బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-49
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1
సర్వజనులారా ఆలకించుడి.
2
సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు విజ్ఞానవిషయములను పలుకును
3
నా హృదయధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును.
4
గూఢార్థముగలదానికి నేను చెవియొగ్గెదను సితారా తీసికొని నా మరుగు మాట బయలుపరచె దను.
5
నాకొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టు కొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను?
6
తమ ఆస్తియే ప్రాపకమని నమి్మ తమ ధన విస్తారతనుబట్టి పొగడుకొనువారికి నేనేల భయపడవలెను?
7
ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమో చింపలేడు
8
వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు
9
వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.
10
జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండ పోదు మూర్ఖులును పశుప్రాయులును ఏకముగా నశింతురు.
11
వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ యిండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారను కొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు.
12
ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించుమృగములను పోలినవాడు.
13
స్వాతిశయ పూర్ణులకును వారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి.
14
వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియై యుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును.
15
దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములోనుండి ఆయన నా ప్రాణమును విమోచించును.(సెలా.)
16
ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని యింటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము.
17
వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు వాని ఘనత వానివెంట దిగదు.
18
నీకు నీవే మేలు చేసికొంటివని మనుష్యులు నిన్ను స్తుతించినను తన జీవితకాలమున నొకడు తన్ను పొగడుకొనినను
19
అతడు తన పితరుల తరమునకు టొరవలెను వారు మరి ఎన్నడును వెలుగు చూడరు.
20
ఘనత నొంది యుండియు బుద్ధిహీనులైనవారు నశించు జంతువులను పోలియున్నారు.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.