11:1, 11:2,3, 11:4,5, 11:6,7, 11:8, 11:9, 11:10-22, 11:23,25, 11:26,27, 11:28, 11:29 , 11:30, 11:31, 11:32
ఆదికాండము 11:1 భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.
ఈ వచనంలో భూమి అంతటా ఒకే బాష, ఒకే పలుకు ఉన్నట్టు మనం చూస్తాం. ఆ బాష ఏంటో గ్రంథకర్త తెలియచెయ్యనప్పటికీ దానిపై పరిశీలనలు చేసిన బైబిల్ పండితులు, ప్రస్తుతం Semitic languages గా పిలవబడుతున్న Akkadian, Phoenician, Ugaritic, Aramaic, Hebrew, Arabic భాషలన్నీ ఆ భాష నుండే ఉద్భవించాయని చెబుతున్నారు. అందుకే ఆ మొదటి బాషను proto Semitic గా పిలుస్తున్నారు.
అదేవిధంగా ఈ ప్రారంభ భాషకు ఒకే మాండలికం ఉండేది. ప్రస్తుతం మనకు తెలిసిన భాషల్లో వేరువేరు మాండలికాలు ఉండడం మనం చూస్తుంటాం. ఉదాహరణకు, ఒకే తెలుగు భాష మాట్లాడే ఆంధ్రప్రదేశ్ వారి పలుకుకీ తెలంగాణ వారి పలుకుకీ కొంచెం వృత్యాసం ఉంటుంది. ఈ ప్రారంభ భాషలో ఐతే అలాంటి వృత్యాసమేమీ లేకుండా వారందరూ ఒకే పదాన్ని ఒకేవిధంగా పలికేవారు.
ఆదికాండము 11:2,3 వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.
ఈ వచనాలలో ఆ ప్రజలు షీనారు మైదానాన్ని చేరుకుని, అక్కడ నిర్మాణం చేసేందుకు ఇటుకల తయారీకి ఆలోచించండం. తదుపరి కాలంలో ఈ షీనారులోనే బబులోను నిర్మించబడింది (దానియేలు 1:1,2). ప్రస్తుతం ఇది ఇరాక్ దేశంలో ఉంది.
ఆదికాండము 11:4,5 మరియు వారుమనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.
ఈ వచనాలలో ప్రజలు ఎక్కడికీ చెదిరిపోకుండా ఒక పట్టణం, గోపురం కట్టుకుని పేరు సంపాదించుకోవాలని మాట్లాడుకోవడం, యెహోవా ఆ పట్టణాన్ని చూడడానికి దిగిరావడం మనం చూస్తాం. వారు చేస్తున్న ఈ ప్రయత్నం దేవుని ఆజ్ఞ పట్ల వారి అవిధేయతను సూచిస్తుంది. ఎందుకంటే ఓడ నుండి బయటకు వచ్చిన నోవహు కుటుంబానికి ఆయన, భూమియందంతటా విస్తరించమని ఆజ్ఞాపించాడు (ఆదికాండము 9:1). అయితే వీరు అలా చెయ్యకుండా ఒకే ప్రాంతంలో స్థిరపడడానికి సన్నాహాలు చేస్తున్నారు. దైవవిరుద్ధ కార్యాలు చేస్తూ పేరు సంపాదించుకోవాలనే దుష్టుల ఆలోచనకు ఇది ప్రారంభం.
అదేవిధంగా అక్కడ మనం "యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను" అని చదువుతున్నాము. దానికి ఆయనేదో కొత్తగా ఆ పట్టణాన్ని చూస్తున్నాడని కాదు కానీ ఈ మాటలు ఆయన తీర్పును సూచిస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు ప్రత్యేకంగా ఒకోప్రాంతాన్ని చూడవలసిన అవసరం ఉండదు, ఆయన అంతటా ఆవరించియున్నవాడు (హెబ్రీ 4:13, సామెతలు 15:3, యోబు 28:24, కీర్తనలు 139:7-12).
ఆదికాండము 11:6,7 అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.
