images//new_theme/Spandana-desktop-1.jpg

ఆదికాండము 9:20-29;11:1-9

ఉద్దేశము/లక్ష్యము
దేవుని శక్తి అన్నిటికంటె గొప్పది అనియు మరియు మానవుని గర్వఫు ఆలోచనలను ఆయన నశింపచేస్తాడు అనియు బోధించుట.

ముఖ్యాంశము
చాలా ఎత్తయిన భవనంపైకి మీరు ఎప్పుడైనా ఎక్కారా? అంత ఎత్తులో ఉంటే ఎలా అనిపిస్తుంది? అలా ఎత్తులో ఉండే ఇంటిలో ఉండటం మీకు ఇష్టమేనా? కొంతమందికి ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లాలంటే ఎంతో భయం, కాని మరికొందరు కొండలు, పర్వతాలు ఎక్కటానికి ఎంతో ఇష్టపడతారు. ఆకాశాన్ని అంటుకునేంత ఎత్తయిన గోపురము కట్టుకోవాలి అని ఆశపడిన కొందరిని గురించి ఈ రోజు తెలుసుకుందాము.

గతవారము
నోవహు,అతని కుటుంబము, జంతువులు,పక్షులు, పురుగులు అన్ని దేవుడు ఆజ్ఞాపించిన తరువాత ఓడ నుండి బయటకు వచ్చినట్లు గతవారం చూశాము. జలప్రళయము ఆగిపోయుంది, వారు క్రొత్తగా తమ పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి దేవుడు కొత్త జీవితాలు ప్రసాదించాడు. ముందుగా ఎక్కడ నివసించాలి, ఏమి పనులు చేయాలి అని వారు ఆలోచించారు. నోవహు వ్యవసాయం చేసేవాడు కనుక ద్రాక్షతోటలు నాటాడు. నోవహు దేవుని ఎంతగానో ప్రేమించి, విధేయత చూపేవాడు.

మనుష్యుల అవిధేయత నోవహు ముగ్గురు కుమారులకు సంతానము కలిగి వారు విస్తరింపసాగారు. వారు భూమియందంతట వ్యాపించారు. దేవుడు వారిని ఒకచోటే ఉండమని చెప్పలేదు కాని అన్నిప్రాంతాలకు విస్తరించమని చెప్పాడు. ఫలించి అభివృద్ధిపొంది భూమిని నింపుడి (9:1) అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ గురించి తెలిసినప్పటికి, ప్రజలు దానికి లోబడలేదు. అందరూ కలసి ఒకే చోట ఉండాలని అనుకున్నారు. దేవుని మాటలకు విధేయత చూపడానికి వారు ఇష్టపడలేదు. వారు తూర్పు దిక్కున ప్రయాణము చేస్తూ షీనారు దేశములోని ఒక మైదానమును చూచి అక్కడ నివసించుటకు నిశ్చయించుకున్నారు. చుట్టూ నదులు కలిగిన చక్కటి మైదానము గనుక అది తమకు సరియైన ప్రదేశం అని వారు తలంచారు.

అప్పుడు వారు ఒకరితో ఒకరు - ” మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండి'' అని మాట్లాడుకున్నారు. మరియు వారు - “ మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండి'' అని మాట్లాడుకున్నారు. వారు తమ తెలివితేటలు ఉపయోగించి పేరుప్రఖ్యాతులు సంపాదించుకొని దేవునికంటె తమను తాము హెచ్చించుకోవాలి అని ఆలోచించారు. తామందరం కలిసి ఉంటే ఎంత అసాధ్యమైన పనులు అయినా చేయగలము, దేవుని కంటె ఎక్కువ పేరు సంపాదించు కొనగలము అని ఆశ పడ్డారు. గొప్ప శిఖరము కట్టుకొంటే క్షేమంగా ఉండవచ్చు అనుకున్నారు. అక్కడే కలిసి ఉంటే ఎవరూ తప్పిపోలేరు. మైదాన ప్రాంతం గనుక అక్కడనుండి ఎంత దూరమైనా ఆ శిఖరం కనిపిస్తుంది అని ఆలోచించి ఉండవచ్చు.

