సరియైన మార్గములో నడవాలంటే దేవునికి ప్రార్ధించుట చాలా ముఖ్యము అని బోధించుట. అదే విధముగా నమ్మకముగా ఉండుట కూడా ఎంతో ముఖ్యమైన విషయము.
దేవుడు చేసిన గొప్ప కార్యములు అన్నింటిని మరువక అంతము వరకు ఆయనను వెంబడించాలి అని బోధించుట.
చిన్న విషయాలలో కూడా దేవుని యందు విశ్వాసముంచి నప్పుడే, దేవుని చేత గొప్పగా వాడబడగలము అని చూపించుట.
క్రైస్తవులకు ఎదురయ్యే పోరాటాలలో, గెలిచే శక్తి ని దేవుడు వారికి దయ చేస్తాడు అని బోధించుట.
ప్రభువును ప్రేమించే వారు కూడా ఈ లోకములోని విషయాలకు ఆకర్షించబడి ఆయనకు దూరముగా వెళ్ళిపోయే అవకాశం ఉంది అని బోధించుట. అలా దూరంగా వెళ్లి పోయిన తరువాత వారు ఎన్నో కష్టాలు అనుభవించ వలసి వస్తుంది. కాని మనము నిజమైన క్రైస్తవులమైన యెడల, ఆయన మనలను తననుండి దూరముగా పోనివ్వడు. కాని మనము చేయవలసిన పని, మన పొరపాట్లను,పాపమును గ్రహించి దేవుని క్షమించమని అడగడం.
మా వెబ్సైట్లో ఉన్న వ్యాసాలు, పుస్తకాలు చదివేవారి సౌకర్యార్థం BSIవారు అనువదించిన తెలుగు బైబిల్ కూడా మీకు అందుబాటులో ఉంచబడింది. ఈ బైబిలుకు క్రాస్ రిఫరెన్సులు, స్ట్రాంగ్స్ నెంబర్లు జత చేస్తూ ఉన్నాము. లోతుగా లేఖనాలను అధ్యయనం చేయటానికి ఈ వనరులు ఎంతగానో ఉపయోగపడతాయి. వాడుక భాషలో తెలుగు బైబిల్ అనువాదాలను కూడా ఇక్కడ పొందు పరచాలనుకుంటున్నాము. ఈ ప్రక్రియ అంతా త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు అందుబాటులోకి వచ్చేలా దయచేసి ప్రార్థించండి.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.