మా విశ్వాస ప్రమాణము
I.లేఖనం
1)39 పాతనిబంధన పుస్తకాలు మరియు 27 కొత్త నిబంధన పుస్తకాలతో మొత్తం 66 పుస్తకాలు ఉన్న బైబిల్ గ్రంథం, మూలప్రతులలో ఏ పొరపాట్లు లేకుండా, బోధనలలో ఏ తప్పులు లేకుండా, ప్రతి మాట దైవావేశము వలన రాయబడి, ఎలాంటి మార్పుచేర్పులకు గురికాకుండా పరిపూర్ణంగా భద్రపరచబడిన దేవునివాక్యం అని మేము విశ్వసిస్తున్నాము. బైబిల్ గ్రంథాన్ని అలంకరించిన 66 పుస్తకాలు ఏవంటే,
పాతనిబంధనలోనివి:
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండము
యెహోషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహుము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
క్రొత్త నిబంధనలోనివి :
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతి
2 తిమోతి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథం.
(లూకా 16:29; లూకా 24:27,44 1 తిమోతి 5:18; 2 పేతురు 3:16 2 సమూయేలు 7:28; 2 సమూయేలు 23:2; కీర్తన 12:6; కీర్తన 25:5;కీర్తన 111:7-8; కీర్తన 111:43,89; కీర్తన 138:2; దానియేలు 10:21; యోహాను 17:17; అపో.కార్యములు 3:18; 1 కొరింథీయులు 2:4 , 1 కొరింథీయులు 12:16; 2 తిమోతి 2:15; 3:15-17; హెబ్రీయులు 1:1-2; 2 పేతురు 1:20-21; 2 పేతురు 3:15; కీర్తన 19:7-9 2 కొరింథీయులు 1:18-20; హెబ్రీయులు 6:17-18; ద్వితీయోపదేశకాండమ 31:11; కీర్తన 12:5-7; కీర్తన 111:7-8; కీర్తన 119:152; యెషయా 40:8; యెషయా 59:21; అపో.కార్యములు 15:21; రోమీయులు 3:1-4; ఎఫెసీయులు 2:20).
2) ఈ లేఖనాలు మాత్రమే సంపూర్ణమైన దేవుని బయలుపాటని, ప్రభు యేసుక్రీస్తు రెండవ రాకడ పర్యంతం వీటికి అదనంగా దేవుడు మరేదీ బయలుపరచడని మేము విశ్వసిస్తున్నాము.
(దానియేలు 9:24; ఎఫెసీయులు 2:20; హెబ్రీయులు 1:1,హెబ్రీయులు 2:3-4 2 పేతురు 1:19; యూదా 1:3; ప్రకటన 22:18-19).
3) లేఖనాలు మాత్రమే క్రైస్తవులు వ్యక్తిగతంగా మరియు సంఘం సామూహికంగా, ఏమి నమ్మాలో, ఏమి ఆచరించాలో తిర్మానించే నియమమై ఉండాలని, అన్ని బోధలు, అన్ని అనుభవాలు మరియు ఈ విశ్వాసప్రమాణంతో సహా అన్ని రచనలు లేఖనాల వెలుగులో తప్పక పరిశీలించబడాలని, లేఖనానుసారం కానీ దేనినైనా సంఘం అబద్ధమని గుర్తించి, తిరస్కరించి, ఖండించాలని మేము విశ్వసిస్తున్నాము.
(ద్వితీయోపదేశకాండమ 4:2; ద్వితీయోపదేశకాండమ 11:18-21; 12:32; యెహొషువ 1:8; కీర్తన 19:7-11; సామెతలు 30:5-6; యెషయా 40:6-8; మత్తయి 15:5-9; లూకా 16:31; గలతీయులలు 1:10-17; 2 తిమోతి 3:15-17; 2 పేతురు 1:3-4; ప్రకటన 22:18-19).
II. దేవుడు
1) దేవుడు ఒక్కడే అని, ఇంకెవ్వరికీ లేని, ఇంకెవ్వరూ ఏ మాత్రమూ పొందలేని ప్రత్యేక గుణలక్షణాలు కలిగియున్నాడని, ఆయనే సర్వాన్ని సృష్టించి కొనసాగించే సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాప్తుడు, సర్వజ్ఞుడు, పరిపూర్ణుడు, పరిశుధ్ధుడు, అసమాన ప్రేమాసంపన్నుడు, అపరిమిత న్యాయవంతుడు, అమరత్వముగలవాడు, మార్పు చెందనివాడు, పొరబడజాలనివాడు మరియు నిత్యుడైనవాడని మేము విశ్వసిస్తున్నాము.
(ఆదికాండము 1:1-31; 8:22; నిర్గమకాండము 20:10-11; 1 సమూయేలు 2:8; 2 రాజులు 19:15; 1 దినవృత్తాంతములు 16:26; నెహెమ్యా 9:6; యోబు 9:5-9; యోబు 26:7-14; 28:24-27; 38:1-41: 38:34; కీర్తన 8:3; కీర్తన19:1; 24:1-2; 33:6-9; 74:16-17; 89:11-12; 90:2; 90:2; 102:25; 104:1-32; 121:2; 124:8; 136:5:9; 146:6; 147:7-9; 148:3-12; సామెతలు 3:19-20; సామెతలు 8:23-31; 30:4; యెషయా 40:26-28; యెషయా 42:5; 44:24; 48:13; యిర్మీయా 10:12-13; యిర్మీయా 27:5; 31:35; 32:17; 15:15-16; ఆమోసు 4:13; ఆమోసు 5:8; 9:6; జెకర్యా 12:1; యోహాను 1:1-3; అపో.కార్యములు 4:24; అపో.కార్యములు 14:15; 17:24-28; రోమీయులు 1:20; ఎఫెసీయులు 3:9; ప్రకటన 4:11; ప్రకటన 10:6; 14:7; నిర్గమకాండము 20:5-6; సంఖ్యాకాండము 23:19; 1 సమూయేలు 15:29; 1 రాజులు 8:27; యోబు 26:6-14; కీర్తన 44:21;కీర్తన 90:2-4; 103:17; 136:1-26; సామెతలు 8:22-31; యెషయా 6:3; యెషయా 57:15; విలాపవాక్యములు 3:22-23; హబక్కూకు 1:12-13; మలాకీ 3:6; యాకోబు 1:17; 1 యోహాను 4:8).
