్‌ క్రైస్తవ్యమే నాలుగవ భాగాన్ని సూచిస్తోందని ఆ గణాంకాలు చెబుతున్నాయి. కోట్ల కొలదిగా ఉన్న పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్స్‌లో అధికశాతం ప్రోస్పారిటి సువార్తను నమ్ముతున్నారనేది వాస్తవం. కేవలం గణాంకాలను బట్టి చూసినా, హెల్త్‌ (ఆరోగ్యం) అండ్‌ (మరియు) వెల్త్‌ (ఐశ్వర్యం) వేదాంతమే ఈ భారీ ఉద్యమాన్ని నడిపిస్తున్నదని మనం చెప్పవచ్చు.  “తగినంత విశ్వాసం కలిగిన వారందరికీ దేవుడు ఇహలోక సంపదలను అనుగ్రహిస్తాడు” అని అనేకమంది పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్స్‌ అంగీకరిస్తున్నారని “క్రిస్టియానిటి టుడే లో
టెడ్‌ ఒల్సెన్‌ రాశాడు.”

హెల్త్‌ అండ్‌ వెల్త్‌ ప్రోస్పారిటి సువార్త ప్రజాదరణ పొందినదై యుండవచ్చు కానీ అది సత్య సువార్త మాత్రం కాదు.

ప్రవంచంలోనే అత్యంత భారీ సంఘాలు కొన్నింటిలో ప్రకటించబడే సందేశం మారిపోయింది. ఒక కొత్త సువార్త నేటి దినాన బోధింపబడుతుంది. ఈ కొత్త సువార్త కలవరపెట్టేదిగా ఉంది (ఏందుకంటే) ఇది యేసును విడిచిపెట్టి సిలువను నిర్లక్ష్యం చేస్తుంది. క్రీస్తును వాగ్దానం చేయడానికి బదులు, ఈ సువార్త ఆరోగ్యైశ్వర్యాలని వాగ్దానం  చేస్తూ, నీవు తాకే ప్రతీది వర్ధిల్లుతుంది అని నీవు నమ్మాలని ప్రకటిస్తుంది. ఎందుకంటే “నీ నోటిలో ఒక అద్భుతం ఉంది” అని ప్రముఖ ప్రోస్పారిటీ  నువార్తికుడొకడు చెబుతున్నాడు. ఈ కొత్త సువార్త ప్రకారం “విశ్వాసులు స్థిరంగా ఆలోచిస్తూ తగినంత విశ్వాసాన్ని కనపరచగలిగితే, వారిని దేవుడు ఆశీర్వాదిస్తాడని” డేవిడ్‌ జోన్స్‌, రస్సెల్‌ ఉడ్‌ బ్రిడ్ట్‌ చెబుతున్నారు”

అది రక్షించడానికి శక్తిలేని సువార్త. దానిని బలపరిచేది పరిశుద్ధాత్ముడు కాదు మానవ కోరికయే. అంతేకాదు, ఇది నిత్యజీవానికి బదులు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులకు తప్ప, సామాన్యులెవ్వరికీ అది చేసిన వాగ్దానాలను నెరవేర్చట్లేదు.

                                                        సమస్యకు మూలం

నిస్సందేహంగా ప్రోస్పారిటి సువార్త ఒక వింతైన సువార్త, నిజానికి అది అసలు సువార్తే కాదు (గలతీ 1:1-6) అయితే ఇలాంటి ఘోరమైన తప్పు బోధ కేవలం క్యారిస్‌మాటిక్‌ సంఘాల్లో మనుగడ సాధించడం కాదు కానీ వర్ధిల్లుతోంది. అది ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు సమాధానమే క్యారిస్‌మాటిక్‌ వేదాంతంలో ఉన్న ప్రధానమైన లోపాన్ని చూపిస్తోంది. ఈ లోపమే క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాన్ని అన్నిరకాల తప్పుడు బోధలకు పుట్టినిల్లుగా మార్చేసింది. పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్స్‌ వాక్య సత్యం కంటే పైగా మతానుభవానికే విలువనిస్తున్నారు. వారిలో అనేకులు కేవలం పెదాలతో దేవుని వాక్య అధికారాన్ని ఒప్పుకుంటున్నప్పటికీ, ఆచరణలో దాన్ని తృణీకరిస్తున్నారు. 

నిజంగా లేఖనం మాత్రమే క్యారిస్‌మాటిక్‌ క్రైస్తవుల అంతిమ అధికారమైతే, అర్థరహితమైన భాషల్లో గొణుగుతూ చేసే ప్రార్థన, లోపాలతో కూడిన ప్రవచన పలుకులు, క్రమం లేని ఆరాధన పద్ధతులు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనబడే దాని ద్వారా సృహ కోల్పోవడం మొదలైన దారుణమైన, వాక్యవిరుద్ధమైన పనులను వారు ఎన్నటికీ సహించి ఉండేవారు కాదు. బైబిల్‌కి అనుగుణంగా తమ అనుభవాలకు వారు తిరిగి భాష్యం చెప్పాలి కాని వారి అనుభవాలను సమర్థించుకోవడానికి వింతగా, వాక్యవిరుద్ధమైన పద్ధతుల్లో లేఖనానికి వారు కొత్త భాష్యం చెబుతున్నారు. ఫలితంగా "దేవుని దగ్గర నుంచి వచ్చిన నూతన ప్రత్యక్షత” అని చెబితే అది ఎంతటి తప్పుడు బోధ, ఆచరణయైనా వాక్యానుసారమైనదిగా స్వీకరించబడుతోంది. రేనెపాచెచే రాయబడి దాదాపు అర్థ  శతాబ్దమైనప్పటికీ, ఇంకా ఆయన మాటలు మారుమ్రోగుతూనే ఉన్నాయి.

తమ ధ్యానాల్లో పరిశుద్ధాత్మ, కృపా వరాలు, తన్మయత్వంతో కూడిన భావాలు, ప్రవచనాలు మొదలగు విషయాలకు  ఇచ్చిన మితిమీరిన ప్రాధాన్యత వలన లేఖనాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. మనం జీవంగల దేవునితో అనుదినం నంభాషించగలిగినప్పుడు , ప్రాచీన కాలపు గ్రంథమైన బైబిల్ కు  కట్టుబడి ఎందుకుండాలి? అయితే ఇదే ముమ్మాటికి ప్రమాదకరమైన విషయం. మనం వాక్య ప్రత్యక్షతకు దూరమైతే అతి త్వరలోనే వ్యక్తిగత అభిప్రాయాల్లో మునిగిపోతాము. విశ్వాసికి ఎంత ఉన్నతమైన భావాలున్నప్పుటికీ, వాక్యానికి దూరమైన కొద్దికాలానికే అతడు క్రమం నుండి తొలగిపోతాడు. లేఖనాల నుంచి దేన్నైనా తొలగించడం, దానికి దేన్నైనా కలవడం నిషిద్ధం అనే సంగతి ప్రతి ఒక్కరూ  గుర్తుచేసుకోవాలి (ద్వితీ 4:2, ప్రకటన 22:18-19)

“ఊహాజనితమైన ప్రత్యక్షత, నూతన అనుభవాలే దాదాపు ప్రతి విధమైన తప్పుడు బోధకు మూలాలు.” వాక్యపు అంతిమ అధికారాన్ని విడిచిపెట్టి క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం అత్యంత నీచమైన సిద్ధాంతపర మోసానికీ, ఆత్మీయ దోపిడీకీ గురైంది.

సంఘనాయకులను ప్రవక్తలుగా, అపొస్తలులుగా పేర్కొనడం, అద్భుతాలు సహజాతీత కార్యాలకై నిరంతర అన్వేషణ, గూఢమైన పద్ధతుల్లో దేవుని సమీపించాలనే తపన, ఆరాధనలో మనస్సును దాటవేసే ఆలోచనలు మొదలైనవి సమస్యను మరింత విషమం చేస్తున్నాయి. వాక్య ప్రత్యక్షతను విడిచిపెట్టి, ఉద్రేకపూరిత అనుభవాలకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా తప్పు బోధకులకూ, ఆత్మీయ వంచకులకూ క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం అనువైన కేంద్రంగా మారిపోయింది. ప్రోస్పారిటి ప్రసంగీకులవలె తీవ్రంగా దేవదూషణ చేసేవారు సైతం దాని సరిహద్దుల్లోనికి ఆహ్వానం పొందుతున్నారు.

క్యారిస్‌మాటిక్‌ సంఘాల్లో నిరంతరం జరుగుతున్న అక్రమాలు కేవలం బాహాటంగా కనబడే లక్షణాలే కానీ వాటితో కాదు అసలైన సమస్య. లేఖన అధికారానికి పైగా స్వీయ అనుభవాలను హెచ్చించడమే అసలైన సమస్య. అదే పరిశుద్ధాత్మను చులకన చేస్తూ అతిగా దుఃఖపెడుతోందని నేను భావిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రేరేపించి (2పేతురు1:19-21), తన  ప్రజల హృదయాల్లో ఆ సత్యాన్ని వెలిగించేది (1 కోరింథీ 2:10-15) పరిశుద్ధాత్ముడే. తన వాక్యానికి విరుద్ధమైన అనుభవం గురించి మాట్లాడితే అది ఆయన అధికారానికి తీవ్రమైన అవమానం. ఆయన ప్రేరేపించిన లేఖనాలను వక్రీకరించి, వాటిని పూర్తిగా విస్మరించడం ఆయనను తిరస్కార భావంతో అమర్యాదగా పరిగణించడమే ఔతుంది. కానీ ప్రముఖ టి.వి. సువార్తికుల అతి నీచమైన తప్పుడు బోధలు మొదలుకుని చిన్న సంఘాలలో స్వయం నియమిత ప్రవక్తల సొంత దర్శనాల వరకూ ప్రతిరోజు క్యారిస్‌మాటిక్‌ లోకంలో ఖచ్చితంగా జరుగుతున్నది అదే. ఇదంతా పరిశుద్ధాత్ముని నిజ వ్యక్తిత్వ కార్యాలకు అవమానం.

“దేవుని ఆశీర్వాదం పేరుతో ప్రజలకు సహజంగా ఉండే ఇహలోక దూరాశలు ప్రేరేపిస్తూ, లాభం నిమిత్తం వారిని దోపిడి చేసే ప్రోస్పారిటి నువార్త ను ప్రకటించే వ్యక్తులున్నారు. (ఇది సువార్తకు చాలా దూరంగా ఉన్నది కనుక "సువార్త" అనే పదాన్ని దుర్వినియోగం చేయడమే) స్వస్థత అద్భుతాలు చేసేవారి గర్వపు ప్రకటనలను వాటికి జత చేయండి. చిన్న చిన్న స్థానిక సంఘాలలో సైతం తమకు కలిగిన కొత్త "దర్శనానికి" సరికొత్త సొగసైన సిద్దాంతానికీ, కొత్త పద్ధతికీ, కీర్తనకూ పరిశుద్ధాత్ముని  అధికారాన్ని ఆపాదిస్తూ ఆయనను దూషించే వారు ఉన్నారు” అని కిష్టాఫర్‌ రైట్‌ సరిగ్గా చెప్పాడు.

ఈ ఆలోచన మనం ఈ అధ్యాయం ఎక్కడ ప్రారంభించామో అక్కడకు మనల్ని తీసుకువస్తుంది. పరిశుద్ధాత్మను హెచ్చించడానికి ఎక్కువ బాధ్యత తీసుకున్నాననే ఉద్యమం నిజానికి ఆయనను తృణీకరించి, ఆయనను మిక్కిలి తుచ్చమైనవానిగా పరిగణించడం మిక్కిలి హాస్యాస్పదంగా ఉంది.

                                           2. పరిశుద్ధాత్మ యొక్క నూతన క్రియ?

అది 20వ శతాబ్దపు శుభోదయం. 1901వ సంవత్సరపు వేకువజాము ఘడియలు. నూతన సంవత్సరపు రాత్రి ప్రార్థన కూడికకు కొన్ని గంటల ముందే బైబిల్‌ పాఠశాల విద్యార్థులు కొద్దిమంది సమావేశమయ్యారు. అర్థరాత్రి దాటిపోయినా సరే పరిశుద్ధాత్మ సన్నిధినీ, శక్తినీ అనుభవించాలనే ఆశతో ఎదురుచూస్తూ వారు అక్కడే ఉన్నారు. వారంతా ఏదో అద్భుతం జరగాలని ఎంతో ఆశగా ఎదురుచూశారు.

ఆ దినానికి కొన్ని వారాల ముందునుంచే, ఆ విద్యార్థులు అపొస్తలుల కార్యాల గ్రంథంలోని కొన్ని భాగాలను ఉద్దేశపూర్వకంగా అధ్యయనం చేస్తున్నారు. మారుమనస్సు పొందిన తర్వాతే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే అనుభవం కలుగుతుందని “వెస్లియన్‌ హోలినెస్‌” అనే తమ శాఖ బోధిస్తుంది. ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి అపొస్తలులు గ్రంథస్థం చేసిన దానిపై వారు ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. భాషల్లో మాట్లాడడమే ఆత్మ బాప్తీస్మానికి నిజమైన సూచన అనే అభిప్రాయంతో చివరికి ఆపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలీ, 19వ అధ్యాయంలో బాప్తీస్మమిచ్చు యోహాను శిష్యులూ భాషల్లో మాట్లాడిన విధానాన్ని ఆ విద్యార్థులు పరిశీలించారు. ఆపొస్తలుల కాలంలో భాషలు మాట్లాడడమే ఆత్మ సన్నిధికి సూచన ఐతే, 20వ శతాబ్దారంభంలో సహితం అదే నిజమై ఉండవచ్చునని వారు భావించారు.

నూతన సంవత్సర ప్రార్ధన కూడికకు సమకూడే సమయానికే భాషల్లో మాట్లాడడమే ఆత్మ బాప్తీస్మానికి సూచన, భాషల వరాన్ని తాము పొందుకొనే అవకాశముంది అనే రెండు అభిప్రాయాలను వారు కలిగి ఉన్నారు. కనుక మనః పూర్వకమైన సంకల్పంతో పరిశుద్ధాత్మ బాప్తీస్మం పొందాలని వారు దేవుని వేడుకున్నారు. మెథడిస్ట్‌ పరిచారకుడైన తమ బోధకుడు ఛార్లెస్‌ ఫాక్స్‌ పర్హామ్ వాళ్ళను ఈ విషయాల్లో ప్రోత్సహించాడు. పరిశుద్ధాత్మ శక్తిని తామే స్వయంగా అనుభవించాలనే ఆశతో వారంతా సిద్ధపడి ఉన్నారు. ఆ వేకువజాము ఘడియల్లో అసాధారణ సంఘటన ఒకటి జరిగింది. ఆ విద్యార్థుల్లో ఒకరైన ఆగ్నెస్ ఓజ్‌మన్‌ అనే యువతి పరిశుద్ధాత్మను పొందుకునే విధంగా తనపై చేతులుంచి ప్రార్ధించమని తన బోధకుణ్ణి కోరింది. ఆ తరువాత జరిగిన సంఘటన ఆధునిక సంఘ చరిత్ర దిశనే మార్చేసింది.

“ఆమెపై నా చేతులుంచి ప్రార్థించాను. ప్రార్థన మొదలుపెట్టి కొద్ది మాటలనైనా పూర్తి చేయకముందే, మహిమ ఆమెపైకి వచ్చింది. ఆమె తల చుట్టూ, ముఖం చుట్టూ వెలుగు ప్రకాశించినట్లయింది. ఆ సమయంలో ఆమె చైనీస్‌ భాషలో మాట్లాడనారంభించింది. మూడు రోజుల వరకు ఆమె ఇంగ్లీషులో మాట్లాడలేకపోయింది. తన అనుభవం గురించి మాకు తెలియచేయడానికి ఇంగ్లీషులో రాయడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె చైనీస్‌ భాష రాసింది” అని తర్వాత ఛార్లెస్‌ పర్హామ్ వివరించాడు.

ఓజ్‌మెన్‌ యొక్క అనుభవాన్ని ఆమె బోధకుడు, తన తోటి విద్యార్థులు ఇతరులకు తెలియచేశారు. పరిశుద్ధాత్మ యొక్క సహజాతీత శక్తితో ఆమె ఇరవైకి పైగా భాషలు మాట్లాడినట్లు ఆ తరువాత జరిగిన పలు ఉజ్జీవ కూడికల్లో ప్రచారం జరిగింది. అందులో రష్యా, జపాన్‌, బల్గేరియా, ఫ్రెంచ్ , బోహేమియా, నార్వే, హంగేరియా, ఇటలీ, స్పెయిన్‌ దేశాల భాషలు కూడా ఉన్నాయి. తాను కూడా స్వీడన్‌ భాషలోనూ, ఇతర భాషల్లోనూ మాట్లాడానని ఛార్లెస్‌ పర్హామ్ ప్రకటించాడు.

ఈ విధంగా ప్రస్తుత పెంతెకోస్తు ఉద్యమం ఆరంభమైంది. “ఓజ్‌మన్‌ అనుభవం లక్షలాదిమంది భావి అనుచరుల అనుభవాలకు ముంగుర్తుగా ఉంది. అని పెంతెకోస్తు చరిత్రకారుడైన విన్సన్‌ సైనన్‌ చెప్పాడు. ఒక దశాబ్దంలోపే ఆగ్నెస్‌ ఓజ్‌మన్‌ వలె 50 వేలకు పైగా ప్రజలు అదే సూచనను అనుభవించారు. ఆ ఉత్సాహం వేగంగా విస్తరించింది. ముఖ్యంగా పశ్చిమ తీరప్రాంతంలో విలియం జె. సేమూర్‌ అనే మరొక పర్హామ్‌ విద్యార్థి పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి సూచన భాషల్లో మాట్లాడడమని ప్రచారం చేసాడు. కాన్సస్‌ రాష్ట్రంలో ఒక చిన్న బైబిల్‌ పాఠశాలలో జరిగిన ఒక సాధారణ ప్రార్థన కూడిక మొత్తం ప్రపంచాన్నే మార్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఒక శతాబ్దం గడిచేటప్పటికీ పెంతెకోస్తు, నూతన పెంతెకోస్తు ఉద్యమాలు 50 కోట్లకు మించిన క్యారిస్‌మాటిక్‌ అనుచరులను చేర్చుకుని వృద్ధి చెందాయి.

                                                        నూతన పెంతెకోస్తు?

పెంతెకోస్తు ఉద్యమారంభం అద్భుతంగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు. “అపోస్టలిక్‌ ఫెయిత్‌ మూవ్‌మెంట్‌” (అపోస్తలుల విశ్వాస ఉద్యమం) అని తన కొత్త ఉద్యమానికి పేరు పెట్టి, తన అనుభవాలు “ఒక నూతన పెంతెకోస్తును స్థాపించాయని ఛార్లెస్‌ పర్హామ్ ప్రకటించాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో అపొస్తలుల మాదిరిగానే అతడూ, అతని విద్యార్థులూ పరిశుద్ధాత్మను పొందినట్టు భావించారు. 1901లో వారి అనుభవాలే ఆధునిక క్యారిస్‌మాటిక్‌ ఉద్యమమనే అగ్ని జ్వాలలను రగిలించిన నిప్పుకణం.

అయితే తర్వాత జరిగిన విచారణ కనీసం మూడు ముఖ్యమైన సందర్భాల్లో పర్హామ్ మాటల్లోని యథార్థతను ప్రశ్నార్థకం చేసింది. 

మొదటి సందర్భం: ఆ సంఘటనలోని పాల్గొన్న ప్రముఖ వ్యక్తులు పొసగని కథనాలు తెలియచేశారు. తన అనుభవం తర్వాత ఓజ్‌మన్‌ మూడు రోజులపాటు ఇంగ్లీష్‌ మాట్లాడలేదని పర్హామ్ తెలియచేసాడు. అయితే ఆ తర్వాత రోజే తాను ఇంగ్లీష్‌లో ప్రార్ధించానని ఓజ్‌మన్‌ ప్రకటించింది. ఓజ్‌మన్‌కి ఆ అనుభవం నూతన సంవత్సరపు రాత్రివేళ జరిగిందని పర్హామ్ వాదించగా, ఓజ్‌మన్‌ మాత్రం పగటివేళ జరిగిందని పట్టుబట్టింది. 8 చారిత్రాత్మక ప్రార్థన కూడికకు ముందు తన విద్యార్థులను అపొస్తలుల కార్యాల గ్రంథం వైపు నడిపించిన ఆ ఘనత పర్హామ్ తనకు ఆపాదించుకొనగా, భాషలు మాట్లాడిన అనుభవానికి ముందు పర్హామ్ తనకు ఏ విధమైన బైబిల్‌ పఠనాన్ని అప్పగించలేదని ఓజ్‌మన్‌ పర్హామ్ వ్యాఖ్యల్ని వ్యతిరేకించింది. వాస్తవానికి భాషలు మాట్లాడిన తన అనుభవం గురించి ప్రశ్నించిన విద్యార్థులకు తానే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయాన్ని చూపించానని ఆమె చెప్పింది. ఆ రకమైన భేదాభిప్రాయాలు మార్టిన్‌ ఇ. మార్టి వంటి చరిత్రకారులను ఆ సంఘటనలోని కీలకాంశాలను ప్రశ్నించడానికి పురికొల్పాయి.

ఫురాణాలలో కల్పిత కథల మాదిరిగానే, వీటిలో సహితం ప్రశ్నార్ధకమైన అంశాలున్నాయి. మొదట చెప్పిన సాక్ష్యంలో, తేదీ స్పష్టంగా తెలియచేయనప్పటికీ నూతన సంవత్సరానికి మూడు వారాల ముందే తాను భాషల్లో మాట్లాడానని మిస్ ఓజ్‌మన్‌ ప్రస్తావించింది. మిగిలిన వారు ఈ సాక్ష్యాన్ని దృవీకరించారు. భాషల్లో మాట్లాడటం యొక్క ప్రాధాన్యతను తాను తరువాతనే గ్రహించినట్టు ఆమె తెలియచేసింది. అయితే ఖచ్చితంగా ఆ సూచన కోనమే ఎదురుచూడమని ముందుగానే ఆమెకు పర్హామ్ బోధించినట్లు మనకు సమాచారం ఉంది.

దీనికి తోడు తన అనుభవాన్ని అపో.కా 2వ అధ్యాయపు కోణంలో ఆగ్నెస్ ఓజ్‌మన్‌ వివరించినప్పటికీ, తన తోటి విద్యార్థుల్లో అందరూ దానిని అంగీకరించలేకపోయారు. ఆ పాఠశాలలోని కొందరు విద్యార్థులు ఈ నూతన అనుభవాన్ని అంగీకరించలేదని “ద టొపేకా డైలీ కేపిటల్" ప్రచురించింది. “వారంతా పిచ్చివారని నాకు అనిపిస్తోంది” అని పర్హామ్ గురించీ, తన తోటి విద్యార్థులను గురించీ ఎస్‌.జె. రిగ్గిన్స్ అనే విద్యార్థి ఒక వార్తాపత్రిక ఇంటర్వ్యూలో చెప్పాడు.

రెండవ సందర్భం: ఇది చాలా ముఖ్యమైనది. ఛార్లెస్‌ పర్హామ్, ఆగ్నెస్ ఓజ్‌మన్‌ తన తోటి విద్యార్థులలో ఏ ఒక్కరు కూడా తాము నిజంగా ఆశించిన అద్భుతాన్ని ఎన్నడూ పొందుకోలేదు. భాషలు మాట్లాడడం అంటే అపొ.కా. 2వ అధ్యాయంలో అపొస్తలులు మాట్లాడిన విధంగానే, నిజమైన విదేశీ భాషలు మాట్లాడగలిగే అద్భుత సామర్థ్యమని వారు భావించారు. ఆ వరాన్నే వారు అతిగా ఆశించారు. అయితే వారు పొందిన వరం అర్ధరహితమైన భాషే కాని మరొకటేమీ కాదు. పెంతెకోస్తు మిషనరీలు మొదట భాషలు నేర్పే పాఠశాలకు వెళ్ళకుండానే విదేశాలకు వెళ్లవచ్చని పర్హామ్ పట్టుపట్టి చెప్పినప్పుడు ఈ నిజం బట్టబయలైంది.

“పాఠశాలల్లో నేర్చుకోవలసిన అవసరం లేకుండానే, పలు దేశాల ప్రజలతో మాట్లాడ గలిగే భాషాశక్తిని ప్రభువు మాకు అనుగ్రహిస్తాడు” అని అతడు “టొపేకా స్టేట్‌ జర్నల్" కు గర్వంగా చెప్పాడు. “విదేశాల్లో పరిచర్య చేయడానికి వారు చేయవలసిందల్లా శక్తి కోసం దేవుని అడగడమే కానీ, మిషనరీలను సిద్ధపరుస్తూ సంవత్సరాలపాటు సమయాన్ని వెచ్చించడం నిరుపయోగమైనదని సంఘానికి బోధించడం మా శ్రమలో ఒక భాగం” అని కొన్ని వారాల తరువాత అతడు కాన్సస్ సిటీ టైమ్స్ కు చెప్పాడు. కొన్ని వారాలలోనే హవాయి రాష్ట్రంలో ఉన్న వార్తా పత్రికలు సైతం పర్హామ్ చేసిన వాగ్దానానికి ఆకర్షణీయమైన అబద్ధాలను మరిన్ని కలిపి ప్రకటించ మొదలుపెట్టాయి.

టొపేకా, మే 20వ తేదీ - టొపేకాలో బేతెల్‌ నందున్న రెవ. ఛార్లెస్‌ ఎఫ్‌. పర్హామ్ , తన అనుచరులు సంఘ ప్రజలకు సువార్త పరిచర్యకు సంబంధించి ఒక కొత్త పని ఇవ్వాలని ఆశపడుతున్నారు.

అపొస్తలుల కాలం నుంచి ఏ ఒక్కరికీ దేవుడు అనుగ్రహించని భాషల వరంతో దీవించబడిన వ్యక్తులను అన్యుల మధ్యకు పంపాలన్నది అతని ప్రణాళిక వివిధ జాతి ప్రజల మధ్య పనిచేస్తున్న తన మిషనరీలకు అద్భుతంగా (ఆ ప్రజలు) భాషలు మాట్లాడే గొప్ప ఆధిక్యత అనుగ్రహించబడింది. కనుక అది వారికి గొప్ప ప్రయోజనమనీ, ఆ భాషలను ఎంతో శ్రమవడి నేర్చుకుంటున్న ఇతర మిషనరీల వలే వాటిని నేర్చుకోవడానికి వారు ఇబ్బందికి గురికారనీ అతడు చెప్పాడు.

యోగ్యులై విశ్వాసంతో వెదికిన వారు భాషలు మాట్లాడే ఆధిక్యత పొందుకుంటారనేది నిస్సందేహమైన విషయం. అలా వెదికిన వారికి ఏ ప్రజల మధ్య వారు పనిచేయాలని నిర్ణయించుకుంటారో, ఆ ప్రజల భాషను మాట్లాడే సామర్థ్యాన్ని ఇస్తాడనీ, అదొక అమూల్యమైన ఆధిక్యత అని పర్హామ్ చెప్పాడు. బేతెల్‌ కళాశాల విద్యార్థులు భాషలను ప్రాచీన వద్ధతిలో నేర్చుకోవలసిన అవసరం లేదు. అద్భుతకరమైన రీతిలో ఆ భాషలను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. స్పెయిన్‌, ఇటలీ, బోహేమియా, హంగారీ, జర్మనీ, ప్రెంచ్ మొదలైన దేశాల ప్రజలతో వారి భాషల్లోనే చాలామంది ఇప్పటికే సంభాషించగలిగారు. అదే విధంగా మా సభలో భారతదేశ భాషలను , ఆఫ్రికాలో ఉన్న అటవిక జాతి భాషలనూ మాట్లాడే ఆధిక్యత వారు పొందుకుంటారనడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. పెంతెకోస్తు దినాల తర్వాత ఈ సమావేశమే అత్యంత గొప్పదని నేను భావిస్తున్నాను అని పర్హామ్ చెప్పాడు. క్రీస్తు తన మొదటి శిష్యులకు అనుగ్రహించిన వరాలన్నీ తనతోపాటు తన శిష్యులు కూడా పొందుకున్నారని అతడు చెబుతున్నాడు.

ఉద్దేశపూర్వకంగా కల్పించిన, మిక్కిలి అతిశయోక్తిగా చెప్పిన అలాంటి సాక్ష్యం నేటి క్యారిస్‌మాటిక్‌ సంఘాల్లో సర్వసాధారణమైపోవడం విచారకరం. అయితే అమాయక ప్రజలు అటువంటి కథనాలను పైపై హంగులను బట్టి నమ్మి, అవివేకమైన వాటిని విశ్వాసమని పొరబడుతున్నారు.

పర్హామ్ తన మిషనరీ ప్రణాళికను ఎంతో నమ్మకంగా చెప్పినప్పటికీ, అది అత్యంత దారుణంగా విఫలమైంది. క్యారిస్‌మాటిక్‌ రచయితలైన జాక్‌ హేఫోర్ట్‌, డేవిడ్‌ మూరేలు పర్హామ్ అంచనాలు అతి దారుణంగా విఫలమైనట్లు గుర్తించారు. “తాము పొందిన భాషల వరంతో సువార్త యాత్రకు వెళ్లిన పెంతెకోస్తు సేవకులు తాము మాట్లాడిన దానిని తమ శ్రోతలు గ్రహించలేదని గమనించినప్పుడు విదేశీ భాషలు అనే భావం ఘోరమైన వైఫల్యంగా రుజువైంది” అని వారు అన్నారు.

జపాన్‌, చైనా, భారతదేశాల్లోని స్థానిక ప్రజల సొంత భాషలలోనే సువార్త ప్రకటించాలని ఆశిస్తూ ఆ దేశాలకు వెళ్ళిన 18మంది పెంతెకోస్తు సభ్యులను బైబిల్‌ మిషనరీ సొసైటీకి చెందిన ఎస్. సీ. టాడ్‌ ప్రశ్నించి, కనీనం ఒక్క సందర్భంలో కూడా వారు భాషలు మాట్లాడలేకపోయిన విషయాన్ని తామే స్వయంగా అంగీకరించారని అతడు తెలుసుకున్నాడు. నిరుత్సాహంతో అపజయంతో తిరిగివచ్చిన పెంతెకోస్తు మిషనరీలు భాషల వరంపై తమకున్న అభిప్రాయం గురించి వునరాలోచించడం మొదలు పెట్టారు” అని రాబర్డ్‌ మేప్స్ అండర్సన్‌ చెప్పారు.

భాషల్లో మాట్లాడడమే కాదు, భాషల్లో రాస్తున్నామని భావించి ఆగ్నెస్ ఓజ్‌మన్‌, ఇతర పెంతెకోస్తు సభ్యులు పిచ్చిగితలు గీయడం మొదలుపెట్టారు. ఇలా వీళ్లు రాసిన భాషల ఫోటోలను “టొపేకా డైలీ కేపిటల్‌”, “ద లాన్‌ ఏంజెలస్ టైమ్స్" అనే వార్తా పత్రికలు ప్రచురించాయి. కోడి దువ్వేసినట్లున్న ఈ గీతలు భూమి మీదనున్న ఏ భాషకూ సంబంధించినవి కావు, అవి పూర్తిగా అర్ధరహితమైనవి.

మూడవ సందర్భం: ఛార్లెస్‌ పర్హామ్ యొక్క వ్యక్తిగత జీవితమే తన పరిచర్య ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రపంచ వ్యాప్తమైన ఉజ్జీవాన్ని కలుగచేస్తాడా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. తన విద్యార్థులు భాషల్లో మాట్లాడిన కొద్ది కాలం తర్వాతే, గొప్ప అభివృద్ధి జరుగబోతుందని తను ముందుగానే చెప్పినప్పటికీ, టొపేకాలో బైబిల్‌ పాఠశాలను మూసేయవలసినదిగా పర్హామ్ బలవంతం చేయబడ్డాడు. స్వస్థతా ఉజ్జీవ సభలనూ జరుపుతూ, అనేకమంది శిష్యులను కూర్చుకుని కాన్సస్‌ రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రదేశాలకూ, మధ్య పశ్చిమానికీ అతడు ప్రయాణించాడు. త్వరలోనే 5 వేల కంటే ఎక్కువ మంది శిష్యులను సంపాదించుకున్నానని అతడు ప్రకటించాడు. వృద్ధి చెందుతున్న తన అనుచరుల సమూహాన్ని “అపొస్టలిక్‌ ఫెయిత్‌ మూవ్‌మెంట్‌" (అపొస్టలిక్‌ ఫెయిత్‌ అనే తన పక్షపత్రిక పేరును పోలినది) గా ప్రస్తావించి, “అపొస్టలిక్‌ ఫెయిత్‌ మూవ్‌మెంట్‌" కు కర్త అనే బిరుదును తనకు తాను ఇచ్చుకున్నాడు.

అయితే పర్హామ్ కు కలిగిన తీవ్రమైన అపకీర్తి మూలంగా ఈ ఉద్యమం కొనసాగలేకపోయింది. 1906వ సంవత్సరం ఆకురాలే కాలంలో ఇలినాయిస్‌ రాష్ట్రంలోని జాయన్‌ అనే ప్రాంతంలో కొన్ని సభలను అతడు నిర్వహించాడు. కొన్ని నెలల తరువాత తన అనుచరుల్లో ఐదుగురు ఒక స్త్రీలో ఉన్న కీళ్ళవాతాన్ని కలుగచేసే దెయ్యాన్ని వదిలించే ప్రయత్నంలో ఆమెను కొట్టి చంపేసారు. ఆ స్త్రీ చనిపోకముందే జాయన్‌ నుంచి పర్హామ్ వెళ్ళిపోయినప్పటికీ, ఆ సంఘటన గురించి విచారణ జరిగింది. అది దేశవ్యాప్తంగా ప్రచారమైంది. అక్కడ వార్తాపత్రికలన్నీ ఆ హంతకులను "పర్హామ్ తప్పు బోధలోని సభ్యులుగా” గుర్తించాయి. “విచారణలో తేలిన ఆధారాలను బట్టి మరి కొంతమందిని అరెస్టు చేయబోతున్నట్టు తెలిసింది. ఇప్పుడు జైలులో ఉన్న వారి తప్పుడు బోధకు నాయకుడైన పర్హామ్ సైతం పోలీసువారి పర్యవేక్షణలో ఉండవచ్చు” అని ప్రధాన నిందితులు దోషులుగా నిర్ధారించబడినప్పుడు జాతీయ మీడియా ప్రకటించింది. పర్హామ్ ఈ కేసులో శిక్ష పొందలేదు, కానీ "ప్రాణాంతకమైన మత మూఢత్వానికి" పర్యాయపదంగా అతని పేరు మారిపోయింది.

కాన్సస్ రాష్ట్రంలో అనారోగ్యంతో ఉన్న తమ కుమార్తెకు వైద్యం చేయించడానికి బదులు ఆమె తల్లితండ్రులు పర్హామ్ పరిచర్య ద్వారా స్వస్థత కోసం ఎదురుచూడగా ఆ యవ్వన బాలిక మరణించింది. ఆ సందర్భంలో ఈ పెంతెకోస్తు సువార్తికుడు కాన్సస్‌ ను వదిలి, టేక్సస్‌ రాష్ట్రానికి బలవంతంగా వెళ్ళగొట్టబడ్డాడు.

ఆ సమయంలో అమెరికాకు వలస వెళ్ళిన 35 సంవత్సరాల ఆఫ్రికన్‌ విలియమ్‌ జె. సేమూర్‌ని అతడు కలిసాడు. ఈయన పరిశుద్ధాత్మ గురించీ, భాషల వరం గురించీ పర్హామ్ చేసిన బోధలను చేపట్టి, 1906లో లాస్‌ ఏంజెలస్‌లో “అజుసా స్ట్రీట్‌ రివైవల్‌" ను ప్రారంభించాడు. అయితే కొద్దికాలానికే వారి స్నేహం చెడిపోయింది. దక్షిణ కాలిఫోర్నియాలో సేమూర్ యొక్క పరిచర్యను దర్శించి, ఆ సభల్లోని అనాగరికమైన ప్రవర్తనను పర్హామ్ ఆమోదించలేదు? ఆ ఉజ్జీవంలో పర్హామ్ తన నాయకత్వాన్ని కనపరచుకోవడానికి ప్రయత్నించి, భంగపడ్డాడు.

ఆ సమయం నుంచి పర్హామ్ స్థితి మరింత దారుణమైంది. 1907 సంవత్సరం, జూలై 19వ తేదీన టెక్సాస్‌ రాష్ట్రంలో సాన్‌ ఏంటోనీయో హోటల్‌లో వేరొక పురుషునితో వ్యభిచారంలో దొరికిపోయిన కారణంగా అరెస్టయ్యి, నాలుగు రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. తాను నిర్దోషినని అతడు వాదించినప్పటికీ, విడుదలకు ముందు తన నేరాన్ని పూర్తిగా అంగీకరిస్తూ లేఖ రాసాడని తన విరోధులు ఆరోపించారు. ఈ ఆరోపణలు సరైనవి కావని పర్హామ్ వాదించినప్పటికీ, అతని కీర్తి పూర్తిగా అప్రతిష్ట పాలైంది, అతని ప్రభావం క్రమేపి క్షీణిస్తూ వచ్చింది. ఆ వేసవి కాలపు రాత్రి జరిగినదేమిటో ఎప్పటికీ తెలియకపోవచ్చు. పర్హామ్ పై వచ్చిన ఆరోపణలు తరువాత తొలగిపోయినప్పటికీ, బాగుచేయలేనంత పరువు నష్టం అతనికి జరిగింది. హోలినెస్‌, పెంతెకోస్తు పరిచర్యల ద్వారా ఈ అక్రమాన్ని గురించిన వార్త విస్తరించి తన శత్రువులను సంతోష పెట్టింది, స్పేహితులను నిరుత్సాహపరిచింది. ఈ క్రమంలో అపొస్టలిక్‌ ఫెయిత్‌ మూవ్‌మెంట్‌ ఛిన్నాభిన్నమైంది.

తన పరువును కాపాడుకొనే దీన ప్రయత్నంలో తనపై వస్తున్న నిందల నుంచి ప్రజల గమనాన్ని మళ్ళించడానికి ఏదొక అద్భుత కార్యాన్ని చేయాలని పర్హామ్ నిర్ణయించుకున్నాడు. దాని కోసం పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము యాత్ర కోసం నిధులు సేకరించే పని ప్రారంభించి, ఈ యాత్రలో నోవహు ఓడనూ, అదృశ్యమైన నిబంధన మందసాన్నీ కనిపెడతానని వాగ్దానం చేశాడు. అయితే తన యాత్ర మొదలుకాకముందే ముగిసిపోయింది. "వార్తాపత్రికల ముందు తన ప్రణాళికను చెప్పి, తగినంత ధనాన్ని సేకరించిన తరువాత, యెరూషలేముకు వెళ్ళే స్టీమర్ ఎక్కడానికి 1908 డిసెంబర్‌లో పర్హామ్ న్యూయార్క్‌కి బయలుదేరాడు. అయితే అక్కడకు వెళ్లే టికెట్‌ మాత్రం అసలు కొనలేదు. తన స్నేహితుని దగ్గర అప్పు తీసుకుని 1909 జనవరిలో కాన్సస్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. న్యూయార్క్ కి చేరుకొన్న తర్వాత తన దగ్గరున్న ధనాన్ని దొంగలు దోచుకున్నారనీ, కనుక టిక్కెట్‌ కొనే అవకాశమే తనకు రాలేదనీ విచారంతో తన అనుచరులకు వివరించాడని" పర్హామ్ జీవిత చరిత్ర రాసిన జేమ్స్‌ ఆర్‌. గాఫ్‌ జరిగిన విషయాన్ని చెప్పాడు.

ఆ కాలంలో ఉన్న అనేకమంది హోలినెస్‌ మూవ్‌మెంట్‌ ప్రసంగీకుల మాదిరిగానే పర్హామ్ సైతం చౌకబారైన, ప్రాముఖ్యత లేని, పూర్తిగా వాక్య విరుద్ధమైన సిద్ధాంతాల వైపు ఆకర్షితుడయ్యాడు. “షరతులతో కూడిన నిత్యత్వం” (దుష్టులు నిత్య యాతనను అనుభవించవలసిన అవసరం లేకుండానే శూన్యంలో కలిసిపోతారని చెప్పే బోధ) ను చాలా బలంగా సమర్థించిన వ్యక్తి ఇతడు. మానవులందరూ ఆఖరికి రక్షణ పొందుతారు? అనే బోధను నమ్మాడు. అతనికి మానవ పతనావస్థ గురించి వాక్య విరుద్ధమైన అభిప్రాయం ఉంది. పాపులు తమ స్వప్రయత్నంతో, దేవుని సహకారంతో తమను తాము రక్షించుకోగలరని అతడు నమ్మాడు. దేవుడు మానవజాతికి కృప అనుగ్రహించబద్దుడని అతడు విశ్వసించాడు. పరిశుద్ధతే స్వస్థతను ఖచ్చితంగా కలుగ జేస్తుంది. కనుక ఏ రోగానికైనా వైద్య చికిత్స కోసం ఎదురుచూడడం అవిశ్వాస కార్యమని అతడు బోధించాడు.

పర్హామ్ ఒక విధమైన “ఆంగ్లో - ఇశ్రాయేలీయిజమ్‌” అనే బోధను సైతం ప్రోత్సహించాడు. అష్షూరీయుల చెర సమయంలో చెల్లాచెదురైపోయిన పది గోత్రాల ఇశ్రాయేలీయుల నుంచి వచ్చిన వారే పశ్చిమ ఐరోపా జాతులనీ, అందుచేత తెల్లజాతి ఐరోపా వాళ్లందరూ “నిజంగా దేవుడు ఏర్పరుచుకున్న ప్రజలని" ఈ బోధ చెబుతుంది. ఆ అభిప్రాయమే నిజానికి జాతివైరాన్ని కలుగజేసేదిగా ఉంది. కాలం గడిచిన కొద్దీ పర్హామ్ జాతిబేధాన్ని బలపరిచే మాటలను చాలా బహిరంగంగా మాట్లాడడం ఆరంభించాడు. జాత్యంతర వివాహమే దేవుడు లోకాన్ని వరదతో ముంచేయడానికి కారణమని అతడు ఒక సందర్భంలో నొక్కి చెప్పాడు. “హూస్టన్‌ డైలీ పోస్ట్‌” అనే పత్రికలో, 1905 ఆగష్టు 13వ తేదీన క్రియేషన్‌ అండ్‌ ఫార్మేషన్‌ (సృష్టి దాని నిర్మాణం) అనే శీర్షికతో ఒక ప్రసంగం వెలువడింది. “ఆ విధంగా శాప భరితమైన జాత్యంతర వివాహాలు ప్రారంభమై, శిక్షగా జల ప్రళయం రావడానికి కారణమయ్యాయి. ఆ వివాహాల ద్వారా వచ్చిన సంతానంపై అనగా 3,4 వ తరాలకు తెగులు, చికిత్సలేని రోగాలు సంక్రమించాయి. అమెరికాలోని తెలుపు, నలుపు, ఎరుపు జాతుల మధ్య వివాహాలు కొనసాగితే త్వరలోనే క్షయ తదితర రోగాలు భూమిపై ఉన్న సంకరజాతి సంతానాన్ని తుడిచి పెట్టేస్తాయని” ఆ ప్రసంగంలో పర్హామ్ చెప్పాడు.

1906లో అజుసా వీధిని దర్శించి, అక్కడి మితిమీరిన ఉద్రేకాలను చూసి పర్హామ్ ఆ పరిచర్యను ఖండించాడు. అతనికున్న జాత్యహంకారం మరింత స్పష్టంగా అతని మాటల్లో కనబడింది. అజుసా పరిచర్య ఆరాధనలో నల్లజాతి పురుషులతో ఏకీభవించిన తెల్ల జాతి స్త్రీలను పర్హామ్ కఠినమైన పదాలతో నిందించాడు. తెలుపు, నలుపు జాతికి చెందిన స్త్రీ పురుషులు కలసి మోకరించి ఒకరికొకరు అడ్డుపడడాన్ని అతడు నిందించాడు. అజుసా పరిచర్య జరిగే ప్రతి చోట అటువంటి వెర్రితనం కొనసాగిందని అతడు ఆరోపించాడు. తన జీవిత చరమాంకంలో అనగా 1927లో కు క్లక్స్‌ క్లాస్ (Ku Klux Klan) అనే సంస్థను బహిరంగంగా పొగడి, పర్హామ్ దానిని బాహాటంగా సమర్ధించాడు. “పెంతెకోస్తు వేదాంత స్థాపకుడైన ఛార్లెస్‌ పర్హామ్ కు క్లక్స్‌ క్లాన్‌ అనే జాతి పట్ల సానుభూతి చూపాడు. టొపేకాలో తన బైబిల్‌ పాఠశాలలోని విద్యార్థులను జాతులను బట్టి విభజించాడు. వివిధ జాతులు కలిసి జీవించడానికి వ్యతిరేకంగా ప్రసంగించాడు. ఆంగ్లోసాక్సన్లే ప్రధాన జాతి అని నమ్మాడని” పర్హామ్ జాత్యహంకార అభిప్రాయాల సారాన్ని ఫ్రెడరిక్‌ హారిస్‌ చెప్పాడు.

అపకీర్తి, అపనింద పర్హామ్ ను సహజంగానే వెంటాడాయి, అతని పరువు పోయింది. పలు పెంతెకోస్తు సంఘాలు తమ స్థాపకుని నుంచి దూరమైపోయాయి. “ధన మోసాలతో వింత సిద్ధాంతాలతో, జాత్యహంకార భావాలతో పర్హామ్ 20వ శతాబ్దపు తొలి దశకాల్లో వ్యాప్తి చెందిన పెంతెకోస్తు ఉద్యమానికి ఇబ్బందికరంగా మారాడు” కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రస్తుత పెంతెకోస్తువారు (క్యారిస్‌మాటిక్‌ సభ్యులందరూ) ఛార్లెస్‌ పర్హామ్ తమ ఉద్యమానికి వేదాంత శిల్పియని భావిస్తున్నారు. “సాంప్రదాయక పెంతెకోస్తు సంఘానికి ఛార్లెస్‌ పర్హామ్ స్థాపకునిగా పరిగణించబడ్డాడు. రక్షణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, స్వస్థత, క్రీస్తు యొక్క రెండవరాకను గురించిన ఎదురు చూపు ఆనే నాలుగు పెంతెకోస్తు సిద్ధాంతాలను పర్హామ్ ప్రతిపాదించాడ” ని ఎంథోని తిసల్టన్ వివరించాడు.

ఉద్యమారంభ సమయంలో ఉన్న సభ్యులు చెప్పిన విరుద్ధ సాక్ష్యాలు మొదలుకొని, వారు మాట్లాడిన అర్థరహిత భాషలు, ఆ ఉద్యమ ప్రధాన నాయకుని వివాదాస్పదమైన జీవితం వరకూ ఉన్న విషయాలు ప్రస్తుత పెంతెకోస్తు ఉద్యమం చేసే బోధల గురించి ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. 19వ శతాబ్దంలో హోలినెస్‌ మూవ్‌మెంట్‌ రక్షణ గురించి తప్పుడు సిద్ధాంతాన్ని బోధించింది. ఆ తప్పుడు సిద్ధాంతం మూలంగా ఈ పెంతెకోస్తు ఉద్యమం ఆవిర్భవించింది. ఈ హోలినెస్‌ మూవ్‌మెంట్‌లో ఛార్లెస్‌ పర్హామ్, విలియం జె. సేమూర్‌ అనే వీరిద్దరూ భాగస్తులు.

మారుమనస్సు పొందిన తర్వాత విశ్వాసులు “రెండవ ఆశీర్వాదం” అనుభవిస్తారనీ, ఆ సమయంలోనే వారు తమ క్రైస్తవ జీవితంలో పరిపూర్ణతను సాధిస్తారని "హోలినెస్‌ వేదాంతం" తప్పుగా బోధిస్తుంది.” 1యోహాను 1:8-10 లాంటి వాక్యభాగాలు ఈ ఆలోచనకు వ్యతిరేకమైనప్పటికీ, హోలినెస్‌ వేదాంతం దానిని లెక్క చేయలేదు. “కొద్దిమంది 19వ శతాబ్దపు హోలినెస్‌ ఉద్యమ నాయకులు పరిశుద్ధాత్మ బాప్తిస్మం” అనే మూడవ ఆశీర్వాదం గురించి సహితం బోధించారు. తరువాత దానినే పెంతెకోస్తువారు భాషల్లో మాట్లాడడంతో ముడిపెట్టారు.

ఈ చరిత్ర యావత్తును చర్చించడం వెనకున్న ఉద్దేశం ఇదే: ఒకవేళ పెంతెకోస్తు దినాన్ని పరిశుద్ధాత్ముడు పునరావృతం చేయదలిస్తే నిజంగా ఆయన ఈ విధంగానే చేస్తాడా? అపొ.కా. 2 లో జరిగిన సంగతులనూ, 19 శతాబ్దాల తర్వాత టొపేకాలో కాన్సస్‌లో సంభవించిన సంగతులనూ ప్రాథమికంగా పోల్చిచూసినా ఆ రెండు సందర్భాలలో ఉన్న విరుద్ధమైన విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. అపొస్తలుల నాటి పెంతెకోస్తు దినం లోపభూయిష్టమైన రక్షణ శాస్త్రం నుంచి ఉద్భవించిందీ కాదు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విభిన్న సాక్ష్యాల ఫలితమూ కాదు. అపొస్తలులకున్న భాషల వరం హేతువిరుద్ధమైన పదోచ్చారణ కాదు. వారు తాము ఎన్నడూ నేర్చుకోని విదేశీ భాషలను అద్భుత రీతిలో మాట్లాడారు (ఆపో. కా. 2:9-12), అంతేకాదు, కేవలం వారి ప్రసంగం ద్వారానే కాకుండా జీవితకాలమంతటిలో వారిని పరిశుద్ధాత్మ పరిశుద్ధపరుస్తుండగా, వారి భక్తి జీవితం ద్వారా సైతం పరిశుద్ధాత్మ కార్యం వెల్లడయ్యింది.

క్యారిస్‌మాటిక్‌ ఉద్యమారంభం గురించి ఒక్కసారి ఆలోచించండి. “హోలినెస్‌ మూవ్‌మెంట్‌” తప్పుగా బోధించిన రక్షణ సిద్ధాంతం నుంచి ఉద్భవించింది. ప్రత్యక్ష సాక్షులు పరస్పర విరుద్ధమైన సాక్ష్యాలు చెప్పారు. అది నకిలీ మత అనుభవాలను సృష్టించింది. దుష్టుడైన ఆత్మీయ నాయకుడు దాన్ని ప్రారంభించాడు. కనుక ఈ కారణాలన్నీ ఈ ఉద్యమం యథార్థతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

                                                            న్యూ థాట్‌ విధానం

పరిశుద్ధాత్మ బాప్తీస్మానికి సూచన అయిన భాషల నిమిత్తం కనిపెట్టమని ఛార్లెస్‌ పర్హామ్ తన విద్యార్థులను నడిపిస్తున్న సమయంలోనే, తమ కోరికలను తెలియచేసి వాటిని పొందుకోవడానికి తగినంత విశ్వాసాన్ని కనపరచమని తన అనుచరులను ప్రోత్సహించాడు మరొక అమెరికా పరిచారకుడు.

“నేను అడిగిన ప్రతిదానిని నేను పొందుకుంటాను” అనే నినాదాన్ని మొదట ప్రయోగించిన వ్యక్తి ఎస్సెక్‌ విలియమ్‌ కెన్యాన్‌. ఇతడు 1867-1948 సంవత్సరాల కాలంలో జీవించిన ఒక ఫ్రీవిల్‌ బాప్టిస్ట్‌ సంఘ కాపరి, శిక్షకుడు. తరువాత ఈ నినాదాన్ని వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ ప్రసంగీకులు ప్రజాదరణ పొందేలా చేసారు. కెన్యాన్‌ మెథడిస్ట్‌ గృహంలో పెరిగినప్పటికీ, ప్రముఖ సువార్తికుడు ఎ.జె. గోర్డాన్‌ ప్రోద్బలంతో కెన్యాన్‌ బాప్తిస్టుగా మారాడు. అయితే 19వ శతాబ్దంలో అతడు తత్వ సంబంధమైన మతాలకు కూడా పరిచయమై, తన వేదాంతాన్ని ఆ లోపాలతో కలుషితం చేయననుమతించాడు

అతడు 1892లో బోస్టన్‌లో ఉన్న “ఎమర్సన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆరేటరీ" హాజరయ్యాడు. ఈ కళాశాల తత్వశాస్త్రంలో (ముఖ్యంగా న్యూ థాట్‌ మెటా ఫిజిక్స్‌) ఉపన్యాసకులకు ప్రత్యేక శిక్షణ నిచ్చేది. న్యూ ఇంగ్లాండ్‌ దేశపు తత్త్వవేత్త ఫినియస్‌ పి . క్వింబీ బోధల ద్వారా ఈ “న్యూ థాట్‌" అనే శాఖ మునుపటి తరంలోనే ప్రారంభమైంది. ఈయన ఒక హిప్నాటిస్టు, స్వస్థత వరం కలిగినవాడు. భౌతిక పరిస్థితులను మానసిక, ఆత్మీయ పద్ధతుల ద్వారా లొంగదీసుకొని, ఆధీనంలోనికి తెచ్చుకోవచ్చని అతడు బోధించాడు. “దైవశక్తీ శ్రేష్టమైన జ్ఞానమూ ప్రతిచోట ఉన్నాయనీ, మనుషులు దైవస్వభావం కలవారనీ, తమ భౌతిక స్థితిని మార్చుకోవడానికి తమ మనస్సును ఉపయోగించుకోవచ్చని, సరిగా ఆలోచించడం ద్వారా వ్యాధి నుంచి పేదరికం నుంచి తమను తాము విడుదల చేసుకోవచ్చని” ఈ 'న్యూ థాట్‌' బోధలు నొక్కి చెప్పాయి. క్రిష్టియన్‌ సైన్స్‌ అనే మతంలో న్యూ థాట్‌ బోధను మిళితం చేసుకున్న మేరీ బేకర్‌ ఎడ్జీ మొదలైన క్వింబీ అనుచరులు అతని ఆలోచనలను ప్రజాదరణ పొందేలా చేసారు.

ఎమర్సన్‌ కాలేజ్‌ను వదిలి వెళ్లిన తర్వాత కెన్యాన్‌ పలు బాప్టిస్టు సంఘాలకు కాపరిగా పనిచేశాడు. 1898 లో మ్యాసచుసెట్స్‌లో స్పెన్సర్‌ వద్ద బేతేల్‌ బైబిల్‌ ఇన్‌స్టిట్యూట్‌ను అతడు ప్రారంభించాడు. 1923లో ఎన్నటికీ వెలుగుచూడని వివాదాన్ని బట్టి అతడు రాజీనామా చేసే వరకూ ఆ ఇన్‌స్టిట్యూట్‌కు అతడు ప్రెసిడెంట్‌గా పనిచేసాడు. మ్యాసచుసెట్స్‌ అనే ప్రాంతాన్ని వదిలిపెట్టిన తర్వాత 1980 తొలినాళ్ళలో వాషింగ్టన్‌ రాష్ట్రంలోని, సియాటిల్‌ నగరానికి రాకముందు దక్షిణ కాలిఫోర్నియాలో చాలా సంవత్సరాలు స్థిరపడ్డాడు. అక్కడ న్యూ కవనెంట్‌ బాప్టిస్ట్‌ సంఘాన్ని సియాటిల్‌ బైబిల్‌ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించి, “కెన్యాన్స్‌ చర్చ్‌ ఆఫ్‌ ద ఎయిర్‌” అనే రేడియో కార్యక్రమం ద్వారా తన బోధలను ప్రసారం చేసాడు.

అతడు పెంతెకోస్తు సభ్యుడు కాకపోయినా పెంతెకోస్తు సభలకు హాజరయ్యాడు. లాస్‌ ఏంజెలెస్‌లో ఏయ్‌మీ సెంపిల్‌ మెక్‌ఫెర్సన్‌ యొక్క ప్రసిద్ది పొందిన ఆంగేలస్‌ టెంపుల్‌కు ఆహ్వానించబడ్దాడు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన కొద్ది కాలానికే, అతడు మరణించినప్పటికీ, యుద్దానంతర సంవత్సరాల్లో వచ్చిన ప్రముఖ స్వస్థతా ఉజ్జీవకారులు చాలా స్పష్టంగా అతడిచేత ప్రభావితమై, అతడి సేవను ఉదాహరించారు. ఏ “వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్" బోధకుని సిద్ధాంత చరిత్రను పరిశీలించినా, దానికి బీజం ఇ.డబ్లు. కెన్యాన్‌ చేసిన బోధలో ఉన్నట్లు మీరు కనుగొంటారు.

కెన్యాన్‌ చేసిన బోధ పలు స్థాయిల్లో వాక్య నియమాలకు తీవ్ర విరుద్ధంగా ఉంది. దేవుని వాక్యాన్ని రూఢిగా ఒప్పుకోవడం ద్వారా ప్రజలు తమ భౌతిక పరిస్థితులను మార్చుకోగలరని తన ప్రసంగాల్లో, బోధల్లో చెబుతూ "న్యూ టాట్" తత్వంలోని కీలకాంశాలను క్రైస్తవ వేదాంతంలో అతడు మిలితం చేసాడు. ఉదాహరణకు, స్వస్థత పొందాలన్నప్పుడు, విశ్వాసులు తాము అప్పటికే స్వస్థత పొందామని ప్రకటించవలసిన అవసరం ఉంది. “స్వస్థతకు ముందు ఒప్పుకోలు ఉంటుంది. వ్యాధి లక్షణాలను చూడొద్దు, కేవలం వాక్యాన్ని మాత్రమే చూడండి. మీ ఒప్పుకోలు ధైర్యంగా, తీక్షణంగా ఉండేలా నిర్ధారించుకోండి. ప్రజలు చెప్పింది వినొద్దు, ఎందుకంటే మాట్లాడేది దేవుడు. నీవు స్వస్థత పొందుతావు, నీవు పొందుతావని వాక్యం చెబుతోంది. నీ ఇంద్రియాల మాట వినొద్దు. వాక్యానికి సరియైన స్థానం ఇవ్వండి” అని కెన్యాన్‌ దీనిని వివరించాడు. ఎవరైతే విశ్వాసంతో అడుగుతారో, వారే ఆశించిన ఫలితాలు పొందుతారు. దానికి వ్యతిరేకంగా ఎవరైతే నిరాశతో మాట్లాడతారో వారు దారుణంగా విఫలమవుతారు.

కెన్యాన్‌ నుంచి మరలా కొన్ని మాటలు: “నీ మాటలకంటే ఉన్నతంగా నీవు ఎదగలేవు. నీవు నీ అనారోగ్యం గురించి మాట్లాడితే, దాన్నే పొందుకుంటావు. బలహీనత వైఫల్యాల గురించి మాట్లాడితే, వాటినే పొందుకుంటావు. నేను ఏ పనీ చేయలేనని నీవు చెబుతుంటే, నీ మాటలు నీ శరీరాన్ని స్పందింపచేస్తాయి. ఎందుకిలా? ఎందుకంటే నీవొక ఆత్మ కలిగినవాడివి, భౌతిక సంబంధివి కావు. ప్రాథమికంగా నీవొక ఆత్మవు. ఒక శోషితకాగితం ఇంకును ఇముడ్చుకొన్న విధంగా, ఆత్మ మాటలను నమోదు చేసుకుంటుంది.” మాటల క్రియాశీలక శక్తి గురించి, రోగం ఆత్మ సంబంధమైనదే కానీ భౌతిక సంబంధమైనది కాదనే అభిప్రాయం గురించి నొక్కి చెప్పడం ద్వారా వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ శాఖకు కెన్యాన్‌ ఒక ప్రాథమిక సిద్ధాంతాన్ని సమకూర్చాడు.

ఇహలోక అభివృద్ధి గురించి “వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌” శాఖ ఇచ్చే ప్రాధాన్యతకు పునాది వేసింది కూడా కెన్యాన్‌ బోధలే. సువార్త పరలోక బహుమానాన్ని గురించిన నిరీక్షణను మాత్రమేకాకుండా ప్రస్తుతం భూమిపై ఇహలోక ఆశీర్వాదాన్ని కూడా వాగ్దానం చేస్తుందని అతడు నమ్మాడు. “మనం క్రైస్తవ్యం నుంచి ఏమి పొందుకుంటామనేదే నిజానికి విలువైనది. ఈ జీవితంలో మనం ఏమి పోందుకోగలమనే విషయంలోనే మనం క్రైస్తవులం. రాబోయే లోకాన్ని గురించిన నిరీక్షణ మనకుంది. మనం సేవించి, ఆరాధించే దేవుడు మన మొరలను విని, అపాయాల నుంచి మనల్ని కాపాడి, దుఃఖంలో మనల్ని ఆదరించాలని మేము డిమాండ్‌ చేస్తున్నామని” అతడు రాశాడు. కెన్యాన్‌ ప్రకారం, మనం భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పేదరికంలో జీవించాలని దేవుడెన్నడూ ఉద్దేశించలేదు. ఆయన ఇశ్రాయేలీయులను ఆర్థికంగా బలపరచి ఇతర దేశాల కంటే ముందుకెళ్ళేలా చేసాడు. మనం ఆయనతో భాగస్వామ్యం పొందినప్పుడు, ఆయన పద్ధతులను అనుసరించడం నేర్చుకుంటాం, మనం విఫలం కాము. నీ జీవితాన్ని విజయవంతం చేసుకోవడానికి అవసరమైన సామర్థ్యాన్ని ఆయన నీకు దయచేస్తాడు.

అటువంటి మాటలు ప్రోస్పారిటి ప్రసంగీకులూ, ప్రధాన టి.వి. సువార్తికులూ చొంగకార్చుకుంటూ నేడు చెబుతున్న మాటలను పోలినట్టుగా ఉన్నాయి కదా! అవును. (ఎందుకంటే) వారు ఆ సమాచారం కెన్యాన్‌ నుంచే నేర్చుకున్నారు.

అతని సరికొత్త ఆలోచనలు త్వరలోనే క్యారిస్‌మ్యాటిక్‌ ఉద్యమంలో చొరబడి, క్యారిస్‌మాటిక్‌ వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ ఉద్యమానికి జన్మనిచ్చాయి. “1940-50 సంవత్సరాల్లో వివిధ పెంతెకోస్తు స్వస్థతా ఉజ్జీవకారులు కెన్యాన్‌ రచనలను చదివి, కొన్నిసార్లు అతని మాటలను ప్రస్తావించారని” డెన్నిస్‌ హోలింగల్‌ చెప్పాడు. ఫెయిత్‌ హీలర్స్‌ అయిన విలియమ్‌ బ్రన్ హమ్ , ఒరల్‌ రాబర్ట్స్‌ వంటివారు ప్రోస్పాపారిటీ సువార్త క్యారిస్‌మాటిక్‌ సమాజాల్లో అంగీకరించబడేలా ఒక పునాదిని వేసారు. అయితే "వర్డ్ ఆఫ్‌ ఫెయిత్‌ ఉద్యమానికి” పితామహుడిగా పేరొందిన కెన్నెత్‌ హాగిన్‌ కెన్యాన్‌ చేసిన రచనల్ని బాగా ప్రాచుర్యం పొందేలా చేసాడు. అంతేకాదు, కెన్యాన్‌ రచనల్లో అధిక భాగాల్ని తన పుస్తకాల్లో తన సొంత ఆలోచనలైనట్లు రాశాడు. తరువాత వచ్చిన కెన్నెత్‌ కోప్‌ల్యాండ్‌, బెన్నీహిన్‌, క్రెభ్లోడాలర్‌ మొదలైన ప్రస్పారిటీ ప్రసంగీకులందర్నీ హాగిన్‌ ప్రభావితం చేసాడు. ఆధునిక పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్‌ సమాజాల్లో ప్రోస్పారిటి సువార్త ప్రబలమైన శక్తిగా మారిందని మనం ఇంతకుముందు అధ్యాయంలో చూసాము.

ఛార్లెస్‌ పర్హామ్ వ్యక్తిగత జీవితం పెంతెకోస్తు ఉద్యమారంభాల పైన అనుమానపు చీకటి ఛాయలను ఏర్పరచిన విధంగానే, ఈ. డబ్ల్యూ. కెన్యాన్‌ ఇనుమడింపచేసుకున్న న్యూ టాట్ నియమాలు వర్ట్‌ ఆఫ్‌ ఫెయిత్‌ ఉద్యమం, ప్రోస్పారిటి సువార్తల నిజ ఆరంభాలను బట్టబయలు చేసాయి. నిజమైన విదేశీ భాషలు మాట్లాడాలని ఆశపడిన పర్హామ్ యొక్క తొలి అనుభవం ఒక మోసం. తత్వ శాస్త్రాన్ని తన ప్రసంగాల్లో మిళితం చేసిన కెన్యాన్‌ వేదాంతం ఒక తప్పుడు బోధ. కెన్యాన్‌ అడుగుజాడల్లో నడిచే “వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌” బోధకులు ఫినియస్‌ పీ. క్వింబీ) వంటి నాయకుల్నే తమ పూర్వికులుగా పరిగణిస్తున్నారు.

వారి వేదాంతం కూడా క్రిస్టియన్‌ సైన్స్‌ (క్రైస్తవ విజ్ఞానం), థియోసోఫి (దైవజ్ఞానం) మెస్మరిజమ్‌ (వశీకరణ), సైన్స్‌ ఆఫ్‌ ద మైండ్‌ (మానసిక విజ్ఞానం) స్వీడన్‌ బోర్డియానిజమ్‌ (ఇమ్మానుయేలు స్వీడన్‌బోర్ట్‌ రచనలచే ప్రభావితం చేయబడి ఏర్పడిన క్రొత్త క్రైస్తవ మత శాఖలు), న్యూ థాట్‌ మెటాఫిజిక్స్‌ మొదలైనవాటి కుటుంబానికే చెందినదని దాని అర్థం.

ఫలితంగా వచ్చిన ప్రోస్పారిటి సువార్త నియో-నాస్టిక్‌ డువలిజమ్‌ (సూతన జ్ఞాన ద్వైతం), న్యూ ఏజ్‌ మిస్టిసిజమ్‌ (నూతన యుగపు గూఢమతం) సిగ్గులేని భౌతికతల సమ్మేళనం. ఆరోగైశ్వర్యాలను వాగ్దానం చేస్తూ, తన బాధితులను నైతికంగా దిక్కులేని వారిగా, ఆత్మీయంగా దరిద్రులుగా వదిలేస్తున్న ఈ బోధ నాశనకరమైన తప్పు బోధ (2పేతురు 2:1),

ఛార్లెస్‌ పర్హామ్, ఈ.డబ్ల్యు. కెన్యాన్‌ల రచనలపై ఎందుకు దృష్టి సారించడం? సమాధానం చాలా సులభమైంది. మొత్తం క్యారిస్‌మాటిక్‌ ఉద్యమానికి సిద్ధాంతపరమైన పునాది వేసింది వీరిద్దరే. ఈ ఉద్యమానికి చరిత్రలో మూలాలుగా వీరున్నారు. పెంతెకోస్తు శాఖ స్థాపకునిగా వేదాంత శిల్పిగా ఉన్న పర్హామ్ కొన్ని నియమాలను వివరించి ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాన్ని ప్రోత్సహించిన అనుభవాలకు భాష్యం చెప్పాడు. కనుక తన పొరపాట్లు, వైఫల్యాలు ఈ మొత్తం వ్యవస్థకు ఆధారమైన దానిని ప్రశ్నిస్తున్నాయి. వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ ఉద్యమానికి పితరునిగా ఉన్న కెన్యాన్‌, సిద్ధాంతపరమైన విషాన్ని తర్వాత ప్రోస్పారిటి బోధకులకు సిద్ధం చేసాడు. తత్త్వ సంబంధమైన తప్పు బోధలతో తనకున్న సంబంధం, నేటి టి.వి. సువార్తికుల ప్రముఖ వర్తమానాల్లో దాగియున్న ఆకర్షణీయమైన అవినీతి గురించి వివరిస్తోంది.

                                                           న్యూ అవేకనింగ్‌

ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమారంభం వివాదాస్పదంగా ఉన్నప్పటికీ అది అత్యంత భారీ ఉద్యమంగా అభివృద్ధి చెందింది. ఇంతకు మునుపెన్నేడూ లేనంత అభివృద్ధిని చూసిన కొంతమంది పరిశీలకులు దీనిని 'నూతన మతోద్దారణ' అని పేర్కొన్నారు. “16 శతాబ్దంలో ఐరోపాను వణికించిన మతోద్దారణకంటే ప్రాథమికమైన, మరింత విస్తృతమైన మతోద్ధారణ ద్వారా క్రైస్తవ్యం జీవిస్తోంది... ప్రస్తుత మతోద్ధారణ 16వ శతాబ్దపు మతోద్ధారణ కంటే నాటకీయమైన రీతిలో పునాదులను వణికిస్తోంది గనుక ఫలితాలు తీవ్రమైనవిగా ఉండబోతున్నాయి” అని ఒక పండితుడు అభిప్రాయపడుతున్నాడు. “మతోద్ధారణ తర్వాత క్రైస్తవ్యంలో వచ్చిన అత్యంత నాటకీయమైన మార్పుల మధ్య మనం ఉన్నాము. క్రైస్తవ్యం ముందుకు సాగిపోతూ, సార్వత్రిక క్రైస్తవ ఉద్యమపు ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న విస్తృతమైన మార్పును సృష్టిస్తోందని” మరొక రచయిత వివరిస్తున్నాడు.

ఇతరులు చాలా మితంగా ఈ ఆధునిక క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాన్ని 'న్యూ గ్రేట్‌ అవేకనింగ్‌'' అని పేర్కొంటున్నారు. "కొంతమంది చరిత్రకారులు 1906-09ల మధ్య సంభవించిన అజుసా స్ట్రీట్ రివైవల్‌ “నాలుగవ గ్రేట్‌ అవేకనింగ్‌” అని పిలుస్తున్నట్టు” విన్సన్‌ సైనన్‌ వివరిస్తున్నాడు. ఈ చారిత్రాత్మక ఉజ్జీవం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పది లక్షల కంటే ఎక్కువ పెంతెకోస్తు సంఘాలు ఉనికిలోకి వచ్చాయి. పెంతెకోస్తు ఉద్యమం నుంచే 'క్యారిస్‌మాటిక్‌ రెన్యువల్‌ ఉద్యమం' ఉద్భవించింది. ఇది 1960లో ప్రారంభమై ప్రపంచమంతటిలో ఉన్న ప్రధాన ప్రొటస్టెంటు, కేథలిక్‌ సంఘాలలో "హోలిస్పిరిట్‌ రెన్యువల్‌ గురించిన బోధను విస్తరింపచేసింది.” తమ ఉద్యమానికీ, 18వ శతాబ్దపు 'గ్రేట్‌ అవేకనింగ్‌' కీ మధ్య సంబంధం ఉందని ఈ క్యారిస్‌మాటిక్‌ సంఘం వారు చెప్పుకోవడం సహజం. 1730 ఆఖరిలో 1740 తొలినాళ్లలో ప్రముఖ ప్రసంగీకులూ, వేదాంత పండితులూ అయిన జార్జి విట్‌ఫీల్డ్‌, జోనాతన్‌ ఎడ్వర్ట్‌ మొదలైన వారి నాయకత్వంలో వచ్చిన 'న్యూ ఇంగ్లాండ్‌ రివైవల్' పొందిన ప్రజాదరణయే వారు ఇలా చెప్పడానికి కారణం.

18వ శతాబ్దపు ఉజ్జీవ సభల్లో కొన్నిసార్లు సంభవించిన ఉద్రేకపూరిత అల్లర్లతో దీనికి కొన్ని పోలికలున్నాయి. 'గ్రేట్‌ అవేకనింగ్‌' ఉద్యమ సమయంలో “ప్రజలు తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపంతో దుఃఖించారు, పాప క్షమాపణ పొందిన కారణాన్ని బట్టి కొందరు ఆనందంతో కేకలు వేసారు, కొంతమంది భయంతో మూర్చపోయారు". కొన్ని సందర్భాల్లో, ఈ అల్లర్లు మరింత విషమించాయి. “కొలోనియల్‌ అమెరికాలో సంభవించిన గ్రేట్‌ అవేకనింగ్‌ సమయంలో, ప్రజలు కొన్నిసార్లు వాతం వచ్చినట్లు వణికిపోయారు, జంతువుల్లా కీచు ధ్వనులతో అరిచారు, మైకం కమ్మిన స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ రకమైన ఆత్మీయ పోరాటానికీ విమోచనకూ సంబంధించిన, భౌతిక
సూచనలను ఆవిష్కరించింది పెంతెకోస్తువారు కాదు. ఈ భౌతిక సూచనలు ఉజ్జీవ చరిత్రలో భాగమే” అని డగ్లస్‌ జాకబ్‌సన్‌ వివరిస్తున్నాడు.

ఆ ఉజ్జీవంలో కనిపించిన భావోద్వేగాలను బట్టి న్యూ ఇంగ్లాడు ప్యూరిటన్లు పలువురు సందేహాన్ని వెలిబుచ్చారు. వీరిలో బోస్టన్‌ పాస్టరైన ఛార్లెస్‌ ఛాన్సీ ఒకరు. “మానసిక స్వభావంలో కలిగిన మార్పు కంటే, భావోద్వేగాల్లో వచ్చిన కలవరాన్నే మతం ఎక్కువ నమ్ముతోందని” అతడు ఫిర్యాదు చేశాడు. 1742 లో ఈ ఉజ్జీవం నిజమైన ఆత్మీయతను, అదుపులేని సంచలనాలతో మార్పుచేసిందని ఆరోపిస్తూ, గ్రేట్‌ అవేకనింగ్‌ని అతడు "ఎంతూసియాజమ్‌ డిస్కైబడ్‌ అండ్‌ కాషన్ట్‌ ఎగ్‌నెస్ట్‌” అనే తన ప్రసంగంలో ఖండించాడు. ఉజ్జీవ సభల్లో జరిగిన మితిమీరిన మత కార్యాలను ఖండిస్తూ, అవే అంశాలను “సీజన్డ్‌ థాట్స్‌ అన్‌ ద స్టేట్‌ ఆఫ్‌ రెలిజియన్‌ ఇన్‌ న్యూ ఇంగ్లాండ్‌” అనే తన తరువాత పుస్తకంలో రాశాడు.

ఛార్లెస్‌ ఛాన్సీ, తదితర ప్యూరిటన్లు లేవనెత్తిన ప్రశ్నలను ఎరిగియున్నాడు “గ్రేట్‌ అవేకనింగ్‌”ను అతిగా బలపరిచిన జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌. 1741 జూలైలో ఎడ్వర్డ్స్‌ “సిన్సర్స్‌ ఇన్‌ ద హ్యాండ్స్‌ ఆఫ్‌ యాన్‌ యాంగ్రీ గాడ్‌ ” (ఉగ్రుడైన దేవుని చేతిలో పాపులు) అనే తన ప్రముఖ ప్రసంగాన్ని చేసినప్పుడు, ప్రజల స్పందన చాలా తీవ్రమైనదిగా ఉండడం వల్ల చివరికి తన ప్రసంగాన్ని ముగించలేకపోయాడు. “రక్షింపబడడానికి నేనేమి చేయాలి? అయ్యో, నేను నరకానికి వెళ్ళిపోతున్నాను. అయ్యో క్రీస్తు కోసం నేనేమి చేయాలి? అనే అరుపులతో, మూలుగులతో, ఏడ్పులతో శ్రోతలు ఉద్వేగానికి గురవడం వలన గలిబిలి చాలా అధికమైంది” అని జార్జ్‌ మార్స్‌ వెల్లడించాడు.

రెండు రోజులకు ముండే, కొనెక్టికట్‌ అనే రాష్ట్రంలో సఫీల్డ్‌ అనే ప్రదేశంలో ఒక కమ్యూనియన్‌ సభలో ఎడ్వర్ట్స్‌ ప్రసంగించాడు. దీనికి వచ్చిన స్పందన సైతం అంతే భావోద్వేగపూరితమైందిగా ఉంది. “తమ ఆత్మల స్థితిని గురించి ప్రజలు స్త్రీ పురిటి నొప్పులు పడుతున్నప్పుడు వేసే కేకలు మాదిరిగా కూతలు, అరుపులు, మూలుగులు పెడుతుంటే ఒక పావు మైలు దూరం నుంచి నేను విన్నానని ప్రసంగం తర్వాత అక్కడికొచ్చిన ఒక వ్యక్తి చెప్పాడు. కొద్దిమంది మూర్చపోయారు, కొంతమంది ధ్యానంలో మునిగి పోయారు. మరి కొంతమంది శరీరం అసాధారణ రీతిలో వణికిపోయింది. “కలవరపడిన అనేకులతో ఎడ్వర్డ్స్‌ తదితరులు ప్రార్ధించారు. కొంతమందిలో సంతోష సమాధానాలను కలిగించారు. కొంతమందిని పరమానందభరితుల్ని చేసారు, అందరూ ప్రభువైన యేసు క్రీస్తును ఘనపరుస్తూ ఇతరులను విమోచకుని చెంతకు రమ్మని బ్రతిమలాడారు”

“గ్రేట్‌ అవేకనింగ్‌”ను, దాని విమర్శకుల నుంచి సమర్థిస్తూ, ఈ రకమైన భావోద్వేగాలతో కూడిన అల్లర్ల గురించి వారికున్న సందేహాలకు సమాధానం చెప్పవలసిన అవసరముందని ఎడ్వర్డ్స్‌ గుర్తించాడు. 1741వ సంవత్సరం వేసవికాలపు చివర్లో తను చదువుకున్న యాలే కాలేజ్‌లో తాను ప్రసంగించిన తొలి వర్తమానంలోనే నేరుగా ఈ అంశాన్ని అతడు ప్రస్తావించాడు. తరువాత ప్రచురించబడిన, “ద డిస్టింగ్‌ విషింగ్‌ మార్క్స్ ఆఫ్‌ ఎ వర్క్ ఆఫ్‌ ద స్పిరిట్‌ ఆఫ్‌ గాడ్‌” (ఆత్మ దేవుని కార్యంలో ఉండే ప్రత్యేక సూచనలు) అనే తన వర్తమానంలో ఒక ఉజ్జీవపు యధార్ధత ఉద్వేగపూరిత స్పందనలను బట్టి నిర్ధారించలేమని ఎడ్వర్డ్స్‌ వివరించాడు.