ఈ వచనాలలో దేవుడు, ఒక బాష వల్లే వారు మాటా మాటా కలుపుకుని ఆ పట్టణాన్ని కడుతున్నారు కాబట్టి, ఆ బాషను తారుమారు చెయ్యాలనుకోవడం మనం చూస్తాం. గమనించండి. "అనుకొనెను" అంటే ఆయన మనకులా పరిస్థితులను బట్టి అనుకుంటాడని కాదు. మనకు అర్థమయ్యే విధంగా అలాంటి పదప్రయోగం వాడబడింది. ఈ విషయం 6వ అధ్యాయపు వ్యాఖ్యానంలోనూ 8వ అధ్యాయపు వ్యాఖ్యానంలోనూ నేను స్పష్టంగా వివరించాను. ఆయన "అనుకొనెను" అంటే ఆయన నిర్ణయించిన కార్యాన్ని ఇప్పుడు నెరవేర్చబోతున్నాడని అర్థం.
కొందరు బైబిల్ విమర్శకులు ఈ సందర్భాన్ని చూపించి, ఆ పట్టణం వల్ల మనుషులు ఎక్కడ పేరు సంపాదించుకుంటారో అనే అసూయతోనే బైబిల్ దేవుడు ఈవిధంగా చేసాడని ఎగతాళి చేస్తుంటారు. కానీ వారు దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఆ పని చేస్తున్నారని ఇప్పటికే వివరించుకున్నాం. అందుకే ఆయన వారి బాషను తారుమారు చెయ్యడం ద్వారా భూమి అంతటా వారిని చెదరగొట్టి, తన సంకల్పాన్ని నెరవేర్చుకోబోతున్నాడు. బైబిల్ విమర్శకులు కాస్త విజ్ఞతతో ఆలోచిస్తే ఇక్కడ ఆయనలో అసూయ కనిపించదు కానీ తన చిత్తాన్ని నెరవేర్చుకునే సార్వభౌమత్వం మాత్రమే కనిపిస్తుంది.
అదేవిధంగా ఆ ప్రజలు బాబెలు గోపురాన్ని కట్టడం ప్రారంభించగానే దేవుడు వారిని చెదరగొట్టలేదు. వారు కొంతకాలం ఆ పని కొనసాగించేలా మౌనంగా ఉన్నాడు. దీనినిబట్టి ఎవరైనా దైవచిత్తానికి వ్యతిరేకంగా పని చేస్తున్నప్పుడు అది కొంతకాలం కొనసాగినప్పటికీ మనం అధైర్యపడవలసిన అవసరం లేదని ఎందుకంటే చివరికి అది నాశనం అవ్వక తప్పదని అర్థం ఔతుంది.
కీర్తనలు 37:13 వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచు చున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.
ఈ విధంగా దేవుడు తనకు విరుద్ధంగా జరుగుతున్నదాని విషయంలో వెంటనే తీర్పుతీర్చకుండా కొంతకాలం వాటిని కొనసాగనివ్వడానికి నా ఉద్దేశం ప్రకారం; రెండు కారణాలు ఉన్నాయి.
1. వారు ఆ పని దైవచిత్తానికి వ్యతిరేకమైందని తమకు తాముగా గ్రహించి, దానిని విడిచిపెట్టాలని.
2. వారు కొంతవరకూ ఆ పనిచెయ్యడానికి అనుమతించి చివరిలో దానిని నాశనం చేస్తే వారు కట్టనారంభించి పూర్తి చెయ్యలేకపోయారు కాబట్టి అప్పటివరకూ వారి కష్టమంతా వృథాగా మారి వారికి మరింత ఎక్కువ అవమానం కలగాలని
ఇక్కడ మరొక విషయం గమనించాలి; మన సమాజంలో "కలిసుంటే కలదు సుఖం" అనే సామెతను ఎక్కువగా వింటుంటాము. ఇది నిజమే కానీ దైవచిత్తానికి వ్యతిరేకంగా కలిసుండడం మాత్రం మంచిది కానే కాదు. ఇక్కడ బాబెలు గోపురం దగ్గర అందరూ కలసి ఉండాలి అనుకున్నారు. కానీ అది ఆయన చిత్తం కాదు. మన సంఘాల్లో కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఐక్యంగా ఉండడమే దేవుని చిత్తమనే అభిప్రాయానికి మనం ఎప్పుడూ రాకూడదు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని బట్టి ఐక్యంగా ఉండడమే ఆయన సంఘంలో కోరుకునే ఐక్యత. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు "వాక్యము వలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండవలెనని" (యోహాను 17:21) ప్రార్థించాడు.