2) ఒక్కడైయున్న ఈ దేవుడు, సమానత్వము మరియు నిత్యత్వముగల తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు మరియు పరిశుద్ధాత్ముడైన దేవుడు అనే ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా, తన అస్థిత్వాన్ని కలిగియున్నాడని మేము విశ్వసిస్తున్నాము.
( నిర్గమకాండము 3:14; కీర్తన 110:1; యోహాను 1:1; యోహాను 5:18; 8:58; 10:30-33; అపో.కార్యములు 20:28; 1 కొరింథీయులు 10:9; 1 కొరింథీయులు 15:47; 2 కొరింథీయులు 3:17-18; 1 తిమోతి 3:16; తీతు 2:13; హెబ్రీయులు 1:3; 1 పేతురు 1:2; యూదా 1,20-21).
3) తండ్రి సంపూర్ణంగా దేవుడని, కుమారుడు సంపూర్ణంగా దేవుడని, పరిశుధ్ధాత్మ సంపూర్ణంగా దేవుడని, అయినప్పటికీ వారు ముగ్గురు దేవుళ్ళు అని కానీ, ఒకే వ్యక్తి మూడు వేరువేరు పాత్రలు పోషించటం అని కానీ కాదని, ముగ్గురు వ్యక్తులుగా అస్తిత్వాన్ని కలిగియున్న ఒకే దేవుడని, అతీతుడైనవానిలో ఈ మర్మము, సర్వప్రతిష్టుడైనవానిలో ఈ విశిష్టత ఉండటం సహజమే అని మేము విశ్వసిస్తున్నాము.
( ద్వితీయోపదేశకాండమ 6:4;మార్కు 12:29; గలతీయులు 3:20; 11 రాజులు 8:27; యోబు 9:10; యెషయా 40:28; యెషయా 46:9; యోహాను 1:3; అపో.కార్యములు 17:24-25; రోమీయులు 11:33-36; యెషయా 40:18,25; 46:5; ).
III. మానవుడు
1) ప్రారంభంలో మానవుడు దేవుని పరిశుద్ధ స్వభావ సారూప్యంలో సృష్టించబడి, చిత్తస్వేచ్ఛ అనుగ్రహింపబడి, దేవునిని ఆరాధించి, ఆయనతో సహవాసము, సంభాషణ చేసే ఆధిక్యతలు కలిగియున్నాడని మేము విశ్వసిస్తున్నాము.
( ఆదికాండము 1:26-30; 2:7;,2:21-25;9:6; నిర్గమకాండము 20:11; విలాపవాక్యములు 7:29;యాకోబు 3:9).
2) మానవుని మొదటి అవిధేయతే మూలపాపమని, అది చేయటం వల్ల మొదటి మానవుడు సమస్త మానవాళికి మూలప్రతినిధిగా వారందరినీ దాని పర్యావసానమైన మరణానికి అనగా దేవుని నుండి వేర్పాటు అనే ఆత్మీయ మరణానికి గురిచేశాడని మేము విశ్వసిస్తున్నాము.
(ఆదికాండము 3:1-8;
ఆదికాండము3:16-24;ఆదికాండము5:3-5; కీర్తన 51:5; రోమీయులు 3:10-18; 5:12-14,19; 8:5-8; ఎఫెసీయులు 2:1-3; ఎఫెసీయులు 4:17-19;).
3) ఈ మొదటి పతనం కారణంగా క్రీస్తు మినహా ప్రతి మానవుడు తన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి,చిత్త స్వేచ్ఛను కోల్పోయి, ఈ స్థితి నుండి తనను తాను విమోచించుకోవటానికి ఏమీ చేయలేని అసమర్థుడై, దేవునితో సమాధానపడటానికి సామర్థ్యం కాని ఇష్టం కాని లేనివాడిగా పుట్టాడని, దేవుడే తన కృప ద్వారా రక్షణకు ఒక ఏర్పాటు చేయకపోతే, అందరూ న్యాయంగా ఆయన నుండి నిత్యము వేరుపడి నిత్య నరకాగ్నిదండనకు లోను చేయబడాలని మేము విశ్వసిస్తున్నాము .
( ఆదికాండము 3:5; కీర్తన 14:2-3; సామెతలు 12:10; 15:8; యెషయా 45:20; 64:6; యిర్మీయా 13:23; 17:9; మత్తయి 7:18; యోహాను 3:19-20; యోహాను 6:44-45; రోమీయులు 1:20-23; 3:9-12,20; 5:12;
6:116-23; 7:5; 8:5-8; 10:2-3; 1 కొరింథీయులు 2:14; 2 కొరింథీయులు 4:3-4; ఎఫెసీయులు 2:5; ఎఫెసీయులు 4:18; కొలొస్సయులు 1:21; 2:13; హెబ్రీయులు 9:14; 11:6;).
