28:1,2, 28:3-5, 28:6-9, 28:10,11, 28:12-15, 28:16-19, 28:20,21, 28:22
ఆదికాండము 28:1,2
ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి-
ఈ వచనాలలో ఇస్సాకు రిబ్కా మాటమేరకు, యాకోబును పిలిపించి, నీవు నీ తల్లియొక్క తండ్రి ఇంటికి వెళ్ళి ఆమె సహోదరుడైన లాబాను కుమార్తెను వివాహం చేసుకోమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దీనిని బట్టి మనం మూడు ప్రాముఖ్యమైన విషయాలు గ్రహించాలి.
1. ఇస్సాకు ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న యాకోబు శాపగ్రస్తులైన కనానీయుల కుమార్తెలను కాకుండా తన తల్లి సోదరుడి కుమార్తెను మాత్రమే వివాహం చేసుకునేలా ఇక్కడ ఆజ్ఞాపించబడుతున్నాడు. దీని ప్రకారం దేవుని ఆశీర్వాదం పొందుకున్న ప్రజలు తమ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించడానికి ఆయన అనుమతించలేదు. వారు దేవుని ఆజ్ఞలప్రకారమే జీవించితీరాలి. అందుకే ప్రస్తుతం దేవునిచేత ఆశీర్వదించబడిన మనముందు కూడా లేఖనాలలో ఎన్నో ఆజ్ఞలు నిర్ణయించబడ్డాయి.
2. ఈ సందర్భం జరగడానికి ముందు యాకోబు ఇస్సాకు చేత ఆత్మీయంగానూ భౌతికంగానూ ఆశీర్వదించబడ్డాడు (ఆదికాండము 27:28,29). కానీ ఇప్పుడు తన తండ్రి ఆజ్ఞప్రకారం ఏమీలేని పరదేశిగా మరోచోటికి పయనమవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆ ఆశీర్వాదం వెంటనే జరిగేది కాదు, దాని నెరవేర్పుకు కొంతసమయం పడుతుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకున్న ప్రజలు వెంటనే దాని ప్రతిఫలం అనుభవించకపోవచ్చు, అలాంటి సమయంలో నిరాశ చెందకూడదు.
3. యాకోబు తన తండ్రి నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోవడం దేవుని నిర్ణయమే అయినప్పటికీ అందులో అతను చేసిన మోసానికి తప్పకుండా తానే బాధ్యుడు ఔతాడని గత అధ్యాయంలో వివరించాను (ఆదికాండము 27:5-10 వ్యాఖ్యానం చూడండి). కాబట్టి అతను తన విషయంలో నెరవేరిన దేవుని సంకల్పాన్ని బట్టి ఆశీర్వాదం పొందుకున్నట్టే ఆ సమయంలో తాను చేసిన ఆ మోసానికి క్రమశిక్షణ కూడా చెయ్యబడాలి. అందుకే ఇప్పుడు యాకోబు తన తండ్రి ఆజ్ఞ ప్రకారం తన మామ ఇంటికి వెళ్ళి కష్టాలు పడబోతున్నాడు. ఎందుకంటే అతను చేసిన ఆ మోసాన్ని బట్టే ఏశావు అతనిపై పగబట్టాడు, ఆ భయంతోనే రిబ్కా యాకోబును అక్కడికి పంపించడానికి ఇస్సాకును ప్రేరేపించింది.
ఆదికాండము 28:3-5
సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశ మును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసి కొనునట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేసెను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను.
ఈ వచనాలలో ఇస్సాకు; అబ్రాహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరలా యాకోబుకు జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. ఆ వాగ్దానం యాకోబులో నెరవేరినట్టుగా అతని జీవితచరిత్రను బట్టి మనకు అర్థమౌతుంది. ఎలా అంటే అబ్రాహాము పిల్లలలో ఇస్సాకు మాత్రమే ఆ వాగ్దానానికి వారసుడయ్యాడు, ఇస్సాకు పిల్లలలో యాకోబు మాత్రమే దానికి వారసుడయ్యాడు కానీ యాకోబు విషయంలో మాత్రం అతని పిల్లలంతా ఆ వాగ్దానానికి చెందినవారుగా దీవించబడ్డారు (ఇశ్రాయేలీయులు). అదేవిధంగా ఇక్కడ ఇస్సాకు తనను మోసగించిన యాకోబుపై ఎలాంటి కోపమూ చూపకుండా అతనిని దీవిస్తున్నాడు. ఎందుకంటే యాకోబు తనను మోసగించినప్పటికీ చివరికి దేవుని నిర్ణయమే నెరవేరిందని అతను భావించాడు.
