37:1, 37:2, 37:3, 37:4, 37:5-11, 37:12-17, 37:18-20, 37:21-24, 37:25, 37:26-28, 37:29,30, 37:31-33, 37:34,35, 37:36
ఆదికాండము 37:1 యాకోబు తన తండ్రి పరదేశవాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను.
ఈ వచనంలో యాకోబు కనాను దేశంలో నివసిస్తున్నట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఇది అబ్రాహాము ఇస్సాకులకు దేవుని ఆజ్ఞ (ఆదికాండము 13:17, 26:3) అది యాకోబుకు కూడా వర్తిస్తుంది కాబట్టి అతను ఆ దేవుని ఆజ్ఞకు లోబడి జీవిస్తున్నాడు అని తెలియచెయ్యడానికే ఈమాటలు రాయబడ్డాయి (హెబ్రీ 11:8,9).
ఆదికాండము 37:2 యాకోబు వంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండువాడు.
ఈ వచనంలో గ్రంథకర్త యాకోబు వంశావళి ప్రస్తావిస్తూ యోసేపుపై దృష్టి సారించడం మనం చూస్తాం. ఎందుకంటే యాకోబు కుటుంబం సజీవంగా ఉండడానికి ఇతనే కారణం. అలానే అతను 17 యేళ్ళ యవ్వనుడిగా ఉండగానే తన సహోదరుల చెడుతనాన్ని తన తండ్రికి చేరవెయ్యడం ద్వారా చెడుతనాన్ని ద్వేషించేవాడిగా కనిపిస్తున్నాడు. అందుకే యాకోబు కుటుంబంలో ప్రముఖుడిగా పేరుగాంచాడు. గమనించండి; 17 యేళ్ళ వయస్సు అంటే సహజంగానే అది చెడుతనానికి ఆకర్షించబడే వయస్సు. అయితే యోసేపు జీవితం అలా లేదు. దీనికి యెహోవాయందు అతను కలిగున్న భయభక్తులే కారణం. కాబట్టి ఈరోజు మేము దేవునిపట్ల భయభక్తులు కలిగియున్నామని భావించే విశ్వాసులు యోసేపులో ఉన్న ఈ లక్షణం తమలో ఉందో లేదో పరిశీలించుకోవాలి. ఎందుకంటే "యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు" (సామెతలు 16:6) అని రాయబడింది. దానిప్రకారం; మనలో ఇంకా చెడుతనం ఉందంటే మనకు యెహోవా యందు భయభక్తులు లేవు. ఉన్నట్టు భ్రమపడుతున్నాం అంతే.
అదేవిధంగా యోసేపు తన సహోదరులు చేస్తున్న చెడుతనంలో పాలిభాగస్తుడు కాకుండడమే కాదు, దానిని తన తండ్రికి తెలియచేస్తున్నాడు. ఎందుకంటే పాపం విషయంలో మౌనంగా ఉండడం అందులో పాలు పంచుకోవడమే ఔతుంది. అందుకే "నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను" (లేవీయకాండము 19:17) అని రాయబడింది. కాబట్టి మన కుటుంబసభ్యులు కానీ సన్నిహితులు కానీ సంఘస్థులు కానీ చెడుతనంవైపు ఆకర్షితులౌతున్నప్పుడు గద్దించే స్థాయి మనకుంటే గద్దించాలి. లేదా సంబంధిత పెద్దలకు దానిని తెలియచెయ్యాలి. అయితే ఆ క్రమంలో మనం సమస్యల్లో పడకుండా కూడా చూసుకోవాలి సుమా.
ఆదికాండము 37:3 మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువుటంగీ కుట్టించెను.
ఈ వచనంలో యాకోబు యోసేపును ఎక్కువ ప్రేమించడానికి కారణమేంటో రాయబడడం మనం చూస్తాం. యాకోబుకు యోసేపు వృద్ధాప్యంలో (91వ యేట) జన్మించాడు. పైగా అతను యాకోబు ప్రేమించి వివాహం చేసుకున్న రాహేలు కుమారుడు. అందుకే యాకోబు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమిస్తున్నాడు. అయితే అందరికంటే చిన్నవాడు అనగా యాకోబుకు మరింత వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు బెన్యామీను అయినప్పుడు అతను కూడా రాహేలు కుమారుడే అయినప్పుడు యోసేపు ఎక్కువ ప్రేమించబడడానికి "అతను ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక" అనే కారణం ఎలా సరిపోతుందే సందేహం రావొచ్చు. కానీ ఈ సంఘటన జరిగే సమయానికి బెన్యామీను పుట్టుండడు. ఎందుకంటే ఇస్సాకు చనిపోయే సమయానికే ఈ యోసేపు ఐగుప్తుకు అమ్మబడి 12 సంవత్సరాలు గడచిపోయింది (ఆదికాండము 35:27 వ్యాఖ్యానం చూడండి). ఆ 12 సంవత్సరాల కాలంలో బెన్యామీను పుట్టుండాలి. అందుకే ప్రస్తుతం ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారునిగా యోసేపు మాత్రమే ఉండి అందరికంటే ఎక్కువగా ప్రేమించబడుతున్నాడు.
