images//new_theme/Spandana-desktop-1.jpg

నిర్గమ. 11 - 13; హెబ్రీ. 11: 28

ఉద్దేశము
మన పాపముల నుండి విడిపించబడుటకు ఉన్న ఏకైక మార్గం యేసుని విశ్వసించుట మాత్రమే అని బోధించుట.

ముఖ్యాంశము
కుటుంబముగా కారులో ప్రయాణం చేస్తూ మీరు ఎప్పుడైనా దారి తప్పిపోయారా? అలా తప్పిపోయినప్పుడు మీ తల్లిదండ్రులు కారు కిటికీలో నుండి దారి కోసం కనబడిన వారిని అడుగుతుంటారు. వారు చెప్పిన గుర్తులు జాగ్రత్తగా విని, వాటి ప్రకారం ప్రయాణించినప్పుడు మీ గమ్యాన్ని సరిగా చేరుకోగలరు. ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పిన ఆజ్ఞలకు సూచనలకు లోబడి ఏ విధముగా నడుచుకున్నారో ఈ రోజు చూద్దాము.

గతావారము
ఫరో మీదికి, ఐగుప్తీయుల మీదికి దేవుడు పంపిన తొమ్మిది భయంకరమైన తెగుళ్లు గురించి గతవారం చూశాము. ప్రభువు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను పంపుమని ఫరోకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ అతడు తన హృదయ కాఠిన్యాన్ని బట్టి వారిని పంపలేదు. ఈరోజు చివరి తెగులు గురించి తెలుసుకుందాం. ఈ పదవ తెగులు అత్యంత భయంకరమైనది కనుక ఐగుప్తీయులతో పాటు ఫరోకూడా ఇశ్రాయేలీయులను తమదేశం విడిచివెళ్ళి పోవలసినదిగా త్వరపెట్టాడు.

తొమ్మిది తెగుళ్ల తరువాత తనను మరెన్నడూ కలువవద్దు అని ఫరో మోషేకు ఆజ్ఞా పించాడు. ఫరో సన్నిధి నుండి వెళ్లకముందు మోషే పదియవ తెగులు గురించి హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఐగుప్తులోని ప్రతి కుటుంబంలో తొలి సంతానం మరణిస్తారు అనేది ఆ పదవ తెగులు. వారు చెప్పిన తొమ్మిది తెగుళ్ళు తమ మీదకు వచ్చినప్పటికీ, పదవ తెగులు గురించి మోషే చెప్పిన మాటలు ఫరో నమ్మలేదు.

దేవుని ప్రత్యేకమైన ఆజ్ఞలు సూచనలు
తాను కలుగజేయబోవుచున్న పదవ తెగులు గురించి ప్రభువు మోషే అహరోనులకు వివరించాడు. అప్పుడు వారు ఫరో దగ్గరకు వెళ్ళి - "ఒక దినము మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశం లోనికి బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలి పిల్ల మొదలుకుని తిరుగలి విసరు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరు చచ్చెదరు. జంతువులలోకూడా తొలి పిల్లలన్నియు చచ్చును. అప్పుడు నీ సేవకులైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారముచేసి నీవును నిన్ను ఆశ్రయించిన ఈ ప్రజలందరును బయటకి వెళ్ళుడి అని చెప్పుదురు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు" అని చెప్పి ఫరో యొద్దనుండి కోపముతో వెళ్లిపోయారు. ఆ తెగులు నుండి తప్పించుకొనుటకు ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పిన ఆజ్ఞలను అనుసరించవలసియున్నది. దేవుని మాటలు వినిన ప్రతిఒక్కరు ప్రాణములతో ఉంటారు.

దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు

  • ఆ నెల పదవ దినమున ఇశ్రాయేలీయులు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను, ఒక మేక పిల్లనైనను తీసుకోవాలి (నిర్గమ.12:3)
  • ఆ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు ఆ గొర్రె పిల్లను చంపాలి( నిర్గమ. 12: 7)
  • గొర్రెపిల్ల రక్తము కొంచెము తీసి ఇండ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్ముల మీదను, ఫై కమ్మి మీదను చల్లాలి (నిర్గమ. 12:7)
  • ఆ రాత్రి అగ్నిచేత కాల్చబడిన మాంసమును, పొంగని రొట్టెలను తినాలి. చేదు కూరలతో దానిని తినాలి (నిర్గమ.12:8)
  • నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కుని కర్రలు పట్టుకుని త్వరపడుచు దానిని తినాలి (నిర్గమ. 12:11)
  • పైన వివరించిన ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకు అర్థం కాకపోయినప్పటికీ వారు దేవుని మాటలకు విధేయత చూపాలి. వారు దేవుని మాటలను విశ్వసించి ఆహారం సిద్ధపరచుకుని, ప్రయాణం కొనసాగించుటకు సిద్ధపడసాగారు.