ఆదికాండము 28:6-9
ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతనినక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లిపోయెననియు ఏశావు తెలిసికొనినప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలునొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను.
ఈ వచనాలలో ఏశావు మళ్ళీ ఇష్మాయేలు కుమార్తెను వివాహం చేసుకోవడం మనం చూస్తాం. కనానీయుల కుమార్తెలు తన తండ్రికి ఇష్టురాండ్రు కాదు కాబట్టి తన బంధువుడైన ఇష్మాయేలు కుమార్తెను తాను వివాహం చేసుకుంటే అది తన తండ్రి దృష్టికి ఇష్టమౌతుందని అతను భావించాడు. కానీ అతను ఇదంతా తాను గతంలో చేసిన తప్పుల విషయంలో మారుమనస్సు పొంది కాకుండా ఏదో విధంగా తన తండ్రిని సంతోషపెట్టి అతని నుండి ఏదో ఒకటి పొందుకోవాలనే ఉద్దేశంతోనే అలా చేస్తున్నాడు. సాధారణంగా దుష్టులకు ఉండే ఒక లక్షణం ఏంటంటే వారు చివరికి ఏదొక మంచి పనిని చేసి గతంలో చేసిన చెడు అంతా మాసిపోయిందని వారి మనసాక్షికి సర్దిచెప్పుకుంటూ ఆ మంచి పనిని బట్టి లాభం సంపాదించుకోవాలి అనుకుంటారు. ఇక్కడ ఏశావులో మనకు అదే కనిపిస్తుంది.
ఇలాంటి సంఘటననే మనం న్యాయాధిపతులు 18వ అధ్యాయంలో చూస్తాం. దానీయుల గోత్రంవారు తాము చేసే చెడునంతా చేస్తూ వారికి ఒక లేవీయుడు పరిచయమయ్యేసరికి, చెక్కబడిన ఒక ప్రతిమకు ఆ లేవీయుడిని యాజకుడిగా చేసి తాము చేసేది సరైనదిగా వారు భావిస్తారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం యాజకత్వాన్ని లేవీయులు మాత్రమే చెయ్యాలి. వారక్కడ దేవుడు అసహ్యించుకునే ప్రతిమను నిలుపుకుని, చెడుకార్యాలను చేస్తూ లేవీయుడిని మాత్రం ధర్మశాస్త్ర ప్రకారం నియమించుకుని తాము చేసినదానిని బట్టి దేవుడు తమకు తోడైయుంటాడని ఆశపడుతున్నారు.
మరోవిషయం ఏంటంటే కనానీయులైన తన భార్యలు తన తండ్రికి ఇష్టురాండ్రు కారని ఇప్పుడు ఆ తండ్రి ఇష్టపడేలా ఏదోటి చెయ్యాలని ఇష్మాయేలు కుమార్తెను వివాహం చేసుకున్నటువంటి ఏశావు, అక్కడ కూడా తన క్రియలతో దేవుని ఆశీర్వాదానికి అపాత్రుడనని ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే అబ్రాహాముతో దేవుడు చెప్పినదాని ప్రకారం ఇస్సాకుతో ఇష్మాయేలు వారసుడు కానేరడు (ఆదికాండము 21:9-12). దీనిప్రకారం ఎవరైతే ఇస్సాకుతో కలసి వారసుడిగా ఉండకూడదో అదే ఇష్మాయేలు కుమార్తెను ఇస్సాకు సంతానమైన ఏశావు వివాహం చేసుకుని ఆ కుటుంబంలోకి తీసుకుని వచ్చాడు. కాబట్టి దుష్టులు తమ దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో ఒకోసారి తెలియకుండానే మరలా దుష్టత్వంలో పడుతుంటారు.
కీర్తనలు 36: 1 భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నది వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు.
