18:1,2, 18:3-5, 18:6-8, 18:9,10, 18:11,12, 18:13-15, 18:16-19, 18:20,21, 18:22, 18:23-25, 18:26-32, 18:33
ఆదికాండము 18:1,2
మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి-
ఈ వచనాలలో యెహోవా దేవుడు; ఇద్దరు వ్యక్తులతో కలసి అబ్రాహామును దర్శించినట్టు మనం చూస్తాం. ఆయన తన భక్తులకు అనుగ్రహించిన ప్రత్యక్షతలలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ ఆయన మానవరూపంలో అబ్రాహాము దగ్గరకు వచ్చాడు.
ఆదికాండము 18:3-5
ప్రభువా, నీ కటాక్షము నామీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్లు కడుగు కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరచు కొనుడి. తరువాత మీరు వెళ్లవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా-
ఈ వచనాలలో తనయొద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులకు అబ్రాహాము ఆతిధ్యం చెయ్యడానికి ప్రయత్నించడం మనం చూస్తాం. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. అబ్రహాము దగ్గరకు వచ్చింది ముగ్గురు వ్యక్తులు అయినప్పటికీ అతను వారిలో ఒకరిని మాత్రమే ప్రభువా అని సంబోధిస్తున్నాడు. ఆ ఒక్కరే యెహోవా దేవుడని మనకు ప్రారంభవచనం తెలియచేస్తుంది. "యెహోవా అతనికి కనబడెను". మిగిలిన ఇద్దరు వ్యక్తులూ దేవదూతలని 22వ వచనంలోనూ తర్వాత అధ్యాయం మొదటివచనంలోనూ వారు సొదొమ వైపుగా వెళ్ళినప్పుడు మనకు అర్థమౌతుంది. కొందరు అబ్రాహాము ఇంటికి వచ్చిన ముగ్గురు వ్యక్తులనూ ఉద్దేశించి వారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అని అపార్థం చేసుకుంటున్నారు. అందుకే ఈ స్పష్టతను ఇవ్వవలసివస్తుంది.
ఆదికాండము 18:6-8
అబ్రాహాము గుడారములో నున్న శారాయొద్దకు త్వరగా వెళ్లినీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్ప గించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనము చేయు చుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను.
ఈ వచనాలలో అబ్రాహాము తాను చెప్పినట్టే తన దగ్గరకు మానవ రూపంలో వచ్చిన యెహోవాకూ, దేవదూతలకూ ఆతిధ్యం చెయ్యడం మనం చూస్తాం. ఈ సంఘటనపై కొందరు, దేవుడు/దేవదూతలు ఆహరం తిని దానిని అరిగించుకోవడానికి వారికి జీర్ణాశయం ఉండదు కాబట్టి, వారు అబ్రాహాముకు ఆ ఆహారాన్ని తింటున్నట్టుగా కనిపించారే తప్ప నిజానికి తినలేదని అభిప్రాయపడుతుంటారు. లేఖనాలు స్పష్టంగా చెబుతున్న విషయానికి ఇలాంటి సహజమైన తర్కాలు ఉపయోగించి, మరేదో చెప్పాలని ప్రయత్నించడం సరైనపద్ధతి కాదు. ఇక్కడ దేవుడు/దేవదూతలు మానవరూపాన్ని ధరించుకుని అబ్రాహాము ఇంటికివచ్చినప్పుడు వారు మానవులవలే ఆహారాన్ని భుజించినప్పటికీ అందులో మనకు ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది సర్వశక్తిగల దేవుని గురించి.
ఆదికాండము 18:9,10
వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడ నున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను. అందుకాయన మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చ యముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను.
ఈ వచనాలలో యెహోవా మాట్లాడుతూ, మరలా ఇదే కాలానికి నీదగ్గరకు వస్తానని అప్పటికి నీకు కుమారుడు జన్మిస్తాడని అబ్రాహాముకు వాగ్దానం చెయ్యడం మనం చూస్తాం. కాబట్టి ఈవిధంగా ఎవరు మాట్లాడతారో (దేవుడు), తనయొద్దకు వచ్చింది ఎవరో అబ్రాహాముకు కచ్చితంగా తెలుసు.
ఆదికాండము 18:11,12
అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక శారానేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమాను డును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను.
