29:1, 29:2, 29:3, 29:4, 29:5, 29:6, 29:7-9, 29:10, 29:11-13, 29:14,15, 29:16,17, 29:18,19, 29:20, 29:21-23, 29:24, 29:25, 29:26, 29:27, 29:28, 29:29, 29:30, 29:31,32, 29:33,34, 29:35
ఆదికాండము 29:1
యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను.
గత అధ్యాయంలో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై అబ్రహాముతో చెయ్యబడిన నిబంధనను జ్ఞాపకం చేసి, నిన్ను క్షేమంగా ఈ దేశానికి తిరిగి తీసుకువస్తానని ధైర్యపరచడం ద్వారా అతను బేతేలు నుండి ప్రయాణమై తూర్పుజనుల దేశానికి చేరుకున్నట్టు ఈ వచనంలో మనం చూస్తాం, తూర్పు జనుల దేశం అంటే సిరియా (ఆదికాండము 31:20, యెషయా 9:12). కాబట్టి విశ్వాసులు కొన్ని సమయాలలో యాకోబువలే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళినప్పటికీ దేవుని వాక్యాన్ని బట్టి బలపరచబడి మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి.
ఆదికాండము 29:2
అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దానియొద్ద గొఱ్ఱెల మందలు మూడు పండుకొనియుండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూతవేసి యుండెను.
ఈ వచనంలో యాకోబు ప్రయాణం చేస్తూ చివరికి ఒక బావి దగ్గరకు చేరినట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఆ చుట్టుప్రక్కల ప్రజలు ఏదోఒక సమయంలో నీటికోసం ఆ బావి దగ్గరకు వస్తారు కాబట్టి, వారిని వాకబు చెయ్యడం ద్వారా తాను చేరుకోవలసిన గమ్యానికి చేరుకోవచ్చనే ఉద్దేశంతో అతను అక్కడే నిలిచాడు. అబ్రాహాము దాసుడైన ఎలీయెజెరు కూడా ఇదేవిధంగా ఒక బావి దగ్గరకు చేరుకుని రిబ్కా కోసం ఎదురుచూసినట్టు మనం చదువుతాం (ఆదికాండము 24:11).
ఆదికాండము 29:3
అక్కడికి మందలన్నియు కూడి వచ్చునప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి, గొఱ్ఱెలకు నీళ్లు పెట్టి తిరిగి బావిమీది రాతిని దాని చోటనుంచుదురు.
ఈ వచనంలో యాకోబు చేరుకున్న బావిని ఆ ప్రాంతపువారు ఒక రాయితో మూసివేసి మందలన్నీ అక్కడ పోగయ్యాక మాత్రమే దానిని తీస్తున్నట్టు మనం చూస్తాం. దీనికి కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో నీరు సమృద్ధిగా లభించే పరిస్థితి ఉండదు కాబట్టి, ఎవరుబడితే వారు ఆ బావినీటిని ఎప్పుడుబడితే అప్పుడు తోడుకోకుండా కేవలం ఒక ఒప్పందం ప్రకారం మందలన్నీ పోగయ్యే సమయంలో మాత్రమే ఆ నీటిని తోడుకోవడానికి అలా చేసేవారు. అదేవిధంగా అప్పటి బావులు కొన్ని ఊట బావులుగా ఇంచుమించు నేలతో సమానంగా ఉండేవి, ఆ కారణం చేత నీటికోసం చూసే పశువులు అందులో పడిపోకుండా కూడా ఆ బావిని రాయితో మూసివేసేవారేమో.
ఆదికాండము 29:4
యాకోబు వారిని చూచి అన్నలారా, మీరెక్కడివారని అడుగగా వారు మేము హారాను వారమనిరి.
