22:1, 22:2, 22:3-5, 22:6-8, 22:9, 22:10-12, 22:13, 22:14, 22:15-18, 22:19, 22:20-24
ఆదికాండము 22:1
ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను.
ఈ వచనంలో దేవుడు అబ్రాహామును పరిశోధిస్తున్నట్టు మనం చూస్తాం. ఆయనకు తన సృష్టిని మరిముఖ్యంగా తన పిల్లలను పరిశోధించే అధికారం ఉంటుంది. దానిద్వారా ఆ పిల్లలకే ఘనత కలుగుతుంది. ఉదాహరణకు ఈ సందర్భంలో ఆయన అబ్రాహామును పరిశోధించినప్పుడు అతను దానిని సహించాడు కాబట్టే నేడు మనమంతా అబ్రాహామును గొప్ప విశ్వాసిగా భావిస్తున్నాం. మనం కూడా దేవుని చేత అబ్రాహాములా, యోబులా పరిశోధించబడవలసిన అవసరం ఉంది (1 పేతురు 1:6,7).
కొందరు దేవుడు ఎవరినీ శోధించడని యాకోబు పత్రికలో రాయబడిన మాటలను ఇక్కడ ప్రస్తావించి (యాకోబు 1:13) ఈ రెండు సందర్భాల మధ్య వైరుధ్యం ఉందని భావిస్తుంటారు. మరికొందరు దీనిని పరిష్కరించేందుకు దేవుడు పరిశోధిస్తాడు తప్ప శోధించడని, అబ్రాహామును దేవుడు పరిశోధించాడే తప్ప శోధించలేదని, శోధించేవాడు కేవలం సాతానుడని చెబుతుంటారు. కానీ మనం హెబ్రీ 11:17వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ అబ్రాహాము శోధించబడ్డాడు అనే రాయబడింది. అదేవిధంగా యిర్మియా 11:20వ వచనంలో కూడా "నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించువాడు సైన్యములకధిపతియగు యెహోవాయే" అని రాయబడింది. కాబట్టి శోధన, పరిశోధన అనేపదాలు రెండూ కొన్ని సందర్భాలలో పర్యాయపదాలుగా ఉపయోగించబడ్డాయని మనం గుర్తించాలి. అందుకే యూదులు పాతనిబంధనను గ్రీకులోకి తర్జుమా చేసినప్పుడు (LXX) ఆదికాండము 22:1వ వచనంలో "దేవుడు అబ్రాహామును పరిశోధించెను" అన్నప్పుడు πειράζω' (peirazo) అనే పదాన్ని ఉపయోగించారు. నూతననిబంధనలో "శోధించెను" అన్నపుడు కూడా గ్రీకులో అదే పదం ఉపయోగించబడింది (హెబ్రీ 11:17).
ఇక యాకోబు పత్రికలో "దేవుడు ఎవరినీ శోధించడు" అన్నప్పుడు దానిని సందర్భపరిధిలో ఎవరినీ పాపం చేసేలా ప్రేరేపించడు అని అర్థం చేసుకోవాలి.
యాకోబు 1:13,14 దేవుడు "కీడు" విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడునేను దేవుని చేత శోధింప బడుచున్నానని అనకూడదు. "ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును".
అదేవిధంగా ఈ సందర్భంలో మనకు "ఆయా సంగతులు జరిగిన తరువాత" అనే పదం కనిపిస్తుంది. దీనికి ముందున్న అబ్రాహాము చరిత్రను మనం పరిశీలిస్తే అప్పటికే అతను ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఇష్మాయేలును కూడా దూరంగా పంపిచేసి ప్రస్తుతం వాగ్దానపుత్రుడైన ఇస్సాకుతో సంతోషంగా జీవిస్తున్నాడు. ఆ సంతోష సమయంలోనే అతనికి అత్యంత బాధాభరితమైన శోధన సంభవించింది. దీనిని బట్టి విశ్వాసులమైన మనం గతంలో ఎన్ని శోధనలను ఎదుర్కొన్నప్పటికీ అవి అంతటితో ముగిసిపోయాయని అనుకోకూడదు, మనం ఈలోకంలో జీవించినంతకాలం వాటికి సిద్ధంగా ఉంటూ, అబ్రాహాములా దేవుడు మన జీవితంలోకి ఎలాంటి శోధనను, ఎలాంటి సంతోష సమయంలో అనుమతించినప్పటికీ "చిత్తం ప్రభువా" అనేలా ఉండాలి.