“కన్నీళ్లు, భయం, మూలుగులు, పెద్ద పెద్ద అరుపులు, శరీర వేదనలు, శరీరంలో శక్తి హీనత” మొదలైన తీవ్రమైన భౌతిక సూచనలు ఏ విధంగానూ ఒక ఉజ్జీవవు నిజతత్వాన్ని నిరూపించలేవని ఎడ్వర్డ్‌ తనదైన శైలిలో ఎంతో స్పష్టంగా వాదించాడు. పరిశుద్ధాత్ముని అసాధారణ వరాలకు ప్రత్యేక సమయం ఆసన్నమైందని అతడు నమ్మలేదు, కనుక వింతగొలిపే సూచనలే పరిశుధ్ధాత్మ అసలైన కుమ్మరింపుకు ఉత్తమ ఆధారాలనే విషయాన్ని అతడు తృణీకరించాడు (తన రోజుల్లో కొంతమంది తీవ్ర ప్రభావాలు కలిగిన వారికి, తరువాత పెంతెకోస్తు వారికి వ్యతిరేకమైనది ఈ ఆలోచన). అదే సమయంలో భయాన్ని కలిగించే భావోద్వేగపూరిత అల్లర్లు పరిశుధ్ధాత్మ సన్నిధికి వ్యతిరేకమేమీ కాదని సైతం అతడు నొక్కి చెప్పాడు. ఆత్మ దేవుని నిజ కార్యానికిగల నూచనలలో అటువంటి నాటకీయమైన ఫలితాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అయితే ఈ సూచనలు నువార్త ఆజ్ఞాపించిన ప్రకారం జీవిస్తున్న వారి మార్పు నొందిన జీవితాల్లో కనిపించి, నిజక్రైస్తవ్యపు లక్షణాలనూ, మనోభావాలనూ బయలు పరిచాయి.

యోహాను మొదటి పత్రికలో ఆ ప్రత్యేకమైన సూచనలను కనుగొని, వాక్యంలోని ప్రధాన లక్షణాల ఆధారంగానే పరిశుద్ధాత్మ నిజ కార్యాన్ని నిర్ధారించవచ్చని ఎడ్వర్డ్స్‌ వాదించాడు. ఉద్రేకపూరిత అనుభవాలు శక్తివంతమైనవి కావచ్చు, అయితే దేవుడు నిజంగా పనిచేస్తున్నాడా లేదా అనే దానికి అవి ఆధారాలు కావు. నిజానికి సువార్తికులు తప్పు సిద్ధాంతం ప్రకటించినప్పుడు కూడా ఉత్సాహం తరచూ విస్తరించిందనీ, కనుక సాతాను సైతం నిజమైన మేల్కొల్పులు వచ్చినట్టు నమ్మించగలడనీ ఎడ్వర్డ్స్‌ గుర్తించాడు.

పరిశుద్ధాత్మ కార్యానికి గల నిజమైన సూచనలను ఎడ్వర్డ్స్‌ చెప్పినప్పుడు, వేషధారులు కల్పించే “వ్యతిరేక సూచనల" గురించి సైతం అతడు వివరించాడు. ఉద్వేగపూరితమైన అరుపులనూ, భౌతిక స్పందనలనూ ఏ విధమైన స్పష్టతా ఇవ్వలేని జాబితాలో ఎడ్వర్డ్స్‌ చేర్చాడు. ఒక ఉజ్జీవపు నిజతత్వాన్ని ఆ సూచనలు నిరూపించవని అతడు అభిప్రాయపడ్డాడు.

అయితే ఉజ్జీవం అనేది సత్యమైనదో, అసత్యమైనదో ఎలా తెలుసుకోగలం? మరింత స్పష్టంగా అడగాలంటే పరిశుద్ధాత్మ యొక్క నిజకార్యాన్నీ నకిలీనీ వేరు చేసేదేమిటి? “ఆత్మలను పరీక్షించడం” ద్వారా మాత్రమే వాటిని కనిపెట్టగలమని ఎడ్వర్డ్స్‌ వాదించాడు. 1యోహాను 4:1 నుంచి ఈ ప్యూరిటన్‌ వేదాంత పండితుడు 5 నియమాలను సేకరించి తద్వారా దేవుని కార్యమని చెప్పబడే ప్రతి విధమైన దానికి అన్వయించగలిగే ఒక స్పష్టమైన వాక్య నమూనాను సిద్ధం చేసాడు.

ఆ విధంగా తన రోజుల్లోని అనుభవాలను లేఖనమనే బూతద్దంలో పరీక్షించి, ఆ సమయంలోనే అత్యంత పెద్దదైన మత వివాదంపై వాక్య నియమాలు ప్రభావితమయ్యేలా ఎడ్వర్డ్స్‌ చేసాడు. ఆ కారణాన్నిబట్టి, అతని పద్ధతి మనకు ఆలోచించడానికి ఉపయోగకరమైన మాదిరినిస్తుంది.

చరిత్ర చిత్రపటంపై ఉజ్జీవ సూచనలు కనిపించినప్పుడు కలిగే ప్రశ్నల్లో మొదటిది దాని యథార్థత గురించినదై ఉంటుంది. ఆ ఉజ్జీవం నిజమైందా? లేదా లోతులేని భావోద్వేగాల వల్ల కలిగిందా? నిస్సారమైన దానిచే బలపరచబడిన వ్యర్ధమైన ఉత్సాహాన్ని మనం చూస్తున్నామా లేదా ఆ ఉత్సాహమే దేవుని మహాకార్యాన్ని నూచిస్తోందా? సంఘ చరిత్రలో నమోదైన ప్రతి ఉజ్జీవంలో, కలిగిన సూచనలు మిశ్రితంగా ఉన్నాయి. బంగారం అన్ని నమయాల్లో మస్టుతో కలిసి ఉంటుంది. అదే విధంగా ప్రతి ఉజ్జీవంలో నకిలీలు కూడా ఉన్నాయి. ఈ రకమైన వక్రీకరణలే నిజమైన ఉజ్జీవానిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఈ సమస్య 18వ శతాబ్దంలో వచ్చిన "గ్రేట్‌ అవేకనింగ్‌” అనే ఉజ్జీవానికి ప్రధాన కారణమైన జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ విషయంలో కూడా కనిపించింది. ఆ ఉజ్జీవంలోని సారాన్నీ అదే విధంగా దుష్టప్రవర్తనలనూ గమనించి తన డిస్ట్రింగ్‌ విషింగ్‌ మార్క్స్ లో ఒక ఖచ్చితమైన విశ్లేషణ అతడు చేసాడు. అయితే ఆ అంశం గురించి ప్యూరిటన్‌ మహాశయుని అధ్యయనం కేవలం ఆ గ్రేట్‌ అవేకనింగ్‌కు మాత్రమే కాక ప్రస్తుత కాలానికి సహితం వర్తించే భావాలను కలిగి ఉంది. అది అన్ని కాలాల్లో జరిగే ఉజ్జీవాన్ని అనుసరించడానికి ఒక దిశా నిర్దేశకాన్ని అందిస్తోంది అని ఆర్‌.సి. స్ప్రౌల్, ఆర్చీ పర్రిష్‌లు వివరిస్తున్నారు.

జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ రోజుల్లోని అమెరికా దేశ క్రైస్తవులు “ద గ్రేట్‌ అవేకనింగ్‌” పరిశుద్ధాత్ముని నిజమైన కార్యమేనా అని నిర్ధారించుకునే ప్రయత్నం చేసారు. అటువంటి పరీక్ష చేయడానికి ఎడ్వర్డ్స్‌ లేఖనాలను పరిశోధిస్తూ స్పందించాడు. అతడు తన ఆశయాన్ని ఈ విధంగా తెలియచేసాడు. “అపొస్తలుల కాలంలో, ఇంతకు ముందెన్నడూ లేనంత గొప్పగా దేవుని ఆత్మ కుమ్మరింపు జరిగింది. కానీ సత్యమైన పరిశుద్ధాత్మ కార్యాలు వర్ధిల్లిన కొలదీ, మోసపూరిత కార్యాలు కూడా వర్ధిల్లాయి. పరిశుద్ధాత్మ దేవుని సాధారణ, అసాధారణ క్రియల్ని సైతం అపవాది యధేచ్చగా అనుకరించగలుగుతున్నాడు. అసత్యం నుంచి సత్యాన్ని నిర్ధారించి సురక్షితంగా ముందుకు సాగిపోవడానికి క్రీస్తు సంఘానికి ప్రత్యేకమైన, స్పష్టమైన నియమాలను సమకూర్చవలసిన అత్యవసరత ఏర్పడింది. ఆ నియమాలను ఇవ్వాలనే ఉద్దేశంతోనే 1యోహాను 4వ అధ్యాయం రాయబడింది. బైబిల్‌లో ఎక్కడా లేనంత స్పష్టంగా, సంపూర్ణంగా ఈ అధ్యాయంలో ఈ అంశానికి వివరణ ఉంది. పరిశుద్ధాత్మ కార్యం గురించి అతి ఎక్కువగా మాట్లాడుతున్న ఈ అసాధారణ రోజుల్లో ఈ నియమాలను మనం జాగ్రత్తగా అన్వయించుకోవాలి".

నేడు అనేకులైన విశ్వాసులు ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం సూచించేది పరిశుద్ధాత్ముని నిజ కార్యాన్నేనా అని ఆశ్చర్యపోతున్నారు (మత్తయి 7:15-20). దానిని నిర్ధారించడానికి జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ దేవుని వాక్యం దగ్గరకు వెళ్లాడు. ఆత్మావేశం చేత రాయబడిన లేఖనాలు నిత్యమైనవి కనుక, ఈ ఆధునిక క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాన్ని పరీక్షించడానికి అవే వాక్య సత్యాలను మనం కూడా ఉపయోగించవచ్చు. ఆధునిక క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం పరిశుద్ధాత్ముని నిజకార్యాన్ని సూచిస్తోందా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి దేవుని వాక్య నియమాల సహాయాన్ని అనుమతిస్తూ 1యోహాను 4 అధ్యాయం నుంచి ఎడ్వర్డ్స్‌ గ్రహించిన ఐదింతల పరీక్షను రానున్న అధ్యాయాల్లో ఆలోచిద్దాం.

                                     3. ఆత్మలను పరీక్షించుట - మొదటి భాగం

అబద్ధ బోధకుల గురించిన భయంకరమైన హెచ్చరికలతోనూ, ఆత్మీయ వివేచనను ప్రతి విశ్వాసి సాధన చేయవలసిన అవసరం ఉందని తెలియచేసే వచనాలతోనూ కొత్త నిబంధన నిండి ఉంది. “అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొట్టెల చర్మములు వేసికొని మీ యొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లని" (మత్తయి 7:15) కొండ మీద ప్రసంగంలో మన ప్రభువు తన శ్రోతలందరిని హెచ్చరించారు. ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ, అపొస్తలుడైన పౌలు ఆ మాటలనే ప్రతిధ్వనించాడు. “నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును, వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు” (అపో. కా. 20:29-30) అదే విధంగా “నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యంగా తీసుకొచ్చి, సంఘంలోకి తప్పు బోధను ప్రవేశపెట్టే తప్పు బోధకులను గూర్చి జాగ్రత్తపడుడని” తన పాఠకులతో పేతురు చెప్పాడు (2పేతురు 2:1).

ప్రారంభం నుంచే సంఘ ఆరోగ్యానికీ, ఐక్యతకూ తప్పు బోధకులు తీవ్రమైన ముప్పును కలుగచేసారు. ఆది సంఘం చాలా స్వచ్చమైనదనీ, చెడిపోనిదనీ మనమనుకుంటాం. కానీ పసితనంలోనే సంఘాన్ని తప్పుడు బోధ పీడించింది. తప్పుడు సిద్ధాంతాన్ని గురించిన హెచ్చరిక అపొస్తలుల బోధలో ఒక స్థిరమైన అంశం. ఏ ఆత్మీయ సందేశాన్నైనా, దేవుని పక్షంగా మాట్లాడుతున్నానని చెప్పే స్వయం నియమిత దూతనైనా పరీక్షించడంలో ప్రత్యేక జాగ్రత్త వహించమని యేసే స్వయంగా విశ్వాసులకు బోధించారు. అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ, మత్తయి 7:16 లో యేసు “వారి ఫలాలను బట్టి మీరు వారిని తెలిసికొందురని” జనసమూహానికి చెప్పారు. ధనాపేక్ష, కామాతురత, అహంకారం, వేషధారణ, తప్పుడు సిద్ధాంతం అనేవాటిని ఆ ఫలాలుగా పేతురు 2వ పత్రిక, యూదా పత్రిక వర్ణిస్తున్నాయి.

ప్రవచనాత్మక సందేశాలుగా చెప్పబడుతున్న వాటిని పరీక్షించే సందర్భంలో, “సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడని” (1 థెస్స 5:21,22) పౌలు థెస్సలోనికయులకు ఆజ్ఞాపించాడు. కొత్త సిద్ధాంతాలు, డంబంగా తమ్ముతామే హెచ్చించుకోవడం, దేవుని దగ్గర నుంచి తాజా దర్శనం వచ్చిందనే వ్యాఖ్యలు తప్పుడు బోధకునికి గల ప్రత్యేక సూచనలు (ఇవన్నీ క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో చాలా సాధారణంగా కనిపించే లక్షణాలు). దేవుని దగ్గర నుంచి ఒక కొత్త బోధ వచ్చిందనే మాట ప్రతి తప్పుడు బోధకుని విజయానికి అత్యవసరం. అదే విధంగా అబద్ధాలను గుర్తించడం విశ్వాసులు సైతం వాక్యానుసారమైన వివేచనను సాధన చేయడం అత్యవసరం. ఈ విషయంలో క్రైస్తవులు విఫలమైతే, వారు “పసిపిల్లల మాదిరిగా ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయాక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడిన వారైనట్లు” అపరిపక్వతను ప్రదర్శిస్తున్నారు (ఎఫెసీ 4:14).

యేసు కొండ మీద చేసిన ప్రసంగానికి అర్థ శతాబ్దం తరువాత, పౌలు తన పత్రికలు రాసిన కొన్ని దశాబ్దాల తర్వాత అపొస్తలుడైన యోహాను తన మొదటి పత్రికను రాశాడు. అయితే పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. తప్పుడు బోధకులు సంఘంపై తీవ్రంగా దాడి చేస్తూనే ఉన్నారు. కనుక అబద్ధ ప్రవక్తల మోసపూరితమైన, నాశనకరమైన సిద్ధాంతాల విషయంలో తన పాఠకులను జాగ్రత్త వహించమని హెచ్చరిస్తూనే వారిని సత్యాన్ని ఎరగమనీ, దానిని ప్రేమించమని యోహాను ప్రోత్సహించాడు.

విశ్వాసుల్ని పరిశుద్ధాత్మ నిజ కార్యానికీ, అబద్ధ ప్రవక్తల నకిలీ పరిచర్యలకూ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడంలో నిపుణుల్ని చేయడానికి విశ్వాసులకు 1యోహాను 4:1-8 లో అపొస్తలుడు ఒక ప్రణాళిక రూపొందించాడు. ఈ వచనాలు మొదటి శతాబ్దంలో రాయబడినప్పటికీ, వాటిలోని నియమాలు నిత్యమైనవి. ఎన్నో రకాల అబద్ధాలను సత్యంతో మిళితంచేసి, దానిని దేవుని వాక్యంగా ప్రకటించడానికి సంతోషపడుతున్న అనేక నామకార్థ క్రైస్తవ నాయకులూ, మత ప్రచార మాధ్యమాలూ ఉన్న సమయంలో అవి మరింత అవసరం.

1యోహాను 4వ అధ్యాయం ఈ మాటలతో ప్రారంభమవుతుంది. “ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళియున్నారు గనుక ప్రతి ఆత్మను సమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి” (1యోహాను 4:1), “పరీక్షించుడి” అనే గ్రీకు పదం, ప్రాచీన కాలంలో లోహాల్ని అధ్యయనం చేసే ప్రక్రియలో ముడి ఖనిజపు స్వచ్చతనూ, విలువనూ నిర్ధారించే సందర్భంలో ఉపయోగించేవారు. విలువైన లోహాలు మూసలోనూ, కొలిమిలోనూ పరీక్షించబడేవి (సామెతలు 17:3) ఈ లోహాలు తీవ్రమైన ఉష్ణోగ్రతకు గురైనప్పుడు మిశ్రమమైన మస్టును కోల్పోతాయి. అదే విధంగా నిజంగా విలువైనదానికీ, నకిలికీ మధ్య తేడాను వివేచించడానికి పరిచారకులనూ, వారి సందేశాలనూ, ప్రతి బోధకు ఆధారమైన నియమాలనూ పరీక్షిస్తూ విశ్వాసులు నిరంతరం “ఆత్మలను పరీక్షించాలి.”

“ఆత్మలను పరీక్షించుడి” అనే ఆజ్ఞ తర్వాత ఒక బోధ నిజ స్వభావాన్ని అంచనా వేయడానికి యోహాను అయిదంతల వివరణ ఇచ్చాడు. అపొస్తలుడైన యోహాను మరణించి 1600 కంటే ఎక్కువ సంవత్సరాలు గడిచిన తర్వాత, జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ ఈ వాక్య భాగాన్ని అధ్యయనం చేసి, దానిలోని నియమాలను “గ్రేట్‌ అవేకనింగ్‌కు” అన్వయించాడు. అమెరికా ఉజ్జీవానికి వచ్చిన ప్రజాదరణ వల్లనో, లేదా అది కలిగించిన ఉద్వేగపూరిత ఉత్సాహం వల్లనో అతడు దాన్ని సమర్థించలేదు. కానీ తన రోజుల్లో సంభవించిన సూచనలను సరిగ్గా నిర్ధారించడానికి అతడు లేఖన పరీక్షనే ఉపయోగించాడు. ఎడ్వర్డ్స్‌ మాదిరిగానే, ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమ ప్రకటనలనూ, ఆత్మీయ అనుభవాలనూ నిర్ధారించడానికి విశ్వాసులకు నేటికీ ఒకే ఒక ఖచ్చితమైన ప్రమాణం ఉంది. లేఖన పరిశోధనకు నిలబడిన దానిని హత్తుకోవాలి. నిలబడని దానిని గద్దించి, తృణీకరించాలి. ఇది ప్రతీ కాపరికీ, బోధకునికీ విధి, ప్రతి నిజ విశ్వాసికీ ఉన్న బాధ్యత.

1యోహాను 4:2-8 లో ఉన్న ఈ పరీక్షలను 1) పరిశుద్ధాత్మ కార్యంగా చెప్పబడుతున్నది నిజక్రీస్తుని ఘనపరుస్తోందా? 2) అది పాపాన్ని వ్యతిరేకిస్తోందా? 8) అది ప్రజల గమనాన్ని లేఖనాలవైపు మళ్ళిస్తోందా? 4) అది సత్యాన్ని ఘనపరుస్తోందా? 5) అది దేవుని యెడల, ఇతరుల యెడల ప్రేమ కలుగచేస్తోందా? అనే అయిదు ప్రశ్నల రూపంలో రూపొందించవచ్చు. “గ్రేట్‌ అవేకనింగ్‌" కు జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ అన్వయించిన పరీక్షలివే. ఈ నియమాల వెలుగులో ఆధునిక క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాన్ని ఈ రెండు అధ్యాయాల్లో మనం పరీక్షిద్దాం.

మొదటి పరీక్ష పరిశుద్ధాత్మ మూలంగా కలిగిందని చెప్పబడుతున్న ఆ కార్యం నిజక్రీస్తుని ఘనపరుస్తోందా?

యోహాను మొదటి పత్రికను జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ అధ్యయనం చేసినప్పుడు, 1యోహాను 4:2-3 లలో ఉన్న ప్రాథమిక సత్యాన్ని అతడు గుర్తించాడు. పరిశుద్ధాత్మ నిజకార్యం నిజక్రీస్తుని ఘనపరుస్తుందనేదే ఆ సత్యం. అబద్ధ ప్రవక్తలకు భిన్నంగా, నిజంగా పరిశుద్ధాత్మ బలపరచిన వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తు వ్యక్తిత్వ కార్యాలకు ప్రథమ స్థానాన్ని ఇస్తారు. కనుక పరిశుద్ధాత్మ నిజకార్యం రక్షకునిపై ప్రకాశమానమైన వెలుగును ప్రసరింపచేసి ఆయనను ఖచ్చితంగా, ఘనమైన, శ్రేష్టమైన రీతిలో చూపిస్తుంది. అయితే తప్పు బోధకులు ఆయన గురించిన సత్యాన్ని తక్కువచేసి, వక్రీకరిస్తారు.

యేసు భౌతిక మానవ దేహాన్ని కలిగి ఉన్నాడనే వాస్తవాన్ని తృణీకరించి, క్రీస్తు శరీరధారి అయ్యాడనే వాక్య సిద్ధాంతంపై యోహాను రోజుల్లో ఒక ప్రముఖ తప్పుడు బోధ దాడిచేసింది. దీనినే "డోసెటిజమ్‌" అంటారు. ఆ తప్పుడు బోధ ప్రభువు దేహం కేవలం ఒక భ్రమ అని బోధించింది (డోసెటో అనే మాటకు గ్రీకులో “కనిపించడం” అని అర్థం) ప్రస్తుత కాలంలో జీవిస్తున్న వారికి ఇది చాలా వింతగా అనిపించవచ్చు. కానీ పదార్థ సంబంధమైన లోకం దుష్ట స్వభావం కలిగిందనీ, కేవలం ఆత్మీయ వాస్తవాలే మంచివని బోధించే గ్రీకు తత్త్వశాస్త్రం బహుగా వాడుకలో ఉన్న సమయంలో ఈ బోధ వర్ధిల్లింది. కనుక "డోసెటిజమ్‌" అనే బోధ ప్రకారం యేసు ఒక వాస్తవ దేహాన్ని కలిగియుండే అవకాశం లేదు. ఒకవేళ ఆ దేహం వాస్తవమైనదైతే, ఆయన దుష్టత్వంచే కళంకితుడవుతాడు.

“డోసెటిజమ్‌” యొక్క బోధలు గ్రీకు ద్వైత సిద్ధాంతానికి సంపూర్ణ అవకాశమిచ్చాయి. కానీ అవి క్రీస్తును గురించిన, ఆయన సువార్తను గురించిన వాక్య సత్యానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఈ డోసెటిజమ్‌ అనే బోధ వలన కలిగే ప్రమాదాన్ని గుర్తించి, అపొస్తలుడైన యోహాను "సాతాను యొక్క వంచన" అని దాన్ని బట్టబయలు చేసాడు. “యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనదికాదు. దేవుని ఆత్మను మీరెరుగుదురు” (1యోహాను 4:2-3) అని అతడు రాశాడు. ఆపొస్తలుని అభిప్రాయం లోపరహితమైనది: (డోసెటిజమ్‌ బోధించినట్లు) ఎవరైనా యేసు గురించి అసత్యాన్ని బోధిస్తే ఆ వ్యక్తి తనను తాను అబద్ధ బోధకునిగా కనబరచుకుంటున్నాడు. కనుక, అతని పరిచర్య దేవుని మూలంగా వచ్చింది కాదు.

ఈ వాక్యభాగం నుంచి, జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ ఒక స్పస్టమైన నియమాన్ని ప్రతిపాదించాడు. ఆ నియమం ప్రకారం పరిశుద్ధాత్మ నిజకార్యం అన్నివేళలా, తప్పనిసరిగా ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సత్యాన్ని చూపిస్తుంది.

“కన్యకకు జన్మించి, యెరూషలేము గవిని వెలుపల సిలువ వేయబడిన యేసును హెచ్చించి, ఆయనను దేవుని కుమారునిగా, మనుషుల రక్షకునిగా మనకు ప్రకటిస్తున్న సువార్త సత్యంలో ప్రజల మనస్సును స్థిరపరచి, స్థాపిస్తూ వారి మధ్య పనిచేస్తున్న ఆత్మయే పరిశుద్ధాత్మ?" అని ఆ వచనాల గురించి వ్యాఖ్యానిస్తూ ఎడ్వర్డ్స్‌ రాశాడు. దానికి భిన్నంగా, క్రీస్తు నుంచి ప్రజల దృష్టిని మళ్ళించి, ఆయన స్వభావాన్నీ సువార్తను గురించిన సత్యాన్ని వక్రీకరిస్తూ, ఆయన మహిమను తగ్గించే ప్రయత్నం చేస్తున్న పరిచర్యలు ఖచ్చితంగా పరిశుద్ధాత్మచేత బలపరచబడినవి కావు.

“ఏ వ్యక్తికైతే ఆత్మ సాక్ష్యామిస్తున్నాడో ఎవరి యెడలైతే గౌరవ మర్యాదల్ని పెంచుతున్నాడో అతడు మర్మయుక్తమైన క్రీస్తు కాకూడదు కానీ శరీరధారిగా వచ్చిన యేసై ఉండాలి. క్వేకర్‌ అనే శాఖను అనుసరించే వారిలో “ఉన్నట్లు” చెప్పబడుతున్న దైవాత్మ శరీరధారిగా వచ్చిన యేను ఘనతను తగ్గిస్తుంది, ఆయనపై ఆధారపడకుండా చేస్తుంది, అంతేకాదు వారిని ఆయనకు దూరంగా నడిపిస్తుంది. వాక్యంలో ప్రత్యక్షపరచబడిన యేసుకు సాక్ష్యామిస్తున్న పరిశుద్ధాత్మయైతే ప్రజలను ఆయన దగ్గర నడిపిస్తున్నాడు. లోక రక్షకుడైన క్రీస్తు వ్యక్తిత్వమంటే సాతానుకు తీరని పగ ఆయన విమోచన కార్యాన్ని వాడు అతిగా ద్వేషిస్తాడు. మనుషులు ఆయనకు భయపడుతూ, ఆయన ఉవదేశాలకూ, ఆజ్ఞలకూ అధిక ప్రాధాన్యత ఇచ్చే బుద్ధిని ఆయన గురించిన ఉన్నతమైన అల్రోచనలనూ వారికి ఎన్నడూ వాడు రానీయడని” ఎడ్వర్డ్స్‌ వివరించాడు.

సాతాను ప్రభువైన యేసు గురించిన సత్యాన్ని వక్రీకరించి, అడ్డగించడానికి ప్రయత్నిస్తుంటాడు. సాతానుగాడు సాధ్యమైనంత మేరకు, ప్రజల గమనాన్ని రక్షకుని వైపు నుంచి తొలగించే ప్రయత్నం చేయాలనుకుంటాడు. పరిశుద్ధాత్మ యొక్క నిజకార్యం దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది. ఇది ప్రజలకు వాక్యానుసారమైన క్రీస్తును చూపించి, ఆయన సువార్త సత్యాన్ని ధృవీకరిస్తుంది.

                            పరిశుద్ధాత్మ నిజకార్యం ప్రజలకు క్రీస్తును చూపిస్తుంది

ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తును చూపించడమే పరిశుద్ధాత్మకున్న దివ్యమైన ఆధిక్యత. “ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటిని మీకు జ్ఞాపకము చేయును” (యోహాను 14:26), “ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచునని” యేసుప్రభువు తన శిష్యులకు చెప్పారు (యోహాను 16:14) పరిశుద్ధాత్మ పరిచర్య ఎల్లప్పుడూ రక్షకునిపైనే కేంద్రితమై ఉంటుంది. ఆయన బలపరిచే ఏ పరిచర్యయైనా, ఉద్యమమైనా అదే ఆశయాన్నీ స్పష్టతనూ కలిగి ఉంటాయి.

అయితే క్యారిస్‌మాటిక్‌ ఉద్యమమెప్పుడూ క్రీస్తు వ్యక్తిత్వ కార్యాలపై దృష్టి సారించలేదు. దాని దృష్టంతా ఆశీర్వాదాలపైనా పరిశుద్ధాత్మ వరాలపైనే నిలిపింది. “పెంతెకోస్తు సమాజంలో పరిశుద్ధాత్మ సన్నిధినీ, శక్తినీ అనుభవించాలనే వారి తపనయే సామాన్యాంశంగా ఉంది.” “త్రిత్వంలో మూడవ వ్యక్తియైన పరిశుద్ధాత్ముని పై ప్రాధాన్యతయే క్యారిస్‌మాటిక్‌ శతాబ్దాన్ని నిర్వచించేదని” క్యారిస్‌మాటిక్‌ రచయితలైన జాక్‌ హే ఫోర్డ్‌ డేవిడ్‌మూర్‌లు రూఢిగా చెబుతున్నారు. తప్పుడు ప్రాధాన్యతపై దృష్టిపెట్టి దానిని బట్టి వారు వేడుక చేసుకోవడం విచారకరం. పరిశుద్ధాత్మను ఘనపరుస్తున్నామని వాదిస్తూనే, అందరి గమనాన్నీ ప్రభువైన యేసువైపు మళ్ళించే పరిశుద్ధాత్మ పరిచర్య ప్రధానోద్దేశాన్ని క్యారిస్‌మాటిక్స్‌ ముఖ్యంగా నిర్లక్ష్యం చేస్తున్నారు.

“తన పైన కాక యేసుక్రీస్తుపైనే మనం దృష్టి సారించాలన్నది పరిశుద్ధాత్మకున్న అభిలాష అదే పరిశుద్ధాత్మ ముఖ్యమైన పరిచర్య. ఆయన మనకు యేసును చూపిస్తున్నాడు. క్రీస్తును చాలా స్పష్టంగా మన దృష్టికి తీసుకు వస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మే మన ప్రాధాన్యతైతే, మనం ఆయన పరిచర్యను తప్పుగా అర్థం చేసుకున్నామని” స్టీవ్‌ లాసన్‌ సరిగ్గా చెప్పాడు.

కృపా వరాలపైనా, అద్భుతాల పైనా ఎక్కువగా దృష్టి పెట్టడం వలన క్యారిస్‌మాటిక్‌ సంఘాలు క్రీస్తుపై సరైన దృష్టి పెట్టలేకపోతున్నాయి. ఒక సగటు క్యారిస్‌మాటిక్‌ చెప్పేది వినండి. తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడంపైనా, తన సొంతకార్యాల పైన దృష్టిసారించడమే పరిశుద్ధాత్మ కార్యమని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. మునుపు పెంతెకోస్తు శాఖకు చెందిన కెన్నెత్ డి.జాన్స్‌ అభిప్రాయం ప్రకారం, “పలు క్యారిస్‌మాటిక్‌ సంఘాలు క్రీస్తు కేంద్రిత సంఘాలుగా కాక, ఆత్మ-కేంద్రిత సంఘాలుగా ఉన్నాయి.” జెరికో మార్చ్‌, భాషల్లో మాట్లాడడం, ఆత్మచే వధింపబడడం అనే తన స్వీయ అనుభవాలను నెమరు వేసుకుంటూ, జాన్స్‌ ఈ విధంగా వివరిస్తున్నాడు.

ప్రతి నందర్భంలోనూ ఆ కార్యాలే “పరిశుద్దాత్మ పనిచేస్తున్నాడనడానికి ఆధారంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే మార్గంగా” మాకు బోధించబడ్డాయి. ఆ అనుభవాలను పొందుతుండగా “పరిశుద్దాత్మకు లొంగిపోండి, మీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేయండి. ఆయన సన్నిధీ, అభిషేకమూ మీపైకి వస్తున్నట్లు భావించండి. కొత్తగా, స్పష్టంగా ఆయన స్వరాన్ని వినండని” మాకు ఆదేశించారు. మేము “పరిశుద్ధాత్మ" అనుభవం పొందాలని ప్రయత్నించినప్పుడు, యేసును తెరవెనుక భాగానికి నెట్టేసాము.

మేము యేసు- కేంద్రితమైన వారంగా కాకుండా పరిశుద్ధాత్మ కేంద్రితమైన వారంగా ఉండాలని ఆదేశించబడ్డాము. ఈ వక్రీకరించబడిన సందేశ ఫలితంగా, మేము ఉద్రేకవూరిత భావాలపైనా, మితిమీరిన ఆశలపైనా ఎక్కువ దృష్టి పెట్టాము. మా దుర్భర పరిస్థితులన్నింటినీ అద్భుతాల ద్వారా అధిగమించి నూతన జీవితాలను గడుపుతామన్నట్లుంది మా ఆలోచన. మేము ఆత్మ పూర్ణులమైతే అద్భుత శక్తిని పొందుకుంటామని” మాకు చెప్పారు.

దేవుని శక్తితో నింపబడి అద్భుతాలపైనా కృపా వరాలపైనా దృష్టిని నిలిపితే యేసుక్రీస్తు పై దృష్టిని కోల్పోవడం చాలా సులభమని మరొక రచయిత చెబుతున్నాడు.

ఇలాంటి సాక్ష్యాలు విన్న తర్వాత, “క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ఎటువంటి సంఘాన్ని ఏర్పరుస్తుంది?” పరిశుద్ధాత్మకు ప్రాధాన్యతనిచ్చి, క్రీస్తును ప్రక్కకు నెట్టేసే సంఘాన్నే ఇది ఏర్పరుస్తుందని చెప్పిన రోనాల్డ్‌ బాక్‌స్టర్‌ మాటలు సరైనవనిపిస్తాయి. కొందరు క్యారిస్‌మాటిక్‌ రచయితలు సైతం పరిశుద్ధాత్మను అనుభవించడం పై అత్యాసక్తిని కనపరచడం వలన తమ ఉద్యమంలో సమతుల్యత దెబ్బతిందని నిర్మొహమాటంగా చెప్పారు. “అరవై అయిదు సంవత్సరాల చరిత్ర తర్వాత (1966), చాలా మట్టుకు పెంతెకోస్తు సభ్యులు ఇంకా ఉద్వేగాలకోసం, అద్భుతాలకోసం, సూచనల కోసం పిచ్చిగా ఎదురు చూస్తున్నారు" అని పెంతెకోస్తు పితరుడైన డోనాల్డ్‌ గీ తన జీవిత చరమాంకంలో విలపించాడు. అర్థశతాబ్దం తర్వాత, ఆ వెర్రికి ఇంతకుముందెన్నడూ లేనంత స్వేచ్చ దొరికింది.

ఇదంతా క్యారిస్‌మాటిక్‌ ఉద్యమపు మూల సిద్ధాంతాన్నే ప్రశ్నార్ధకం చేసింది. పరిశుద్ధాత్ముడు తనవైపు కానీ ఏ నరునివైపు కానీ గమనాన్ని మళ్ళించక మొత్తం గమనమంతటినీ దేవుని కుమారుడూ ప్రభువు అయిన యేసుక్రీస్తువైపుకూ, దేవుడు ఆయన ద్వారా చేసిన కార్యం వైపుకూ మళ్ళిస్తుంటే, తనను తాను పరిశుద్ధాత్మ ఉద్యమంగా ప్రచారం చేసుకుంటుంది మాత్రం ఎందుకు అలా చేయట్లేదు? క్యారిస్‌మాటిక్స్‌ పరిశుద్ధాత్ముని పై దృష్టిసారించాలనుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు నిజ వ్యక్తిత్వ, కార్యాలపై దృష్టిసారించాలని ఆశిస్తున్నాడు. “నా నామమున ఆత్మ పంపిస్తాడనీ, నా బోధలు మీకు జ్ఞాపకము చేసి, నా కార్యానికి సాక్ష్యమిస్తాడు” అని మేడ గదిలో ప్రభువు తన శిష్యులతో చెప్పారు (యోహాను 14:2, 15:26) అత్మ తన సొంత అధికారంతో మాట్లాడడు, తన వైపు గమనాన్ని మళ్ళించుకోడు కానీ కుమారుణ్ణే ఆయన ఘనపరచకోరతాడు (యోహాను 16:13,14) “ఆత్మ ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు కానీ క్రీస్తును ఘనపరచడానికి వచ్చాడని” ప్రముఖ ప్యూరిటన్‌ భక్తుడు మ్యాథ్యు హెన్రీ చెప్పాడు. ఈ మధ్య కాలంలో, కెవిన్‌ డీయంగ్‌ పరిశుద్ధాత్ముని పాత్రను ఈ విధంగా వర్ణించాడు:

క్రీస్తులో ఆనందించడం పరిశుద్ధాత్మ కార్యానికి ఆధారం. సంఘవు దృష్టి పావురంపై కాదు సిలువపై ఉంది, అలాగే ఉండాలని పరిశుద్ధాత్మ కోరుతున్నాడు. జెఐ. పేకర్‌ ఈ విధంగా చెప్పాడు. "నా వైపు చూడండి, నేను చెప్పేది వినండి, నా దగ్గరకు రండి, నా గురించి తెలుసుకోండి” అనే సందేశాన్ని మనకు పరిశుద్దాత్ముడు ఎన్నడూ ఇవ్వడు. కానీ ప్రతీసారీ, "యేసును ఆయన మహిమనూ చూడండి. ఆయన చెప్పేది వినండి. ఆయనకు లోబడండి. ఆయన దగ్గరకు వెళ్ళి, జీవం పొందండి. ఆయన గురించి తెలుసుకోండి, ఆయన ఇచ్చే శాంతి, సంతోషం, సమాధానాలను ఆస్వాదించండి” అని బోధిస్తాడు.

పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తూ మనుషులు యేసును ప్రభువుగా చూసి, ఆయన అధికారాన్ని గుర్తించి, ఆయన చిత్తానికి లోబడే విధంగా చేస్తాడు (1కొరింధీ 12:3, ఫిలిప్పీ 2:9-13). అన్నిటి కంటే ముఖ్యంగా ప్రజలు క్రీస్తును ప్రభువుగా ఘనపరచి ఆయన యెడల వారు ప్రేమానురాగాలను కనబరిచే విధంగా వారిని పరిశుద్ధాత్మ నిజకార్యం నడిపిస్తుంది. మనం కుమారుణ్ణి ఘనపరచినప్పుడే, పరిశుద్ధాత్మ అధికంగా మహిమ పొందుతాడు.

ప్రభువైన యేసు వైపు మన దృష్టి మరల్చడమే కాకుండా పరిశుద్ధాత్ముడు మనలను క్రీస్తు స్వరూపంలోనికి మారుస్తాడు. “క్రీస్తుకు ఘనత, మహిమలను తీసుకురావడమే పరిశుద్దాత్ముని ప్రధాన గురి, ఆయన చేసే నిరంతర కార్యం. తండ్రి కార్యాన్ని నెరవేర్చి, ఆయన బిడ్డలను కుమారుడైన యేసు స్వరూపంలోకి మార్చడానికి పరిశుద్ధాత్మ విశ్వాసుల్లో పనిచేస్తున్నాడు. మనం మరింత క్రీస్తువలె మారడానికి పరిశుద్ధాత్మ ఏమి చేస్తాడు? 2 కొరింథీ 3:18 ప్రకారం, పరిశుద్ధాత్మ మన దృష్టిని క్రీస్తు మహిమ యొక్క సొగసు పైకి మళ్ళిస్తాడు, తద్వారా మనం ఆయన స్వరూపంలోనికి అంతకంతకూ మార్చడానికి మనల్ని నిర్బంధిస్తాడని” వేదాంత పండితుడు బ్రూస్‌వేర్‌ వివరించాడు. పరిశుద్ధాత్మశక్తి చేత, విశ్వాసులు ప్రభువైన యేసు మహిమను చూసే విధంగా నడిపించబడి, ఫలితంగా ఆయన స్వరూపంలోనికి రూపాంతరం చెందుతారు. నిజానికి క్రీస్తు నుంచి మన గమనాన్ని మళ్ళించే దేనినైనా పరిశుద్ధాత్మ కార్యంగా పరిగణించడం సరి కాదు. ఎందుకంటే అది ఆయనను దుఃఖపెడుతుంది.

20వ శతాబ్దపు ఆరంభంలో, ప్రముఖ బ్రిటీష్‌ ప్రసంగీకుడైన డేవిడ్‌ మార్టిన్‌ లాయిడ్‌ జోన్స్‌ కంటే స్పష్టంగా ఈ మాటను ఎవ్వరూ చెప్పలేదు.

“పరిశుధ్ధాత్ముడు తనను తాను మహిమవరచుకోడు, ఆయన కుమారుని మహిమ పరుస్తాడు . పరిశుధ్ధాత్మను గురించిన ఈ వాక్యానుసారమైన సిద్ధాంతం నాకు ఎంతో అద్భుతమైన, అసాధారణమైన విషయాల్లో ఒకటి. పరిశుద్దాత్ముడు తనను తాను దాచుకున్నట్టు, మరుగుచేసుకున్నట్టు కనిపిస్తున్నాడు. ఆయన ప్రతి నిత్యం కుమారునిపై దృష్టిసారిస్తున్నాడు. అందుచేతనే పరిశుద్ధాత్మను మనం పొందుకున్నామా లేదా అనేదానికి అన్నింటిలోకెల్లా ఉత్తమమైన పరీక్ష ఏంటంటే, మనం కుమారుని గురించి ఏమి ఆలోచిస్తున్నాము? మనకు ఆయన గురించి ఏమి తెలును? కుమారుడు మనకు నిజంగా వాన్తవమైనవాడేనా? అని మనకు మనం ప్రశ్నించుకోవడమేనని నేను చాలా బలంగా నమ్ముతాను. పరిశుధ్ధాత్మ కార్యం అంటే అదే ఆయన పరోక్షంగా మహిమ పరచబడతాడు. ఆయన నిరంతరం మనకు కుమారుని చూపిస్తాడు.

కనుక వాక్యానికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్మపై అతిగా మనం దృష్టి పెడితే, మనం ఎంత సులభంగా దారి తప్పి తప్పుడు బోధలో కలిసిపోతామో చూసారా! ఆయన మనలో నివసిస్తున్నాడని మనం గ్రహించాలి. అయితే కుమారుని మహిమపరుస్తూ ఆయనను గురించిన ఆ దివ్యమైన జ్ఞానాన్నీ, ఆయన అద్భుత ప్రేమనూ మనకు తీసుకురావడమే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ చేసే కార్యం. ఈ క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలని అంతరంగ పురుషునిలో శక్తితో మనలను బలవరచేది ఆయనే (ఎఫెసీ 3:16).

సరిగ్గా ఇదే విషయంలో అనేక మంది క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలోని వారు తప్పిపోవడం విచారకరం. ఆయన వరాలనూ, ఆశీర్వాదాలనూ ప్రధానాంశంగా చేసి పరిశుద్ధాత్మను హెచ్చిస్తున్నామని వారు అనుకుంటున్నారు. కాని అది నిజం కాదు. క్రీస్తుపై దృష్టి ఉంచడమే పరిశుద్ధాత్మను నిజంగా ఘనపరచడం. పరిశుద్ధాత్ముడు తన గురించి కాకుండా యేసు గురించి మాట్లాడతాడు. కాబట్టి యేసుక్రీస్తు వ్యక్తిత్వ కార్యాల నుంచి మన దృష్టిని మళ్ళించే విధంగా పరిశుద్ధాత్ముని యొక్క వ్యక్తిత్వ, కార్యాలపై దృష్టి కేంద్రీకరించడమనేది పరిశుద్ధాత్మ చేసే పని కాదని మనం చెప్పవచ్చు. అది క్రీస్తు వ్యక్తిత్వాన్ని తగ్గించడమే పనిగా కలిగియున్న క్రీస్తు విరోధి ఆత్మ కార్యమిది (1యోహాను 4:2,3) "పరిశుద్ధాత్ముడు ప్రముఖుడే కానీ, మన ఆలోచనల్లో క్రీస్తు స్థానాన్ని మాత్రం ఆయన ఎన్నటికీ అధిగమించకూడదు” అని వేదాంత పండితుడు జేమ్స్‌, మాంట్‌ గోమరీ బాయిస్‌ వివరించాడు.

పాస్టర్‌ చక్‌ స్విండాల్ ఈ విషయంలో మరింత స్పష్టంగా ఉన్నాడు. “గమనించండి. పరిశుద్ధాత్మ క్రీస్తును మహిమపరుస్తాడు. నేను మరొక అడుగు ముందుకు వేస్తాను: పరిశుద్దాత్ముడే ప్రత్యేకంగా ఆధిక్యతను ఘనతనూ పొందుతూ ఉంటే ఆయన అందులో ఉండడు. పరిశుద్ధాత్మ పనిచేస్తున్నప్పుడు మహిమ పొందింది క్రీస్తు. ఆయన తన కార్యాన్ని బాహాటంగా కాకుండా, తెర వెనుక నుండి చేస్తాడు”. కృపా వరాలనూ, అద్భుతాలనూ, ఆరోగ్యైశ్వర్యాలను గురించిన వాగ్దానాలనూ ముందుంచి, వాటినే కేంద్రంగా చేసుకుంటే, గమనం యేసుక్రీస్తునుంచి తొలగిపోతుంది. అది పరిశుద్ధాత్మ కార్యం కాదు. పాస్టర్ డాన్ ఫిలిప్స్ ఈ విషయాన్ని సంగ్రహంగా వివరించారు.

పరిశుద్ధాత్మతో ఆయన వరాలతో (అవి నిజమైనవి కానీ లేదా కల్పితమైనవి కానీ) పీడితుడైన ఒక వ్యక్తిని నాకు చూపించండి. పరిశుద్ధాత్మతో నింపబడని వ్యక్తిని నేను మీకు చూపిస్తాను.

యేసుక్రీస్తు గురించి నేర్చుకోవడానికీ, ఆలోచించడానికీ, అతిశయించడానికీ, ఆయన గురించి, ఆయన కోనం ఆయనతో మాట్లాడడానికి ఎన్నటికీ అలసిపోకుండా, ఆయన వరిపూర్ణతల సొగసుతో నిండి, పరవశమొంది, ఆయనను సేవించి, ఘనపరచడానికి మార్గాలను అన్వేషిస్తూ, ఆయనకోసం అర్పించడానికి ఆర్పణగా మారడానికి నిర్విరామంగా మార్గాలను వెదుకుతూ స్వభావంలో అంతకంతకూ ఆయనవలె ఎదుగుతూ ఆయన వ్యక్తిత్వ కార్యాలపై దృష్టి ఉంచిన ఒక వ్యక్తిని నాకు చూపించండి. పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. పరిశుద్ధాత్మ గురించి బైబిల్‌ ఏమి బోధిస్తున్నదో దానిని నేర్చుకుని, దాన్ని మనం బోధించాలి. వాక్యం నిర్వచించి, పరిశుద్ధాత్మ పరిచర్యతో నిండిన జీవితాలను జీవించడానికి మనం ప్రయత్నించాలి.

మనం పరిశుద్ధాత్మతో నింపబడే కొలదీ, ప్రభువైన యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని గురిగా పెట్టుకిని, ఆయనపైనే దృష్టిసారిస్తామనే విషయంలో ఎన్నడూ మనం దృష్టి మరల్చకూడదు".

పరిశుద్ధాత్మతో నింపబడడం అనగా క్రీస్తు కేంద్రిత జీవితాన్ని కలిగి ఉండడమే (హెబ్రీ 12:2) పరిశుద్ధాత్ముడు మన గమనాన్ని రక్షకునివైపు మరల్చుతాడు. అదే ఆయన ప్రథమ కర్తవ్యం. ఆ ప్రాధాన్యతను అడ్డుకునే ఏ ఉద్యమాన్నైనా త్రిత్వంలో మూడవ వ్యక్తి బలపరచడు. ఇది వాస్తవం.

            పరిశుద్ధాత్మ యొక్క నిజకార్యం క్రీస్తును గురించిన సత్యాన్ని ధృవీకరిస్తుంది

పరిశుద్ధాత్ముడు మన గమనాన్ని మన రక్షకుడూ ప్రభువూ యేసుక్రీస్తు వైపు మరల్చినప్పుడు, ఆయన గురించి వాక్యంలో రాయబడిన విషయాలను ఎంతో ఖచ్చితంగా మనకు చూపిస్తాడు. ఎందుకంటే ఆయన సత్యస్వరూపి (యోహాను15:26) ప్రభువైన యేసుక్రీస్తు గురించి పరిశుద్ధాత్ముడు చెప్పే సాక్ష్యం తానే స్వయంగా ప్రేరేపించిన వాక్య సత్యానికి ఎల్లప్పుడూ అనుగుణంగా ఉంటుంది. మెస్సీయ రాకను గురించి ముందుగా ప్రవచించేలా పాత నిబంధన ప్రవక్తలను ప్రేరేపించింది ఆయనే (2పేతురు 2:1) “మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలిస్తూ తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునప్పుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరని” 1 పేతురు 1:10:11లో అపొస్తలుడైన పేతురు వివరించాడు. లేఖనమంతటి యొక్క ప్రధానాంశం ప్రభువైన క్రీస్తే (యోహాను 5:39). దేవుని వాక్యాన్ని ఉపయోగించుకుని పరిశుద్ధాత్ముడు నేరుగా మనకు యేసుక్రీస్తు మహిమను చూపిస్తాడు.

ఖచ్చితమైన వాక్య విధానంలో యేసుక్రీస్తును చూపించని పరిచర్యగానీ, సందేశం గానీ పరిశుద్ధాత్మ నిజకార్యం కాదు. డోసెటిజమ్‌లో అబద్ధ “క్రీస్తును” నిందించినప్పుడు అపొస్తలుడైన యోహాను భావం అదే. 1యోహాను 4:2,3లో జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ కూడా అదే సారాంశాన్ని కనుగొన్నాడు. క్వేకర్స్‌ అనే శాఖ వారి అంతరంగంలో ఉన్న వెలుగుగా పేర్కోబడిన గూఢమైన, కల్పిత క్రీస్తును గురించిన కథనాలను ఎడ్వర్డ్స్‌ గట్టిగా తిరస్కరించాడని మనం ఇంతకు మునుపే గమనించాము. ఆ రకమైన ఊహలు నిజ రక్షకుని ప్రతిబింబించేవి కావు. యేసుక్రీస్తును గురించిన తప్పుడు అభిప్రాయాన్ని కలిగియున్న ఏ ఉద్యమమైనా పరిశుద్ధాత్మ యొక్క నిజకార్యాన్ని చూపించదు. అది క్రీస్తు విరోధి ఆత్మ మూలంగా ప్రారంభమైన ఉద్యమం.

క్యారిస్‌మాటిక్‌ సంఘాల్లో యేసును గురించిన దర్శనాలు సర్వసాధారణం. ఆయన అగ్నిమాపక దళ దుస్తులు ధరించాడు, 900 అడుగుల ఎత్తు ఉన్నాడు, బాత్‌రూమ్‌లో ఆకస్మాత్తుగా ప్రత్యక్షమైయ్యాడు, చెత్త పారబోయబడే స్థలంపై నాట్యం చేస్తున్నాడు, స్వస్థత గృహం వద్ద చక్రాల కుర్చీలో కూర్చున్నాడు, సముద్రతీరంలో సుదూరం నడిచాడు, ఊహించిన దాని కంటే ఎక్కువ పద్ధతుల్లో కనిపించాడని ఈ దర్శనాలు చెబుతున్నాయి. వాస్తవానికి అటువంటి చిత్ర విచిత్రమైన అనుభవాలు ప్రభువైన యేసును గురించిన వాక్యవర్ణనను వక్రీకరిస్తాయి, కనుక అవి పరిశుద్ధాత్మ మూలంగా కలిగినవి కావు. అపొస్తలుడైన యోహాను పునరుత్థానుడైన క్రీస్తు దర్శనం "చూడగానే, చచ్చినవాడిలా నేలపై పడిపోయాడు" (ప్రకటన 1:17). వాక్యంలోని ఈ సంఘటనను ఒక క్యారిస్‌మాటిక్‌ ఉద్యమ రచయిత చెప్పిన ఆధునిక అనుభవాలతో పోల్చిచూస్తే, భేదాలు చాలా కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. “పరిశుద్ధాత్ముడు తనను తాను బయలుపరచుకోగానే నేను యేసును చూశాను. అపుడు తన రహస్య స్థలానికి నన్ను తీసుకెళ్లమని ప్రభువును నేనడిగాను. అక్కడున్న పచ్చికపై పరుండి, యేసూ, నా పక్కనే పరుండెదవా? అని అడిగాను. ఇద్దరం ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ అక్కడే ఉన్నాం. తండ్రి కూడా వచ్చి యేసు పక్కనే కూర్చున్నాడు". ఇటువంటి ఉల్లాసభరితమైన ఉద్వేగాలు మొదలుకుని వింతైన ఊహలతో కూడిన క్యారిస్‌మాటిక్‌ దర్శనాలు కొన్ని సంఘాల్లో సర్వ సాధారణం కావచ్చు. అయితే వాటికి మూలం మాత్రం పరిశుద్ధాత్ముని లో లేదు. వాక్యానుసారమైన విధానంలో అవి ప్రభువైన యేసును చిత్రించడం లేదు, అనంతమైన మహిమ గలవానిగా ఆయనను స్తుతించడం లేదు. అయితే పరిశుద్ధాత్మ నిజ కార్యం అన్ని సమయాలలో ఈ రెండు కార్యాలను చేస్తుంది.

పరిస్థితులను మరింత విషమం చేయడానికి అన్నట్టు, కొంతమంది క్యారిస్‌మాటిక్‌ బోధకులు చాలా బాహాటంగా క్రీస్తును గురించి తీవ్రమైన తప్పుడు బోధలను బలపరుస్తున్నారు. మానవ శరీరాన్ని కలిగిన దేవునిగా యేసు భూమి మీదకు రాలేదని బోధిస్తూ, తానే దేవుడిననే విషయాన్ని యేసు ఎన్నడూ చెప్పలేదని వాదిస్తూ, సిలువపై యేసు సాతాను పాప స్వభావాన్ని ధరించాడని చెబుతూ, సిలువపై భౌతికంగా మరణించిన తర్వాత ఆయన నరకంలో ఆత్మీయంగా మరణించాడని వాదిస్తూ వికారమైన దేవదూషణలు చేస్తున్నారు. వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ సంఘాలు యేసుక్రీస్తును ఎంత దేవదూషణకరమైన, వాక్యవిరుద్ధమైన పద్ధతిలో పరిగణిస్తున్నాయో చూడాలంటే ప్రోస్పారిటి బోధకుడు కెన్నెత్ కోప్‌ల్యాండ్‌ మాటలను వినాల్సిందే.

సిలువవైన యేసు "నా దేవా" అని ఎందుకు పిలిచాడు? ఎందుకంటే దేవుడు ఇకపై తన తండ్రి కాడు కాబట్టి ఆయన స్వయంగా తనపై సాతాను న్వభావాన్ని ధరించాడు. పాతాళం మధ్యలో యేసు ఉన్నాడు. అక్కడ అనుభవించవలసిన దానినంతటినీ ఆయన అనుభవిస్తున్నాడు. క్షీణించిపోయిన చిన్న వురుగు వంటి ఆయన ఆత్మ ఆ పాతాళపు అడుగున ఉంది. ఆయనను నాశనం చేయించానని సాతాను అనుకుంటున్నాడు. కానీ అకస్మాత్తుగా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు.

క్రెప్లో డాలర్‌ అనే మరొక వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ శాఖకు చెందిన బోధకుడు క్రీస్తు దైవత్వాన్ని బహిరంగంగా ప్రశ్నిస్తూ ఆయన పట్ల తన అమర్యాదను కనబరిచాడు.

యేసు పరిపూర్ణుడిగా రాలేడు, ఆయన వరిపూర్ణతలో ఎదిగాడు. బైబిల్‌లో ఒక లేఖనంలో యేను ప్రయాణం చేసి, అలసిపోయాడని నీకు తెలుసా? దేవుడు అలనిపోడని నీవు నిరీక్షించడం మంచిది ........ కానీ యేసు అలసిపోయాడు. అలసిపోయినందుకు బావి దగ్గర కూర్చున్నానని ఆయన చెబుతున్నాడు. ఆయన దేవునిగా వచ్చి అలసిపోయాడంటే అయ్యో, మనం సమస్యలో ఉన్నాం. ఒకాయన “యేను దేవునిగా వచ్చాడని” చెప్పాడు. కానీ దేవుడు ఎన్నడూ కునుకడు, నిద్రించదు అని బైబిల్ చెబుతున్న విషయం మీలో ఎంత మందికి తెలుసు? కానీ మార్కు సువార్తలో దోనె వెనుక భాగంలో యేను నిద్రించడాన్ని మనం చూస్తాం.

క్రీస్తు దైవత్వాన్ని తృణీకరించి, తామే చిన్న దేవుళ్ళమనే స్థాయికి తమను తాము ఈ వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ శాఖ వారు హెచ్చించుకోవడం హాస్యాస్పదం. యేసువలే మాట్లాడుతున్నట్టు నటిస్తున్న కెన్నెత్ కోప్‌ ల్యాండ్‌ వక్రీకరించబడిన మాటల్లో చెప్పాలంటే అది ఈ కింది విధంగా ఉంటుంది, “నీవే దేవుడవని చెప్పుకుంటున్నందుకు ప్రజలు నిన్ను నిందిస్తే దాన్ని బట్టి కలత చెందవద్దు. దేవుడనని చెప్పుకున్నందుకు వారు నన్నే సిలువ వేసారు. నేనే దేవుణ్ణి నేను చెప్పలేదు. నేను ఆయనతో నడిచాననీ, ఆయన నాలో ఉన్నాడని మాత్రమే నేను చెప్పాను. హల్లెలూయ! నీవు చేస్తున్నది కూడా అదే.” అటువంటి మాటల్లో మిళితమైయున్న దురహంకారం, నీచమైన అబద్ధాలు ఏ నిజ విశ్వాసికైనా వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అటువంటి తీవ్రమైన వాక్యవిరుద్ధమైన బోధను ప్రేరేపించేది క్రీస్తు విరోధి ఆత్మ మాత్రమే. అయితే దానికి భిన్నంగా, పరిశుద్ధాత్మ నిజమైన కార్యం ప్రజలను “మన గొప్ప దేవుడును, రక్షకుడైన యేసుక్రీస్తు" ను గురించిన సత్యాన్ని చూపిస్తుంది (తీతు 2:13),

అంతేకాదు, యేసుక్రీస్తు సువార్త సత్యాన్ని పరిశుద్ధాత్ముడు ప్రజలకు చూపిస్తాడు. లోకాన్ని పాపం గురించీ, దుర్నీతి గురించీ ఒప్పించి తద్వారా వారికి ప్రభువైన యేసులో విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆత్మను పంపించాడు (యోహాను 16:7-11) చారిత్రాత్మక సువార్త సత్యానికి ఆత్మ సాక్ష్యమిస్తూ (అపొ.కా.5:30-32) ఈ రక్షణార్థమైన సందేశాన్ని ప్రకటిస్తున్న వారిని బలపరుస్తాడు (1పేతురు 1:12), సువార్తను బలహీనపరిచేది ఏదైనా పరిశుద్ధాత్మ నిజకార్యం కాదు.

కేథలిక్‌ క్యారిస్‌మాటిక్స్‌ నూ, ఒన్‌నెస్‌ పెంతెకోస్తువారినీ, వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ బోధకులనూ, ఇతర తప్పుడు బోధలనూ నేర్చుకుంటున్న సార్వత్రిక క్యారిస్‌మాటిక్‌ లోకంలో సువార్త సత్యానికి ఉన్న విలువ తగ్గిపోతుంది. క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాన్ని ఐక్యపరిచే అంశం వింతైన ఆత్మీయ అనుభవాలు, భాషల్లో మాట్లాడడం వంటి భౌతిక సూచనలే గానీ సువార్త సత్యం కాదు. “పోప్‌ బిషప్‌ల వంటి అధికార వ్యవస్థ కలిగిన రోమన్‌ కేథలిక్‌ సంఘంలోనూ, ఏ అధికారం కిందకు రాని సామాన్యమైన స్వతంత్ర సంఘాల్లోనూ క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం వర్ధిల్లింది. దీనిని బట్టి వివిధ క్రైస్తవ శాఖలు నమ్మే సిద్ధాంతాలు ఏవైనప్పటికీ పరిశుద్ధాత్మ వరాలు ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా మారుతున్నాయని అర్థమౌతుంది” అని ఒక రచయిత చెప్పాడు. సత్యానికి అనుగుణమైన సిద్ధాంతాన్ని వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాలు అణిచి వేసాయి. కనుక క్యారిస్‌మాటిక్‌ సంఘాల్లో అనేకులు సువార్త నకిలీ రూపాన్ని సంతోషంగా అంగీకరిస్తున్నారు.

తాము పరిశుద్ధాత్మ బాప్తీస్మం పొంది, భాషల్లో మాట్లాడామని 1976 ప్రకటించినప్పుడు కేథలిక్‌ క్యారిస్‌మాటిక్‌ రెన్యువల్‌ ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని అనతికాలంలోనే పోప్‌ జాన్‌పాల్‌ -2 అధికారికంగా గుర్తించాడు, అప్పుడది కేథలిక్‌ సంఘ ఆశీర్వాదంతో వేగంగా విస్తరించింది. “2000 సంవత్సరం నాటికి ఇంచుమించు పదికోట్ల ఇరవై లక్షల కేథలిక్‌ క్యారిస్‌మాటిక్స్‌ ఉన్నారనీ ఈ సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేథలిక్కుల సంఖ్యలో 11 శాతంగానూ, సాంప్రదాయక పెంతెకోస్తు వారందరూ సమకూడినప్పటి సంఖ్యకు రెండింతలుగానూ ఉందని” అలెన్‌ అండర్సన్‌ చెప్పాడు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యారిస్‌మాటిక్‌ జనాభాలో 5వ భాగంకంటే ఎక్కువ రోమన్‌ కేథలిక్కులే ఉన్నారని ఆ లెక్కలు తెలియచేస్తున్నాయి. కేవలం విశ్వాసం ద్వారానే పాపులు నీతిమంతులుగా తీర్చబడతారనే వాక్య సిద్ధాంతాన్ని కేథలిక్ సంఘం తృణీకరిస్తుంది. ఆ సంఘం ఆచరించే ఏడు సంస్కారాలు మనిషిని కృపకు పాత్రునిగా చేయగలవని నమ్ముతుంది. తల్లియైన మరియకు చేసే విగ్రహారాధనకు ఆ సంఘం ఇంకా కట్టుబడివుంది. ఇలాంటి సిద్ధాంతాలను రోమన్‌ కేథలిక్‌ సంఘం కలిగి ఉన్నప్పటికీ, ఎన్నో ప్రొటస్టెంట్‌, పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్‌ సంఘాలవారు వారిని బహిరంగంగా అంగీకరిస్తున్నారు.

"పరిశుద్ధాత్మతో వ్యక్తిగత అనుభవం కోసం, తద్వారా కలిగే కృపావరాల నిమిత్తం ఇతర పెంతెకోస్తు సభ్యుల మాదిరిగానే కేథలిక్‌ క్యారిస్‌మాటిక్స్‌ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ రకమైన ఏకాభిప్రాయాలే కేథలిక్స్‌ ప్రొటెస్టెంట్స్‌ కలిసి క్యారిస్‌మాటిక్‌ సభల్లో పాల్గొనడానికీ, ఉద్యమ ఆరంభ సమయం నుంచే నిబంధన జనులుగా కలిసి నివసించడానికీ వారికి అవకాశమిచ్చాయని” టి.పి. తిగ్‌పెన్‌ వివరించాడు.

గత వేసవిలో నాలుగు రోజుల క్రైస్తవ సమాఖ్య సభల్లో వరిశుద్ధాత్మలో ఉన్న సామాన్య బంధాన్నిబట్టి, పదివేలమంది క్యారిన్‌మాటిక్స్, పెంతెకోస్తు సభ్యులూ కలిసి ప్రార్ధించారు, పౌటలు పాడారు, నాట్యం చేసారు, చప్పుట్లు కొట్టారు, ఉత్సహించారు. జూలై 26-29 తేదీల్లో ఫ్లోరిడాలోని ఒర్లెండోలో జరిగిన “పరిశుద్దాత్మ, ప్రపంచ నువార్తీకరణ” సభలో పాల్గొన్నవారిలో సగంమంది కేథలిక్‌ సభ్యులే. పాట్‌ రాబర్ధ్‌సన్‌ రిజెంట్‌ విశ్వ విద్యాలయానికి పీఠాధిపతిగా ఉండి ఆ సభకు అధ్యక్షత వహించిన విన్సన్‌ సైనన్‌ ఈ విధంగా చెప్పాడు, “కేథలిక్స్‌, ప్రొటస్టెంట్స్ మధ్య ఉన్న గోడలను కూలగొట్టాలని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు"

అలాంటి సందర్భాల్లో, వాక్య సత్యంపై కాకుండా వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాలపై ఆధారపడిన అసత్య ఐక్యమత్యం కోసం సత్య బోధ నిర్లక్ష్యానికి గురైంది. రోమన్ కేథలిక్‌ సంఘం అవినీతిమయమైన అబద్ధ సువార్తను బోధించినంతకాలం, కేథలిక్‌ క్యారిస్‌మాటిక్‌ రెన్యువల్‌ వెనుకున్న ఆత్మ పరిశుద్ధాత్మ కాదు.

క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో ఒన్‌నెస్‌ పెంటెకోస్టలిజమ్‌ (ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల 40 లక్షలమంది సభ్యులున్నారు) అనే శాఖ త్రిత్వాన్ని గురించిన సిద్ధాంతాన్ని తృణీకరించడం అదే రీతిలో విచారించదగ్గ విషయం. “అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న సాంప్రదాయక పెంతెకోస్తువారిలో దాదాపు 25% మంది తమ వేదాంతంలో "ఒన్‌నెస్‌" సిద్దాంతాన్ని నమ్మేవారే. అథనేషియన్‌ విశ్వాస ప్రమాణంలో వివరించబడినట్టు దైవంలోని ముగ్గురు వ్యక్తులు సమానులనీ, నిత్య ఉనికినీ కలిగినవారనీ కాక, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను మూడు పాత్రలుగా దేవుని అర్థం చేసుకోవాలని బోధించే మోడలిజమ్‌తో ఈ వేదాంతం సంబంధాలను కలిగి ఉంది” అని విలియమ్‌ కే వివరించాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అను ముగ్గురు భిన్నమైన వ్యక్తులుగా దేవుడు ఉన్నాడనే వాక్య బోధను తృణీకరించిన కారణాన్ని బట్టి "మోడలిజమ్‌” అనే సిద్ధాంతాన్ని ఆది సంఘం తప్పు బోధగా పరిగణించింది.

“దేవుడు ఒక్కడే వివిధ నమయాల్లో ఆయనకు తండ్రీ, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే మూడు భిన్నమైన నామాలు ఉంటాయి. అయితే వీరు ముగ్గురు విభిన్నమైన వ్యక్తులు కారు. కానీ ఒకే దేవునిలో వీరు మూడు పాత్రలుగా ఉన్నారు. లోకానికి సృష్టికర్తగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వానిగా ఉన్నపుడు దేవుడు 'తండ్రి' గానూ , యేనుక్రీస్తుగా అవతరించినపుడు దేవుడు 'కుమారుడు' గానూ, నంఘ యుగంలో దేవుడు 'పరిశుద్ధాత్ముని' గానూ ఉన్నాడు. అదే విధంగా యేసుక్రీస్తూ దేవుడే పరిశుద్ధాత్మయూ దేవుడే, అయితే వారు విభిన్న వ్యక్తులు కాదు” అని మోడలిస్ట్‌ సిద్ధాంతకర్తలు బోధించేవారు.” నైసియా (క్రీ.శ 325), కాన్‌స్టాంటినోపుల్ (క్రీ.శ 381) సభల కాలం నుంచి వేదాంతపరమైన శాస్త్ర సరిహద్దులకు బయటనున్న మోడలిజమ్‌ను అన్ని ప్రధాన క్రైస్తవ శాఖలూ తప్పుడు బోధగా పరిగణించాయి. స్పష్టమైన లేఖన బోధకు ఈ మోడలిజమ్‌ అనే బోధ సరితూగట్లేదు. (మత్తయి 3:13-17, 28:19 వాక్యభాగాలు పోల్చి చూడండి).

క్యారిస్‌మాటిక్‌ సమాఖ్యకు ఉదాహరణ ప్రముఖ ప్రోస్పారిటి ప్రసంగీకుడైన జోయల్‌ ఆస్టిన్‌ స్థాపించిన మాదిరిలో కనిపిస్తుంది. క్రీస్తు శ్రేష్టత్వం గురించీ, విలక్షణత గురించీ లేఖనం చెప్పే ప్రతి విషయానికీ తీవ్ర విరుద్ధంగా నిలిచే యూనివర్సలిజమ్‌ ఆనే తీయని విధానంతో, ఆస్టిన్‌ సిద్ధాంతం లోతులేనిదిగా ఉన్నది. యేసుక్రీస్తును తిరస్కరించేవారు తప్పుచేస్తున్నారా? అనే ప్రశ్నను అడిగినప్పుడు ఆస్టిన్‌ చాలా అస్పష్టంగా సమాధానమిచ్చాడు. “వారు చేసేది తప్పో కాదో నాకు తెలియదు, బైబిల్‌ బోధించే క్రైస్తవ విశ్వాసమేమిటో నాకు తెలుసు. దాన్ని నేను నమ్ముతున్నాను. దేవుడు వ్యక్తుల హృదయాలకు మాత్రం తీర్పుతీరుస్తాడని నేను అనుకుంటున్నాను. భారతదేశంలో నా తండ్రితో నేను చాలా కాలం గడిపాను. వారి మతం గురించి నాకు తెలియదు. కానీ వారు దేవుని ప్రేమిస్తున్నారని మాత్రం నాకు తెలుసు. వారి భక్తిని నేను చూసాను. నేను యేసుతో సంబంధం కలిగి ఉండాలని బైబిల్‌ బోధిస్తున్న విషయమే నాకు తెలుసు. మీరడిగిన ప్రశ్నకు నాకు సమాధానం తెలియదు". మరొక సందర్భంలో, మార్మన్‌లు నిజ క్రైస్తవులేనా? అని ఆస్టిన్‌ను అడిగినప్పుడు, అతని సమాధానం ఎంతో నిరాశపరిచేదిగా ఉంది. “అవును, నా దృష్టిలో వారు నిజ క్రైస్తవులే. క్రీస్తును తన రక్షకునిగా నమ్ముతున్నానని మీట్‌రామ్నీ అనే వ్యక్తి చెప్పాడు. నేనూ అదే నమ్ముతున్నాను. మార్మనిజమ్‌లో ఉన్న ప్రతి చిన్న విషయానికీ నేను తీర్పరిని కాను. వారు నిజ క్రైస్తవులు అని నేను నమ్ముతున్నానని” అతడు చెప్పాడు.

పెంతెకోస్తు వారూ, క్యారిస్‌మాటిక్స్ వారూ పొందుకుంటున్న అద్భుత సూచనలను మార్మనిజమ్‌ స్థాపకులు కూడా పొందామని వాదిస్తున్న ప్రత్యేక కారణాన్ని బట్టి లేటర్‌-డే సెయింట్స్‌ (మార్మన్స్‌) గురించి ఆస్టిన్‌ చేసిన మతిస్థిమితం లేని వ్యాఖ్య ఆసక్తికరమైన చర్చనీయాంశమైంది. 1836లో కిర్ట్‌ల్యాండ్‌ దేవాలయ ప్రతిష్టత కార్యక్రమంలో భాషలు, ప్రవచనం, దర్శనాలు మొదలైన పలు క్యారిస్‌మాటిక్‌ సూచనలను జోసెఫ్‌ స్మిత్‌ తెలియచేశాడు. ఆ సన్నివేశం గురించి ఇతర ప్రత్యక్ష సాక్ష్యులు సైతం ఇవే వ్యాఖ్యలు చేసారు: భాషల్లో మాట్లాడడం, దర్శనాలను చూడడం, దేవదూతలను ఆజ్ఞాపించడం మొదలగు శక్తివంతమైన ప్రత్యక్షతలనేకం అక్కడ జరిగాయి. “పెంతెకోస్తు దినాన జరిగినట్టే ప్రభువు పరిశుద్ధాత్మ విస్తారంగా కుమ్మరించబడింది. వందలాది పెద్దలు భాషల్లో మాట్లాడారు". ఛార్లెస్‌ పర్హామ్ , పెంతెకోస్తు సభ్యులు భాషల్లో మాట్లాడడానికి అర్థశతాబ్దానికి ముందే, అటువంటి సంగతులనే ఈ లేటర్‌ డే సెయింట్స్‌ (మార్మన్స్‌) తమకు జరిగినట్లు చెప్పారు. తద్వారా పెంతెకోస్తు ఉద్యమారంభానికి మూలం మార్మనిజమ్‌లోనే ఉందని కొంతమంది చరిత్రకారులు గుర్తించేలా చేసింది.

ఈ రెండు ఉద్యమాల్లో ఉన్న పోలికలే వీరిలో కొద్దిమందిని నేటి దినాన మరింత అన్యోన్యంగా ఉండేలా ప్రోత్సహించాయి. “లేటర్‌-డే సెయింట్స్‌కూ, ఆత్మపూర్ణులైన క్రైస్తవులకు మధ్య భాష, సంస్కృతుల అడ్డంకి ఉన్నప్పటికీ, ఈ రెండు వర్గాల వారు ఒకే రకమైన సిద్ధాంతాలను సమ్ముతారని” రచయితలైన రాబ్, క్యాధీ డాట్స్‌కో “బిల్డింగ్ బ్రీడ్జెస్ బిట్వీన్‌ స్పిరిట్‌ ఫిల్డ్ క్రిస్టియన్స్‌ అండ్‌ లేటర్‌-డే సెయింట్స్‌” అనే తమ పుస్తకంలో చెప్పారు. పెంతెకోస్తు శాఖ లేటర్‌ డే సెయింట్స్‌ బోధను తృణీకరించినప్పటికీ, జోయల్‌ ఆస్టిన్‌ వంటివారు చేసిన వ్యాఖ్యలు “కైస్తవ శాఖలు ఐక్యత” అనే నూతన అధ్యాయానికి సూచనగా ఉన్నాయి. థర్డ్‌వేవ్‌ ఉద్యమానికి జన్మస్థలమైన ఫుల్లర్‌ థియాలజికల్‌ సెమినరీ ప్రస్తుతం మార్మన్స్‌, ఇవాంజెలికల్‌ క్రైస్తవుల ఉన్నతమైన ఐక్యత కోసం దండయాత్ర చేయడం ఏ మాత్రం యాదృచ్చికం కాదు.

సువార్తను అత్యంత ఘోరంగా వక్రీకరిస్తున్న క్యారిన్‌మాటిక్‌ సిద్ధాంతం ఆరోగ్వైశ్వర్యాలను వాగ్దానం చేస్తున్న వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ ప్రోస్పారిటి సువార్తలో కనిపిస్తుంది. ఈ సువార్తే క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాన్ని ఏలుతున్న ప్రాణాంతకమైన అసత్యం. పెంతెకోస్తు శాఖలన్నిటికి గల ప్రధాన సిద్ధాంతం ప్రోస్పారిటి వేదాంతమే కనుక చాలా దేశాల్లో 90% కంటే ఎక్కువమంది పెంతెకోస్తు సభ్యులు ఈ నమ్మకాలకే కట్టుబడి ఉన్నారని, ఇంతకు ముందు గమనించాం. ఇహలోక సంపదలను వాగ్దానం చేస్తున్న ప్రోస్పారిటి సువార్త వాక్యానుసారమైన సువార్తను తలకిందులు చేస్తుంది. సత్య సువార్త పాపం నుంచి, ఆత్మీయ మరణం నుంచీ రక్షణను వాగ్దానం చేస్తుంది. అయితే నిత్యత్వానికి సంబంధించిన వాస్తవాలను విస్మరిస్తూ, ప్రోస్పారిటి సువార్త తాత్కాలిక సమస్యలైన పేదరికం నుంచీ, అనారోగ్యం నుంచీ విడుదలను వాగ్దానం చేస్తుంది. సమస్తాన్నీ విడిచిపెట్టి, తమ సిలువను ఎత్తుకుని తనను వెంబడించమని యేసు తన శిష్యులను పిలిచారు (లూకా 9:23). అయితే లక్షలాదిమంది దిక్కులేని ప్రజలకు శారీరక సౌఖ్యాలనూ, ఇహలోక సంపదలనూ, లౌకిక విజయాన్నీ ప్రోస్పారిటి సువార్త వాగ్దానం చేస్తోంది. ఈ ప్రజలు దాన్ని నిజమని నమ్మి మోసపోతున్నారు. సత్య సువార్త దేవుని మహిమపై దృష్టి సారిస్తుండగా, ప్రోస్సారిటి సువార్త మనుషుల కోరికలకూ, అవసరాలకూ ముఖ్య స్థానాన్ని ఇస్తోంది. “సువార్త కేంద్ర స్థానం నుంచి క్రీస్తును తొలగించి, నిత్యమైన వాటికి పైగా తాత్కాలికమైన వాటిని హెచ్చించిన ఈ అసత్య సువార్తను ప్రకటిస్తున్న ఈ అక్రమకారులు దోషులని” ఒక రచయిత రాశాడు.

మోసపూరిత వస్తువులతో వ్యాపారం చేసుకునే ప్రయత్నంలో ప్రోస్పారిటి ప్రసంగీకులు క్రైస్తవ్యాన్ని దాన్ని గమనిస్తున్న లోకం దృష్టికి హాస్యాస్పదంగా చేసేసారు. బ్రూస్‌ బికెల్‌, స్టాన్‌ జాన్జ్‌ అనేవారు దీని గురించి పరిహసించినప్పుడు ఒక ఉత్తమమైన మాట పలికారు. "ప్రోస్పారిటీ సువార్త అనేది క్రైస్తవ దృక్పథంలో మల్లయుద్ధం (Professional Wrestling) లాంటిది. ఇది మోసపూరితమైనప్పటికీ, ప్రజలకు ఉత్సాహాన్ని కలుగచేసే నైపుణ్యం దీనికి ఉంది.” అయితే మల్లయుద్ధం మాదిరిగా, ఈ ప్రోస్పారిటి వేదాంతంలో హాస్యాన్ని కలిగించేదేమీ లేదు. ఇది ఒక ప్రాణాంతకమైన, నాశనకరమైన తప్పుడు బోధ. దేవుని వాక్య సత్యాన్ని ఉద్దేశపూర్వకంగానే కొందరు ఆధ్యాత్మిక వంచకులు వక్రీకరిస్తున్నారు. దేవదూషణతో కూడిన ఈ అహంభావానికి వారు ఒక దినాన శిక్ష పౌందుతారు (యూదా 13),

కేథలిక్‌ క్యారిస్‌మాటిక్‌ రెన్యువల్‌, ఒన్‌నెస్‌ పెంటెకోస్టలిజమ్‌ (ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధిని వాగ్దానం చేసే సువార్తను బోధించే) వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ ఉద్యమం వంటి తప్పుడు బోధలకు సంబంధించిన ప్రజల సంఖ్యను లెక్కిస్తే, అది కోట్లలోనే ఉంటుంది. మొత్తం ఈగ్రూపులన్నీ ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో ఒక ప్రధాన భాగాన్ని సూచిస్తున్నాయి. అసత్య సువార్తను వారు ప్రకటిస్తున్నప్పటికీ, “ఆధ్యాత్మిక అనుభవాలు” అనే ఉమ్మడి విషయాన్ని బట్టి వారిని క్యారిస్‌మాటిక్‌ సమాజం అంగీకరిస్తున్నది.