ఈ వచనంలో యాకోబు ఆ బావిదగ్గరకు వచ్చిన పశువుల కాపరులతో చాలా మర్యాదగా మాట్లాడడం మనం చూస్తాం. అతను వారితో మర్యాదగా "సోదరులారా" అంటూ మాట్లాడాడు కాబట్టే వారు కూడా అతను అడిగినదానికి మర్యాదగా సమాధానం ఇస్తున్నారు. వారి సమాధానం ప్రకారం యాకోబు ఇప్పుడు హారానుకు చేరుకున్నాడు. కాబట్టి విశ్వాసులు ఇతరులతో చేసే సంభాషణలు మర్యాదపూర్వకంగా ఉండడం చాలా ప్రాముఖ్యం.
ఆదికాండము 29:5
అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి.
ఈ వచనంలో యాకోబు ఆ బావి దగ్గరకు వచ్చినవారితో లాబాను గురించి వాకబు చెయ్యడం మనం చూస్తాం. వాస్తవానికి లాబాను తండ్రి పేరు బెతూయేలు, అతను నాహోరు కుమారుడు. వారి సంస్కృతుల్లో తాతలను కూడా తండ్రులుగానే సంబోధించేవారు కాబట్టి, బహుశా ఆ ప్రాంతంలో బెతూయేలు కంటే నాహోరు పేరున్నవాడు అవ్వడం వల్ల యాకోబు అతని పేరునే ఇక్కడ ప్రస్తావించాడు.
ఆదికాండము 29:6
మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తెయైన రాహేలు గొఱ్ఱెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి.
ఈ వచనంలో యాకోబు వారితో మాట్లాడుతుండగా ఆచోటికి రాహేలు రావడం మనం చూస్తాం. వాస్తవానికి క్రింది వచనాల ప్రకారం ఇంకా బావిపై రాయి పొర్లించే సమయం కాలేదు. అయినప్పటికీ ఆమె ముందుగానే ఆ చోటికి వచ్చింది, అది యాదృచ్ఛికం కాదు దేవుని నడిపింపు. ప్రపంచంలో జరిగేదేదీ యాదృచ్ఛికంగా జరగదు, ప్రతీదీ సార్వభౌముడైన దేవుని చిత్తానుసారంగానే జరుగుతుంది.
ఎఫెసీయులకు 1: 12 ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.
ఉదాహరణకు, యోసేపును తన అన్నలు గుంటలో పడవేసిన సమయంలో అటువైపుగా ఇష్మాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళడం యాదృచ్ఛికం కాదు, దేవుని నిర్ణయం. మోషేను తన తల్లి ఒక జమ్ముపెట్టెలో పెట్టి దానిని నీటిలో విడిచిపెట్టినప్పుడు ఫరో కుమార్తె స్నానం చెయ్యడానికి అక్కడికి రావడం, ఆమె పనికత్తె ఆ పెట్టెను చూడడం యాదృచ్ఛికం కాదు, దేవుని నిర్ణయం. మన జీవితాలలో కూడా ఏదైన ఆలస్యం అవ్వడం, నష్టపోవడం, ఏదైనా సరే ఏదీ యాదృచ్ఛికం కాదు, అసలు యాదృచ్ఛికం అనే భావజాలమే ఒక అబద్ధం, కాబట్టి విశ్వాసులు ఈ విషయంలో అవగాహన కలిగియుండాలి.
రోమీయులకు 8: 28 దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
ఆదికాండము 29:7-9
అతడు ఇదిగో ఇంక చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగుచేయు వేళకాలేదు, గొఱ్ఱెలకు నీళ్లు పెట్టి, పోయి వాటిని మేపుడని చెప్పగా వారుమందలన్నియు పోగుకాకమునుపు అది మావలన కాదు, తరువాత బావిమీద నుండి రాయి పొర్లించుదురు. అప్పుడే మేము గొఱ్ఱెలకు నీళ్లు పెట్టుదుమనిరి. అతడు వారితో ఇంక మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొఱ్ఱెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది.