ఆదికాండము 22:2
అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతనినర్పించమని చెప్పెను.
ఈ వచనంలో దేవుడు అబ్రాహాముతో ఇస్సాకును ఆయనకు బలిగా అర్పించమనడం మనం చూస్తాం. గమనించండి. ఇక్కడ ఆయన నీవు ప్రేమించే ఇస్సాకును అంటున్నాడు. దీనినిబట్టి మనం ప్రేమించేదానిని దేవునికోసం కోల్పోవడానికి సిద్ధపడినప్పుడే ఆయనపై మనకున్న ప్రేమ ఎంతగొప్పదో రుజువౌతుంది. అన్నిటికంటే ఆయనను ఎక్కువగా ప్రేమించినప్పుడే కదా వాటన్నిటినీ ఆయనకోసం నష్టపోవడం సాధ్యమౌతుంది. కాబట్టి విశ్వాసులమైన మనందరమూ దేవునిపై ఇలాంటి ప్రేమను కలిగియుండాలి. ఎందుకంటే మనకున్న ప్రేమలన్నీ బంధాలన్నీ ఆయన దానమే.
ద్వితీయోపదేశకాండము 6:5 నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను.
అదేవిధంగా కొందరు ఈ సందర్భాన్ని ప్రస్తావించి బైబిల్ దేవుడు నరబలిని కోరేవాడంటూ విమర్శిస్తుంటారు. కానీ వారు కొంచెం విజ్ఞతతో ఈ వచనాన్ని చదివితే ఆయన ఇస్సాకును బలిగా అర్పించమన్నది అబ్రాహామును పరిశోధించడానికేయని స్పష్టంగా అర్థమౌతుంది. ఒకవేళ ఆయన ఇస్సాకును బలిగా తీసుకోవాలనే అబ్రాహాముతో ఆ మాటలు పలికియుంటే చివరికి ఆ బలిని ఎందుకు అడ్డుకున్నాడు? (ఆదికాండము 22:11,12). ఈ ఆరోపణకు మరింత వివరణ తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
యెహోవా దేవుడు నర బలులను కోరేవాడా?
ఇక ఈ సందర్భంలో దేవుడు నీకు ఒక్కడైయున్న కుమారుడిని నాకు బలిగా అర్పించమనడం మనం చూస్తాం. దీనిని బట్టి ఇస్లాం దావా ప్రచారకులు అబ్రాహాము బలిగా అర్పించబోయింది ఇస్సాకును కాదు ఇష్మాయేలునని వాదిస్తారు. ఎందుకంటే ఇస్సాకు పుట్టేసమయానికే అబ్రాహాముకు ఇష్మాయేలు అనే కుమారుడు ఉన్నాడు. ఇక్కడ దేవుడు నీకు ఒక్కడైయున్న కుమారుడనని అంటున్నాడు కాబట్టి ఆ ఒక్కడూ ఇష్మాయేలు అని అప్పటికి ఇంకా ఇస్సాకు అసలు పుట్టనేలేదనేది వీరి వాదన. అయితే ఈ సంఘటన జరిగే సమయానికి ఇష్మాయేలు అబ్రాహాముతో లేడు అతడిని ముందు అధ్యాయంలోనే అబ్రాహాము తన ఇంటినుండి పంపివేసాడు. ప్రస్తుతం అబ్రాహాముకు ఒక్కడైయున్న కుమారుడు ఇస్సాకు మాత్రమే పైగా అతను వాగ్దానపుత్రుడు కాబట్టి ఆ విధంగా సంబోధించబడడంలో ఎలాంటి అభ్యంతరం లేదు.
