ఓఫిరుతో చర్చల విషయంలో హితబోధ అభ్యంతరాలకు RTFవారి స్పందన | Hithabodha & RTF

 

ఈ చర్చానేపథ్యాన్ని తెలుసుకోవడానికి క్రింద ఇవ్వబడిన వీడియో లింక్ చూడండి

క్రైస్తవ సంఘానికి దుర్బోధకులతో సంధి కుదిర్చే రాయబారమే RTFవారి 'యుగాంతం' చర్చావేదిక by హితబోధ - https://youtu.be/dotJd9J--8o

ఇందులో RTFవారు దుర్బోధకులతో సంఘానికి సంధి కుదిర్చే ప్రయత్నం చేశారని మేము చేసిన అభియోగమే ప్రస్తుత చర్చకు దారితీసింది. మేము లేవనెత్తిన అనేక విషయాలలో, సహో.సాయికృష్ణ గోమటంగారు ఓఫిర్ని "క్రీస్తునందు సోదరుడని", సహో.జాన్ క్రిస్టోఫర్ గారు ఓఫీర్ని "దేవుని సేవకునిగా గౌరవిస్తున్నాం" అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్న ప్రశ్నలు ఈ చర్చలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

సాయిగారు దేవుని భయం కలిగి, సంఘాన్ని ప్రేమించి, మంచి మనసుతో తన ఉద్దేశాన్ని వివరించి, అయినా కొందరు తొట్రిల్లడానికి అవకాశం ఉన్న ఆ మాటలు వాడకుండా ఉంటే బాగుండేది అని తగ్గింపుతో ఒప్పుకుని క్షమాపణ కోరారు. దానిని మేమూ అంతే మంచి మనసుతో స్వాగతిస్తున్నాము.

అయితే సమస్యంతా జాన్ క్రిస్టోఫర్ గారి అమర్యాదాపూర్వకమైన వ్యవహారం దగ్గరే ఉంది. ఏ వివరణా చెప్పుకోలేక, "అసలు ఇది ఎవరి ఆలోచన", "మాతో మీకు ఎంత కాలం పరిచయం ఉంది", "డాక్యుమెంట్స్ చదివారా", "మా ప్రోసెస్ మీకు అర్థమయ్యిందా", "చర్చలన్నీ పూర్తి అయ్యాకే నేను ఆయనను దేవుని సేవకుడిగా ఎందుకు సంబోధించానో తెలుస్తుంది", అంటూ ఏదేదో చెప్పజూసారు. ఇలా తర్జనభర్జన పడుతున్న క్రమంలో ఓఫీర్ని "ఒక భిక్షగాడితో", "ఇస్కరియోతు యూదాతో", పొల్చి మాట్లాడడమే కాదు, "అతనికి మారుమనస్సు లేదు" అని చెప్పకనే చెప్పేసారు. అతని సంఘంలో భాగంగా అసలే ఉండకూడదని కూడా నిరభ్యంతరంగా ఒప్పుకున్నారు.

అయితే, ఇలా అక్కడక్కడా కొన్ని ఉపయోగకరమైన మాటలు చెప్పినప్పటికీ, మేము వీడియో ద్వారా ప్రశ్నించినందుకు మా మీద ఆగ్రహం వెళ్లగ్రక్కడం కోసమే ఈ చర్చా కార్యక్రమం పెట్టుకున్నారని జాన్ క్రిస్టోఫర్ గారి ప్రవర్తనలో స్పష్టంగా తెలుస్తుంది.

"హితబోధ వీడియోల క్రింద ట్రోలు జరుగుతాయి కాబట్టి చూడటం మానేశాను", "మీ వ్యాఖ్యానం సరిగ్గా ఉంటే 2 సంవత్సరముల ముందు కొందరు మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టేసారు" అని బిబుగారి మీద, వారి టీం మీద బురద చల్లడం మాత్రమే కాదు, దుర్బోధకులకు మరియు మతోన్మాదులకు వంగివంగి దండాలు పెట్టేంత పని చేసే ఈయన, కనీస మర్యాద కూడా సోదరులకు ఇవ్వకుండా వ్యవహరించిన తీరు, కేవలం హితబోధ పరిచర్యను అణచివేసి, RTF పరిచర్యను హెచ్చించుకోవాలనే Unhealthy Competition లేదా "మా మీదనే వీడియో చేస్తారా" అనే అక్కసు మాత్రమే తప్ప వేరే ఏమీ కాదు అని మా అభిప్రాయం.

ఏది ఏమైనా, ఓఫిర్ని "Minister of God" అనే మాట వెనుక్కు తీసుకోనంత వరకూ, మేము కూడా "Conspiracy" అనే మాటను మా వీడియోలో నుండి తొలగించే ప్రసక్తే ఉండదు.

RTF సభ్యులు కొందరు మాకు కావాల్సినవారే. వారితో స్నేహం నష్టపోవటం మాకు ఇష్టం లేదు. అయితే, RTFను బహిరంగంగా ప్రశ్నించే ముందు వారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనే నియమం మాకు అంగీకారం కాదు; ఎందుకంటే, బహిరంగంగా చేసిన పొరపాట్లకు వ్యక్తిగత సంప్రదింపుల తరువాతే ఖండన జరగాలనే నియమం బైబిల్ ఎక్కడా‌ బోధించదు. అన్ని విషయాలలో మాకు బైబిల్ మాత్రమే ప్రమాణం. ఏ విషయంలో అయినా మాకు RTF ఆమోదముద్ర కానీ, ధృవీకరణ పత్రం కానీ అవసరం లేదు

====================================

మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/

మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/@hithabodha/

మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/

మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha

హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.

 ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప హితబోధ ఎప్పుడూ, ఎవ్వరి నుండీ ఆర్థిక సహాయం అంగీకరించదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.