IV. రక్షణలో దేవుని సార్వభౌమాధికారం
1) రక్షణ పూర్తిగా దేవుని వలన మాత్రమే కలుగుతుందని, దానిని ఎవ్వరికైనా ఇవ్వాల్సిన బాధ్యత దేవునికి కానీ పొందే హక్కు మనుష్యులలో ఎవ్వరికైనా కానీ లేదు కాబట్టి, దేవుడు తన సార్వభౌమాధికారం, తన చిత్తం చొప్పున దానిని ఎవ్వరికైనా ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం సమర్థనీయమే అని, అలా ఆయన చేసేది తన న్యాయానికి, ప్రేమకు అనుగుణంగా, తన మహిమ కొరకే అని మేము విశ్వసిస్తున్నాము.
( ద్వితీయోపదేశకాండమ 7:7-8; యెషయా 65:1; యెహెజ్కేలు 36:22-32; రోమీయులు 8:28-3 0; రోమీయులు 9:11-23; 10:20; 1 కొరింథీయులు 1:25-29; ఎఫెసీయులు 1:11; 2 తిమోతి 1:9;).
2) తండ్రియైన దేవుడు, గత నిత్యత్వంలో తన కొరకు ఒక ప్రజను ఏర్పాటు చేసుకున్నాడని, సిలువపై క్రీస్తు ప్రాయశ్చిత్తబలి ద్వారా వారు రక్షింపబడి, తత్ఫలితంగా పరిశుధ్ధాత్ముడు వారిని తిరిగి జన్మింపచేసి, పరివర్తన కలుగజేసి, దేవునితో సమాధానపడేలా వారి హృదయాలలో మారుమనస్సును మరియు విశ్వాసాన్ని ఉచితవరంగా అనుగ్రహిస్తాడని, వారింకెన్నడూ నశించక నిత్యం జీవించేలా శాశ్వతంగా భద్రపరచబడతారని, ఇవన్నీ అందరికి కాదని, ఎందుకంటే రక్షణ "అందరికి " లేదా "సర్వలోకానికి" అని బోధించే లేఖనభాగాలన్నీ, ఏ మినహాయింపు లేకుండా అని కాక ఏ బేధము లేకుండా అందరికి అనే భావంలో చెప్పబడ్డాయని, కాబట్టి ఈ ప్రత్యేకమైన ఆధిక్యతలన్నీ దేవుని చేత ఎన్నిక చేయబడిన వారికి తప్ప ఇంకెవ్వరికీ చెందవని మేము విశ్వసిస్తున్నాము .
(కీర్తన 89:19-37; యెషయా 49:5-6; 53:11-12; లూకా 22:29; యోహాను 6:37-40; 10:29; 17:2,9; గలతీయులు 3:16-18; 2 తిమోతికి 1:9; యెషయా 44:3-4; 59:21; యెహెజ్కేలు 36:27; గలతీయులు 4:6; ఎఫెసీయులు 1:13-14; 1 పేతురు 1:2; కీర్తన 31:23; 37:24,28; 55:22; 66:9; 121:3-8; సామెతలు 2:7-8; యిర్మీయా 32:39-40; యోహాను 6:40; 10:28-29;
రోమీయులు 8:30-39; ఎఫెసీయులు 1:13-14; ఫిలిప్పీయులు 1:6; 2 థెస్సలొనీకయులు 3:3; 2 తిమోతి 1:12; 4:18; 1 పేతురు 1:3-5; యూదా 24).
3) రక్షణ కొరకు దేవుడు ఏర్పరచుకున్న వీరు ఎలాగయితే ఆయన తన ప్రేమను ప్రదర్శించే కరుణాపాత్రలుగా ఉన్నారో, అలాగే మిగిలినవారందరూ ఆయన న్యాయం ప్రదర్శించబడే ఉగ్రతపాత్రలుగా ఉన్నారని, అందుకే వారి శాశ్వతగమ్యం గురించి దేవుడు ఒక తీర్మానానికి రాలేదని చెప్పగలిగేలా ఒక్కరు కూడా ఉనికిలో ఉండరని, అంతేకాక, ఎన్నిక చేయబడిన లేదా చేయబడనివారి సంఖ్య పెరగటమైనా తరగటమైనా జరుగుతుందని తలంచటం, దేవుని రక్షణ ప్రణాళిక అపరిపూర్ణమైనది, అనిశ్చితమైనది అని చెప్పడమే ఔతుంది కాబట్టి అది నిజం కాదని మేము విశ్వసిస్తున్నాము.
( యెషయా 45:23; రోమీయులు 9:22-23; 14:11; నిర్గమకాండము 9:14-16; కీర్తన 73:17-18; సామెతలు 16:4; యిర్మీయా 6:28-30;హబక్కూకు 1:6-11;రోమీయులు 9:17,21-23; 1 పేతురు 2:8).
V. రక్షణలో మానవ బాధ్యత
1) మారుమనస్సు పొంది సువార్తను నమ్మాలనే దేవుని ఆజ్ఞకు స్పందించలేని నిస్సహాయతకు మానవుడే పూర్తిగా బాధ్యుడని, ఎందుకంటే దేవునితో సమాధానపడటానికి శక్తి కానీ ఇష్టం కానీ లేనివానిగా అతనిని చేసింది తన స్వీయపాపమే అని, అందుకే సువార్తప్రకటన అనే మాధ్యమం ద్వారా అందరు అంతటా మారుమనస్సు పొంది విశ్వసించాలని ఆజ్ఞాపించే హక్కు దేవునికుందని, సువార్త పిలుపుకు స్పందించి నమ్మలేని తన నిస్సహాయతతో నిమిత్తం లేకుండా దానికి విధేయత చూపించాల్సిన పూర్తి బాధ్యత మానవునిపై ఉందని మేము విశ్వసిస్తున్నాము.
(ద్వితీయోపదేశకాండము 10:16; మత్తయి12:13;28:18; యోహాను11:43; అపొస్తలుల కార్యములు17:30-31; రోమీయులు 2:12-16; 2థెస్సలొనీకయులు 1:8).