ఆదికాండము 22:3-5
తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను. మూడవ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి తన పని వారితోమీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి-
ఈ వచనాలలో అబ్రాహాము దేవుడు తనకు ఆజ్ఞాపించినదాని ప్రకారం మోరియా పర్వతంపై ఇస్సాకును బలిగా అర్పించేందుకు పయనమవ్వడం మనం చూస్తాం. ఇక్కడ అబ్రాహాము తన పనివారితో "మ్రొక్కి" అని పలికినచోట ఇంగ్లీషు బైబిల్ లో మొదటిసారిగా worship అనే పదం అనువదించబడింది. హీబ్రూలో ఐతే అక్కడున్న పదం שָׁחָה (shachah) దీనికి సాష్టాంగపడడం, విధేయత చూపించడం, పూర్తిగా లోబడడం అనే అర్థాలు వస్తాయి. దీనిప్రకారం దేవుణ్ణి ఆరాధించడమంటే అన్నిటికంటే ఆయనను అధికంగా ప్రేమించి ఆయనకు లోబడడమే. ఇక్కడ అబ్రాహాము తాను ఎంతగానో ప్రేమించే ఇస్సాకును ఆయన మాటప్రకారం బలిగా అర్పించడానికి సిద్ధపడుతూ అదే చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసులు దేవుణ్ణి ఆరాధించడమంటే ఆదివారం చర్చిలో నోటితోనూ చేతులతోనూ చేసేది మాత్రమేయని భావించకుండా అబ్రాహాములా దేవుని మాటకు విధేయత చూపించాలి. అలాంటి విధేయత లేని ఆరాధనను దేవుడు అసహ్యించుకుంటాడే తప్ప భక్తిగా భావించడు.
అదేవిధంగా ఇక్కడ అబ్రాహాముకున్న శ్రేష్టమైన విశ్వాసం మనకు కనిపిస్తుంది. అతను ఇస్సాకును బలిగా అర్పించడానికి పర్వతం ఎక్కే తరుణంలో తన పనివారితో మేము దేవునికి మ్రొక్కి మరలా వస్తాము అంటున్నాడు. అంటే అబ్రాహాము చాలా కచ్చితంగా ఇస్సాకు సజీవుడిగా తనతో తిరిగివస్తాడని నమ్ముతున్నాడు. ఎందుకంటే దేవుడు అతనితో చేసిన నిబంధన ప్రకారం ఇస్సాకు ద్వారా తన సంతానం ఆకాశనక్షత్రాల వలే విస్తరించాలి (ఆదికాండము 17:16,21, 21:12). దేవుడు చేసిన ఆ నిబంధన నెరవేరాలి అంటే ఇస్సాకు బ్రతికేయుండాలి. కాబట్టి అబ్రాహాము తనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడని, ఆయన ఇస్సాకు చనిపోయాక కూడా (బలిలో) తప్పకుండా తిరిగి బ్రతికిస్తాడని విశ్వసించి ఈ కార్యం చేయబోతున్నాడు (హెబ్రీ 11:17-19). నిజానికి అబ్రాహాము తన కుమారుడిని చంపకముందే దేవుడు అడ్డగిస్తాడని ఊహించలేదు, చంపిన తర్వాత కూడా ఆయన మరలా బ్రతికిస్తాడని విశ్వసించాడు, అది నిజంగా గొప్ప విశ్వాసం. అలాంటప్పుడు అతను ఎందుకు బాధపడ్డాడనే ప్రశ్న మనకు రావొచ్చు. అబ్రాహాము ఇస్సాకును దేవుడు తిరిగి బ్రతికిస్తాడని విశ్వసించినప్పటికీ ప్రస్తుతానికి తన చేతులతో ఇస్సాకును చంపాలి. అది బాధకలిగించే విషమేగా?.