ఈ వచనాలలో శారా తన మరియు తన భర్తయొక్క శారీరక పరిస్థితులను బట్టి దేవుడు చెబుతున్న మాటలకు నవ్వుకున్నట్టు మనం చూస్తాం. ఈవిధంగా నవ్వుకున్న శారా తదుపరి దేవుడు పలికిన మాటలను బట్టి విశ్వాసం ద్వారా ఇస్సాకును కనే శక్తిని పొందుకున్నట్టు లేఖనంలో రాయబడింది.
హెబ్రీయులకు 11:11 విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.
కాబట్టి విశ్వాసులమైన మనం మనమున్న పరిస్థితులను బట్టి కొన్ని అసాధ్యంగా భావించినప్పటికీ దేవుని మాటలను బట్టి అనగా ఆయన వాక్యాన్ని బట్టి మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ దేవుని వాగ్దానాలపై విశ్వాసముంచగలగాలి (2 తిమోతీ 3:14,15 , రోమా 15:4).
ఆదికాండము 18:13-15
అంతట యెహోవా అబ్రాహాముతోవృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల? యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడినేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను.
ఈ వచనాలలో శారా నవ్వును బట్టి దేవుడు తనకు అసాధ్యమైంది ఏదీలేదని ప్రకటించుకోవడం, శారా నేను నవ్వలేదని అబద్ధం చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ శారా అబద్ధం చెప్పినందుకు ఆయన ఆమెపై కోపపడలేదు కానీ ఆమెకు ఆయన శక్తి గురించి తెలియచేసి, నువ్వు నవ్వావంటూ ఆమె అబద్ధాన్ని బహిర్గతం చేస్తున్నాడు. ఎందుకంటే ఆమె భయంతో అబద్ధాన్ని చెప్పచూసింది.
ఆదికాండము 18:16-19
అప్పుడా మనుష్యులు అక్కడనుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితోకూడ వెళ్లెను. అప్పుడు యెహోవానేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.
ఈ వచనాలలో దేవుడు తాను చెయ్యాలనుకుంటున్న కార్యాన్ని అబ్రాహాముకు వివరించాలకోవడం మనం చూస్తాం. ఆయన అబ్రాహాముకు ఆ కార్యాన్ని తెలియచెయ్యాలని అనుకోవడానికి ఒకదానితో ఒకటి ముడిపడిన రెండు కారణాలు ఉన్నాయని మనం భావించవచ్చు.
1. అబ్రాహాము నీతిన్యాయాలను జరిగిస్తూ దేవుని మార్గంలో నడుచుకుంటూ తన ఇంటివారు కూడా అదేవిధంగా ప్రవర్తించేలా వారికి బోధిస్తున్నాడు. కాబట్టే దేవుడు అతనితో అంత సన్నిహితంగా మసలుకుంటున్నాడు. కాబట్టి మనమంతా దేవునితో ఇలాంటి మంచి సంబంధం కలిగియుండేలా నీతిన్యాయాలను జరిగిస్తూ ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఆవిధంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన తన వాక్యంలో బయలుపరచిన సంగతులన్నీ గ్రహించడానికి తన ఆత్మద్వారా మనకు సహాయం చేస్తాడు.
కీర్తనలు 119: 18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము.
1 కొరింథీయులకు 2:12,13 దేవుని వలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.
2. అబ్రాహాము దేవుడు తనతో చేసిన నిబంధనను బట్టి ఆయనపట్ల విధేయత చూపుతూ పైన చెప్పినవిధంగా ఆయన మార్గంలో నీతిగా నడుచుకుంటున్నాడు కాబట్టి, అతని విషయంలో దేవుడు చేసిన ఆ నిబంధనను ఆయన ఆసక్తికలిగి నెరవేర్చబోతున్నాడు. దీనివల్ల అతని సంతానం బహుగా విస్తరించబోతుంది. క్రింది వచనాల ప్రకారం దేవుడు చేస్తున్న కార్యం సొదొమ గొమొఱ్ఱా పట్టణాలను నాశనం చెయ్యడంగా మనకు అర్థమౌతుంది. ఒకవేళ ఆయన అబ్రాహాముతో దీనిగురించి ముందే చెప్పకుండా అలా నాశనం చేస్తే భవిష్యత్తులో ఆయన విస్తరింపచేస్తానన్న తన సంతానాన్ని కూడా ఆయన అలాగే నాశనం చేస్తాడేమో అనే ఆందోళన అతనిలో కలుగుతుంది. పైగా ఆ పట్టణంలో లోతు కూడా కాపురం ఉంటున్నాడు. అందుకే దేవుడు ఆ కార్యం గురించి అబ్రాహాముకు తెలియచేసి, తాను ఊరకనే ఆ పట్టణాలను నాశనం చెయ్యడం లేదని, వారు చేసినపాపాన్ని బట్టే న్యాయంగా శిక్షిస్తున్నానని అతనికి అర్థమయ్యేలా వివరించబోతున్నాడు. దీనివల్ల అబ్రాహాము భవిష్యత్తులో ఆయన తన సంతానాన్ని నాశనం చేసినప్పటికీ దానికి న్యాయమైన కారణం ఉంటుందని భావించి ధైర్యం తెచ్చుకుంటాడు.
