ఆదికాండము 50:1
యోసేపు తన తండ్రి ముఖముమీద పడి అతని గూర్చి యేడ్చి అతని ముద్దుపెట్టుకొనెను.
గడచిన అధ్యాయంలో యాకోబు తన కుమారుల భవిష్యత్తు గురించి ప్రవచించిన తరువాత తన మంచము మీద కాళ్ళు ముడుచుకుని మరణించినట్టు మనకు కనిపిస్తుంది. ఈ అధ్యాయం ప్రారంభంలో అలా చనిపోయిన తన తండ్రిపట్ల యేసేపు తన ప్రేమను తెలియచేస్తున్నాడు.
ఆదికాండము 50:2
తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి.
ఈ సందర్భంలో యాకోబు శవాన్ని ఐగుప్తు వైద్యులు సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచినట్టు మనం చూడగలం; మరణించినవారి దేహం చాలాకాలం వరకూ పాడుకాకుండా ఉంచడానికి ఐగుప్తీయులు ఈవిధంగా చేస్తారు; ఈ పద్ధతిని Embalming అంటారు. దీనికి 40 రోజుల సమయం పడుతుంది. అయితే యేసేపు ఐగుప్తీయుల ఆచారాన్ని బట్టి తన తండ్రి శవానికి ఈవిధంగా చేయించడం లేదు కానీ, యాకోబు యేసేపుతో చేయించుకున్న ప్రకారం అతను ఆ శవాన్ని కానాను దేశానికి తీసుకువెళ్ళి పాతిపెట్టాలి, ఆ ప్రయాణానికి సుమారు 40 రోజుల సమయం పడుతుంది. ఆ సమయంలో యాకోబు దేహం కృశించకుండా ఉంచడానికే యేసేపు ఈవిధంగా తన వైద్యులతో ఆ Embalming పనిని చేయిస్తున్నాడు.
ఆదికాండము 50:3
సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడువారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతనికొరకు నలుబది దినములు సంపూర్ణమాయెను. అతనిగూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చిరి.
ఈ సందర్భంలో యాకోబు శవాన్ని Embalming చేసే నలబైరోజులతో పాటు ఐగుప్తీయులు డెబ్బైరోజులు అతనికోసం అంగలార్చినట్టు రాయబడింది. చనిపోయింది ఐగుప్తు ప్రధాని తండ్రి కాబట్టి ప్రభుత్వం ఆ రోజులను అధికారికంగా సంతాపదినాలుగా ప్రకటించి ఉండవచ్చు.
ఆదికాండము 50:4,5
అతనిగూర్చిన అంగలార్పుదినములు గడచిన తరువాత యోసేపు ఫరో యింటివారితో మాటలాడి మీ కటాక్షము నా మీదనున్నయెడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నాచేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చెదనని చెప్పుడనెను.
ఈ సందర్భంలో యేసేపు అతను ఐగుప్తుకు ప్రధాని స్థానంలో ఉన్నప్పటికీ ఆ దేశపు ప్రజలంతా తనకు ఎంతో రుణపడి ఉన్నప్పటికీ తనకున్న అధికారిక బాధ్యతలకు లోబడుతూ ఫరో ఇంటివారి ద్వారా కానానులో తన తండ్రి శవాన్ని పాతిపెట్టడానికి వెళ్ళేందుకు ఫరో అనుమతి కోరుకుంటున్నాడు. ఇక్కడ యేసేపు తగ్గింపునూ, తనకంటే పై అధికారంలో ఉన్నవారికి లోబడేతత్వాన్ని మనం చూడగలం.
ఆదికాండము 50:6
అందుకు ఫరో అతడు నీచేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను.