ప్రారంభంలో మనం చూసినట్టుగా ఆ ప్రాంతపు మనుష్యులు ఒక ఒప్పందం ప్రకారం ఆ బావిపై రాయిని ఒక సమయంలో మాత్రమే తొలగించి తమ మందలకు నీళ్ళు పెట్టేవారు, అదే విషయాన్ని వారు ఈ వచనాలలో యాకోబుకు వివరిస్తున్నారు. అదేవిధంగా రాహేలు తన మందలను తోలుకుని బావిదగ్గరకు రావడాన్ని బట్టి ఆమె తన అత్తయైన రిబ్కావలే కుటుంబ బాధ్యత కలిగిన మంచి స్త్రీగా మనకు కనిపిస్తుంది. లేయా జబ్బుకండ్లు కలది కాబట్టి ఆమె ఇలాంటి బాధ్యతలు తీసుకుని ఉండకపోవచ్చు.
ఆదికాండము 29:10
యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావిమీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని యెలుగెత్తి యేడ్చెను.
ఈ వచనంలో రాహేలును చూసిన యాకోబు ఆ బావి మీద నుండి ఒక్కడే రాయిని పొర్లించి ఆమె మందకు నీళ్ళు పెట్టడం మనం చూస్తాం. జోనాథాన్ టార్గం లో కూడా దీనిగురించి ప్రస్తావించబడింది. మరికొన్ని యూదా రచనల్లో కూడా చాలామంది కలసి తీసే రాయిని యాకోబు ఒక్కడే తీసివేయడం అక్కడున్న మనుష్యులను ఆశ్చర్యపరిచిందని రాయబడింది. అదేవిధంగా ఇక్కడ యాకోబు రాహేలును ముద్దుపెట్టుకోవడం మనకు కనిపిస్తుంది దీనిని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటుంటారు కానీ ఇది ఆ కాలపు సంస్కృతుల్లో ఇద్దరు బంధువుల మధ్య ఉండే ప్రేమను సూచిస్తుంది. అందుకే క్రింది వచనాలలో లాబాను కూడా అదేవిధంగా యాకోబును ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పటికీ కొన్ని దేశాలలో ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. వ్యతిరేక లింగం వారిని ముద్దుపెట్టుకోవడం అనగానే ఎవరైన తప్పుగా అభిప్రాయపడుతుంటే ఒక తల్లి కూడా తన కొడుకును ముద్దుపెట్టుకోకూడదు.
ఆదికాండము 29:11-13
మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు, రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికొని వచ్చి అతని కౌగలించి ముద్దుపెట్టుకొని తన యింటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నియు లాబానుతో చెప్పెను.
ఈ వచనాలలో యాకోబు మాటలను బట్టి రాహేలు తన తండ్రికి ఆ సమాచారం తెలియచెయ్యడం, లాబాను కూడా యాకోబును తన ఇంటికి ఆహ్వానించడం మనం చూస్తాం. యాకోబు లాబాను ఇంట్లో అతను చూపించే ప్రేమాభిమానాల మధ్య ఎలాంటి ఇబ్బందీ లేకుండా నెలరోజులు నివసించాడు. ఇదంతా రిబ్కా ఆలోచించినట్టే మంచిగా జరుగుతుంది. అయితే ఆ నెలరోజులూ గడిచాక తన తండ్రిని మోసగించినందుకు దేవుడు యాకోబును క్రమశిక్షణ చెయ్యడం ప్రారంభమౌతుంది.
ఆదికాండము 29:14,15
అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునైయున్నావు అనెను. అతడు నెల దినములు అతనియొద్ద నివసించిన తరువాత లాబాను నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబు నడిగెను.