అదేవిధంగా చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలను ప్రేమించడమంటే వారికి బాధ్యతలు నేర్పించకుండా సోమరులను చెయ్యడమే అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. కానీ యాకోబు యోసేపును అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నప్పటికీ తనకు మందను కాచే బాధ్యత అప్పగించాడు. కాబట్టి విశ్వాసులైన తల్లితండ్రులందరూ తమ పిల్లల విషయంలో ఇలాంటి వైఖరిని కలిగుండాలి.
ఆదికాండము 37:4 అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, అతనిని క్షేమసమాచారమైనను అడుగలేకపోయిరి.
ఈ వచనంలో తమతండ్రి యోసేపును ఎక్కువగా ప్రేమించడం గమనించిన యాకోబు కుమారులు అతనిపై విషపు చూపు నిలిపినట్టు మనం చూస్తాం. యాకోబు వారందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించడానికి కారణం ఉన్నప్పటికీ అది మాటిమాటికీ బహిర్గతం అవ్వడం వల్ల మిగిలిన కుమారులకు ఆ చిన్నవాడిపై పగను పుట్టించింది. కాబట్టి తల్లితండ్రులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే కుటుంబంలో ఎన్నో అనర్థాలు చోటుచేసుకుంటాయి.
ఆదికాండము 37:5-11 యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. అతడు వారిని చూచి నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను. అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మునేలెదవా? మామీద నీవు అధికారివగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింత పగపట్టిరి. అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరియొక కలకంటిని. అందులో సూర్యచంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగపడెనని చెప్పెను. అతడు తన తండ్రితోను తన సహోదరులతోను అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన యీ కలయేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమూ అని అతని గద్దించెను. అతని సహోదరులు అతనియందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను.
ఈ వచనాలలో యోసేపు ఒకే భావం కలిగిన రెండు కలలు కని వాటిని తన తండ్రికీ సహోదరులకూ తెలియచెయ్యడం, దానిని బట్టి అతని సోదరులు అతనిపై మరింత పగపట్టడం, యాకోబు సైతం అతణ్ణి గద్దించడం మనం చూస్తాం. ఎందుకంటే అప్పటికే అతని సోదరులు యోసేపుపై అసూయతో ఉన్నారనే విషయం యాకోబుకు తెలిసుంటుంది. ఈ కలలవల్ల వారు మరింత అసూయపడే అవకాశం ఉంటుంది కాబట్టి, యాకోబు అలా గద్దించాడు కానీ ఆ కలను మాత్రం జ్ఞాపకం ఉంచుకున్నాడు.
యోసేపు చెప్పిన ఈ రెండు కలలకూ నెరవేర్పుగా అతను ఐగుప్తు ప్రధానిగా మారినప్పుడు అతని సోదరులంతా అతనిముందు సాష్టాంగపడ్డారు. ఆ కుటుంబమంతటినీ ఐగుప్తులో అతనే పరిపాలించాడు (ఆదికాండము 42:5,6, 46:6-8).
