19:1,2, 19:3, 19:4,5, 19:6-8, 19:9, 19:10,11, 19:12,13, 19:14, 19:15,16, 19:17, 19:18-22, 19:23-25, 19:26, 19:27-29, 19:30, 19:31-36, 19:37,38
ఆదికాండము 19:1,2 ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారముచేసి నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారుఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి.
గత అధ్యాయంలో యెహోవాతో పాటు అబ్రహాము యొద్దకు వెళ్ళిన ఇద్దరు దేవదూతలు విందు పూర్తైన తర్వాత సొదొమలోని లోతు దగ్గరకు చేరుకున్నట్టు (ఆదికాండము 18:16, 22) మానవరూపంలో ఉన్నవారిని అతను అతిథులుగా భావించి వారికి ఆతిథ్యం చెసే ప్రయత్నం చెయ్యడం మనం చూస్తాం.
ఆ క్రమంలో అతను వారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. అతిథులను అలా గౌరవించడం వారి సాంప్రదాయం అయ్యుండవచ్చు. కానీ ఒకటి మాత్రం స్పష్టం. ఇక్కడ లోతు తన యొద్దకు వచ్చింది దేవదూతలనే ఉద్దేశంతో నమస్కారం చెయ్యలేదు, ప్రభువులారా అని సంబోధించనూ లేదు. వారు దేవదూతలని అతనికి తెలుసుంటే వారిని కాపాడడానికి తన కుమార్తెలను కోల్పోయే సాహసం చేయకపోదుడు (ఆదికాండము 19:5-9). కాబట్టి లోతు వారు దేవదూతలని తెలియకే వారికి ఆతిథ్యం చెయ్యడానికి ప్రయత్నించాడు. దీనిని ఉద్దేశించే హెబ్రీ గ్రంథకర్త "ఆతిథ్యము చేయమరవకుడి. దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి" (హెబ్రీ 13: 2) అని ప్రస్తావించాడు.
అదేవిధంగా లోతు అబ్రాహాము దగ్గరనుండి వెళ్ళిపోయినప్పుడు అ పట్టణాల సమీపంలో గుడారం వేసుకున్నాడు (ఆదికాండము 13:12). కానీ ఈ సందర్భంలో అతను పట్టణపు గవిని దగ్గర కూర్చున్నాడు. ఆ కాలంలో తీర్పులూ పెద్దమనుషుల సంబాషణలూ ఈ పట్టణపు ఈ గవినుల దగ్గరే జరుగుతుండేవి (ఆదికాండము 23:10, ద్వితీయోపదేశకాండము 21:19, 22:24, 25:7, రూతు 4:1,2). అంటే ప్రస్తుతం లోతు కూడా సొదొమ పట్టణానికి ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నాడు. అందుకే సొదొమలోని దుష్టులు అతన్ని "వీడెవడో మనలోనికి పరదేశిగావచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు" (ఆదికాండము 19:9) అని విమర్శించినట్టుగా రాయబడింది. అలానే 6వ వచనం ప్రకారం; అతను ఆ పట్టణంలో ఒక ఇల్లు కూడా కట్టుకుని అందులో నివశిస్తున్నాడు.
ఆ పట్టణానికి పరదేశిగా వచ్చిన ఇతనికి అది ఎలా సాధ్యమైందంటే ఆదికాండము 14వ అధ్యాయం ప్రకారం; సొదొమ గొమొఱ్ఱా పట్టణాలు చెరపట్టబడినప్పుడు అబ్రాహామే వారిని రక్షించాడు. అతను అదంతా లోతు కోసమే చేసాడు కాబట్టి అప్పటినుండి ఆ పట్టణంలో లోతుకు కూడా ఘనత కలిగింది. అందుకే అతను ఆ పట్టణంలో ఒక ప్రముఖుడిగా వర్ధిల్లాడు. అయినప్పటికీ "ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను." (2 పేతురు 2:8) అని రాయబడింది. కాబట్టి పాపం మనల్ని ఘనపరచాలని చూస్తున్నప్పుడు దానినుండి పారిపోవాలే తప్ప, అది కల్పించే సుఖవంతమైన జీవితానికి ఆశపడకూడదు. దానివల్ల చివరికి మనకు లోతుకు కలిగిన వేదనే మిగులుతుంది. అందుకే మనం పాపం (పాపాత్ములు) కల్పించే సుఖవంతమైన జీవితం విషయంలో మోషేలా వ్యవహరించాలి ఆ "మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను" (హెబ్రీ 11:24-26).
ఆదికాండము 19:3 అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి.
ఈ వచనంలో ఆ దేవదూతలు లోతు ఆతిథ్యాన్ని స్వీకరించడానికి సమ్మతించడం మనం చూస్తాం. వాస్తవానికి వారు లోతు దగ్గరకు వచ్చింది అబ్రాహాము విజ్ఞాపన మేరకు అతడిని కాపాడడానికే అని, ముందటి అధ్యాయంలో అబ్రాహాము దేవునితో చేసిన సంబాషణలోనూ ఈ అధ్యాయం 29వ వచనంలోనూ మనకు అర్థమౌతుంది. కానీ వారు లోతును పరిశీలించడానికే మొదట అతని ఇంట ఆతిధ్యం స్వీకరించడానికి ఒప్పుకోలేదు. పైగా దీనివల్ల ఆ పట్టణస్థుల మృగతత్వం మరింతగా బయటపడుతుంది.
ఆదికాండము 19:4,5 వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి లోతును పిలిచిఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా-
ఈ వచనంలో ఆ పట్టణస్తులు లోతు ఇంటికి వచ్చిన వారిని అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నట్టు మనం చూస్తాం. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి.