ఈ వచనాలలో లాబాను యాకోబు చేస్తున్న పనిని బట్టి, అతనికెంత జీతం కావాలో కోరుకోమనడం మనం చూస్తాం. యాకోబు రాహేలును కలుసుకున్నప్పుడే చురుగ్గా బావిమీద రాయిని పొర్లించి ఆమె మందకు నీరుపెట్టాడు. ఆవిధంగానే అతను లాబాను ఇంట్లో ఉన్న నెలరోజూలూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిచేస్తూనే ఉన్నాడు. అది గమనించిన లాబాను అలాంటి చురుకైన వ్యక్తిని తన ఇంటినుండి వెళ్ళనివ్వకూడదనే ఉద్దేశంతో నాకు ఊరికే కొలువు చెయ్యకుండా నీకేం జీతం కావాలో అడగమంటున్నాడు. యాకోబు తన తండ్రి పట్ల జరిగించిన మోసానికి దేవుడతణ్ణి క్రమశిక్షణవైపు నడిపించడంలో ఇది ప్రారంభం. ఎందుకంటే యాకోబు తన తండ్రిని మోసగించి పొందుకున్న ఆశీర్వాదం ప్రకారం అతనికి తన సోదరుడు దాసుడు ఔతాడు, ఇతను మాత్రం యజమానుడిగా ఉంటాడు. కానీ అక్కడ యజమానిగా ఉండాలని ఆశించిన యాకోబు ఈ సందర్భంలో మాత్రం లాబాను దగ్గర జీతానికి పనిచేసే దాసుడిగా మారుతున్నాడు. అదేవిధంగా లాబాను యాకోబును నీవు నా ఎముకలో ఎముక మాంసములో మాంసమని సంబోధించడం మనకు కనిపిస్తుంది. ఆ కాలంలో బంధుత్వాన్ని సూచించడానికి ఈ పోలికను వాడేవారు (2 సమూయేలు 19: 12).
ఆదికాండము 29:16,17
లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా. చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది. రాహేలు రూపవతియు సుందరియునై యుండెను.
ఈ వచనాలలో లాబాను పెద్దకుమార్తె లేయా జబ్బుకండ్లుగలదని రాయబడడం మనం చూస్తాం. ఆ జబ్బు ఏంటో లేఖనంలో మనకు స్పష్టంగా చెప్పబడలేదు కానీ దీనిపై కొందరు వివిధరకాల అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు. ఏదేమైనప్పటికీ అ కళ్ళు లేయా అందానికి మచ్చగా కనిపిస్తున్నాయి. రాహేలు మాత్రం అందమైనదిగా కనిపిస్తుంది, అందుకే యాకోబు ఆమెను ప్రేమించాడు.
ఆదికాండము 29:18,19
యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను. అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుటకంటె నీకిచ్చుట మేలు. నాయొద్ద ఉండుమని చెప్పగా-
ఈ వచనాలలో యాకోబును తన ఇంటిదగ్గరే ఉంచుకోవాలని నిశ్చయించుకున్న లాబాను నాకు చేసే కొలువుకు నీకేం జీతం కావాలో అడగమని యాకోబును ప్రేరేపించినప్పుడు అతను రాహేలును ప్రేమించి ఆమెకోసం 7 సంవత్సరాలు కొలువుచేయడానికి ఇష్టపడినట్టు మనం చూస్తాం. ఇక్కడ లాబాను ఆమెను అన్యునికివ్వటంకంటే నీకు ఇవ్వడం మేలని పలకడంలో యాకోబును మోసం చేసే ఆలోచన అతనికి ముందు నుండీ ఉన్నట్టు మనకు అర్థమౌతుంది. ఎందుకంటే లేయాను కూడా అన్యుడికి ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే అతను యాకోబును ప్రణాళిక ప్రకారం మోసం చేసాడు. అదేవిధంగా లాబాను తన కుమార్తెల విషయంలో చేసిన ఈ పని, కొందరు అన్యులను బానిసలుగా పట్టుకుని వారిని బేరం పెట్టి అమ్మివేసినట్టుగా ఉందని తర్వాతకాలంలో అతని కుమార్తెలే వాపోయినట్టు లేఖనం మనకు తెలియచేస్తుంది (ఆదికాండము 31:14,15). కాబట్టి విశ్వాసులు తమ పిల్లలతో ఎలాంటి భావం వచ్చేలా వ్యవహరిస్తున్నారో గమనించాలి.
ఆదికాండము 29:20
యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను.