ఆదికాండము 22:6-8
దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తనచేతితో నిప్పును కత్తిని పట్టుకొనిపోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రీ అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా అబ్రాహాము నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను.
ఈ వచనాలలో అబ్రాహాము ఇస్సాకులు తమ పనివారిని విడిచిపెట్టి దేవుడు చెప్పిన పర్వతంపైకి ఎక్కిపోవడం, మార్గమధ్యంలో ఇద్దరూ దహనబలికై గొఱ్ఱెపిల్ల గురించి చర్చించుకోవడం మనం చూస్తాం. అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించడానికి పయనమైనప్పటినుండి దేవుడు చెప్పిన పర్వతం దగ్గరకు చేరుకోవడానికి మధ్య మూడురోజుల సమయం పట్టింది (4వ). గమనించండి. అబ్రాహాము దేవుని వాగ్దానంపై తనకున్న నమ్మకం చొప్పున ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడినప్పటికీ ఈ ప్రయాణ సమయంలో అతని మనసులో ఎన్నో సందేహాలు కలిగే అవకాశం ఉంది. ప్రాముఖ్యంగా అతను అప్పటివరకూ చనిపోయిన వారు తిరిగి బ్రతకడం చూడలేదు కాబట్టి, నా కుమారుడి విషయంలో ఇది జరుగుతుందా అనే ప్రశ్న అతడిని వెంటాడవచ్చు. అయినప్పటికీ అబ్రాహాము దేవుని వాగ్దానం పై తనకున్న విశ్వాసంతో ఆ సందేహాలు అన్నిటినీ జయించాడు. కాబట్టి విశ్వాసులు దేవుని వాగ్దానం విషయంలో ఆయన గుణలక్షణాల విషయంలో ఇటువంటి దృఢ విశ్వాసాన్ని కలిగియుండాలి.
ఆదికాండము 22:9
ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.
ఈ వచనంలో అబ్రాహాము ఇస్సాకుతో ఆ పర్వతంపైకి చేరి, బలిపీఠంకట్టి దానిపై కట్టెలను క్రమంలో పేర్చి, ఇస్సాకును బంధించి దానిపై ఉంచడం మనం చూస్తాం. ఇక్కడ అబ్రాహాము మనసులో తన కుమారుడిని చంపుతున్నందుకు ఎంతబాధ ఉన్నప్పటికీ బలియొక్క క్రమాన్ని మరచిపోవడం లేదు. అందుకే బలిపీఠం కట్టి దానిపై కట్టెలను చక్కగా పేర్చుతున్నాడు. కాబట్టి మన మనసులో ఉండే వేదనలు మనం చేసే దేవుని పనిని ప్రభావితం చెయ్యకుండా జాగ్రతపడాలి. మనకు మాదిరిగా జీవించిన ప్రవక్తలు, అపోస్తలులు తమముందు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళనలతో జీవిస్తున్నప్పటికీ దేవుని కార్యం విషయంలో అశ్రద్ధచూపలేదు.
అదేవిధంగా ఇక్కడ ఇస్సాకు బలికి కావలసిన కట్టెలను పర్వతంపైకి మోసుకుపోవడాన్ని బట్టి అతను తన తండ్రికంటే బలవంతుడైన యవ్వనుడిగా కనిపిస్తున్నాడు. అయినప్పటికీ అబ్రాహాము అతడిని బంధించి బలిపీఠంపై ఉంచుతున్నప్పుడు అతనికి విషయం అర్థమైనప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చెయ్యడం లేదు. అతను తలచుకుంటే అబ్రహామును త్రోసివేసి అక్కడినుంచి పారిపోగలడు. కానీ అతను అలా చెయ్యలేదు. ఇక్కడ ఇస్సాకుకు దేవునిపట్ల ఉన్న విధేయత మనకు కనిపిస్తుంది, అతను దేవుని ఆజ్ఞను బట్టి తన ప్రాణాలను కోల్పోవడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. కాబట్టి ఇస్సాకులా దేవుని వాగ్దానాన్ని బట్టి జన్మించిన (తిరిగి జన్మించిన) మనమందరం అతనివలే విధేయులుగా జీవించాలి. ఇలాంటి విధేయతనే మనం పౌలు మాటల్లో చూస్తాం (అపో.కా 20: 24).