    సిద్ధపాటు
    దేవుడు చివరి తెగులు పంపుటకు ముందు ఇశ్రాయేలీయులకు సిద్ధ పడటానికి ఎక్కువ సమయం లేదు. ప్రయాణములో తమకు అవసరమైన వాటిని తీసుకుని వెళ్లాలి. బట్టలు, వంట సామానులు తమ గాడిదల మీద వేసి ఉంటారు. ఐగుప్తీయుల దగ్గరనుండి వెండి నగలను, బంగారు నగలను,మంచి బట్టలను తీసికొనుమని దేవుడు ఇశ్రాయేలీయులకు సెలవిచ్చాడు. వారు చేసిన కఠినమైన దాసత్వానికి వారు ఐగుప్తీయులను దోచుకోవడం సరియైనదే. దేవుడు అబ్రాహాముతో ముందుగానే ఇశ్రాయేలీయులను గూర్చి - "మీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీ ర్పుతీర్చెదను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు" అని చెప్పాడు (ఆది. 15:14).

    పస్కా పండుగ లేదా పులియని రొట్టెల పండుగ
    చివరకు ఆ దినము సాయంకాలము రానేవచ్చింది. ఇశ్రాయేలీయులు కుంచెను రక్తములో ముంచి ద్వారబంధపు పై కమ్మీ మీదను రెండు నిలువు కమ్ములకును తాకించాలి. వారు మంచి వస్త్రములు ధరించుకొని బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నారు ఇవన్నియు వారు దేవుడు ఆజ్ఞాపించిన విధముగానే చేశారు.

    ఉదయం వరకు ఎవరూ ఇంటి ద్వారం నుంచి బయటకురాకూడదు అని మోషే ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ప్రభువు ఐగుప్తీయు లను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు కమ్మీలమీదను, రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి ఆ తలుపును దాటిపోవును కనుక ఆ ఇంటిలో మరణం సంభవించదు అని వారికి వివరించాడు. ద్వారబంధం మీద రక్తం లేని ఇంటిలో జ్యేష్ఠ కుమారుడు మరణిస్తాడు ఎంత భయంకరం! కానీ ఎవరి పొరపాటు వలన ఆ విధంగా జరగబోతుంది? ఫరో చేసిన పొరపాటువలననే కదా! ఫరో దేవునికి విధేయత చూపితే ఐగుప్తు మీదకు తెగుళ్లు వచ్చేవి కావు. అతడిని హెచ్చరించినప్పటికీ పట్టించుకొనలేదు. ఫరో చెడుతనము వలననే ఐగుప్తులో ప్రతికుటుంబములో జ్యేష్ఠ కుమారుడు మరణించవలసివచ్చింది. ఇశ్రాయేలీయుల ద్వారబంధపు కమ్ములపై రక్తముచూచి ప్రభువు వారిని సంహరించకుండా విడిచిపెట్టాడు. దేవుడు ఇశ్రాయేలీయులతో - "మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను" అని వాగ్దానం చేశాడు (నిర్గమ. 12:13). అందుకే దానిని పస్కాఅనగా దాటి పోవుట అని పిలుస్తారు. దేవుడు ఇశ్రాయేలీయులను చంపకుండా దాటి పోయాడు కనుక పస్కాదినము అని అంటారు. ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరూ ప్రభువు మాటలకు విధేయత చెప్పినందువలన వారిలో ఏ ఒక్కరు కూడా మరణించలేదు. ద్వార బంధపు కమ్ముల మీద పూయబడిన రక్తము వారిని క్షేమంగా ఉంచింది.