ఈ వచనంలో యాకోబు రాహేలును ప్రేమించి ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చెయ్యడం మనం చూస్తాం. నిజమైన యవ్వనప్రేమకు యాకోబు రాహేలులు మనకు మంచి మాదిరిగా కనిపిస్తారు. యాకోబు ఆమె కోసం త్యాగపూరితంగా పనిచేస్తూ ఒకేచోట కలసి ఉంటున్నప్పటికీ వివాహం జరిగేవరకూ వారిద్దరూ తమ పవిత్రతను కోల్పోయి వ్యభిచరించలేదు, ప్రస్తుతం యవ్వనప్రేమను కామవాంఛలు తీర్చుకునే సాధనంగా భావించే ప్రతీ ఒక్కరికీ ఇది వ్యతిరేకంగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంలో యాకోబు రాహేలుపై ఉన్న ప్రేమతో లాబానుకు కొలువు చేసిన 7 సంవత్సరాల కాలం అతనికి కొద్ది దినాలుగా తోచిందని రాయబడింది. ఒకరిపై మనం తీవ్రమైన ప్రేమతో చేసే ఏ కష్టమైనా మనకు కష్టంగా అనిపించదు, ఆ సమయం మనకు తెలియకుండానే గడచిపోతుంది. ఒకవేళ విశ్వాసి తన ప్రభువైన దేవుణ్ణి పూర్ణమనస్సుతో ప్రేమిస్తే ఆయనకోసం వారు పడే ప్రయాస వారికి కష్టంగా తోచదు. ఆ ప్రేమతోనే అపోస్తలులు ఆయన కోసం ఎన్నో శ్రమలను, ప్రయాసలను, చివరికి మరణాలను కూడా ఇష్టంగా అనుభవించారు.
ఆదికాండము 29:21-23
తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యయొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా లాబాను ఆ స్థలములోనున్న మనుష్యులనందరిని పోగుచేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతనియొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను.
ఈ వచనాలలో లాబాను ఉద్దేశపూర్వకంగా యాకోబును మోసగించడం మనం చూస్తాం. అతను కేవలం యాకోబును మాత్రమే మోసగించలేదు కానీ తన కుమార్తెయైన రాహేలును కూడా మోసగించాడు. ప్రాచీన కాలపు కొన్ని సంస్కృతుల వివాహాల్లో అక్కడున్న ప్రజలకు రాత్రివేళ విందు చేసి విడివిడిగా ఉన్న వధూవరులను చీకటిగదిలోకి పంపడం ఆనవాయితీ. ఇక్కడ యాకోబు విషయంలో అదే జరిగింది కాబట్టి అతను గదిలో తనతో ఉన్న స్త్రీ ఎవరో గుర్తించలేకపోయాడు. పైగా ఆ పద్ధతిలో తొలిరాత్రి భార్యభర్తతో మాట్లాడకుండా సిగ్గుతో మౌనంగానే ఉంటుందేమో. దీనికారణంగా యాకోబుకు ఆమె స్వరాన్ని గుర్తుపట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ఈ మోసంలో లేయా పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది, యాకోబు తన చెల్లెలిని ప్రేమిస్తున్నాడనే విషయం ఆమెకు తెలిసినప్పటికీ ఆమె తన తండ్రి చేసే మోసంతో ఏకీభవించి మౌనంగా ఉండిపోయింది. ఆమెలో నిజాయితీ ఉంటే నేను రాహేలును కాదని చెప్పి ఉండేది. ఎందుకంటే లాబాను తన బంధువులందరినీ లేయా వివాహమని చెప్పి పిలవలేదు కానీ రాహేలుది అనే పిలిచాడు. ఒకవేళ లేయా వివాహమనే అక్కడివారిని పిలచి ఉంటే ఆ విషయం యాకోబుకు తెలియకుండా పోదు. కాబట్టి యాకోబు భార్య రాహేలే తప్ప లేయా కాదు. ఈవిధంగా లేయా అక్కడ యాకోబును మోసగించడంలో తండ్రితో పాటు ప్రమేయాన్ని చూపింది.