2) రక్షణలో దేవుని సార్వభౌమత్వం మరియు మానవుని నిస్సహాయతతో నిమిత్తం లేకుండా, దేవుడు తనవారిని రక్షణలోనికి నడిపించి ఇతరుల శిక్షావిధిని నిర్ధారించే సాధనంగా నియమించిన సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత సంఘం మీద ఉందని మేము విశ్వసిస్తున్నాము.
(యెషయా 6:9-12; మత్తయి13:13-15; మార్కు 4:11-12; 2 కొరింథీయులు 2:14-16;).
3)నిత్యభద్రతకు సంబంధించిన దైవిక వాగ్దానముతో నిమిత్తం లేకుండా, మారుమనస్సు పొంది సువార్తను నమ్మిన ప్రతి వ్యక్తి తన సొంతరక్షణను భయముతోను వణుకుతోను కొనసాగించటానికి పూర్తి జాగ్రత్త వహించాలని, అలా చేయటానికి అతడు విఫలం అయితే తన రక్షణ కోల్పోతాడని కాదు కానీ అసలెన్నడు అతడు రక్షణ పొందనేలేదని నిరూపించబడుతుందని మేము విశ్వసిస్తున్నాము.
(యోహాను 6:64-65; హెబ్రీయులు 6:4-6; 1 యోహాను 2:19;).
VI.యేసు క్రీస్తు
1) కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారునిని ఈ లోకములోనికి పంపాడని, ఆయన త్రిత్వములో రెండవ వ్యక్తిగా సంపూర్ణ దేవుడైయుండి సంపూర్ణ మానవుడయ్యాడని, ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా కన్యకయందు అద్భుతంగా జన్మించి, దేవుని ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా తృప్తిపరిచేలా జీవించి, తన సంఘానికి బదులుగా అక్షరాలా సిలువపై మరణించి దేవుని నీతిని దాని పక్షాన సంపూర్ణముగా తృప్తిపరచి, లోపరహిత నీతిని సంపాదించి ఆపాదించటం ద్వారా దానిని పూర్తిగా నీతిమంతంగా చేసాడని, మూడవ దినాన మరణాన్ని జయించి సశరీరుడుగా తిరిగి లేచి, తన శిష్యులకు మరియు అనేక ఇతరులకు కనిపించిన తరువాత పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని, యుగసమాప్తి వరకు తనవారి కొరకు అక్కడ విజ్ఞాపన చేసి, ఆపై, లోకాన్ని నిత్య శిక్షావిధికై తీర్పు తిర్చి, తన సంఘాన్ని నిత్య మహిమలోనికి చేర్చుకోటానికి అక్కడ నుండి అక్షరాలా రెండవసారి వస్తాడని, ఈ కారణాలనుబట్టి ఆయన మాత్రమే నిజమైన భావంలో ప్రవక్త, యాజకుడు మరియు రాజని మేము విశ్వసిస్తున్నాము .
(యెషయా 7:14; యెషయా 53:9; మత్తయి 1:25; లూకా 1:31-35; 2 కొరింథీయులు 5:21; హెబ్రీయులు 4:15; హెబ్రీయులు 7:26-27; 1 పేతురు 2:22-23; 1 యోహాను 3:5; కీర్తన 40:8; యెషయా 50:5; మత్తయి 3:15; 2 కొరింథీయులు 5:21; గలతీయులు 4:4; హెబ్రీయులు 2:14-15; హెబ్రీయులు 7:26; 1 పేతురు 2:22-23; 1 యోహాను 3:4-5; ఆదికాండము 22:13; నిర్గమకాండము 12:3-13; లేవీయకాండము 16:21-22; లేవీయకాండము 17:11; కీర్తన 22:1-18; కీర్తన 32:1; యెషయా 53:1-12; దానియేలు 9:24-26; జెకర్యా 13:7; మత్తయి 26:28; మత్తయి 27:35-50; మార్కు 15:24-37; లూకా 23: 33-46; లూకా 24:46; యోహాను 11:49-52; యోహాను 19:16-30; అపోస్తలుల కార్యములు 17:3; అపోస్తలుల కార్యములు 20:28; రోమీయులు 3:24-25; రోమీయులు 5:6-11; 1 కొరింథీయులు 1:30; 1 కొరింథీయులు 6:20; 1 కొరింథీయులు15:3; 2 కొరింథీయులు 5:21; గలతీయులు 1:4; గలతీయులు 2:20; గలతీయులు 3:13; గలతీయులు 4:5; ఎఫెసీయులు 1:7; ఎఫెసీయులు 2:13-17; కొలొస్సయులు 1:14, 20-22; కొలొస్సయులు 2:13-14; 1 థెస్సలొనీకయులు 5:10; 1 తిమోతి 2:6; తీతు 2:14; హెబ్రీయులు 2:9-10,17; హెబ్రీయులు 9:12-14,26-28; హెబ్రీయులు 10:10-18; హెబ్రీయులు 13:12; 1 పేతురు 1:18-19; 1 పేతురు 2:24; 1 పేతురు 3:18; 1 యోహాను 1:7; 1 యోహాను 2:2; 1 యోహాను 3:5; 1 యోహాను 4:10; ప్రకటన 1:5; ప్రకటన 5:9; యోబు 29:14; కీర్తన 32:2; కీర్తన 85:10-11; యెషయా 53:11; యెషయా 61:10; యిర్మీయా 23:5-6; రోమీయులు 3:21-22; రోమీయులు 4:6-8; రోమీయులు 5:9-11,17-19; రోమీయులు 8:1,31-39; 1 కొరింథీయులు 1:30; 2 కొరింథీయులు 5:18-21; ఎఫెసీయులు 5:25-27; కొలొస్సయులు 1:21-22; తీతు 3:6-7; యోబు 19:25-27; కీర్తన 16:10; లూకా 24:4-7; అపోస్తలుల కార్యములు 1:22; అపోస్తలుల కార్యములు 2:24-33; అపోస్తలుల కార్యములు 3:15; అపోస్తలుల కార్యములు 4:10,33; అపోస్తలుల కార్యములు 5:31; అపోస్తలుల కార్యములు10:40; అపోస్తలుల కార్యములు 13:30-37; అపోస్తలుల కార్యములు 17:3,31; రోమీయులు 1:4; రోమీయులు 4:24-25; రోమీయులు 5:10; రోమీయులు 6:4,9-10; రోమీయులు 8:34; రోమీయులు 10:9; రోమీయులు 14:9; 1 కొరింథీయులు 15:20-28; 2 కొరింథీయులు 5:15; గలతీయులు 1:1; ఎఫెసీయులు 1:20; కొలొస్సయులు 2:12; 1 థెస్సలొనీకయులు 1:10; 2 తిమోతికి 2:8; హెబ్రీయులు 1:3; హెబ్రీయులు 10:12; హెబ్రీయులు 12:2; 1 పేతురు 1:21; కీర్తన 96:13; కీర్తన110:1,6; మత్తయి 25:31-46; అపోస్తలుల కార్యములు 10:42; అపోస్తలుల కార్యములు 17:31; రోమీయులు 8:34; 2 కొరింథీయులు 5:10; 2 తిమోతి 4:1).