1. సాధారణంగా ఆ కాలంలో తమ పట్టణానికి ఎవరైనా క్రొత్తగా వచ్చినప్పుడు వారు శత్రు రాజ్యానికి సంబంధించిన వేగులేమో అని వారిని విచారించడం జరుగుతుండేది. కానీ వీరు లోతు ఇంటికి అలాంటి విచారణా ఉద్దేశంతో రాలేదు. "మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని" అంటే వారిని అత్యాచారం చెయ్యాలనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చారు.
2. లోతు ఇంటికి వచ్చినవారు పురుషులనే విషయం వారికి తెలుసు, అయినప్పటికీ వారు వీరిని కూడాలని (లైంగికసంబంధం) ఆశపడుతున్నారు దీనిని బట్టి వారు స్వలింగ సంపర్కులనే విషయం బాగా అర్థమౌతుంది. అందుకే ఇప్పటికీ స్వలింగ సంపర్కాన్ని ఈ పట్టణం పేరుతో "sodomy" అని పిలుస్తారు.
అయితే ప్రస్తుత సమాజంలో మనిషి చేసే అపవిత్ర కార్యాల వెనుక కూడా వారి హక్కులను చూసే కొందరు (మానవతావాదులు), ఈ స్వలింగ సంపర్కాన్ని సమర్థిస్తూ దేవుడు వారికి Apposite Gender పై కాకుండా Same Gender పైనే కామవాంఛ కలిగేలా చేసాడని, అందుకే వారు స్వలింగసంపర్కులుగా మారారని, కాబట్టి వారిని పాపులుగా ఎంచడమో నాశనం చెయ్యడమో సరికాదని విమర్శిస్తుంటారు. కానీ స్వలింగ సంపర్కులకు అలాంటి స్వభావవిరుద్ధమైన కామవాంఛ పుట్టడానికి కారణం దేవుడు కాదు. ఆయన కేవలం స్త్రీపురుషుల మధ్యలో మాత్రమే ఆ కోరికలు కలిగేలా వారిని సృష్టించాడు (ఆదికాండము 2:24). అది కూడా వారిని వివాహం ద్వారా ఒక్కటిగా జతపరిచి, ఫలింపచెయ్యడానికే (ఆదికాండము 1:27,28). కానీ ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి మానవజాతి అంతా పతన స్వభావాన్ని సంతరించుకుంది (ఆదికాండము 3వ అధ్యాయపు వ్యాఖ్యానం చూడండి).
అప్పటినుండే మనిషి ఇలాంటి హేయమైన కార్యాలు చేసేలా స్వభావసిద్దంగా ప్రేరేపించబడ్డాడు. అందుకే దేవుడు మనిషిని స్వభావసిద్ధంగా కూడా ఉగ్రతకు పాత్రులుగా చూస్తున్నాడు (ఎఫెసీ 2:3). అదేవిధంగా మనిషి తన పతన స్వభావాన్ని బట్టి దైవవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారు మరింత శిక్షకు గురవ్వడానికి కూడా దేవుడు వారిని ఇలాంటి హేయకార్యాలకు అప్పగిస్తున్నాడు (రోమా 1:21-28). కాబట్టి స్వలింగ సంపర్కానికి కారణం మనిషిలోని పతనస్వభావం, దైవవిరుద్ధమైన నడవడికే తప్ప దేవుడు కాదు. దీనికి సంబంధించిన మరికొన్ని కారణాలను ఈ వ్యాసంలో వివరించాను చదవండి.
LGBTQ+ పై బైబిల్ దృక్పథం ఏంటి? బైబిల్ ప్రకారం మూడవ లింగం (Third Gender) ఉందా?
ఆదికాండము 19:6- 8 లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపువేసి అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెల వైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి.
ఈ వచనాలలో లోతు తన ఇంటికి వచ్చిన ఇద్దరు మనుష్యులనూ కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు మనం చూస్తాం. వారు దేవదూతలని అతనికి తెలియదు కాబట్టి అలా చేస్తున్నాడు. అయితే ఆ క్రమంలో అతను తన ఇద్దరు కుమార్తెలనూ ఆ పట్టణస్థులకు అప్పగించడానికి సిద్ధపడ్డాడు. ఇది సరైనది కానప్పటికీ ఆ కాలంలో తమ అతిథులను కాపాడడానికి ఇంటివారిని కూడా త్యాగం చెయ్యడం అనవాయితీగా ఉండేది (న్యాయాధిపతులు 19:24).
గమనించండి. లోతు అబ్రాహాము వంటి విశ్వాసి కాదు. అయ్యుంటే అతను అసలు అబ్రాహామునే విడిచిపెట్టేవాడు కాదు. తన కాపరులను మందలించి అతనితోనే కలిసుండే ప్రయత్నం చేసేవాడు. అతను నీతిమంతుడు అని రాయబడింది (2 పేతురు 2:8) కేవలం సొదొమలోనే ఉంటూ వారి దుష్టత్వంలో కలసిపోకుండా దానిని ద్వేషించినందుకే తప్ప అబ్రాహాము అంత నీతిమంతుడని కాదు.
ఆదికాండము 19:9 ఈ మనుష్యులు నా యింటి నీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారువీడెవడో మనలోనికి పరదేశిగావచ్చి తీర్పరిగానుండ చూచుచున్నాడు. కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టు టకు సమీపించిరి.