జరిగిన ఈ సంఘటనలో లాబాను, లేయాల మోసయుక్తమైన ఆలోచన మనకు కనిపిస్తుంటే దీనివెనుక సార్వభౌముడైన దేవుని న్యాయం కూడా మనకు కనిపిస్తుంది. యాకోబును ఆయన క్రమశిక్షణవైపుగా నడిపే క్రమంలో అతను ఏవిధంగా ఐతే మారువేషంలో తన తండ్రిని మోసగించాడో అదే మారువేషంలో ఉన్న లేయా వల్ల మోసపోయేలా ఆయన నిర్ణయించాడు.
గలతియులకు 6:7 మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.
ఆదికాండము 29:24
మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.
ఈ వచనంలో లాబాను తన కుమార్తెకు జిల్పా అనే స్త్రీని దాసిగా ఇవ్వడం మనం చూస్తాం. ప్రాచీనకాలంలో తాము కొనుగోలు చేసిన దాసదాసీలపై యజమానులకు పూర్తి హక్కు ఉండేది. ఆ హక్కును బట్టి వారు తమ కుమార్తెలకు వివాహం చేసినప్పుడు వారికి సేవలు చెయ్యడానికై వారిని కానుకలుగా ఇచ్చేవారు.
ఆదికాండము 29:25
ఉదయమందు ఆమెను లేయా అని యెరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పనియేమిటి? రాహేలు కోసమేగదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను.
ఈ వచనంలో యాకోబు రాత్రి తనతో ఉన్నది రాహేలు కాదు లేయా అని గుర్తించి లాబానును ప్రశ్నించడం మనం చూస్తాం. గతంలో తాను కూడా అదే పనిచేసాడని ఆ పనివల్ల తన అన్న కూడా ఇదే విధంగా బాధపడ్డాడని ఇప్పుడతనికి అనుభవమౌతుంది.
ఆదికాండము 29:26
అందుకు లాబాను పెద్దదానికంటె ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశమర్యాద కాదు.
ఈ వచనంలో లాబాను యాకోబుకు తాను చేసిన మోసం విషయంలో తప్పించుకోవడానికి అబద్ధం చెబుతున్నట్టు మనం చూస్తాం. ఒకవేళ అతను చెబుతుంది నిజమే ఐతే ఆ విషయం యాకోబుతో ఒప్పందం చేసుకోవడానికి ముందే అతనితో చెప్పి ఉండేవాడు. పైగా అక్కడున్న ప్రజలను నా చిన్న కుమార్తె వివాహమని చెప్పి విందుకు పిలవడం అతనికి సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ అతను పెద్దకుమార్తె వివాహమనే వారిని విందుకు పిలచి ఉంటే విందుకు వచ్చినవారు యాకోబును కలుసుకోకుండా ఉండరు కాబట్టి, వారు ఆ విషయాన్ని యాకోబుకు చెప్పి ఉండేవారు.
ఆదికాండము 29:27
ఈమెయొక్క వారము సంపూర్ణము చేయుము. నీవిక యేడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల అందుకై ఆమెను కూడ నీకిచ్చెదమని చెప్పగా-
ఈ వచనంలో లాబాను రాహేలు నిమిత్తం మరలా యాకోబుతో 7 సంవత్సారాల కొలువుకు ఒప్పందం చేసుకోవడం మనం చూస్తాం. యాకోబు ఏవిధంగా ఐతే తన అన్న ఆకలితో ఉన్నప్పుడు వ్యాపారం తరహాలో బేరానికి దిగాడో ఆవిధంగానే లాబాను కూడా యాకోబుతో వ్యాపారం తరహాలో ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ఇదంతా యాకోబు చేసినదానికి అతడిని క్రమశిక్షణ వైపుగా నడిపే దేవుని నిర్ణయమే. అయితే ఇందులో మోసగించినవారు తమ మోసానికి బాధ్యులుగానే ఉంటారు, దీనిగురించి ఇప్పటికే నేను ఆదికాండము 3 మరియు 27వ అధ్యాయాల వ్యాఖ్యానాలలో వివరించాను.