2) యేసు క్రీస్తు తండ్రియైన దేవునికి తక్కువగా చేయబడినది కేవలం ఆయన స్వచ్ఛందంగా చేపట్టిన సేవకుని పాత్రకు తగిన విధంగా తండ్రితో తనకున్న సమానత్వం విషయమై తనను తాను రిక్తునిగా చేసుకున్నతన శరీరధారణ మొదలుకొని తన పునరుత్తానం వరకున్న వ్యవధికి మాత్రమే పరిమితమని, అయితే తన పరిచర్య సంపూర్ణమైన తరువాత తనకు లోకం పుట్టక మునుపు తండ్రితో ఉన్న అదే మహిమలోనికి తిరిగి చేర్చబడ్డాడని మేము విశ్వసిస్తున్నాము.
( యోహాను 17:5; మత్తయి 28:18; ఫిలిప్పీయులు 2:6-9).
3) యేసు క్రీస్తు సంపూర్ణ మానవుడైనప్పుడు తన సంపూర్ణ దైవత్వానికి ఎలాంటి అంతరాయం కలగలేదని, దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా ఆయనలో నివసించేలా తన దైవత్వానికి మానవత్వాన్ని జోడించుకున్నాడని, తన మానవ స్వభావంలో పాపము తప్ప అన్ని బలహీనతలు మరియు పరిమితులకు లోనైనప్పటికీ, ఆ బలహీనతలు, పరిమితులు, తన దైవిక స్వభావాన్ని ప్రభావితం చేయలేదని అందుకే ఆయన తన శరీరధారణ మొదలుకొని సంపూర్ణ దైవమానవుడుగా ఉన్నాడని, అలాగే నిత్యము కొనసాగుతాడని, అయితే పునరుత్తానం తరువాత తన మానవత్వం, ఎలాంటి బలహీనతలు, పరిమితులు లేనివిధంగా మహిమపరచబడిందని, ఆ పరిపూర్ణ సారూప్యములోనికే చివరికి సంఘం కూడా మార్చబడుతుందని మేము విశ్వసిస్తున్నాము.
( ద్వితీయోపదేశకాండమ 18:15; కీర్తన 2:7; 110:1; యెషయా 9:6; లూకా 2:7; యోహాను 1:1,14,18; 3:16,18; 5:18; 8:58; 10:30-33; అపోస్తలుల కార్యములు 20:28; రోమీయులు 1:3; 1 కొరింథీయులు 15:47; గలతీయులు 4:4; ఫిలిప్పీయులు 2:6-8; కొలొస్సయులు 1:15; 1 తిమోతి 3:16; తీతు 2:13; హెబ్రీయులు 1:1-5;5:5;1 యోహాను 4:9,15;ప్రకటన 1:17-18; రోమీయులు 8:29; 1 యోహాను 3:2-3).
VII. పరిశుద్ధాత్మ
1) పరిశుద్ధాత్మ ఒక శక్తి లేదా ఒక దైవిక ప్రభావం అనే ఆలోచనలకు విరుద్ధంగా ఆయన ఒక వ్యక్తి అని, దైవిక త్రిత్వంలో మూడవ వ్యక్తిగా ఆయన సంపూర్ణంగా దేవుడు కాబట్టి దైవలక్షణాలన్నీ కలిగియుండి, దైవిక కార్యాలన్నీ నిర్వర్తిస్తాడని మేము విశ్వసిస్తున్నాము.
(10 1 కొరింథీయులు 2:10-11;) 11 1 కొరింథీయులు12:11; రోమీయులు 5:5; రోమీయులు 15:30; ఎఫెసీయులు 4:30; 1 తిమోతి 4:1; ప్రకటన 2:7; కీర్తన 78:17-18, యెషయా 63:10, హెబ్రీయులు 3:7-11; ద్వితీయోపదేశకాండమ 32:12, యెషయా 63:14; 2 సమూయేలు 23: 2-3, లూకా 1:68-70, అపోస్తలుల కార్యములు 1:16; అపోస్తలుల కార్యములు 5:3-4; 1 కొరింథీయులు 12:4-6; 1 కొరింథీయులు 3:16; 2 కొరింథీయులు 6:16; 2 పేతురు 1:21, 2 తిమోతి 3:16-17).