ఈ వచనంలో లోతు ఆ ఇద్దరు మనుష్యులను కాపాడడానికి తన కుమార్తెలను అప్పగించడానికి సిద్ధపడినా దానికి వారు ఒప్పుకోకుండా అతనితో కఠినంగా వ్యవహరించడం మనం చూస్తాం. ఇక్కడ ఆ పట్టణస్థులు గతంలో లోతును బట్టి అబ్రాహాము చేసిన మేలు మరచిపోయి ఇలా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి కృతజ్ఞతాహీనత అనేది దుష్టుల లక్షణంగా మనం పరిగణించాలి. అలాంటి లక్షణం విశ్వాసులమైన మనది కాదు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించాలి.
యెషయా 26:10 దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.
అదేవిధంగా వారు ఆ మాటల్లో "వీడెవడో మనలోనికి పరదేశిగావచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు" అని పలకడం మనం చూస్తాం. నేను ప్రారంభ వచనాల్లో వివరించినట్టుగా లోతు ఆ పట్టణపు పెద్దమనిషిగా ఉండి ఆ పట్టణంలో జరిగే వివాదాల గురించి మంచిచెడ్డలను విచారిస్తున్నాడు. ఈ కారణం చేత కూడా వారికి లోతుపై పగ పెరిగి అతని ఇంటికి వచ్చిన వారిపై దాడికి సిద్ధపడియుండవచ్చు. కాబట్టి మనం కొన్నిసార్లు దుష్టులకు దూరంగా ఉండాలే తప్ప, వారిపై తీర్పరులుగా ఉండడానికి ప్రయత్నించకూడదు, అది మనకే ప్రమాదం. అందుకే జ్ఞానియైన సొలొమోను "అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును" (సామెతలు 9:7) అని హెచ్చరిస్తున్నాడు.
ఆదికాండము 19:10,11 అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసికొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దలవరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి.
ఈ వచనాలలో లోతు ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణస్తుల కళ్ళకు మబ్బు కలుగ చెయ్యడం మనం చూస్తాం. ఇప్పుడు లోతుకు తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరూ మనుష్యులు సాధారణ మనుష్యులు కాదని అర్థం ఔతుంది.
ఆదికాండము 19:12,13 అప్పుడా మనుష్యులు లోతుతో ఇక్కడ నీకు మరియెవరున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొనిరమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారినిగూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా-
ఈ వచనాలలో ఆ దేవదూతలు తాము లోతు దగ్గరకు ఎందుకు వచ్చారో తెలియచేస్తూ తనకు కలిగినవారందరినీ రక్షించుకోవడానికి లోతుకు అవకాశం ఇస్తున్నట్టు మనం చూస్తాం. ఆదికాండము 18వ అధ్యాయం ప్రకారం; వీరు యెహోవాతో కలసి అబ్రాహాము దగ్గరకు వెళ్ళారు, తదుపరి వీరు అబ్రాహాము విందు పుచ్చుకున్న తర్వాత యెహోవా ఆజ్ఞతో లోతును కాపాడి ఆ పట్టణాలను నాశనం చెయ్యడానికి సొదొమ చేరుకున్నారు (ఆదికాండము 18:22).
అయితే ఇక్కడ వారు "నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొనిరమ్ము" అంటూ లోతుకు కుమారులు కూడా ఉన్నట్టు ప్రస్తావించడం మనం చూస్తాం. దీని ఆధారంగా కొందరు లోతుకు కుమారులు కూడా ఉన్నారని ఐతే వారు లోతుతో బయటకురాలేదు కాబట్టి ఆ పట్టణంలోనే నశించిపోయారని భావిస్తుంటారు. కానీ ఇది వాస్తవం అయ్యుండదు. ఎందుకంటే దేవదూతలు సర్వజ్ఞులు కారు. వారికి దేవుడు తెలియచేసినంతమట్టుకే లేక గమనించినంతమట్టుకే ఏదైనా తెలుస్తుంది. కాబట్టి లోతు కుటుంబం గురించి వారికేమీ తెలియదు. అందుకే "ఇక్కడ నీకు మరియెవరున్నారు?" అని ప్రశ్నించి అతనికి కుమార్తెలు ఉన్నారు కాబట్టి వారికి భర్తలు కూడా ఉన్నారేమో అలానే కొడుకులు కూడా ఉన్నారేమో అని తనకు ఉన్నవారందర్నీ వెలుపలికి తీసుకురమ్మంటున్నారు. అతనికి కుమారులే ఉండుంటే ఆ సమయంలో ఇంట్లోనే ఉండేవారు కదా!
ఆదికాండము 19:14 లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాటలాడిలెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవు చున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్లదృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.
ఈ వచనంలో దేవదూతలు చెప్పినట్టే లోతు తనకు కాబోయే అల్లుల్లను హెచ్చరించినప్పుడు దానిని వారు ఎగతాళి (వేలాకోళం) గా భావించడం మనం చూస్తాం. ఎందుకంటే అతను చెప్పింది అసాధ్యంగా వారు భావించారు. ఈరోజు విశ్వాసులు దేవుని ఉగ్రతను ప్రకటిస్తూ మారుమనస్సు పొందమని లోకాన్ని/కుటుంబాన్ని హెచ్చరించినప్పుడు కూడా ఇలాంటి అనుభవమే ఎదురౌతుంటుంది. ఇలా జరుగుతుందని యేసుక్రీస్తు ముందే తెలియచేసాడు (లూకా 17:28-30) కాబట్టి ఆ విషయంలో మనం కృంగిపోకూడదు. రక్షణకు పాత్రులంతా రక్షించబడతారు. అందుకే "నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి" (అపో.కార్యములు 13:48) అని రాయబడింది. మిగిలినవారు నాశనమే.
1థెస్సలొనిక 5: 3 లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని (లోతు అల్లుళ్ళవలే) చెప్పుకొనుచుండగా గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.