ఆదికాండము 29:28
యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తియైన తరువాత అతడు తన కుమార్తెయైన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను.
ఈ వచనంలో యాకోబు లాబాను మాటప్రకారం లేయాతో వారంరోజులు కలిసున్న తరువాత రాహేలును కూడా వివాహం చేసుకోవడం మనం చూస్తాం. "మొదటిసారి లాబాను యాకోబుతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ 7 సంవత్సరాలు కొలువు పూర్తయ్యేవరకూ అతనికి భార్యను ఇవ్వలేదు. ఆ విషయంలో లాబాను యాకోబును మోసగించాడు కాబట్టి ఈ సందర్భంలో మరో 7 సంవత్సరాలకు అతనితో ఒప్పందం చేసుకున్నప్పటికీ ఆ కాలం పూర్తయ్యేవరకూ అతనిని ఆపకుండా వారి దేశ వివాహ ఆచారం ప్రకారం లేయాతో అతను కలిసుండే ఏడురోజులు పూర్తవ్వగానే (న్యాయాధిపతులు 14:17) రాహేలును కూడా అతనికి భార్యగా ఇచ్చాడు". ఈవిధంగా యాకోబు లాబానుకు కొలువు చేయవలసిన మరో 7 సంవత్సరాలు అతను లేయాతోనూ రాహేలుతోనూ కాపురం చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వారికి పిల్లలు కూడా పుట్టారు.
ఆదికాండము 29:29
మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చెను.
ఈ వచనంలో లాబాను రాహేలుకు కూడా బిల్హా అనే స్త్రీని దాసిగా ఇవ్వడం మనం చూస్తాం. ఈవిధంగా లాబాను యాకోబు ఇద్దరు భార్యలకూ ఇద్దరు దాసిలను ఇవ్వడం జరిగింది.
ఆదికాండము 29:30
యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాకంటె రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు కొలువు చేసెను.
ఈ వచనంలో, యాకోబు రాహేలును కూడా భార్యగా చేసుకున్న తరువాత లాబానుతో చేసుకున్న ఒప్పందాన్ని మీరకుండా మరో 7 సంవత్సరాలు అతనికి కొలువు చేసినట్టు మనం చూస్తాం. "మరియేడేండ్లు" అంటే, మొదటిసారి కొలువు చేసిన 7 సంవత్సరాలు కాకుండా రెండవసారి కొలువు చేసిన 7 సంవత్సరాలని అర్థం. ఈవిధంగా యాకోబు తన భార్యలైన లేయా రాహేలుల నిమిత్తం 14 సంవత్సరాలు లాబానుకు కొలువు చేసాడు (ఆదికాండము 31:41).
ఆదికాండము 29:31,32
లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను. లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.
ఈ వచనంలో లేయా యాకోబు చేత ద్వేషించబడుతూ ఉండడం మొదటిగా మనం చూస్తాం. యాకోబు మొదటినుంచీ రాహేలునే ప్రేమించాడనే విషయం ఆమెకు తెలిసినప్పటికీ ఆమె మోసంతో యాకోబును భర్తగా చేసుకుంది కాబట్టి అతను ఆమెను ద్వేషిస్తూ బలవంతంగానే ఆమెతో కలిసి ఉన్నాడు. అయినప్పటికీ ఆమె ఆ విషయంలో తన తండ్రికి ఏనాడూ యాకోబుపై ఫిర్యాదు చెయ్యలేదు. ఎందుకంటే ఆమె అతణ్ణి మోసం చేసిందనేది ఆమెకు కూడా బాగా తెలుసు. అందుకే ఆమె తన తండ్రికి ఎలాంటి ఫిర్యాదులూ చెయ్యకుండా తన తప్పును తెలుసుకుని దేవునిపైనే ఆధారపడింది. ఆమె తన పిల్లలకు పెట్టిన పేర్లు కూడా దేవునిపై ఆమెకున్న విశ్వాసాన్ని మనకు రుజువుచేస్తున్నాయి. భార్యాభర్తలకు లేయా చేసిన ఈ పని మంచి పాఠాన్ని నేర్పిస్తుంది.