ఆదికాండము 18:20,21
మరియు యెహోవాసొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయనియెడల నేను తెలిసికొందుననెను.
ఈ వచనాలలో దేవుడు సొదొమ గొమొఱ్ఱా పట్టణాలను ఉద్దేశించి, ఆయనవద్దకు వచ్చిన మొరప్రకారం ఆ పట్టణాలను విమర్శించడానికి వచ్చానని పలకడం మనం చూస్తాం. ఈమాటలు మనకు రెండు విషయాలు తెలియచేస్తున్నాయి.
1. దేవుడు ఎవరిపాపమూ సంపూర్ణం కాకుండా వారిని సమూలంగా నాశనం చెయ్యడు, దాని విషయంలో తప్పకుండా ఆయన మానవులను విచారణ చేస్తాడు.
2. దేవునికి సొదొమ గొమొఱ్ఱా పట్టణస్తుల పాపం సంపూర్ణమైందని ముందే తెలుసు. కానీ నేను పైన చెప్పినట్టుగా అబ్రాహాముకు దేవుడు నేనేం చేసినా వారిపాపం సంపూర్ణమయ్యాకనే చేస్తానని అర్థమయ్యేలా చెప్పడానికి ఆయన ఈవిధంగా పలుకుతున్నాడు (కీర్తనలు 37:13 , 50:21, ఆదికాండము 15:16).
ఆదికాండము 18:22
ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను.
ఈ వచనంలో యెహోవాతో కలసి అబ్రాహాము దగ్గరకు వచ్చిన ఇద్దరు మనుష్యులు సొదొమ వైపుగా వెళ్ళినట్టు మనం చూస్తాం. వారు దేవదూతలని తర్వాత అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది (ఆదికాండము 19:1 ). ఇక్కడ దేవుడు వారిని సొదొమవైపు పంపివేసాడు కానీ ఆయన ఇంకా అబ్రాహాము ఇంటి పరిసర ప్రాంతాల్లోనే నిలిచియున్నాడు. ఎందుకంటే ఆయన అబ్రాహాము మనసులో ఉన్న సందేహాలను తీర్చడానికి అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు.
ఆదికాండము 18:23-25
అప్పడు అబ్రాహాము సమీపించి యిట్లనెనుదుష్టులతోకూడ నీతి మంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానిలోనున్న యేబదిమంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతి మంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టు నితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు-
ఈ వచనాలలో అబ్రాహాము సొదొమ గొమొఱ్ఱా పట్టణాల విషయంలో దేవునితో మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. అతను ఈవిధంగా మాట్లాడడానికి రెండు కారణాలు ఉన్నాయి.
1. దుష్టులతో పాటుగా నీతిమంతులను కూడా ఆయన నశింపచెయ్యడం ఆయన న్యాయానికి విరుద్ధం. అబ్రాహాము తన మనసులో ఆ పట్టణాలలో కనీసం యాబైమందైనా నీతిమంతులు ఉంటారని భావిస్తున్నాడు కాబట్టి దేవుడు వారిని కూడా నశింపచేస్తే ఆయన గుణలక్షణాలపై నిందపడుతుందని ఆలోచించి ఈవిధంగా మాట్లాడుతున్నాడు. అబ్రాహాము దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నాడు అనడానికి మంచి ఆధారమే ఈమాటలు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఆ దేవుని గుణలక్షణాలకు ఏదైనా చెడ్డపేరు వస్తుందంటే దానిని సహించలేడు. అందుకే ఆయన ఇశ్రాయేలీయులను నాశనం చేస్తాను అన్నప్పుడు కూడా మోషే ఇలాంటి ఆవేదననే ఆయనముందు వ్యక్తపరిచాడు (నిర్గమకాండము 32:7-14 ).