ఆదికాండము 19:15,16 తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టిలెమ్ము. ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసికొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతనిమీద యెహోవా కనికరపడుటవలన ఆ మనుష్యులు అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయటనుంచిరి.
ఈ వచనాలలో ఆ దేవదూతలు లోతును ఆ పట్టణం నుండి తీసుకుని వెళ్ళేందుకు తొందరపెట్టడం, యెహోవా అతనిపై చూపిస్తున్న కనికరాన్ని బట్టి వారు లోతు కుటుంబాన్ని చేతులు పట్టుకుని మరీ బయటకు తీసుకురావడం మనం చూస్తాం. లోతుకు ఆ దేవదూతలు ఇచ్చిన సమయం మించిపోయినప్పటికీ తన అల్లుల్ల తిరస్కారాన్ని బట్టి ముందుకు కదలలేకపోతున్నాడేమో. కానీ ప్రస్తుతం వారి గురించి వేచిచూసే సమయం లేదు. మనం కూడా రక్షణ సువార్త విషయంలో ఎంత చెప్పినా తిరస్కరించేవారి పట్ల ఇలాంటి వైఖరినే కలిగియుండాలి. ఒక సందర్భంలో పౌలు కూడా ఏం చేసాడో చూడండి.
అపో.కార్యములు 13: 46 అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్లుచున్నాము.
అదేవిధంగా ఈ సందర్భంలో ఆ పట్టణస్తుల దోషశిక్ష గురించి ప్రస్తావించడం మనం చూస్తాం. కాబట్టి ఆ పట్టణంలో నశించిపోయినవారు అంతా కేవలం వారి దోషాన్ని బట్టే న్యాయంగా శిక్షించబడ్డారు. అయితే ఆ పట్టణంలో నశించిపోయిన చిన్నపిల్లల పరిస్థితి ఏంటనే సందేహం కొందరికి కలగొచ్చు. ఆ విషయంలో కొందరు విమర్శిస్తుంటారు కూడా. ఇలా విమర్శించేవారు, కలుషితమైన తమ మనసులోనే చిన్నపిల్లలపై అంతజాలి ఉంటే వారిని పుట్టించిన దేవుడు వారిపట్ల మరెంత న్యాయంగా ప్రవర్తిస్తాడో గ్రహించగలగాలి. ఆయన పాపాన్ని బట్టి ఒక జాతి మొత్తాన్ని నాశనం చెయ్యాలనుకున్నప్పుడు ఆ జాతి మొత్తాన్నీ పసిపిల్లలతో సహా నాశనం చేస్తాడు. అది ఆ జాతి ఇంతవరకూ చేసిన పాపం పట్ల ఆయన అసహ్యతనూ ఉగ్రతనూ సూచిస్తుంది. ఆ జాతిని సృష్టించినవాడిగా అలా చెయ్యడం ఆయనకు న్యాయమే.
అయితే కొన్నిసార్లు ఆ చిన్నబిడ్డలు ఈ లోకంలో మరింత అపవిత్రులు కాకుండా దానివల్ల మరింత శ్రమకు గురికాకుండా కూడా వారిని మరణానికి అప్పగిస్తుంటాడు. ఉదాహరణకు,
2 సమూయేలు 12: 15 గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పితన యింటికి వెళ్లెను.
ఈ సందర్భంలో దేవుడు దావీదు బత్షెబాల పాపాన్ని బట్టి వారికి పుట్టినబిడ్డను మరణానికి అప్పగిస్తున్నట్టు మనం చూస్తాం. చాలామంది దీని విషయంలో పాపం చేసింది దావీదు బెత్షెబాలు ఐతే ఆ పుట్టినబిడ్డను చంపడం ఏంటని విమర్శలు చేస్తుంటారు. కానీ దావీదు చేసిన పాపాన్ని బట్టి అతని కుటుంబానికి వచ్చిన శాపం ఏంటో మనం పరిశీలించాలి. అతను చేసినపాపాన్ని బట్టి అతని కుటుంబానికి ఎల్లవేళలా యుద్ధం కలుగుతుందని, తన పిల్లలు కూడా అపవిత్రులుగా జీవిస్తారని న్యాయంగా శపించబడ్డాడు (2 సమూయేలు 12:10-12). ఒకవేళ దావీదు బత్షెబాలకు పుట్టిన ఆ బిడ్డ బ్రతికేయుంటే అతను కూడా ఇందులో పాలుపొందే/శ్రమపడే అవకాశం ఉంది. పైగా అతడిని ప్రజలు వ్యభిచారం వల్ల పుట్టినవాడంటూ ఎగతాళి చేస్తారు. ఇలాంటి పరిస్థితులనుండి తప్పించడానికే దేవుడు ఆ బిడ్డను మరణానికి అప్పగించాడు.
కాబట్టి సొదొమ పట్టణాలలోని పిల్లలను కూడా ఇలాంటి కారణంతో కూడా ఆయన మరణానికి అప్పగించియుండవచ్చు, లేదా మనిషి స్వభావసిద్ధంగా పాపి అయ్యుండి దేవుని ఉగ్రతకు పాత్రుడిగా ఉన్నాడు కాబట్టి (ఎఫెసీ 2:3) ఆ ఉగ్రతను బట్టి కూడా వారు నశించియుండవచ్చు. ఏది ఏమైనప్పటికీ సార్వభౌముడైన, సృష్టికర్తయైన దేవునికి మానవులను జీవింపచెయ్యడానికే కాదు నశింపచెయ్యడానికి కూడా అధికారం ఉంటుంది, ఎందుకంటే ఆయన సృష్టికర్త.