అలానే ఇక్కడ "మనము దిగిపోయి" అని దేవుడు పలుకుతున్న మాటలు క్రైస్తవ సంఘం లేఖనాధారంగా విశ్వసిస్తున్న త్రిత్వ సిద్ధాంతానికి చాలా కీలకమైనవి. ఎందుకంటే ఆ మాటలను దేవుడు తనతో సమానులైన వారితో అనగా క్రీస్తుతోనూ పరిశుద్ధాత్ముడితోనూ పలుతున్నాడు. ఇదే పదప్రయోగం ఆయన నరులను సృష్టించేటప్పుడు కూడా ఉపయోగించినట్టు మనం చదువుతాం (ఆదికాండము 1:26). దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
త్రిత్వ సిద్ధాంత నిరూపణ
ఆదికాండము 11:8 ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.
ఈ వచనంలో దేవుడు వారి బాషలను తారుమారు చేసి ఆ పట్టణం కట్టబడకుండా ఆపడం, వారిని అక్కడినుండి భూమి అంతటా చెదరగొట్టడం మనం చూస్తాం. ఈ సంఘటన మనిషి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎన్ని సన్నాహాలు చేసినప్పటికీ చివరికి ఆయన చిత్తమే నెరవేరుతుందని మనకు బోధిస్తుంది. ఆ ప్రజలు భూమియంతటా చెదరి విస్తరించాలి అనేది దేవుని చిత్తం, అందుకే వారు దానికి వ్యతిరేకంగా సన్నాహాలు చేసినప్పటికీ అది వారివల్ల కాలేకపోయింది. చివరికి వారు భూమియంతటా చెదరిపోయారు. ఈ వాక్యభాగాలు పరిశీలించండి.
సామెతలు 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
యెషయా 46:10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.
యోబు 42:2 నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని.
అదేవిధంగా ప్రపంచంలో ఉన్న మరే మత గ్రంథంలోనూ ఈ భూమిపైకి ఇన్ని భాషలు ఎలా వచ్చాయో మనుషులు భూమి అంతటా ఎలా విస్తరించారో ఆ వివరణలు మనకు కనిపించవు. దేవుని వాక్యమైన బైబిల్ లో మాత్రమే ఈ వివరణ మనకు కనిపిస్తుంది.
మరొక విషయం ఏంటంటే; తన చిత్తానికి విరుద్ధంగా ప్రయత్నించడం వల్ల వారి భాషను తారుమారు చేసి, అక్కడి నుండి చెదరగొట్టిన దేవుడు, అపోస్తలుల కాలంలో అవే బాషలు మాట్లాడేవరాన్ని అపోస్తలులకు ప్రసాదించి, తన ప్రజలందరినీ ఒకే సంఘంగా ఏకంచేసే తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. బాషల వరంయొక్క ఉద్దేశం అదే (అపొ.కార్యములు 2:1-4).
ఆదికాండము 11:9 దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందు కనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.
బాబెలు అంటే తారుమారు అని అర్థం. ఈ ప్రాంతం ఇరాక్ దేశంలో ఉందని ఇప్పటికే మనం చూసాం. పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ బాబేలు గోపురం యొక్క శిథిలాలను కనుగొన్నట్టుగా బైబిల్ పండితులు తెలియచేస్తున్నారు. ప్రాముఖ్యంగా నెబుకద్నెజరు వేయించిన ఒక శిలాఫలకంలో ఒకవైపు ఈ బాబేలు గోపురం చెక్కబడి, మరోవైపు అతని రూపం చెక్కబడింది. దానిక్రింద cuneiform లిపిలో మా పితరులు ఈ గోపురాన్ని కట్టడం ప్రారంభించారు కానీ దానిని కొనసాగించలేకపోయారని రాయబడింది. కాబట్టి ఈ అధ్యాయంలో చెప్పబడుతున్న బాబెలు గోపురం సంఘటన కచ్చితంగా జరిగింది అనడానికి మనదగ్గర బైబిలేతర ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయి.