అదేవిధంగా ఈ సందర్భంలో ఏశావు తన పెదనాన్న కుమార్తెను వివాహం చేసుకున్నట్టు మనం చూస్తాం. మనదేశ సంస్కృతి ప్రకారం ఇది తప్పేమో కానీ వారి సంస్కృతిలో ఇది సరైనదే. ఇప్పటికీ ఇతరదేశాల్లో ఈ వరసలలోనే వివాహాలు జరుగుతుంటాయి. ఇందువల్ల బైబిల్ లోని సంఘటనలను మనం అధ్యయనం చేసేటప్పుడు ప్రస్తుతం మనమున్న దేశ సంస్కృతులు, కాలాన్ని బట్టి కాకుండా ఆయా వ్యక్తులు నివసించిన సంస్కృతులు, కాలాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మనకు బైబిల్ మాత్రమే నైతికనియమం తప్ప మన దేశ సంస్కృతులు కాదు. కాబట్టి, లేవీకాండము 18వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞాపించిన హద్దులను పాటిస్తూ వివాహ వ్యవస్థ వెనుక ఉన్న దేవుని ప్రణాళికను అనుసరిస్తూ మనం ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు.
ఆదికాండము 28:10,11
యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండుకొనెను.
ఈ వచనాలలో యాకోబు బెయేర్షెబాలో తన తండ్రియొద్దనుండి బయలుదేరి ఒకచోట నిలిచినట్టు మనం చూస్తాం. ఇక్కడ యాకోబు పరిస్థితిని మనం ఆలోచిస్తే ఇస్సాకు అతనిని పంపివేసేటప్పుడు ఒంటరిగా పంపివేసాడు తప్ప తనకున్న పరివారాన్ని కానీ ఒంటెలను కానీ తోడుగా ఇవ్వలేదు. దీనిని బట్టి ఆ సమయంలో యాకోబు వన్యమృగాలకూ చోరులకూ భయపడుతూ పయనించి ఆ చోట అదే పరిస్థితిలో పడుకుని ఉండవచ్చు. గుడారంలో సాధువుగా జీవించిన యాకోబు రాతితో తలగడ చేసుకుని నేలపై పడుకున్నాడు. కాబట్టి అతని మనసులో భయం, బాధ కలగడం సహజం కానీ ఆ సమయంలో ఏం జరిగిందో చూడండి.
ఆదికాండము 28:12-15
అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడియుండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును. నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా-
ఈ వచనాలలో బాధతోనూ భయంతోనూ ఆచోట పడుకున్న యాకోబుకు దేవుడు స్వప్నంలో ప్రత్యక్షమై, అబ్రాహాముకు తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి ధైర్యాన్ని కలిగించడం మనం చూస్తాం. ఆ వాగ్దానం నెరవేరాలంటే యాకోబు బ్రతికే ఉండాలి. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకున్న విశ్వాసులు ఈ లోకంలో కొన్నిసార్లు ఒంటరిగా మారినప్పటికీ వారిని చుట్టూ ఎన్నో భయాలు, బాధలు వెంటాడుతున్నప్పటికీ ఆయన మనకు తోడుగా ఉన్నాడని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ సందర్భంలో పరలోకానికీ భూమికీ మధ్యలో ఒక నిచ్చెన వేయబడి దానిపై దేవదూతలు ఎక్కుతూ దిగుతుండడం మనకు కనిపిస్తుంది. ఆ సంఘటన దేవుని సన్నిధినీ సహవాసాన్నీ సూచిస్తుంది, మనం కూడా అలాంటి సన్నిధినీ సహవాసాన్ని యేసుక్రీస్తు ద్వారా అనుభవిస్తాం (యోహాను 1:51).
ఆదికాండము 28:16-19
యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియక పోయెననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.
ఈ వచనాలలో యాకోబు నిద్ర మేలుకుని అది దేవుడున్న స్థలమని గుర్తించి భయపడుతున్నట్టు మనం చూస్తాం. ఇది దేవునిపట్ల అతనికున్న విధేయతను మనకు తెలియచేస్తుంది. తర్వాత అతను ఆ రాయిని నిలిపి దానిపై నూనెను పోస్తుంది ఆ రాయిలో ఏదో ఉందని కాదు కానీ ఆ కాలంలో బలిపీఠాలను ప్రతిష్టించే పద్ధతిలో అదొక భాగం.