ఆదికాండము 22:10-12
అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. అతనినేమియు చేయకుము. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నదనెను.
ఈ వచనాలలో అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించబోతున్నప్పుడు యెహోవా దూత అతడిని నిలువరించి, ఇస్సాకును కాపాడడం మనం చూస్తాం. మొదటి వచనం ప్రకారం ఇస్సాకును బలిగా కోరింది దేవుడు. కానీ ఇక్కడ యెహోవా దూత మాట్లాడుతూ "నీ కుమారుడిని నాకు ఇవ్వడానికి వెనుతియ్యలేదంటూ", ఆ బలిని ఆయనే కోరినట్టుగా తనకు ఆపాదించుకుంటున్నాడు. కాబట్టి అబ్రాహామును బలిగా కోరిన దేవుడే ఇక్కడ యెహోవా దూతగా వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈ దూత గురించి వివరంగా తెలుసుకునేందుకు ఈ వ్యాసం చదవండి.
యెహోవా దూత యేసుక్రీస్తు
అదేవిధంగా దేవునికి సమస్తమూ తెలుసు ఆయన మనకు పెట్టిన పరీక్షలను బట్టి మనం ఎలాంటివారిమో అప్పటికప్పుడు తెలుసుకోడు (కీర్తనలు 139:1-6). అయినప్పటికీ ఇక్కడ యెహోవా దూత "నీవు నీ కుమారుడిని నాకు అర్పించడానికి వెనుదియ్యలేదు కాబట్టి నీవు దేవునికి భయపడేవాడివని ఇందువల్ల నాకు కనబడుతుంది" అంటున్నాడు. దీనిని మనం క్రియల కోణంలో అర్థం చేసుకోవాలి, దేవునికి మనమేంటో తెలిసినప్పటికీ ఆ క్రియలే మనలోపల ఉన్నదానిని బాహాటంగా రుజువు చేస్తాయి కాబట్టి ఆయన ఈవిధంగా మాట్లాడుతున్నాడు. స్పష్టంగా చెప్పాలంటే దేవునిపై మనకున్న భయాన్ని మన క్రియలలో చూపించాలని ఈ మాటలు మనకు బోధిస్తున్నాయి. అందుకే అబ్రహాము క్రియలమూలంగా కూడా నీతిమంతునిగా తీర్చబడినట్టు లేఖనం చెబుతుంది (యాకోబు 2:21-23).
ఇక్కడ మనం గుర్తించవలసిన మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తన కుమారుడిని చంపే బాధను అబ్రాహాము అనుభవించకూడదని అతను బలి ఇవ్వకముందే నియంత్రించిన దేవుడు నిత్యత్వంలో తాను ప్రేమించిన కుమారుడిని మాత్రం మనకోసం బలిగా మార్చడానికి ఆలోచించలేదు. ఇది దేవునికి మనపై ఉన్న గొప్ప ప్రేమను రుజువుచేస్తుంది (రోమీయులకు 8:32, యోహాను 3:16).
ఆదికాండము 22:13
అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను.