ఆదికాండము 11:10-22షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనినతరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను. అర్పక్షదు షేలహును కనినతరువాత నాలుగు వందలమూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను (హీబ్రూ అనేపదం ఏబెరు పేరునుండే వచ్చింది). షేలహు ఏబెరును కనినతరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను. ఏబెరు పెలెగును కనినతరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను. పెలెగు రయూను కనినతరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను. రయూ సెరూగును కనినతరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.
ఈ వచనాల్లో నోవహు కుమారుడైన షేము నుండి తెరహు తండ్రియైన నాహోరు వరకూ ఉన్న వంశావళి ని మనం చూస్తాం. అయితే మన బైబిళ్ళు తర్జుమా చెయ్యబడిన Masoretic ప్రతిలో (హీబ్రూ ప్రతి) ఇక్కడ సంఖ్యాపరమైన పొరపాట్లు జరిగాయి. అవి మన బైబిళ్ళలో కూడా అలానే తర్జుమా చెయ్యబడ్డాయి. నిజానికి గ్రీకు Septuagint (LXX) నూ Samaritan Pentateuch నూ మనం పరిశీలిస్తే అర్పక్షదు నుండి సెరూగు వరకూ వారు కుమారులను కన్నారని రాయబడిన వయస్సుకు మరో వందయేళ్ళను కలిపి లెక్కించాలి. ఉదాహరణకు; అర్పక్షదు, షేలాహును కన్నది 35 యేళ్ళకు కాదు, 135 యేళ్ళకు. అంటే ఈ వంశావళికి మనం మరో 600 సంవత్సరాలను చేర్చాలి. అదే వాస్తవం.
అదేవిధంగా 12వ వచనంలో అర్పక్షదు షేలహును కన్నట్టుగా రాయబడింది కానీ లూకా సువార్త 3:36లో అర్పక్షదు కెయినానును కన్నట్టుగా రాయబడింది. దీనిగురించి కూడా మనం పురాతన ప్రతుల పరిశీలన ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాయంలో రాయబడినట్టుగా అర్పక్షదు షేలహును కన్నాడు అన్నదే వాస్తవం. దీనికి మరో ఆధారం చూడండి.
1 దినవృత్తాంతములు 1:18 అర్పక్షదు షేలహును కనెను.
మన బైబిళ్ళు తర్జుమా చెయ్యబడిన Masoretic Text లోనూ Samaritan Pentateuch లోనూ యూదాచరిత్ర కారుడైన జోసెఫెస్ రచనల్లో కూడా అర్పక్షదు కొడుకు షేలహు అనే రాయబడింది. కానీ గ్రీకు septuagint (LXX) లో మాత్రం, అర్పక్షదు కొడుకు కెయినాను అని రాయబడింది. తర్వాత కాలంలో క్రైస్తవ సంఘం లూకా సువార్తకు ప్రతులు రాసేటప్పుడు ఈ septuagint (LXX) ను ఆధారం చేసుకుని కెయినాను అనే పేరును చేర్చారు. అది వారు septuagint (LXX) ఆధారం చేసుకోవడం వల్ల సంభవించిన పొరపాటు. లూకా ఆ విధంగా రాయలేదు. ఎందుకంటే క్రీస్తు శకం 175-225 కాలానికి చెందిన లూకా సువార్త వ్రాత ప్రతి (Papyrus 75) లో అర్పక్షదు షెలహునే కన్నాడనే రాయబడింది. దీనిప్రకారం లూకా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినప్పుడు సరిగానే రాసినప్పటికీ తర్వాత కాలంలో దానికి ప్రతులు రాసేటప్పుడు septuagint (LXX) బట్టి ఈ పొరపాటు చోటుచేసుకుంది. లేఖనాలలో మనకు కనిపించే సంఖ్యాపరమైన, పేర్లకు సంబంధించిన పొరపాట్లు ఇలా సంభవించినవే. అలాంటి ఒక సందర్భం గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవంది.