                                                               మారని పరిస్థితి

పరిశుద్ధాత్మ నిజకార్యం ప్రజలకు క్రీస్తు గురించిన సత్యాన్ని చూపిస్తుందని మనం ఈ అధ్యాయంలో చూసాం. తన దినాల్లో జరుగుతున్న ఆధ్యాత్మిక అనుభవాలకు ఆ పరీక్షను జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ అన్వయించాడు. ఈ కాలంలో మనం కూడా అలా చేయడం జ్ఞాన యుక్తమైనది. ఆ పరీక్షను ఆధారంగా చేసుకుని క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాన్ని పరీక్షిస్తే రెండు ముఖ్యమైన విషయాల్లో అది విఫలమౌతోందని స్పష్టమవుతుంది. మొదటిది: పరిశుద్ధాత్మ వరాలూ, శక్తీ అని చెప్పబడే క్యారిస్‌మాటిక్‌ పిచ్చి యేసుక్రీస్తు వ్యక్తిత్వ కార్యాల నుంచి ప్రజల గమనాన్ని మళ్ళిస్తుంది. పరిశుద్ధాత్ముడు తనవైపు కాకుండా క్రీస్తువైపు చూపిస్తాడు. నిజంగా ఆత్మచేత నింపబడినవారు అదే భావాన్ని కలిగి ఉంటారు. రెండవది: ఈ ఉద్యమం క్రియలతో కూడిన నీతిని బోధించే రోమన్‌ కేథలిక్‌ సిద్ధాంతాన్నీ ఇహలోక సంపదలను వాగ్దానం చేసే ప్రోస్పారిటి సువార్తను తన సరిహద్దుల్లోకి అనుమతించింది. ఇలాంటి తప్పుడు బోధలు ఈ ఉద్యమానికి ప్రధాన సిద్ధాంతాలుగా ఉన్నాయి.

ఇదంతా ఒక కీలక ప్రశ్నను లేవనెత్తుతోంది: ప్రజల గమనాన్ని క్రీస్తు నుంచి దూరం చేస్తూ అదే సమయంలో సువార్త అసత్య రూపాల్ని హత్తుకొంటున్న ఒక ఉద్యమాన్ని పరిశుద్ధాత్మునికి ఆపాదించవచ్చా? జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ అయితే “ఆపాదించకూడదు” అనే పొలికేక పెట్టుండేవాడు. 1యోహాను 4:2,3 లో ఉన్న వాక్య నియమం ఆధారంగా, ఆ సమాధానంతో నేను హృదయపూర్వకంగా ఏకీభవిస్తాను. అసత్య సువార్తను ప్రచారం చేసే వారిని గానీ క్రీస్తును గురించిన సత్యం నుంచి ప్రజలను దూరం చేసేవారిని గానీ బలపరచడానికి పరిశుద్ధాత్ముడు తన వరాలను ఎన్నడూ ఉపయోగించడు. “ఈ ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం పరిశుద్ధాత్మ నిజ కార్యమేనా?” అనే ప్రశ్నను పరిశోధిస్తూ, తరువాత అధ్యాయంలో 1యోహాను 4:2-8 నుంచి మిగిలిన పరీక్షలను ఆలోచిద్దాం.

                                  4. ఆత్మలను పరీక్షించుట - రెండవ భాగం

"మెరిసేదంతా బంగారం కాదు” అనే మాటను ద మర్చెంట్‌ ఆఫ్‌ వెనీన్‌ అనే తన ప్రముఖ డ్రామాలో మొదటిగా ప్రయోగించింది విలియమ్‌ షేక్‌స్పియర్‌. రెండున్నర శతాబ్దాల తర్వాత (అనగా) 1840 ఆఖరి సంవత్సరాల కాలంలో కాలిఫోర్నియాలో బంగారపు నిధులను వెదికే సాహసవంతులు ఆ మాటలో ఉన్న సత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. విలువైన బంగారాన్ని గురించిన తమ అన్వేషణలో, మెరిసే ప్రతీది దాచుకునేంత విలువైనది కాదనే విషయాన్ని బంగారాన్ని వెదికేవారు త్వరలోనే తెలుసుకున్నారు. రాతి పగుళ్లు, ఏటిగట్లూ ఏ మాత్రం విలువలేని బంగారపు నురుగుతో నిండి ఉండేవి. సాధారణ ఖనిజమైన తళతళ మెరిసే నకిలీ ఇనుప శిల త్వరలోనే మూర్ఖుల బంగారం అనే మారు పేరును పొందుకున్నది. సరైన అన్వేషకుడెవరైనా స్వచ్ఛమైన బంగారానికీ, దాని మెరిసే రూపానికీ మధ్య భేదాన్ని కనుగొనగలిగేవాడు.

19వ శతాబ్దంలో కాలిఫోర్నియాలోని నదులూ పర్వతాల మాదిరిగా, ఈ సమకాలీన క్రైస్తవ ముఖచిత్రం "మూర్ఖుల బంగారం"తో నిండిపోయింది. మెరిసేది చాలా ఉంది కానీ అది ఆధ్యాత్మికంగా విలువలేనిది. ఇంతకుముందు అధ్యాయంలో, ఒక ఆత్మీయ ఉద్యమాన్ని పరీక్షించేటప్పుడు క్రైస్తవులు అడగవలసిన 5 ప్రశ్నలను 1యోహాను 4:1-8 అందించుట మనం చూసాం. 1) పరిశుద్ధాత్మ మూలంగా కలిగిన కార్యంగా చెప్పబడుతున్నది నిజక్రీస్తుని ఘనపరుస్తోందా? 2) అది పాపాన్ని వ్యతిరేకిస్తోందా? 3) అది ప్రజలకు లేఖనాలను చూపిస్తోందా? 4) అది సత్యాన్ని ఘనపరుస్తోందా? 5) అది దేవుని యెడల, ఇతరుల యెడల ప్రేమ కలుగచేస్తోందా? ఈ ఐదింటిలో మొదటి దానిని మనం 3వ అధ్యాయంలో చూశాం. కనుక మిగిలిన నాలుగింటిని ఆలోచించడానికి మనం ఇప్పుడు సిద్ధపడదాం.

రెండవ పరీక్ష: పరిశుద్ధాత్మ మూలంగా కలిగినదిగా చెప్పబడుతున్న కార్యం పాపాన్ని వ్యతిరేకిస్తోందా?

పరిశుద్ధాత్మ ప్రభావం నీ జీవితంలో ఎలా ఉంది? అని ఒక సగటు క్యారిస్‌మాటిక్‌ని అడగండి. భాషల్లో మాట్లాడడం, ఆత్మచే వధించబడడం, అద్భుత వరాలను గురించిన మాటలను మీరు వింటారు. స్వస్థతల గురించీ, ధనాభివృద్ధి గురించీ ప్రకటిస్తున్న టి.వి. సువార్తకుల బోధలోని అంశాలను ప్రధాన క్యారిస్‌మాటిక్స్‌ ప్రస్తావిస్తారు. ఒక దర్శనం ద్వారానో, లేదా ప్రవచనం ద్వారానో అద్భుత శక్తితో దేవుని అసాధారణ రీతిలో కలుసుకున్నామని ఈ రెండు శాఖల్లో ఉన్నవారు చెబుతారు. ఆ లక్షణాలపై ఆధారపడి, తమను తాము “ఆత్మపూర్ణులైన క్రైస్తవులుగా” ఊహించుకుంటున్నారు. అయితే ఆ పేరునుబట్టి వారి ఉద్దేశమేంటి?

క్యారిస్‌మాటిక్‌ సభ్యుని దృక్పథంలో దాదాపు ఎలాంటి వ్యక్తిగత అనుభవమైనా పరిశుద్ధాత్మ కార్యానికి ఆధారంగానే పరిగణించబడుతోంది. (తరచూ పునరావృత్తమయ్యే) అర్థరహితమైన శబ్దాలను ఉచ్ఛరిస్తూ, మతిభ్రమించి వెనుకకు పడిపోతూ, ప్రవచనమని పిలువబడే లోపాలతో కూడిన మాటలను పలికినప్పుడు, ఉద్రేకపూరిత శక్తితో కూడిన భావనను పొందినప్పుడు, తమ అభిమాన హెల్త్‌ వెల్త్‌ ప్రోస్పారిటి సువార్త బోధకునికి తమ ధనాన్ని విరాళంగా ఇచ్చినప్పుడు తాము ఆత్మ పూర్ణులమౌతున్నామని క్యారిస్‌మాటిక్స్‌ అనుకోవచ్చు. అయితే పరిశుద్ధాత్మ సన్నిధికి అందులో ఏ ఒక్కటీ సూచన కాదు. ఆ సూచనల వెనకున్నది ఏదో ఒక ఆత్మ కావచ్చు గానీ అది పరిశుద్ధాత్మ మాత్రం కాదు.

ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ ప్రభావానికి ఖచ్చితమైన ఆధారం పరిశుద్ధతయే గాని క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ఎక్కువగా నొక్కి చెబుతున్నట్టు ఇహలోక అభివృద్ధీ, భావోద్వేగాలూ, అద్భుతాలూ కావు. అనగా (పరిశుద్ధాత్ముడు తన పరిశుద్ధుల హృదయాలకు తన వాక్యాన్ని అన్వయిస్తుండగా) ఆధ్యాత్మిక పరిపక్వత, క్రియలలో పవిత్రత, పరిశుద్ధాత్మ శక్తి, నడిపింపు ద్వారా క్రీస్తు సారూప్యంలోనికి విశ్వాసి ఎదుగుదలయే పరిశుద్ధాత్మ ప్రభావానికి ఆధారం. పరిశుద్ధాత్మ నిజకార్యం పాప హృదయాన్ని ఒప్పిస్తుంది, లోకాశలతో పోరాడుతుంది. దేవుని ప్రజల జీవితాల్లో ఆత్మ సంబంధమైన ఫలాన్ని కలుగచేస్తుంది.

రోమా 8:5-11లో శరీరానుసారంగానూ, ఆత్మానుసారంగానూ నడుచుకునే రెండు ప్రాథమిక వర్గాలుగా ప్రజలందరిని అపొస్తలుడైన పౌలు విభజించాడు. శరీరానుసారంగా జీవించే ప్రజలు గతించిపోయే ఈ లోకాశలను వెంబడిస్తారు (రోమా 8:5, 1యోహాను 2:16-17) "దేవుని సంతోషపెట్టలేని” శరీరానుసారమైన మనసును వారు కలిగి ఉంటారు (రోమా 8:8). దుర్నీతితో కూడిన ప్రవర్తన ద్వారా అనగా కామాతురత, విగ్రహారాధన, అహంకారం మొదలైన గలతీ 5:19-21లో గ్రంథస్థం చేయబడిన శరీర కోరికల ద్వారా వారి పాపాల ద్వారా హృదయాల్లో ఉండే దుష్టత్వం బయటపడుతుంది. దానికి భిన్నంగా పరిశుద్ధాత్మ నడిపించేవారు క్రీస్తు (ప్రస్తుతం) ఎక్కడ ఉన్నాడో ఆ విషయాలను అనగా పైనున్న వాటి మీదనే మనసు పెడతారు (కోలస్సీ 3:1-2). ప్రభువైన యేసును సేవించడంలో వారికున్న ఆనందం, ఆయన యెడల వారు కలిగియున్న ప్రేమ ఆయనకు విధేయత చూపడం ద్వారా కనబడతాయి (యోహాను 14:15). వారిని పరిశుద్ధాత్మ నడిపిస్తాడు ఫలితంగా వారి జీవితాల్లో ఆత్మఫలం ప్రత్యక్షమౌతుంది (రోమా 8:14, గలతీ 5:22-23). పరిశుద్ధాత్మ కార్యం ఎక్కడైతో ఉందో అక్కడ విశ్వాసులు “శరీర క్రియలను చంపుతుండగా” (రోమా 8:13) వారి పాపపు క్రియలూ, కోరికలూ, ప్రాధాన్యతలూ పెకలించబడతాయి. శరీర దురాశలకు పరిశుద్ధాత్మ పరిచర్య పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. “నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురని” గలతీ 5:16-17లో పౌలు వివరిస్తున్నాడు.

లోక ప్రాధాన్యతలు శరీర కార్యాలే ఒక ఉద్యమాన్ని వర్ణిస్తుంటే, అది దాని వెనకున్న ఆత్మ సంబంధమైన బలగాల గురించి తీవ్రమైన హెచ్చరికలను జారీ చేస్తున్నది. “పాపాన్ని ప్రోత్సహించి, దానిని స్థిరపరుస్తూ, మనుషుల లోకాశలను పెంచడంలో ఆసక్తి కలిగి ఉన్న సాతానుగాడి రాజ్యానికి ప్రతికూలంగా ఆత్మ పనిచేస్తున్నట్లైతే, అది పరిశుద్ధాత్మయే కానీ దురాత్మ కాదని”1 జోనాతన్‌ ఎడ్వర్డ్స్ చెప్పాడు.

వేరేవిధంగా చెబితే, పరిశుద్ధాత్మ నిజకార్యం ప్రజలను వ్యర్థమైన విషయాలతో, శరీరాశలతో శోధించకుండా వ్యక్తిగత పరిశుద్ధతను ప్రోత్సహిస్తూ లోకాశలను ఎదిరిస్తుంది. అయితే ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ వేదాంత, బోధలు నిర్విరామంగా బహిరంగంగా లోక విలువలను సరఫరా చేస్తున్నాయి. శరీర కోరికల నెరవేర్పే ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉంది. టి.వి. సువార్తికులు మొదలుకుని ఫెయిత్‌ హీలర్స్‌, ప్రోస్పారిటి ప్రసంగీకుల వరకూ మొత్తం క్యారిస్‌మాటిక్‌ ప్రముఖులు లోకాశలే విశ్వాసి జీవితానికి అంతిమ లక్ష్యమన్నట్లు బోధిస్తున్నారు. అహంకారంతో కూడిన వారి ప్రకటనలు, డంబంతో కూడిన వారి జీవన విధానాలూ సంఘ నాయకుల విషయంలో ఉన్న వాక్య ప్రమాణానికి తీవ్ర విరుద్ధంగా నిలుస్తున్నాయి (1 తిమోతి 3:1-7, తీతుకు 1:5-9).

క్రీస్తుతోనూ, అపొస్తలులతోనూ పోల్చినప్పుడు సగటు క్యారిస్‌మాటిక్‌ టి.వి. సువార్తికుని నిజ స్వభావం వెంటనే బట్టబయలౌతుంది. డంబంగా, అత్యంత విలాసవంతంగా ఉన్న టి.వి. సువార్తికుల జీవిత విధానాలు “తన తలవాల్చుకొనుటకైనను స్థలములేని మనుష్య కుమారుని జీవిత విధానంలా లేవు” (లూకా 9:58), వారికి గల ధన వ్యామోహం (పేదరికంలో జీవిస్తున్న) అనేకమంది శ్రోతలను వారు దోచుకునే విధానం “నేను పరిచారము చేయించుకొనుటకు కాదు గానీ, పరిచారము చేయుటకు, అనేకులకు ప్రతిగా నా ప్రాణాన్నే క్రయధనముగా చెల్లించడానికి వచ్చానని” చెప్పిన యేసు మాదిరికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి (మత్తయి 20:28). అద్భుతాలను వారు ప్రచారం చేసే విధానం యేసు పద్ధతికి పూర్తి భిన్నంగా ఉంది. తాను స్వస్థపరచిన వారితో “జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని” యేసు తరచూ వారికి ఆదేశించారు (లూకా 8:56, మత్తయి 8:4, మార్కు 7:36). అన్నిటికీ మించి క్యారిస్‌మాటిక్‌ వంచకులకు ఉన్న తుచ్ఛమైన కీర్తి ప్రతిష్టలు, నైతిక వైఫల్యాలూ, "పరిశుద్ధుడు నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమండలము కంటె మిక్కిలి హెచ్చయిన వాడునైన" యేసుతో ఎటువంటి సంబంధమూ లేనివి (హెబ్రీ 7:26).

క్యారిస్‌మాటిక్‌ పద్ధతిలో స్వచ్ఛమైన ఆత్మ ఫలాలు (దీనత్వం, ఓర్పు, సమాధానం. క్రీస్తు ప్రభుత్వానికి లొంగిపోయే త్యాగపూరిత తీర్మానం మొదలగునవి) తరచూ మరుగు చేయబడి శరీర ఆరోగ్యం, ఇహలోక సంపద, తాత్కాలిక సంతోషం మొదలగు మూర్ఖమైన వ్యామోహంతో భర్తీ చేయబడుతున్నవి. ప్రోస్పారిటి వేదాంతానికి ఆ విధమైన ప్రాధాన్యత నివ్వడమే ప్రస్తుత దశాబ్దాల్లో క్యారిస్‌మాటిక్‌ ఉద్యమపు గణనీయమైన అభివృద్ధిని వివరిస్తున్నది. ఈ ప్రోస్పారిటి సిద్ధాంతం రక్షించబడని పాపులు కోరే వాటిని వాగ్దానం చేస్తూ, అవి యేసుక్రీస్తు సువార్తను ప్రతిబింబిస్తున్నవిగా చూపడానికి క్రైస్తవ పదజాలాన్ని ఉపయోగించుకుంటున్నది. ప్రతి పదిమంది పెంతెకోస్తు సభ్యుల్లో తొమ్మిదిమంది పేదరికంలో జీవిస్తున్నప్పటికీ,2 ప్రోస్పారిటి సువార్త ఈ ఉద్యమంలోనికి ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. ప్రజల అవసరత పెరిగేకొలది, ప్రోస్పారిటి బోధకునికి వారిని మోసం చేయడంలో సౌలభ్యత పెరుగుతుంది.

నైజీరియా, దక్షిణాఫ్రికా, భారతదేశం, ఫిలిప్పీన్స్‌ దేశాల్లో ఉన్న 90 శాతం పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్‌ సభ్యులు “తగినంత విశ్వాసం గల విశ్వాసులందరికీ దేవుడు ఇహలోక అభివృద్ధిని దయచేస్తాడ"ని నమ్ముతున్నారు. ప్రతి దేశంలో ముఖ్యంగా, ఇతర శాఖల్లో ఉన్న క్రైస్తవుల కంటే దీనిని పెంతెకోస్తు వారు ఎక్కువగా నమ్ముతున్నారు. అలాంటి గొప్పదైన సందేశాన్ని బట్టి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి సభ్యత్వం పొందడం ఆశ్చర్యమేమీ కాదు. ఇల్లు, ఉద్యోగం, బ్యాంక్‌లో డబ్బు మొదలైనవాటిని కోరుకునే అమెరికా వారి కలకు దైవం ఇచ్చే హామీయే ఈ ప్రోస్పారిటి సువార్త. ఈ సువార్త విశ్వవ్యాప్తమైన విజయం అమెరికా వారి కలను ఎగుమతి చేయడమే.3

ప్రోస్పారిటి సందేశం సిగ్గులేకుండా ప్రజలను గతించిపోతున్న లోకాశాలపై వారి నిరీక్షణనుంచమని పిలుపునిస్తోంది. తప్పుడు కోరికలను నిందించడం మానేసి, ఈ బోధ లోకానుసారమైన జీవన విధానాల్ని హెచ్చిస్తోంది, పాపపు దురాశలను పోషిస్తోంది. దిక్కులేని ప్రజలకు “ప్రభువుతో సరిపడు ఆయన నీకు మంచి జీతాన్నిచ్చే ఉద్యోగాన్నీ, చక్కటి గృహాన్నీ, కొత్త కారునీ అనుగ్రహిస్తాడనే” వ్యర్థమైన వాగ్దానాలు చేస్తోంది.4 లాస్‌వేగాస్‌లో ఉన్న నర్తనశాల కంటే మరింతగా ఈ ప్రోస్పారిటి సువార్త నిందించతగినది. ఎందుకంటే ఇది మతంలా నటిస్తూ క్రీస్తు నామంలోనే వస్తోంది. కానీ నర్తనశాలలో మాదిరిగానే, ఇది దాని భాదితులను కళాత్మక ప్రదర్శనలతోనూ, తక్షణమే సంపదలను పొందవచ్చనే ప్రలోభతోనూ ఆకర్షిస్తోంది (విదేశాల్లో సిగరెట్లూ చాక్‌లెట్లూ అమ్మడానికి ఉపయోగించే స్లాట్‌ మెషీన్‌లు ఉంటాయి). ప్రోస్పారిటి సువార్త అనే ఈ ఆధ్యాత్మిక స్లాట్‌ మెషీన్‌ ప్రజల దగ్గర ఉండే ఆఖరి రూపాయిని సైతం మింగేసిన తర్వాత, వారిని తాము వచ్చినప్పటికంటే హీనమైన స్థితిలో ఇంటికి పంపేస్తోంది.

క్యారిస్‌మాటిక్‌ వేదాంతంలో ఉన్న వ్యక్తిగతమైన గూఢమైన సంగతులే ప్రోస్పారిటి వేదాంతానికి చక్కటి వసతిని కలిగిస్తున్నాయి. ఎందుకంటే తమను తాము ప్రవక్తలుగా ప్రకటించుకోవడానికీ, దైవాభిషేకాన్ని పొందుకున్నామని చెప్పడానికీ, ప్రజలను నిలువు దోపిడీ చేయడానికీ, వాక్యానుసారమైన పరీక్షను తప్పించుకోవడానికీ, దేవుని అధికారంతో మాట్లాడుతున్నట్టు నటించడానికీ, తప్పుడు సిద్ధాంతాలను ప్రజలపై బలవంతంగా రుద్దడానికీ ఆధ్యాత్మిక వంచకులను ఈ వేదాంతం అనుమతిస్తోంది. “దుర్నీతిపరుడైన మతగురువు ఎలాంటి నిషిద్ధమైన కార్యాన్నైనా చేసి తప్పించుకునే అవకాశాన్ని ఈ ప్రోస్పారిటి సువార్త కలిగించడం చాలా నీచమైన విషయం. ఒక విధమైన లేఖన ఉగ్రవాదం ద్వారా తమ అవసరతలను తీర్చుకోవడానికీ నమ్మకస్తులను బలాత్కారం చేయడమే కాకుండా వారి దుష్ప్రవర్తనకు సాకులు చెప్పడానికీ వారిని ఈ బోధ అనుమతిస్తుందని” ఫిలిప్‌ జెన్‌కిన్స్‌ వివరిస్తున్నాడు.5 అలాంటి అవినీతి ఇవాంజెలికల్‌ క్రైస్తవ్యపు ప్రతిష్టను వ్యంగ్యంగా చిత్రించి, ముద్రించి, కలుషితం చేసేసింది. ఫలితంగా సత్యసువార్త సందేశాన్ని బట్టి కాకుండా క్యారిస్‌మాటిక్‌ మీడియాలో క్రైస్తవ్యం ధరించుకున్న వికృత రూపాన్ని బట్టి లోకంలో మేధావి వర్గం క్రైస్తవ్యాన్ని తిరస్కరిస్తోంది. దానిని బట్టి సంఘసాక్ష్యం దారుణంగా దెబ్బతిన్నది.

అత్యుత్తమ సంఘాల్లో సైతం అప్పుడప్పుడు ధన మోసాలూ, నైతిక వైఫల్యాలూ కనిపిస్తున్నాయనేది అంగీకరించాలి. అయితే అలాంటి అక్రమాలు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిని అందుకున్నామని వాదించే వారి మధ్య చాలా తక్కువగా జరగాలని ఎవరైనా అనుకుంటారు. అయితే సమస్యకు మూలం ఇక్కడే ఉంది. సూచనలనూ, అద్భుతాలనూ, గొప్పవైన అనుభవాలనే ఆధ్యాత్మికతగా నిర్వచించి, ప్రోస్పారిటి సువార్త యొక్క దారుణమైన ఇహలోక తత్వాన్ని తన సరిహద్దులలోనికి అనుమతించడం ద్వారా, క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం నిజమైన ఎదుగుదలకు గల మార్గాన్ని నిర్లక్ష్యం చేసింది. ఆధ్యాత్మిక జీవితాన్ని గురించిన అసత్య ప్రమాణాలు పాపాన్ని నిర్భంధించలేవు.

తన నైతిక వైఫల్యాలనుబట్టి అపకీర్తిని పొందిన ప్రముఖ క్యారిస్‌మాటిక్‌ బోధకుల్లో ఉన్నది కేవలం పెంతెకోస్తు స్థాపకుడైన ఛార్లెస్‌ పర్హామ్ మాత్రమే కాదు. పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్‌ చారిత్రక చావడులన్నింటికీ అక్రమాలతోనే త్రోవ తయారుచేయబడింది.

ప్రముఖ ప్రవక్తి, ఇంటర్నేషనల్ చర్చ్‌ ఆఫ్‌ ద ఫోర్ స్క్వేర్ గాస్పల్‌ స్థాపకురాలు అయిన ఏయ్‌మీ సెంపుల్‌ మెక్‌ఫర్సన్‌ 1926 మే నెలలో లాస్‌ ఏంజలెస్‌ సముద్రతీరంలో ఈదుతుండగా అదృశ్యమైపోయింది. ఆ సమయంలో అమెరికాలో ఉన్న ప్రతీ వార్తాపత్రిక మొదటి పేజీలో ఆమె అకస్మాత్తుగా అదృశ్యమైన వార్తను రాసింది. ఆమె సముద్రంలో మునిగిపోయిందనుకుని ఆమె అనుచరులు దుఃఖించారు. “కొందరు అగంతకులు తనను అపహరించి, మెక్సికోలో బంధించారనీ, తనను బంధించిన వారి దగ్గరనుంచి ధైర్యంగా తప్పించుకుని కాలినడకన ఎడారిని దాటాననీ,” చెబుతూ కొన్ని వారాల తరువాత ఆమె తిరిగి ప్రత్యక్షమయ్యింది. పరిశోధకులు ఆ కథనంలో ఉన్న అబద్ధాలను అకస్మాత్తుగా బయటపెట్టారు. ముఖ్యంగా క్యాలిఫోర్నియా తీరానికి అవతలనున్న కర్మెలు నుంచి వచ్చిన ఆధారాన్ని బట్టి, ఆమె తన సొంత రేడియో స్టేషన్‌నే ఒక ఇంజనీరుతో కామకలాపాలు జరిగించడానికి ఉపయోగించిందని తెలిసింది.6 ఆమెను ఎన్నడూ అరెస్టు చేయలేదు కానీ తన కామకలాపాల వృత్తాంతాన్ని దాచి పెట్టడానికి తనను కిడ్నాప్ చేసారనీ వారినుంచి తప్పించుకున్నానని అల్లిన కథలు ఆమెను నవ్వులపాలు చేసాయి. దాదాపు ఒక సంవత్సరం జరిగిన పత్రికా పరిశోధనలోనూ, చట్టపరమైన విచారణలోనూ, ఏయ్‌మీ సెంపుల్‌ మెక్‌ ఫర్సన్‌ ఏ ప్రముఖ వ్యక్తీ తిరిగి కోలుకోలేనంత అపహేళనకు గురైంది.7

1970-80 సంవత్సరాల కాలంలో, జీసస్‌ మూవ్‌మెంట్‌లో అత్యంత ప్రముఖమైన వ్యక్తుల్లో ఒకడు పెంతెకోస్తు సువార్తికుడైన లానీ ఫ్రిస్బీ. తనను తానే ప్రవక్తగా ప్రకటించుకున్న ఇతడు 1960 ఆఖరికాలం, 1970 మొదట్లో జీసస్‌ మూవ్‌మెంటుకు చాలా ముఖ్యమైన వ్యక్తి. ఇతని జీవితం 'ఫ్రిస్బీ: ద లైఫ్‌ అండ్‌ డెత్‌ ఆఫ్‌ ఎ హిప్పీ ప్రీచర్' అనే ఎమ్మీ నామినేటెడ్‌ చిత్రంలో ప్రచురితమయ్యింది. ఆ తరువాత ఇతడు జాన్‌వింబర్‌ అనే వ్యక్తితో సైన్స్‌ అండ్‌ వండర్స్‌ (The Signs and Wonders) ఉద్యమంలో పనిచేసాడు. కల్వరి ఛాపెల్‌, ద విన్‌యార్డ్ ఉద్యమం అనే రెండింటి ఆరంభ అభివృద్ధిలో (చక్‌స్మిత్‌, వింబర్‌లతో పాటు) ఈయన పాత్ర కూడా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా స్వలింగ సంపర్కునిగా ఉన్నాడని తెలిసిన తర్వాత ఫ్రిస్బీ పరిచర్య అవమానకరంగా ముగిసిపోయింది.

నిజానికి పశ్చిమ తీర క్యారిస్‌మాటిక్‌ కమ్యూనిటిలో చాలా సంవత్సరాలుగా ఫ్రిస్బీ వ్యక్తిగత జీవన విధానం ఒక బహిరంగ రహస్యం. శనివారం రాత్రి అతి రోతగా వ్యభిచారం చేసి ఆదివారం ఉదయాన్నే ప్రసంగించేవాడు8. ఫ్రిస్బీ వేశ్యాసాంగత్యాన్ని రహస్యంగా ఉంచడం చివరికి అసాధ్యమైన సందర్భంలో, అది 'విన్‌యార్డ్' ఉద్యమాన్ని ఘోరమైనరీతిలో బలహీనపరుస్తుందనే చింతతో9 జాన్‌ వింబర్‌ ఫ్రిస్బీని ఆ ఉద్యమ బహిరంగ పరిచర్య నుంచి తొలగించాడు. చివరికి ఎయిడ్స్‌ వ్యాధి సోకి ఫ్రిస్బీ 1993వ సంవత్సరంలో మరణించాడు.10

న్యూజిలాండ్‌లో 'అసెంబ్లీస్‌ ఆఫ్‌ గాడ్‌'లో ప్రముఖ పాస్టర్ నేవిల్‌ జాన్సన్‌. అతడు 1988 సంవత్సరంలో అనైతిక ప్రవర్తనను బట్టి రాజీనామా చేసాడు. తన క్యారిస్‌మాటిక్‌ వేదాంతాన్ని భ్రమ కలిగించే స్థాయికి తీసుకువెళ్ళాడు. దేవుడు తనకొక ప్రత్యేక దర్శనమిచ్చాడనీ, తన భార్య త్వరలోనే చనిపోతుంది కనుక తిరిగి వివాహం చేసుకోవచ్చని ఆ దర్శనంలో తనకు కనబడిందనీ జాన్సన్‌ ప్రకటించాడు. ఫలితంగా, వివాహేతర సంబంధాల్లో పాల్గొనడానికి అతనికి ప్రత్యేకమైన కృపను దేవుడు అనుగ్రహించాడని జాన్సన్‌ తెలియచేశాడు.

1986లో ఫెయిత్‌ హీలర్‌ పీటర్‌ పోపొఫ్‌ పరిచర్య మోసపూరితమైందని ఒక జాతీయ టి.వి. ఛానెల్‌ ప్రచారం చేసింది. ప్రేక్షకుల్లో ప్రజలను గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి చెవికి పెట్టుకునే సూక్ష్మమైన ఫోన్‌ని పీటర్‌ ఉపయోగిస్తున్నాడని వేదికపై మ్యాజిక్స్‌ చేసే, గొప్ప పరిశోధకుడు జేమ్స్‌ ర్యాండి కనిపెట్టాడు. పోపొఫ్‌ భార్య శ్రోతల్లో కలిసిపోయి వివిధ వ్యక్తులతో యధాలాపంగా మాట్లాడేది. ఆ తర్వాత తన దగ్గరున్న పోర్టబుల్‌ రేడియో ప్రసారక యంత్రం (ట్రాన్స్ మీటర్‌) ద్వారా (ఒక చిన్న ఫోన్‌ చెవి దగ్గర అమర్చుకున్న) తన భర్తకు ఏమి ప్రకటించాలో చెప్పేది. ఆనందభరితులైన వేలాదిమంది ఆరాధికులకు పోపొఫ్‌ అక్కడ ఉన్న వ్యక్తి పేరు, రోగం, చిరునామా ప్రకటించేవాడు.12 పోపొఫ్‌ భార్య తన భర్తతో చేసే రహస్య సంభాషణను గుర్తించడానికి ర్యాండి ఒక డిజిటల్‌ స్కానర్‌ను ఉపయోగించాడు. ఆ మోసాన్ని "ద టునైట్‌ షో స్టారింగ్‌ జానీ కార్డన్‌” అనే కార్యక్రమంలో బట్టబయలు చేసాడు. సంవత్సరంలోపే పోపొఫ్‌ దివాలా తీసానని దాఖలు చేసుకోవలసి వచ్చింది.

పరిచారకులు నిందారహితులుగా ఉండాలనే వాక్య నియమం ఉంది. ఆ వాక్య నియమాన్ని ఉల్లంఘించినా క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం దానిలోని నాయకులను వారి అవినీతి అక్రమాలను బట్టి బహిరంగ పరిచర్య నుంచి అనర్హులుగా ప్రకటించట్లేదు. ఈ శాఖల్లో అటువంటి అక్రమం వల్ల కలిగే నింద చాలా అత్యల్ప కాలం ఉండడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పీటర్‌ పోపొఫ్‌ బహిరంగ సేవనుంచి ఎన్నడూ తప్పుకోలేదు. అతడు ఆర్థిక సంక్షోభంనుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అతడు అమెరికాలో ఉన్న ఆఫ్రికా జనం మధ్య కొత్త విధానంలో తనను తాను కనపరచుకుని, అద్భుతంగా తిరిగి సంపాదించుకుంటున్నాడని 1998లో 'వాషింగ్టన్‌ పోస్ట్‌' తెలియచేసింది.13 ఒక జాతీయ టెలివిజన్‌ ప్రత్యక్ష ప్రసారం అతణ్ణి వంచకునిగా చూపించిన 25 సంత్సరాల తరువాత (ఇటువంటివే మరికొన్ని తెలియబడని విషయాలు ఇతని గురించి బహిర్గతమైనవి) నేటి దినాన, పీటర్‌ పోపొఫ్‌ పరిచర్యలు వర్ధిల్లుతున్నాయి. ఆకస్మికమైన ధన ప్రవాహాన్నీ స్వస్థతలనూ ఈ వెబ్‌సైట్‌ ప్రసారం చేస్తోంది. 2007లో తన అర్థరాత్రి టెలివిజన్‌ కార్యక్రమంలో 'మిరకిల్‌ స్ప్రింగ్‌ వాటర్‌' ప్యాకెట్లను అమ్మి పోపొఫ్‌ సంస్థ 2 కోట్ల 30 లక్షల డాలర్లు సంపాదించింది.15

1986,87లో మార్విన్‌ గార్మన్‌, జిమ్‌ బక్కర్‌ అనే ఇద్దరు తోటి టి.వి. సువార్తికుల వ్యభిచార సంబంధాలను బయటపెట్టి జిమ్మీ స్వగర్ట్‌ అమెరికా ప్రధాన వార్తల్లో నిలిచాడు. ముఖ్యంగా జిమ్‌ బక్కర్‌ తమ వ్యభిచార ఒప్పందాన్ని బయట పెట్టకుండా తన చర్చి సెక్రటరీని నిశ్శబ్దంగా ఉంచడానికి 2,65,000 డాలర్లు ఆమెకు చెల్లించాడని ఆధారం స్పష్టం చేసింది. తరువాత తన పరిచర్యకు సహాయం చేసే దాతల నుంచి 15 కోట్ల 8 లక్షల డాలర్లు అతడు అపహరించి మోసగించాడని స్పష్టం కాగానే బక్కర్‌ జైలుకు పంపబడ్డాడు. గార్మన్‌, బక్కర్‌లను అపఖ్యాతికి గురిచేసిన కొద్ది కాలానికే, స్వగర్ట్‌ ఒక వేశ్యతో పట్టుబడడం హాస్యపు కథలో ఒక వికృతమైన మలుపు. స్వగర్ట్‌ ఏడుపుగొట్టు ఒప్పుకోలు 1980 టెలివిజన్‌ కార్యక్రమాలలోనే విలక్షణమైన సందర్భాల్లో ఒకటిగా నిలిచిపోయింది. “నా ప్రభువా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. దేవుని మరుపు అనే సముద్రాలలోనికి వెళ్ళేవరకు, మరిక ఎన్నటికీ నాకు వ్యతిరేకంగా అవి జ్ఞాపకం చేసుకోకుండా నీ విలువైన రక్తంతో ప్రతి మచ్చను కడిగి, శుద్ధి చేయమని నేను అడుగుతున్నానని” కన్నీరు నిండిన ముఖంతో అతడు చెప్పాడు.16

అయితే బహిరంగ పరిచర్య నుంచి మాత్రం అతడు వైదొలగలేదు. 1991లో రోడ్డుమీద తప్పు మార్గంలో వాహనం నడుపుతున్నప్పుడు స్వగర్ట్‌ను కాలిఫోర్నియా ప్రధానరోడ్డు గస్తీ కాసే బృందం పట్టుకుంది. ఈసారి కూడా అతడు వేశ్యతోనే ఉన్నాడు. ఈసారి తన నియామకులతో “ఇది మీకు ఏ మాత్రం సంబంధంలేని విషయమనీ, సేవ నుంచి నీవు తప్పుకోవద్దనీ” దేవుడు తనతో చెప్పాడని అన్నాడు.17 నేటి దినాన స్వగ్గర్ట్‌, బక్కర్‌ సంపూర్ణ క్యారిస్‌మాటిక్‌ టి.వి. సువార్తికులుగా ఉన్నారు. ఉత్సాహవంతమైన అనుచరులకు వారికి కొదువ ఏమీ లేదు.

1991లో కాన్సస్‌ సిటీ ప్రవక్త బాబ్‌జోన్స్‌ తన 'ప్రవచన అభిషేకాన్ని' ఉపయోగించి స్త్రీలను దుస్తులు తీసివేసి నగ్నంగా ఉండమని బలవంతం చేసాడనే ఆరోపణను బట్టి బహిరంగంగా అవమానానికి గురయ్యాడు.18 అదే సంవత్సరం, సంవత్సరానికి 8 కోట్ల డాలర్లు పోగుచేస్తున్న రాబర్ట్‌ టిల్టన్ పరిచర్యను ఎబిసి న్యూస్‌ పరిశోధించింది. ఆ పరిచర్యకు ప్రజలు పంపిన కవర్ల లోపల ఉన్న ధనాన్ని తీసుకోవడానికి మాత్రమే వాటిని తెరిచి, ప్రార్థన మనవులను చదవకుండానే అతని పరిచర్య విసిరిపారేసిందని ఆ విచారణ కనుగొన్నది. 2000లో వివాహేతర సంబంధంతో ఒక బిడ్డకు తండ్రి అయ్యాడన్న అనుమానాల మధ్య, 16 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న తన భార్యకు విడాకులిచ్చిన ఏడు రోజులకే తిరిగి వివాహం చేసుకున్నాడు బిషఫ్‌ క్లారెన్స్‌ మెక్‌ క్లెన్‌డన్‌. లాస్‌ ఏంజెలెస్‌లో ఒక భారీ పెంతెకోస్తు సంఘానికి పాస్టరైన మెక్‌క్లెండన్‌ ఇంటర్‌నేషనల్‌ కమ్యూనియన్‌ ఆఫ్‌ క్యారిస్‌మాటిక్‌ చర్చెస్‌కు ఒక ప్రముఖ సభ్యుడు. ఈ అక్రమం జరిగినప్పటికీ, తన గురుపీఠం నుంచి వైదొలగడానికి గానీ తాత్కాలికంగానైనా తప్పుకోవడానికి గానీ తిరస్కరించాడు మెక్‌ క్లెండన్‌. “నాకు వాక్యం బోధించడానికే కానీ వివాహం చేసుకోవడం గురించి పిలుపులేదు. అది నా పరిచర్యను ప్రభావితం చెయ్యదని” అతడు విడాకులను గురించి చెప్పాడు.20

2002 ప్రారంభంలో కాలిఫోర్నియా కేంద్రిత పెంతెకోస్తు పాస్టరైన రాబర్ట్స్‌ లాయర్డన్ తన సంఘంలో యవ్వనస్తుల మధ్య పరిచర్య చేసే సేవకుడైన జాన్‌ కరెట్‌తో స్వలింగ సంపర్క సంబంధం సాగిస్తున్నానని ఒప్పుకొని తన అనుచరులను భయపెట్టాడు. ఆ సంఘటన జరిగిన కొన్నాళ్ల తర్వాతే అతడు సంపూర్ణకాల పరిచర్యకు తిరిగి రావడం ఆశ్చర్యకరం. 2004లో ఈనక్‌ లానీ ఫోర్డ్‌ అనే ట్రినిటీ బ్రాడ్‌కాస్టింగ్‌ నెట్‌వర్క్ లో గత ఉద్యోగి 1990 కాలంలో పాల్‌క్రౌచ్‌ అనే వ్యక్తితో జరిగించిన స్వలింగసంపర్క సంబంధాన్ని గురించిన రాతప్రతిని ప్రచురం చేసేస్తానని అతణ్ణి బెదిరించాడు. 'లాస్‌ ఏంజలస్ టైమ్స్' పత్రిక జరిగిన వృత్తాంతాన్ని బట్టబయలు చేయకుండా ఉండడానికి గతంలో 4 లక్షల 25 వేల డాలర్లు క్రౌచ్‌, ఫోర్డ్ కి చెల్లించినట్లు ప్రకటించింది.22

2005లో “ఎంతో కాలంగా స్వలింగ సంపర్క సంబంధం, త్రాగుడు అనే రెండు విషయాల్లో నేను ఇబ్బంది పడ్డానని” ప్రముఖ క్యారిస్‌మాటిక్‌ ప్రవక్త పాల్‌ కెయిన్‌ ఒప్పుకొన్నాడు.23 అదే సంవత్సరం ఇంటర్‌నేషనల్‌ క్యారిస్‌మాటిక్‌ బైబిల్‌ మినిస్ట్రీస్‌ స్థాపకుడైన ఎర్ల్‌ పాల్క్ కు వ్యతిరేకంగా దావా వేయబడింది. పాల్క్ సంఘంలో అతడు తనను ప్రలోభపెట్టి 14 సంవత్సరాలుగా తనతో అక్రమసంబంధం కలిగి ఉన్నాడని ఒక వివాహిత అతణ్ణి నిందించింది. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయిలో ఉన్నవారు వ్యభిచారం చేయకుండానే వివాహేతర కామకలాపాలు సాగించవచ్చని పాల్క్ చెప్పాడని ఆ మహిళ చెప్పింది. ఈ అక్రమసంబంధాలను 'రాజ్యసంబంధాలని' అతడు పేర్కొన్నాడు.24

మాదకద్రవ్యాలను అందించి తమ కామకోరికలను తీర్చుకోవడానికి మూడు సంవత్సరాల కాలం సహాయపడినందుకు ఒక స్వలింగ సంపర్క సహచరునికి ధనం చెల్లించాడని స్పష్టంగా తెలిసిన తరువాత కొలరెడో స్ప్రింగ్స్ లో ద క్యారిస్‌మాటిక్‌ - ఇవాంజెలికల్‌ న్యూలైఫ్‌ చర్చికి పాస్టరుగా ఉన్న టెడ్ హగ్గర్డ్‌ 2006లో రాజీనామా చేశాడు. 2011 ఫిబ్రవరిలో జి.క్యూ. అనే మ్యాగజైన్‌ ఇంటర్వ్యూ చేసినప్పుడు హగ్గర్డ్‌ ఈ విధంగా వివరించాడు. “నేను గనుక ఒకవేళ ఈ సమాజంలో 21 సంవత్సరాలు గలవాడినై ఉంటే, నన్ను నేను ద్విలింగాత్మకమైన వ్యక్తిగా గుర్తించుకుంటాను". 2010లో కొలరెడోలో అతడు ఒక నూతన సంఘాన్ని కట్టనారంభించాడు.26

2008లో పెంతెకోస్తు బిషప్‌ ధామస్‌ వెస్లీ వీక్స్‌ - 3 క్యారిస్‌మాటిక్‌ ప్రవక్తి అయిన జూయనిట బైనమ్‌ అనే తన భార్యను భౌతికంగా హింసించానని ఒప్పుకొన్నాడు. తన భర్త తనను గొంతునొక్కి ఊపిరాడనీయకుండా చేసాడనీ, నేల పైకి గెంటేసాడనీ, ఒక హోటల్‌ పార్కింగ్‌ స్థలంలో తనను కింద పడేసి తొక్కేసాడనీ ఆమె చెప్పింది. కనుక కోర్టు అతణ్ణి దోషిగా ఎంచింది, అతడు మూడు సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు.27 తనకు వేరే స్త్రీలతో కామకలాపాలు జరిగించాలనే కోరికతో ఇబ్బందిపడుతున్నాననీ, ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది స్త్రీలతో అక్రమ సంబంధాలు కలిగియున్నాననీ బైనమ్‌ అంగీకరించింది.28

2008లోనే ఫెయిత్‌ హీలర్‌ టాడ్‌ బెంట్లీ తనకు ఉద్యోగ వర్గంలో పనిచేసే వారిలో ఒక స్త్రీతో అక్రమసంబంధం ఉందని ఒప్పుకున్నాడు. తన భార్యకు విడాకులిచ్చాక, తాను ఇంతకుముందు అక్రమ సంబంధం కలిగిఉన్న ఆ స్త్రీని బెంట్లీ వివాహం చేసుకున్నాడు.29 అదే సంవత్సరం అశ్లీల చిత్రాలను చూడడమనే జీవితకాల వ్యసనంవల్ల కలిగే వత్తిడి లక్షణాలను కప్పిపుచ్చుకోవడానికి తాను క్యాన్సర్‌తో పోరాడుతున్నానని ఆస్ట్రేలియా పెంతెకోస్తు సువార్తికుడు మైఖెల్‌ గుగ్‌లియేల్‌మక్కి చెప్పినమాట అబద్ధమనే వార్త వెలుగులోకివచ్చింది. తనకు క్యాన్సర్‌ ఉందని లోకాన్ని నమ్మించడానికి, గుగ్‌లియేల్‌మక్కి తన తలను గొరిగించుకొని, ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఉపయోగించి, కొంతమంది నకిలీ వైద్యుల నుంచి కొన్ని అసత్యమైన ఈ-మెయిల్స్‌ సృష్టించాడు. తన రోగాన్ని భరించడానికి ప్రభువు ఏ విధంగా సహాయం చేస్తున్నాడో వివరిస్తూ, హీలర్‌ (స్వస్థపరిచేవాడు) అనే పేరుతో జనాదరణ పొందిన ఒక పాటను కూడా అతడు రాశాడు.30

2009లో రిపబ్లికన్‌ పార్టీ సభ్యుడైన చక్‌ గ్రాస్‌లే కెన్నెత్‌ కోప్‌ల్యాండ్‌, క్రెఫ్లో డాలర్‌, బెన్నీహిన్‌, ఎడ్డీ లాంగ్‌, జాయస్‌ మేయర్‌, పౌలా వైట్‌ మొదలైనవారి పరిచర్యల్లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల గురించి ఒక అధికారిక విచారణ జరిపించాడు. ఈ ప్రముఖ టి.వి. సువార్తికుల విలాసవంతమైన జీవన విధానాలే ఆ విచారణకు పురికొల్పాయి. 2010లో తన సంఘంలోని 13-19 సంవత్సరాల బాలురికి ధనాన్నీ, ఇతర ప్రయోజనాలనూ కలిగిస్తూ ప్రతిగా వారితో స్వలింగ సంపర్క సంబంధాలు కోరుకున్నాడనే ఆరోపణలతో ఎడ్డీలాంగ్‌కు వ్యతిరేకంగా దావాలు వేయబడ్డాయి. 2011లో తన 15 సంవత్సరాల కూతురు గొంతు నులిమిన ఆరోపణలను బట్టి పోలీసులు క్రెఫ్లో డాలర్‌ను అరెస్ట్‌ చేసారు.33

రోమ్‌లో ఒక హోటల్‌ను వదలివెళ్తూ విడాకులు పొందిన టి.వి. సువార్తికులు బెన్నీహిన్‌, పౌలా వైట్‌ చేయిచేయి పట్టుకొన్నట్లు 2010లో నేషనల్ ఇంక్వైరర్ అనే పత్రిక 2010 సంచికలో ప్రచురించిన ఫోటోలు చూపించాయి.34 మారుపేరుతో హిన్‌ అద్దెకు తీసుకొన్న ఒక 5స్టార్‌ హోటల్‌లో ఆ ఇరువురు మూడు రాత్రులు గడిపారని జూలై 23న విడుదలైన ఆర్టికల్‌ తెలియచేసింది.35 వారిద్దరూ ఆ నిందలను ఖండించినప్పటికీ, వారిమధ్య సంబంధం ఉందనే వదంతులు చాలా వేగంగా వ్యాపించాయి. ఆ అపనిందను వ్యభిచార సంబంధం కాదని నిరూపించడానికి వారు వాటికన్‌కు ఆర్థిక విరాళాలను అందించడానికి వచ్చామని పట్టుబట్టారు. రెండు సంవత్సరాల తరువాత 2012లో పెంతెకోస్తు పెద్ద అయిన జాక్‌ హేఫోర్డ్ వివాహ వేడుకను జరుపుతుండగా తాను, తన భార్య సుజానే తిరిగి వివాహం చేసుకోబోతున్నామని బెన్నీహిన్‌ ప్రకటించాడు. 2010 ఫిబ్రవరిలో సర్దుబాటు చేసుకోలేని విషయాలను ఉదాహరిస్తూ సుజానే విడాకులకు దరఖాస్తు చేసింది. దాని తర్వాత తన భార్య కొన్ని మాదకద్రవ్యాలకు బానిసైన కారణాన్ని బట్టి వారు విడిపోయారని బెన్నీ వ్యాఖ్యానించాడు.36

పైన పొందుపరిచిన ఉదాహరణలు క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాన్ని నిరంతరాయంగా భ్రష్టు పట్టిస్తున్న అనేక జాతీయ అంతర్జాతీయ అక్రమాల్లో కేవలం పిడికెడు మాత్రమే.37 కానీ “అక్రమానికీ, ప్రముఖ పెంతెకోస్తు ప్రసంగీకులకు మధ్య ఉన్న దీర్ఘకాలపు ఆకర్షణ" అని టైమ్ మ్యాగజైన్‌ చెబుతున్న మాటలకు సరిపడే ఆధారాన్ని అవి సమకూరుస్తున్నాయి.38 నాకు ఈ వ్యక్తులతో వ్యక్తిగతంగా శత్రుత్వమేమీ లేదు. కానీ వీరు నేటి కాలానికి చెందిన నాదాబు అబీహులను పోలి ఉన్నారని చెప్పటానికి మాత్రం నాకెలాంటి సమస్యా లేదు. వారు ఆత్మీయ కిరాతకులు, వారు అన్యాగ్నితో ఆటలాడుకుంటున్నారు. పరిచర్యలో వారు ఇంక చేయగలిగిందేమీ లేదు. వారు కలిగించిన నష్టాన్ని బట్టి దేవునికి వారు సమాధానం చెప్పుకుంటారని” ఇటువంటి సంఘటనలపై వ్యాఖ్యానిస్తూ కరిష్మా పత్రికా సంపాదకుడైన జె.లీ. గ్రాడీ బలవంతంగా అంగీకరించాడు.39

గ్రాడీ భయపడడం సరైన విషయమే. కానీ ఈ అక్రమాలను ఒక సాధారణ సమస్యగా కంటే ప్రమాదకరమైనవిగా చూడడంలో అతడు విఫలమయ్యాడు. వాస్తవానికి అవి సంపూర్ణమైన లోపాలను తెలియచేసే లక్షణాలుగా ఉన్నాయి. అటువంటి దోషాలు క్యారిస్‌మాటిక్‌ చరిత్ర అంతటా వ్యాపించాయి. వాటి మూలాన్ని వెదకండి. ఏదొక తప్పుడు సిద్ధాంతంలో అవి వేళ్ళూనుకుని ఉన్నవని మీరు గ్రహిస్తారు. సులభంగా చెప్పాలంటే ఈ అధ్యాయంలో మనం గ్రంథస్థం చేసిన నైతిక, ఆధ్యాత్మిక వైఫల్యాలు పరిశుద్ధాత్మను గురించిన తప్పుడు బోధ వలన కలిగిన పరిణామాలే.

ఈ అక్రమాల సుదీర్ధ జాబితా అంతటిలో స్థిరంగా కొనసాగిన అంశాన్ని విస్మరించడం అసాధ్యం. జరిగిన అపరాధం ఎంత తీవ్రమైనదైనప్పటికీ, దానికి ప్రజల ఆగ్రహం తొలుత ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఈ క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో అనర్హులైన పాస్టర్లు వారి గురుపీఠ సింహాసనాలను వీలైనంత త్వరితంగా, కొన్నిసార్లు కొన్ని వారాల వ్యవధిలోనే తిరిగి అధిరోహించారు (కొన్నిసార్లు అసహ్యకరమైన సందర్భాల్లో సైతం, అసలు ఏ మాత్రం ఆటంకంలేకుండా కొనసాగననుమతించబడ్డారు). వారి నాయకులు దేవునితో వ్యక్తిగతంగా ఉన్నతమైన సంబంధాలను కలిగిన మహాత్ములు కనుక స్థానిక స్థాయిలో ఎవరికీ లోబడే అవసరం కానీ లెక్క అప్పగించవలసిన అవసరం కానీ లేదనే విధంగా క్యారిస్‌మాటిక్‌ సంఘాలకు బోధించబడే విధానమే దీనికి గల ప్రధాన కారణం.

“ఒక వ్యక్తి క్యారిస్‌మాటిక్‌ శక్తిని, అభిషేకాన్ని పొందుకున్న కారణాన్ని బట్టి అతని వైఫల్యాన్ని........ ప్రజలు తరచూ సులభంగా క్షమించి ఉపేక్షిస్తున్నారని” వేదాంత బోధకుడు చాడ్‌బ్రాండ్‌ వివరిస్తున్నాడు. 1975లో జాన్‌హగీ విడాకులూ, 1979లో (ఓరల్‌ రాబర్ట్స్‌ కుమారుడైన) రిచర్డ్‌ రాబర్ట్స్‌ విడాకులు, 2007లో పౌలా, ర్యాండీ వైట్‌ల యొక్క విడాకులను గమనించిన తర్వాత బ్రాండ్‌ ఈ విధంగా చెప్పాడు. “ఈ విడాకులు వారి పరిచర్యల్లో అనేక చిక్కులు తెచ్చినప్పటికీ, తర్వాత కాలంలో ప్రతి సందర్భంలోనూ వారి పరిచర్య వర్ధిల్లింది. కానీ ఎన్నో ఇతర ఇవాంజెలికల్‌ సంఘాల్లో మాత్రం, విడాకుల ప్రభావం ఆ సేవకులను అతిగా కలిచి వేసింది.”41

పరిశుద్ధాత్మ ఆశయాలతో అతిగా ఏకీభవిస్తున్నామని చెప్పుకుంటున్న ఒక ఉద్యమం, ప్రసంగీకులకు, బోధకులకు లేఖనం నియమించిన ఉన్నత ప్రమాణాలను అంటే వ్యక్తిగత పరిశుద్ధత గురించి కనీసం శ్రద్ధ చూపకపోవడం హాస్యాస్పదం.

పరిశుద్ధాత్మ నిజకార్యం ప్రజల జీవితాల్లో పరిశుద్ధతను కలుగచేస్తుంది. ఒక ఉద్యమపు నాయకత్వం నిరంతరం అవినీతి అక్రమాల వలన మలినమౌతుంటే, అదిదాని వెనకున్న ఆత్మీయ బలగాల్ని ప్రశ్నించడానికి తావిస్తోంది. తన ప్రజలు క్రీస్తు సారూప్యంలోనికి ఎదుగుతూ ఉండగా, పాపంతో పోరాడడానికి శక్తిననుగ్రహిస్తూ పరిశుద్ధాత్ముడు వారిని పవిత్రపరిచే కార్యంలో చురుకుగా నిమగ్నమైయున్నాడు. మరోపక్క అదుపులేని శరీర కోరికలే అబద్ధ బోధకుల లక్షణాలుగా ఉన్నాయి (2 పేతురు 2:10,19)

3వ పరీక్ష: పరిశుద్ధాత్మ కార్యంగా చెప్పబడుతున్నది ప్రజల గమనాన్ని లేఖనాలవైపు మళ్ళిస్తోందా?

ప్రజలను దేవుని వాక్యం దగ్గరకు నడిపించడమే పరిశుద్ధాత్మ నిజకార్యానికి గల మూడవ ప్రత్యేకమైన సూచన. “పరిశుద్ధ లేఖనాల యెడల మనుషుల్లో ఉన్నతమైన గౌరవం కలుగచేసి వారిని సత్యంలోనూ, భక్తిసందు స్థాపించే విధంగా పనిచేస్తున్న ఆత్మ కచ్చితంగా దేవుని ఆత్మయే” అని జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ వివరించాడు.42 1యోహాను 4:6 నుంచి ఎడ్వర్డ్స్‌ ఈ నియమం తీసుకున్నాడు. “మనము దేవుని సంబంధులము: దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధికానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మయేదో, భ్రమపరచు ఆత్మయేదో తెలసికొనుచున్నాము” అని ఇక్కడ అపొస్తలుడైన యోహాను తన పాఠకులతో చెప్పాడు. పరిశుద్ధాత్ముని నిజకార్యం విశ్వాసులను అపొస్తలుల బోధ (కొత్త నిబంధన) కూ, తద్వారా సంపూర్ణ బైబిల్‌కూ లోబడేలా నడిపిస్తుంది. లేఖనాల పట్ల ఉన్నతమైన గౌరవాన్నీ ప్రేమనూ కలిగి ఉండేలా ఆయన వారిని నడిపిస్తాడు. దానికి భిన్నంగా అబద్ధ ప్రవక్తలు దేవుని వాక్యాన్ని అవమానిస్తూ వారి సొంత అభిప్రాయాలను దానికి కలిపి, దాని అర్థాన్ని వక్రీకరిస్తుంటారు (2పేతురు 3:16).

పరిశుద్ధాత్మునికీ, ఆయన ప్రేరేపించిన లేఖనాలకూ మధ్య విడదీయరాని బంధం ఉందని బైబిల్‌ బోధిస్తోంది (2పేతురు 1:20,21). ప్రభువైన యేసు రాకను గురించి పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించడానికి ఆయనే వారిని ప్రేరేపించాడు (1పేతురు 1:10,11, అపొ.కా. 1:16; 3:18). అదే విధంగా సువార్త గ్రంథాలను కొత్త నిబంధన పత్రికలనూ రచించడానికి అపొస్తలులను పరిశుద్ధాత్మడే ప్రేరేపించాడు (యోహాను 14:25-26, 15:26). పరిశుద్ధాత్ముడు అపొస్తలులకు ఇచ్చే ప్రత్యక్షత గురించి మాట్లాడుతూ ప్రభువైన యేసు వారికి ఈ విధంగా వివరించారు, “నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన, అనగా సత్య స్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి సడిపించును. ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని” (యోహాను 16:12-15). పరిశుద్ధాత్ముడు తనంతట తాను ఏమి మాట్లాడడు కానీ క్రీస్తు మాటను వారికి బయలుపరుస్తాడని ప్రభువు స్పష్టం చేసారు. కొత్త నిబంధన రాయబడినప్పుడు ఆ వాగ్దానం నెరవేరింది.

బైబిల్‌ పరిశుద్ధాత్ముని గ్రంథం. ఆయన దాన్ని ప్రేరేపించి, శక్తితో నింపాడు. లోకాన్ని పాపం గురించి ఒప్పించడానికీ (యోహాను 16:8-11, అపొ.కా. 2:37), పాపులకు రక్షకుణ్ణి చూపించడానికీ (యోహాను 5:39, 1యోహాను 5:6), విశ్వాసుల్ని వారి ప్రభువు స్వారూప్యంలోనికి మార్చడానికీ (2కొరింథీ 3:18, 1పేతురు 2:2) ఆయన ఉపయోగించే ప్రధాన సాధనం ఇదే. దానికి తగ్గట్లుగానే, లేఖనాలు “ఆత్మఖడ్గం”గా వర్ణించబడ్డాయి. శోధనకు వ్యతిరేకంగా ఆత్మరక్షణ చేసుకోవడానికి విశ్వాసులకు ఆ ఖడ్గం ఆత్మశక్తిచే నిండిన ఒక ఆయుధం (ఎఫెసీ 6:17). అది అవిశ్వాస హృదయాలను పొడిచేందుకు పరిశుద్ధాత్ముడు ఉపయోగించే ఖచ్చితమైన సాధనం (హెబ్రీ 4:12). “క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి” అనే కొలస్సీ 3:16లోని ఆజ్ఞ “ఆత్మపూర్ణులైయుండుడి” అనే ఎపెసీ 5:15లోని ఆజ్ఞ ఒకే విధమైన ఫలితాలను కలుగచేస్తాయి కనుక అవి సమాంతరమైనవనిగా కనబడుతున్నాయి (ఎఫెసీ 5:18-6:9, కొలస్సీ 3:16-4:1).

“పరిశుద్ధాత్మ పూర్ణులైతే తప్ప విశ్వాసుల్లో దేవుని వాక్యం నివసించడం అసాధ్యం. అదే విధంగా క్రీస్తు వాక్యం క్రైస్తవులలో నివసిస్తే తప్ప వారు ఆత్మపూర్ణులు కాలేరని” ఒక వ్యాఖ్యానకర్త వివరించాడు.43 ఆత్మపూర్ణులవ్వడమనేది లేఖనాలతో నింపబడడం ద్వారా ఆరంభమౌతుంది. విశ్వాసులు క్రీస్తు వాక్యానికి లోబడే కొలది, పరిశుద్ధాత్ముని పవిత్రపరిచే ప్రభావం కిందకి వస్తారు. విశ్వాసులు ప్రభువైన యేసును గురించిన గ్రహింపులో ఎదిగేలా, వారి హృదయాలను వెలిగించేది పరిశుద్ధాత్ముడే. దానికి తగినట్లు రక్షకుని యెడల వారి ప్రేమ అధికం ఔతుంది (1కొరింథీ 2:12-16).

ఆయనే ప్రేరేపించి, శక్తితో నింపుతూ రక్షణ పరిశుద్ధతల కోసం ఆయనే వెలిగిస్తున్న పవిత్ర లేఖనాలను అధ్యయనం చేసి అన్వయించడానికి పరిశుద్ధాత్ముడు ఎన్నడూ అడ్డుపడడు. కానీ పరిశుద్ధాత్ముడు తనంతట తానే మాట్లాడుతున్నాడనీ, తన వాక్యసత్యానికి విరుద్ధమైన పద్ధతిలో నేటి సంఘంలో పని చేస్తున్నాడనీ చెబుతూ వాక్యవిరుద్ధమైన అనుభవాలను సమర్ధించి వాక్యేతర ప్రత్యక్షతలకు మద్దతునివ్వడం ద్వారా బైబిల్‌కూ, దాని దివ్య గ్రంథకర్తకూ మధ్య ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ఒక చీల దింపింది. పరిశుద్ధాత్మ గురించి వారి సొంత కథనాన్ని అల్లుకుని, లేఖనానికి సంబంధంలేని కొత్త పద్ధతుల్లో ఆయన మాట్లాడి పనిచేయాలని క్యారిస్‌మాటిక్స్‌ ఆశిస్తున్నారు. ఫలితంగా వాక్య ప్రత్యక్షత దారుణమైన రీతిలో హేళనకూ అవమానానికీ గురవుతున్నది.

దేవుని వాక్యాన్ని ఏకాగ్రతతో చదివితే అది ఆత్మకార్యాన్ని పరిమితం చేస్తుంది, అడ్డుకుంటుంది అనే భయంకరమైన భావం అనేక క్యారిస్‌మాటిక్‌ సమాజాల్లో ఉంది.44 కానీ సత్యం నుంచి దూరపరిచే ఆలోచన ఇంతకు మించినది మరొకటేదీ లేదు. వాక్యాన్ని పరిశోధిస్తే అది ఆత్మను విస్మరించినట్టు కాదు, అది ఆయనను ఘనపరిచినట్టు ఔతుంది (అపొ.కా. 17:11). లేఖనాల ఖచ్చితమైన అర్ధాన్ని వివేచించడానికి వాటిని వెదకడమంటే, నేరుగా పరిశుద్ధాత్ముని నుంచి వినడమే. ఎందుకంటే అందులోని ప్రతి పదాన్ని ప్రేరేపించింది ఆయనే కనుక.

దేవుడు తన సొంత నామం కంటే హెచ్చించిన ఆత్మ ప్రేరేపిత లేఖనం యెడల (కీర్తన 138:2) ఉన్నతమైన భావాన్ని ప్రజల్లో నింపడానికి బదులు, బైబిల్ కు బయట పలు చోట్ల దైవప్రత్యక్షత కోసం వెదకమని క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఆ తప్పుడు భావం లేఖన సమృద్ధిని గురించిన సిద్ధాంతాన్ని నాశనం చేసి లేఖన ప్రత్యక్షత ముగిసిందనే సిద్ధాంతాన్ని దారుణంగా విస్మరిస్తూ విపత్కరమైన పర్యవసానాలను కలుగచేస్తోంది. దైవ ప్రత్యక్షత నేటికీ ఇంకా అనుగ్రహించబడుతుందని వాదిస్తూ వాక్య ప్రత్యక్షత విశిష్టతను గట్టిగా ప్రశ్నించిన వారికి తనను తానే అపొస్తలుడుగా ప్రకటించుకున్న 'థర్డ్ వేవ్' స్థాపకుడు పీటర్‌ వాగ్నర్‌ ఒక ఉదాహరణగా నిలుస్తున్నాడు.

"దేవుడు బయలువరచాలనుకున్న దానంతటిని బైబిల్‌లో బయలుపరచాడని ఊహిస్తూ దేవుడు నేరుగా మాతో సంభాషిస్తున్నాడనే అభిప్రాయానికి కొందరు అభ్యంతరం చెబుతున్నారు. అయితే బైబిల్‌లో 66 గంథాలే ఉన్నాయని ఎక్కడా చెప్పబడలేదు కనుక ఇది నిజం కాదు. వాస్తవానికి ఏ గంథాలు బైబిల్ లో ఉండాలి ఏవి ఉండకూడదు అనే విషయాన్ని సంఘానికి బయలుపరచడానికి దేవునికి దాదావు 200 సంవత్సరాల కాలం పట్టింది. అది వాక్యేతర ప్రత్యక్షత. అయినప్పటికీ కాథలిక్కులూ ప్రొటస్టెంట్‌లూ ఇంకా గ్రంథాల సంఖ్య గురించి భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు. దానికి మించి, ప్రార్థన రెండు విధాలుగా ఉందని నేను నమ్ముతాను. మనం దేవునితో మాట్లాడతాం, ఆయన మనతో మాట్లాడాలని ఆశిస్తాం. మనం దేవుని స్వరం వినగలం. మనం చూసినట్టు ప్రవక్తలకు ఆయన కొత్త విషయాలను కుడా బయలుపడుస్తాడని” వాగ్నర్‌ రాశాడు.45

'లేఖనాల ప్రమాణ ముగింపు' (The closed canon of scripture) వంటి ప్రాథమిక సత్యాన్ని బహిరంగంగా ప్రశ్నించి, పరోక్షంగా కుడా దాన్ని తృణీకరించిన ఆ రకమైన ఆలోచన క్యారిస్‌మాటిక్స్‌ ఆలోచన ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియచేస్తోంది. వాక్య ప్రత్యక్షత అనే లంగరు నుంచి అంతకంతకూ లోతుకు కొట్టుకొనిపోతూ ఎన్నో తప్పుడు బోధలకు సృష్టికర్తగా వాగ్నర్‌ తన జీవితాన్ని గడపడం ఆశ్చర్యమైన విషయమేమీ కాదు.46

క్యారిస్‌మాటిక్‌ రచయిత జాక్‌ డీరె 'లేఖనాల సమృద్ధి' (The sufficiency of scripture) ని గురించిన బోధను దెయ్యాల బోధని పేర్కొనే స్థాయికి వెళ్ళిపోయాడు.

“మన జీవితాల్లో దేవుని ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి గ్రంథస్థం చేయబడిన బైబిల్‌ నుంచీ, పరలోకం నుంచీ తాజాగా వచ్చిన మాటనుంచీ ఆయన స్వరాన్ని మనం వినగలగాలి. క్రైస్తవులు దేవుని స్వరాన్ని వినడంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను సాతానుగాడు గ్రహించాడు కనుక ఈ విషయంలో మనకు వ్యతిరేకంగా అనేక దాడులు వాడు ప్రారంభించాడు. గంథస్థం చేయబడిన వాక్యం ద్వారా తప్ప దేవుడు మరి ఏ విధంగానూ మాట్లాడడని బోధించే ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేయడమే వాడు చేసిన అత్యంత విజయవంతమైన దాడుల్లో ఒకటి. చివరికి ఈ సిద్ధాంతాన్ని సంపూర్ణమైనదిగా చేయడంలో క్రైస్తవ వేదాంత పండితులు ఉపయోగించబడినప్పటికీ ఇదొక దెయ్యాల బోధని” అతడు చెప్పాడు.47

లేఖనాలకు బయట దైవ ప్రత్యక్షతను క్రైస్తవులు వెదకాలని డీరె పట్టుబట్టాడు. కానీ క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో ప్రవక్తల ప్రవచనాలు తప్పులతో నిండి ఉన్నాయని అంగీకరించి వాక్యేతర సందేశాలకు నమ్మకంగా అర్ధం చెప్పడమనేది దాదాపు అసాధ్యమని అతడు గుర్తించాడు. “మన సొంత ఆలోచనలను దేవుని ప్రత్యక్షతగా పొరబడే అవకాశముందని” సైతం డీరే అంగీకరించాడు.48 కల్పిత దర్శనాలు, తప్పుడు ప్రవచనాలే క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో నిత్యమూ చెప్పబడుతున్నాయనే విషయాన్ని మనం 6 వ అధ్యాయంలో చూద్దాం.

నూతన ప్రత్యక్షతగా చెప్పబడుతున్న వాటి వలన తీరని నష్టం జరుగుతున్నప్పటికీ, కొన్ని క్యారిస్‌మాటిక్‌ సంఘాలు ఈ ఆధునిక ప్రవచనానికి బైబిల్‌ కంటే అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. "బైబిల్‌ కంటే నూతన దర్శనాలకు అధిక విలువనిచ్చే సంఘాల్లో జాన్‌ రాబర్ట్స్‌ స్టీవెన్స్‌ స్థాపించిన 'ద చర్చ్‌ ఆఫ్‌ ద లివింగ్‌ వర్డ్‌', 'ద యునైటెడ్‌ హౌస్‌ ఆఫ్‌ ప్రేయర్‌ ఫర్‌ ఆల్‌ పీపుల్‌' లు ఉన్నాయి. బైబిల్‌ పురాతనమైనది కనుక మన కాలంలో ఆత్మ ప్రేరేపించిన ప్రవచనాలను దానికి అదనంగా చేర్చవలసిన అవసరం ఉందని స్టీవెన్స్‌ బోధిస్తున్నాడని”49 ఒక రచయిత రాశాడు. కొన్ని సంఘాలు అంత విపరీత స్థాయికి చేరుకోవు. అయితే దేవుడు నేటి సంఘానికి నూతన ప్రత్యక్షత ఇస్తున్నాడనే క్యారిస్‌మాటిక్‌ నమ్మకం నుంచి ఉత్పన్నమయ్యే భావాలకు ఆ ఉదాహరణలు అద్దం పడుతున్నాయి. ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఇంకా దైవ ప్రత్యక్షత ననుగ్రహిస్తుంటే, ఆ మాటలను సేకరించి మన బైబిల్స్‌లో ఎందుకు చేర్చకూడదు?

ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం తనను తాను ఇవాంజెలికల్‌ శాఖగా పిలుచుకోవడం తప్పు. ఎందుకంటే అది లేఖనాల అధికారాన్నీ వాటి సమృద్ధినీ నిర్లక్ష్యం చేస్తోంది. బైబిల్‌కు పైగా కల్పిత ప్రత్యక్షతలనూ, ఆధ్యాత్మిక అనుభవాలనూ హెచ్చిస్తున్నందుకు ఈ ఉద్యమం వాక్యానుసారమైనది కాదు, ఇవాంజెలికల్‌ శాఖ కూడా కాదు. రూపాంతర కొండపై తన స్వీయ అనుభవాన్ని గురించి మాడ్లాడుతూ, అపొస్తలుడైన పేతురు ఈ కింది ప్రత్యక్షతనిచ్చాడు.

ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, తండ్రియెన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడ ఉండిన వారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చెక్కటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు (2 పేతురు 1:16-19).

రూపాంతర సమయంలో పేతురు అసమానమైన అద్భుత దృశ్యాన్ని చూసాడు. ఆయనకు అచ్చమైన పరలోక అనుభవం ఉంది. అయినప్పటికీ ఎంతో గంభీరమైన అనుభవాల కంటే లేఖనాలు (ప్రవచన వాక్యం) స్థిరమైనవని అపొస్తలునికి తెలుసు. అనేక మంది క్యారిస్‌మాటిక్స్‌ గ్రహించ విఫలమైన విషయాన్నే పేతురు ఖచ్చితంగా చెబుతున్నాడు. మానవ అనుభవం వ్యక్తిగతమైనది, లోపాలతో కూడినది. కేవలం దేవుని వాక్యం మాత్రమే నిశ్చయమైనది, నిర్దోషమైనది, ఎందుకంటే దానికి ఆధారమైనవాడు పరిపూర్ణుడు.

పేతురులా అపొస్తలుడైన పౌలు కూడా నమ్మశక్యంకాని పరిస్థితిననుభవించాడు. అతడు పరలోకానికి తీసుకొనిపోబడ్డాడు, “పరదైసుకు కొనిపోబడి అక్కడ మనుష్యుడెవడును వచింపశక్యం కాని మాటలను విన్నాడు” (2కోరింథీ 12:14). మరణానంతర జీవితం గురించి అద్భుతమైన కథలను అల్లి పరలోకంలో తాము చూసినట్టు చెబుతున్న వాటి గురించి ఉపన్యాసాలిస్తూ జీవితాన్ని గడిపేస్తున్న వారిలా కాకుండా తన అనుభవాన్ని గురించి గొప్ప చెప్పుకోవడం ప్రయోజనకరం కాదనీ, ఆధ్యాత్మికంగా లాభదాయకం కాదని పౌలు చెప్పాడు (వ1). ఎందుకు? ఎందుకంటే ఆ నిజమైన అనుభవాన్ని సహితం ఎవ్వరూ నిర్ధారించలేరు, అది పునరావృతం కాదు. పౌలు అతిశయిస్తే అది సువార్త సత్యాన్ని గురించీ, తన స్వీయ రక్షణలో ఉన్న అద్భుతాన్ని గురించీ అతిశయిస్తాడు (గలతీ 6:14). నిజానికి తనకు కలిగిన నిజమైన దర్శనాలనూ, ప్రత్యక్షతలనూ బట్టి అతిశయపడకుండా, ప్రభువు అతనికి శరీరంలో ఒక ముల్లు, సాతాను దూతగా పెట్టాడు (2 కోరింథీ 12:7). తనకు కలిగిన ఉన్నతమైన అనుభవాలను బట్టి గర్వించడానికి బదులు, దేవుని వాక్యాన్నిబోధించడానికి దేవుడు పౌలును పిలిచాడు (2 తిమోతి 4:2). ఎందుకంటే విశ్వాసముంచు ప్రతి వానికి రక్షణ కలుగచేయడానికి వాక్యానుసారమైన సువార్త దేవుని శక్తియై ఉంది (రోమా 1:16).

వాక్య ప్రత్యక్షతకు వెనకున్న మూలం, దాని వెనకున్న శక్తి ఎవరు? మనం పేతురు రూపాంతర సన్నివేశాన్ని తిరిగి చూస్తే, ఈ ప్రశ్నకు 2 వచనాల తర్వాత సమాధానం మనం చూస్తాము, “ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన పేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి” (2 పేతురు 1:21). దేవుని వాక్యమే మనకు అధికారి. దానికి లోబడితే, మనం స్వయంగా లోబడేది పరిశుద్ధాత్మకే. ఎందుకంటే అందులో ఉండే ప్రతి పదాన్ని ఆయనే ప్రేరేపించాడు గనుక. పరిశుద్ధాత్మ నిజకార్యమేదైనా లేఖనాలను వ్యతిరేకించదు, అమర్యాదచేయదు, లేఖనాలకు నూతన ప్రత్యక్షతను కలుపదు (ప్రకటన 22:17-19). దీనికి భిన్నంగా విశ్వాసుల హృదయాల్లోనూ, మనసుల్లోనూ వాక్య సత్యాన్ని ఘనపరుస్తుంది.

4వ పరీక్ష: పరిశుద్ధాత్మ కార్యంగా పిలువబడుతున్నది సత్యాన్ని ఘనపరుస్తోందా?

పరిశుద్ధాత్మకార్యమని చెప్పబడే దేనికైనా అన్వయించాల్సిన పరీక్షల్లో నాలుగవది ఇదే: ఆ కార్యం ఆత్మసంబంధమైన సత్యానికీ సిద్ధాంతపరమైన స్పష్టతకూ ప్రాధాన్యతనిస్తోందా? లేక అయోమయాన్ని సృష్టించి, అసత్యాన్ని ప్రచారం చేస్తోందా?

1యోహాను 4:6లో “సత్య స్వరూపమైన ఆత్మయేదో, భ్రమపరచు ఆత్మయేదో మనకు తెలుసని” అపొస్తలుడైన యోహాను స్పష్టంగా రాశాడు. సత్యస్వరూపిగా నిర్వచించబడిన పరిశుద్ధాత్ముడు, లోపాలతో అబద్ధాలతో వ్యక్తీకరించబడుతున్న భ్రమపరచు దురాత్మలకు పూర్తి విరుద్ధంగా నిలుస్తున్నాడు. ఒక ఆత్మసంబంధమైన ఉద్యమం సత్యమైన వేదాంతాన్ని పరిరక్షించి తప్పుడు బోధను నిందిస్తే అది పరిశుద్ధాత్మ స్వచ్ఛమైన కార్యమే అనడానికి బలమైన సూచనలున్నాయి.50 దానికి భిన్నంగా హితబోధను విస్మరించి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ, అన్ని రకాల క్రైస్తవ శాఖల ఐక్యత విషయంలో రాజీపడే ఏ మత వ్యవస్థ విషయంలోనైనా విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి.