    ఫరో విడిచిపెట్టుట
    ఐగుప్తీయులుకు ఆరోజు రాత్రి ఎంత భయంకరమైనది! ఆ రోజు అర్ధరాత్రి సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్లవరకు ఐగుప్తు దేశములో తొలి పిల్లలు అందరూ చనిపోయారు. ఫరో జ్యేష్ఠ కుమారుడు కూడా చనిపోయాడు. ఫరో, అతని సేవకులు చూచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటి కూడా ఐగుప్తులో కనబడలేదు. అందువలన ఐగుప్తు దేశములో మహా దుఃఖం కలిగింది. అప్పుడు ఫరో ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి పంపివేయాలి అనుకున్నాడు. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో - "మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి మీ దేవుని సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను, మీ పశువులను తీసుకొనిపొవుడి నన్ను దీవించుడి" అని చెప్పాడు. ఐగుప్తీయులు తమ దేశములోనుండి ఇశ్రాయేలీయులను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేశారు కనుక ఇశ్రాయేలీయులు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లలో దానిని మూటకట్టుకుని తన భుజముల మీద పెట్టుకుని బయలుదేరారు. ఇశ్రాయేలీయులు మోషే చెప్పినట్లు ఐగుప్తీయుల దగ్గరనుండి వెండి బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకుని వారిని దోచుకున్నారు. ఫరో మనస్సు మారకముందే వారు ఐగుప్తు విడిచి పెట్టారు. ఐగుప్తులో కఠినదాస్యములో కూడా తమతో ఉండి అక్కడ నుండి విడిపించిన దేవునికి వారు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించి ఉంటారు.

    సందేశము
    ఫరో చేతి నుండి తన మహాశక్తి తో దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించిన విషయాన్ని ఈరోజు చూశాము. ఐగుప్తులో జ్యేష్ఠ సంతానమును చంపుట దేవునికి సంతోషము కలిగించే విషయం కాదు. కాని ముందు పంపిన తొమ్మిది తెగుళ్లు ఫరోలో ఎటువంటి మార్పు కలిగించలేదు. మరణం అనే తెగులు దేవుడు పంపిన తరువాత ఫరో ఇశ్రాయేలీయులను త్వరపడి పంపివేశాడు. ఫరో దుష్టత్వము, కఠిన హృదయం కలవాడు కనుక దేవుడు అతనికి తీర్చు తీర్చవలసి వచ్చింది. యోసేపు కుటుంబము అనేక సంవత్సరములు ఐగుప్తులో నివసించిన తరువాత వారు ఇప్పుడు కనాను దేశము వెళ్ళుటకు బయలుదేరారు. దేవునికి విధేయులైనందున ఇశ్రాయేలీయులు మరణం అనే తెగులు నుండి రక్షింపబడ్డారు. ద్వారబంధపు కమ్ములమీద రక్తమును చూచి దేవుడు వారిని సంహరించకుండా దాటిపోయాడు.

    అన్వయింపు
    దేవుడు చెప్పిన మాటలు ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా పాటించారు. మరణము నుండి తప్పించడానికి ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తాన్ని వారి ద్వారబంధం కమ్ములమీద పూయవలసివచ్చింది. యేసు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన సిలువపై తన రక్తము చిందించుట ద్వారా పాపులకు రక్షణ దయచేశాడు (యోహాను1:29;1కొరింథీ.5:7). నిత్య నరకం నుండి తప్పిం చుకొని రక్షింపబడుటకు దేవుని ఆజ్ఞలను మనము నెరవేర్చాలి. ఆయనకు విధేయత చూపాలి. మన పాపములు క్షమించమని దేవుని అడగాలి. ఆయన చిందించిన రక్తము మనలను ర క్షింపగలదు అని విశ్వసించాలి. యేసు రక్తము ద్వారా పాపవిమోచన కలుగుతుంది అని మనము విశ్వసించిన యెడల దేవుడు మన పాపములను క్షమించి, మనము మరణించినప్పుడు మనకు ఎటువంటి శిక్షను విధించడు. మనము నిత్యజీవము లోనికి నడిపించబడతాము. మనము దేవుని ప్రేమించి ఆయనను వెంబడించు వారుగా ఉంటాము.

    కంఠతవాక్యము
    "ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు" అని చెప్పాడు అ.కా. 16 31.

    ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

     

    పుస్తకాలు
    More articles ...
    More articles ...
    More articles ...
    More articles ...