ఇశ్రాయేలీయులు, ఐగుప్తులో ఎంతకాలం బానిసలుగా, నివసించారు? 430/400/215?
ఆదికాండము 11:23-25 నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను. నాహోరు తెరహును కనినతరు వాత నూటపం దొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఈ వచనాలలో నాహోరు తెరహును కన్నాడని రాయబడిన వయసు కూడా కొన్ని ప్రతుల్లో 79 యేళ్ళని రాయబడింది.
ఆదికాండము 11:26,27 తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహో రును హారానును కనెను. తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహో రును హారానును కనెను. హారాను లోతును కనెను.
ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తున్న వంశావళిని బట్టి, బాబేలు గోపురం సంఘటన తర్వాత మానవజాతి రెండుగా విభజించబడి, దేవుడు అబ్రాహాము అనే వ్యక్తిపైన, అతనినుండి వచ్చేజాతిపైన దృష్టి నిలుపుతున్నట్టుగా కనబడుతుంది.
అదేవిధంగా ఇక్కడ "తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను" అనే మాటలనూ ముందటి వచనాల్లో "నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను" అనే మాటలనూ కొందరు చూపించి, ఒకవైపు నాహోరు తెరహును కన్నట్టు రాయబడింది మరోవైపు తెరహు నాహోరును కన్నట్టుగా రాయబడింది అంటూ ఇదేదో వైరుధ్యంగా ప్రస్తావిస్తుంటారు. అలాంటివారు; తండ్రుల పేర్లను తమ పిల్లలకు పెట్టుకునే తండ్రులు కూడా ఉంటారని తెలుసుకుంటే మంచిది. ఆ మాత్రం అవగాహన కూడా లేకుంటే ఎలా?
ఆదికాండము 11:28 హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను.
ఈ వచనంలో తెరహు కుమారుడైన హారాను వారి స్వదేశంలో తెరహు కంటే ముందుగా చనిపోయినట్టు మనం చూస్తాం. అతను ఎలా చనిపోయాడో ఇక్కడ రాయబడలేదు, కానీ క్రీస్తుశకం రెండవశతాబ్దానికి చెందిన యూదుల వ్యాఖ్యానం 'Midrash Rabbah' 38వ అధ్యాయంలో దీనిగురించి ఒక కథ కనిపిస్తుంది. అయితే దానిని మనం ప్రామాణికంగా తీసుకోలేము కాబట్టి విడిచిపెడుతున్నాను. ఈ హారాను నుండే లోతు సంతానం వ్యాప్తి చెందింది (ఆదికాండము 11:31, 14:14)
ఆదికాండము 11:29 అబ్రామును నాహోరును వివాహము చేసి కొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.
ఈ వచనంలోని మాటలు మన BSI తెలుగు బైబిల్ లో కాస్త స్పష్టత లేనివిధంగా తర్జుమా చెయ్యబడ్డాయి. అందుకే వాడుక బాష అనువాదాన్ని పెడుతున్నాను చూడండి.
"అబ్రాము వివాహమాడాడు. అతడి భార్య పేరు శారై. నాహోరు కూడా వివాహమాడాడు. అతడి భార్య పేరు మిల్కా. ఆమె హారాను కూతురు. హారాను ఇస్కాకు కూడా తండ్రి.