అదేవిధంగా యోసేపు కనిన కలలో తన సోదరులు నక్షత్రాలవలే తన తల్లితండ్రులు సూర్యచంద్రులవలే పోల్చబడడం మనకు కనిపిస్తుంది. దేవుడు అబ్రాహాముతో అతని సంతానం గురించి వాగ్దానం చేసినప్పుడు కూడా ఇశ్రాయేలీయులను ఆయన ఆకాశనక్షత్రాలతో పోల్చాడు, యాకోబు దీనిని బట్టే ఆ నక్షత్రాలు, సూర్యచంద్రులు తమ కుటుంబాన్ని సూచిస్తున్నాయని భావించాడు. అయితే ఆ కలలో యోసేపు తల్లి కూడా (చంద్రుడు) అతనికి సాష్టాంగపడినట్టు మనకు కనిపిస్తుంది కానీ అతను ఐగుప్తులో ప్రధానిగా మారి తన కుటుంబాన్ని అక్కడికి రప్పించేసరికి అతని తల్లియైన రాహేలు చనిపోయింది. కాబట్టి అతని తల్లి విషయంలో యోసేపు చెప్పిన మాట నెరవేరలేదనే సందేహం కొందరికి కలుగుతుంది కానీ యోసేపు తల్లియైన రాహేలు చనిపోయినా యాకోబు మిగిలిన భార్యలు అతని తల్లి స్థానంలో ఉంటారు (ప్రాముఖ్యంగా బెన్యామీనుకు తల్లిగా వ్యవహరించిన ఆమె). దీనిప్రకారం యోసేపు కలలో చంద్రుడిగా ఆమె గురించే చెప్పబడింది.
అలానే ఇక్కడ సూర్యచంద్రులు యోసేపుకు సాష్టాంగపడ్డారు అన్నప్పుడు యాకోబు మరియు అతని భార్య తమ కుమారుడైన యోసేపు ముందు నిజంగానే సాష్టాంగపడతారని భావించకూడదు. ఆ మాటలు యోసేపు వారిపై అధికారిగా ఉంటాడనేదానిని తెలియచేస్తున్నాయి. ఐగుప్తు దేశంలో యాకోబు కుటుంబమంతా యోసేపు అధికారం క్రిందనే జీవించింది.
అదేవిధంగా ఈ యోసేపు కలలను కొందరు ప్రస్తావిస్తూ ఇప్పటికీ అలాంటి కలల ద్వారా దేవుడు భవిష్యత్తును తెలియచేస్తాడని బోధిస్తుంటారు. యోబు గ్రంథంలో కూడా దీనికి సంబంధించిన మాటలు మనకు కనిపిస్తాయి (యోబు 33:15-18). కానీ ఆ సందర్భాలన్నీ వాక్య ప్రత్యక్షత సంపూర్ణంగా లేని సమయానికి చెందినవని మనం గ్రహించాలి. ఆయన మనకు పరిపూర్ణంగా వాక్యాన్ని అప్పగించి, అవసరమైన బోధను తెలియచేసాక మరలా కలల ద్వారా దర్శనాల ద్వారా మనకేదో కొత్త సంగతి చెబుతాడని ఎదురుచూడడం వాక్యానికి లోబడకుండా వేరొకదానిపై ఆధారపడడమే ఔతుంది. అలా కాకూడదనే పౌలు తన సంఘాన్ని వాక్యానికి అప్పగించినట్టుగా చదువుతున్నాం (అపో. కార్యములు 20:32).
బైబిల్ లోని దర్శనాలూ కలలూ ఇప్పటికీ మనుగడలో ఉన్నాయని ఎందుకు భావించకూడదంటే ఏలియా ఆ కాలంలో అగ్నిని భూమిపైకి దింపి, బలిని దహించేలా చేసి, అక్కడున్నవారికి యెహోవాయే నిజదేవుడని నిరూపించాడు. వర్షాన్ని ఆపాడు, రప్పించాడు. ఏలీషా ఎలుగుబంట్లను రప్పించాడు. మోషే 10 తెగుళ్ళని రప్పించాడు, ఎర్రసముద్రాన్ని పాయలు చేసాడు. ఇప్పుడు మనం కూడా అలానే చేసి, మతోన్మాదులు, నాస్తికుల నోర్లను మూయించవచ్చుగా? ఎందుకలా చెయ్యలేకపోతున్నాం? ఎందుకంటే ప్రస్తుతం మన దేవుడే నిజదేవుడని వాక్యాన్ని ఆధారం చేసుకుని, సృష్టిని ఆధారం చేసుకుని చెప్పాలే తప్ప, అద్భుతాలు చూపించి కాదు. కలలూ దర్శనాల విషయంలో కూడా అంతే.
ఆదికాండము 37:12 అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లిరి.