ఒక తల్లి బిడ్డను కంటుంది కానీ సృష్టించదు, ఒక తండ్రి బిడ్డను పోషిస్తాడు కానీ ఆ బిడ్డకు ఊపిరిపొయ్యడు, పైగా ఏ తల్లీ తండ్రీ కూడా మానవ ఉనికికి మూలమైన గాలి, నీరు, ఆహారం సూర్యకాంతి ఇలాంవి సృష్టించి వారికి అందించలేరు. కాబట్టి తల్లితండ్రులకు పిల్లలపై ఉండే అధికారం పరిమితులు కలది, ముఖ్యంగా వారిని నశింపచేసే బాధించే అధికారం వారికి ఉండదు. కానీ సృష్టికర్తయైన దేవునికి తన సృష్టిపై అపరిమితమైన అధికారం ఉంటుంది, ఎందుకంటే ఆయన వారికి సృష్టించడమే కాదు, వారి జీవానికి మూలమైన నీరు గాలి సూర్యరశ్మి, భూమినుండి ఆహారం ఇవన్నీ తన కృపచేతనే వారికి అనుగ్రహిస్తున్నాడు (మత్తయి 5: 45, 1 కోరింథీ 15: 37,38, అపో.కా 14: 17, 17:24-27).
ఆదికాండము 19:17 ఆ దూతలు వారిని వెలుపలికి తీసికొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా-
ఈ వచనంలో సొదొమ దగ్గరకు చేరుకున్న యెహోవా (ఆయన) ఆ పట్టణం నుండి బయటకు వచ్చిన లోతుతో వెనక్కు చూడకుండా పారిపొమ్మనడం మనం చూస్తాం. ఇక్కడ లోతుతో మాట్లాడుతుంది దూతలలో ఒకరు కాదు యెహోవాయే. అది మనకు క్రింది వచనాలలో స్పష్టమౌతుంది.
ఆదికాండము 19:18-22 లోతు ప్రభువా ఆలాగు కాదు. ఇదిగో నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది. నా ప్రాణము రక్షించుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను ఘనపరచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది గదా, నేను బ్రదుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీ వక్కడ చేరువరకు నేనేమియు చేయలేననెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను.
ఈ వచనాల్లో లోతు యెహోవా పారిపోమన్న పర్వతానికి ప్రత్యామ్నాయంగా సమీపంలో ఉన్న ఊరును కోరుకోవడం దానికి ఆయన అంగీకరించడం మనం చూస్తాం. ఇక్కడ ఆయన లోతు భయాన్ని అర్థం చేసుకుని కనికరం చూపిస్తున్నాడు. ఇక లోతు పారిపోయిన ఆ ఊరికే సోయరు అనే పేరు పెట్టబడింది. సోయరు అంటే చిన్నది అని అర్థం.
ఆదికాండము 19:23-25 లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించినవారినందరిని నేల మొలకలను నాశనము చేసెను.
ఈ వచనాలలో యెహోవా లోతు సోయరుకు పారిపోయేంతవరకూ ఆగి, ఆ పిమ్మట ఆ పట్టణాలను నాశనం చేసినట్టు మనం చూస్తాం. ఈ సంఘటన వాస్తవంగా జరిగింది అనేందుకు లభ్యమైన ఆధారాలు ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు Google చేసి చూడవచ్చు.
అదేవిధంగా ఇక్కడ చాలా స్పష్టంగా యెహోవా దేవునిలో బహుళత్వాన్ని చూస్తున్నాం. ఆదికాండము 18వ అధ్యాయం ప్రకారం; యెహోవా ఇద్దరు దూతలతో కలసి అబ్రాహాము వద్దకు వెళ్ళాడు (ఆదికాండము 18:1) అక్కడ వారు ముగ్గురూ విందుపుచ్చుకున్న తర్వాత ఆయన తనతో వచ్చిన ఇద్దరు దూతలనూ సొదొమలో ఉన్న లోతు వద్దకు పంపి (ఆదికాండము 18:16, 22, 19:1) ఆయన మాత్రం అబ్రాహాముతో ఈ పట్టణాల గురించి సంభాషించాడు. ఆ తర్వాత ఆయన అబ్రాహాము వద్దనుండి వెళ్ళిపోయి (ఆదికాండము 18:33) ఈ అధ్యాయంలో సొదొమ పట్టణం నుండి బయటకు తీసుకువచ్చిన లోతుతో మాట్లాడాడు (ఆదికాండము 19:18-22). ఇప్పుడు ఆ యెహోవా మరో యెహోవా యొద్ద నుండి (ఆకాశం) అగ్నినీ గంధకాలనూ కురిపించి ఆ పట్టణాలను నాశనం చేసాడు.
అంటే ఇక్కడ మనకు యెహోవా అనే పేరుతో ఇద్దరు వ్యక్తుకు పరిచయం చెయ్యబడుతున్నారు. ఒకరు అబ్రాహాము ఇంటికి వచ్చి సొదొమ పట్టణాలపై అగ్ని గంధకాలను కురిపింపచేసిన యెహోవా. మరొకరు ఆకాశము నుండి అగ్ని గంధకాలను కురిపించిన యెహోవా. బాషాపరంగా కూడా ఇక్కడ ఏ పొరపాటూ జరగలేదు. ఎందుకంటే ఇదే సందర్భం గురించి రాయబడిన మరో లేఖనం చూడండి.
ఆమోసు 4:11 దేవుడు సొదొమ గొమొఱ్ణాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగా మీరు మంటలోనుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించు కొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు. ఇదే యెహోవా వాక్కు.