ఈ సందర్భంలో ఫరో యేసేపు కోరిక చొప్పున అతను కానాను వెళ్ళేందుకు అనుమతించడం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఫరో కేవలం యేసేపు కోరికను బట్టి మాత్రమే కాకుండా తన తండ్రికి అతను చేసిన ప్రమాణాన్ని కూడా ప్రస్తావించి వెళ్ళమని చెబుతున్నాడు. కాబట్టి ప్రమాణానికి విలువనిచ్చే పద్ధతి అన్ని దేశాల ప్రజలకూ ముందు నుండీ తెలిసే ఉంది.
ఆదికాండము 50:7-9
కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను; అతనితో ఫరో యింటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరును యోసేపు యింటివారందరును అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారును వెళ్లిరి. వారు తమ పిల్లలను తమ గొఱ్ఱెల మందలను తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి. మరియు రథములును రౌతులును అతనితో వెళ్లినందున ఆ సమూహము బహు విస్తారమాయెను.
ఈ సందర్భంలో యాకోబు శవాన్ని పాతిపెట్టేందుకు కానానుకు వెళ్తున్న యేసేపుతో తన కుటుంబపువారే కాకుండా ఐగుప్తు దేశపు పెద్దలు కూడా వెళ్ళడం మనకు కనిపిస్తుంది. దీనిని బట్టి యేసేపు ఐగుప్తు ప్రజలకూ, అధికారులకూ ఎంత ఇష్టుడిగా జీవిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.
ఆదికాండము 50:10,11
యెర్దానునకు అవతలనున్న ఆఠదు కళ్లమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రినిగూర్చి యేడు దినములు దుఃఖము సలిపెను. ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆఠదు కళ్లమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్ మిస్రాయిము అను పేరు పెట్టబడెను, అది యొర్దానునకు అవతలనున్నది.
ఈ సందర్భంలో యేసేపు అతనితో ఉన్నవారు కానానుకు చేరి యేసేపు తన తండ్రికోసం దుఃఖపడేటపుడు అతనితో ఉన్న ఐగుప్తీయులు కూడా దుఃఖపడడం చూసిన కానానీయులు అది ఐగుప్తీయులకు మిక్కటమైన దుఃఖమని చెప్పుకుని ఆ ప్రాంతానికి ఒక పేరును పెట్టడం మనకు కనిపిస్తుంది. ఐగుప్తీయులు యాకోబు మరణం నిమిత్తం కేవలం ప్రభుత్వం నియమించిన కట్టడచొప్పునే కాకుండా మనస్పూర్తిగా దుఃఖపడ్డారు. వాస్తవానికి ఐగుప్తీయులకు గొర్రెలు కాచుకునే హెబ్రీయులు హేయులు (ఆదికాండము 46:33) అయినప్పటికీ యాకోబు ప్రవర్తననూ యేసేపు ప్రవర్తననూ చాలాకాలం గమనించిన ఐగుప్తీయులు వారి మనసులో కానాను ప్రాంతపు గొర్రెలకాపరులపై ఉన్న ద్వేషాన్ని విడిచిపెట్టి వారిని అభిమానించడం మొదలుపెట్టారు, దానికి వారి అంగలార్పే మనకు సాక్ష్యంగా ఉంది. కాబట్టి దేవుని పిల్లల ప్రవర్తన తమ శత్రువుల మనస్సులను సైతం గెలచుకునేదిగా ఉండాలి.
సామెతలు 16: 7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.
ఆదికాండము 50:12,13
అతని కుమారులు తన విషయమై అతడు వారికాజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసికొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశానముకొరకు స్వాస్థ్యముగానుండు నిమిత్తము మమ్రేయెదుట హిత్తీయుడైన ఎఫ్రోనుయొద్ద కొనెను.