పట్టణమును కట్టుటకు మొదలుపెట్టుట అంత పెద్ద పట్టణము, శిఖరము కట్టడానికి చాలా సమయం పడుతుంది. ఆ పనులు అన్నీ చూచుకోవడానికి మనుష్యులను నియమించాలి. ఎవరిని నియమించాలి? నోవహుకు నిమ్రోదు అనే ముని మనుమడు ఉన్నాడు. అతడు చాలా పేరు గలిగినవాడు, పరాక్రమము గల వేటగాడు(10:8-9). నిమ్రోదు ఎంతో పరాక్రమశాలి గాని ఎంతో గర్వము, చెడుతనము కలిగిన క్రూరుడు. దేవుని ఎంత మాత్రము లక్ష్య పెట్టేవాడు కాదు. జలప్రళయము గురించి, ఆ సమయములో దేవునికి అవిధేయులైన వారు నశించుట గురించి నోవహు నిమ్రోదుకు తప్పకుండా చెప్పి ఉండవచ్చు. కానీ నిమ్రోదు అవేమీ పట్టించుకొనలేదు. దేవుడు భూమిపై విస్తరించి దానిని నింపుడి అని చెప్పిన మాటలు పట్టించుకోకుండా జనులందరూ కలిసి ఉండునట్లు గొప్ప పట్టణము కట్టించాలని అనుకున్నాడు. నిమ్రోదు కట్టించిన మొదటి పట్టణము బాబెలు (10:10). అతడు పరాక్రమము గలవాడు అయినప్పటికి, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవాడు. జనులుఎంత ఉత్సాహంగా ఆ పట్టణాన్ని, గోపురాన్ని కట్టడం మొదలుపెట్టారో మనం ఊహించవచ్చు! ఆ గోపురము కట్టుటకు వారు ఇటుకలు చేసి బాగుగా కాల్చి వాటిని ఉపయోగించసాగారు. ఆ పనులతో జనులు తీరిక లేకుండా ఉన్నారు. ఆ గోపురం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతూ ఉంది. వారు అందరూ ఆలోచిస్తూ,మాట్లాడుకుంటూ కలిసి పనిచేస్తున్నారు. ఆ గోపురము కట్టుటకు ఎంతో ఎత్తు ఎక్కవలసి వచ్చేది. ఎంత కష్టమైనా వారు మానకుండా పని చేయసాగారు.
ప్రభువు దిగివచ్చుట వారు కడుతున్నది అంతా ఒకరు చూస్తున్నారు అని వారికి తెలుసా? ఎవరో మీరు ఊహించగలరా? అవును దేవుడు. జనులు తన యెడల అవిధేయులుగా ఉన్నందుకు దేవుడు వారిపై ఎంతో ఆగ్రహంతో ఉన్నాడు. వారిని అలాగే పట్టించుకోకుండా ఉంటే అందరూ కలిసి తమ దుష్ట ఆలోచనలను నెరవేర్చుకుంటారు అని దేవునికి తెలుసు. దేవుడు వారిని ఎలా ఆపి వేయబోతున్నాడు? మరొక జలప్రళయము పంపుతాడు అనుకుంటున్నారా? లేదు, మరెన్నడూ భూమిమీదికి జలప్రళయము పంపను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానములు నెరవేర్చే దేవుడు. ఆ పట్టణపు నిర్మాణము ఆపివేయుటకు దేవుడు మరొక మార్గం ఎన్నుకున్నాడు.