    తెలుగు బైబిల్

    మా వెబ్సైట్లో ఉన్న వ్యాసాలు, పుస్తకాలు చదివేవారి సౌకర్యార్థం BSIవారు అనువదించిన తెలుగు బైబిల్ కూడా మీకు అందుబాటులో ఉంచబడింది. ఈ బైబిలుకు క్రాస్ రిఫరెన్సులు, స్ట్రాంగ్స్ నెంబర్లు జత చేస్తూ ఉన్నాము. లోతుగా లేఖనాలను అధ్యయనం చేయటానికి ఈ వనరులు ఎంతగానో ఉపయోగపడతాయి. వాడుక భాషలో తెలుగు బైబిల్ అనువాదాలను కూడా ఇక్కడ పొందు పరచాలనుకుంటున్నాము. ఈ ప్రక్రియ అంతా త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు అందుబాటులోకి వచ్చేలా దయచేసి ప్రార్థించండి.

    బైబిల్ వ్యాఖ్యానాలు
    పూర్తి బైబిలును వచనం వెంబడి వచనం క్రమబద్ధంగా అర్థం చేసుకోవడానికి, ఆచరించటానికి బైబిల్ వ్యాఖ్యానం నేరుగా దోహదపడుతుంది. ఇందుకోసమే ఒక్కొక్క గ్రంథం యొక్క వ్యాఖ్యానాన్ని మీకు అందుబాటులోకి తెస్తూ ఉన్నాము.
    ఆడియోలు మరియు వీడియోలు
    వ్యాసాలు, పుస్తకాలతో పాటు ఆడియో,వీడియో వనరులు కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి.
    01

    ఆడియోలు

    అనేక ఆధ్యాత్మిక సందేశాలు, అలాగే వ్యాసాల, పుస్తకాల రికార్డింగులు మీకిక్కడ లభిస్తాయి.
    02

    వీడియోలు

    YOUTUBE CHANNEL ద్వారా అనేక ఆధ్యాత్మిక సందేశాలు, అలాగే వ్యాసాల, పుస్తకాల వీడియోలు మీకిక్కడ లభిస్తాయి.

    Store

    హితబోధ పుస్తకాలు Onlineలో ఆర్డర్ చేయడం కొరకు ఈ Linkని వాడండి. గుంటూరు నగరంలో మా హితబోధ బుక్ స్టోర్ ను సందర్శించండి
    క్రొత్తగా చేర్చిన పుస్తకాలు
    Intro Image
    April 04, 2026
    ఈ విశ్లేషణ కేవలం మతపరమైన ఆడంబరాలను ప్రేమించేవారి కోసం కాదు; దేవుని వాక్యం పట్ల నిజాయితీగా ఉండేవారి కోసం. గుడ్ ఫ్రైడే...

    Read More ...

    Intro Image
    March 21, 2026
    క్రీస్తు దైవత్వం అనేది కేవలం వాద ప్రతివాదాలకు మాత్రమే పనికొచ్చే సిద్ధాంతం కాదు. ఇది నిత్యజీవము...

    Read More ...

    Intro Image
    March 18, 2026
    సుమారు క్రీ.పూ 2300 చెందిన 'ఎరిడు జెనెసిస్', 'అత్రహసిస్ ఎపిక్', 'ఎపిక్ ఆఫ్ గిల్గమేష్' (Eridu...

    Read More ...

    Intro Image
    December 19, 2025
    దశమభాగం బైబిల్ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞలలో ఒకటి. పాత నిబంధనలో ఇది తప్పనిసరి ఆజ్ఞగా...

    Read More ...

    Intro Image
    August 13, 2025
    ప్రసంగించడం అనేది దేవుడు మనకు అప్పగించిన ఒక పవిత్రమైన బాధ్యత. సంఘ నిర్మాణం వాక్యోపదేశం ద్వారా...

    Read More ...

    Intro Image
    June 09, 2025
    దేవుని ప్రజలందరూ ఆయన మనస్సు‌ కలిగియుండాలని ఆజ్ఞాపించబడుతున్నారు (ఫిలిప్పీ 2:5). నిజంగా ఆయన మనస్సు...

    Read More ...

     

    'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

    హితబోధ యాప్ కొరకు Join WhatsApp

    సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

    ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.