ఈ సందర్భంలో యేసేపు అతని సహోదరులు కలసి యాకోబు చేయించుకున్న ప్రమాణం చొప్పున అతని దేహాన్ని కానానులో మక్పేలా పొలంలోని గుహలో పెట్టినట్టు మనం చూడగలం. ఈ స్థలాన్ని అబ్రాహాము శారా చనిపోయినప్పుడు ఆమె శవాన్ని పాతిపెట్టడానికి హేతుకుమారుల ద్వారా ఎఫ్రోను దగ్గర కొన్నాడు (ఆదికాండము 23వ అధ్యాయం). అయితే స్తెఫను ఈ స్థలాన్ని అబ్రాహాము హమోరు కుమారుల దగ్గరకొన్నట్టుగా తన ప్రసంగంలో ప్రస్తావించాడు (అపొ.కార్యములు 7:15,16) అతను ఎందుకిలా పేరును మార్చి చెప్పాడో 23 వ అధ్యాయపు వివరణలో తెలియచేసాము.
ఆదికాండము 50:14
యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులును అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరును తిరిగి ఐగుప్తునకు వచ్చిరి.
ఈ సందర్భంలో యేసేపు ఫరోకు ఇచ్చినమాట చొప్పున తన కుటుంబంతో కలసి ఐగుప్తుకు రావడం మనకు కనిపిస్తుంది.
ఆదికాండము 50:15,16
యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మనయందు పగపట్టి మనమతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఈలాగు వర్తమానమంపిరి.
ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబాన్ని యేసేపు 17 సంవత్సరాలు భద్రంగా చూసుకున్నాడు. కానీ ఈ సందర్భంలో యేసేపు సహోదరులు తమతండ్రి మరణం తరువాత యేసేపు వారిపై పగతీర్చుకుంటాడేమో అని భయపడ్డారు. ఎందుకంటే గతంలో యేసేపు వారిపై పగతీర్చుకుంటే యాకోబు తప్పకుండా తన కుమారుల కోసం బాధపడతాడు కాబట్టి యేసేపు దానిని బట్టే ఇంతకాలం అలా చెయ్యకుండా ఆగాడని వారు అనుమానించారు.
ఆదికాండము 50:17
నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యెసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను.
ఈ సందర్భంలో తమ తండ్రి మరణించాక తమపై యేసేపు పగతీర్చుకుంటాడని అనుమానించిన అతని సహోదరులు యాకోబు తమతో చెప్పని అబద్ధాన్ని యేసేపుతో చెప్పడం మనకు కనిపిస్తుంది. ఒకవేళ యాకోబు మనసులో ఆ అనుమానం ఉండియుంటే అతను వారితో కాదు యేసేపుతోనే వారిని క్షమించమని చెప్పియుండేవాడు. అది గుర్తించిన యేసేపు తన సహోదరులపై కోపం తెచ్చుకోకుండా తనపై వారికున్న అనుమానానికి బాధతో ఏడుస్తున్నాడు. ఇంతకాలం వారిని ప్రేమగా చూసుకున్నప్పటికీ వారి మనసులో తనపై ఉన్న అనుమానం అతనికి ఎంతోబాధ కలిగించింది. కాబట్టి మన మనసులో ఉన్న అనుమానాలను బట్టి మనల్ని ప్రేమించేవారిని మనం బాధకు గురిచెయ్యకూడదు.
ఆదికాండము 50:18
మరియు అతని సహోదరులు పోయి అతని యెదుట సాగిలపడిఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా-
ఈ సందర్భంలో మరోసారి యేసేపుకు వచ్చిన కలచొప్పున అతని సహోదరులు అతనిముందు సాగిలపడ్డారు.
ఆదికాండము 50:19
యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా?
యేసేపు సహోదరులు అతని విషయంలో చేసిన అపరాధాన్ని యేసేపు ఎప్పుడో క్షమించాడు కాబట్టే వారు ఇంతకాలం బ్రతికున్నారు. అయినప్పటికీ వారు దానినిమిత్తం దేవుణ్ణి క్షమాపణ వేడుకోవాలి ఎందుకంటే మనిషి చేసే ప్రతీపాపం దేవునికి విరుద్ధంగానే చేస్తాడు. అందుకే యేసేపు తన సహోదరులు తనను క్షమించమన్నపుడు మిమ్మల్ని క్షమించే దేవుని స్థానంలో తాను లేడు కాబట్టి ఆ దేవుడినే క్షమాపణ వేడుకోమంటున్నాడు. ఎందుకంటే వారి మనసులో ఉన్న అనుమానం, వారు చెప్పిన అబద్ధం వారు ఇంకా సరైన దైవమార్గంలో లేరన్నట్టు సూచన ఇస్తుంది.