యాకోబు కనానుకు వచ్చినప్పటినుంచీ జరిగినట్టుగా రాయబడిన సంఘటనలన్నీ వరుసక్రమంలో రాయబడలేదని గ్రంథకర్త ఈ అధ్యాయం నుండి యోసేపు చరిత్రను వివరించదలచి వాటిని ముందే తెలియచేసాడని ఇప్పటికే వివరించాను. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే ఈ షెకెముకు చెందిన షెకెమే దీనాను పాడు చేసాడు (34 అధ్యాయం). అయితే ప్రస్తుతం యాకోబు కుమారులు ఆ ప్రాంతంలోనే మందలను మేపడాన్ని బట్టి ఆ సంఘటన ఇంకా జరగలేదని అర్థం.
ఆదికాండము 37:13-17 అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. నిన్ను వారియొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలోనుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటుఅటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి నీవేమి వెదకుచున్నావని అతనినడిగెను. అందుకతడు నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను. అందుకు ఆ మనుష్యుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్లిరి. వారు దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను.
ఈ వచనాలలో యాకోబు తన కుమారుడైన యోసేపును అతని సహోదరుల దగ్గరకు పంపించడం, యాకోబు చెప్పిన ప్రాంతంలో వారు లేనప్పటికీ అతను వెనుదిరగకుండా వారి సమాచారాన్ని తెలుసుకుని మరీ ఆ చోటికి వెళ్ళడం మనం చూస్తాం. ఇక్కడ యోసేపులో ఉన్న పట్టుదలనూ అతనికి తన సహోదరులపై ఉన్న ప్రేమను కూడా మనం గుర్తించవచ్చు.
ఆదికాండము 37:18-20 అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.
ఈ వచనాలలో యోసేపు అన్నలు అతనిపై కుట్ర చెయ్యడం మనం చూస్తాం. అతను ఎంతో ప్రేమతో వారిని నెతుక్కుంటూ వచ్చాడని కూడా వారు ఆలోచించలేకపోతున్నారు. అసూయ అంతగా వారిని అంధుల్ని చేసింది. దాని స్వభావమే అది. కాబట్టి విశ్వాసులమైన మనం ఈ అసూయ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
గమనించండి; ఇక్కడ యోసేపు అన్నలు అతడిని చంపడం ద్వారా అతను కన్నటువంటి కలలను అవహేళన చెయ్యాలనుకున్నారు. కానీ ఆ కలలు దేవుని నిర్ణయం కాబట్టి ఎవరూ వాటిని నిరర్థకం చెయ్యలేరు. అందుకే "యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు." (సామెతలు 21:30) అని రాయబడింది. ఈరోజు ఎంతోమంది మతోన్మాదులు ఇలానే సువార్తీకులను చంపడం ద్వారా హింసించడం ద్వారా సువార్తను నిర్వీర్యం చెయ్యాలనుకుంటున్నారు కానీ సువార్త ప్రకటించబడుతూనే ఉంది.
ఆదికాండము 37:21-24 రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండ అతని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనినప్పగించుటకై వారి చేతులలో పడకుండ అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి. అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న యీ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొనియుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి, అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు.
ఈ వచనాలలో యాకోబు పెద్దకుమారుడైన రూబేను యోసేపును ప్రాణహాని నుండి తప్పించేలా అతన్ని నీరులేని గుంటలో పడవేసేలా ప్రోత్సహించడం మనం చూస్తాం. అతను యోసేపును ఏదోలా తన తండ్రికి అప్పగించే ఉద్దేశంతో అలా చేసుండవచ్చు. ఈవిధంగా దేవుడు రూబేను ద్వారా యోసేపును కాపాడాడు. ఆయన సాతానును కూడా తన చిత్తాన్ని నెరవేర్చుకునేందుకు వాడుకునే సర్వాధికారి.
అయితే ఈ సంఘటన అంతటిలో యోసేపు మాట్లాడినట్టు ఎక్కడా మనకు కనిపించదు కానీ వారు ఇలా చేస్తున్నప్పుడు అతను ఎంతో బ్రతిమిలాడినట్టు తర్వాత కాలంలో అతని సోదరులే ఒప్పుకుని పశ్చాత్తాపపడ్డారు (ఆదికాండము 42:21,22). కాబట్టి మనిషి నేరం చేస్తున్నప్పుడు మనస్సాక్షి వాతవేయబడినప్పటికీ ఆ నేరానికి తగిన పర్యవసానాన్ని (శిక్షను) ఎదుర్కొన్నప్పుడు ఎందుకలా చేసానా అని బాధపడక తప్పదు.
ఆదికాండము 37:25 వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి.