ఆదికాండము 11:29"
దీనిప్రకారం; తెరహు కుమారుడైన నాహోరు మిల్కా అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఆమె సహోదరుని పేరు ఇస్కాకు, వీరిద్దరూ హారాను పిల్లలు. అయితే కొందరు ఈమాటలను ఆధారం చేసుకుని "నాహోరు వివాహం చేసుకున్న మిల్కా చనిపోయిన హారాను కుమార్తె అనగా తన సహోదరుని కుమార్తెయని" కాబట్టి అబ్రాహాము సహోదరుడైన నాహోరు వావి వరసలు లేకుండా వివాహం చేసుకున్నాడని విమర్శిస్తుంటారు. కానీ తెరహు కుమారుడైన హారానూ (అబ్రాహాముకూ నాహోరుకూ సహోదరుడు) మిల్కా మరియు ఇస్కాకులకు తండ్రియైన హారానూ ఇద్దరూ ఒక్కరు కారు. ఒకవేళ ఈ హారానూ తెరహు కుమారుడైన హారానూ ఒక్కడే ఐతే అతని పిల్లల జాబితాలో లోతు పేరు ఎందుకు లేదు? ఆ హారానుకు మిల్కా మరియు ఇస్కాకు అనే ఇద్దరికి మాత్రమే తండ్రియని పైన స్పష్టంగా రాయబడింది. పోని అబ్రాహాము సహోదరుడైన హారాను సంతానంగా లోతు పేరు మాత్రమే ఎందుకు ఉంది? (ఆదికాండము 11:27,31). అతనితో పాటు మిల్కా ఇస్కాకుల పేర్లు కూడా ఉండాలిగా? కాబట్టి నాహోరు వివాహం చేసుకున్న మిల్కా తండ్రియైన హారాను వేరే. ఇలాంటి విమర్శలు చేసేవారు ఒకే పేరు కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారని గుర్తుంచుకోవాలి. హారాను అనే పేరుతో ఒక ప్రాంతం కూడా ఉంది (ఆదికాండము 11:32, 12:5, 27:43). అంటే ఆ పేరు చాలా ప్రాముఖ్యత కలిగిందని సులభంగానే అర్థమౌతుంది. ఆ కారణంగా ఆ పేరును చాలామంది కలిగియుంటారు. అది తెరహుకు సంబంధించిన (చుట్టుప్రక్కల) ప్రాంతం కాబట్టి అతను కూడా తన కుమారుడికి ఆ పేరు పెట్టాడు.
ఆదికాండము 11:30 శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు.
ఈ వచనంలో అబ్రాహాము భార్యయైన శారయి గొడ్రాలిగా ఉన్నట్టు మనం చూస్తాం. తర్వాత కాలంలో దేవుని వాగ్దానం చొప్పున ఇస్సాకును కన్నటువంటి స్త్రీ ఈమెనే. ఆయన ఎందుకూ పనికిరానివారిని కూడా పిలుచుకుని ఫలభరితంగా చేస్తాడనడానికి ఈ ఉదాహరణ మంచి నిదర్శనం.
ఆదికాండము 11:31 తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.
ఈ వచనంలో తెరహు అబ్రాహాముతోనూ తన మిగిలిన కుటుంబంతోనూ కలసి, హారాను అనే పట్టణానికి వచ్చి అక్కడ నివసిస్తున్నట్టు మనం చూస్తాం. ఆవిధంగా వీరు హారానుకు రావడానికి అబ్రాహాముకు దేవుడు ప్రత్యక్షమవ్వడమే కారణం. ఆయన పిలుపు మేరకే అబ్రాహాముతో పాటుగా అతని కుటుంబం కూడా హారానుకు చేరుకుంది (అపొ.కా 7:2-4). అయితే ఇక్కడ వారితో పాటుగా నాహోరు కుటుంబం వచ్చినట్టు మనం చూడము. బహుశా అతను అక్కడ తనకున్న ఆస్తిని బట్టీ అవకాశాలను బట్టీ అక్కడే ఉండిపోయాడు. లోతుకు ఎలాగూ తండ్రి లేడు కాబట్టి ఆ స్థానంలో ఉన్నటువంటి అబ్రాహాముతోనే అతనూ ప్రయాణించాడు. అలాగని నాహోరు చేసింది పొరపాటుగా మనం భావించకూడదు. ఎందుకంటే దేవుడు పిలిచింది అబ్రాహామును మాత్రమే. తర్వాత ఈ నాహోరు సంతతి నుండే ఇస్సాకుకు భార్యను తీసుకురమ్మని అబ్రాహాము ఎలియెజెరును పంపించాడు (ఆదికాండము 24). యాకోబు వివాహం చేసుకున్న స్త్రీలు కూడా ఈ నాహోరు సంతతివారే.