ఈ వచనంలో అబ్రాహాము పొదలో కనిపించిన పొట్టేలును దేవునికి బలిగా అర్పించడం మనం చూస్తాం. ఈవిధంగా దేవుడు "దహనబలికి గొఱ్ఱెపిల్లను దేవుడే చూసుకొనును" అని పలికిన అబ్రాహాము మాటను నెరవేర్చాడు. కొందరు దీని ఆధారంగా కూడా అబ్రాహాముకు ఇస్సాకును బలి ఇవ్వకుండా దేవుడు ఆపుతాడని ముందే తెలుసని భావిస్తుంటారు. అది వాస్తవం కాదని ఇప్పటికే నేను వివరించాను, ఒకవేళ అదే వాస్తవమైతే అబ్రాహాముకు ఇది శోధన అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే దాని ప్రకారం ఇస్సాకును చంపవలసిన అవసరమే అతనికి లేదుగా. కాబట్టి "దహనబలికి గొఱ్ఱెపిల్లను దేవుడే చూసుకొనును" అనేమాటలను అబ్రాహాము కేవలం ఇస్సాకును ధైర్యపరచడానికి మాత్రమే ఉపయోగించాడు. కానీ దేవుడు ఆ మాటలను నిజం చేసాడు.
అదేవిధంగా బైబిల్ గ్రంథంలోని బలులన్నీ యేసుక్రీస్తుకు ఛాయగా ఉన్నాయి, ఈ సందర్భంలో ఇస్సాకుకు ప్రతిగా బలైన పొట్టేలు కూడా ఆయనకు ఛాయగానే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు మనందరికీ ప్రతిగా సిలువలో బలయ్యాడు (మార్కు 10: 45, యెషయా 53:4-11).
ఆదికాండము 22:14
అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.
ఈ వచనంలో అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించబోయిన ప్రదేశానికి యెహోవా ఈరే అని పేరుపెట్టడం మనం చూస్తాం. ఎందుకంటే అతను చెప్పినట్టుగానే దేవుడు ఇస్సాకుకు ప్రతిగా దహనబలికై బలిని చూసుకున్నాడు. తరువాత ఇదే ప్రదేశంలో సొలోమోను యెరుషలేము మందిరాన్ని నిర్మించాడు (2 దినవృత్తాంతములు 3:1).
ఆదికాండము 22:15-18
యెహోవా దూత రెండవమారు పరలోకము నుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశనక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.
ఈ వచనాలలో యెహోవా దూత మరలా అబ్రాహాముతో నీవు నీ కుమారుడిని నాకు అర్పించడానికి సిద్ధపడ్డావు కాబట్టి నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని వాగ్దానం చెయ్యడం మనం చూస్తాం. అయితే ఈ వాగ్దానాన్ని దేవుడు అబ్రాహాముకు గతంలోనే చేసినట్టుగా లేఖనాలు మనకు సాక్ష్యమిస్తున్నాయి (ఆదికాండము 12:2,3, 13:16, 15:5) అప్పటికి అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించలేదు. కాబట్టి ఇది వైరుధ్యంలా అనిపించే అవకాశం ఉంది కానీ అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడే ఈ వాగ్దానం చేసినప్పటికీ ఈ సందర్భంలో ఆ వాగ్దానానికి తగిన క్రియలు అతనిలో ప్రత్యక్షమయ్యాయి కాబట్టి, ఆ వాగ్దానం ఇస్సాకును బలిగా అర్పించిన క్రియమూలంగా నెరవేరుతున్నట్టు ఇక్కడ జ్ఞాపకం చెయ్యబడింది (యాకోబు 2:21,22). మనల్ని కూడా దేవుడు ముందే రక్షణకు పాత్రులుగా నిర్ణయించినప్పటికీ (రోమా 8:29,30, ఎఫెసీ 1:4-6,12) ఆ రక్షణకు తగిన క్రియలు చెయ్యమని మనకు బోధిస్తున్నాడు, అవి చేసి పరలోకం చేరేలా సహాయం (కార్యసిద్ధి) చేస్తున్నాడు (ఫిలిప్పీ 2: 13).
