నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.
నేను నీకు మ్రొక్కుకొనియున్నాను నేను నీకు స్తుతియాగములనర్పించెదను.
నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు
అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును ; మృత్యువు నుండి వారిని రక్షింతును . ఓ మరణమా , నీ విజయ మెక్కడ? ఓ మరణమా , నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు .
ఆ పెద్దలు-నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,
అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంటపోవునని ఆత్మ చెప్పుచున్నాడు.
ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు
ప్రభువా , నా దేవా , నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించియున్నావు .
మరణమును చూడక బ్రదుకు నరుడెవడు ? పాతాళముయొక్క వశముకాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు ?
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి --తండ్రీ , నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను . ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను .
నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొనిపోవుదును.
ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.