2 యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు, సార్వత్రిక సంఘంలో భాగమైనవారందరినీ తిరిగి జన్మింపజేసి, మారుమనస్సు కలిగించి, వారిలో నివసించి, వారిని పరిశుద్ధపరచి, వారిలో నూతనస్వభావం మరియు ఆత్మఫలాన్ని కలుగజేయటం ద్వారా వారు రక్షింపబడ్డారనటానికి ఆధారాన్ని, సాక్ష్యాన్ని వారిలో పుట్టించి, సంఘక్షేమాభివృద్ధి కొరకు దాని సభ్యులందరికీ ఆత్మవరాలు అనుగ్రహించటంతోపాటు, లోకాన్ని పాపం, నీతి మరియు శిక్షావిధి గురించి ఒప్పించటానికి, యేసుక్రీస్తు విజ్ఞాపన కారణంగా తండ్రి పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపాడని మేము విశ్వసిస్తున్నాము.
యోహాను 14:16-17,26; యోహాను 16:7-15; యోహాను 3:3-8; రోమీయులు 8:11-26; గలతీయులు 5:22-23; తీతు 3:5
3) విశ్వాసుల హృదయాలలోనికి పంపబడిన పరిశుద్ధాత్మ వారిని దేవుని పిల్లలుగా చేసే దత్తపుత్రాత్మ కాబట్టి భూమి మీద రక్షింపబడినవారిలో పరిశుద్ధాత్మ నివాసం లేనివారంటూ ఎవ్వరు ఉండరని, రక్షణకు వేరుగా పరిశుద్ధాత్మను పొందటానికి జరిగే రెండవ కృపాకార్యమంటూ ఏమీ ఉండదని మేము విశ్వసిస్తున్నాము.
(యోవేలు 2:28-32; యోహాను 7:37-39; రోమీయులు 8:15; ఎఫెసీయులు 1:13-17; గలతీయులు 4:6; 1 కొరింథీయులు 12:3.
VIII. సంఘం
1) అన్ని కాలాలలో మరియు అన్ని స్థలాలలో, పునరుజ్జీవింపబడిన విశ్వాసులే యేసుక్రీస్తు సార్వత్రిక సంఘమని, అందులో సభ్యత్వం పరిశుద్ధాత్మ కలగజేసే పునర్జన్మవల్ల దానంతట అదే వస్తుందని, ఆ సభ్యులు సువార్తకు విధేయమైన పలు స్థానిక సంఘాలలో ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము.
కీర్తన 2:6; కీర్తన 46:4-5; కీర్తన 48:1-2, కీర్తన 48:11-13; కీర్తన 50:2; కీర్తన 99:2; కీర్తన 102:13-21; కీర్తన 111:1; కీర్తన 118:22; యెషయా 2:3; యెషయా 28:16; యెషయా 33:5-6; యెషయా 35:8-10; యెషయా 52:7; యెషయా 62:12; మత్తయి 16:18; అపొస్తలుల కార్యములు 20:28; రోమీయులు 12:4-5; 1 కొరింథీయులు 12:24,27; ఎఫెసీయులు 1:6,13; ఎఫెసీయులు 2:20-22; ఎఫెసీయులు 5:23-32; కొలొస్సయులు 1:18; 1 థెస్సలొనీకయులు 1:1; 2 థెస్సలొనీకయులు 1:1; 1 తిమోతి 3:15; తీతు 1:9; తీతు 2:15; యాకోబు 1:21; ప్రకటన 21:12
2) సమాజంగా ఆరాధించటం, సహవాసం చేయటం, ఒకరినొకరు హెచ్చరించి బలపరచడం, క్రీస్తునందున సహోదరుల పట్ల ప్రేమ కలిగియుండటం, తమకు అప్పగించబడిన ఆత్మల విషయమై శ్రద్ధవహించే కాపరుల పర్యవేక్షణకు విధేయులవ్వటం, క్రైస్తవ జవాబుదారీతనం, ప్రభుబల్లలో పాల్గొనటం మొదలైన క్రైస్తవ బాధ్యతలు సమాజంగా కాక ఒంటరిగా నిర్వహించటం సాధ్యపడదు కాబట్టి, వీటిలో ఏదయినా ఒకటి తప్పటం దేవుని వాక్యానికి బహిరంగ ధిక్కారం ఔతుంది కాబట్టి, సరైన క్రైస్తవ సాక్ష్యానికి కూడా అది విఘాతం కలిగిస్తుంది కాబట్టి, ప్రతి విశ్వాసి ఒక స్థానిక సంఘంలో బాప్తిస్మము పొందిన సభ్యుడిగా ఉండాలని, ఎట్టిపరిస్థితిలోను ఒక క్రైస్తవుడు సంఘానికి వేరై తన క్రైస్తవ జీవితాన్ని ఒంటరిగా కొనసాగించే ప్రయత్నం చేయరాదని మేము విశ్వసిస్తున్నాము.
మత్తయి 18:20; అపోస్తలుల కార్యములు 2:42; హెబ్రీయులు 10:24-25.
3) ప్రతి స్థానిక సంఘం నిజ మరియు నకిలీ విశ్వాసుల మిశ్రిత జనమని, అయితే యుగ సమాప్తియందు ప్రభువు వారిని వేర్పరచేంత వరకు మనుష్యులెవ్వరు వారిని వేరు చేయకూడదని, అప్పటివరకు వారిని కలిసి కొనసాగనివ్వాలని, అయినప్పటికీ బోధలో, పవిత్రతలో, రాజీపడని నైతికత, మరియు ఓరిమితో బోధించటం, ఖండించటం, దిద్దుబాటు చేయటం, లేఖనాలు సూచించిన కారణాలను బట్టి సభ్యులను వెలివేయటం, మారుమనస్సు పొందినవారిని తిరిగి చేర్చుకొనటం లాంటి క్రమశిక్షణాచర్యలను నిర్వహించే బాధ్యత నుండి ఇది సంఘాన్ని ఎంతమాత్రమూ మినహాయించదని, ఇవన్నీ సంఘంలో వాక్యక్రమం మరియు క్రమశిక్షణ అమలుపరచటానికి అవసరమని మేము విశ్వసిస్తున్నాము.