హితబోధ కంటే వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవానికే ప్రాధాన్యతనిస్తున్న క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో వాక్యసత్యమెన్నడూ ప్రధానమైనది కాకపోవడం విచారించదగిన వాస్తవం. “పెంతెకోస్తు దినాన వివిధ భాషల్లో మాట్లాడడం ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మమనే అత్యున్నత అనుభవంతో పెంతెకోస్తు శాఖ దానిని అనుభవపూర్వకమైన కైస్తవ్యంగా ఇతరులు గుర్తించాలని కోరుతుంది. పెంతెకోస్తు శాఖ అనేది ఒక సిద్ధాంతం కాదు కాని, పరిశుద్ధాత్మ అనుభవమని పెంతెకోస్తువారు నిరంతరం చెబుతున్నారని” వేదాంత పండితుడైన ఫ్రెడరిక్‌ డేల్‌ బ్రూనర్‌ వివరిస్తున్నాడు.51

(ఆత్మ బాప్తిస్మం గురించి తప్పుడు అభిప్రాయాన్ని ఒకదాన్ని ఆధారం చేసుకుని) దాని వేదాంతానికి 'భాషల్లో మాట్లాడడాన్ని' అత్యంత ముఖ్యాంశంగా చేసుకున్న పెంతెకోస్తు ఉద్యమ చరిత్రలో దీనికొక ఉదాహరణ కనిపిస్తుంది (1901వ సంవత్సరంలో). తొలి పెంతెకోస్తు సభ్యులు లేఖన భాగాన్ని అధ్యయనం చేసినపుడు, బైబిల్‌లో భాషలు ప్రామాణిక విదేశీ భాషలని భావించారు. అయితే వారు పొందిన భాషల వరంలో భాషలు నిజమైనవి కావని స్పష్టమైనప్పుడు ఏమి జరిగింది? లేఖనమే వారి అంతిమ అధికారమై ఉంటే, వారు చేస్తున్నది వాక్యంలో ముందు సంభవించిన దానికి ఏకీభవించట్లేదనే వాస్తవాన్ని గమనించి, వారు ఆ ఆచరణను విడిచిపెట్టి ఉండేవారు. దానికి బదులు ఒక మోసాన్ని సమర్థించి, భద్రపరచడానికి వాక్యాన్ని తారుమారు చేసి, వారు కొత్త నిబంధన అర్థాన్ని సమూలంగా మార్చేశారు. ఆ విధంగా భాషలను అర్థంలేని భాషగా పునర్‌నిర్వచించి తద్వారా ప్రస్తుత సూచనకు సరిపడేటట్టు చేయడానికి భాషలను గురించిన స్పష్టమైన లేఖన బోధను వక్రీకరించారు.

ఆచరణలో నిరంతరం, పెంతెకోస్తు సంఘాలు సత్యానికన్నా వ్యక్తిగత అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. ఆత్మలో వధించబడడం అనే వాక్యవిరుద్ధమైన ఆచారాలు ప్రచారం చేయబడడానికి కారణం అది ప్రజలకు మంచి భావాన్ని కలుగచేస్తుందనే తప్ప లేఖనంలో దానికి అనుమతి ఉందని మాత్రం కాదు. స్త్రీ నాయకత్వమే నిరంతరం క్యారిస్‌మాటిక్‌ ఉద్యమ ప్రత్యేక లక్షణం కనుక సంఘంలో స్త్రీలు పాస్టర్లుగా అనుమతించబడుతున్నారు, కాని కొత్త నిబంధన అనుమతితో మాత్రం కాదు (1 తిమోతి 2:12). ప్రజలను పరమానందభరితుల్ని చేయడానికి ఉద్రేకం అవసరం కనుక మతిలేని, అదుపు తప్పిన ఆరాధన పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు (1 కొరింథీ14:33), బైబిల్‌ అంగీకరిస్తుందని మాత్రం కాదు. పెంతెకోస్తు శాఖలో వాక్య అధికారంపై వ్యక్తిగత ఆత్మీయ అనుభవం నిరంతరం దాడి చేస్తుందని చూపే ఉదాహరణలెన్నో చూపించవచ్చు.

1960లో ప్రారంభమైన క్యారిస్‌మాటిక్‌ రెన్యువల్‌ ఉద్యమం ఇదే సమస్యతో నిండి ఉంది. కేవలం ఒకే రకమైన అనుభవాలపై తప్ప మరే ఇతర విషయంపై ఆధారపడని లోతులేని ఐక్యత కోసం, ప్రధాన సిద్ధాంతాలను విస్మరించడం ఈ ఉద్యమ వైఖరిలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.52 ఈ అనుభవాలను బట్టి ఐకమత్యంగా ఉండడం అనే ఆలోచనకు అతి ఘోరమైన ఉదాహరణ క్యారిస్‌మాటిక్‌ సార్వత్రిక ఉద్యమం కాథలిక్‌ క్యారిస్‌మాటిక్స్‌ను అంగీకరించడమే. కేవలం తమ కాథలిక్‌ స్పేహితులు భాషల్లో మాట్లాడుతున్నారనే కారణం చేతనో లేదా క్యారిస్‌మాటిక్‌ అనుభవంలోని ఇతర అంశాలను హత్తుకున్న కారణం చేతనో క్యారిస్‌మాటిక్‌ సభ్యులనేకులు చారిత్రాత్మక ప్రొటస్టెంటు సిద్ధాంతాలను నిర్లక్ష్యం చేసారు. నేటి దినాన క్యారిస్‌మాటిక్‌ మార్మన్స్‌ కూడా ఉన్నారు.53 వారికి క్యారిస్‌మాటిక్‌ అనుభవముంటే చాలు వారి బోధ ఏదైనప్పటికీ, వారు ఈ ఉద్యమంలో సభ్యులే.

క్యారిస్‌మాటిక్‌ టెలివిజన్‌ను యధాలాపంగా చూసినా సరే అది, అనేక క్యారిస్‌మాటిక్స్‌కు వాక్య సత్యం కంటే వ్యక్తిగత అనుభవమే అధిక ప్రాధాన్యమైనదనే వాస్తవాన్ని ఉదాహరిస్తోంది. “అది నిజం కాదు, దేవుని వాక్యంలో అది లేదు. దానిని మేము అంగీకరించము. లేఖనం చేత దాన్ని మీరు నిర్ధారించలేరని” చెప్పి తప్పుడు బోధకుణ్ణి వ్యతిరేకించే క్యారిస్‌మాటిక్‌ టెలివిజన్‌ యాంకర్‌ కోసం నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఏమి బోధించినా అలా ఎవ్వరూ ఎన్నటికీ గద్దించరు. అది అతి వికారమైన వేదాంతం కావచ్చు, లేదా సందర్భంలో నుంచి బయటకు చీల్చి దాని అర్థాన్ని అతి దారుణంగా వక్రీకరించిన అత్యంత హాస్యాస్పదమైన లేఖన భాష్యం కావచ్చు. అయితే “ఆగు, అది తప్పు బోధ అది నిజం కాదు” అని ఎవరూ ఆపరు, చెప్పరు.

క్యారిస్‌మాటిక్‌ సంఘాల్లో బోధించే సిద్ధాంతాన్నీ వేదాంతాన్నీ ఆరా తీసేవారు లేకపోవడం వలన కొంతమంది పరిశీలకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. “క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంగా ఇప్పటికింకా ప్రజల జీవితాల్లోకి వాక్యంలోని ఉన్నతమైన సిద్ధాంతాలను తీసుకెళ్ళాల్సి ఉంది. పరిశుద్ధాత్మ అనుభవానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంవల్ల వేదాంతాన్ని ఆసక్తితో అధ్యయనం చేసే విలువ తరచూ నిర్లక్ష్యం చేయబడుతోంది.54 ఈ మాటలు చాలా మృదువుగా ఉన్నాయి. సిద్ధాంతపరంగా క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ఇశ్రాయేలు చరిత్రలో ప్రతివాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చిన న్యాయాధిపతుల కాలానికి అద్దంపడుతోంది (న్యాయాధి 21:25). ఫలితంగా సిద్ధాంతపరంగా దాని తప్పులను బట్టి తప్ప ఈ క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాన్ని నిర్వచించడం దాదాపు అసాధ్యం. వ్యక్తిగతమైన అభిప్రాయాలూ, ఊహలూ దీన్ని ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి ఒక ప్రత్యేకమైన వేదాంత వర్గంగా పరిగణించబడడాన్ని ఇది వ్యతిరేకిస్తోంది.

“మొదట ఏదొక అనుభవాన్ని పొందు. అప్పుడు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి లేఖనం దగ్గరకు త్వరపడి వెళ్ళు,” అని ప్రజలు తమకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నారని క్యారిస్‌మాటిక్‌ రచయితలు సైతం గుర్తిస్తున్నారు.55 “ఆయన ప్రేమను అడ్డుకోవద్దు విశ్లేషించవద్దు కేవలం లొంగిపో. ఆ అనుభవాన్ని పొందిన తర్వాత నీవు దాన్ని విశ్లేషించు"56 అని క్యారిస్‌మాటిక్‌ రచయితల్లో ఒకరు చెప్పారు. కానీ అది వాక్యానికి పూర్తిగా విరుద్ధమైన భావన. మన అనుభవాలను నిర్ధారించడానికి వాక్యానికి సరైన అర్థాన్ని చెబుతూ మనం దేవుని వాక్యంతో ప్రారంభించాలి. పరిశుద్ధాత్మ నిజ కార్యం హితబోధను బట్టి వర్ధిల్లుతుంది. అది వాక్య సత్యాన్ని సమర్ధిస్తుందే తప్ప దాన్ని కొట్టేయడమో లేదా ఒక బెదిరింపుగానో చూడదు. అనుభవాన్నే సత్యాన్ని నిర్ధారించడానికి ఉపయోగిస్తే అప్పుడు సిద్ధాంతాన్ని లేదా ఒక ఆచారాన్ని నిర్వచించడానికి దైవ ప్రమాణమైన లేఖనాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

క్యారిస్‌మాటిక్స్‌ బైబిల్‌నూ, సిద్ధాంతాన్నీ విలువలేనిదిగా చూడడానికి కారణం ఒక్కటే. కాల పరిమితి లేని ప్రామాణిక సత్యాన్ని గురించిన ఆలోచన ఏదైనా పరిశుద్ధాత్మ కార్యాన్ని అడ్జగిస్తుందని వారు భావిస్తున్నారు. పరిశుద్ధాత్మ పరిచర్య నిర్వచించడానికి వీలు లేనంత గొప్పగా ఉంటుందని వారు ఊహిస్తున్నారు. నమ్మకాలు, విశ్వాస ప్రమాణాలు, సిస్టమాటిక్‌ థియాలజీలు పరిశుద్ధాత్మ పనిచేయడానికి సంకుచితమైన అడ్డంకులని వారి ఉద్దేశం. “ఒక కళాశాల విద్యార్థి ఒకసారి నన్ను దెయ్యాల ప్రమాదకరమైన బోధను (సిస్టమాటిక్‌ థియాలజీకి అతని వర్ణన ఇది) గురించి హెచ్చరించాడు. లేఖనానికి అర్థం చెప్పడానికి ప్రభువు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. కనుక బైబిల్‌ను అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మపై ఆధారపడకుండా మన మనస్సులను ఉపయోగించడానికి సాతానుగాడు చేసే ప్రయత్నమే సిద్ధాంతాన్ని బోధించడమని” అతడు నాకు వివరించాడని క్యారిస్‌మాటిక్‌ శాఖల్లో ఈ భావాన్ని గుర్తిస్తూ ఒక రచయిత రాశాడు.57

అది చాలా భయం కలిగించే మాట. వాస్తవానికి మంచి వేదాంతం అణిచివేసేది కేవలం తప్పునే. అందుచేత క్యారిస్‌మాటిక్‌ తప్పిదాలకు ఉత్తమమైన ఏకైక విరుగుడు ఈ హిత బోధయే. పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి (యోహాను 16:13). ఆయన చేసే ఏ కార్యమైనా తన ప్రజల హృదయాల్లో, మనస్సుల్లో వాక్య సత్యాన్నీ హితబోధనూ ఘనపరచేదిగా ఉంటుంది.

5వ పరీక్ష: పరిశుద్ధాత్మ కార్యమని పిలువబడుతున్నది దేవునియెడల, ఇతరులయెడల ప్రేమను కలుగచేస్తోందా?

ఏ ఆధ్యాత్మిక ఉద్యమాన్నైనా నిర్ధారించడానికి జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ చెప్పిన పరీక్షల్లో 5వదీ, ఆఖరిదీ ఇదే: పరిశుద్ధాత్మ నిజకార్యం ప్రజల్లో దేవుని యెడల ఇతరుల యెడల ప్రేమ అధికమయ్యేలా చేస్తుంది. ఎడ్వర్డ్స్‌ ఈ నియమాన్ని 1యోహాను 4:7-8 నుంచి తీసుకొన్నాడు. “ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేనివాడు దేవుని ఎరుగడని” అపొస్తలుడైన యోహాను రాశాడు. ఆత్మ ప్రథమ ఫలం “పేమ” (గలతీ 5:21) కనుక నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో, అది పరిశుద్ధాత్మ స్వచ్ఛమైన కార్యానికి ఆధారంగా ఉంటుంది.

పరిశుద్ధాత్మ నిజ కార్యం దేవునికి స్థిరమైన మనస్సుతో కూడిన ఆరాధననూ స్తుతినీ వ్యక్తపరిచే ప్రేమను కలుగచేస్తుంది. వాక్యానుసారమైన ఆరాధనకు నిర్వచనం అదే. దేవుని యెడల ప్రేమను వ్యక్తీకరించడమే ఆరాధన. ఆ ప్రేమ స్వభావమే (మన) అంతరంగంలోని మనోభావాలకు పని కల్పిస్తుంది. క్రైస్తవులు ప్రాథమికంగానైనా ఆ సత్యాన్ని అర్ధం చేసుకుంటున్నారు.

అయితే మానవ మేధస్సును ఏదో విధంగా వదిలించుకొనేవరకు మనం నిజంగా ఆరాధించట్లేదని చాలామంది భావిస్తున్నారు. మనం ఎక్కువగా ఆలోచిస్తే పరిశుద్ధాత్మ పనిచేయడు కనుక ఆలోచించే అవయవాలను ఉపయోగించవద్దని ప్రజల్ని క్యారిస్‌మాటిక్‌ బోధకులు బ్రతిమలాడడం నేను విన్నాను. అది పూర్తిగా వాక్యవిరుద్ధమైన భావన. మానవ శరీర అవయవాలన్నింటితోపాటు ఆలోచనలూ, భావాలూ కలిసి స్వచ్ఛమైన ఆరాధనలో దేవునిపై దృష్టి సారిస్తాయి. మొదటిదీ, ముఖ్యమైనదీ అయిన ఆజ్ఞలో ఈ నియమం మిళితమై ఉంది. “నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను” (మత్తయి 22:37).

తండ్రి కోరుకునే ఆరాధన మతిలేక గందరగోళస్థితిలో చేసే అపశ్రుతులతో కూడిన సంగీతం కాదు. ఆరాధన అంటే కేవలం అనాగరికమైన క్రియ కాదు, అనిర్వచనీయమైన భావన కాదు. “ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి” (యోహాను 4:24). అంతరంగంలో ఉండే సత్యాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు (కీర్తన 51:6). కనుక (పరిశుద్ధత మాదిరిగానే) నిజమైన ఆరాధన మనస్సును దాటవేయదు. ఇదంతా మనస్సు నూతనపరచబడడానికి చెందినదే (రోమా 12:1-2, ఎఫెసీ 4:23-24). “స్వచ్ఛమైన, వాక్యానుసారమైన ఆరాధన ప్రజల్లో దేవుని గురించీ ఆయన మహిమకరమైన పరిపూర్ణతల గురించీ శ్రేష్టమైన ఆలోచనలు తీసుకురావాలి. అది వారిలో యేసుక్రీస్తు శ్రేష్టత గురించి ప్రశంసాపూర్వకమైన సంతోషకరమైన భావాన్ని కలిగించాలని” జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ చెప్పాడు.58 నూతన పరచబడుతున్న జ్ఞానంలో మనం సంపూర్ణమైన నూతన వ్యక్తులుగా మారడమే దీని ప్రభావంగా ఉంటుంది (కొలస్సీ 3:10). జ్ఞానాన్ని ఉపయోగించకుండా కేవలం ఉద్రేకాలపైనే ఆధారపడే ఆధ్యాత్మికత గురించి లేఖనాలకు ఏ మాత్రమూ తెలియదు.

అయితే క్యారిస్‌మాటిక్‌ వారు తమ ఆరాధన కార్యక్రమాలను ప్రభువుని ఘనపరచని అక్రమం అల్లర్లతోనే నిర్వహిస్తున్నారు (1కొరింథీ 14:33). “క్యారిస్‌మాటిక్‌ వారి ఆరాధనను నేను 'సంపూర్ణ శరీరంతో చేసే ఆరాధన' అనగా హృదయం మనస్సు ఆత్మ బలములతో కూడిన ఆరాధన” అని పిలవాలనుకుంటున్నాను. "దేవుడు మనకోసం మనతో చేసిన కార్యాలన్నింటిని గురించి ఆలోచిస్తే మనకు పిచ్చిపడుతుంది. మన బాస్కెట్‌బాల్‌ టీమ్‌ గురించి మనకు ఉన్న పిచ్చికి మించిన పిచ్చని"59 ఒక పెంతెకోస్తు వేదాంత పండితుడు చెబుతున్నాడు. టిబిఎన్‌ లేదా మరి యే ఇతర క్యారిస్‌మాటిక్‌ టెలివిజన్‌ కార్యక్రమాన్నైనా చూడండి. అర్ధరహితమైన భాష మాట్లాడడం, మత్తుగా వెనక్కి పడిపోవడం, నిగ్రహం కోల్పోయి నవ్వడం, వికృతంగా కేకలు వేయడం మొదలైన హేతువిరుద్ధమైన ఉదాహరణలు చూడడానికి ఎక్కువ సమయం పట్టదు.60

తరచుగా క్యారిస్‌మాటిక్స్‌ తమ మనస్సును లగ్నం చేయకుండానే ఆరాధననూ, ప్రార్థననూ సమీపిస్తున్నారు. “నిశ్శబ్దమైన ప్రదేశాన్నొక దానిని ఎంచుకో. నీ మనస్సును ఖాళీ చెయ్యి. నీ శ్వాసను విను, ఒక పదంపై దృష్టి సారించు ఉదాహరణకు “ప్రభువు” అనే పదం. ఇలా దృష్టి పెట్టే మరొక పద్ధతి ఏమిటంటే మృదువైన, ఆత్మ సంబంధమైన సంగీతాన్ని వింటూ పరిశుద్ధాత్మ ప్రశాంతంగా నీతో మాట్లాడడానికి అనుమతించడమే,” అనే విషయాలను వారికి చెబుతున్నారు. ఆత్మపూర్ణులు కావడాన్ని వారు మతిలేని వెర్రితో ముడిపెడుతున్నారు.61 ఒక పెంతెకోస్తు సభ్యురాలు ఈ విధంగా చెప్పింది. “పరిశుద్ధాత్మ నన్ను తాకిన ప్రతిసారి నేను చాలా ఇబ్బందిపడ్డాను. నాకు పిచ్చి పట్టిందని ప్రజలు భావించారు. అయితే అది అత్యంత శక్తివంతమైన అనుభవం. నేను శరీరంపై పూర్తిగా ఆధీనం కోల్పోయాను. ఏదో నా శరీరాన్ని పూర్తిగా లోబరచుకుంది. దాన్ని ఆపడానికి నేనేమీ చేయలేకపోయాను."62

గలిబిలితో కూడిన క్యారిస్‌మాటిక్‌ ఆరాధనకు 1990-95 సంవత్సరాల కాలంలో ద టొరంటో బ్లెస్సింగ్‌ సమయంలో జరిగిన ఆరాధన అతి స్పష్టమైన ఉదాహరణల్లో ఒకటిగా ఉంది. 1995 లో టొరంటో ఎయిర్‌పోర్టు క్రైస్తవ సహవాసంలో జరిగిన ఆరాధన కార్యక్రమంలో తనకు ప్రత్యక్షంగా కలిగిన అనుభవం గురించి సామాజిక శాస్త్ర ప్రొఫెసర్‌ మార్గరెట్ ఎమ్‌.పొలొమ ఈ విధంగా వివరించింది.

నవ్వుల విస్పోటనం వేగం పుంజుకుంది. “దేవుడు ఒక ప్రధాన కార్యాన్ని జరిగించబోతున్నాడని” నువార్తికుడైన బైరాన్ మోట్‌ ప్రసంగించాడు. అప్పుడు అతడు లూకా నువార్త మొదటి అధ్యాయాన్ని తెరచి, తల్లియైన మరియ గురించి ఒక ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నట్లు కనిపించాడు. ఆ ఆడిటోరియం అంతా ప్రజలు నవ్వుతుండగా, మోట్ భాష నత్తిగా మారింది ........ ఒక త్రాగుబోతు కింద పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అతడు కూర్చున్నాడు. ప్రజలు నవ్వుతూ కరతాళ ధ్వనులు చేస్తుండగా మోట్‌ పరిశుద్ధాత్మ అనే మందును సేవించినట్లు నేలపై పడిపోయాడు. అప్పుడు “నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును గాక” అని పరమగీతం నుండి ఒక వాక్యభాగం తీసుకుని ఆ నభలో ప్రసంగీకురాలిగా తన భర్త స్థానాన్ని జాన్‌ మోట్‌ తీసుకుంది. జాన్‌ మోట్‌ కూడా ప్రశాంతంగా ఉండడానికి ఇబ్బందివడుతూ ఆమె మోకాళ్లు బలహీనంగా ఉన్న కారణాన్ని బట్టి అమె ఒక ప్రదేశంలో కూర్చున్నది. నవ్వు అనేది ఏ విధంగా దేవుని ప్రేమను ప్రజలు పొందుకునేలా చేస్తుంది అనే విషయం గురించి ఆమె మాట్లాడింది. ఆ సంఘంలో ఆధ్యాత్మికంగా మత్తులు కాకుండా ఉన్నవారు నేలపై పడి దొర్లుతూ, నిగ్రహం కోల్పోయి నవ్వుతూ “మై జీసన్‌ ఐ లవ్‌ యు” అనే పాట పాడుతూ ఆమెను అనుసరించారు.63

అటువంటి అసభ్యకరమైన ప్రవర్తన వాక్యానుసారమైన ఆరాధనకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఇది పరిశుద్ధమైన దానిని అపహాస్యం చేస్తూ దేవుణ్ణి తీవ్రమైన అమర్యాదతో చూస్తోంది. ఈ సహస్రాబ్ది ప్రారంభంతో ద టొరంటో బ్లెస్సింగ్‌ ప్రాధాన్యత అంతరించిపోయినప్పటికీ, అడ్డూ అదుపూ లేని ఉద్రేకాలను ప్రోత్సహించినప్పుడు ఉత్పన్నమయ్యే వింత ప్రవర్తనలను అది ఉదాహరిస్తున్నది. “అజుసా స్ట్రీట్ రివైవల్‌”లో తొలి పెంతెకోస్తు సభ్యులు కూడా ఇటువంటి ప్రవర్తననే కనపరిచారు.64 పెంతెకోస్తు ఉద్యమ స్థాపకుడు ఛార్లెస్‌ పర్హామ్ సైతం అక్కడ జరిగిన సంఘటనలు కొన్ని చూసి భయంతో వెనక్కి తగ్గాడు. డాన్స్‌ క్లబ్బుల్లో మాదిరిగానే ఈ అనాగరికమైన ప్రార్థన సభల్లో కూడా ఒకరినొకరు తాకినప్పుడు కొన్నిసార్లు ప్రాణాపాయానికీ కొన్నిసార్లు లైంగిక సంపర్కానికీ, వెర్రి ఆకర్షణలకూ దారితీస్తున్నాయి.65

అడ్డూ అదుపూ లేని ఉద్రేకాలు, మనసుపై ఆధీనం కోల్పోయిన పద్ధతులే ఎందుకు క్యారిస్‌మాటిక్‌ ఆరాధనలో ప్రధానాంశం అయ్యాయో లండన్‌ మెట్రోపాలిటన్‌ మందిరానికి పాస్టరైన పీటర్‌ మాస్టర్స్‌ వివరిస్తున్నాడు.

మనం ఆలోచించినప్పుడూ, పని చేసినప్పుడూ మనసును మన అదువులో ఉంచుకుంటే పరిశుద్ధాత్మ కార్యానికి మనం అడ్డుపడుతూ ఆయనను ఆర్పివేస్తున్నామని క్యారిన్‌మాటిక్‌ వారు వాదిస్తున్నారు. ఆరాధన, క్రైస్తవ పరిచర్య అనే రెండింటిలోనూ దేవుని కార్యాన్ని నేరుగా అనుభవించడానికీ, విశ్వాసులు మనసును అదుపులో పెట్టకుండా ఉండడానికీ సిద్ధపడాలని వారు చెబుతారు. “నిగ్రహం కోల్పోతామనే భయం చాలామంది పాశ్చాత్య క్రైస్తవులకు భీతి కలిగించేదని” జాన్‌ వింబర్‌ విచారంతో చెప్పాడు. భాషల్లో మాట్లాడడానికీ, ఆకాశంలో విహరించే భావాలను ఆరాధనలో పొందడానికీ, మనస్సులోకి నేరుగా దేవుని సందేశాలను పొందుకోవడానికీ, స్వస్థతలు పొందడానికి మన భయాలను అధిగమించి మనస్సుపై నిగ్రహం కోల్పోవాలని” అతడు పట్టుబట్టాడు.66

కానీ ఆరాధనలో నిగ్రహం కోల్పోవడమనేది తీవ్రమైన, విచారకరమైన తప్పిదం. ఇది స్వచిత్తానుసారమైనది, అహాన్ని సేవించేది, ఎందుకంటే దేవుడు ఏ విధంగానైతే మనం ఆత్మతో, సత్యంతో ఆరాధించాలని చెప్పాడో అలా చేయకుండా నిర్లక్ష్య వైఖరితోనూ తీవ్రమైన తిరస్కార బుద్ధితోనూ ఆరాధనను సమీపించడాన్ని ఇది ప్రతిబింబిస్తుంది (యోహాను 4:24).67

మనసుపై నిగ్రహాన్ని కోల్పోవాలని చెప్పే ఆరాధన పద్ధతులను మనం ఏ విధంగా పరీక్షించాలి? ఇక్కడొక చక్కటి సమాధానం ఉంది. “మనసును ఖాళీ చేసుకోవడమనే భావన క్రైస్తవ తత్వానికి భిన్నమైంది. దెయ్యాల ప్రభావానికి తరచూ ద్వారాన్ని తెరిచే ధ్యానం, గూఢమైన ఆచారాలు, యోగా, మనస్సును ఖాళీ చేయమనే ఇతర పద్ధతులు అన్య ఆచారాల్లో సాధారణంగా కనిపిస్తాయి. మనసు ఉపయోగించకుండా ఆధ్యాత్మిక అనుభవం పొందాలని ఆతురపడే ఒక స్త్రీ, తను కోరుకొనని ఆత్మ సంబంధమైన అంశాలకు తావునిస్తుంది. అద్భుత అనుభవాల్లో మునిగిపోయి, ఆధ్యాత్మికతకు సులభమైన మార్గం కోసం వెదికేవాడు సాతానుగాడి వంచనకు గురయ్యేంత బలహీనమైపోతాడు.”68

క్యారిస్‌మాటిక్స్‌ ఆరాధనలో గూఢత్వానికి ప్రోస్పారిటి వేదాంతంలో ఉన్న ఇహలోక తత్వాన్ని జతచేస్తే పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది. క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలోని ప్రముఖులు ప్రజల ప్రతి ఇహలోక కోరికను సంతోషంగా తీర్చే విశ్వవ్యాప్తమైన క్రిస్మస్‌ తాతలా దేవుణ్ణి పరిగణిస్తున్నారు. ఇతరులు పరిశుద్ధాత్మని ఒక శక్తిగా భావిస్తున్నారు. రెండు విషయాల్లోనూ దేవుని దగ్గరనుంచి వారు ఏదొకటి పొందుకోవాలనే ఉద్దేశంతోనే ఆయనను సమీపించాలనే శిక్షణను క్యారిస్‌మాటిక్‌ సంఘ సభ్యులు పొందుతున్నారు. “మతం అనే మారు వేషంలో ఉన్న క్రూరమైన ఇహలోక తత్వమే ప్రోస్పారిటి సువార్త. నేమ్‌ ఇట్‌ అండ్‌ క్లెయిమ్‌ ఇట్‌ (కావాల్సింది అడిగి, పొందుకో) అనే సిద్ధాంతానికి సరిపోయే విధంగా బైబిల్‌ వచనాలను ఇది ఎంపిక చేసుకుంటుందే తప్ప ఇది దేవుని ప్రేమించదని” ఒక రచయిత వివరించాడు. స్వార్ధపూరిత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఈ ఉద్యమం దేవుణ్ణి ఉపయోగించుకోవాలని కోరుతుంది.”69 అయితే దేవుని యెడల నిజమైన ప్రేమ, విధేయత ద్వారా, త్యాగపూరితంగా ఆయనను సేవించడం ద్వారా తన్నుతాను వ్యక్తపరుచుకుంటుంది (రోమా 12:1).

పరిశుద్ధాత్మ నిజ కార్యం దేవుని యెడల ఉన్నతమైన ప్రేమను కలుగచేయడమే కాకుండా ఒకరియెడల మరొకరు చూపే యథార్థమైన, త్యాగపూరితమైన ప్రేమను కూడా విశ్వాసుల్లో కలిగిస్తుంది. అటువంటి ప్రేమ “సత్యమునందు సంతోషిస్తుంది” (1 కొరింథీ 13:6), అనగా లోతులేని ఐక్యత నిమిత్తం ఇది అబద్ధ బోధను సహించదు. అంతేకాదు క్రీస్తు శరీరంలోని ఇతరుల క్షేమాభివృద్ధిని ఇది కోరుతుంది. సంఘంలోని ఇతర విశ్వాసులను బలపరచడానికే కృపావరాలను ఉపయోగించాలని 1కొరింథీ 12-14 అధ్యాయాలలో ఆత్మవరాల గురించి చర్చించినప్పుడు పౌలు చెప్పాడు. “అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది” అని 1కొరింథీ 17:7లో అతడు చెప్పిన మాట ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. “నిజమైన ప్రేమ తన సొంత కార్యములను చూచుకొనదు,” అని పౌలు 1కొరింథీ 13:5లో వివరించిన మాటలో అది మరొకసారి ప్రతిధ్వనిస్తున్నది.

అయితే కొన్ని వరాలు (ముఖ్యంగా భాషల వరం) స్వప్రయోజనం నిమిత్తం ఉపయోగించుకోవచ్చని వాదిస్తూ క్యారిస్‌మాటిక్స్‌ దీన్ని తలకిందులు చేశారు.70 స్వార్ధంగా గర్వంతో, కృపావరాలను వినియోగించుకుంటున్న కొరింథీయులను సరిచేయడానికే పౌలు దీనిని రాస్తున్నాడు. నేడు క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం కొరింథీ సంఘం చేసిన పొరపాటును తనకొక ప్రత్యేకతగా చేసుకుంది. కానీ అటువంటి స్వార్ధం నాశనకరమైన పర్యావసానాలతో వస్తుంది. “కృపావరాలు స్వప్రయోజనం కోసం అనుగ్రహించబడి మనకు మనం క్షేమాభివృద్ధి కలుగచేసుకోవడానికి ఉపయోగపడతాయనే ఆలోచన వలన కలిగే తీరని నష్టాన్ని అంచనా వేయడం అసాధ్యం. ఇది ఖచ్చితంగా వాక్య విరుద్ధమైనది. వరాలు స్వప్రయోజనం నిమిత్తం కాదు, ఇతరుల క్షేమాభివృద్ధి కోసం అనుగ్రహించబడ్డాయి.”71

పరిశుద్ధాత్మ వరాల విషయంలో ఉన్న ఈ స్వార్ధపూరిత విధానానికి ప్రోస్పారిటి సువార్త యొక్క స్వప్రయోజన నిమిత్తమైన కోరికలు తోడై పరిస్థితులను మరింత విషమం చేశాయి. అదే విధంగా ప్రోస్పారిటి వేదాంతం సత్యమైన ఆరాధన స్థానాన్ని కోరికల జాబితాతో భర్తీచేసింది. ఇతరుల యెడల చూపవలసిన స్వచ్ఛమైన ప్రేమకు, ఇహలోక భాగ్యాన్ని గురించిన స్వార్ధపూరిత కోరికను ప్రత్యామ్నాయంగా చేసింది.

తమ ఉద్యమం ఇతరుల యెడల స్వచ్ఛమైన ప్రేమను కనబరుస్తోందని క్యారిస్‌మాటిక్స్‌ ఖచ్చితంగా చెబుతున్నారు. అయితే చట్టవిరుద్ధమైన సమాజంలో సైతం కనబడే నకిలీ ప్రేమ ఒకటుందని జోనాతన్‌ ఎడ్వర్ట్స్‌ హెచ్చరించాడు. అతని హెచ్చరికలు ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమానికి స్పష్టంగా వర్తిస్తాయి.

నిజానికి, భ్రమపరిచే ఆత్మచేత నడిపించబడే వారి మధ్య తరచూ కనబడే నకిలీ ప్రేమ ఒకటుంది. అనాగరికుల మధ్యన సైతం ఒకరిపై మరొకరికి ఆప్యాయతానురాగాలు ఉంటాయి. ఇది స్వీయప్రేమనుంచి ఉద్భవిస్తుంది. ఇతరులతో వారు దేనిలోనైతే అతిగా విభేదిస్తున్నారో ఏ కారణం చేత వారు తక్కిన మానవ జాతి యొక్క హేళనకు గురౌతున్నారో దానిలో వారికున్న ఏకాభిపాయం వల్ల ఆ ప్రేమ కలుగుతుంది. ఇతరుల తిరస్కారానికి ఏ వికారమైన చేష్టలు కారణమయ్యాయో ఆ చేష్టలనే తమలో తాము చూసుకుని ఒకరినొకరు మరింత గౌరవించుకొనేలా ఆ నకిలీ ప్రేమ వారిని ప్రోత్సహిస్తుంది. కనుక పురాతన నాస్టిక్స్, మతోద్ధారణ ప్రారంభంలో కనిపించిన క్రూరులు ఒకరియెడల మరొకరు కలిగియున్న ఉన్నతమైన ప్రేమ గురించి అతిశయించారు. వారిలో ప్రత్యేకంగా ఒక తెగవారు తమను తాము ప్రేమ కుటుంబంగా పేర్కొన్నారు. అయితే నేను ఇంతకు ముందు వర్ణించిన క్రైస్తవ ప్రేమకు ఇది పూర్తిగా భిన్నమైనది. ఇది సహజమైన స్వీయ ప్రేమ ఫలితమే, కానీ నిజమైన ప్రేమ కాదు. మిగిలిన ప్రవంచంతో యుద్ధం చేస్తున్న సముద్రపు దొంగల ముఠా మధ్య కనిపించే ఐక్యత, స్నేహల కంటే మించినదేమీ కాదు ఈ ప్రేమ.72

ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలోని “అనాగరికులను, క్రూరులను” ఖచ్చితంగా ఎడ్వర్డ్స్‌ తిరస్కరించి ఉండేవాడు. ఎన్నో విధాలైన అనుభవాలు పరిశుద్ధాత్మ నుంచి నూతన ప్రత్యక్షత మొదలగు అనేక లక్షణాలను ప్రస్తుత క్యారిస్‌మాటిక్స్‌ మాదిరిగానే మతోద్ధారణ సమయంలోని మూఢ సమాజపు వారు పొందుకున్నారు. వాక్య వ్యతిరేకమైన వారి అభిప్రాయాలను ఎదురిస్తూ, “పరిశుద్ధాత్మ ఈకలన్నింటిని మింగేసిన” వారని ఈ వేదాంత భ్రష్టులను మార్టిన్‌ లూథర్‌ ప్రస్తావించాడు.73

ఒక నిర్ణీత పరిచర్యనూ ఆధ్యాత్మిక ఉద్యమపు గొప్పతనాన్నీ నిర్ధారించే అంతిమ అధికారి జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ కాడనే విషయాన్ని అంగీకరించాలి. అన్ని విషయాలను నిర్ధారించడానికి ఉపయోగించే ప్రమాణం కేవలం లేఖనం మాత్రమే. అయితే దేవుని ఘనపరిచే ఆరాధనలో సత్యానికి మనం ఇవ్వాల్సిన స్థానం గురించి లేఖనం చెప్పేదేమిటో మనం గుర్తు చేసుకొని, ఆ ప్రమాణాన్ని గలిబిలితో, అడ్డూ అదుపు లేని అల్లరితో నిండిన క్యారిస్‌మాటిక్‌ వారి ఆరాధనతో పోల్చినప్పుడు, ప్రేమను గురించిన లేఖన నిర్వచనాన్ని తీసుకుని దానిని క్యారిస్‌మాటిక్‌ వేదాంతంలో మిళితమైయున్న అహాన్ని సేవించే భావంపక్కనే పెట్టినపుడు తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతాయి. క్యారిస్‌మాటిక్స్‌ తమ ఉద్యమాన్ని ఎడ్వర్డ్స్‌ రోజుల్లో జరిగిన “గ్రేట్‌ అవేకనింగ్‌”తో పోల్చుకోవచ్చు.74 కానీ 1యోహాను 4లో ఉన్న పరీక్షలను అన్వయించినప్పుడు, వాటి మధ్య వ్యత్యాసాలు వెంటనే తేటతెల్లమౌతాయి.

                                ఆధ్యాత్మిక నిధా? లేక నకిలీ బంగారమా?

18వ శతాబ్దం మొదటి 50 సంవత్సరాల్లో జరిగిన “గ్రేట్‌ అవేకనింగ్‌కు 1 యోహాను 4:1-8లో ఉన్న పరీక్షలను జోనాతన్‌ ఎడ్వర్డ్స్‌ అన్వయించినప్పుడు“ కొన్ని మితిమీరిన తుచ్ఛమైన సంగతులు ఉన్నప్పటికీ, ఆ ఉజ్జీవంలో దేవుని ఆత్మ కార్యం మాత్రం ఖచ్చితంగా జరిగిందని అతడు తేల్చిచెప్పాడు. ఎందుకనగా నిజక్రీస్తు ప్రకటించబడ్డాడు. లోకతత్వమూ, పాపమూ వ్యతిరేకించబడ్డాయి, లేఖనాలు ఘనపరచబడ్డాయి, సువార్త సత్యం హెచ్చించబడింది, ఫలితంగా దేవుని యెడల ఇతరుల యెడల యధార్థమైన ప్రేమ కనపరచబడింది.

అయితే ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం దానికి విరుద్ధమైన విషయాలను చూపిస్తున్నది. అది క్రీస్తుని గురించిన సత్యాన్ని వక్రీకరించింది, గమనమంతా ప్రభువైన యేసు యొక్క వ్యక్తిత్వ కార్యాల నుంచి పరిశుద్ధాత్మ శక్తి, ఆశీర్వాదాలుగా కల్పించబడిన వాటిపైకి మళ్ళించింది. ఆత్మపూర్ణులమని చెప్పుకునే వారిపై తరుచూ నాయకత్వంలోని అక్రమాలు మచ్చను కలుగచేస్తుండగా (అత్యంత ప్రభావం కలిగి వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఉద్యమ శాఖలో ఉన్న) ప్రోస్పారిటి ప్రసంగీకులు పాపాన్ని బహిరంగంగా సమర్థించారు. ఆత్మ ప్రేరేపిత లేఖనాలను ఘనపరచడానికి బదులు నూతనమైన ప్రత్యక్షత కోసం ఎదురుచూస్తూ క్యారిస్‌మాటిక్స్‌ బైబిల్‌ను అసంపూర్ణమైనదిగా పరిగణిస్తున్నారు. ఫలితంగా వాక్యసత్యం విలువలేనిదిగా ఎంచబడుతున్నది. కాథలిక్స్‌ ప్రొటస్టెంట్‌ శాఖల ఐక్యత ప్రశంసించబడుతోంది. హితబోధ 'మృతమైనదిగా', 'భేదాలు కలుగచేసేదిగా' అపహాస్యం చేయబడుతోంది. స్వచ్ఛమైన ఆరాధన, విధేయతలద్వారా దేవుని యెడల ప్రేమ తనను తాను ప్రత్యక్షపరచుకోవాలి. నిస్వార్థపూరిత సేవ ద్వారా ఇతరుల క్షేమాభివృద్దిని గురించిన ఆలోచన ద్వారా ఇతరుల పట్ల ప్రేమ బయటపడాలి. అయితే కృపా వరాలను అన్వేషిస్తూ, ప్రోస్పారిటి వేదాంతాన్ని చేపడుతూ ఈ క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం తనకు నచ్చిన పద్ధతిలో దేవుని సమీపిస్తోంది.

ఈ ఐదు రకాల వాక్య పరీక్షలను బట్టి మనం ఏమి చెప్పవచ్చు? సమాధానం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అబద్ధ సువార్తను ప్రచారం చేస్తున్న అబద్ధ బోధకులే ఈ క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. హద్దుల్లేకుండా విస్తరిస్తున్న వర్డ్‌ ఆఫ్‌ ఫెయిత్‌ ఉద్యమం, అది ప్రకటిస్తున్న ప్రోస్పారిటి సువార్త విషయాల్లో ప్రాముఖ్యంగా ఇది నిజం. దుర్లాభాపేక్షతో సంఘంలోనికి తప్పుబోధను ప్రవేశపెట్టే వారి గురించి కొత్త నిబంధన పదే పదే హెచ్చరిస్తోంది. ఆ వచనాలకు క్యారిస్‌మాటిక్‌ మీడియాలోని ప్రముఖ ఫెయిత్‌ హీలర్స్‌, ప్రోస్పారిటి ప్రసంగీకులు, టి.వి.సువార్తికులు చక్కటి ఉదాహరణగా ఉన్నారు. ఏ విధంగానైనా నిజ విశ్వాసులు అటువంటి ఆధ్యాత్మిక వంచకుల నుంచి దూరంగా ఉండాలి. అపొస్తలుడైన యోహాను తన రెండవ పత్రిక 7-11 వచనాల్లో ఈ విధంగా హెచ్చరించాడు.

“యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరియున్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునైయున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి యుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనువద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. ”

క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం పూర్తిగా అవినీతిమయమై, అయోమయ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఇందులో కూడా యథార్థమైన ప్రజలు ఉన్నారనీ, సువార్తలో అత్యావశ్యకమైన సత్యాలను వారు గ్రహించారని నేను నమ్ముతున్నాను. ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్త బలి, క్రీస్తు నిజ స్వభావం, త్రియేక దేవుని తత్వం, పశ్చాత్తాపం, వాక్యానికి ఉన్న సంపూర్ణ అధికారం మొదలైన వాక్య సత్యాలను వారు హత్తుకున్నారు. రక్షణ అనేది ఆరోగ్యఐశ్వర్యాలను గురించినది కాదని వారు గుర్తిస్తూ పాపం ఆత్మ సంబంధమైన మరణం, నిత్యనరకం నుంచి నిజంగా రక్షించబడాలనే కోరికను వారు కలిగి ఉన్నారు. అయితే వారు పరిశుద్ధాత్మ పరిచర్య, కృపా వరాల స్వభావం గురించీ ఇంకా అయోమయంలోనే ఉన్నారు.

ఫలితంగా, వారు అన్యాగ్నితో ఆడుకుంటున్నారు. క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలోని తప్పుడు బోధకూ, నకిలీ ఆధ్యాత్మికతకూ తమను తాము నిరంతరం బయలుపరచుకుంటూ, తమను తాము (వారి ఆధ్యాత్మిక సంరక్షణలో ఉన్న ప్రతివారిని) నిత్య ప్రమాదానికి గురిచేసుకుంటున్నారు. విశ్వాసుల ఆధ్యాత్మిక ఎదుగుదల, పరిచర్య, ఫలాలకు ఈ క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం అత్యంత భారీ అడ్డుబండ. పరిశుద్ధాత్మను గురించిన, ఆత్మ ప్రేరేపిత లేఖనాలను గురించిన దాని తప్పు బోధలు ఆధ్యాత్మికంగా పసితనాన్నీ బలహీనతనూ పాపంతో నిరంతర పోరాటాన్నీ నిత్యమూ ఉండేలా చేస్తున్నాయి.

ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో చిక్కుకున్న క్రైస్తవులకు, మొదటి శతాబ్దంలో కొరింథీ సంఘంలోని నిజ విశ్వాసులకు మధ్య పోలిక ఉంది. నైతిక విషయాల్లో రాజీపడి శరీర కోరికలతో, సతమతమవుతూ కృపవరాలతో గురించిన అయోమయంతో కొరింథీ సంఘం నిండియున్నది. అయితే ఆ సంఘంలో నిజవిశ్వాసులు చాలామంది ఉన్నారనే విషయం మన ఊహకు వ్యతిరేకంగా అనిపిస్తుంది. కొరింథీ సంఘంలోనికి చొరబడిన తప్పులకు పరిశుద్ధాత్ముడు బాధ్యుడు కాడనే విషయం స్పష్టం. అదే విధంగా ఇవాంజెలికల్‌ సంఘంలో ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ అయోమయానికి మూలం ఆయన కాదు. కొరింథీలో ఉన్న నిజవిశ్వాసులు ఘోరమైన తప్పులు, పొరపాట్లు చేసినప్పటికీ వారి జీవితాల్లో పరిశుద్ధాత్ముడు పనిచేయడం కొనసాగించాడు.75 నిజ విశ్వాసులు చేసే అవినీతి కార్యాలను తీవ్రంగా పరిశుద్ధాత్ముడు వ్యతిరేకిస్తున్నప్పటికీ వారిలో ఆయన నేటికీ పనిచేస్తున్నాడనే విషయం ముమ్మాటికీ సత్యం.

వాక్యేతర ప్రత్యక్షత, వింత అనుభవాలు, అడ్డూ అదుపు లేని ఉద్రేకాలు, ఇహపరమైన ఐశ్వర్యాల కోసం క్యారిస్‌మాటిక్‌ వారి అన్వేషణ పెను ప్రమాదాన్ని సూచిస్తున్నది. పసిబిడ్డ అగ్నికి ఏ విధంగానైతే దూరంగా ఉండాలో, అదే విధంగా అంగీకారయోగ్యం కాని కారిస్‌మాటిక్‌ ఆరాధన, అభ్యాసాలనే అన్యాగ్ని నుంచి విశ్వాసులు దూరంగా ఉండాలి. ఇది పౌలు కొరింథులో సరిచేసిన గందరగోళానికి ఉదాహరణగా ఉన్నది. అదే సమయంలో అబద్ధ బోధకుల నాశనకరమైన తప్పుడు బోధలను కలిగియున్నది. ఇది దారుణమైన విషయం. ఇలాంటి కువైద్యుల గురించి లేఖనం ఈ విధంగా చెబుతుంది, “అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైన వాటియందే మనస్సునుంచుచున్నారు” (ఫిలిప్పీ 3:18,19).

రెండవ భాగం

నకిలీ వరాలను బట్టబయలు చేయుట

                                              5. అపొస్తలులు మనమధ్య ఉన్నారా?
క్యారిస్‌మాటిక్‌ ఉద్యమానికి 1901వ సంవత్సరం ముఖ్యమైనదైతే, 2001వ సంవత్సరం మరింత ప్రాముఖ్యమైనది. 1901వ సంవత్సరం కాన్సస్‌ రాష్ట్రంలో టొపేకా అనే నగరంలో జరిగిన ప్రార్ధన సభలో ఆగ్నెస్‌ ఓజ్‌మన్‌ భాషల్లో మాట్లాడానని తెలియజేసినప్పటినుంచి ప్రారంభమైన ప్రస్తుత పెంతెకోస్తు ఉద్యమాన్ని సూచిస్తోంది. అయితే ఖచ్చితంగా ఒక శతాబ్దం తరువాత వచ్చిన 2001వ సంవత్సరం రెండవ అపోస్తలుల యుగారంభాన్ని సూచిస్తోంది.1 ఇది కొంతమంది క్యారిస్‌మాటిక్‌ నాయకులకు ఎంతో దివ్యమైన సంగతి. క్రైస్తవ పరిచర్యల శాస్త్ర బోధకుడు, ప్రముఖ రచయిత, ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమ చరిత్రకారుడు సి.పీటర్‌ వాగ్నర్ యొక్క వర్ణన ఇది. 21వ శతాబ్ద ఆరంభంలో దేవుని విమోచన ప్రణాళికలో ముఖ్యమైన మార్పు చోటు చేసుకుందని అతడు భావిస్తున్నాడు.

“ప్రొటస్టెంటు మతోద్ధారణ కాలం నుంచి సంఘాన్ని నడిపించే విధానంలో వచ్చిన సమూలమైన మార్పును ఇపుడు స్వయంగా మనమే చూస్తున్నాము. నిజానికి ఇది అత్యద్భుతమైన మార్పును కలుగచేస్తుందనేది నా హేతుబద్దమైన వాదన” అని వాగ్నర్ చెబుతున్నాడు. 20వ శతాబ్దపు ప్రారంభం అద్భుత వరాల యెడల నూతన ఆసక్తిని కలిగించింది. అయితే నూతన సహస్రాబ్ది "అపొస్తలుల పునరాగమనం" అనేది మరింత ప్రాముఖ్య విషయాన్ని సూచిస్తుంది.3 అపోస్తలుని ధర్మం అనేది సంఘ చరిత్రలో కేవలం మొదటి రెండు శతాబ్దాలకు మాత్రమే పరిమితమైన సూచన కాదు కానీ నేడు కూడా క్రీస్తు శరీరంలో ఈ ధర్మం పనిచేస్తోందని వాగ్నర్‌ మాటలు వెల్లడిచేస్తున్నాయి.4

సంఘంలోనికి అపొస్తలుల పునఃప్రవేశాన్ని "న్యూ అపోస్టలిక్‌ రిఫర్మేషన్‌" (నూతన అపొస్తలుల మతోద్దారణ) అని వాగ్నర్‌ పేర్కొన్నాడు. అతడు ఈ ఉద్యమాన్ని ఈ కింది విధంగా నిర్వచించాడు.

ఈ ఉద్యమానికి నేను ఎంచుకున్న పేరు "న్యూ అపోస్టలిక్‌ రిఫర్మేషన్" (నూతన అపొస్తలుల మతోద్ధారణ). "రిఫర్మేషన్‌" (మతోద్ధారణ) అని అనడానికి గల కారణం, ఇది ప్రొటస్టెంటు మతోద్దారణ చూపినంత ప్రభావం గలది. "అపోస్టలిక్‌" అనడానికి కారణం నేటి నంఘాలలో అపొస్తలుల వరానికి, ధర్మానికి విస్తృతమైన గుర్తింపు వచ్చింది. "అపోస్టలిక్‌" అనే పేరును అధికారికంగా పెట్టుకున్నప్పటికి, ఈ నూతన పద్దతులను కాకుండా పాత పద్ధతులనే అనుసరిస్తున్న పలు శాఖల నుంచి ప్రత్యేకించుకోవడం కోసం "న్యూ" (నూతన) అనే వదాన్ని ఉపయోగించడం జరిగింది.5

1996లో ఫుల్లర్ థియలాజికల్‌ సెమినరీ 'నేషనల్‌ సింపోజియమ్‌ ఆన్‌ ది పోస్ట్‌ డినామినేషనల్‌ చర్చ్‌' అనే అంశంపై చర్చ నిర్వహించింది. ఆ చర్చలో నిపుణుల అభిప్రాయాన్నీ, కొన్ని ఆధునిక ప్రవచనాలను ఆధారం చేసుకుని నేడు సంఘంలో అపొస్తలులు ఇంకా ఉన్నారని అతడు నిర్ణయించాడు. అప్పటి నుంచి అపొస్తలుని ధర్మాన్ని ప్రస్తుత సంఘంలో ప్రవేశపెట్టే నూతన పరిచర్యను వాగ్నర్‌ ఆరంభించాడు. సంఘ చరిత్రలో ప్రతీ తరంలో 'అపొస్తలత్వపు' వరాన్ని కలిగిన వ్యక్తులున్నారనీ అయితే రెండవ అపొస్తలులు యుగారంభంగా అతడు ఎంచుకున్న 2001వ సంవత్సరంలోనే ఈ వరం కలిగిన వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అతడు వాదిస్తున్నాడు.6 “ప్రస్తుత క్రైస్తవులు అన్ని కృపా వరాలతో పాటు 'అపొస్తలత్వం' అనే వరాన్ని కూడా గుర్తించి, దానిని స్వీకరించి, ఉపయోగించుకుంటేనే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి భక్తినీ, శక్తినీ పొందుకోగలరని” వాగ్నర్‌ అభిప్రాయపడ్డాడు.7

'అపొస్తలుడైన పేతురు' అనే పేరు చరిత్రలో 12 మంది శిష్యులలో ప్రధాన నాయకుడైన సీమోను పేతురుకు మాత్రమే కేటాయించబడింది. అపొస్తలుల కార్యాలు 1-12 అధ్యాయాల్లో ఇతని అపొస్తలత్వ పరిచర్యను లూకా వివరించాడు. కానీ న్యూ అపోస్టలిక్‌ రిఫర్మషన్‌లో ఆ పేరు పొందడానికి మరెవరో కాదు స్వయంగా పీటర్‌ వాగ్నెరే ఎన్నికయ్యాడు.8 వాగ్నర్‌ అపోస్తలుని అభిషేకం పొందాడని 1995లో ఇద్దరు ప్రవక్తిలు ప్రకటించినప్పుడు, తన సొంత అపొస్తలత్వాన్ని గుర్తించనారంభించాడు. 1998లో డాలస్‌లో జరిగిన సమావేశంలో మరొక ప్రవచన వాక్కుతో అతనికున్న అపొస్తలత్వపు పిలుపును స్థిరపరిచింది. ఆ సమయంలో జరిగిన కొన్ని వింతైన సంగతులను వాగ్నర్‌ గుర్తు చేసుకుంటున్నాడు.

నేను మొదటి వరుసలో కూర్చున్నాను ....... కొద్ది సేపటికి నాకు తెలియకుండానే అంతర్జాతీయ క్రైస్తవుడైన జిమ్‌ స్టీవెన్స్ తో వేదికపై మోకరించి ఉన్నట్టు గుర్తించాను. అతడు బహిరంగంగా నా గురించి ప్రవచించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను అక్కడికి ఎలా వెళ్ళానో నాకు ఇప్పటికీ తెలియదు! నేను పైకి చూసాను. మాలో ప్రముఖ విజ్ఞాపన కర్తయైన ఛార్లెస్‌ డూలిటిల్‌ నా దగ్గర నిలబడి ఉండడం చూసాను. ఛార్లెస్‌ 6.4 అడుగుల ఎత్తుండే ఒక ఆఫ్రికన్ అమెరికన్‌. కాలిఫోర్నియా రాష్ట్రంలో గ్లెన్డేల్ అనే ప్రాంతంలో అతడొక పోలీన్‌ అధికారి. చాలా కోపం నిండిన ముఖంతో నా తలపై 3 అడుగుల పొడవున్న పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని ఉన్నాడు. నేను జాగ్రత్తగా ఉండి, జిమ్‌ స్టీవెన్స్‌ చెప్పే మాటల్ని శ్రద్దగా వినాలని వెంటనే నిర్ణయించుకున్నాను. ఆ సమయం నుంచి అపోస్తలునిగా ఉండడానికి నేను ప్రవచనాత్మకంగా నియమించబడ్డానని భావించాను.9

కొద్ది సమయం తర్వాత తాను అపొస్తలునిగా నియమించబడ్డానని నిరూపించడానికి ఐరోపాలో ఆవులకు (తద్వారా మనుషులకు సోకే) సంక్రమించే రోగాన్ని అంతమొందించానని వాగ్నర్ చెప్పుకున్నాడు. అతడు ఈ విధంగా చెప్పాడు:

“దేవుడు నాకు అనుగ్రహించిన అపొస్తలుని అధికారాన్ని తీసుకుని ఐరోపాలో, ఇంగ్లాండులో ఆవులకు సంక్రమించే వ్యాధిని సమూలంగా అంతమొందించమని దేవుడు కోరాడు. అక్టోబర్‌ 1వ తేదీన నేను ఆ రోగాన్ని అంతమొందించాను. ఒక నెల తరువాత ఆవులకు సోకే తెగులు అంతమొందించబడిందనీ, అక్టోబరు 1వ తేదీన నేను ఆ రోగాన్ని రూవుమాపడానికి చేసిన శాసనానికి ముందు రోజైన సెప్టెంబర్‌ 30వ తేదీన చివరి కేసు నమోదయ్యిందని చెబుతూ నా స్నేహితుడు ఇంగ్లాండు నుంచి ఒక వార్తా పత్రిక శీర్షికను నాకు పంపించాడు.10

ఐరోపాలో ఈ తెగులు ఇంకా నిలిచే ఉందనీ, కేవలం 2009వ సంవత్సరంలోనే 67 ఆవులకు ఈ తెగులు సోకినట్టు ప్రకటించబడిన వాస్తవాన్ని మితిమీరిన ఉత్సాహంతో వాగ్నర్‌ గమనించలేదు.11 ఈ ఆవులకు వచ్చే రోగాన్ని నియంత్రించడానికి ఐరోపా ప్రభుత్వాలు తీవ్రంగా కృషిచేయడం వాస్తవం కానీ వాగ్నర్‌ అపొస్తలత్వపు శాసనమే ఆ తెగులును అంతమొందించిందనే అభిప్రాయం ఒక దారుణమైన అబద్ధం.

2000లో నూతనంగా ప్రారంభమైన 'ఇంటర్నేషనల్ కొయ్‌లిషన్‌ ఆఫ్‌ అపోసల్స్‌' (అంతర్జాతీయ అపొస్తలుల ఐక్యత) అనే పరిచర్యను వాగ్నర్ ఒక ప్రిసైడింగ్‌ అపొసల్‌ (అధ్యక్ష అపోస్తలుడు) గా ఉండి నడిపించడం ప్రారంభించాడు. 2009లో తన బిరుదు ప్రిసైడింగ్‌ అపొసల్‌ ఎమిరైటస్‌ (గౌరవాచార్యుడు, అధ్యక్ష అపొస్తలుడు) గా మారేవరకు అతడు ఈ హోదాను కలిగి ఉన్నాడు.12 “ఈ ఐక్యత ప్రారంభమైనప్పుడు సభ్యత్వ రుసుము కింద నెలకు 69 డాలర్లు చెల్లించి క్రొత్త అపోస్తలులు ఇందులో చేరవచ్చని పెంతెకోస్తు చరిత్రకారుడైన విన్సన్ సైనన్ చెప్పాడు.13 వాగ్నరే సైనన్‌ను స్వయంగా ఆహ్వానించాడు కానీ తర్వాత తిరస్కరించాడు. “నన్ను నేను అపొస్తలునిగా తలంచుకోలేదు. కనుక అపొస్తలునిగా ఉండడానికి నెలకు 69డాలర్లు నేను చెల్లించలేనని అతనికి రాసానని” సైనన్‌ వివరించాడు. 2012వ సంవత్సరం ఆఖరికి అపొస్తలులు నివసించే దేశాన్నిబట్టి ఈ సభ్యత్వపు ధరలు మారాయి. అంతర్జాతీయ అపోస్తలులకు సాధారణ ఫీజు 350 డాలర్లు. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న అపొస్తలులకు సంవత్సరానికి 450 డాలర్లు, వివాహిత అపొస్తలులకు (అనగా తమను తాము అపోస్తలులుగా భావించుకుంటున్న భార్యాభర్తలకు) 650 డాలర్లు ఫీజు. ప్రాంతీయ అమెరికన్లు సైతం (తొలి జాతీయ అపోస్తలులు) అదే ఫీజుకు 'అంతర్జాతీయ అపొస్తలులు'గా చేరవచ్చు.15

ఈ న్యూ అపోస్టలిక్‌ మూవ్‌మెంట్‌ (నూతన అపొస్తలత్వ ఉద్యమం) ను నిర్వహించే ప్రయత్నంలో, అనేక ఉపవర్గాలతో పాటూ, రెండు ప్రాథమిక వర్గాలుగా 'అపొస్తలుడు' అనే అంశాన్ని వాగ్నర్ వర్ణించాడు. మొదటి వర్గం వర్టికల్‌ ఆపోసల్స్, రెండవ వర్గం హారిజోంటల్‌ ఆపోసల్స్. అనేక పరిచర్యలలో, పరిచర్య వ్యవస్థల్లో నాయకులుగా 'వర్టికల్‌ అపోసల్స్‌' పనిచేస్తారు. వివిధ రకాలైన పరిచర్యలను జరిగించే నాయకులను సమకూర్చడానికి 'హారిజోంటల్‌ అపొసల్స్‌' సహాయం చేస్తారు. పేతురును, పౌలును క్రొత్త నిబంధనలో 'వర్టికల్‌ ఆపోసల్స్' గా వాగ్నర్‌ అభివర్ణించాడు. ఎందుకంటే వారిద్దరికీ సంఘాలను నడిపించే బాధ్యత, సంఘస్తులను శ్రద్ధగా కాపాడే బాధ్యత అప్పగించబడ్డాయి. యెరూషలేము సభలో అపొస్తలులందర్ని విజయవంతంగా ఏకాభిప్రాయానికి తెచ్చిన మన ప్రభువు సహోదరుడైన యాకోబు 'హారిజోంటల్‌ అపొసల్స్‌'కి ఉదాహరణగా ఉన్నాడు.16

ఈ రెండు వర్గాలతోపాటు మతపరమైన వృత్తిపరమైన అపోస్తలులు, సంఘపరమైన అపొస్తలులు, ఏర్పాట్లు చేస్తూ రాయబారం పంపుతూ కార్యక్రమాలను నిర్వహించే ప్రాదేశిక అపొస్తలులు, బహిరంగ అపొస్తలులు, పిలువబడిన అపొస్తలులు అనే ఉప వర్గాలున్నాయి.17 ఈ పేర్లను క్రొత్త నిబంధనలో ఎక్కడైనా వెదకండి. అవి ఎక్కడా లేవని తక్షణమే మీరు కనుగొంటారు.

అయినప్పటికీ, ఈ న్యూ అపొస్టలిక్‌ రిఫర్మేషన్‌ ప్రధాన క్యారిస్‌మాటిక్‌ సంఘాల్లో, థర్డ్‌వేవ్‌ సంఘాల్లో ఎంతో వేగంగా విస్తరిస్తోంది. “అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, సంఘ కాపరులు, బోధకులు” అని ఎఫెసీ 4:11 లో రాయబడిన 5 రకాల పరిచర్యలను పరిశుద్ధాత్ముడు తిరిగి తీసుకు వస్తున్నాడనే సాధారణ నమ్మకం ఈ నూతన సంఘాల్లో ఉంది. సువార్తికుడు, సంఘ కాపరి, బోధకుల పరిచర్యలు ఇవాంజెలికల్‌ సంఘాల్లో ఇప్పటికే సర్వసాధారణమైన కారణాన్ని బట్టి అపొస్తలులు, ప్రవక్తల పరిచర్యలపైనే వారి దృష్టి ఉందని”18 ఒక రచయిత వివరిస్తున్నాడు. వాగ్నర్ యొక్క న్యూ అపోస్టలిక్‌ మూవ్‌మెంట్‌ క్రైస్తవ్యంలోనే అతి వేగంగా విస్తరిస్తున్న శాఖల్లో భాగమనీ, అలా విస్తరించడమే దైవ సమ్మతికి సూచనగా భావించి అతడు విపరీతంగా ఆనందిస్తున్నాడు.19

ఈ అభివృద్ధిని ఆధారం చేసుకుని సంఘంలో ఒక బ్రహ్మాండమైన, ప్రాథమికమైన మార్పు జరుగుతోందని వాగ్నర్ వాదిస్తున్నాడు. ఈ మార్పును పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చిన మార్పుతో అతడు పోలుస్తున్నాడు.20 “నేడు మనం మరొక నూతన ద్రాక్షతిత్తి (బోధ) లోనికి ప్రవేశించాము. దానిని నేను 'రెండవ అపొస్తలుల యుగమని' పిలుస్తున్నాను. సంఘాన్ని మనం నడిపించే విధానంలో వచ్చిన సమూలమైన మార్పులు ఎక్కడో మూలలో కాదు గాని అవి ఇపుడు ఇక్కడ మనతోనే ఉన్నాయని” చెబుతూ 'ఈ న్యూ అపోస్టలిక్‌ రిఫర్మేషన్‌'ను క్రొత్త నిబంధన యొక్క క్రొత్త ద్రాక్ష తిత్తులతో (బోధ) పోల్చే స్థాయికి అతడు వెళ్ళిపోయాడు.21

ఈ 'న్యూ అపోస్టలిక్‌ రిఫర్మేషన్‌'ను వ్యతిరేకించే వారు “దేవుని నూతన ద్రాక్ష తిత్తిని అభినందించి, దీవించడానికి బదులు దాన్ని అడ్డుకున్న పరిసయ్యుల్లాంటి వారని వాగ్నర్‌ అభిప్రాయం.”22 తన నూతన ఉద్యమాన్ని ఎదిరించేవారు సాతానుగాడి ప్రభావం కింద ఉన్నారని అతడు చెప్పాడు. “దేవుని నూతన కాలాలనూ, సమయాలనూ రానీయకుండా మన మనస్సులపై పనిచేయడానికి దురాత్మలను పంపి సాతాను వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ దురాత్మలు విజయవంతమైతే, దేవుడు అభివృద్ధి చేయదలచిన నూతన ద్రాక్షతిత్తుల గురించి మనం తప్పుగా ఆలోచించడం మొదలు పెడతాము.”23 తాను, ఇతర క్యారిస్‌మాటిక్‌ నాయకులూ అపొస్తలులమనీ వాగ్నర్‌ చెప్పుకున్నాడు. ఆ మాటతో విభేదించే వారిని ధర్మశాస్త్రాన్ని గుడ్డిగా అనుసరిస్తున్నారనీ, దెయ్యం పట్టినవారని , సంఘ చరిత్రలో నూతన యుగాన్ని హత్తుకోవడానికి భయపడుతున్నారని అతడు ఎగతాళి చేస్తున్నాడు.

                                            మతోద్ధారణా? లేక మత భ్రష్టత్వమా?

వాగ్నర్‌ తన విమర్శకులపై వ్యక్తిగత దాడులు చేస్తున్నాడు. అయితే ఈ న్యూ అపొస్టలిక్‌ రిఫర్మేషన్‌ మోసమనే విషయాన్ని ఎవరో ఒకరు బట్టబయలు చేయడానికి ఇదే సరైన సమయం.

ఈ న్యూ అపాస్టలిక్‌ రిఫర్మేషన్‌లో విస్తరించిన అహంకారాన్నీ వాక్యం విషయంలో వారి అజ్ఞానాన్ని నొక్కి చెప్పడం కష్టమే. వాగ్నర్‌ తన ఉద్యమాన్ని గురించిన చర్చలో మాట్లాడుతూ: “నేను చెప్పిన మాట ప్రజలు చాలా వివాదాస్పదమైన మాటగా పరిగణిస్తారనే వాస్తవం గురించి నాకు అవగాహన ఉందని” 24 చెప్పాడు. ఈ ఒక్క మాటతో నేను ఏకీభవిస్తున్నాను. అది కేవలం ఒక ఉత్తి మాట. తాను అపొస్తలునిగా నియమించబడ్డానని వ్యాఖ్యానించడం అహంకారంతో పలికిన మాటే కాదు గాని అది పూర్తిగా హాస్యాస్పదమైనది. “ప్రారంభం నుంచి సంఘాల్లో అంతిమమైన అధికారాన్ని చెలాయించే అపొస్తలుల వరాల్ని తిరిగి తెస్తున్నామని వ్యాఖ్యానించే ప్రతీ ఉద్యమం గురించి నేను వ్యసనపడ్డాను. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశమే చాలా ఎక్కువగా ఉంది. సంఘ చరిత్ర అంతటిలో, సంఘంలో అపాస్తలుని స్థానాన్ని తిరిగి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలన్నీ తప్పుడు బోధతో ముగిసిపోయాయి. కొన్ని తట్టుకోలేనంత బాధను కలుగచేశాయని,”25 పెంతెకోస్తు ఉద్యమాన్ని సమర్థించే వాడైనప్పటికీ, వాగ్నర్‌ నూతన ఉద్యమానికి విన్సన్‌ సైనన్‌ భయపడడం సరైన విషయమే.

వాగ్నర్‌ తన ఉద్యమానికి 'న్యూ అపోస్టలిక్‌ రిఫర్మేషన్‌' అనే పేరు పెట్టి ఉండవచ్చు. కానీ ఆ పేరు తెలియచేస్తున్న వాటిలో ఏదీ నిజం కాదు. అది నూతనమైనదీ కాదు, మతోద్ధారణ కాదు, ఖచ్చితంగా అపొస్తలులకు సంబంధించింది అసలే కాదు. సంఘంలో విశ్వాసులపై అధికారం చెలాయించడానికి అధికార దాహం గల తప్పుడు బోధకులు తమను తాము అపొాస్తలులుగా నియమించుకోవడం సంఘ చరిత్రలో ఇదేమీ మొదటిసారి కాదు. అబద్ధ అపొస్తలులు క్రొత్త నిబంధన కాలంలో కూడా చాలా ఎక్కువగా ఉండేవారు. “అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రను పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడని” పౌలు వారిని నిందించాడు (2 కొరింథీ 11:13-14). పేతురు దగ్గరనుంచి పొందుకున్న అపొస్తలుని అధికారం తనకుందని పోప్‌ చెప్పుకున్నాడు. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతితో నిరంకుశ వ్యవస్థగా మధ్య యుగంలో రోమన్‌ కేథలిక్‌ సంఘం మార్పు చెందింది. 20వ శతాబ్దంలో కూడా, క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలోని తొలి శాఖలు 'అపొస్తలత్వం' అనే దానిని ఉజ్జీవింపచేసే ప్రయత్నాలు చేసాయని వాగ్నర్‌ గుర్తించాడు. అలాంటి ఎన్నో శాఖలను పీటర్‌ హాకెన్‌ పరిశోధించాడు.

పెంతెకోస్తు ఉద్యమారంభంలోనే కొన్ని గుంపులు ముఖ్యంగా 1966 లో వేల్స్ లో ఏర్పడిన ద అపొస్తలిక్‌ చర్చ్‌ (అపొస్తలుల సంఘం) అవి అపొస్తలుల మరియు ప్రవక్తల వునరాగమనాన్ని ప్రకటించి ఆ తర్వాత ఈ పరిచర్యలను వ్యవస్థీకృతం చేసాయి. 1948లో కెనడాలోని, సస్కేట్ చేవన్ రాష్ట్రంలో నార్త్ బాటిల్‌ ఫోర్డ్ లో అనే నగరంలో లేటర్‌ రెయిన్‌ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో కూడా పెంతెకోస్తు సంఘాలు తిరస్కరించిన అపొస్తలుల ప్రవక్తల పరిచర్యలు మళ్ళీ కనబడ్డాయి. లేటర్‌ రెయిన్‌ అనుచరులు ఎఫెసీ 4:11 లోని పరిచర్యలు తిరిగి వచ్చాయని నమ్మారు. ఇది తరువాత ఉద్భవిస్తున్నటువంటి క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంపై ప్రభావం చూపింది.26

లేటర్‌ రెయిన్‌ వేదాంతంలోని 'అపొస్తలత్వం' అనే బోధను తీసుకొని వాగ్నర్ తన 'థర్డ్‌ వేవ్' బోధల్లో దాన్ని మిళితం చేసుకున్నాడు. కనుక తన ప్రస్తుత ఉద్యమాన్ని 'నూతన'మైనదని పిలవడం సరి కాదు.

దీనిని 'మతోద్ధారణ' అని పిలవడం కూడా తప్పు దారి పట్టించేదే. ఎందుకంటే 16వ శతాబ్దపు మతోద్ధారణ తనకు స్వయంగా అపొస్తలుని అధికారం ఉందని ప్రకటించుకున్న పోప్‌కు వ్యతిరేకంగా వచ్చిన ప్రాథమిక స్పందన.28 అంతేకాదు, సంఘ మతోద్ధారణలో లేఖనాలకు మాత్రమే కట్టుబడి ఉండాలనే ప్రాథమిక నియమం ఉండేది. ఈ నియమం వాగ్నర్‌ అభిప్రాయాన్ని చాలా బలంగా, సూటిగా వ్యతిరేకిస్తోంది. 'మతతత్వాన్ని' దెయ్యాలకు సంబంధించిందని వాగ్నర్ నిర్వచించాడు. తర్వాత, “ఈ బోధ సంఘ నాయకుల్ని పరిశుద్ధాత్మ ప్రస్తుతం చెబుతున్న విషయాల పై కాకుండా, గతంలో ఆయన చెప్పిన విషయాలపై దృష్టి పెట్టేందుకు కారణమైందని”29 వాదిస్తున్నాడు. మరొక విధంగా చెప్పాలంటే గతంలో బైబిల్‌లో పరిశుద్ధాత్మ చెప్పిన దానిని నమ్మేవారు దెయ్యాల ప్రభావం కింద ఉన్నారని వాగ్నర్‌ అభిప్రాయం.

సంఘ మతోద్ధారణకు చెందిన నాయకులు అటువంటి అభిప్రాయాన్ని వింటే ఎగతాళి చేసుండేవారు. నిజానికి అలాగే ఎగతాళి చేయాలి. విశ్వాసానికీ, ఆచరణకూ సంబంధించిన ప్రతి విషయంలో అధికారం కేవలం లేఖనాలకు మాత్రమే ఉందని వారు పోరాడారు (2 తిమోతి 3:16-17). ఔను, సోలా స్క్రిప్చురా అనే మతోద్ధారణ సిద్ధాంతం ఆధునిక క్యారిస్‌మాటిక్స్‌ కల్పిత ప్రవచనాలకు ఎలాంటి అవకాశాన్నీ ఇవ్వదు. కనుక వాగ్నర్ ఆ సిద్ధాంతాన్ని తృణీకరిస్తున్నాడు. ఇది ఆశ్చర్యపడవలసిన విషయమేమీ కాదు. (4వ అధ్యాయంలో వాక్య ప్రత్యక్షత ముగిసింది (the close of the biblical canon) అనే సిద్ధాంతాన్ని బహిరంగంగా వాగ్నర్ ప్రశ్నించడం మనం చూసాము).

ఆఖరిది, అతి ప్రాముఖ్యమైనది: ఈ న్యూ అపాస్టలిక్‌ రిఫర్మేషన్‌ అనేది ఏ విధంగానూ అపొస్తలులకు సంబంధించింది కాదు. నిజమైన అపొస్తలులకు ఉండవలసిన వాక్య అర్హతలను ఆలోచిస్తే ఆ విషయం మనకు చాలా సులభంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ న్యూ అపొస్టలిక్‌ రిఫర్మేషన్‌లో అపొస్తలులని పిలువబడుతున్న వారికి క్రొత్త నిబంధన ప్రమాణాలను అన్వయిస్తే వెంటనే వాళ్లు నకిలీ అపొస్తలులనీ, నటులనీ తేలిపోతుంది.

                                                 అపోస్తలత్వానికి వాక్య ప్రమాణాలు

ఆది సంఘంలో ఉన్న ప్రతీ వరాన్ని నేటి సంఘం ఆశించి దానిని అనుభవించాలనే భావంతో క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం పనిచేస్తోంది. “క్రొత్త నిబంధన అనగా గతంలో జరిగిన విషయాలతో నిండిన గ్రంథం కాదు గానీ యేసు వచ్చే వరకు ప్రతి తరంలో జరగవలసిన దానికి అది ఒక నమూన”30 అని ఆ భావాన్ని ఒకనాటి ప్రముఖ పెంతెకోస్తు నాయకుడైన డేవిడ్‌ డు ప్లెస్సిస్‌ వ్యక్తపరిచాడు. ఆ ఊహ నుంచి ఉత్పన్నమయ్యే భావాలే నేటి సంఘంలో ఇంకా అపొస్తలులున్నారని వాదించడానికి వాగ్నర్ తదితరులను ప్రోత్సహించాడు. ఆది సంఘంలో అపొస్తలులు ఉన్నారు. కనుక నేటి మన సంఘాలలో కూడా అపొస్తలులు ఉండి తీరాలని వాళ్ళు వాదిస్తున్నారు.

కానీ ఆ రకమైన భావనలో ప్రాణాంతకమైన దోషం ఉంది. అపొస్తలత్వాన్ని పొందడానికి ఉన్న వాక్య ప్రమాణాలు సంఘంలో ఇంకా అపొస్తలులు ఉన్నారని నమ్మబలికే ప్రతి మాటనూ తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. అపొస్తలులందరిలో యోహాను ఆఖరిగా మరణించాడు. దాదాపు క్రీ.శ 100వ సంవత్సరంలో అతడు మరణించాడని చరిత్ర చెబుతోంది. నిజానికి క్రొత్త నిబంధనలో వర్ణించబడిన ప్రత్యేక షరతులను బట్టి చూస్తే, తర్వాత సంఘ చరిత్రలో మరెవ్వరూ తన్ను తాను చట్టబద్ధంగా అపొస్తలుడని చెప్పుకోలేదు. వాక్యానుసారంగా మాట్లాడితే, అపొస్తలుని వరాన్నీ ఆ ధర్మాన్నీ ఆది సంఘానికి మాత్రమే దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహించాడు. అది నేటి సంఘంలో అనుభవించే వరం కాదు. దీనికి కనీసం ఆరు కారణాలున్నాయి.

1) అపొస్తలత్వానికి అవసరమైన అర్హతలు:

మొదటిగా, అపోస్తలునిగా పరిగణించడానికి అవసరమైన వాక్య అర్హతలను నెరవేర్చడం నేటి క్రైస్తవుడెవరికైనా అసాధ్యమే. కనీసం మూడు అత్యవసరమైన లక్షణాలను కొత్త నిబంధన తెలియచేస్తుంది.