ఆదికాండము 28:20,21
అప్పుడు యాకోబునేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడైయుండును.
ఈ వచనంలో యాకోబు తనకు కలిగిన దేవుని దర్శనానికి స్పందనగా మాట్లాడుకున్నట్టు మనం చూస్తాం. ఇక్కడ అతను మొదటిగా దేవుడు తనకు తోడైయుండాలని కోరుకుంటూ తదుపరి కనీస అవసరాలైన వస్త్రాలనూ తినడానికి తిండినీ దయ చెయ్యమంటున్నాడు తప్ప ఎలాంటి దురాశలకూ పోవడం లేదు. గతంలో అతను ఎంతో గొప్ప ఆస్తికీ ఐశ్వర్యానికీ వారసుడుగా దీవించబడినప్పటికీ ప్రస్తుతం అతని మనసు కేవలం కనీస అవసరతలపైనే ఉండడానికి కారణం అతనిలో దేవుని వాగ్దానానికి తగిన మార్పు ప్రారంభమవ్వడమే. కాబట్టి గతకాలపు పాపాల విషయంలో మారుమనస్సు పొంది ప్రస్తుతం విశ్వాసులుగా జీవిస్తున్న మనం మొదటిగా దేవుని తోడునూ తదుపరి మన పరిస్థితిని బట్టి కనీస అవసరాలనూ ఆయన నుండి ఆశించాలే తప్ప దురాశలకు పోకూడదు.
1 తిమోతికి 6:6-10 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది. మన మీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలో నుండి ఏమియు తీసికొనిపోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.
ఆదికాండము 28:22
మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కుకొనెను.
ఈ వచనాలలో యాకోబు అతను కోరుకున్నట్టుగా దేవుడు తనకు తోడైయుండి, ఆయన చెప్పినప్రకారంగా తన స్వదేశానికి మరలా తీసుకునివస్తే అతను రాయిని నిలిపినచోట మందిరం కడతానని, తన సంపాదనలో పదియవ భాగం చెల్లిస్తానని మ్రొక్కుకోవడం మనం చూస్తాం. దేవుడు ఇచ్చినదానిలో ఆయనకు కృతజ్ఞతగా కొంత చెల్లించడం ఆరాధనా పద్ధతిలో ఒక భాగంగా లేఖనాలలో మనకు కనిపిస్తుంది. ఇది మోషే ధర్మశాస్త్రంలో దశమభాగంగా పిలవబడింది. ప్రస్తుత విశ్వాసులు దశమభాగం ఇవ్వాలనే నియమం క్రిందలేకున్నప్పటికీ వారి సంపాదన నుండి కృతజ్ఞతా కానుకను తప్పకుండా సంఘక్షేమాభివృద్ధి నిమిత్తం ఇస్తుండాలి (1 కోరింథీ 16:2).
అయితే మనకు ఇక్కడ యాకోబు కాలానికి సంఘం కానీ దేవాలయం కానీ ఏమీ లేనప్పుడు అతను పదివంతులు దేవునికి ఎలా చెల్లించాడనే ప్రశ్నతలెత్తవచ్చు. దీనికి సమాధానం ఏంటంటే; బలిపీఠం మీద జంతువులను దహనబలిగా అర్పించడం, బీదలకు దానం చెయ్యడం కూడా ఆయనకు చెల్లించడమే ఔతుంది. యాకోబు ఇదే చేసాడని మనం భావించాలి (సామెతలు 19:17).
పౌలు కూడా కొరింథీయులను నిలువ చెయ్యమన్న సొమ్మును యెరుషలేములోని పేదలకే తీసుకువెళ్ళాడు.
అదేవిధంగా యాకోబు ఇక్కడ దేవునికి మ్రొక్కుబడి చేసుకుంటున్నాడు. మ్రొక్కుబడి చేసుకోవడం కూడా దేవునిపట్ల భక్తులకుండే విధేయతను తెలియచేస్తుంది (యోనా 1:16, 1 సమూయేలు 1:11, కీర్తనలు 22: 25).
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 28

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"

Add comment