అదేవిధంగా ఇక్కడ యేసేపు తాను దేవుని స్థానంలో లేనంటూ దేవునికే మహిమను ఆపాదిస్తున్నాడు. కానీ నేటిసమాజంలో చాలామంది సాతాను అనుచరులు తామే దైవాలన్నట్టుగా ప్రశంసించబడుతున్నారు వారిని అలా ప్రశంసించనివారిపై బలవంతం చేస్తున్నారు. వీరందరూ దేవునితో సమానంగా ఉండాలనుకుని పడద్రోయబడిన సాతానుతో కలసి నరకశిక్షలో పాలివారౌతారు.
ఆదికాండము 50:20,21
మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను.
ఈ సందర్భంలో మానవ ఉద్దేశానికి పైగా దేవుని ఉద్దేశం (సార్వభౌమత్వం) మనకు కనిపిస్తుంది. మనిషి తనకున్న ఉద్దేశంతో ఒకపని చేస్తాడు కానీ దానికి పైగా దేవుడు తన ఉద్దేశాన్నే నెరవేర్చుకుంటాడు. అయినప్పటికీ మానవుడు తనకున్న ఉద్దేశాన్ని బట్టి దానికి బాధ్యుడు ఔతాడు. యేసేపు సహోదరులు తమ అసూయతో నిండిన ఉద్దేశాన్ని బట్టి అతడిని ఐగుప్తుకు అమ్మివేసారు కానీ దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని కరువు నుండి కాపాడేందుకు యేసేపు ఐగుప్తుకు వెళ్ళాలని ఉద్దేశించాడు.
దీనిగురించి మరింత వివరంగా తెలుసుకునేందుకు ఈ లింక్ ద్వారా సూచించబడిన వ్యాసం చదవండి.
దేవుని సార్వభౌమత్వం ( ఆర్థర్ డబ్ల్యు పింక్ )
యేసేపు ఆ దేవుని సార్వభౌమత్వాన్నే తలచుకుంటూ తనకు హానిచేసిన తన సహోదరులను మనస్ఫూర్తిగా క్షమించి వారితో ప్రేమగా మసలుకుంటున్నాడు.
ఆదికాండము 50:22,23
యోసేపు అతని తండ్రి కుటుంబపువారును ఐగుప్తులో నివసించిరి, యోసేపు నూటపది సంవత్సరములు బ్రదికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవతరము పిల్లలను చూచెను; మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి.
ఈ సందర్భంలో యేసేపు దేవుని కృపను బట్టి తన పిల్లల పిల్లలను చూసినట్టు రాయబడింది. యేసేపు దేవునిపై ఆధారపడి అనుభవించిన కష్టానికి మించిన ఆనందం ఆయన అతని జీవితంలో దయచేసాడు. కాబట్టి దేవునిపిల్లలు తమకు సంభవించిన శ్రమలనుబట్టి ఎప్పుడూ అంతటితో తమ జీవితం అయిపోయింది అన్నట్టు నిరాశచెందకూడదు.
ఆదికాండము 50:24
యోసేపు తన సహోదరులను చూచినేను చనిపోవుచున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను.