మత్తయి 13:24-43, మత్తయి18:15-20, 1 కొరింథీయులు 5:1-13, గలతీయులు 6:1, 1 తిమోతి 5: 19-20, యాకోబు 5:19-20.
IX.ఆరాధన
1) దేవుడు ఎలా ఆరాధించబడాలో ఆయనే తన వాక్యంలో స్పష్టంగా బోధించాడని, ఆయన తన వాక్యంలో క్రమబద్ధీకరించిన విధంగా మాత్రమే ఆరాధించటం సంఘం బాధ్యత అని, అందులో ఆజ్ఞాపించిన దేనికైనా కలిపి లేదా దేనినైనా చెరిపి దానిని మార్చే అధికారం ఏ మానవుడికి లేదని, అలాంటి ప్రయత్నమేదైనా జరిగితే దానిని మనుష్యులు కల్పించిన పద్ధతిగా, ధిక్కారంగా ఎంచి, దానిని విసర్జించాలని మేము విశ్వసిస్తున్నాము.
లేవీయకాండము 10:1-2, ద్వితీయోపదేశకాండమ 12:30-32, ద్వితీయోపదేశకాండమ 13:1-4 యెషయా 8:20; మత్తయి 15:1-12; యోహాను 7:24; అపోస్తలుల కార్యములు 17:11; గలతీయులు 1:8-9; 1 యోహాను 4:1 ).
2) ప్రార్థన, బహిరంగ లేఖన పఠనం, స్తుతి చెల్లించటం, వాయిద్యాలు చక్కగా వాయిస్తూ పాటలు పాడటం, దేవుని మంచితనాన్ని ప్రకటిస్తూ సాక్ష్యాలు చెప్పటం, దేవుని వాక్యం వినటం మరియు రక్షకుని శరీరధారణ, పునరుత్తానం మరియు రెండవరాకడలతో విడదియ్యరాని సంబంధమున్న ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బల్లలో పాల్గొనటం, లేఖనాలలో నేర్పించబడిన సరైన ఆరాధన క్రమాన్ని, ప్రతి ప్రభువుదినమందునూ, జరిగే కూడికలన్నిటిలో ఇవి ఆచరించబడాలని, ఇందుకు అదనంగా ఏ ఇతర దినాలలోనైనా సరే, దేవుడు సంఘానికి మొత్తంగా లేదా ఏదయినా సభ్యులకు వ్యక్తిగతంగా చేసిన ఏదయినా మేలు కొరకు కృతజ్ఞతాకూడికలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని, అవి క్రీస్తునందున్న విశ్వాసుల ఐక్యతను బట్టి సంతోషించి దేవునికి మహిమనిచ్చే విధంగా క్రమంగాను, మర్యాదగాను జరగాలని మేము విశ్వసిస్తున్నాము .
మలాకీ 3:16; మత్తయి 18:19; మత్తయి 21:13; అపో స్తలుల కార్యములు 2:42; ఎఫెసీయులు 5:19-20; కొలొస్సయులు 3:16 1 థెస్సలొనీకయులు 5:16-18; కీర్తన 150).
3) దేవుని నామంలో లేదా దేవుని కొరకు, సువార్త ప్రకటన లేదా బైబిల్ లోని ఏదయినా సంఘటనకు జ్ఞాపిక అనే సాకులతో, అన్యఆచారాలతో సంబంధమున్న ఏదయినా పండుగదినాన్ని లేదా ఏదయినా ఇతర ఆచారాన్ని జరపటం దేవుని ఆరాధనను అపవిత్రపరచటమే ఔతుంది కాబట్టి క్రిస్మస్, శ్రమదినాలు, శుభ శుక్రవారం, ఈస్టర్, సమాధులపండుగ లాంటివింకేవైనా సరే, ఎట్టిపరిస్థితిలోను అనుమతించకూడదని, అలాగే, వివాహం, జననం, మరణం లాంటి సందర్భాలలో కూడా, అన్యమతాల నుండి ఆవిర్భవించిన ఎలాంటి ఆచారాలనైనా సహించకూడదని మేము విశ్వసిస్తున్నాము.
(ద్వితీయోపదేశకాండమ 32:30-32; 1 సమూయేలు 15:22; మత్తయి 15:6-7; మత్తయి 16:6,12; 2 థెస్సలొనీకయులు 2:15.
X. బాప్తిస్మము మరియు ప్రభుబల్ల
1) బాప్తిస్మము మరియు ప్రభుబల్ల మాత్రమే సంఘానికి అప్పగించబడిన పవిత్ర ఆచారాలని, అవి రక్షణ పొందటానికి చేసే పుణ్యకార్యాలు కావు కాని వేటికి నిదర్శనాలుగా అవి రూపొందించబడ్డాయో వాటికి అవి సాదృశ్యాలు మాత్రమే అని మేము విశ్వసిస్తున్నాము.
(మత్తయి 28:18-20, 1 కొరింథీయులు 11:23-28; ఎఫెసీయులు 2:8-10 .