ఈ వచనంలో/ఆ అధ్యాయపు సందర్భంలో ఒక యెహోవా మాట్లాడుతూ దేవుడు సొదొమ గొమొఱ్ణాలను నాశనం చేసినట్టు నేను మీలో కొందరిని (ఇశ్రాయేలీయులను) నాశనం చేసానని అయినను మీరు నాతట్టు తిరిగినవారు కాదని అంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతుంది యెహోవాయే అందుకే "ఇదే యెహోవా వాక్కు" అని అంటున్నాడు. అలానే ఈ అధ్యాయంలో సొదొమ గొమొఱ్ణాలను నాశనం చేసిన దేవుడు కూడా యెహోవానే. ఆకాశం నుండి (ఆకాశంలో ఉండి) అగ్ని గంధకాలను కురిపించిన యెహోవా తండ్రియైన దేవుడైతే అబ్రాహాముతో సంబాషించాక పైనున్న యెహోవా యొద్దనుండి అగ్ని గంధకాలను కురిపింపచేసిన యెహోవా కుమారుడైన దేవుడు (యేసుక్రీస్తు). ఈ అంశం గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసాలను చదవండి.
యెహోవా దూత యేసుక్రీస్తు
త్రిత్వసిద్ధాంత నిరూపణ
ఇక ఈ సందర్భంలో దేవుని చేత నాశనం చెయ్యబడిన సొదొమ గొమొఱ్ణా పట్టణాల పాపం గురించి మనం పరిశీలిస్తే ఒక్క స్వలింగసంపర్కమే కాకుండా మరికొన్నిటిని కూడా లేఖనం తెలియచేస్తుంది (యెహెజ్కేలు 16:49,50).
ఆదికాండము 19:26 అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పుస్థంభమాయెను.
ఈ వచనంలో లోతు భార్య దేవుడు నాశనం చేస్తున్న పట్టణాలవైపు చూసి నాశనం అయినట్టు మనం చూస్తాం. ఆమె దేవుని ఆజ్ఞను అతిక్రమించి మరీ ఆ పట్టణాల వైపు చూడడానికి వాటిపై ఆమెకున్న మక్కువనే కారణం. కాబట్టి విశ్వాసులమైన మనం లోకం మనకు అందిస్తున్న సుఖవంతమైన జీవితంపై మక్కువతో దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యపెట్టకుండా జాగ్రతపడాలి. అందుకే "లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి" (లూకా 17:32,33) అని రాయబడింది.
అదేవిధంగా ఆమె ఉప్పుస్థంబంగా మారినప్పటికీ లోతు దానిని లక్ష్యపెట్టకుండా తన కుమార్తెలతో కలసి ముందుకు పారిపోయాడు. లేదంటే అతను కూడా నశించిపోయేవాడు. కాబట్టి విశ్వాసులమైన మనం అవిధేయులతో పాటు నశించిపోకుండా (కుటుంబసభ్యులైనా సరే) దేవుడు చెప్పినమార్గంలో ముందుకు సాగాలి.
ఇక్కడ మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే; అబ్రాహాము దేవుని పిలుపును బట్టి మొదట హారానుకు వచ్చేటప్పుడు "తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి" (ఆదికాండము 11:31) అని రాయబడింది. అంటే లోతు అబ్రాహాముతో కలసి హారానుకు వచ్చేసరికి అతనికి భార్య కానీ కుమార్తెలు కానీ ఉన్నట్టు భావించలేము.
అలానే అబ్రాహాము అతడిని నాకు విడిగా ఉండమన్నప్పుడు కూడా లోతు కుటుంబానికి సంబంధించిన ప్రస్తావన కనిపించదు (ఆదికాండము 13:11). అలానే శత్రురాజులు సొదొమ పట్టణం పై యుద్దం చేసి లోతును చెరపట్టుకుపోయినప్పుడు కూడా అతని కుటుంబం ప్రస్తావన కనిపించదు (ఆదికాండము 14). కేవలం అక్కడ "ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొని వచ్చెను" (ఆదికాండము 14:16) అని మాత్రమే ఉంటుంది. అతని పనివారిలో స్త్రీలు ఉంటారు కదా! పైగా అబ్రాహాము తీసుకువచ్చినవారిలో సొదొమకు చెందిన ప్రజలు కూడా ఉన్నారు అందుకే సొదొమ రాజు అబ్రాహాముతో "మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసికొనుమని" (ఆదికాండము 14:21) అంటాడు. కాబట్టి లోతు ఆ తర్వాతకాలంలో సొదొమకు చెందిన స్త్రీనే వివాహం చేసుకుని ఉంటాడు. అందుకే ఆమె ఆ పట్టణాలపై ఉన్న మక్కువతో దేవుని హెచ్చరికను కూడా లెక్కచెయ్యకుండా వెనక్కు తిరిగింది. అతని కుమార్తెల ప్రవర్తన కూడా ఆ పట్టణస్థుల్లానే నీచంగా కనిపిస్తుంది (ఆదికాండము 19:31-36). నేనైతే ఆమె సొదొమకు చెందిన స్త్రీయే అని విశ్వసిస్తున్నాను. అలా విశ్వసించడానికి అబ్రాహాము కనానుకు వచ్చినప్పటినుండి అతనికి ఇస్సాకు జన్మించేంతవరకూ గడచిన సమయంతో కూడా ఎలాంటి సమస్యా లేదు. ఆ 25 సంవత్సరాల మధ్యలోనే ఇదంతా జరిగింది కాబట్టి ఆ సమయంలోనే లోతు వివాహం చేసుకుని ఇద్దరు కుమార్తెలను కన్నాడు. ఆ కాలంలో ఆడపిల్లలకు త్వరగానే పెళ్ళి చేసేసేవారు కాబట్టి వారికి వివాహాలు కూడా నిశ్చయమైయున్నారు.