1) అపొస్తలుడు ఖచ్చితంగా పునరుత్థానుడైన క్రీస్తును చూసిన ప్రత్యక్ష సాక్షియై ఉండాలి. (అపొ కా, 1:22,10:39-41, 1కొరింధీ 9:1, 15:7-8).
2) అపోస్తలుణ్ణి స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తే నియమించాలి (మార్కు 3:14, లూకా 6:13, అపో కా 1:2, 24:10,41, గలతీ 1:1).
3) అద్భుతాలతో సూచనలతో తన అపొస్తలత్వ నియామకాన్ని అపొస్తలుడు ధృవీకరించగలగాలి (మత్తయి 10:1-2, అపో కా 1:5-8; 2:43, 4:33, 5:12, 8:14, 2 కొరింధీ 12:12, హెబ్రీ 2:3-4)

నేటి సంఘంలో అపొస్తలులు లేరనే వాస్తవానికి ఆ అర్హతలే స్వయంగా సాక్ష్యమిస్తున్నాయి. పునరుత్థానుడైన క్రీస్తును తన స్వనేత్రాలతో చూసిన ఏ వ్యక్తీ నేటి కాలంలో లేడు. అపొస్తలుల కార్యాల గ్రంథంలో అపొస్తలులు చేసిన విధంగా అద్భుత సూచనలను ఎవ్వరూ చేయలేరు (అపో .కా. 3:3-11, 5:15-16, 9:36-42, 20:6-12, 28:16). ప్రస్తుత సంఘంలో అనేకులు తమను ప్రభువే స్వయంగా అపొస్తలులుగా నియమించాడని గర్వంగా చెప్పినప్పటికీ అది నిజం కాదు. పునరుత్థానుడైన ప్రభువును తమ దర్శనాల్లో చూసామని కొందరు క్యారిస్‌మాటిక్స్‌ చెప్పుకుంటున్నారు. అలాంటి మాటలను ధృవీకరించడం అసాధ్యం కాబట్టి వాటిని అనుమానించాలి. అపొస్తలుడు తన స్వనేత్రాలతో శరీరధారిగా ఉన్న పునరుత్థానుడైన క్రీస్తును చూడాలనే అపొస్తలత్వ ప్రమాణానికి వాళ్ళు సరితూగరు.

“ఒకరికి కలిగిన దర్శనాలు, కలలు నిజమైనప్పటికీ అవి అతణ్ణి క్రీస్తు యొక్క అపొస్తలునిగా ఉండడానికి అర్హునిగా చేయలేవు. బైబిల్‌ మనోనేత్రానికి బాహ్యనేత్రానికి ఉన్న తేడాను నొక్కి చెబుతుంది. బాహ్యనేత్రానికి దర్శనాన్ని శ్రేష్టమైనదిగా చూపిస్తుంది. యేసుని దర్శనంలోనో లేదా కలలోనో చూసామనే వారి ప్రస్తుత వ్యాఖ్యలు క్రీస్తు అపొస్తలునిగా ఉండడానికి ఎవ్వరినీ అర్హులుగా చేయవని” సామ్యూల్‌ వాల్డ్‌రన్‌ వివరిస్తున్నాడు.31

వేయిన్‌ గ్రూడెం ప్రముఖ రచయిత, ఫోనిక్స్‌ వేదాంత కళాశాలలో బైబిల్‌ బోధకుడు, ఒక నిబద్ధత గల క్యారిస్‌మాటిక్‌ సభ్యుడు. అంతేకాదు ఈ ఉద్యమానికి శ్రేష్టుడైన వేదాంత పండితుడు, ప్రతివాది. అయితే “తన స్వనేత్రాలతో పునరుత్థానుడైన క్రీస్తును చూసిన అర్హతను నేటి దినాన ఎవరూ సాధించలేరు, కాబట్టి నేడు అపొస్తలులు లేరని”32 అతడే అంగీకరిస్తున్నాడు.

ఈ అర్హతల గురించి పీటర్‌ వాగ్నర్‌కు పూర్తిగా తెలుసు. వాటిని అతడు నెరవేర్చలేడు. కాబట్టి వాటిని ఎంతో సునాయాసంగా విస్మరిస్తున్నాడు. తను ప్రారంభించిన న్యూ అపోస్టలిక్‌ రిఫర్మేషన్‌ (నూతన అపొస్తలుల మతోద్ధారణ) కు సరితూగే అపోస్తలత్వపు కథనాన్ని చెప్పిన తర్వాత, అపోస్తలుని నిర్వచించడానికి ఉన్న వాక్య అర్హతలను తాను ఉద్దేశపూర్వకంగానే వదిలేస్తున్నానని వాగ్నర్‌ ఒప్పుకుంటున్నాడు.

అపొస్తలునిగా ఉండడానికి మూడు వాక్య ప్రమాణాలున్నాయి. అపొస్తలుని నిర్వచించడానికి కొంతమంది వీటిని ఉపయోగిస్తున్నారు. 1) సూచనలు, అద్భుతాలు (2 కొరింథీ 12:12), 2) యేసును వ్యక్తిగతంగా చూడడం (1కొరింథీ 9:1), 3) సంఘాలను స్థాపించడం (1 కొరింథీ 3:10) అనేవే ఆ ప్రమాణాలు. ఈ మూడు ప్రమాణాలు అంత ప్రాముఖ్యమైనవి కావని నేను భావిస్తున్నాను. కనుక ఈ మూడింటిలో ఎవరికైననూ ఒకటి రెండు ప్రమాణాల్లో అభిషేకం లేనంత మాత్రాన అతణ్ణి అపొస్తలునిగా ఉండడానికి అడ్డు చెప్పకూడదు.33

అపొస్తలత్వాన్ని పొందడానికి ఉన్న వాక్య ప్రమాణాల్లో సంఘాలు స్థాపించే అంశం ఉందా లేదా అనే విషయంపై మనం వాదించవచ్చు. కానీ మిగిలిన రెండు సూచనలు ఖచ్చితంగా ఉండాలి. అయితే వాగ్నర్‌ వాటిని ప్రాముఖ్యత లేనివాటిగా కొట్టిపారేస్తున్నాడు. వాటిని చాలా వివాదాంశాలుగా పరిగణిస్తున్నాడు. ఇది కేవలం తన యొక్క అపొస్తలత్వ అధికారాన్ని వాక్యప్రమాణం ధ్వంసం చేస్తుందన్న కారణాన్ని బట్టే తప్ప వేరే ఇతర కారణమేమీ లేదు. అతడు తనను తానే అపొస్తలునిగా ప్రకటించుకున్నాడు. తనకు ఆసౌకర్యం కలిగించేది ఏదైనా, తాను ఏ అధికారాన్నైతే పొందానని నమ్ముతున్నాడో దానినుంచి అతణ్ణి తొలగించేది స్పష్టమైన లేఖన బోధ దేనినైనా సరే కొట్టిపారేసే అధికారం తనకుందన్నట్లు అతడు ప్రవర్తిస్తున్నాడు. లేఖనాల యెడల అటువంటి అధికారంతో కూడిన వైఖరితో ఈ న్యూ అపాస్టలిక్‌ రిఫర్మేషన్‌ నిండిపోయింది. వాగ్నర్‌కూ, అతని మద్దతుదారులకు “ఆధునిక యుగపు అపొస్తలులు” అనే అంశాన్ని ప్రచారం చేయడానికి ఉన్న ఏకైక మార్గం బైబిల్‌ స్పష్టంగా బోధించే దానిని పెడచెవిన పెట్టడమే.

2) అపొస్తలుల్లో ఆఖరివాడు పౌలు

పౌలు అపోస్తలునిగా ఉండడానికి కావలసిన ఆ మూడు అర్హతలను కలిగి ఉన్నాడు. అయితే, అతడు అపొస్తలునిగా నియమించబడిన విధానం మాత్రం ప్రామాణికం కాదు. పునరుత్థానం తర్వాత ప్రభువైన యేసుని దర్శనాలను వర్ణిస్తూ, 1 కొరింథీ 15:5-9 లో పౌలే స్వయంగా ఈ విషయాన్ని నొక్కి చెప్పాడు. యేసు భూమిపై పరిచర్య చేసిన కాలంలో ఆయనతో ఉన్న 11 మంది శిష్యులు లాంటి వాడు కాడు పౌలు. మేడగదిలో తన శిష్యులకు ప్రభువు దర్శనమిచ్చినప్పుడు అతడు లేడు. పునరుత్థానుడైన క్రీస్తును చూసిన 500 మంది సాక్షుల్లో కూడా అతడు లేడు. నిజానికి పౌలుకు పునరుత్థానం తరువాత కాదు కానీ ఆయన ఆరోహణం తర్వాత ప్రభువు కనిపించారు. దమస్కులో ఉన్న క్రీస్తు అనుచరులను హింసించడానికి వెళ్తూ మార్గమధ్యలో ఉండగా (సౌలు అని పిలువబడిన) పౌలుకు ఈ దర్శనం కలిగింది (అపొ.కా.9:1-8).

కానీ పౌలుకు కలిగిన అసాధారణ అపోస్తలత్వం తాము కూడా పొందగలమని భావించేవారు, పౌలుకు ఉన్న అసమాన పిలుపును గురించి రెండు ప్రాముఖ్యమైన విషయాలను గమనించాలి. మొదటిది: 1కొరింథీ 15:8 లో పునరుత్థానుడైన క్రీస్తు వ్యక్తిగతంగా, భౌతికంగా చిట్టచివరిగా దర్శనమిచ్చింది తనకేనని పౌలు చెబుతున్నాడు. పౌలు తర్వాత ఎవరైనా అపొస్తలత్వాన్ని పొందే అవకాశాన్ని ఇది అడ్డుకుంటుంది. ఎందుకంటే పునరుత్థానుడైన క్రీస్తును చూడడం అపొస్తలత్వానికి ఉన్న అత్యావశ్యకమైన విషయం. అటువంటి అనుభవం కలిగిన ఆఖరి వ్యక్తిని తానేనని పౌలు ప్రకటించాడు.

రెండవది: పౌలు తన అపొస్తలత్వాన్ని అసమానమైనదిగా, అసాధారణమైనదిగా చూసాడన్న విషయాన్ని గమనించాలి. తన రక్షణకు ముందు సంఘం యెడల కనపరిచిన ద్వేషాన్ని బట్టి తనను తాను అకాలమందు పుట్టినవానిగానూ (వ8) అపొస్తలులందరిలో తక్కువవానిగా ఎంచుకున్నాడు (వ9). తన అపొస్తలత్వపు ప్రామాణికతను అతడెన్నడూ ప్రశ్నించనప్పటికీ, తరువాత తరం క్రైస్తవులు అనుసరించడానికి ఒక ప్రామాణికమైన పద్ధతిగా మాత్రం పౌలు దానిని చూడలేదు.

3) అపొస్తలులు అసమానమైన అధికారాన్ని కలిగి ఉన్నారు

క్రొత్త నిబంధన అపొస్తలులు దేవుని ప్రత్యక్షతలకు రాయబారులుగా గుర్తింపు పొందారు. అందుచేత సంఘ చరిత్రలో వారు అసమానమైన అధికారాన్ని కలిగియున్నారు. ఈ అధికారాన్ని వారు స్వయంగా క్రీస్తు నుంచే పొందుకున్నారు. యేసుక్రీస్తుకు అపొస్తలునిగా ఉండడమంటే ఆయన ప్రతినిధిగా ఉండడమని అర్థం. ప్రస్తుత చట్టరీత్యా చూస్తే, ప్రభువుకు ప్రత్యామ్నాయాలుగా మనం అపొస్తలులను ప్రస్తావించవచ్చు. తన సొంత అధికారాన్ని వారికి ఆయన అనుగ్రహించారు.

“అపొస్తలుడు” అనే పదం క్రొత్త నిబంధనలో 'సంఘాలకు అపొస్తలుల (లేదా దూతల)' ను సూచించడానికి ప్రత్యేక పద్ధతిలో ఉపయోగించబడిందనేది కూడా వాస్తవమే (2 కొరింథీ 8:3). అయినా సరే వారిని ఆ పన్నెండు మందితోనూ, అపొస్తలుడైన పౌలుతోనూ పోల్చకూడదు. ప్రభువైన యేసుక్రీస్తుకు అపొస్తలునిగా ఉండడం అనేది ఒక ప్రత్యేకమైన పిలుపు, అదొక ఉన్నతమైన ఆధిక్యత. ఈ అధిక్యతకూ స్థానిక సంఘం నుంచి పంపబడిన సామాన్య దూత కలిగి ఉన్న పిలుపుకూ చాలా వ్యత్యాసముంది. ప్రభువైన యేసుకు అపొస్తలునిగా ఉండడమంటే వ్యక్తిగతంగా ఆయనచేత నియమించబడడం. సంఘంలో ఉన్న అంతిమ అధికారం ఇదే. సంఘానికి పునాది వేస్తుండగా ప్రత్యక్ష పరచబడిన సిద్ధాంతాన్ని ప్రకటించడానికి వేరే ఏ ఇతర వ్యక్తికీ అనుగ్రహించదగని ఒక విశిష్టమైన బాధ్యత ఇది.

మేడపై గది ప్రసంగంలో, తన ప్రజలకు దేవుని సత్యాన్ని బయలుపరచడానికి పరిశుద్ధాత్ముడు అపొస్తలులను బలపరుస్తాడనే వాగ్దానం చేస్తూ, తాను లేనప్పుడు సంఘాన్ని నడిపించే అధికారాన్ని వారికి స్వయంగా ప్రభువే ఇచ్చారు (యోహాను 14: 26, 15:26-27, 16:12-15). అది సంఘంలో అపొస్తలుల బోధ క్రీస్తుయొక్క అధికారంతో వచ్చిందని విశ్వాసులు గుర్తించారు. అపొస్తలుల రచనలు ప్రేరేపించబడినవి, లోపరహితమైన ప్రత్యక్షత కలిగినవి. కనుక దేవుని వాక్యంగా వాటిని అంగీకరించాలి, వాటికి లోబడాలి (1కొరింథీ 14:37, గలతీ 1:9, 2 పేతురు 3:16) అపోస్తలుని అధికారంతో రాయబడిన ప్రేరేపిత పత్రిక పాత నిబంధన లేఖనాలంత అధికారం కలిగి ఉంది (1కొరింథీ 14:37, గలతీ 1:9, 2 పేతురు 3:16). సంఘానికి రాసినప్పుడు యూదా ఆ వైఖరిని కనపరిచాడు. “అయితే ప్రియులారా ..... మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి” (యూదా 17)

'లేఖన ప్రమాణం' (Canonicity) అనే సిద్ధాంతం గురించి ఆలోచించినప్పుడు ఈ అపొస్తలుని అధికారం ప్రాముఖ్యమైనదౌతుంది. ప్రేరేపిత లేఖనాలను రాయడానికి అపొస్తలులకు స్వయంగా ప్రభువైన యేసే అధికారాన్ని ఇచ్చారు. ఒక గ్రంథమైనా లేదా ప్రవచనాత్మక అధికారంతో మాట్లాడుతున్న పత్రికైనా అపోస్తలుని చేతగానీ లేదా అపోస్తలుని పర్యవేక్షణలో గానీ రాయబడితే అది ప్రేరేపించబడినదిగానూ, అధికార పూర్వకమైనదిగానూ గుర్తించబడేది. అయితే అపొస్తలుని అధికారం నుంచి వేరు చేయబడిన రచనల గురించి రచయిత తనకు ఎలాంటి అధికారాన్ని ఆపాదించుకున్నప్పటికీ, అవి లేఖనాలుగా అంగీకరింపబడేవి కావు.34. ఆది సంఘంలో సైతం అపొస్తలుని అధికారం పొందకుండా, దైవావేశం కలిగిన రచనలుగా చెప్పుకున్నటువంటి గ్రంథాలకు కొదువ లేదు (2 థెస్స 2:2, 2కొరింథీ 11:13, 2 పేతురు 2:1-3).

నేటి సంఘంలోనికి అపొస్తలులను ప్రవేశపెట్టాలనుకుంటున్న ప్రస్తుత క్యారిస్‌మాటిక్స్‌కు ఇదంతా ప్రశ్నలను లేవనెత్తుతోంది. తమను తామే అపొస్తలులుగా ప్రకటించుకునే వీరిలో అనేకులు దేవుని ప్రత్యక్షత ప్రత్యేకంగా, నేరుగా తమకు వస్తుందని చెబుతున్నారు. వారికి నిజంగా అపొస్తలుని అధికారం ఉంటే, బైబిల్‌లో వాటిని చేర్చకుండా వారిని అడ్డుకునేదేంటి? ప్రస్తుత అపొస్తలులు తమకు కలిగే ప్రత్యక్షతను లేఖనాలకు కలపడానికి భయపడుతుంటే, వారి అపొస్తలత్వపు యథార్థత గురించి అది ఏమి చెబుతోంది?

"అపొస్తలుని ధర్మంలో ఏదో విశిష్టత ఉన్నది. నేటి దినాన బైబిలుకు ఎవరైనా కొన్ని మాటలను కలిపి వాటిని దేవుని మాటలుగా, లేఖన భాగంగా నమ్మించడం సాధ్యంకాదు గనుక నేటి దినాన సంఘంలో అపోస్తలత్వం కొనసాగాలని మనం ఆశించకూడదని”35 వేయిన్‌ గ్రూడెమ్‌ సరిగ్గా చెప్పాడు.

ఈ వాస్తవాన్ని బహిరంగంగా ఒప్పుకున్నది మరెవరో కాదు క్యారిస్‌మాటిక్‌ వేదాంత పండితుల్లో ఒక ప్రముఖుడు. అపొస్తలుల కార్యాలు గ్రంథంలో, 1కొరింథీ పత్రికలో వర్ణించబడిన అద్భుతాలు, కృపా వరాలన్నీ నేటికీ క్రైస్తవులకు అందుబాటులో ఉన్నాయనీ, ప్రవచన వరాలు, సూచనలు, అద్భుతాలు కేవలం అపొస్తలుల యుగానికి మాత్రమే పరిమితమైనవి కావనీ, ఈ సూచనల్లో ఒకటి గాని అనేకం కానీ నిలిచిపోయాయని నమ్మడానికి సరియైన హేతువు లేదనేది క్యారిస్‌మాటిక్‌ సిద్ధాంతానికి అత్యవసరమైన ఆరంభం. ఆ సిద్ధాంతానికి 'కంటిన్యుయేషనిజమ్‌' అని పేరు పెట్టారు. కానీ అపొస్తలత్వం, లేఖన ప్రమాణం (Canonicity) అనే సిద్ధాంతాల విషయంలో తాను 'సిసేషనిష్ట్‌' నని వేయిన్‌ గ్రూడెమ్‌ తన గురించి తాను చెప్పుకున్నాడు. ఫలితంగా క్యారిస్‌మాటిక్‌ సిద్ధాంతానికి వ్యతిరేకమైన ప్రాథమిక వాదాన్ని అతడు అంగీకరించాడు. ఆ విషయాన్ని మరొకసారి ఆలోచిద్దాం. కానీ ప్రస్తుతానికి, కంటిన్యుయేషనిజమ్‌ సిద్ధాంతాన్ని సమర్థించే ప్రముఖులు సైతం అపొస్తలుల యుగం తర్వాత జరిగిన ప్రాముఖ్యమైన మార్పును ఒప్పుకోవలసి వస్తుందనే విషయాన్ని గమనించండి.

'లేఖన ప్రమాణం' (Canonicity) ముగిసిందనే విషయాన్ని నమ్మకమైన విశ్వాసులందరూ తప్పనిసరిగా గుర్తించడం అతి కీలకమైనది. మొదటి శతాబ్దపు సంఘ చరిత్ర తరువాత అపోస్తలుని ధర్మం కొనసాగలేదు కనుక అది ముగిసిందని ఖచ్చితంగా మనకు తెలుసు. అపొస్తలుల రాతపూర్వక సాక్ష్యమే అనగా దైవావేశం మూలంగా గ్రంథస్థం చేయబడిన వారి అధికార పూర్వక బోధయే నేటికీ నిలిచి ఉన్న మన ఏకైక అధికారం. కనుక క్రొత్త నిబంధన రచనలే నేటి సంఘంలో నిజమైన అపొస్తలుల అధికారాన్ని కలిగి ఉన్నాయి.

4) అపొస్తలులు సంఘానికి పునాది వేశారు

ఎఫెసీయులకు తన పత్రికను రాస్తూ, వారంతా దేవుని గృహంలో భాగమని పౌలు వివరించాడు. “క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపోస్తలులును ప్రవక్తలును వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు” (ఎఫెసీ 2: 19-20). ఈ వాక్యభాగం అపోస్తలులను సంఘ పునాదులతో సమానం చేస్తుంది. సంఘ చరిత్రలో ప్రారంభ దశకు అపొస్తలత్వాన్ని ప్రత్యేకంగా పరిమితం చేయకపోతే దీనికి అర్థం లేనట్టే. ఎందుకనగా పునాది అనేది నిర్మాణపు ప్రతి దశలోనూ తిరిగి కట్టబడేది కాదు, పునాది విశిష్టమైనది. అది ఎల్లప్పుడూ మొదటిగా వేయబడుతుంది. దానిపైనే మిగిలిన నిర్మాణమంతా స్థిరంగా ఆధారపడుతుంది.

అపొస్తలుల కాలం తరవాత జీవించిన కెస్తవ నాయకులు అనగా సంఘ పితరులుగా పిలువబడిన వారి రచనలను పరిశీలిస్తే సంఘానికి పునాది వేయబడింది గత కాలంలోనేనని వారు గుర్తించినట్లు వెంటనే తేటతెల్లమవుతుంది.36 ఇగ్నేషియస్ (క్రీ.శ 35-115) మేగ్నెషియులకు రాసిన తన పత్రికలో సంఘానికి గతంలోనే పేతురు, పౌలు పునాది వేసారని చెప్పాడు. అపొస్తలుల కార్యాల గ్రంథాన్ని ప్రస్తావిస్తూ “ఇది సిరియాలో మొదట నెరవేర్చబడింది. పౌలు పేతురు సంఘానికి పునాదులు వేస్తున్నప్పుడు, అంతియొకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారని”37 ఇగ్నేషియస్ రాశాడు.

పన్నెండు మంది అపొస్తలులను 'సంఘం యొక్క పన్నెండు స్తంభాల పునాది' అని ఇరేనియస్‌ (క్రీ.శ 130-202) ప్రస్తావించాడు.38 “అపొస్తలుల కాలం తర్వాత, వారు పునాది వేసిన సంఘాల్లో ప్రకటించబడిన సిద్ధాంతం మాత్రమే నిజ క్రైస్తవులు అంగీకరించిన సిద్ధాంతమని,” టెర్టూల్లియన్ సైతం వివరించాడు.” 39. అపొస్తలులు వేసిన సంఘ పునాదులు గత కాలంలోనేనని తన “డివైన్‌ ఇన్‌స్టిట్యూట్‌” (దైవ విధులు) లో లాక్టంటియస్‌ (క్రీ.శ. 240-320) ప్రస్తావించాడు. ఆ పన్నెండు మంది గురించి మాట్లాడుతూ, “శిష్యులు రాజ్యాలన్నింటిలో చెదరగొట్టబడి, ప్రతి చోట సంఘ పునాదులు వేస్తూ, వారి దైవ యజమాని నామంలో నమ్మశక్యం కాని అనేక అద్భుతాలను జరిగించారని” అతడు వివరించాడు. ఆయన వెళ్ళిపోయే సమయంలో వారి నూతన ప్రకటన స్థిరపరచబడి బలపరచబడాలనే ఉద్దేశంతో వారిని శక్తితో, బలంతో ఆయన నింపారు.40

ఇలాంటి ఉదాహరణలు అనేకం ఇవ్వవచ్చు అయితే ఇప్పటికే విషయం స్పష్టమైంది. ప్రస్తుత క్యారిస్‌మాటిక్స్‌ వారు 'అపొస్తలుల పునాది' నేటి దినాన ఇంకా వేయబడుతుందని వ్యాఖ్యానించవచ్చు. కానీ ఆ అభిప్రాయం లేఖనం యొక్క స్పష్టమైన భావానికీ, చరిత్రలో అపొస్తలుల తర్వాత జీవించిన క్రైస్తవ నాయకుల గ్రహింపుకూ విరుద్ధంగా ఉంది. అపొస్తలులు సంఘ పునాదిని సంపూర్ణంగా వేసారని మొదటి శతాబ్దంలోనే వారు స్పష్టంగా గ్రహించారు. ఆధునిక అపోస్తలులనే ఏ అభిప్రాయమైనా ఎఫెసీ 2:20 లో పౌలు ఉపయోగించిన పోలిక వెనుక ఉద్దేశాన్ని నాశనం చేస్తుంది. అపొస్తలులు సంఘ పునాదిలో ఉండగా, మరలా వారిని ఇంటి వాసాల దగ్గర పెట్టాలనుకోవడం కేవలం బుద్ధిలేనితనం ఔతుంది.

5) అపొస్తలుల తర్వాత సంఘాన్ని పెద్దలు, పరిచారకులు నడిపించారు

సంఘ భవిష్యత్తు గురించీ, సంఘం ఏ విధంగా నిర్వహించబడాలనే విషయం గురించీ అపొస్తలులు బోధించినప్పిడు, క్రొత్త అపొస్తలులను ఎంపిక చేసుకోమని వారు సలహా ఇవ్వలేదు. దానికి భిన్నంగా సంఘ కాపరుల పెద్దల పరిచారకుల గురించి వారు మాట్లాడారు. కనుక “మీ మధ్యనున్న దేవుని మందను కాయుడని” పెద్దలకు పేతురు ఆజ్ఞాపించాడు (1పేతురు 5:2). “నేను నీ కాజ్ణాపించిన ప్రకారము, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించుమని” పౌలు తీతుకు చెప్పాడు (తీతు 1:5). 1తిమోతి మూడవ అధ్యాయంలో పెద్దలకు పరిచారకులకు ఉండవలసిన అర్హతలను అతడు అదే విధంగా వివరించాడు. సంఘ కాపరికి రాసిన పత్రికల్లో ఎక్కడా అపొస్తలత్వం కొనసాగుతుందని పౌలు చెప్పలేదు కానీ అర్హులైన పెద్దల పరిచారకుల నాయకత్వంలో సంఘ నిర్వాహణ గురించి అతడు చాలా చెప్పాడు. ఆ విధుల్లో నమ్మకమైన వ్యక్తులుంటే, సంఘం వర్ధిల్లుతుంది. “నీవు అనేక సాక్షుల యెదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుమని,” పౌలు తిమోతికి చెప్పాడు (2 తిమోతి 2:2).

క్రొత్త నిబంధన రచనలు ముగిసిన కొద్ది కాలానికి జీవించిన సంఘ నాయకుల సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని సంఘ చరిత్రను పరిశీలిస్తే, ఆ ఆది సంఘ పితరులు తమను తాము అపోస్తలులుగా కాకుండా 'అపొస్తలులకు శిష్యులుగా' ఎంచుకున్నారనే విషయాన్ని మనం కనుగొంటాము.41 అపొస్తలులు ఆసమానులని వారు గ్రహించారు. అపొస్తలుల యుగం ముగిసిన తర్వాత, సంఘం పెద్దల చేత (కాపరులు, భిషప్పులు), పరిచారకుల చేత నడిపించబడింది. “తర్వాత కాలంలో నమ్ముకోబోయే వారికి అధ్యక్షులుగా, పరిచారకులుగా ఉండడానికి అపొస్తలులు తమ ప్రయాసల్లో ప్రథమ ఫలాలను నియమించారని” క్రీ.శ 90-100 సంవత్సరాల కాలంలో రోమ్‌కు చెందిన క్లెమెంట్‌ రాస్తూ చెప్పాడు.42 అదే విధంగా అంతియొకయలో ఉన్నవారికి రాసిన తన పత్రికలో తాను అపోస్తలుణ్ణి కానని ఇగ్నేషియస్‌ (క్రీ. శ. 35-115) స్పష్టం చేస్తాడు. “ఈ విషయాల్లో నేనే అపొస్తలుణ్ణి అన్నట్టు ఆజ్ఞలను జారీ చేయను. కానీ మీ తోటి దాసునిగా, వాటిని మీకు గుర్తు చేస్తున్నానని” అతడు వ్రాసాడు.

నా అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి నేను ఎంపిక చేసుకున్న కల్పితాలు కావు అవి. అపొస్తలుల యుగం అసమానమైనది పునరావృతం కానిది సంఘ చరిత్రలో మొదటి శతాబ్దానికి మాత్రమే పరిమితమైనదనే విషయంలో ఇది సంఘ పితరుల ఏకాభిప్రాయం. 'అపొస్తలుల సమయం' అనగా “గత కాలానికి సంబంధించినది, అదొక పూర్తిచేయబడిన వాస్తవమని,” అగస్టీన్‌, జాన్‌ క్రిసాస్టమ్‌ చెప్పారు. నాల్గవ శతాబ్దంలో యూసేబియస్‌ అనే సంఘ చరిత్రకారుడు సంఘ చరిత్ర యొక్క మొత్తం ప్రవాహం అపొస్తలుల కాలాన్నుంచి తన రోజు వరకు ప్రవహిస్తుందని గుర్తించాడు.45 ముందు తరాల్లో ఉన్న సంఘ నాయకులను అపొస్తలుల కాలాలకు సమీపంగా నివసించినట్టు సిజేరియాకు చెందిన బాసిల్‌ ప్రస్తావించాడు.46 అపొస్తలుల కాలం తర్వాత జరిగిన సంఘటనలను నొక్కి చెప్పాడు టెర్టూల్లియన్‌.47

అపొస్తలుల యుగం ముగిసిందనీ, దాని కొనసాగింపుని ఆశించకూడదనీ ఆది సంఘమంతా ఏకపక్షమైన సమ్మతి తెలియచేసిందనే విషయాన్ని నిరూపించడానికి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. అపొస్తలుల తర్వాత వచ్చిన వారు తాము అపాస్తలులం కాదని స్పష్టంగా చెప్పారు. బదులుగా సంఘకాపరులుగా, పెద్దలుగా, పరిచారకులుగా తమని తాము చూసుకున్నారు. “సిసేషనిజమ్‌” అనే సిద్ధాంతాన్ని సమర్థించడానికి వేయిన్ గ్రూడెమ్ మాటలను మరొకసారి ప్రస్తావిస్తే: “అథనేషియన్‌, అగస్టీన్, లూథర్‌, కాల్విన్‌, వెస్లీ , విట్ఫీల్డ్ వంటి నంఘ చరిత్రలోని ఏ ప్రముఖ నాయకుడు తనకు తాను అపొస్తలుని బిరుదును తీసుకోలేదు, అపొస్తలునిగా పిలువబడడానికి ఒప్పుకోలేదనే విషయం గమనించదగింది. ప్రస్తుత కాలంలో 'అపొస్తలుని' బిరుదు తీసుకోవాలనుకునేవారు స్వీయ ఘనతను గురించిన అపేక్ష మితిమీరిన స్వార్ధం, అధికార దాహంచేత ప్రేరేపించబడుతున్నారనే అనుమానం కలిగి తీరుతుంది.48

6) అపొస్తలులు విశిష్టమైన ఘనతను కలిగి ఉన్నారు

సంఘ చరిత్రలో అపొస్తలులు అసమానమైన అధికారం కలిగి ఉండడం మాత్రమే కాదు, నిత్యత్వంలో కూడా ఘనతలో వారికి అసమానమైన స్థానం ఇవ్వబడింది. నూతన యెరూషలేమును వర్ణిస్తున్నప్పుడు, అపొస్తలుడైన యోహాను ఈ విధంగా వివరించాడు.“ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులు గలది, ఆ పునాదుల పైన గొఱ్ఱెపిల్ల యొక్క పన్నిద్దరు అపొస్తలుల పన్నెండు పేర్లు కనబడుతున్నాయి (ప్రకటన 21:14). నిత్యత్వమంతా ఆ పునాదులు సంఘంతో దేవుని సంబంధాన్ని గుర్తు చేస్తుంటాయి. దానికి అపొస్తలులే పునాది. నూతన యెరూషలేము ప్రాకారంలో పన్నెండుమంది అపొస్తలులపేర్లు నిత్యమూ ముద్రించబడి ఉంటాయి.

క్రొత్త నిబంధన అపొస్తలుల మాదిరిగానే ఈ కాలపు అపొస్తలులు కూడా పరలోక ఘనతకు నిజంగా యోగ్యులమని భావిస్తున్నారా? వారి అనుచరుల్లో కొందరు అలా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. “ఈ కాలంలో డాక్టర్‌ పీటర్‌ వాగ్నర్ లాంటి అపొస్తలులు ఒక పునాదిని వేస్తున్నారు. దానినుంచే వాయుమండలం నందు ఆధ్యాత్మిక యుద్ధం జరుగుతుంది, విజయం చేకూరుతుంది.......... అపొస్తలులుగా ఎంతోమంది పిలువబడుతున్నారు. దేవుడు వారిని ఘనపరుస్తున్నాడు. కొత్త నిబంధనలో కొద్దిమంది అపొస్తలులు గురించి మనకు చాలా తెలుసు. నూతన యెరూషలేంలో మరి కొంతమంది అపొస్తలులు గురించి మనకు తెలుస్తుంది. మేము ఆ పన్నెండుమంది నుంచి వేరుచేయబడి నిరాశ చెందడానికీ, వారితో కలిసి ఘనత పొందడానికి అవకాశమున్నదని”49 తనను తానే ప్రవక్తగా ప్రకటించుకున్న ఒకడు చెబుతున్నాడు.

ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాట. ఎందుకంటే వాగ్నర్‌, అతని వంటి వారు నిత్యమూ ఆ పన్నెండుమంది వలే, పౌలు వలే గౌరవించబడతారని ఆ మాట భావం. అటువంటి మితిమీరిన అహంకారం, గర్వం నిజ విశ్వాసులందరికీ విపరీతమైన కోపం కలిగించాలి. నూతన యెరూషలేములో అపొస్తలులకు చెందిన ఘనత విశిష్టమైనది. కొత్త నిబంధనలో క్రీస్తు చేత వ్యక్తిగతంగా నియమించబడిన వారికి మాత్రమే అది పరిమితమైనది. అపొస్తలులకు ఇవ్వబడిన నిత్యమైన ఘనతను నేడు జీవిస్తున్న ఏ వ్యక్తికైనా ఆపాదించేది కేవలం తప్పుడు దారిలో నడిపించబడిన అబద్ధ బోధకులు మాత్రమే.

                                          మరి ఎఫెసీ 4:11-13 సంగతి ఏమిటి?

ఆధునిక కాలంలో అపొస్తలత్వం ఉందనే విషయాన్ని వాదించే వారు తమ వాదనను సమర్థించుకోవడానికి తరచుగా ఎఫెసీ 4:11-13 ను చూపిస్తారు. కనుక ఆ వాక్య భాగాన్ని శ్రద్ధగా పరీక్షించడం ప్రాముఖ్యమైన విషయం. క్రీస్తు యొక్క ఆరోహణాన్ని వర్ణించిన తర్వాత, పౌలు ఈ విధంగా రాశాడు.

మనమందరము విశ్వాన విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది, నంపూర్ణ పురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు నమానమైన సంపూర్ణత కలవారమగు వరకు, ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు నంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కావరులను గాను ఉపదేశకులను గాను నియమించెను.

నేటి కాలంలో అపొస్తలత్వాన్ని సమర్థించేవారు ఈ వాక్యభాగం గురించి రెండు తప్పుడు ప్రతిపాదనలు చేస్తున్నారు. మొదటిది: 11వ వచనంలో వర్ణించబడిన ఏకత్వం, జ్ఞానం , సంపూర్ణత క్రీస్తు యొక్క రెండవ రాకడను సూచిస్తున్నాయని వారు చెబుతారు. రెండవది: 13వ వచనంలో చెప్పబడిన అయిదు రకాల విధులు (అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, సంఘ కాపరులు, ఉపదేశకులు) రెండవ రాకడ వరకూ కొనసాగాలని వారు వాదిస్తారు. కానీ పై వాక్య భాగం ఆ రెండు ప్రతిపాదనలను సమర్థించట్లేదు.

మొదటిగా రెండవ ప్రతిపాదనను పరిశీలిద్దాం. 13వ వచనంలో రాయబడిన అపొస్తలుల ప్రవక్తల సువార్తికుల కాపరుల బోధకుల ధర్మాలు విశ్వాసం విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది మనం సంపూర్ణులమయ్యే వరకు నిలుస్తాయని ఈ వాక్యభాగం చెబుతోందా? 'పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును' అనే మాటలు లేకపోతే ఆ ఐదు ధర్మాలు నిలిచే ఉంటాయనే భావన నిజమయ్యేది. కానీ “పరిశుద్ధులు.... పరిచర్య ధర్మము జరుగుటకును” అనే మాటల వలన ఆ ఐదు రకాల ధర్మాలున్నవి క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి నిమిత్తమే అని తెలుస్తున్నది.

పరిశుద్ధుల ద్వారా క్రీస్తు శరీరానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆ క్షేమాభివృద్ధి మనం విశ్వాస విషయంలో క్రీస్తును గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణులమయ్యే వరకూ కొనసాగుతుంది. సంఘ యుగమంతటిలో అపొస్తలులు ప్రవక్తలు ఉంటారనే విషయాన్ని ఈ వాక్యం ఏ మాత్రం సమర్థించడం లేదు కానీ కేవలం వారు మొదలుపెట్టిన కార్యం మాత్రమే కొనసాగుతుందని ఈ వాక్యభాగం చెబుతోంది. అపొస్తలులు ప్రవక్తలు కేవలం సంఘ ప్రారంభ యుగానికి మాత్రమే పరిమితమైయున్నారని (ఎఫెసీ 2:20) పౌలు ఇంతకుముందే వివరించాడు. కనుక పైన వివరించబడిన విధానం సరియైనదే.

ఇపుడు 11వ వచనంలో వర్ణించబడిన ఏకత్వం గురించీ, జ్ఞానం గురించీ మనం ఆలోచిద్దాం. అటువంటి ఉన్నతమైన అనుభవం మహిమకు ఇవతల పొందలేము. కనుక పౌలు బహుశా సంఘం పరలోకంలో పొందే ఏకత్వం గురించి, జ్ఞానం గురించి వర్ణిస్తున్నాడని వారు వాదిస్తారు. కానీ పౌలు ఆలోచనా క్రమంలో ఆ భావం సరిగా ఇమడదు. పరిశుద్ధులు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగచేస్తుండగా కలిగే ఫలితాలను అతడు వర్జిస్తున్నాడు. పరలోకంలో దేవుడు చిట్టచివరిగా చేసే 'మహిమపరచే' కార్యంపై కాకుండా భూమి మీద సంఘంలో ఉన్న నమ్మకమైన విశ్వాసులు చేసే కార్యంపై ఉంది పౌలు దృష్టి. సంఘంలోనే, వాక్య సత్యానికి కట్టుబడితే అది విశ్వాసుల్లో గంభీరమైన ఐక్యతనూ, ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సన్నిహిత జ్ఞానాన్నీ లోతైన ఆధ్యాత్మిక పరిపక్వతనూ కలుగచేస్తుంది. పరిశుద్ధులు సరైన రీతిలో క్రీస్తు శరీరానికి క్షేమాభివృద్ధిని కలుగచేస్తే (వ12) కలిగే ఫలితాలకు హితబోధనూ (వ14), క్రీస్తు సారూప్యంలోనికి (వ15) ఎదుగుదలనూ పౌలు అదనంగా చేర్చాడు.

సరిగ్గా గ్రహిస్తే, ఎఫెసీ 4:11-13 ఐదు రకాల పరిచర్య పద్ధతి (అపొస్తలులను, ప్రవక్తలను చేర్చుతూ) క్రీస్తు రెండవ రాకడ వరకూ సంఘ చరిత్ర అంతటిలోనూ కొనసాగుతుందనే విషయాన్ని బోధించట్లేదని స్పష్టమౌతుంది. పరిశుద్ధులను సిద్ధపరచాలనే ఉద్దేశంతోనే అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, సంఘకాపరులను, బోధకులను ప్రభువైన యేసు సంఘానికి అనుగ్రహించారని ఈ వాక్యభాగం తెలియచేస్తోంది. పరిశుద్ధులు క్రీస్తు శరీరంలో ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగచేసుకునే విధంగా బలపరచబడతారు. దాని ఫలితంగా ఏకత్వం, జ్ఞానం, సంపూర్ణత, హితబోధ, పవిత్రత మొదలైన విషయాల్లో ఎదుగుతూ సంఘం బలపరచబడుతుంది.

అపొస్తలులు, ప్రవక్తలు కేవలం పునాది కోసం మాత్రమేనని స్పష్టంగా తెలియచేసిన కారణాన్నిబట్టి, మరలా వారి స్థానాలు తాత్కాలికమని తిరిగి చెప్పవలసిన అవసరం పౌలుకు రాలేదు. సంఘ చరిత్రలో శతాబ్దానికి మించి వారి రెండు స్థానాలు నిలువనప్పటికీ, వారు మన కోసం విడిచిన ఆత్మ ప్రేరేపిత లేఖనాల (బైబిల్‌) ద్వారా అపొస్తలులు ప్రవక్తలు ఇంకా పరిశుద్ధులను సిద్ధపరుస్తున్నారు. మిగిలిన మూడు స్థానాలు అనగా సువార్తికుడు, సంఘ కాపరి, ఉపదేశకుడు సంఘ చరిత్ర అంతటిలో కొనసాగాయి. ఫలితంగా సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగచేసే ఉద్దేశంతో ప్రతి తరంలో ఉండే పరిశుద్ధులను సిద్ధపరిచే పనిని వారు కొనసాగిస్తున్నారు.

                                       'అపొస్తలత్వం నిలిచిపోవడం' లోని ప్రాముఖ్యత

పీటర్‌ వాగ్నర్ వంటి అనేక మంది ఆధునిక క్యారిస్‌మాటిక్‌ నాయకులు అపొస్తలుని వరం, ధర్మం కొనసాగుతున్నాయని వాదించవచ్చు. పోప్‌ అపొస్తలత్వానికి వారసుడని రోమన్‌ కేథలిక్కులు సైతం అదే రీతిలో పట్టుపట్టవచ్చు. కానీ ఈ రెండు మాటలు తీవ్రంగా తప్పుత్రోవ పట్టించేవే. అపొస్తలులు ఒక విశిష్టమైన బృందమనీ, క్రీస్తే మూలరాయి అనే సిద్ధాంతపరమైన సంఘ పునాదిని వేసే ఒక ముఖ్య ఉద్దేశం నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా వారిని ఎన్నుకున్నారని క్రొత్త నిబంధనలో ఉన్న ఆధారాన్ని నిజాయితీగా పరిశీలిస్తే స్పష్టమౌతుంది. నేడు జీవిస్తున్న ఏ వ్యక్తైనా వాక్యానుసారంగా అపోస్తలుడు కావడానికి అవసరమైన ప్రమాణాలను అందుకోవడం అసాధ్యం. అద్భుత వరాలన్నీ వాడుకలో ఉన్నాయని అందరూ అంగీకరించిన మొదటి శతాబ్దంలో సైతం, ఆధ్యాత్మిక నాయకుల్లో కొద్ది మంది సభ్యులు మాత్రమే అపొస్తలులుగా పరిగణించబడ్డారు.

తరువాత శతాబ్దాల్లో, తానే అపొస్తలుడనని ఏ సంఘ పితరుడూ చెప్పుకోలేదు. దానికి భిన్నంగా రెండవ శతాబ్దం నుంచి ఉన్న క్రైస్తవ నాయకులు అపొస్తలుల కాలాన్ని అసమానమైనదిగా, పునరావృత్తం కానిదిగా చూసారు. 21వ శతాబ్దం వరకు విశ్వాసుల యొక్క అభిప్రాయం అదే. అయితే అకస్మాత్తుగా సంఘంలో అపొస్తలుల పునరాగమనాన్ని మనం మరొకసారి అంగీకరించాలని మనకు చెబుతున్నారు. స్వచ్చమైన వాక్య దృక్పథాన్ని బట్టి చూస్తే (ఏ స్పష్టమైన చారిత్రాత్మక దృక్పథం నుండైనా సరే), ఆ ఆధునిక వ్యాఖ్యలు గర్వంతో కూడినవిగా, గందరగోళానికి గురి చేసేవిగా ఉన్నాయి.

మొదటి శతాబ్దం తరువాత అపొస్తలుని వరం, ధర్మం నిలిచిపోయాయనేది వాస్తవం. అపొస్తలుడైన యోహాను పరలోకానికి వెళ్ళినప్పుడు, అపొస్తలత్వం ముగింపుకు వచ్చింది. అయితే అపొస్తలులు రాసిన లేఖనాల ద్వారా అపొస్తలుల ప్రభావం మాత్రం కొనసాగింది. అయితే సంఘ చరిత్ర అంతటిలో అపొస్తలుల పునాది నిత్యం వేయబడుతుందని మనం అనుకోకూడదు. ఆ పునాది వేసే కార్యం వారి జీవిత కాలంలోనే పూర్తయ్యింది. కనుక మరలా పునాది వేయవలసిన అవసరం లేదు.

అపొస్తలత్వం నిలిచిపోయింది కనుక కంటిన్యుయేషనిస్ట్‌ క్యారిస్‌మాటిక్‌ సిద్ధాంతానికి అర్థమేమిటో మరొకసారి ఆలోచించండి. స్పష్టంగా కొత్త నిబంధన సంఘంలో జరిగిన ప్రతి సంగతి నేడు జరగడం లేదు. ఆపోస్తలుని ధర్మం ఒక వరం కనుక ఏ క్యారిస్‌మాటిక్‌ సభ్యునికైనా ఆ వాస్తవాన్ని ఒప్పుకోవడం అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. ఎఫెసీ 4:11 స్పష్టంగా చెబుతున్నది అదే. ఆ స్థానం నిలిచిపోతే, క్యారిస్‌మాటిక్స్‌ మాదిరిగా, అపొస్తలుల కార్యాల గ్రంథంలో, 1కొరింథీ పత్రికలో వర్ణించబడిన కృపా వరాలన్నీ కొనసాగాయని మనం పట్టుపట్టకూడదు. “సంఘ యుగమంతటిలో వరాలన్నీ వాడుకలో ఉన్నాయనే క్యారిస్‌మాటిక్‌ వారి నమ్మకానికి అపొస్తలుని వరం అపోస్తలుని యుగంతోనే నిలిచిపోయిందన్న వాస్తవం కోలుకోలేని దెబ్బ. కనీసం ఒక వరం నిలిచిపోయిందని మనకు తెలుసు. కనుక వారి ప్రాథమిక ఊహ సరియైనది కాదని,” థామస్‌ ఎడ్గర్ అభిప్రాయపడుతున్నాడు.50

మొదటి శతాబ్దం తరువాత అపొస్తలత్వం కొనసాగలేదని గ్రహించిన కొంతమంది క్యారిస్‌మాటిక్స్‌ వారు అపొస్తలత్వం ఒక వరం కాదని, అది ఒక ధర్మం మాత్రమేనని వాదిస్తున్నారు. కనుక అపొస్తలుని ధర్మం నిలిచిపోయినప్పటికీ, అద్భుత వరాలన్నీ ఇంకా కొనసాగుతున్నాయని వారు వాదిస్తున్నారు. ఈ జఠిలమైన సమస్యను మోసపూరితంగా అధిగమించడానికి క్యారిస్‌మాటిక్‌ సభ్యులు చేసిన తెలివైన ప్రయత్నం కుప్పకూలిపోతుంది. ఎందుకంటే 1కొరింథీ 12: 28-29 లో కృపా వరాలను గురించి పౌలు రాసిన జాబితాలో ప్రవక్తలు, అద్భుతాలు చేసేవారు, భాషలు మాట్లాడే వారి ప్రక్కన అపొస్తలులు కూడా చేర్చబడ్డారు కనుక. 4,5 వచనాల్లో పౌలు ప్రారంభించిన అంశం 31వ వచనంలో ముగుస్తుంది. (28-30 వచనాలలో వరం అనే పదాన్ని తెలియచేయడానికి అతడు 'కరిష్మా' అనే గ్రీకు పదాన్ని ఉపయోగించాడు). సందర్భాన్ని బట్టి చూస్తే పౌలు మనసులో ఉన్న వరాల్లో అపొస్తలుని వరం కూడా ఒకటని స్పష్టమౌతుంది. అపొస్తలులు క్రీస్తు చేత తన సంఘానికి అనుగ్రహించబడ్డారని ఎఫెసీ 4:13 లో పౌలు యొక్క ఉద్దేశం. అపొస్తలత్వం అనేది ఒక ధర్మం అనేది వాస్తవమైనప్పటికీ, 'వరంగా' కాకుండా దాన్ని ఈ ఆలోచన అడ్డుకోదు. ప్రవచనం, బోధ అనేవి కూడా వరాలు అదే విధంగా ధర్మాలు.

ముగింపు: కొంతమంది కంటిన్యుయేషనిస్ట్‌లకు విరుద్ధాభిప్రాయాలు ఉన్నప్పటికీ, 1కొరింథీలో వర్ణించబడిన అతి ముఖ్యమైన అంశాల్లో ఒకటైన అపొస్తలత్వం నేటి సంఘంలో వాడుకలో లేదనే వాస్తవం తప్పించుకోలేనిది, ఇది నిలిచిపోయింది. ఈ విషయాన్ని గుర్తించడమే 'సిసేషనిజమ్‌' లోని ప్రాథమికమైన సత్యాన్ని గుర్తించడం. అపొస్తలత్వం నిలిచిపోతే, కొత్త నిబంధన సంఘపు ప్రతీ గుణలక్షణం నేటి సంఘ గుణలక్షణాల్లో కనిపించదు. అంతేకాదు, ఇది 1కొరింథీ 12-14 లో పేర్కోబడిన మరికొన్ని వరాలు సైతం నిలిచిపోయాయనే వాస్తవ అవకాశానికి ద్వారం తెరుస్తోంది. తరువాత అధ్యాయాల్లో మనం ఇతర వరాల గురించి ఆలోచిద్దాం.

                                                    6. అబద్ధ ప్రవక్తల మూఢత్వం

నిర్జల బావులు, నిష్ఫలమైన చెట్లు, ప్రచండమైన అలలు, మార్గము తప్పి తిరుగు చుక్కలు, వివేక శూన్యములగు మృగములు, భయంకరమైన మాలిన్యములు, వాంతిని తినే కుక్కలు, బురదను ప్రేమించే పందులు, క్రూరమైన తోడేళ్ళని అబద్ధ ప్రవక్తలను బైబిల్‌ వర్ణిస్తుంది (2పేతురు 2, యూదా పత్రిక). దైవ ప్రత్యక్షతను మాట్లాడుతున్నామని అబద్ధమాడే వారికి కలుగబోయే శిక్షావిధిని అత్యంత కఠినమైన పదాలతో కొత్త నిబంధన వర్ణిస్తోంది. బైబిల్‌ దేన్నైతే నిందిస్తుందో దాన్ని మనం కూడా అంతే తీవ్రత, బలాలతో నిందించాలి. కానీ నేటి తప్పుడు బోధకులకు ఆ పేర్లను అన్వయించి, చూడండి. మీరు చాలా కఠినులనీ, క్రైస్తవ వ్యతిరేకులనీ పిలవబడతారు. ఎంతో స్పష్టంగా తప్పుడు బోధలను ఖండించమని లేఖనం ఆజ్ఞాపించినప్పటికీ, నేటి క్రైస్తవ్యం పిరికితనం వలన అలా ఖండించడానికి సంకోచిస్తోంది.

పరిశుద్ధాత్మ నామంలో హాస్యాస్పదమైన, వాక్యంలో లేని, పూర్తిగా వాక్య విరుద్ధమైన మాటలు మాట్లాడేవారిని ప్రోత్సహించి వారికి వేదికను సిద్ధంచేస్తూ, క్యారిస్‌మాటిక్‌ ఉద్యమ ప్రగతి సమస్యను మరింత పెద్దది చేసింది. క్యారిస్‌మాటిక్‌ ఉద్యమారంభంలో సంఘంలోనికి ఉధృతంగా ప్రవహించిన అబద్ధ ప్రవచనాలకు ఎదురు నిలిచి వాటిని ఖండించవలసిన అవసరత నమ్మకమైన క్రైస్తవులకు ఎంతైనా ఉంది. తమ అబద్ధాలను ప్రచారం చేసుకోవడానికి గొట్టెల చర్మంలో వచ్చిన అత్యంత ప్రమాదకరమైన తోడేళ్ళనీ, వెలుగు దూతలవలె మారువేషంలో వచ్చినవారనీ అబద్ధ ప్రవక్తల గురించి కొత్త నిబంధన పదే పదే హెచ్చరిస్తోంది. వారెన్నడూ బాహాటంగా క్రీస్తును తృణీకరించరు, పరిశుద్ధాత్మను అడ్డగించరు. వారు క్రీస్తు నామంలోనే వస్తారు, పరిశుద్ధాత్మ అధికారంతో మాట్లాడినట్టు కనిపిస్తారు. కపటంతో, కుయుక్తితో సంఘంలోనికి చొరబడి, వారు సంఘానికి తీవ్రమైన నష్టాన్ని కలుగచేస్తారు.

“అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరని” (మత్తయి 24:11-24) యుగాంతం గురించి మాట్లాడుతూ ప్రభువైన యేసు చెప్పారు. అదే విధంగా “....ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకరమాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురని” (అపొ.కా. 28:28-30) అపొస్తలుడైన పౌలు కూడా ఎఫెసీ సంఘ పెద్దలను హెచ్చరించాడు. క్రీస్తుచేత విమోచింపబడ్డామని అబద్ధమాడుతున్న తప్పుడు బోధకులు సంఘాన్ని చుట్టుముట్టారనే విషయాన్ని పేతురు కూడా గుర్తించాడు. “మరియు అబద్ధ ప్రవక్తలు (ఇశ్రాయేలు) ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు నాశనకరమగు ఖిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు” (2పేతురు 2:1). (1యోహాను 4:1 యూదా 4) వంటి అనేక ఇతర వచనాలను కూడా ఉపయోగించవచ్చు, కానీ విషయం ఇప్పటికే స్పష్టమయ్యింది. అబద్ధ ప్రవక్తలు క్రీస్తు శరీరానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలుగచేసే వారిగా ఉన్నారు.

నిజానికి అబద్ధ ప్రవక్తలు తమను తాము వేషధారణ గల తప్పుడు బోధకులమని ప్రచారం చేసుకోరు. వారు గొట్టెల చర్మంలో వచ్చి, వెలుగు దూతల వేషం వేసుకుని, వారే పాపేఛ్చలకు  బానిసలై యుండగా ఇతరులకు స్వేఛ్ఛను వాగ్దానం చేస్తారు. అయినప్పటికీ అబద్ధ ప్రవక్తలను గుర్తించడం అంత కష్టమైన విషయమేమీ కాదు. ఈ ఆత్మసంబంధమైన నటుల్ని గుర్తించేందుకు బైబిల్‌ మూడు సూచనలు ఇస్తోంది.

మొదటిది: తనను తానే ప్రవక్తగా ప్రకటించుకుని ప్రజలను తప్పుడు సిద్ధాంతంలోనికి, తప్పుడు బోధలోనికి నడిపించేవాడే అబద్ధ ప్రవక్త. ద్వితీయోపదేశకాండము 13:1-5” లో మోషే ఇశ్రాయేలీయులకు ఈ విధంగా చెప్పాడు:

“ప్రవక్తయేగాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ యెదుట సూచక క్రియయైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినయెడల అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలు కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండ వలెను. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి, ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.”

కొత్త నిబంధన కూడా అదే విధంగా కఠినమైన హెచ్చరికను జారీ చేసింది. దేవుని పక్షంగా మాట్లాడుతున్నానని చెబుతూనే, ప్రజలను దేవుని వాక్య సత్యం నుంచి దూరంగా నడిపించేవాడు స్పష్టంగా అబద్ధ ప్రవక్త, మోసగాడు. ఒకవేళ అటువంటి వ్యక్తి ఖచ్చితమైన ప్రవచనాలను చెప్పి సూచకక్రియలు జరిగించినప్పటికీ, అతడిని లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే సాతానుగాడు కూడా నకిలీ అద్భుతాలను చేయగలడు (2 థెస్స 2:9) అబద్ధ ప్రవక్తల ప్రభావం ఎంత నాశనకరంగా ఉంటుందోనన్న విషయాన్ని తెలియచేసే ఉదాహరణలతో చరిత్ర నిండిపోయింది. లేఖనం కంటే ఇద్దరు స్త్రీల యొక్క అబద్ధ ప్రవచనాలపై అత్యాసక్తి కనపరిచాడు రెండవ శతాబ్దపు తప్పుడు బోధకుడు మొంటానస్‌. 7వ శతాబ్దంలో గబ్రియేలు దేవదూత నుంచి దైవ ప్రత్యక్షతను పొందానని కనుక తానొక ప్రవక్తనని మహమ్మద్‌ చెప్పుకున్నాడు. 19వ శతాబ్దంలో దేవదూతల దర్శనాల గురించీ వాక్యేతర ప్రత్యక్షతల గురించీ కల్పిత వ్యాఖ్యలు చేసి “మార్మనిజమ్‌” అనే తప్పు బోధను ప్రారంభించాడు జోసెఫ్‌ స్మిత్‌. తమను అనుసరించే వారికి అబద్ధ ప్రవక్తలు ఎంత నష్టాన్ని కలిగించగలరనే విషయానికి ఇవి కొన్ని చారిత్రాత్మక ఉదాహరణలు మాత్రమే.

రెండవది: తనను తానే ప్రవక్తగా ప్రకటించుకున్న వ్యక్తి స్వేఛ్చగా పాపం చేస్తూ దానిని ఒప్పుకోకుండా జీవిస్తుంటే అతడు తన్నుతాను అబద్ధ ప్రవక్తగా కనబరుచుకుంటున్నాడు. అబద్ధ ప్రవక్తల జీవిత ఫలాలను బట్టి వారిని గుర్తించవచ్చని ప్రభువైన యేసు తానే స్వయంగా వివరించారు (మత్తయి 7:20), గర్వం, దురాశ, వ్యభిచారం, కామం, తిరుగుబాటు స్వభావం, అవినీతి మొదలైనవాటికి అబద్ధ ప్రవక్తలు బానిసలై ఉంటారనే భావనను పేతురు 2వ పత్రిక యూదా పత్రికలు విస్తరించి చెప్పాయి. ధనాపేక్షతో ప్రేరేపించబడి, దుర్లాభం పొందగోరు నిమిత్తం వారి నిత్యమైన ఆత్మలను వారు పణంగా పెడుతున్నారు. తగిన సమయంలో, అబద్ధ ప్రవక్తలు తమ జీవన విధానాన్ని బట్టి వారి నిజ స్వభావాన్ని ఖచ్చితంగా కనబరుస్తారు. వారు ప్రభువైన యేసును ప్రతిబింబిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ, వారు అసలు నిజమైన విశ్వాసులే కాదు.

ఖచ్చితంగా ప్రవచించిన వారిలో అవిశ్వాసులు కూడా ఉన్నారని లేఖనాలు చెబుతున్నాయి. దానిని బట్టి, అప్పుడప్పుడు ఖచ్చితమైన ప్రవచనం చెప్పడమనేది సైతం నిజమైన ప్రవచన వరం కాదు. యధార్థమైన రక్షణ అంతకంటే కాదు (సంఖ్యా 22:23 యోహాను 11:49-52) “ఆ దినమందు (ఆఖరి తీర్పునందు) అనేకులు నన్ను చూచి ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? ఆని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును” (మత్తయి 7:22,23). దుర్నీతితో, దుబారాగా జీవిస్తూ తమను తామే నేడు ప్రవక్తలుగా నియమించుకున్న టి. వి. సువార్తికులలో ఎంతోమంది ఆఖరి దినాన ఆ తీర్పును ఎదుర్కొంటారు.

మూడవది: తనను తానే ప్రవక్తగా ప్రకటించుకుని, దేవుని ప్రత్యక్షతగా తాను ప్రకటించింది యధార్థమైనది కాకపోయినా అసత్యమైనా, అతనిని దేవుని పక్షంగా మాట్లాడే వ్యక్తిగా పరిగణించకూడదు. ప్రభువు నామంలో అసత్యాన్ని మాట్లాడే ప్రవక్త అబద్ధికుడని బైబిల్‌ చాలా స్పష్టంగా చెబుతోంది. ద్వితీ 18:20-22లో  ప్రభువే స్వయంగా ఇశ్రాయేలీయులతో చెప్పాడు.

"అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్జాపించని మాటను నా నామమున చెప్పునో, యితర దేవతల నామమున చెప్పునో, ఆ ప్రవక్షయును చావవలెను మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని మీరనుకొనిన యెడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగకపోయిన యెడలను ఎన్నడును నెరవేరకపోయిన యెడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు".

దేవుని దర్శనమని చెప్పి తప్పుడు ప్రవచనం చేస్తే అది తీవ్రమైన నేరం. ఆ ప్రవక్త మోసగాడు మాత్రమే కాదు పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం అతడు మరణశిక్షకు పాత్రుడని తన తప్పుడు ప్రవచనం బుజువు చేస్తోంది. నిజానికి ప్రభువు మాట్లాడకుండా ఉన్నపుడు, “ప్రభువు యీలాగు సెలవిచ్చుచున్నాడు” అని చెబుతూ ఆయన పక్షంగా మాట్లాడుతున్నానని అబద్ధమాడే వారి నేరాన్ని దేవుడు సామాన్యమైనదిగా తీసుకోడు. అలాంటి తప్పును ప్రోత్సహించే వారు తమ అహంకారాన్నిబట్టి పాపాన్ని బట్టి దోషులుగా, తమ ఆధ్యాత్మిక విధిని త్యజించినవారుగా ఉన్నారు. అటువంటి ప్రవచనాలను వివేచించలేని మనసుతో మనం వినకూడదు (1థెస్స 5:21)

లేఖనంలోని స్పష్టమైన హెచ్చరికలను విస్మరించి, దేవుని ఆత్మకు అపకీర్తి కలుగుతున్నప్పటికీ, లెక్కచేయకుండా క్యారిస్‌మాటిక్స్‌ తమ ఉద్యమానికి అహంకార పూరిత ప్రవచనాన్ని ఒక ప్రత్యేకాంశంగా చేసుకున్నారు. అబద్ధ ప్రవక్తలు చెప్పే ప్రవచనం ఎంత హాస్యాస్పదమైనదైనా, దైవదూషణతో కూడినదైనా తాము ఆ ప్రత్యక్ష దర్శనాన్ని దేవుని నుంచి పొందుకున్నామని చెప్పే అధికారాన్నిచ్చి, వారికి అనువైన స్థలాన్ని క్యారిస్‌మాటిక్స్‌ కలిగించారు. ఒక ప్రవచన వాక్కును ఆధారం చేసుకుని క్యారిస్‌మాటిక్‌ సంఘాల్లోకి చేరి ప్రోత్సహించబడిన విస్తరించబడిన వివిధ రకాల తప్పుడు బోధలను మనం గత అధ్యాయంలో పరిశీలించాము (నేటి కాలపు ప్రవక్తలమని చెప్పుకునే వారితో సహా). ప్రముఖులైన అనేక క్యారిస్‌మాటిక్‌ నాయకుల జీవితాలను నిరంతరం పీడిస్తున్న అనేక అక్రమాలను మనం క్లుప్తంగా గమనించాము. సార్వత్రిక క్యారిస్‌మాటిక్‌ సంఘంలో ప్రబలిన ప్రవచనం నిజానికి అబద్ధ ప్రవచమని చూపడానికి ఈ రెండు కారణాలు చాలు.

ఈ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తను కనిపెట్టడానికి మూడవ సూచనయైన తప్పుడు ప్రవచనాలపై మనం దృష్టి సారిద్దాం. బైబిల్‌ దేన్నైతే  తీవ్రమైన నేరంగా నిందిస్తుందో దాన్ని ఈ క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ఒక కృపావరంగా భావిస్తోంది. ప్రస్తుతం చేయబడుతున్న ప్రవచనాలలోని దురభిప్రాయాలు దోషాలు అబద్ధాలు క్యారిస్‌మాటిక్‌ వేదాంత పండితులు తృణీకరించలేనంత చక్కగా ప్రకటించబడుతున్నాయి. “ఒకడు తను చెప్పిన ప్రవచనం తప్పైన ఒకే ఒక్క కారణాన్ని బట్టి మనం అతణ్ణి అబద్ధ ప్రవక్త అని పిలవడానికి తొందరపడకూడదు ..... ప్రవచనంలో కొన్నిసార్లు తప్పు చెప్పడం ఒకరిని అబద్ధ ప్రవక్తగా చేయదు. సామాన్యుడైన ఏ ప్రవక్తయైనా పరిపూర్ణుడు కాడు, పౌరపాట్లు అందరూ చేస్తారని,” చెప్పి క్యారిస్‌మాటిక్‌ ప్రవక్త బిల్‌ మామన్‌ ద్వితీయోపదేశకాండం 18 అధ్యాయాన్ని ప్రత్యక్షంగా తప్పు అని చెప్పాడు.

“ఒక ప్రవక్త చెప్పినది చాలా దారుణంగా తప్పిపోయి, అది తక్షణమే ప్రజల జీవితాల్లో ప్రమాదకరమైన పరిస్థితులను కలిగించినప్పటికీ, ఇవేమి ఆ వ్యక్తిని అబద్ధ ప్రవక్తగా చేయవని,” జాక్‌ డీరె వాదిస్తున్నాడు. లేఖనం బోధించేది మాత్రం అది కాదు. ప్రవక్తలు ఎన్ని విషయాలను సరిగా చెబుతున్నారనే దానిని బట్టి కాకుండా ఎన్నిసార్లు వారు తప్పుగా ప్రకటిస్తున్నారనే విషయాన్ని బట్టి తీర్చు తీర్చబడతారు. (ఎందుకనగా కొన్నిసార్లు దెయ్యం పట్టిన ప్రజలు సైతం సరియైన ప్రవచనాలు చెప్పగలరు  అపొ.కా, 16:16) దేవుని నుంచి వచ్చే ప్రత్యక్ష దర్శనపు మాటలను ప్రకటించేవారు లోపాలు లేకుండా చెప్పాలి. లేదంటే తమను తాము అబద్ధికులుగా నిరూపించుకుంటున్నట్టే.

కాన్సస్‌ సిటీ ప్రోఫెట్స్‌ అనే శాఖలో ప్రముఖ వ్యక్తులు మైక్‌బికెల్‌, బాబ్‌ జోన్స్‌. వీరిద్దరూ తమను తామే పప్రవక్తలుగా ప్రకటించుకున్నారు. వీరిద్దరి మధ్య "దర్శనాలు , ప్రత్యక్షతలు" గురించి జరిగిన సుదీర్ఘ సంభాషణలో నేటి కాలంలో చెప్పబడుతున్న ప్రవచనంలోని లోపాలను బహిరంగంగా ఒప్పుకున్నారు. జోన్స్‌ తన ప్రవచనాలలో పొరపడిన పలు సందర్భాల గురించి మాట్లాడమని బికెల్‌ని అడిగాడు.

వారి సంభాషణ ఈ విధంగా జరిగింది:

మైక్‌బికెల్‌: మీ ప్రవచనాలలో ఉన్న యధార్ధత, లోపాల పరిమాణాలెంతో ప్రజలకు చెప్పండి. ఈ విషయాన్ని వాళ్ళు కొంత గ్రహించాలని నేను కోరుతున్నాను.

బాబ్‌జోన్స్‌: నా ప్రవచనాలలో చాలా లోపాలున్నాయి. నేను గర్వించిన ఒక సందర్భం గుర్తొస్తుంది. నేను గర్వించిన ప్రతిసారి, దాన్ని ఎలా అణిచివేయాలో తండ్రి (దేవుని) కే తెలుసు. నాకు గర్వం వచ్చిన ఆ సందర్భంలో, ఒక సంఘాన్ని మూడు రోజులు ఉపవాసం ఉండమనీ, కొన్ని అద్భుతాలు జరుగబోతున్నాయనీ వారికి చెప్పగా, వాళ్లు మూడు రోజులు ఉపవాసం చేసారు. పరిస్థితి చాలా భయంకరంగా తయారైంది. మూడు రోజుల ఉపవాసం తర్వాత, ఆ రాత్రి అసలు పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమే కాలేదు.

మైక్‌ బికెల్‌: మీరు ప్రజల్ని ఉపవాసం చేయమన్నారా?

బాబ్‌జోన్స్‌: ఔను, వారిని ఉపవాసం చేయమని చెప్పాను కానీ అది ప్రభువు నుంచి వచ్చింది కాదు, నా గర్వం వల్ల చెప్పింది. ఉపవాసం ద్వారా ప్రభువును ఏదైనా చేయించడానికి మనం బలవంతం చేయవచ్చని నేను భావించాను. కానీ అది తప్పని నేను వెంటనే గ్రహించాను. అక్కడున్న పరిశుద్ధులు నన్ను రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు. నేను అక్కడ నుంచి బయలుదేరి, ఒక మంచి ప్రవక్తలా ఇంటికి వెళ్లిపోయాను. నేను నిరాశ చెందాను, గట్టిగా అరిచి కేకలు పెట్టాను, చివరిగా నిద్రపోయాను. నేను నిద్రించినప్పుడు ప్రభువు వచ్చి నా చేతిని పట్టుకున్నాడు (ఆ దర్శనంలో) ఇక్కడున్న ఈ చిన్న పాపలా ఉన్నాను..... నా పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది, ఎందుకంటే నేను చిన్న ప్లాస్టిక్‌ డ్రాయర్‌ వేసుకుని ఉన్నాను. దాన్నంతా పాడు చేసేసాను. నా కాళ్లు కిందకు (నా మలం) జారుతూ ఉంది. ప్రభువు నా చేతిని పట్టుకున్నాడు నేను అరుస్తున్నాను, కేకలు పెడుతున్నాను...“బాబ్‌కి ఏమయ్యింది?” అని అడిగిన ఒక స్వరం నాకు వినిపించింది. అపుడు నా (పరలోక) ఆదరణకర్త “అతడు ఊహించని వైఫల్యాన్ని ఎదుర్కొన్నాడు” అని చెప్పాడు. తర్వాత నేను నిజంగా ఆశ్చర్యపోయాను. “ఆ బాలునికి మరికొంత అభయం అవసరం. అలాంటి వైఫల్యాల నుంచి అతణ్ణి కాపాడిన సంగతిని అతనికి తెలియజేయండి. అతనికి గొప్ప ఆదరణను ఇవ్వండని” ఒక మృధు మధుర స్వరం చెప్పగా నేను విన్నాను. అయితే నేను కోరింది అది కాదు. అతణ్ణి శుద్ధి చేయండి. సంఘంలోనికి తిరిగి వెళ్ళమని చెప్పి ఈసారి రెండింతలు ప్రవచించమని చెప్పండి. ఈసారి నేను అతనికి చెప్పిన దాన్ని అతడు చేస్తాడు. తరువాత చూడగా నేను మంచంపై ఉన్నాను. నాకు మెలకువ వచ్చేసింది, చెమటలు కారుతూ ఉన్నాయి.

మైక్‌బికెల్‌: అయితే లోపాలున్నాయి, చాలా తప్పులున్నాయి. ఔనా?

బాబ్‌జోన్స్‌: ఔను, వందలాది లోపాలున్నాయి.3

జోన్స్‌ చేసిన వ్యాఖ్యలు ఆధునిక ప్రవచనంలో ఉన్న రెండు ప్రాథమిక సమస్యలను చూపిస్తున్నాయి. నేటి ప్రవచనం లెక్కకు మించిన తప్పులతో, లోపాలతో నిండిపోయింది. అసలు ఏ మాత్రం దేవునితో సంబంధంలేని దేవ దూషణకరమైన వెర్రితో అది వర్ధిల్లుతోంది. జోన్స్‌ తన ప్రవచనంలో లోపాల్ని మురికి షాస్టిక్‌ డ్రాయర్‌తో పోల్చి సరైన పోలికనే ఎంచుకున్నప్పటికీ, మిగిలిన అన్ని విషయాల్లో ఆతను చెప్పింది తప్పే.  తాను నిజమైన ప్రవక్తనని చెప్పిన మాటలు చాలా స్పష్టంగా బూటకపు మాటలు. అతనికి నిజమైన పరలోక దర్శనాలు ఏవీ లేవు. వందలాది తప్పుడు ప్రవచనాలు చెప్పినప్పటికీ, అది పెద్ద విషయం కాదన్నట్లు తప్పించుకోవడానికి దేవుడు తనను ఆదరించిన విషయం ఖచ్చితంగా నిజం కాదు.

ఆ ఇంటర్వ్యూ జరిగి మూడు సంవత్సరాలైనా గడవక ముందే, ఒలతేలో కాన్సన్‌ నగర మెట్రో వినియార్డ్‌ ఫెలోషిప్‌ బాబ్‌జోన్స్‌ను తాత్కాలికంగా బహిరంగ పరిచర్య నుండి తొలగించింది. దానికి సీనియర్‌ పాస్టర్‌గా ఉన్నది మరెవరో కాదు మైక్‌ బికెలే. జోన్స్‌ స్త్రీలను నమ్మించి, తర్వాత వారిని తన కామం తీర్చుకోవడానికి ఉపయోగించుకోవడానికి అబద్ధ ప్రవచనాలు చేస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. “తనకున్న వ్యక్తిగత కోరికల నిమిత్తం కామ కలపాల నిమిత్తం ప్రజలను లోబరుచుకోవడానికి, పాస్టర్‌ గారి అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి, నాయకులు గురించి పుకార్లు పుట్టించడానికి క్రీస్తు శరీరమైన సంఘంలో ద్వేషభావాలు విస్తరింపచేయడానికి తన వరాల్ని ఉపయోగించి పాపం చేస్తున్నాడనే ఆరోపణల మూలంగా అతడు పరిచర్య నుండి తొలగించబడ్డాడు.  కానీ స్వల్పకాల విరామం తర్వాత అతడు మరి తిరిగి క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో ఉన్నత స్థానానికి ఎదిగి, క్యారిస్‌మాటిక్‌ సంఘాల్లో ప్రసంగిస్తూ, దేవునిచేత నియమించబడిన ప్రవక్తగా తనను తాను కనపరుచుకుని అబద్ధాలతో కూడిన విడ్డూరమైన ప్రవచనాలను చేస్తున్నాడు. అసలు ఈ అక్రమాలూ, అబద్ధ ప్రవచనాలూ ఏవీ ఎన్నడూ జరుగలేదన్నట్టు, వేలాదిమంది అవివేక క్యారిస్‌మాటిక్స్‌ ఇంకా అతని ప్రతి మాటను నమ్ముతూనే ఉన్నారు. ఇంటర్‌నెట్‌లో పొందుపరిచిన జోన్స్‌ జీవిత చరిత్ర అతని పరిచర్యను ప్రవక్తయైన దానియేలు పరిచర్యతో పోల్చి, ఈ అబద్ధ ప్రవచనాల వలన కలిగే ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది."

                                                   అబద్ధ ప్రవచనం - సత్య వాక్యం

ఘోరమైన అబద్ధాలతో, దేవదూషణతో కూడిన మరెన్నో క్యారిస్‌మాటిక్‌ ప్రవచనాలను కనుగొనడం ఏ మాత్రం కష్టతరమైన విషయం కాదు. 1989 డిసెంబర్‌లో బెన్నీహిన్‌ కొన్ని ప్రవచనాలు చేసాడు. అందులో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ఫిడేల్‌ క్యాస్ట్రో అనే వ్యక్తి 1990-2000 మధ్యలో ఏదొక సమయంలో మరణిస్తాడనీ, 1995కు ముందే అమెరికాలోని స్వలింగసంపర్కుల సమాజం అగ్నివల్ల నాశనం ఔతుందనీ, 2000 సంవత్సరానికి ముందు తూర్పు తీర ప్రాంతంలో ఒక పెద్ద భూకంపం తీవ్రనష్టం కలుగచేస్తుందని దేవుడు తనకు బయలుపరిచాడనీ ఒర్లాండో క్రిస్టియన్‌ సెంటర్‌ దగ్గర తన సంఘానికి అతడు చాలా నమ్మకంగా చెప్పాడు. అన్ని సందర్భాల్లోనూ అతడు పొరపడ్డాడు. కానీ ఆ అబద్ధ ప్రవచనాలేమీ ఎంతో ధైర్యంగా సరికొత్త అబద్ధ ప్రవచనాలు చేస్తున్న అతణ్ణి ఆపలేకపోయాయి.

నూతన సహస్రాబ్ది ప్రారంభంలో, తన స్వస్థత సభల్లో యేసు భౌతికంగా తొందర్లోనే కనిపిస్తాడని ఒక ప్రవక్తి అతనికి తెలియచేసిందని తన టెలివిజన్‌ వీక్షకులకు బెన్నీహిన్‌ ప్రకటించాడు. ఆ ప్రవచనం ప్రామాణికమైనదిగా తాను భావించానని హిన్‌ చెప్పాడు. టి.బి.ఎన్‌ కార్యక్రమంలో 2000, ఏప్రిల్‌ 2వ తేదీన “వినండి, నేను ప్రవచిస్తున్నాను! దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కొన్ని సంఘాల్లో, కొన్ని సభల్లో, తన ప్రజల్లో అనేక మందికి భౌతికంగా కనిపించబోతున్నాడు: కారణం మాత్రం ఒక్కటే. ఆయన వస్తున్నానని చెప్పడానికి! నిద్రలేపడానికి! పరిశుద్ధులారా, యేసు వస్తున్నాడని,” తన సొంత ప్రవచనంతో అతడు దాన్ని విపులీకరించాడు.

హిన్‌ యొక్క విఫలమైన ప్రవచనాలు కొన్ని దశాబ్దాల క్రితం ఒరల్‌ రాబర్ట్స్‌ చేసిన సుప్రసిద్ధ వ్యాఖ్యలంత విపరీతంగా ఉన్నాయి. 1997లో 900 అడుగుల పొడవున్న యేసును దర్శనంలో చూసానని, దక్షిణ తుల్సలో 60 అంతస్తులు గల "సిటీ  ఆఫ్‌ ఫెయిత్‌" (విశ్వాస నగరం) అనే హాస్పిటల్‌ నిర్మించమని తనకు ఆయన ఆజ్ఞాపించాడని రాబర్ట్స్‌ చెప్పాడు. వైద్య శాస్త్రానికి ఫెయిత్‌ హీలింగ్‌ (విశ్వాసం మూలంగా కలిగే స్వస్థత) ను జతచేసి ఉపయోగించుకుంటాననీ దాని వలన ఆరోగ్యం విషయంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయనీ, క్యాన్సర్‌కి మందును కనుగొనే సామర్థ్యం వైద్యులకు వస్తుందనీ దేవుడు తనకు చెప్పాడని ఒరల్‌ రాబర్ట్స్‌ చెప్పాడు.