ఆదికాండము 11:32 తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను.
ఈ వచనంలో అబ్రాహాము తండ్రియైన తెరహు 205 సంవత్సరాలు జీవించి మృతిచెందినట్టు మనం చూస్తాం. అయితే నేను పైన వంశావళి సందర్భంలో వివరించినట్టుగా ఈ తెరహు వయస్సు విషయంలో కూడా ప్రతులు రాసేటప్పుడు పొరపాటు జరిగింది. క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో గ్రీకులోకి తర్జుమా చెయ్యబడిన పాతనిబంధన (Septuagint) నూతన ప్రతులలో కూడా అదే పొరపాటు మనకు కనిపిస్తుంటుంది. కానీ మనం పైన ప్రస్తావించుకున్న "Samaritan Pentateuch" హీబ్రూ ప్రాచీన వ్రాతప్రతిలో మాత్రం తెరహు జీవించిన కాలం మొత్తం 145 సంవత్సరాలని రాయబడింది. ఇదే వాస్తవం. ఒకవేళ అబ్రాహాము తండ్రియైన తెరహు జీవించింది 205 సవత్సరాలే ఐతే ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య తలెత్తే అవకాశం ఉంది. అదేంటంటే ఆదికాండము 12:4 ప్రకారం; అబ్రాహాము హారాను నుండి కనానుకు ప్రయాణమయ్యేసరికి అతనికి 75 సంవత్సరాలు. అప్పటికి అతని తండ్రి చనిపోయాడని కూడా స్పష్టంగా రాయబడింది (అపొ. కార్యములు 7:4). ఒకవేళ తెరహు జీవించింది 205 సవత్సరాలే ఐతే అదికాండము 11:26 ప్రకారం, అతను అబ్రాహామును 70వ యేట కన్నాడు. అబ్రాహాము 75 యేళ్ళకు కనానుకు బయలుదేరాడు. 70+75=145 ఈ 145 యేళ్ళను తెరహు జీవించిన 205 యేళ్ళ నుండి తీసివేస్తే అబ్రాహాము కనానుకు బయలుదేరిన 60 సంవత్సరాల వరకూ తెరహు జీవించేయుండాలి. కానీ అబ్రాహాము తన తండ్రి చనిపోయాకే కనానుకు బయలుదేరాడని స్పష్టంగా రాయబడింది కదా (అపొ. కార్యములు 7:4).
కొందరు ఈ సమస్యను పరిష్కరించడానికి నోవహు కుమారుల విషయంలో రాయబడిన వరుసక్రమాన్ని చూపించి, షేము చిన్నవాడైనప్పటికీ అతని పేరు ముందు రాయబడిందని, అలాగే తెరహు విషయంలో కూడా అబ్రాహాము అతనికి 130 యేట పుట్టిన చిన్నకుమారుడని చెబుతుంటారు. కానీ ఈ వాదనలో అభ్యంతరం ఉంది. అబ్రాహాము తెరహుకు 130 యేటనే పుట్టుంటే అతనికి మాత్రం 100 సంవత్సరాలు రాగానే తనకిక పిల్లలు పుట్టరని ఎందుకు ఆందోళన చెందుతాడు? (ఆదికాండము 17:17) తన తండ్రికి పుట్టినట్టే తనకూ పుడతారని భావించేవాడు కదా?