2. అబ్రాహాము మనసులో ఈమాటలు పలకడం వెనుక నీతిమంతుడైన లోతును గురించిన ఆలోచనకూడా ఉంది. అందుకే ఆదికాండము 19:29వ వచనంలో "దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని లోతును తప్పించినట్టుగా" రాయబడింది. కాబట్టి ఈ సందర్భంలో అబ్రాహాము లోతు పేరు తియ్యకుండా దేవునితో మాట్లాడనప్పటికీ అతనిని గురించిన చింత మాత్రం మనసులో తప్పకుండా ఉంది. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి, గతంలో పశువుల కాపరుల మధ్య తలెత్తిన కలహాల వల్ల లోతు అబ్రాహాముకు దూరంగా నివసిస్తున్నాడు. అయినప్పటికీ అబ్రాహాము అతనికోసం ఆలోచించి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. కాబట్టి మనవారు మనకు దూరంగా ఉంటున్నప్పటికీ వారు ఆ విధంగా దూరంగా ఉండడానికి కొన్ని వ్యక్తిగత కలహాలు కూడా కారణమైనప్పటికీ మనం వారి క్షేమంకోసం ప్రార్థించకుండా ఉండకూడదు.
ఆదికాండము 18:26-32
యెహోవాసొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను అందుకు అబ్రాహాముఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువై నందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన అక్కడ నలుబది యైదు గురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను. అతడింక ఆయనతో మాటలాడుచుఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయనఆ నలుబదిమందిని బట్టి నాశనముచేయక యుందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడనియెడల నేను మాటలాడెదను. ఒకవేళ అక్కడ ముప్పదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను. అందు కతడుఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని. ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయ కుందుననగా అతడు ప్రభువు కోపపడనియెడల నేనింకొకమారే మాటలాడెదను. ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందిని బట్టి నాశనము చేయకయుందుననెను.
ఈ వచనాలలో అబ్రాహాము తాను మొదట ప్రస్తావించిన లెక్కనుండి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ చివరికి పదివరకూ వెళ్ళడం, దేవుడు దానికి కూడా అంగీకరించేసరికి, అతనికి ఆ పట్టణాలలో పదిమంది నీతిమంతులు కూడా లేరని అర్థమై మౌనంగా ఉండడం మనం చూస్తాం. దీనివల్ల అబ్రాహాముకు దేవుడు ఆ పట్టణంలోని దుష్టులతో పాటుగా నీతిమంతులను కూడా నశింపచెయ్యడం లేదని, వారి పాపం సంపూర్ణమయ్యాకే వారిని నాశనం చేస్తున్నాడని బాగా అర్థమైంది. ఇది అతనికి బాగా అర్థమవ్వాలనే దేవుడు ఎంతో దీర్ఘశాంతంతో అతనితో సంభాషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబ్రాహాము మనసులో తన సంతానాన్ని కూడా ఆయన అదేవిధంగా నాశనం చేస్తాడేమో అనే ఆందోళనకు ఊరట లభించింది.
అయితే తన మనసులో లోతును గురించిన చింతమాత్రం అలానే ఉండిపోయింది. ఎందుకంటే అతనికి పదిమంది నీతిమంతులు కూడా ఆ పట్టణంలో లేరని తెలిసినప్పుడు ఇంక దేవునితో మాట్లాడే సాహసం చెయ్యలేకపోయాడు. బహుశా అతను ఆ పట్టణంలో లోతు ఇంటివారి (పనివారితో సహా) తో కలిపి కనీసం పదిమంది నీతిమంతులైనా ఉంటారని బలంగా విశ్వసించి అంతవరకూ మాట్లాడియుండవచ్చు. కానీ అక్కడ లోతు తప్ప చివరికి అతని కుటుంబంలో కూడా ఎవరూ నీతిమంతులుగా లేరు. అయినప్పటికీ దేవుడు ఆ ఒకడ్ని కూడా విడిచిపెట్టకుండా అతనితో పాటు అతని కుటుంబాన్ని కూడా కాపాడినట్టుగా మనం చూస్తాం.
2పేతురు 2: 7,8 దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.
ఆదికాండము 18:33
యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.
ఈ వచనంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన తర్వాత అతని యొద్దనుండి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. తర్వాత అధ్యాయంలో ఇదే యెహోవా సొదొమ గొమొఱ్ణా పట్టణాలవద్దకు వెళ్ళి, తాను చెప్పినట్టుగానే ఆ పట్టణాలను నాశనం చేసాడు (ఆదికాండము 19:24 ). వాస్తవానికి ఈ యెహోవా తండ్రియైన యెహోవా కాదు. కుమారుడైన యెహోవా. దీనిగురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
యెహోవా దూత యేసుక్రీస్తు
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 18

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"

Add comment