1980 తొలినాళ్ళలో నిర్మించబడిన ఆ భవనం అత్యంత భారీ నిర్మాణం. "సిటీ ఆఫ్‌ ఫెయిత్‌" (విశ్వాస నగరం) అనే పేరుతో హాస్పిటల్‌ ప్రారంభమైనప్పుడు, ఆ భారీ నిర్మాణంలో రెండు అంతస్తులు తప్ప మిగిలిన భాగమంతా ఖాళీగానే ఉంది. 1987 జనవరి నాటికి మోయలేనంత అప్పుల భారంతో రాబర్ట్స్‌ ఇబ్బందిపడ్డాడు. మార్చి 1వ తేదీ నాటికి 80 లక్షల డాలర్లు సేకరించి అప్పు తీర్చకపోతే, రాబర్ట్స్‌ అను నేను మరణిస్తానని ప్రభువే చెప్పారని అతడు ప్రకటించాడు. మరణపు బెదిరింపు గురించిన ప్రవచనాన్ని పరీక్షించడం ఇష్టం లేక, (ఫ్లోరిడాకు  చెందిన ఒక పోలిసు జాగిలాల శిక్షణా డ్రాగ్  ట్రాక్‌) యజమాని ఆఖరి సమయంలో 10 లక్షల 30 వేల డాలర్లు విరాళంగా అందించిన సహాయంతో సమయానికి దాతలు రాబర్ట్స్‌కి అవసరమైన ధనాన్ని సమకూర్చారు. కానీ రెండు సంవత్సరాలలోపే పెరిగిపోతున్న అప్పును తీర్చడానికి వైద్య కేంద్రాన్ని మూసివేసి ఆ భవనాన్ని అమ్మివేయాలని రాబర్ట్స్‌ నిర్బంధించబడ్డాడు. 80 శాతానికి పైగా భవనం ఎన్నడూ వినియోగించబడలేదు. క్యాన్సర్‌కి మందు కనిపెట్టడం గురించిన వాగ్దానం ఎన్నడూ నిజరూపం దాల్చలేదు.

కాన్సస్‌ సిటీ ప్రోఫెట్స్‌లో మరొక సభ్యుడు, మార్నింగ్ స్టార్‌ మినిస్ట్రీస్‌ స్థాపకుడు రిక్‌జాయనర్‌. 1990-2000 మధ్యలో దక్షణ కాలిఫోర్నియా రాష్ట్రంలో అధిక భాగాన్ని పసిఫిక్‌ మహాసముద్రం ముంచివేసేంత తీవ్రతతో భూకంపం వస్తుందని ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేరనప్పటికీ, అది ఎన్నటికైనా నెరవేరుతుందని జాయ్‌నర్‌ వాదిస్తున్నాడు. 2011లో, 9.0 తీవ్రతతో జపాన్‌ దేశాన్ని భూకంపం తాకినప్పుడు (ప్రవచన దర్శనం ఆధారంగా) మాట్లాడుతూ నాజీ జర్మనీని బలపరిచిన సాతాను శక్తులే భౌగోళిక సంఘటనలను ఉపయోగించుకుని జపానులో భూకంపాన్ని కలిగించాయి. అవి ఇప్పుడు (అమెరికా) సంయుక్త రాష్ట్రాలపై హఠాత్తుగా దాడిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని జాయ్‌నర్‌ వ్యాఖ్యానించాడు.

అసభ్యకరమైన, విఫలమౌతున్న క్యారిస్‌మాటిక్‌ ప్రవచనాల జాబితా అనేక గ్రంథాలను నింపేయగలదు. అలాంటి అబద్ధ ప్రవక్తలు దేవుని తీర్పు గురించి విపరీతంగా భయపడుతూ జీవిస్తారని మనం ఊహిస్తాం. కానీ ఆశ్చర్యపరిచే రీతిలో ఇంతకు మునుపెన్నడూ  చేయని వింతైన ప్రవచనాలను వారు చేస్తూనే ఉంటారు. ప్రధాన ఇవాంజెలికల్‌ సంఘాల్లోను వారి ప్రభావం ఎంతో విస్తారంగా ఉండడం నమ్మశక్యం కాని విషయం. సంఘ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా దేవుడు తన ప్రజలతో సంభాషిస్తున్నాడనే భావం నేడు విస్తృత ఆదరణ పొందింది.

క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ప్రారంభమై కేవలం వంద సంవత్సరాలే అయ్యింది. కానీ ఇవాంజెలికల్‌ సంఘాలపై దాని ప్రభావం ఎంత మాత్రం కాదనలేనిది. ఛార్లెస్‌ ఫాక్స్‌ పర్హామ్ దాన్ని మొదలుపెట్టిన దగ్గర్నుంచి, అత్యంత ప్రసిద్ధుడు ఆధునిక ప్రతినిధియైన బెన్నీహిన్‌ వరకూ, ఈ ఉద్యమాన్ని అంతా నకిలీ పరిచారకులే నడిపిస్తున్నారు. ఇదొక తప్పుడు మతమే కానీ మరొకటి కాదు. లోపాలూ, అబద్ధాలూ తప్ప, సత్యమైన వాక్య భాష్యం, హితబోధ, చారిత్రాత్మక వేదాంతలేవీ ఈ ఉద్యమానికి కారణాలు కావు. ఇతర తప్పుడు బోధల మాదిరిగానే, నమ్మకత్వం సంపాదించుకోవడానికి తగినంత సత్యాన్ని తన సిద్ధాంతాల్లో క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం చేర్చుకుంది. కానీ సత్యాన్ని ప్రాణాంతకమైన మోసాలతో మిళితం చేసి, ఇది హృదయాలనూ ఆత్మలనూ నాశనం చేసే అవినీతినీ, విషపూరిత సిద్ధాంతాలనూ తయారుచేసింది.

లేఖనాలపై ఆసక్తి అనురాగాలను పెంచడానికి బదులు వాక్యేతర ప్రత్యక్షతపైనే క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ఇంతకు మునుపెన్నెడూ లేనంత ఆసక్తిని కలిగించి, ఆ వాక్యేతర ప్రత్యక్షతనే  ప్రధాన స్వాస్థ్యంగా  ఎంచుతుంది. ఈ క్యారిస్‌మాటిక్‌ సిద్ధాంతం వల్ల ప్రలోభానికి గురైన అనేక లక్షలమంది దేవుడు అన్ని సమయాలలో తమతో నేరుగా మాట్లాడతాడని భావిస్తున్నారు. ప్రత్యక్ష దర్శనమే నిజానికి దేవుడు తన ప్రజలతో సంభాషించే ప్రధాన మార్గమని నమ్ముతున్నారు. అనుభవాలచేత నడిపించబడే ఇవాంజెలికల్‌ సభ్యులకు "ప్రభువు నాతో చెప్పాడు" అనే మాట ఒక ఇష్టమైన ఊతపదంగా మారిపోయింది.

క్యారిస్‌మాటిక్‌ టి.వి. ప్రసంగీకులు, కాన్సస్‌ సిటీ ప్రొఫెట్స్ ప్రకటిస్తున్నంత హాస్యాస్పదమైన ప్రవచనాలను దేవుడు తమతో మాట్లాడుతున్నాడని నమ్మేవారంతా చెప్పట్లేదు. అయితే వినదగిన స్వరం ద్వారా, దర్శనం ద్వారా, మనస్సులో ప్రేరేపణ ద్వారా, అంతరంగంలో తలంపుల ద్వారా దేవుడు ఇంకా వాక్యేతర సందేశాలను అనుగ్రహిస్తున్నాడని వారు నమ్ముతున్నారు. పలు సందర్భాలలో, వారి ప్రవచనాలు అతి సాధారణమైనవి. అయితే వారి ప్రవచనాలకు బెన్నీహిన్‌ ప్రవచనాలకు మధ్య తేడా పరిమాణమే కానీ సారాంశంలో మాత్రం కాదు.

దేవుడు నేటి క్రైస్తవులకు వాక్యేతర సందేశాలనూ, సరికొత్త ప్రత్యక్షతనూ నిరంతరం అనుగ్రహిస్తున్నాడనే అభిప్రాయం క్యారిస్‌మాటిక్‌ సిద్ధాంతానికి అత్యవసరమైన విషయం. దేవుడు వ్యక్తిగతంగా, ప్రత్యక్షంగా, క్రమంగా ప్రతీ విశ్వాసితో మాట్లాడకపోతే, ఆయన నిజంగా మన జ్ఞానానికి అతీతునిగా ఉన్నాడనేది సగటు క్యారిస్‌మాటిక్‌ సభ్యుని ఆలోచనా విధానం. దేవుని దగ్గర నుంచి వచ్చినవిగా చెప్పబడుతున్న ఈ దర్శనాలు సాధారణంగా లోపాలతో కూడినవి, తప్పు దారి పట్టించేవి, ప్రమాదకరమైనవి. ఈ విషయం కాదనలేని వాస్తవం. అయినప్పటికీ క్యారిస్‌మాటిక్స్‌ వ్యక్తిగత ప్రవచనాలనన్నింటినీ చాలా తీక్షణంగా సమర్థిస్తున్నారు.

ఉదాహరణకు, దేవుడు క్రమంగా క్రైస్తవుల మనసులోకి అప్పటికప్పుడే ఆలోచన కలిగిస్తూ ప్రవచనాత్మక సందేశాలను అనుగ్రహిస్తున్నాడనే అభిప్రాయాన్ని సమర్థిస్తూ కేంబ్రిడ్జ్  విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ పరిశోధన పత్రం సమర్పించాడు వేయిన్ గ్రూడెమ్ “బలమైన భావాలను ప్రవచనంగా ప్రకటించాలి. అయినప్పటికీ అలాంటి ప్రవచనాలలో తరచు లోపాలుంటాయని” అతడు నిర్మొహమాటంగా ఆంగీకరిస్తున్నాడు. “ప్రవచనం అసంపూర్ణమైనది, అపవిత్రమైనది కనుక విధేయత, విశ్వాసం చూపవలసిన అవసరం ఉండదని క్యారిస్‌మాటిక్‌ సభ్యులందరూ అంగీకరిస్తారని” గ్రూడెమ్‌ కొనసాగించాడు. ఆ వాస్తవాన్ని ఒప్పుకున్నపుడు క్రైస్తవులు దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రత్యక్షతకూ వారి స్వంత ఊహలను బట్టి కల్పించిన దానికీ భేదాన్ని ఎలా కనుగొనగలరు? ఆ ప్రశ్నకు తగిన సమాధానం చెప్పడానికి గ్రూడెమ్‌ ఇబ్బందిపడుతున్నాడు.

ఆ ప్రత్యక్షత పరిశుద్ధాత్మ  నుంచి వచ్చినట్టుగా ఉందా? ఆ వ్యక్తికి ఇంతకు ముందు ఆరాధనలో తెలిసిన  పరిశుద్ధాత్మ అనుభవాలను అది పోలి ఉందా? అనే వాటిని బట్టే తప్ప, అవి నిజంగా పరిశుద్ధాత్మ నుంచే వచ్చాయా లేదా అనేది న్పృష్టంగా వివరించడం కష్టం. కానీ ప్రవచనాలను పరీక్షించడానికి అవనరమైన సమర్థత సంఘానికి కాలం గడచిన కొద్ది వస్తుందనీ, తద్వారా పరిశుద్ధాత్మ నుంచి వచ్చిన నిజమైన ప్రత్యక్షతకూ, వారి సొంత ఆలోచనల నుంచి వచ్చిన ప్రత్యక్షతకూ మద్య భేదాన్ని గుర్తించగలిగే సమర్ధత ఇంకా పెరుగుతుందని మాత్రం చెప్పవచ్చు.11

నేటి ప్రవచనం నిజమో కాదో తెలుసుకోవడానికి పెట్టే పరీక్షను బేస్‌బాల్‌ ఆటతో వేయిన్‌గ్రూడెమ్‌ మరొకచోట పోల్చాడు. “మీరు చూసిందే మాట్లాడతారు. నేను అమెరికా దేశపు సాదృశ్యాన్ని ఉపయోగిస్తున్నాను. ఆమ్ పైర్‌ తాను చూసి గ్రహించిన దానిని ఆధారం చేసుకుని బౌలర్‌ విసిరింది వైడ్‌ బాల్‌గానో, బ్యాట్స్‌మాన్‌ షాట్‌ విఫలమైందిగానో ప్రకటిస్తాడు. దీనికి మించిన ప్రమాణాలేవీ ఈ ఆటలో లేవు" మరొక మాటలో చెప్పాలంటే నిజమైన ప్రవచనాలకూ, కల్పితమైన మాటలకూ తేడాను గుర్తించడానికి అవసరమయ్యే ప్రామాణిక సూచనలేవీ క్యారిస్‌మాటిక్‌ సంఘాల్లో లేవు.

ప్రస్తుత ప్రవచనాలలో లోపాలున్నాయని తెలిసినా, అవి వ్యక్తిగత అనుభవాల మూలంగానే కలుగుతున్నాయని అంగీకరించినా, ఇవాంజెలికల్‌ సంఘాలు సైతం బైబిల్‌కి వేరుగా దేవుడు మాట్లాడుతున్నాడనే అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నాయి. ఉదాహరణకు హెన్రీ బ్లేకబే, క్లౌడీకింగ్‌లు రాసిన “ఎక్స్‌పీరియన్సింగ్‌ గాడ్‌" అనే పుస్తకాన్ని చాలా ఆసక్తిగా దక్షిణ బాప్టిస్టులు చదివారు. పరిశుద్ధాత్ముడు విశ్వాసులను నడిపించే ప్రధాన మార్గం వారితో ప్రత్యక్షంగా మాట్లాడడమేనని ఈ పుస్తకం చెబుతుంది. “సంఘానికి సంబంధించిన ఏ సందేశాన్నైనా ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చినప్పుడు, మొత్తం సంఘానికి అతడు దాన్ని తెలియచేయాలి,” అనేది బ్లేకబే అభిప్రాయం. కనుక దక్షిణ బాప్టిస్టు సంఘాల్లో సైతం “ప్రభువు దగ్గర నుంచి వాక్యేతర మాటలు” ఇపుడు సర్వ సాధారణమైపోయాయి.

లేఖనం ద్వారా కాకుండా వేరొక మార్గంలో వచ్చే దైవ ప్రత్యక్షతను అనేకమంది ఆధునిక క్రైస్తవులు ఎందుకు కోరుకుంటున్నారు? సత్యాన్ని కనుగొనడానికి నమ్మకమైన మార్గం ఇదొక్కటే అనే ఆలోచనతో మాత్రం కాదు. ఆధునిక ప్రవచనాలన్నీ తరచూ పూర్తి లోపాలతో కూడినవని అందరూ అంగీకరిస్తారు. విఫలమైన ప్రవచనాల సంఖ్య చాలా అధికంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. “క్యారిన్‌మాటిక్‌ కేయాస్‌" అనే నా పుస్తకంలో, "కాన్సస్‌ సిటీ ప్రోఫెట్స్‌ ఉద్యమంలో” ఇద్దరు ప్రముఖ నాయకుల మధ్య జరిగిన సంభాషణను ప్రస్తావించాను. వారి ప్రవచనాల్లో మూడింట రెండొంతులు ఖచ్చితమైనవని నమ్మి వారు సంబరపడ్డారు. “ఇప్పటివరకు నెరవేరిన ప్రవచనాలన్నింటిలో అది శ్రేష్టమైనదిగా ఉంది. ఇప్పటి వరకూ జరిగిన వాటిలో అదే అత్యున్నతమైన స్థాయి” అని ఆ ఇరువురిలో ఒకరు చెప్పారు. 14

సులభంగా చెప్పాలంటే, సత్యాన్ని వివేచించడంలో చిలుక జ్యోతిష్యానికీ, ఆధునిక ప్రవచనానికీ పెద్ద తేడా ఏమీ లేదు. ప్రస్తుత ప్రవచనం ఒక మూఢ నమ్మకం. దేవుడు మనకు ఇప్పటికే దయచేసిన లిఖితపూర్వకమైన వాక్యానికి బయట నూతన దైవ ప్రత్యక్షతను వినమని క్రైస్తవులకు లేఖనాల్లో ఎక్కడా దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. ప్రభువు నామంలో అసత్యంగా గర్వంగా ఒక మాటనైనా పలికిన వారందర్నీ ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం నిందిస్తుంది. దైవ ప్రత్యక్షతను కొత్తగా విన్నామని చెబుతున్నవారు అటువంటి హెచ్చరికలను సులభంగా కొట్టిపారేస్తున్నారు.

నూతన ప్రవచనం అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చిన ఉద్యమం ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా లేఖనాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది. జీవంగల దేవుడు మన సొంత భాషలో, అనుదినం, నేరుగా మనతో సంభాషిస్తుండగా, ప్రాచీన గ్రంథమైన బైబిలుకు ఖచ్చితమైన భాష్యాన్ని చెప్పడానికి ఎందుకు శ్రమపడాలి? బైబిల్‌లో ఉన్న సుపరిచితమైన మాటల కంటే, ఈ ప్రత్యక్షతలో ఉన్న తాజా పలుకులు మన జీవితాలకు సంబంధించినవిగా, అత్యవసరమైనవిగా కనిపిస్తున్నాయి. “జీసస్‌ కాలింగ్‌” అనే పుస్తక రచయిత్రి శారా యంగ్‌. ఇది అతి ఎక్కువగా అమ్ముడైన పుస్తకం. “ఈ పుస్తకం క్రీస్తు నుంచి తాను పొందిన ఆధ్యాత్మిక ధ్యానాలతో నిండి ఉందని,” ఆమె చెబుతోంది. పాఠకునితో నేరుగా ఒక మానవ రచయిత ద్వారా క్రీస్తే స్వయంగా మాట్లాడుతున్నట్టు, ఆయన స్వరంతోనే ఈ పుస్తకమంతటినీ ఆమె రాసింది. నిజానికి, తన పుస్తకానికి ఖచ్చితంగా ఉన్న అధికారం అదేనని శారా యంగ్‌ వ్యాఖ్యానించింది. యేసు తనతో మాట్లాడుతుండగా కేవలం తాను ఒక శ్రోతలా విన్నానని ఆమె చెబుతోంది. లేఖనాలలో సమృద్ధి కొదువగా ఉన్నదనే మనసును తొలిచి వేసే భావంతో ఉండగా వాక్యేతర ప్రత్యక్షతను గురించిన తన అన్వేషణ ఆరంభమైందని ఆమె చెప్పింది. “బైబిల్‌ ద్వారా దేవుడు నాతో సంభాషిస్తాడని నాకు తెలుసు, అయితే నేను మరింత ఎక్కువగా అపేక్షించాను. ప్రతి దినం దేవుడు నాతో వ్యక్తిగతంగా చెప్పదలచిన దాన్ని నేను వినాలనుకున్నానని” ఆమె రాసింది. 15 అటువంటి వైఖరి ప్రజలను లేఖనం నుంచి దూరం చేస్తుందనే విషయం ఆశ్చర్యమా?

అందుచేతనే వాక్యేతర ప్రత్యక్షతపై ప్రస్తుత ఇవాంజెలికల్‌ సంఘానికి ఉన్న వ్యామోహం అత్యంత ప్రమాదకరం. ఈ వ్యామోహం మధ్య యుగానికి సంబంధించిన మూఢ నమ్మకం వైపు తిరగడమే కాదు, బైబిలే మన జీవితాలపై ఏకైక, ఉన్నతమైన, సంపూర్ణమైన అధికారం కలిగినదనే మన ప్రాథమిక విశ్వాసానికి ద్రోహం చేయడమే ఔతుంది. ఇది "సోలా స్క్రిప్చురా (కేవలం లేఖనాలు మాత్రమే) అనే మతోద్ధారణ నియమాన్ని పూర్తి స్థాయిలో త్యజిస్తుంది.

వెస్ట్‌ మినిస్టర్‌ విశ్వాస ప్రమాణం లేఖనం యొక్క సర్వ సమృద్ధి గురించి ఎంతో చక్కగా సంక్షిప్తం చేసింది. “దేవుని మహిమకూ, నరుని రక్షణకూ, విశ్వాసానికీ, జీవానికీ అవసరమైన విషయాల గురించిన దేవుని సంకల్పం చాలా స్పష్టంగా లేఖనంలో లిఖించబడింది. ఉత్తమమైన, అత్యవసరమైన విషయాలను లేఖనం నుంచే గ్రహించాలి. ఈ లేఖనానికి పరిశుద్దాత్మ ప్రత్యక్షతలు అనబడేవాటినీ, మనుషుల ఆచారాలనూ ఎన్నడూ కలుపకూడదు.”  లేఖన ప్రమాణం ముగిసిపోయిందనే నమ్మకంలో చారిత్రాత్మక ప్రొటస్టెంటు శాఖ వేళ్ళూనుకునియుంది. లేఖనం సంపూర్ణమైనది, సర్వ సమృద్ధి కలిగినది. కనుక నూతన ప్రత్యక్షత అవసరమే లేదు.

నానావిధమైన ప్రవచనాలద్వారా, దర్శనాల ద్వారా సంఘ యుగంలో ప్రజలతో దేవుడు నేరుగా మాట్లాడిన రోజులు గతించిపోయాయని లేఖనం చాలా స్పష్టంగా చెబుతోంది. పాత నిబంధన, కొత్త నిబంధన గ్రంథాల ద్వారా దేవుడు బయలుపరిచిన సత్యం సంపూర్తి చేయబడింది (హెబ్రీ 1:1,2, యూదా 3 ప్రకటన 22:18,19) లేఖనం అనగా లిఖించబడిన దేవుని వాక్యం సంపూర్ణంగా సమృద్ధియైనది. మనకు అవసరమైన ప్రత్యక్షతలన్నీ అందులో ఉన్నాయి.  2 తిమోతి 3:15-17లో పౌలు తిమోతితో ఏమి చెబుతున్నాడో గమనించండి.

"క్రీస్తు యేసు నందుంచవలసిన  విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల వరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదవు ... దైవజనుడు నన్నద్దుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధవడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును  నీతియందు శిక్ష  చేయుటకును ప్రయోజనకరమై యున్నది"

లేఖనానికి సంబంధించిన రెండు అతి ప్రాముఖ్యమైన మాటలను ఈ వాక్యభాగం తెలియచేస్తోంది. మొదటిది: “ప్రతి లేఖనము దైవాదేశము వలన కలిగినది.” లేఖనం సాక్షాత్తు దేవుని అధికారంతో మాట్లాడుతుంది. అది ఖచ్చితమైంది, నమ్మదగింది, సత్యమైంది. యోహాను 17:17 లో “నీ వాక్యం సత్యమైనది” అని యేసే స్వయంగా ప్రార్థించారు. “నీ వాక్య సారాంశం సత్యము” అని కీర్తన 119:160 చెబుతోంది. ఆ మాటలు ప్రతి మానవ అభిప్రాయానికీ, ఊహకూ, ఉద్రేకపూరిత భావనకూ పైగా లేఖనాన్ని ఉంచుతున్నాయి. లేఖనం మాత్రమే స్థిరమైన సత్యంగా నిలుస్తుంది. ఏ ఇతర స్వరమూ మాట్లాడలేని అధికారంతో ఇది మాట్లాడుతుంది.

రెండవది: లేఖనాలు పూర్తిగా సమృద్ధియైనవని, రక్షణార్థమైన జ్ఞానం నీకు కలుగచేయడానికీ, ప్రతి సత్కార్యానికి, సంపూర్ణంగా నిన్ను సిద్ధపరచడానికీ శక్తి కలిగినవనీ ఈ వాక్య భాగం బోధిస్తోంది. లేఖనం యొక్క సర్వసమృద్ధి గురించి ఇంతకంటే స్పష్టమైన వివరణ ఎవ్వరికీ అవసరం లేదు. దేవుణ్ణి మహిమపరిచేలా మనల్ని సిద్ధపరచడానికి ఆయన నుంచి వాక్యేతర సందేశాలు అవసరం లేదు. దేవుని నుంచి సరికొత్త వర్తమానాల కోసం ఎదురుచూసేవారు నిజానికి దేవుని వాక్య సత్యాన్ని, సర్వసమృద్ధినీ విడిచిపెట్టేసారు. పతనమైన, లోపభూయిష్టమైన వారి సొంత ఊహలను దాని స్థానంలో ఉంచారు. సంఘం “సోలా స్క్రిప్చురా” (లేఖనాలు మాత్రమే) అనే నియమాన్ని తిరిగి చేపట్టకపోతే, మనం చూడగలిగే ఉజ్జీవం కేవలం మూఢ నమ్మకంతో, ఆధ్యాత్మిక చీకటితో నిండిన ఉజ్జీవాన్ని మాత్రమే.

దేవుడు మాట్లాడడం ఆపేసాడని దీని అర్థమా? ఖచ్చితంగా కాదు. తన సర్వ సమృద్ధి గల వాక్యం ద్వారా ఆయన నేడు మాట్లాడతాడు. దేవుని ఆత్మ మన హృదయాలను కదిలించి, ప్రత్యేకమైన బాధ్యతలనూ, పిలుపునూ మనకు ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అలా చేయడానికి ఆయన దేవుని వాక్యం ద్వారా పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన హృదయాలకు వాక్యాన్ని అన్వయించడానికి, మన ఆధ్యాత్మిక నేత్రాలను తెరవడానికి అవసరమైంది "వెలిగింపే" కాని  "నూతన ప్రత్యక్షత" కాదు. వాక్యాధికారాన్నీ మరి స్థిరమైన వాక్య సత్యాన్నీ మరుగు చేయకుండా మన అనుభవాన్నీ సొంత ఆలోచనలనూ, ఊహలనూ జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.

ప్రవచనం గురించి నేటి విశ్వాసులు కలిగిఉండవలసిన సరైన దృక్పథాన్ని 20వ శతాబ్దపు ప్రసిద్ధ బ్రిటీష్ వాక్య బోధకుడైన డేవిడ్‌ మార్టిన్‌ లాయిడ్‌ జోన్స్‌ చక్కగా వివరించాడు. ఎఫెసీ 4:11 గురించి వ్యాఖ్యానిస్తూ, లాయిడ్‌ జోన్స్‌ ఈ విధంగా రాశాడు

“కొత్త నిబంధన గ్రంథాలు  రాయబడ్డాయి కనుక, ప్రవక్త అవసరత ఇక లేదు. తామే కొత్త నిబంధన తరహా ప్రవక్తలమనీ, సత్యాన్ని గురించిన ప్రత్యేక దర్శనాలను తాము పొందుకున్నామనీ ప్రజలు  అనుకున్న కారణాన్ని బట్టి సంఘచరిత్రలో నమస్య తలెత్తింది. కొత్త నిబంధన లేఖనాల వెలుగులో చూస్తే వేరే సత్యం మనకు అవసరత లేదన్నదే ఆ ప్రశ్నకు జవాబు. అది చాలా ఖచ్చితమైన మాట. కొత్త నిబంధనలో మనకు సర్వ సత్యం  ఉంది కాబట్టి వేరే యే ఇతర ప్రత్యక్షతల అవసరం మనకు లేదు. మనకవసరమైన ప్రతిదీ మనకు అందుబాటులో ఉంది. కనుక ఏ వ్యక్తి అయినా కొత్త ప్రత్యక్షతను పొందుకున్నానని చెబితే మనం అతణ్ణి వెంటనే అనుమానించాలి.

కొత్త నిబంధన వాక్య  ప్రత్యక్షత మనకు పూర్తిగా అందుబాటులోనికి రాగానే ప్రవక్త అవసరత ఇక లేదన్నదే దీనంతటికీ సరియైన జవాబు. సత్యాన్ని గురించిన ప్రత్యక్ష దర్శనాల అవసరత మనకిక ఏ మాత్రమూ లేదు. బైబిల్ లోనే సత్యం ఉంది. పరిశుద్ధాత్మనూ వాక్యాన్నీ మనమెన్నడూ విడదీయకూడదు. వాక్యంతో సంపూర్ణంగా ఏకీభవించని ఏ విధమైన దర్శనాన్నైనా సందేహించి , పరిశోధించాలి. "అసలు దర్శనం" అనే పదాన్ని పూర్తిగా విస్మరించి కేవలం "వెలిగింపు" అనే మాటను ఉపయోగించడం జ్ఞానమైన పని. వాక్య  ప్రత్యక్షత అంతా ఒక్కసారే అనుగ్రహించబడింది. మనకు అవసరమైనదీ, దేవుని కృపను బట్టి  మనం పొందుకొనేదీ  ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహించే  వాక్య  వెలిగింపే. అదే వాక్య గ్రహింపుకు మనకు అవసరం.

                                                      రెండు రకాల ప్రవక్తలా?

లేఖనంలో ఉన్న స్పష్టమైన ప్రమాణాలను తప్పించుకుని, ఆధునిక ప్రవచనమనే మరో బోధను కొనసాగించే ప్రయత్నంలో, లేఖనం రెండు రకాల ప్రవక్తలను వర్ణిస్తోందని క్యారిస్‌మాటిక్స్‌ చెబుతున్నారు. మొదటి వారు లోప రహితులు, అధికారం గలవారు. రెండవ రకపు వారు, మొదటి వారికి భిన్నమైనవారు. పాత నిబంధన ప్రవక్తలూ, కొత్త నిబంధన అపొస్తలులూ, లేఖన రచయితలూ మొదటి జాబితాకు చెందిన వారు. వారి ప్రవచనాలు దేవుని ప్రజలకు దేవుని మాటలను సంపూర్ణంగా చేరవేస్తుండేవి. ఫలితంగా, వారి ప్రవచనాత్మక ప్రకటనలు లోపరహితమైనవిగా ఉండి, ఇతరుల జీవితాల్లో వెంటనే ప్రభావాన్ని చూపించేవి.

అయితే కొత్త నిబంధన సంఘంలో రెండవ రకపు ప్రవక్తలు ఉన్నారని క్యారిస్‌మాటిక్స్‌ వాదిస్తారు. లోపాలతో కూడిన, అధికారం లేనటువంటి ప్రవచనాన్ని పలికిన సంఘ ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళు కొత్త నిబంధన కాలంలో ఉనికిలోకి వచ్చారు. వీళ్ళ ప్రవచనం లోపాలతో కూడింది, అధికారం లేనిది. ఆది సంఘంలో ఉన్న సంఘ ప్రవక్తలు దైవ ప్రత్యక్షతను గురించిన వారి ప్రకటనలో కొన్నిసార్లు పొరపాట్లు చేసారన్నది వారి వాదన. కనుక పాత నిబంధన ప్రవక్తలకూ, వాక్య రచయితలకూ ఉన్న పరిపూర్ణ ప్రమాణాన్ని వీళ్ళు నెరవేర్చవలసిన అవసరం లేదు. ఆ రకమైన వాదనను బట్టి, ఆధునిక ప్రవచనాలు 100 శాతం ఖచ్చితత్వాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేదని క్యారిస్‌మాటిక్స్‌ వాదిస్తారు.

కొత్త నిబంధనలో దైవ ప్రత్యక్షతను తప్పుగా ప్రకటించినవారు, లోపాలు కలిగిన కొత్త నిబంధన ప్రవక్తలు ఉన్నారనే అభిప్రాయం ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ పరిస్థితికి సరిపోతుంది. కానీ దీనిలో ప్రాణాంతకమైన లోపం ఉంది. ఇది వాక్యానుసారం కాదు. నిజానికి తప్పుడు ప్రవక్తలు ప్రమాదకరమైనవారనీ, మోసగాళ్లనీ బైబిల్‌ నిత్యం నిందిస్తుంది. లోపభూయిష్టమైన ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, తప్పుడు మార్గంలో నడిపించబడిన అబద్ధ ప్రవక్తలు దేవుని పక్షంగా మాట్లాడుతున్నట్టు నటించడం ఆపి, ఊహల నుంచి మాట్లాడడం మానెయ్యాలి. వారి అనుభవాలను వాక్యంలోని ఖచ్చితమైన ప్రమాణాలకు లోబరచడానికి బదులు (వారి యొక్క లోపాలతో నిండిన మాటలను ప్రవచనమని పేర్కొంటారు).  క్యారిస్‌మాటిక్స్‌ ఆధునిక అనుభవాలను లేఖనంపై రుద్దేశారు. దేవుని వాక్యంలో ఉన్న స్పష్టమైన సూచనలతో పోల్చినప్పుడు, ఆధునిక ప్రవచనం ఏ మాత్రమూ నిలువలేదు.

కొత్త నిబంధన ప్రవక్తలను, పాత నిబంధన ప్రవక్తలను పరీక్షించడానికి ఒకే రకమైన ప్రమాణాలను ఉపయోగించలేదని క్యారిస్‌మాటిక్స్‌ వాదిస్తారు, కానీ ఆ మాటకు ఏ విధమైన ఆధారమూ లేదు. రెండు నిబంధనలలో ప్రవక్తల మధ్య భేదమేమీ లేదు. నిజానికి పాత, కొత్త నిబంధనలలోని ప్రవక్తలను వర్ణించడానికి కొత్త నిబంధన ఒకే విధమైన పదజాలాన్ని ఉపయోగిస్తోంది. ఆపో. కా. 2:16, 3:24:25, 10:43, 13:27-40, 15:15, 25:14, 26:22,27, 28:23 వచనాల్లో పాత నిబంధన ప్రవక్తల గురించిన ప్రస్తావన ఉంది. ఏ విధమైన వ్యత్యాసం, విశేషం, మినహాయింపు ప్రదర్శించకుండా అదే విధమైన పదజాలాన్ని కొత్త నిబంధన ప్రవక్తలకు ఉపయోగించారు (ఆపో. కా. 2:17,18, 7:37, 11:27,28, 13:1 15:32 21:9-11)

క్యారిస్‌మాటిక్స్‌ వాదిస్తున్న ప్రకారం కొత్త నిబంధన ప్రవక్తల విధులలో స్పష్టమైన వ్యత్యాసమున్నట్లైతే ఖచ్చితంగా అది ఆ పదజాలంలో కొంతమేరైనా కనిపించి ఉండేది. “కొత్త నిబంధన ప్రవచనాలు పాత నిబంధన ప్రవచనం మాదిరిగా లోపరహితమైనది కాకపోతే, పాత కొత్త నిబంధనల మధ్య ఖచ్చితంగా ఒక ప్రాథమిక వైరుధ్యాన్ని అది కలుగచేసి ఉండేది. ఇంతటి ముఖ్య వ్యత్యాసం గురించి స్పష్టంగా చర్చించకుండా దాటవేయడమనే ఆలోచన ఊహించలేనిదని" స్యామ్‌ వాల్డ్రన్  చెప్పారు.

నిజానికి కొత్త నిబంధన ప్రవక్తలను గురించిన సరైన అవగాహన నిశ్శబ్దం నుంచి పుట్టుకొచ్చిన వాదనపైన కాకుండా స్థిరమైన వాక్యంపై ఆధారపడి ఉంది. (అపొ.కా. 2:18 లో) అపొస్తలుల యుగమంతటిలో సంఘంలో ఉండబోయే ప్రవచన శైలి గురించి పేతురు మాట్లాడినప్పుడు, పాత నిబంధన ప్రవచన శైలికి స్పష్టమైన మాదిరిగానున్న యోవేలు 2:28ని అతడు ప్రస్తావించాడు. వాక్య రచయితలు (బాప్తిస్మమిచ్చు యోహాను, అగబు ప్రవక్త, ప్రకటన గ్రంథంలో అపొస్తలుడైన యోహాను వంటి) కొత్త నిబంధన ప్రవక్తల గురించి మాట్లాడినప్పుడు, ఉద్దేశపూర్వకంగానే పాతనిబంధన ప్రవక్తలను తలపించే విధంగా వారిని వర్ణించారు. రెండు నిబంధనల్లోని ప్రవక్తలకూ ఖచ్చితంగా ఒకే విధమైన విధివిధానాలు ఉన్నాయని కొత్త నిబంధన గ్రంథకర్తలు నొక్కి చెప్పారు. ఆది సంఘం రెండు నిబంధనల్లోని ప్రవక్తలను సమానులుగా పరిగణించింది. సంఘ చరిత్ర యొక్క మొదటి కొన్ని శతాబ్దాలను విస్తృతంగా పరిశోధించిన కొత్త నిబంధన ప్రొఫెసర్‌ డేవిడ్‌ ఫార్నెల్‌ ఈ విధంగా చెప్పారు.

అపొస్తలుల తర్వాత కాలంలో ఉన్న సంఘం పాత నిబంధన ప్రవచన ప్రమాణాలతోనే కొత్త నిబంధన ప్రవక్తల నిజతత్వాన్ని నిర్ధారించింది. కొత్త నిబంధన కాలంలో వింతగా ప్రవర్తించి, లేఖనాలను తప్పుగా అన్వయించిన వారిని అబద్ధ ప్రవక్తలుగా పరిగణించింది. ఎందుకంటే నిజమైన దేవుని ప్రవక్తకు ఉండవలసిన లక్షణాలుగా పాత నిబంధన పెట్టిన షరతులను అలాంటి కార్యాలు ఉల్లంఘిస్తున్నాయి కనుక (ద్వితీ 13:1-5, 18:20-22) ప్రవక్తలు, ప్రవచనాల విషయంలో పాత, కొత్త నిబంధనలు ఒకే రకమైన ప్రమాణాలను అనుసరించాయనే భావాన్ని ఆది సంఘం ధృవీకరించింది.

ఆది సంఘం కొత్త నిబంధన పాత నిబంధన ప్రవక్తలకు ఒకే విధమైన ప్రమాణాలు వర్తిస్తాయని నొక్కి చెప్పింది. దైవ ప్రత్యక్షతను ప్రకటించినప్పుడు పాత నిబంధన ప్రవక్తలు ఏ విధంగానైతే సత్యాన్ని మాట్లాడవలసి వచ్చిందో, కొత్త నిబంధన ప్రవక్తలు అదే విధంగా మాట్లాడవలసి వచ్చేది. “ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు” అని వారు ప్రకటించినప్పుడు, తర్వాత వచ్చిన మాట ఖచ్చితంగా దేవుడు చెప్పినదై ఉండాలి (ఆపో. కా 21:11). దేవుని నుంచి వచ్చిన ప్రామాణిక పదాలు ఆయన పరిపూర్ణమైన, మచ్చలేని స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి కనుక అలాంటి ప్రవచనాలు అన్నివేళలా లోపరహితంగా, తప్పులు లేకుండా ఉంటాయి. అబద్ధ ప్రవక్తలు స్థిరమైన బెదిరింపును కలుగచేశారు కనుక, పరీక్ష అనేది అవసరం (1యోహాను 4:1, 2పేతురు 2:1-3: 2 యోహాను 10,11,  3 యోహాను 9,10, యూదా 9-23). పాత నిబంధనలో మునుపటి ప్రత్యక్షత ఆధారంగా ప్రవచనాలను ఏ విధంగా పరీక్షించేవారో (ద్వితీ 13:1-5), అదే విధంగా కొత్త నిబంధనలోనూ అవి పరీక్షించబడాలి (1 థెస్స 5:20-22, ఆపో. కా. 17:11)

 “మనకనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము” అని రోమా 12:6 లో పౌలు రాసిన దాన్ని చూపించి ఎవరో ఒకరు అభ్యంతరం లేవనెత్తుతారనడంలో సందేహం లేదు. ఈ వచనాన్ని ఉపయోగించుకుని ప్రవచనపు ఖచ్చితత్వం వ్యక్తి యొక్క విశ్వాస పరిమాణంపై ఆధారపడి ఉంటుందని క్యారిస్‌మాటిక్స్‌ వాదిస్తారు. కానీ ఆ వచనంలో పౌలు మనసులో ఉన్న భావానికి వారి వాదన కనీసం దగ్గరగా కూడా లేదు. ఈ “విశ్వాసము” అనే పదానికి ముందు గ్రీకులో ఒక డెఫనెట్‌ ఆర్టికల్‌ ఉంది. ఈ డెఫనెట్‌ ఆర్టికల్‌కి అత్యంత ఖచ్చితమైన తర్జుమా “ఆ”. కనుక ప్రవచన వరం కలిగిన వారు "ఆ విశ్వాసము" నకు తగినట్లు ప్రవచించాలని పౌలు తన పాఠకులకు ఉపదేశిస్తున్నాడు. “ఆ విశ్వాసం” అనగా "ముందుగానే బయలుపరచబడిన వాక్య సత్య సారాంశం" (యూదా వ. 3-4).

అంతేకాదు, ఈ సందర్భంలో "ప్రవచనం” అనే మాట ఖచ్చితంగా “భవిష్యత్తును గురించిన ప్రవచనాలు గానీ, నూతన ప్రత్యక్షత” గానీ కావలసిన అవసరం లేదు. ఆ పదానికి "ప్రకటించడం” అనే అర్థముంది. మనుషులకు క్షేమాభివృద్ధియు, హెచ్చరిక, ఆదరణ కలుగునట్లు దేవుని సత్యాన్ని ప్రకటించే వరం కలిగిన ఏ వ్యక్తెనా ప్రకటించే ప్రతీ అధికారపూర్వక ప్రకటనకైనా ఇది వర్తిస్తుంది (1 కోరింథీ 14:3). కనుక రోమా 12:6 కు సరియైన అనువాదం ఈ విధంగా ఉంటుంది: “దేవుని వాక్యాన్ని ప్రకటించడం నీ వరమైతే, ఆ విశ్వాసానికి అనుగుణంగా దాన్ని ప్రకటించు.” ప్రకటించబడేది ఏమైనప్పటికీ అది మునుపటి దైవ ప్రత్యక్షతకు సంపూర్ణంగా ఏకీభవించాలనేదే దాని భావం.

లోపాలు కలిగిన ప్రవచనం గురించి వాదించడానికి క్యారిస్‌మాటిక్స్‌ సాధారణంగా నూతన నిబంధన ప్రవక్త అగబును ఉపయోగించుకుంటారు. పౌలు యెరూషలేముకు వెళ్ళినప్పుడు యూదులు అతణ్ణి బంధించి రోమీయులకు అప్పగిస్తారని అపొ. కా. 21:10,11 లో అగబు ప్రవచించాడు. అపొ.కా. 21వ అధ్యాయపు చివరి భాగంలో పౌలు బంధించబడినప్పటి సంగతులను గ్రంథస్థం చేసినప్పుడు ఆ ఖచ్చితమైన వివరాల గురించి లూకా తిరిగి చెప్పలేదన్న వాస్తవాన్ని క్యారిస్‌మాటిక్స్‌ పెద్ద విషయంగా చేస్తున్నారు. అగబు చేసిన ప్రవచనం పూర్తిగా అసత్యం కానప్పటికీ, జరిగిన సంఘటనను పరిశీలిస్తే అతడు చేసిన ప్రవచనంలో లోపాలు కనిపిస్తున్నాయని వేయిన్‌ గ్రూడెమ్‌ వంటి కంటిన్యుయేషనిస్ట్‌ల మనస్సులోని భావం. 22 ఆ ప్రవచనంలో యూదులచేత "బంధింపబడడం" “అప్పగింపబడడం” అనే రెండు విషయాలు ఆ తరువాత సంభవించిన సన్నివేశాన్ని బట్టి ఎంతో స్పష్టంగా అబద్ధ ప్రవచనాలుగా నిరూపించబడ్డాయని వ్యాఖ్యానించే స్థాయికి వేయిన్‌ గ్రూడెం వెళ్లిపోయాడు. 23 “కొత్త నిబంధనలో లోపాలు కలిగిన ప్రవచనానికి అగబు ఒక ఉదాహరణగా నిలిచాడు. అదే క్యారిస్‌మాటిక్‌ వారి సిద్ధాంతానికి ఒక నమూనాగా ఉందని” గ్రూడెమ్  చెబుతున్నాడు.

అయితే నిజంగానే అగబు ప్రవచనంలోని విషయాలు తర్వాత జరిగిన సంఘటనల ద్వారా స్పష్టమైన విధంగా  అబద్ధమని నిరూపితమయ్యాయా? వాక్యం దానికి పూర్తి విరుద్ధమైన విషయాన్ని బయలుపరుసోంది. అపొ.కా. 21:11లో యూదులు పౌలును బంధిస్తారని అగబు చెప్పిన ప్రవచనం, 30-32 వచనాలలో వారు పౌలును పట్టుకుని ఈడ్చి కొట్టారనే వాస్తవంలో ఇమిడియుంది. ఆపో. కా. 26:21 లో యూదులు తనను బంధించి, చంప చూసారనే వాస్తవాన్ని అగిప్ప ముందు సాక్ష్యమిచ్చేటప్పుడు పౌలు చెప్పాడు. ప్రతిఘటిస్తున్న పౌలును బలవంతంగా నిర్భంధించి దేవాలయం బయటికి ఈడ్చుకెళ్ళడానికి క్రూరులైన అతని విరోధులు అతణ్ణి తప్పించుకోనీయకుండా ఉండడానికి తమకు అందుబాటులో ఉన్న అతనియొక్క నడికట్టుతోనే బంధించియుంచవలసి వచ్చింది. 10వ వచనంలో ఈ సంగతిని అప్పటికే తెలియచేసిన కారణంచేత 30వ వచనంలో లూకా దాన్ని తిరిగి చెప్పవలసిన అవసరం లేదని భావించి ఉంటాడు. రోమా సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని (వ.33), పౌలుకున్న తాత్కాలిక బంధకాలను తొలగించి అధికారికంగా అతణ్ణి సంకెళ్ళతో బంధించారు. ఆ విధంగా జరిగిన సంఘటనలు ఖచ్చితంగా అగబు చెప్పిన ప్రవచనంతో ఏకీభవిస్తున్నాయి.

పౌలును యూదులు రోమా సైనికులకు అప్పగించారనే భావం అపొ.కా. 21వ అధ్యాయాన్ని బట్టి అర్థమౌతోంది. 32వ వచనంలో సైనిక పటాలపు పై అధికారి వచ్చే సమయానికి ఆగ్రహంతో నిండిన జనం పౌలును కొడుతున్నారు. రోమా అధికారులను చూసి యూదులు పౌలును కొట్టడం మాని రోమా సైనికులు అతణ్ణి బంధించేందుకు వీలు కల్పించారు. ఆ సమయంలో ఆగ్రహంతో నిండిన జనం పౌలును రోమా అధికారుల చేతికప్పగించడానికి ఇష్టపడి, అక్కడి నుంచి వెనుదిరిగి నిష్క్రమించారనేది లూకా రాసిన వృత్తాంతంలో ఇమిడియున్న భావం. పౌలు యొక్క సొంత సాక్ష్యం ఈ వాక్య వివరణను స్థిరపరుస్తోంది. ఆపో.కా. 28:17 లో  రోమాలో ఉన్న కొద్దిమంది యూదుల వలన తనకు సంభవించిన వాటిని పౌలు వివరించాడు.

“సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూల మైనది ఏదియు చేయకపోయినను, యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగింపబడితిని.” యూదుల ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించేది ఏదీ పౌలు చేయలేదు. అలా చేసాడని యూదు నాయకులు అనుకుని అతణ్ణి తప్పుగా నిందించారు. అప్పుడు రోమా అధికారుల చేతికి అతణ్ణి ఖైదీ (బంధింపబడిన వాని) గా వారు అప్పగించారు. “అప్పగింపబడితిని” (అపౌ.కా. 28:17) అని పౌలు ఉపయోగించిన పదం, తన ప్రవచనంలో అగబు ఉపయోగించిన గ్రీకు పదం ఒక్కటే (ఆపో.కా. 28:11) కనుక పౌలు యొక్క సొంత సాక్ష్యం అగబు ప్రవచనంలోని వివరణలను సంపూర్ణ సత్యమని నిరూపించింది. అగబు ప్రవచించినప్పుడు పరిశుద్ధాత్మను ప్రస్తావించాడనే వాస్తవం అన్ని విషయాల్లో ప్రాముఖ్యమైనది. పాత నిబంధన ప్రవక్త “యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు” అని చెప్పిన విధంగానే, “పరిశుద్ధాత్ముడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు” అనే మాటలతో అగబు తన ప్రవచనం ప్రారంభించాడు. ఆ తరువాత వచ్చిన మాటలు స్వయంగా పరిశుద్ధాత్ముడే పలికిన మాటలు. ఆ విధంగానే లూకా వాటిని యధాతథంగా గ్రంథస్థం చేసాడు. ఏ విధమైన దిద్దుబాటు లేకుండా లూకా వాటిని గ్రంథస్థం చేయడానికి అతణ్ణి ప్రేరేపించింది సాక్షాత్తు పరిశుద్ధాత్ముడే కావడం అంతేకంటే ప్రాముఖ్యమైన విషయం. కనుక అగబు తన ప్రవచన వివరణల్లో పొరపాటు చేసాడనే మాట పరిశుద్ధాత్ముడు తన ప్రవచనాత్మక ప్రత్యక్షత సారాంశం విషయంలో పొరపాటు చేసాడని తీవ్రమైన నింద వేయడమే.

క్యారిస్‌మాటిక్స్‌ చెబుతున్నట్టు లోపాలతో కూడిన ప్రవచనానికి ఉదాహరణ అగబు కాదనే విషయం స్పష్టమౌతుంది.24 ఆ సత్యం వాక్యేతర ప్రవచనానికి చావు దెబ్బ లాంటిది. “ఆ విధంగా ఈ ప్రవచనం లోపాలు లేనిదిగా వివరించబడింది. తద్వారా లోపాలు కలిగిన ప్రవచనమని క్యారిస్‌మాటిక్స్‌ ప్రతిపాదించిన భావనకు అవకాశమే లేకుండా చేసింది ఈ ప్రవచనం” అని అగబు గురించి రాబర్డ్  సౌసి వివరించాడు.25

                                      మరి 1థెస్స 5:20-22 సంగతేమిటి?

“ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతివిధమైన కీడునకును దూరముగా ఉండుడి” అని 1 థెస్స 5:20-22 లో అపొస్తలుడైన పౌలు రాశాడు. కొత్త నిబంధన ప్రవచనా వరం దృష్ట్యా ఆ వచనాల్లో పౌలు ఇచ్చిన ఆదేశాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి?

నిజమైన ప్రవచనాత్మక వాక్కులు దైవ ప్రత్యక్షతను కలిగి ఉంటాయని గ్రహిస్తే ఈ వాక్యభాగంపై సరైన అవగాహన కలుగుతుంది. కనుక వాటిని తృణీకరించకూడదు. ఎందుకంటే వాటిని తృణీకరిస్తే మనం స్వయంగా దేవుని మాటలను అపహాస్యం చేస్తున్నట్టే, నేను రచించిన వేరొక పుస్తకంలో ఈ అంశాన్ని వివరించాను.

“ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయకూడదని థెస్సలోనీకయులకు జాగ్రత్త చెప్పినప్పుడు దైవ ప్రత్యక్షత యొక్క శ్రేష్టతపై  గౌరవం అపౌస్తలుడైన పౌలు మనస్సులో ఉంది. “నిర్లక్ష్యం” (exouthenao) అనే పదానికి "బొత్తిగా నిష్పయోజనమైనదిగా ఎంచడం, తిరస్కార బుద్ధితో పరిగణించడం లేదా అల్పమైనదిగా చూడడం" అనే బలమైన అర్థాలున్నాయి. కొత్త నిబంధనలో “ప్రవచనాత్మక పలుకులు” (propheteia) అనగా మాట్లాడిన మాటలను, రాసిన పదాలను సూచిస్తాయి. అయితే propheteuo అనే క్రియాపదం “మాట్లాడడాన్నీ, బహిరంగంగా ప్రకటించడాన్నీ” సూచిస్తున్నాయి. కనుక ప్రవచన వరమంటే బయలుపరచబడిన దైవ సత్యాన్ని బహిరంగంగా ప్రకటించడానికి ఆత్మ అనుగ్రహించిన నైపుణ్యం. కొత్త నిబంధన ప్రవక్తలు కొన్ని సందర్భాలలో దేవుని నుంచి నేరుగా పొందుకున్న సరికొత్త ప్రత్యక్షతను బయలుపరిచేవారు (లూకా 2:29 ,32-38, పో. కా. 15:23-29) ఇతర సందర్భాలలో అంతకు మునుపే గ్రంథస్థం చేయబడిన దైవ ప్రకటనను వారు తిరిగి ప్రకటించేవారు (లూకా 3:5,6, ఆపో. కా. 2:17-21,25-28, 34,35, 4:25,26, 7:2-53).26

రెండు సందర్భాలలోను సత్య ప్రవచనం అంటే దైవప్రత్యక్షతను ప్రకటించడమే. కనుక అది ఖచ్చితంగా దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. అందుచేతనే అది “ఆ విశ్వాస” పరిమాణం ప్రకారం పరీక్షించబడాలి (రోమా 12:6) అనగా “ఇంతకు మునుపే బయలుపరచబడిన సత్యంతో అది ఏకీభవించాలి (అపొ.కా. 6:7 యూదా 3,20). దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవచనం అన్నివేళల్లో సత్యమైనది, అది లేఖనంతో ఏకీభవిస్తుంది. అయితే లిఖించబడిన దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండే లోపాలతో కూడిన కల్పిత ప్రవచనం తన్ను తానే అబద్ధమైనదిగా కనబరుచుకుంటుంది. అందుచేతనే దేవుని మూలంగా వచ్చిందని చెప్పబడే ఏ సందేశాన్నైనా విన్నప్పుడు, దానిని ఇంతకుమునుపే ఇయ్యబడిన రాతపూర్వక ప్రత్యక్షతతో పోల్చి, జాగ్రత్తగా పరీక్షించే ఆత్మసంబందమైన వివేచనను సాధనచేయమని పౌలు థెస్సలోనీకయులకు ఉపదేశించాడు. పరీక్షలో విఫలమైన ఆ ప్రవచనాలను విశ్వాసులు విస్మరించవలసిన “కీడు” గా పౌలు వర్ణించాడు (వ 22).

ఇదిలా ఉండగా కొత్త నిబంధన ప్రవచనం లోపాలతో కూడినదనీ, తప్పుల తడక అనే వారి వాదనను ఈ వచనాలు బలపరుస్తున్నాయని అనుకుంటూ తప్పుడు ప్రవచనాలను సమర్థించుకోవడానికి క్యారిస్‌మాటిక్స్‌ తరచూ 1థెస్స 5:20-22 వచనాలను చూపిస్తున్నారు. పాత నిబంధన యొక్క లోపరహితమైన అధికార పూర్వక ప్రవచనాలకు కొత్త నిబంధన ప్రవచనం సమానమైనదైతే ప్రవచనాలను పరీక్షించమని పౌలు సంఘానికి ఎందుకు ఆజ్ఞాపిస్తాడని వారు వాదిస్తారు.

ఆ ప్రశ్న అడిగి పాత నిబంధన ప్రవచనం సైతం కొత్త నిబంధన ప్రవచనం మాదిరిగా అదే విధమైన పరీక్షను ఎదుర్కొనవలసి వచ్చేదనే విషయాన్ని గుర్తించడంలో వారు విఫలమౌతున్నారు. దేవుడు తన ప్రజలను అన్ని సమయాలలో చేయమని ఆజ్ఞాపించిన దానినే తప్ప వేరొక దాన్ని చేయమని పౌలు థెస్సలోనీకయులకు ఆజ్ఞాపించట్లేదు. సత్యాన్ని, యథార్థతనూ ఆధారంగా చేసుకుని ప్రవచనమంతటిని పరీక్షించమని ప్రభువు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు (ద్వితీ 13:1-5, 18:20-22, యెషయా 8:20) ఆ అర్హతలు లేని ప్రవచనాలు అసత్యమైనవిగా ఎంచబడేవి. పాత నిబంధన కాలపు ఇశ్రాయేలీయుల మధ్య అబద్ధ ప్రవక్తల బెడద ఎక్కువగా ఉన్న కారణాన్ని బట్టి, దేవుని ప్రజలు వారిని గుర్తించి, గద్దించవలసి వచ్చేది (ద్వితీ 13:3, యెషయా 30:10 యిర్మీయా 5:31, 14:14-16, 23:21,22, యెహేజ్కేలు 13:2-9, 22:28, మీకా 3:11) అదే నియమం కొత్త నిబంధన విశ్వాసులకు వర్తిస్తుందనే కారణాన్ని బట్టి ప్రవచనాలను జాగ్రత్తగా పరీక్షించమని థెస్సలోనీయులకు పౌలు ఆదేశించాడు.

పౌలు అపొస్తలుడైనప్పటికీ తన బోధను కూడా అవే ప్రమాణాలతో పరీక్షించమని ఇతరులను ప్రోత్సహించాడు. గలతీయులకు రాసిన పత్రికలో, “మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక” (గలతీ 1:8) అని చెప్పినప్పుడు, ద్వితీ 13:1-5 లో ఉన్న నియమాన్నే ఆతడు తిరిగి చెప్పాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అనగా పౌలు థెస్సలోనికను వదిలి వెళ్ళిన వెంటనే మరియు తన మొదటి పత్రికను రాయక ముందు, అతడు బెరయకు ప్రయాణం చేశాడు. బెరయలోనున్న వారు పౌలు యొక్క బోధను యథాలాపంగా అంగీకరించలేదు కానీ పాత నిబంధన ప్రత్యక్షతను ఆధారం చేసుకుని అతని మాటలను పరీక్షించారు. అపొస్తలుల కార్యాల గ్రంథం వారి గురించి ఈ విధంగా చెబుతుంది. “వీరు థెస్సలోనీకలో ఉన్న వారి కంటె ఘనులై యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి (అపొ.కా. 17:11), కొద్దికాలం తర్వాత థెస్సలోనీకయులకు శ్రద్ధ, మెలకువ గల వివేచన గురించిన ఆజ్ఞను రాసినప్పుడు పౌలు మనస్సులో ఈ వృత్తాంతమే ఉండి ఉంటుంది.

మొదటి శతాబ్దపు సంఘంలో అబద్ధ ప్రవక్తల ఉనికి గురించిన వాస్తవాన్ని కొత్త నిబంధన స్పష్టంగా ధృవీకరించింది (మత్తయి 7:15, 24:11, 2 తిమోతి 4:3,4, 2 పేతురు 2:1-3, యోహాను 4:1, యూదా 4). ప్రవచనాన్ని పరీక్షించమనే ఆజ్ఞలను ఆ నేపాథ్యాన్ని బట్టి అర్ధం చేసుకోవాలి. నిజమైన దేవుని ప్రవక్తలకూ, ప్రమాదకరమైన నకిలీ ప్రవక్తలకూ మధ్య వ్యత్యాసాన్ని వివేచించమని వాక్యం విశ్వాసులకు ఆజ్ఞాపించింది. ముఖ్యంగా థెస్సలోనీకయులు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడవలసిన వారుగా ఉన్నారు. పౌలు యొక్క వ్యక్తిగత స్వభావం గురించిన (1థెస్స 2:1-12), అంత్య దినాల్లో సంఘ భవిష్యత్తు (1థెస్స 4:13, 5:11) గురించిన రెండు విషయాల్లో వారి సంఘంలో కొద్దిమంది అప్పటికే తప్పుదారిలో నడిపించబడ్డారని పౌలు వారికి రాసిన రెండు పత్రికలు తెలియజేస్తున్నాయి. పౌలు చేసిన ఉపదేశంలో అధిక భాగం థెస్సలొనీక సంఘంలో తీవ్ర నష్టాన్ని కలుగచేస్తున్న తప్పుడు బోధకు స్పందనగా ఉంది. అందుచేతనే బహుశా అన్ని ప్రవచనాలను అనగా సత్యమైన ప్రవచనాలను సైతం తృణీకరించే విధంగా థెస్సలొనీకయులు శోధించబడ్డారు.

ప్రవచన వరం ఇంకా అందుబాటులో ఉన్న సంఘ ప్రారంభ యుగంలోనే పౌలు ఈ మాటలను రాయడం గుర్తించుకోదగ్గ ముఖ్య విషయం (ఎఫెసీ 2:20), కనుక “ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి” అనే అతని ఆజ్ఞ ఆ వరం పూర్తిగా అందుబాటులో ఉన్న సమయానికి వర్తిస్తుంది. ప్రస్తుత కాలపు ప్రవక్తలు చేసే అబద్ధ ప్రవచనాలను సేషనిస్ట్‌లు కొట్టిపారేసినప్పుడు వారు పౌలు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం లేదు. కానీ దేవుని మూలంగా వచ్చిందని చెప్పబడిన సందేశాలు వాక్యానుసారమైనవో కావో తెలుసుకోవడానికి వాటికి వాక్య ప్రమాణాలను అన్వయించడం ద్వారా వారు వాక్య ప్రత్యక్షతను సీరియస్‌గా తీసుకుంటున్నారు. వాస్తవానికి క్యారిస్‌మాటిక్‌ సభ్యులే నకిలీ వరాన్ని సమర్థించడం ద్వారా సత్యమైన ప్రవచనాన్ని తృణీకరిస్తున్నారు.

ప్రవచన వరం నిలిచిపోయింది. అయితే లేఖనాలకు అర్ధం చెప్పి ప్రజలను వాటికి లోబడమని బోధకులు చెబుతుండగా ఆ ప్రవచన వాక్కు నేడు ఇంకా ప్రకటించబడుతూనే ఉంది. దాన్ని బట్టి చూస్తే 1థెన్స 5:19-22 లోని భావాలు నేటికీ ప్రస్తుత సంఘానికి వర్తిస్తాయి. ప్రస్తుత కాలపు కాపరులూ, బోధకులూ చేస్తున్న ప్రతి ప్రసంగాన్ని, అన్వయిస్తున్న ప్రతి పాఠాన్నీ చాలా శ్రద్ధగా లేఖనమనే భూతద్దంతో పరీక్షించాలి. దేవుని పక్షంగా మాట్లాడుతున్నానని చెబుతున్న వాని సందేశం వాక్య సత్యానికి విరుద్ధంగా ఉంటే, తన్ను తానే అబద్ధికునిగా కనపరుచుకుంటున్నాడు. ఆ సందర్భంలోనే మనకు వాక్య వివేచన అవసరం.

1థెస్స 5:20-22 లోపాలు కలిగిన ప్రవచనం యెడల క్యారిస్‌మాటిక్స్‌ కలిగి ఉన్న అభిప్రాయాన్ని సమర్థించదు. నిజానికి ఇది దేవుని మూలంగా వచ్చిన సందేశాన్నీ లేదా దూతనూ పరీక్షించమని క్రైస్తవులకు పిలుపునిస్తూ దానికి భిన్నమైన విషయానికి నడిపిస్తుంది. ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ సభ్యుల కల్పిత ప్రవచనానికి లేఖన పరీక్షలను మనం అన్వయించినప్పుడు, వారి “ప్రవచనం” నాశనకరమైన నకిలీ అని మనం తక్షణమే కనుగొనగలము.

కొత్త నిబంధనలో ప్రవచనం గురించిన వాక్య భాగాలన్నింటిని పరిశీలిస్తే, క్యారిస్‌మాటిక్‌ వారి సిద్ధాంతం నిరాధారమైనదిగా, వాక్య వ్యతిరేకమైనదిగా వెంటనే బహిర్గతమౌతుంది. మొదటి శతాబ్దపు సంఘంలోని ప్రవక్తలకు ఖచ్చితత్వం విషయంలో పాత నిబంధనలోని ప్రవక్తలకు ఉపయోగించిన ప్రమాణాలనే ఉపయోగించారనేది కొత్త నిబంధన చేసే స్పష్టమైన బోధ. తమ తప్పుడు ప్రవచనాలను సమర్థించుకోవాలనే వారి మనసుల్లో ప్రవక్తలు పొరపడతారనే అభిప్రాయం ఉంది. అయితే దాన్ని బలపరచడానికి అవసరమైన వాక్యాధారం మాత్రం ఎక్కడా లేదు.

                                             అపాయకరమైన ఆట

ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ప్రవచనం వాక్యానుసారమైనది కాకపోతే, మరి ఏమిటి? క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో తన స్వీయానుభవాలను నెమరువేసుకుంటూ ఈ ప్రశ్నకు మునుపటి ప్రవక్త  ఫ్రెడ్‌ యల్‌. వోల్జ్  ఒక తెలివైన సమాధానం చెప్పాడు.

“ఈ ప్రవక్తలు చెప్పే ప్రవచనాలన్నీ దాదాపుగా ఒకే రీతిగా ఉంటున్నాయని నేను గమనించాను. గొప్ప ఆశీర్వాదాల గురించీ భవిష్యత్తులో కలుగబోయే విజయం గురించీ, అభివృద్ధి గురించీ వారు అన్ని వేళలా ప్రవచిస్తున్నారు. మరొక అనుకూల ప్రవచనం రాగానే, అది మునువటి ప్రవచనానికి నెరవేర్పుగా వరిగణిస్తున్నారు. ఏదో ఒక రోజున ఆ ప్రవచనం కూడా నెరవేరుతుందనే భావం వారిలో ఉంది.”

కొన్నిసార్లు ఆ వ్యక్తి యొక్క గత వర్తమానాల గురించిన కొంత నమాచారం అనగా మద్యానికీ, మాదక ద్రవ్యాలకూ బానిసైన వారు ఎవరో నీ కుటుంబంలో ఉన్నారు? “నీకు సంగీతం అంటే ఇష్టం” అనేవి ప్రవచనాన్ని అనుసరించి వచ్చేవి. దేవుని వాక్యంతో దాన్ని పరీక్షించి లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేస్తూ పాస్టర్‌ని కొన్ని ప్రశ్నలు అడిగితే ఇదంతా నకిలీ అనే విషయం తేలిపోతుంది.27

సర్కస్ లో  గారడీ చేసేవారికీ, హస్త సాముద్రికాన్ని చదివేవారికీ ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ప్రవక్తలు ఏమీ తీసిపోరు. కొన్ని సందర్భాల్లో అంధకార సంబంధమైన శక్తి కూడా వారి వెనుక ఉండవచ్చు. న్యూ ఏజ్‌ ప్రవక్తల ద్వారా సాతాను చెప్పిన ప్రవచనాలతో క్యారిస్‌మాటిక్‌ ప్రవచనాలను పోలుస్తూ వోల్జ్  కొనసాగించాడు. ఈ రకమైన అన్యాగ్నితో ఆడుకొనే వారి హృదయాల్లో అతడు చెప్పిన గంభీరమైన మాటలు భయాన్ని కలిగించాలి.

“సాతానుగాడికి భవిష్యత్తు  ఖచ్చితంగా తెలుసునని నేను అనుకోను. ఒకవేళ వాడికి భవివ్యత్తు తెలిస్తే, అబద్ద ప్రవక్తలు చెప్పేది చాలా ఖచ్చితంగా ఉండియుందేది. ఉదాహరణకు, న్యూఏజ్‌కు చెందిన అబద్ధ ప్రవక్తలు కొందరున్నారు. 2001, సెప్టెంబరు 11వ తేదీన ప్రవంచ వాణిజ్య కేంద్రం (వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్స్‌) పై దాడి జరగడానికి కొన్ని నెలల ముందే ఆ దాడి గురించి వీరు ప్రవచించారు ....... ఆ దాడి జరగడానికి కొన్ని నంవత్సరాల క్రితమే పథకం వేయబడిందని మిలటరీ నిపుణుల అభిప్రాయం. ఆ పథకం ఆరంభంనుంచి జరిగిన విషయాలన్నీ సాతాను గాడికి తెలుసు. అందు చేతనే అబద్ధ ప్రవక్తల ఖచ్చితత్వం కొంత రహస్యంగానే కనిపిస్తుంది. మానవుల ప్రవర్తనను వాడు కొన్ని వేల నంవత్సరాలు పరిశోధించాడు. మనకు సంబంధించిన అన్ని విషయాలను గమనించడానికి సహకరించే దూతలూ దయ్యాలూ అధిక నంఖ్యలో వాడికి ఉన్నారు. అయినప్పటికీ, వాడికున్న జ్ఞానమంతా ఉపయోగించినా వాడు భవిష్యత్తును ఖచ్చితంగా చూడలేదు. కొన్నిసార్లు మాత్రం వాడు ఊహించింది నిజమౌతుంది.28

దానికి భిన్నంగా, మనసులో పుట్టే సహజమైన జ్ఞానం, ఆధునిక మత మర్మాల ద్వారా సత్య ప్రవచనమెన్నడూ మనస్సులోనికి రాదు, అది ఊహల వలన వివేచించబడదు. “ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడినవారై దేవుని మూలముగా పలికిరి (2 పేతురు 1:20-21). దైవ ప్రత్యక్షతను తమ స్వీయ అనుభవాలతో, ఊహలతో, జ్ఞానంతో సమానం చేసేవారు ఘోరమైన తప్పిదం చేస్తున్నారు. అబద్ధ ప్రవచనాలు చేస్తున్న వారిని “తాను దేవుని పక్షంగా మాట్లాడుతున్నానని” చెప్పడానికి అనుమతిస్తున్న క్యారిస్‌ మాటిక్‌ ఉద్యమం సమస్యను మరింత పెద్దది చేస్తుంది. వీలైనంత సులభంగా స్పష్టంగా చెప్పాలంటే, ప్రవచనం యెడల ఈ వైఖరి అతి దారుణమైన దుర్బోధ ఎందుకంటే దేవుని మూలంగా కలగనిదాన్ని ఆయనకు ఇది ఆపాదిస్తోంది.

లోపాలతో కూడిన ప్రవచనాలు యథార్థమైనవని వాదిస్తూ, క్యారిస్‌మాటిక్స్‌ సాతానుగాడి దాడికీ వంచనలకూ ద్వారం తెరిచారు. తద్వారా వారి ఉద్యమాన్ని సెవెంత్‌డే ఎడ్వెంటిస్ట్‌లు, మార్మన్లు, యెహోవా సాక్షులు వంటి తప్పు బోధల జాబితాలో చేరుస్తున్నారు. క్రైస్తవేతర దుర్బోధకూ, తప్పు మతానికీ అసత్య ప్రవచనం అతి స్పష్టమైన గురుతులలో ఒకటి. సెవెంత్‌డే అడ్వెండిస్ట్‌ స్థాపకులైన విలయమ్‌ మిల్లర్‌, ఎలెన్‌జి వైట్‌లు యేసు 1843వ సంవత్సరంలో తిరిగి వస్తారని తప్పుగా ప్రవచించారు. ఆ ప్రవచనం విఫలమైనప్పుడు, 1844వ సంవత్సరానికి వారు ఆ తేదీని మార్చేసారు. మరొకసారి వారి లెక్కలు తప్పని నిరూపితమైనప్పుడు, వారి తేదీ తప్పుకాదు గానీ ఆ తేదీకి ముడిపట్టిన సంఘటన తప్పై ఉండవచ్చని వారు వాదించారు. పాప పరిహారానికి సంబంధించిన రెండవ కార్యాన్ని ప్రారంభించడానికి క్రీస్తు తన పరలోక ఆవరణలో 1844వ సంవత్సరంలో ప్రవేశించాడనే కొత్త సిద్ధాంతాన్ని వారు ఆవిష్కరించారు (హెబ్రీ 9:12 లాంటి ఎన్నో ఇతర నూతన నిబంధన వాక్య భాగాలకు ఇది విరుద్ధమైనది).

మార్మన్‌ స్థాపకుడు జోసెఫ్‌ స్మిత్‌. 1891 సంవత్సరానికి ముందే యేసు తిరిగి వస్తాడని అతడు ప్రవచించాడు. అమెరికా అంతరంగిక యుద్ధం (సివిల్‌ వార్‌) లో అన్ని దేశాలు పాల్గొంటాయనీ, మిస్సురీ అనే రాష్ట్రంలో ఒక దేవాలయం నిర్మించబడుతుందనీ, 1839వ సంవత్సరం వసంతకాలంలో మార్మన్‌ అపోస్తలుడు డేవిడ్‌ డబ్ల్యూ పాటన్  విదేశీ పరిచర్యకు వెళ్తాడనేవి స్మిత్‌ చేసిన తప్పుడు ప్రవచనాలలో ఉన్నాయి (ఎందుకంటే మిస్సురీలో దేవాలయం ఎన్నడూ నిర్మించబడలేదు. 1888 అక్టోబర్‌ 255 తేదీన పాటన్‌ను తుపాకీతో కాల్చి చంపారు. కనుక 1889లో అతడు ఏమీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది).

తమ వంద సంవత్సరాల చరిత్ర అంతటిలో కావలికోట సమాజపు వారు (యెహోవా సాక్షులు) క్రీస్తు రాకడ గురించి పలుమార్లు తప్పుగా ప్రవచించారు. మొదటిగా ఆయన రాకడ 1914లో వస్తుందనీ తరువాత 1915, 1925, 1935, 1951, 1975, 1986, 2000 సంవత్సరాలలో అది జరగవచ్చని ప్రవచించారు. 1914 సంవత్సరంలో తొలిసారి ప్రవచనం చెప్పబడిన 120 సంవత్సరాల తర్వాత అనగా 2033లోనే ప్రపంచ అంతమని యెహోవా సాక్షులు ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు. నోవహు ఓడను 120 సంవత్సరాలు నిర్మించిన రీతిగా, మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన 120 సంవత్సరాలకు దేవుని తీర్పు ఈ భూమి పైకి వస్తుందని కావలికోట సమాజపు వారు (యెహోవా సాక్షులు) నమ్ముతున్నారు.

అటువంటి ప్రవచనాల్లో ఉన్న వెర్రితనాన్ని చూసి మనం నవ్వుతాము. ఆ దుర్ఫోధల సమూహాలకు వ్యతిరేకంగా ఆ ఘోరమైన తప్పులను మనం ఖచ్చితంగా ఉపయోగించాలి. క్యారిస్‌మాటిక్‌ వారి ప్రవచనాల్లో ఉన్న హాస్యాస్పదమైన తప్పులకూ, ఆ తప్పుడు ప్రవచనాలకూ భేదం ఏదైనా ఉందా? అని మనం అడగాలి. బయటి వారి ఆలోచన దృష్ట్యా, పెద్ద వ్యత్యాసమేమీ లేదు. తప్పుడు ప్రవచనాలు దుర్బోధ సమూహాల దుర్మార్గతను చూపడానికి ఉపయోగించబడితే, ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ప్రవచనం విషయంలో కూడా అదే సత్యమౌతుంది. తప్పులను బయట పెట్టడం ప్రేమలేకపోవడం కాదు. ద్వితీ 18వ అధ్యాయం స్థాపించిన ప్రమాణం వైపుకు మనల్ని అది తిరిగి తీసుకువెళ్తుంది కనుక అది వాక్యానుసారంగా ఉండడమౌతుంది.

సత్యమైన ప్రవచనం నూటికి నూరు శాతం యధార్ధతను డిమాండ్‌ చేస్తుంది. దేవునినుంచి వచ్చిన నూతన ప్రత్యక్షతను కొత్త నిబంధన ప్రవక్తలు సంఘానికి ప్రకటించినప్పుడు, వారికి కూడా అదే ప్రమాణాన్ని ఉపయోగించారు. ఖచ్చితంగా చెప్పాలంటే, నమ్మకమైన ప్రసంగ బోధనల ద్వారా ప్రవచన వాక్యం నేటికీ ప్రకటించబడి బయలుపరచబడుతోంది (2పేతురు 1:19) దైవ ప్రత్యక్షతను వినమని బైబిల్‌లో ప్రవక్తలు ఏ విధంగా ప్రజలను హెచ్చరించి ప్రోత్సహించేవారో అదే విధంగా (బోధించే) వరం గల బోధకులు సంఘ చరిత్ర మొదలుకుని నేటివరకు వారి సంఘ సభ్యులను ప్రభువు యొక్క వాక్యాన్ని వినమని భారంతో ప్రోత్సహిస్తూనే ఉన్నారు. బైబిల్‌లో ప్రవక్తలు దేవుని ఆత్మనుంచి నేరుగా నూతన ప్రత్యక్షతను పొందేవాళ్ళు, నేటి ప్రసంగీకుడు దేవుని ఆత్మ తాను ప్రేరేపించి బయలుపరిచిన వాక్యాన్ని మాత్రమే ప్రకటించడానికి పిలువబడ్డాడు. ఇదొక్కటే ప్రధానమైన వ్యత్యాసం (2తిమోతి 4:2). కనుక “ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు...” అని ఎవరైనా యధార్థంగా పలికితే, ఆ మాటల తర్వాత వచ్చే మాటలు నేరుగా వాక్యభాగం నుంచే రావాలి. దానికి వేరుగా ఉన్నదేదీ ప్రవచనం కాదు, కాని కేవలం దేవదూషణతో కూడిన అహంకారమే.

నూతన ప్రత్యక్షతను పొందడం పైనే క్యారిస్‌మాటిక్స్‌ ముఖ్యంగా దృష్టి పెట్టడం వారికి ప్రవచనంపై ఉన్న అభిప్రాయాన్ని అత్యంత ప్రమాదకరంగా చేసేసింది. కొత్త నిబంధన కాలంలో జీవిస్తున్న ప్రవక్తల ద్వారా నూతన ప్రత్యక్షతను అనుగ్రహించడం కేవలం సంఘ ప్రారంభ కాలానికి మాత్రమే ఉద్దేశించబడింది అనే విషయంలో బైబిల్‌ చాలా స్పష్టంగా ఉంది. “అపాస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపైనే సంఘం కట్టబడిందని” పౌలు ఎఫెసీ 2:20లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ వచనంలో పౌలు ప్రస్తావించిన ప్రవక్తలు కొత్త నిబంధనకు చెందిన ప్రవక్తలు. ఎఫెసీ 3:5, 4:11లో  కొత్త నిబంధన ప్రవక్తలే వర్ణించబడ్డారనే వాస్తవం దానిని ధృవీకరిస్తోంది. లోపంతో, అవినీతితో నిండిన ప్రవచనాలను ప్రకటిస్తూ దేవుడు నిజానికి మాట్లాడనప్పుడు ఆయన దగ్గర నుంచి ప్రత్యక్షత వచ్చిందని దేవునికి ఆయన వాక్యానికి తాము కలిగించిన అవమానం ఎలాంటిదో గుర్తించడంలో ముఖ్యంగా క్యారిస్‌మాటిక్స్‌ అతి ఘోరంగా విఫలమౌతున్నారు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట ఎల్లప్పుడూ పరిపూర్ణమైనది, సత్యమైనది, లోపరహితమైనది. ఎందుకంటే దేవుడు అబద్ధమాడలేడు. కనుక ఆయన నామంలో అబద్ధాలను పలికేవారు తమ్మును తామే దేవుని తీర్పుకు గురిచేసుకుంటున్నారు.

సత్యమే క్రైస్తవ్యానికి ప్రాణాధారం. కనుక అబద్ధ ప్రవచనం (దాన్ని అనుసరించి వచ్చే తప్పుడు సిద్ధాంతం) సంఘ పవిత్రతకు పొంచి ఉన్న ఒకే ఒక తీవ్రమైన ప్రమాదాన్ని సూచిస్తుంది. అబద్ధ ప్రవక్తలూ తప్పుడు బోధకులూ సంఘంలోనికి చొరబడడానికి కాపలా లేని ప్రవేశమార్గాన్నొక దాన్ని క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా వారి సొంత ఊహలను బట్టి వచ్చిన తప్పును విస్తరింపచేస్తున్న వారిని సాదరంగా తమ సమాజంలోనికి ఆహ్వానించి, వారి పాపాన్ని స్థిరపరుస్తూ, ఈ ఉద్యమం వారికోసం పూల బాటను ఏర్పరిచింది. అయితే క్యారిస్‌మాటిక్‌ ఉద్యమ ప్రవక్తలు సత్యమైన ప్రవక్తలు కారు. మరి వారెవరు?