దేవుని అద్భుతం మేరకే అబ్రాహాము వందవయేట ఇస్సాకును కన్నాడు, తర్వాత కెతూరా ద్వారా మిగిలిన పిల్లలను కూడా కన్నాడు. వాస్తవానికి అది అబ్రాహాముకు సహజంగా పిల్లలను కనే వయస్సు కాదు. కాబట్టి తెరహుకు అబ్రాహాము పుట్టింది 130వ యేటకాదు 70వ యేటనే. "Samaritan Pentateuch" ఆధారంగా తెరహు జీవించాడని రాయబడిన 145 యేళ్ళతో దీనిని పోల్చినప్పుడు, తెరహుకు 70వ యేట అబ్రాహాము జన్మించాడు, అబ్రాహాము 75వ యేట కనానుకు బయలుదేరాడు. 70+75=145 సరిగ్గా ఈ సంవత్సరంలోనే తెరహు చనిపోయాడు. దీనిప్రకారం స్తెఫను చెప్పినట్టుగా తెరహు చనిపోయిన సంవత్సరంలోనే అబ్రాహాము కనానుకు బయలుదేరాడు.
పై సందర్భంలో నేను ప్రస్తావించిన "Samaritan Pentateuch" హీబ్రూ వ్రాతప్రతి గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
Samaritan Pentateuch అంటే ఏమిటి? అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది?
అలానే బైబిల్ నిజదేవుని వాక్యమని, మానవ చరిత్రకు సంబంధించిన గ్రంథమని ఈ అధ్యాయంలోని వంశావళి కూడా మనకొక ఆధారం కల్పిస్తుంది. ఎందుకంటే బైబిల్ అనేది ఎవరో కల్పించిన గ్రంథమైతే అతను ఈ వంశావళుల జాబితాలో ఎవరు ఎవరికి పుట్టారు అనే పేర్లతో సహా ఇన్నిన్ని తరాలని నమోదు చెయ్యడం అతని శక్తికి మించినపని. మహా ఐతే కొన్ని పేర్లను మాత్రమే ఊహించి రాయగలడు. నిజానికి ఇతర మతగ్రంథాలు కొన్నిటిలో కూడా కొంత పొడవైన జాబితా కలిగిన వంశావళులు మనకు దర్శనమిస్తాయి. కానీ అవి చాలా అరుదుగానూ మరియు ఆ గ్రంథాలలో ప్రముఖవ్యక్తులకు మాత్రమే పరిమితమైనవిగానూ ఉంటాయి. పైగా ఆ వంశావళి సత్యమని ఎవరూ రుజువు చెయ్యలేదు కూడా. బైబిల్ వంశావళుల్లో మాత్రం అలా కాదు. ఇందులో ప్రస్తావించబడిన వంశావళులు ఆయా కాలాలకు చెందిన ఇతర గ్రంథకర్తల ద్వారా మరలా మరలా ప్రస్తావించబడి అవి సత్యమని ధృవీకరిస్తుంటాయి. ఉదాహరణకు; 1 దినవృత్తాంతములు 1,2 అధ్యాయాలు, మత్తయి సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం. చివరికి దేవుని చేత విసర్జించబడిన వ్యక్తి వంశావళి కూడా ఇందులో రాయబడింది (ఆదికాండము 36). బైబిల్ వంశావళులు కల్పించబడినవే ఐతే అలాంటివారి వంశావళి కూడా ఊహించి రాయవలసిన అవసరం ఆ గ్రంథకర్తకు ఏముంటుంది? అయితే వీటిలో కొన్ని పేర్ల మధ్య తరాల సంఖ్య మధ్య కొన్ని వృత్యాసాలు మనకు కనిపిస్తున్నప్పటికీ వాటికి మనదగ్గర సమాధానం ఉంది. ఉదాహరణకు ఆదికాండము 10వ అధ్యాయపు వంశావళిలో నేను కేయినాను అనే పేరు గురించి వివరించాను, అలానే మా ఇతర వ్యాఖ్యానాల్లో కూడా వాటికి సమాధానం చెబుతున్నాము (మత్తయి 1 వ్యాఖ్యానం చూడండి). అదేవిధంగా ఆదికాండము 10వ అధ్యాయంలో ప్రస్తావించబడిన వంశావళిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అది సత్యమని అంగీకరించినదానికి కూడా నేను ఆధారాలను పొందుపరిచాను (ఆదికాండము 10 వ్యాఖ్యానం చూడండి).
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 11

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"

Add comment