Free Free Free
MEDIUM OF INSTRUCTION: English, Telugu, Tamil
PAUL SCHOOL OF Kannada MISSIONS
152/1 Capernaum, Grace gardens, Keel Krishnapuram, Oorgaumpet post, KGF
563121
(A UNIT OF PAUL MINISTRIES®)
We are happy to inform you that the next batch of students enrolment will be taken from July 2024, for three months of intensive training on Advanced Missions to reach the Unreached People groups. It is exclusively residential
training
QUALIFICATIONS REQUIRED: 1. Pastors and Lay pastors, 2. Born-again Christians interested in doing Lord's ministry,
their language,5. Preferably Men and married couples. SUBJECTS TAUGHT: 1. Missiology
TEACHERS ARE WELL-QUALIFIED THEOLOGIANS WITH PRACTICAL KNOWLEDGE AND FIELD EXPERIENCE.
WE REQUEST THE PASTORS,
ASSISTANT PASTORS, EVANGELISTS, AND YOUTHS TO UTILIZE THIS PROGRAM AND WELL EQUIP FOR THE MINISTRY.
పరిశుద్ధాత్మ వరాల పేరుతో నేటి క్రైస్తవ సంఘాన్ని మోసగిస్తున్న మరియొక ఆత్మను వాక్యపు వెలుగులో వివేచించడానికి అవసరమైన అనేక అంశాలను గురించి ఈ సదస్సులో చర్చించుకోబోతున్నాము.
వీటి విషయమై తలెత్తే అనేక సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇదొక సదవకాశం. తెలిసో తెలీకో అనేకులు గురైన ఈ మోసం నుండి తప్పించుకోవడానికి ఈ సదస్సులో తప్పక పాల్గొనండి. 'సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేస్తుంది'
https://forms.gle/5uQJQSjp9GXCSy5X6
శ్రీమతి ఫ్రాన్సిస్ ఫౌంటెన్ గారి జీవితం (1930-2023) స్థిరమైన విశ్వాసంతో, దృఢచిత్తంతో మరియు సువార్తను వ్యాప్తి చేయాలనే లోతైన నిబద్ధతతో నిండినది. ఒక చిన్న గ్రామంలో డిస్లెక్సియాతో పెరిగిన ఈమె 16 సంవత్సరాల వయస్సులో క్రైస్తవురాలిగా మారారు. తరువాత స్ప్రింగ్ రోడ్ ఎవాంజెలికల్ చర్చి పాస్టర్ ఐన డేవిడ్ ఫౌంటెన్ గారిని వివాహం చేసుకున్నారు. ఆవిడకు ఆరోగ్య సవాళ్ళు ఉన్నప్పటికీ, ముఖ్యంగా నిర్ధారణ కాని ఉదరసంబంధ వ్యాధి ఉన్నప్పటికీ, ఆమె ఒక ప్రియమైన, ఆచరణాత్మక తల్లిగా, సంఘంలో చురుకైన సభ్యురాలిగా చివరి వరకూ ఉన్నారు. ఆమె సృజనాత్మకత 'మేఫ్లవర్ బైబిల్ పాఠాలు' మరియు 'ట్రెజర్ నోట్స్'ను అభివృద్ధి చేయడంలో వెల్లివిరిసింది. ఈ పాఠాల ద్వారా యునైటడ్ కింగ్డమ్ మరియు ఇంకా చాలా దేశాల్లోని అనేకమంది పిల్లలకు వీరు ప్రయోజనం చేకూర్చారు.
ఆమె తరువాతి సంవత్సరాలలో, ఆరోగ్య పోరాటాల మధ్య కూడా, దయతో, నిస్వార్థతతో కొనసాగారు. స్నేహితులూ, కుటుంబసభ్యులూ పెద్ద సంఖ్యలో హాజరైన ఆమె అంత్యక్రియలు తన చుట్టూ ఉన్నవారిపై ఆమె యొక్క శాశ్వత ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఫ్రాన్సిస్ ఫౌంటెన్ గారి జీవితం అంకితభావంతో కూడిన సేవ యొక్క కథని చెప్పుకోవాలి. ఆమె సంఘం లోపలే కాక సంఘం వెలుపల కూడా శాశ్వత వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు. తన పిల్లలు మరియు మనుమలు-మనుమరాళ్ల రక్షణలో ఆవిడ కీలక పాత్ర పోషించారు; వారంతా ఇప్పుడు ప్రభువు పనిలో చురుకుగా ఉన్నారు. "నా దేవుడు ఆదేశించిందేదైనా సరైనదే" అనే క్రైస్తవకీర్తన పట్ల ఆమెకున్న నిబద్ధత, ఆమె జీవితకథ చేత స్పృశించబడినవారి హృదయాలలో ప్రతిధ్వనిస్తుంది.
దేవుడు ఎవరనేది పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయపడటం, సువార్తను చిన్నిమనసులకు హత్తుకునేలా చెప్పడం మరియు క్రైస్తవ విలువలను ప్రోత్సహించడం అనే ఒక సాధారణ లక్ష్యంతో ఫ్రాన్సిస్ ఫౌంటెన్ గారు 25 సంవత్సరాలు వెచ్చించి 'మేఫ్లవర్ బైబిల్ పాఠాలను' రూపొందించారు. ఈ పాఠాలలో 16 ధారావాహికలు ఉన్నాయి, ప్రతి ధారావాహిక 11-13 పాఠాలతో బైబిల్లో ఒక భాగాన్ని బోధిస్తుంది. పాఠాలను క్రమపద్ధతిలో బోధించడం చాలా ముఖ్యం. ప్రతి పాఠంలో పేజీలకు రంగులు వేయడం, కట్ - పేస్ట్ - కలర్ యాక్టివిటీ మరియు పజిల్స్ వంటి పిల్లలకు నచ్చే ఎన్నో విషయాలు ఉంటాయి. ఈ కార్యకలాపాలు బిగినర్స్, ప్రైమరీ మరియు జూనియర్స్ తరగతుల కోసం రూపొందించబడ్డాయి.
హితబోధ పుస్తకాలు Onlineలో order చేయడం కొరకు ఈ link వాడండి.
మా వెబ్సైట్లో ఉన్న వ్యాసాలు, పుస్తకాలు చదివేవారి సౌకర్యార్థం BSIవారు అనువదించిన తెలుగు బైబిల్ కూడా మీకు అందుబాటులో ఉంచబడింది. ఈ బైబిలుకు క్రాస్ రిఫరెన్సులు, స్ట్రాంగ్స్ నెంబర్లు జత చేస్తూ ఉన్నాము. లోతుగా లేఖనాలను అధ్యయనం చేయటానికి ఈ వనరులు ఎంతగానో ఉపయోగపడతాయి. వాడుక భాషలో తెలుగు బైబిల్ అనువాదాలను కూడా ఇక్కడ పొందు పరచాలనుకుంటున్నాము. ఈ ప్రక్రియ అంతా త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు అందుబాటులోకి వచ్చేలా దయచేసి ప్రార్థించండి.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.