ఆ ప్రశ్నకు సమాధానం ఈ అధ్యాయపు మొదటి మాటలను గుర్తుచేస్తున్నది. పేతురు 2వ పత్రిక  యూదా పత్రికల ప్రకారం వారు నీళ్లులేని బావులు, నిష్పలమైన వృక్షాలు, ప్రచండమైన అలలు, మార్గం తప్పి తిరుగు చుక్కలు, వివేక శూన్యములగు మృగాలు, భయంకరమైన మాలిన్యాలు, వాంతిని తినే కుక్కలు, బురదను ప్రేమించే పందులు, క్రూరమైన తోడేళ్లు.

పరిశుద్ధాత్మ ప్రత్యక్షత వలన కలిగిన మాటలని చెబుతూ తన దగ్గరకు వచ్చిన వారితో సుప్రసిద్ధ ప్రసంగీకుడు ఛార్లెస్‌ స్పర్జన్  ఈ విధంగా చెప్పవలసి వచ్చింది.

“నీ తలంపులలోని వ్యర్థమైన భావాలను ఎన్నటికీ పరిశుద్ధాత్మునికి ఆపాదించకుండా జాగ్రత్తపడు. తమకు నానా విధాలైన ప్రత్యక్షతలు కలిగాయని చెప్పే వారు దేవుని ఆత్మను ఘోరంగా అవమానించడం నేను చూసాను. వాళ్ళు వెర్రివారు. గత కొద్ది సంవత్సరాలుగా వేషధారుల వెర్రి ప్రత్యక్షతల మూలంగా నేను పీడించబడని వారం ఒక్కటీ లేదు. వాక్యంలో  లేని సందేశాలతో నా దగ్గరకు రావడమంటే కొందరు పిచ్చోళ్లకు చాలా ఇష్టం. వారి వెర్రి సందేశాల్లో ఒక దాన్ని కూడా నేను అంగీకరించనని ఒకసారి చెప్పేస్తే వారి శ్రమ కొంత తగ్గించినవాడనౌతాను .... వరలోకమే నీకు కొన్ని నంగతులను బయలుపరుస్తుందని ఎన్నడూ కల కనకు. లేదంటే తమ తీవ్రమైన వెర్రిచేష్టలను వరిశుద్దాత్మునికి ఆపాదించ తెగించే ఆ మూర్ఖుల్లా నీవు ఉంటావు. వ్యర్ధమైన సంగతులను పలకడానికి నీ నాలుక దురదవెడుతున్నట్లు నీవు భావిస్తే దాన్ని అపవాదికి ఆపాదించు, పరిశుద్ధాత్మకు కాదు. మనలో ఎవరికైనా పరిశుద్ధాత్మ బయలుపరచాలనుకుంది అంతా ఇప్పటికే దేవుని వాక్యంలో ఉంది. ఆయన ఎన్నటికీ బైబిల్ కి  దేనినీ చేర్చడు. నానా విధములైన ప్రత్యక్షతలు కలిగాయని చెబుతున్న వ్యక్తులకు నిద్రపోయి, జ్ఞానంతో నిద్రలేవమని చెప్పండి. వారు ఈ సలహాను  అనునరించి, తమ అజ్ఞానాన్ని పరిశుద్ధాత్మ ముందు పెట్టి ఆయనను ఇక ఎన్నటికీ అవమానించకుండా ఉండాలని నేను కోరుతున్నాను.29

స్పర్జన్ మాటలు కటువుగా అనిపించవచ్చు కానీ, అటువంటి అహంకారాన్ని తీవ్రంగా నిందిస్తున్న లేఖనాల మాటలను అవి  పోలి ఉన్నాయి. యిర్మీయా 23 అధ్యాయంలో అబద్ధ ప్రవచనం గురించి అదే విధమైన హెచ్చరికలున్నాయి. క్యారిస్‌మాటిక్‌ సంఘాల్లో ఉన్న విశ్వాసులు శ్రద్ధగా ఈ మాటలను వినాలి. యిర్మీయా 3:16-32లో ఇలా ఉంది.

"సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు... వారు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు.... నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు వరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరిన వారైన యెడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు, దుష్‌ క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టునట్లు వారిని త్రిప్పి యుందురు. కల కంటిని, కల కంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని యున్నాను. ఇక ఎప్పటి వరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు వారు...  కాబట్టి  ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు, స్వేఛ్చగా నాలుకల నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధముల చేతను, మాయా ప్రగల్భత  చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై  యున్నాను, ఇదే యెహోవా వాక్కు.  నేను వారిని పంపలేదు. వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏ మాత్రమును ప్రయోజన కారులు కాదు, ఇదే యెహోవా వాక్కు"

                                                       7. వక్రీకరించబడిన భాషలు

జుయనిట బైనం తన్ను తానే ప్రవక్తిగా  ప్రకటించుకున్న పెంతెకోస్తు టి.వి. సువార్తికురాలు. 2011లో తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో కొన్ని అర్థరహితమైన అక్షరాలను పొందుపరచి ప్రధాన వార్తల్లో నిలిచింది. ఆ అక్షరాలు ఈ విధంగా ఉన్నాయి,

"CHCNCFURRIRUNGIGNGNGNVGGGNCG", "RFSCN GUGHURGVHKTGHDKUNHSTNSVHGN" and  "NDHDIUBGUGTRUCGNRTUGTIGRTIGRGBNRDRGNGGINRIC"

చాలా సందర్భాల్లో సోషల్‌ మీడియా సైట్‌లో ఇలాంటి అర్థరహిత అక్షరాలను అస్తవ్యస్తమైన ఆలోచనతోనో (కంప్యూటర్‌) కీబోర్డు సరిగ్గా పనిచేయకపోవడం వలన రాసినవిగానో పరిగణించి ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకోరు. అయితే క్యారిస్‌మాటిక్స్‌ కు మాత్రం, బైనం రాసిన అర్థరహిత ఆక్షరాలు చాలా ఉన్నతమైనవి. “టెలి ఇవాంజలిస్ట్‌ జుయనిట బైనం రైజెస్ బ్రోస్‌ విత్‌ టంగ్స్‌ ప్రేయర్‌ ఆన్‌ ఫేస్‌బుక్‌” అనే అంశంలో "క్రిస్టియన్‌ పోస్ట్‌" అనే పత్రికా శీర్షిక ఆమె అక్షరాల ప్రాధాన్యతను గ్రహించింది.

భాషలు మాట్లాడడం అనే పెంతెకోస్తు ప్రక్రియ పద ఉచ్చరణకు సంబంధించినదైనా, ఈ సందర్భంలో మాత్రం అది అక్షర రూపాన్ని దాల్చింది. క్యారిస్‌మాటిక్స్‌ నేడు మాట్లాడుతున్న భాషలకు బైనం  ఫేస్‌బుక్‌లో రాసిన అర్ధరహితమైన అక్షరాలు చక్కటి ఉదాహరణగా ఉన్నాయి. ప్రోస్పారిటి సువార్తపైనే క్యారిస్‌మాటిక్స్‌ అత్యాసక్తిని కనపరుస్తునప్పటికీ, భాషలు మాట్లాడడం అనే ప్రక్రియ కూడా ఈ ఉద్యమంలో ఒక ముఖ్యాంశంగా ఉన్నది. "పరలోక భాష, దేవదూతల భాషలు, వ్యక్తిగతమైన ప్రార్థన భాషా" అని క్యారిస్‌మాటిక్స్‌ ఈ భాషలను పేర్కొన్నప్పటికీ, ఇవి పూర్తిగా అర్థంలేని పిచ్చి మాటలేనని వారు కూడా ఒప్పుకుంటున్నారు.

“ఆ మరుసటి దినం నా గదిలో ప్రార్థిస్తుండగా, నా అంతరంగంలో నుంచి ఒక పరలోక భాష ఉబికివస్తున్నట్లు నేను భావించాను. నేను నోరు తెరచి, “ఇలియ స్కిరిడస్ టొలాడో స్కన్‌టమ” అని పలికాను. నేను చెబుతున్నదేమిటో నాకు తెలియదు. అవి అర్థ రహితమైన మాటలుగానే నాకు అనిపించాయి. కానీ నేను భాషల్లో ప్రార్థించినప్పుడు, దేవునికి సమీపంగా ఉన్నట్లు భావించానని” కరిష్మా పత్రికా సంపాదకుడు జె. లీ. గ్రాడీ భాషల్లో తాను తొలిసారి మాట్లాడిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ రాశాడు.

డెన్నిస్‌ బెన్నెట్  యొక్క వ్యక్తిగత క్యారిస్‌మాటిక్‌ అనుభవాలే 1960-70 మధ్య కాలంలో క్యారిస్‌మాటిక్‌ రెన్యువల్‌ ఉద్యమారంభానికి కారణం. “ఒక భాష ఏ రకమైన శబ్దాలను కలిగి ఉంటుందో మీకెన్నటికీ తెలియదు. నాకొక స్నేహితుడున్నాడు. అతడు “రబ్‌-ఎ-డబ్‌డబ్‌” అని భాషల్లో మాట్లాడి గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడని” భాషలు మాట్లాడడం గురించి బెన్నెట్  వరించాడు.  “ప్రపంచంలో నేడు లక్షలాదిమంది భాషల్లో మాట్లాడుతున్నారు. ఈ కారణాన్ని బట్టి జాయస్‌ మేయర్‌ భాషలలో మాట్లాడే ప్రక్రియను సమర్థించింది. ప్రజలు అర్ధరహితమైన భాషలను కల్పించి మాట్లాడుతున్నది కేవలం తాము భాషల్లో మాట్లాడుతున్నామని భావించడానికి మాత్రం కాదని” ఆమె తర్వాత చెప్పింది. భాషల్లో మాట్లాడడాన్ని సమర్థిస్తున్నానని భావిస్తూనే "భాషలను కల్పిస్తున్నారనీ, అవి అర్థరహితమైనవనీ” చెప్పి భాషల నిజ స్వరూపాన్ని జాయస్‌ మేయర్‌ బట్టబయలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.

భాషలు మాట్లాడడం అనే ప్రక్రియను అధ్యయనం చేసిన భాషా నిపుణులు ఆ వివరణతో ఏకీభవిస్తున్నారు. టొరంటో విశ్వ విద్యాలయంలో భాషానిపుణుడు ప్రొఫెసర్‌ విలియమ్‌ సమరిన్‌ వివిధ దేశాల్లో ఉన్న క్యారిస్‌మాటిక్‌ సంఘాలను దర్శించి అనేక సంవత్సరాలు తానే స్వయంగా పరిశోధన చేసిన తర్వాత ఈ విధంగా రాశాడు.

“భాషలు మాట్లాడే ప్రక్రియలో మర్మమేమీ లేదు. టేపు రికార్డులో వాటిని రికార్డు చేసి విశ్లేషించడం సులభమే. అన్ని సందర్భా లలోను అవి ఒకే రీతిగా ఉంటాయి. మాట్లాడే వ్యక్తి తనకు తెలిసిన శబ్దాలలో నుంచి కొన్నింటిని తీసుకుని, ఒక భాషలో ఏ విధమైన పదాలు, వాక్యాలు ఉంటాయో ఆ విధంగా వాటిని ఒక నిజమైన భాషలా అమరుస్తాడు. మాట్లాడే వ్యక్తి తనకు తెలియకుండానే అది ఒక భాషలా ఉండాలని కోరతాడు. అది కూడా ఒక భాషే అదే సమయంలో దానికి అర్ధం లేదు కాబట్టి అది భాష కాదు. భాషలని చెప్పబడుతున్న వాటిని అధ్యయనం చేసినప్పుడు, అందులో ఏ ఒక్కటి నిజమైన భాషను పోలినది లేదని తేలింది. భాషలు మాట్లాడడం అనేది అద్భుతం కాదు. ఆ చమత్కారాన్ని కనిపెట్టి ఎటువంటి నిర్భంధం లేకుండా తన భావాలను వ్యక్తపరిచే ఏ వ్యక్తెనా భాషలు మాట్లాడవచ్చు. “భాషాశాస్త్రం అంతటినీ భాషలు మాట్లాడడం అనే ప్రక్రియకు అన్వయిస్తే, ఇది ఖచ్చితంగా మోసపూరితమైన భాష అని తేలిపోతుందని” సమరిన్‌ మరొక చోట చెప్పాడు.

“ఇది మానవ భాష కాదు కనుక మానవ భాషవలె దీనికి అర్థం చెప్పడం, అధ్యయనం చేయడం సాధ్యం కాదు” అని ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ సైకాలజీ అండ్ రెలిజియన్‌ క్లుప్తంగా వివరించింది. ఈ భాష అసలు భాషే కాదని నిస్సందేహంగా అంగీకరిస్తుంది “ద కేంట్రిడ్జ్ కంపేనియన్‌ టు సైన్స్‌ అండ్‌ రెలిజియన్‌”

అందుచేత ప్రస్తుత భాషల వరాన్ని తెలిసిన ఏదోక  విదేశీ భాషతో ముడిపెట్టే ప్రయత్నాలను క్యారిస్‌మాటిక్‌ రచయితలు విరమించుకున్నారు. 60 కోట్ల  క్రైస్తవులు వారికి నచ్చిన భాషను మాట్లాడుకునే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారని వారు చెబుతున్నారు. భాషలు మాట్లాడడం అనేది ప్రతి వ్యక్తికి విశిష్టమైనదే. తరచూ ఒకే ఆక్షరాన్ని అనాలోచనగా పదేపదే ఉచ్చరించడం ద్వారా ఇది మొదలౌతుంది. “నీవు పరిశుద్ధాత్మను అడిగితే, ఒక అక్షరం నీలో ఉబికినట్టు, నీ మనసులో మెదిలినట్టు అనిపిస్తుంది. నీవు విశ్వాసంతో మాట్లాడితే, ఆనకట్ట గేట్లను తెరచినప్పుడు నీరు ప్రవహించిన రీతిగానే భాష బయటకు ప్రవహిస్తుంది. దారపు రీలునుంచి దారాన్ని లాగినప్పుడు ఎలాగైతే దారం బయటకు వస్తుందో ఆ విధంగా భాష అనేది నీ కడుపులో నుంచి నీ నాలుక మీడకు రావాలని” ఒక పాస్టర్‌గారు ఉపదేశిస్తున్నారు.10

“నీవు చెబుతున్నదేమిటో నీకు అర్ధం కాదు. ఎందుకంటే ఇది మనస్సుతో కాదు ఆత్మతో చేసే ప్రార్థనని” మరొక క్యారిస్‌మాటిక్‌ రచయిత చెబుతున్నాడు. “స్కిజోప్రెనీయా రోగం ఉన్నవారు భాష మాట్లాడితే అది పిచ్చివాగుడు. కానీ అదే భాషను క్యారిస్‌మాటిక్‌ క్రైస్తవులు పవిత్రమైనదిగా, ఒక వరంగా భావిస్తున్నారని” “స్కెఫ్టిక్స్‌ డిక్షనరీయే” ఈ ప్రక్రియను బాహాటంగా అపహాస్యం చేస్తోంది.12

ఈ భాషలు మాట్లాడే ప్రక్రియ ఉన్నతమైన విశ్వాస మూలంగా కలిగేది కనుక సాధారణ భాషకు ఉండే నియమాలు దీనికి వర్తించవు. ఈ ఆలోచననే క్యారిస్‌మాటిక్స్‌ తమకు అనుకూలాంశంగా మలుచుకున్నారు. “భాషల్లో మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ వశంలో ఉన్నామనడానికి సూచన. వర్ణింపశక్యంకాని విషయాలను వివరించడానికి ఈ భాష వ్యాకరణానికీ, ఆర్థానికీ చెందిన నియమాలన్నింటినీ ఉపేక్షిస్తుందని” ఒక రచయిత రాశాడు. ఈ అభిప్రాయం 20వ  శతాబ్దపు ఆరంభంలో తొలి పెంతెకోస్తు సభ్యుల అభిప్రాయానికి చాలా భిన్నంగా ఉంది. ఛార్లెస్‌ ఫాక్స్ పర్హామ్, ఆగ్నెస్‌ ఓజ్‌మన్‌ తొలి పెంతెకోస్తు సభ్యులు ఖచ్చితమైన విదేశీ భాషల్లో మాట్లాడే అద్భుత శక్తిని తాము పొందినట్లు భావించారని మనం 2వ అధ్యాయంలో చూసాము.

“ప్రపంచ సౌవార్తీకరణ నిమిత్తం సంఘానికి దేవుడు భాషల వరాన్ని అనుగ్రహించాడని తొలి పెంతెకోస్తు సభ్యులు నమ్మారు. పరిశుద్ధాత్ముడు తమకు స్థానిక ప్రజల భాషను అద్భుతరీతిలో అనుగ్రహిస్తాడని పూర్తిగా నమ్మి, వారిలో అనేకులు విదేశాలకు సువార్తికులుగా వెళ్ళారు. అనేక సంవత్సరాలు శ్రమపడి భాష నేర్చుకోవడానికి ఇష్టపడని మిషనరీలకు ఈ తొలి అనుభవం, తద్వారా ఎదుర్కొన్న వైఫల్యం వారికి తీవ్ర నిరాశను మిగిల్చిందని” కెన్నెత్‌ యల్‌. నొలాన్‌ వివరించాడు. తమ భాషలు గుర్తింపు పొందిన ఏ భాషకూ చెందినవి కావని స్పష్టమైనప్పుడు, తమ వైఫల్యాన్ని సమర్థించుకోవడానికి వారికి రెండు మార్గాలు కనిపించాయి. మొదటిది వారి భాషలు నిజమైన భాషలే అని వారు వాదించాలి. అయితే దానికి సరైన ఆధారాలు లేకపోగా ప్రతికూలమైన ఆధారమే బలంగా ఉంది. కనుక వీరు రెండవ మార్గాన్ని ఎంచుకున్నారు. తమ అనుభవాలను సమర్థించే విధంగా భాషలు మాట్లాడే ప్రక్రియను వారు పునర్మించుకున్నారు. క్యారిస్‌ మాటిక్‌ వారు వాగే దానికి వారిచ్చే నిర్వచనం అంగీకారయోగ్యమైనది కాదు.

                                         పెంతెకోస్తు వారి ప్రస్తుత భాషల వరం
                                       వాక్యంలో ఉన్న భాషల వరం ఒక్కటేనా?

భాషల్లో మాట్లాడిన అనుభవం తాము దేవునికి దగ్గరగా ఉన్నామనే అనుభూతిని కలిగిస్తోందని క్యారిస్‌మాటిక్స్‌ వాదిస్తున్నారు. “దేవుడు హృదయపూర్వకంగా కోరేదానినంతటిని నేను గ్రహించినట్టు భావించాను. నేను చెబుతున్నదేమిటో నాకు నిజంగా తెలియదు. కానీ దేవుడు కోరిందే నేను మాట్లాడుతున్నానని మాత్రం నాకు తెలుసు. ఇదొక వెలిగింపు. నీకు సమీపంగా ఉండి నీ ద్వారా ఆయన మాట్లాడుతున్నాడని నీవు భావించవచ్చు” అనేది క్యారిస్‌మాటిక్‌ సంఘ సభ్యుని సహజమైన సాక్ష్యం.15

“కొద్దిమంది వ్యక్తుల అంతరంగంలో ఆహ్లాదాన్ని కలిగించే అస్పష్టమైన భావాలు కలుగుతాయి. నాకైతే నిజానికి ఒళ్ళు జలదరిస్తుందని” ఒక సంఘ సభ్యురాలు భాషలు మాట్లాడే తన అనుభవాన్ని వివరించింది.16 తెలివిని కోల్పోయి మైమరిపించే స్థాయికి తీసుకెళ్ళే భావాలు ఆధ్యాత్మిక లోకంలో అనుకూలమైనవి, అద్భుతమైనవి ఏవో జరుగుతున్నాయనడానికి ఆధారాలుగా కనిపిస్తున్నాయి. “నీకు మంచి అనుభూతిని కలిగించే దేన్నైనా నీవు తప్పనిసరిగా చేయాలి” అనేది పనికిరాని వాదననీ, ప్రమాదకరమైన అభ్యాసమనీ గుర్తించాలి. లేఖనాన్ని చదివి గ్రహించే వారెవరికైనా అది సులభమే!

ప్రస్తుతం భాషలు మాట్లాడే ప్రక్రియ మోసకరమైనది, ప్రమాదకరమైనది. నిజమైన ఆధ్యాత్మికతను తలపించే నకిలీ భక్తిని మాత్రమే ఇది అందిస్తున్నది. దేవుడు తమ ద్వారా మాట్లాడుతున్నాడని క్యారిస్‌మాటిక్స్‌ వాదించవచ్చు. కానీ నేటి భాషలు మాట్లాడే ప్రక్రియ పరిశుద్ధాత్మ నుంచి కలిగిందనడానికీ, పరిశుద్ధతను కలుగచేసే ఆయన కార్యానికి సహకరిస్తుందనడానికీ ఆధారమేమీ లేదు. దానికి భిన్నంగా ఈ ఆచరణను మానుకోవడానికి మాత్రం చాలా మంచి కారణాలున్నాయి. నిజానికి ఆఫ్రికాలోని ఊడు వైద్యులు మొదలుకుని బౌద్దమత సన్యాసుల, మార్మన్‌ మత స్థాపకుల వరకూ ఎన్నో తప్పుడు బోధల్లోనూ, తప్పుడు మతాల్లోనూ ఇది ఒక సామాన్యమైన ఆచరణగా ఉంది.17

చరిత్రలో మొంటనిస్ట్‌లు, జాస్సెనిస్ట్‌లు, ఇర్వింగైటులు అనే  తప్పుడు మతాల సభ్యులు మాత్రమే అర్థంలేని వెర్రి భాషను మాట్లాడేవారు. కానీ అదే వ్యర్థమైన ఆధ్యాత్మిక అనుభవం నేటి క్యారిస్‌మాటిక్‌ వారి ఆచరణను పోలియున్నది. చరిత్ర తెలియని నేటి ఇవాంజెలికల్‌ సభ్యులు ఎంతో మంది అపొస్తలుల సంఘ కాలం నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న ఒక ప్రధాన అభ్యాసంగా ఈ భాషలు మాట్లాడే ప్రక్రియను చూస్తున్నారు. కానీ అది నిజం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం భాషల గురించి డబ్ల్యు. ఎ. క్రిస్‌వెల్‌ చెప్పినది నేటికీ సత్యమే.

అపొస్తలుల దినాల తర్వాత సంఘం సుదీర్ఘ చరిత్రలో ఈ భాషలు మాట్లాడే ప్రక్రియ ఎక్కడ దర్శనమిచ్చినా అది తప్పుడు బోధగానే పరిగణించబడింది. ఈ భాషలు మాట్లాడే ప్రక్రియ అధికశాతం 19, 20 వ శతాబ్దాలకే పరిమితమైంది. కానీ అది ఎక్కడ ఏ విధంగా కనిపించినప్పటికీ  చారిత్రాత్మక క్రైస్తవ సంఘాలు దాన్ని అంగీకరించలేదు. ఈ ప్రక్రియలో  ఉన్న సిద్ధాంతపరమైన లోపాన్ని బట్టి ఉద్రేకపూరిత వెర్రిని బట్టి సంఘాలు ఈ అభ్యాసాన్ని తృణీకరించాయి.18

నేడు క్యారిస్‌మాటిక్స్‌ అభ్యాసం చేస్తున్న భాషలు మాట్లాడే ప్రక్రియ కొత్త నిబంధనలో వర్ణించబడిన భాషల వరానికి సంబంధించిన ఏ ప్రమాణాన్నీ అందుకోలేని ఒక నకిలీ ఆచరణ అని మనం క్లుప్తంగా చెప్పవచ్చు. నేడు భాషలు మాట్లాడేవారు వాక్యానుసారమైన వరాన్ని పొందుకున్నామని వాదిస్తున్నారు. కానీ వారు మాట్లాడే అర్థరహితమైన మాటలకు నిజమైన భాషకుండే లక్షణాలు లేవనే వాస్తవాన్ని వారు గుర్తించాలి. ప్రస్తుత భాషలు అర్ధరహితమైన శబ్దాలను అజ్ఞానంగా ఉపయోగిస్తూ నేర్చుకున్నవి, అయితే ఒక వ్యక్తి ఇంతకు ముందెన్నడూ నేర్చుకోని విదేశీ భాషలలో ఖచ్చితంగా మాట్లాడగలిగే అద్భుత సామర్థ్యం గురించి కొత్త నిబంధనలోని భాషల వరం మాట్లాడుతున్నది. తమ అభ్యాసాన్ని వివరించడానికి క్యారిస్‌మాటిక్స్‌ బైబిల్‌ పదజాలాన్ని ఉపయోగించినప్పటికీ, అలాంటి కల్పిత ప్రవర్తనకు వాక్యానుసారమైన వరానికి ఏ సంబంధమూ లేదనేది వాస్తవం. నార్మ్‌ గేయ్‌స్లర్‌ ఈ విధంగా చెబుతున్నారు,

“రక్షణ పొందని ప్రజలకు సైతం భాషల అనుభవాలు ఉంటాయని (ఆధునిక) భాషల వరాన్ని నమ్మేవారు ఒప్పుకుంటున్నారు. ఆందులో పెద్ద అద్భుతం ఏమీ లేదు. ఒక వ్యక్తికి ఎన్నడూ వరిచయం లేని ఒక నిజమైన భాషలో సంపూర్ణ అర్థాన్నిచ్చే మాటలు పలికి  ప్రసంగాలు చేయడమనేది మాత్రం చాలా విశిష్టతతో కూడినటువంటి విషయం” 19

కొత్త నిబంధన తెలియజేసే భాషల వరం అదే. ఈ ప్రమాణాలను అందుకోని దేనినైనా వాక్యానుసారమైన భాషల వరంగా పరిగణించకూడదు. వాక్యానుసారమైన భాషల వరం యొక్క ఖచ్చితమైన స్వభావాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? మరి ముఖ్యంగా “మనుష్యుల భాషలు మరియు దేవదూతల భాషలు” అని 1కొరింథీ 13:1లో చెప్పబడిన మాట, భాషల వరమనేది వేరే లోకానికి సంబంధించిన, దేవదూతల భాషను మాట్లాడగలిగే సామర్థ్యాన్ని సూచిస్తోందా? ప్రస్తుత భాషల్లో ఒక నిజమైన భాషకు ఉండవలసిన లక్షణాలు ఎందుకు లేవనే ప్రశ్నకు ఈ వచనమే సమాధానమని క్యారిస్‌మాటిక్స్‌ నమ్ముతున్నారు.

అపొ.కా. 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన జరిగిన వృత్తాంతంలో మాత్రమే భాషల వరాన్ని గురించిన స్పష్టమైన వర్ణన కనిపిస్తుంది. భాషల వరం అనగా నిజమైన అర్థవంతమైన, అనువదించదగిన భాషల్లో మాట్లాడే సహజాతీతమైన సామర్థ్యమని స్పష్టంగా ఈ వాక్యభాగం గుర్తిస్తుంది. మేడగదిలో సమకూడిన 120 మంది యేసుక్రీస్తు అనుచరుల గురించి అపొ.కా. 2:4 చాలా స్పష్టతను ఇస్తుంది. “అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడ సాగిరి”  శిష్యులు నిజమైన భాషలలోనే మాట్లాడారనే విషయం, గ్లోస్స  (భాషలు) అనే గ్రీకు పదం ద్వారా, (గ్లోస్స అనే ఆ పదం మానవ భాషలకు సంబంధించినది)20.  6,7 వచనాలలో లూకా ఉపయోగించిన పదం “స్వభాషలు” అనే పదం ద్వారా, 9-11 వచనాలలో అపొస్తలులు మాట్లాడిన అన్య భాషల జాబితా ద్వారా కూడా ధృవీకరించబడుతోంది. పెంతెకోస్తు వేడుక సందర్భంగా ఆరమిక్‌ భాష కాకుండా వేరే భాషలు మాట్లాడుతూ పెరిగిన అనేకమంది యూదు యాత్రికులు ప్రపంచ నలుమూలలనుంచి విందు కోసం యెరూషలేముకు ప్రయాణించారు (వ. 5). విద్యాహీనులైన కొందరు గలిలయులు హఠాత్తుగా అనేక భాషల్లో ధారాళంగా మాట్లాడగలిగారనేది ఎవ్వరూ తృణీకరించలేని అద్భుతం. కనుక ఆ భాషలను ప్రత్యక్షంగా విన్న యాత్రికులు మిక్కిలి ఆశ్చర్యానికి గురయ్యారు (7,8 వచనాలు).

ఆ విదేశీ భాషలను మాట్లాడలేని స్థానిక యూదులు కూడా ఆ జన సమూహంలో ఉన్నారు. కనుక శిష్యులు చెబుతున్నది వారు అర్థం చేసుకోలేకపోయారు. అయోమయానికి గురై సరైన వివరణ కోసం ఆలోచిస్తూ, శిష్యులు మద్యం సేవించారని సందేహించి వారిని ఎగతాళి చేసి నిందించారు (వ.18). పెంతెకోస్తు దినాన జరిగిన దానికి త్రాగుడు కారణం కాదని పేతురు వివరించాడు (14,15 వచనాలు). “వారు నేర్చుకొనని భాషను వారు మాట్లాడారనే అద్భుతం గొప్పదని” ఆది సంఘ పితరుల్లో ఒకరు తెలియజేసాడు.

ఆదికాండం 11వ అధ్యాయంలో బాబెలు గోపురం దగ్గర మానవ జాతిపై తీర్పుగా ప్రభువు ప్రజల భాషలను తారుమారు చేసాడు. దానికి భిన్నంగా పెంతెకోస్తు దినాన ప్రపంచమంతటిలో ఉన్న ప్రతి దేశపు వారికి యేసుక్రీస్తు సువార్తతో కూడిన దేవుని అద్భుతమైన మాటలు తీసుకుని వెళ్ళడం ద్వారా బాబెలు గోపుర శాపం అద్భుతమైన రీతిలో తొలిగించబడింది. అపొస్తలుల కాలం తర్వాత శతాబ్దాలలో జీవించిన ఆది క్రైస్తవులు ఖచ్చితంగా ఇదే విధంగా భాషల అద్భుతాన్ని అర్ధం చేసుకున్నారు. కనుక ప్రాచీన కాలంలో ప్రముఖ ప్రసంగీకుడైన జాన్‌ క్రిసాస్టమ్  ఈ విధంగా వివరించాడు.

“(బాబెలు) గోపురాన్ని నిర్మించే సమయంలో ఒక భాష వివిధ భాషలుగా విభజింపబడింది. (పెంతెకోస్తు దినాన) అనేక భాషలు ఒకే మనిషిలో చేరాయి. పరిశుద్ధాత్మ  తనకు తెలియచేస్తుండగా ఒకే  వ్యక్తి పర్షియా రోమా భారతదేశం మొదలగు దేశ భాషల్లో ప్రసంగించేవాడు. ఆ వరాన్ని భాషల వరమని పిలిచేవారు ఎందుకంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా వివిధ భాషలు మాట్లాడగలిగేవాడు. 22

అదే విధంగా అగస్టీన్‌ కొన్ని విషయాలు చెబుతున్నాడు:

“తొలి దినాల్లో పరిశుద్ధాత్ముడు విశ్వాసుల పైకి దిగి వచ్చాడు. కనుక ఆత్మ తమకు దయచేస్తుండగా తాము నేర్చుకొనని భాషల్లో వారు మాట్లాడారు. ఆ సమయానికి ఈ సూచనలు తగినవి. భూమి అంతటా ఉన్న భాషలన్నింటికీ దేవుని సువార్త చేరాలి కనుక పరిశుద్ధాత్ముడు ఆ విధంగా అన్ని భాషలలో కనపరచుకోవడం అవనరమైంది. అది ఆ సమయంలో ఇవ్వబడిన సూచన, కానీ ఇప్పుడు అది గతించిపోయింది"

20వ శతాబ్దపు ప్రారంభంలో మార్గం తప్పిపోయిన తొలి పెంతెకోస్తు సభ్యులు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉన్న సూచనను అసలైన భాషలుగా అర్ధం చేసుకున్నారన్నది చాలా స్పష్టం. అద్భుతమైన రీతిలో, అప్పటికప్పుడు విదేశీ భాషల్లో మాట్లాడే సామర్థ్యాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడనే వాస్తవాన్ని కేవలం బైబిల్‌ని చదవడం ద్వారా వారు తెలుసుకున్నారు. సువార్త పనిని జరిగించడానికి అదే విధమైన సామర్థ్యాన్ని తాము కూడా పొందుకున్నామని వారు భావించారు. పెంతెకోస్తు దినానికి అనుకూలంగా వారి ఉద్యమానికి పేరు పెట్టుకున్నారు. ఆధునిక భాషలు నిజమైన భాషలు కాదనే విషయం స్పష్టమైన తరువాత మాత్రమే, వారి వాక్యవిరుద్ధమైన ఆవిష్కరణను సమర్థించుకోవడానికి క్యారిస్‌మాటిక్స్‌ లేఖనాలకు కొత్త అర్థాలను కల్పించనారంభించారు.

లూకా రాసిన అపొస్తలుల సంఘ చరిత్రలో, అపో.కా. 10:46, 19:6 లో మరలా భాషలు మాట్లాడడం గురించి ప్రస్తావించాడు. పెంతెకోస్తు దినాన మాట్లాడబడిన భాషలకూ ఆ తర్వాత మాట్లాడబడిన భాషలకూ వ్యత్యాసమున్నదని వాదిస్తూ క్యారిస్‌మాటిక్స్‌ తమ ప్రస్తుత అభ్యాసానికి వాక్యాధారం కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వాక్యం ఆ వివరణను అనుమతించదు. మేడపై గదిలో ఉన్న వారు భాషల్లో (గ్లోస్స) మాట్లాడారని ("మాట్లాడుట" అనే పదం "లాలేఒ"అనే గ్రీకు పదం నుంచి వచ్చింది) అపొ.కా. 2:4 లో  లూకా రాశాడు. కొర్నేలీ, అనుభవాన్నీ బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యుల అనుభవాన్నీ వివరించడానికి అపొ.కా 10:46 19:6 లో కూడా ఖచ్చితంగా అవే పదాలను లూకా ఉపయోగించాడు. అంతేకాదు అపొ.కా. 10 లో సూచనకూ, అపొ.కా. 2 అధ్యాయంలో ఉన్న సూచనకూ మధ్య వ్యత్యాసమున్నదని చెప్పే ప్రతి అభిప్రాయం అపో.కా. 11:15-17 లో పేతురు తన సాక్ష్యంతో వలన ప్రత్యక్షంగా తప్పని నిరూపించాడు. పెంతెకోస్తు దినాన శిష్యులపైకి వచ్చిన విధంగానే పరిశుద్ధాత్ముడు అన్యుల పైకి కూడా దిగి వచ్చాడని ఇక్కడ అపొస్తలుడు చాలా స్పష్టంగా తెలియచేసాడు.

అర్థరహితమైన భాషను సమర్థించుకోవడానికి క్యారిస్‌మాటిక్‌ సభ్యులు అనేకులు 1కొరింథీ పత్రికను ఆశ్రయిస్తారు. 1కొరింథీ 12-14 అధ్యాయాలలో వర్ణించబడిన వరానికీ, అపొస్తలుల కార్యాల గ్రంథంలో వర్ణించబడిన వరానికీ చాలా స్పష్టమైన వ్యత్యాసముందని వారు వాదిస్తారు. కాని ఈ వాదాన్ని వాక్యం సమర్ధించట్లేదు. పదాలను నామమాత్రంగా అధ్యయనం చేసినప్పటికీ ఆ విషయం చాలా స్పష్టంగా నిరూపించబడుతుంది. ఎందుకంటే ఆ అద్భుత వరాన్ని వర్ణించడానికి ఈ రెండు వాక్యభాగాలు ఒకే రకమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నాయి. "లాలేఒ" (మాట్లాడుట), గ్లోస్స (భాషలు) అనే పదాలను అపొస్తలుల కార్యాల్లో వివిధ సందర్భాల్లో లూకా ఉపయోగించాడు (అపో.కా. 2:4,11, 10:46, 19:6). 1 కోరింథీ 12 నుంచి 14 అధ్యాయాల్లో అవే పదాలను 13 సార్లు పౌలు ఉపయోగించాడు (1కొరింథీ 12:30, 13:1, 14:2-5 (2 సార్లు), 6,13,18,19,21,27,39).

లూకా పౌలుకు తోటి ప్రయాణికుడు, అత్యంత సన్నిహితుడు, పౌలుకున్న అపోస్తలత్వపు అధికారం కింద అతడు రాస్తున్నాడనే విషయాలను మనం అలోచించినప్పుడు, ఈ భాషాపరమైన సమాంతరాలు విశేషమైన ప్రాముఖ్యతను కలుగజేస్తున్నాయి. పౌలు కొరింథీయులకు తన మొదటి పత్రిక రాసిన దాదాపు 5 సంవత్సరాల తర్వాత అనగా క్రీ.శ 60వ సంవత్సరంలో లూకా అపొస్తలుల కార్యాల గ్రంథం రాశాడు. కనుక భాషల వరం గురించిన వారి అయోమయాన్ని లూకా బాగా గ్రహించే ఉంటాడు. మరికొంత అయోమయాన్ని కలుగచేయాలనుకోలేదు లూకా. పెంతెకోస్తు దినాన జరిగిన సంఘటన పౌలు తన పత్రికలో వర్ణించిన నిజమైన వరం లాంటిది కాకపోతే పౌలు ఉపయోగించిన అదే ఖచ్చితమైన పదజాలాన్ని అపొస్తలుల కార్యాల్లో లూకా ఉపయోగించి ఉండేవాడు కాదు.

1కొరింథీ 12:10లో “నానావిధ భాషలు” అని పౌలు చెప్పిన మాట కొన్ని నిజమైన భాషలు, కొన్ని అర్థరహితమైన భాషలు అని చెప్పినట్లు కాదు. “నానావిధమైన” అనే పదం “గేనాస్‌” అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఈ పదానికి ఒక కుటుంబం, సమూహం, జాతి, దేశం అనే అర్థాలున్నాయి. ఈ పదం భాషా కుటుంబాలకూ, సమూహాలకూ చెందినదని భాషా పండితులు తరచూ చెబుతారు. ఖచ్చితంగా అదే పౌలు యొక్క ఉద్దేశం. ప్రపంచంలో అనేక భాషల కుటుంబాలున్నాయి. ఈ వరం కొందరి విశ్వాసులను వాటిలో కొన్ని భాషలను మాట్లాడే విధంగా బలపరిచాయి. మాట్లాడబడిన భాషలు కనీసం 16 వివిధ ప్రాంతాలనుంచి వచ్చినవని వివరించి అపొ.కా. 2:9-11 లో ఆ భావాన్ని లూకా నొక్కి చెప్పాడు.

అపొస్తలుల కార్యాలు, 1కొరింథీ 12-14 అధ్యాయాల్లో ఉన్న మరికొన్ని పోలికలను పరిశీలిద్దాం. రెండు సందర్భాల్లోనూ, ఆ వరాన్ని అనుగ్రహించేది పరిశుద్ధాత్ముడే (అపో.కా. 2:4,18, 10:44-46, 19:6, 1 కొరింథీ 12:1,7,11), రెండు సందర్భాలలోను, ఈ వరం కేవలం అపోస్తలులకు మాత్రమే పరిమితం కాలేదు కాని సంఘంలో ఉండే సామాన్య ప్రజలకు కూడా ఇవ్వబడింది (అపో.కా. 1:15, 10:46, 19:6; 1 కొరింధీ 12:30, 14:18), రెండు సందర్భాల్లో మాట్లాడే వరంగా ఈ వరం వర్ణించబడింది (అపో.కా 2:4,9-11, 1కొరింథీ 12:30, 14:2-5) రెండు సందర్భాలలోనూ, చెప్పబడిన సందేశం అనువదించదగినది కనుక ఆ భాషను ముందే ఎరిగియున్నవారు (పెంతెకోస్తు రోజున జరిగినట్లు అపొ.కా. 2:9-11) గాని లేదా అర్థం చెప్పగలిగే వరం ఉన్న వ్యక్తి గాని గ్రహించేవారు (1కొరింథీ 12:10, 14:5,13). 

రెండు సందర్భాలలోనూ, అవిశ్వాసులైన యూదులకు ఈ వరం ఒక అద్భుత సూచనగా పనిచేసింది (అపొ.కా. 2:5,12,14,19, 1కోరింథీ 14:21,22, యెషయా 28:11,12) రెండు సందర్భాలు, భాషల వరానికీ, ప్రవచన వరానికీ చాలా దగ్గర సంబంధమున్నట్లు తెలియచేస్తున్నాయి (అపొ.కా. 2:16-18; 19:6, 1 కోరింథీ 14). రెండు సందర్భాలలోనూ, ఆ భాషలను అర్ధం చేసుకోలేని అవిశ్వాసులు ఎగతాళి చేసి, తిరస్కరించారు (అపో.కా. 2:13, 1కోరింథీ 14:23) ఇన్ని పోలికలను చూసిన తర్వాత కూడా అపొ.కా. 2వ అధ్యాయంలో జరిగినదానికీ 1కొరింథీ పత్రికలో వర్ణించబడిన దానికీ వ్యత్యాసముందని చెప్పడం వ్యాకరణపరంగా అసంభవం, బాధ్యతారాహిత్యం ఔతుంది. పెంతెకోస్తు దినాన భాషల వరంలో నిజమైన విదేశీ భాషలున్నాయి. కనుక కొరింథులో ఉన్న విశ్వాసుల విషయంలోనూ అదే సత్యం.

రెండు అదనపు ఆలోచనలు ఈ గ్రహింపును సంపూర్ణమైన ఖచ్చితత్వంతో నిరూపిస్తాయి. సంఘంలో మాట్లాడబడే ఏ ఏ భాషకైనా, అర్థం చెప్పగలిగే వరం కలిగిన వ్యక్తి దానికి అర్థం చెప్పాలని ఆజ్ఞాపించి (1కొరింథీ 12:10, 14:27) ఆ వరం అర్థం చేసుకోగలిగిన భాషలను కలిగిఉందని పౌలు తెలియచేసాడు. “అర్థం చెప్పడం” అనే పదం “హెర్మెన్యూఓ” అనే పదం నుంచి వచ్చింది (ఈ పదం నుంచే మనకు హెర్మెన్యూటిక్స్‌ అనే పదం వచ్చింది). ఈ పదానికి “అనువాదం” లేదా “అర్థాన్ని ఖచ్చితంగా బయలు పరచడం” అనే అర్థాలున్నాయి. అనువదించాలంటే ఒక భాషలో ఉన్న పదాలకు మరొక భాషలో సరైన అర్థాలు ఉండవలసిన అవసరత ఉంది. కనుక అర్థరహితమైన పిచ్చి కూతలను అనువదించడం అసాధ్యమనే విషయం స్పష్టం.

1కొరింథీ 12-14 అధ్యాయాల్లో ఉన్న వరం నిజమైన భాషలను కలిగి ఉండకపోతే, అర్థం చెప్పాలని పౌలు పదే పదే పట్టుబట్టడం అర్థం లేనిది. 1కొరింథీ పత్రికలో “భాషలకు” అర్థం చెప్పబడుతుందని పౌలు వర్ణించాడు. కనుక ఆ భాష అర్థవంతమైనదని తెలుస్తోంది. లేదంటే “అర్ధం చెప్పబడడం కాదు” “అర్ధం కల్పించబడాలి”. భాషలు యధార్థమైన భాషలనీ, అర్థం చెప్పే ప్రత్యేక వరంతో అందరి ప్రయోజనం నిమిత్తం అది అనువదించబడుతుందనే వాస్తవాన్ని ఈ అర్థం చెప్పే వరం బలపరుస్తుందని (1కోరింథీ 12:30, 14:5,13) నార్మ్‌ గేయ్‌స్లర్‌ వివరిస్తున్నాడు.

రెండవదిగా, 1కొరింథీ 14:10,11 వచనాలలో పౌలు చాలా స్పష్టంగా మానవ భాషల గురించి ప్రస్తావించాడు. “లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై యుండదు. మాటల అర్థము నాకు తెలియకుండిన యెడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును” అని అతడు రాశాడు. గుంపులో ఉన్న ప్రజలు అపొస్తలులు మాట్లాడుతున్న వివిధ భాషలను అర్థం చేసుకున్నారు కనుక పెంతెకోస్తు దినాన అర్థం చేప్పేవాని అవసరత లేకపోయింది (అపొ.కా. 2:5-11) కానీ కొరింథీ సంఘంలో ఆ భాషలు అర్ధం కాకపోయేసరికి అనువదించే వాడు అవసరమయ్యాడు. లేకపోతే ఆ సందేశాన్ని సంఘస్తులు అర్థం  చేసుకోలేకపోయేవారు. అందువలన వారికి క్షేమాభివృద్ధి కలిగేది కాదు. యెషయా 28:11,12లో  అన్యభాషలూ, పరజనుల పెదవులూ అష్హూరు దేశపు భాషను తెలియచేస్తున్నాయి. ఈ వచనాలను గురించిన అపొస్తలుని ప్రస్తావన, పౌలు మనసులో విదేశీ మానవ భాషలు ఉన్నాయనే విషయాన్ని స్థిరపరుస్తోంది (1కొరింథీ 14:21),

వాక్యాధారాన్ని పరిశీలించినప్పుడు, 1కొరింథీ 12-14 అధ్యాయాల్లో వర్ణించబడిన భాషల వరం అపొస్తలుల కార్యాలు 2 వ అధ్యాయంలో శిష్యులు తమకు తెలియని విదేశీ భాషల్లో సంభాషించడానికి ఆత్మ అనుగ్రహించిన సామర్థ్యం ఖచ్చితంగా ఒక్కటేననే విషయంలో సందేహమే లేదు. దీనికి భిన్నమైన ఏ వివరణనూ లేఖనం అనుమతించదు.

“1కొరింథీ 14వ అధ్యాయంలో వర్ణించబడిన విదేశీ భాషలు అర్ధం ఔతాయి. అదే సమయంలో హేతుతుబద్ధం కాని పిచ్చి వాగుడు అర్ధం కాదు (ఉదాహరణ;  వ22) వినేవాడికి అర్ధం కానిది విదేశీ భాషయైనా లేదా అర్ధరహితమైన మాటలైనా వాని దృష్టికి పెద్ద తేదా ఏమీ ఉండదు. కనుక వాక్యభాగం తెలియచేసేది అర్ధరహితమైన భాషేనని చెప్పడానికి ఎంత అవకాశముందో, ఆ భాష వినే వానికి తెలియని భాషేనని చెప్పడానికి కూడా అంతే అవకాశముంది. "గ్లోస్స" అనే పదానికున్న సహజమైన అర్థాన్నుంచి తొలిగిపోయి, ఏ మాత్రం బలపరచబడని అర్ధాన్ని కల్పించడానికి ఈ వాక్యభాగంలో  కారణాలు ఏవి లేవని” థామన్‌ ఎడ్గర్‌ చెబుతున్నాడు.”25

ఈ సారాంశం భాషలు మాట్లాడే ప్రక్రియను గురించి క్యారిస్‌మాటిక్స్‌ కలిగిఉన్న అభిప్రాయానికి చావు దెబ్బలాంటిది. కొత్త నిబంధనలో ఉన్న సత్యమైన వరానికీ, దీనికీ అస్సలు పోలికలే లేవు. కానీ ఇది పురాతన గ్రీకు-రోమా దేశపు గూఢ మతాల్లో ఉన్న పిచ్చివాగుణ్ణి పోలియుంది. లేఖనం అటువంటి అన్య మతాచారాలను నిందిస్తుంది (మత్తయి 6:7).26

                       భాషల వరం గురించిన సాధారణ ప్రశ్నలకు సమాధానాలు

ఈ అద్భుత సామర్థ్యం గురించి సరైన నిర్వచనాన్ని చేపట్టిన ప్రతి బైబిల్‌ విద్యార్థీ వాక్యం బోధించే దానికి ఖచ్చితమైన అర్థాన్ని చెప్పగలుగుతాడు. ఇప్పుడు భాషల వరం గురించి మాట్లాడినప్పుడు ఎదురయ్యే 10 సాధారణ ప్రశ్నలను మనం పరిశీలిద్దాం.

1) భాషల వరం యొక్క ఉద్దేశం ఏమిటి?

రక్షణ గురించి దేవుడు కలిగి ఉన్న సార్వభౌమ ప్రణాళికను నెరవేర్చడంలో మొదటి ఉద్దేశం, మొదటి శతాబ్దపు సంఘ విషయంలో రెండవ ఉద్దేశం ఈ వరం ద్వారా నెరవేరాయి. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దిశగా పరిస్థితులు మారుతున్న విషయాన్ని ఇది ప్రాథమికంగా తెలియజేస్తోంది. అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులకు ఇది సూచనగా పనిచేసింది. 1కొరింథీ 14:21,22లో ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు స్పష్టం చేసాడు. అపో.కా.2:5-21లో పెంతెకోస్తును గురించిన తన వివరణలో లూకా సైతం అదే ఉద్దేశాన్ని తిరిగి చెప్పాడు. అదే విధంగా మార్కు సువార్త ముగింపు క్రీస్తుని శిష్యులు వారికి తెలియని భాషల్లో మాట్లాడతారని వివరిస్తోంది (16:17) వారిని సత్య సువార్తకు రాయబారులుగా ఋజువు చేసిన సూచనల్లో ఇది కూడా ఒకటి (వ20).27 అయితే తోటి విశ్వాసుల క్షేమాభివృద్ధి అనే రెండవ ఉద్దేశాన్ని ఇది సంఘం యెడల కలిగి ఉంది. 1 కోరింథీ 12:7-10లో  క్రీస్తు శరీరంలో ఆత్మ సంబంధమైన వరాలన్నీ ఇతరుల క్షేమాభివృద్ధి నిమిత్తమే పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడని పౌలు స్పష్టంగా తెలియజేశాడు (1పేతురు 4:10,11ని పోల్చి చూడండి). సంఘానికి వెలుపల ఈ భాషల వరాన్ని ఉపయోగించినప్పుడు, అది (పెంతెకోస్తు దినాన సూచించినట్లు) సువార్తను ధృవీకరించే ఒక సూచనగా ఉండేది. కానీ సంఘంలో (కోరింథీ లో క్రైస్తవులకు పౌలు ఉపదేశాన్ని బట్టి) ఇతర విశ్వాసుల క్షేమాభివృద్ధి నిమిత్తమై ఇది ఉపయోగించబడేది. కొత్త నిబంధన పూర్తి కాకముందు, దేవుడు తన సత్యాన్ని తన సంఘానికి బయలుపరచి దాన్ని ధృవీకరించడానికి ప్రవచనం మాదిరిగానే అద్భుతరీతిలో ఉపయోగించుకున్న వరం ఇది.

ఒకరియెడల ఒకరు ప్రేమను కనపరచడమనేది అన్ని వేళలా ప్రధానమైన విషయం. ఆత్మ వరాలన్నీ అదే ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఉద్దేశించబడినవి (1కొరింథీ 13:1-7, రోమా 12:3-21), కనుక ఏ వరాన్నైనా  స్వప్రయోజనం నిమిత్తం ఉపయోగించడం మ్రోగెడు కంచు లేదా గణగణలాడు తాళమువలె (సంఘానికి) ఏ విధమైన ప్రయోజనాన్నీ చేకూర్చదు (1 కొరింథీ 13:1) “ప్రేమ తన స్వప్రయోజనమును విచారించుకొనదు” (1కొరింథీ 13:5) అని పౌలు కొరింథీయులకు వివరించాడు. “ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయచూచుకొనవలెను” అని అదే పత్రిక ముందుభాగంలో చెప్పాడు (10:24).

భాషలతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగచేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును” అని 1 కోరింథీ 14:4లో పౌలు రాసినప్పుడు, “స్వంత క్షేమాభివృద్ధే” ముఖ్య ఆశయంగా పెట్టుకోండని అతడు ప్రకటించట్లేదు. ఒకవేళ అదే నిజమైతే, అది ఇంతకు ముందు అధ్యాయంలో అతడు రాసిన ప్రతి విషయాన్నీ బలహీనపరిచి ఉండేది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే భాషలో చెప్పబడిన ప్రవచనం (ఎవరూ అర్ధం చేసుకోలేని) విదేశీ భాషల్లో మాట్లాడడం కంటే శ్రేష్టమైనదనే విషయాన్ని అతడు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే భాషలకు అర్థాన్ని చెప్పవలసిన అవసరత ఉంది. ఏ వరాన్నైనా మొత్తం సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగిస్తేనే సరిగా ఉపయోగించినట్టు ఔతుంది. కనుక (1 కోరింథీ 14:12,26) అందరూ గ్రహించే విధంగా విదేశీ భాషలకు అర్థం చెప్పవలసిన ఆవశ్యకత ఉంది (1 కొరింథీ 14:6-11,27)

ఆధ్యాత్మికంగా శ్రేష్టులుగా కనబడాలనే పాపేచ్చను నెరవేర్చుకోవడానికి కలుషితమైన, స్వార్ధపూరిత ఉద్దేశాలతో కొరింథీయులు భాషల వరాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో కూడా అవే ఉద్దేశాలు తరచూ ప్రబలడం వలన ఇతరుల క్షేమాభివృద్ధి అనే విషయం సాధ్యం కావట్లేదు.

2) విశ్వాసులందరూ భాషల్లో మాట్లాడ బద్ధులై ఉండేవారా?

క్రైస్తవులందరూ భాషల్లో మాట్లాడాలని చాలా మంది క్యారిస్‌మాటిక్స్‌ ముఖ్యంగా పెంతెకోస్తు వారిచే ప్రభావితమైనవారు వాదిస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి తొలి ఋజువూ అందరూ నమ్మేదీ భాషల్లో మాట్లాడే ప్రక్రియేనని వారు వాదిస్తారు. కానీ 1కొరింథీ 12వ అధ్యాయంలో పౌలు చేసిన బోధ పెంతెకోస్తు వారి పద్ధతిని ఛిన్నాభిన్నం చేసేస్తుంది. విశ్వాసులందరూ రక్షణ సమయంలో ఆత్మ బాప్తిస్మాన్ని పొదుకున్నారని 13వ వచనంలో పౌలు స్పష్టం చేసాడు (తీతు 3:5 ని పోల్చి చూడండి). కానీ వారిలో ప్రతి వానికి ఈ భాషల వరం అనుగ్రహించబడలేదని తరువాత వచనాలలో అతడు వివరించాడు. కనుక పొరపడే అవకాశమే లేదు. కొరింథులో ఉన్న విశ్వాసులందరూ ఆత్మ బాప్తిస్మం పొందితే (వ13), వారిలో అందరూ భాషల్లో మాట్లాడలేకపోతే (వ28-30), పెంతెకోస్తు వారు వాదించినట్టు ఈ వరం ఆత్మ బాప్తిస్మానికి ఉన్న ఒకే ఒక సూచన కాదు. భిన్నమైన వ్యక్తులకు భిన్నమైన వరాలను పరిశుద్ధాత్ముడే తన సార్వభౌమ చిత్తాన్ని బట్టి అనుగ్రహిస్తాడని 12వ అధ్యాయంలో ముందుగా చెప్పిన పౌలు బోధతో ఇది ఏకీభవిస్తుంది.

అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా, ఒకనికి ఆత్మమూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క  ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్ధము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. (7-11 వచనాలు).

విదేశీ భాషలు మాట్లాడే అద్భుత సామర్థ్యం నేటికీ అందుబాటులో ఉందని తలంచినా, అది ప్రతి క్రైస్తవునికి అనుగ్రహించబడేది కాదు. ప్రతి విశ్వాసి భాషల వరాన్ని అపేక్షించాలని క్యారిస్‌మాటిక్స్‌ పోరాడుతూ, 1 కోరింథీ 12:14-31లో పౌలు చేసిన వాదన యొక్క విషయాన్నంతటినీ వారు విస్మరిస్తూ, నకిలీ భాషలను సృష్టిస్తున్నారు.

“మీరందరూ భాషల్లో మాట్లాడాలని నేను కోరుచున్నాను” అని 1కొరింథీ 14:5లో పౌలు చెప్పిన మాటను, క్రైస్తవులందరూ భాషలు మాట్లాడటాన్ని ఖచ్చితంగా సాధన చేయాలనే తమ వాదనకు ఆధారమైన వాక్యంగా క్యారిస్‌మాటిక్స్‌ తరచూ చూపుతున్నారు. అలా చూపుతూ, అపొస్తలుడు ఒక వాస్తవమైన విషయాన్ని కాకుండా ఒక ఊహాతీతమైన సంగతిని చెబుతున్నాడనే విషయాన్ని గుర్తించడంలో విఫలమౌతున్నారు. ఈ సందర్భంలో భాషల వరం కంటే ప్రవచన వరం శ్రేష్టమైనదనే విషయాన్ని మరలా దృఢపరుస్తున్నాడు. పౌలు 5వ వచనం మిగిలిన భాగం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. “మీరందరూ భాషలతో మాటలాడవలెనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనే గాని వాని కంటే ప్రవచించువాడే శ్రేష్టుడు” కనుక పౌలు యొక్క కోరిక వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉన్నప్పటికీ కోరింథీయులందరూ బాషల్లో  మాటలాడవలెనని కాకుండా వారందరూ ప్రవచించాలన్నది అతని యొక్క నిజమైన కోరిక. ఎందుకంటే సంఘంలో ఇతర సభ్యులకు క్షేమాభివృద్ధిని కలుగజేయడానికి ప్రవచనాలకు అర్ధం చెప్పవలసిన అవసరం లేదు.

వ్యాకరణాన్ని బట్టి చూస్తే, పౌలు చెప్పిన మాట అతడు ఇంతకు మునుపు 1 కొరింథీ 7:7లో చెప్పిన మాట దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. తన అవివాహిత స్థితిని ప్రస్తావిస్తూ, “పురుషులందరూ నావలె యుండవలెనని నేను కోరుచున్నాను” అని అపొస్తలుడు రాశాడు. ఈ వచనంలో పురుషులందరూ బ్రహ్మచారులుగా ఉండాలని పౌలు ఆజ్ఞాపించటం లేదనేది స్పష్టంగా ఉంది. ఎందుకనగా ఒంటరిగా ఉండే వరం ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడలేదనే విషయం అతనికి తెలుసు. 1కొరింథీ 14:5లో భాషల వరానికి సంబంధించిన విషయంలోనూ అదే నిజం ఔతుంది.

3) భాషల వరాన్ని అపేక్షించమని పౌలు కొరింథీయులకు ఆజ్ఞాపించాడా?

“కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి” అనే 1కొరింథీ 12:31 వచనం ఒక ఆజ్ఞలా అనువదించబడింది. కానీ ఆ అనువాద ఎంపిక ఒక తీవ్రమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఆత్మవరాలన్నీ పరిశుద్ధాత్మ స్వతంత్ర ఆధిక్యతను బట్టి అనుగ్రహించబడితే (1కొరింథీ 12:7,18,28) క్రీస్తు శరీర క్షేమాభివృద్ధికి ప్రతి వరం అవసరమైతే (14-27 వచనాలు), వారు పొందుకోని వరాలను ఆపేక్షించాలని దేవుడు విశ్వాసులను ఎందుకు ఆజ్ఞాపిస్తాడు? అటువంటి ఏ అభిప్రాయమైనా 1కొరింథీ 12వ అధ్యాయంలో, ప్రతి విశ్వాసి తనకు అనుగ్రహించబడిన విశిష్టమైన వరాన్ని సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమైన పరిచర్యలో తృప్తికరంగా వినియోగిస్తూ, ఆ వరాన్ని బట్టి కృతజ్ఞత కలిగినవాడై ఉండాలని పౌలు చేసిన వాదనంతటికీ విరుద్ధంగా ఉంటుంది.

వాస్తవానికి 1 కోరింథీ 12:31ఆజ్ఞ కాదు. వ్యాకరణాన్ని బట్టి చూస్తే “అపేక్షించుడి” అనే క్రియా పదం ఒక సాధారణమైన మాట (indicative) గా తర్జుమా చేయబడాలి. ఈ సందర్భం ఆ అనువాదాన్ని బలపరిచేదిగా ఉంది. నిజానికి పౌలు చేసిన వాదన క్రమాన్ని చూస్తే ఆజ్ఞ కంటే, ఒక సామాన్యమైన మాటకే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది.28 "ద న్యూ ఇంటర్‌నేషనల్‌ వర్షన్‌" అపొస్తలుని ఉద్దేశాన్ని సరిగా గ్రహించి ఈ వచనాన్ని ఈ కింది విధంగా అనువదించింది: “కానీ మీరు గొప్ప వరాలను ఆశతో అపేక్షిస్తున్నారు”. “మీరు శ్రేష్టమైన వరాల కోసం ఆసక్తిని కనపరుస్తున్న కారణాన్ని బట్టి, మీకు అత్యున్నతమైన మార్గాన్ని చూపిస్తాను” అని సిరియా కొత్త నిబంధన కూడా చెబుతోంది.

ఆకర్షణీయంగా కనబడుతున్న వరాలను తీవ్రంగా అపేక్షిస్తూ పెద్దగా ఆకర్షణ లేని వరాలను వారు విస్మరిస్తున్న కారణాన్ని బట్టి కోరింథీయులను పౌలు గద్దిస్తున్నాడు. వారికి అతిశ్రేష్టమైన మార్గాన్ని అనగా ఇతరుల యెడల వినయంతో కూడిన ప్రేమ మార్గాన్ని చూపాలని అపొస్తలుడు కోరుతున్నాడు. 1కొరింథీ 13 అధ్యాయంలో ప్రేమ యొక్క శ్రేష్టత గురించిన తన చర్చను ప్రారంభించింది ఆ కోరికే.

గర్వంతో, స్వార్ధపూరిత కోరికలచేత ప్రేరేపించబడి డంబంగా, స్పష్టంగా కనిపించే అద్భుతమైన పరిశుద్ధాత్మ వరాలను పొందుకుని వాటినే ప్రదర్శించాలని కొరింథీయులు ఎదురుచూసారు. వారు శరీరానుసారంగా పనిచేస్తుండగా ఆత్మ సంబంధులుగా కనబడాలని కోరుతూ మనుషుల మెప్పును ఆశించారు (పౌలు వారికి ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి చూస్తే, కొరింథు సంఘంలో కొంతమంది గ్రీకు రోమీయుల మార్మిక మతాలలో కనిపించే అర్థంకాని మాటలను అనుకరించడం ప్రారంభించి, నేటి క్యారిస్‌మాటిక్‌ ఉద్యమకారుల వలే  చేస్తున్నట్టు అప్పుడు జరిగి ఉండవచ్చు). పరిశుద్ధాత్ముడే తన సార్వభౌమ చిత్తాన్ని బట్టి కృపా వరాలను ఎంపికచేసి, పంచియిస్తాడని మనకు చెప్పబడిన తర్వాత ఏ ఆత్మ వరాన్నైనా స్వార్థంగా  కోరుకోవడం అనేది ఆ కాలంలోనైనా, నేటికాలంలోనైనా తప్పే. స్వప్రయోజనం నిమిత్తమో, గర్వంతోనో మనకు లేనటువంటి వరాన్ని ప్రత్యేకంగా కోరుకోవడం చాలా పెద్ద తప్పు.

4) “దేవదూతల భాషలు” అంటే ఏంటి?

1కోరింథీ 13:1 లో దేవదూతల భాషల గురించి పౌలు ప్రస్తావించిన మాటను తరచూ క్యారిస్‌మాటిక్స్‌ చూపిస్తుంటారు. క్యారిస్‌మాటిక్స్‌ మాట్లాడే భాషల్లో మనం తరచూ వింటున్న పనికిమాలిన మాటలు మానవ భాషకంటే శ్రేష్టమైనదనీ, అవి దేవదూతల సంభాషణకు చెందిన పరిశుద్ధమైన, పరలోక భాష అనీ వారు వాదిస్తుంటారు.

దేవదూతలకు కలిగే అవమానాన్ని పక్కన పెడితే, 1కొరింథీ 13:1 వచన సందర్భాన్ని పరిశీలిస్తే ఆ భావం కుప్పకూలిపోతుంది. 1కొరింథీ 13 అధ్యాయంలో పౌలు యొక్క అంశం ఆత్మ వరాలను గురించి కాదు గానీ ప్రేమను గురించినదనే విషయాన్ని మొదటిగా గమనించాలి. ఆ అంశాన్ని అతడు ఈ విధంగా పరిచయం చేసాడు: “మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును.” పౌలు ఒక ఊహజనితమైన పరిస్థితిని గురించి మాట్లాడుతున్నాడు (2,3 వచనాల్లో అతడు ఉదాహరించిన సంగతులు ప్రేమ యొక్క విలువను నొక్కి చెప్పడానికి అతిశయోక్తితో కూడిన ఉదాహరణలను భాషను పౌలు ఉపయోగిస్తున్నాడనే విషయాన్ని తెలియచేస్తున్నాయి).30 అతనిలో ప్రేమకు కొదువ లేదు. (అయితే) అతనికి కొదువైయున్నట్లు ఊహించమని అతడు కొరింథీయులను అడుగుతున్నాడు. అదే విధంగా, దేవదూతల భాషలు మాట్లాడే సామర్థ్యం అతనికి ఉందని అతడు వాదించట్లేదు. (అయితే) ఆ విధంగా చేయగలవాడైయుండి, ఇతరుల క్షేమాభివృద్ధిని గురించి శ్రద్ధ, ప్రేమ లేకుండా మాట్లాడిన వ్యక్తియైనట్లు అతడు ఊహిస్తున్నాడు. అతడలాంటి వ్యక్తి అయితే ఉపయోగమేమీ ఉండదు.

క్యారిస్‌మాటిక్స్‌ తరచూ “దేవదూతల భాషలు” అనే పదాలపైన తీక్షణంగా దృష్టి సారిస్తూ పౌలు యొక్క ముఖ్యోద్దేశాన్ని గమనించకపోవడం హాస్యాస్పదం. స్వప్రయోజనం నిమిత్తం ఈ వరాన్ని ఉపయోగించడమనేది ఇతర విశ్వాసుల క్షేమాభివృద్ధి నిమిత్తం ప్రేమకు చిహ్నంగా ఉపయోగించే దాని నిజ ఉద్దేశాన్ని ఉల్లంఘించడమే ఔతుంది. కేవలం ఒకడు భాషల్లో మాట్లాడడం ద్వారా గానీ (1కొరింథీ 14:17) లేదా జ్ఞానరహితమైన వ్యర్థమైన మాటలను వినడం వలన గానీ ఇతరులకు మేలు జరుగదు. కొరింథీయులకు పౌలు ఈ పత్రికలో బోధిస్తున్న ప్రతి విషయాన్ని ఈ ఆచరణ ఉల్లంఘిస్తుంది. దేవదూతల భాషలు అనే పదాలను అక్షరానుసారంగా తీసుకోవాలని ఎవరైనా వాదిస్తే, బైబిల్‌లో దేవదూతలు మాట్లాడిన ప్రతిసారి అర్ధమయ్యే నిజమైన భాషలోనే మాట్లాడారనే విషయం సహకరిస్తుంది. కనుక 1కొరింథీ 13-1లో ఉన్న “దేవదూతల భాషలు” అనే పదాలు ఏ విధంగానూ నేటి “అర్ధంలేని పిచ్చి వాగుడును” సమర్థించడం లేదు.

5) భాషలు నిలిచిపోతాయని పౌలు చెప్పిన మాట సంగతి ఏమిటి?

“భాషలైననూ అవి నిలిచిపోతాయి” అని 1కొరింథీ 13:8లో  పౌలు వివరించాడు. “ఈ వచనంలో ఉపయోగించబడిన "పావో" అనే గ్రీకు క్రియా పదానికి “శాశ్వతంగా నిలిచిపోవడం” అని అర్థం. కనుక భాషల వరం అకస్మాత్తుగా ముగింపుకు వస్తుందని అది తెలియచేస్తోంది. సంఘ చరిత్రలో అద్భుత వరాలు నిలిచిపోయాయని అంగీకరిస్తూనే ఆవి తిరిగి 1901వ సంవత్సరంలో మరలా ఆందుబాటులోనికి వచ్చాయని నమ్మే పెంతెకోస్తు వారికి “పావో” అనే క్రియాపదంలో ఉన్న శాశ్వత తత్వం చాలా పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ సభ్యులు ఏమి చేసినప్పటికీ, అది భాషల వరం మాత్రం కాదనే విషయం ఇప్పటికే నిరూపించబడింది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన వారెన్నడూ నేర్చుకోని విదేశీ భాషలను శిష్యులు ధారాళంగా మాట్లాడగలిగే సహజాతీత  సామర్థ్యానికీ ఈ ప్రస్తుత భాషలకూ అసలు పోలికే లేదని నిరూపించబడింది. అపొస్తలుల కాలం తర్వాత కొత్త నిబంధన వరం నిలిచిపోయింది అది మరలా తిరిగి ఎన్నడూ అందుబాటులోకి రాలేదు.

“పరిపూర్ణమైనది వచ్చినపుడు” అసంపూర్ణమైన జ్ఞానమూ, ప్రవచనాలూ నిలిచి పోతాయని 1కొరింథీ 13:10లో పౌలు చెప్పాడు. మరి “పరిపూర్ణమైనది” అన్నపుడు పౌలు ఉద్దేశం ఏమిటి? "టెలాయాన్" అనే ఆ  గ్రీకు పదానికి “సంపూర్ణం”, “పరిపక్వత,” “పూర్ణమైనది” అనే అర్థాలున్నాయి. వ్యాఖ్యానకర్తలు దాని ఖచ్చితమైన అర్ధం గురించి ఒకరితో ఒకరు విభేదిస్తూ అనేక రకాలైన అర్థాలను చెప్పారు. ఉదాహరణకు ఎఫ్‌. ఎఫ్‌. బ్రూస్‌ “పరిపూర్ణమైనది” ప్రేమేనని చెప్పాడు. అది “సంపూర్ణమైన లేఖన ప్రత్యక్షతను” సూచిస్తోందని బి. బి. వార్‌ఫీల్డ్‌ (యాకోబు 1:25), అది పరిపక్వత గల సంఘాన్ని సూచిస్తోందని రాబర్ట్‌ థామస్‌ వాదిస్తున్నారు (ఎఫెసీ 4:11-13 ). ఆ పదం క్రీస్తు తిరిగి రావడాన్ని సూచిస్తోందని రిచర్డ్‌ గఫిన్‌ చెబుతున్నాడు. అది ప్రతి విశ్వాసి పరలోకపు ప్రవేశాన్ని సూచిస్తోందని థామస్‌ ఎడ్గర్ చెబుతున్నాడు (2 కోరింథీ 5:8) “పరిపూర్ణమైనది” ఏమిటనే దాన్ని గుర్తించడంలో పండితులంతా ఒకరితో ఒకరు విభేదిస్తున్నప్పటికీ, అద్భుత వరాలు నిలిచిపోయాయనే విషయంలో మాత్రం అందరూ ఏకీభవించడం ప్రాముఖ్యమైన విషయం.31

1కొరింధీ 13:10లో “పరిపూర్ణమైనది” అనే పదానికి భిన్న ఆర్థాలున్నప్పటికీ పౌలు ఉపయోగించినప్పుడు “విశ్వాసి ప్రభువు సన్నిధిలో ప్రవేశమే” ఆ పదానికి గల సరియైన భావం. 12వ వచనం ఆఖరిలో విశ్వాసులు క్రీస్తుని ముఖాముఖిగా చూడడం, సంపూర్ణ జ్ఞానాన్ని కలిగియుండడం అని పౌలు చెప్పిన మహిమకు ఇవతల సాధ్యంకాని వర్ణనలు ఈ భావాన్ని సమర్థిస్తున్నాయి.

ఈ అధ్యాయంలో ఆత్మ వరాలు సంఘ చరిత్రలో ఎన్ని శతాబ్దాలు కొనసాగుతాయనే విషయాన్ని చెప్పడం పౌలు ఉద్దేశం కాదని ముఖ్యంగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఆ విషయం కొరింథీయులకు అనవసరం. దానికి భిన్నంగా తన మొదటి శతాబ్దంలోని విశ్వాసులకు సంబంధించిన విషయాన్నే అతడు చెబుతున్నాడు. కొరింథీ విశ్వాసులారా, మీరు పరలోకంలో నిత్యత్వపు మహిమ సంపూర్ణతలోనికి ప్రవేశించినప్పుడు, 32 మీరు ఎంతో ఉన్నతంగా భావించే ఆత్మ వరాల ఆవశ్యకత ఏమీ ఉండదు (ఎందుకంటే ఈ వరాలు ఇచ్చే అసంపూర్ణమైన ప్రత్యక్షత అప్పుడు సంపూర్ణమౌతుంది కనుక). అయితే ప్రేమకు అనంతమైన విలువ ఉంది కనుక ప్రేమను వెదకండి. ఎందుకంటే అన్ని వరాల కన్నా ఇది శ్రేష్టమైనది (వ3). ఈ అంశాన్ని ఈ కింది మాటలతో థామస్‌ ఎడ్గర్‌ వివరిస్తున్నాడు.

“టెలియాన్‌ (పరిపూర్ణం) అనేది ప్రభువుతో ఒక వ్యక్తి సన్నిధిని సూచిస్తుంది కానీ చరిత్రలో ఒక ప్రవచనాన్ని మాత్రం కాదు. వరాలు ఎవ్వడు నిలిచిపోతాయి లేదా ఎన్నాళ్ళు కొనసాగుతాయనే విషయాన్ని ఈ వాక్యభాగం బోధించట్లేదు. వరాలకు భిన్నంగా నిలిచి ఉండే ప్రేమ  స్వభావాన్ని కొరింథీయులకు ఇది గుర్తుచేస్తుంది. ఈ వరాలు వాటి స్వభావాన్ని బట్టి తాత్కాలికమైనవిగా, కేవలం ఈ జీవితకాలానికి మాత్రమే పరిమితమైనవిగా ఉన్నాయి.33 

అద్భుత వరాలు సంఘ చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతాయో చెప్పడానికి 1కోరింథీ 13:10 కాకుండా ఎఫెసీ 2:20 లాంటి వాక్య భాగంలో వెదకాలి. అపొస్తలుల, ప్రవక్తల విధులు కేవలం సంఘ ప్రారంభ కాలానికే పరిమితమైనవని ఎఫెసీ 2:20లో పౌలు తెలియచేసాడు. 34 అయితే మనం కూడా మన పరలోకపు మహిమ కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆత్మవరాల కంటే ప్రేమే శ్రేష్టమైనదనే పౌలు చెప్పిన ప్రధాన నియమం. ఇది నేటి విశ్వాసులకు ఇప్పటికీ వర్తిస్తుంది.

6) భాషల్లో మాట్లాడేవారు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడతారు అని చెప్పినప్పుడు పౌలు ఉద్దేశం ఏమిటి?

అర్థరహితమైన భాషలు మాట్లాడడాన్ని సమర్థించుకోవడానికి 1కొరింథీ 14:2లో ఉన్న ఈ మాటలను కొన్నిసార్లు క్యారిస్‌మాటిక్స్‌ హత్తుకుంటున్నారు. అయితే ఈ వచన సందర్భం ఆ విధమైన అర్థాన్ని బలపరచట్లేదు. మొదటి మూడు వచనాలు ఈ కింది విధంగా ఉన్నాయి: “ప్రేమను వెంటాడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు.”

ఆ వచనాలలో భాషల వరాన్ని పౌలు గొప్ప చేయట్లేదు కానీ ప్రవచన వరం కంటే అది ఎందుకు అల్పమైనదో వివరిస్తున్నాడు.(ప్రతి ఒక్కరు అర్ధం చేసుకునే మాటలుగా ప్రవచనం ఉంటే, ఇతరులు మేలు పొందడానికి విదేశీ భాషల వరానికి అర్థం చెప్పబడాలి. “అతడు మనుష్యులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు” అని చెప్పి ఆ తరువాత భాగంలో “ఎందుకంటే మనుష్యుడెవడును వాటిని గ్రహింపడు” అనడం ద్వారా తన ఉద్దేశాన్ని ఖచ్చితంగా తెలియచేసాడు. భాష అనువదించబడకపోతే, చెప్పబడుతున్న మాటలను కేవలం దేవుడు మాత్రమే అర్థం చేసుకోగలడు.

అటువంటి అభ్యాసాన్ని అభినందించడానికి పౌలు దూరంగా ఉన్నాడని స్పష్టమౌతుంది. క్రీస్తు శరీరంలో ఇతరుల క్షేమాభివృద్ధియే వరాల ఉద్దేశమని అతడు 12వ అధ్యాయంలో చెప్పాడు. అనువదించబడని విదేశీ భాషలు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చలేవు. ఆ కారణాన్ని బట్టి అర్థం చెప్పడంలోని అవసరం గురించి అపొస్తలుడు నొక్కి చెప్పాడు (వ18,27).

7) భాషల్లో ప్రార్ధించడం సంగతి ఏమిటి?

క్షేమాభివృద్ధి నిమిత్తం బహిరంగ ప్రార్థనలో భాషల వరం ఉపయోగించబడేదని 1 కొరింథీ 14:13-17లో  పౌలు ప్రస్తావించాడు. కానీ వ్యక్తిగత ఆరాధనలో, ఏకాంత ప్రార్ధనలలోనూ ఉపయోగించే ఒక ప్రత్యేకమైన పద్ధతిగా భాషల వరాన్ని పునఃనిర్వచించారు క్యారిస్‌మాటిక్స్‌. అయితే నేడు భాషలు మాట్లాడేవారికీ, పౌలు చేసిన వర్ణనకు ఎంత వ్యత్యాసముందో గమనించండి. ఏ రకమైన అర్థరహితపు వాగుడును పౌలు ప్రోత్సహించట్లేదు ఇది మొదటి విషయం. ఎందుకనగా నిజమైన వరం అనువదించదగిన విదేశీ భాషలను కలిగి ఉంటుందనే వాస్తవాన్ని అతడు ఇంతకు మునుపే స్థాపించాడు (వ10,11).