ఆ దినములలో భూమియందంతట ఒకే భాష, ఒకే పలుకు ఉండేవి (11:1). దేవుడు వారు కట్టుచున్న పట్టణమును, గోపురమును చూచి - “ఇదిగో జనము ఒక్కటే వారికందరికి భాష ఒక్కటే. వారు ఈ పని ఆరంభించి యున్నారు. ఇకమీదట వీరు చేయదలచు ఏ పనియైనను చేయకుండా వారికి ఆటంక మేమియు ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండి'' అని అనుకున్నాడు. అలా జరిగినప్పుడు వారు తమ పనిని అపివేసి, భూమియందంతట తప్పక చెదరిపోవలసి వస్తుంది. ఆ విధముగానే జరిగింది. అకస్మాత్తుగా వారందరికి ఒకరి మాటలు మరొకరికి అర్థం కాకుండా పోయాయి. మొదట్లో కొందరు తమషాగా మాట్లాడుతున్నారు అని అనుకొని ఉండవచ్చు. కాని తరువాత అందరికి కోపం విసుగు కలగడం మొదలైంది. ఒకరి మాటలు ఒకరు అర్థం చేసుకోలేక ఎవరూ పని చేయలేకపోతున్నారు. అక్కడ ఎంత అల్లరి ఉందో మీరు ఊహించగలరా! వారికి తాము కలసి పనిచేయడం అసాధ్యం అని అర్థమైంది. వారు ఆ గోపురం కట్టడం మానివేశారు. అది మరెన్నటికి పూర్తి కాలేదు. ఒకే భాష మాట్లాడుతున్న వారందరు కలిసికొని ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ నివసించటం మొదలుపెట్టారు. అలా అందరూ భూమియందంతట చెదరిపోయారు. దేవుడు మొదట చెప్పిన విధముగా భూమియందంతట వ్యాపించునట్లు వారు బలవంతముగా దేవునిచేత చెదరగొట్టబడ్డారు.

సందేశము
ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలను మనము చూశాము. నిమ్రోదు మరియు జనులుఎంతో గర్వంతో నిండిన వారుగా ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా ఏ పనైనా చేయగలము అని తలంచారు. అవిధేయులుగా ఉన్నప్పటికి తమకు ఏమీ జరగదు అనుకొన్నారు. కాని వారు అనుకున్నవన్నీ పొరపాటు అని మనము చూసాము. నిమ్రోదు ఎంతో దుష్టుడు. అతడు నిజమైన దేవుని ఆరాదించేవాడు కాదు. ఈ బాబెలు పట్టణమే తరువాత బబులోను మహా సామ్రాజ్యముగా మారింది అని మనకు తెలుసు. బబులోను విగ్రహారాధనతో నిండిన దేశము అని బైబిల్ లో వ్రాయబడింది.

అన్వయింపు
ఈ దినములలోకూడా ప్రపంచములో ఎంతో మంది జనులు గర్వముతో నిండి యున్నారు. వారు ఎన్నో పాపపు ఆలోచనలు, చెడు ప్రణాళికలతో దేవునికి వ్యతిరేకమైన పనులు చేయుటకు ప్రయత్నిస్తుంటారు. అమాయకులను చంపుతూ, ఇతరులను హింసిస్తూ వుంటారు. కాని వారిని చూచి మనము భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటె దేవుడు వారి క్రియలన్నిటిని చూస్తున్నాడు. వారి క్రియలను దేవుడు అలాగే ముందుకు కొనసాగనీయడు. వారి గర్వమును, వారి దుష్ట క్రియలను తప్పక ఒకరోజు అణిచివేస్తాడు. బాబెలు గోపురము కట్టుచున్న వారిని ఆపివేసినట్లుగానే వీరిని కూడా ఆపివేస్తాడు. కానీ క్రైస్తవులమైన మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటాడు. మనము దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుడు చూపిన మార్గములలో నడుస్తూ ఆయనను సంతోషపరిచే జీవితము కలిగి ఉండునట్లు ప్రార్ధన చేయాలి. బాబెలు గోపురము కట్టించిన వారు దేవుని కంటే తమను తాము హెచ్చించుకోవాలి అనే చెడు ఆలోచన కలిగి, మొదలుపెట్టిన పనిని ముగించలేకపోయారు. మనలను సృజించిన దేవుని కంటె మనలను హెచ్చించుకోవాలి అని తలంచుట ఎంత బుద్ధిలేని తనము! అటువంటి గర్వము చెడుతనము మన హృదయాలలో ప్రవేశించకుండునట్లు దేవుని సహాయము కొరకు ప్రార్ధించాలి.

కంఠతవాక్యము
గర్వముతో నటించువారిని ఆయన అణపశక్తుడు (దానియేలు 4:37).