2) మారుమనస్సు పొంది యేసుక్రీస్తును విశ్వసించిన తరువాత మాత్రమే బాప్తిస్మమివ్వాలని, ఇవి మాత్రమే అందుకు కారణాలయ్యుండాలని, ఎట్టి పరిస్థితిలోను, ఇతర కారణాలను బట్టి ఎవ్వరికీ అది అనుమతించకూడదని, ప్రాచీన పురుషుని భూస్థాపన మరియు యేసుక్రీస్తు కృప పునరుజ్జీవించిన నూతనత్వాన్ని సరిగ్గా చిత్రీకరించే ముంచుడు పద్ధతిలో కాకుండా మరేవిధంగాను అది ఇవ్వకూడదని, ఆరోగ్యాలేమి లేదా నీటికొరత వల్ల ముంచటం అసాధ్యమైనప్పుడు అది చేయకపోయినా పర్వాలేదు కాని, చిలకరించటం, పోయటం, ఇసుకలో ముంచటం, జెండా క్రిందగా వెళ్ళటం లేదా మరేదయినా బైబిలేతర పద్ధతిలో దానికి ప్రత్యామ్నాయాలు కల్పించటం సరికాదని మేము విశ్వసిస్తున్నాము.
(మార్కు 16:16; అపోస్తలుల కార్యములు 2:37-39; రోమీయులు 6:3.
3) ప్రభురాత్రి భోజనంలో రొట్టె మరియు ద్రాక్షరసం, పాపపరిహారార్థమై అప్పగించబడిన క్రీస్తు శరీరానికి మరియు చిందించబడిన ఆయన రక్తానికి కేవలం సాదృశ్యాలు మాత్రమే అని, మారుమనస్సు పొంది, నమ్మి బాప్తిస్మము పొందినవారు మాత్రమే అందులో పాలుపంపులు పొందాలని, అక్షరాలా (పదార్థాంతరం చెందిన) ప్రభువు శరీరరక్తాలను ఆరగిస్తున్నట్లు కాక ఒక్కసారే సిలువపై ఆయన చేసిన అసలు బలియర్పణకు జ్ఞాపికలుగా మాత్రమే వాటిని సేవించాలని మేము విశ్వసిస్తున్నాము.
మత్తయి 26:26-28, మార్కు 14:22-24, లూకా 22:19-20, 1 కొరింథీయులు 11:23-28.
XI. వివాహం మరియు కుటుంబం
1) వివాహం కేవలం దేవుని ఏర్పాటు మాత్రమే కాదు కాని, ప్రతి వివాహంలోనూ, ఒక పురుషుడిని ఒక స్త్రీని ఏకశరీరమయ్యేలా జతపరచేది ఆయనే అని, ప్రమాణాలు చేసుకోవటం మాత్రమే లేక సంయోగం ద్వారా మాత్రమే కాక ఈ రెండిటి ద్వారా ఇది జరుగుతుందని, ఈ రెండింటిలో ఏ ఒక్కటి లోపించినా అది వివాహం కాదని, ఇలా క్రైస్తవ లేదా ఇంకేదయినా స్థానిక వివాహ చట్టం ద్వారా చట్టబద్దం చేయబడిన వివాహాన్ని, ఆ ఇరువురిలో ఒకరి మృతివల్ల, వ్యభిచారం చేయటం, ప్రాణాపాయం తలపెట్టటం, బ్రతకటానికి అవసరమైనవి ఇవ్వకమానటం, లేదా ఉద్దేశపూర్వకంగా సంసారధర్మం చేయకపోవటం ద్వారా వారు కనబరచిన అపనమ్మికవల్ల, లేదా వారిలో విశ్వాసియైన ఒకరు శక్తివంచన లేకుండా ఎంత ప్రయత్నించినా, అవిశ్వాసియైన మరొకరు వివాహంలో కొనసాగటానికి నిరాకరించటం వల్ల తప్ప, వారికి కానీ మరింకెవ్వరికైనా కానీ రద్దు చేసే అధికారం లేదని మేము విశ్వసిస్తున్నాము.
ఆదికాండము 2:18,21-24; మత్తయి 19:1-12; మలాకీ 2:14-16; 1 కొరింథీయులు 6:16; 1 కొరింథీయులు 7.
2) ఒక పురుషుడు మరియు ఒక స్త్రీని తమకు వివాహమైననాటి నుండి పరస్పర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని, ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా తమ కుటుంబ నిర్ణయాలు తామే తీసుకునేలా, తమ తల్లితండ్రులపట్ల ఉండాల్సిన బాధ్యతలు, ప్రేమ మరియు సన్మానానికి భంగం కలిగించకుండా జాగ్రత్త వహిస్తూనే, వారి నియంత్రణ మరియు పర్యవేక్షణ నుండి స్వత్రంతులవ్వాలని, గృహములో తమ తమ పాత్రలను మరియు బాధ్యతలను నేర్చుకొని సక్రమంగా నిర్వర్తించాలని, ఇరువురు మంచి తల్లితండ్రులుగా తమ పిల్లలు దేవుని భయం మరియు వాక్యజ్ఞానంలో ఎదిగేలా కుటుంబంగా కలిసి ఆరాధించి, వాక్యం చదివి ప్రార్థన చేసుకునే సమయాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని మేము విశ్వసిస్తున్నాము.
ఆదికాండము 2:21-24; ఎఫెసీయులు 5:22 . ఎఫెసీయులు 6:3
3) వివాహమే సాధారణంగా అందరికి ఉన్న పిలుపని, పలువిధాల పాపాలు మరియు శోధనలను తప్పించుకునేలా సకాలంలో వివాహం చేసుకోటానికి కావలసిన ఉపాధిని స్థిరపరచుకొని ఇతర ఏర్పాట్లతో సిద్ధపడటానికి జాప్యం చేయకూడదని, అవివాహితులుగా ఉండటం చాలా అరుదుగా ఇవ్వబడే వరం కాబట్టి, ఆ వరనిర్ధారణ జాగ్రత్తగా చేసుకోకుండా మ్రొక్కుబడి లేదా అత్యాశక్తివల్ల, ఎవరూ తమకు తాముగా అలాంటి తిర్మానాలు చేసుకోటానికి త్వరపడకూడదని మేము విశ్వసిస్తున్నాము.
మత్తయి 19:10-12 1 కొరింథీయులు 7:7-9.