చాలామంది క్యారిస్‌మాటిక్స్‌ చేస్తున్నట్టు మనస్సును దాటవేసే ప్రార్థనలను పౌలు ఎప్పటికీ అభినందించడనేది రెండవది. గతంలోనూ ఇప్పుడు కూడా అది అన్యమతాల ఆచారమే. దురాత్మల సమూహాలతో సంభాషించడానికి మనస్సును దాటిపోయే పద్ధతిగా ఈ అర్థరహిత మాటలు గ్రీకు-రోమా మార్మిక మతాల్లో సాధారణంగా కనిపించేవి. చుట్టుపక్కల ఉండే అన్యుల వలె మతిభ్రమించిన అభ్యాసాలను అనుకరించడానికి ప్రయత్నిస్తున్న కొరింథులో క్రైస్తవులను గద్దిస్తూ ఈ వచనాల్లో పౌలు తన వ్యంగ్య స్వరాన్ని వినిపించాడు. పౌలు ఉపదేశం ప్రకారం, విదేశీ భాషలో ప్రార్థించే ప్రతివాడు మొదటిగా దాని అర్ధం చెప్పే సామర్థ్యం కోసం ప్రార్థించి తద్వారా తాను మాట్లాడే వర్తమానాన్ని
అర్థం చేసుకోవాలి (వ18). లేదంటే ఆ వ్యక్తి యొక్క గ్రహింపు ఫలవంతంగా ఉండడు (వ.14). దీనిని పౌలు స్పష్టంగా వ్యతిరేక భావంతో చూసాడు (కొలస్సీ 3:10, తీతు 3:14) ఎల్లప్పుడు ఆత్మను, మనస్సును ఉపయోగిస్తేనే ఈ వరాన్ని బాగా ఉపయోగించినట్లు. మరైతే దీని సారాంశం ఏమిటి? “ఆత్మతో ప్రార్థన చేతును మరియు మనస్సుతోను ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును మరియు మనస్సుతోనూ పాడుదును” (వ15).

మూడవదిగా, పౌలు ప్రస్తావించిన ప్రార్థన బహిరంగ ప్రార్థన గురించే కానీ రహస్యంగా చేసే ధ్యానం గురించి మాత్రం కాదు. చెప్పబడుతున్న దానిని సంఘంలోని ఇతర సభ్యులు వింటున్నారని 16వ వచనం స్పష్టం చేస్తోంది. కనుక సంఘంలో అనువదించబడవలసిన అవసరం ఉన్న ప్రార్ధనను అతడు ప్రస్తావిస్తున్నాడు. ఆ సందేశాన్ని సంఘం ఆమోదించి, అందున్న విషయాల ద్వారా క్షేమాభివృద్ధి పొందుతుంది. ఇంటి దగ్గర ఒంటరిగా కానీ సంఘ ఆరాధన కార్యక్రమంలో అనేక మంది మధ్య కానీ అర్థరహితమైన వ్యర్థపు మాటలను పదే పదే ఉచ్చరిస్తూ ఉన్న ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ అభ్యాసానికి కొత్త నిబంధనలో అసలు అవకాశమే లేదు.

8) పౌలు ఏకాంత సమయంలో భాషలు మాట్లాడే ప్రక్రియను అభ్యసించాడా?

పౌలే స్వయంగా ఏకాంత ప్రార్థనలో భాషను ఉపయోగించాడని వాదించడానికి క్యారిస్‌మాటిక్స్‌ తరచూ 1కొరింథీ 14:18,19 ను చూపుతారు. “నేను మీ యందరి కంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను. అందుకు దేవుని స్తుతించెదను. అయినను సంఘములో భాషతో పది వేల మాటలు పలుకుట కంటె ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు” అని పౌలు అక్కడ చెప్పాడు.

పౌలు ఎప్పుడు, ఎక్కడ భాషలు మాట్లాడాడో తెలియచేయలేదు కనుక పౌలు ఏకాంత సమయంలో ప్రార్థనలో భాషను ఉపయోగించాడని క్యారిస్‌మాటిక్స్‌ వాదించడం పూర్తిగా ఊహజనితమైనదే. అవిశ్వాసులకు సువార్త పరిచర్యలో భాగంగా అపొస్తలులు ఇతర భాషల్లో మాట్లాడడం మనం అపొస్తలుల కార్యాల గ్రంథంలో చూస్తాము (అపొ.కా 2:5-11), కనుక  అదే విధంగా తన ఆపోస్తలత్వ పరిచర్యను ఋజువు చేయడానికి ఒక సూచనగా పౌలు తన వరాన్ని ఉపయోగించాడని మనం స్పష్టంగా చెప్పవచ్చు (మార్కు 16:20, 2 కోరింథీ 12:12),

1 కోరింథీ 14వ అధ్యాయంలో ఏకాంతంగా, స్వప్రయోజనం నిమిత్తం భాషల వరాన్ని ఉపయోగించడాన్ని పౌలు ఖచ్చితంగా అనుమతించట్లేదు. దానికి భిన్నంగా కొరింథీ సంఘపు గర్వాన్ని అతడు గద్దిస్తున్నాడు. తమకు తెలియని భాషలను తమలో కొంతమంది మాట్లాడుతున్నారు కనుక తాము శ్రేష్టులమని వారు అనుకున్నారు. కానీ వారందరి కంటే ఎక్కువ విదేశీ భాషల్లో అద్భుతంగా మాట్లాడిన పౌలు ఆది ఎంత అద్భుతమైనదైనప్పటికీ అన్ని వరాల కంటే  ప్రేమ శ్రేష్టమైనదనే విషయాన్ని వారు గ్రహించాలని కోరాడు. పౌలు తన వరాలను క్రీస్తు శరీరంలో ఉపయోగించినప్పుడు, సంఘంలో ఇతరుల క్షేమాభివృద్ధినే అతడు ప్రాధాన్యంగా ఎంచాడు. ఏ వరాన్నైనా స్వార్థపూరిత ప్రయోజనం కోసం ఉపయోగిస్తే, అది అపొస్తలుడు 1కొరింథీ 12-14 అధ్యాయాల్లో చేసిన వాదనను బలహీనపరిచి ఉండేది.

9) ఆది సంఘంలో భాషలు ఏ విధంగా పనిచేసేవి?

1కొరింథీ 14వ అధ్యాయంలో భాషల వరం గురించి చర్చిస్తూ, దాన్ని సంఘంలో ఎలా ఉపయోగించాలో తెలియచేయడానికి పౌలు కొన్ని ప్రత్యేక నియమాలను ఇచ్చాడు. 26-28 వచనాలలో అపొస్తలుడు ఈ విధంగా వివరించాడు. “సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు, మరియొకడు బోధింపవలెనని యున్నాడు. మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటన చేయవలెనని యున్నాడు, మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు. మరియొకడు అర్థము చెప్పవలెనని యున్నాడు సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి. భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతుల చొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.”

ఆ వచనాలలో భాషల ఉపయోగం గురించి కొన్ని షరతులను పౌలు తెలియ చేసాడు. 1) సంఘ కార్యక్రమం జరుగుతుండగా ముగ్గురు కంటే ఎక్కువ మనుషులు మాట్లాడకూడదు. 2) వారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి.  3) వారి సందేశం సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం అనువదించబడాలి.  4) అర్థం చెప్పేవారు లేకపోతే, వారు మౌనంగా ఉండాలి. 34వ వచనంలో సంఘంలో స్త్రీలు మాట్లాడే అవకాశం లేదనే 5వ విషయాన్ని పౌలు తెలియచేసాడు. పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్‌ సంఘాల్లో, ఆ ఆఖరి షరతును అనుసరిస్తే ప్రస్తుత కాలంలో జరిగే చాలా మట్టుకు మోసం ముగింపుకు వచ్చేస్తుంది.

ఆశానిగ్రహం లేని ప్రజల ద్వారా పరిశుద్ధాత్ముడు పనిచేయడు. “మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. ఆలాగే పరిశుద్దుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు” (వ32-33) “పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడే వ్యక్తి తను మాట్లాడదలుచుకున్నప్పుడు మాట్లాడతాడు. మిగిలిన సమయంలో ప్రవక్తల వలే మౌనంగా ఉంటాడు. అపవిత్రాత్మ పట్టినవారు తమకు ఇష్టం లేనప్పుడు సైతం మాట్లాడుతూనే ఉంటారు తమకు అర్ధం కాని విషయాలను వారు చెబుతారు"36 అని ఆ వచనాలను ధ్యానిస్తూ మొదటి తరపు క్రైస్తవ వేదాంత పండితుడు వివరించాడు.

ప్రతీ సంఘ కూడికలో ఇద్దరూ లేక ముగ్గురూ వారి ప్రత్యక్షతలను చెప్పడానికి అనుమతించబడ్డారు. వారు వంతుల చొప్పున మాట్లాడాలి. నేటి క్యారిస్‌మాటిక్‌ సంఘాల్లో సభ్యులంతా ఏక సమయంలో పిచ్చి మాటలు మాట్లాడుతూ తరచూ గందరగోళాన్ని సృష్టించడాన్ని పౌలు ఎన్నటికీ అనుమతించి ఉండేవాడు కాడు. అది పరిశుద్ధాత్మునికి ఆపాదించి ఉండేవాడు కాడు. నిజానికి ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమం క్రమం లేని, స్వార్థపూరితమైన, అవాస్తవ భాషలను గందరగోళంగా మాట్లాడడాన్ని అభ్యసిస్తుందనే అత్యంత తీవ్రమైన నిందను ఎదుర్కొంటుంది.

కొరింథు సంఘంలో మాట్లాడబడిన విదేశీ భాషలకు అర్థం చెప్పవలసి వచ్చిందని ఇంతకు ముందే గమనించాము. ప్రతి ఒక్కరూ అర్థం గ్రహించే విధంగా భాషలను అనువదించాలనేది ఆజ్ఞ. ఆ వరం ఉన్నవారెవరో సంఘానికి తెలుస్తుంది. అర్థం చెప్పగలిగే వారు అందుబాటులో లేకపోతే, మాట్లాడేవాడు మౌనంగా ఉండాలని ఆజ్ఞ ఇవ్వబడింది. “తనతోనూ మరియు దేవునితోనూ మాట్లాడుకోవాలి” అని పౌలు చెప్పిన మాట “సంఘంలో మౌనంగా ఉండాలి” అనే ఇంతకు ముందున్న ఆజ్ఞకు సమానమైనది (వ28) ఇంటి వద్ద ఏకాంత సమయంలో భాషలు మాట్లాడాలి అనే విషయాన్ని అపొస్తలుడు చెప్పట్లేదు. సంఘ సమక్షంలో మౌనంగా ఉండి, దేవునికి ప్రార్ధించమని భాషలు మాట్లాడే వ్యక్తికి ఇచ్చిన ఆజ్ఞను అతడు తిరిగి చెబుతున్నాడు.

కనుక సంఘంలో భాషల వరాన్ని ఒక క్రమమైన పద్ధతిలో ఉపయోగించాలి (వ39,40) విధ్వంసకరమైన, అక్రమమైన పద్ధతిలో ఆ వరాన్ని ఉపయోగించడం దేవునికి ఆ వరం యెడల కలిగిన ఉద్దేశాన్ని ఉల్లంఘించడమే ఔతుంది. ఆ వరం ఇంకా అందుబాటులో ఉన్న సమయంలోనే ఆ విధమైన ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ వరం నేడు నిలిచిపోయినప్పటికీ, విశ్వాసులు నేటికి ఉపయోగిస్తున్న ఇతర వరాలను ఒక క్రమంలో, మర్యాదగా ఉపయోగిస్తూ, తమ ఆరాధనను నిర్వహించాలి.

10) ఈ అబద్ధ వరాన్ని కోరుకునే విశ్వాసులను నిరుత్సాహపరచాలా?

భాషల వరాన్ని గురించిన తన చర్చను అపొస్తలుడైన పౌలు ఈ మాటలతో ముగించాడు. “కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి” (1కొరింథీ 14:39,40) పౌలు ఈ ఆజ్ఞను రాసిన సమయానికి అన్ని వరాలు ఇంకా పనిచేస్తున్నాయి. కనుక సరియైన క్రమమైన పద్ధతిలో ఉపయోగించబడే భాషల వరాన్ని అడ్డుకోవద్దని కొరింథీ విశ్వాసులకు ఆదేశించాడు. ఆ ఆజ్ఞ యొక్క పరిధి స్వభావం ప్రాముఖ్యమైనది. కొరింథీ సంఘంలో ఉన్న ప్రతీ వ్యక్తి ప్రవచన వరాన్ని కోరుకోవాలనేది ఈ ఆజ్ఞ సారాంశం కాదు. కానీ భాషలు కన్నా ప్రవచనానికి సంఘం మొదట ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే ఇతరులకు మేలు కలుగు నిమిత్తం ఈ ప్రవచన వరాన్ని అనువదించాల్సిన అవసరం లేదు.

క్యారిస్‌మాటిక్స్‌ నేడు సాధన చేస్తున్న భాషలు మాట్లాడే ప్రక్రియను నిషేధించే వారందరూ పౌలు ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారనే విషయాన్ని చూపించడానికి కొన్నిసార్లు వారు 39వ వచనాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ నేడు జరుగుతున్న మోసానికీ అపొస్తలుని ఆజ్ఞకూ ఏ సంబంధమూ లేదు. విదేశీ భాషలను గురించిన ప్రామాణిక వరం ఇంకా అందుబాటులో ఉన్నప్పుడు, దాని ఉపయోగాన్ని విశ్వాసులు నిషేదించకూడదు. కానీ నేడు జరుగుతున్న ఆత్మీయమైన నకిలీని అడ్డుకోవలసిన బాధ్యత సంఘాలపై ఉంది. అర్ధం కాని భాష నిజమైన వరం కాదు కనుక అటువంటి భాషను సాధన చేస్తున్న వ్యక్తిని అడ్డుకోవడం 1 కోరింథీ 14:39లో పౌలు ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించినట్లు కాదు. నిజానికి అలా చేయడం మంచి పని. ప్రస్తుత భాషలు మాట్లాడే ప్రక్రియలో ఉన్న అవమానకరమైన గందరగోళం, అహేతుకమైన మాటలు నిజానికి 40వ వచనాన్ని ఉల్లంఘిస్తున్నాయి. సంఘంలో క్రమానికి, మర్యాదకు కట్టుబడిన వారు దాన్ని అణిచివేయబద్దులై యున్నారు.

                                                             సారాంశము

మార్కు సువార్తలో, అపొస్తలుల కార్యాల్లో, 1కొరింథీ పత్రికలో భాషల వరం గురించి వివరించే వాక్యభాగాలను గమనించినప్పుడు, ఏ విధంగా చూసినా క్యారిస్‌మాటిక్‌ వారి కథనం మోసపూరితమైనదిగా మనకు కనిపిస్తుంది.37 నిజమైన వరం ఒక వ్యక్తికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికీ, తాను ప్రకటించే సువార్త సందేశాన్ని ధృవీకరించడానికీ తాను ఎన్నడూ నేర్చుకోని విదేశీ భాషలను మాట్లాడే అద్భుత సామర్థ్యాన్ని ఇచ్చేది. దాన్ని సంఘంలో ఉపయోగిస్తే, ఆ వర్తమానం ద్వారా ఇతర విశ్వాసులు మేలు పొందేలా దానికి అర్ధం చెప్పాలి.

దానికి భిన్నంగా, నేటి క్యారిస్‌మాటిక్‌ వారి భాషల వరం అద్భుతం కాదు. అర్ధం చెప్పడానికి వీలు కాదు. ఇది ఏ నిజమైన మానవ భాషకూ సంబంధం లేనిది. దీనిని వారు అభ్యాసం చేసి నేర్చుకుంటున్నారు. సంఘ క్షేమాభివృద్ధికి ఒక సాధనంగా ఉపయోగించడానికి బదులు, అహాన్ని సంతోష పెట్టాలనే ఉద్దేశంతో ఏకాంతపు ప్రార్థన భాషగా నేటి క్యారిస్‌మాటిక్‌ సభ్యులు దీన్ని ఉపయోగిస్తున్నారు. తాము దేవునికి సమీపంగా ఉన్నారనే భావాన్ని కలుగచేస్తోందని దీన్ని వారు సమర్థించినప్పటికీ, అర్థరహితమైన పిచ్చిమాటలను గురించి బైబిల్‌ ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది ఏ విధమైన ఆధ్యాత్మిక విలువ లేని ఒక అబద్ధ ఆధ్యాత్మిక స్థితి. నేటి భాషలు మాట్లాడే ప్రక్రియ అన్యమత ఆచారాలను పోలినదనే వాస్తవం ఈ వాక్యాధారం లేని ఆచరణ ప్రవేశపెట్టే ఆధ్యాత్మిక ప్రమాదాల గురించి తీవ్రమైన హెచ్చరికగా పనిచేయాలి.

                                       8. నకిలీ స్వస్థతలు, అబద్ద వాగ్దానాలు

2009 డిసెంబర్‌ 15వ తేదీన ప్రముఖ టి.వి. సువార్తికుడు ఒరల్‌ రాబర్ట్స్‌ నిత్యత్వంలోకి ప్రవేశించినప్పుడు, అమెరికా క్రైస్తవ్యానికి తాను చేసిన విశేషమైన సేవలకు గాను "ఈ ప్రోస్పారిటి సువార్త తొలి బోధకుని" కొనియాడుతూ క్రైస్తవులనేకులు వార్తా పత్రికలలో తమ సంతాపాన్ని తెలియచేసారు. ఒరల్‌ రాబర్ట్స్‌పై నా అభిప్రాయం చాలా భిన్నంగా ఉంది. “బైబిల్‌ని నమ్మే క్రైస్తవులు వేడుక చేసుకునేంత గొప్పది కాదు ఒరల్‌ రాబర్ట్స్‌ ప్రభావం. 1950 తర్వాత పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాల్లో కనిపించిన ప్రతీ తప్పుడు బోధ, వెర్రితనం ఏదో ఒక రూపేణా ఒరల్‌ రాబర్ట్స్‌ ప్రభావంలో నుంచి ఉద్భవించినదే" అని అతని మరణానంతరం ఒక శీర్షికలో నాకు వీలైనంత స్పష్టంగా తెలియజేశాను.

పై వ్యాఖ్య కటువైనదిగా ప్రతిధ్వనించవచ్చు అయితే సత్యాన్ని వక్రీకరించే వారిని నిందిస్తూ (మన) ఊహకు అందనంత కఠినమైన పదజాలాన్ని ఉపయోగించిన కొత్త నిబంధన మాటల కంటే అది కటువైనది కాదు. “ఆరోగ్యైశ్వర్యాలను” గురించిన అసత్య సువార్తను హత్తుకోవడమే కాకుండా, తన సిద్ధాంతపరమైన విషాన్ని ప్రజలకు టెలివిజన్‌ ప్రసారాల ద్వారా అందించి ప్రధాన సంఘాల్లో దాన్ని విస్తరింపచేసాడు ఒరల్‌ రాబర్ట్స్‌. నిజానికి టి.వి కార్యక్రమాలను ఉపయోగించుకుని తన తర్వాత వచ్చిన ఆధ్యాత్మిక వంచకులకు మార్గాన్ని సిద్ధపరచిన ప్రథమ మోసపూరిత స్వస్థతకారుడు ఇతడే.3

ప్రోస్పారిటి సువార్తను ఒరల్‌ రాబర్ట్స్‌ కనుగొన్న విధానమూ, తన సందేశానికి అది కీలకాంశంగా ఎలా మారిందీ అనే విషయాలను “ఒరల్‌ రాబర్ట్స్‌ యాన్‌ అమెరికన్‌ లైఫ్‌” అనే పుస్తకంలో అతని జీవిత చరిత్రను రచించిన రచయిత డేవిడ్‌ ఎడ్విన్‌ హర్రెల్ జూనియర్‌ వివరించాడు. ఒక దినాన యథాలాపంగా తన బైబిల్‌ తెరచి, “ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్ధించుచున్నాను,” అనే 3యోహాను 2వ  వచనాన్ని చూసాడు. ఈ వచనాన్ని అతడు తన భార్య ఎవిలిన్‌కు చూపించాడు. ఈ వచనాన్ని సరైన సందర్భం నుంచి పూర్తిగా వేరుచేసి, దీని నుంచి ఉత్పన్నమయ్యే భావాల గురించి చాలా ఆసక్తితో వారిరువురు మాట్లాడుకున్నారు. “ఒక కొత్త కారు, నూతన గృహం, సరికొత్త పరిచర్య” వాళ్ళు పొందుకుంటారని దాని భావమా? తర్వాత కాలంలో ఆ ఉదయాన్నే అతని పరిచర్యకు ప్రారంభ సమయంగా ఎవిలిన్‌ చూసింది. “అతని ప్రపంచ వ్యాప్త పరిచర్యకు ప్రారంభం ఆ ఉదయాన్నే జరిగిందని నేను నిజంగా నమ్ముతున్నాను. ఎందుకంటే అది అతని ఆలోచనను విశాలపరిచిందని”4 ఆమె చెప్పింది. ఆ సంఘటన జరిగిన కొద్దిసేపటికే తళతళలాడే ఒక కొత్త బ్విక్‌ కారు అనూహ్యమైన రీతిలో తాను సంపాదించాననీ, మనిషి దేవుణ్ణి నమ్మితే ఏమి చేయగలడో అనే దానికి అది గుర్తుగా ఉందని రాబర్ట్స్‌ సాక్ష్యామిచ్చాడు.

తన ప్రోస్పారిటి సిద్ధాంతాన్ని కల్పించిన తర్వాత, సీడ్‌-ఫెయిత్‌ (విత్తనము- విశ్వాసము) అనే తన సుప్రసిద్ధమైన, అత్యంత ప్రభావితం చేయగలిగిన సందేశాన్ని ఒరల్‌ రాబర్ట్స్‌ ఆవిష్కరించాడు.

“సీడ్‌- ఫెయిత్‌” ద్వారా ఇవ్వడం ప్రగతికి మార్గమని రాబర్ట్స్‌ బోధించాడు. “తన సంస్థకు విరాళంగా ఇవ్వబడే ధనం, ఇతర వస్తువులు, ప్రభువు వద్ద నుంచి ఇహపరమైన ఆశీర్వాదాల పంటను పండించడానికి నాటబడిన విత్తనాల్లాంటివి. తన పరిచర్యకు ఏది ఇచ్చినా, దేవుడు దాన్ని అద్భుత రీతిలో రెట్టింపు చేసి, దానికి అనేక వంతులు తిరిగి ఆ దాతకు ఇస్తాడని” రాబర్ట్స్‌ ప్రకటించాడు. ఈ బోధలోని నామకార్థమైన భక్తి, వేగంగా ధనవంతులైపోతామనే ఆలోచన పేదవారినీ, దిక్కు లేని ప్రజలనూ బాగా ఆకర్షించింది. ఇది రాబర్ట్స్‌ మీడియా సామ్రాజ్యానికి కోట్లాది రూపాయలను సమకూర్చింది.

అవే భావాలు గల కొందరు పెంతెకోస్తు, క్యారిస్‌మాటిక్‌ మీడియా పరిచర్యల బృందం చక్కటి ఆదాయం వస్తుందని గమనించి ఈ పథకాన్ని వెంటనే అమలుచేసింది. అద్భుతాల గురించి చక్కటి వాగ్దానాలు చేసి ప్రతిఫలంగా ఈ టి.వి. సువార్తికులు వీక్షకుల ధనాన్ని స్వీకరిస్తున్నారు. కనుక వారి పరిచర్యలను స్థాపించి, బలపరిచే ప్రధాన లాభసాటి వ్యాపారంగా ఈ "సీడ్‌-ఫెయిత్‌” బోధ బాగా పనిచేస్తోంది. ఆరోగ్యైశ్వర్యాలను గురించిన అద్భుతాలను వారు అతిగా కోరుకుంటున్నారు.

ఒరల్‌ రాబర్ట్స్‌ ప్రసంగంలో ఉన్న సువార్త సారాన్ని ఈ “సీడ్‌- ఫెయిత్‌” సందేశం ఆక్రమించి, దాన్ని సమూలంగా స్థానభ్రంశం చేయడం విషాదకరం. టి.వి.లో నేను అతణ్ణి చూసిన పలు సందర్భాల్లో ఏ ఒక్కసారీ అతడు సువార్తను ప్రకటించడం నేను వినలేదు. “సీడ్‌-ఫెయిత్‌” అనే సందేశాన్నే అతడు ప్రకటించాడు. “యేసు శ్రమల ద్వారా పాపాల నిమిత్తం జరిగించిన పాపపరిహారార్థ బలిని గురించిన సిలువ సందేశం టి.వి. సువార్తికులకు ధనం పంపే ప్రజలకు ఆరోగ్యైశ్వర్యాలను, క్షేమాన్ని దేవుడు గ్యారంటీగా ఇస్తాడని చెప్పే అభిప్రాయానికి సరిపడదు.” అందుచేతనే అతడు సత్య సువార్తను ఎన్నడూ ప్రకటించేవాడు కాదు. యేసు శ్రమల్లో మన సహవాసం (ఫిలిప్పీ 3:10), ఆయన అడుగుజాడల్లో నడవవలసిన మన విధి (1పేతురు 2:20-23) ప్రోస్పారిటి సిద్ధాంతంలో ఉన్న కీలక నియమాలకు విరుద్ధమైనవి. ప్రోస్పారిటి సువార్త భిన్నమైన సువార్త అని మనం 2వ అధ్యాయంలో చూసాము (గలతీ 1:8,9). 

ప్రజల డబ్బు సంచులను ఖాళీ చేయించడానికి అవసరమయ్యే స్వస్థత అద్భుతాలు అనే గారడీపైనే రాబర్ట్స్ పరిచర్య ప్రధానంగా కేంద్రీకృతమైయుంది. “క్యారిస్‌మాటిక్‌ ఉద్యమాన్ని ప్రధాన క్రైస్తవ సమాజంలోనికి తీసుకెళ్ళిన ఘనత ఇతని కంటె మరి ఎక్కువగా ఎవరికీ చెందదు. అమెరికా వారి దృష్టిలోనికి అతడు దైవిక స్వస్థతను తీసుకువచ్చాడని,” రాబర్ట్స్‌ మరణం తర్వాత పెంతెకోస్తు చరిత్రకారుడు విన్సస్‌ సైనన్‌ చెప్పాడు. ఫెయిత్‌ హీలర్‌ అనే బిరుదును తాను తిరస్మరించినప్పటికీ 1950-60 మధ్యకాలంలో టెలివిజన్‌ కార్యక్రమాలను బట్టి రాబర్ట్స్ అదే బిరుదును పొందాడు. అంతే కాదు అనేకమందిని  మృతుల్లోనుంచి తిరిగి లేపానని కూడా చెప్పుకున్నాడు. ఆ అద్భుతాలు నిజమైనవేనా? నిర్ధారించదగినవేనా? అస్సలు కావు. కానీ నేటి మతపరమైన ప్రసార మాద్యమాలను శాసిస్తున్న క్యారిస్‌మాటిక్‌ బోధకులకూ, టి.వి. సువార్తికులకూ, ఫెయిత్‌ హీలర్స్‌కూ, వంచకులకూ, గారడీలు చేసేవారందరికీ మార్గాన్ని సిద్ధం చేసింది ఇతడే.

నిజానికి తొలి పెంతెకోస్తు ఉద్యమంలోని ఈ మోసకరమైన భావాలను ప్రధాన ఇవాంజలికల్‌ శాఖలో అంగీకరించేటట్టు అందరి కంటే ఎక్కువగా ప్రభావితం చేసింది రాబర్ట్స్ యే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘంపై ఒక చెరగని ముద్రను వేసిన ఒక విస్తృత సామ్రాజ్యంగా అతడు తన టెలివిజన్‌ పరిచర్యను విస్తరింపచేసాడు. అత్యంత నిరక్ష్యరాస్యత, పేదరికం అత్యధికంగా ఉన్న పలు ప్రాంతాల్లోని ప్రజలకు విశ్వాసం ద్వారా నీతి మంతులవడం అనే సిద్ధాంతం కంటే ఒరల్‌ రాబర్ట్స్‌ యొక్క సీడ్‌-ఫెయిత్‌ను గురించిన సందేశమే చిరపరిచయం. సువార్త అనే పదాన్ని వినగానే జనసముహాలకు ఆరోగ్యైశ్వర్యాలను గురించిన సందేశమని భావిస్తున్నారు. సువార్త అనేది పాపక్షమాపణను గురించిన గొప్ప ఆశీర్వాదమని, క్రీస్తుతో విశ్వాసులకున్న ఆత్మీయ ఐక్యతలోని నిత్యాశీర్వాదాన్ని గురించినదనీ కాకుండా ఇహలోక సంపదల, భౌతిక స్వస్థతల గురించిన సందేశమని లెక్కకు మించిన ప్రజలు భావిస్తున్నారు. ఒరల్‌ రాబర్ట్స్‌ యొక్క కీర్తి ప్రతిష్టల గురించి వేడుక చేసుకోవడానికి బదులు విలపించడానికి అవన్నీ కారణాలుగా ఉన్నాయి.

అయితే ప్రథమ స్వస్థత సువార్తికుడు ఒరల్‌ రాబర్ట్స్‌ కాదు. అతనికి ముందే పెంతెకోస్తు సేవకులైన జాన్‌ జీ.లేక్‌, స్మిత్‌ విగ్గిల్స్‌ వర్త్‌, ఏయ్‌మీ సెంపుల్‌ మెక్‌ ఫర్సన్‌, ఎ.ఎ.అలెన్‌ తదితరులున్నారు. 20వ  శతాబ్దపు మధ్యకాలంలో ఉన్న ఏకైక ఫెయిత్‌ హీలర్‌ కూడా రాబర్ట్స్‌ కాదు. అతని స్నేహితులైన కెన్నెత్  హగిన్‌, కాథ్‌రిన్‌ కుల్‌మన్‌లు ప్రముఖ సమకాలీకులు. అయితే అందరి కంటే ఎక్కువగా టెలివిజన్‌ ప్రసార మాధ్యమం ద్వారా ఆధునిక స్వస్థతలను ప్రధానమైనవిగా చేసింది మాత్రం రాబర్ట్స్‌ యే. 1950-60లలో మురికి గుడారాల్లో సభలను నిర్వహిస్తూ సామాన్యమైన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ప్రసారాలను చేసిన ఇతగాడు, 1970 తర్వాత అత్యున్నతమైన క్వాలిటీతో కలర్‌ స్టూడియో కార్యక్రమాలను ప్రసారం చేసాడు.

టెలివిజన్‌ కార్యక్రమాల ద్వారా రాబర్ట్స్‌ సాధించిన విశేష ప్రగతి ఎన్నో కల్పిత గాథలను సృష్టించింది. ఫెయిత్‌ హీలర్స్‌, క్యారిస్‌మాటిక్‌ విరాళ సేకరణకర్తలు అనేకులు తమ ప్రధాన కేంద్రాలను రాబర్ట్స్‌ సొంత పట్టణమైన టుల్స, ఒక్లహామాలో స్థాపించారు. కెన్నెత్ హగిన్‌, టి.యల్‌, ఆస్‌బార్న్ లు అక్కడ భారీ పరిచర్యలను ఏర్పరచుకున్నారు. 1963వ సంవత్సరం టుల్సాలో స్థాపించబడిన ఒరల్‌ రాబర్ట్స్‌ విశ్వ విద్యాలయం నూతన తరానికి అవసరమైన టి.వి. సువార్తికుల, విశ్వాస స్వస్థతకారుల శిక్షణా కేంద్రంగా మారింది. జోయల్‌ ఆస్టిన్‌, క్రెఫ్లో డాలర్‌, టెడ్‌ హగ్గర్ట్‌, కెన్నెత్‌ కోప్‌ల్యాండ్‌, కార్ల్‌టన్‌ పియర్సన్‌, బిల్లీ జో డావర్తీ మొదలైనవారు ఒరల్‌ రాబర్ట్స్  విశ్వవిద్యాలయంలో విద్యార్థులు.

ఒరల్‌ రాబర్ట్స్ మరణానంతరం అతన్ని వెంబడించిన వారు కొనసాగిస్తున్న పరిచర్యను పరిశీలించడమే అతని నిజస్వాస్థ్యంను  నిర్ధారించే అత్యుత్తమ మార్గం. రాబర్ట్స్‌ స్థానాన్ని తీసుకుని, ఆధునిక ఫెయిత్‌ హీలర్స్‌లో అత్యంత ప్రముఖుడు విజయవంతమైన వ్యక్తి బెన్నీహిన్‌ గురించి మనం ఆలోచిద్దాం.

                                                             ఎంటర్ బెన్నీహిన్ 

ఒరల్‌ రాబర్ట్స్‌‌ కు‌ ఉన్న నీచమైన వారసులలో టౌఫిక్‌ బెనెడిక్టస్‌ (బెన్నీ) హిన్‌ కు మించిన ప్రముఖులెవరు లేరు. రాబర్ట్స్‌ కనుమరుగై పోయినప్పటికీ, హిన్‌ ద్వారా అతని మిత్ర బృంద పరిచర్యల ద్వారా అతని ప్రభావం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. బెన్నీహిన్  తనను తాను రాబర్ట్స్‌ వారసునిగా పరిగణించుకుంటున్నాడు. “ఎన్నో విషయాలలో అతనొక మహానుభావుడు. అనేక సంవత్సరాలుగా అతణ్ణి అత్యంత ఆప్తమిత్రునిగా కలిగి ఉండే ఆధిక్యత నాకు దక్కింది....అనేకమంది సేవకులు, విశ్వాసులు అనుసరించడానికి అతడు పెట్టిన ప్రమాణం గురించి ఎన్నో సంవత్సరాలుగా నేను ఆలోచించాను....అతడు ఏర్పరచిన మార్గాన్ని బట్టి నేను అతనికి ఎల్లవేళలా కృతజ్ఞుడినిగా ఉంటానని” ఒరల్‌ రాబర్ట్స్‌ మరణించిన కొద్దికాలం తరువాత తాను రాబర్ట్స్‌కి ఎంత రుణపడి ఉన్నాడో గుర్తిస్తూ ఆ దివంగత టి.వి. సువార్తికుని కొనియాడుతూ ఒక ప్రశంసాపూర్వకమైన నివాళిని బెన్నీహిన్‌ ప్రచురించాడు.8

రాబర్ట్స్‌, హిన్‌లు కేవలం స్పేహితులుగా మాత్రమే కాకుండా తోటి పరిచారకులుగా ఉన్నారు. వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి టి.వి. ప్రసారాలలో కనిపించారు. 2002 లో హిన్‌ పరిచర్యలో ఉన్న భయంకరమైన మోసాన్ని ఎన్ బిసి డేట్ లైన్ బయట పెట్టినప్పుడు, ఒరల్‌ రాబర్ట్స్‌ అతణ్ణి బహిరంగంగా సమర్థించాడు.9 దానికి ప్రతిగా ఒరల్‌ రాబర్ట్స్‌ విశ్వవిద్యాలయంలో కొన్ని సంవత్సరాలు హిన్  అధికారిగా పనిచేసాడు.10 అన్ని ప్రదేశాలలో ఫెయిత్‌ హీలర్స్‌లో అత్యంత ప్రముఖుడిగా ఒరల్‌ రాబర్ట్స్‌ యొక్క స్థానాన్ని బెన్నీహిన్‌ తీసుకోవడం ఆశ్చర్యమైన విషయం కాదు.

అత్యధిక సంఖ్యలో తాను చేస్తున్న టెలివిజన్‌ ప్రసారాలను బట్టీ, అతడు ఆకర్షిస్తున్న వీక్షకుల సంఖ్యను బట్టీ తన కీర్తి ప్రతిష్టలు రాబర్ట్స్‌ను అధిగమించాయని బెన్నీహిన్‌ వాదించడం నిజానికి వాస్తవమే. “అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ  ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల్లోనూ రెండు కోట్లకు పైగానే ప్రజలను చేరి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రైస్తవ టెలివిజన్‌ కార్యక్రమంగా “దిస్‌ ఈజ్‌ యువర్‌ డే” అనే హిన్‌ టెలివిజన్‌ కార్యక్రమం ఉంది.11 నేటి కాలంలో ఉన్న గొప్ప స్వస్థత వరం కలిగిన సువార్తికులలో ఈయన ఒకడని హిన్‌ పుస్తకాల కవర్‌పై సందేశం మోసం చేస్తుండగా, “భారతదేశంలో (మూడు సభలలో) 73 లక్షల మంది ప్రజలు తన సభలకు హాజరయ్యారని, చరిత్రలోనే అవి అత్యంత భారీ సభలని” హిన్‌ వెబ్‌సైట్‌ గొప్పగా చెప్పుకుంటోంది.13 “అన్ని రకాల స్వస్థతలు జరుగుతున్నాయని, నెలనెలా హిన్‌ అద్భుత సభల్లో దేవుడు తనను తాను ఎంతో ప్రభావంతో బయలుపరచుకుంటున్నాడని , అందువల్లనే వారు దిక్కులేని వారినీ, మరణిస్తున్న ప్రజలనూ వేడుకుంటున్నారనేది” హిన్‌ అభిప్రాయం.

దాదాపు ప్రతి రాత్రి వివిధ క్యారిస్‌మాటిక్‌ నెట్‌వర్క్ లో (అనేక స్వతంత్ర అభ్యర్థులకు చెందిన ఛానెల్స్‌లో) అనేకమంది ప్రజలను వెర్రివారిగా చేస్తూ, ప్రజలను ఆత్మలో వధిస్తూ, కనులకు కానరాని వ్యాధులన్నింటిని బాగు చేస్తున్నానని వాదిస్తున్న బెన్నీహిన్‌ని మనం చూడవచ్చు. రాబర్ట్స్‌ యొక్క దుప్పటి బెన్నీహిన్‌పై పడిందని లక్షలాది మంది వీక్షకులు నమ్ముతూ, తన గురువును మించిన మరి గొప్పవైన అసాధారణ స్వస్థతలనూ, అద్భుతాలనూ చేసే వరాలు బెన్నీహిన్‌కు ఉన్నాయని వారు పూర్తిగా విశ్వసిస్తున్నారు.

డంబమైన టెలివిజన్‌ ప్రసారాల వెనకున్న వాస్తవాన్ని నిశితంగా పరిశీలిస్తే అది పూర్తి భిన్నమైన చిత్రాన్ని బయలుపరుస్తోంది.

                                         స్వస్థపరిచేవారా? తప్పుబోధకులా?

అక్టోబర్‌ నెలలో ఒక సాయంత్రం ఉత్తర క్లీవ్‌ల్యాండ్‌లో ఉన్న సంఘం నుంచి ఒక చక్రాల కుర్చీలో తప్పటడుగులు వేసే వయస్సున్న తమ కుమారుని బయటకు నడిపించుకుంటూ వస్తున్న ఒక యవ్వన జంటను రఫాయేల్‌ మార్టినెజ్‌ చూడవలసి వచ్చింది. ఆ బాలుని అంగవైకల్యపు శరీరం ఆ చక్రాల కుర్చీకి కట్టివేయబడింది. ముక్కు ద్వారా శ్వాసయంత్రాలు అమర్చబడ్డాయి. తనకు ప్రాణాధారమైన మందులు గల మిషన్లు తను కూర్చున్న కుర్చీకి వేలాడుతూ ఉన్నాయి. అద్భుతం జరగాలనే ఆశతో, ప్రార్థిస్తూ ఆ స్వస్థత కార్యక్రమానికి ఆ బాలుని తల్లిదండ్రులు అతణ్ణి తీసుకువచ్చారు. ఆ రాత్రి ఆ స్వస్థత సభను నడిపించింది మరెవరో కాదు ప్రముఖ స్వస్థత సువార్తికుడు బెన్నీహిన్‌. అక్కడ వాతావరణం ఉద్వేగభరితంగా, అంచనాలు మరి అధికంగా ఉన్నాయి. అయితే కొన్ని గంటలు తర్వాత సభ పూర్తయిపోయింది. కానీ వారి బిడ్డ  స్వస్థపరచబడలేదు. చెల్లాచెదురైన ఆశలతో వారి బిడ్డను ఇంటికి తీసుకునిపోయే సమయం ఆసన్నమైంది.

హృదయాన్ని కలిచివేసే ఆ సంఘటన మార్టినెజ్‌ యొక్క మనస్సును తొలిచేసే ప్రశ్నలతో ముంచెత్తింది. “వారి కుమారుడు ఎలా వచ్చాడో అలాగే ఎందుకు వెళ్తున్నాడోననే భాధ వారికి కలిగే ఉంటుంది. తమ విశ్వాసం అల్పమైనదనీ అసంపూర్ణమైనదనీ అతని తల్లిదండ్రులు వేదన చెందారా? వారు దోషులవడానికి కారణమైన పాపం ఏంటి? “సీడ్‌-ఫెయిత్‌ “అనే బోధ పారదోలిన శాపం ఏంటి? అద్భుతాలకోనం దేవుని నమ్మండని హిన్ వారికి చెప్పినప్పుడు, దేవుడు ఆ ప్రదేశానికి రాకుండా, సుందరుడైన ఆ బాలుణ్ణి తన గాయపడిన గొప్ప హస్తాలతో ఎత్తుకుని, అతని శరీరాన్ని బాగుచేయకుండా, తన ముందున్న అనిశ్చితమైన భవిష్యత్తును అతను తప్పించుకునే అవకాశాన్ని ఎందుకు దేవుడు కల్పించలేదు? నా కనులను తిప్పుకోలేకపోయాను. ఈ సంఘటనలో ఉన్న తీక్షణతనూ, కలవరాన్నీ నేను మరచి పోలేదు?” అని ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ అతడు రాశాడు.15

ఆ రాత్రి అబద్ధ వాగ్ధానాలకు బాధితులు కేవలం ఆ పసి బాలుని దిక్కుతోచని తల్లిదండ్రులు మాత్రమే కాదు. కాలికి కట్టుతో వేదిక దగ్గరికి వచ్చి స్వస్థపడకుండా తిరిగి వెళ్ళిపోయిన ఒక వృద్ధున్నీ, అట్లంటా నుంచి క్లీవ్‌ల్యాండ్‌కు ప్రయాణించి తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం లేని రోగియైన స్త్రీని కూడా మార్టినేజ్‌ గమనించాడు. ఆ కార్యక్రమం ముగింపు సమయంలో చుట్టూ చూసిన అతనికి, చక్రాల కుర్చీల్లోనూ, చేతికర్రలు పట్టుకుని, చంకలో కర్రల సహాయంతో సభా ప్రాంగణమంతా మౌనంగా కూర్చున్న అనేకమంది ప్రజలు కనిపించారు. “ఎటువంటి శ్రమ, బ్రాంతి, గందరగోళంలోనికి ఈ గాయపడిన ప్రజలు త్రోసివేయబడ్డారో చూసిన ఏ పాస్టర్‌ హృదయానికైనా బాధ కలుగకుండా ఎలా
ఉంటుంది?” అని ఒక స్పష్టమైన ప్రశ్నను అతడు సంధించాడు.16

ప్రతీ బెన్నీహిన్‌ స్వస్థత సభ నుంచి ఇలాంటి కథనాలు వినిపించడం సహజమే. “పాస్టర్‌ గారు వేదికను వదిలి వెళ్ళిపోయిన తర్వాత, సంగీతం ఆగిపోయినప్పుడు అసలైన హడావుడి మొదలైంది. దీర్థకాలిక వ్యాధులు గల ప్రజలు మునుపటిలానే ఉన్నారు. శరీరం వణికే రోగం గలవారు వణుకుతూనే ఉన్నారు. చతురాంగ పక్షవాతంగల వారిలో మెడ కింది కండరాలలో ఏ విధమైన చలనమూ లేదు. ప్రతీ సభలో ఇలాంటి వందలాది, వేలాది మంది ప్రజలు కుర్చీల్లో కూర్చుని, ఆశ్చర్యపోతూ, దేవుడు వారిని స్వస్థపరచలేదని కృంగిపోతున్నారని” కాలిఫోర్నియా, అనాహేయమ్‌లో హిన్‌ సభకు హాజరైన తర్వాత “లాస్ ఏంజెలెన్‌ టైమ్స్‌” రెలిజియన్‌ రిపోర్టర్‌ విలియమ్‌ లాబ్ డెల్  తెలియచేసాడు.17 “అబద్ధ వాగ్దానాలను ఎరగావేసి, ధనాన్ని పోగుచేయడమే” హిన్‌ కార్యక్రమాల్లోని సులభ సూత్రమని తాను గమనించిన దాన్ని బట్టి లాబ్‌డెల్‌ తెలివిగా చెప్పాడు.

క్రీస్తు, అపొస్తలుల మాదిరిని నేను అనుసరిస్తున్నానని తనను తానే ఫెయిత్‌ హీలర్‌గా ప్రకటించుకున్న హిన్‌ చెబుతున్నాడు. ఉదాహరణకు, యేసు ప్రజలను స్వస్థపరచడానికి ప్రతి ఒక్కరిపై చేతులుంచకుండా కేవలం మాట పలికిన సందర్భాలను కొన్నింటిని చూపి అతడు తన బహిరంగ స్వస్థతను సమర్థించుకుంటున్నాడు.19 

"వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు” అని మార్కు 16:1 లో ప్రభువు శిష్యులకు చెప్పినట్టే, సువార్త ప్రకటనలో భాగంగా రోగుల నిమిత్తం ప్రార్థించమని ప్రభువు నాతో చెప్పాడని హిన్‌ తెలియచేసాడు. స్వస్థత కేవలం గతానికి మాత్రమే కాకుండా, వర్తమానానికి కూడా సంబంధించింది అని వాదిస్తూ గాయపడిన ఆధ్యాత్మికంగా ఆకలిగొన్న ప్రజలకు దేవుని స్వస్థత శక్తినీ, ఆయన సన్పిధినీ తీసుకువచ్చే సాధనంగా పరిశుద్ధాత్ముడు తనను అభిషేకించి వాడుకుంటున్నాడని హిన్‌ చెబుతున్నాడు.

అటువంటి వ్యాఖ్యలు తీవ్రమైన గర్వం, ఘోరమైన మోసమనే అగ్ని జ్వాలల వలన వీచే వెచ్చని గాలికి మించినవేమీ కాదు. హిప్పాటిజమ్‌, కనికట్టు, నాటక ప్రదర్శన కళ మొదలగు ప్రజలను వశపరచుకునే పద్ధతులు హిన్‌కి తెలిసి ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా అతనికి కొత్త నిబంధన స్వస్థత వరం మాత్రం లేదు. మనసుపై, భావోద్రేకాలపై  హిన్‌ చేసే మాయకు దేహం తాత్కాలికంగా స్పందించడమే అతని నామకార్థ స్వస్థతలకు కారణం. హిన్‌ చేసే స్వస్థతలు మహా అయితే ఘోరమైన అబద్ధాలు లేదా అపవాది శక్తి మూలంగా చేయబడే నకిలీలు. వాక్యానుసారమైన వరాన్ని బెన్నీహిన్  వేదికపై చేసే స్వస్థతలను పోల్చిచూస్తే, ఇతగాడు చేసేది భారీ మోసమని తేలిపోతుంది.

                                                 బెన్నీహిన్ వర్సెస్‌ బైబిల్‌

సూచనల కోసం అద్భుతాల కోసం ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ వారి అన్వేషణను నిందించే భాగం “మూర్ఖమైన వ్యభిచారతరము వారు సూచనను అడుగుచున్నారు” అని మత్తయి 16:4లో మన ప్రభువు పరిసయ్యులను గద్దించిన మాటలో తప్ప మరెక్కడా లేఖనంలో బహుశా లేదు. జన సమూహాలు అద్భుతాన్ని చూడాలని, స్వస్థత పొందుకోవాలని ఆశతో యేసును చుట్టుముట్టినప్పటికీ, ప్రభువు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొనలేదు (యోహాను 2:4). బూటకపు విశ్వాసమనేది ఒకటుందని యేసుకు తెలుసు. ఈ విశ్వాసం సహజాతీత కార్యాల్ని చూడాలనే పైపై కుతూహలాన్నే కానీ, రక్షకుని యెడల కనపరచవలసిన స్వచ్చమైన ప్రేమను మాత్రం కనపరచదు.

ప్రస్తుత క్యారిస్‌మాటిక్‌ ఉద్యమంలో ఉన్నది పైపై విశ్వాసమే. అయితే వీరి విశ్వాసం పరిసయ్యుల విశ్వాసం కంటే నీచమైనది. ఎందుకంటే యేసు, అపొస్తలుల కాలంలో నిజంగా అద్భుతాలు జరుగుతున్నాయి. మన కాలంలో క్యారిస్‌మాటిక్‌ నాయకులు అదే విధమైన సహజాతీత శక్తిని కలిగియున్నామని చెబుతున్నప్పటికీ, వారి ద్వారా అద్భుత కార్యాలేవీ నిజానికి జరగట్లేదు. నేటి ఫెయిత్‌ హీలర్స్‌, టెలివిజన్‌ సువార్తికుల నామకార్థ పరిచర్యలు మోసపూరితమైనవి. అమాయకులైన, దిక్కులేని ప్రజలను దోచుకుని సంపన్నులయ్యే గొప్ప కళాకారులు బెన్నీహిన్‌లాంటి స్వస్థతకారులు.

బహిరంగంగా పదే పదే అప్రతిష్టపాలౌతున్న బెన్నీహిన్ కు  ఒక పూర్తి అధ్యాయాన్ని కేటాయించడానికి కారణమేంటి? సమాధానం రెండు విధాలుగా చెప్పవచ్చు. బెన్నీహిన్‌ ఎంత అట్టహాసం చేసినా, ఎన్ని తప్పిదాలూ మోసాలూ చేసినా ఇప్పటికింకా అతడొక ప్రముఖ క్యారిస్‌మాటిక్‌ టి.వి. సువార్తికునిగా ఫెయిత్‌ హీలర్‌గా కొనసాగుతున్నాడు. అతని పరిచర్య ప్రపంచవ్యాప్తంగా ఉండే కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేస్తూ కోట్లాది రూపాయలను పోగుచేస్తోంది. రెండవది: స్వస్థపరిచే వరం నేటికింకా కొనసాగుతుందని బెన్నీహిన్‌ వాదిస్తున్నాడు. ఈ క్యారిస్‌మాటిక్‌ సిద్ధాంతం నుంచి ఉత్పన్నమయ్యే నాశన కరమైన భావాలను హిన్‌ అభిప్రాయం సమర్ధిస్తోంది. అపొస్తలుల కాలంలో ఉన్న స్వస్థతలకు తమ స్వస్థతలు ప్రతి రూపాలనీ బెన్నీహిన్‌ వంటి ఫెయిత్‌ హీలర్స్‌ చెబుతున్నారు. కానీ వారు చేసే మోసాలకూ అసలైన కొత్త నిబంధన స్వస్థత వరానికీ ఎటువంటి పోలికలూ లేవు. ఇప్పుడు లేఖనాల్లో గ్రంథస్థం చేయబడిన స్వస్థతలకూ, ప్రస్తుత నకిలీ స్వస్థతలకూ మధ్య ఉన్న ఆరు తీవ్రమైన వ్యత్యాసాలను మనం ఆలోచిద్దాం.

1) కొత్త నిబంధన స్వస్థతలు దాన్ని పొందుకునే వ్యక్తి విశ్వాసంపై ఆధారపడినవి కావు

తమ అల్ప విశ్వాసం వలన కాదు కానీ రోగుల అల్ప విశ్వాసం వల్లనే తాము  లెక్కలేనన్నిసార్లు విఫలమయ్యామని బెన్నీహిన్ వంటి క్యారిస్మాటిక్ స్వస్థతకారులు నిందిస్తున్నారు. ఫలితంగా "తమకు బలమైన విశ్వాసం లేని కారణంగానే దేవుడు స్వస్థపరచ విఫలమయ్యాడని చాలామంది ప్రజలు నమ్ముతున్నారు. హిన్ పరిచర్యకు తగినంత డబ్బును ఇవ్వకపోవడం, తగినంత విశ్వాసం చూపకపోవడమే బహుశా స్వస్థత పొందకపోవడానికి కారణం.23 కనుక సఫలమైనట్టు భావిస్తే ఘనత హిన్ పొందుతున్నాడు. కానీ లెక్కలేనన్ని వైఫల్యాలకు మాత్రం నింద తాను భరించట్లేదు.

విఫలమైన స్వస్థతల నిమిత్తం రోగులను నిందించడం ఆ స్వస్థతకారుడు తప్పించుకోవడానికి అనువైన సాకును అందించినప్పటికీ, దానిని వాక్యం సమర్ధించదు. క్రీస్తు, అపొస్తలుల స్వస్థత పరిచర్యలను వేగంగా పరిశీలించినా ఆ విషయం స్పష్టమౌతుంది. పలు సందర్భాలలో ఏ విధమైన వ్యక్తిగత విశ్వాసాన్ని కనపరచకుండానే ప్రజలు స్వస్థత పొందారు. కొన్ని ఉదాహరణలు గమనిద్దాం.

లూకా 17:11-19 లో పదిమంది కుష్ఠరోగులు స్వస్థత పొందినప్పటికీ, కేవలం ఒకడు మాత్రమే విశ్వాసాన్ని కనపరిచాడు. మత్తయి 8:28-29, మార్కు 1:23-26లో దెయ్యాలు  పట్టినవారు విడుదల పొందక మునుపు విశ్వాసాన్ని వ్యక్తపరచలేదు. బేతెస్థ కోనేటి దగ్గర పడియున్న కుంటివానికి తన స్వస్థత పొందక మునుపు యేసు అసలు ఎవరో కూడా తెలియదు (యోహాను 5:13). యోహాను 9వ అధ్యాయంలో ఉన్న గుడ్డివాడు యేసు ఎవరో గుర్తించక ముందే స్వస్థతపొందాడు (యోహాను 9:36) కొన్ని సందర్భాలలో యాయిరు కుమార్తె, లాజరు మొదలైనవారిని మృతుల్లో నుంచి తిరిగి లేపాడు. మరణించిన ప్రజలు ఏ విధమైన విశ్వాసాన్ని వ్యక్తపరచలేరనేది చాలా స్పష్టమైన విషయం. జన సమూహాల్లో చాలా మంది విశ్వాసముంచనప్పటికీ మన ప్రభువు వారిని స్వస్థపరిచారు (మత్తయి 9:35, 11:2-5, 12:15-21, 14:13-14, 34-36, 15:29-31, 19:2).

అదే విధంగా అపొస్తలుల స్వస్థత పరిచర్యల్లో స్వస్థత కలగడానికి రోగుల విశ్వాసం అవసరం కాలేదు. కుంటివాని నుంచి విశ్వాసాన్ని కోరకుండానే పేతురు అతణ్ణి స్వస్థపరిచాడు (అపొ.కా. 3:6-8). మరణించిన తబిత అనే స్త్రీని అతడు బ్రతికించాడు (అపొ.కా. 9:36-43). అదే విధంగా అవిశ్వాస బానిస బాలిక నుంచి పౌలు దయ్యాన్ని వెళ్ళగొట్టాడు (అపొ. కా. 16:18). మృతినొందిన ఐతుకును అతడు తిరిగి లేపాడు (అపొ.కా. 20:7-12). ఆ  స్వస్థత అద్భుతాలకు విశ్వాసం ముందు అవసరం కాలేదు.

స్వస్థతను కోరే వ్యక్తి యొక్క విశ్వాసాన్నే పూచీగా ఎంచే హిన్, అతడి అనుచరుల ఆలోచన ఇది కాదు. "నీ అద్భుతానికి విశ్వాసం ప్రాముఖ్యమైనది. విశ్వాసం ద్వారా స్వస్థత లభిస్తుంది. విశ్వాసం ద్వారానే స్వస్థత భద్రం చేయబడుతుంది.24 ఆ రోగం నుంచి విడుదల పొందడానికి శక్తివంతమైన విశ్వాసం కావాలి.25 నీ హృదయం దేవునితో సరిపడితే తప్ప నీవు స్వస్థత పొందలేవు. దేవునితో నీ నడక సరిగా ఉన్నప్పుడు స్వస్థత చాలా సులభం కలుగుతుందని"26 హిన్ చెబుతున్నాడు.

"తరచుగా మా సభల్లో, దేవుడు స్వస్థపరచవలసిన వారి శరీరభాగాన్ని తాకమని నేను ప్రజలకు చెబుతాను. తమ గాయపడిన హస్తాలను కదల్చమని లేదా నొప్పిగా ఉన్న కాళ్ళను వంచమని నేను వారిని ప్రోత్సహిస్తాను. ఈ పనులేవీ వారిని స్వస్థపరచవు. కానీ దేవుని స్వస్థపరచు శక్తి యందు వారికి నమ్మకముందని ఆ పనులు తెలియచేస్తాయి. ప్రభువైన యేసు రోగులను స్వస్థపరచినప్పుడు, ఆ అద్భుతం జరగక ముందు వారిని ఏదో ఒకటి చేయమని చెప్పడం లేఖనాల్లో మీరు పదే పదే చూస్తారు" అని అతడు మరొక చోట రాశాడు.27

"ప్రజలు స్వస్థత పొందనప్పుడు వారే నిందించబడాలి" అనే భావం "స్వస్థత కలగడం అన్ని వేళలా దేవుని చిత్తం" అనే హిన్ యొక్క బోధ నుంచి వచ్చిన భావం. స్వస్థత కోసం చేసే ప్రార్థనలో “నీ చిత్తమైతే" అనే మాట వాడితే అది అల్ప విశ్వాసానికి సూచన అనేది అతని అభిప్రాయం. అందుచేత "ప్రభువు దగ్గరికి వెళ్ళి, నీ చిత్తమైతే అని ఎన్నటెన్నటికీ చెప్పవద్దు. విశ్వాసాన్ని నాశనం చేసే అటువంటి మాటలను నీ నోటి నుంచి ఎప్పుడూ రానీయవద్దు, ప్రభువా, నీ చిత్తమైతే అని నీవు ప్రార్థించినప్పుడు, విశ్వాసం నాశనమై పోతుందని హిన్ చెప్పాడు.

ఈ భావం చాలా స్పష్టమైనది, విధ్వంసకరమైనది. స్వస్థత కలగడం ఎల్లప్పుడూ దేవుని చిత్తమైతే, రోగుల్నీ బలహీనుల్నీ వారి వేదనల నిమిత్తం వారినే నిందించాలి. వారికి తగినంత విశ్వాసం లేదు. ఇదే అంశం గురించి మాట్లాడమని ఒత్తిడి చేసినప్పుడు తన బోధలోని నిర్ణయమైన భావాల నుంచి హిన్ స్వయంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

"హిన్ వాదన ప్రకారం ఎవరైనా రోగియైతే, ఆ వ్యక్తి యొక్క విశ్వాసంపైనే అతని స్వస్థత ఆధారపడి ఉంటుంది. స్వస్థత రాకపోతే, అది ఆ వ్యక్తి యొక్క తప్పిదమే అనే విషయం తప్పించుకోలేనిది, దేవునితో అతని నడక అంత పరిశుద్ధమైనది కాదు, అతని విశ్వాసం తగినంత బలమైనది కాదు. ప్రజలు స్వస్థపడకపోతే, దానికి బాధ్యులు వారేననే కఠినమైన మాటలు తాను మాట్లాడనని హిన్ చెబుతున్నప్పటికీ, ఖచ్చితంగా అతడు చేస్తున్నది అదేనని" జస్టిన్ పీటర్స్ సరిగ్గా చెప్పాడు.29

తన పరిచర్య కాలంలో ప్రజల విశ్వాసానికి యేసు తరచూ స్పందించినప్పటికీ  స్వస్థపరిచే ఆయన శక్తి యొక్క విజయం మాత్రం ప్రజల విశ్వాస పరిమాణంపై మాత్రం ఖచ్చితంగా ఆధారపడిలేదు. "నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది" అనే మాటకు ఉత్తమ అనువాదం  "నీ విశ్వాసమే నిన్ను రక్షించింది" (మత్తయి 9:22 మార్కు 5:34,10:52, లూకా 7:50, 8:48, 18:42). విశ్వాసాన్ని గురించిన ప్రభువు ఆలోచన కేవలం భౌతిక దేహాల స్వస్థతను గురించింది కాకుండా ఆత్మల రక్షణకు సంబంధించినది. కానీ బెన్నీహిన్ వంటి వంచకులైన స్వస్థతకారులు సత్య సువార్తపై ఈ దృక్పధాన్ని ఎప్పుడో కోల్పోయారు.

"రక్షణ తీర్మానాన్ని గురించిన పిలుపు ఆ సభలో లేకపోయినప్పటికీ, కానుకల గురించిన పిలుపు మాత్రం ఖచ్చితంగా ఉంది. అతణ్ణి అన్ని ప్రదేశాలకు తీసుకెళ్ళడానికి అవసరమయ్యే ఒక సొంత జెట్ (విమానాన్ని) కొనడానికి 2 కోట్ల 30 లక్షల డాలర్లు ఒప్పందంపై అప్పుడే సంతకం పెట్టాడని హెచ్చరిక సమయంలో హిన్ అస్పష్టంగా తెలియచేసాడు. అంత్యకాలంలో ఆర్థిక సహాయం చేయడానికి దేవుడు ఉద్దేశించిన గొప్ప అవకాశాల్లో ఇది ఒకటి కనుక, మన కానుక ద్వారా మనల్ని మనం నిరూపించుకోవడానికి సిద్ధపడితే, సువార్త ప్రకటించడానికి లోక సంపదను దేవుడు మనకు దయచేస్తాడని అతడు చెప్పినట్టు" హిన్ యొక్క స్వస్థత సభలో తన స్వీయ అనుభవాన్ని రఫాయెల్ మార్టినేజ్ తెలియ చేశాడు.30

ప్రపంచమంతట సువార్త వ్యాప్తి జరగాలని హిన్ మాట్లాడవచ్చు. కానీ సత్య సువార్తను ప్రకటించాలనే ఆసక్తి అతనికి లేదని స్పష్టమౌతుంది. ఒరల్ రాబర్ట్స్ మరియు అతని వంటి ఇతరులు హిన్ పొందుకున్న ఆరోగ్యైశ్వర్యాలను గురించిన ప్రోస్పారిటి సువార్త అనే ఇహపరమైన మంత్రంలో తను ప్రకటించే సువార్త వేరుపారుకుని ఉంది. దీనికి లేఖన ఆధారం లేదు. కానీ ఇది హిన్ కు చాలా సంపదను సమకూర్చింది. ఇది మనల్ని రెండవ వ్యత్యాసానికి తీసుకువస్తుంది.

2) కొత్త నిబంధన స్వస్థతలు ధన, ఘనతల కోసం చేయబడలేదు

ఎవ్వరినీ ఎన్నడూ ఇహపరమైన సంపద కోసం ప్రభువైన యేసు స్వస్థపరచలేదు. అపొస్తలులు కూడా అలా చేయలేదు. స్వస్థపరిచే శక్తిని పొందుకోవడానికి పేతురుకు ధనాన్ని ఇవ్వడానికి ప్రయత్నించిన గారడీ చేయు సీమోనును చాలా కఠినంగా అతడు గుద్దించాడు. “నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచు కొనినందున నీ వెండి నీతో కూడ నశించునుగాక!” (అపొ.కా. 8:20).

కటిక పేదరికాన్ని అనుభవించిన వారిపై, తిరిగి ఏదైనా ఇచ్చే సామర్థ్యం లేని సమాజంలోని దిక్కులేని ప్రజలపై క్రీస్తూ, అపొస్తలులూ తమ స్వస్థత పరిచర్యలను గురి పెట్టారు. గుడ్డివారైన బిచ్చగాళ్లు (మత్తయి 9:27-31, 20:29-34, 21:14, మార్కు 8:22-26) వెలివేయబడిన కుష్ఠరోగులు (మత్తయి 8:2,3, లూకా 17 :11-21) బీదలైన వికలాంగులు  (మత్తయి 9:1-8, 21:14, యోహాను 5:1-9, అపొ.కా. 3:1-10, 14:8-18)  సమాజంలో అతి దీనులైన సభ్యులు. ఆ సమాజం పాపం వలన రోగం తెచ్చుకున్నటువంటిది (యోహాను 9:2,3) కానీ యేసూ, ఆయన శిష్యులూ కనికరం చూపింది వీరికే. వారు ప్రతిగా డబ్బును ఎన్నడూ అడుగలేదు. కొత్త నిబంధన స్వస్థత అద్భుతాల వెనకున్న ప్రేరణ ఆర్థికపరమైనది కాదు. నిజానికి అది ధనానికి వ్యతిరేకమైనది. ధనాపేక్షచేత ప్రేరేపించబడే సేవకులు తప్పుడు బోధకులుగా దూషించబడ్డారు (1తిమోతి 6:5,9,10). "నీవు దేవుని మరియు సిరిని సేవించలేవు" అని యేసు చెప్పారు (మత్తయి 6:24).

తన అద్భుత కార్యాల ఫలితంగా వచ్చే పైపై పేరు ప్రఖ్యాతులను, ఆత్రుతగా ఎదురుచూసే వారిని సైతం మన ప్రభువు లెక్క చేయలేదు. జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని తరచూ స్వస్థపరిచిన వారిని ఆయన ఆజ్ఞాపించారు (మత్తయి 8:4, 9:30, మార్కు 5:43) ఆయనను పూర్తిగా నమ్మకుండా కేవలం మరికొన్ని అద్భుతాలను కోరుకుని ఆయనను రాజుగా చేయాలనుకున్న జనసమూహాల నుంచి యేసు తప్పించుకుని గలిలయ సముద్రం అవతలికి వెళ్ళిపోయారు (యోహాను 6:15). అద్భుతాలు చేయగల వారి సామర్థ్యం గురించి కాకుండా వారి నిత్యరక్షణ నందు సంతోషించమని తన శిష్యులకు లూకా 10:20 లో ఆయన ఉపదేశించారు. తన పరిచర్య కాలమంతటిలో జనసమూహం ఆయన దగ్గరకు చేరినప్పటికీ, కీర్తి ప్రతిష్టలపై మన ప్రభువు ఎన్నడూ ఆసక్తిని కనపరచలేదు. ఆయన అద్భుతాలు చేసినప్పటికీ, అదే జనసమూహం చివరికి ఆయనను సిలువ వేయమని కేకలు వేసారు.

దానికి భిన్నంగా బెన్నీహిన్ స్వస్థత పరిచర్య అతనికి పేరు ప్రఖ్యాతులనూ, వ్యక్తిగత అభివృద్ధినీ చేకూర్చింది. "వేలాదిమంది ప్రజలను దేవుని వాక్యాన్ని వినడానికి మా సభలవైపు ఆకర్షించిన వార్తాపత్రికల వారిని నేను ఏ విధంగా విమర్శించగలను?" అని తన స్వీయ జీవిత చరిత్రలో అతడు తెలియజేశాడు.31

"వాక్యాన్ని వినడానికా ?" ఈ వ్యాఖ్య కేవలం హిన్ కల్పించాడు. తన సభలకు ప్రజలు దేవుని వాక్యాన్ని వినడానికి రారు. నిష్కల్మషమైన దేవుని వాక్యాన్ని అతడు నమ్మకంగా ప్రసంగించడు. "అద్భుతాలు చూడడానికే ప్రజలు అక్కడకు వస్తారని" హిన్నే స్వయంగా గుర్తించాడు.32 "ప్రజలు నీవు ప్రసంగించే దాన్ని వినడానికి కాకుండా ఏదో చూడాలనే ఆశతో వస్తారు" అని అతడు మరొక చోట చెప్పాడు.

ఒరల్ రాబర్ట్స్ చెప్పిన సీడ్-ఫెయిత్ అనే సందేశాన్ని చేత పట్టుకొని, అద్భుతాలకై ఎదురుచూసే వారిని తన పరిచర్యకు దాతలుగా మార్చుకున్న హిన్ అత్యానంద భరితుడయ్యాడు. "ప్రజలు ఈ రాత్రికి ప్రమాణం చేస్తుండగా దేవుడు వారిని స్వస్థపరచ బోతున్నాడని నేను నమ్ముతున్నాను. ప్రమాణం చేస్తూ స్వస్థత పొందిన ప్రజలున్నారు".34 అని 2000లో టి.బి.ఎన్. అనే ఛానెల్లో ప్రసారమయ్యే "ప్రైజ్-ఎ-థాన్" శ్రోతలకు అతడు చెప్పాడు. “ఒక ప్రమాణం చేయండి. ఒక బహుమానాన్ని ఇవ్వండి. ఎందుకంటే మీ అద్భుతాన్ని మీరు పొందే ఏకైక మార్గమిది... మీరు ఇస్తుండగా, అద్భుతం ఆరంభమౌతుంది"35 అని మరొక "ప్రైజ్-ఎ-థాన్" కార్యక్రమంలో హిన్ సందేశం మరింత ముందుకు సాగింది. ఈ రకమైన విన్నపాలు “పొందడానికి ఇవ్వండి" అనే సీడ్ -ఫెయిత్ బోధలో వేరు పారి ఉన్నాయి.

మీ ప్రార్థన మనవులు స్పష్టంగా తెలియచేసి, అప్పుడు కానుకను పంపించండి. "ఇవ్వండి" అని దేవుని వాక్యం చెబుతోంది. "విత్తు అప్పుడు నీవు కోస్తావు" అని వాక్యం చెబుతుంది. (ధనం అనే) విత్తనాన్ని నాటే వరకు పంటను నీవు ఆశించకూడదు...కనుక ఆ విత్తనాన్ని నేడే పంపించు. నీవు పంపే మొత్తం నీ అవసరతపై ఆధారపడి ఉంటుంది. "పాస్టర్ గారూ, నేను దేవునికి ఎంత ఇవ్వాలి?" అని ఈ మధ్య కాలంలో ఒకాయన నన్ను సమీపించి సంఘంలో అడిగాడు. "నీవు ఏ విధమైన పంట కోసం ఎదురుచూస్తున్నావు?" అని నేను అడిగాను.36

అలా ప్రచారంలో ఉన్న పథకం కేవలం కపటంతో కూడింది. "నీవు స్వస్థత పొందాలంటే, ధనాన్ని పంపించు, ఒకవేళ నీవు స్వస్థత పొందకపోతే, నీవు తగినంత పంపించలేదని దాని భావం. లూకా 20వ అధ్యాయంలో దూషించబడిన దుష్టులైన మత నాయకుల వలే, ధనానికి ప్రతిగా అబద్ధ వాగ్దానాలు చేస్తూ బెన్నీహిన్ విధవరాండ్ర ఇళ్ళను దిగమింగుతున్నాడు. లూకా 21వ అధ్యాయంలో పేద విధవరాలివలే చాలా మంది వారి ఆఖరి రెండు కాసులు అతడికి పంపిస్తూ స్పందిస్తున్నారు.

తన ఉద్దేశాలు ధనాపేక్షతో కూడినవి కావని బెన్నీహిన్ వాదిస్తున్నప్పటికీ, 37 అతని జీవనశైలి తన ధనాకాంక్ష, దురాశల నిజతత్త్వాన్ని వెల్లడిచేస్తోంది. అనేకమంది ఉన్నత  స్థాయి ఉద్యోగస్థులను, అంగరక్షకులను దాతల ఖర్చులతోనే సూపర్ సానిక్ విమానంలో  తనతో పాటు ఐరోపాకు తీసుకువెళ్ళిన ఘటన వెలుగులోనికి వచ్చినప్పుడు అతడు చేసిన అక్రమం చాలా సంవత్సరాల తర్వాత బయటపడింది. ఆ సూపర్ సానిక్ విమానంలో మొదటి తరగతి టిక్కెట్టు ధర 8,850 డాలర్లు. హిన్ అతని అనుచరులు బసచేసిన 5 స్టార్ హోటల్ యొక్క ప్రతి రూమ్ కీ  ఒక రాత్రి అద్దె 2 వేల డాలర్లు. హిన్, అతని అనుచరులు ఆ సూపర్ సానిక్ విమానం ఎక్కుతున్నప్పటి దృశ్యాన్ని వీడియో తీసి, ఆ పూర్తి కథనాన్ని సిఎన్ఎన్ ప్రసారం చేసింది.38  హిన్ చేసిన అతి దుబారా ఖర్చు అతడు విమర్శలు ఎదుర్కొనేలా చేసింది.

అప్పటినుంచి పెద్దగా మారిందేమి లేదు. "హిన్ సంవత్సరానికి 10 లక్షల డాలర్లు పైనే సంపాదిస్తూ, సముద్రతీర ప్రాంతంలో ఒక భవనంలో నివసిస్తున్నాడని, అతి విలాసవంతమైన సరికొత్త కార్లలో తిరుగుతూ, అసలు సూపర్ సోనిక్ విమాన ప్రయాణాన్ని పట్టించుకోకుండా ఒక వ్యక్తిగత జెట్లో ప్రయాణం చేస్తున్నాడని సమాచారం".39 అంతేకాదు డైమండ్ రోలెక్స్ (వాచ్), వజ్రపు ఉంగరాలు, బంగారు కడియాలు, ఖరీదైన సూట్లు మొదలైన అతి ఖరీదైన వస్తువులను అతడు ఉపయోగిస్తున్నాడు. 40 ఇహలోక సంపదలతో అహంకారంగా విర్రవీగడమే దేవుని ఆశీర్వాదానికి సూచన అనే ప్రోస్పారిటి సువార్త పద్ధతికి ఇటువంటి డంబంతో కూడిన జీవనశైలి సరిగ్గా సరిపోతుంది. కానీ కొత్త నిబంధన పరిచర్య విధానం దీనికి పూర్తి భిన్నమైనది. అద్భుతం కోసం దేనినైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్న దిక్కులేని ప్రజల జేబులను ఖాళీ చేస్తూ, ప్రతి సంవత్సరం 10 కోట్ల డాలర్లు తన స్వస్థత సభల ద్వారా హిన్ సంపాదిస్తున్నాడు.

3) కొత్త నిబంధన స్వస్థతలు పూర్తిగా విజయవంతమయ్యాయి

యేసు, అపొస్తలుల కార్యాలు గ్రంథంలో అపొస్తలులు చేసిన స్వస్థత అద్భుతాలు ఎన్నడూ విఫలం కాలేదు. మత్తయి 14:36 లో క్రీస్తు వస్త్రపు అంచును తాకిన వారందరు పూర్తిగా బాగుచేయబడ్డారు, కుష్ఠరోగులు స్వస్థత పొందినప్పుడు, వారి స్వస్థత సంపూర్ణమైంది. కనుక యాజకుని నిశితమైన పరీక్షను ఎదుర్కోగలిగారు (లేవీ 14:3,4,10). గ్రుడ్డివారు స్పష్టమైన చూపును పొందారు, కుంటివారు పరిగెత్తి గెంతగలిగారు, చెవిటివారు వినగలిగారు. మరణించినవారు పూర్తి ఆరోగ్యాన్ని పొందారు. పూర్తిగా విజయవంతం కాని కొత్త నిబంధన అద్భుతమేదీ లేదు.

మత్తయి17:20 లో దెయ్యాన్ని వెళ్ళగొట్టలేని శిష్యుల అసమర్థతను మార్కు 8:22-26లో గుడ్డివాడిని బాగుచేయడానికి ప్రభువు ఎంచుకొన్న రెండు దశలను చూపి కొంతమంది అభ్యంతరం తెలుపవచ్చు. రెండు సందర్భాలలోనూ చివరికి సంపూర్ణ స్వస్థత జరిగిన కారణాన్ని బట్టి ఇవి పైన చెప్పబడిన నియమాన్ని నిరూపిస్తున్నాయి. శిష్యుల వైఫల్యం గురించి ఆలోచిస్తే (రోగియైన బాలుని అల్పవిశ్వాసం వలన కాకుండా) తమ అల్పవిశ్వాసాన్ని బట్టి వారు విఫలమయ్యారనేది గమనించదగ్గ వాస్తవం. ఆ సంఘటన తమ వైఫల్యాన్ని సర్థిచెప్పాలనుకునే ప్రస్తుత స్వస్థతకారులు, వారి అల్ప విశ్వాసమే సమస్యకు మూలమని గుర్తించవలసినవారై యున్నారు.

మార్కు 8:21లోని గుడ్డివాని విషయంలో శిష్యుల ఆధ్యాత్మిక అవివేకాన్ని నొక్కిచెప్పి ఒక ఆత్మసంబంధమైన పాఠాన్ని నేర్పించడానికి యేసు అతణ్ణి రెండు దశల్లో స్వస్థపరిచాడు. కానీ చివరకు ఆ వ్యక్తికి చూపును పూర్తిగా ప్రభువు అనుగ్రహించారు. కనుక సువార్తల్లో, అపొస్తలుల కార్యాల్లో ప్రతి సందర్భంలోనూ క్రీస్తూ అపొస్తలులూ నూరు శాతం విజయాన్ని సాధించారు. "అక్కడ వైఫల్యాలు లేవు. స్వస్థపరచాలనే ప్రతి ప్రయత్నం విజయవంతమైందని" 42 థామస్ ఎడ్గర్ సరిగ్గా వివరించాడు.

ప్రస్తుత స్వస్థత పరిచర్యల్లో ఏ ఒక్కటి కూడా ఈ వాక్య ప్రమాణానికి కనీసం దగ్గరగా కూడా లేదని స్పష్టంగా తెలుస్తుంది. బెన్నీహిన్ కళంకిత పరిచర్య ఈ విషయానికి ఆధారాన్ని సమకూరుస్తున్నది. తాను చేసిన స్వస్థతల్లో ఏ ఒక్క దానికీ వైద్యపరమైన నిర్ధారణలేదని హిన్ అంగీకరిస్తున్నాడు. నిజానికి తాను చేసిన స్వస్థతల్లో కొన్ని అసలు వాస్తవం కావని ఎబిసి నైట్ లైన్ 2009లో ప్రకటించింది. "2001 హిన్ క్రూసేడ్లో 9 సంవత్సరాల దృష్టిలోపం గల విలియమ్ వాండెన్ కాల్క్ తను కంటిచూపును పొందుకున్నానని చెప్పాడు. ఇపుడు వాండెన్ కాల్క్ వయస్సు 17 సంవత్సరాలు కానీ చట్టరీత్యా అతడు ఇప్పటికీ అంధుడే”44 అని నైట్ లైన్ తెలియచేసింది.

జరిగిన వాస్తవాలను బట్టి ఇబ్బంది పడుతూ, "ప్రతి ఒక్కరు ఎందుచేత స్వస్థపడట్లేదో నాకు తెలియదని"45 హిన్ బలవంతంగా ఒప్పుకోవలసి వచ్చింది. "ప్రజలపై తాను చేతులుంచినప్పుడు అనేకసార్లు ఎలాంటి కార్యమూ జరగలేదని అతడు చెబుతున్నాడు".46 తీవ్రమైన అనారోగ్యంతో నలుగురు రోగులు కెన్యా ఆసుపత్రి నుంచి హిన్ అద్భుత క్రూసేడుకు స్వస్థత పొందాలని హాజరయ్యారు. స్వస్థత పొందడానికి బదులు వారు ఆ సభ వద్దనే మరణించారని వార్తాపత్రికలు ప్రకటించాయి.47 ఆ వాస్తవాలు హిన్ రచనలను వ్యతిరేకిస్తున్నాయి.

"ద