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

పుస్తకాలు
More articles ...
More articles ...
More articles ...
More articles ...

తెలుగు బైబిల్

మా వెబ్సైట్లో ఉన్న వ్యాసాలు, పుస్తకాలు చదివేవారి సౌకర్యార్థం BSIవారు అనువదించిన తెలుగు బైబిల్ కూడా మీకు అందుబాటులో ఉంచబడింది. ఈ బైబిలుకు క్రాస్ రిఫరెన్సులు, స్ట్రాంగ్స్ నెంబర్లు జత చేస్తూ ఉన్నాము. లోతుగా లేఖనాలను అధ్యయనం చేయటానికి ఈ వనరులు ఎంతగానో ఉపయోగపడతాయి. వాడుక భాషలో తెలుగు బైబిల్ అనువాదాలను కూడా ఇక్కడ పొందు పరచాలనుకుంటున్నాము. ఈ ప్రక్రియ అంతా త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు అందుబాటులోకి వచ్చేలా దయచేసి ప్రార్థించండి.

బైబిల్ వ్యాఖ్యానాలు
పూర్తి బైబిలును వచనం వెంబడి వచనం క్రమబద్ధంగా అర్థం చేసుకోవడానికి, ఆచరించటానికి బైబిల్ వ్యాఖ్యానం నేరుగా దోహదపడుతుంది. ఇందుకోసమే ఒక్కొక్క గ్రంథం యొక్క వ్యాఖ్యానాన్ని మీకు అందుబాటులోకి తెస్తూ ఉన్నాము.
ఆడియోలు మరియు వీడియోలు
వ్యాసాలు, పుస్తకాలతో పాటు ఆడియో,వీడియో వనరులు కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి.
01

ఆడియోలు

అనేక ఆధ్యాత్మిక సందేశాలు, అలాగే వ్యాసాల, పుస్తకాల రికార్డింగులు మీకిక్కడ లభిస్తాయి.
02

వీడియోలు

YOUTUBE CHANNEL ద్వారా అనేక ఆధ్యాత్మిక సందేశాలు, అలాగే వ్యాసాల, పుస్తకాల వీడియోలు మీకిక్కడ లభిస్తాయి.

Store

హితబోధ పుస్తకాలు Onlineలో ఆర్డర్ చేయడం కొరకు ఈ Linkని వాడండి. గుంటూరు నగరంలో మా హితబోధ బుక్ స్టోర్ ను సందర్శించండి
క్రొత్తగా చేర్చిన పుస్తకాలు
Intro Image
April 04, 2026
ఈ విశ్లేషణ కేవలం మతపరమైన ఆడంబరాలను ప్రేమించేవారి కోసం కాదు; దేవుని వాక్యం పట్ల నిజాయితీగా ఉండేవారి కోసం. గుడ్ ఫ్రైడే...

Read More ...

Intro Image
March 21, 2026
క్రీస్తు దైవత్వం అనేది కేవలం వాద ప్రతివాదాలకు మాత్రమే పనికొచ్చే సిద్ధాంతం కాదు. ఇది నిత్యజీవము...

Read More ...

Intro Image
March 18, 2026
సుమారు క్రీ.పూ 2300 చెందిన 'ఎరిడు జెనెసిస్', 'అత్రహసిస్ ఎపిక్', 'ఎపిక్ ఆఫ్ గిల్గమేష్' (Eridu...

Read More ...

Intro Image
December 19, 2025
దశమభాగం బైబిల్ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞలలో ఒకటి. పాత నిబంధనలో ఇది తప్పనిసరి ఆజ్ఞగా...

Read More ...

Intro Image
August 13, 2025
ప్రసంగించడం అనేది దేవుడు మనకు అప్పగించిన ఒక పవిత్రమైన బాధ్యత. సంఘ నిర్మాణం వాక్యోపదేశం ద్వారా...

Read More ...

Intro Image
June 09, 2025
దేవుని ప్రజలందరూ ఆయన మనస్సు‌ కలిగియుండాలని ఆజ్ఞాపించబడుతున్నారు (ఫిలిప్పీ 2:5). నిజంగా ఆయన మనస్సు...

Read More ...

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.