అదేవిధంగా ఆ సందర్భంలో యెహోవా దూత మాట్లాడుతూ నీ సంతానం శత్రువుల గవిని స్వాధీనం చేసుకుంటారని, నీ మూలంగా సమస్త భూజనులు ఆశీర్వదించబడతారని చెప్పడం మనం చూస్తాం. ఇది ఒకవైపు చారిత్రాత్మకంగా ఇశ్రాయేలీయులు యుద్ధాల్లో సాధించిన విజయాలను సూచిస్తుంటే మరోవైపు విశ్వాసం ద్వారా అబ్రాహాము సంతానమైన మనం క్రీస్తు ద్వారా అపవాదిపై సాధించే విజయాన్ని కూడా తెలియచేస్తుంది. అబ్రాహాము సంతానంలో జన్మించిన క్రీస్తు మూలంగానే ఈరోజు ప్రపంచంలోని జాతులన్నీ ఆశీర్వదించబడుతున్నాయి.
ఆదికాండము 22:19
తరువాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరును కలిసి బెయేర్షెబాకు వెళ్లిరి. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించెను.
ఈ వచనంలో ఇస్సాకు బలి సంఘటన జరిగిన తర్వాత, అబ్రాహాము తన కుమారుడితోనూ పనివారితోనూ బెయేర్షెబాకు వచ్చి అక్కడ నివసిస్తున్నట్టు మనం చూస్తాం. ఆదికాండము 21:31 ప్రకారం; అబీమెలెకు అబ్రాహాము దగ్గరకు వచ్చి ప్రమాణం చేసుకున్నప్పుడు ఆ చోటికి అబ్రాహాము బెయేర్షెబా అని నామకరణం చేసాడు, అప్పటికి శారా కూడా అక్కడే ఉంది. కాబట్టి అబ్రాహాము అదేచోటికి తిరిగివెళ్ళి తన భార్యయైన శారా మరియు తన కుమారుడైన ఇస్సాకుతో కలసి అక్కడే నివసించాడు. కొందరు ఇస్లాం దావా ప్రచారకులు హాగరు ఇష్మాయేలుతో వెళ్ళగొట్టబడినప్పుడు దారితప్పి బెయేర్షెబా అరణ్యంలో తిరిగిన సంఘటనను (ఆదికాండము 21:14) వక్రీకరించి ఇక్కడ అబ్రాహాము కూడా ఆమెదగ్గరకే వెళ్ళిపోయాడని చెబుతుంటారు. కానీ అబ్రాహాము వెళ్ళింది బెయేర్షెబాలో శారా ఉన్న చోటికే తప్ప హాగరు దగ్గరకు కాదు.
తర్వాత కాలంలో కూడా అబ్రాహాము, శారా ఇస్సాకులు ఒకేచోట కలసి ఉన్నారు అనడానికి ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకున్నప్పుడు ఆమెను తన తల్లియైన శారా గుడారంలోకి తీసుకుని వెళ్ళడం మంచి ఆధారంగా మనకు కనిపిస్తుంది (ఆదికాండము 24:67). అప్పటికి శారా చనిపోయినప్పటికీ ఆమె గుడారం అబ్రాహాము, ఇస్సాకుల దగ్గరే ఉంది. కాబట్టి అబ్రాహాము శారాలు చివరివరకూ కలసే జీవించారు.
ఆదికాండము 22:20-24
ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు, కెసెదు, హజో, షిల్దాషు, యిద్లాపు, బెతూయేలు. బెతూయేలు రిబ్కాను కనెను. ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను. మరియు రయూమా అను అతని, ఉపపత్నియు తెబహును, గహమును తహషును మయకాను కనెను.
ఈ వచనాలలో అబ్రాహాము విడిచివచ్చిన తన సహోదరుడి సంతానం గురించి మనం చూస్తాం. ఈ సంతానంలో జన్మించిన రిబ్కానే ఇస్సాకు వివాహం చేసుకున్నాడు. దీనిగురించి 24వ అధ్యాయంలో చూద్దాం.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 22

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"

Add comment