ఆదికాండము 19:27-29 తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొఱ్ఱాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలె లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసికొని, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండ అతని తప్పించెను.
ఈ వచనాలలో అబ్రాహాము లోతు విషయమైన ఆందోళనతో నాశనమైన ఆ పట్టణాలవైపు చూస్తున్నట్టు, దేవుడు అతనిని బట్టి లోతును కాపాడినట్టు మనం చూస్తాం. వాస్తవానికి ముందటి అధ్యాయంలో అబ్రాహాము దేవునితో సంబాషించినప్పుడు లోతు ప్రస్తావన తీసుకురాకుండానే ఆ పట్టణాలను కాపాడే ప్రయత్నం చేసాడు. అక్కడ అబ్రాహాము లోతు ప్రస్తావన తీసుకురానప్పటికీ అతని మనసెరిగిన దేవుడు లోతును తప్పించి అబ్రాహాముకు ఆనందం కలుగచేసాడు, ఇది దేవునికి తన పిల్లలపై ఉండే శ్రేష్టమైన ప్రేమ. ఇలాంటి ఉన్నతమైన ఆయన గుణలక్షణాలను మనం అర్థం చేసుకుని ఆయనకు మరింత విధేయులంగా జీవించాలి.
ఆదికాండము 19:30 లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి.
ఈ వచనంలో లోతు దేవుడు తనకు ముందుగా చెప్పిన పర్వతానికి పారిపోయి ఒక గుహలో నివసించడం మనం చూస్తాం. దేవుడు అతనితో ముందుగా అ పర్వతం దగ్గర నివసించమన్నప్పుడు లోతు సోయరులో నివసించడానికి ఆయనను బ్రతిమిలాడాడు. అప్పుడు ఆయన కూడా లోతుపై తన కనికరం చొప్పున ఆ ఊరిని నాశనం చెయ్యనని చెప్పాడు. అయినప్పటికీ ఇక్కడ లోతు తనకున్న భయంతో ఆ పర్వతం దగ్గరకే వెళ్ళిపోయాడు. ఒకవిధంగా ఇతను సోయరును నాశనం చెయ్యనన్న దేవునిమాటను తనకున్న భయాన్ని బట్టి నమ్మకుండా పోయాడు.
ఆదికాండము 19:31-36 అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలి వాడు. సర్వ లోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలిని చూచినిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని. ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము. ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షా రసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.
ఈ వచనాలలో లోతు కుమార్తెలు తమ తండ్రిద్వారా గర్భవతులు అయ్యేందుకు హేయమైన కార్యానికి పాల్పడడం మనం చూస్తాం. వీరు అప్పటివరకూ నివసించిన సొదొమ గొమొఱ్ఱాల సంస్కృతిని బట్టే అలా తెగించారు. కొందరు మతోన్మాదులు వీరు చేసినదానిని ప్రస్తావిస్తూ బైబిల్ లో తండ్రీకూతుర్ల సెక్స్ ఉందంటూ హేళన చేస్తుంటారు. బైబిల్‌లోని ఈ సందర్భం అబ్రాహామును విడిచివెళ్ళిన లోతు పరిస్థితిని తెలియచేసే చారిత్రికకోణంలో రాయబడింది తప్ప, అలాంటి హేయకార్యాలను ప్రోత్సహించడానికి కాదని కనీస విజ్ఞత ఉన్నా అర్థమౌతుంది. మతోన్మాదులకు అలాంటి విజ్ఞత ఉండదు కాబట్టి, పైగా వారి దేవుళ్ళకు ఇలాంటి పనులు చెయ్యడం బాగా అలవాటు కాబట్టి, బైబిల్ ని కూడా తప్పుగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో అలా హేళన చేస్తుంటారు.
ఇక లోతు విషయానికి వస్తే తన కుమార్తెలు చేసిన ఆ హేయకార్యంలో అతని ఉద్దేశపూర్వకమైన ప్రమేయం ఏమీలేదు. పురుషులు మత్తులుగా ఉండి సృహలో లేని సమయంలో కూడా వారి శరీరస్వభావం స్త్రీతో శయనించడానికి అనువుగానే ఉంటుంది. అందుకే జరిగిన విషయమేమీ అతనికి తెలియనట్టు "ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి" అని రాయబడింది (33,35,36 వచనాలు). దీనిని బట్టి లోతును తప్పు పట్టే అవకాశం ఎవరికీ లేదు. ఉదాహరణకు ఈరోజు ఎవరైనా కామాంధుడు ఒక స్త్రీకి మధ్యం కానీ మత్తు మందు కానీ పట్టించి ఆమెపై అత్యాచారం చేస్తే ఆ స్త్రీని ఎలా నిందించలేమో అలానే లోతునూ నిందించలేము.
కాసేపు ఈ వాదనంతా పక్కనపెట్టి లోతుకూడా ఆ తప్పు ఉద్దేశపూర్వకంగానే చేసాడు అనుకున్నప్పటికీ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మనుషులు తప్పులు చేసారు. అలా చేసిన కొందరు దేవుని చేత వెంటనే శిక్షించబడ్డారు కూడా. ఆ చరిత్రలన్నీ దేవుడు రాయించడానికి కారణం మనమలా చెయ్యవద్దని హెచ్చరించడానికే తప్ప అవి చేసేలా ప్రోత్సహించడానికి కాదు. అందుకే "వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులైయుండకుడి. మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను." (1 కొరింథీ 10:6-11) అని ఉంది.