కాబట్టి, వివాహ జీవితంలో మనం చేసిన పొరపాటు వల్ల భాగస్వామి మనల్ని ద్వేషించినప్పుడు ఆ ద్వేషాన్ని బట్టి వారిపై ఫిర్యాదులకు పాల్పడకుండా మనం చేసిన తప్పును బట్టి ఆ ద్వేషం న్యాయమని ఎంచి పశ్చాత్తాపంతో దేవునిపై ఆధారపడాలి, భాగస్వామి ద్వేషాన్ని మన ప్రేమతోనే నిర్వీర్యం చెయ్యడానికి ప్రయత్నించాలి. లేయా అలా చేసింది కాబట్టే దేవుడు ఆమెపై కృపచూపించి ఆమె గర్భాన్ని తెరిచాడు. అదేవిధంగా ప్రతీమానవుని జననం ఆయన గర్భాన్ని తెరవడం మూలంగానే జరుగుతుంది (కీర్తనలు 100:3, 127:3).
రెండవదిగా ఈ సందర్భంలో మనం లేయా యాకోబుకు కన్న జ్యేష్ఠకుమారుడైన రూబేను గురించి పరిశీలిస్తే అతను యాకోబుకు జ్యేష్ఠకుమారుడిగా జన్మించినప్పటికీ పెద్దవాడైనతరువాత చేసిన ఒక హేయమైన క్రియను బట్టి నిందించబడ్డాడు, అతని జ్యేష్ఠత్వపు హక్కును కూడా కోల్పోయాడు (ఆదికాండము 35:22, 49:3,4, 1 దినవృత్తాంతములు 5:1).
ఆదికాండము 29:33,34
ఆమె మరల గర్భవతియై కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికూడ నాకు దయచేసెననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతియై కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను.
ఈ వచనాలలో లేయా మరో ఇద్దరు కుమారులను కూడా కన్నట్టు మనం చూస్తాం. ఆమె మూడవ కుమారుడైన లేవీని కనేవరకూ యాకోబు ఆమెపైన ద్వేషంతోనే వ్యవహరిస్తూ ఉండవచ్చు అందుకే ఆమె ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉంటాడని పలుకుతుంది. కాబట్టి నేను పైన జ్ఞాపకం చేసినట్టుగా జీవిత భాగస్వామి విషయంలో మనం పొరపాటు చేసినప్పుడు మనపై వారికి కలిగిన ద్వేషం విషయంలో దేవునిపై ఆధారపడి మన ప్రేమతో వారి మన్నింపును కోరుకునేటప్పుడు కొన్నిసార్లు ఆలస్యమైనప్పటికీ మన సహనాన్ని కోల్పోకూడదు, నిజమైన విశ్వాసులు ఇలాంటి ప్రవర్తననే అనుసరిస్తారు. అదేవిధంగా ఈ సందర్భంలో యాకోబుకు మూడవ కుమారుడిగా లేవి జన్మించడం మనకు కనిపిస్తుంది, ఇతని నుండి వచ్చిన లేవీగోత్రాన్నే దేవుడు తన యాజకత్వం కోసం ప్రత్యేకపరచుకున్నాడు.
ఆదికాండము 29:35
ఆమె మరల గర్భవతియై కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను.
ఈ వచనంలో లేయా యాకోబుకు నాలుగవ కుమారుడిని కని ఈసారి యెహోవాను స్తుతిస్తానని అతనికి యూదా అనే పేరు పెట్టినట్టు మనం చూస్తాం. ఈ యూదా నుండి వచ్చిన యూదా గోత్రంలోనే మన ప్రభువైన యేసుక్రీస్తు జన్మించారు, ఏర్పరచబడినవారంతా లేయాతో కలసి యెహోవాను స్తుతించేలా మార్గం తెరిచారు (మత్తయి 1:1-16).
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 29

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"

Add comment