ఈ వచనాలలో యోసేపు అన్నలు అతడిని గుంటలో పడవేసి భోజనం చేస్తున్నప్పుడు అటుగా ఇస్మాయేలీయులు వెళ్ళడం మనం చూస్తాం. ఈ ఇష్మాయేలీయులు అబ్రాహాము పెద్దకుమారుడైన ఇష్మాయేలు సంతానం. వీరు ఐగుప్తుకు సుగంధద్రవ్యాలు తీసుకువెళ్ళి అక్కడ వ్యాపారం చేసేవారు, నాగరికతపరంగా ఎంతో అభివృద్ధి చెందిన ఐగుప్తు దేశంలో సుగంధద్రవ్యాల వాడకం ఎక్కువగా ఉండేది, చనిపోయిన దేహాలను మమ్మిఫికేషిన్ (మృతదేహాలను భద్రపరచడం) చెయ్యడానికి కూడా వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు (ఆదికాండము 50:2,3).
గమనించండి; యోసేపును వారు గుంటలోకి పడద్రోసినప్పుడు, అటువైపుగా ఇష్మాయేలీయులు వెళ్ళడం యాదృచ్చికంగా జరగలేదు. యోసేపు ఐగుప్తుకు చేరాలనేది దేవుని నిర్ణయం కాబట్టే అలా జరిగింది (కీర్తనలు 105:17). ఈ సృష్టిలో యాదృచ్చికంగా జరిగేవంటూ ఏమీ ఉండవు సమస్తమూ దేవుని నిర్ణయానుసారంగానే జరుగుతుంది. అందుకే "ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు" (ఎఫెసీ 1:12) అనీ "దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము" (రోమా 8:28) అని కూడా రాయబడింది.
ఆదికాండము 37:26-28 అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మి వేయుదమురండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హానియేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.
ఈ వచనాలలో యూదా ప్రేరణతో వారంతా యోసేపును ఇష్మాయేలీయులకు అమ్మివేయడం, వారతడిని ఐగుప్తుకు తీసుకుపోవడం మనం చూస్తాం. చూడండి; వారు యోసేపు ఏ కలలనైతే అవహేళన చెయ్యాలనుకుని అతడిని చంపాలనుకున్నారో అదే కలను నెరవేర్చడానికి దేవుడు యూదాను వాడుకుంటూ అతను ఐగుప్తుకు అమ్మబడేలా చేసాడు (కీర్తనలు 105:17). అందుకే యోసేపు దీనిని దేవుని ఉద్దేశమని విశ్వసించాడు (ఆదికాండము 50:19,20). అయినప్పటికీ యోసేపు అన్నలు పగతో ఇలా చేసారు కాబట్టి వారి మనసులో ఉన్న ఉద్దేశాన్ని బట్టి వారు చేసింది నేరమే (ఆదికాండము 3:1 వ్యాఖ్యానం చూడండి).
అదేవిధంగా యోసేపును కొనుక్కున్నవారి గురించి ఇష్మాయేలీయులు అనీ మిద్యానీయులు అని కూడా రాయబడింది. ఇష్మాయేలీయులూ మిద్యానీయులూ అబ్రహాము సంతానమే అయినప్పటికీ వారు వేరు వేరు తల్లులకు పుట్టిన వేరువేరు జాతులవారు (ఆదికాండము 16:15, 25:1,2). మరి మోషే ఆ ఇష్మాయేలీయులను మిద్యానీయులు అని కూడా ఎందుకు రాసాడంటే మిద్యాను అనేపేరుతో ఒక దేశం కూడా ఉంది (నిర్గమకాండము 2:15). యోసేపును కొనుక్కున్న ఈ ఇష్మాయేలీయులు కూడా ఆ దేశంలోనే నివసించేవారు (దేశం ఎవరిదైనా అందులో ఇతరజాతుల వారు కూడా నివసిస్తారు). కాబట్టి మోషే ఆ దేశం పేరుతోనే వారిని మిద్యానీయులు అని ప్రస్తావించాడు. ఒకే దేశంలో వేరు వేరు జాతు ప్రజలు నివసిస్తున్నప్పటికీ వారిని ఆ దేశం పేరుతోనే పిలవడం సహజమే కదా! ఉదాహరణకు మనమంతా భారతీయులం.