ఈ సందర్భంలో యేసేపు కూడా యాకోబు తన మరణసమయంలో పలికినట్టుగానే దేవుడు వారందరినీ ఐగుప్తునుండి వారి స్వదేశమైన కానానుకు తీసుకువెళ్తాడని నమ్మకంగా చెప్పడం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పితరులంతా దేవుని వాగ్దానాన్ని సందేహం లేకుండా విశ్వసించారు. అయితే ఇక్కడ యేసేపు ఈ మాటలను తన సహోదరులతో చెప్పినట్టు రాయబడింది యాకోబు కుమారులలో యేసేపు బెన్యామీనులే అందరికంటే చిన్నవారు దీనివల్ల యేసేపు మిగిలిన సహోదరులు అప్పటికే చనిపోయి ఉండవచ్చు. అయితే హెబ్రీయుల సంస్కృతిలో తమ సహోదరుల పిల్లలను కూడా కొన్నిసార్లు సహోదరులనే సంబోధిస్తారు కాబట్టి యేసేపు ఈ మాటలను తనకంటే చిన్నవాడైన బెన్యామీనుతోనూ, మిగిలిన తన సహోదరుల పిల్లలతోనూ చెబుతుండవచ్చు.
ఆదికాండము 50:25
మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించుకొనెను.
ఈ సందర్భంలో యాకోబు చేయించుకున్నట్టుగానే యేసేపు కూడా తన ఎముకలను కానాను దేశానికి తీసుకుని వెళ్ళాలని ప్రమాణం చేయించుకున్నట్టు రాయబడింది. ఈ ప్రమాణాన్ని బట్టి మోషే ఐగుప్తునుండి ఇశ్రాయేలీయులను కానానుకు తీసుకుని వెళ్ళేటపుడు అతని ఎముకలను తీసుకువచ్చాడు వాటిని ఇశ్రాయేలీయులు యేసేపు స్వాస్థ్యభాగంలో పాతిపెట్టారు.
నిర్గమకాండము 13:19 మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును; అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసికొని పోవలెనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొనియుండెను.
యెహోషువ 24: 32 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేనిభాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను.
అయితే యాకోబు కానీ, యేసేపు కానీ తమ శరీరాలు కానానులోనే పాతిపెట్టబడాలని ఎందుకు అంతలా కోరుకున్నారు? ఎందుకంటే ఆ దేశాన్ని దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు కాబట్టి మృతుల పునరుత్థానం రోజు వారు ఆ దేశం నుండే పునరుత్థానం చెందాలని ఆశించారు. విశ్వాసులు దీనిని బట్టి దేవుడు తమకు వాగ్దానం చేసిన పరలోకం పట్ల ఆసక్తి కలిగి జీవించాలి.
ఫిలిప్పీయులకు 3: 20 మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
ఆదికాండము 50:26
యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.
యేసేపు చేయించుకున్న ప్రమాణం ప్రకారం ఇశ్రాయేలీయులు అతని శవాన్ని ఐగుప్తులో సమాధి చెయ్యకుండా సుగంధద్రవ్యాలతో దానిని సిద్ధపరచి ఒక పెట్టెలో పెట్టారు. ఇప్పటికీ ఈజిప్టులో యేసేపు ఎముకలు ఉంచబడిన ప్రాంతాన్ని, అతని శిల్పాన్ని మనం చూడవచ్చు. ఇశ్రాయేలీయులు అ ఎముకలు ఉంచబడిన పెట్టెను పగులగొట్టి కేవలం ఎముకలను మాత్రమే కానానుకు తీసుకునివెళ్ళారు. ఈజిప్టులో ఉన్న ఆ ఆధారాలన్నీ యేసేపు ఆ దేశాన్ని పరిపాలించినట్టుగా మనకు రుజువులు అందిస్తున్నాయి. యేసేపు సమాధికి సంబంధించిన విషయాలకోసం ఈ లింక్ ద్వారా సూచించబడిన వ్యాసాన్ని చదవండి.
https://madainproject.com/tomb_of_joseph_(nablus)#mediagallery
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2021 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 50

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2021 www.hithabodha.com"

Add comment