కానీ బైబిల్ ని విమర్శించేవారి దేవతల చరిత్రలను పరిశీలిస్తే అక్కడ సాధారణ మనుషులు కాదు స్వయంగా వారే (దేవతలు) నీచమైన కార్యాలెన్నో చేసినట్టు, శాపాలకు కూడా లోనైనట్టు కనిపిస్తుంది. ఈ అంశం గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
హిందూ మతోన్మాదులు అశ్లీలపు ఆరోపణలకు బైబిల్ సమాధానాలు
కొందరు క్రైస్తవులు కూడా లోతు ఆ సమయంలో ద్రాక్షారసం త్రాగడం వల్లే తన కూతుళ్ళు ఆ పని చెయ్యడానికి అవకాశం లభించిందని, కాబట్టి జరిగిన ఆ సంఘటనలో లోతు ద్రాక్షారసం త్రాగడం కూడా నేరమేయని భావిస్తుంటారు. అయితే ఇక్కడ నాకు ఒక అభ్యంతరం ఉంది. అప్పటికి లోతు తన కూతుళ్ళతో కలసి పర్వతపు గుహలో నివసిస్తున్నాడు. ఈ కారణంచేత వారు తినడానికి అన్నిరకాల పధార్థాలు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కాబట్టి అతని కుమార్తెలు అతనికి ఆరోజులలో ఆహారకొరత ఉందని చెప్పి ద్రాక్షారసాన్నే ఎక్కువశాతంలో అందించారేమో? ఎందుకంటే అది పర్వతం కాబట్టి వారు ఆహారంకోసం పండ్లపైనే ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది.
అదేవిధంగా 2 పేతురు 2:7,8 వచనాలలో లోతు నీతిమంతుడని రాయబడింది. దీనికి లోతు చేసే అన్ని క్రియలూ నీతిగా ఉన్నాయని కాదు. ఆ సందర్భాన్ని మనం పరిశీలిస్తే ఆ పట్టణస్థులు చేస్తున్న హేయక్రియల విషయంలో అతనికి ఆ మాటను ఉపయోగించడం జరిగింది. ఎందుకంటే అతను వారి హేయక్రియల విషయంలో నీతిగా ఉంటూ వాటిని బట్టి తన మనసును నొప్పించుకునేవాడు, కాబట్టి అతనిని మనం అబ్రాహాము, నోవహు అంతటి నీతిమంతునిగా భావించే అవకాశం లేదు.
ఆదికాండము 19:37,38 వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును. చిన్నదికూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.
ఈ వచనాలలో లోతు కుమార్తెలు తమ తండ్రిద్వారా ఇద్దరు కుమారులను కన్నట్టు, వారి ద్వారా రెండు జనాంగాలు విస్తరించినట్టు మనం చూస్తాం. లోతు మత్తుడిగా ఉన్నప్పుడు తన కుమార్తెలు చేసినపని అతనికి తెలియకపోయినా తర్వాత వారు గర్భవతులై కుమారులను కన్నప్పుడు అతను తప్పకుండా మానసిక వ్యధకు గురయ్యుంటాడు. దేవుడు సొదొమ పట్టణాలను నాశనం చేసినప్పుడు ఇతను సోయరు నుండి పర్వతపు గుహలోకి కాకుండా అబ్రాహాము దగ్గరకు వెళ్ళుంటే ఇలాంటి పరిస్థితి అతనికి రాకుండును. కాబట్టి మనం ఏదైనా ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నపుడు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం కంటే మనకోసం ఆలోచించే అబ్రాహాము వంటి భక్తుల సహాయాన్ని కోరడం చాలా శ్రేయస్కరం.
అదేవిధంగా ఈ సందర్భంలో లోతుకు జన్మించిన ఆ కుమారుల సంతానపు చరిత్రను మనం పరిశీలిస్తే వారి తల్లులవలే వీరు కూడా హేయక్రియలెన్నో జరిగించి దేవుని చేత శిక్షించబడ్డారు (ద్వితీయోపదేశకాండము 23:3,4,6, సంఖ్యాకాండము 25:1-3, ఆమోసు 2:1-3, ఆమోసు 1:13,14).
అయితే ఈ లోతు ద్వారా జన్మించిన మోయాబు సంతానం నుండే యేసుక్రీస్తు వంశావళిలో బోయజు భార్యగా పేర్కోబడిన రూతు జన్మించింది. ఎందుకంటే ఆమె అపవిత్రమైన తన జాతితో సంపూర్ణంగా తెగదెంపులు చేసుకుని, కష్టమైనా నష్టమైనా ఇశ్రాయేలీయురాలిగా అనగా యెహోవా దేవుని భక్తురాలిగా జీవిస్తానని నయోమీని వెంబడించింది (రూతు 1:16,17). ఆ కారణంగా కనికరం కలిగిన దేవుడు ఆమెపై కృపచూపించి యేసుక్రీస్తు వంశావళిలో చోటుదక్కేలా చేసాడు. ఇది మోయాబీయుల జాతి విషయంలో ఆమెకు మాత్రమే కల్పించబడిన మినహాయింపు. పైగా యేసుక్రీస్తు పరిశుద్ధత, ఆయన వంశావళిని బట్టి సంక్రమించిందో ఆ వంశావళిని బట్టి తగ్గిపోయేదో కాదు. దీనికి సంబంధించిన ప్రాముఖ్యమైన వివరణను పైన ప్రస్తావించిన "హిందూ మతోన్మాదుల అశ్లీలపు ఆరోపణకు బైబిల్ సమాధానాలు" అనే వ్యాసంలో వివరించాను.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 19

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"

Add comment