ఆదికాండము 37:29,30 రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగివెళ్లి చిన్నవాడు లేడే. అయ్యో నేనెక్కడికి పోదుననగా-
ఈ వచనాలలో రూబేను యోసేపును పడవేసిన గుంటలో అతను లేకపోయేసరికి అతనికి ప్రాణహాని సంభవించిందేమో అని రోదించడం మనం చూస్తాం. అతడి సహోదరులు అతన్ని ఇష్మాయేలీయులకు అమ్మివేసేటప్పుడు రూబేను అక్కడ లేడు, బహుశా మందల దగ్గరకు వెళ్ళుంటాడు.
ఆదికాండము 37:31-33 వారు యోసేపు అంగీని తీసికొని, ఒకమేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి అతడు దానిని గురుతుపట్టి ఈ అంగీ నా కుమారునిదే. దుష్టమృగము వానిని తినివేసెను. యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను.
ఈ వచనాలలో యోసేపు అన్నలు యాకోబును మభ్యపెట్టేలా సన్నాహం చెయ్యడం మనం చూస్తాం.
దీనివల్ల వారు తమ తండ్రియైన యాకోబుపై దయ లేకుండా అతనికి కూడా ఎంతో వేదనను కలుగచేసారు.
ఆదికాండము 37:34,35 యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను.
ఈ వచనాలలో యాకోబు తన కుమారుడైన యోసేపు కోసం అంగలార్చడం మనం చూస్తాం. గమనించండి; యాకోబు దేవుని ఆజ్ఞ చొప్పునే కనానుకు చేరుకుని ఆ దేశంలో నివసిస్తున్నాడు. కానీ అతని జీవితంలో ఇలాంటి వేదనలు మినహాయించబడలేదు. రాహేలు మరణం, దీనాపై అత్యాచారం. ప్రాముఖ్యంగా ఈ యోసేపు సంఘటన. ఇలా మరెన్నో. అయినప్పటికీ అతను దేవుణ్ణి ఎక్కడా నిందించలేదు. ఎందుకు నా కుటుంబాన్ని కాపాడలేదని ప్రశ్నించలేదు. మరోవిషయం ఏంటంటే యోసేపు గురించి ఎంతగానో అంగలారుస్తున్న తమ తండ్రిని చూస్తున్న అతని కుమారులు వేషధారుల్లా అతడిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప జరిగిన సంఘటన అతనికి తెలియచేసి యోసేపును వెనక్కు తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యడంలేదు. అసూయవల్ల కలిగిన పగ మనుషులను ఎంత హీనస్థితికి దిగజార్చుతుందో వివరించడానికి ఇదొక ఉదాహరణ.
అదేవిధంగా ఈ సందర్భంలో యాకోబు కుమార్తెల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. యాకోబు పిల్లల జాబితాను మనం పరిశీలించినప్పుడు అతనికి దీనా అనే ఒకే కుమార్తె ఉంది తప్ప కుమార్తెలు లేరు. హెబ్రీయుల సంస్కృతి ప్రకారం వారు తమ పిల్లలకు పుట్టినవారిని కూడా కుమారులు, కుమార్తెలు అనే సంబోధిస్తారు కాబట్టి, యాకోబు కుమార్తెయైన దీనాతో పాటుగా అతని కుమారుని కుమార్తెయైన శెరహు (ఆదికాండము 46:17) తో కలపి ఇక్కడ ఆవిధంగా ప్రస్తావించబడింది. అంతేకాకుండా వారు కోడళ్ళను కూడా కుమార్తెలుగానే సంబోధిస్తారు (రూతు 1:11,12).
ఆదికాండము 37:36 మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసికొనిపోయి, ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మి వేసిరి.
ఈ వచనాలలో ఇష్మాయేలీయులు (మిద్యాను దేశస్తులు) యోసేపును ఫరో ప్రముఖ ఉద్యోగస్తునికి అమ్మివేసినట్టు మనం చూస్తాం. కొందరు బైబిల్ పండితులు, యోసేపు జీవితానికీ యేసుక్రీస్తు జీవితానికీ పోలికలు చూపిస్తూ అతను యేసుక్రీస్తుకు ఛాయగా ఉన్నాడని బోధిస్తారు. నిజంగానే వీరిద్దరి మధ్యా కొన్ని పోలికలు ఉన్నట్టుగా మనకు కనిపించినా బైబిల్ గ్రంథం ఆవిధంగా ఎక్కడా ఖచ్చితంగా ప్రకటించలేదు కాబట్టి వాటిని విడిచిపెడుతున్నాను.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 37

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"

Add comment