దేవుడు మనుష్యులను ఎంతగానో ప్రేమించాడు. మానవుడు తనను తాను పాపము నుండి విడిపించుకోలేక, జీవము గల దేవుని చేరలేకపోతున్నాడు. బైబిలు చెబుతుంది - మనము మొదటి మానవుని ద్వారా పాప స్వభావమును సంక్రమించుకున్నాము, మరియు మనము వ్యక్తిగతంగా దేవుని ఆజ్ఞలను పాటించకుండా పాపము చేస్తూ వస్తున్నాము. పాపము వలన వచ్చు జీతము మరణము (భౌతిక మరణము మరియు ఆత్మ మరణము)(ఆత్మ మరణమనగా మానవుడు ఇక ఎప్పటికీ దేవుని చేరుకోలేక ఆయనను ద్వేషిస్తూనే ఉంటాడు)
చాలాకాలం క్రితం గ్రీకు దేశాన్ని ఆర్కియాస్ అనే రాజు పరిపాలించాడు. అతను చాలా స్వార్థపరుడు. ప్రజల అవసరాలు, ఇబ్బందులు గురించి ఏమాత్రం పట్టించుకునేవాడు కాడు. ఎంతసేపూ వినోదంగా గడుపుతూ, బాగా తింటూ ఉండాలన్నదే అతని తత్త్వం. భవిష్యత్తు గురించి ఆలోచించడం అతని దృష్టిలో తెలివితక్కువతనం. కాబట్టి ప్రజలు అతనిని ద్వేషించేవారు. చివరికి వారిలో కొందరు అతని హత్యకు కుట్ర కూడా పన్నారు.
ఈ రోజు మానవుడు విజ్ఞాన, సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించినట్లు ముందెన్నడూ సాధించలేదు. అయినా, ఈ రోజు మానవుడు మానసిక సమస్యలతో కలవరం చెందినట్లు ఎన్నడూ కలవరం చెందటం లేదు. ఒక్కసారి మనస్సాక్షి గురించి ఆలోచించండి, ఈ విచిత్రమైన బుద్ధి ఎమిటి ? ఇది ఎలా పనిచేస్తుంది ? మనస్సాక్షికి వ్యతిరేకంగా నడిచినప్పుడు ఏమి సంభవిస్తుంది?
భారత దేశం బహు సౌందర్యమైంది. ఎతైన పర్వతశిఖరాలు, సుందరమైన అడవులు, మనోహరమైన నదీతీరాలు, మైదానాలతో శోభిల్లే దేశం. అయినా గోపాల్ కి ఈ సుందరదృశ్యాలు చూసే భాగ్యం లేదు. అందుకు కారణం గోపాల్ పుట్టుగ్రుడ్డివాడిగా పుట్టడమే. అంతేకాక పసితనంలోనే తల్లిదండ్రులు ఇద్దరినీ పోగొట్టుకున్న దౌర్బాగ్యుడు అతను. అయితే గోపాల్ కు మిగిలిన ఒకే ఒక ఆశ్రయం 'అమ్మమ్మ'. పేదరికం, వృద్ధాప్యంతో కృంగిపోయిన యీ ముసలమ్మ గోపాల్ ను ఎలా పెంచగలదు? దిక్కులేనివారికి దేవుడే దిక్కు!
ఒక వేసవికాలం సాయంత్రాన లండన్ మహానగరం వీధుల్లో ఒక యువకుడు అలసిపోయిన దేహంతో, విచారం కమ్మిన ముఖంతో అటుఇటు తిరుగుతున్నాడు. అతని వాలకం చూస్తే క్రమశిక్షణ లేకుండా జీవించి, డబ్బంతా వృథాగా ఖర్చు చేసుకుని, ఖాళీ జేబులతో ఆకలిగొన్నవాడిలా కనిపిస్తున్నాడు. మరునాటి ఉదయమే ఆతడు న్యూయార్కు వెళ్ళవలసియుంది. అది ఆదివారం కనుక ఇంగ్లాండులో అతడు గడిపే ఆఖరి రాత్రి సువార్త కూటానికి హాజరై దేవుని సందేశము వినాలని అతని స్నేహితుడొకడు బ్రతిమిలాడాడు. ఆ కూటంలో ప్రసిద్ధిగాంచిన సువార్తికుడు మాట్లాడవలసియుంది.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.